Wednesday, 26 April 2017

గానగంధర్వుణ్ణి తను కూర్చిన పాటల్ని పాడినందుకు కోర్టుకీడ్చిన ఇసైజ్ఞాని తను కూర్చడానికి రాగకర్తల నుంచి అనుమతి తీసుకున్నాడా?

          ముఖే ముఖే సరస్వతీ అన్నట్టు ఒక మనిషి నుంచి ఒక మనిషికి వ్యాపించే భావాల మీద, రాగాల మీద ఏ ఒక్క మనిషికీ కాపీరైటు లేదు. మనకి తెలిసిన ప్రతి విషయమూ ఇంకొకరి నుంచి తెలిసిందే అవుతుంది - మన తలిదండ్రులు నేర్పితేనే మనకి మాటలు వచ్చాయి! అయినా కొందరు నాకు తెలిసిందీ, నేను పాడందీ, నేను కూర్చిందీ నా సొంతమే అంటున్నారు!సార్వజనీనమైన కళమీద సొంతహక్కుల కోసం సాటి కళాకారుల మీద కేసులు కూడా వేస్తున్నారు, ఏమి చిత్రం?

          ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ సంగెతం ఉంది,ప్రతి సంగీతంలోనూ రాగాలు ఉన్నాయి,ప్రతి రాగానికీ స్వరాలు ఉన్నాయి - చిత్రంగా అన్ని  రకాల సంగీత రీతుల్లోనూ ఉన్న స్వరాలు ఏడు మాత్రమే!ఆ స్వరాల వెనక గణితం ఉంది - ఫ్రీక్వెన్సీ,డిలే అనే రెండింటి మిళాయింపుని ఒక స్థిరాంకంగా తీసుకుని దాన్ని మెట్లు మెట్లుగా పెంచితే మిగిలిన స్వరాలు ఏర్పడతాయి.షడ్జమం అనేది ఇక్కడ బేసిక్,రిషభం దానికంటే ఒక యూనిట్ పెంపు(కానీ పెంపులో ఒక నిష్పత్తి ఉంటుంది, అది లాగరథమిక్ స్కేల్) - ఇట్లా లెక్క ప్రకారం స్వరాలను ఏర్పరచారు. వారెవరో ఈనాటివారికి తెలియనే తెలియదే!వారు పేటెంటు హక్కుల కోసం ఆ పని చేశారా?ఆ స్వరాలని గాత్రంలో పలికించినా వాద్యం మీద పలికించినా లెక్క ఒకటే కాబట్టి నాదరమ్యతలో తేడా వుండదు!"నీ లీల పాడెద దేవా...!" పాటలో యస్.జానకి ఆలాపనా సన్నాయి ఆలాపనా ఒకే స్థాయిలో పలకడమే దానికి నిదర్శనం."షడ్జమం మయూరో వదతి" శ్లోకం ప్రకారం అవి ఆయా జంతువుల గొంతునుడి వచ్చే ఏకసూత్ర ధ్వనులు.అలాంటి విశ్వజనీనమైన సంగీతం మీద తనకి మాత్రమే పేటెంట్ హక్కులు ఉన్నాయనటం స్వరజ్ఞాని యొక్క అజ్ఞానం మాత్రమే!

          విశ్వనాధ సత్యనారాయణ గారి పురాణ వైర ఫ్రంధమాలలో "వేదవతి" కధ ప్రత్యేకమైనది!అందులో వేదవతి అనే ఆ నవలానాయకి దేహం సంగీతానికి విపరీతంగా ప్రతిస్పందిస్తుంది - ఎంతగా అంటే స్వరబద్ధమైన సంగీతం వింటూ ఉంటే క్షణ క్షణానికీ జీవశక్తులు ఉత్తేజితమై కొద్ది మిమిషాల్లోనే పూర్ణచందుడిలా తళుకులీనుతుంది,కర్ణకఠోరమైన సంగీతం వింటూ ఉంటే క్రుంగి కృశిస్తుంది!ఆ నవలలో భగవంతుడి మీద పగతో రగిలిపొయే జయధ్రధుడి వారసత్వంలో వచ్చే ప్రతినాయకుడి పేరు నిమేషధారి,వాడో మాంత్రికుడు.వాడు ఆయుష్షుని నిమిషాల లెక్కన పెంచుకోగలిగినవాడు.దాన్ని సాధించడానికి వేదవతిని కిడ్నాప్ చేసి వేదనాదం వినిపించి ఆమేనుంచి ఆయుష్షును నిమిషాలుగా గహిస్తాడు!అలా ఆయుష్షును పెంచుకున్నాక ఆమెకి పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తాడు - తప్పించుకోవడానికి శక్తి కూడా లేనంత నీరసించి పోతుంది వేదవతి.కల్పన బాగుంది కదూ - ఇప్పటి హాలీవుడ్ సినిమాల వాళ్ళకి కూడా రాని యెన్నో చిత్రవిచిత్రమైన కల్పనలు ప్రతి పురాణ వైర కధలోనూ ఉంటాయి - ఆయన్ని వెనక్కి నడిచేవాడు అని వెక్కిరించారు!అసలు విషయం యేమిటంటే ఈమెని వెతకడానికి బయలుదేరినవాళ్ళలో ఒక జానపదుడు ఉంటాడు,ఆ పాత్రకి విశ్వనాధ పెట్టిన పేరు టికటిక!నిమేషధారి తన స్థావరంలో లేని సమయంలో ఈ జానపదుడు  ఆ దగ్గిరలో తిరుగుతూ పాడిన జానపద గీతాలలో వైదిక సంగీతం వినబడి కృశించిన వేదవతి తేరుకుని నిండు తేజస్సును సమకూర్చున్నట్టు విశ్వనాధ వారు కల్పన చేశారు.ఆ వెంటనే తప్పించుకుంటుందో,లేక టికటిక ఆమెను కనిపెట్టటం జరిగి కధ కొంచెం నడిచాక తప్పించుకుంటుందో నాకు గుర్తు లేదు.అయితే ఇక్కడ విశ్వనాధ చెప్పదల్చుకున్న విషయమే ముఖ్యం - సంగీతం ఎవడబ్బ సొమ్మూ కాదు!

          ఇళయరాజా గురించి సినిమా పరిశ్రమలో తరచుగా కొన్ని మాటలు వినబడతాయి - ముక్తసరిగా మాట్లాడతాని,మాటిమాటికీ ట్యూన్లు మార్చడానికి విసుక్కుంటాడని,ఇలాంటివి చాలావరకు వినయాన్ని కాకుండా పాండితీగర్వాన్ని సూచించే లక్షణాలు!ఆ సహజమైన అహంభావంతోనే బాలసుబ్రమణ్యం మీద కేసు వేసి ఉండవచ్చును.కొందరు కాపీరైటు ఉల్లంఘనలకి ఇతరేతర వ్యక్తుల నుంచి గట్టి స్పందన కోసం చేశాడంటున్నారు గానీ నాకు మాత్రం ఈ పనిలో పాండితీగర్వానికి సంబంధించిన దుర్మార్గమే కనబడుతున్నది.యెందుకంటే,గానగంధర్వుణ్ణి తను కూర్చిన పాటల్ని పాడినందుకు కోర్టుకీడ్చిన ఇసైజ్ఞాని ఆ పాటల్నితను కూర్చడానికి ముందు రాగకర్తల నుంచి అనుమతి తీసుకున్నాడా?

17 comments:

  1. Agree with you sir. Ilayaraja sueing baluji who brought life to his songs is atrocious. Ilayaraja has behaved in the most undignified manner.

    ReplyDelete
  2. చట్టం అలా ఉంది ఇసై ఏం చేయగలడు పాపం :)

    ReplyDelete
  3. . . . స్వరకర్తలు . .
    అనేకరాగాలు అనూచానం. అవి సామవేదం నుండి వచ్చాయంటారు సంప్రదాయికంగా. ఈమధ్య వచ్చిన రాగాలూ ఉన్నాయి. కదనకుతూహల రాగం (రఘువంశ సుధాంబుధి చంద్ర...) అనేది పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి సృష్టి. మంగళం పల్లివారు కూడా అనే రాగాలు సృజించారు - కొన్న సంప్రదాయిక మూఢవిశ్వాసాలను బదాబదలు చేస్తూ.

    . . . షడ్జమం అనేది ఇక్కడ బేసిక్,రిషభం దానీంటె ఒక యూనిట్ పెంపు . . .
    స్వరస్థానాలు లాగరిథెమిక్ స్కేల్ ప్రకారం ఉంటాయనుకుంటాను. అవి ఒకదానికొకటి వరుసగా సమదూరంలో ఉండవు.

    . . . "నేనేల పాడెద దేవా...! . . .
    నీ లీల పాడెద దేవా.. ఈ‌పాటను జానకిచే పాడించమని లీలగారే సూచించారని ఒకచోట చదివాను.

    ReplyDelete
    Replies
    1. @శ్యామలీయం
      . . . షడ్జమం అనేది ఇక్కడ బేసిక్,రిషభం దానీంటె ఒక యూనిట్ పెంపు . . .
      స్వరస్థానాలు లాగరిథెమిక్ స్కేల్ ప్రకారం ఉంటాయనుకుంటాను. అవి ఒకదానికొకటి వరుసగా సమదూరంలో ఉండవు.
      hari.S.babu
      అవును సమదూరంలో ఉండవు,కానీ పెంపులోఒక నిష్పత్తి ఉంటుంది,మీరన్నట్టు అది లాగరథమిక్ స్కేల్.టైప్ చేసేటప్పుడు హడావిడిగా రాసేశాను.సరి చేస్తాను,కృతజ్ఞుణ్ణీ!

      Delete
    2. సంతోషం. నీ లీల పాడెద దేవా.. అని కూడా ఒక సవరణ చేయండి. అది మురిపించే మువ్వలు అనే సినీమాలోని అద్భుతమైన పాట. దాని లింక్ ఇదిగో: https://www.youtube.com/watch?v=UENO-hR8c5M

      Delete
  4. ‘ రాగకర్తల నుంచి అనుమతి తీసుకున్నాడా’- భలే లాజిక్ లాగారండీ హరిబాబు గారు :)

    ReplyDelete
  5. కేసీయార్ చాలా ఎక్కువ చేస్తున్నాడు!కాంగ్రెస్ లేకపోతే వీళ్ళకు గతమూ లేదు,భవిష్యత్తే లేదు.నోటికొచ్చినట్లు తిట్టవలసిన అవసరం ఏముంది? ఎన్నికల ప్రచారసభ కూడా కాదు కదా? పండిన పంటకి గిట్టుబాటు ధర లేక కాల్చుకుంటున్నారు. తెలంగాణా మిర్చి రైతులకి గుంటూరు రావల్సిన అవసరం ఏమిటి?కేసీయార్ ఎటూ ఫెయిలయ్యాడు బాబు అన్నా న్యాయంచేస్తాడేమోనని ఆశతోనే కదా - ఎవరు రాజేసిన మంటలో వాళ్ళు కాలిపోవడం ఖాయం!

    ReplyDelete
  6. >>పండిన పంటకి గిట్టుబాటు ధర లేక కాల్చుకుంటున్నారు.

    వాళ్ళు ఆంధ్రావాల్ల తొత్తులు. తెలంగాణా ద్రోహులు. అంతేనా గుండు గారూ??

    ReplyDelete
  7. Concept of Temples-Talk by Dr.R Nagaswamy

    https://www.youtube.com/watch?v=P0bU6p2F77M

    ReplyDelete
  8. Dr. Nagaswamy on Hindu Temple Architecture

    https://www.youtube.com/watch?v=d-NDsJ17iCw

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. https://youtu.be/ayxfoaNvLJs

    ReplyDelete
  11. https://soundcloud.com/kuchipudiartacademy-chennai/jayalalitha-speech?

    ReplyDelete
  12. Asalu ilayaraajaa ki kuda rights levu because he sold it to production house. Este gisteren vallu veyyali anthe kani eeyana veyyatam comedy. Oka vela ayana compose chesi evariki ammani paatalu padithe appudu okay.

    ReplyDelete
  13. O Hindu Meluko|Addanki Ranjith Ophir(Christian)Create Rumor On Hindu Dharma| హైందవ క్రైస్తవం పుస్తకం

    https://www.youtube.com/watch?v=aDlPTFB0W6I

    ReplyDelete
  14. Arnob Goswami Republic TV started.

    http://www.hotstar.com/republic-tv-news-with-arnab-goswami/1000116802?ns_mchannel=search&ns_source=Google&ns_campaign=Arnab-Goswami-Republic-EM&ns_linkname=Republic&ns_fee=0&gclid=Cj0KEQjw6LXIBRCUqIjXmdKBxZUBEiQA_f50PsVCRhrMOV90vTbC4pNhqsHIP7JBAGVf3LUwzJ75uVIaAj2U8P8HAQ

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...