ముఖే ముఖే సరస్వతీ అన్నట్టు ఒక మనిషి నుంచి ఒక మనిషికి వ్యాపించే
భావాల మీద, రాగాల మీద ఏ ఒక్క మనిషికీ కాపీరైటు లేదు. మనకి తెలిసిన ప్రతి విషయమూ ఇంకొకరి
నుంచి తెలిసిందే అవుతుంది - మన తలిదండ్రులు నేర్పితేనే మనకి మాటలు వచ్చాయి! అయినా కొందరు
నాకు తెలిసిందీ, నేను పాడందీ, నేను కూర్చిందీ నా సొంతమే అంటున్నారు!సార్వజనీనమైన కళమీద
సొంతహక్కుల కోసం సాటి కళాకారుల మీద కేసులు కూడా వేస్తున్నారు, ఏమి చిత్రం?
ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ సంగెతం ఉంది,ప్రతి సంగీతంలోనూ రాగాలు ఉన్నాయి,ప్రతి రాగానికీ స్వరాలు ఉన్నాయి - చిత్రంగా అన్ని రకాల సంగీత రీతుల్లోనూ ఉన్న స్వరాలు ఏడు మాత్రమే!ఆ స్వరాల వెనక గణితం ఉంది - ఫ్రీక్వెన్సీ,డిలే అనే రెండింటి మిళాయింపుని ఒక స్థిరాంకంగా తీసుకుని దాన్ని మెట్లు మెట్లుగా పెంచితే మిగిలిన స్వరాలు ఏర్పడతాయి.షడ్జమం అనేది ఇక్కడ బేసిక్,రిషభం దానికంటే ఒక యూనిట్ పెంపు(కానీ పెంపులో ఒక నిష్పత్తి ఉంటుంది, అది లాగరథమిక్ స్కేల్) - ఇట్లా లెక్క ప్రకారం స్వరాలను ఏర్పరచారు. వారెవరో ఈనాటివారికి తెలియనే తెలియదే!వారు పేటెంటు హక్కుల కోసం ఆ పని చేశారా?ఆ స్వరాలని గాత్రంలో పలికించినా వాద్యం మీద పలికించినా లెక్క ఒకటే కాబట్టి నాదరమ్యతలో తేడా వుండదు!"నీ లీల పాడెద దేవా...!" పాటలో యస్.జానకి ఆలాపనా సన్నాయి ఆలాపనా ఒకే స్థాయిలో పలకడమే దానికి నిదర్శనం."షడ్జమం మయూరో వదతి" శ్లోకం ప్రకారం అవి ఆయా జంతువుల గొంతునుడి వచ్చే ఏకసూత్ర ధ్వనులు.అలాంటి విశ్వజనీనమైన సంగీతం మీద తనకి మాత్రమే పేటెంట్ హక్కులు ఉన్నాయనటం స్వరజ్ఞాని యొక్క అజ్ఞానం మాత్రమే!
విశ్వనాధ సత్యనారాయణ గారి పురాణ వైర ఫ్రంధమాలలో "వేదవతి" కధ ప్రత్యేకమైనది!అందులో వేదవతి అనే ఆ నవలానాయకి దేహం సంగీతానికి విపరీతంగా ప్రతిస్పందిస్తుంది - ఎంతగా అంటే స్వరబద్ధమైన సంగీతం వింటూ ఉంటే క్షణ క్షణానికీ జీవశక్తులు ఉత్తేజితమై కొద్ది మిమిషాల్లోనే పూర్ణచందుడిలా తళుకులీనుతుంది,కర్ణకఠోరమైన సంగీతం వింటూ ఉంటే క్రుంగి కృశిస్తుంది!ఆ నవలలో భగవంతుడి మీద పగతో రగిలిపొయే జయధ్రధుడి వారసత్వంలో వచ్చే ప్రతినాయకుడి పేరు నిమేషధారి,వాడో మాంత్రికుడు.వాడు ఆయుష్షుని నిమిషాల లెక్కన పెంచుకోగలిగినవాడు.దాన్ని సాధించడానికి వేదవతిని కిడ్నాప్ చేసి వేదనాదం వినిపించి ఆమేనుంచి ఆయుష్షును నిమిషాలుగా గహిస్తాడు!అలా ఆయుష్షును పెంచుకున్నాక ఆమెకి పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తాడు - తప్పించుకోవడానికి శక్తి కూడా లేనంత నీరసించి పోతుంది వేదవతి.కల్పన బాగుంది కదూ - ఇప్పటి హాలీవుడ్ సినిమాల వాళ్ళకి కూడా రాని యెన్నో చిత్రవిచిత్రమైన కల్పనలు ప్రతి పురాణ వైర కధలోనూ ఉంటాయి - ఆయన్ని వెనక్కి నడిచేవాడు అని వెక్కిరించారు!అసలు విషయం యేమిటంటే ఈమెని వెతకడానికి బయలుదేరినవాళ్ళలో ఒక జానపదుడు ఉంటాడు,ఆ పాత్రకి విశ్వనాధ పెట్టిన పేరు టికటిక!నిమేషధారి తన స్థావరంలో లేని సమయంలో ఈ జానపదుడు ఆ దగ్గిరలో తిరుగుతూ పాడిన జానపద గీతాలలో వైదిక సంగీతం వినబడి కృశించిన వేదవతి తేరుకుని నిండు తేజస్సును సమకూర్చున్నట్టు విశ్వనాధ వారు కల్పన చేశారు.ఆ వెంటనే తప్పించుకుంటుందో,లేక టికటిక ఆమెను కనిపెట్టటం జరిగి కధ కొంచెం నడిచాక తప్పించుకుంటుందో నాకు గుర్తు లేదు.అయితే ఇక్కడ విశ్వనాధ చెప్పదల్చుకున్న విషయమే ముఖ్యం - సంగీతం ఎవడబ్బ సొమ్మూ కాదు!
ఇళయరాజా గురించి సినిమా పరిశ్రమలో తరచుగా కొన్ని మాటలు వినబడతాయి - ముక్తసరిగా మాట్లాడతాడని,మాటిమాటికీ ట్యూన్లు మార్చడానికి విసుక్కుంటాడని,ఇలాంటివి చాలావరకు వినయాన్ని కాకుండా పాండితీగర్వాన్ని సూచించే లక్షణాలు!ఆ సహజమైన అహంభావంతోనే బాలసుబ్రమణ్యం మీద కేసు వేసి ఉండవచ్చును.కొందరు కాపీరైటు ఉల్లంఘనలకి ఇతరేతర వ్యక్తుల నుంచి గట్టి స్పందన కోసం చేశాడంటున్నారు గానీ నాకు మాత్రం ఈ పనిలో పాండితీగర్వానికి సంబంధించిన దుర్మార్గమే కనబడుతున్నది.యెందుకంటే,గానగంధర్వుణ్ణి తను కూర్చిన పాటల్ని పాడినందుకు కోర్టుకీడ్చిన ఇసైజ్ఞాని ఆ పాటల్నితను కూర్చడానికి ముందు రాగకర్తల నుంచి అనుమతి తీసుకున్నాడా?
ఇళయరాజా గురించి సినిమా పరిశ్రమలో తరచుగా కొన్ని మాటలు వినబడతాయి - ముక్తసరిగా మాట్లాడతాడని,మాటిమాటికీ ట్యూన్లు మార్చడానికి విసుక్కుంటాడని,ఇలాంటివి చాలావరకు వినయాన్ని కాకుండా పాండితీగర్వాన్ని సూచించే లక్షణాలు!ఆ సహజమైన అహంభావంతోనే బాలసుబ్రమణ్యం మీద కేసు వేసి ఉండవచ్చును.కొందరు కాపీరైటు ఉల్లంఘనలకి ఇతరేతర వ్యక్తుల నుంచి గట్టి స్పందన కోసం చేశాడంటున్నారు గానీ నాకు మాత్రం ఈ పనిలో పాండితీగర్వానికి సంబంధించిన దుర్మార్గమే కనబడుతున్నది.యెందుకంటే,గానగంధర్వుణ్ణి తను కూర్చిన పాటల్ని పాడినందుకు కోర్టుకీడ్చిన ఇసైజ్ఞాని ఆ పాటల్నితను కూర్చడానికి ముందు రాగకర్తల నుంచి అనుమతి తీసుకున్నాడా?