Monday, 27 March 2017

లేవండర్రా బడుద్ధాయిలూ!బారెడు పొద్దెక్కింది - ఇంకా లేవకపోతే ఎట్లా?

అసలు కవిత్వం:
---------------
పొడుపు మలపైన విచ్చుకున్న 
నటరాజు కుడికంటి చురుకు చూపులు
నులివెచ్చని కరుకు తూపులై గుచ్చుకుని,

రేరాజు పంచిన వెన్నెల కొంచెం
సూరీని చాటున తీగలై సాగితే
అల్లుకుని కప్పుకున్న జలతారు
దుప్పటి కరిగి కరిగి చిద్రుపలై,

అటుకాస్త ఒత్తిగిలి ఇటుకాస్త ఒత్తిగిలి
పనిపాట్లకి వేళయిందని గురుతొచ్చి
మంచుముత్యాల కలనేత చిగురాకుపచ్చ ౙరీచీరను

చెదిరీ చెదరనంత సుతారంగ సవరించుకుని
లేచి నిలబడి ఒళ్ళు విరుచుకునింది భూమిదేవి -
అల్లరి పిల్లల్ని పనుల్లోకి తరమాలి గద!

కొసరు మద్యం:
--------------
సీ||
మేలు జరుగుగాక మేదినిపై గల
సకల భూతములకు - స్వస్తి భవతు!

రక్షించబడుగాక రమణులున్,వృద్ధులు,
శిశువు లనాధలున్ - స్వస్తి భవతు!

కలియుగాక సఫలకర్ములై దేశదే
శాల పౌరజనులు - స్వస్తి భవతు!

నశియించిపోవలె నీచులున్,దుర్మతులు
శాంతమార్గముననె - స్వస్తి భవతు!

తే||
చెలుల కిష్టులౌ మగలార - స్వస్తి భవతు!
చదువు చెప్పు గురువులార - స్వస్తి భవతు!
సమత పెంచు నాయకులార - స్వస్తి భవతు!
సేద్యమొనరించు సైరికా - స్వస్తి భవతు!
(సీర్లు!సీర్లు!)

18 comments:

  1. //నటరాజు కుడికంటి చురుకు చూపులు

    మంచుముత్యాల కలనేత చిగురాకుపచ్చ ౙరీచీర//

    హరికాలం ��- హరితకాలం ��
    ఈ రెండు పోలికలు భలే అందంగా అర్ధవంతంగా ఉన్నాయి హరిగారు.
    ఉగాది శుభాకాంక్షలు ������

    ReplyDelete
  2. ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  3. ఎందరో మహానుభావులు!
    అందరికీ ఉగాది శుభాకాంక్షలు!!

    ReplyDelete

  4. ಹರಿ ಬಾಬೇ !

    ಜಿಲೇಬಿ

    ReplyDelete
  5. తెనుగు నూతన సంవత్సర (హేవిళంబి ఉగాది) శుభాకాంక్షలు

    ReplyDelete
  6. నూతన గృహప్రవేశ వైభోగమే!

    ఇదంతా నిజమేనా?ముందే ఫీద్ ఇచ్చి ప్రిపేర్ చేసిన బాపతా?కేవలం 7వ తరగతి చదువుకున్న ఒక చాకలి మనిషి గ్రామజనాభా లెక్కలూ చెప్పింది,పించను అవసరం ఉన్నవాల్ల లెక్కా చెప్పింది!

    తుమ్మల బాగా ప్రిపేర్ చేసి మరీ చెప్పించాడు.మరీ అంత తెలిసిపోయేతట్టు చెప్తే ఎష్లా?బొత్తిగా లౌక్యం తెలీదు పాపం:-)

    తెలంగాణలో అంతే:-)


    ReplyDelete
    Replies
    1. మీరు మరీనూ 😀. ఊళ్ళో వాళ్ళ బట్టలుతుకుతుంటామన్నదిగా, మరి ఊరి జనాభా లెక్కలు తదితర లెక్కలు తెలిసుండడంలో వింతేముంది మాస్టారూ 🙂. చదువుకున్నవాడి కన్నా చాకలి నయం అని సామెతే ఉందిగా ☝️.

      Delete
    2. అంతే, అంతే!తెలంగాణలో అంతే:-)

      Delete
  7. పంఘుం లంఘయతే అనంట్టు శ్రీ రాజశేఖరుల వారి కాలంలో ఒక కుంటివాడు గోడలెక్కి దూకి ఒక హత్య చేశాడని పోలీసులు నిర్ధారించేశారు!అతను చక్రాల కుర్చీలో కోర్టుకి వస్తూ ఉండటం చూసి కూడా న్యాయవాదులు,న్యాయమూర్తులు అతన్ని దోషిగా తేల్చి శిక్ష ప్రకటించేశారు!అతని అదృష్టం బాగుండి ఉరిశిక్ష పడకపోవటం వల్ల ఇప్పటికైనా బయత పడగలిగాడు!న్యాయం చెయ్యండని ముఖ్యమంత్రి గారి కాళ్ళమీద పడితే కాళ్ళతో పక్కకి తోసేసి విదిలించుకుని పోయిన వాడి కొడుకు నిన్నటి రోజున తను ముఖ్యమంత్రి కాకపోవడం వల్లనే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని చెబుతూ రేపటి కాలంలో ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాడు!

    ఇదంతా ప్రజాస్వామ్య యుగంలోనే జరిగింది,జరుగుతున్నది!మరి రాజరిక యుగంలో ఎట్లా ఉండేదో?

    ReplyDelete
    Replies
    1. అతను ముఖ్యమంత్రి కాకపోవడం వల్లనే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని చెబుతూ ఉన్నాడన్నారే - అలాంటి ఘోరాల్లో ఈ సత్యంబాబు నిర్దోషిగా బయటపడటం కూడా ఒకటండారేమో ఆయన?

      Delete
    2. నిజమే, శ్రీకృష్ణుడి పుట్టుక మాత్రమే చెఱసాలలో జరిగితే నిత్యకారాగృహసందర్శనంతో ఈయన అంతకన్నా గొప్పవాడని కూడా చెప్పుకోవచ్చు!కలికాలంలో ఏమైనా జరగొచ్చు!!

      Delete
  8. Check What Pakistani girls are doing in England. Mr Jinnah are you watching

    https://www.youtube.com/watch?v=oSvePHgkqOo

    ReplyDelete
  9. Who is he?

    https://www.youtube.com/watch?v=BIp0zXP4TD0

    ReplyDelete
    Replies
    1. వీళ్ళు పోయి పోయి వాళ్ళనే అడిగారూ?ఆయన ఖురాను నాలుగుసార్లు ఎత్తి చూపించాడు!కాబాలో కూల్చిన 360 విగ్రహాలకీ మేము ఎప్పుడో దిట్టంగా కధలు అల్లేశాం కావాలంటే వినిపిస్తాం అంటున్నాడు.

      కాబా ఇస్లామిక్ భూతం కూల్చిన మొదటి శివాలయం - చంద్రుడికీ శనికీ శివుడితో ఉన్న సంబంధాన్ని చూపించే అపురూపమైన హిందూ దేవాలయం!

      Delete
  10. 'భారతీయులను జాత్యహంకారులు అనడం దుర్మార్గం. ఎందుకంటే మేము నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తాం. మాకే కనుక జాతివివక్ష ఉంటే దక్షిణ భారతీయులతో కలిసి ఎలా నివసిస్తాం. మాలోనూ, మన చుట్టూ నల్లజాతీయులు ఉన్నారు. వివిధ వర్గాలకు చెందినప్పటికీ భారతీయులు పరస్పరం సంఘర్షించుకుంటారు. కొంతకాలం క్రితం మహారాష్ట్రలో బిహారీలపై దాడులు జరిగాయి. మరాఠీలను బిహార్ లో బెదిరించారు. ఇవన్నీ జాత్యహంకార దాడులు కాద'ని తరుణ్ విజయ్‌ పేర్కొన్నారు.

    ReplyDelete
    Replies
    1. వెయ్యి మంచిపనులు చేసి ఉండవచ్చు గాక… ఒక్క హత్య చేస్తే చాలు… అంతా పోయినట్టే..!
      తరుణ్‌ విజయ్‌ జాత్యహంకారి అంటూ జరుగుతున్న రచ్చలో కనబడిన ఓ వ్యాఖ్య అది.

      నిజానికి ఈ వ్యవహారంలో ఒక సామెత వాడవచ్చునా లేదా అని ఆలోచిస్తున్నాను. ‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోయింది’ అన్న సామెత అది. పోలికలో తేడా గురించి కాదు, ఆ సామెతను వాడితే అది అపసవ్యమైన ఇంటర్‌ప్రిటేషన్స్‌కు దారి తీస్తుందన్నది భయం. సరే, ఇప్పుడు ఆ మొదటి వ్యాఖ్యను తీసుకోవచ్చు.

      తరుణ్‌ విజయ్ జాత్యహంకారి, మనువాది, ఆరెస్సెస్‌ ఫాసిస్టు, బ్లా బ్లా బ్లా… అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రాసేస్తున్న వారిలో అందరూ మాటల శూరులే అని అర్ధమవుతోంది కానీ చేతల వీరులు ఎవరైనా ఉన్నారా అంటే అనుమానమే.

      తరుణ్‌ విజయ్ వ్యాఖ్యలు సరైనవి అని సమర్ధించబోవడం లేదు. ఆ మాట అతనే ఒప్పుకున్నాడు, క్షమాపణలు చెప్పుకున్నాడు. అసలు సందర్భం ఏంటి, అతనేం మాట్లాడాడు, ఎందుకలా మాట్లాడాడు అన్నది ఒకసారి ఆలోచించాలి కదా. ఆ మాటలు స్లిప్ ఆఫ్‌ టంగా, లేక అతనికి మాలాఫైడ్ ఇంటెన్షన్‌ ఉందా, అసలు అతని ట్రాక్‌ రికార్డ్ ఏంటి… అన్నవి చూడాలి కదా.

      భారతదేశంలోని ఆఫ్రికా ఖండవాసులు అందరిపైనా దాడులు జరుగుతున్నాయి… అవన్నీ జాత్యహంకార దాడులే… అన్న పాయింట్‌ మీద అల్‌జజీరా ఛానెల్ చర్చాగోష్టి నిర్వహించింది. ఓ భారతీయ ఫొటోగ్రాఫర్‌, కొందరు ఆఫ్రికన్‌ విద్యార్థులతో పాటు బీజేపీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ (ఇండియా ఆఫ్రికా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్‌ గ్రూప్‌ ఛైర్మన్) పాల్గొన్నాడు. ఆఫ్రికన్లపై జరిగే అన్ని దాడులనూ రేసిస్టు దాడులుగా పరిగణించడం సరికాదని ఆయన చెప్పాడు. భారతీయులు దేవుడిగా కొలిచే కృష్ణుడి పేరుకు అర్ధమే నల్లనయ్య అయినప్పుడు రంగు ఆధారంగా వ్యక్తులను అంచనా వేయడం సరికాదన్నాడు. ఐతే… భారతదేశం మొత్తం రేసిస్టుల మయం అన్న సాధారణీకరించేసిన ఇతర ప్యానెలిస్టులతో మాట్లాడే సందర్భంలో నోరు జారాడు. భారతీయులు జాత్యహంకారులైతే దక్షిణాది రాష్ట్రాలతో ఎలా కలిసుంటారని వ్యాఖ్యానించాడు. అక్కడే తరుణ్‌ విజయ్‌ అడుసులో కాలేశాడు. తర్వాత ట్విట్టర్‌ ద్వారా తను సరిగ్గా మాట్లాడలేదని ఒప్పుకున్నారు. తన భావానికీ పదప్రయోగానికీ పొంతన లేకుండా పోయిందంటూ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఇంకేం, గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతిపక్షాల వారందరూ తరుణ్‌ను ఏకిపారేశారు. సోషల్‌ మీడియా ట్రాలింగూ పెరిగిపోయింది.

      ఇంతకీ దక్షిణాది అంటే తరుణ్‌విజయ్‌కి నిజంగా చిన్నచూపేనా? అతని వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే కొన్ని ఘటనలు చూద్దాం…

      — తమిళనాడు హైకోర్టులో తమిళాన్ని వాడుకభాష చేయాలంటూ ఉద్యమించాడు.

      — తమిళం, తిరుక్కురళ్‌ లేకుండా భారతదేశమే లేదని వ్యాఖ్యానించాడు.
      TV 2

      — తిరువళ్ళువర్‌ జీవిత చరిత్రను విద్యార్ధులకు పాఠ్యాంశంగా పెట్టాలని డిమాండ్ చేశాడు.

      — తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో తిరువళ్ళువర్‌ విగ్రహం కట్టించాడు.

      TV 1

      — అగ్ర, నిమ్న వర్ణాల సమన్వయం కోసం కృషి చేశాడు, ఆ క్రమంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు.

      — దళితులకు ఆలయ ప్రవేశం చేయిస్తూ సోకాల్డ్ అగ్రవర్ణస్తుల చేత రాళ్ళదెబ్బలు తిన్నాడు.

      — కర్ణాటక కోలార్‌ జిల్లా కగ్గనహళ్ళి గ్రామంలో సాంఘిక బహిష్కరణ ఎదుర్కొన్న ఎస్సీ మహిళ రాధమ్మకు అండగా నిలబడ్డాడు. మూడురోజులు ఆ గ్రామంలో ఉండి ఆమె చేతి వంట తిన్నాడు. ఆమె బాధను పార్లమెంటులో వినిపించాడు.

      ఉత్తరాఖండ్‌కు చెందిన తరుణ్‌ విజయ్‌కి తమిళ భాష గురించో, కన్నడ ఎస్సీ మహిళ గురించో కష్టపడాల్సిన పనేంటి? తరుణ్‌ విజయ్‌ను మీడియాలో, సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్న వారిలో ఎవరైనా అతని ఆచరణలో వెయ్యోవంతైనా ఆచరించగలరా? కానీ మనకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందిగా. వాడేసుకుంటే పోలా. పైగా తప్పు చేశాడు, చేశానని ఒప్పుకున్నాడు, అడ్డంగా దొరికిపోయాడు. అలాంటి జాత్యహంకారిని కుమ్మేద్దాం పదండి.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...