Friday, 23 December 2016

అందరు మొగుళ్ళూ భీమవరమెళ్ళి బిందెలు దెస్తేనూ నా మొగుడూ కాకినాడెళ్ళి కుండలు దెచ్చాడే!"

     కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు,పోయే కాలానికి తగ్గట్టు కాంగ్రెసుకి రాహుల్ బుజ్జాయి దొరికాడు - నీ సోకు మాడ!ఏం తెలివి?ఏం తెలివి?మొగుడు కొట్టినందుకు కాదు తోడికోదలు నవ్వినందుకు ఏడుస్తున్నానన్న అమ్మల్ల్లక్కల పాటి పౌరుషం కూడా లేదే - ఖరమ!

     "నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?" అని కూడా అనేశాడు."మీరు మనసారగా నేడ్వనీరు నన్ను!" అని ఇదివరకే అనేసినట్టున్నాడు."లేవు నాకుగాదులు,లేవు నాకు ఉషస్సులు!కలవు నాకు కన్నీటి ముత్యాల సరాల దొంతరలు!!" అని సరిపెట్టుకునే కాలం తొందర్లోనే ఉన్నట్టుంది.వరస చూస్తుంటే కాంగ్రెసురహితభారతం రాహులు బాబు మూలంగానే వచ్చేట్టుంది:-)

     ఒఖానొఖప్పుడు హఠాత్తుగా ప్రజాసేవకు సెలవుచీటీ ఇచ్చి బాఘా ఏడ్చి మొహం కడుక్కుని  వచ్చాడని తెలియడంతో కాంగ్రెసు పార్టీ లోపల ఉన్న వారికీ బయటుండి కాంగ్రెసు పార్టీని అభిమానించే వారికీ సరికొత్త ఆశలు మోసులు వారాయి,వాడిన పూలు వికసించినట్టు మాడిన మొహాలు తేటబారాయి - యువనేత కొత్తరక్తం పుంజుకుని కొత్తతెలివితో మోదీని ఇరగదీస్తాడని!షెర్లాక్ హోమ్స్ కధలు చదివి అపరాధ పరిశోధనలో ఆరితేరి భూకంపాలు పుట్టించాల్సింది పోయి చంపక్ కధలు చదివి ఒళ్ళు మర్చిపోయి వయసు తగ్గిపోయి బుద్ధి మట్టమైపోయి పాత సూట్ కేసుల పిట్టకధలు ఎత్తుకుంటున్నాడు.కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు తయారయింది పరిస్థితి - కక్కలేకా మింగలేకా కాంగ్రెసోళ్ళు కుడితిలో పడ్ద ఎలుకల్లా అల్లల్లాడిపోతున్నారు:-(

     తోటకూర నాడే చెప్పకపోతివి గదే అని తల్లి దవడ పగలగొట్టిన దొంగకొడుకు పాటి కూడా బుర్రలు పనిచెయ్యని సన్నాసులకి ఈ పోటుగాడు మేధావి అనిపిస్తాడు, ఆ లెక్కన ఈయన పార్టీ పవరులోకి రావాలంటే జనాలంతా అట్టనే ఉండిపోవాల ఈయనా,దిగంబరం,మనమోహనూ బయటపెట్టిన ఇండియా పోరి పోగ్రెస్ రిపోర్టు ప్రకారం - కొంపదీసి దేసమంతా ఇంకా అట్టాంటి సన్నాసులే ఉండారా నాయ్నా?

     అయ్యా!పేరుకే దుర్యోధనుడు నేను కర్ణుణ్ణి చూసుకుని యుద్ధానికి దిగుతున్నానని అన్నాడు గానీ మొత్తం 18 రోజుల్లో 10 రోజులు భీష్ముడూ మిగతా 8 రోజుల్ని ద్రోణుడూ,శల్యుడూ,కర్ణుడూ పంచుకున్నాక తసమదీయులైన కౌరవసేన విషయం వదిలేస్తే అస్మదీయులైన పాండవుల వైపున ఆ అయిదుగురూ వాళ్ళ పిల్లలూ తప్ప ఇంకెవరూ మిగల్లేదు - ముసలాళ్ళ అనుభవం ముందు కుర్రాళ్ళ హడావిడి ఆంజనేయుడి ముందు వేసిన కుప్పిగంతులు!తన పరాక్రమంతో ఒక్కొక్క గెలుపుకీ ఒక్కొక్క పేరు చొప్పున పదిపేర్లు తెచ్చుకున్న అర్జునుడు కూడా సిగ్గు పడకుండా శిఖండిని ముందు పెట్టుకుంటే గానీ పని జరగలేదు - అట్టాంటిది ఈ బుజ్జాయి ఆ గడుగ్గాయిని గెలుస్తాడా - హవ్వ!ఈ శిఖండిని ముందు పెట్టుకుని కాంగ్రెసుని గెలిపించగలిగిన అర్జునుడు ఎవడు?

     బాలానాం రోదనం బలం అంటారు,అందుకే గాబోలు గొప్ప సమయస్పూర్తితో ఏడుపు కార్యక్రమం పెట్టుకున్నాడు.ఆంధ్రాలో ఒక బుగ్గల రుద్దుడు ఓదార్పులు చేసిన అనుభవజ్ఞుడు ఉన్నాడు - అతని దగ్గిర ప్రైవేటు చెప్పించుకుంటే బాగుంటుంది.ఒకవేళ ప్రైవేటుకి వెళ్లాలంటే శుక్రవారం మాత్రం వెళ్ళకూడదు - ఆంధ్రాగన్ శుక్రవారం చాలా బిజీ!పాటకి నేనూ ఆటకి మా అప్పా అన్నట్టు ఎప్పటికప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకుని తెల్లమొహం వెయ్యడంలో ఇద్దరికిద్దరు సరిజోడు చిన్నోళ్ళు!

     మొదట్లో నేనూ బీదాబిక్కీ ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకునుంటే బాగుండేదని అనుకున్నా గానీ విశేరెడ్డి లాంటోళ్ళ దగ్గిర బయటపడుతున్న కట్టల్ని చూశాక నమ్మకం కుదిరింది ఇట్లా తప్ప ఇంకోట్లా వీళ్ళు బయటపడి ఉండేవాళ్ళు కాదని!వేలు పెట్టే సందు దొరికితే కాలు దూర్చేవాళ్ళు,విడుదల చేసిన ఆరుగంటల్లోనే కాలు కదపకుండా తళతళలాడే కొత్తనోట్లని ఇళ్ళకే తెప్పించుకోగలిగినవాళ్ళు,నిలువు బొట్లూ అడ్ద బొట్లూ పెట్టి భక్తుల మాదిరి దేవస్థానాల్ని కూడా అపవిత్రం చేస్తున్నవాళ్ళు సామాన్యుల కోసం అని చెప్పి ఏమాత్రం వాళ్ళకి దారి తెరిచే వెసులుబాటు ఇచ్చినా దాన్ని ఉపయోగించుకోకుండా వొదుల్తారా?నేను పాత పేపర్లు తిరగేస్తుంటే కనబడింది 2000 నోటు విడుదల చెయ్యాలన్న నిర్ణయం చాలా ముందే జరిగింది - అంతా ప్లాను ప్రకారం వేసిన ట్రాప్!"అంచెలంచల మోక్షము చాల కష్టమె భామినీ!" అని ఎంత మొత్తుకున్నా లాభం లేదు, సీతయ్యలాగే మోదీ కూడా ఎవ్వరి మాటా వినడు - ఆడంతే,అదో టైపు!

     "ఎవరు పేర్చిన నలుపు వారు పూసుకోక తప్పదన్నా!" అన్నట్టూ "కట్టలు కట్టలనియేవు ఈ కట్టలెవరివే సిలకా!" అన్నట్టూ "చెరసాలకు వేళాయెరా!" అన్నట్టూ పేరడీ తత్వాలు రాసే క్రియేటివిటీ ఉన్నవాళ్లకి మంచి గిరాకీ ఇప్పుడు!మోదీ కేవలం నోట్ల రద్దు ఒక్కటే చెయ్యలేదు - ఈడీ,ఐటీ లాంటి మదగజాల్ని ఫుల్ పవర్లు ఇచ్చి వొదిలాడు.టెలిఫోన్లు ట్యాప్ చెయ్యడం దగ్గిర్నుంచి వాళ్ళకి తెలిసిన విద్యలన్నింటినీ ప్రయోగిస్తున్నారు - ఎంతకాలం నుంచి కసిగా ఉన్నారో గానీ!ఇంక అవినీతిపరులకి "పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిన శాశ్వతమెవడురా!" అనే తత్వం ఒక్కటే నిక్కచ్చిగా బోధపడాల్సి ఉంది.ఎవరు ఏడ్చినా ఎవరు నవ్వినా ఆట మొదలయ్యాక ఆడాల్సిందే,ఇప్పుడిక మోదీ కూడా ఆపలేడు!


అంతం కాదిది ఆరంభం మాత్రమే - ఖబడ్దార్!

42 comments:

  1. చాలా కాలం శలవుల్దీసుకున్నా ఇరగదీశావుగదబ్బాయ్ :)

    ReplyDelete

  2. http://myvoice.opindia.com/2016/12/demonetization-what-does-the-worlds-most-unbiased-reporter-say/

    ReplyDelete
    Replies
    1. నగదుకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం చేపట్టిన విపరీత చర్యగా నోట్ల రద్దును వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనంలో వ్యాఖ్యానించింది. భారతలో 95 శాతం లావాదేవీలు నగదులోనే కొనసాగుతాయనీ, దేశ ఆర్థిక రంగంలో అవ్యవస్థీకృత రంగం వాటా 45 శాతం ఉంటుందని పేర్కొంది. అడ్డగోలు రూల్స్‌తో వ్యాపారాలను ప్రభుత్వమే గొంతు నులుముతోందనీ, సజావుగా చట్టబద్ధంగా సాగే వ్యాపారాలు కూడా ఈ నిబంధనలు, చట్టాల కారణంగా చట్టం పరధి నుంచి దూరం జరుగుతున్నాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అభిప్రాయపడింది. జర్మనీలో ఇప్పటికే 80 శాతం నగదు లావాదేవీలేననీ, అమెరికాలో 32 శాతం నగదు లావాదేవీలు కొనసాగుతున్నాయనీ, జపాన్‌, స్విట్జర్లాండ్‌లో నెగెటివ్‌ వడ్డీరేట్ల భయంతో ప్రజలు నగదునే దాచిపెట్టుకుంటారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.
      భారతను క్యాష్‌లెస్‌గా మార్చడమంటే ఎఫ్‌1 రేసులో ఎడ్లబండిని పోటీకి పెట్టి స్పీడ్‌గా వెళ్లడంలేదని చర్నకోలతో ఎడ్లను బాదితే ఏం ఒరుగుతుందని కూడా వాల్‌స్ట్రీట్‌ వ్యాఖ్యానించింది. క్యాష్‌లెస్‌ ఐడియా మంచిదే అయినా రాత్రికి రాత్రి బలవంతంగా రుద్దడం వల్ల సాధ్యం కాదని, ఆ దిశగా వ్యవస్థలో సంస్కరణలను ప్రవేశపెట్టాలని పత్రిక సూచించింది.

      Delete
    2. వాల్స్ట్రీట్ ఓడికి మా ఇంటెనక జిలేబీలమ్మే రాములయ్యకంటే ఎక్కువ బ్రైన్ ఉందా?? రాములయ్య మొడీని పొగిడిన లింకొకటేసుకోండ్రా

      Delete
    3. డీమానిటైజేషన్ ఆలోచన మోడీకి రావడానికి అంబేద్కర్ స్ఫూర్తి అని అయన మనవడు ప్రకాష్ అంబేద్కర్ చెప్పాడు. పదేళ్ళకొకసారి డీమానిటైజేషన్ చేయాల్సిందేనని అంబేద్కర్ 93 ఏళ్ళ క్రితమే వ్రాసాడు.
      ఇప్పడు తుగ్లక్ తాత ఎవడు? అంబేద్కరా?
      అయినా అంబేద్కర్ కి మా సందు చివర అప్పడాలమ్ముకునే అన్వేష్ కంటే పెద్ద బ్రెయినుందా? వేసుకోండిరా ఇంకో వాల్ల్ స్ట్రీట్ లింకు.
      B R Ambedkar said currency should be replaced every 10 years: Prakash
      Prakash Ambedkar shared the economic vision of his grandfather whose research at the London School of Economics that evolved in the form of a thesis and, later, into a book 93 years ago explored the problems confronting the nation today.
      http://indianexpress.com/article/india/india-news-india/b-r-ambedkar-said-currency-should-be-replaced-every-10-years-prakash/

      Delete
    4. అబ్బ శా.. నీ బుర్ర్రకాయని కొంచెం పైకెత్తి, ఇంకొచెం అడ్డంగా తిప్పి మబ్బులెంక చూస్తూ అంబేత్కర్ని నమ్మి 10 ఏళ్ళకో తూరి నోట్లు మార్చాలంటే ఖర్చెంతైద్దో ఓపాలి లెక్కేసుకోమ్మా...... సప్పోజ్.. పర్ సప్పోజ్ అంబేత్కర్ చెప్పిందే మోడీ బాబా సేసెయ్యాలని నడుం బిగించేసినాడనుకుంటే, "మా గడ్కరీ బిడ్డ లగ్గానికి కావల్సిన 100 కోట్లు సైడేసుకున్నాడు. ఇక ఎంటనే మీదగ్గరున్న లెఖ్ఖలన్ని రద్దు చేశేసినాం. ఇక ఎవడి సంకలు వాళు నాక్కోండి" అని కూడా అంబేత్కర్ చెప్పిండా.. లేక పటేలు, రాముడు సెప్పిండ్రా??

      మీ దుంపలుదెగ.. ఇళ్ళంతా తగలబెట్టి, సూసినావా మావోడు ఎలకల్ని ఎంతబాగా చంపేసిండో అని బట్టలు చించుకోని రోడ్ల మీద తైతెక్కలెంద్రా భయీ

      Delete
    5. @Anonymous23 December 2016 at 22:12,

      అజ్ణాతం గా రాసిన పై వ్యాఖ్యలో ఉన్న సమాచారం ఎమి ఉంది? వ్యక్తిగతంగా ఎగతాళి చేయటం తప్ప.

      వాల్స్ట్రీట్ వాడు విమర్శించటానికి ఇంత కాలం ఎందుకు తీసుకొన్నాడు? మొదటి వారం లోనే మోడి ప్రభుత్వా నిర్ణయాన్ని చీల్చి చెండాడ లేక పోయాడా? విషయమేమంటే డిజిటల్ పేమెంట్ల వలన విసా,మాసటర్,అమెరికన్ యక్స్ ప్రెస్స్ కార్డ్ లకు వేల కోట్ల వ్యాపారం వస్తుందనుకొన్నారు. ఆధార్ కార్డ్ తో పేమెంట్ చేసే అవకాశం మోడిప్రభుత్వం ప్రవేశ పెడుతున్నాదని తెలిసిన తరువాత ఆశలు అడుగంటి పోయాయి. వ్యాపారం పోయిందనే కోపం, కసి తట్టుకోలేక వాల్స్ట్రీట్ వాడు అక్కసు వెళ్ల గక్కాడు. అది అసలు రహస్యం. వాడికి వంత పాడుతూ సాక్షి,ఆంధ్రజ్యోతి పత్రికల వాళ్ళు ఆ వార్తను ప్రచూరించుకొని చంకలు గుద్దుకొన్నారు.

      ఈ ఆంధ్రా వాళ్ళ గోల ఎమిటి? డిల్లికి పోయి మోడికి, సాష్టాంగ పడేది ఇక్కడ వీరుల్లా మాట్లాడేది. బాబు తప్పుకొంటే, మోడికి జిందాబాద్ కొట్టడానికి జగన్ క్యు లో ఉన్నాడు. వీళ్ల సంగతి ఎవరికి తెలియదు. వీళ్లేందో నమో కు గుణపాఠం చెప్తారంట. ఆంధ్ర రాజకీయాలలో బిజెపి ఎదో ప్రధాన రాజకీయ పక్షం అయినట్లు, గంగవెర్రులెత్తుతూ మోడి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తారా? చేసి ఎమి సాధిస్తారు? నమో వెంట్రుక పీకలేరు.కారణం కర్నటక ను పక్కన పెడితే, మొత్తం సౌత్ లో బిజెపి కి ఐదు యం.పి.స్థానాలు కూడా లేవు. వచ్చే ఎన్నికలలో ఇంతకన్నా మెరుగయ్యేది లేదు. వెంకయ్య నాయుడున్నంత వరకు బిజెపి కి ఆంధ్రాలో భవిషత్ లేదు. మోడిని, బిజెపిని ఎంత తిట్టుకొన్నా తెలుగువారి సంబందించినంత వరకు అది వేస్ట్ ఆఫ్ టైం. ప్రస్తుతం కేంద్ర రాజకీయాల లో తెలుగు వారి పాత్ర శూన్యం. వాస్తవాన్ని ఒప్పుకోలేక కిందా మీద పడుతున్నారు.


      ఇక ఆధార్‌తో చెల్లించండి

      http://www.andhrajyothy.com/artical?SID=349589

      Delete
    6. 10 సంవత్సరాలకోసారి అని మాత్రమే చెప్పాడా? అది ఎలా చెయ్యాలో, దానికి ముందు వెనక తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటో మాత్రం చెప్పలేదా?? లేకపోతే, అర్ధరాత్రి అపరాత్రి పిచ్చి ముదరినప్పుడల్లా మార్చేసుకోమన్నాడా??

      Delete
    7. ముందు వెనకా తీసుకోవాల్సిన స్టెప్స్ నీకేమైనా చెప్పాడా? చెబితే నిన్ను మోడీ కనుక్కోలేదా? మోడీ ఫోబియా ముదిరితే ఎదుటోడు ఏం చేసినా మెంటల్ గానే కనబడతాది. ఇట్లా చేస్తేనే బ్యాంకుల్నుండి తిన్నగా ఇంటికే నోట్లు తెప్పించుకున్నారు. ఇంకా ముందే చెప్పేస్తే తీసుకుంటే ఈ పాటికి దొంగనోట్లనీ బ్యాంకుల్లోనే వుండేయి.

      Delete
    8. @ Sriram

      బీజెపీ మన రాష్ట్రాన్ని కుక్కకంటే ఎంత నీచంగా చూస్తున్నా, నీలాంటి భట్రాజులున్నంతకాలం నమో నమహా

      Delete
    9. >>ముందు వెనకా తీసుకోవాల్సిన స్టెప్స్ నీకేమైనా చెప్పాడా? చెబితే నిన్ను మోడీ కనుక్కోలేదా?


      పిచ్చి పీక్కెల్లడమంటే ఇదే, నాకు అంబేత్కర్ చెప్పలేదు కాబట్టి, మోడీ ఇష్టమొచ్చినట్టు చేసుకోమనా అర్ధం?? అస్సలు మీ తలక్కాయలకి మోడీ రోకల్లు చుడతంటే అబ్బా అబ్బా.. ఎంత పెద్ద డాక్టరో అని మురిసిపోతున్న మిమ్మల్ని చూస్తంటే... ఎఫ్1 లో ఎద్దులబండి కాదు, బండరాల్లు పెట్టికూడా పోటీ చేస్తున్నారు ఎదవలు, అదేమంటే, చూశావా! మా పెద్ద పిచ్చోడు ఔన్సు పెట్లోలు కూడా వాడట్లేదని గెంతడానికి తయారు..

      Delete
    10. @Anonymous25 December 2016 at 23:07,
      ముందుగా నువ్వు ఊహించుకొన్నట్లు మోడి అంటే వ్యక్తిగత అభిమానం నాకు లేదు.

      ఈ రోజుల్లో చదువుకొన్న వారెవ్వరు పుట్టిన రాష్ట్రం లో తిష్ట వేసి కూచొని ఉండటం లేదు. ఆంధ్రా నుంచి అమెరికా వరకు అటు ఆస్ట్రేలియా, యురోప్, రష్యా, బెంగుళూరు, చెన్నై, డిల్లి, బాంబే ఎక్కడ సందు దొరికితే అక్కడి కెళ్ళుతున్నారు. స్థిర పడుతున్నారు. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన అందరు తట్టాబుట్టా ఎత్తుకొని హైదరాబాద్ నుంచి వచ్చేశారా? కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాత్రికి రాత్రి ఆంధ్రా అభివృద్ది బాట పట్టేస్తుందనే భ్రమలు నాకు లేవు.

      వానలోస్తే టౌన్ లో వరదలొస్తున్నాయి. కాలువలనంతా
      ఆక్రమించి ఇళ్లు కట్టేశారు. వాటిని తొలగిస్తాను, దురాక్రమణలు తొలగించి, కాలువల పూడిక తీయించి బ్రహ్మాండంగా టౌన్ అభివృద్ది చేస్తాను అని బాబు గారు చెప్పిపోతారు. పరిస్థితి యథాతం గా ఉంట్టున్నాది. ఒక్క ఉద్యోగికి కూడా ప్రభుత్వం అంటే భయం అనేది లేదు సరికదా! ప్రభుత్వమే ఈయన వలన ఉన్నట్లు ఫీలవ్వటం. ప్రజలను పీక్కతినటం ఎక్కువైంది. అలాగే ప్రజలు కూడాను ఉచిత పథకం పెట్టి తాయిలాలు పంచటం చేసేవాడే ప్రభువన్నట్లు గా తయారయ్యారు.

      బాబు గారు అమరావతి అభివృద్ది పై ఫోకస్ తగ్గించి, అవీనీతి ని కంట్రోల్ చేయాలి ఉద్యోగులు, ఆఫీసుల చుట్టుతిరిగే ప్రజలకి సరైన సేవలు అందేటట్లు చూడాలి. ఇవేమి పట్టించుకోకుండా ఎంత సేపటికి అమరావతి నిర్మాణం గురించి ఫోకస్ పెడితే మంచిది కాదు. ఇప్పటివరకు నాలాగా గుంటూరు, విజయవాడ చూడని వాళ్లేంతోమంది ఆంధ్రాలో ఉన్నారు. వారికి ఈ రాజధాని ఎంత అద్భుతంగా కట్టినా పెద్దగా పట్టదు. వాళ్ల ఊర్లో రోడ్లు, కాలువలు బాగుంటే చాలు.

      Delete
    11. @UG SriRam
      వెంకయ్య నాయుడున్నంత వరకు బిజెపి కి ఆంధ్రాలో భవిషత్ లేదు.

      hari.S.babu
      అయ్యో!అదేంటండీ,ఒక్కసారే అంతమాటనేసారూ!రెండు రాష్త్రాకీ ఆయననే పెద్దదిక్కుగా వొదిలారని అనుకుంటున్నారే అనద్రూ?నాకయితే డీమోనిటైజేషన్ తర్వాత అవినీతి కొండలు పగలటం చూసాక సాక్ష్యాలూ రుజువులూ దొరకబట్టి సమర్ధిస్తున్నాను గానీ ఆంధ్రాకి సాయం చెయ్యగలిగి ఉండి కూదా చెయ్యకపోవటం వల్లనే ఆంధ్రాలో బీజేపీకి వోట్లు పడవని నాకు అనిపిస్తున్నది!

      తెదెపా గట్టిగా పోట్లాదకపోవటానికి ఎన్ని కేసులు ఉన్నా జగన్ ఒకవేల తెదెపా+బీజేపీ మైత్రి చెడిపోయి బీజేపీ సాయం చెయదల్చుకుంటే ఇప్పటికీ మూలుగుతున్న డబ్బుతో ముఖ్యమంత్రి కాగలడు అనే భయం కారనం కావచ్చు - అది నిజమా కాదా అనేదానితో సంబధం లేకుండా పైస్థాయిలో జరిగే అధికార మార్పిడి రాజకీయాలు తెలిసినవాళ్లకి అలా జరగడానికి ఆస్కారం ఉంటుందనే అనిపిస్తుంది.కానీ అతని బలహీనత కారణంగా ఆంధ్రా ప్రజలకి ద్రోహం చెయ్యదం మాత్రం బీజేపీ దుర్మారగమైన రాజకీయమే,దాన్ని క్షమించలేను నేను!

      ఇంక మీరు భాజపాకి వెంకయ్యనాయుడే గుదిబంద అన్నది అస్సలు అర్ధం కాలేదు,కొంచెం వివరంగా చెప్పగలరా?

      Delete
    12. Anonymous26 December 2016 at 01:07
      **పిచ్చి పీక్కెల్లడమంటే ఇదే, నాకు అంబేత్కర్ చెప్పలేదు కాబట్టి, మోడీ ఇష్టమొచ్చినట్టు చేసుకోమనా అర్ధం??**
      ఆ ముక్క అర్థమైన ఎర్రి పప్పలకు ఇది మంత్రివర్గ సమిస్టి నిర్ణయం అని తెలియదా? ఇక్కడ ఎడ్లబళ్ళ వాళ్ళని పాలించడానికి ఫారెన్ నాయకులని, ఫారిన్ భావజాలాలని కోరి ఎఫ్ 1 అందలాలెక్కించినప్పుడే మన వాటికన్
      మూలాలు జనాలకి అర్థమయ్యాయి. 70 ఏళ్ళనుండి నీలాంటి ఎర్రెంకన్నలు ఓట్లేసారు కాబట్టే మన దేశంలో ఎడ్లబళ్ళింకా వున్నాయ్. గురివిందగింజలు ముందుగా ఏం చూసుకోవాలో తెలుసుకో.
      ఫోబియా తగ్గించుకోడానికి మందులేసుకో. గెట్ వెల్ సూన్.
      చేసినవాడు మోడీ అయినా ఇంకో గీడీ అయినా ఈ నోట్ల రద్దు చాలా ఉపయోగం అనే వాస్తవం నీ ఫోబియా గంతలు తీసేయనంతవరకూ నీకు తెలియడం చాలా కష్టం.
      మాట్లాడి మోడీ జపమే అయితే ఒక్క రోకలి కాదు, లక్ష రోకళ్ళు చుట్టినా నీకు ఫోబియా తగ్గనే తగ్గదు.

      Delete
    13. వెంకయ్య నాయుడు గారు పెద్దరికం తో పంచాయితీలు చేసి, రెండు రాష్ట్రాల నాయకులను కన్వీన్స్ చేయవచ్చేమో గాని, పార్టిని అభివృద్ది చేసి ఎన్నికలలో గెలిపించటం ఆయన వలన కాదు. 40ఏళ్లు గా రాజకీయాలలో ఉంట్టు, జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, నెల్లూరు మునిసిపాలిటి ఎన్నికలలో పట్టుమని పదిమంది కౌన్సిలర్ లు గెలిచే పరిస్థితిలో లేదు. స్వంత ఊరిలోనే పరిస్థితి అలా ఉంది. ఈయన పార్టి లో చురుకుగా ఉన్నంత కాలం వేరే వారికి అవకాశం ఉండదు. కేంద్రం లో పాత తరం నాయకుల నుంచి అందరితో పరిచయాల చేత ఎవరిని పార్టికి అధ్యక్షుడి గా చేసినా అతను వెంకయ్య కే రిపోర్ట్ చేయాలి. ఒకవేళ వాడు కొంపదీసి పార్టిని తెలుగు రాష్ట్రం లో అభివృద్ది చేశాడే అనుకో, వెంకయ్యకు ఒక వైపు అభినందనలు, మరోవైపు విమర్శలు వస్తాయి. సరైన వ్యక్తిని ఎన్నుకొని పార్టిని అభివృద్ది చేయించాడని అభినందిస్తారు. ఇంకొందరు ఇన్నేళ్ళు రాజకీయాలలో వెంకయ్య ఉండి కొత్తవాడు అభివృద్ది చేశాడు అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉన్న వెంకయ్యకు ఈ సుత్తి అంతా ఎందుకు? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామంత రాజులుగా ఉండడానికి సంసిద్దంగా ఉంటే. వారిని మేనేజ్ చేసుకొంటే పేరుకి పేరు వస్తుంది పని భారం తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితిలో పార్టిని అభివృద్ది చేయటానికి పెద్దగా అవసరం లేదు. ఉదాహరణకు పెళ్ళి లో కేటరింగ్ ఇస్తే భోజనాలు వడ్డించే అవకాశం ఉంటే, పాతరోజులలో వలే వంట వాడిని, గిన్నెలు,కూరలు,ఇతర సామానులు కొని వంట చేయించవలసిన అవాసరంలేదు కదా! ఇది అంతే. నడచినన్ని రోజులు బిజెపితో బాబు జట్టుకడతారు. ఆయన తదనంతరం అబ్బాయికి(లోకేష్ బాబు ) కేపాసిటి లేకుంటే బిజెపి పార్టి వారు రంగంలోకి దిగుతారు. ఆ దిగే ముందు తమిళ నాడు జయలలిత అనంతర పరిణామాలు అధ్యయనం చేసి, అక్కడి అనుభవాల నుంచి నేర్చుకొని ఆంధ్రాలో అమలు చేస్తారు.

      Delete


    14. Demonetisation took the veil off the seemingly well organised world of Indian private banks

      http://timesofindia.indiatimes.com/business/india-business/demonetisation-took-the-veil-off-the-seemingly-well-organised-world-of-indian-private-banks/articleshow/56164299.cms

      Delete
    15. @UG SriRam
      నడచినన్ని రోజులు బిజెపితో బాబు జట్టుకడతారు. ఆయన తదనంతరం అబ్బాయికి(లోకేష్ బాబు ) కేపాసిటి లేకుంటే బిజెపి పార్టి వారు రంగంలోకి దిగుతారు. ఆ దిగే ముందు తమిళ నాడు జయలలిత అనంతర పరిణామాలు అధ్యయనం చేసి, అక్కడి అనుభవాల నుంచి నేర్చుకొని ఆంధ్రాలో అమలు చేస్తారు.

      hari.S.babu:
      జయలలిత మరణానంతరం జరిగిన పరిణామాల్లో బీజేపీ హస్తం ఉందన్నది ఏ కొంచెం బుర్ర ఉన్నవాడీకైనా తెలుస్తుంది!అయితే,కాంగ్రెసు మాదిరే ప్రజలకి మేలు చేసి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోకుండా వాళ్ల చావునీ వీళ్ల చావునీ రాజకీయంగా ఉపయోగించుకుని ఎదగాలనుకోవతం నైతికంగా అధమ స్థాయి రాజకీయం,కదా!

      ఒకప్పుడు 2 సీట్ల నుంచి 200 సీట్లకి ఎదిగింది ఈ స్థాయి రాజకీయంతో కాదు.అప్పట్లో భాజపా నాయకులూ నిజాయితీ పరులు,వారి రాజకీయ విధానాలూ ఆదర్శవంతమైనవి!అయోధ్యలో రామాలయం కట్తదం అనేది హైందవేతరులకి వింతగా,దుర్మార్గంగా,మతతత్వాన్ని రెచ్చగొట్టడంలా కనిపించినా వారికి ప్రజలనుంచి అంత అంతటి ప్రోత్సాహం రావడం పూర్తిగా తాము నమ్మిన ఆదర్శానికి బలంగా కట్టుబడటం వల్లనే అన్నది నిజం!ఇవ్వాళ ఆ ఆదర్సమూ లేదు,ఆ నిబద్ధతా లేదు,ఆ నిజాయితీ లేదు - అధికారం కోసం అచ్చం కాంగ్రెసునే ఇమిటేట్ చేస్తూ తను కాంగ్రెసు కన్న భిన్నమైన పార్టీ అని ఎట్లా నమ్మించగలదు?

      పోటుగాళ్ళలా మొండిగా ఒక్క రోజులో మసీదు కూల్చేశారు గానీ అదె పద్ధతిలో ఒక్క రోజులో ఆలయం కట్టగలరా?కేవలం ఆలయం కట్టడం కోసం దేశప్రజలంతా ఎదురులేని మెజార్తీ ఇవ్వాలా!సామరస్యంగా ఆలయంకట్టడానికి ఇప్పుడు ఉన్న మెజారిటీ చాలు - ఐ నాకు స్పష్టంగా తెలుసు!అయినా ఎందుకు పూనుకోవటం లేదు?

      ముస్లిములతో సయోధ్య సాధించి అయోధ్యలో రామాలయం కట్టగైలిగితేనే మళ్ళీ భాజపాకి ఒకప్పటి ఆదరణ వస్తుంది.లేని పక్షంలో ఆవు రాజకీయాలూ చావు రాజకీయాలూ తప్ప ఆ పార్టీ నుంచి ఉన్నతస్థాయి రాజకీయాలని ఆశించలేము.

      Delete
    16. >> ఆవు రాజకీయాలూ చావు రాజకీయాలూ తప్ప ఆ పార్టీ నుంచి ఉన్నతస్థాయి రాజకీయాలని ఆశించలేము.

      WELL SAID

      Delete
    17. బిజెపి పార్టిని మీరు విమర్శిస్తే నాకు ఇబ్బంది లేదు. కారణం మీ బ్లాగును చదివి ఉన్నాను, మీ భావల గురించి, మీ అవగాహన పరిది, మీ పరిణితి తెలుసు కనుక. నేను ప్రో బిజెపి అయినా, బిజెపి ని మీరు విమర్శిస్తే వెనుకేసుకొస్తూ వ్యాఖ్యలు రాయలేదు.

      ఇక అజ్ణాతగా రాసేవారు, ఆవును, మోడిని,బిజెపి ని విమర్సిస్తున్నట్లు వచ్చి రాసే వ్యాఖ్యలను ప్రచూరిస్తే చదవటానికి విసుగ్గా ఉంది. కారణం వారి విమర్శలు బిజెపి, మోడిపై న కాదు. అది మనలాంటి హిందూవులను బిజెపి ని అడ్డుపెట్టుకొని విమర్శిస్తున్నారని మీరు గమనించాలి. కొంతమంది కి హిందుత్వ పార్టి అధికారం లోకి వచ్చిందన్న విషయం జీర్నించుకోలేక, మొదట మోడి తో మొదలు పెట్టి ఇప్పుడు దేశం, మన సంసృతి తో సహా నిరంతరం ద్వేషించటం ఒక అలవాటైంది. ఇటువంటి వాళ్లు వెబ్ పత్రికలలో, ఫేస్ బుక్ లో చాలా మంది కనిపిస్తారు. మోడిని టుమచ్ గా విమర్సించటంలో వాళ్ళ ప్రధాన ఉద్దేశం, ఆయన అడ్డుపెట్టుకొని సామాన్య హిందూవులను,వాళ్ల సంస్కృతిని, ఆచార వ్యవహారాలను కించపరచాలనేదే ప్రధాన ఉద్దేశం.

      వాళ్ల ఇష్టం వారిది. కాని మీ బ్లాగులో ఇటువంటి వ్యాఖ్యలు రాసేవారిని ప్రోత్సహించటం సమంజసం కాదు. ఏ మాత్రం వాల్యు యాడ్ చేయని Anonymous26 December 2016 at 01:13 ఈ వ్యాఖ్యలను ప్రచూరిచడం ఎంత వరకు సబబు?

      Delete
    18. @UG SriRam
      ఏ మాత్రం వాల్యు యాడ్ చేయని Anonymous26 December 2016 at 01:13 ఈ వ్యాఖ్యలను ప్రచూరిచడం ఎంత వరకు సబబు?

      hari.S.babu:కామెంటుని పబ్లిష్ చెయ్యదంలో ముందుగానే ఎవరి అభిప్రాయాన్నీ తిరస్కరించకుండా - పూర్తిగా వ్యక్తుల్ని సంబోధిస్తూ చెత్త భాష వాడుతునవాటిని(ఒకోసారి జడ్జ్ చెయ్యతం కష్టంగా ఉంటున్నది,ఇటువంటివాటికి గభాలున రెస్పాన్స్ ఇవ్వకుండా నాకు రిక్వెస్ట్ పెడితే అర్ధం చేసుకోగలను) మాతరమే నిషేధిస్తున్నాను.ఎవరయినా సరే ఫలానా కామెంటు నాకు ఇబ్బందిగా ఉంది అని అడిగితే తప్పకుండా తీసేస్తాను!నేను ముందుకు ముందే ఎలాంటి నిషేధమూ పెట్టుకోలేదు.మీరిప్పుడు ఒక అనొన్ కామెటుకి జవాబు చెప్పారు గనక అది ఉంచి రెందవ కామెంటును తీసేశాను.

      కామెంట్లకి సమబంధించి ఇక ముందు కూడా అదే పద్ధతి ఫాలో అవుతాను.

      సరే మీ గురించి మీరే ప్రో బీజేపీ అని చెప్పుకున్నారు గాబట్టి బీజేపీని మూర్ఖంగా వ్యతిరేకించే కామెంట్లకు జవాబు చెప్పవచ్చు, లేదా అభ్యంతరం వ్యక్తం చెయ్యవచ్చు.నాకు మాత్రం హిందూత్వం బీజేపీ రెండూ వేరు!

      Delete
    19. హరిబాబు గారూ, చాలాకాలం నుండి మీ బ్లాగులోని వ్యాసాలను చదువుతున్నాను. విషయపరంగా ఎంతో పరిశోధించి చేస్తున్న మీ ప్రయత్నం నిజంగా అభినందనీయం. అంత ఓపిగ్గా సమకాలీన, సాంస్కృతిక, సనాతన అంశాలపట్ల మీ పరిశీలన, వ్యాఖ్యానం అద్భుతం. నేను వ్యక్తిగతంగా ఎంతో జ్ఞానాన్ని మీ బ్టాగు వలన పొందాను. వేలకొలదీ చెత్త వ్యాసాలు, ఊకదంపుడు, అసత్య ప్రచారాలు చేస్తున్న బ్లాగుల మధ్యలో ఒక రిలీఫ్ మీ బ్లాగు.

      అయితే, పై వ్యాఖ్యలు మీరు చేసారు కాబట్టి చెప్పవలసిన సమయం వచ్చిందని గ్రహించి, చాలాకాలం నుండి నేను నా మనస్సులో వున్న సూచనలను చెబుతున్నాను.
      మీ వ్యాసాలలో ప్రస్తావించిన విషయాలపై కామెంటేటర్ల వ్యాఖ్యల సంఖ్యని నేను మీ మొదటి వ్యాసాన్నుండి లెక్కవేసాను. 100 కామెంట్లలో దాదాపు 90 కామెంట్లు నిరర్థకమైనవి, వ్యాఖ్య ముసుగులో వ్యక్తిగత, సాంస్కృతిక ద్వేషాన్ని చిమ్మే పర్వర్టెడ్ వ్యాఖ్యలు అని కామన్ సెన్స్ వున్న ఏ ఒక్కరైనా అంగీకరించే విషయం. తెలివితేటలను విషాన్ని చిమ్మడానికిే ఉపయోగిస్తున్నవారి ఆ చెత్త వ్యాఖ్యలని చదవడానికి, వాటిని ప్రచురించడానికి, వాటికి సమాధానం ఇవ్వడానికి మీరు వెచ్చిస్తున్న సమయం మీరు ఈ వ్యాసాలన్నీ వ్రాయడానికి మీరు వెచ్చించిన సమయానికంటే వందల రెట్లు వుంటుందన్న నా పరిశీలనతో మీరు ఒప్పుకోక తప్పదు. గమ్మత్తేమింటంటే ఆ వ్యాఖ్యలు చేస్తున్నది నలుగురైదుగురు నుండి పదిమంది దాకా మాత్రమే. ఆ వ్యాఖ్యాతలు మీ బ్లాగులోకి వస్తున్నది, వ్యాఖ్య చేస్తున్నది కేవలం మీ పట్ల, మీ భావజాలం పట్ల అసహనం, ద్వేషంతో మాత్రమే అన్నది మీకు నేను వేరేగా చెప్పక్కర్లేదు. ఆ పదిమందీ తగ్గినంత మాత్రాన మీ బ్లాగుకున్న విలువ నలుసంతయినా తగ్గదు. ఆ వ్యాఖ్యలు లేకపోయితే ప్రపంచానికి, సమాజానికి ఏ నష్టమూలేదు.

      ఇలా వాళ్ళని నిషేదిస్తే మీరు ఆధా చేసే సమయంలో మీరు మాకూ, సమాజానికిీ ఉపయోగపడే, మీ అభిరుచికి న్యాయం చేయగలిగే అనేక విషయాలను వ్యాసంగా వ్రాయడానికి కావలసిన అధ్యయనం చేయవచ్చని మీకు సూచిస్తున్నాను.
      మనకున్న జీవితం అతి స్వల్పకాలం. మిగిలిన ఈ స్వల్పంకాంలోనే మన ధర్మానికి, సంస్కృతికి, సమాజానికి అత్యధికంగా మీరు చేయగలిగినంత చేయాలంటే అలాంటి వ్యాఖ్యలన్నింటినీ నిర్మొగమాటంగా ప్రచురించకపోవడం ప్రధానం, ఏకైక తరుణోపాయం.

      అంతేగాక, ఆ చెత్త వ్యాఖ్యలన్నింటినీ చదివి మన మైండ్లో కూడా చెత్త చేరే అవకాశం వుంటుంది.
      ప్రజాస్వామ్యం పట్ల మీకూ, మాకూ అందరికీ సమానమైన గౌరవం, అభిప్రాయం వున్నాయి. అయితే, కలుపు మొక్కలని ఉపేక్షిస్తే మీ వ్యాసంగ లక్ష్యం దెబ్బతినే అవకాశం వుంటుంది.
      నా ఈ సూచనని మన్నించి భవిష్యత్తులో అలాంటి చెత్త వ్యాఖ్యలు, వ్యాఖ్యాతలని పూర్తిగా తొలగించి, లేధా ఆరంభంలోనే పీకేసి మీ సమయాన్ని, మా సమయాన్ని ఆదాచేసి, మన సంస్కృతి విశిష్టతను తెలిపే అనేక వ్యాసాలని అందిస్తారని ఆశిస్తున్నాను.
      ఇదే నేను మీ బ్లాగుకు వ్రాసే మొదటి, చివరి వ్యాఖ్య.

      శెలవు
      మీ బ్లాగ్ అభిమాని

      Delete
    20. నేను శలవలకి ఇంటీకి వెళ్ళడం వల్ల కొంతమంది చండప్రచండ మూర్ఖులకి సమాధానం చెప్పడంలో ఆలశ్యమైనది కాబట్టి ఈ సమాధానం ప్రచురించవలసిందిగా మనవి:

      1. నోట్ల రద్దు చెడ్డది కాదు గాని అది అమలుపరిచే విధానమే నీచంగా వుంది అంటే, "నోట్ల రద్దుకు నువ్వు వ్యతిరేకివి, నువ్వు ఉగ్రవాధివి, పాకిస్తాన్ కి వెళ్ళీఫో " అనే వెధవలకి నా సమాధానాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరెఖంగానే కనిపిస్తాయి

      2. కేంద్రం మన రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే' "నువ్వేమైనా బీజేపీ ని గెలిపించావా అన్యాయం జరిగిందని అడగడానికి?" అనే మూర్ఖశిఖామనులకి నేను హిందూ వ్యతిరేకిగా కనిపించడంలో విచిత్రమేమీ లేదు.

      3. వ్యాసకర్త ఆవు, చావు రాజకీయాలకు మొడీ, మంది మాగధులు పరిమితమైపోయారు అంగానే, ఈ అనామకుడికి అకస్మాత్తుగా బుర్రలో (అ)గ్నానం విపరీతంగా పెరిగిపోయి, మోడీని విమర్శించేవాళ్ళంతా హిందూ మతం మీద విషం చిమ్ముతున్నారు అని తేల్చేశాడు. హరిబాబుని ఐసు చెయ్యడానికి, నేను మీ అభిమానిని అని పూతలొకటి

      హిదూ మతానికి, మొడీ కి లంకె పెట్టి పిచ్చి కూతలు కూస్తున్న వెధవలందరికీ ఇదే నా సవాల్. రేపెప్పుడైనా మొడీ చేసింది పనికిమాలిన పని అని నిరూపణ ఐతే, అది హిందూ మత ఓటమి అని ఒప్పుకుంటారా??

      Delete
    21. @Anonymous30 December 2016 at 05:08
      హిదూ మతానికి, మొడీ కి లంకె పెట్టి పిచ్చి కూతలు కూస్తున్న వెధవలందరికీ ఇదే నా సవాల్. రేపెప్పుడైనా మొడీ చేసింది పనికిమాలిన పని అని నిరూపణ ఐతే, అది హిందూ మత ఓటమి అని ఒప్పుకుంటారా??

      hari.S.babu
      నంబర్లు వేసి మీరు తరచిన విషయాలు మిమ్మల్ని కొందరిని ఉద్దేశించి వేసిన వ్యాఖ్యలు కాబట్టి నేను కల్పించుకోను గానీ ఈ చాలెంజి మాత్రం అర్ధం లేనిదే!

      ఎందుకంతే రేపు అది పనికిమాలిన పని అని రుజువయ్యాక ఎంత బలమైన ఫ్యాన్ అయిన చచ్చినట్టు అది పనికిమాలినది అని ఒప్పుకుంటాడు,అందులో పెద్ద విశేషం ఏముంది?రేపటి రోజున అది ఫెయిలై తీరుతుందని మీకు గ్యారెంటీ ఉందా?

      ముందు మీరు ఆ గ్యారెంటీ ఇచ్చి అపుడు చాలెంజి చేస్తే సబబుగా ఉంటుంది.అది తప్పనిసరిగ అఫెయిల్ అవుతుందనే గ్యారెంటీ ఇస్తే హిందువులు కూడా మోదీ ఫెయిల్యూర్ హిందూఒమతం యొక ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటారు,సరేనా?

      Delete
  3. రాహుల్గాంధి, బ్రహ్మనందం ఎంత సీరియస్ గా మాట్లాడినా మనకు నవ్వే ఒస్తుంది

    ReplyDelete
    Replies
    1. ee cooment chadivina ventane naaku navvu aagadam ledu!!

      Delete
    2. >>ఆ ముక్క అర్థమైన ఎర్రి పప్పలకు ఇది మంత్రివర్గ సమిస్టి నిర్ణయం అని తెలియదా?

      ha ha ha ha..... veediki burra poorthigaa paadaipondi...

      Delete
  4. MUST READ : Can You Believe It? Congress Legally Printed Fake Currency !

    The facts represented in this article have been taken from CAG report and some facts are taken from various past investigations

    http://postcard.news/must-read-can-you-believe-it-congress-legally-printed-fake-currency/


    UPA-era corruption behind slow printing of currency notes at Dewas. Corrupt Deal Disrupted Printing of Rs 500 Notes

    https://www.thequint.com/currency-ban/2016/12/06/corruption-led-to-installing-slow-note-printing-machine-at-dewas-bnp-demonetisation-note-ban-rs-500-note

    ReplyDelete
  5. Nehru's 97 Major Blunders

    http://rajnikantp.blogspot.in/2016/07/nehrus-97-major-blunders.html

    ReplyDelete
  6. @ Srinivasudu & Haribaabu gaaru,

    No Peace, Only Pieces – The Sufi Mission in Kashmir!
    http://www.dimplehere.com/sufisinkashmir/

    ReplyDelete
  7. ఒకేఒక నోట్లరద్దు దెబ్బకి కొన్ని దశాబ్దాలుగా తెగబలిసినవాళ్ల తెరవేనక సంపాదన కట్తలు కట్టలు బయతపడి వాళ్ళు సిగ్గుతో తలదించుకుంటున్న దృశ్యాలు చూస్తూ కూడా "ఇదంతా 90% నిరుపేదల్ని కొట్టి 10$ కుబేరుల్ని మేపటానికే" అంతే ఎవడు నమ్మ్ముతాడు - చెవుల్లో పువ్వులు పెట్టుకున్న పిచ్చివాళ్ళు తప్ప!
    బీదా బిక్కీ జనం క్యూలల్లో నిలబదలేక చచ్చిపోతున్నారని అల్లాడిపోయేవాళ్ళు అదే క్యూలో ఉన్న మిగతావాళ్లకి ఆ బీదాబిక్కీకి సాయం చేయ్యాలన్న ఇంగితజ్ఞానం లేకపోవడానికి కూడా మోదీయే కారణం అంటున్నట్టా?ఒక్క క్యూల దగ్గిరే కాదు,దేశంలో ఎక్కడ చూసినా పక్కవాడికి సాయం చెయ్యదం లేదు,జాలీ దయా లేకుండా పోయినాయి - వాటికి కూడా మోదీయే కారనమా?

    ReplyDelete
    Replies
    1. రోజులతరబడి పనులాపుకోని ఒక్క 2000/- కోసం క్యూలో నిలబడి నిలబడి, తీరా మన వంతు ఒచ్చాక, డబులైపొయినై మళ్ళీ రేపు సంకనాక్కుంటూ ఒచ్చేయ్యండి అంటుంటే, ఇక మానవత్వాలు, మట్టిగడ్డా అంటూ ఎవ్వడూ కూర్చోడు. నువ్వు చెప్పిన లాంటివి నోట్ల రద్దు తర్వాతే జరుగుతున్నాయి.

      Delete
    2. రోజుల తరబడి పనులాపుకుని క్యూలో నిల్చోవడమా?నేను పల్లెటూళ్ళో లేను బాబూ!ఏ.టీ.యం మెషీన్లని రోజుకి ఓక్ గంట/రెండు గంటలు టైము పెట్టి తెరుస్తున్నారు.ఆ ఒక్క గంట కోసం రోజుల తరబడి క్యూలో ఎవరయినా నుంచుంటారా?నేనూ ఓ రోజు పొద్దున 6:30కి వెళ్లాను.ఖాళీగా ఉంది,క్యూ లేదు.ఒకే ఒక్క మనిషి డ్రా చేస్తున్నాడు.నాకు చిన్న ఎర్రర్ వచ్చి ఆ చిన్న చిన్న మూడు స్టెప్పులే రెండు సార్లు చెయ్యాల్సి వచ్చింది - అయ్యాక వెనక్కొస్తుంటే అప్పటికి అయిదుగురు తయారు!ప్రతిరోజూ ఆఫీసుకి వెళ్ళేటప్పుడూ,వచ్చేతప్పుడు చూస్తూనే ఉన్నాను.టైము తెలుసుకుని వస్తున్నారు,క్లోజ్ చెయ్యగానే వెళ్ళిపోతున్నారు.నేను చూస్తున్న దృశ్యాలు అవే.

      Delete
    3. ఈ మధ్య నేను ప్రకాశం జిల్లాలో కొన్ని టౌన్లకి వెళ్ళాను. అక్కడ పరిస్తితులు ఎంత చండాలంగా వున్నయంటే, మార్కాపూర్లో ఏటిఎం క్ ఎలా వెళ్ళాలి అంటే, అవెప్పటినుంచి పనిచేస్తున్నాయి ఇక్కడ అని అడిగారు. పొదిలిలో ఒకే ఒక్క ఏటి ఎం రోజుకు 30నిలు మాత్రమే పనిచేస్తుంది. కనిగిరి, కందుకూరులలో ఐతే ఏటిఎంలలో డబ్బులు చూసి ఎంతకాలమైందో.. వాళ్ళు డబ్బులు కావాలంటే, ఒక రోజంతా లైన్లో వుండి బాంకుల్లో టోకెన్ తీసుకుంటే, తర్వాతరోజు మళ్ళి వెల్లి లైనులో నిలబడి టోకెన్ చూపించి డబ్బులు తీసుకోవాలి. అదికూడా ఆరోజు డబ్బులు దొరికితేనే.. లేకుంటే ఆ టోకెన్ మురిగిపోతుంది. మళ్ళీ మరిసటిరోజు టోకెన్ కోసం లైనులు.. ఈ దేశంలో అందరూ హైదరాబాదులోనే లేరని తెలుసుకో బాబూ..

      Delete
    4. చిదంబరం,మన్మోహను,రాహుల్ పాడిన పాటే నువ్వూ పాడుతున్నావు"-)

      "వాళ్ళు చెప్తున్నది రెండున్నరేళ్ళు కూడా కాని నా ప్రోగ్రెస్ రిపోర్టా?స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పాలించిన వాళ్ల ప్రోగ్రెస్ రిపోర్టా" అని అడగనే అడిగేశాడు మోదీ - చూళ్ళే!

      బినామీ ఆస్తుల చట్టం చేసి కూడా తొక్కేసి ఉంచారు,ఎందుకో?

      Delete
    5. బీదా బిక్కీ జనం క్యూలల్లో నిలబదలేక చచ్చిపోతున్నారని అల్లాడిపోయే "తెలుగు మీడీయావాళ్ళు " మన రాష్ట్రం లో ప్రముఖులను, యువ నెత జగన్ ని గాని,చంద్రబాబు,బాలయ్య బాబు, రాజకీయ పార్టి నాయకులను,పారిశ్రామిక వేత్తలను, మైక్ దొరికితే డప్పుకొట్టుకొనే సినేమా వాళ్లని గాని, మీలో ఒక్కరు డబ్బులను మార్చుకోవటం కోసం క్యులో నిలబడలేదు. మీదగ్గర 500,1000 నోట్లు లేవా? దేశంలో ఉండే డబ్బులో 86% ఆ నోట్లే ఉంటే మీవంటి సంపన్నుల దగ్గర కూడా సుమారు అంతే శాతం ఉండాలి కదా? వాటిని మార్చుకోవటానికి మరి మీరు బాంక్ కులకు వెళ్ళాలి కదా?! మీరెక్కడికెళ్ళకుండా ఎలా నోట్లను మార్పిడి చేసుకోగలిగారు? ఆ టెక్నిక్ ఎదో మా ప్రేక్షకులకు చెప్పండంట్టూ ఇంటర్వ్యూ చేసి ప్రశ్నించకుడదా?

      తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సినినటులు,రాజకీయ నాయకులు వెంటపడగలగా లేనిది, ఈ నోట్ల సమస్యను సంపన్నులు ఎలా మేనేజ్ చేస్తున్నారో అని ప్రశ్నలు సంధిస్తూ వాళ్ళ వెంటపడలేకపోయారా? అది వదిలేసి తెలుగు మీడీయా వాళ్లు పేదోళ్ళు కష్ట పడిపోతున్నారని అరిగిపోయిన పాటందుకొన్నారు.

      బంగారం విషయం లో మరీ ఓవర్, స్రీలను కొంటే ప్రభుత్వాలను దించేస్తారట,వాళ్ల జోడి కొచ్చిన వాళ్లకు గుణపాఠం చెప్తారట. మైక్ ముందు అతి వాగుడును మధ్యా హ్నం 3 మొదలు పెట్టి రాత్రి 8గంటల వరకు ప్రసారం చేయటం. అపార్ట్ మెంట్ల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయటం. వాళ్ళేమో ఈ రోజుల్లో సాధారణం ప్రతి ఒక్కరి దగ్గర కె.జి. బంగారం ఉంట్టున్నాది, మోడి ప్రభుత్వం రెండు మూడు కెజిల బంగారం పై ఎటువంటి పన్నులు విధించకుడదు అంట్టు మాట్లాడారు. అంటే సుమారు కోటి రూపాయల బంగారం వాళ్ళు హాబిగా కొనుకొట్టుంటే ప్రభుత్వం స్రీశక్తి ముందు తలవంచి, పన్నులేయ కుండా వదిలేయాలట. లేకపోతే ఈ మహిళా మణులు మోడికి వ్యతిరేకంగా ఓటు వేసిఎన్నికలలో గుణపాఠం చెప్తారట. భలే!
      కెజి బంగారం నేడు అందరి దగ్గరా ఉంట్టున్నాదని చెపుతూంటే నోరెళ్ల బెట్టాల్సి వచ్చింది. వాళ్ళు ఏ రాష్ట్ర మహిళల గురించి మాట్లాడారో అర్థం కాలేదు. నార్త్ ఇండియా మహిళలకు బంగారం వ్యామోహమే లేదు. వాళ్లకి అది ఒక సమస్యే కాదు. సౌత్ లో బిజెపి కి పది సీట్లు కూడా లేవు. అంతకు మించి రావు. ఈ తెలుగు మహిళలు ఓటు వేయకపోయినా మోడికి వచ్చే నష్టమేమిలేదు. అది తెలియకుండా టివి వాళ్ళు గంటకొలది తెలివితక్కువ వాదనను చూపిస్తూ ఇంటర్వ్యూలు ప్రసారం చేయటం మరీ అతి గా అనిపించింది.

      Delete
    6. ఈ టీవి లో వచ్చిన బంగారం పై నిరసనలన్ని ఇలా మాట్లాడాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి, రిహార్సెల్స్ చేసి మాట్లాడిపించారని అనిపించింది.

      Delete
    7. ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. పైన రాసిన అజ్ణాత అనుభవం వాదన చేసి మనం తీసి పారేసినా, వాస్తవం వేరుగా ఉంట్టుంది. డబ్బులు అవసరమైన వారికి దొరకకపడే ఇబ్బందులు, డబ్బుల కోసం బాంక్ ల చుట్టు తిరిగే ప్రజలకు తెలుస్తూనే ఉంట్టుంది. చెక్ ను ఉపయోగించి డబ్బులను తీసుకొన్న వారు గంటలకొలది క్యులో ముందునిలబడినట్లు చూడలేదు. ATM లు ప్రజల సహనాన్ని పరీక్షించాయని చెప్పవచ్చు. బాంక్ అధికారుల కుమ్మకు అయ్యి కోట్ల రూపాయలు బయటకి పోయాయంటే, బాంక్ కుల లో అవినీతి ఏ స్థాయిలో ఉందో, ఎంత బాధ్యతా రాహిత్యంగా ఉన్నారో అర్థమౌతుమ్న్నాది. డబ్బులొక్కటే కాదు సమస్య, ప్రజలకు అప్పుపుట్టటం చాలా ముఖ్యం. ప్రభుత్వం విడుదలచేసిన నోట్లు ఎంత త్వరగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్కొనే వాళ్ల చెంతకు చేరితే వాళ్లకు ప్రభుత్వం పై గురి కుదురుతుంది. అంతేకాని ప్రభుత్వం కోట్ల రూపాయలను పట్టుకొని కటకటాల వెనుకకు పంపింతే, అది మధ్య తరగతి ప్రజలకు (అంకుశం సినేమాలో రామిరెడ్డిని తన్నేటప్పుడు కలిగే ఆనందం లాంటిది) త్రుప్తి నిస్తూందే గాని, అది వీకర్ సెక్షన్స్ ను ఆకట్టుకోదు. రేపటి ఎన్నికలలో వాళ్ళు బిజెపికి ఎదురుతిరుగుతారు. వాళ్లు ఇప్పటి వరకు చాలా ఓపికగా ఉన్నారు. వారికి ఎంత త్వరగా ప్రభుత్వం 10,20,50,100,500 నోట్లను పెద్ద ఎత్తున సరఫరా చేయగలదో, బాంక్ ల ద్వారా ౠణాలు ఇప్పించగలదో (డబ్బులన్ని ఇప్పుడు బాంక్ ల దగ్గరకు చేరాయి అవి మళ్ళీ మర్కెత్ లోకి రావాలి)దానిని బట్టి వచ్చే ఎన్నికలలో మోడి విజయం ఆధారపడి ఉంట్టుంది. మోడి ప్రజల ఆగ్రహం తగ్గించేందుకు సమర్ధమైన చర్యలు తీసుకోవాలి.

      ఈ మొత్తం ప్రక్రియలో ఆర్ధిక మంత్రి, ఆర్.బి.ఐ. లు పదే పదే రూల్స్ మార్చటం ఘోరం. ప్రధానిగా మోడి నిర్ణయం తీసుకొని కార్యరంగంలోకి దిగిన తరువాత ఊహించని సమస్యలు ఎదురుకావచ్చు, వాటిని పరిష్కరించ వలనసిన బాధ్యత ఆర్ధిక మంత్రి,అందులో పనిచేసే ప్రభుత్వాధికారులు, ఆర్.బి.ఐ., బాంక్ ల పైన ఉంది. 50రోజుల గడువులో ఒక వారం, పది రోజులలో వాళ్లకు ఎదురైన సవాళ్ళపై అవగాహన వచ్చి ఉండాలి. కాని ఆచరణలో అది కనపడలేదు. కారణం చాలా సార్లు రూల్స్ మార్చటం. అమలులో వీళ్ల తప్పులను తీసుకొచ్చి, నిర్ణయం తీసుకొన్నందుకు ప్రధాని మెడకి చుట్టారు. ఈ పథకం బాక్ ఫైర్ అయిందంటే ఈ ఇద్దరు అర్ధిక మంత్ర, డిల్లి లో కూచొన్న ప్రభుత్వ అధికారులు ప్రధాన కారణం అవుతారు.

      Delete
  8. >>"వాళ్ళు చెప్తున్నది రెండున్నరేళ్ళు కూడా కాని నా ప్రోగ్రెస్ రిపోర్టా?స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పాలించిన వాళ్ల ప్రోగ్రెస్ రిపోర్టా" అని అడగనే అడిగేశాడు మోదీ - చూళ్ళే!

    మాట్లాడితే ఇదొకటి మాత్రం పట్టుకుంటారు అక్కడ మీరు, ఇక్కడ టి ఆర్ ఎస్ వాళ్ళు. ఇంతోటిదానికి ఎల్లక్షన్లెందుకు, ఆ ఖర్చులెందుకు? సుబ్బరంగా నువ్వు ఇర్వయేల్లు, నేనో ఇరవయ్యేల్లు పంచుకోని దొబ్బుకుందాం అని రూలెట్టొచ్చుగా?? ఏం చేసినా కొట్టడానికి మత మూర్ఖుల దగ్గర అక్కడ, ప్రాంతాల పేర పిచ్చగాల్ల దగ్గర ఇక్కడ.. డప్పులు ఎవర్రెడీ

    ReplyDelete
  9. మోడి పాక్ ప్రధానికి బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పాడు. అదే ఆ చెప్పింది ఏ కాంగ్రేస్ వాడో అయ్యుంటే నా సామిరంగా... మతపిచ్చగాళ్ళంతా బట్టలు చించుకోని మీడియా, బ్లాగుల్లో అల్లకల్లోలం చేసే వాళ్ళు

    ReplyDelete
  10. 1. Prannoy Roy siphoned Rs. 53.84 crore to personal account from NDTV

    The IT Dept. has unearthed an instance of Prannoy Roy moving approx. Rs.53.84 crores by rigging NDTV stocks.

    https://www.pgurus.com/mr-prannoy-roy-you-are-lying-through-your-teeth/

    2. Sebi begins action in NDTV ownership case

    http://www.business-standard.com/article/companies/sebi-begins-action-in-ndtv-ownership-case-116122600016_1.html

    3. Gurumurthy And His Fake-News Gang Of Four

    http://www.ndtv.com/communication/gurumurthy-and-his-fake-news-gang-of-four-1642003?site=full

    4. Mr. Prannoy Roy, you are lying through your teeth

    Candid reply to NDTV and Prannoy Roy on their rant on the web
    You siphoned more than Rs.145 crores from NDTV & cheated investors

    https://www.pgurus.com/mr-prannoy-roy-you-are-lying-through-your-teeth/

    ReplyDelete
  11. ఒక దేశ ఆర్ధిక వ్యవస్థ ఎక్కువగా ప్రకృతి సంపదలపై ఆధారపడి జీవించటం మొదలుపెడితే, కొంతకాలనికి ప్రపంచంలో వచ్చే మార్పులవలన ప్రజల జీవితాలు ఎలా తారుమారౌతాయో ఇది చదివితే తెలుస్తుంది.

    As socialism shattered Venezuela, the useful idiots applauded

    http://www.bostonglobe.com/opinion/editorials/2016/12/25/socialism-shattered-venezuela-useful-idiots-applauded/ZoQnAX5WksuCTauiAjCx4M/story.html?event=event25

    ReplyDelete
  12. ఇక ఈ పోస్టుకు సంబంధిన వ్యాఖ్యలు ప్రచురించబదవు,కొత్త పోష్టుకు స్వాగతం!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...