Wednesday, 23 November 2016

దేశం బయట ఉన్న ఉగ్రవాదుల మీద చేసిన సర్జికల్ స్ట్రైక్ గ్రాండ్ సక్సెస్, దేశం లోపల ఉన్న అవినీతిపరుల మీద చేసిన సర్జికల్ స్ట్రైక్ అట్టర్ ఫెయిల్యూర్ - కారణం ఏమిటి?

     రోజువారీ జీవితానికి సంబంధించిన తలనెప్పులతోనే సతమతమయ్యే సామాన్యులకి నల్లధనానికి సంబంధించిన సంక్లిష్టమైన ఆర్ధికరంగపు నడకలు తెలియవు. ఆల్రెడీ నల్లధనం పోగేసుకుని ధనవంతులైన ప్రముఖులు దేశప్రధాని ఎన్నో వెసులుబాట్లు కల్పించి "అయ్యా!బాబూ!!మీ దగ్గిరున్న నల్లధనమంతా తెలుపు చేసుకోండి, ప్లీజ్!!!" అంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు.ఇవ్వాళ ప్రజల తరపున వకాల్తా పుచ్చుకుని మీడియాలో గొంతు చించుకుని అరుస్తున్నవాళ్ళలో ఒక్కరికి కూడా శాస్త్రీయమైన విశ్లేషణలతో ప్రజల జ్ఞానాన్ని పెంచి ఒక మంచి ఉద్దేశంతో చేసిన పనిలో దొర్లిన ఒక చిన్న పొరపాటు ఎట్లా జరిగిందో అర్ధం చేసుకుని సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకునేలా చెయ్యాలన్న బాధ్యత లేదు.

     ఆర్ధికరంగ నిపుణుల్లో ఎవ్వరూ ప్రధాని ఉద్దేశాన్ని తప్పు పట్టటం లేదు.నలధనాన్ని తెల్లధనంగా మార్చటానికి ఇంతకు మించిన మార్గం కూడా లేదంటున్నారు.ఈ ఒక్క చర్యతోనే అద్భుతాలు జరిగిపోవనీ గొలుసుకట్టు చర్యలు అన్నీ పూర్తయినాక తప్పకుండా ధరలు తగ్గుతాయనీ అప్పటినుంచీ నల్లధనం క్రమంగా తెల్లధనంగా మారి ప్రజలకు గట్టిమేలు జరుగుతుందనీ బల్లగుద్ది చెబుతున్నారు. ప్రధాని మొత్తుకుంటున్నది కూడా అదే అయినప్పుడు అతను ప్రజల్ని ఇబంది పెట్టడానికే ఇదంతా చేసినట్టు ఈ అరిగోల ఏంటి?నిజమే. నల్లధనం దాచుకున్నవారు ఎవరూ బ్యాంకుల ముందు క్యూలో కనబడటం లేదు - అయితే ఏమిటి?అక్కడా ఇక్కడా పారేస్తున్నారుకోటికి ముప్పయి లక్షలు కమిషన్లు చెల్లించుకుంటూ నష్టపోతూ అఘోరిస్తున్నారు. ఏమాత్రం కామన్సెన్సు ఉన్నవాడు ఎవడయినా అలాంటివాళ్ళు ఏంచేస్తారని అనుకుంటాడో అవే చేస్తున్నారు వాళ్ళు!

     అవినీతికీ నల్లధనానికీ ద్రవ్యోల్బణానికీ అధికధరలకీ సామాజిక అసమానతలకీ ఉగ్రవాదానికీ అవినాభావ సంబంధం ఇప్పుడు కొత్తగా ఏర్పడినది కాదు.పాలకులే పాలితుల్ని అడ్డగోలుగా దోచుకోవడమనే మాయాజాలం విదేశీయులైన ఇంగ్లీషువాళ్ళ కాలంలో పుట్టి స్వదేశీయులైన కాంగ్రెసువాళ్ళ  సుదీర్ఘమైన పరిపాలనలో అడయార్ మర్రిచెట్టులా వూడలు దించుకుని ఉన్నది.ఈ దేశపు అవినీతిపరులు మహా మొండివాళ్ళు - "నేను నా దేశమును ప్రేమించుచున్నాను,ఈ దేశసంపద నాకు గర్వకారణము,దానిని భక్షించుటకు నా శాయశక్తులా కృషి చేసెదను" అని ప్రతిజ్ఞ పట్టి ఉన్నారు.సామాన్యులు ఎంతో ఓర్పుతో క్యూలలో నిలబడి అపురూపమైన సహనాన్ని ప్రదర్శిస్తుంటే ప్రభుత్వం వారిమీద సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు హోరుగాలిలో చిగురుటాకుల్లా కంపించిపోతూ యుద్ధభేరీలు మోగిస్తున్నవాళ్ళు స్వతంత్రం వచ్చిన తదాది వ్యవసాయం దిక్కుమాలినదై అన్నదాతలు ఉరితాళ్ళకు వేలాడుతుండటం చూశాక కూడా ఇన్ని దశాబ్దాలుగా ఏమాత్రం ఆందోళన చెయ్యకుండా కడుపునిండా అన్నమెలా తినగలుగుతున్నారు?

     ఏపీ ముఖ్యమంత్రి రుపే కార్డు అంటున్నాడు,అలాంటి క్రియేటివిటీ భాజపా వాళ్ళకి ఎందుకు లేదు?అతనే బ్యాంకుల్ని ప్రజలకి మీడియేటర్లని ఫీల్డులో ఉంచటం గురించి ఇచ్చిన సూచన కూడా బాగుంది - దీనివల్ల అందరూ బ్యాంకుల దగ్గిర గుమిగూడటం తగ్గుతుంది.కొన్నిచోట్ల కొత్తనోట్ల బండిల్సు వీధుల్లోకి వచ్చాయని మీడియాలో చూపిస్తున్నారు - బ్యాంకు ఉద్యోగులు మోళీ చేస్తున్నారు! రద్దు చేసినది 500,1000 రూపాయలయితే అప్పటివరకు పుష్కలంగా వచ్చిన 100 రూపాయలు ఏటీయం బాక్సుల్లోకి అప్పటినుంచే ఎందుకు మాయమైపోయినాయి?బ్యాంకులోపల రశీదుల ద్వారా జరిగే జమలు,చెల్లింపుల మీద ఆడిట్ చెక్ ఉంటుంది కానీ ఏటీయం బాక్సుల్లో పేట్టే కరెన్సీకి మాత్రం ఈరోజు ఈ బాక్సులో ఇంత పెట్టాం అని లెడ్జరులోకి మాత్రం ఎక్కించి సరిపెడతారు.ఇవ్వాళ జనం పడుతున్న ఇబ్బంది మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల కాదు,ఆ లొసుగు ఆధారంగా బ్యాంకుల స్టాఫ్ తమ చేతివాటం కడుపు కక్కుర్తి చూపించటం వల్ల!ఒక ఏటీయం బాక్సులో 10,000 మాత్రమే పెట్టి 50,000 పెట్టినట్టు రాసి 40,000 మొత్తాన్ని దొడ్డిదారిని బ్యాంకు బయటికి పంపిస్తారు.ఇలా మొదలైన కార్యకారణశృంఖల దళారీలూ,బ్రోకర్లూ,ఏజెంట్లూ,థర్డ్ పార్టీ మీడియేటర్లని పర్సెంటీజీల వారీగా పునీతుల్ని చేస్తూ చివరకు నల్ల కుబేరులకు శ్వేతమోక్షాన్ని ప్రసాదిస్తున్నది!

     దేశంలో ఉన్న ప్రతి ఏటీయం బాక్సునీ ఈ పద్ధతిలో వాడుకుంటే ఎంత భీబత్సం జరగాలో లెక్క ప్రకారం అదే జరుగుతున్నది ఇప్పుడు.అయితే దీన్ని అదుపు చెయ్యాల్సిన పెద్దలు మాత్రం "ఒక మంచిపని జరగాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవు - అర్ధం చేసుకోండి!" అని చిలకపలుకులు పలుకుతూ పనులన్నీ మానుకుని కష్టాన్ని పళ్ళబిగువున భరించి తప్పనిసరై క్యూలల్లో నిల్చున్న అమాయకుల్ని చూపించి ప్రజలు మమ్మల్నే మెచ్చుకుంటున్నారని మురిసిపోతున్నారు.ప్రజలకి ఇబ్బంది కలగనిదే మంచిపని అయినప్పుడు ప్రజల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నది మంచిపని ఎట్లా అవుతుంది?అధికారంలో ఉన్నవారు బ్యాంకుల దగ్గిర జరుగుతున్న భాగోతం తెలియనంతటి అమాయకులా! కొన్ని గంటల్లోనే ఇదంతా వ్యవస్థీకృతం అయిపోయి నల్లగద్దల్ని కొట్టి బ్యాంకు కాకులకి పెడుతున్నట్టు జరుగుతున్న పబ్లిక్ వ్యవహారం చూస్తుంటే నాకెందుకో అధికారంలో ఉన్నవారు తస్మదీయులైన నల్లకుబేరుల నుంచి వడకట్టి అస్మదీయులకి కట్టబెట్టడానికి ముందస్తు ప్లాను ప్రకారమే ఇదంతా చేస్తున్నట్టు అనుమానంగా ఉంది.వీళ్ళ యాభైరోజుల లిమిట్ తస్మదీయుల నుంచి అస్మదీయులకి నల్లధనం పూర్తిగా చేరడానికి పట్టే సమయం కాబోలు! ఆదర్శాల చాటున అధర్మాలు చేస్తూ ప్రజల్ని మోసగించటంలో కాంగ్రెసు యాభయ్యేళ్ళలో సాధించిన పరిణితిని భాజపా ఇరవయ్యేళ్ళలోనే సాధించేసిందా- మాయురే భాజపా గోమాయువులు!వారు నిజంగానే అమాయకులయి బ్యాంకుల్ని కంట్రోల్ చెయ్యలేకపోయామని చెప్పుకున్నా దేశాన్ని ఒక్కరోజు కూడా పరిపాలించటానికి అనర్హులేనన్నది సత్యం!అనుభవం లేని ఆర్.యం.పీ డాక్టరు చేసినట్టు ఇలాంటి ఎనస్థీషియా ఇవ్వని ఆపరేషన్లు మళ్ళీ మళ్ళీ చేస్తూ పోతే జనం పిచ్చెక్కి పోతారు - భాజపాని శవాన్ని చేసి చెట్టెక్కిస్తారు, అది ఖాయం!

     కాలం అతివేగంగా మారుతున్నది.మా తాతగారి కాలంలో ఒక వూరినుంచి మరోవూరికి కొంచెం ఎక్కువ డబ్బు తీసుకెళ్ళాలంటే నాణాల్ని సంచుల్లో వేసి ఎడ్లబళ్ళ మీద పెట్టుకుని వాటికి కాపలాగా పహిల్వాన్లని తోడు తెసుకుని వెళ్ళేవాళ్ళు.ఒక్కొక్క నాణెం ఒక రూపాయి అనుకుంటే పది రూపాయలు ఇవ్వాలంటే పది నాణాల సంచి ఇచ్చేవాళ్ళు,యాభై రూపాయలు ఇవ్వాలంటే  యాభై నాణాల సంచి ఇచ్చేవాళ్ళు - మోత బరువు, అయినా బాగానే జరిగిపోయంది!ఇప్పుడు కాగితం రూపాయిలు వాడటం వల్ల మోతబరువు తగ్గింది నిజమే,కానీ బరువుకీ అది చేసే పనికీ సంబంధం ఉందా?లేదు!నోట్లని లెక్కబెట్టగలిగిన చదువు ఉంటే సంతకం చెయ్యడం పెద్ద కష్టమా!బ్యాంకులో అకవుంటు తీసుకోవడానికి అది చాలు గదా!అకవుంటుతో పాటు డెబిట్ కార్డు వస్తుంది, ఇప్పుడు పచారీ కొట్లలో కూడా స్వైపింగ్ మెషీన్లు ఉన్నాయి - కొత్తగా ఆలోచించితే ఒకటి రెండు రోజుల్లో సమస్య తీరిపోయేదానికి ప్రజల్ని ఎందుకింత భయోత్పాతానికి గురి చేస్తూ ఫిడేలు వాయంచుకుంటూ కూర్చున్నారు?నోట్లకట్టల్ని దొంగలు కొట్టేస్తారనే భయం ఉంటుంది, కార్డు పోతే బ్యాంకుని మెస్సేజి పంపిస్తే చాలు మనీ సెక్యూర్ - తోపుడు బళ్ళవాళ్ళు కూడా మొబైల్ వాడుతున్నారే!ఎప్పటికైనా అలవాటు చేసుకోవాల్సిన కొత్తదనాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ఇప్పుడు కూడా అలవాటు చేసుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటారు?చురుకైనవాళ్లు నేర్చుకోవాలిమిగతావాళ్లకి నేర్పాలి - ఈ అతి ముఖ్యమైన పని చెయ్యాల్సిన అధికార పార్టీకి చెందినవాళ్ళు ఇప్పటికీ ఇంకో యాభై రోజులు ఇబ్బంది పడండని చిద్విలాసంగా చెబుతున్నారు, మరోదారి లేక విసుక్కుంటూనే ఓపిగ్గా క్యూలల్లో నిల్చున్న జనాల్ని చూసి ఇంకా మమ్మల్ని చీకొట్టటం లేదులెమ్మని మురిపాల స్టేటుమెంట్లు గుప్పించి వదుల్తున్నారు - మీదకురికి చొక్కాలు చింపితే గానీ కంగారు పుట్టదు కాబోలు!దాచుకున్న కోపాన్ని ఎన్నికల్లో చూపించి పుట్టి ముంచాక గానీ కళ్ళు తెరిచి చూడరు కాబోలు! .

     తమ పార్టీ అధికారంలో ఉంది,ప్రధాని తీసుకున్న చర్యని ఆర్ధిక శాస్త్రవేత్తలు కూడా ప్రశంసిస్తున్నారు, ఆఖరు నిమిషాల్లో చిన్న సమస్య జనాన్ని అతలాకుతలం చేసి గంప లాభం చిల్లి తీసిందన్నటు గాలి తమకి వ్యతిరేకంగా మారుతున్నది - అయినా క్యూల దగ్గిరకి వెళ్ళి చాయ్ ఇవ్వండని క్లూ ఇచ్చి ఇన్ని గంటలైనా కింది స్థాయి కార్యకర్తల్లో చలనం లేదు!తమ పార్టీ ప్రభుత్వంలో ఉంది గాబట్టి ప్రభుత్వాధికారుల నుంచి వీలున్నంత ఎక్కువ సమాచారం రాబట్టి ప్రజలకి చెప్పవచ్చునే!భాజపా కార్యకర్తలకి ఎక్కడో ఉన్న అయోధ్యలో రామాలయం కట్టటానికి ఇటుకలు సేకరించటం, గుడి కట్టనివ్వటం లేదని ముస్లిముల్ని తిట్టటం లాంటి మోటుపన్లు తప్ప ఇట్టాంటి  క్రియేటివ్ పన్లు చెయ్యటం నామోషీయా!మోదీ ఒక్కడే చాలు మాపార్టీకి అనే ధీమా తప్ప ఏడుపు తన్నుకొచ్చేటంత కష్టంలో ఉన్న మోదీకి సాయం చెయ్యగలిగిన దమ్మున్న కుర్రాడు భాజపా కార్యకర్తల్లో ఒక్కడు కూడా లేడా!ఇలాంటప్పుడు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల పక్కన నిలబడితే గుడి కట్టినదాని కన్నా ఎక్కువ పాప్యులారిటీయే వస్తుంది కదా!సాక్షాత్తూ వైకుంఠవాసుడికి డబ్బు కావాలంటే ఆదిలక్ష్మి మేడం చెక్కో క్యాషో ఇవ్వాలి, వీళ్ళు ఆవిడ బ్యాంకుకే కన్నమేస్తున్నారు - రామాలయం కట్టటానికి ఆమె డబ్బెట్లా ఇస్తుంది?


రాముడొక్కడే దేవుడు కాదు, లక్ష్మీదేవి కూదా దేవతయే - కాస్త ఆవిణ్ణి కూడా పట్టించుకోండి!

116 comments:

  1. గవర్నమెంట్, బ్యాంక్ ఏంప్లాయిస్ చేతివాటంతోనే బ్లాక్ నుంచి వైట్‍కి మారుతోంది ప్రస్తుతం. కమీషన్ చార్జెస్ వసూల్ చేసి మారుస్తున్నవారికి ఇదే దారి. బెంగుళూరు కార్పొరేషన్లో కరెంట్ బిల్లు క్యాష్‍తో చెల్లిస్తున్నవారి అనుభవమేంటంటే, సిబ్బంది వారి కళ్ళముందే ఇచ్చిన కొత్తనోట్లు లేదా వంద/యాభై నోట్లని జేబులో పెట్టుకుని, వాళ్ళ దగ్గరున్న పాత ఐదు వందలు, వెయ్యి నోట్లని మిషెన్లో పెడుతున్నారట. అడిగితే మీకేం నష్టం లేదు కదా అని దబాయింపట. కట్టినవారు ఫేస్‍బుక్‍లో మొత్తకున్నారు. మిగతాచోటా ఇదే దార్లో ఉంటారని ఖచ్చితంగా చెప్పవచ్చు.

    అందరూ ఆన్‍లైన్లో కట్టరు కదా, యాభైరోజుల్లో కావలిసినంత మార్చుకోవచ్చు ఈ దారిలో. ఎక్కడెక్కడైతే పాతనోట్లు ఒప్పుకుంటోందో ప్రభుత్వం, అవన్నీ ఈ కన్వర్షన్‍కి దారులే. వీలైనంత వేగంగా ఎక్కువ కొత్తనోట్లు చలామణీలోకి తెచ్చేసి, ఈ వెసులుబాట్లు మూసేసి ఉంటే బావుండేది. అది సరిగ్గా ప్లాన్ చేయలేక, వేరే దారిలేక ఈ వెసులుబాట్లు ఇచ్చి బ్లాక్ మార్చుకునే సదుపాయం స్వయంగా కల్పించినట్టయ్యింది.

    ReplyDelete
  2. తోపుడు బళ్ళవాళ్ళు కూడా మొబైల్ వాడుతున్నారే!

    మీరన్నది నిజమే. మీడియా అతి చేస్తున్నారు. ఇంట్లో కొంతమంది పెద్ద వాళ్లకి స్మార్ట్ పోన్ ఉపయోగించటం రాకపోయినా, పిల్లలు చాలా బాగా ఉపయోగిస్తారు. వాళ్లు వాడినట్లు ఇంకెవ్వరు వాడరు. వీళ్ళలో పేటి.యం. వంటి అప్లికేషన్ లు వాడేవారెందరో ఉన్నారు. అందులో ఆటోవాళ్లు,పాల వాళ్ళను చూశాను. ఎవరికైనా తెలియకపోతే రెండు నిముషాలలో నేర్చుకోగలరు. కాని మీడీయాలో ఎక్కడ వీరి గురించి ప్రస్థావనే ఉండదు. ఎంతసేపు పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అని పథకం మంచిదే కాని అమలు సరిగాలేదు అని సోది రాస్తూ పోతుంటారు. ఇప్పటికే పేఫర్ చదివేవారికి విసుగొచ్చింది. ఒకే విషయాన్ని మార్చి మార్చి మీడీయా వాళ్ళు ఇలా రాస్తూ పోతే పేపర్లు కూడా అమ్ముడు కావు. గాసిప్ లు రాసి సామాన్యులను భయపెడుతున్నారు.
    గ్రామీణ ప్రజల కష్టాలని ఎవేవో లెక్కలు చెప్పటం మొదలుపెడుతున్నారు. మా జిల్లాలో గ్రామీణ ప్రజలు పట్టణ ప్రజలకన్నా అడ్వాన్స్డ్ గా ఉంటారు. కొత్త బైక్ వచ్చినా మొబైల్స్ వచ్చినా మొదట కొనేది వాళ్ళే. వాళ్లకి ఈ ఆప్ ల గురించి తెలియవా? మా గ్రామీన ప్రాంతాలలో నేడు ఆర్.టి.సి బసులు కూడపోవటల్లేదు. కారణం అందరికి స్కూటర్లు ,ఆటోలు ఉండి. ఎవ్వరు బస్సును ఎక్కటం లేదు. ఇదే పరిస్థితి ఇతర కోస్తా ఆంధ్రా జిల్లాలో ఉందని నేను భావిస్తాను. ఒకసారి రైలో ప్రయాణం చేస్తూంటే చిన్న నుంచి పెద్ద వరకు మోబై లో సినేమాలు,గేంస్ మొదలైన అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉపయోగిస్తూంటారు.
    కొన్ని చోట్ల ప్రజలు కష్టపడుతున్నారా అంటే కష్టపడుతున్నారు. ఐతే అందరు పడుతున్నారా అంటే అదేమి లేదు.

    ఇల్లు కట్టిస్తున్నాను. ఈ పథకం తరువాత 500, 1000 కూలీలకు ఇస్తున్నాను. ఇప్పటివరకు ఏ ఇబ్బందులు రాలేదు. హాయిగా తీసుకొంట్టున్నారు.

    ReplyDelete
  3. సాఫ్ట్ వేర్ లో ఫాక్స్ ప్రో నుంచి బిగ్ డేటా వరకు చూశాను. శాస్ ను ఉపయోగించి కోట్ల రికార్డ్ లను అతి సులువుగా, తక్కువ సమయంలో ప్రాసేస్ చేయవచ్చు. Acxiom లాంటి అమెరికన్ కంపెనీలే కాదు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ సాస్, బిగ్ డేటా లను ఉపయోగిస్తున్నాయి. డేటా ఉండాలే గాని, మీకు ఏ రిపోర్ట్ కావాలంటే అది తీసిస్తుంది.

    నేడు పేపర్లో వచ్చే వివిధ అక్రమాలు చేసేవారిని, ప్రోగ్రాంలో కండిషన్ లు రాసి డేటా ద్వారా ట్రాక్ చేసి, టార్గేట్ చేయవచ్చు. ఉదా|| ప్రభుత్వానికి అకస్మాతుగ్గా జనధన్ యోజన లో డబ్బులు పడినవారివి వేరే వారి దనిపించిందనుకో వాళ్ళ ని టార్గేట్ చేయవచ్చు. సంజాయిషి కోరుతూ మైల్స్ పంపించేది. మూడూ చాన్స్ లు ఇచ్చి వారినుంచి బదులువస్తే సరి, లేకపోతే ఆ డబ్బు ప్రభుత్వం జప్తు చేసుకొంట్టే అడ్డుపడేవారెవ్వరు. ఈ మొత్తం ప్రాసెస్ ను ఆటోమేట్ చేయవచ్చు.
    http://www.acxiomconsulting.com/business-intelligence/

    ReplyDelete
    Replies
    1. >>సంజాయిషి కోరుతూ మైల్స్ పంపించేది

      వాళ్ళకి మెయిల్ అక్కంటు వుంటుందాస్సలు.



      Delete
    2. అడ్రెస్ కూడా లేకుండా బాంక్ లు అకౌంట్ ఒపెన్ చేస్తారా?

      Delete
    3. మీ ఊర్లో కూలి నాలి చేసుకునే అడోల్లకి ఇ-మైల్ అక్కంట్ వుంటుందేమో గాని, మా ఊరోళ్ళకి లేవు.

      Delete
    4. హరిబాబు గారు,

      ఈ అనామక వ్యాఖ్యలను ఎందుకు ప్రచూరిస్తారు? ఇందులో ఎమైనా పదార్థం ఉందా? బుర్ర మోకాలు లో ఉండేవాడికి ఎంత చెప్పినా,ఎన్నిసార్లు చెప్పినా ప్రశ్నలు వస్తూంటాయి. నాకు మీ అంత ఓపిక లేదు, వీళ్లను కన్వీన్స్ చేయాలని ఆరాటం అసలుకు లేదు. నేను రాసే వ్యాఖ్యలు గాని, ఇచ్చే లింక్ లు గాని మీలాంటి ఒకరిద్దరి కొరకే. దారినపోయే దానయ్యలందరికొరకు కాదు. శ్రీనివాస్, చంద్రిక, మీకు ఎమైనా ప్రశ్నలు ఉంటే అడగండి.

      ఈ అనామక, కోడి బుర్ర బోడి ప్రశ్నను, చదివినవారికి ఎదో నిజమున్నట్లు అనిపిస్తుంది. కాని అదినిజం కాదు. వాళ్లకి వివరణ ఇస్తూ పోతే ప్రశ్నలు వేస్తూ పోతారు. అసలికి వీళ్లేసే ప్రశ్నలు చూస్తే, పదో తరగతి అన్నా చదివారా? అనిపిస్తుంది. ఈ మొద్దు బుర్రలకు అర్థమయ్యేటట్లు చెప్పటానికి నేను బుర్ర బద్దలు పగలకొట్టుకోవాలా?

      ఈ సందర్భంగా సెంథిల్,గౌండర్ మణి టైపు కామేడి యన్లు గుర్తుకొచ్చారు. వీళ్ళ లాజిక్ ను చూస్తూంటే, జెంటి మాన్ సినేమాలో, నేను సెవెంత్ పాస్ అన్నా, నువ్వు టెంత్ ఫైల్ అన్నా? పాస్ గొప్పా? ఫైల్ గొప్పా? అన్నట్లుంది. వాళ్ల ప్రశ్నలు వాళ్లకి గొప్పగా అనిపించవచ్చేమోకాని, నాకు మటుకు వీళకి వివరణ ఇవ్వటమంటే సెంథిల్,గౌండర్ మణిల ప్రశ్నలకు సీరియస్ సమాధానాలు ఇవ్వటం లాంటిది. వాళ్ల కర్థమయ్యేదే అవుతుంది. జవాబు అంతంలో ఇంకొక కామేడి ప్రశ్న వాళ్ల బుర్రలో పుడుతుంది. loop

      Delete
    5. హరిబాబు గారు పైన రాసిన నా వ్యాఖ్యకు ప్రతివ్యాఖ్యగా మీరు మరొక పెద్ద వ్యాఖ్యను దయచేసి రాయకండి. అలాగే నా వ్యాఖ్యను చదివి నన్ను ప్రశ్నిస్తు రాసే అజ్ణాత వ్యాఖ్యలను ప్రచూరించకండి. అవి చదవటం, మళ్ళీ వాటికి బదులివ్వటం ఇదొక పెద్ద విషవలయంలా అయిపోతున్నాది.

      Delete
    6. శ్రీ రాం! మీరిచ్చిన 4 పేజీల టెక్ష్టులో ఒక చిన్న తప్పిదం చూపించానేగాని, అంతా తప్పనలేదు. మరి మీరెందుకంత గావున ఉలిక్కిపడ్డారో అర్ధం కాలేదు. మీరు హరిబాబు కోసమే ఇక్కడ రాస్తున్నసంగతి ప్రతి వాఖ్యకి చివ్రాకర్న బ్రాకెట్టులో పెడితే మాలాంటి వాళ్ళకి కొంచెం అనువుగావుంటుంది

      Delete
    7. Today I read this:

      ‘నా పేరు యహియా. సన్నిహితులు యహి అని, కస్టమర్లు యహక్కక అని పిలుస్తారు. నా వయసు 70 ఏళ్లు. మా సొంతూరు కొల్లాం జిల్లాలోని కొడక్కల్‌ ముక్కున్నమ్‌. నాకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేను చదవుకోలేదు. పేదవాడ్ని. కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేశా. గల్ఫ్‌ కూడా వెళ్లొచ్చా. చివరకు చిన్న హోటల్‌, టీకొట్టు పెట్టుకున్నా. కుమార్తె పెళ్లి కోసం చాలా కష్టపడ్డా. బ్యాంకు లోన్‌ తీసుకుని, చేతిలో ఉన్న కొంత డబ్బుతో పెళ్లి జరిపించాను. హోటల్‌ లో మొత్తం పనిని నేనే చేస్తాను. వండటం నుంచి సర్వ్‌ చేయడం, క్లీన్‌ చేయడం నా పనే. అందుకే నేను నైటీ వేసుకుంటా. 500, 1000 రూపాయల నోట్లను ప్రధాని మోదీ రద్దు చేశారని తెలిసి షాకయ్యాను. కష్టపడి దాచుకున్న డబ్బు 23 వేల రూపాయలు ఉంది. అన్ని పెద్ద నోట్లు. వీటిని మార్చుకునేందుకు బ్యాంకుల ముందు రెండు రోజులు క్యూలో నిల్చున్నా. రెండో రోజు బీపీ తగ్గిపోయి కూలబడ్డాను. కొందరు దయగల వ్యక్తులు సాయం చేసి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కో ఆపరేటివ్‌ బ్యాంకులో లోన్‌ తీసుకున్నా, నాకు బ్యాంకు ఖాతా లేదు. దీంతో పాతనోట్లను ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు. ఎన్ని రోజులు బ్యాంకుల ముందు క్యూలో నిల్చోవాలి? పగలు రాత్రి ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇది. నా డబ్బు చెల్లకుండా పోయింది. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత 23 వేల రూపాయల నోట్లను అన్నింటినీ కాల్చివేశాను. వెంటనే దగ్గరలోని బార్బర్‌ షాప్‌ కు వెళ్లి బట్టతలను సగం గుండు చేయించుకున్నా. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బును బూడిదపాలు అయ్యేలా చేసిన ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోయేవరకు ఇలాగే ఉంటా. మోదీ గద్దె దిగిన తర్వాతే వెంట్రుకలను పూర్తిగా పెంచుతా. ఇది నా నిరసన. ప్రతిజ్ఞ’

      ((ఇది శ్రీ రాం కోసం కాదు))

      Delete
    8. ఇంకేం యహి ఆర్ యహక్కక్క ఆర్ యహియా, నీ ప్రతిజ్ఞతో గుజరాత్లో నాలుగువేలమందిని చంపిన నరరూప రాక్షసుడైన మోడీకి అంతిమ రోజులు దగ్గరపడినట్లే. అలా చంపినా అక్కడ 14 ఏళ్ళుగా పదవిలో వుంది భాజపా. ఇప్పడు నోట్లు రద్దు చేసిన తరువాత దేశంలో వేలాదిమంది క్యూలలో నిలబడి, నిలబడలేక ప్రతిరోజూ చనిపోతున్నారు కదా? ఇక వచ్చే ఎన్నికలలో మోడీకి డిపాజిట్లు కూడా దక్కదు. ఇక కమ్మీలు, దళ్ళీలు, కాంగీలు, పండగజేసుకోవచ్చు. ఇలాగే దేశమంతా ప్రతి పత్రికకూ, ప్రతి బ్లాగుకూ నీ బాధని పంపించు, ప్రచురిస్తారు.
      జనధన్ ఖాతా, గ్యాస్ సబ్సిడీ ఖాతా, నరేగా కూలీ ఖాతా కూడా లేనిి నీలాంటి నిర్భాగ్యులకి ఒక ఖాతాని బ్యాంకులో ఇప్పించలేని నీవున్న ఊరిలోని వ్యక్తులు నిజంగా నరరూప రాక్షసులే. ఒక్క తెలిసినవాడు, నిన్ను విశ్వసించేవాడు, ఒక్క స్నేహితుడూ కూడా లేని నీ ఊరిలో, ఆ ఊరు వున్న ఈ దేశంలో నీలాంటి నిస్సహాయులు బ్రతకలేరు. మళ్ళీ గల్ఫ్ కే వెళ్ళు. లేదా, ఈ పరిస్థితికి ఎవరు కారణం అని నీకు నూరిపోసారో, ఆ వ్యక్తిని నిర్మూలించు.
      లాంగ్ లివ్ యహియా అండ్ పర్వర్టెడ్ బ్లాగోపాత్స్.
      ((ఇది అనానిమస్ కోసం కాదు నిజమైన యహియా కోసమే))

      Delete
    9. చిరునామా నే లేని వారు ఓటు ఎలా వేస్తున్నారండీ మరి ? శ్రీరామ్ గారన్నట్లు ఇదేమి ప్రశ్న :) ‘ డబ్బును బూడిదపాలు అయ్యేలా చేసిన ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోయేవరకు ఇలాగే ఉంటా. ‘ బ్యాంకు లో ఖాతా తెరవమన్నపుడు ఏం చేశారట ? కేజ్రీవాల్ తమ్ముడిలా ఉన్నారే !! వాళ్ళింట్లో ఇంట్లో అన్నం మాడిపోతే కూడా, దానికి కారణం మోడీ నే అంటారేమో కూడా !!

      Delete
    10. Anonymous (05:20) గారు, చంద్రిక గారు సరిగ్గా అడిగారు. ఈ కథలో ఎక్కడో ఏదో అర్థం కావడంలేదు. Financial Inclusion అని చెప్పి అత్యధికంగా ఖాతాలు తెరిపించారు. ఈయన రెండుసార్లు బ్యాంక్ లోన్ తీసుకున్నానంటున్నాడు. లోన్ ఇచ్చేటప్పుడు సాధారణంగా బ్యాంకులు సేవింగ్స్ ఖాతా కూడా తెరిపిస్తాయి, లోన్ సొమ్ము దాంట్లో వేస్తాయి. సాధారణంగా అలా జరుగుతుంది. ఒకవేళ ఇదివరలో అలా జరగకపోయున్నా కనీసం ఇప్పుడైనా నోట్లు మార్చుకోవడానికి లైన్లల్లో నిలబడే బదులు ఓ ఖాతా తెరచి దాంట్లో ఆ నోట్లు జమ చేసుకుంటే సరిపోయేది. ఆ నోట్లను తగులబెట్టడం ఎందుకు? నల్లధనం కాదుగా (వాళ్ళే తగలబెట్టుకోవడంలేదు) !

      Delete
    11. ఈ దేశంలో బాంకు అక్కౌంట్ లేని వాళ్ళు లక్షల మందిలో వున్నారు. అస్సలు ఇ మైలక్కౌంట్ లేనివాళ్ళు కోట్లలో వున్నారు. మరి మోడి మీద మాటా రాకూడదనుకుంటే, వీళ్ళంతా భారతీయులు కాదని ప్రకటించేద్దాం. ఇంట్లో అన్నం కూర మాడటమేం ఖర్మ, బాంకు క్యూ లో చచ్చినా అది తిన్నదరక్క చావడమేగాని ఇంకొకటి కాదు.

      ఇలా బ్లాగులు, ఇ-మైలు అక్కౌంటులున్నవాళ్ళు మాత్రమే భరతీయులు. లేకపోతే శరణార్దులు

      Delete
    12. అందుకే పైన చెప్పింది - గ్యాస్ సబ్సిడీ, నరేగా కూలీ డబ్బులు బ్యాంక్ ఎకౌంట్ల ద్వారా మాత్రమే వస్తాయని. ఒక కుటుంబంలో ఒక బ్యాంక్ ఎకౌంట్ వుంటే సరిపోదా? అందరికీ వుంటేనే 135 కోట్ల భారతీయులకి వున్నట్లా? తింగరి లెక్కలు వేసే కమ్మీలు, దళ్ళీలు,కాంగీలకు మతి లేదు. మనకి కూడా లేదా? మోడీ చేసే ప్రతి పనీ నరరూప రాక్షసుడి పనే అనే బ్లాగోపాతులకి చర్య అరక్కే ఈ చావడం.
      మోడీ ఫోబియో వుండొచ్చుగానీ ఇంతగా ముదిరిపోవడం కచ్చితంగా అనారోగ్య సూచనే.
      గెట్ వెల్ సూన్

      Delete
    13. నేను ఇ-మైలు అకౌంట్ లేని వాళ్ళగురించి మాట్లాడూతుంటే, విన్నకోటలు, చంద్రికలు బాంక్ అక్కౌంట్ల దగ్గరే ఆగిపోతున్నారు. ఎందుకో, ఏమో ;)

      Delete
    14. మయన్మార్ (బర్మా)లో నల్లడబ్బును సమూలంగా నిర్మూలించాలనే సదాశయంతో 1987లో అప్పటి దేశ నాయకుడు నే విన్ దేశ కరెన్సీ కియత్‌లోని పెద్ద నోట్లను రద్దు చేశారు. సరైన ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల దేశంలో ఒక్కసారి వ్యవసాయ రంగం కుప్పకూలి పోయింది. గ్రామీణ ప్రాంతాల ప్రజల చేతుల్లో పెద్ద నోట్లు చెల్లకుండా పోవడంతోపాటు చేతుల్లో చిల్లిగవ్వ లేకుండా పోయింది. రోజువారి కూడు కోసం కావాల్సిన ఉప్పు, పప్పుల కొనగోలు కూడా కష్టమైంది.
      అప్పటికే వరి పంట చేతికి రావడంతో గ్రామీణ ప్రజలకు వస్తుమార్పిడి విధానం (బార్టర్) అమలు చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు అక్కడి ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను బియ్యం ఇవ్వడం ద్వారా కొనుక్కోవడం ప్రారంభించారు. పర్యవసానంగా బియ్యం, అలాగే కూరగాయల ఎగుమతులు పట్టణాలకు నిలిచిపోయి అక్కడ తీవ్ర ఆహారం కొరత ఏర్పడింది. దీంతో దేశంలోని పట్టణ ప్రాంతంలో సరకుల దోపిడీలు, అల్లర్లు చెలరేగాయి. అల్లర్లను అదుపు చేయడానికి సైనికులు జరిపిన కాల్పుల్లో పదివేలకు మందికిపైగా ప్రజలు మరణించారు.
      అంతకుముందు దేశాధ్యక్షుడిగా పనిచేసిన నే విన్ 1987లో యాభై, వంద రూపాయల కియత్ నోట్లను రద్దు చేసినప్పుడు పాలకపక్ష ‘బర్మ సోషలిస్ట్ ప్రోగ్రామ్ పార్టీ’కి చైర్మన్‌గా కొనసాగుతూ దేశ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. పాలకపక్ష సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ఆర్మీ చీఫ్ కమాండర్‌గా, పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రధాన మంత్రిగా కూడా పనిచేశారు. సోషలిజం కార్యక్రమం కింద ఆయన ఎన్నో మంచి ప్రజా సంక్షేమ పనులు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులను జాతీయం చేయడంతోపాటు పలు ప్రభుత్వ ఆస్పత్రులను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారు. ప్రభుత్వ విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. భూ సంస్కరణలను తీసుకొచ్చి పేదలకు మేలు చేశారు.
      ఇలాంటి సోషలిస్టు భావాలు కలిగిన ఆయన నల్ల కుబేరుల పీచమణచాలనే ఉద్దేశంతో యాభై, వంద కియత్ నోట్లను అనూహ్యంగా రద్దు చేసి వాటి స్థానంలో 49, 90 కియత్ నోట్లను తీసుకొచ్చారు. ఈ కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడడం వల్ల నే విన్‌కు చెడ్డ పేరు వచ్చింది. 1963లో ఆయన దేశ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ 50, 100 నోట్లను రద్దు చేశారు. అప్పడు కూడా ఆయన ఆశించిన ఫలితాలు కాకుండా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అప్పటిలాగా కాకూడదనే ఉద్దేశంతో 1987లో సంఖ్యా శాస్త్రం విశ్వసించే నే విన్ ఓ సంఖ్యాశాస్త్ర జ్యోతిష్యుడిని సంప్రతించారు. తొమ్మిదో నెంబర్ కలిసి వస్తుందని జ్యోతిష్యుడు చెప్పడంతో 50, 100 నోట్ల స్థానాల్లో 49, 90 నోట్లను ప్రవేశపెట్టారు. దాంతో దేశంలో నియత ఆర్థిక వ్యవస్థ 50 శాతం దెబ్బతింది. అనియత వ్యవస్థ అంటే ప్రజల్లో నగదు సర్కులేషన్ సరిగ్గా 86 శాతం పడిపోయి, జాతీయ స్థూల ఉత్పత్తి దారుణంగా తగ్గిపోయి దేశంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. కేవలం జ్యోతిష్యుడు మాట నమ్మి దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారంటూ ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా పాలకపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తడంతో 1988, జూలై 23వ తేదీన పార్టీ చైర్మన్ పదవికి నే విన్ రాజీనామా చేశారు.

      Delete
    15. ఈ మేల్ ఎకౌంటేకాదు, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ఎలా సాధ్యం, ఎలాంటి సమస్యలున్నాయి అనేదాన్ని గురించి, ఆధార్ రూపశిల్పి నందన్ నీలేకనీ తో ప్రెస్టిట్యూట్ బర్ఖాదత్ ఇంటర్యూ ఎన్ డి టి.వి.లో ప్రసారమైంది. నిజంగా తెలుసుకుందామనుకనేరు, బ్లాగోపాత్స్ కానివారు చూసి తెలుసుకోవచ్చు.

      Delete

  4. హరిబాబు గారు. నిన్న ఎవరో నన్ను 20 డాల్లర్లకి చిల్లర అడిగారు. అసలు చేతిలో డబ్బే లేదని చెప్పాను. చేతిలో కాష్ లేకపోయినా నెలల తరబడి గడిచిపోతుంది ఇక్కడ. బ్యాంకు లో ఖాతా తెరవమన్నపుడు, ఆధార్ కార్డు లు తెచ్చుకోమని ఎవరు ఎంత మంది ని ఎడ్యుకేట్ చేసారో తెలీదు కానీ చిల్లర దొరక్కపోయేసరికి మాత్రం తెగ గోల పెట్టేస్తున్నారు. డిజిటల్ ఇండియా రమ్మంటే ఎలా వస్తుంది ?

    ReplyDelete
  5. Hari Babu Garu,

    This is just beginning and Our PM had more plans.

    Due to corruption of Some Bankers the Rich was able to exchange some. Even some BJP politicians worried as it is open secret that there are some corrupted.

    This is the reason the Ban misfired and poor suffered. So far 60 Lakhs of (Total 150 Lakh currency notes and smaller notes share is 15 percent so 50 percent task completed) notes were recovered.

    I copied and pasted here some interesting points mentioned by a professional CA.

    ReplyDelete
  6. Our PM had a Full blue print for the development of our country right from Day 1 of his being elected.

    Firstly they asked for all the bank account number in your Return of Income

    Then they linked your PAN with Aadhar

    They linked all the subsidies, pension and other benefits directly to your bank account through Direct Benefit Transfer Scheme.

    Then they gave opportunity to all the common men to open an account with bank through Jan Dhan Yojna. Around 25 Crore Accounts opened.

    They entered into revised treaty with most of the countries in which unaccounted money goes through HAWALA e.g. Mauritius and thus the route of Black Money coming from Mauritius which everyone knew is stopped.

    They passed few strict laws to overcome the evil of black money such as Benami Transaction Act and Foreign Black Money Act

    They levied Excise duty on Gold.

    They also made TCS compulsory for Cash transactions above 2 lakh.

    They withdrew lakhs of pending income tax and service tax litigations where Common men had won at Appeal level and Department had gone further.

    They also entered into information exchange agreement with such countries.

    Then they gave last opportunity to all black money hoarders through Income Declaration Scheme, 2016

    Now they have a Scheme for Dispute Resolution Panel again to reduce Litigation till December 2016.

    Now the masterstroke, that they have banned Rs 500 & 1000 denominations.

    The journey or the chronology of these events is interesting which explains the ultimate destination and who knows, may be the journey is still not over and the ultimate destination may still be the Swiss Account holders!

    ReplyDelete
  7. The main reason about sudden decision of Ban of Big notes is known from a Facebook Friend.

    We as Indians generally lack strategic thinking at individual and collective level.We are trained to maintain status quo .It is time to think what really demonization means at bigger canvas as a nation than as an individual. Country comes first rest everything comes secondary.

    Lets consider some cold facts. There are four main firms that produce paper for printing Currency notes. These are, Portal of USA, Gain of Sweden, Arzo Vigiz of France and paper fabrics Leuscental. In 2010 Pak started buying paper from two of these firms from which India was sourcing its paper. Pak is economically much weaker than India .

    All of a sudden this coup gave the Pak ISI the option of printing fake Indian currency in the mass. This gave Pak the option of pumping in Hawala money to support Terror ops on a massive scale and destabilise J&K. it also began to buy sections of our student community and media and began to fund political parties to influence Indian elections.

    It set up 5 presses for Printing fake currency notes. These were then smuggled into India via Nepal( via the PIA flights). Bangladesh( into India mostly via Malda), Rajasthan border, Punjab border and via Chennai and Mangalore(via Indian expats from the Gulf). There are reports that our Indian intelligence agencies recently uncovered a plan by the ISI to execute an economic Pearl Harbour. India has some 16000 trillion currency notes of 500 and 1000 in circulation (96% OF OUR MONEY SUPPLY).As per this source, Pak was printing 15,000 trillion such notes and was about to push them into India to unhinge its economy and generate runaway inflation and price rise but above all to give a big push to terror activities in J&K and rest of India.

    Frankly this was an act of war. Our response instead of being offensive (military terms) had perforce to be defensive and PRE- EMPTIVE. That is what precisely has been done. The people crying loudest are those hit hardest by the sudden strike on their black and fake money hordes -mostly from abroad. The terrorist in J&K have been hard hit. All stone pelting is at an end. The Maoists are reeling- all their extortion money is now a heap of junk. Hawala racket is busted. Many of the people now in lines were out of job labour from the House construction agencies darfted to deposit black money tranches and despperately try and convert them to white.

    We need to HOLD FIRM. Have faith- this is BITTER Medicine but it will work..

    ReplyDelete
  8. There is an interesting article why the Fake notes increased in India.

    http://postcard.news/must-read-can-you-believe-it-congress-legally-printed-fake-currency/

    ReplyDelete
  9. 2) http://postcard.news/must-read-can-you-believe-it-congress-legally-printed-fake-currency/2/

    3) http://postcard.news/must-read-can-you-believe-it-congress-legally-printed-fake-currency/3/

    ReplyDelete
  10. ఐదేళ్ళ క్రితం మా నాన్న గారు నాపేర ఒక బాంక్ లో రెండు ఫిక్స్ డ్ డిపాజిట్లు వేశారు. అవి చాలా చిన్న మొత్తాలు 25వేలు. నేనావిషయం మరచిపోయాను. కారణం ఆ బాంక్ లో నాకు అకౌంట్ లేదు, వాళ్ల దగ్గర నా వివరాలు ఎమి లేవు. నేను మా స్వంత ఊరులో ఉండను. బాంక్ వాళ్ల దగ్గర ఒక్క నాపేరు తప్పించి మిగతా వివరాలు ఎమిలేవు. గత సంవత్సరం నా ఫాం16 లో ఆ రెండు డిపాజిట్ల వివరాలు ఇన్ కంటాక్స్ వెబ్ సైట్ లో కనిపించటం మొదలయ్యాయి. (అంత చిన్న మొత్తాలైనా!) అది చూసి ఆశ్చర్య పోవటం నా వంతైంది. మన ప్రభుత్వం దగ్గర పేరు, చిరునామ ల ద్వారా కోట్ల రికార్డ్ లో వ్యక్తిని గుర్తించే పరిజ్ణానం అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే అమెరికోడు దగ్గర ఉండే సాంకేతికత కన్నా ఎక్కువగా ఉంది అని చెప్పగలను. ప్రభుత్వం వాళ్ళు ఫిక్స్ డ్ డిపాజిట్ లో కనిపించే పేరుతో నా పాన్ డిటైల్స్ పట్టుకొని, ఫాం16 లో నా అకౌంట్ లో కనిపించేటట్లు చేసేశారు.

    ఒక్కసారి ఈ ధనం ఏ రూపంలో అయినా బాంక్ లో కొచ్చి పడితే చాలు దానిలో తెలుపేది, నలుపేది, పేదోడిది ఎదీ, బినామి లది ఎది అని రెండునిముషాలలో పట్టిపారేయొచ్చు. ప్రభుత్వం నిబంధనలు మార్చి వాటిని స్వాధీనం చేసుకొంట్టుంది. చాలా మందికి ఆ సూక్షం అర్థమౌతున్నట్లు లేదు.
    ఇంకా పాతరోజుల మాదిరి తిమ్మిని బమ్మిగా చేద్దామనుకొంట్టున్నారు. అది అయ్యేపనే కాదు. ప్రభుత్వం పట్టాలా అని అనుకొంటే ఎక్కడా దాకోలేరు.
    ____________________

    ఒక వ్యక్తి పేరు కోటి రికార్డ్ లలో పది సార్లు ఉండిందనుకోండి. అందులో అతని లేటేస్ట్ అడ్రెస్ ఎదో కూడా సులువుగా పట్టేయవచ్చు.ఇవ్వని (సరైన Name & Address రికార్డ్ ను గుర్తించటానికి ) చేయటనికి ఒకప్పుడు పదిరోజులు పడితే ఇప్పుడు ఎక్కువ వేసుకొంటే ఒకరోజు చాలు. కోట్ల రికార్డ్ ల డేటాను అవలీలగా ప్రాసేస్ చేసి అవతల పారేయొచ్చు.

    ReplyDelete
    Replies
    1. ‘ ఇంకా చెప్పాలంటే అమెరికోడు దగ్గర ఉండే కన్నా ఎక్కువగా ఉంది అని చెప్పగలను. ‘ అక్షరాలా నిజం శ్రీరామ్ గారు. digitization తో ఉచ్చులు బిగుసుకుంటున్నాయనేది మాత్రం వాస్తవం. problem is - everyone tries to break the system, no one wants to follow the system. ఈ ఆటిట్యూడ్ లో ముందు మార్పు రావాలి . పైన అనామకులు గారు చెప్పినట్లు ఎవరో డబ్బు తగల పెట్టి మోడీ కారణం అంటున్నారు.

      Delete
  11. మర్చిపోయా!ఆ నల్లధనం పాపాత్ముల్లో ఒక్క పుణ్యాత్ముదన్నా కమిషన్లకి తగలెయ్యకుండా భేతాళిక అకవుంటులో ఒక మూడువేలకోట్లు వేస్తే పుణ్యం దక్కేది.పాపం ఎప్పట్నుంచొ ఎవరన్నా నాకు మూడువేఅలకోట్లు ఇస్తే అయోధ్య సమస్యని చితికెలో పరిష్కరించేస్తానని ఎక్కడబడితే అక్కడ మొత్తుకుంటూ మూతికాలిన తెనాలి రామలింగడి పిల్లిలా/కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నది!సందట్లో సడేమియా అంటూ దైవకార్యం పూర్తయిపోయేది - ఎక్కడుందో, ఏం చేస్తుందో!

    ReplyDelete
    Replies
    1. ఆంటిజీని అంత మాట అంటారా? ఎంతైనా ఆంటి, ఆంటీనే!
      ఫైర్ & లవ్లీ పూసుకోకుండా (పోటోషాప్ వాడి) తెల్లబడ్డ ఏకైక మహిళ.

      Delete
  12. పోనీ నా అకౌంట్ నంబర్ ఇచ్చేదా?

    ReplyDelete
  13. Haribabu gaaru!
    demonetization in india batti
    rajakeeya adhikaaram goppadaa?

    variki donations iche ambani lanti parishramika vaadula adhikaaram goppada?

    ReplyDelete
  14. < " నేను ఇ-మైలు అకౌంట్ లేని వాళ్ళగురించి మాట్లాడూతుంటే, విన్నకోటలు, చంద్రికలు బాంక్ అక్కౌంట్ల దగ్గరే ఆగిపోతున్నారు. ఎందుకో, ఏమో ;) "
    ----------------------------
    పై వ్యాఖ్య Anonymous (29Nov2016, 03:16) గారు వ్రాసారు. నేను 28Nov2016, 07:48 న వ్రాసిన వ్యాఖ్య నోట్లను కాల్చేసుకున్నాడొక వ్యక్తి అన్న వార్త గురించి ..... మాత్రమే ..... వ్రాసింది. ఆ వార్త మీద 28Nov2016, 05:20 న తన అభిప్రాయం వ్రాసిన Anonymous గారిని నా వ్యాఖ్యలో ఉదహరించాను --> ఈ Anonymous గారి వ్యాఖ్యలో గాని, నా స్పందనలో గాని, అసలు వార్తలో గాని ఉన్నది ప్రస్తుత ఇబ్బందికి సంబంధించిన బ్యాంక్ అక్కంట్ల ప్రస్తావనే తప్ప ఇ-మెయిల్ అక్కంట్ల గురించిన చర్చ కాదు కదా.

    ReplyDelete
  15. ఏదైనా మనం చూసే కళ్ళనిబట్టి వుంటుంది. బాంక్ లో పని మానుకోని రోజులతరబడి లైన్లోనిల్చున్నాగాని, కష్టార్జితం ఇంకా చిత్తుకాగితాల లాగా కనిపిస్తుంటే, తట్టుకోలేక కాల్చేసి వుంటాడని అనుకోవొచ్చు.

    విన్నకోటగారు! మీరు మాత్రం తగలబెట్టిన పాయింటు మాత్రం పట్టుకున్నారు. చంద్రికగారు, ఇంకొకరు బాంకు అకౌంట్, ఆన్లైన్ అకౌంట్ లేదని కాస్త వెటకారం చూపిస్తున్నారు. ఒక్క ఫొన్ కొట్టి మేము బాంకు నుంచి మాట్లడతున్నాం మీ పాస్వర్డ్లు ఇచ్చెయ్యండి అంటే, అమాయ్కంగా నమ్మి అంతా చెప్పేసేంత చదువురానివాళ్ళకి ఈ దేశంలో లెక్కే లేదు. ఆన్లైన్ అక్కంట్ హాకై డబ్బులు ఇంకొకడూ దొబ్బేస్తున్నా తెలుసుకోలేని జనాలు వీళ్ళు. తీరిగ్గా కూర్చోని తిన్నా 4,5 సం.. సరిపడా బాంకులో మనలాగా పెట్టుకోలేదు చంద్రికగారు. ఒక్కరోజు కూలి డబ్బులు పొఇనా ఇక అంతా పస్తు పండుకోవాల్సిందే,, కడుపునిండి అంతా మనకు లాగే దెశమంతా వుంటుందని అంకున్నప్పుడే ఇలాంటి వెటకారాలు ఒస్తాయి

    ReplyDelete
    Replies

    1. ఈ పథకం మొదలు పెట్టి రెండేళ్లు అయినా ఖాతాలు లేవు అని చెప్పడం నిజం గా దేశం లో ప్రతిఒక్కరు సిగ్గు పడాల్సిన విషయం. ఒక నిరక్ష్యరాస్యుడి చేత ఖాతా తెరిపించటం ప్రతి పౌరుడి బాధ్యత. ఈ ఖాతా తెరవటం గురించి చాలా విమర్శలే విన్నాను కూడా. డబ్బు వేస్తాడా పెడ్తాడా పనికి మాలిన పనులు అని. ప్రతి దానికి ఒక విమర్శ ఒక అస్త్రం అనుకుంటారు !! జనం అమాయకంగా ఉంటారు అని నేను ఒప్పుకుంటా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు అలా అమాయకులు ఉండాలన్నదే చాలా మంది కోరిక. చాలా మంది రోజు వారీ కూలి చేసుకునే వారు డబ్బు ఇంటిదాకా పట్టుకెళ్లే వాళ్ళు ఎంత మంది? సగం మంది మద్యం త్రాగటానికి వెళ్తుంటారు. కాదు అని వాదించకండి. రుజువులు చూపించి మాట్లాడగలను. అసలు అటువంటి వారు సగం ఏడుస్తూ ఉండి ఉండచ్చు చేతిలో నగదు లేదని మద్యం దొరకట్లేదని. ఇలా మద్య వ్యాపారాలు, చిట్టీ వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు, మాత మార్పిడి చేసే వారు, సోషల్ వర్కర్లము అంటూ వేరే దేశాల నుంచి డబ్బు తెచ్చుకొనే వారు, ఓట్ల కోసం నోట్లు పంచే నాయకులూ చాలా మంది కోరుకునేది ఈ పేదవారు అమాయకులు ఉండాలన్నదే. ఈ పేదవారు తెలివిగల వాళ్ళు అవుతే వీళ్ళ గతి ఏంటి ? మీరు మాలాంటి వారిని , మోడీని కాదు విమర్శించాల్సింది అని తెలుసుకోండి. కష్టపడటం అంటే ఏంటో నాకు తెల్సు. ఏ వాదన చేయాలో తెలీక వ్యక్తిగత దూషణ చేసేవారితో వాదిస్తున్నాను అని కూడా తెల్సు. కడుపులో చల్ల కదలకుండా మాట్లాడుతున్నది నేను మాత్రం కాదు.

      Delete
    2. కెన్యాలో ఫోనే పర్సు
      మొబైల్‌ మనీలో ప్రపంచంలోనే అగ్రస్థానం

      ఇంటి నుంచి బయటకు అడుగు తీస్తే చాలు.. జేబులో సరిపడా డబ్బులున్నాయో లేదో చూసుకుంటాం. ఎందుకైనా మంచిదని డెబిట్‌, క్రెడిట్‌ కార్డులూ పర్సులో పెట్టుకుని బయలుదేరుతాం. కానీ... మన కంటే పేద దేశమైన కెన్యాలో ప్రజలు అవేమీ చూసుకోరు. అంతేకాదు, బ్యాంకు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూడడం.. బ్యాంకు పనివేళలు ముగిసేముందే అక్కడికి చేరుకుని తమ పని పూర్తిచేయాలనే ఆరాటం ఏవీ వారికి ఉండవు. తమ ఫోన్‌ ఉంటే చాలు.. జేబులో చిల్లిగవ్వ లేకున్నా ఇంటి నుంచి ధైర్యంగా బయటకొచ్చేస్తారు. ఫోనే వారికి కొండంత అండ.

      కెన్యా.. ఆఫ్రికాలోని చిన్న దేశం. జనాభాపరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ కంటే చిన్నదే. 42 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువనే జీవనం సాగిస్తున్నారు. ప్రజల్లో మూడొంతుల మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు.. కానీ, నగదు రహిత జీవనానికి వచ్చేసరికి కెన్యా ప్రపంచదేశాలకే ఆదర్శంగా నిలుస్తోంది.

      జేబులో డబ్బన్నది లేకుండా కేవలం సాధారణ ఫోన్‌తోనే ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టేస్తారు వారు. కొనుగోలు చేసిన వస్తువులకు డబ్బు చెల్లించాలన్నా, ఎవరికైనా డబ్బు పంపించాలన్నా, ఎవరి నుంచైనా డబ్బు తీసుకోవాలన్నా ఫోనే ఆధారం. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్ల అవసరం లేకుండానే ఇదంతా సాధ్యమవుతోంది. దీంతో డిజిటల్‌ అక్షరాస్యత పెద్దగా లేనివారు, గ్రామీణులూ సులభంగానే తమ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించగలుగుతున్నారు.

      ఎలా సాధ్యమైంది..?
      చాలా అభివృద్ధి చెందిన దేశాలకూ అందనంత దూరంలో ఉన్న సంపూర్ణ నగదు రహిత లావాదేవీల లక్ష్యం కెన్యాలో సుసాధ్యం కావడానికి కారణం ఎం-పెసా. మన దేశంలో రెండో స్థానంలో ఉన్న టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ సంస్థ తీసుకొచ్చిన విప్లవమే ఎం-పెసా. 2007 ఏప్రిల్‌లో వొడాఫోన్‌ ప్రవేశపెట్టిన ఎం-పెసా కెన్యాను పదేళ్ల కాలంలోనే నగదు రహిత కార్యకలాపాల దేశంగా మార్చేసింది.

      ఎం-పెసా అందుబాటులోకి రాకముందు కెన్యాలో 25 శాతం మంది మాత్రమే అడపాదడపా ఇలా మొబైల్‌ ఆధారిత ఆర్థిక లావాదేవీలు జరిపేవారు. కానీ, 2014కి వచ్చేసరికి అది 75 శాతానికి చేరింది. 2016లో అది దాదాపుగా 100 శాతానికి చేరువైంది.

      కెన్యా చుట్టుపక్కలా..
      లెక్కలేనన్ని శాఖలు, విస్తృతమైన ఏటీఎం వ్యవస్థ, నగదు జమ యంత్రాలు అన్నీ ఉన్న బ్యాంకులు కంటే సమర్థంగా, వేగవంతంగా ఈ ఎం-పెసా వ్యవస్థ కెన్యా ప్రజలకు సేవలందిస్తోంది. కెన్యా అనుభవాలతో ఆ చుట్టుపక్కలున్న బురుండి, అంగోలా, ఎరిత్రియా, గాంబియా, సెంట్రల్‌ ఆఫ్రికా వంటి సబ్‌ సహారా దేశాల్లోనూ ఇది విస్తరిస్తోంది.

      * ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ ఆధారిత లావాదేవీలు కేవలం 3 శాతమే ఉండగా సబ్‌ సహారా దేశాలన్నిట్లో సుమారు 20 శాతం ఉంది.

      * ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో బ్యాంకు ఖాతాల కంటే మొబైల్‌ మనీ ఖాతాలు అధికంగా ఉన్నాయి. అందులో 17 దేశాలు ఆఫ్రికా ఖండంలోనివే. వీటితో పాటు దక్షిణ అమెరికాలోని పరాగ్వేలో మాత్రమే బ్యాంకు ఖాతాల కంటే మొబైల్‌ మనీ ఖాతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.

      * అయితే, ఆఫ్రికాలోనే టాంజానియా, దక్షిణాఫ్రికా, ఉగాండా వంటిచోట్ల కెన్యాతోపాటే మొదలైనా అక్కడ విజయవంతం కాలేదు. ఈ ఏడాది జూన్‌లో దక్షిణాఫ్రికాలో సేవల నుంచి ఎం-పెసా వైదొలిగింది.

      పదేళ్లలో ఎంతో మార్పు..
      * ఎం-పెసా రాకముందు కెన్యాలో 43 శాతం ప్రజల వద్దే మొబైల్‌ ఫోన్లు ఉండేవి. ఇప్పుడు 85 శాతం ప్రజలు వినియోగిస్తున్నారు.
      * కెన్యాలోని వయోజనుల సంఖ్య కంటే మొబైల్‌ మనీ ఖాతాల సంఖ్య ఎక్కువ.
      * 3.3 కోట్ల మొబైల్‌ ఫోన్లు ఉండగా 2.7 కోట్ల ఎం-పెసా ఖాతాలున్నాయి.
      * ఈ సౌకర్యం కారణంగా అక్కడి గ్రామీణ ప్రజలకు ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు చాలా పరిమితంగా ఉండడంతో ఇంతకుముందు వారు బ్యాంకు పనుల కోసం పట్టణాలకు వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడు ఆ సమయం, ఖర్చూ ఆదా అవుతోంది.

      అక్రమాలకు అవకాశం లేకుండా..
      ఎన్నో సౌకర్యాలున్న ఈ నగదు రహిత వ్యవస్థలో అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా కొన్ని పరిమితులున్నాయి. చెల్లింపులు, బదిలీలకు గరిష్ఠ పరిమితులు విధించారు.

      అక్షరాస్యతే అండగా..
      కెన్యా ఆర్థికంగా బలహీనమైన దేశమే అయినా అక్కడ అక్షరాస్యత శాతం అధికం. యువతలో 85 శాతం మంది విద్యావంతులు. అంతేకాదు.. ఏటా పాఠశాలల్లో చేరేవారి సంఖ్య 90 శాతంపైనే. అక్షరాస్యత కారణంగా వారు ఇలాంటి సేవలను సులభంగా వినియోగించుకోగలుగుతున్నారు.
      మహిళా సాధికారతను తీసుకొచ్చింది..
      కెన్యాలో మొబైల్‌ మనీ విప్లవంతో మహిళా సాధికారతా సాధ్యమైంది. ఇంతకుముందు గ్రామీణ మహిళలు బ్యాంకు పనులకు వెళ్లాలంటే కుటుంబసభ్యులపైనో, ఇతర గ్రామస్థులపైనో ఆధారపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు వారు తమ ఇంటి నుంచే సులభంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
      కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా ప్రారంభించి..
      వొడాఫోన్‌ తన కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా కెన్యాలో ఎం-పెసాను ప్రారంభించింది. స్థానిక మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ సఫారీకాంతో కలిసి ప్రజలకు బ్యాంకింగ్‌ తరహా సేవలు అందించేందుకు మొదలుపెట్టిన ఇది విజయవంతమైంది.

      Delete
    3. ఎం-పెసా వ్యవస్థతో ఏమేం చేయొచ్చు..
      * బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వేయడం, ఖాతా నుంచి డబ్బులు తీయడం దీంతో పూర్తిచేయొచ్చు.
      * ఖాతాల మధ్య డబ్బు బదిలీ చేయొచ్చు. ఎం-పెసాతో అనుసంధానించని ఖాతాలకూ డబ్బు పంపించొచ్చు.
      * కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపులు
      * బిల్లులు కట్టడం
      * ప్రతి లావాదేవీకీ వినియోగదారుడికి వెనువెంటనే సంక్షిప్త సందేశాలు వస్తాయి.
      * ఈ పనులన్నీ పూర్తిచేయడానికి వీలుగా కెన్యావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఏజెంట్లను నియమించుకుంది ఎం-పెసా. బ్యాంకు ఖాతాకు డబ్బు జమ చేయడానికి ఎం-పెసాలో సంబంధింత లావాదేవీ పూర్తి చేస్తే చాలు ఏజెంటు వచ్చి నగదు తీసుకెళ్తాడు. ఖాతా నుంచి డబ్బు తీసుకోవాలన్నా మొబైల్‌ ద్వారా సందేశమిస్తే ఏజెంట్లు నగదు అందించి వెళ్తారు.

      * ఖాతాల మధ్య నగదు బదిలీలకు, చెల్లింపులకు ఏజెంట్ల అవసరం ఉండదు. కేవలం జమ చేయడానికి, డబ్బు తీసుకోవడానికి మాత్రమే వీరి అవసరం ఉంటుంది.
      * ఈ తరహా లావాదేవీల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడం, నేర్పించడం కూడా వీరి బాధ్యతే.
      * ఎంపెసాకు అనుబంధంగా వడ్డీ వచ్చే ఖాతాలూ తెరవొచ్చు.
      * ఎం-స్వారీ పేరుతో రుణాలూ ఇస్తున్నారు.
      * క్రెడిట్‌కార్డుల్లా ముందస్తుగా డబ్బులు తీసుకోవడం, ఖాతాలో డబ్బు లేకున్నా కొనుగోళ్లు జరిపే వెసులుబాట్లూ ఉన్నాయి. నియమిత కాలంలో తిరిగి చెల్లించకపోతే స్వల్ప వడ్డీ విధిస్తారు.

      Delete
    4. ఎం-పెసా వ్యవస్థతో ఏమేం చేయొచ్చు..
      * బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వేయడం, ఖాతా నుంచి డబ్బులు తీయడం దీంతో పూర్తిచేయొచ్చు.
      * ఖాతాల మధ్య డబ్బు బదిలీ చేయొచ్చు. ఎం-పెసాతో అనుసంధానించని ఖాతాలకూ డబ్బు పంపించొచ్చు.
      * కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపులు
      * బిల్లులు కట్టడం
      * ప్రతి లావాదేవీకీ వినియోగదారుడికి వెనువెంటనే సంక్షిప్త సందేశాలు వస్తాయి.
      * ఈ పనులన్నీ పూర్తిచేయడానికి వీలుగా కెన్యావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఏజెంట్లను నియమించుకుంది ఎం-పెసా. బ్యాంకు ఖాతాకు డబ్బు జమ చేయడానికి ఎం-పెసాలో సంబంధింత లావాదేవీ పూర్తి చేస్తే చాలు ఏజెంటు వచ్చి నగదు తీసుకెళ్తాడు. ఖాతా నుంచి డబ్బు తీసుకోవాలన్నా మొబైల్‌ ద్వారా సందేశమిస్తే ఏజెంట్లు నగదు అందించి వెళ్తారు.

      * ఖాతాల మధ్య నగదు బదిలీలకు, చెల్లింపులకు ఏజెంట్ల అవసరం ఉండదు. కేవలం జమ చేయడానికి, డబ్బు తీసుకోవడానికి మాత్రమే వీరి అవసరం ఉంటుంది.
      * ఈ తరహా లావాదేవీల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడం, నేర్పించడం కూడా వీరి బాధ్యతే.
      * ఎంపెసాకు అనుబంధంగా వడ్డీ వచ్చే ఖాతాలూ తెరవొచ్చు.
      * ఎం-స్వారీ పేరుతో రుణాలూ ఇస్తున్నారు.
      * క్రెడిట్‌కార్డుల్లా ముందస్తుగా డబ్బులు తీసుకోవడం, ఖాతాలో డబ్బు లేకున్నా కొనుగోళ్లు జరిపే వెసులుబాట్లూ ఉన్నాయి. నియమిత కాలంలో తిరిగి చెల్లించకపోతే స్వల్ప వడ్డీ విధిస్తారు

      Delete
  16. ఇది మాత్రం నిజం. ఏదైనా మనం చూసే కళ్ళను బట్టే వుంటుంది. మనకేదైనా ఫోబియా వుంటే ఆ ఫోబియాని మరింత పెంచుకునేందుకే మన పోస్టింగులుంటాయి. వ్యవస్థలో లోపాలని ఆధారం చేసుకుని వ్యాపారస్తులు, అడ్డమైన సంపాదనపరులు హ్యాక్ చేసి కోట్లు కొల్లగొట్టడం, నకిలీనోట్లతో ఆర్థిక వ్యవస్థని హ్యాక్ చేయడం అనేది ఇన్నాళ్ళూ జరుగుతున్నా తెలుసుకోలేని అమాయకులు ఫోన్లో ప్యాస్ వర్డ్ చెప్పడం, హ్యాక్ చేయబడడం సాధారణ విషయమే. ఈ చర్యని అమలు చేయడంలో లోపాలు అనేకం వున్నాయి. కానీ, అవే వున్నాయి, అవి తప్పితే ఏమీ లేదనడమే నిజమైన కుట్ర. దీన్ని ఒక యుద్ధంగా భావించి ప్రక్కవాడిని ఎన్ లైటెన్ చేయడం మానేసి గాంధీజయంతి రోజున కోడికూర తిని ప్రాయశ్చిత్తంగా ఒక సంవత్సరంపాటు చికెన్ మానేస్తానని ప్రతిజ్ఞ చేసిన నారాయణ లాగా పరమ నెగెటివ్ యాటిట్యూడ్ తో పిచ్చ స్టేట్ మెంట్లు ఇస్తేనే చిక్కులు వస్తాయి. విలువ వుండాల్సింది డబ్బులకు కాదు, మనిషి తత్త్వానికి అన్నది ప్రజలకు తెలుస్తున్నదని, నోట్లు చెల్లకుండా పోయిన కొన్ని గ్రామాలలోని ప్రజలంతా ఏకమయి తమ పనులన్నీ సమష్టిగా చేసుకుంటున్నారన్న వార్తలు చెబుతున్నాయి. దాదాపు నలభై శాతం పైగా పడిపోయిన మద్యం అమ్మకాలు చెబుతున్నాయి.
    నోటుకు కాదు మాటకి, మనిషికి అన్నది ఈ విధంగానైనా సాధ్యమవుతున్నందుకు మనం సంతోషించాలి.

    ReplyDelete
    Replies
    1. ఒక్కసారి గూగిలించి చూడు.. భారతదేశం అక్షరాస్యత ఎంత(అ, ఆ లు రాగానే అక్షరాసులైపొయ్యారని మన నాయకుల్లా అంటే నేనేం చెయ్యలేను)? వాళ్ళలో స్మార్ట్ ఫోన్ వినియూగించేది ఎంతమంది? పాటలు, సినిమాలు చూడదం తప్ప ఇంకేం రాని వాల్లెంతమంది? వొచ్చిన వాళ్ళెంతమంది? తండాల్లో వండేవాల్లెంతమంది, అడవుల్లో, పల్లెల్లో వుండేవాల్లెంతమంది? అస్సలు మీఇంత్లో, మీ పల్లెలో మీ బట్టలుతికేవాడికి, కూరగాయలమ్మే అమ్మకి, పాలేసే అన్నకి ఎన్ని ఎంతమందికి మొబైల్ పేమెంట్ తెలుసు, ఎంతమంది వాడుతున్నారో లెక్కవేసి అప్పుడూ మాట్లాడు. తమ్ముడు మనవాడే కదా, వాడేం చేసినా ధర్మమే అని వాదించకు

      Delete
    2. క్యాష్ మొత్తం తీసేస్తారని ఎవడైనా చెప్పాడా? లెస్ క్యాష్ సొసైటీ వైపుకు తీసుకువెళ్ళాలని చెప్పడంలేదా? మొత్తం మొబైల్ పేమెంటే జరుగుతుందని నీకు చెప్పిందెవడు? దేశంలో రోజుకి 50 రూపాయలకంటే ఎక్కువ ఆదాయం వున్నవాళ్ళెందరో గూగుల్లో చూడు. వాళ్ళందరి దగ్గరా 500 రూ., 1000 రూ. నోట్లుె కట్టలు కట్టలుగా వున్నాయా? ఉన్న క్రీమీలేయర్ ఎటిెఎమ్ గాళ్ళందరూ అంతా నీ తమ్ముళ్ళే అనుకుని వెనకేసుకుని వాళ్ళ నోట్ల కోసం వీళ్ళని మధ్యలో తీసుకు రాకు. మొత్తం జనాభాలో ట్యాక్సుల కడుతుంది 1 శాతమే. అది నీకు తెలియదా? ఆ లెక్క ప్రకారం ఈ క్యూల్లో నిలుచున్నవాళ్ళందరూ నీ దృష్టిలో పేదవాళ్లా?
      తండాల్లో వండేవాల్లెంతమంది, అడవుల్లో, పల్లెల్లో వుండేవాల్లెంతమంది? అస్సలు మీఇంత్లో, మీ పల్లెలో మీ బట్టలుతికేవాడికి, కూరగాయలమ్మే అమ్మకి, పాలేసే అన్నకి, వీళ్లందరికీ 500, 1000 నోట్లు వచ్చేటంత ఆదాయం వుందా?

      Delete
    3. >>లెస్ క్యాష్ సొసైటీ వైపుకు తీసుకువెళ్ళాలని చెప్పడంలేదా?
      మోడీ కాష్ లెస్స్ అంటే వీడు లెస్స్ కాష్ అని ఎంతబాగా మార్చేశాడో.

      >>వీళ్లందరికీ 500, 1000 నోట్లు వచ్చేటంత ఆదాయం వుందా?
      నీ ఆస్థానంలో నువ్విచ్చేది పావలా అర్ద్రూపయేమోగాని, 10,20 మందికి పని చేసి పెడుతూ ఒక్కొక్కలు తక్కువలో తక్కువ 10 వేలు సంపాదించుకుంటూన్నారు. మాదగ్గర ఆ సంస్థానాలు లెవ్వుబాబూ. బ్రిటీష్ వడి వల్ల జరిగిన తక్కువ మంచిపనులు ఏవైతె వున్నయో వటీల్లో ఒకటి రాచరికం అంతం. మోడీని రాజుని చేసి మళ్ళీ దెశాన్ని ఓ నాలుగైదొందలు వెనక్కి తీసుకెల్లి , నీ సంస్థానాల్ని మళ్ళీ పునరద్దరించుకోని, జనాలకి పావలా అర్ధా ఇచ్చి, కొండకచో అస్సలు ఇవ్వకునండా పనిచేపించుకోవాలనుకుటున్నావా ఎర్రినాగన్నా?

      Delete
    4. >>వాళ్ళ నోట్ల కోసం వీళ్ళని మధ్యలో తీసుకు రాకు.

      lol.. రాసుకో చిన్నా! ఇంకో ఎలక్షన్ ఏదైనా రానివ్వు, మళ్ళీ ఇంకో సర్జికల్ స్ట్రైక్ అంటూ ముందుకు రాకపోతే చూడు

      Delete
    5. మార్చింది, మొరిగేదీ ఎవడో తెలుస్తూనే వుంది.
      ఒక్కొక్కరూ పది, ఇరవై వేలూ సంపాదిస్తే ఈ దేశంలో రోజూ 50 రూ.ల కంటే తక్కువ ఆదాయం వున్నర గ్రామీణుల సంఖ్య కోట్లలో ఎలా వుంటుంది? ఇవి నా లెక్కలు కాదు. నీ ప్రగతిశీల పత్రికల లెక్కలే. నీకు బ్రిటిష్ వాడి పాలనో, అమెరికా వాడి పాలనో కావాలంటే డైరెక్టుగా అడగొచ్చుగా పిచ్చి ఎంకన్నా? విషయాన్ని ప్రక్కదోవ పట్టిస్తావెందుకు ఎర్రి పప్పా?
      బర్మా సర్జికల్ స్ట్రైక్ కు ముందు ఏ ఎన్నికలు వచ్చాయి LOL Head?

      Delete
  17. Rajiv Malhotra In Conversation With General GD Bakshi
    https://www.youtube.com/watch?v=4W3kmjNG_K8&t=260s

    ReplyDelete
  18. @చంద్రిక! చుట్టూ జనాలు ఎడ్యుకేట్ చెయ్యడమేంటి? ప్రభుత్వం ఇలా తలా తోకా లేని డెషిషన్లు తీసుకోని, జనాలు ఒకళ్ళకొకళ్ళు ఎడుకేట్ చేసుకోలేదు కాబట్టి మా భాద్యత లేదు అంటే సరిపోతుందా?? ఒక అనాలోచిత చర్యని సమర్ధించడానికి పనికట్టుకోని తప్పు జనాలమీద ఎందుకు రుద్దుతారు? మిగితావాళ్ళు సరే, మీరెంతమంది కూలీలని, చదువులేనివాళ్ళని ఎడుకేట్ చేసి బాంకు ఖాతాలు తెరిపించారు?

    రేపు పే టి యం సేవలకు చార్జి చేయడం మొదలుపెడితే, గవర్నమెంటు పూనుకోని, అవి లేకుండా చెయ్యగలదా? లేదూ అవి హాక్ ఐతే భాద్యత గవర్నమెంటూ తీసుకుంటుందా? అంతెందుకు, ఇకనుంచి తిరపతి వెళ్ళి దక్షినగా కార్డు స్వైప్ చెయ్యొచ్చా? మోండా మార్కెట్టుకు పొయి రూపాయి కరివెపాకు కొని, పేటియం నంబర్ అడిగేద్దామా?

    6 నెలల క్రితమే నోట్లు ప్రింట్ మొదలుపెట్టామని చెప్పే ఈ గవర్నమెంట్ గాని, దాన్ని గుడ్డిగా నమ్మే జనాలుగాని, అప్పటి రిజర్వ్ బాంక్ గవర్నర్ సంతకం నోట్లమీదెందుకు లేదని అలోచించలేరెందుకని?

    ఇంతకంటే ప్రూఫ్ అవసరమా ఇది ప్రి ప్లాండ్ కాదని చెప్పడానికి? ఇంకా సిగ్గు! ఆర్ధికమంత్రిని కూడా భయటకు పంపేసి మరీ 30 నిమిషాల్లో డెషిషన్లు తీసుకుంటూన్నారు. ఇనొతటీదానికి మంత్రులు, వాళ్ళకి జీతాలు, సెక్యురిటీలు ఎందుకు? అన్నీ శాఖలు మోడీ దగ్గరే పెట్టుకుంటే దెశానికి కాస్తయినా డబ్బులు మిగులుతాయి.

    ఇక దీన్ని తప్పన్నవాళ్ళందిరినీ నాయకులు పెద్దనొట్ల రద్దుకుకి వ్యతిరెకులని ఏకి పారెస్తున్నారు.ఇలాంటీ బుర్ర లేని వాళ్ళంతా అధికారంలోవుంటే మన దేశం సర్వనాశనం కాకుండా ఇంకేమౌతుంది? వీళ్ళకన్నా కాంగెయులు నయ్యం, తిన్ననదా తిని వాళ్ళ బొక్కసాల్లో దాచుకున్నారు, వీళ్ళు మాత్రం తల తోక లేని పనులు చేస్తూ జనాల్ని ఎర్రెదవల్ని చేసి రొడ్లెంట పరిగెత్తిస్తున్నారు.

    ReplyDelete
  19. >>ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో బ్యాంకు ఖాతాల కంటే మొబైల్‌ మనీ ఖాతాలు అధికంగా ఉన్నాయి. అందులో 17 దేశాలు ఆఫ్రికా ఖండంలోనివే.

    వాళ్ళంతా కూడ యే గ్రౌండ్ వర్క్ చెయ్యకుండా మూర్ఖంగా ఒక్క సాయంకాలం కూర్చోని దేశాన్ని మార్చేసుకున్నారా????

    ReplyDelete
    Replies
    1. వాళ్ళు చేసిన గ్రౌఃండ్ వర్క్, ఈ ప్రభుత్వం చేయని గ్రౌండ్ వర్క్ నీకేమైనా తెలుసా? మూర్ఖంగా ఈ ప్రభుత్వం చేసే ప్రతదానినీ వ్యతిరేకించడమే మూర్ఖాగ్రేసరుల పని. ః
      ఒక్క సాయంకాలంలోనే మార్చేస్తానని ఎవడైనా నీకు చెప్పాడా?
      నందన్ నీలేకనీ బర్ఖాదత్ కి ఇచ్చిన ఇంటర్యూ చూడు. ఇదెంత సరైన పనో నీకు అర్థమవుతుంది.

      Delete
    2. ఏమాత్రం గ్రౌండ్ వర్క్ చెయ్యలేదని ప్రూఫ్ ఇదిగో..

      6 నెలల క్రితమే నోట్లు ప్రింట్ మొదలుపెట్టామని చెప్పే ఈ గవర్నమెంట్ గాని, దాన్ని గుడ్డిగా నమ్మే జనాలుగాని, అప్పటి రిజర్వ్ బాంక్ గవర్నర్ సంతకం నోట్లమీదెందుకు లేదని అలోచించలేరెందుకని?

      నీ దగ్గర ఏం ప్రూఫ్ వుందో చూపించు.

      Delete
    3. ఉర్జిత్ ని గవర్నర్ చెయ్యాలని అప్పుటికే నిర్ణయించుకోని అతని సంతకమే తీసుకోని వుంటారు. ఇందులో తప్పేంటి? అంతలా మొడీ మీద పడి చస్తారెందుకు?

      Delete
    4. దానికీ దీనికీ ఏం సంబంధం? నోట్లు ప్రింట్ చేసిి వెంటనే ప్రతి నోటునీ మార్చి యిస్తే నల్లధనం, దొంగనోట్ల సమస్య తీరుతుందా? అంచెలంచెలుగా ఇవ్వాలని ఎకనమిక్స్ చదువుకుంటే తెలుస్తుంది. ఇంతకు ముందే నీకు చెప్పాను, లోపాలు వెదకడంకోసమే అడగడం మొదలుపెడితే పరిశుద్ధాత్మలు ఎవ్వరూ మిగలరు. ఈ పేజీలోనే వున్న సమాచారమంతా చదివితే ప్రభుత్వం ఎంత గ్రౌండ్ వర్క్ చేసిందో నీకు అర్థమవుతుంది. ఇక్కడ సమస్య మోడీ కాదు, ఈ డీమానిటైజేషన్ని మోడీ ఫోబియాతో వ్యతిరేకిస్తున్న కమ్మీలు, దళ్ళీలు, కాంగీలది. మాకు హక్కులే తప్ప బాధ్యతలు లేవనే నయా ప్రగతిశీల వాదులది.
      ముందు కెన్యా గవర్నమెంట్ ప్రూఫ్ ఏదో నీవు చూపిస్తే ఇక్కడ గవర్నమెంట్ చేసిందా, చేయలేదా చెప్పొచ్చు. మేం ఇచ్చిన సమాచారంలో బొక్కలు వెదకడం కాదు. నీకేదైనా తెలిస్తే అధి చెప్పు.

      Delete
    5. >>దానికీ దీనికీ ఏం సంబంధం?
      ఆరు నెలల క్రితమే ప్రింటింగ్ మొదలు పెట్టామన్నారు మరి అప్పటీ గవర్నర్ సంతకం అవసరంలేదు, రాబొయే గవర్నర్ పెట్టొచ్చు అని మా ఎకనమిక్స్లోనైతే చెప్పలేదు. నీ ఎకనమిక్స్ బొక్స్ ఎక్కడ కొంటావో చెబితే, అక్కడీకెల్లి మేము కూడా ఒకటి తెచ్చుకోని మోడీ ఉన్నంతకాలం ఫాలో ఔతాం

      >>అంచెలంచెలుగా ఇవ్వాలని

      బియ్యం కొనడానికి మార్కెట్కెల్లి అంచెలంచెలుగా డబ్బులిస్తాం, మాఎకసెక్కానమిక్స్ అంతే చెప్పిందని చెప్పి చూడు.

      >>లోపాలు వెదకడంకోసమే అడగడం మొదలుపెడితే పరిశుద్ధాత్మలు ఎవ్వరూ మిగలరు.

      అద్భుతమైన తుర్ముఖాన్వి.. సాహో సాహో. ఇంకేం.. జైల్లన్నీ ఖాలీ చేపించి వాళ్ళందర్నీ పరిషుద్దలని డిక్లేర్ చెసేద్దాం. హబ్బ..హబ్బా.. మొడీ వొచ్చాక.. నీ బుర్రెంత బాగైపొయిందో. ఇంటికెల్లగానే దిష్టి తీపించు

      >>ఈ పేజీలోనే వున్న సమాచారమంతా చదివితే ప్రభుత్వం ఎంత గ్రౌండ్ వర్క్ చేసిందో నీకు అర్థమవుతుంది

      రెందు రెళ్ళు ఆరు అనిలెక్కేసే మా ఆర్ధికమంత్రి మాకోద్దు. ఇది సాక్షాత్ నోరుంది కదా, శత్రువుల మీద ఎగదొయ్యటానికి పనికొస్తాడు అని మీ భుజాలమీదకెక్కించుకున్న లీడరు మాటలు.

      నువ్వీ పేజంతా మళ్ళీ తిరగదిప్పి మరగదిప్పి నమిలేసినా, మోడీ చేసిన పిచ్చపని లెఖ్ఖలు.. అద్భుతదీపం పట్టుకోని ఊర్చున్నాడని మీ కీర్తన్లు తప్ప ఇంకేం కనిపించవ్.

      >>మేం ఇచ్చిన సమాచారంలో బొక్కలు వెదకడం కాదు. నీకేదైనా తెలిస్తే అధి చెప్పు.
      ఎంటీ, లెఖ్ఖలు చెబుతున్నాడా, అందరూ వినపడకుండా, కనపడకుండా అన్నీ మూసుకొండొర్రో తొందరగా.. మళ్ళీ మనగుంపంతా కలిసిపొయ్యాక కేకలు అరుపులతో వినపడకుండా చెయ్యొచ్చు


      Delete
  20. @"""ఎలా సాధ్యమైంది..?
    చాలా అభివృద్ధి చెందిన దేశాలకూ అందనంత దూరంలో ఉన్న సంపూర్ణ నగదు రహిత లావాదేవీల లక్ష్యం కెన్యాలో సుసాధ్యం కావడానికి కారణం ఎం-పెసా. మన దేశంలో రెండో స్థానంలో ఉన్న టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ సంస్థ తీసుకొచ్చిన విప్లవమే ఎం-పెసా. 2007 ఏప్రిల్‌లో వొడాఫోన్‌ ప్రవేశపెట్టిన ఎం-పెసా కెన్యాను పదేళ్ల కాలంలోనే నగదు రహిత కార్యకలాపాల దేశంగా మార్చేసింది.""

    ఒక పేదదేశం నుంచి ఈ మాత్రం మనం నేర్చుకోలేకపోయాం. మార్పనేది గ్రాడ్యువల్ గా జరిగితేనే నిలబడుతుంది. చాయ్ కాసినంత సేపట్లో జరగాలి అంటే అది వాపుకి దారి తీస్తుంది.

    ReplyDelete
    Replies
    1. @????
      మార్పనేది గ్రాడ్యువల్ గా గాక వెంటనే వస్తుందని చెప్పిన బాగ్లో పాత్ ఎవడు?
      చాయ్ కాసిన వాడే కమ్మీల, దళ్ళీల, కాంగీలని కుళ్ళబొడిచింది. ఇటలీ నుండి దిగుమతి చేసుకున్న నాయకత్వం బెంజికారుల్లో వెళ్ళి ఎటిఎమ్ ల లైన్లో నిలబడినప్పుడే మన బ్రతుకు అర్థమైంది.
      డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలియని ఫోబియాగాళ్ళ వ్రాతల వల్లే బ్లాగు లోకం భ్రష్టుపట్టేది.

      '''''Teviolare

      Delete
    2. బార్ గర్ల్ అని సోనియా గాంధీ ని ఎగతాలి చేసిన ఈ తొప్పెంగాళ్ళు డిగినిటీ ఆఫ్ లేబర్రె ల గురించి మాట్ళాడుతుంటే తెగ నవ్వొస్తుంది

      Delete
    3. ఖూన్ కీ దలాలీ అని ఎగతాళి చేసిన ఈ తొక్కగాళ్ళు చాయ్ గురించి మాట్లాడుతుంటే ఇంకా నవ్వొస్తుంది.

      Delete
    4. >>మార్పనేది గ్రాడ్యువల్ గా గాక వెంటనే వస్తుందని చెప్పిన బాగ్లో పాత్ ఎవడు?

      not any blog path but ur God modi and his disciples like u

      Delete
  21. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కి ఒక గొప్ప సమాధానం.

    http://naidu9962.blogspot.in/2016/11/blog-post_29.html?showComment=1480599708107#c6868331218457876655

    ఏది అరాచకం ?
    ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ‘కొత్త పలుకు’ శీర్షికన ‘ఇంత అరాచాకమా? పేరిటి రాసిన ఎడిటోరియల్ చదివాకా, ఆయన అభిప్రాయాలకు, ప్రశ్నలకు నా సమాధానాలు... నా అభిప్రాయాలలోకి వెళ్లేముందు, నేను ప్రధాని తీసుకున్న నిర్ణయానికి మద్దతుదారుణ్ణే కానీ, ప్రధానికి గానీ, ఆయన పార్టీకి గానీ మద్దతు దారున్ని కాదు. ఇక రాధాకృష్ణ గారు వేసిన ప్రశ్నలకు నాలాంటి అతి సామాన్య దిగువ స్థాయి వ్యక్తులు కూడా సమాధానాలు చెప్పగలరనే ఉద్దేశ్యంతోనే ఈ సమాధానాలు చెప్పే ప్రయత్నం. ఆయన గారి అభిప్రాయాలు...నా సమాధానాలు

    1. ప్రత్యామ్నాయ నోట్లను అందించకుండా నీ దగ్గర ఉన్న నోటు ఇక నుంచి చెల్లదు అని ప్రకటించే అధికారం ప్రధానమంత్రికి ఉందా?
    • ఏ నోటుకు ప్రత్యామ్నాయం? ఏ నోటు చెల్లకుండా పోయింది? ఆధాయ పన్ను ఎగేసిన నల్ల నోటుకా? న్యాయబద్దమైన నోటు మార్పిడికి అవకాశం ఉంది కదా! మన దగ్గర అన్ని రూపాలలో పోగేసిన చట్టబద్దత లేని డబ్బుకంతా ప్రత్యామ్నాయం అడుగటం సమంజమేనా?

    2. అటు ప్రధాని ఇటు ప్రజలు కంటతడి పెట్టుకుంటూ ఉంటే నల్లధనం మాత్రం నవ్వులు చిందిస్తోంది.
    • ప్రజలు ఇప్పుడు కొంత కష్టం కలిగి కంటతడి పెట్టుకుంటున్న మాట వాస్తవమే. ప్రజలతో పాటు ప్రధాని కూడా కంట తడిపెడుతున్నారు అని చెప్పినప్పుడు...ప్రజల ఏడుపులో(ఏ ప్రజలో ఇది మరో ప్రశ్న ) నిజాయితీని చూసిన రాధాకృష్ణ ప్రధాని ఏడుపులోని నిజాయితీని కూడా అంగీకరించినట్లే కదా!

    3. డబ్బున్న వాడిపై డబ్బు లేనివాడికి కోపం ఉండటం మనుషుల సైకాలజీ! అందుకే ప్రధాని నిర్ణయం వల్ల నల్లధనం ఉన్నవారు ‘చచ్చారు’ అని సామాన్య ప్రజలు కొందరు సంబరపడుతున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో తమకు ఎదురుకానున్న కష్టాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
    • అధికారంలో ఉన్న వాడిపై అధికారం లేని వాడికి కోపం ఉండటం రాజకీయనాయకుల సైకాలజీ అన్న మాటను RK అంగీకరిస్తాడా? డబ్బు ఉన్న వాడిపై డబ్బు లేని వాడు ఏడిస్తే (నల్ల ధనం ఉన్న వారు చచ్చారు అని ఏడ్చే వాళ్ళకు) భవిష్యత్తులో ఎదురు కాబోయే కష్టాలేమిటో పనిలో పనిగా సెలవిచ్చి ఉంటే మా బోటి అజ్ఞానులం కోందరమైనా మారే వాళ్ళమే. నల్ల ధనం ఉన్న వారు చచ్చారు అని సంబరపడి పోకండి అని హెచ్చరించడంలో RK ఎటు వైపో అర్థం కావటం లేదా? ఆ ధ్వనిలో అర్థం స్పష్టం కావటం లేదా?


    4. అవినీతి ఇవ్వాళ కొత్తగా పుట్టుకు వచ్చింది ఏమీ కాదు.
    • ....అంటే ఇది ఇలాగే ఉండాలా? అంతం ఉండొద్దా ?


    5. మన దేశ ఆర్థిక వ్యవస్థతో నల్లధనానికి విడదీయలేని బంధం ఉంది. నల్లధనం పుణ్యమా అనే పలు రంగాలు అభివృద్ధి చెందాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. దేశానికి, రాష్ర్టాలకు రాబడి పెరుగుతోంది. ప్రధానమంత్రి తాజా నిర్ణయం తర్వాత ఈ రంగం, ఆ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి.
    • ఈ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. అంతకు మించిన సిగ్గేస్తుంది. దేశానికి, రాష్ట్రాలకు రాబడి రావడమే ముఖ్యమా? వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందడమే ముఖ్యమా? అది ఏ రూపానా? ఏ మార్గానా? అన్నది అక్కరలేదా? అదే అవునైతే... ఇన్ని బడు లెందుకు? ఇంతమంది ఉపాధ్యాయులెందుకు? ఇన్నిన్ని జీతాలెందుకు? ఇన్ని నీతి సూత్రాలెందుకు? బడి ఉన్న ప్రతి చోటా ఓ సారా దుకాణమో! ఓ నల్ల మందు అంగడో! ఏ వ్యభిచార కొంపో! ప్రభుత్వాలు పెట్టుకుంటే రాబడి రాదా? పెట్టుబడి మిగిలిపోయి, రాబడులు పెరిగిపోయి ప్రభుత్వాలు ఇక అన్ని రంగాలను 3 పువ్వులేమి కర్మ 6 పువ్వులకు 90 కాయలు కాయించగలదు. దీనికి RK ఒప్పుకుంటాడా?


    ReplyDelete
  22. 6. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఒక్కసారిగా తమ ఆస్తుల విలువ పడిపోయిందని బాధపడుతున్న వారికి ఉపశమనం ఎవరు కలిగిస్తారో చెప్పాలి.
    • ఉన్న ఆస్తికి విలువ పడిపోయినప్పుడు, కొనదలచుకున్న ఆస్తి విలువ కూడా అంతే అన్న సత్యం బోధపడదా? ఇప్పుడు ఆస్తిపరులకు ఉపశమనం మాట సరే. ఆ మాత్రం ఆస్తి కూడా లేని పేదలకు ఇన్నాళ్ళు ఎవడైనా ఉపశమనం కలిగించాడా? అందులో శతాంశామైనా ఆస్తిని కూడ గట్టుకోగలమనే భరోసా ఇచ్చారా? “నల్లధనం ఉన్నవారు ‘చచ్చారు’ అని సామాన్య ప్రజలు కొందరు సంబరపడుతున్నారు” అని RK అనగాలిగాడంటే ఇప్పుడు ఆ పని ప్రధాని చేసినట్లే నని RK అంగీకరించగలడా?

    7. ఏ ఉద్దేశంతో 2000 రూపాయల నోట్లను ముద్రించారో చెప్పాలి.
    తాత్కాలిక నోట్ల సర్దుబాటుకు/మార్పిడి కని సామాన్యుడికి సైతం అర్థమైంది. RK కు అర్థం కాలేదంటే విడ్డూరమే. 4 ఐదు వందలకు 1 నోటు, 2 వేయి నోట్లకు 1 నోటుతో సర్దుబాటు చేయడం, ముద్రణకు, సరఫరాకు ఎంతో ఉపయోగపడుతుందనే. కాలక్రమేణా అంతర్ధాన మవుతుందని చెబుతున్నా అదే ప్రశ్న వేయడంలో అర్థమేమిటో వేసేవారికే తెలియాలి.


    8. దేశంలో ఇకపై నల్లధనం ఉండబోదని ప్రధానమంత్రి హామీ ఇవ్వగలరా?
    • ఇకపై ఉంటుంది కాబట్టి, ఇప్పుడూ ఉండనీయమనడమా దీనర్థం. నీతి మంతుడిని మాత్రమే కనగలనని ఏ తల్లైనా హామీ ఇవ్వగలదా? కనడం, నిజాయితీగా పెంచడం, కలలు కనే వరకే తన బాధ్యత. ఆ తరువాత ఏమవుతాడన్నది వాడి ప్రవర్తనే నిర్ణయిస్తుంది. ఏ తల్లైనా అవినీతి పరుడిగా కొడుకును పెంచాలని కలలు కంటుందా? అయినప్పటికీ ఈ దేశంలో ఇంత మంది అవినీతి కొడుకులు ఎలా తయారు కాగలిగారో అర్థం కావడం లేదా?


    9. ఇప్పుడు తాజాగా బంగారం కొనుగోళ్లపై కూడా పరిమితులు విధించాలని కేంద్ర
    ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మహిళలు తిరగబడతారు.

    *“అక్రమ సంపాదన పోగేసుకున్నవారెవ్వరూ తమ ఇళ్లలో నగదును సూట్‌కేసులలో దాచిపెట్టుకోరు. భూములు, భవనాలు, బంగారం, వజ్రాలపై పెట్టుబడులు పెడతారు.” అని అనే RK నే అట్లాంటి ఆస్తి విలువ తగ్గిందని ఒక చోట బాధపడుతాడు. ఆ నల్ల ధనంతో కొనే బంగారుపై ఆంక్షలు విదించొద్దని కోరుతాడు. ఇదేమి ద్వంద్వ నీతో అర్థం కాదు.


    10. పచ్చిగా చెప్పాలంటే తాను ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం విజయవంతం కాలేదన్న కోపంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కక్షతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు.
    • ఇందులో మొదటిది... అవకాశం ఇచ్చినవాడిది తప్పా? అది సద్వినియోగం చేసుకోలేని వాడిది తప్పా? రెండోది మొదటి దాని కన్న అర్థవంతమైనది. ఆవశ్యకమైనది.

    11. నల్లధనాన్ని నిజంగా అరికట్టాలన్న ఉద్దేశం ప్రధానమంత్రికి ఉంటే దుందుడుకు నిర్ణయాలు తీసుకునే బదులు ఆచరణ సాధ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి.
    • ఒక పత్రికాధినేతగా, ఛానెల్ అధిపతిగా ఆ ఉద్దేశ్యంలో నీకు భాగస్వామ్యం లేదా? నీవు, నీ తోటి అధిపతులు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పండి. ఆ ఆచరణ సాధ్యమైన నిర్ణయాలెంటో సూచించండి.


    12. పెద్ద నోట్ల రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం.
    • ఒక ఆర్ధిక నిపుణుడు రాజ్యంగా బద్దంగా ఈ దేశాన్ని 10 సంవత్సరాలు మౌనంగా ఏలిన కాలంలో, ఒక రాజ్యాంగేతర శక్తి తెరవెనుక నిర్ణయాలు తీసుకుంటుందని అప్పటి ప్రతిపక్షం ఏడ్చినప్పుడు ప్రశ్నించని మీడియాకు, రాజ్యంగ బద్దంగా ఎన్నికై ఏలుతున్నవాడు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే ఏక పక్షమని ఏడుస్తుందేం?


    ----ఎన్. జయన్న

    ReplyDelete
    Replies
    1. RK is parroting for KCR and other fraudsters!

      Delete
    2. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ‘కొత్త పలుకు’ శీర్షికన ‘ఇంత అరాచాకమా? పేరిటి రాసిన ఎడిటోరియల్ చదివాకా, ఆయన అభిప్రాయాలకు, ప్రశ్నలకు నా సమాధానాలు... నా అభిప్రాయాలలోకి వెళ్లేముందు, నేను ప్రధాని తీసుకున్న నిర్ణయానికి మద్దతుదారుణ్ణే కానీ, ప్రధానికి గానీ, ఆయన పార్టీకి గానీ మద్దతు దారున్ని కాదు. ఇక రాధాకృష్ణ గారు వేసిన ప్రశ్నలకు నాలాంటి అతి సామాన్య దిగువ స్థాయి వ్యక్తులు కూడా సమాధానాలు చెప్పగలరనే ఉద్దేశ్యంతోనే ఈ సమాధానాలు చెప్పే ప్రయత్నం. ఆయన గారి అభిప్రాయాలు...నా సమాధానాలు

      1. ప్రత్యామ్నాయ నోట్లను అందించకుండా నీ దగ్గర ఉన్న నోటు ఇక నుంచి చెల్లదు అని ప్రకటించే అధికారం ప్రధానమంత్రికి ఉందా?
      • ఏ నోటుకు ప్రత్యామ్నాయం? ఏ నోటు చెల్లకుండా పోయింది? ఆధాయ పన్ను ఎగేసిన నల్ల నోటుకా? న్యాయబద్దమైన నోటు మార్పిడికి అవకాశం ఉంది కదా! మన దగ్గర అన్ని రూపాలలో పోగేసిన చట్టబద్దత లేని డబ్బుకంతా ప్రత్యామ్నాయం అడుగటం సమంజమేనా?

      2. అటు ప్రధాని ఇటు ప్రజలు కంటతడి పెట్టుకుంటూ ఉంటే నల్లధనం మాత్రం నవ్వులు చిందిస్తోంది.
      • ప్రజలు ఇప్పుడు కొంత కష్టం కలిగి కంటతడి పెట్టుకుంటున్న మాట వాస్తవమే. ప్రజలతో పాటు ప్రధాని కూడా కంట తడిపెడుతున్నారు అని చెప్పినప్పుడు...ప్రజల ఏడుపులో(ఏ ప్రజలో ఇది మరో ప్రశ్న ) నిజాయితీని చూసిన రాధాకృష్ణ ప్రధాని ఏడుపులోని నిజాయితీని కూడా అంగీకరించినట్లే కదా!

      3. డబ్బున్న వాడిపై డబ్బు లేనివాడికి కోపం ఉండటం మనుషుల సైకాలజీ! అందుకే ప్రధాని నిర్ణయం వల్ల నల్లధనం ఉన్నవారు ‘చచ్చారు’ అని సామాన్య ప్రజలు కొందరు సంబరపడుతున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో తమకు ఎదురుకానున్న కష్టాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
      • అధికారంలో ఉన్న వాడిపై అధికారం లేని వాడికి కోపం ఉండటం రాజకీయనాయకుల సైకాలజీ అన్న మాటను RK అంగీకరిస్తాడా? డబ్బు ఉన్న వాడిపై డబ్బు లేని వాడు ఏడిస్తే (నల్ల ధనం ఉన్న వారు చచ్చారు అని ఏడ్చే వాళ్ళకు) భవిష్యత్తులో ఎదురు కాబోయే కష్టాలేమిటో పనిలో పనిగా సెలవిచ్చి ఉంటే మా బోటి అజ్ఞానులం కోందరమైనా మారే వాళ్ళమే. నల్ల ధనం ఉన్న వారు చచ్చారు అని సంబరపడి పోకండి అని హెచ్చరించడంలో RK ఎటు వైపో అర్థం కావటం లేదా? ఆ ధ్వనిలో అర్థం స్పష్టం కావటం లేదా?


      4. అవినీతి ఇవ్వాళ కొత్తగా పుట్టుకు వచ్చింది ఏమీ కాదు.
      • ....అంటే ఇది ఇలాగే ఉండాలా? అంతం ఉండొద్దా ?


      5. మన దేశ ఆర్థిక వ్యవస్థతో నల్లధనానికి విడదీయలేని బంధం ఉంది. నల్లధనం పుణ్యమా అనే పలు రంగాలు అభివృద్ధి చెందాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. దేశానికి, రాష్ర్టాలకు రాబడి పెరుగుతోంది. ప్రధానమంత్రి తాజా నిర్ణయం తర్వాత ఈ రంగం, ఆ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి.
      • ఈ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. అంతకు మించిన సిగ్గేస్తుంది. దేశానికి, రాష్ట్రాలకు రాబడి రావడమే ముఖ్యమా? వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందడమే ముఖ్యమా? అది ఏ రూపానా? ఏ మార్గానా? అన్నది అక్కరలేదా? అదే అవునైతే... ఇన్ని బడు లెందుకు? ఇంతమంది ఉపాధ్యాయులెందుకు? ఇన్నిన్ని జీతాలెందుకు? ఇన్ని నీతి సూత్రాలెందుకు? బడి ఉన్న ప్రతి చోటా ఓ సారా దుకాణమో! ఓ నల్ల మందు అంగడో! ఏ వ్యభిచార కొంపో! ప్రభుత్వాలు పెట్టుకుంటే రాబడి రాదా? పెట్టుబడి మిగిలిపోయి, రాబడులు పెరిగిపోయి ప్రభుత్వాలు ఇక అన్ని రంగాలను 3 పువ్వులేమి కర్మ 6 పువ్వులకు 90 కాయలు కాయించగలదు. దీనికి RK ఒప్పుకుంటాడా?

      Delete
    3. >>2000/- తాత్కాలిక నోట్ల సర్దుబాటుకు/మార్పిడి కని సామాన్యుడికి సైతం అర్థమైంది.

      ఇదొక దండగమారి ఎక్ష్ట్రా ఖర్చు అని నువ్వు ఒప్పున్నావన్నమాట. గుడ్ బోయ్.

      >>ఏ నోటుకు ప్రత్యామ్నాయం? ఏ నోటు చెల్లకుండా పోయింది?

      ఇదే ప్రశ్న, నీ అంత నాలేడ్జీ లేక రాత్రి, పగలు తేడాలేకుండా బాంకులముందు, ఏటిఎం ల ముందు కాళ్ళరిగేలా నిల్చున్నవాళ్ళని అడిగి చూడరాదూ.. కుమ్మేసే సమాధానం చెప్పేవాళ్ళు

      >>పచ్చిగా చెప్పాలంటే తాను ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం విజయవంతం కాలేదన్న కోపంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కక్షతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు.

      అది మాత్రమేనా! పాక్ పై సర్జికల్ స్ట్రైక్ మీదకూడా జనాలకు డౌట్లు వొస్తున్నాయి అని తెలియగానే, ఇదొకటి మొదలు, ఇది కూడా వేస్ట్ ఐంది కాబట్టి బంగారం, అదికూడ వేస్ట్ అంటే ఇంకోకటి, ఎన్ని వేస్ట్ ఐనా చివరికి అయొధ్య రామాలయం ఉండనే వుంది మల్లి జనాల చెవుల్లో పూలు పెట్టడానికి.


      >>ఒక పత్రికాధినేతగా, ఛానెల్ అధిపతిగా ఆ ఉద్దేశ్యంలో నీకు భాగస్వామ్యం లేదా? నీవు, నీ తోటి అధిపతులు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పండి. ఆ ఆచరణ సాధ్యమైన నిర్ణయాలెంటో సూచించండి.

      ఇదో పిచ్చ జోకు. మేమంతా నవ్వలేక చచ్చిపొయామనుకో. సాక్షాత్తూ ఆర్ధిక మంత్రినే తన్ని బయటకు తగలేసి మరీ నిర్ణయాలు తీసుకునేవాడికి మళ్ళీ వీళ్ళ సలహాలు వినబడతాయా??

      >>రాజ్యంగ బద్దంగా ఎన్నికై ఏలుతున్నవాడు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే ఏక పక్షమని ఏడుస్తుందేం?

      ఆహా ఇంకేం, పార్లమెంటు మూసేసుకోడానికి ఈ ఒక్క పాయింటు చాలదూ...




      >>ఉన్న ఆస్తికి విలువ పడిపోయినప్పుడు, కొనదలచుకున్న ఆస్తి విలువ కూడా అంతే అన్న సత్యం బోధపడదా?

      ఛు..ఛూ, ఛు..ఛూ.. బుజ్జి బాబూ! నీకు అమ్మేవాడు తక్కువకిచ్చాడని, నీకు తక్కువ రేటు కి దొరికేసిందని లటుక్కున కొనేసి, చూశావా అభివ్రుధ్ధి అంటే ఇదే. ఇది మా మోడీ బాబా వల్లే సాధ్యం అని మురిసిపోతున్నావా.. చిట్టికన్నా! వాడు అమ్మే దాని ముందు, నువ్వు కొన్నా తరువత కూడా చాలా ఫాక్టర్స్ దేశ ఆర్ధిక వ్యవస్థని నిర్దేశిస్తాయని మరీ అంత చిన్న క్ల్లసుల్లో చెప్పరులేమా. నీకు ఇంకా బ్రైను పెరిగాక, నిన్ను పెద్ద క్లాసుల్లో వేసి, అప్పుడు అర్ధం అయ్యేట్టు చెబుతారు. అప్పటీదాకా బొజ్జ నిండా పాలు తాగేసి, అమ్మ పక్కలో బజ్జుకో కన్నా!

      Delete
    4. ‘‘ఇదొక దండగమారి ఎక్ష్ట్రా ఖర్చు అని నువ్వు ఒప్పున్నావన్నమాట. గుడ్ బోయ్.‘‘
      దండగమారి ఎక్స్టా ఖర్చుల్లేని పెబుత్వం కావాలని కలలు కంటున్నావన్నమాట. గుడ్ హడ్
      ‘‘ఇదే ప్రశ్న, నీ అంత నాలేడ్జీ లేక రాత్రి, పగలు తేడాలేకుండా బాంకులముందు, ఏటిఎం ల ముందు కాళ్ళరిగేలా నిల్చున్నవాళ్ళని అడిగి చూడరాదూ.. కుమ్మేసే సమాధానం చెప్పేవాళ్ళు‘‘
      వాళ్ళు కుమ్మేయడమే కాదు, ప్రక్కవాడు గుండెపోటొచ్చి చస్తూవుంటే పట్టించుకోకుండా ఇంకా క్యూల్లోనే నిలబడేవుంటారు. అలాంటి క్రీమీలేయర్ క్యూగాళ్ళని, వాళ్ళని సమర్థించే నియోరిచ్ గాళ్ళని దించడం పెద్ద పనేం కాదు.
      ’’అది మాత్రమేనా! పాక్ పై సర్జికల్ స్ట్రైక్ మీదకూడా జనాలకు డౌట్లు వొస్తున్నాయి అని తెలియగానే, ఇదొకటి మొదలు, ఇది కూడా వేస్ట్ ఐంది కాబట్టి బంగారం, అదికూడ వేస్ట్ అంటే ఇంకోకటి, ఎన్ని వేస్ట్ ఐనా చివరికి అయొధ్య రామాలయం ఉండనే వుంది మల్లి జనాల చెవుల్లో పూలు పెట్టడానికి‘‘
      మోడీ ఫోబియా వుండొచ్చు గానీ ఇంత సైకో ఫోబియా వుంటే కష్టం. మోడీ ఏం చెప్పినా, ఏం చేసినా చెవిలో పూలు పెట్టించుకునే జనాలకి పోయి మనం చెబితే సక్కగా వుంటది. పదహారేళ్ళు గుజరాత్ అల్లర్ల గురించి చెప్పారు, వినీ వినీ చెవుల్లో పూలు పెట్టకుని ప్రధానిని చేసారు. ముందు ఎటిమ్ లో కుమ్మేసేవాళ్ళకి చెప్పు నీ సుద్దులు.
      బర్మా మీద జరిగిన సర్జికల్ స్ట్రయిక్ మీద రాని అనుమానం దీని మీద వచ్చిందంటే అమావ్యాస్యకీ, పున్నమికీ ఫోబియో తిరగబెడుతుందన్నమాట.

      ‘‘ఇదో పిచ్చ జోకు. మేమంతా నవ్వలేక చచ్చిపొయామనుకో. సాక్షాత్తూ ఆర్ధిక మంత్రినే తన్ని బయటకు తగలేసి మరీ నిర్ణయాలు తీసుకునేవాడికి మళ్ళీ వీళ్ళ సలహాలు వినబడతాయా??‘‘
      ఫోబియా ముదిరి పిచ్చిగా మారిందన్నమాట. అందుకే అన్నీ పిచ్చజోకుల్లాగే వున్నాయి. మరీ అంత చచ్చేలా నవ్వబాకు. మీకు జోకర్ల కొరత వస్తాది.
      ‘‘ఆహా ఇంకేం, పార్లమెంటు మూసేసుకోడానికి ఈ ఒక్క పాయింటు చాలదూ...‘‘
      అడెడే, పార్లమెంట్ లో జరుగుతున్నాయా నిర్ణయాలు? పార్లమెంట్లో ప్రతిపక్షాల మాటకి ఏనాడైనా విలువ యిచ్చారా? రండిరా చర్చకి అంటే మూసుకు పరుగెత్తుతున్నవాళ్ళకి చెప్పు ఈ వార్త. మోడీ బాబా కాకపోతే రాహుల్ బాబానో, లేకపోతే కమ్మీ బాబానో, దళ్లీ బాబానో, లేకపోతే కాండీ బాబానో తీసుకువచ్చి కూర్చోబెడితే పదేళ్ళుగా ఏం పీకిందీ కనబడుతూనే వుంది కదా?

      Delete
    5. >>ఎన్ని వేస్ట్ ఐనా చివరికి అయొధ్య రామాలయం ఉండనే వుంది

      adi koodaa waste aithe, jole sardhukoni jump jilani

      Delete
  23. రూ. 4-5 లక్షల కోట్ల లాభం ఆశలు గల్లంతు
    రద్దయిన కరెన్సీ అంతా ఖాతాల్లోకే ..
    బయటేమీ మిగలకపోవచ్చంటున్న విశ్లేషకులు
    నోట్ల రద్దు వ్యవహారంలో ప్రభుత్వానికి భారీ ఆశాభంగం తప్పదని సరికొత్త విశ్లేషణలు వినవస్తున్నాయి. నల్లధనాన్ని వెలికితీయడమే ప్రధాన లక్ష్యంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు మోదీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అంచనాలు ఫలిస్తే సర్కారు ఖజానాకు దాదాపు 4-5 లక్షల కోట్ల రూపాయల మేర లాభం కలిగేది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే అంత సీన్‌ లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇదెలాగో చూద్దాం..
    ప్రభుత్వం రద్దు నిర్ణయం తీసుకోవడానికి ముందు దేశంలో 1716.5 కోట్ల 500 రూపాయల నోట్లు, 685.8 కోట్ల 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి ఉమ్మడి విలువ 15.44 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 500 రూపాయల నోట్ల వాటా 8.58 లక్షల కోట్ల రూపాయలు. 1000 రూపాయల నోట్ల వాటా 6.86 లక్షల కోట్ల రూపాయలు.
    ప్రభుత్వం వేసుకున్న అంచనాల ప్రకారం.... బ్యాంకుల్లో సుమారు 10-11 లక్షల కోట్ల రూపాయల విలువైన రద్దయిన కరెన్సీ నోట్లు డిసెంబర్‌ ఆఖరు నాటికి డిపాజిట్‌ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 4-5 లక్షల కోట్ల రూపాయల నల్లధనం బయటకు రాలేక శాశ్వతంగా చీకట్లనే సమాధి అవుతుంది. ఇలా బ్యాంకుల్లోకి రాకుండా నల్లధనసాముల గోదాముల్లోనే సమాధయ్యే కరెన్సీ అంతా ఆర్‌బిఐ ఖాతాల్లో లాభంగా మిగులుతుంది. దీనిని సర్కారుకు డివిడెండ్‌గా బదలాయిస్తుంది.
    క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తే మాత్రం ప్రభుత్వం వేసుకున్న లెక్కలు దారుణంగా బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నవంబర్‌ 10 నుంచి నవంబర్‌ 27 మధ్య 18 రోజుల్లోనే 8.45 లక్షల కోట్ల రూపాయల విలువైన రద్దయిన కరెన్సీ నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యాయి. ఈ విషయం ప్రభుత్వమే స్వయంగా పార్లమెంట్‌లో వెల్లడించింది. గత మూడునాలుగు రోజుల లెక్కలు కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు దాటి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
    ప్రతి బ్యాంకూ తాను వసూలు చేసే డిపాజిట్లలో కొంత భాగాన్ని ఆర్‌బిఐ దగ్గర ఉంచాల్సి ఉంటుంది. దీనిని నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్‌)గా వ్యవహరిస్తారు. నవంబర్‌ 8 నాటికి ఆర్‌బిఐ దగ్గర ఉన్న సిఆర్‌ఆర్‌ నిధుల మొత్తం 4.06 లక్షల కోట్ల రూపాయలు. బ్యాంకులు సాధారణంగా పెద్ద కరెన్సీ నోట్లలోనే సిఆర్‌ఆర్‌ నిధులను ఆర్‌బిఐకి సమకూరుస్తాయి.
    ఆర్‌బిఐ వద్ద సిఆర్‌ఆర్‌ కింద ఉంచే మొత్తం కాకుండా బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు కూడా ఎంతో కొంత ఉంటాయి. ఆర్‌బిఐ లెక్కల ప్రకారం ఈ మొత్తం నవంబర్‌ 8 నాటికి 70 వేల కోట్ల రూపాయలుంది. ఇందులోనూ పెద్ద కరెన్సీ నోట్లు ఉంటాయి.
    ఇప్పుడిక బ్యాంకుల్లో ప్రజల నుంచి జమ అయిన 10 లక్షల కోట్ల రూపాయలను సిఆర్‌ఆర్‌ కింద ఆర్‌బిఐలో ఉన్న 4 లక్షల కోట్ల రూపాయలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయలు వెనక్కి వచ్చినట్టు. బ్యాంకుల దగ్గర ఉన్న నగదులో కనీసం సగం మొత్తం (35 వేల కోట్ల రూపాయలు) పెద్ద కరెన్సీ నోట్లలో ఉంటుందని భావిస్తే.. ఈ మొత్తం 14.35 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది. వెరసి చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువలో మార్కెట్లో మిగిలింది కేవలం మరో లక్ష కోట్ల రూపాయలు.
    భారీ క్యూలకు జడిసి ఇంకా లక్షలాది మంది తమ దగ్గరున్న రద్దయిన కరెన్సీని బ్యాంకుల్లో జమచేయలేదు. వారంతా కూడా వచ్చే 15-20 రోజుల్లో తమ ఖాతాల్లో ఈ కరెన్సీ నోట్లను జమచేసే అవకాశం ఉంది. ఈ మొత్తం ఎంత ఉండొచ్చన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది మరో లక్ష కోట్ల రూపాయలకు చేరితే నోట్ల రద్దుతో మోదీ సర్కారు సాధించినది శూన్యమనే చెప్పాల్సి వస్తుంది. చలామణిలో ఉన్న 500, 1000 నోట్లకు సంబంధించి 14 లక్షల కోట్ల రూపాయలు వెనక్కివచ్చినా సర్కారుకు తీవ్ర ఆశాభంగమనే చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. అంటే ఉత్తి పుణ్యానికి ప్రజలూ, ఆర్థిక రంగం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నమాట.

    ReplyDelete
    Replies
    1. మీడియా సంస్థల దగ్గర పోగైన నల్లధనాన్ని మార్చుకోలేకే ఈ దుష్ప్రచారాలు, తింగరి విశ్లేషణలని ప్రచురిస్తున్నాయని మరో పత్రిక కథనం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా నోట్ల రద్దు విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడానికి ఇదే కారణం.

      Delete
    2. తప్పు ఆలోచన్ బాస్. రాత్రి నేను చూసిన అన్ని న్యూస్ చానల్స్లోనూ.. నోట్లరద్దు భయంకరమైన డిసార్డర్ అని లెక్కలతో సహా తేల్చేశారు. ఇవే చానల్స్ నోట్ల రద్దు ప్ర్కటీంచగానే మోడీని ఆకాశానికి ఎత్తేశారు.

      ఇందిరమ్మ ఎమర్జెన్సీ ప్రకటించగానే మొదట్లో అందరూ ఆమెని సమర్ధించారు.. కొన్ని రొజులు గడిచాకగాని జనాలకి ఆమె మత్తు దిగలేదు

      మరి మోడీ మత్తు దిగటానికి ఇంకెంత కాలం పడుతుందో??

      Delete
  24. డబ్బుకు.. ఖర్చు ఎంతో!
    మొబైల్‌ చెల్లింపులతో నగదు భారాన్ని తగ్గించుకున్న స్కాండినేవియా దేశాలు
    ‘నగదు రహితం’ మెరుగైన మార్గం
    ఆ దిశగా అడుగు వేస్తున్న దేశాలు ఎన్నో ..

    రిజర్వు బ్యాంకు ఓ 1000 రూపాయల నోటును ముద్రించాక అది మన జేబులోకి రావడం వరకు ఎన్నో దశలు. ప్రతీ మలుపులో ఖర్చు తప్పదు. ఒక్కో నోటు ముద్రణకే రూ. 2.50 అవుతుంది. దానిని బ్యాంకులకు చేర్చడం.. బ్యాంకులు వాటిని ఏటీఎంలలో అమర్చడం.. ఇందుకోసం సిబ్బంది నిర్వహణ, వారి జీతభత్యాలు... చివరకు ఏటీఎం లావాదేవీలపై మనకు పడే ఛార్జీలు.. ఇవన్నీ కలుపుకొంటే ఒక రూ. 100 నోటు మన జేబులోకి చేరేవరకు అయ్యే ఖర్చు లెక్కపెట్టడం కష్టమే! ఇంత ఖర్చును తగ్గించుకోవాలంటే ఏంచేయాలి? అదే.. డిజిటల్‌ కరెన్సీ.

    నగదు భారం అంతా ఇంతా కాదు
    * నగదు లావాదేవీలు ఎంతో ఖర్చుతో కూడుకున్న అంశం అనేది ఎక్కువమందికి తెలియక పోవచ్చు. నోట్ల ముద్రణ, చలామణి, భద్రపరచం నుంచి పాడైన నోట్ల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టటం, నకిలీని అరికట్టటానికి నోట్ల ముద్రణలో సరికొత్త భద్రతా ప్రమాణాలు ప్రవేశపెట్టటం, నోట్లు లెక్కించే యంత్రాలు- నోట్ల తనిఖీ చేసే యంత్రాలపై పెట్టుబడి.. ఇలా నగదు లావాదేవీలపై ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ భారం ప్రభుత్వానిదే. నగదు చలామణి తగ్గించటం ద్వారా ఖర్చు తగ్గించుకునే అవకాశం కలుగుతోంది.

    * ఏటీఎం యంత్రం అధునాతన సాంకేతిక ఆవిష్కరణల్లో ఒకటి. గత పదిహేనేళ్ల కాలంలో మనదేశంలో బ్యాంకులు ఏటీఎం కేంద్రాలను నెలకొల్పటానికి పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. వీటిపై ఒకసారి మాత్రమే కాకుండా వాటి నిర్వహణ, నోట్లు నింపటం, నిఘా.. అన్నీ ఖర్చుతో కూడుకున్న పనులే.

    * నగదు చలామణిపై అధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో బంగ్లాదేశ్‌, భారత్‌, చైనా, ఇండోనేషియా, నైజీరియా, అమెరికా తదితర దేశాలు ఉన్నాయి. జర్మనీ, జపాన్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అదే సమయంలో మొబైల్‌ చెల్లింపుల విధానం పెద్దఎత్తున విస్తరించిన స్కాండినేవియన్‌ దేశాలైన స్వీడన్‌, ఫిన్లాండ్‌, డెన్మార్క్‌లలో నగదు నిర్వహణపై ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎంతో తక్కువ. మొబైల్‌ చెల్లింపుల విధానాన్ని అందిపుచ్చుకున్న కెన్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో సైతం ఇదే సానుకూలత ఉంది.

    * నగదు చలామణి అధికంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పన్నుల వసూళ్లు తక్కువగా ఉంటున్నాయి. లెక్కల్లోకి రాని సొమ్ము అధికంగా ఉండటం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఇటువంటి దేశాల్లో సమాంతర ఆర్థిక వ్యవస్థ పెద్దదిగా ఉంటోంది. ఈ పరిస్థితి వల్ల మనదేశంలో ఇప్పుడు ఎంత పన్ను ఆదాయం లభిస్తుందో, దాదాపు దానికి సమానమైన పన్ను ఆదాయాన్ని కోల్పోతున్నట్లు ఆంచనా.

    * నగదు తగ్గించి డిజిటల్‌ లావాదేవీల వైపు మళ్లడంతో దక్షిణ కొరియాలో ప్రభుత్వానికి పన్నుల ఆదాయం గణనీయంగా పెరిగింది.

    అమెరికా, చైనా
    ప్రపంచంలో అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆ దేశం డిజిటల్‌ లావాదేవీలకు కేంద్ర స్థానం. అమెరికా డాలర్‌ ప్రపంచ వాణిజ్య కరెన్సీ కూడా. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని అక్కడి బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంతో ముందుగా అందిపుచ్చుకుంది. ఆన్‌లైన్‌, మొబైల్‌ లావాదేవీలు ఎంతగానో విస్తరించాయి. అయినప్పటికీ ఈ అగ్రరాజ్యం కరెన్సీ నిర్వహణకు ఏటా పెద్దఎత్తున నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. నగదు చలామణి నిమిత్తం అమెరికా ఏటా 200 బిలియన్‌ డాలర్ల మేరకు వెచ్చించాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక డాలర్‌ నోటు ముద్రించటానికి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఒక్కో నోటుకు 5.5 సెంట్లు ఖర్చు చేస్తోంది. 100 డాలర్ల నోటు ముద్రణకు 14.3 సెంట్లు ఖర్చు అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో నోట్లు చలామణిలో ఉన్న దేశం చైనా. ఈ దేశం నగదు నుంచి మొబైల్‌ వ్యాలెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా అత్యంతవేగంగా మారిపోతోంది. ఈ విషయంలో అమెరికా కంటే ముందుండటం గమనార్హం.

    మనదేశంలో.. ఏటా రూ. 3,421 కోట్ల ఖర్చు
    * కరెన్సీ ముద్రణకు మనదేశం దాదాపు 22,000 టన్నుల కాగితం, ఇంకులు, భద్రతా చర్యలకు అవసరమైన సామగ్రిని ఏటా వినియోగిస్తోంది. 2016 జూన్‌తో ముగిసిన ఏడాది కాలానికి రిజర్వు బ్యాంకు 2120 కోట్ల నోట్లు సరఫరా చేసింది. వీటిని ముద్రించటానికి రూ. 3,421 కోట్లు వెచ్చించింది.

    * నగదు లావాదేవీల వ్యయం భారతదేశం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.7 శాతం ఉన్నట్లు కార్డు చెల్లింపు సేవల సంస్థ అయిన వీసా ఇటీవల పేర్కొంది.
    * మనదేశంలో ఇప్పటి వరకూ డిజిటల్‌ లావాదేవీలు ఎంతో తక్కువ. సగటున ప్రతి ఒక్కరికి 10 డిజిటల్‌ లావాదేవీలు మాత్రమే నమోదు అవుతున్నాయి. అదే బ్రెజిల్‌లో ఎంతో ఎక్కువగా 163 డిజిటల్‌ లావాదేవీలు ఉన్నాయి. సగటున ఒక్కొక్కరికీ దక్షిణ కొరియాలో 420, స్వీడన్‌లో 429 డిజిటల్‌ లావాదేవీలు నమోదు కావటం ప్రత్యేకత.

    * నగదు ముద్రణ, నిర్వహణ, చలామణి వ్యయాలను వచ్చే అయిదేళ్లలో జీడీపీలో 1.7 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గించుకునే అవకాశం మనదేశానికి ఉన్నట్లు అంచనా. అదే జరిగితే ప్రభుత్వానికి రూ. 70,000 కోట్లు ఆదా అవుతాయి.

    ReplyDelete
  25. ఏమైపొయారు హరిబాబుగారూ? ఏ టి ఎం లైన్లో చిక్కుకున్నారా?

    ReplyDelete
    Replies
    1. I am sick,in bed rest-shoulder pain!But I am happy you are all responding well - discussion is going nice!

      Delete
    2. I am sick,in bed rest-shoulder pain!But I am happy you are all responding well - discussion is going nice!

      Delete
    3. Get well soon Haribabu garu

      Delete
  26. ఈ చంద్రికమ్మ ఎవరోగాని, ఒక మతానికి సంభదించిన వాళ్ళ దగ్గరే బ్లాక్ మనీ వుందని అనుకుంటునట్టుంది. మన మతంలో ఎంత మంది బాబాలు టాక్సు కడతన్నారో లిస్టు ఇవ్వగలవా తల్లీ!!

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. Please stop questions like this which calls personally and quoting the text that was mot told by the author!

      Delete
    3. Please stop questions like this which calls personally and quoting the text that was mot told by the author!

      Delete
    4. బాబాల లిస్టే కాదు, ముల్లాలు, డాన్ లు, ఫాదర్లు, సువార్త ప్రసంగీకులు, ఎవాంజలిస్టుల లిస్టు కూడా అడగరా

      Delete
    5. నడుస్తున్న చర్చ ని ఇంకొక వైపు కి తిప్పుతున్నందుకు క్షమించండి హరిబాబుగారు.
      కానీ సమాధానం ఇవ్వదల్చుకున్నాను. అజ్ఞాత గారు, నా పేరు ని అలా పిలవటం తోటే వెక్కిరిస్తున్నారు అని అర్ధం అవుతోంది. మత మార్పిడి సంస్థలు పేదవారిని ఉచితం గా డబ్బు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి అనేది కఠోర వాస్తవం.నేను విజయవాడ వెళ్ళినపుడు ఇంటిపని చేసే అమ్మాయి ఆదివారం రాలేదు. సొసైటీ ఏదన్నా ఉందేమో , వాళ్ళ నియమమేమో అనుకున్నాను. నియమం కాదు చర్చి కి వెళ్తుందట. అక్కడ కూర్చుని చర్చి వారి బోధలు విన్నందుకు ప్రతి ఆదివారం ఒక్కొక్క కుటుంబ సభ్యులకి 100 రూపాయలు, భోజనము ఇస్తారట. అంటే నలుగురు ఉన్న కుటుంబం లో నెలకి కూర్చోబెట్టి 1600 రూపాయలు. కేవలం మతం మార్చుకున్నందుకు. అలాంటి చర్చి వారి కి కూడా మోడీ గారు తలుపులు మూసినట్లయింది కదా. అందుకే నేను ప్రస్తావించాను. గోదావరి జిల్లాలో ప్రతి చోటా చిన్న ఇళ్లల్లో కూడా చర్చీలు. ఎక్కడనించి వస్తున్నట్లు వీరి డబ్బు? కరెన్సీ నోట్లు ? నాకు తెల్సి దేవాలయాల్లో, బాబా మఠాలలో ఉచితంగా కరెన్సీ నోట్లు ఇవ్వటం తెలీదు. ఏదో మంత్రోపదేశాలు, విభూది ఇస్తారు. మహా అయితే అన్నదానం ఉండచ్చు. ఎన్నో మంత్రతంత్రాలు చేసారు అన్న అభియోగాలున్న పుట్టపర్తి బాబా కూడా సేవలు ఇచ్చారే కానీ ఇలా ఉచిత డబ్బు ఇచ్చారు అని అనుకోను. నా కళ్ళతో చూసినవి, నా అనుభవం లోకి వచ్చిన వాటి గురించే నేను ప్రస్తావించాను. హేళన తగ్గించి మీకు తెల్సినవి చెప్పండి తెల్సుకోలేకపోతే తెల్సుకుంటాను.

      Delete
    6. ఆదివారం కూడా శలవు ఇవ్వకుండా పనిచేపించుకోవడం కుదరేలేదని ఒక మతాన్నే బ్లేం చేస్తున్నావా? పనిమనుషులు అంటే మీకు మనుషుల్లా కనబట్లేదా? వాళ్ళకి నీతి న్యాయం అనేవి వుండవనా నీ వుద్దేశ్యం? ఎవడు డబ్బులిస్తాను అంటే వాళ్ళవెనకపడి పోతారు అనా నీ బోడి అలోచన? ఈ కాలంలో కూడా ఇలాంటి తలతిక్కవాళ్ళు ఉన్నందుకు సిగ్గుపడాలి. మళ్ళీ బోడి నీతులొకటి. దెయ్యలు వెదాలు వల్లించడమంటే ఇదే.
      అమేరికా వాడు నాలుగు పైసలిస్తాననగానే పోలో మంటూ ఫామిలీ ఫామిలీ ఎగేసుకుపొయిన నువ్వు, నీ ఫామిలీ మాట్లాడాలి ఇక పనిమనుషులు డబ్బుకోసం ఏమైనా చేస్తారని.

      Delete
    7. >>హేళన తగ్గించి మీకు తెల్సినవి చెప్పండి తెల్సుకోలేకపోతే తెల్సుకుంటాను.

      వంటగదిలో మూకుడు మాడినా మొడీనే అంటారు అని హేళన చేసిన నువ్వే హేలన తగ్గిచ్చమని దేబిరిచ్చుకోవడం చాలా ఫన్నీగా ఉంది

      Delete
    8. This comment has been removed by the author.

      Delete
    9. Do you think getting a servant-maid itself a racist?Do you think the servant should not be responsible for the loss of the householder?What about the agreement about monthly salary for working full month?

      Delete
    10. >>Do you think getting a servant-maid itself a racist?
      పౌరులగురించి వాళ్ళ భాధ్యతలగురించి తెగ్ లెక్చర్లు దంచేసిన ఈ చంద్రికమ్మ, డబ్బులిచ్చి ఒక చర్చిలో జనాల్ని కూర్చొపెడతనారు అని తెలిశాక పోలీసులకెందుకు చెప్పలేదూ? దీన్నిబట్టే అర్ధం కావట్లెదా ఒక మతాన్ని బ్లేం చెయ్యడాని ఎంత నీచ స్తాయికి దిగజారిందొ ఈవిడ.

      What about the agreement about monthly salary for working full month?
      నెల అంటే 24/7 అనా మీ అర్ధం? మీరు కూడా అలానే పని చేస్తున్నారా?

      Delete
  27. ఆ గ్రామం మొత్తం క్యాష్‌ లెస్‌
    ముంబయి: నల్లధనం నిర్మూలించేందకు పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం... నగదు రహిత లావాదేవీలను అలవాటు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. దీంతో ఆ దిశగా దేశ ప్రజలు అడుగులు వేస్తున్నారు. గ్రామాల్లో కూడా ప్రజలు నగదురహిత లావాదేవీలకు క్రమంగా అలవాటు పడుతున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న దేశాయి గ్రామం మొదటి నగదురహిత గ్రామంగా నిలిచింది. గురువారం నుంచి ఆ గ్రామంలో పూర్తిగా లావాదేవీలన్ని స్వైపింగ్‌ మిషన్‌ ద్వారానే జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్‌ ముంగన్‌తివార్‌ తెలిపారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సహకారంతో స్థానిక ఎన్జీవో వీర్‌ సవార్కర్‌ ప్రతిష్టాన్‌ ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాడు. దీంతో గ్రామంలోని ప్రజలందరూ నగదు రహిత లావాదేవీలను చేస్తున్నారు. కూరగాయల, పండ్ల వ్యాపారులతో పాటు పలువురు స్వైపింగ్‌ మిషన్లును ఉపయోగిస్తున్నారని మంత్రి తెలిపారు. దీంతో మహారాష్ట్రలోనే ఇది మొదటి నగదు రహిత గ్రామంగా ఆవిర్భవించిందని.. త్వరలో మహారాష్ట్ర దేశంలోనే నగదు రహిత రాష్ట్రంగా అవతరిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

    ముర్బాద్‌ తాలూకాలోని దేశాయి గ్రామంలో దాదాపు 10వేల మంది జనాభా ఉన్నారు. చుట్టుపక్కల 60 గ్రామాల వారు తమ నిత్యావసరాల కోసం దేశాయి గ్రామానికి వస్తుంటారు. నగదు రహిత లావాదేవీలతో ఇప్పుడు తమ కష్టాలు తీరినట్లే అని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    ReplyDelete
  28. అమెరికా డాలర్లకి దొంగ నోట్లు చెయ్యలేరని విన్నాను, అది నిజమైతే మనం కూడా అదే టెక్నాలజీ ఎందుకు వాడము?

    ReplyDelete
    Replies
    1. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. సొంతగా తెలుసుకోడానికి ప్రయత్నించకుండా అడగడం కోసమే అడగడమయితే ఇంతే.

      Delete
  29. ఈ రోజు బాంకుల్లో డబ్బు లేకపోవడానికి ఒక అద్భుతమైన రీసన్ చెప్పారు ప్రభాకర్ గారు 10 టీ వి లో. జనాల్లో బాంకులు ఎత్తేస్తున్నారు అని ప్రతిపక్షాలు ఒక రూమర్ లేపారు, అందుకే జనాలంతా బాంకులముందు డబ్బులకోసం ఎగబడుతున్నారు. సో బాకుల్లో డబ్బులు లేవు..

    ఇంకో బిజేపీ యువ నాయకుడు నిన్న హెచ్ యం టీ వి లో అంటాడు.. జనాలు అంతా పెద్ద బాంకులముందే నిల్చుంటూన్నారు,విజయ బాంకు ల్లంటి చిన్న బాంకుల్లో డబ్బులు దొర్కుతున్నాయి, నిన్ననే నేను చాలా సులువుగా డ్రా చేసుకున్నను అని. అతని ఖర్మకి దిల్సుఖ్ నగర్ నుంచి, నిన్న మా ఏరియాలో డబ్బుల్లేక విజయబాంకు భంద్ వుంది అని మెస్సేజ్ పంపారు. వెంకట క్రిష్న ఆ మాట చెప్పగానే, బుర్ర తిరిగి పోయిన ఈ యువ నాయకుడు(అస్సలు వీళ్ళకి బుర్రే వుండదనుకోండి) "నేను చెప్పింది ఉప్ప్పల్ విజయా బాంకు గురించి" అన్నాడు.. చిరాకు దొబ్బిన వెంకట క్రిష్న, "ఉప్పలేనా, లైన్ నంబర్ కూడా ఇస్తారా" అన్నాడు

    కాంగ్రెస్స్ వున్నంత కాలం వాళ్ళు చేసేది తప్పు అన్నప్పుడల్లా, ఇది ప్రతిపక్షాల కుట్ర అనేది.. కాషాయం బాచ్చి నాయకులు వాళ్ళని అన్నవాళ్ళదరికీ దేశద్రోహులు అని స్టాంప్ వేస్తుంది. ఎమోషనల్ బ్లాక్ మైలింగ్ మీద లాక్కుంటా పోతారు.

    బ్లాక్ మనీ గురించి మోడీకి నిజ్జంగా ఇంత చిత్తసుద్ది వుంటే ముందు సుజనా చౌదరిలాంటి డిఫాల్ట్రలని కాబినేట్లోనించి పేకేసి వాళ్ళమీద కేసులు పెట్టి వుంటే నమ్మేవాళ్ళం. వాళ్ళని సంకలో దాచిపెట్టి, జనాల్ని సంక నాకిస్తున్నాడు.

    ReplyDelete
    Replies
    1. ఆ ప్రోగ్రాములు నేనూ చూశాను, ఆ యువ నాయకుడి పేరు రాకేష్ రెడ్డి. రిజర్వ్ బాంకు 1 వ తారీఖు కోసం సరిపడా నోట్లు పంపినా, గవర్నమెంటు ఉద్యోగులే కాకుండా, ప్రైవేట్ ఉద్యోగులుకూడా డబ్బులకోసం ఎగబడ్డారు కాబట్టే ఎవ్వరికీ మనీ అందలేదు కాని దాన్లో రిజర్వ్ బాంకు తప్పు ఎంతమాత్రం లేదనేది ఈ కొడి బుర్ర నాయకుడి ఆవేదన/వాదన.
      ఇక ప్రభాకర్ని చూడాలి మీరు చెప్పిన రెండో ప్రోగ్రాంలో(10 టీ వీ, ముందు వెనుక ప్రోగ్రాం అది) ప్రాబ్లం అని ఎవ్వరు మాట్లాదటం మొదలుపెట్టీనా వెంటనే బర్రె గొంతేసుకోని అవతలివాడి మాటలు వినిపించకుండా సెంటీమెంటు కేకలు. ఇక మన దేశంలో కార్డ్లెస్స్ ట్రాన్సాసన్ పాసిబిలిటీ గురించి లెక్కలు తో సహా చూపిస్తుంటే, ప్రభాకర్ కుర్చీలో అసహనంగా ఊగిపొతూ, ప్రొగ్రాం ఎంతతొందగా ముగ్స్తారురా బాబూ అన్నంతగా చచ్చిపొయ్యాడు

      Delete
  30. B R Ambedkar said currency should be replaced every 10 years: Prakash
    అమ్బేడ్కర్ మనవడైన ప్రకాష్ అమ్బేడ్కర్ మాటల్లో అమ్బేడ్కర్ ఈ నోట్ల మార్పిడి గురించి ఏం చెప్పారంటే, ‘‘ప్రతి పది సంవత్సరాకొకసారి నోట్ల మార్పిడి జరిగి తీరవలసిందే’’
    నిజానికి మోడీ బహుశా అమ్బేడ్కర్ దగ్గరనుండే ఈ కీలక అంశాన్ని గ్రహించివుండవచ్చని ఆయన అన్నారు.
    Prakash Ambedkar shared the economic vision of his grandfather whose research at the London School of Economics that evolved in the form of a thesis and, later, into a book 93 years ago explored the problems confronting the nation today.
    B R Ambedkar strongly recommended that the purchasing power of the rupee should be stabilised and that it should be the foremost motto of any nation. The fluctuation in the purchasing power of the rupee leads to devaluation along with increase in inflation, which ultimately affects the common man in the country,” he said.

    While the architect of the Indian Constitution had not prescribed a uniform formula to be adopted for the currency replacement, he had underlined the need for circular flow of money in an open economy that would serve the welfare of the poorest sections of the society.

    “I am not sure whether the Prime Minister has taken the cue from B R Ambedkar’s economic vision. But what cannot be undermined is that Ambedkar’s economic vision is still relevant not only in the Indian context but also globally,” said Prakash, who also heads the Bharip Bahujan Mahasangh party.

    ReplyDelete
  31. మనదేశంలో ఎటి ఎమ్ ముందు నిలబడుతున్న అత్యంత పేద ప్రజలు ( కొందరు వ్యాఖ్యాతల మాటల్లో) ఎంత కరుణామయులు, మానవత్వం వున్న మనుష్యలుంటే, కొల్ కతాలోని భండేల్ హూగ్లీలోని ఒక ఎ టి ఎమ్ ముందు ఒక పదిమంది నిలిచి వున్నారు. ఆ క్యూ మధ్యలో వున్న ఒక వృద్ధుడు గుండెపోటుతో పడిపోయాడు. అరగంట గడిచనా ఆ క్యూలో వున్న మహా ప్రజలు ఒక్కరూ కదలలేదు. సహాయం అందించలేదు. క్యూలోనే అలాగే నిలబడి చూస్తూ వున్నారు. ఈ వీడియో టైమ్స్ నౌ ఛానెల్ లో లభిస్తుంది. కనీసం ఆ ఎటి ఎమ్ సెక్యూరిటీ గార్డయినా ముందుకు రాలేదు. ఇదీ మన దేశంలోని సామాన్య ప్రజల పరిస్థితి. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతూ అలాంటి వాళ్ళకోసం వ్యాఖ్యలు వ్రాస్తున్నాం.

    అదే బెంగాల్లో పుట్టిన పసిపిల్లలని చనిపోయారని చెప్పి బిస్కట్ల పెట్టెలలో పెట్టి ఇతర దేశాలకు అమ్మేస్తున్న డాక్టర్లు ఈ మధ్య పట్టుబడ్డారు.
    స్టడీకోసం ఇచ్చిన శవాలను, అస్థిపంజరాలను దొంగతనంగా అమ్ముకుంటున్న వైద్య విద్యార్థులూ ఈ మధ్యనే పట్టుబడ్డారు.

    ReplyDelete
    Replies
    1. >> ఆ క్యూ మధ్యలో వున్న ఒక వృద్ధుడు గుండెపోటుతో పడిపోయాడు.

      బిజేపీ నేతలు: ఉయ్.. ఉయ్..ఉయ్(విజిల్స్..).. ఇంకో సిక్స్ కొడితే డబుల్ సెంచరీ..

      Delete
  32. సగానికి పైగా నలుపే!
    జీడీపీలో 60% పైగా నల్లరంగం
    తాజాగా నిపుణుల అంచనా
    అంతు తెలియని నలుపుతో లెక్కలు తారుమారు..
    వ్యవస్థలు అతలాకుతలం!

    మనం ‘భారత ఆర్థిక రంగం’ అంటూ గొప్పగా, ఘనంగా చాటుకుంటున్నదంతా కూడా నాణేనికి ఒక పార్శ్వమే! నిజానికి ఇలా పైకి ఎంత కనబడుతోందో.. దీని వెనకాల చీకటి తెరల మాటున కూడా అంత జరుగుతోందని అంచనా వేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు! ఇంకా చెప్పాలంటే మనం పక్కాగా లెక్కాజమలు చూసుకొంటూ మురుసుకుంటున్న దానికంటే కూడా చీకటి ఆర్థిక రంగమే పెద్దగా ఉంటోందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం 2012 నాటికే మన స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో ఈ చీకటి ఆర్థిక రంగం 60% దాటిపోయిందని ప్రొఫెసర్‌ అరుణ్‌కుమార్‌ వంటి ఆర్థిక రంగ నిపుణులు నిగ్గు తేలుస్తుండటం ఆందోళనకర వాస్తవం!

    నల్లధనం అంటే మనందరం.. అదేదో మనకు సంబంధించిన వ్యవహారమే కానట్లు మాట్లాడుతుంటాం. కానీ ఇల్లు కొనటానికి వెళ్లగానే.. అప్రయత్నంగానే ‘చెక్కు ఎంత? నగదు ఎంత?’ అంటాం! నగదుగా ఇచ్చింది నల్లధనంగా మారిపోబోతోందని మనకు తెలియక కాదు. దుకాణానికి వెళ్లగానే అదనంగా పన్ను పడుతుందని బిల్లు వద్దంటాం. మనకు తెలుసు, ఆ లావాదేవీ ‘నలుపు’ కాబోతోందని! దేశంలో సామాన్యుల దగ్గరి నుంచీ అంతా నల్లధనాన్ని ఇంత మామూలుగా ఆమోదించే స్థాయి వచ్చేసింది. అక్రమ లావాదేవీలూ, చీకటి వ్యవహారాలూ సర్వసాధారణమైపోయిన ఈ పరిస్థితుల్లో అసలీ నల్లభూతం ఎంతగా విస్తరించింది? దీని విస్తృతి ఎంత? అన్నది తెలియకపోవటం మూలంగా మన ఆర్థిక అంచనాలు, ప్రణాళికలన్నీ కూడా తల్లకిందులైపోతున్నాయి. అధికారికంగా చెప్పుకొనేదొకటి, బయట వాస్తవంగా జరిగేదొకటి! దీనివల్ల మన ఆర్థిక రంగంపై ప్రభుత్వాలకూ, వ్యవస్థలకూ నియంత్రణ లేకుండా పోతోంది. ఒక రకంగా దేశం ఆర్థిక అయోమయంలో పడిపోతోందని చెప్పుకోవచ్చు. అందుకే ప్రముఖ ఆర్థిక వేత్త, దిల్లీలోని జేఎన్‌యూలో అర్థశాస్త్రం ప్రొఫెసర్‌గా సేవలందించిన ప్రొ॥ అరుణ్‌కుమార్‌ వంటివారు అసలీ నల్ల ఆర్థిక రంగం ఎంతగా విస్తరించింది, దీన్ని అంచనా వేసేదెలా? అన్నదానిపై విస్తృతంగా కసరత్తులు చేస్తున్నారు. అందరికీ తెలిసినా, ఎవరూ ఎక్కడా దీని గురించి కాగితం మీద పెట్టరు కాబట్టి దీన్ని అంచనా వేయటం అత్యంత క్లిష్టమైన వ్యవహారంగా తయారైంది.

    చీకట్లో లెక్కలు!
    నల్లధనం ఉందని తెలుసుగానీ దీనికి సంబంధించిన గణాంకాలు ఎక్కడా ఉండవు కాబట్టి నల్లరంగం గురించే పట్టించుకోకుండా, కేవలం తెల్లధనాన్నే లెక్కలేసి, దాని ఆధారంగానే విశ్లేషణలు, విధానాలూ రూపొందిస్తుండటం వల్ల అవన్నీ తప్పుల తడకలుగా తయారవుతున్నాయి. అంతిమంగా ఆశించిన ఫలితాలూ దక్కటం లేదు. కాబట్టి నల్లధనం ఎంత ఉండొచ్చన్న ఉజ్జాయింపు లెక్కలైనా సిద్ధం చేసుకోవటం దేశ సంక్షేమానికి కచ్చితంగా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    పోనీ మన దగ్గర తెల్ల రంగానికి సంబంధించిన లెక్కలైనా పక్కాగా ఉన్నాయా? అంటే దానికి నల్లరంగమే పెద్ద అవరోధంగా తయారవుతోంది. ఆ రెండూ కలగలిసే నడుస్తున్నాయి. కానీ మనం ఒక దాన్ని చూడనట్టు నటిస్తూ, ఎప్పుడూ తెల్లరంగం గురించే చెప్పుకొంటూ ఉండటం వల్ల మొదటికే నష్టం వస్తోంది. బయటి నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి 2010లో ప్రభుత్వం నల్ల రంగం అంచనా కోసం మూడు అధ్యయనాలను నియోగించింది. కానీ వాటిని ఇంత వరకూ బయటపెట్టలేదు.

    రిజర్వు బ్యాంకు నిస్సహాయం!
    నల్లధనం విషయంలో రిజర్వు బ్యాంకు పరిస్థితి కూడా నిస్సహాయంగానే తయారైంది. తన నియంత్రణ పరిధికి వెలుపల దేశంలో బోలెడంత ధనం తిరుగాడుతుండటంతో రిజర్వు బ్యాంకు కూడా ద్రవ్యోల్బణం వంటి వాటిని నియంత్రించలేకపోతోంది. ద్రవ్య సరఫరాను కట్టుదిట్టం చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ బయటి నుంచి ధన ప్రవాహం మొదలై, ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. స్మగ్లింగ్‌, హవాలా లావాదేవీలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఎంతోకొంత స్వతంత్రంగా వ్యవహరించే రిజర్వు బ్యాంకు కూడా ఇప్పటి వరకూ దేశంలో నల్లధనం ఉందన్న వాస్తవాన్ని గుర్తించేందుకే ఇష్టపడటం లేదు.

    ReplyDelete
  33. లెక్క ఎంత కష్టం!
    నల్లధనం ఎక్కడా కాగితాల మీద కనబడదు కాబట్టి లెక్క మహా కష్టం. అందుకే తెల్ల రంగంపై పడే నల్లధనం ఆనవాళ్ల ఆధారంగానే దీన్ని అంచనా వేయటం కొంతకాలంగా అనుసరిస్తున్న విధానం. వీటినే ‘ట్రేస్‌ మెథడ్స్‌’ అంటారు. నల్లధనం మూలంగా ఆర్థిక రంగంలో లోపలికీ, బయటకూ ప్రవహించే మొత్తాల మధ్య (ఇన్‌పుట్‌/ఔటపుట్‌) నిష్పత్తి అస్తవ్యస్తమైపోతుంది. కాబట్టి దీని ఆధారంగా లెక్కించటం మరో పద్ధతి. ఇలా రకరకాల పద్ధతుల్లో అంచనా వేసే ప్రయత్నాలు 1970ల నుంచీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రముఖంగా, ఆమోదయోగ్యంగా అందుబాటులోకి వచ్చింది మాత్రం ద్రవ్య విధానం. దీనిలో- వివిధ రంగాల మధ్య, లాభాలకూ వేతనాలకూ మధ్య, అలాగే ఆదాయాల మధ్య ఉండే వ్యత్యాసాలను గుర్తించి, వాటి ఆధారంగా నల్లధనం ఎంత పోగుపడి ఉండొచ్చన్నది లెక్కిస్తారు. అయితే దేశంలో సేవల రంగం విస్తరించటం, విదేశీ వాణిజ్యం పెరిగిపోవటం, రాజకీయ-అధికార-వ్యాపార వర్గాలు కుమ్మక్కవటం వంటివన్నీ కూడా నల్ల రంగం విస్తరించటానికి దోహదం చేశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి దేశంలో నల్ల రంగం విస్తృతి తెలియాలంటే- సేవల రంగం ఎంతగా విస్తరించింది? జీడీపీలో ప్రైవేటు రంగం వాటా ఎంత? విదేశీ వాణిజ్యంలో జరుగుతున్న అవకతవకలు ఎలా ఉంటున్నాయి? ఇవన్నీ చూడక తప్పదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని భిన్నకోణాల నుంచి అంచనా వేసినప్పుడు దేశంలో నల్లధనం 2012 నాటికే జీడీపీలో 62.02 శాతానికి చేరిందని అర్థిక వేత్తలు నిర్ధారణకు రావటం విస్మయకర విశేషం!

    సరళీకరణతో నల్లరంగానికి రెక్కలు!
    1980ల తర్వాత దేశం ఆర్థిక రంగాన్ని సరళీకరించి, దిగుమతులకు తలుపులు బార్లా తెరవటం వల్ల, 1985 తర్వాత సాఫ్ట్‌వేర్‌ రంగానికి గణనీయంగా రాయితీలు ఇవ్వటం వల్ల సేవల రంగం విపరీతంగా విస్తరించింది. సరుకుల కన్నా సేవల విషయంలో ‘ఇన్వాయిస్‌’లను ఎక్కువతక్కువ చేసి చూపటం చాలా తేలిక కాబట్టి నల్లధనం తయారీకి ఇది బాగా దోహదం చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండోది- విదేశీ వాణిజ్యం పెరగటం నల్ల ఆదాయాల తయారీకీ, అలాగే నల్లధనాన్ని దేశం మళ్లించటానికి కూడా దోహదం చేస్తోంది. 1991 సరళీకరణల తర్వాత దేశంలో వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణం నెలకొంది గానీ.. ఇదే సమయంలో నల్లధనం తయారీ, దాన్ని తరలించటం రెండూ పెరిగిపోయాయి. పన్ను లేకుండా డబ్బు దాచుకునే నల్లధన ‘స్వర్గ ధామాలు’ చాలానే అక్కరకొచ్చాయి. నల్లధనాన్ని ఇక్కడి నుంచి తరలించటం, విదేశీ వాణిజ్య మార్గాల్లో దాన్ని తిరిగి తెల్లధనంలా వెనక్కి తెచ్చుకోవటానికి మార్గాలు తెరుచుకున్నాయి. దేశంలో వాణిజ్యం / జీడీపీ నిష్పత్తి పెరుగుతున్న కొద్దీ జీడీపీలో నల్లధనం వాటా కూడా పెరుగుతూ రావటం గమనార్హం. అలాగే 1991 తర్వాత దేశంలో నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలంతా కుమ్మక్కై ప్రభుత్వ విధానాలను తమకు అనుకూలంగా మలుచుకుని, చట్టపరమైన కార్యకలాపాల్లోనే భారీగా వెనకేసుకోవటమన్నది (క్రోనీ క్యాపిటలిజం) బాగా పెరిగింది. దీన్నుంచి పుట్టేదంతా నల్లధనమే కావటంతో ఇదెంతగా విస్తరించిందో అంచనా కూడా కష్టంగా తయారైంది.

    సేవల రంగం.. నల్లరంగానికి వూతం!
    మన దేశంలో ఎంతోమందికి జీతభత్యాలతో పాటు అదనపు ఆదాయం కూడా ఉంటుండటం తప్పనిసరిగా గుర్తించాల్సిన అంశం. కానీ తెల్ల ఆర్థిక రంగంలో ఈ అదనపు ఆదాయం గురించిన అంచనాలు, గణాంకాలేవీ పెద్దగా కనబడవు. కాబట్టి అదనపు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవటం నల్లరంగం అంచనాకు ఒక కీలక మార్గం. రెండోది అదనపు ఆదాయం, దేశంలో సేవల రంగం అన్నవి రెండూ పరస్పరాధారితంగా ఉంటున్నాయి. నల్లధనం ఎక్కువగా సేవల రంగంలోనే తయారవుతోందని కొందరు ఆర్థిక వేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే లెక్కలు తారుమారు చేసే అవకాశం సేవల రంగంలోనే ఎక్కువ. నల్ల ఆదాయాల చెలామణీకి, ఆదాయ వెల్లడి సరిగా లేకపోవటానికి వ్యవసాయ రంగం ఆలవాలమే అయినా- వ్యవసాయ ఉత్పాదనలపై పన్నుల్లేకపోవటం వల్ల ఈ రంగంలో నల్ల ఆదాయాలు తయారవటం తక్కువే. కాబట్టి అంతిమంగా సేవల రంగంలోనే నల్లధనం అధికంగా తయారవుతోందని భావిస్తున్నారు. వీరు తమ సేవల్లో కొద్దిగా లెక్క చూపకుండా పక్కన ఉంచినా కూడా.. చివరికి అదే భారీఎత్తున నల్లధనం తయారీకి దారి తీస్తోందని నిపుణులు భావిస్తున్నారు.

    ReplyDelete
  34. Young man what is wrong with u. Get well soon, wish to see u early on blog ok. Say yes :)

    ReplyDelete
  35. This comment has been removed by the author.

    ReplyDelete
  36. JP he published a beautiful article in andhrajyoti yesterday - a very practicl solution with great research!

    ReplyDelete
  37. @Haribabu
    Please see this link,

    An open letter to Arvind Kejriwal from CA Mehul Shah about Rs. 2,000 rs note and demonestation.

    http://aapdelhi.in/an-open-letter-to-arvind-kejriwal-from-ca-mehul-shah/

    And, Hope with this letter our blogopaths who were die hard Modi phobiaites will realize and will stop these non sense posts.

    ReplyDelete
    Replies
    1. its not peak theory. if you read the above link, meeku picchi ekki baTTalu chinchukoavadam khaayam.

      Delete
    2. Don't worry all you commies, dallis and congis. All these years your left oriented propaganda links chadivi pichekkina pichi kukkalke aa link.

      Delete
  38. వీళ్ళకి ఎన్ని లెఖ్ఖలు చూపించినా, మా మోడీ ముందు ఈ లెఖ్ఖలు బలాదూర్ అనే వాళ్ళకి ఏం చెబుతాం.

    ReplyDelete
  39. హూగ్లీ: వారు మానవత్వాన్ని మరిచిపోయారు. ఓ మనిషి ప్రాణం కంటే తమకు డబ్బే ఎక్కువ అంటూ నిరూపించారు. డబ్బుల కోసం తిరిగి తిరిగి ఓ వ్యక్తి అలసిసొలసి అనారోగ్యంతో ఏటీఎం ముందు పొడవాటి క్యూలో ప్రాణాలొదిలినా.. మిగతవారు తమకు జాలి, దయ, కరుణ ఏమీ లేదనట్లు ఆ వరుసలో అతన్ని దాటుకుంటూ ముందుకుసాగారు. మానవత్వానికి మాయని మచ్చ తెచ్చే ఈ ఘటన పశ్చిమ్‌బంగాల్‌లో చోటుచేసుకుంది.

    కోల్‌కతాలోని బెహాల వాసి అయిన 52 ఏళ్ల కల్లోల్‌ రాయ్‌చౌదురి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఉద్యోగి. కూచ్‌బెహార్‌లో పనిచేస్తూ శనివారం తన సొంతూరుకి వచ్చాడు. హుగ్లీలోని బాందెల్‌ రైల్వేస్టేషన్‌లో దిగి నగదు కోసం సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ పొడవాటి క్యూ ఉంది. క్యూలో నిల్చున్న 15 నిమిషాల అనంతరం అనారోగ్యంతో అక్కడే కుప్పకూలాడు. ఆ వరుసలో ఉన్న వారు ఏ మాత్రం పట్టించుకోకుండా అతన్ని దాటి వెళ్లారు. ఇలా గంటకుపైనే సమయం గడిచిపోయింది. ఎవ్వరూ కూడా క్యూ నుంచి కదిలి వచ్చి అతనికి సహాయం చేయాలని భావించలేదు. పలువురు మాత్రం అతని పరిస్థితిపై దగ్గర్లోని పోలీసుస్టేషన్‌కు సమాచారమందించారు. అదీ వారు ఏటీఎంలో డబ్బులు తీసుకున్న తర్వాతే. పోలీసులు ఏటీఎం వద్దకు చేరుకొని బాధితున్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. క్యూలో ఉన్నప్పుడు అతనికి గుండెపోటు వచ్చి మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

    ఈ ఘటన జరిగిన సమయంలో క్యూలో దాదాపు 50 మంది వరకూ ఉన్నారని ఎవ్వరూ బాధితుని ఆరోగ్య పరిస్థితిపై సకాలంలో స్పందించలేదని పోలీసులు తెలిపారు.

    ReplyDelete
  40. సింహాచలం: చిల్లర కొరత నేపథ్యంలో సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి(అప్పన్న) ఆలయంలో స్వైపింగ్‌ హుండీ(స్వైపింగ్‌ మిషన్లు)లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఈ విధమైన ఏర్పాటు చేసిన తొలి ఆలయంగా ఇది నిలిచింది.

    ReplyDelete
    Replies
    1. ఆకాశమంత బిందె పెట్టి ప్రతి అడ్డమైన వాళ్ళ నల్ల డబ్బును తేరగా దొబ్బేసే తిరపతి బాబులు మాత్రం ఇలాంటి సాంప్రదాయాలు వైదికంలో లెవ్వు అని, ఇలాంటి తెల్లవాళ్ళ సాంప్రద్దాయాల్ని, సాంప్రదాయం కోసం ప్రాణాలిచ్చే(తీసే) సాప్రదాయ వాదులంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

      Delete
    2. అడ్డమైనవాళ్ళ డబ్బు, నల్ల వ్యాపారుల డబ్బు, ఆయుధ వ్యాపారుల డబ్బు, నియంతల డబ్బు, సామ్రాజ్యవాద వ్యాపారుల డబ్బు నిస్సంకోచంగా కొన్ని కోట్ల డాలర్లు తీసుకున్న మదర్ థెరిసాకు చెప్పు నీ నీతులు. ఆ డబ్బలంతా దొబ్బేసి బ్యాంకుల్లో వేసుకున్న కేథలిక్ పోప్ కి చెప్పు నీ సుద్దులు. ఇంకా నీకు వివరంగా తెలియాలంటే మదర్ తెరీమా గురించి చెప్పిన ఈ లింక్ చూసుకో. అక్కడకి పోయి వేయ్ నీ వీరంగం.
      https://tetageeti.wordpress.com/2016/09/02/murderer_theresa/

      అనవసరంగా కమ్యూనల్ హేట్రెడ్ పెంచే వ్యాఖ్యలు చేస్తే అదే స్థాయిలో మట్టి కరవాల్సొస్తది.
      https://tetageeti.wordpress.com/2016/09/02/murderer_theresa/

      Delete
    3. >>అడ్డమైనవాళ్ళ డబ్బు, నల్ల వ్యాపారుల డబ్బు, ఆయుధ వ్యాపారుల డబ్బు, నియంతల డబ్బు, సామ్రాజ్యవాద వ్యాపారుల డబ్బు నిస్సంకోచంగా కొన్ని కోట్ల డాలర్లు తీసుకున్న మదర్ థెరిసాకు చెప్పు నీ నీతులు. ఆ డబ్బలంతా దొబ్బేసి బ్యాంకుల్లో వేసుకున్న కేథలిక్ పోప్ కి చెప్పు నీ సుద్దులు.


      ఇక్కడ పోకిరిలో ప్రకాష్ రాజ్ డవిలాగ్ గుర్తురావట్లా...

      "గిల్లితే గిల్లుచ్చుకోవాలిగాని ఎదురు మాట్లాడకూడదు"

      Delete
  41. I have seen a small scale merchant supporting modi by saying that he is going to get swiping machine from the bank and what modi did is good and when suggesting others to cooperate - the anchor Turner the focus off to him.
    THAT WAS THE MODUS OPERANDI OF MEDIA TO SHOW THE HUE AND CRY OFTHE PUBLIC!

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడే గాస్ సిలిండర్ ఇంటీకి ఒచ్చింది. అతని దగ్గర స్వైప్ మెషిన్ లేదు. నా దగ్గర కాష్ లేదు. మళ్ళీ ఎటిఎం ల కోసం తిరిగి తిరిగి ఒక్కటి కూడా ఓపన్ లేక సిలిండర్ వెనక్కి పంపాల్సొచ్చింది. మరి మొడీ చెప్పినట్టు 50 దోజులు వంట చేసుకోకుండా హోటల్లో తినమంటారా లేక ఆధికమంత్రి చెప్పినట్టు 4 నెలలు ఆగమంటారా లేక ఆర్ధికవేత్తలు చెప్పినట్టు నొట్లన్ని మళ్ళీ ప్రింటవ్వలంటే ఇప్పుడున్న ప్రింటలన్నీ 6 నెలలు 24X7 పంచెయ్యలి కాబట్టీ అప్పటి వరకూ వంట మానేసి స్వైప్ మెషిన్ వున్న హోటల్లు వెదికి ఇంటిల్లిపాదీ ఆ 6 నెలలు మంత్లీ కార్డులు కొనుక్కోమంటారా?

      ప్రభుత్వం ముందు ప్రజల కనీస అవసరాలకు జాగర్త పడి ఆతర్వాత తీరిగ్గ ఎన్ని కబుర్లైనా చెప్ప్పాలి. అంతేగాని, వాడ్ని చూసి నేర్చుకో వీడ్ని చూసి నేర్చుకో అని నీతులు మానండి సర్

      Delete
    2. . . . . వంట చేసుకోకుండా హోటల్లో తినమంటారా . . . .
      అదైనా ఎలా? హోటలు వాడు మాత్రం రూ.2000 నోటు ఇస్తే తీసుకుంటాడా? కాబట్టి స్వైప్ మెషీన్ ఉన్న హోటల్ వెతుక్కోక తప్పదు.

      Delete
  42. నగదు రహిత గ్రామంగా ఇబ్రహీంపూర్‌
    సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపురం గ్రామం అరుదైన రికార్డు సాధించింది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పూర్తి నగదు రహిత లావాదేవిలు నిర్వహించే తొలి గ్రామంగా ఇబ్రహీంపూర్‌ నిలిచింది. సోమవారం సాయంత్రం 4గంటలకు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

    ReplyDelete
  43. ఆ గ్రామంపై పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం లేదు
    దేశమంతా కరెన్సీ కష్టాలు పడుతోంటే మహారాష్ట్రలోని దేశాయి గ్రామ ప్రజలు కరెన్సీ కోసం ఇబ్బందులు పడడం లేదు. ఈ గ్రామంలో గురువారం నుండి నగదురహిత లావాదేవీలు ప్రారంభమయ్యాయి.
    By: Narsimha
    Updated: Friday, December 2, 2016, 14:26 [IST]
    Subscribe to Oneindia Telugu

    ముంబాయి :పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మహారాష్ట్రలోని దేశాయి గ్రామంమాత్రం కొత్త రెన్సీ కోసం ఇబ్బందులు పడడంల లేదు. రద్దు చేసిన నగదు నోట్లను మార్పిడి చేసుకొనేందుకు బ్యాంకుల చుట్టూ తిరగడం లేదు. ఈ గ్రామం దేశంలోనే నగదు రహిత గ్రామంగా మారింది. దీంతో ఈ గ్రామానికి కరెన్సీ కష్టాలు లేవు.

    మహారాష్ట్రలోని థానే జిల్లాలోని దేశాయి గ్రామం నగదు రహిత గ్రామంగా గుర్తింపు తెచ్చుకొంది. ఈ గ్రామవాసులంతా నగదు లేకుండా తమ పనులను చేసుకొంటున్నారు. అన్నింటికి కార్డులను ఉపయోగిస్తున్నారు.త్వరలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఇదే విదానాన్ని అమలు చేస్తామని మహరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

    deshayi first cashless village in maharastra

    బ్యాంకు ఆఫ్ బరోడా సహకారంతో దేశాయి గ్రామంలో ఏ వస్తువును కొనుగోలు చేయాలన్నా నగదు రహిత పద్దతిని ఉపయోగిస్తున్నారు. స్వైప్ మిషన్లు, లేదా డెబిట్, క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.గురువారం నుండి ఈ గ్రామం నగదు రహిత గ్రామంగా మారిందని మహారాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి సుధీర్ మంగన్ తివార్ తెలిపారు.

    గ్రామంలోని ప్రతి వ్యాపారి స్వైపింగ్ మిషన్ ను ఉపయోగిస్తున్నారని మంత్రి తెలిపారు.ముర్బాద్ తాలుకాలోని దేశాయి గ్రామంలో 10 వేల మంది జనాభా ఉన్నారు. చుట్టుపక్కల 60 గ్రామాల ప్రజలు అన్ని అవసరాల కోసం ఈ గ్రామానికి వస్తుంటారు. నగదు రహిత లావాదేవీలను ప్రారంభించడంతో కరెన్సీ కష్టాలు తప్పాయని స్థానికులు చెబుతున్నారు.

    ReplyDelete
  44. Thanks for the commentators to put their arguments in the most controlled way!I have already pointed out once we used sacks to carry,and people of that time also might felt like today when paper currency was introduced first time!

    Time and tide wait for none,change is inevitable - be preparedness that.I request you to stop responding here and wait for the next post.

    NEXT POST WILL BE A BANG!?

    ReplyDelete
  45. ఆహా! కట్టలు కట్టల నల్లధనం వెనకేసుకున్న రాజకీయ నాయకుల్లో ముందు వర్సలోవున్న జయలలితకి భారత రత్న. థూ ఈ ఓట్ల రాజకీయం. బిజేపీ కాదు ఎస్ పి పీ (శవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ)

    ReplyDelete
    Replies
    1. నీ ఆత్రం అడవికెల్ల .... (నక్సలైట్ అయితే జాగ్రత్త! మిలటరీ వాళ్ళు చంపేస్తున్నారు).
      భారత రత్న ఇచ్చేశారా ... నువ్వే ఇచ్చేశావా ... ఏదో రూమర్ వస్తే భా.జా.పా మీద అక్కసు వెళ్ళ గక్కడమేనా!! చచ్చీన ప్రతి లేడర్ కీ భారత రత్న ఇవాలి అని ఒక చచ్చు డిమాండు ఉంటుంది అంత మాత్రాన .... నువ్వు ఇక్కడ అరవడం ... నువ్వూ నీ ఆత్రం ..

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...