Tuesday, 19 July 2016

తల్లిని చంపి పుట్టిన రెండు రాక్షస శిశువులు - పాకిస్తాన్,తెలంగాణ!

          "పవిత్ర భూమి" అని పేరుపెట్టిన దేశం ఎంత అపవిత్రంగా పుట్టిందో తెలుసుకుంటే హిందువులు క్రీ.శ 1901 నంచి క్రీ.శ 1950ల మధ్యలో ఒక అర్ధశతాబ్ది పాటు తమమీద జరుగుతున్న కుట్రని ఏమాత్రం తెలుసుకోలేక ఎంత అమాయకంగా వంచింపబడినారో తెలుస్తుంది!క్రీ.శ 1890 దశకంలో కేవలం బీదరికంలో మగ్గుతున్న తమ సాటివారిని ఉద్ధరించడం కోసం ముస్లిం లీగ్ అనే ఒక సంస్థని విద్యావిషయిక వ్యవహారాలలో ముస్లిముల్ని సంఘటితపరచే ఉద్దేశంతో పెట్టిన వాళ్ళు క్రీ.శ 1905 కల్లా దానిని రాజకీయ సంస్థగా మార్చడమే కాకుండా హిందువులూ ముస్లిములూ రెండు వేరువేరు జాతులు కాబట్టి దేశానికి స్వాతంత్ర్యం ఇస్తే గిస్తే తమకు వేరే దేశం ఇవ్వాలే తప్ప హిందువులతో పొరపాటున కూడా కలిసి ఉండబోమని ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యటం మొదలుపెట్టారు.

          క్రీ.1930లలో కాంగ్రెసు పార్టీలో తనకొక మంచి స్థానం కోసం పోరాడి అక్కడ తనకిక మాట చెల్లుబడి లేదని తెలిసిన జిన్నా పూర్తిగా ముస్లిం లీగ్ రాజకీయాలకే అంటుగట్టుకుపోయి ద్విజాతి సిద్ధాంతానికి విశ్వసనీయతని తీసుకొచ్చి తను కూడా పాప్యులారిటీ తెచ్చుకుని ముస్లిముల్ని బుజ్జగించడానికి ఉదారవాద హిందువులు ప్రత్యేక నియోజకవర్గాలతో పాటు ఎన్నో తాయిలాలని ఇచ్చినా క్రీ.శ 1945-46 ఎన్నికల్లో మొత్తం ఎన్నికల ఫలితం పాకిస్తాను ఏర్పాటుకు వ్యతిరేకంగా రావడంతో నిరాశతో రాజకీయాల నుంచి విరమించుకుని ఇంటిపట్టున బతకటానికి సెటిలయిపోయిన తర్వాత మళ్ళీ  కద ఎట్లా మలుపు తిరిగి పాకిస్తాను ఆవిర్భవించిందో తెలుసుకుంటే హిందువులు తమ నాయకుల చేతుల్లోనే ఎంత తెలివితక్కువగా మోసపోయారో తెలుస్తుంది."మేము ఒకప్పుడు హిందువుల్ని పరిపాలించాం,ఇప్పుడు వాళ్ళ పరిపాలనలో బతకడమా!" అన్న అహంకారంతో ద్విజాతి సిద్ధాంతాన్ని పుట్టించి "లడ్కే లేంగే పాకిస్తాన్" అని మొండిపట్టు పట్టి ఆ లక్ష్యం కోసం రక్తపుటేరులు పారించిన వాళ్ళని అమాయకులుగా చిత్రిస్తున్నారు గత 70 యేళ్ళుగా సెక్యులరిస్టులు.భారత చరిత్రలో అత్యంత ప్రముఖమైన ఆనాటి ఎన్నికల్లో ముస్లిములు ఎక్కువగా ఉన్నచోట ముస్లిమేతరులు అబ్యర్ధులుగా నిలబదకుండా కట్టడి చేసి ముస్లిములకి మాత్రమే వోటు హక్కు ఇచ్చి,ఇతర ప్రాంతాల్లో కూడా, అంటే ముస్లిమేతరుల నియోజకవర్గాల్లో కూడా ముస్లిములు అబ్యర్ధులుగా నిలబడటానికి వెసులుబాటు ఇచ్చిన ఉదారవాద హిందువులు సాధించినది - వీళ్ళ ముఖం మీద తంతూ వాళ్ళు పాకిస్తానుని సాధించుకోవటం,వీళ్ళు హిందూ మతతత్వవాదులుగా సెక్యులరిస్టులతో గత డెబ్బయ్యేళ్ళుగా తిట్టించుకోవటం!

          అసలు గాంధీ ఈ చెంపని కొడితే ఆ హెంపని చూపించమనే అహింసాయుత పోరాటమే హేతువుకి లొంగనిది.దానికి తోడు ఇతను అరిభీకరంగా విదేశీవస్త్రదహనం స్వదేశీలవణఖాదనం అని ఏదన్నా కొత్త కార్యక్రమం మొదలుపెట్టి నాలుగు రోజులన్నా గడవక ముందే ఇంగ్లీషువాళ్ళు వచ్చి ఒక్కణ్ణి కూడా వదలకుండా కాంగ్రెసు నాయకుల్ని అరెస్టు చేసి జైళ్ళకి తరలించేవాళ్లు. నాయకులు లేకపోవటంతో కొద్ది రోజుల్లోనే అవి మెల్లమెల్లగా అణగారిపోయేవి.ఆ రకమైన కార్యక్రమాలతో పోరాటాన్ని అనంతకాలం వరకూ సాగదీసినా మనకి స్వతంత్రం వచ్చి ఉండేది కాదు.మీరు జాగ్రత్తగా గాంధీ ఉద్యమాలు ఎన్ని విజయవంతమయ్యాయి అని పరిశీలిస్తే ఏ ఒక్కటీ ఆ కార్యక్రమాల్ని ప్రారంభించినప్పుడు చెప్పిన లక్ష్యాల్ని చేరుకోలేకపోయాయని తెలుస్తుంది.కేవలం వాటివల్ల కలిగిన సంచలనాన్నీ మీడియా కవరెజినీ మాత్రమే మనకు గాంధీ విజయాలుగా నమోదు చేసి చెప్తున్నారు గాంధేయవాదులు."భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడంలో గాంధీ ప్రభావం ఎంత?" అని ఒక జర్నలిస్టు అడిగితే బ్రిటిష్ అధికార ప్రతింధి "చా..లా..త..క్కు..వ" అని స్పష్టంగా అన్నాడు - ఎందుకు తక్కువన్నాడో కారణాల్ని కూడా విపులీకరించి చెప్పాడు,ఇంతోటి ప్రభావశీలమైన ఉద్యమం వెనక్కాల హిందువులూ,సెఖ్ఖులరిస్టులూ దెబ్బలు తంటూ అఘోరిస్తుంటే ముస్లిం లీగు వాళ్ళు వీటికి దూరంగా ఉండి మరో పనిలో తలమునకలుగా ఉన్నారు.

          ముస్లిం లీగ్ వాళ్ళు ఈ కార్యక్రమాలకి దూరంగా ఉండి ఆ సమయంలో ఇంగ్లీషువాళ్ళతో తమకు మరిన్ని తాయిలాల కోసం,ప్రత్యేక హక్కుల కోసం,వీలయితే స్వాతంత్ర్యానంతరం తమకే అధికారాన్ని ఫిరాయించుకోవడం కోసం మంతనాలు చేస్తూ ఉండేవాళ్ళు.ఈ తొక్కలో నెహ్రూ మార్కు సెఖ్ఖులరిస్టులు అక్బరునీ,బాబరునీ ఎంత మోసినా అవతలి వైపు వాళ్ళు కోరుకున్నది మాత్రం ఔరంగజేబు కాలం నాటి హవానే!


పాకిస్తాను యొక్క ప్రత్యేకత ఏమిటి?ద్విజాతి సిద్ధాంతం యొక్క ప్రామాణికత ఏమిటి?


          పాకిస్తాను కాక ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలన్నీ ఆయా ప్రాంతాలలో ప్రవక్త ప్రవచించిన ఇస్లాము ధర్మం క్రమేణా బలీయమై సహజంగా ముస్లిముల జబాభా ఎక్కువవడంతో ఏర్పాటయిన దేశాలు.పాకిస్తాన్ మాత్రం మత ప్రాతిపదికన రాజకీయ పోరాటం ద్వారా ఏర్పడిన దేశం.క్రీ.శ 2015లో పాకిస్తాన్ జనాభా 191 మిలియన్లు ఉంటే జిన్నా అప్పట్లోనే 100 మిలియన్ల ముస్లిముల గురించి మాట్లాడేవాడు. అది కేవలం అప్పటి పంజాబ్,సింధ్ లాంటి రెండు మూడు రాష్ట్రాలలో ఉన్న ముస్లిముల సంఖ్య కాదు,మొత్తం భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న ముస్లిములని కలిపితే వచ్చిన సంఖ్య.కమ్యునిష్టోళ్ళూ, కాంగ్రెసోళ్ళూ ఎంత నికృష్టులో చూడండి!ముస్లిములకి ప్రత్యేకదేశం అడిగిన వాడు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న అందరు ముస్లిముల కోసం పాకిస్తాన్ అడిగాడు,మరి పాకిస్తాన్ ఏర్పడినాక వీళ్ళని తీసుకుపోవాలి గదా!ఎందుకు వదిలేశాడు?పాకిస్తాను ఏర్పాటు కోసం దైరెక్ట్ యాక్షన్ డే నాటి ఒక్క రాత్రిలోనే 5000 మందిని హతమార్చిన బొంబాయి ముస్లింలు పాకిస్తాన్ ఏర్పడింది గద, ఆ పవిత్రభూమికి సంతోషంగా తరలి పోవచ్చునే!

          ఆ ముక్క అడిగినందుకు పటేల్ హిందూ మతోన్మాది అయిపోయాడు.క్రీ.శ 1946లో జరిగిన ప్రావిన్షియల్ ఎలెక్షన్లలో మొత్తం 1585 నియోజకవర్గాలలో ముస్లిం లీగ్ పోటీ చేసిన 492 నియోజకవర్గాలలో ముస్లిములు 429 స్థానాలలో పాకిస్తాన్ కోసం పట్టుబడుతున్న ముస్లిం లీగ్ పార్టీని గెలిపించారు!ఇవన్నీ ఇప్పుడు పాకిస్తాన్ ఏర్పడిన ప్రాంతాలలో లేవు.బొంబాయిలో ముస్లిములు పాకిస్తాన్ కోరుకోవడంలో అర్ధం ఏమిటి?పాకిస్తాన్ ఏర్పడితే అక్కడికి వెళ్ళి తరించాలని కాదా!ఆ ఎన్నికల్లో భారతదేశంలోని 90% ముస్లిములు పాకిస్తాను ఏర్పాటును సమర్ధించారు.కాంగ్రెస్ పార్టీకి అత్యధిక శాతం వోట్లు వచ్చిన క్రీ.శ 1984లో ఆ పార్టీకి పోలయిన వోట్ల శాతం కేవలం 49% మాత్రమే!మరి అంత బలంగా పాకిస్తానును కోరుకున్నవాళ్ళు అది యేర్పడిన తర్వాత కూడా ఎందుకు ఇక్కడే ఉండిపోయారు అని అడగటం కూడా తప్పయిపోయింది పాకిస్తాను ఏర్పాటుకి పూర్తి సహాయ సహకారాలు అందించిన కమ్యునిష్టులకి, ఎందుకో?హిందువులు ఎర్రిపప్పలు గనక!.

          ఈ ద్విజాతి సిద్ధాంతానికి ఉన్న త్రిమూర్తులలో మొట్టమొదటిసారి ఒక మాటగా వదిలినవాడు ముస్లిం లీగ్ వ్యవస్థాపకుడైన సయ్యద్ అహ్మద్ ఖాన్(క్రీ.శ 1817-1898),దానికి తాత్విక ప్రాతిపదికను కల్పించినవాడు మహమ్మద్ ఇక్బాల్(క్రీ.శ 1877-1938).ఆ తాత్వికతని రాజకీయ వాస్తవికతగా మార్చినవాడు మహమ్మదాలీ జిన్నా(క్రీ.శ 1871-1948) - మొత్తం ద్విజాతి సిద్ధాంత ప్రచారకర్తలు చాలామంది ఉన్నా వీళ్ళు ముగ్గురిలో ఏ ఒక్కరు దీన్ని పట్టించుకోకపోయినా అది ఈ స్థాయిలో బలాన్ని పుంజుకుని ఉండేది కాదు.ఈ సిద్ధాంతం మొత్తం మనిషి యొక్క అస్తిత్వాన్ని అతని మతమే నిర్ణయిస్తుంది కాబట్టి హిందువులు,ముస్లిములు ఒక జాతి కాదు అని చెప్పటం. భాషాపరమైన,మతపరమైన,ఆచారపరమైన వైవిధ్యాలు ఉన్నవాళ్ళు ఒక ప్రదేశంలో ఎంతగా కలిసిమెలిసిపోయి సహజీవనం చేస్తున్నప్పటికీ వారిని ఒకే జాతిగా గుర్తించడానికి వీలు లేదనేది వారి వాదనలోని మరొక ముఖ్యమైన అంశం.వీరి వాదన ప్రకారం "ఒక దేశపు ముస్లిం స్వదేశపు ముస్లిమేతరుడి పట్ల కన్నా మరొక దేశపు ముస్లిం పట్ల సహానుభూతిని కలిగి ఉంటాడు" కాబట్టి ఈ సహానుభూతిలో భేదం ఉన్న హిందువులు,ముస్లిములు ఒకటి కాదు అని తేల్చి చెప్పారు.వింతేమిటంటే,మహమ్మదాలీ జిన్నాకి ప్రాదేశిక సరిహద్దులతో ఒక ముస్లిం దేశాన్ని ఏర్పాటు చేయటానికి దారి చూపించిన ఇక్బాల్ సరిహద్దులు లేని అవిభాజ్యమైన ఇస్లామిక్ ప్రపంచాన్ని గురించి కలలు కన్నాడు!"Butān-e raⁿŋg ō-xūⁿ kō tōṙ kar millat mēⁿ gum hō jā; Nah Tūrānī rahē bāqī, nah Īrānī, nah Afġānī (Destroy the idols of color and blood ties, and merge into the Muslim society; Let no Turanians remain, neither Iranians, nor Afghans)" - అనే పంక్తులకి అర్ధం యేమిటి?ఆఖరుకి జిన్నా ద్వారా జరిగింది యేమిటి?మతమే హిందువుల్ని,ముస్లిముల్ని విడదీస్తుంది అని అంత గట్టిగా నొక్కిచెప్పి మా మతస్థులకి ఒక దేశం కావాలని విడిపోయినవాళ్ళు ద్విజాతి సిద్ధాంతం అనే పదానికి సార్ధకత తీసుకురావాలంటే ఇరాన్,ఇరాక్,ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని ప్రపంచంలో ఉన్న అన్ని ముస్లిం దేశాల్నీ కలిపి ఒకే దేశంగా యేర్పాటు చేసి చూపించాలి - చెయ్యగలరా?

          ఈ ద్విజాతి సిద్ధాంతం అనేది వీళ్ళ బుర్రల్లో సొంతంగా పుట్టింది కాదు,ఇంగ్లీషువాళ్ళు చేసిన "భారతీయులు ఒకే జాతి కాదు,అనేక జాతుల సమాహారం - కాబట్టి స్వాతంత్య్రానికి అర్హులు కారు, జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుస్థిరంగా ఉండలేరు" అన్న సూత్రీకరణ నుంచి కొట్టుకొచ్చిన మాట!మరొక తమాషా ఏమిటంటే ముస్లిములలో మతం ద్వారా అధికారం సాధించుకోవాలనుకున్నవాళ్ళు తమకి దేశాన్ని సాధించుకోవటానికి ఎంత ఉత్సాహంగా వాడుకున్నారో హిందువులలో మతం ద్వారా అధికారం సాధించుకోవాలనుకున్నవాళ్ళు ముస్లిముల్ని ఈ దేశంతో సంబంధం లేనివాళ్ళుగా చిత్రీకరించటానికి అంత ఉత్సాహంగా వాడుకుంటున్నారు - ప్రవచించిన వారికీ వారి వ్యతిరేకులకీ ఒక్కలాగే ఉపయోగపడుతున్న వింత సిద్ధాంతం ప్రపంచంలో ఇదొక్కటే!

పాకిస్తాను ఎవరికోసం యేర్పడింది?పాకిస్తాను ఇవ్వాళ ఎట్లాంటి స్థితిలో ఉంది!


          సెటైరికల్ కౌంటర్ ఇవ్వడం కోసం వాడలేదు నేను "ఎర్రిపప్పలు" అని!ఒకవైపున బ్రిటిషువాళ్ళు,ఒకవైపున కమ్యునిష్టులు నడిమధ్యన కాంగ్రెసువాళ్ళు ఉండి ఆ యాభయ్యేళ్ళపాటు తమ తమ వ్యూహాత్మకమైన రాజకీయ సమీకరణాలతో దేశాన్ని విడగొట్టి - లాభంగా వచ్చే అధికారాన్ని తాము అనుభవించి మతతత్వవాదులు అనే చెడ్దపేరునీ ముస్లిముల్ని క్రూరంగా అణిచివెయ్యాలని చూసి దేశవిభజనకి కారకులైన పాపాన్ని హిందువుల మీద వేశారు, ఎంత దారుణం!

          భారత ఉపఖండంలోని హిందువులు,ముస్లిములు అప్పటికే కొన్ని శతాబ్దాలుగా కలిసి ఉండటం గురించి  క్రీ.శ 1001లో అల్-బెరూని తన కితాబ్-ఉల్-హింద్ పుస్తకంలో "భారతీయ హిందూ సమాజం కొన్ని శతాబ్దాల నుంచి ఈ ప్రత్యేక స్వభావాన్ని ప్రదర్శిస్తున్నది.ఈ రెండు సంస్కృతులూ, హిందువులు మరియూ ముస్లిములు,రెండు సమాంతర ప్రవాహాల వలె సాగుతూ అప్పుడప్పుడూ స్పర్శించుకోవడమే తప్ప పూర్తిగా కలిసిపోలేదు" అని విశ్లేషించాడు.ఇందులోని రెండు విడివిడి అంశాలలో ప్రతి అంశమూ - సమాంతరంగా ప్రవహించడమూ నిజమే,పూర్తిగా కలవకపోవడమూ నిజమే - కానీ, ఇది అన్ని జాతుల మధ్యనా ఉన్నదేనని శతాబ్దాలుగా కలిసి బతుకుతున్న రెండు సోదర జాతుల్ని కేవలం ఒక యాభయ్యేళ్ళ కాలంలో విడగొట్టి అనంత కాలపు శత్రువులుగా నిలబెట్టిన వారిలో ఎవరికీ తోచలేదు - ఒక అబద్ధపు సిద్ధాంతం రెండు సోదర జాతుల్ని శత్రువుల్ని చేసింది!

          ఒక శతాబ్దం క్రితం మొదలైన కుట్ర ఇప్పటికీ ఎంత విజయవంతంగా నిర్వహించబడుతున్నదో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు హిందువులు - మరీ ఇంత అమాయకత్వమా!ఈ మాట అంటున్న నేను కూడా ఒక వారం క్రితం వరకూ మహమ్మదాలీ జిన్నా గురించి అజ్ఞానంలోనే ఉన్నాను! ఒక విషయం తెలియక పోవటం వల్ల అజ్ఞానంలో ఉండటం తప్పు కాదు, ఇప్పటి వరకు మనం నమ్ముతున్నవి అబద్ధాలనే ఒక నిజం తెలిశాక కూడా లేనిపోని మొహమాటాలతో అబద్ధాలతో సహజీవనం చెయ్యటమే తప్పు!బ్రిటిషు వాళ్ళు దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఒప్పుకునే ముందు ఒక ప్రతిపాదన పెట్టారు "రష్యా నుంచి పశ్చిమ దేశాలకు ప్రమాదం ఉంది గాబట్టి వాళ్ళని అడ్డుకోవడానికి సైనిక స్థావరాలు పెట్టుకోవడానికి మీరు ఒప్పుకోవాలి" అని. పటేల్ బృందం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తిరస్కరించారు.లార్డ్ వేవెల్ అదే ప్రతిపాదనని జిన్నా ముందు పెడితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా,"అది సమస్యే కాదు,మా ముస్లిములకి కమ్యునిష్టులు బద్ధశత్రువులు కదా,ఈ హిందువులు,వీళ్ళేమి పోట్లాడగలరు?" అనేశాడు. ఈ ఒక్కముక్కతో నాకు అప్పటివరకూ జిన్నా అంటే ఉన్న గౌరవం మట్టిగొట్టుకు పోయింది - ధూత్తేరీ!ముస్లిముల స్వాభిమానం కోసం,వాళ్ళు గర్వంగా తలయెత్తుకు నిలబడటం కోసం పాకిస్తానుని సాధిస్తున్నానని ప్రజల ముందు చెప్పినవాడు తన దేశాన్ని ఇతర దేశస్థులకి సైనికస్థావరంగా ఉంచటమంటే ఆత్మద్రోహం,జాతిద్రోహం అని తెలియనంతటి అమాయకుడా లాయరు వృత్తిలో రాటుదేలి పైకొచ్చిన ఈ మేధావి?

          కమ్యూనిష్టులు,ముఖ్యంగా భారతదేశపు కమ్యూనిష్టులు,అందులోనూ ఆంధ్రప్రాంతపు కమ్యూనిష్టులు అప్పుడప్పుడూ చారిత్రక తప్పిదాల ఒప్పుకోలు సమావేశాలు నిర్వహిస్తుంటారు, ఎప్పుడెప్పుడు?కొన్ని దశాబ్దాల పాటూ ఒక రెటమతం పనిని ఇతర్లు "ఒరే నాయనలూ!దానివల్ల తప్పుడు ఫలితం వొస్తుంది,వొద్దురా" అని చిలక్కి చెప్పినట్టు చెప్పినా "ఠాట్!మార్క్సిజం అంటే యేంటో తెలియని పుచ్చొంకాయవి నువ్వు చెప్పడమా,మేము వినడమా!" అని ఘీంకరిస్తూ చెయ్యాల్సిన మఠధ్వంసమంతా చేసేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించుకోలేం అని తెలిసిపోయాక అప్పుడు చేస్తారు,మరోసారి మరొక చా.త.ఒ.స వరకూ మళ్ళీ తమ రెటమతం పనులు యధావిధిగా చేస్తూ ఉంటారు.మిగిలినవాట్ని క్యామెడీలుగా తీసుకున్నా పాకిస్తాను ఏర్పాటులో వీళ్ళు చూపించిన అత్యుత్సాహం వల్ల విడిపోయిన ఈ రెండు భూభాగాల లోని ప్రజలకి జరిగిన హాని యేమిటో తెలుసుకోవలసిన వాళ్ళు తెలుసుకుంటే చారిత్రక తప్పిదాల ఒప్పుకోళ్ళు కాదు - ఏకంగా ఎలిజీ మీటింగులే పెట్టుకోవాల్సి ఉంటుంది!నోరు తెరిస్తే మేము కార్మిక,కర్షక,పీడిత,తాడిత జాతుల విముక్తి కొరకు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూ మా ఆఖరి రక్తపుబొట్టుని కూడా ధారపోస్తాం అని చెప్పే వీళ్ళు పాకిస్తాన్ ప్రజానీకాన్ని పశ్చీమదేశాల సామ్రాజ్యవాదపు ఉక్కుపిడికిలి కిందకి సాగనంపారు, భారతదేశానికి పక్కలో బల్లెంలాంటి పొరుగుదేశాన్ని తీసుకొచ్చారు!

          1969లో ఇ.యం.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కేరళ ప్రభుత్వం భారతదేశం నడిబొడ్డున పాకిస్తాను తరహాలో ముస్లింల కోసం మల్లపురం జిల్లాని ఏర్పాటు చేసింది - రాజ్యాంగబద్ధంగానే!అంత ఖర్మ ఏం దాపరించింది?ప్రభుత్వం తనదేగా,ప్రత్యేకంగా ఒక జిల్లా ఏర్పాటు చేస్తేనే తప్ప వాళ్ళకి రక్షణ ఉండదని అనుకున్నట్టు లేదూ!అసలు బ్రిటిషువాళ్ళు ముస్లిం నాయకుల్లో ఆశలు రేకెత్తించినా ఈ కమ్యూనిష్టులు ఆ మిధ్యా కారణాల మతప్రాతిపదిక ఉన్న వేర్పాటువాద ఉద్యమాన్ని సత్యప్రమాణం గల విమోచన ఉద్యమంగా నిర్వచించి తలకెత్తుకుని సమర్ధించకపోతే అంతగా ప్రభావశీలమై ఉండేది కాదు.ప్రజాభిమానం గాంధీ నేతృత్వంలో ఉన్న కాంగ్రెసుకి ఎక్కువగానే ఉంది.కాంగ్రెసు పార్టీ విభజన జరగకుండా స్వతంత్రం తెచ్చుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది.కానీ,స్టాలిన్ డిక్రీని ఫాలో అవుతున్న కమ్యునిష్టులు బాహాటంగా పాకిస్తాన్ ఏర్పాటున్ సమర్ధించి పూర్తి సహాయ సహకారాలు అందించారు!అప్పట్లో బహుళ పార్టీ సభ్యత్వం అఘోరించేది.తొలిదశలో వాళ్లూ వీళ్ళూ అని తేడా లేకుండా అప్పుడున్న ఒకే ఒక రాజకీయ సంస్థ అయిన కాంగ్రెసు సభ్యులే!తర్వాతి దశలో తమ ఎజెండాలకి తగ్గట్టు వేరే పార్టీలు పెట్టుకున్నా కాంగ్రెసు పార్టీ సభ్యత్వాన్ని కూడా కొనసాగించేవాళ్ళు - చర్చల్లోనూ,వోటింగుల్లోనూ పాల్గొని కాంగ్రెసు పార్టీకి సంబంధించిన కీలకమైన  నిర్ణయాల్ని కూడా ప్రభావితం చెయ్యగలిగేవాళ్ళు! కమ్యూనిష్టులు బాహాటంగా పాకిస్తాన్ ప్రతిపాదనని సమర్ధించాక, మిలిటరీ స్థావరాల ఏర్పాటుకి జిన్నా ఒప్పుకున్నాక,కాంగ్రెసు పాకిస్తాన్ ఏర్పాటుతో కూడిన స్వాతంత్ర్యానికి ఒప్పుకోకపోతే బ్రిటిషువాళ్ళ దగ్గిర మరో ప్రమాదకరమైన తురుపుముక్క ఉంది -  అప్పటికి సుస్థిరంగా ఉన్న 500 సంస్థానాలకీ సర్వాధికారాలు దఖలుపరుస్తూ స్వతంత్రం ఇచ్చేస్తే?అట్లా కమ్యూనిష్టుల స్టాలిన్ డిక్రీ ప్రభావిత పాకిస్తాన్ అనుకూల విధానం వల్లనే పాకిస్తాన్ ఏర్పాటు వాస్తవరూపం దాల్చింది!

          ఇవ్వాళ కామన్సెన్సుతో మనం అనుకుంటున్న ఆలోచన,"మత ప్రాతిపదిక మీద దేశాన్ని విడగొట్టి ముస్లిములకి వాళ్ళ దేశం పంచి ఇచ్చేశాక ఇక మిగిలిన దేశం హిందువులదే కదా!" అనేది అప్పుడు ఒక కాంగ్రెసు నాయకుడు పైకే అనేశాడు,గట్టిగా వాదించాడు కూడాను.అయితే, అప్పటికే నెహ్రూని ఫాబియన్ లెఫ్టిస్ట్ అని వెక్కిరించుకుంటూ ఉన్న కమ్యూనిస్టుల పట్ల ఉన్న వ్యామోహంతోనూ పశ్చిమ దేశాలలో గుడ్ సమరిటన్ ఇమజి కోసమూ నెహ్రూ సెక్యులరిజానికి మొగ్గు చూపాడు.తమాషా యేమిటంటే, భారతదేశం తప్ప ప్రపంచంలో ఏ దేశమూ సెక్యులరిజానికి ఇంత నిజాయితీగా కట్టుబడలేదు - దీనివల్ల దేశానికి ఒనగూడిన ప్రయోజనం ఏమిటి?

          భారతదేశానికి జరిగిన నష్టం గురించి కాసేపు మర్చిపోయి పాకిస్తాను ఏర్పాటు ఎవరి ప్రయోజనం కోసం ఏర్పడిందో తెలుసుకోవాలంటే సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి తెలుసుకుంటే చాలు!రాజవంశంలో పుట్టి రాజభోగాల మధ్యన పెరిగి మొఘల్ సామ్రాజ్యానికీ దానిని సమూలంగా పెరికివేసి ఏర్పడిన బ్రిటిష్ సామ్రాజ్యానికీ ఒకే రకమైన విధేయతతో ఉపయోగపడిన కులీనత ఇతనిది!ఇంగ్లీషువాళ్ల మీద జరిగిన 1857 తిరుగుబాటులో పాల్గొనడం ద్వారా ముస్లిములు తప్పు చేశారని వాదిస్తూ "The Causes of the Indian Mutiny" పుస్తకం రాసి ప్రకంపనలు సృష్టించిన ఉద్దండుడు!ఒకవైపు ముస్లిములు తిరుగుబాటు చెయ్యటం వాళ్ళలోని చాందసవాద భావాలతో చేసిన హరాంజాదీగా విమర్శించి మరోవైపు బ్రిటిషువాళ్ళని కూడా ఈ దేశపు నిజమైన పరిస్థితిని అర్ధం చేసుకోకుండా దుర్మార్గమైన విస్తరణకాంక్షని ప్రదర్శించారని విమర్శించి బ్రిటిషువాళ్ళకి కోపాన్ని కూడా తెప్పించాడు.ఈ పుస్తకంలో ఉన్న ఘాటుకి ఆగ్రాలో ఉన్న "Mufassilat Gazette Press" వాళ్ళు కూడా భయపడి మొత్తం 500 ఉర్దూ కాపీల్నీ వెనక్కి పంపించేశారు.ఇతనికి అత్యంత ఆత్మీయుడైన స్నేహితుడు రాయ్ శంకర్ దాస్ అయితే వీటిని బయటపెట్టి ప్రాణాల  మీదకి తెచ్చుకోవద్దని హెచ్చరించి,పార్లమెంటుకి గానీ మరే అధికార స్థానానికి గానీ పంపవద్దని బతిమిలాడి వినకపోయేసరికి కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.తను  బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియజేస్తున్నది ముస్లిముల బాగు కోసమే కాబట్టి అన్నిటికీ సిద్ధంగానే ఉన్నానని చెప్పి అంతపనీ చేశాడు.అయితే, పైస్థాయిలో ఉన్న ఇంగ్లీషువాళ్ళు దీనిని స్నేహపూర్వకమైన విమర్శగానే తీసుకున్నారు - ముస్లిములు తమమీద తిరుగుబాటు చెయ్యడాన్ని తప్పుపడుతున్నాడు కదా!

         వంశపారంపర్య రాజకీయ వారసత్వమూ,దాని మౌలిక లక్షణమైన దర్పంతో నిండిన కులీనతా,వెసులుబాటు వల్ల అబ్బిన అమోఘమైన పాండిత్యమూ ఉన్న ఇతడు క్రీ.శ 1857 నాటి తిరుగుబాటు తర్వాత తను ఎంత ప్రయత్నించినా ఇంగ్లీషువాళ్ళు ముస్లిముల్ని దూరంగా ఉంచటం గమనించి దీనికి తరుణోపాయం ముస్లిములకి ఆధునికతని అలవాటు చెయ్యడమేనని గ్రహించాడు.ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీని స్థాపించాడు.ఇతని భావజాలం దేశానికి బ్రిటిషువాళ్ళ నుంచి స్వాతంత్ర్యాన్ని కోరుకునే జాతీయతని వ్యతిరేకించే ఆంగ్ల ప్రభుత్వ విధేయత కాబట్టి ముస్లిముల్ని బాగా ఆధునికం చేసి ఆంగ్లప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదించుకునేటట్లు చెయ్యడమే ఇతని ప్రయత్నాల వెనక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం.ఆలీఘర్ చేరుకున్నాక పూర్తిగా విద్యావిషయాల్లో ముస్లిముల్ని ఆధునికంగా తీర్చిదిద్దటానికి కృషి చేసి చాలామందికి మార్గదర్శకుడయ్యాడు.తర్వాత ముస్లిం లీగ్ నాయకులలో చాలామంది ఇతని ప్రోత్సాహం మూలంగా పైకి వచ్చినవారే.రాజకీయాధికారమనే బెల్లం చుట్తూ ఈగల్లా ముసురుకుని అధిక సౌకర్యాలు నొల్లుకునే మనస్తత్వం గలవాళ్లు అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళని అంటకాగి ఆ ప్రభుత్వం మీద పోరాడుతున్నవాళ్ళని వ్యతిరేకిస్తూ కాలం గడిపేశారు.పోరాటం విజయవంతమై ప్రభుత్వం చేతులు మారుతుండం తప్పదని తలిశాక కొత్త ప్రభుత్వంలో తమకి ఎదురుగాలి తప్పదని స్పష్టంగా తెలిసిపోవడంతో తమ ప్రాభవాల కోసం తమ మతం వాళ్ళనే పావులుగా వాడుకుని పులిజూదం ఆడారు.వీరి మోసాన్ని పసికట్టలేక భారతీయ ముస్లిములే కాదు పాకిస్తాన్ ముస్లిములూ ఘోరంగా మోసపోయారు!

          భారతీయ ముస్లిముల అక్షరాస్యత 59.1% హిందువులలో ఉన్న అక్షరాస్యత 65.1%తో పోలిస్తే దయనీయమైన స్థితిలో ఏమీ లేదు.సంఖ్యాపరమైన పెరుగుదల కూడా గణనీయంగానే ఉంది.అదే పాకిస్తాన్ ముస్లిముల అక్షరాస్యత 43.9% మాత్రమే.అంత భీబత్సం సృష్టించి విశాల ముస్లిం ప్రజానీకం అభ్యున్నతి కోసం పాకిస్తాన్ ఏర్పరచుకున్నవాళ్ళు సాధించినది ఇది!ఆ కొంచెం చదువుకున్న వాళ్లలో ఎవరయినా చదువు కోసమో ఉద్యోగాల కోసమో దేశం దాటిపోతే పాకిస్తానీయులమని చెప్పుకోవడానికి సిగ్గుపడి భారతీయులమని చెప్పుకుంటున్న దుస్థితి దాపరించింది!సరిగ్గా అక్కడ పాకిస్తాన్ తమకు సైనిక విడిదిగా ఉందటం సామ్రాజ్యవాదులకు అవసరం గనక ఒక దేశంగా నిలిచి ఉంది తప్ప లేకుంటే ఎప్పుడో కుక్కలు చింపిన విస్తరి అయ్యుండేది!భారతదేశం ఎడ్వినా ప్రియుడి పంచశీల వ్యామోహం నుంచి బయటపడి చాణక్యుది మండల సిద్ధాంతాన్ని పరిగణనలోకి తెసుకుని వ్యూహాత్మకంగా కదిలి సామ్రాజ్యవాదుల్ని తరిమికొట్టి పాకిస్తానుని మిత్రదేశంగా మార్చుకోనంతకాలం భారతదేశానికి ప్రశాంతత ఉండదు!

          సూటిగా చెప్పాలంటే కొందరు ఇంగ్లీషువాళ్ళు దుర్మార్గులనీ వాళ్లని తరిమికొట్టాలనీ ఉద్యమం చేస్తుంటే కొందరు వీళ్ళని వ్యతిరేకించి ఇంగ్లీషువాళ్ళకి మిత్రులుగా ఉంటూ అధికారంలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు.ఇంగ్లీషువాళ్ళు క్రీ.శ 1857 తొలి సాయుధపోరాటాన్ని అణిచివెయ్యడానికి సాయపడింది పాటియాలా నవాబు.చివరి వరకూ వాళ్లు ఉపయోగించుకున్న పోలీసు బలగం.సైన్యం మొత్తం లండన్ నుంచి రాలేదు,ఇక్కడి వాళ్ళనే ఉపయోగించుకున్నారు.క్రీ.శ 1909లో పండిత మదన మోహన మాలవ్యా గారు "ఇంగ్లీషువాళ్ళు మనని అన్యాయంగా ఆక్రమించలేదు,మన దేశపు రాజుల సహాయ సహకారాల తోనే అధికారంలోకి వచ్చారు" అని ఖండితంగా చెప్పారు.ఏనుగుల వీరాస్వామయ్య గారు,గురజాడ అప్పారావు గారు,మరికొందరు సంస్కర్తలు ఇంగ్లీషువాళ్ళని సత్యమును నమ్మిన పరిపాలకులు అని ప్రశంసించారు.మరి క్రీ.శ 1915 వరకొ మన మేధావులు అంత మంచివాళ్ళని పొగిడిన ఆంగ్లేయులు హఠాత్తుగా ఇరవయ్యేళ్ళలో దుర్మార్గులు యెప్పుడు ఎట్లా అయ్యారు?గాంధీ గారి ఉద్యమం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో తెలియక కాంగ్రెసువాళ్లే బెంగపెట్టుకుంటూ ఉన్నారు.కాంగ్రెసు పార్టీ రాజకీయాలు నచ్చనివాళ్ళు జోకులు కూడా వేస్తున్న కాలంలో ఇంగ్లాండులో తమకు ఏర్పడిన ఇబ్బందుల వల్ల ఫెడీమని స్వతంత్రం ఇచ్చేస్తున్నాం అనేశారు.స్వతంత్రం అంటూ వస్తే దానికోసం పొరాడినవాళ్ళే అధికారంలోకి వస్తారు గానీ దూరంగా ఉన్నవాళ్ళు రారు గదా!ఈ క్యాటగిరీలో ముస్లిములూ,హిందువులూ కూడా ఉన్నారు.వాళ్ళు హిందూ మెజారిటీ ఉన్న కొత్తదేశంలో రెండవ స్థానానికి దిగడం ఇష్టం లేక మాకు వేరే దేశం కావాలని పట్టుబట్టారు.వాళ్ళు విడిపోయి దూరంగా పోతే తమకి పోటీ తగ్గుతుందని ఇటువైపు ఉన్న "అధికారం అనే బెల్లం చుట్టూ మూగే ఈగలు" కూడా సంతోషంగా ఒప్పుకున్నారు.వారిద్దరికీ తమ తమ గొర్రెల చేత/ప్రజలచేత విభజనకి ఆమోదముద్ర వేయించుకోవడానికి దొరికిన తొండి వాదన ద్విజాతి సిద్ధాంతం!అటూ ఇటూ ఉన్న అధికారమనే బెల్లం చుట్టూ మూగి సింహభాగం కొట్టేసే పోతరాజుల సౌకర్యం కోసం భారతదేశం విడిపోయిందే తప్ప వంద మిలియన్ల ముస్లిముల సంక్షేమం కోసం కాదు - దానికి సాక్ష్యమే ఇప్పటి పాకిస్తాన్ దుస్థితి!?

          పంచ మహా పాతకాల్లో తప్పు చెయ్యని వాణ్ణి తప్పు చేశాడని నిందించడం అంటారు!అంత పాపకార్యం కట్టి కుడుపుతున్నదో ఏమో!మహమ్మదాలీ జిన్నా పాకిస్తాను ఏర్పాటు చేసిన కొద్దికాలానికే నీలిగి చచ్చాడు!బలూచ్ తీవ్రవాదులు మితిమీరిన ద్వేషంతో రగిలిపోయి అతని ఇంటిని బాంబులతో పేల్చి పారేశారు!"బ్రతికియుండినంతకాలం పట్టుపరుపుల మీద శయనించిన మహరాజులైన నేమి వారి సమాధుల పైన దున్నలు,రాసభములు తొక్కకుండిన యది చాలును,అదృష్టమే!" అన్న కవివాక్కు నిజమయ్యేలా ఖాయిద్-ఎ-అజం సమాధి దగ్గిర బ్రోతల్ వ్యవహారాలు నడుస్తున్నాయి!సరిగ్గా ఒక శతాబ్ది తర్వాత ఆంధ్రుల్ని దొంగల కింద చిత్రిస్తూ అదే పద్ధతిలో విడిపోయిన నేటి తెలంగాణ ప్రాంతపు ప్రజలు నేడు తొలితరం పాకిసాను పౌరులు ఉన్న యుగసంధిలోనే ఉన్నారు,వీరి రేపటి భవిష్యత్తు కూడా ఇవ్వాళ్టి పాకిస్తానీయులలాగే ఉంటుందా?యేమో,తెలంగాణ పౌరసమాజం విజ్ఞతకి రానున్న దశాబ్దం ఒక పరీక్షా సమయం!

నిను వీడని నీడను నేనే,కలగా మెదిలే కధ నేనే!


     రెండు సంవత్సరాల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ప్రయోజనం పొందాలనే స్వార్ధంతో ఎటువంతి ముందస్తు చర్యలు లేకుండా,ఏ విధమైన ప్రణాళికలూ లేకుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది.విడిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సామాన్యప్రజలకు,ప్రభుత్వాధికారులకు,ఉద్యోగులకు కడగండ్లు మిగిల్చింది.తప్పనిసరిగా ఇవ్వాలని తెల్సినా ప్రత్యేకహోదాని బిల్లులో అధికారికమయిన అంశంగా చేర్చకుండా ఈరోజున ముఖ్యమంత్రి నుంచి అశేష ప్రజానీకం వరకు కేంద్రప్రభుత్వాన్ని బిచ్చగాళ్ళలా దేబిరించాల్సిన పరిస్థితి కల్పించింది.బిచ్చగాళ్ళ కయినా నాలుగిళ్ళు తిరిగితే ఏ దయగల తల్లయినా నాలుగు మెతుకులు విదులుస్తుందనే గ్యారెంటీ ఉంటుంది గానీ ఆంధ్రప్రజలు అది కూడా లేనంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు.రాజధాని కూడా ఏర్పాటు చెయ్యక్యండా విడదియ్యటం వల్ల ఇప్పుడు రాజధాని నిర్మాణమే భయాందోళనలకు గురిచేస్తున్నది.అధికారుల పంపకాలు ఇప్పటికీ పూర్తి కాలేదు,ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు.ఆంధ్రప్రదేశ్ రాష్త్రానికి సంబంధించ్హిన రికార్డులు లక్షల సంఖ్యలో తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉన్నట్టు తెలుస్తున్నది,అవి ఎప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేయబడతాయి?ఏతావాతా,ఆంధ్రప్రదేశ్ ఎవరికీ పట్టని వెలివేయబడ్డ రాష్ట్రంలా తయారయింది.ఉపయోగం ఉందో లేదో తెలియని ప్రత్యేకహోదా చుట్టూ వేటకోసం అడవిపందులు చేసే భీబత్సాన్ని తలపించే రాష్త్రంలోని అన్ని రాజకీయ పక్షాల నాయకులు చేస్తున్న ఆర్భాటాల్ని చూస్తుంటే ప్రజాస్వామ్య పరిపాలన మీదనే నమ్మకం పోయి రాజరికానికైనా తలవంచాలనేటంతగా నిర్వేదం కలుగుతున్నది! 

రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం!


    రాష్ట్రవిభజనని కోరుకున్నవాళ్లు "ఆంధ్రావాళ్లు మా ప్రాంతాన్ని దోచేశారు.అందుకే మేం వెనకబడిపోయాం.విడిపోతే ఇంతకన్నా గొప్పగానే బతగ్గలం" అనే మొండివాదన తప్ప సహేతుకమైన ఆధారాల్ని చూపించి శాస్త్రీయమైన విశ్లేషనతో విభజన యొక్క అవస్రాన్ని ఎవరికీ నిరూపించలేకపోయారు.తమ ప్రాంతపు ప్రజాప్రతినిధుల్నే తమ సభ్యత్వాలకి రాజీనామాలు చేయించడానికి "రాజీనామాలు చెయ్యకపోతే తెలంగానలో తిరగనివ్వం,తంతాం,గుద్దుతాం,నాలుకలు చీరేస్తాం" అనె రండాగొండి భాష మాట్లాడారు.చక్కని హేతుబద్ధమైన వాదనతో ఒప్పించగలిగితే ఈ బజారురౌడీల భాష మాట్లాడాల్సిన అవసరం ఏమిటి?ప్రపంచంలో అన్యాయాన్ని ప్రతిఘటించటానికి చేసిన ఏ న్యాయపోరాటమూ ఇంత జుగుప్సాకరంగా జర్గలేదు!ఆంధ్రప్రాంతపు కొందరు విచక్షణ గల రాజకీయనాయకులు ఈ పరిష్తితి వొహించి ఎన్నోసార్లు విభజనకి ఒప్పుకుంటున్నాం,కొంచెం సామరస్యమైన పద్ధతిలో చేసుకుందాం,ఒకచోత కూర్చుని చర్చించుకుని పంచుకోవాల్సినవి న్యాయంగా పంచుకుని విడిపోదాం అని బ్రతిమిలాడినా వినిపించుకోలేదు.సామరస్యమైన పద్ధతి అంటేనే విభజనని వ్యతిరేకించడం అనే అర్ధం వారికి వారే చెప్పేసుకుని మరింత మొండికెత్తారు తప్పిస్తే ఏనాడూ కనీసపు వివేకం కూడా చూపించలేదు."కలవటానికి ఏకాభిప్రాయం కావాలి గానీ విడిపోటానికి ఏకాభిప్రాయం అఖ్ఖర్లేదు" అనే తింగరి వాదన యెక్కణ్ణుంచి కొట్టుకొచ్చారో!అంటే,మేం విడిపోవాలనుకుంటున్నాం గాబట్టి మాకు మా రాష్త్రం కావాలి - అంతే!మీరు చెప్పేది మేము వినం అనే ఏకపక్షపు అపజాస్వామికపు వాదనలే చేశారు.ఉద్యమవీరులు మొదటినుంచీ 23 జిల్లాల నుంచీ ఎన్నికైన శాసనసభ్యుల మధ్య జర్గాల్సిన చర్చలకి గానీ వారి వోతింగులకి గానీ ఏమాత్రం విలువ ఇవ్వకుండా కేంద్రం ఆర్టికిల్ మూడు ద్వారా విడగొట్టి ఇచ్చే ఏకపక్షపు విభజనయే మాకు కావాలని భీష్మించుకోవడం వల్లనే ఈనాడు 13 జిల్లాల తెలుగు ప్రజల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకార బంధురమై ఎంతటి మేధావికైనా అభివృద్ధి సంగతి దేవుడెరుగు,ఏనాటికైనా సొంతకాళ్ళ మీద నిలబడగలుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి నెలకొనింది!ఈ దుస్థితికి ఎవరు బాధ్యత తీసుకుంటారు?

పోతే పోనీ పోరా!ఈ పాపపు జగతిన శాశ్వత మెవడురా!


     నోరుగలవాళ్ళు గనక యాభై అరవై యేళ్ళు మమ్మల్ని దోచుకుతిన్న పాపం ఇప్పుడు కట్టి కుడుపుతున్నదని కూడా అంటారేమో!విడిపోయి కలిసుందాం అని నీతులు చెప్తూనే సహకరించుకుంటూ విడిపోవటం కోసం ప్రయత్నించినప్పుడల్లా "ఇన్నాళ్ళూ మమ్మల్ని దోచుకుని బాగుపడ్డారు,ఇకముందు సాగదేమోనని బెంగతో కాళ్లబేరాని కొచ్చారు" అని రీజనింగులు లాగిన మెధావులు గదా!పోనీలే ఇన్నేళ్ళు తెలాంగాణోళ్లని దోచుకుతిన్న పాపం ఆంధ్రోళ్లని కట్టి కుడుపుతున్నదని సరిపెటుకున్నా,విడిపోతే ఇంతకన్నా గొప్పగా బత్కగలమని కలౌ గన్న తెలంగాణోళ్ళ పరిస్థితి గూడా పెనం మీదనుంచి పొయ్యిలో పడిన చందంగా తయారయింది గదా!విడిపోయేనాటికి మిగులురాష్ట్రం అన్న ధీమా,అప్పటికే 23 జిల్లాల నుంచి వచ్చే మొత్తం అవిభక్త రాష్ట్రపు నికరాదాయంలో 43% తీసుకొస్తున్న బంగారుగుడ్లుపెట్తేబాతు హైదరాబాదును మనమే కొట్టేశాం లెమ్మన్న భరోసాతో ఉన్నారు గానీ నిన్నటి నుంచ్జి నేటికీ,నేటి నుంచి రేపటికీ సమాజం నడిచే ప్రయాణంలో గతానుగతికంగా అల్లుకుపోయిన కార్యకారణశృంఖల యొక్క ఫలితాంశంగా కనపడే రేపటి తెలంగాణ ముఖచిత్రం కూడా ఉద్యమకాలపు దృశ్యాల మదిరిగానే ఉండదని గ్యారెంటీ యేముంది?

ఎవరికోసం?ఎవరికోసం?ఈ రీడిజైనింగ్లు,ఈ డబల్ బెడ్రూం ఫ్లాట్లు ఎవరికోసం!


     నీళ్ళు,నిధులు,నియామకాల్లో మొదటిదైన నీటిపారుదల కోసం ప్రాజెక్టుల రీడిజైంగు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజంటేషను యొక్క పూర్తిపాఠం చదవగానే నాకుకూడా అద్భుతమైన ప్లాను అనే అనిపించింది.ఈ దెబ్బతో తెలంగాణ రైతుల నీటికష్టాలు తీరుతాయి అనే నమ్మకం కలిగింది.కానీ,ఎందుకైనా మంచిది ఈ పెద్దమనిషి మాటల్లో నిజమెంత ఉందని పరిశీలించి చూస్తే ఎంతో అమాయకంగా ఓట్లేసి గెలిపించి అధికారం కట్టబెట్టి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నవాళ్ళని ఎంత తెలివిగా బురిడీ కొట్టిస్తున్నాడో అర్ధమై గుండె గుభేలు మనింది! 

     1947లో రాష్త్రాల సమాఖ్యగా అవతరించిన భారత్దేశంలోని ఒక రాష్తర్ప్రబుత్వం తన రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టు కటుకోవాలంటే సంకల్పానికీ నిర్మాణానికీ మధ్య ఎన్నో దశలు ఉన్నాయి,పధతులు ఉన్నాయి - సమయం,సహనం కూడా అవసరమే!ఈయన దణ్ణాలు పెడుతూ పొగిడిన కాకతీయ ప్రభువులు సర్వస్వతంత్రులు గాబట్టి సంకల్పించిన వెంటనే కట్టెయ్యగలిగారు,ఈయనకి కూడా కేంద్రం అనుమతులు ఇవ్వాల్సిన పని లేకుండా తెలంగాణ మీద సర్వాధికరాలు దఖలుపడితే తప్ప వాళ్ళు నిర్మించినంత తొందరగా ఈయన కట్టలేడు.పెండింగులో ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల గురించి "తెలంగాణ ప్రాజెక్టులు అంటే చాలు,పెండింగులో పెట్టస్తారు" అంటున్నవాడు ఆంధ్రా,రాయలసెమకి చెందిన ప్రాజెక్టులు కూడా పెండింగులో ఉన్నాయని ఎందుకు మర్చిపోయాడు అమోఘమయిన జ్ఞాపకశక్తి గల ఈ మేధావి?అందులో నిజమే ఉన్నా ఇప్పుడు చెయ్యగలిగింది లేదు,నోటిదురద తీర్చుకోవటం తప్ప - బతిమలాడుకునో దెబ్బలాడో అనుమతులు తొందరగా తెచ్చుకోవటం తప్ప మరోదారి లేదు!అది వదిలేసి ఈ ప్రజంటేషన్లు తయారుచెయ్యడం వల్ల ఉపయ్తోగం ఏమిటి?పాత ప్రాజెక్టులకి కొత్త డిజైన్లు తయారు చేసినంత మాత్రాన ఈ కొత్త డిజైన్లు పట్టుకుని ఇప్పటికిప్పుడు కట్టుకోవటం ఎట్లా కుదురుతుంది?వీటిని కూడా కేంద్రానికి పంపించాల్సినదె గదా, అఖ్ఖర్లేదా!రెడ్డొచ్చె మొదలాడు న్నట్టు ఇప్పుడు పంపిస్తే వీటికి అనుమతులు ఎప్పటికి వస్తాయి?మరి,కేంద్రానికి ఆల్రెడీ పంపించి పెండింగులో ఉన్న పాత ప్రాజెక్టుల సంగతేంటి?

     ఇంకా ఘోరం ఏంటంటే,రాజ్యాంగబద్ధమైన ఎన్నికలప్రక్రియలో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఉన్న చట్టాలని ఉపయోగించుకుని పరిపాలించిప్రజల్లో తెలంగాణ భవిష్యత్తు పట్ల ఉన్న భయసంకోచాల్ని పోగొట్టటానికి బదులు "అనుమతులు లేకపోయినా సరే,  మొదలుపెట్టేద్దాం,పిడుగులు కురిపిద్దాం,భూకంపాలు పుట్టిద్దాం" అని పక్కా కబ్జాదారులా మాట్లాడుతూ కాస్తోకూస్తో తెలివితేటలు గలవాళ్లని అందులో ఉన్న మతలబు అర్ధమై భయభ్రాంతులకి గురి చేస్తున్నాడు.కబ్జా అంటే యేంటి - మొదట తనది కాని స్థలంలో అక్రమ కట్టడాలు కట్టేసుకుని తర్వాత ప్రభుత్వపెద్దలకి చేతులు తడిపి క్రమబద్ధీకరించేసుకోవటం,అంతేనా?సాక్షాత్తూ ముఖ్యమంత్రియే కబ్జాదారులా రెచ్చిపోతుంటే మీ ఇంటిని కబ్జా చేసిన దగాకోరుల్ని మీరు నిలవరించగలరా?"స్వయంగా మ ముఖ్యమంత్రి చేస్తుంటే తప్పు లేదు గానీ నేను చేస్తే తప్పేంటి?రాజు చెయ్యగా నోర్మూసుకుని బంటు చెయ్యగా అడ్డుకోవటం అన్యాయం!" అని అతనంటే?

కల ఇదనీ నిజ మిదనీ తెలియదులే,బ్రతుకింతేనులే!


     ఎప్పట్నించో రూపాయి బిళ్లలు నదుల్లో వేస్తున్నానని సాక్ష్యాలు గూడా చూపిస్తున్నాడు గాబట్టి ఎట్లాగోట్లా ప్రాజెక్టుల్ని పూర్తి చెయ్యాలనే తపనతో చేస్తున్నాడు లెమ్మని అనుకున్నా రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న కేంద్రం ఇక్కడ కురిపంచే పిడుగులకి భయపడిపోయి అనుమతులు ఇచ్చేస్తుందా?సాంకేతికంగా అనుమతులు లేనప్పుడు కోర్టులు కలగజేసుకుని ఆపివేసే అవకాశమూ ఉంది కదా!అయితే,అసలు కిటుకు అది కాదు - ప్రాజెక్టులకి అనుమతులు నిరాకరించబడినా,కోర్టుల ప్రమేయం ద్వారా ఆగిపోయినా సెంటిమెంట్లు రెచ్చగొట్టే వీలు తెలంగాణలో అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉంటుంది,పైగా కట్టిన దానికి కంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వక తప్పదు,ఔనా?అదంతా తెలంగాణ ప్రజల కష్టార్జితమే గదా!ఆ కంట్రాక్టర్లు ఇచ్చే మామూళ్ళ కోసమే గదా అన్ని పార్టీల నాయకులూ అధికార పార్టీలోకి వరదలుగా వచ్చి పడుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే అది కాంట్రాక్తర్ల పనియే, నాయకులు ఇచ్చిపుచ్చుకుంటూ దాన్ని జరిపిస్తారు.ఆ భవనానికి వాస్తు సరిగ్గా లేదు,ఈ భవనానికి పగుళ్ళు ఉన్నాయి,వీటిని కూల్చి కట్టాలి అని పదవిలోకి వచ్చిన కొత్తల్లోనే చేసీన్ హడావిడి వెనక కూడా కాంట్రాక్టర్లకి ఆదాయం సమకూర్చి పెట్టాలనే రంధి తప్ప మరొకటి లేదు!కాంట్రాక్టర్లకి రంగూ,రుచీ,వాసనా ఉండవనే నిజం ఈమధ్యనే హరీష రావు గారికి బోధపడింది,తక్కిన జనాలకి కూడా త్వరలోనే తెలుస్తుంది, కొంచెం ముందూ వెనకా - అంతే! 

అంతా భ్రాంతియేనా?ఆశా నిరాశేనా?జీవితాన వెలుగింతేనా?


     ఎక్కడో దూరంగా ఉండి పత్రికల్లో వార్తలు చదువుతూ ఉన్న నాకు ఇని సందేహాలు వస్తున్నాయి,ఇంత ఆందోళనగా ఉంది గానీ కళ్ళముందు జరుగుతున్న జగన్నాటకాలు చూస్తున్నా తేలంగాణ మేధావులు మాత్రం "చూస్తూ చూస్తూ రెండేళ్ళు గడిచాయి, ఇంకా ఎనిమిది సంవత్సరాల తరువాత కూడా మీరూ నేనూ ఇక్కడే బ్లాగ్లోకంలో ఉంటాము.తెలంగాణా ఏర్పడగానే ఎన్నో ఉపద్రవాలు జరుతాయని ఊహాగానాలు చేసిన వారు అంతర్థానం అయ్యారు ఎందుకో ఏమో?" అని దీర్ఘాలు తీస్తూ అరమోడ్పు కనులతో అజాగళస్తనముల వంటి దివాస్వప్నములలో విహరిస్తూ చిదానందమూర్తుల లాగ కాలం గడిపేస్తున్నారు!ఇంతవరకు నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతోనూ,దబల్ బెడ్రొం ఫ్లట్ల పేరుతోనూ కాంట్రాక్టర్ల ఆకలి తీర్చడానికి చూట్టమే తప్ప సామాన్యప్రజలకి పనికొచ్చే పని ఒక్కటి చెయ్యలేదు.వాహనాల రీవ్రిస్ట్రేషన్ దగ్గిర్నుంచి గుడుంబా వాడకాన్ని తగ్గించటానికి కల్తీకల్లు అమ్మటం వరకు ఎన్నో పిచ్చి నిర్ణయాలు తెసుకున్నా ముఖ్యమంత్రి ఇంకా మేధావిగానే పరిగణించబడుతున్నాడు - ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్న లెఖ్ఖన!జరగాల్సిన భీబత్సమంతా జరిగిపోయి తెలంగాణ మొత్తం చంకనాకిపోయాక అప్పుడు కళు తెరిచి "అర్రెర్రెడ్డెడ్డెడ్డె, గిదేంది?గదేంది?గట్లట్ల అయితనుకుంటె గిట్లెట్ల అయితంది?ఎవళ్ళు జేసిన్రు?ఎవర్ని దిట్టాలె?" అని మళ్ళీ జజ్జనకరెజనారేలు మొదలుపెడతారేమో!

దేవుడనేవాడున్నాడా అని ఆంధ్రులకు కలిగెను సందేహం?


     విభజన ప్రహసనం ఆఖరి సన్నివేశం పెప్పరు స్ప్రే భాగోతాలు దాటి ఎవడు యస్సన్నాడో ఎవడు తూచ్చన్నాడో స్పీకరు మహాతల్లికే తెలియని గందరగోళంలో స్పీకరుకి ముందే ఇవ్వబడ్డ ఆల్టిమేటం ప్రకారం ఆవిడగారు అన్నిట్నీ యస్సుల కిందే లెక్కేసి మమ అనిపించేశాక ఒక తమాషాతో పొర్తయింది!సుషమా స్వరాజు తెలనాణోళ్ళని "ఈ చిన్నమ్మని గుర్తుంచుకోండి" అని బతిమిలాడుకునే విచిత్రమైన సన్నీవెశం అప్పుడు అనుకోకుండా జరిగందని అనుకున్నాము గానీ ఇప్పుడు ఆలోచిస్తే విభజన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ మట్టిగొట్టుకుపోవటం ఖాయమని అందరికీ తెలిసిపోయి ఇంకా వాళ్ళ వోట్లతో యేంపని అనుకున్నట్టు లేదూ!అందరితో పాటు ఆంధ్రావాళ్ళ మద్దతు కూడా కావాలి గదా అని అనుకుని ఉంటే అస్సలు ఆంధ్రావాళ్ళని పలక్రించకుండా యెందుకుంటుంది?ఎప్పుడూ వోట్ల కోసం నానా గడ్డీ కరిచే కాంగ్రెసు కూడా ఆంధ్రాలో వోట్లు పడవు అని తెలిసినా ఇలాగే విభజించాలని ఎందుకు తహతహలాడింది?

ఎవరో!ఎందుకీరీతి సాధంతురు!ఏల పగబూని వేధంతురు?


     నిజమే,ఎవరో పనిగట్టుకుని విభజన ద్వారా తెలంగాణ అనే కొత్త రాష్ట్రాన్ని పుట్టించటమే కాకుండా పాత రాష్ట్రాన్ని గిట్టించటమూ నేను కళ్ళారా చూడాలి అని పంతం పట్టి కూర్చుంటే అతన్ని సంతోషపెట్టటానికి జరిగినట్టు ఉంది విభజన తొలినాటి నుంచీ అది పూర్తయ్యేవరకు జరిగిన కధంతా!దాసరి నారాయణ రావు కూడా విభజనలో ఒక బ్రోకర్ ఉన్నాడు అన్నాడు,ఎవడు వాడు?అలా కాదనుకంటే,నూరేళ్ళకి పైబడి ప్రజా జీవితంలో ఉన్న పార్టీలో ఉండి ఎంతో కాలం నుంచీ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న సీనియర్ నయకులు కూడా విభజన తర్వాత ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వాడిమీదవీడూ వీడిమీదవాడూ దొంగకేసులు పెట్టుకుంటుంటే అటూ ఇటూ ఉన్న బుద్ధిమట్టుగాళ్ళు "మా ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని ఎంత చావుదెబ్బ కొట్టాడో!","మా ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రికి ఎంత గట్టి రిటార్టు ఇచ్చాడో!" అని మురుసుకోవటానికి పనికొచ్చే విధంగా వొదిలారు తప్ప సయోధ్యగా విడిపోయి సహకరించుకునేటందుకు అవసరమైన ప్రతిపాదన ఒక్కటీ ఎందుకు వుంచలేకపోయారు?

బాబూ,వినరా, అన్నాతమ్ములా కధ ఒకటి!!


     సుమారు పన్నెండేళ్ళ క్రితం ఈసారి ఎట్లాగైనా స్వతంత్ర తెలంగాణను సాధించుకోవాలని నిశ్చయించుకుని వ్యూహరచన చేసినవారిలో చంద్రబాబుని ఉద్యమ మెయిన్ విలన్ స్థానంలో నిలబెట్టాలని సూచించిన వ్యక్తి ఎవరో గానీ అతను కాలాంతక నరాంతక దేవాంతకులను మించిన అఖండుడు!ఎందుకంటే,వారిలో తమ ప్రసంగాలను విన్నవాళ్ళు ఆత్మహత్యలకు సైతం ప్రేరేపించగలిగిన చతురత ఉన్నప్పటికీ,సాంకేతికంగా ఆర్టికిల్ మూడు అనే బ్రహ్మాస్త్రం వారి వద్ద ఉన్నప్పటికీ - చంద్రబాబుని ఖాళీగా ఉండనిస్తే తనకి జాతీయస్థాయిలోని అన్ని రాజకీయ పక్షాలలో ఉన మిత్రులను ఉపయోగించుకుని ఈ దుర్మార్గమైన ఏకపక్షపు విభజనని చాలా తేలిగ్గా అడ్డుకోగలిగిన సమర్ధుడు.అందుకే విభజనని సూత్రప్రాయంగా ఒప్పుకుంటూ ఎన్నిసార్లు ప్రకటనలు చేసినా,ఉత్తరాలు ఎప్పుడు ఏ రకంగా అడిగితే అప్పుడు ఆ రకంగా ఇచ్చినా పదే పదే అతనినే టార్గెట్ చేశారు గానీ పదేళ్ళు తాత్సారం చేసినా,ఆఖరి దశలో కికురెతో అంత గడబిడ చేయించినా కాంగ్రెసుని ఒక్క మాట కూడా అనలేదు - నా ఉద్దేశంలో కికురె భాగోతం కూడా ముందుగానే వేసుకున్న ప్లానులోని ఒక అంకం మాత్రమే!అప్పుడూ ఇప్పుడూ పదవుల కోసమే రాజకీయాలు చేసే చిల్లర మల్లర పొలిటీషియన్లకి అలాంటి టార్గెట్ బాబు అనే ప్లాను తోచి చస్తుందంటే నమ్మటం కష్టమే - సాయుధ పోరాటపు రణతంత్రం పట్టుబడిన వాళ్ళకి మాత్రమే అలాంటి క్రూరమైన వ్యూహాలు పన్నటం కుదురుతుంది!

     "టార్గెట్ బాబు" అన్న ఎత్తుగడకి ఉన్న కొసరు కారణం ఆఖరి దశలో విభజనని అడ్డుకోనివకుండా చెయ్యటం అయితే,అసలు కారణం తెలియాలంటే బాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ జరిగిన కొన్ని ప్రముఖమైన విషయాల్ని గుర్తు చేసుకోవాలి.ముందు ముందు తెలంగాణలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అతను ఈజీగా తండ్రి చేసిన మంచిపనుల్ని కంటిన్యూ చేస్తూ పోవచ్చు గానీ ప్రజలందరూ దేవుడిలా కొలిచే రామారావుని పడగొట్టి వచ్చినవాడిగా బాబు కొంతయినా అభివృద్ధి చేసి చూపించకపోతే "వెన్నుపోటు దారు","మామను చంపిన అలుడు" లాంటి చెడ్డపేర్లు మాత్రమే స్థిరపడి పోతాయి తప్ప అంత సాహసం చేసినందుకు ఆశించిన మంచిపేరు చచ్చినా రాదు,అవునా!అది అతనికీ తెలుసు గనక బుద్ధిగానే పనిచేశాడు.తొమ్మిదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని సంపన్న రాష్త్రంగా మార్చాడు.లక్ష కోట్లకు పైబడిన బడ్జెట్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాడు.హైదరాబాదుకు హైటెక్ హంగులు అద్దాడు.

     కానీ యేమి లాభం?రామహత్యాపాతకం పనిచేసింది కాబోలు - సకాలంలో వర్షాలు పడకపోవటం,రైతులు కష్తాలు పడటం,కంప్యూటరు వెనక్కాల కూర్చుని మనుషుల్ని పట్టించుకోలేదన్న అప్రదిష్టా కలిసి రోగశేఖర రెడ్డికి పదవిని కోల్పోయాడు!పాకిస్తాను ఏర్పాటులో పక్కతాళం వేసిన కమ్యునిష్టుల లాగే ఇక్కడి నక్సలైట్లు ఈ బూర్జువా నియంతకి గాలికొట్తి అధికారంలోకి వచ్చేలా చేసి తర్వాత ఛత్రపతి శివాజీని బంధించిన ఔరంగజేబుని ఇమిటేట్ చేస్తూ పద్మసరస్సునివాసి వేసిన ఎత్తుల్తో అణగారిపోవటం మీకూ తెలుసు!ఆ ద్రోహం తర్వతనే వారిలో ఇక రాష్ట్రాన్ని చీలిస్తే తప్ప మళ్ళీ పుంజుకోలేమనే నమ్మకం వారికి కలిగింది.ఇప్పుడు కేసేఅర్ కూడా నిర్దాక్షిణ్యంగా అణగదొక్కాక ఉసూరుమన్నారు గానీ అప్పట్లో చంద్రబాబు నీడ లేకుంటే చాలు,విడిపోయాక తెలంగాణలోని అసమర్ధపరిపాలనని అడ్డుపెట్టుకుని,తొలినాటి అరాచకత్వపు గందరగోళాన్ని ఉపయోగించుకుని ఎకాఎకిన అధికారమే చేపట్టవచ్చుననే హుషారు వచ్చేసింది వారికి!ప్రజల కోసం ప్రాణాలర్పిస్తూ త్యాగమూర్తులుగా పేరు తెచ్చుకోవడం వల్లనో,వారి భావజాలం పట్ల వ్యామోహం ఉండటం వల్లనో,వాళ్ళ వల్లనే తెలంగాణ ఏర్పడినదనే కృతజ్ఞత వల్లనో కొందరు ఒపుకోకపోవచ్చు గానీ బాబు రహిత తెలంగాణని కోరుకుని విభజన ప్రక్రియలో అతని ప్రమేయాన్ని ఏమాత్రం ఉంచకూడదని ఆ విధంగానే విభజనని జరిపించిన వారి క్రూరమైన వ్యూహమే విభజిత మాతృరాష్త్రం యొక్క దుస్థితికి ముఖ్యమైన కారణం!దూరదృష్టీ,కార్యదీక్షా పుష్కలంగా ఉన్న అతని నేతృత్వంలో ఆర్ధికాభివృద్ధి పరుగులు పెడుతూ అసమానతలు తగ్గుతూ ఉంటే సుఖంగా బతుకుతున్న ప్రజల్లో సాయుధ పోరాటం పట్ల ఆకర్షణని పెంచటం కష్తం కదా!అందువల్లనే తమకి నమ్మకద్రోహం చేసిన రోగశేఖర రెడ్డి కన్నా చంద్రబాబు పట్లనే ఎక్కువ వ్యతిరేకతని వారు పెంచుకున్నారు,ఇతర్లకి పెంచారు. 

విధి ఒక విషవలయం!విషాద కధలకు అది నిలయం!!


     ఇప్పటి ఉద్యమంలో వీరావేశంతో పాల్గొన్నవారిలో మూడురకాల వ్యక్తులు ఉన్నారు.పైన చెప్పిన నక్సలైట్లు వ్యూహరచన చేస్తే కొత్త రాష్త్రంలో తమకు దక్కబోయే లాభాల కోసం ఉద్యమాన్ని పోషించిన కాంట్రాక్టర్లు వారితో కలిసిన చిత్రమైన గుంపు!పరస్పర వ్యతిరేక శక్తులు సంఘర్షించకండా సహకరించుకుంటూ ఈ చరిత్రను నిర్మించటం విశేషం!రెండో రకం వ్యక్తులు నక్సలైట్ ఉద్యమంలో పూర్తికాలం పని చెయ్యకపోయినా వారిపట్ల ఆకర్షణ ఉన్నవాళ్ళు. అంటే,ఒకాయన శ్రీశ్రీ గురించి "లెఫ్టుకే ఉంటాడు గానీ రైటుకీ జరుగుతాడు" అన్నట్టు గవర్నమెంటు వాళ్ళని చంపుతున్నప్పుడు జాలిపడుతూ నక్సలైట్లు వేరేవాళ్ళని చంపుతున్నప్పుడు వాళ్ళకి దూరమవుతూ గడబిడ చేస్తూ బతుకుతున్న "మధ్యే మధ్యే ఆచమనం సమర్పయామి" గాళ్ళు!ఇక మూడోరకం ఎవరంటే పై స్థాయిలో వ్యూహకర్తలూ,వారి వందిమాగధులూ కలిసి చేస్తున్న సాహితీకౌశలపు మాయాజాలనికి మెస్మరైజ్ అయిపోయి వాళు నాటిన "ఆంధ్రోళ్ళ పెత్తనం","తరతరాల తెలంగాణ అణచివేత","బాబు కుట్ర" అనే విత్తనాలకి ఎరువులుగా ఉపయోగపడే బుడ్డా మురళి లాంటి దారితప్పిన మేకపిల్లలు!

చెబితే వింటివ గురూ గురూ?వినకే చెడితిర శిష్యా శిష్యా!


     బుడ్డా మురళి గారు నేను బ్లాగుల్లోకి రాకముందునుంచీ రచనలు చేస్తున్న సీనియర్ రాజకీయ విశ్లేషకులు!వారి నేతాశ్రీ వ్యాస పరంపర చదివి చాలామందికి లాగే నేనూ ఆయనకి అభిమాని నయ్యాను.ఎంత సీరియస్ విషయాన్నయినా సటిల్ హ్యూమరు రంగరించి ఎంతవరకు చెప్పాలో అంతవరకు మత్రమే చెప్పి తప్పుకోగల్గిన బ్రివిటీ ఆయనకి మాత్రమే సొంతం.ఈ బ్రివిటీ కోసం మొదట్లో నేను చాలా తంటాలు పడి నాకది కుదిరేది కాదని లేటుగా తెలుసుకుని వొదిలేశాను.కానీ మిగతా విషయాల్లో.ముఖ్యమైనది పెద్ద పెద్ద వాక్యాల్ని చిలవలు పలవలుగా అల్లుకుపోవటంలో ఉన్న పోలికల్ని చూస్తే ఆయన నాకు గురుతుల్యుడు అని నేనంటే కాదని మీరూ అనలేరు,అవునా?కాని,ఈ మధ్యనే కొద్ది వారాల తేడాతో ఈయన వేసిన రెండు పోస్టులు చదివాక గోబెల్సు తరహా ప్రచారం ఎంతటి మేధావినైనా ఎంతటి అధమస్థాయికి దిగజారుస్తుందో అర్ధమైంది.నేను మాత్రం పొరపాటున గూడా అటువంటి దుస్థితికి దిగజారకుండా ఉండేటట్లు నిగ్రహంగా ఉంచమని దేవుణ్ణి వేడుకుంటున్నాను - అది గుర్తొచ్చినప్పుడల్లా!

     మొదటి పోస్టు చంద్రబాబు మనవడికి సంబంధించిన ఫంక్షన్ ఏదో జరిగినప్పుడు:."పుట్టబోయే శిశువులకి కూడా వంశపారంపర్య రాజ్యాధికారాన్ని దఖలు పర్చే మధ్యయుగాల నాటి సంరంభం కనిపిస్తున్నదహో!" అని తీవ్రస్థాయిలో యేకిపారేశారు.రెండో పోస్టు కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల బాధ్యతల్ని కేటీఆర్ గారికి అప్పజెప్తున్న వార్త వచ్చినప్పుడు:"ఒక సమర్ధుడైన యువనేతకి అనుభవజ్ఞుడైన తండ్రి బాధ్యతల్ని అప్పజెప్తూ ఇస్తున్న శిక్షణా కార్యక్రమం"గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు.మొదటి పోస్టు వేనాటికే కర్ణాకర్ణిగా కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి పీఠానికి కూడా కేటీఆర్ పేరు వినబడుతున్నది,అవునా కాదా?ఆ రెండు పోస్టుల్లో ఏదోఒకటి రాయకుండా ఉండిఉంటే నాకిప్పుడు దొరికిపోయేవాడు కాదు.మొదటి పోస్టు వేస్తున్నప్పుడు ఇదేపని కేసీఆర్ చేసినప్పుడు పొగడాల్సి వస్తుంది,ఇప్పుడిట్లా బాబుని విమర్శిస్తే ఎవరన్నా నన్ను తప్పు పడతారేమో అనే అనుమానం రాలేదు - తొందర!రెండో పోస్టు రాస్తున్నప్పుడు ఇదేపని బాబు చేసినప్పుడు విమర్శించాను,ఇప్పుడిట్లా కేసీఆర్ గార్ని పొగిడితే ఎవరన్నా నన్ను తప్పు పడతారేమో అన్న అనుమానం రాలెదు - నిర్లక్ష్యం!

     బాబయినా కసీయారయినా పాలిటిక్సులోకి వచ్చారూ అంటే చెప్పీన్ మాటలకి చప్పట్లు కొటించుకోవటం,ఎన్నికల్లో నిలబడితే ఓట్లు రప్పించుకోవటం కోసమే గదా!చప్పట్లు కొట్టించుకోవాలంటే మీకు ఫలానాది చేస్తానని చెప్పాలి,ఓట్లు రాబట్టుకోవాలంటే మీకు ఫలానాది చేశానని చూపించుకోవాలి - కావాలని ఒక ప్రాంతానికి అన్యాయం చేసి ఆ ప్రాంతం వాళ్ళని ఓట్లు అడగగలడా?

పయనించే ఓ చిలుకా - ఎగిరిపో, పాడైపోయెను గూడు!


     ఈయనొక్కడే కాదు,నేను చూసిన ప్రతి తెలంగాణ వాది ఇంత గందరగోళంలోనే ఉన్నాడు."చూస్తూ చూస్తూ రెండేళ్ళు గడిచాయి, ఇంకా ఎనిమిది సంవత్సరాల తరువాత కూడా మీరూ నేనూ ఇక్కడే బ్లాగ్లోకంలో ఉంటాము.తెలంగాణా ఏర్పడగానే ఎన్నో ఉపద్రవాలు జరుతాయని ఊహాగానాలు చేసిన వారు అంతర్థానం అయ్యారు ఎందుకో ఏమో?" అని దీర్ఘాలు తీస్తున్న పెద్దమనిషి శతకోటి లింగాల్లో ఒక బోడిలింగం అన్నట్టు జరిగిన గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల గురించి స్టాటిస్టిక్సూ,అడ్డనిలువుల టేబుళ్ళూ,గ్రాఫులూ,రిఫరెన్సులూ,కంపారిజన్లూ వదకట్టి గిలకొట్టి తిరగేసి మరగేసి మూడు పోష్టులు రాశాడు గానీ "స్వతంత్ర తెలంగాణపు నికరమైన వార్షికాదాయం ఎంత?వచ్చే ఎనికల్లో మళ్ళీ పవరులోకి రావడానికి ఉపయోగపడతాయని వూహిస్తూ సంక్షేమ పధకాలకి పెడుతున్న ఖర్చు ఎంత?ఆదాయంలో సింహభాగం వీటికే ఖర్చుపెడితే అభివృద్ధికి ఎక్కణ్ణించి డబ్బు తేవాలి?ఆదాయానికి మించి ఖర్చు చెయ్యటం ద్వారా పెరిగే అప్పుల్ని తీర్చడానికి గవర్నమెంటు దగ్గిర ఉన ప్లాను ఏమిటి?" అని ప్రశ్నించుకుని విషయాలని తెలుసుని రాస్తే బాగుండేది కదా!

     చాలామందికి వస్తున్నట్టే డబల్ బెడ్రూం ఫ్లాట్ల పధకం గురించి నాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి - ఇదసలు సాధ్యమేనా?మొత్తం రాష్త్రంలోని బీదవాళ్ళు ఎంతమంది?అందరికీనా అర్హులైన కొందైకేనా?అర్హత ప్రాతిపదిక ఏంటి?ఆశిస్తున్న వాళ్ళలో నికరంగా అర్హులైన లబ్దిదారులు ఎంతమంది ఉన్నారు?కుటుంబం అంటే భార్యా భర్తలూ వాళ్ళ ఇద్దరు పిల్లలు మాత్రమే అయితే నలుగురు,కానీ ఇద్దరిలో ఎవరో ఒకరికి ముసలి తలిదండ్రులు ఉంటే మొతం ఆరుగురు స్వేచ్చగా తిరగటానికి ఎంత స్థలం అవస్రం?అపాటుమెంట్లుగా కడితే బిల్డింగుకీ ప్రహరీకీ మధ్యన స్పేస్ కావాలి.విడిగా ఇల్లు కడితే ఓవరాల్ స్పేస్ మల్టిపలి అవుతుంది.గవర్నమెంటు దగ్గిర అంత బ్జూమి లేకపోతే కొనాల్సి ఉంటుంది.ఈ దబ్బ్బంతా తన సొనత్ జేబునుంచి పెట్టడం లేదు,ప్రజలందరి కష్టార్జితం!ప్రజలకి సంతృప్తి కలిగినా కలగకపోయినా ఇది కూడా కాంట్రాక్టర్లు పండగ చేసుకోవటానికి పనికొచ్చే యవ్వారమే కదా!ఇవ్వాళ తెలంగాణలో కాంట్రాక్తర్ల లక్కే లక్కు!కురో కుర్రు!వెలమదొర పాలన గట్లనె ఉంటది బిడ్డ!ఓర్చుకోవాలె తల్లి!గమ్మునుండవె చెల్లి!తిరగబడ్తనంటె నడ్డి విరిగేను మల్ల!తెలంగాణం బతుక్ ఇంక గుటుక్,బుడుంగ్!కోదండరాం పలుకు బుడుంగ్,బుడుంగ్!కంచ్గె ఐలయ్య పలుకు బుడుంగ్, బుడుంగ్!మేడారం సమక్క సారక్క పలుకు బుడుంగ్,బుడుంగ్!అల్లాండం బెల్లాండం బతుకమ్మ పలుకు బుడుంగ్,బుడుంగ్!బుడుబుడు బుడుంగ్!!

తెలుగు జాతి మనది,నిండుగ వెలుగు జాతి మనది అన్నది మొదట సినారె కాదు!


    మాటిమాటికీ మా సంస్కృతి వేరు,మేం ఆంధ్రోళ్లతో కలవలేం,అందుకే యాభయిల్లో కలవకుండా ఉండటానికి గొదవ చేశాం,అప్పుడు బలవంతంగా కలిపేశారు అని అంటున్నారు గానె తెలుగువాళ్లని ఒక్కటి చేసి బలమైన జాతిగా నిలబేట్టాలని మొదటిసారిగా ఆలోచించింది కాకతీయుల కాలం నాటి రాజనీతిజ్ఞులు!రుద్రమదేవి తాతగారైన రుద్రదేవ మహారాజు ఈ ప్రాంతానికి ఉన్న భౌగోళీక్ రాజకీయ ప్రాధాన్యతని బట్టి మొదలుపెడితే కాకతీయ సేనానులైన తదనంతరపు నాయక రాజులూ రెడ్ది రాజులూ తమ శక్తి కొద్దీ ఆ లక్ష్యానికి అనుగుణంగానే నడుచుకున్నారు.రుద్రదేవ మహారాజూ అతని పుత్రుదైన గణపతి దేవ మహారాజూ నచ్చిన వాళ్లని వివాహ సంబంధాల ద్వారానూ,నచ్చని వాళ్ళని యుద్ధవ్యూహాలతో అణచివెయ్యడం ద్వారానూ మచ్చిక చేసి తెలుగు ప్రజల యేకత్వానికి నారు వేసి పాదులు తీర్చి నీరు పోసి నిన్నటి వరకు అది అఖండంగా సాగిపోయేలా చేశారు!ముఖ్యంగా గణపతి దేవుడు మరింత శ్రద్ధ తీసుకుని అన్ని పండుగల్నీ ప్రభుత్వపరంగా నిర్వహించి ప్రజల్ని కూడా ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేసి తెలుగు ప్రజల ఆచార వ్యవహారాలు ఒకేలా ఉండేటట్లు చేశాడు.అందువల్లనే స్థూలంగా తెలుగువారి ఆచార వ్యవహారాలు కులాల కతీతంగా ఉన్నాయి.

     కాకతీయ ప్రభువులు తెలుగు ప్రజల్ని ఏకజాతిగా నిలబెట్టాలనుకోవడం వెనక అప్పటి రాజకీయ వాతావరణం,ఇక్కడి భౌగోళిక అనుకూలతలూ రెండూ ముఖ్యమైన కారణాలే.ఉత్తరాదిన బలమైన ఢిల్లీ మహమ్మదీయుల పాలనలోకి వెళ్ళి దక్షిణాదిలో కీలకమైన ఈ ప్రాంతాన్ని వశం చేసుకోవాలని ప్లానులు వేస్తున్న కాలం అది.అప్పటికే పక్కన బహమనీ సుల్తానులు బలంగా ఎదుగుతూ దక్షిణాది మొత్తాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు.భౌగోళీకంగా చూస్తే మొత్తం భారతదేశం ఒక అక్షయపాత్ర లాంటిది.గజినీ ఒక్కడే ఏడాది కొక్కసారి చొప్పున 18 సార్లు కొల్లగొట్టుకు పోయినా అతనటు వెళ్ళగానే మళ్ళీ పూర్ణకుంభంలా పైకి లేస్తూ ఉండేదంటే సంపదల్ని సృష్టించడంలో అప్పటి మనవాళ్ళు ఎంత నేర్పరులో అర్ధమవుతుంది కదా!ఆ స్థాయిలో సంపదని సృష్టించే దమ్ము ఈనాటివాళ్ళకి లేకపోబట్టి గానీ ఉంటేనా?!ప్రపంచ జనాభాలో నాలుగోవంతు జనాన్ని కూర్చోబెట్టి మేపుతూ నిన్నటి రోజున ఎవడో వలస రాజ్యంగా చేసుకుంటే లబోదిబోమని అఘోరించినమనం రేపటి రోజూన్ ఎలాంటి కుయుక్తులూ మరెలాంటి యుద్ధాలూ వ్హెయ్యకుండానే ప్రపంచాన్ని శాసించగలం!అంత గొప్ప దేశంలో కిందివైపున ఉన్న సముద్రతీరం పర్పంచానికి కలుపుతూ పైన  ఉన్న విధ్యసానువుల ద్వారా ఉత్తర దక్షిణాల్ని కలుపుతూ దేశపు రాజకీయార్ధిక రంగాల మీద ప్రభావం చూపగలిగే కీలకమైన స్థానంలో ఉంది ఈ ప్రాంతం.అందుకే కాకతీయ ప్రభువులూ,వారి సామంతులూ,అసఫ్ జాహెలూ,ఆదిల్ షాహీలూ,నిజాం షాహీల వరకు అందరూ దీన్ని చెదరనివ్వకుండా వచ్చారు.ఆఖరి నిజాము తన అవసరం కొద్దీ విదగొట్టాక నైజాం,సీడెడ్,కోస్తా పేర్లు బాగ అలవాటయ్యాకనే ఈ తేడాలు వచ్చాయి.

     స్వతంత్రం వచ్చాక అంతటి దూరదృష్టి లేని అప్పటి కాన్రెసు నాయకులు ప్రజలు ఎంత బలమైన సపోర్టు ఇచ్చినా జాతీయస్థాయిలో ఏనాడూ బలంగా ఉండలేదు.కనీసం వాళ్ళ పార్టీలోని కోటరీలోకి కూడా ఎదగలేదు!ఇప్పుడు చూస్తే అక్కడ చక్రం తిప్పడం సంగతి అటుంచి ఒక చోట కూర్చుని చర్చించుకుని చిటికెలో పరిష్కరించుకోగలిగిన చిన్న చిన్న సమస్యల్నే ఈగో ప్రాబ్లెంసుతో పెద్దవి చేసుకుని ఒకళ్ళనొకళ్ళు మీడియాలో అల్లరి పెట్టుకుంటూ ప్రపంచం ముంగిట తెలుగువాళ్ళ పరువు తీస్తున్నారు.ఒకసారి మీడియా ముందు నిలబడి చెత్త మాటలు మాట్లాడితే ప్రపంచంలో ఏమూల ఉన్న ఏ దేశస్థుడికయినా తెలిసిచస్తుంది,తెలిసిన ప్రతివాడూ పగలబడి నవ్వుకోవటానికి తప్ప ఎందుకు పనికొస్తాయనే ఇంగితం కూడా లేదు - వీళ్ళ చదులు తగలెయ్య!ఈ బజారు భాష మాట్లాట్టానికీ ఎ కాంట్రాక్టర్ల చెప్పులు నాకే కుక్కపన్లకీ అన్నేసి ఏళ్ళు వేస్టు చేసి అంతేసి డబు వేస్టు చెయ్యాలా - ధూ,నీయ్యవ్వ!

ఏటిలోని అలలు ఏరు విడిచి పోలేవు!ఎదలోపలి మమకారం బాదు విడిచి రానీదు!!


     తెలంగాణ లోని సాధుసజ్జనులు ఒక విషయానికి నన్ను క్షమించాలి!ఈ దుర్మార్గపు వ్యవహరంలో తలదూర్చకపోయినా మె బతులులు మార్తాయనే ఆశతో ఉండి కొత్తగా ఏర్పడిన అమె రాష్ట్రాని రాక్షసశిశువు అనడం మీకు కష్తం కలిగిస్తుందని నాకు తెలుసు,కానె మీలో కొందరు రాష్త్రం ఏర్పడీన రెండేళ్ళ తర్వాత కూడా మీ రాష్ట్రపు అభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి బదులు ఇంకా ఉద్యమకాలపు వీరావేశాన్నే ప్రదర్శిస్తూ ఆంధ్రద్వేషానికే అంటిపెట్తుకుని ఉండటం చూసి చిరాకు పుట్టి వాళ్ళకీ మీకొ కొంచెం చురుకు పుటించటం కోసమే ఇప్పుడు తెలంగాణ ఉన్న స్థితిలోని నెగిటివ్ అంశాల్ని మాత్రమే తీసుకుని విమర్శిస్తూ కొందరు వ్యక్తుల్ని పేర్లతో సహా ప్రస్తావిస్తూ ఇబ్బందిన్ కూడా కలిగించినా సందేహించహ్కుండా ఈ పోష్టుని వేశాను.నిజానికి సారంగలో ఒక చిత్రమైన అనుభవం ఎదురవకుండా ఉంతే ఈ పోస్టు ఇలా వచ్చేది కాదు.అక్కద రీ-పబ్లిష్ అయిన "ఆంధ్రోళ్ళ కత్తికి ఇంకెన్నాళ్ళు ధారపడదాం?" అనే వ్యాసం చదివి అంతకుముందు పైన ప్రస్తావించిన మశాలనింటి ప్రభావం కలిసి ఇక్కడి తలకటులో ఉన్న వాక్యమూ,పాకిస్తాను గురించి ఒక పేరా,తెలంగాణ గురించి ఒక పేరా కలిపిఒక కామెంటు వేశాను.మొదట ప్రచురించబడి,సారంగ వారి అల్వాటు చొపున నాలుగు రోజుల తర్వాత మాయమైపోయింది.అది మాయమయ్యే ముందర రచయిత దాని చదివి ఇచ్చిన జవాబు మాత్రమే అక్కడ ఉంది 

     ఇపుడు.ఇవ్వాళ డాబుసరికి దొరగారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తాడని పొగుడుతున్నాడు గానీ చెన్నారెడ్డి స్వార్ధ రాజకీయపు ఔన్నత్యం ఎవడికి తెలియదు?తన అవసరం కోసం అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేయ్యడానికి రగిలించి పైకెత్తి తన అవసరం తీరగానే దాని తుంగలో తొక్కి కోరుకున్న పదవిని అందుకున్న ఆ పేరు గొప్ప ఉద్యమానికి వ్యతిరేకంగా రాశాడని శ్రీశ్రీని కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టు పీకి విమర్శిస్తున్నాడు రచయిత!మరి,ఇవ్వాళ వీళ్ళు శిలావిగ్రహం పెట్టుకుని గౌరవించిన తెలంగాణ ప్రాంతపు కవి దాశరధి కూడా దాన్ని విమర్శించాడ్య్ కదా!వ్మర్శించహ్డమే కాదు,ఉద్యమకారులకి నచ్చజెప్పడానికి వెళ్ళిన దాశరధిని కాళోజీ నీ మందుల ఖర్చు భరించిన ఆంధ్రోళ్ళకి వూడిగం చహెస్తున్నావు నువ్వు అని ముఖాన్నే అనేసి చిన్నబుచ్చుకుని వెనకి వెళ్ళిపోయేలా చెయ్యడం ఎంత క్రూరమైన పని!ఉచితానుచితాలు చూడకుండా తమని వ్యతిరేకించిన ప్రతివాడూ ఎదిరి పక్షం వాడే అని తీర్మానించుకుని ఫెడీమని మనస్సు చివుక్కుమనేటట్టు ఎంత మాట పడితే అంత మాట అనగలిగిన నోటిదురుసుతనాన్ని తెలంగాణ వాళ్ళు ఎంత తొందరగా వొదులుకుంటే అప్పటి నుంచే వాళ్ళకి వైభవోజ్వలశకం మొదలవుతుందనేది నోరు మంచిదైతే వూరు మంచిదవుతుందన్న సామెత లాంటి సత్యం!యేది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!! 

Friday, 15 July 2016

ఓరి దేవుడోయ్,ఆయన గారు కదలాలంటే ఇంత గుక్కపట్టి ఏడవాలా?ఇంత సుదీర్ఘంగా యేడ్చే ఓపిక మాకు లేదయ్యోయ్ - గజేంద్ర మోక్షణా!

     అయ్యా,గజేంద్రుడు మకరికి చిక్కి కాస్సేపు చీరులీడర్లుగా ఘీంకరిస్తున్న తన రాణులకి పోజులు గొడుతూ అట్లా ఇట్లా పోట్లాడేసి  ఓపిక తగ్గి కొంచెం డేంజరపాయం బుర్రలో ఎర్రలైటులాగ వెలిగిందో లేదో తెయ్యిమని "లావొక్కింతయు లేదు---" అని పద్యం యెత్తుకోగానే రయ్యిమని వచ్చి రక్షించేశాడనుకుని ఏ కొంచెం కష్తమొచ్చినా ఆ ఒక్క పద్యమూ చదివేసి "ఇంత భక్తిగా చదివినా ఇంకా రావట్లేదు,మనిషిని నా తక్కువంటి?ఆఫ్టరాల్ ఏనుగు ఎక్కువేంటి?ఇందులో ఏదో కిరికిరి ఉంది!ఏమయినా ఆయనకి పక్షపాతం ఎక్కువ" అని పరిపరి విధాల తిట్టుకుంటాం గానీ గజేంద్రుడు చాలా సుదీర్ఘంగా ఏడ్చాడండి పాపం!మకరితో పోట్లాడిన కాలం లెక్క ప్రకారం యుగాలు గడిచాయని చెప్తారు గానీ పోతన గారి పద్యాల లెక్క ప్రకారం, ఇదుగో:

ఏ రూపంబున దీని గెల్తు? నిటమీఁ దేవేల్పుఁ జింతింతు? నె
వ్వారిం జీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్
వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్
లేరే? మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్.

అని ఈ రకమైన విచికిత్సతో ఇక్కడ నుంచి మొదలు పెట్టి

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై; 
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

యోగాగ్ని దగ్దకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొం డెఱుఁగక స
ద్యోగ విభాసిత మనముల
బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్.

కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణముల పాలం
గలఁ డందు రన్నిదిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?

కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ; 
గలిమిలేములు లేకఁ గలుగువాఁడు? 
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ; 
బడిన సాధుల కడ్డపడెడువాఁడు? 
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ; 
జూచువారలఁ గృపఁ జూచువాఁడు? 
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల; 
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?

అఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
ఆదిమధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?

విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్.

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్; 
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్; 
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

విను దఁట జీవుల మాటలు
చను దఁట చనరానిచోట్ల శరణార్థుల కో
యను దఁట పిలిచిన సర్వముఁ
గను దఁట సందేహ మయ్యెఁ గరుణావార్ధీ!

ఓ! కమలాప్త! యో! వరద! యో! ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ! యో! శరణాగతామరా
నోకహ! యో! మునీశ్వర మనోహర! యో! విమలప్రభావ! రా
వే కరుణింపవే తలఁపవే శరణార్థిని నన్నుగావవే.

     ఇక్కడి వరకు ఆపకుండా రకరకాల అర్ధాలతో దఫదఫాలుగా తీరు మారుస్తూ ఆఖరికి సంపూర్ణ శరణాగతికి దిగిపోయి గుక్కపట్టి యేడ్చాడండి,మనమెప్పుడయినా ఇంత సుదీర్ఘంగా యేడ్చామా!కాకిపిల్ల కాక్కి ముద్దన్నట్టు మన కొంచెపు ఏడుపు మనకి ఎక్కువగా కనబడుతుంది గానీ ఆయనకి మనమొక్కరమేనా?అనంతకోటి విశ్వాల్లో ఏనుగే కాదు ఎలకపిల్ల ఏడ్చినా ఆయనే వెళ్ళాలి!సరిగ్గా మనం బుడిబుడి యేడుపుగా ఒక కూనిరాగం తీసి అదే గొప్ప అనుకునే టయానికి ఇంకెక్కడో ఇలాంటి యేడుపు యేడిస్తే ఎటు వెళ్ళటం న్యాయం?మీరే చెప్పండి!

     ఇంత పొడుగ్గా పిల్చినా రావట్లేదంటే నువ్వున్నావనే అనుమానంగా ఉంది స్వామీ అని కూడా అఘోరించి అదీ చాలక ఆఖరికి "ఓ!యో!కుయ్యో!!మొర్రో!!" మని అంగలార్చినాక అప్పుడు

విశ్వమయత లేమి వినియు నూరక యుండి
రంబుజాసనాదు లడ్డపడక
విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు
భక్తియుతున కడ్డపడఁ దలంచె.

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై.

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

     "హమ్మయ్య,కదిలాడు" అని గజేంద్రుడి మీద సెంటిమెంటుతో అల్లాడిపోతున్న మనం వూపిరి పీల్చుకునే లోపు ఆయన కదలడం,లేవడం,పరిగెత్తడం,వైకుఠం దాటి పోవడం అన్నీ జరిగిపోయాయండోయ్!

తన వేంచేయు పదంబుఁ బేర్కొనఁ; డనాథస్త్రీ జనాలాపముల్
వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్? 
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం
గని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్.

అని వితర్కించుచు.

తాటంకాచలనంబుతో; భుజనటద్ధమ్మిల్లబంధంబుతో; 
శాటీముక్త కుచంబుతో; నదృఢచంచత్కాంచితో; శీర్ణలా
లాటాలేపముతో; మనోహరకరాలగ్నోత్తరీయంబుతోఁ; 
గోటీందుప్రభతో; నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్.

అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.

     పాపం పేరు గల పెద్ద ఇల్లాలు శ్రీదేవి కొచ్చిపడిన కష్టం చూడాలి!ఆటగా పట్టుకున్న పైటకొంగు కూడా వదలట్లేదు!చూసి వర్ణిస్తున్నది భక్తుడు గాబట్టి సరిపోయింది గానీ, అదే పెరుమాళ్ మురుగన్ లాంటివాడు చూసి ఉంటే?

     ఆవిడ పిచ్చిగానీ, కళ్ళముందు పాయింట్ బ్లాంక్ రేంజిలో తొండమెత్తి మొత్తుకుంటున్న గజేంద్రుడు కనబడుతుంటే ఈవిడ కొచ్చెన్లు ఆయన చెవిని చేరతాయా?

నిటలాలకము లంట నివుర జుంజుమ్మని; 
ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు; 
నళులఁ జోపఁగఁ జిల్క లల్ల నల్లన చేరి; 
యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు; 
శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం; 
దాకినీ పాఠీనలోక మెసఁగు; 
మీన పంక్తుల దాఁట మెయిదీఁగతో రాయ; 
శపాలతలు మింట సరణిఁ గట్టు;

శంపలను జయింపఁ జక్రవాకంబులుఁ
గుచయుగంబుఁ దాఁకి క్రొవ్వుజూపు; 
మెలఁత మొగిలు పిఱిఁది మెఱుఁగుఁదీవయుఁ బోలె
జలదవర్ణు వెనుకఁ జనెడునపుడు.

వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణావర్ధిష్ణుఁ యోగీంద్ర హృ
ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృందప్రాభవాలంకరి
ష్ణు నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్.

ఇట్లు పొడగని.

చనుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం
ఖ నినాదం బదె; చక్ర మల్లదె; భుజంగధ్వంసియున్ వాఁడె; క్ర
న్నన యేతెంచె నటంచు వేల్పులు నమోనారాయణాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.

     రావడం ఇంత అల్లాండం బెల్లాండం భూనభోంతరాళాలు దద్దరిల్లిపోయేలా వచ్చాడు గానీ క్లైమాక్సు మాత్రం సింపులుగా తేల్చేశాడు,మనసెరిగిన సుదర్శనం కనుసైగతోనే మకరి తల నరికింది,కరి బతికింది,మకరి హరిని చేరింది!


జై శ్రీ గజేంద్రవరద గోవిందోహారి!!!

Tuesday, 12 July 2016

సాంకేతికాంశాలతో రచయిత పెరుమాళ్ మురుగన్ పట్ల చూపించిన సానుభూతిని శ్రీమాన్ కోర్టువారు ఇతని అబద్ధాల వల్ల కులటలుగా ముద్రపడే మహిళల పట్ల ఎందుకు చూపించలేదు?

     పెరుమాళ్ మురుగన్ నవలలో చెప్పిన ఆచారం అక్కడి దేవాలయంలో నిజంగా ఉందా?లేదని దాన్ని విమర్శిస్తున్నవారి వాదన!ఆ సంప్రదాయం అక్కడ లేకుండా పెరుమాళ్ కల్పించినదే అయితే అది ఖచ్చితంగా అతని తప్పే అవుతుంది!అదే నిజమయితే, వారి వాదన నిజం కావడం వల్లనే పెరుమాళ్ మురుగన్ అప్పట్లో వెనక్కి తగ్గాడనేది కూడా మనం అర్ధం చేసుకోవచ్చు.రొమిల్లా దప్పార్ పులిమిన "ఆర్యుల దాడి - ద్రవిడుల అణచివేత" పులుముడు అబధం అని తేలడానికి దశాబ్దాలు పట్టింది - గట్టిగా లెక్కిస్తే ఒక శతాబ్దం!ఈ మధ్యనే ఒక తెలుగు రచయిత "ఆకాశ దేవర" కధ ఇదే రకం ఇతివృత్తంతో రాసినట్టు చదివాను.కాకపోతే ఆ కధలో ఉన్నది వ్యంగ్యం అనీ వాస్తవంగా జరిగిన కధ కాదనీ తెలిసిపోతూనే ఉంటుంది.కానీ పెరుమాళ్ చేసింది అది కాదు.వూరి పేరు చెప్తున్నాడు,దేవాలయం పేరు చెప్తున్నాడు,అక్కడ ఆ సంప్రదాయం ఉందని చెప్తున్నాడు,ఆ సంప్రదాయం వల్లనే కధలోని పాత్ర ఆ సంక్షోభానికి గురయిందని గట్టిగా చెప్తున్నాడు.ఆ ఆలయంలో ఆ సంప్రదాయం లేకపోతే అది ఖచ్చితంగా అతని తప్పే!ఇప్పుడితను చెప్పింది ఖండించకుండా వూరుకుంటే ఆ అబద్ధం నిజమైపోతుంది!

     దేశంలో ఇవ్వాళ ఉన్న అసంఖ్యాకమైన దేవాలయాల్లో అన్నీ కేవలం దర్శనం చేసుకుని వచ్చేవి మాత్రమే  కాదు.కొన్ని ఆలయాల్లో ప్రత్యేక ప్రయోజనాల కోసం పూజలు జరుగుతాయి.వాటిల్లో 90% సంతాన సాఫల్యత కోసమే జరుగుతున్నాయి,తర్వాత ఎక్కువగా జరిగేవి వివహ ప్రాప్తి కోసం,ఆ తర్వాత సర్పదోష నివారణ లాంటివి తక్కువ ప్రాధాన్యతతో జరుగుతున్నాయి.ఈ మురుగన్ వెనక నిలబడి అతన్ని సమర్ధిస్తున్న వాళ్ళ వాదనని ఒప్పుకుంటే అలా అన్ని దేవాలయాల్లోనూ ఎక్కడ సంతానసాఫల్యత కోసం చేసిన పూజలు ఫలించి తమకి పిల్లలు పుట్టారని చెప్పినా మురుగన్ మరియూ అతన్ని సమర్ధించే మేధావులూ,ఈ అసమగ్రమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులూ వాటి వెనక కూడా మురుగన్ అంత గట్టిగా నొక్కి చెప్పిన పరపురుష సంభోగమే కారణం అని అంటున్నట్టు కాదా?

     మొదట రెలీజయినప్పుడు ఎవరూ మాట్లాడలేదు ఇంగ్లీషు వెర్షన్ వచ్చాకే గొడవ చేస్తున్నారు అనటం కూడా తప్పే!మద్రాసులో ఉన్నా తమిళం ఒక్క ముక్క కూడా రాని నాలాంటివాళ్ళు తమిళప్రతి రాగానే చదివి అర్ధం చేసుకోవటం కుదరదు కదా!ఎవరయినా చదివి అందులో ఉన్న కంటెంటు అర్ధం అయ్యాకే రెస్పాండ్ అవుతారు,జరిగింది కూడా అదే.అందులో దురుద్దేశాలూ,కుట్రా అంటగట్టే బదులు వాస్తవం అతను చెప్పినట్టు ఉందా అని చూస్తే చాలదా?అప్పుడు విమర్శించలేదు,ఇప్పుడు విమర్శిస్తున్నారు కాబట్టి అందులో కుట్ర ఉంది అనే వాదనలో పస లేదు.

     పెరుమాళ్ మురుగన్ రాసింది చరిత్రను ప్రతిబింబించే నవల అని చెప్తూ అతను వర్ణించిన ఆచారం ఆ దేవాలయంలో ఏనాడైనా పాటించబడిందా లేదా అనే విషయాన్ని కోర్టు ఎందుకు వదిలేసింది?అసలు పిటిషన్ వేసిన వ్యక్తి ముఖ్యమైన వాదన "ఆ ఆలయంలో లేని ఆచారాన్ని ఉన్నది అని చెప్పి ఆలయాన్నీ ఆ అలయదర్శనం ద్వారా పిల్లల్ని కన్న ఆడవాళ్లని అవమానించాడు" అని అయితే పాతబూతు పురాణాల్ని సాక్ష్యం చూపించి సాహిత్యంలో బూతు ఇదివరకే ఉందిగా అనేస్తే సరిపోతుందా?పిటిసనర్ ఒక విషయం గురించి ప్రస్తావిస్తే కోర్టువారు మరొక విషయం గురించి తీర్పు చెప్పడం ఏంటి?వీపు మీద తంతే మూతి పళ్ళు రాలినట్టు లేదూ!

     ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా అలాంటి ఆచారం అక్కడ ఉంటే,ఉందని నిరూపిస్తే అప్పుడు మాత్రమే పెరుమాళ చేసింది కరెక్ట్ అవుతుంది!లేని పక్షంలో కోర్టు ఇచ్చిందే తప్పుడు తీర్పు!పరమ వాస్తవికంగా చిత్రవిచిత్రమైన సనివేశకల్పనతో ఎంత అద్భుతమైన రచనావిన్యాసం చూపించినా సరే,ఒక ఆలయ చరిత్రని రూపుమార్చి రాస్తే చూస్తూ వూరుకోవడమేనా?

     ప్రాచీన కాలంలో మన దేశంలో చాలాచోట్ల ఇలాంటి ఆపద్దర్మ ఆచారం ఉందని ప్రస్థావిస్తారు చరిత్రకారులు.తాపీధర్మారావుగారు కూడా ఉదాహరణలు ఇచ్చినట్టున్నారు.అయితే, అలాంటి ఆచారాలు గతకాలంలో కొన్ని చోట్ల ఉండటం వేరు,ప్రత్యేకంగా ఒక వూరి పేరునీ,ఒక ఆలయాన్ని ప్రస్తావించి అక్కడ లేని ఆచారాన్ని ఉన్నట్టు చెప్పటం నిజమే అయిన పక్షంలో పెరుమాళ్ తన వూరికి వెళ్ళి తన గ్రామస్తులకి ఏ సమాధానం చెప్పగలడు?మొదట నా దగ్గిర ఆధారాలు ఉన్నాయి అని పుస్తకావిష్కార్ణల్లో దబాయించి చెప్పి చూపించమన్నప్పుడు ఆధారాలు అడిగినప్పుడు చూపించలేకపోయాడు కదా!అప్పటి వరకు ఉన్నదున్నటు రాసిన చరిత్ర అని బుకాయించి ఆధరాలు లేవని తెలిశాక ఇది కేవలం ఫిక్షన్ మాత్రమే అని అడ్డం తిరిగడం ఏ రకమైన భావస్వేచ్చ?తాపీ ధర్మారావు గారు చూపించినట్టు ఆధారాలు చూపించలేకనే గదా అప్పుడు క్షమాపణ చెప్పి బయటపడ్డాడు,అది కొడా కోర్టు పట్టించుకోలేదు - ఎందుకని?ముఖచిత్రం మీద ఆ ఆలయం బొమ్మ ఎందుకు పెట్టినట్టు?అయితే, నేనిప్పుడు ఏదయినా మసీదు చుట్టూరానో,దర్గా చుట్టూరానే ఇలాంటి కల్పననే చేస్తే కోర్టులూ,ఈ పెరుమాళ్ సమర్ధకులూ నన్ను సమర్ధిస్తారా?నాకు కూడా పెరుమాళ పరిస్థితియే దాపరిస్తే ఎటువైపు నిలబడతారు!

     చదువరుల్లో కొందరికి నచ్చని పుస్తకాన్ని నిషేధించటం అవసరమా కాదా అనే జనరల్ విషయాలతో నిండిన సాంకేతిక అంశాలని మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్టు తీర్పు పూర్తిపాఠం చదివాక కూడా స్పష్టంగా తెలుస్తున్నది.రచయిత ఏదో ఆ దంపతులు లేక మరి కొందరు తప్పనిసరి చేస్తున్నట్టు కూడా కాదు,పుస్తకంలో నుంచి ఎత్తి చూపించిన భాగాల్ని కొన్నింటిని చూసినా అక్కడ ఆచారం పేరుతో విచ్చలవిడి వ్యభిచారం జరుగుతున్నట్టు నవల మొత్తంలో చాలా చోట్ల వర్ణించినట్టు తెలుస్తున్నది - అది కూడా సభ్యసమాజం ఆమోదించాల్సిన ఆధునికత కిందకి వస్తుందా?కోర్టువారి ఆందోళన అంతా పబ్లిషర్లకి జరిగే నష్తము,రచయితకి కలిగే దుఃఖము గురించి తప్ప నవలలో అంత ధాటిగా ఒక వూరి పేరు చెప్పి,ఒక ఆలయం పేరు చెప్పి చిలవలు పలవలుగా అక్కడ లేని ఆచారం ఉన్నట్టు వాస్తవికంగా రాయడం వల్ల అక్కడ సంతానవతులైన తల్లులకి జరిగే సామాజిక పరమైన అవమానం ఎందుకు గుర్తుకు రాలేదో!అక్కడి తల్లుల సంతానసాఫల్యతకి కారణాల్ని తెలుసుకోవడానికి ఇప్పుడు వారిని కోర్టు గదిలో ప్రదర్శించే బదులు వైద్యశాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకోవచ్చు కదా!

     "స్రీ,పురుషుల సంగమం లేకుండా పిల్లలు పుట్టరు" అనే ఒక అందరికీ తెలిసిన సత్యాన్నీ "అప్పటివరకూ పిల్లలు పుట్టలేదంటే వాళ్ళ మగాళ్ళు పిల్లల్ని పుటించలేనివాళ్ళు కాబోలు!" అనే అనుమానాన్నీ "అప్పటివరకూ గర్భం దాల్చనివాళ్ళు హఠాత్తుగా ఆ రోజు తర్వాత గర్భం దాల్చారంటే అక్కడ ఏవరో ఒకరు కారణం అయి ఉండాలి" అనే నిర్ధారణనీ కలిపి ఆలోచించడం వల్లనే ఈ సోకాల్డ్ శాస్త్రీయతా గర్వితులు పెరుమాళ మురుగన్ పక్కన నిలబడి వాదించగలుగుతున్నారు!వేరే ఎవరి ద్వారానూ కాకుండా భార్యాభర్తలు పవిత్రంగా ఉన్న సందర్భాలలో కూడా సుదీర్ఘకాలం పాటు పిల్లలు పుట్టకపోవటానికీ ఇంక పుట్టరేమోనని నీరసపడిపోయిన కాలంలో "దేవుడు వరమిచ్చినట్టు" పిల్లలు పుట్టటానికీ చాలా కారణాలు ఉంటాయి - అవన్నీ వైద్యశాస్త్రపరమైన జ్ఞానం ఉన్నవాళ్ళు ఒప్పుకునే కారణాలే!పురుషుడి వీర్యం మొత్తం శుక్రకణాలతోనే నిండి ఉండదు.కొంత అనవరసమైన జిగట కూడా ఉంటుంది.పురుషుడి నుంచి విడుదలైన వీర్యంలోని అతి సూక్ష్మమైన వీర్యకణాలు విడుదలయిన చోటు నుంచి స్త్రీ గర్భాశయపు గోడకి అతుక్కుని ఉన్న అండాన్ని ముట్టడించి చొచ్చుకుపోవడానికి అవసరమైన ప్రయాణం కోసం ఆ జిగట యంత్రాలలో వాడే కందెన తైలంలా ఉపయోగపడుతుంది.వీర్యం ఎక్కడ విడుదలైందో అక్కడే ఫలదీకరణ జరిగిపోదు,అది కొంత దూరం ప్రయాణించాలి,అక్కడ వెలుగు ఉండదు,వీర్యకణాలకి కళ్ళు ఉండవు,దారి చూపించే నాధుడు ఉండడు - అలా పాకుంటూ పోవడమే!విడుదలైన వీర్యంలో ఒకే వీర్యకణం ఉంటే చాలదు.విడుదలయిన వీర్యంలో తగిన మోతాదులో వీర్యకణాలు లేకపోయినా, ఏ రకమైన బలహీనత వల్లనయినా ఈ వీర్యకణాలలో ఏ ఒక్కటీ అండాన్ని చేరుకోలేకపోయినా ఆ పురుషుడు పూర్తి స్థాయి మగతనం ఉన్నా అతనెప్పటికీ తండ్రి కాలేడు!మగవాడి దేహం బలంగా ఉండటానికీ అతని వీర్యకణాలు అండాన్ని చేరుకోగలిగినంత బలంగా ఉండటానికీ ఏ సంబంధమూ లేదు.

     పెళ్ళయిన కొత్తల్లో ఈ రకమైన లోపాలు మొదలై ఎంతకాలమైనా సాగవచ్చు,ఎందుకు పుట్టా
యో తెలియని లోపాలు  కొంతకాలం తర్వాత ఎలా వచ్చాయో అలానే పోవచ్చు!ఈలోపు దంపతులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు,మానవ ప్రయత్నంగా డాక్టర్ల చుట్టూ తిరుగుతారు, దైవానుగ్రహం కోసం గుడి గోపురాలు చుట్టి వస్తారు - ఆఖరికి  ఆ లోపం పోయి గర్భం దాల్చగానే అంతకుముందు వెళ్ళిన డాక్టరుకి హస్తవాసి అంటగడతారు,దణ్ణం పెట్టుకున్న దేవుడికి మహత్యం అంటగడతారు!పైన చెప్పిన సంతానలేమి రావటానికీ పోవటానికీ కొన్నిచోట్ల దైహిక కారణాలు కాకుండా మానసిక కారణాలు కూడా కారణం అవుతాయి.
-----------------------------------------------------------------
infertility
About 25% of all infertility is caused by a male problem, and in 40-50% of cases it is the main cause, or a contributing cause.

It is sometimes hard to know whether the male factor problem is the only cause, or just a contributing cause to the infertility. Part of the problem is that numbers are just numbers

What matters is not really how many or how fast they swim - but whether they can fertilize the female partner's eggs. This is really a biochemical issue at the molecular level.

Causes
There are a number of causes for male infertility, but they all affect quantity and/or

quality of sperm. These causes include:

The sperm's exit route is blocked (from birth, by scarring from infection, past vasectomy,

etc.)
Retrograde ejaculate (semen is ejaculated backwards, into the bladder)
Sperm production in the testes is low or absent (there can be many causes for this finding)

Low sperm count, also called oligospermia, is the most common cause of male infertility. Complete lack of sperm, called azoospermia, is much less common, affecting less than 1% of the population. Low sperm count is diagnosed when the number of sperm falls below 20 million in a milliliter of semen. (Normal range is between 20 million and 120 million per milliliter of semen.) When sperm count is too low, sperm has a much lower chance of reaching and fertilizing the egg, leading to infertility.

Treatment
Treatment approaches for male infertility varies greatly, depending on the severity of the sperm problem. In mild cases, artificial insemination (or intrauterine insemination, IUI) may be enough. In an IUI cycle to address male infertility, semen sample is prepared and concentrated in the laboratory before it is injected directly into the uterus. Higher concentration and direct injection alone can sometimes overcome male infertility.

Low sperm count is one of the reasons for infertility. We detail out the different ways to increase sperm count, what to include in your diet and which habits to follow. 

These are natural ways to pump up your sperm count and increase your chances of fertility. 
- Zinc deficiency 
- Excessive smoking and drinking 
- Tight underpants 
- Overweight 
- Exhaustion 
- Stress 
- Sperm disorders can affect your sperm count, the quality of the sperm and the movement. If sperms are not ejaculated often, their mobility goes haywire. Sperm disorder affects the shape of the sperm too. In terms of ejaculation and infertility, erectile dysfunction, failure to ejaculate or even premature ejaculation can be a problem during sex and also for conceiving. 

Normal sperm count: 
The normal volume varies from 1.5 to 5.0 milliliter per ejaculation. 
The sperm count varies from 20 to 150 million sperm per milliliter. 
At least 60% of the sperm should have a normal shape and show normal forward movement (motility). 

Vitamins that can increase sperm count: 

1) Vitamin B: Sources of Vitamin B: Cheese, eggs, milk, yoghurt, fortified cereals, spinach, legumes, whole grains and nuts. 

2) Zinc: Sources of zinc: Oysters, sesame and sunflower seeds, ginger, wheat germ, red meat, dark chocolate, watermelon seeds and pumpkin seeds. 

3) Selenium: Sources of Selenium: Shellfish, liver, fish, sunflower seeds, crabs, prawns, lobsters, and cereals made from rice, wheat and oats. 

Ways to Increase Sperm Count: 

1) Indulge in sex and masturbation less often. 
2) Avoid processed and unhealthy food choices. 
3) Practice yoga to reduce Stress and improve health. 
4) Avoid wearing tight underwear to avoid overheating the testicles 
5) Get sufficient sleep 
6) Lose weight to balance the hormones 
7) Avoid sitting for long hours. 
8) Get a good body massage to improve circulation. 

Yoga exercises to improve fertility: 

1) Agnisaar kriya 
2) Halasana 
3) Setubandhasana 
4) Dhanurasana 
5) Ashwani Mudra 
6) Bhastrika Pranayam
-----------------------------------------------------------------
     ఉదాహరణకి గతకాలంలోనూ ఈ ఆధునిక కాలంలోనూ కొంతమందికి వైద్యులు మొదట ఎవర్నయినా దత్తు తీసుకోమనే సలహా ఇవ్వటమూ,వాళ్ళు దత్తు తీసుకున్న కొంత కాలానికి సహజమైన పద్ద్ధతిలోనే పిల్లలు పుట్టటమూ కూడా జరుగుతూనే ఉన్నాయి.ఒకప్పుదు తీర్ధయాత్రలకి వెళ్ళమని చెప్పటం కూడా గాలిమార్పు వల్ల వాళ్ళ దేహాల్లో మార్పులు జరిగ్ పైన చెప్పిన లోపాలు వాటంతటవె పోవడం కూడా జరుగుతున్నవే!అలాంటి ప్రతి కేసులోనూ ఈ మేధావులు పెరుమాళ్ మురుగన్ బల్లగుద్ది చెప్పిన అపరిచితుల అక్రమ నిర్వాకమే కారణమని నిర్ధారించి చెప్యున్నట్టా?.దంపతులకి కొంతకాలం పిల్లలు పుట్టకుండా ఉండి వైద్యుడి దగ్గిరకి వెళ్ళకుండా ఏదయినా ఒక గుడికి వెళ్ళి మొక్కుకుని పైన చెప్పిన మానసిక కారణాల వల్లనో, మరేదైనా ప్రాకృతికమైన మార్పుల వల్లనో వచ్చిన ప్రతి గర్భం వెనకా పెరుమాళ్ మురుగన్ చెప్పిన అనామకులతో అక్రమ సంభోగమే కారణం అని తేల్చి చెప్పాలని ఈ మిడిమిడి జ్ఞానపు హేతువాద మూర్ఖులు ఎందుకింత తొందర పడుతున్నారు?

     సంతానలేమి అనే విషయం చుట్టూ ఉన్న ఈ శాస్త్రీయమైన విషయాలు పై మూడు వాక్యాల్నీ పట్టుకు వేళ్ళాడుతూ పెరుమాళ్ మురుగన్ జరుగుతున్నదే రాశాడు కాబట్టి అతన్ని విమర్శించటం అన్యాయం అంటున్న మేధావులకీ, ఈ అసమగ్రమైన తీర్పు ఇచ్చిన న్యాయమూరులకీ తెలుసా!అసలు తెలుసుకోవలసిన అవసరం లేదా?తీర్పుకి సంబంధించిన విషయంలో అతి ముఖ్యమైన "దంపతులకి కొంతకాలం పాటు పిల్లలు పుట్టకుండా తర్వాత హఠాత్తుగా పుట్టుకొచ్చిన సందర్భాలు" గురించి చర్చించకుండా ఎందుకు వదిలేశారు?అలాంటివి ఈ భూప్రపంచంలో ఎక్కడా జరగలేదని వీరు నిర్ధారించి చెప్పగలరా?అలా జరిగిన ప్రతి సందర్భంలోనూ ఇక్కడిలాగే ఎవరో ఒక పరాయి మగాడు పుణ్యం కట్టుకున్నట్టు అర్ధం చేసుకోవాలా?ఇదేనా శాస్త్రీయంగా అలోచించి వ్యతిరేకుల ఆంగ్లోసాక్సన్ మొరాలిటీని ఖండించే ఆధునికుల తెలివైన వాదన!

     తీర్పు నిర్దుష్టంగా ఉండాలంటే అన్ని విషయాలనీ సాకల్యంగా పరిశీలించాలి,అసలు ఆరోపణ ఆ ప్రాంతంలో కొంతకాలం పాటు వంధ్యత్వపు శోకాన్ని అనుభవించిన ఆడవాళ్ళు హఠాత్తుగా తల్లులవడానికి ఆ ఆలయంలోని రధోత్సవం 14వ రోజున అక్కడ జరిగిన అనామక వ్యక్తులతో జరిగిన సంభోగమే కారణం అని రచయిత చెప్తున్న విషయం అయినప్పుడు కోర్టు దానిని కూడా పట్టించుకు తీరాలి!పర పురుషుడి అవసరం లేకుండా దంపతుల మధ్యనే ఇలాంటి సమస్య కారణాంతరాల వల్ల సహజ పద్ధతిలోనే పరిష్కారం అయ్యి పిల్లలు పుట్టడం వైద్యశాస్త్రపరంగా సంభవమే అయినప్పుడు రచయితా అతన్ని సమర్ధిస్తున్న మేధావులూ,ఈ తీర్పు నిచ్చిన న్యాయమూర్తులే తప్పు చేస్తునట్టు!


     ప్రతిదానికీ భావస్వేచ్చ, ప్రజాస్వామ్యం అనే ముతకపదాల్ని తుంపులు తుంపులుగా వదిలి ఆదర్శవాదులుగా పోజులు కొట్టేవాళ్ళకి ప్రజాస్వామ్యం యొక్క పునాదీ వైభవం మెజారిటీ ప్రజల ఆశల్నీ ఆకాంక్షల్నీ గుర్తించి వారి ఒప్పుదలయే అధికారలో నిలదొక్కుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అని నిజంగానే తెలియదా!కొద్దిమంది తమ ఎజెండాల దంతమందిరాల్లో కూర్చుని ఇచ్చే తీర్పులు మెజారిటీ ప్రజల సంప్రదాయాల్ని కించపరిచేవిగా ఉన్నా,అందులో శాస్త్రీయత లేకపోయినా నెత్తిన పెట్టుకోవాలా?అదే న్యాయం,ఆధునికత అని తీర్మానించితే,  మేధావుల నుంచి పెరుమాళ ఎలాంటి రక్షణ తీసుకున్నాడో అలాంటి రక్షణ నాకూ వస్తుందనే గ్యారెంటీ ఉంటే నేను కూడా ఏదో ఒక చర్చి చుట్టూరానో దర్గా చుట్టూరానో ఇలాంటి రంజైన కధ అల్లడానికి సిద్ధంగా ఉన్నాను!

పదిమంది ఎనభైమంది మనోభావాల్ని గాయపర్చటం డేమోక్రసీ కాదు డెమనోక్రసీ!

Monday, 11 July 2016

చెరిగిపోని చరిత్రలో కరిగిపోని కన్నీటిచుక్క - పేరిందేవి!

పేరిందేవి!

విభుని కూడనైన కూడకయే విధవ యయ్యె!!
తనవారి రాజ్యకాంక్షకు తన మాంగల్యమే బలియయ్యె!!!

వయసుకు చిన్నదైనా ఒక్క కన్నీటిబొట్టు రాల్చలేదు.
పినతండ్రిని వరుసతో పిల్చి మరీ తిట్టింది,
చీరెసారె లివ్వాల్సిన చేతితోనే ముండకోకనూ ఇవ్వమని!
సిగ్గుపడి మొగం దించుకుని నిలుచుండేటట్లు చేసింది?! 

"నువు విధవ్వి, దీపాలార్పడమే తెల్సు నీకు!
దీపమెట్టేవేళ బిడ్డలు గల తల్లులు నిన్ను తలవరు - నన్ను తలుస్తారు,
నా ఉసురు తగిలి నీపేర్న నాల్గుమణుగుల నల్లపూసలు తెగుతాయి చూడు!"మన్న
బాలికావధువు శాపానికి నల్ల నాగులేరు గజగజలాడింది!
"నాయుడూ నీమూతికి మీసముంటే నా ముంజేతికి మీసముంది"
అన్న నాయకురాలు నాగమ్మ కూడా బిత్తరపోయంది,
సిగ్గుపడి సంధి కొడంబడింది -  
చిన్నారి పేరిందేవి ధాటిగల మాటలకు జడిసి!

అనపోతు చావువార్త విన్న బాలచంద్రునికి వెర్రిపుట్టి
సంధి చెడింది,నాల్గుమణుగుల నల్లపూసలు తెగినవి,
నల్ల నాగులేటి నీరెర్రబారింది!
    
కళ్ళుమూసుకుని తలిస్తే చాలు
కాటికి కాళ్ళు చాపుకున్నవాడికయినా కండల్ని పొంగించగలిగిన వీరాధివీరులు
తమను తామే చంపుకున్న తీరును చూసి భూతరాట్కంబమొకటే పకపక నవ్వింది!

నాపసాని ఏడుగడియల మంత్రిత్వం ఇంత చేసింది!
ఆపలేని బ్రహ్మనాయుని మంత్రాంగం యాడబోయింది?
నాయుడూ నాగాంబా సన్నాసులై బిలముల జొచ్చినారు.
కోటపేటలు అన్నీ మంటిగలిసి,,
అన్నదమ్ములు కూడ మింటికరిగి
రాజొక్కడు ఒంటిగ మిగిలినాడు!

అంతేరా, నాయనా!
ఆది జంగమదేవర ఢమరుకం మోగించినాక
నువ్వెంత?నీ తెలివెంత?నీ హజమెంత?
నీ వైభవాల మైకం,నీ స్థగిణీల మాంగల్యం,నీ కోటపేటల గట్టిదనం -
ఏదీ మిగలదు,అంతా భస్మమే!!

శివోహం!శివోహం!శివోహం!

Monday, 4 July 2016

చలం తలలోని మెదడును ఉపయోగించి రాసిన బ్రాహ్మణీకం మోకాలిలోని మెదడును మాత్రమే ఉపయోగించేవాళ్ళకి అర్ధం కాకపోవటం సహజమే కదా - శ్రీనివాసా!

         "నువ్వు గొప్పవాడివని నాకు తెలుసు గానీ నిన్ను పొగడ్డానికి మాత్రం మనస్కరించటం లేదు?!" - ఈ ముక్కని మీ గురించి మీతోనే ఎవరయినా అన్నారనుకోండి - అతను మిమ్మల్ని తిడుతున్నాడో,పొగుడుతున్నాడో,నిందాస్తుతితో ఎటకారం చేస్తన్నాడో ఒక పట్టాన అర్ధమయి చావదు,కదూ!కొందరంతే,"ఇన్నాళ్ళూ మాకర్ధం కానివి మీరు మాట్లాడారు,,ఇప్పుడు మీకే కాదు మూగకు మాటొచ్చినటు మాకు కూడా అర్ధం కాకుండా మాట్లాడే తెలివి వచ్చేసింది - కాబట్టి  మీరు మాట్లాడొద్దన్నా వూర్కోం.వింటున్న మీకే కాదు,మాట్లాడుతున్న మాకు కూడా అర్ధం కానంత గొప్పగా మాట్లాడగలం!ఏమనుకున్నారో?" అని వార్నింగులు ఇచ్చి మరీ చెత్త మాట్లాడుతూ ఉంటారు."ఒరేయి శాస్త్రీ!ఇదంతా కలంతోనే రాశావుట్రా?" అనే కొంటె బొమ్మల బాపు కార్టూనులోని కవికుంజరంలా వాళ్లు దేంతో ఆలోచించారో మనం కూడా దాంతోనే ఆలోచిస్తే తప్ప వాళ్ళ మనసు లోపలి అసలు గోలేంటో మనకి అర్ధమయి చావదు!మనమేమో తలలో ఉన్న మెదడుతో అలోచించేవాళ్ళం,వాళ్ళేమో మోకాలిలో ఉన్న మెదడుతో ఆలోచిస్తూ ఉంటారు - కాబట్టి అధాట్న వాళ్ళు రాసినవి చదవగానే మనలాంటివాళ్ళకి గందరగోళం అనిపించటం సహజం.

  మనకి అప్పుడప్పుడు బోరు కొడుతుంది!యెందుకు బోరు కొడుతుందని అడక్కండి,ఇప్పుడు మీరు అడిగినా సరే, బోరు గురించి గంభీరమైన విషయాలు చెప్పి మిమ్మల్ని బోరు కొట్టించే ఉద్దేశం నాకు లేదు:-)బోరు కొట్టినప్పుడు మనం సవాలక్ష పన్లు చేస్తాం - ఒకే రకం బోరు కైనా ఒక్కో మనిషి ఒక్కో ఆల్టర్నేటివ్ చూసుకుంటాడు.కానీ కుక్కలకి మాత్రం ఏ రకమయిన బోరు కయినా ఒకటే కాలక్షేపం - హాయిగా తోక వూపుకోవటం!అన్ని కుక్కలకీ అన్ని బోరులకీ ఓకే పరిష్కారం - ఈ తోక వూపుడు కార్యక్రమం!అలాగే ఇంగ్లీషువాళ్ళకీ, తర్వాత కమ్యూనిష్టులకీ, ఆ తర్వాత స్త్రీవాదులకీ,ఇంకా తర్వాత దళితులకీ ఈ దేశంలోని అన్ని సమస్యలకీ బ్రాహ్మణులే కారణం అనే వాదన చాలాకాలం ముంచీ కాలక్షేపంతో కూడిన ఆనందాన్ని కలిగిస్తున్నది. వారి అపరిమతమైన ఆనందానుభూతిని భగ్నం చేసే క్రూరత్వం నాకు లేదు - అమ్మతోడు,నిజం!మోకాలి లోని మెదడుతో ఆలోచించేవారి పాండిత్యాన్ని అర్ధం చేసుకోలేక తలలోని మెదడుతో ఆలోచించేవారికి ఏర్పడిన గందరగోళాన్ని తగ్గించడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తున్నాను. అసలువారి పాండిత్యాన్ని అవమానించేటంత స్థాయిలో సమ్యక్-జ్ఞానం గానీ వారిని తలతో ఆలోచింపజెయ్యగలిగిన సమర్ధత గానీ నాకు లేవు గాబట్టి శ్రీనివాసుడు లాంటివారిలా వారిని మార్చడానికి నేను పొరపాటున కూడా ప్రయత్నించను - ఆకాశంలో ఎర్రగా ఉన్న సూరీణ్ణి సూడంగానే అక్కడేదో మర్దరు జరిగిపోయిందన్నట్టు బులబులాగ్గా కతలల్లేస్కుంటా కూసింత కలాపోసన జేస్కోకపోతే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది సెప్పండి!ఆళ్ళట్టాగే మాట్టాడాల,మన్లాంటోళ్ళం ఫుల్లుగా నవ్వుకోవాల - అద్గదీ సంగతి:-)

     అసలు ఈ తోకను వూపే దృశ్యం పోలికలోనే వారికి పెద్ద కుట్ర కోణం కనబడవచ్చు కాబట్టి ముందుగానే  నావైపునుంచి నేను కొన్ని విషయాలు స్పష్టం చేస్తాను.కేవలం పెర్స్పెక్టివ్ డిఫరెన్స్ అనే వారికి నచ్చిన వాదనా పద్ధతికి పనికొస్తుందనే ఈ తోక వూపే కుక్క వుదాహరణ తెసుకున్నాను తప్ప హెచ్చార్కె గారిని కించపరిచే ఉద్దేశం నాకెంతమాత్రమూ లేదు.ఈ కాలంలో పుట్టిన ముప్పాళ్ళ రంగనాయకమ్మకి నచ్చిన మార్క్సీయ భావజాలం ప్రకారం రాయని ఆ కాలంలో పుట్టిన వాల్మీకి చేసిన తప్పునే చలం కూడా చేశాడు గాబట్టి తిడితే చలాన్నే తిడతాను తప్ప హెచ్చార్కె గారిని పల్లెత్తు మాట కూడా అనను.

     సనాతనులకి ఈ పెర్స్పెక్టివ్ డిఫరెన్సుల గోల లేదు.ఒకే విషయం గురించి ఒక్కోడూ ఒక్కోమాట చెప్తున్నప్పుడల్లా "ఏకం సత్ విప్రాని బహుధా వదంతి" అని సర్ధి చెప్పేసుకుని అప్పటికి ఏది బెస్టుగా పనికొస్తుందో దాన్ని పాటించేసేవాళ్ళు!అదే అలవాటు చొప్పున ఏ ప్రాంతం నుంచి ఏ మతస్థుడు వచ్చినా చక్కగా ఆతిధ్యమిచ్చి ఇళ్ళూ గుళ్ళూ కట్టుకునే చోటిచ్చి "నీ నిష్ఠ నువ్వు పాటించుకో, నా నిష్ఠ నేను పాటించుకుంటా"నని చెప్పేసి "వసుధైక కుటుంబ భావన"ని అతి ప్రాచీన కాలంలోనే వూహించి,బోధించి,సాధించి సుమారు అరవై వేల సంవత్సరాల వెనకటి కాలం నుంచి ఇప్పటికీ స్వయంచాలిత గడియారంలా తప్పుల్ని సరిదిద్దుకుంటూ తనలో కలిసిన సమస్తాన్నీ తనవెంట లాక్కుపోయే జీవనదీప్రవాహంలా కాలాలు దాటుకుని నడుస్తూ ఉన్న ఈ సనాతన ధర్మానికి కట్టుబడినవారు తమ చుట్టూ ఎన్ని సంక్షోభాలు చెలరేగుతున్నా చలించకుండా ప్రశాంతజీవనం సాగిస్తూనే ఉన్నారు!"ఇప్పటి సమస్య యేంటి?దానికి పరిష్కారం యేంటి?ఏది ప్రశాంతంగా ముందుకు నడిచహెతందుకు ఉత్సాహపరుస్తుంది?" - అంతకు మించి సనాతనులు ఈ పెర్స్పెక్టివ్ డిఫరెన్సుల గనదరగోళంలో పడరు.మనోభావాలు దెబ్బతినడం అంటే యేంటో వారికి తెలియదు!ఎటొచ్చీ మెకాలే మహానుభావుడు మనకి ఇంగ్లీష్ నేర్పకపోయుంటే బ్రాహ్మల చేతుల్లో చచ్చిపోయి ఉండేవాళ్ళం అని నమ్ముతున్న వాళ్ళకి బ్రాహ్మలు చెప్పిన ప్రతిదాన్నీ మరో వైపు నుంచి చూసి ఆ కుట్రకోణాన్ని అర్ధం  చేసుకోవాల్సిన అవసరం ఉంది గాబట్టి ఈ పెర్స్పెక్టివ్ ఔట్లుక్ అనేది పుట్టుకొచ్చింది.తలలోని మెదడుతో ఆలోచించే మనం ఇట్లా సూటిగా "కుక్క తోకని వూపుతుంది" అనేస్తే మోకాలిలోని మెదడుతో ఆలోచించేవారికి అందులో కుట్ర ఉన్నట్టు కనపడుతుంది.ఆ కుట్రని తను కనుక్కుని మిగిలిన మోకాలిలోని మెదడుతో ఆలోచించేవారిని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు మన గ్రూపులో చేరకుండా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా డిఫరెంట్ పెర్స్పెక్టివ్ చాలా అవసరం.

     మీకు బోరు కొట్టినా సరే మరోసారి కుక్క-తోకని-వూపటం అనే దృశ్యాన్ని మీ కళ్ళముందు ఉంచబోతున్నాను.ఇప్పుడే కాదు,ఈ పోష్టు నిండా ఈ దృశ్యాని మీ కళ్ళ ముందు నుంచి పోనివ్వకండి!కనుక్కోగలిగిన వాడికి ఈ ఒక్క దృశ్యంలోనే సమస్త విద్యల్నీ సుబోధకంగా అర్ధం చేసుకోగలిగిన పాండిత్యం వస్తుంది - కాలభైరవస్వామి దీక్ష అంటారు దీన్ని!ఉదాహరణకి "కుక్క తోకని వూపుతుంది" అన్న  సిద్ధాంతంలో బ్రాహ్మణుల కుట్రని కనుకున్న పెద్దమనిషి తనని ఆ కుట్రనించి కాపాడుకోవటానికి చేసే వ్యూహాత్మక మేధోవికసన సంభరితమైన విశ్లేషణ ఎలా ఉంటుంది అనేది మనకి తెలియాలంటే మనం కూడా కాసేపు తలలోని మెదడుతో కాకుండా మోకాలిలోని మెదడుతో ఆలోచించాలి - మరో దారి లేదు!వారొక వేళ తమలో తాము చెప్పుకోవడానికయితే అట్టే శ్రమపడనకరలేదు.కానీ అందరితో ఒప్పించాలంటే కొంచెం శ్రమ పడాలి గదా, మనకి కూడా వారి విశ్లేషణ నమ్మదగ్గదే అనిపించాలి గదా!లేకపోతే మనం తాటాకులు కట్టేస్తాం,అవునా?కుక్క తోకని వూపుతుంది అనే ప్రతిపాదనలోని కుట్రని తప్పించుకోవాలంటే తోకయే కుక్కని కదిలిస్తుంది అని నిరూపించగలిగితే చాలు!ఆర్య - ద్రవిడ ఆక్రమణ తిరగమోత సిద్ధాంతాన్ని వండి వార్చటానికి రొమిల్లా ధాపర్ గారు ఎంత కఠోరంగా శ్రమించారో గుర్తు చేసుకుని ఉత్తేజితులై తోకయే కుక్కని కదిలిస్తుంది అన్న దానికి సాక్ష్యంగా తెచ్చుకోవడానికి కుక్క యొక్క ప్రతి కదలికనీ నిశితంగా పరిశీలించాలి.లించగా లించగా హఠాత్తుగా ఒక విషయం పత్యేకంగా కనిపిస్తుంది - కుక్క ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే తోకని కదిలిస్తుంది - నడిచేటప్పుడు,పరిగెత్తేటప్పుడు తోకని కదిలించదు:కొన్ని కుక్కలయితే తోకని కాళ్ళమధ్యన ఇరిక్కించుకుంటాయి!హమ్మయ్య, తలలోని మెదడుతో ఆలోచించేవాళ్ళని వాదనలో గెలవటానికి ఒక తిరుగులేని సాక్ష్యం దొరికేసిందోచ్!

     "పైన టైటిలు యేంటి?ఈ కుక్క తోక వూపడు గొడవ యేంటి?హరిబాబుకి మెంటల్ వచ్చేసిందా?ముద్రగడ గురించిన వార్తలు మరీ ఎక్కువగా ఫాలో అయ్యాడా?" అని మీరు అనుకుంటే అది శానా తప్పు.ముందే చెప్పాను విషయం కాంప్లికేటెడ్,జాగత్తగా ఫాలో అవ్వాలని!కొన్ని విషయాల్ని సూటిగా చెప్పలేం.అసలే నేను కబాలి గాణ్ణి  దానికి తోడు "చుట్టూ చుట్టి వచ్చావా?చూపుడువేలితొ గుచ్చావా!" అనే మూడ్ ఆవహించి ఉంది - రివోల్టిస్తే పిచ్చెక్కిస్తా:-) ఆదికాలం నుండీ ప్రపంచంలోని ఆలోచనాపరులు "తలలోని మెదడును ఉపయోగించి ఆలోచించేవాళ్ళు","మోకాలిలోని మెదడును ఉపయోగించి ఆలోచించేవాళ్ళు" అని రెండు రకాలుగా విడిపోయి ఈ జగన్నాటకంలో ఎవరి పాత్రని వారు పోషిస్తూ కాలచక్రం ఆకులకి బంకలా అతుక్కుని తాము అతుక్కున్న ఆకు నేలకి తగిలి తమని నలిపినప్పుడు ఏడుస్తూ పైకి వెళ్ళి చిటారుకొమ్మన తమని నిలబెట్టినప్పుడు ఇకిలిస్తూ మల్లాగుల్లాలు పడుతున్నారు.అయితే,ఈ త.మె.ఉ.ఆ గాళ్ళు మహా ముదుర్లు,తమ ఆకు కొంచెం  కిందకి వెళ్ళబోతుందని తెలియంగానే వెంఠనే ఎలర్టయ్యి అసుంటా పక్కకి జరిగి నలుగుడును తప్పించుకుంటున్నారు.పైగా అమాయకులైన మో.మె.ఉ.ఆ గాళ్ళు తప్పించుకోలేక అవస్థలు పడుతుంటే క్రూరంగా కేరింతలు కొట్టి ఆనందిస్తున్నారు - దాంతో కొందరు శ్రీనివాసుడు లాంటి మంచి త.మె.ఉ.ఆ గాళ్ళు ఎట్లాగయినా మో.మె.ఉ.ఆ గాళ్ళని రకషిద్దాం అని ఎంత ప్రయత్నించినా హెచ్చార్కె లాంటివాళ్ళు ఇంకా మొండికెత్తిపోతున్నారే తప్ప శ్రీనివాసుడు ఆశించిన మార్పు రావడం లేదు.దాంతో తన శ్రమ వృధా అవుతున్నందుకు విసుక్కుని అశాంతికి లోనవుతున్న శ్రీనివాసుడు తరహా అజ్ఞానులకి హెచ్చార్కె లాంటి జ్ఞానుల ఆంతర్యాన్ని బోధపర్చాలంటే ఇంత పెద్ద ఉపోద్ఘాతం/మొదటిసుత్తిదెబ్బ చాలా అవసరం.ఇట్నించి నరుక్కొస్తే పని జరగనప్పుడు అట్నించి నరుక్కు రమ్మన్నారు పెద్దలు, విన్లేదూ!

     వ్యూహాలన్నీ దిట్టంగా వేసి,సైన్యాన్ని చక్కగా మొహరించి,శంఖం వూదేశాక ఇంక రంగంలోకి దిగాలి కదా  - ఇప్పుడు దిగుదాం!ఎక్కడో ఒకచోట తను గందరగోళంలో ఉన్నట్టు చెప్పిన హెచ్చార్కె గారు మొదట "అన్న ద్వేషం"లో ఏమి చెప్పదలుచుకున్నారు?ప్రధాన విషయం బ్రాహణీకం నవలని చలం కధలోని విలన్ పాత్రకి అంటగట్టిన బ్రాహ్మణేతరోద్యమాన్ని అవమానించటానికీ బ్రాహ్మణుల్ని పొగడటానికీ రాస్తే ఇప్పటి వరకూ విమర్సకులెవరూ కనుకోలేని ఆ పరమసత్యాని తను కనుక్కున్నానని నవలలోని కొన్ని భాగాల్ని ఉటంకించి నిరూపించటం.కానీ వ్యాసం మొదలుపెట్టింది తన బాల్యపు అనుభవాలతో - బహుశా తన బ్రాహ్మణ ద్వేషానికి మూలకారణాల్ని చెప్పడం ద్వారా ముందరి వాదనకి బలం చేకూరుతుందని భావించి ఉండవచ్చు!అదంతా నాకు అనవసరం అనిపించినా రచయిత రాసేశాడు గనక,అచ్చులోకి వచ్చేసింది గనక చదవటం నుంచి తప్పించుకోలకపోయాను.కానీ అప్పటి వరకూ వాళ్ళింట్లో స్వేచ్చగా తిరిగిన ఈయనని  ఆ బ్రాహ్మణూడు ఒక్కసారిగా అట్లా మందలించడం,దానికి మనసు విరిగిపోయి ఈయన బ్రాహ్మణద్వేషి అయిపోవడం మరీ సినిమాటిక్ మెలోడ్రామా అనిపిస్తున్నది నాకు.సరే,ఆయన సొంతగొడవ ఆయనది,ఆయన అనుభూతులు ఆయనవి,ఆయన అర్ధం చేసుకునే పద్ధతి అది - వాట్ని గురించి యేమీ విమర్శించను!కానీ,"హిస్టారికల్ బుద్ధా" అనే పరమ వాస్తవికమైన గ్రంధంలో బుద్ధుడి కాలానికి కూడా మనుషులు పుట్టిన కులంలోనే అంటుగట్టుకుపోకుండా కులాన్ని మార్చుకునే వీలు ఉండేదనీ,వృత్తులకి అనుబంధంగా కులాలు యేర్పడినాయనే చారిత్రక పరిశోధనల వాసన లేని ఒక మామూలు మధ్యతరగతి కుటుంబీకుడిగా ఉన్న బ్రాహ్మణుణ్ణి తన జ్ఞానపు పరిధికి మించిన ప్రశ్న అడిగితే ఏమి చెబుతాడు?ఈ హెచ్చార్కె గారినే తనకి తెలియని విషయం గురంచి ఎవరయినా చెప్పి తీరాల్సిందేనని రెట్టించి అడిగితే యేమి చేప్తాడు?

     సకలకళావల్లభుడు అనే పదానికి శ్రీరమణ గారు అన్ని ప్రక్రియల మీదా రెట్ట వేసిన పిట్ట అనే సరదా అనువాదం చేశాడు.అట్లాగే ఈయన కూడా బీఫ్ వివాదం నుంచి మహిషాసురుణ్ణి మూలవాసీల దేవుడని అంటూ వచ్చిన కరపత్రం వరకు గల అన్నింటి మీదా విరుచుకు పడ్డాడు.ప్రపంచంలో తొలిసారిగా వ్యవస్థీకృతంగా వ్యవసాయం,పశుపోషణ మొదలు పెటింది భారతీయ సనాతనులే - అది కూడా గోజాతితోనే మొదలైంది!అప్పటి నుంచి భారతీయుల సామాజిక జీవితం మొత్తం గోమాతను దేహమాత,దేశమాత,దేవమాత తదాదిగా గల పంచమాతృకలలో ఒక మాతగా చేసుకుని పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు!గోవునే ఎందుకు పూజించాలి,గేదెనీ మేకనీ ఎందుకు పూజించరాదు అని మహా రౌద్రంగా అడుగుతున్నవారు వాటికి ఒక్కరోజునైనా తిండి పెట్టి పోషించి రక్షించిన దాఖలాలు ఉన్నాయా?ఇప్పటి నుంచీ గేదె భక్తులూ మేక భక్తులూ వాట్ని కూడా రక్షించి పూజించుకోవచ్చు కదా!ఎవరు వద్దన్నారు?మహిషాసురుణ్ణి పొగుడుకుంటూ వేసిన కరపత్రం గురించి స్మృతి ఇరానీ గొంతు వణకటం గురించి మాత్రమే పట్టించుకుని వ్యంగ్యాలు విసురుతున్న ప్రబుద్ధులు మరి అందులో దుర్గను సెక్స్ వర్కర్ అనటం గురించి ఎందుకు మర్చిపోతున్నారు?ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా అంతా తెలిసినట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ మోకాలిలోని మెదడుతో ఆలోచించేవాళ్ళకి సహజ లక్షణం కాబోలు!

     కరపత్రంలో దుర్గని సెక్స్ వర్కర్ అన్నదాన్ని సమర్ధించటానికి చివరి వాక్యంలో "ఇప్పుడు కరపత్రంలో తమ మూలవాసి రాజుని మోసగించి చంపిన స్త్రీని వాళ్ళు ఏదో అన్నారని అంతగా వూగిపోయి డిప్రేవిటీ అంటూ అరుస్తారా?ఇదంతా ప్రజాస్వామ్యం కిందకి వస్తుందా?" అని అడుగుతున్న ఈ పెద్దమనిషికి ప్రజాస్వామ్యం యొక్క మౌలిక లక్షణం మెజార్టీ అభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన ఉండటం అని నిజంగానే తెలియదా?అధికారం మెజార్టీ పౌరుల అభిప్రాయాన్ని ప్రతిబింబించటం ప్రజాస్వామ్యానికి మొదటి లక్షణం అయినప్పుడు ఆ మెజార్టీ ప్రజల సంస్కృతిని అధిక్షేపించటం ప్రజాస్వామ్యబద్ధమైనది అని  కేవలం తోకయే కుక్కని కదిలిస్తుంది అని వాదించగలిగిన మోకాలిలోని మెదడుతో ఆలోచించేవాళ్ళు మాత్రమే చెయ్యగలరు!తెలంగాణ వాళ్ళు అధికారికంగా ఇవ్వాళ మా ప్రాంతాన్నేలిన గొప్ప రాణి అని రుద్రమదేవి గురించి  మురుసుకుంటున్న కాకతీయులంటే సమ్మక్క సారక్కల అభిమానులకి ద్వేషం!వీళ్ళలో ఎవడయినా  ఇప్పటికిప్పుడు మేడారం నడిబొడ్దున నిలబడి కాకతీయుల్ని కీర్తిస్తూ మాట్లాడి క్షేమంగా వెనక్కి తిరిగి రాగలడా?

     సరే,పిట్టకధలుగా చెప్పిన అప్రస్తుత విషయాల్ని ఇంతటితో వదిలి వ్యాసంలోని ముఖ్యవిషయం సంగతి చూద్దాం.ఇన్నేళ్ళుగా ఏ గొప్ప విమర్సకుడికీ తోచని ఒక కొత విషయం ఈయన కనిపెట్టేశాడు - చలం బ్రాహ్మణీకం అనే నవలని బ్రాహ్మణుల్ని పొగడ్డానికీ విలన్ అయిన రామయ్యనాయుడికి అంటగట్టిన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని విమర్శించటానికీ రాశాడని!అదేదో మహద్రచన అయినట్టు దాన్ని ప్రశంసించిన కుహనా ఫెమినిస్టులూ,దాన్ని ఆధారం చేసుకుని కేంద్ర సాహిత్య సత్కారాలు అందుకున్నవాళ్ళంతా అది కాకతాళీయంగా చెయ్యలేదనీ వారు కూడా చలం వంటి కుట్రదారులేననేందుకు తన దగ్గిర  సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నాడు.తన వాదనని బలంగా నిరూపించే ఆధారాలు నవలలోనే వున్నాయంటున్నాడు!మొదటి ఆధారంగా ఇతరత్రా మంచివాడు అని చెప్పి, రామయ్యనాయుడు సుందరమ్మకి సాయం చెయ్యడానికే వెళ్ళినట్టు చెప్పి,ఆమె కులం ఏమిటో తెలిశాక "బ్రాహ్మణ స్త్రీని అలా చయాలనిపించిన విపరీత మనస్తత్వం వల్ల అలా చేశాడట" అని చలం మాటల్ని చెప్పి దానికి తను "మరో మాటలో బ్రాహ్మణవ్యతిరేకోద్యమ మనస్తత్వంతో అలా చేశాడు అని చెలం పలు విధాలుగా ఎస్టాబ్లిష్ చేశాడు" అనే వాదన చేస్తున్నాడు.రెండవ ఆధారంగా చివరి సన్నివేశంలో రామయ్యనాయుడు తనని మోసం చేశాడని తెలిసి నిర్ఘాంతపోయి చస్తూ చస్తూ చూసిన కోపపు చూపుకి తనలోని గిల్ట్ వల్ల  భయపడి వెనక్కి వెనక్కి జరిగి బుడ్డి దీపం అంటుకుని రామయ్యనాయుడు చచ్చిపోయే సనివేశాన్ని బ్రాహ్మణీకపు మహత్యాన్ని ఉగ్గడించటానికే అట్లా రాశాడనే వాదన   చేస్తున్నాడు.

     మొదటి వాదనలోని ఔచిత్యం గురించి తెలుసుకోవడానికి సాహిత్యసృజన విషయం పక్కకి పెట్టి వాస్తవ సమాజంలోని సామాన్యుల నుంచి మహనీయుల వరకు ఏ వ్యక్తిని తీసుకున్నా ఏ ఒక్క వ్యక్తిలోనూ 100% మంచీ 100% చెడూ ఉండటం లేదని తెలుస్తుంది!అయినా సరే,పట్టువదలని విక్రమార్కుడిలా  ఎవరయినా 100% మంచివాడి కోసం గానీ 100% చెడ్డవాడి కోసం గానీ గడ్డివామిలో సూదిని వెతికినంత దీక్షగావెతికి పట్టుకోదల్చుకుంటే రెండే రెండు చోట్లు ఉన్నాయి - పిచ్చాసుపత్రులు,అధమస్థాయి రచయితల సాహితీరూపాలు.ఆ రెండు క్యాటగిరీలనీ సమాజం ఎక్కువ కాలం భరించలేదు!అందుకే మొదటి రకం వ్యక్తుల్ని నాలుగ్గోడల మధ్యన ఉంచడం,రెండవ రకం వ్యక్తుల్ని తొందరగా మర్చిపోవడం జరుగుతున్నది.ఒక అత్యున్నత భావశిఖరం మీద నిలబడి తమ చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఏ రకం వ్యక్తిత్వాల్ని అలవర్చుకుంటే ఇప్పటికన్నా మెరుగ్గా బతకవచ్చునో అలాంటి వ్యక్తిత్వాన్ని కధానాయకుడికీ ఏ రకం వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే జీవితం దుఃఖభాజనం అవుతుందో అలాంటి వ్యక్తిత్వాన్ని ప్రతినాయకుడికీ ఆపాదించి మొత్తం సమాజానికి దిశానిర్దేశంగా పనికొచ్చే సాహిత్యాన్ని సృజించగలిగిన రచయితలు రూపుదిద్దిన పాత్రలు అజరామరంగా ఉండటానికి కారణం మంచిచెడుల మేలుకలయికగా అల్లిన వాటి నిర్మితిలోని వాస్తవికతయే!ఆ లక్షణాన్నే తపు పట్టినవాడు సాహితీ విమర్శకి దూరంగా ఉంటే తనకీ ఇతర్లకీ చాలా ఉపకారం చేసినవాడవుతాడు.

     ఈ రోజున ప్రపంచంలో క్రౌర్యానికి పరాకాష్టగా నిలబడిన అడాల్ఫ్ హిట్లర్ రాజకీయ జీవితం సమసమాజాన్ని వూహించే బాత్ సోషలిస్టు పార్టీలో మొదలైంది!ఆర్యులు గొప్పవాళ్ళని అనుకోవటంలోనూ,ప్రపంచాన్నంతా ఆర్యులతో నింపెయ్యాలని అనుకోవటంలోనూ,దాన్ని సాధించటంలోనూ తప్పు లేదు - స్నేహపూర్వకమైన శాంతియుత మార్గంలో సాధించి ఉంటే వసుధైకకుటుంబభావనని నిజం చేసి చూపించిన చరితార్ధుడుగా మిగిలి ఉండేవాడు!కానీ,దాన్ని కొంచెం వంకర తిప్పి యూదు జాతితో మొదలుపెట్టి తనకి నచ్చని వాళ్ళని అంతం చెయ్యడం ద్వారా సాధించాలనుకోవడం వల్లనే అది తప్పుగా మారింది, అవునా?అట్లాగే రామయ్యనాయుడు సుందరమ్మని అనుభవించటం తప్పు లేదని తనని తను జస్టిఫై చేసుకోవటానికి బ్రాహ్మణ వ్యతిరేకతని మెలితిప్పి వాడుకున్నాడు అని మాత్రమే చెలం ఎస్టాబ్లిష్ చేశాడు.దీని గురించి నేను సారంగలో కలగజేసుకుని చెప్పింది ఇది:"నేను బ్రాహ్మణీకం సొంతంగా చదివి ఉన్నాను.చాలా కాలమైంది.కానీ ఇప్పుడు ఈ ప్రస్తావనల వల్ల మళ్ళీ గుర్తు చేసుకోగలిగాను. హెచ్చార్కె గారి అసలు వ్యాసం నేను చదవలేదు, లింకులుగా ఇచ్చిన ప్రతివిమర్శ మాత్రమే చదివినా కధలో ఆ బ్రాహ్మణ స్త్రీకి మహత్యం అంటగట్టినట్టు అప్పుడు చదివేటప్పుడూ అనిపించలేదు,ఇప్పుడు కూడా చలం నాయుడు చెడగొట్టింది ఒక బ్రాహ్మణ స్త్రీని గాబట్టి నాయుడు పాత్రని చంపాడని అంటే ఒప్పుకోవడం కష్టం.కధలోని విషయం సూటిగా చెప్పాలంటే ఒక కష్టంలో ఉన్న వ్యక్తిని ఆ కష్టాన్ని గట్టేక్కిస్తానని కబుర్లు చెప్పి మోసం చెయ్యడం ఎట్లా ఉంటుందో బొమ్మకట్టినట్టు అతి దగ్గిర్నుంచి చూపించటం, నాయుడి శూద్రత్వాన్ని ఆ స్త్రీ బ్రాహ్మణత్వాన్ని మాత్రమే పట్టించుకోకుండా మన చుట్టూ చూస్తే ఎక్స్ప్లాయిటేషన్ యొక్క పిక్చర్ ఇదే కదా!చలం చేసిన అసలైన ట్రిక్ మోసం చేసేవాడు తనకి తను ఇచ్చుకునే జస్టిఫికేషన్ ఎట్లా ఉంటుందో విప్పి చూపించటం!నాయుడు ఒకప్పుడు తను బ్రాహ్మల వల్ల అన్యాయానికి గురై ఆ కులం మీదనే ద్వేషం పెంచుకుని,ఇక్కడ కనబడుతున్నది బ్రాహ్మణస్త్రీ గాబట్టి రేప్/బలాత్కారం/కపటసంభోగం చెయ్యడంలో ఎలాంటి తప్పూ లేదని అనుకోవడమే కధలోని మెలిక!నాయుడి స్థానంలో హిట్లర్ అనే మరొక వ్యక్తిని నిలబేడితే చరిత్రలో అతడు చేసిందీ ఇదే కదా! మొదట యూదుజాతి మీద దుష్ప్రచారం చేసి అలాంటి యూదుల్ని కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో ఉంచటం,గ్యాస్ చాంబర్లలఒ చంపడం తప్పు కాదనే జస్టిఫికేషన్ తెచ్చుకున్నాకనే ఆపని అంత ధీమాగా చెయ్యగలిగాడు!హెచ్చార్కె గారు ఆ కోణాన్ని పట్టించుకుని ఉంటే బాగుండేది,ఎజెండా,ఐడియలాజికల్ న్యారోనెస్ మనస్సులో సుడులు తిరుగుతునవాళ్ళు సాహిత్యవిమర్శ వైపుకి పోకుండా ఉంటే మంచిది!" - నిజానికి తలలోని మెదడుతో ఆలోచించగలిగిన వాళ్ళకి ఈ ఒక్క విశ్లేషణలోనే హెచ్చార్కె గారి రెండు వాదనలకీ కలిపి జవాబులు దొరుకుతాయి:-)

     బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమం అనగానే అందరికీ మొదట గుర్తుకొచ్చేది తమిళుడైన పెరియార్.కానీ క్రీ.శ 1879లో పుట్టి క్రీ.శ 1973లో చనిపోయిన ఇతనికన్నా రెండు దశాబ్దాల ముందరే తెలుగువాడైన వెలమ కులానికి చెందిన ముద్దు నరసింహం తొలిసారిగా బ్రాహ్మణాధిక్యత మీద రణభేరి మోగించాడు.ఇతని వివేకవర్ధిని వ్యాసాలు వీరేశలింగం పంతులు,గురజాడ అప్పారావు వంటి చాలామందిని హిందూ సమాజంలో విప్లవాత్మకమైన సంస్కరణల్ని తీసుకురావటానికి ఉత్సాహపరిచాయి.ఇప్పుడు దొరకడం లేదు గానీ వాటిని చదివిన వారు ప్రశంసించిన తీరు చూస్తుంటే ఆ చిచ్చరపిడుగే ఈ చిచ్చరపిడుగై పుట్టాడా అని అనుమానంగా ఉంది:-)అయితే ముద్దు నరసింహం దగ్గిరనుంచి పేరియార్ వరకు ఉన్న బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ సారధులు ఎవరూ పూర్తిగా హిందూమతాన్ని ద్వేషించలేదు -కాలదన్నుకుని పోలేదు!కేవలం బ్రాహ్మణులకి జరుగుతున్న అధికమైన గౌరవ మర్యాదల పట్ల ఈర్ష్యా, పౌరోహిత్యపు అవసరాల కోసం బ్రాహ్మలకి ఇస్తున్న సంభావనల ఖర్చు గురించిన లోభితనమూ మాత్రమే నాకు కంబడుతున్నది నాకు వారి వాదనలలో.ఎందుకంటే బ్రాహ్మణాధిక్యతని ఎదిరించటానికి వారు కష్టపడి కనుక్కున్న బ్రహ్మాండమైన సొల్యూషన్లు రెండు!స్వసంఘపౌరోహిత్యం:యజ్ఞోపవీతాన్ని విశ్వబ్రాహ్మణులు,వైశ్యుల వంటి కులాల వారు కూడా ధరిస్తున్నప్పటికీ,వారికి శాస్త్రాన్ని అనుసరించి చేసేదీ తమకు వైదిక పద్ధతిన చేసుకునేదీ బ్రాహ్మణులే!అలా కాకుండా ప్రతి కులంలోనూ కొందరు వేదం చదివి పౌరోహిత్యపు విధి విధానాల్ని తెలుసుకుని తమ కులానికి తామే వైదిక కర్మల్ని చేయించగలిగే యేర్పాటు.అసలు వైదిక కర్మలు అక్కరలేదు అనటం లేదు,ఉండాలి!కానీ,బ్రాహ్మల ద్వారా కాకుండా తమకు తామే లాగించేసుకోవాలి!ఇది పెద్ద తల్నొప్పి యవ్వారం అని మీకూ తెలుసు - తలలోని మెదడుతో ఆలోచించే బుద్ధిమంతులు గనక!మొదట్లో బులపాటానికి చవగ్గానే చేసినా తర్వాత్తర్వాత వీళ్ళూ చెట్టెక్కి కూచోరని గ్యారెంటీ యేమిటి?వేదజ్ఞానార్హత:ఈ పౌరోహిత్యాలతో సంబంధం లేకుండా వేదాధ్యయనం మీద అధికారం వల్లనే బ్రాహ్మణులు చెట్టెక్కి కూర్చున్నారని అనుకుని వేదాధ్యయనం కోసం పోటీ పడటం.ఇది కూడా చెత్త సొల్యూషనే,ఎందుకంటే ఒక అకంసాలికి తన వృత్తిలో నైపుణ్యం కావాలంటే సీనియర్ల దగ్గిర చేరి ఆ వృత్తికి సంబంధించిన మెళకువలు నేర్చుకుంటే పొట్ట గడుస్తుంది గానీ సంగీతము చేత బేరసారము లుడిగెన్ అన్నట్టు శుష్క యజుర్వేదాలు చదివితే యేమొస్తుంది?

     నిజానికి చారిత్రకంగా పరిశీలించి చూస్తే అన్ని వృత్తుల మీదా అందరూ కుల వ్యవస్థ ద్వారా మోనాపలీ సాధించుకోవటం పూర్తయ్యాక ఇక మిగిల్న పౌరోహిత్యాన్ని వృత్తిగా తీసుకుని బ్రాహ్మణ కులం ఏర్పడిందనేది వాస్తవం.ఆ డిమాండ్లు/సొల్యూషన్లు అనబడే సూత్రీకరణల తింగరితనం వల్ల ఎంత గొప్పగా మొదలైందో అంత వేగంగా బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమం చల్లారిపోయింది.వీరేశలింగం పంతులు గానీ గురజాడ అప్పారావు గానీ అందులోని మెయిన్ కంటెంటుని వదిలి సంస్కరణలకి ఉపయోగించుకున్న కాలానికే అది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంది.ఈయన రామయ్యనాయుడు పేరును బట్టి ప్రస్తావించిన త్రిపురనేని రామస్వామి చౌదరి స్థాపించిన సూతాశ్రమం ఆయన పోగానే మూతబడింది.ఇంకా చలం నాటికి బలంగా ఉన్నది అంటాడు చూడండి చోద్యం గాకపోతేనూ!తన కాలానికి బలంగా ఉన్నా ఉండకపోయినా ఆ మంచివారిలో ఎవరినీ చెలం అవమానించలేదు కదా,హిట్లర్ మాదిరి ఆ సిద్ధాంతాన్ని తన దురద తీర్చుకోవటానికి రామయ్యనాయుడు సపోర్టు తెచ్చుకోవడాన్ని తప్పు పట్టటం మొత్తం బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమాన్ని తప్పు పట్టటం అని మోకాలిలోని మెదడును ఉపయోగించి ఆలోచించగలిగే వాళ్ళు మాత్రమే అనగలరు!ఈ లెఖ్ఖన పౌలస్త్యబ్రహ్మమనుమడు అని చెప్పి సీతాపహరణం చేయించినందుకు బ్రాహ్మలంతా ఇకనుంచీ వాల్మీకిని దుమ్మెత్తి పొయ్యాలా, బాఘానే ఉంది సంబడం:-)

     గిరీశాన్నీ,లుబ్ధావధాన్లనీ బ్యాపనోళ్ళని చెప్పి వెక్కిరించినందుకు గురజాడ అప్పారావును కూడా ఉతికి ఆరెయ్యాలి,సంస్కర్తగా ఎందుకు కీర్తిస్తునట్టు?అన్నట్టు గురజాడ మధురవాణితో సుకుమారంగా చెప్పించకపోతే సున్నితహృదయుడిగా కనబడే సౌజన్యారావులో ఉన్న యాంటీనాచ్చి ఉద్యమంలోని మూర్ఖత్వం కూడా మనకు తెలిసేది కాదనుకుంటాను!ఒక సాహిత్యరూపంలోని పాత్రచిత్రణ వాస్తవికంగా ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి లక్షణగ్రంధాలూ అలంకారిక శాస్త్రాలూ మొత్తం తిరగెయ్యడం అనవసరం - జస్ట్ కామన్ సెన్సు చాలు!నేను వేసిన మొదటి కామెంటులో ఉన్నది అర్ధమయ్యి శ్రీనివాసుడు గారు ఇచ్చిన అసలు ఈ సీరియల్ గొడవకి అంకురార్పణ చేసిన "అన్నద్వేషం - బ్రహ్మద్వేషం" వ్యాసం చదివాను.అక్కడే నా ఫైనల్ ఒపీనియన్ చెప్పాను.అది ఇలా ఉంది:ఇప్పుడు “అన్నద్వేషం-బ్రహ్మద్వేషం” వ్యాసం చదివాను.ముఖ్యంగా బ్రాహ్మణీకం గురించిన రెండు పేరాగ్రాఫులూ స్పష్టంగా చదివాను.హెచ్చార్కె గారు పక్షపాతమే చూపించారు విశ్లేషణలో. సుందరమ్మకి వచ్చిన కోపానికి కారణాన్ని చలం ఎస్టాబ్లిష్ చేసిన తీరు కూడా నేను పైన ఇచ్చిన విశ్లేషణనే బలపరుస్తున్నది,గమనించండి! సుందరమ్మకి వచ్చిన తీవ్రమిన కోపానికి ఉన్న మోటివ్ ఆమె కేవలం బ్రాహ్మణస్రీ అవడం వల్ల అని చలం చెప్పాడా?తన అసహాయతని ఉపయోగించుకోవడం కన్నా మరొక బాధ ఉంది.తన కొడుకు ప్రాణం గురించి కదా అంతకి సిద్ధపడింది.ఇప్పుడు ఇతను తాపీగా నేను డాక్టర్ని కాదు అని చెప్తే అక్కడున్నది దళితస్త్రీ అయినా అంత కోపమూ వస్తుంది కదా!అసలు కధ చదివి చాలా కాలమయినా,హెచ్చార్కె గారి విశ్లేషణ ఆ కధకి అన్యాయమే చేసిందనే నా అభిప్రాయాన్ని మార్చుకునేటందుకు తగిన కారణం కనపడటం లేదు.చలం జస్టిఫికేషన్ గురించి చెప్పటానికే ఆ కధ రాశాడు.జస్టిఫికేషన్ అనే పాయింటుని బలంగా చెప్పడానికి నాయుడికి ఉన్న బ్రాహ్మణ ద్వేషం ఒక ఉపాంగం మాత్రమే!చలం బ్రాహ్మణుడే కావచ్చు,కానీ బ్రాహ్మణీకం అనే పేరుకి కూడా సుందరమ్మ యొక్క బ్రాహ్మణీకం ఆమే యొక్క పవిత్రతని కాపాడలేకపోయింది అనే వ్యంగ్యసూచన!రచయిత వ్యంగ్యం కోసం వాడుకున మరొక చిన్న మాట “నాయుడు ఆమె కోపంలో దెయ్యాన్నీ మహిషాసుర మర్దిని చూడటం” అనేది.శ్రీశ్రీ విప్లవకవి,కమ్యూనిజానికి సపోర్టుగా నిలబడి జంధ్యాన్ని ఎంపేశాడు.కానీ తన కవిత్వంలో పురాణ కధల,పాత్రల పోలికల్ని తీసుకోలేదా?మెయిన్ పాయింటు మనస్సులో నిశ్చయించుకున్నాక కధకుడు గానీ కవి గానీ వాతావరణాన్ని సృష్టించడానికి పోలికలూ,సన్నివేశ కల్పనలో చేసే చమత్కారాలూ ఎక్కడినుంచయినా తీసుకోవచ్చు,అది రచయిత లందరూ చేస్తున్నదే కదా!మెయిన్ పాయింటు ముఖ్యం!ఒక్కోసారి శిల్పం రీత్యా అవసరమయితే మెయిన్ పాయింటుకి వ్యతిరేక ధోరణిలో కూడా మెయిన్ పాయింటుని బలంగా ఎక్కించవచ్చు.కవి నిరంకుశుడు.కదకుడు నియంత.ముమ్మాటికీ హెచ్చార్కె గారు బ్రాహ్మణీకం కధని సరిగ్గా అర్ధం చేసుకోలేదనే నాకనిపిస్తున్నది.స్వస్తి!"ఈ కధకి ఫలశృతి ఏమిటి?బ్రాహ్మణ స్త్రీని ఆశించిన అబ్రాహ్మణుడు మాడిపోతాడని చెప్పడమేగా?" అని అంత భీకరంగా గర్జించి మిగిలిన వాళ్ళు చలం బ్రాహ్మణీకపు మహత్యానికి గురయి రామయ్యనాయుడు చచ్చిపోయాడని ఎక్కడయినా నొక్కి వక్కాణించాడా అని నిలదీస్తే "అయ్యయ్యో అవి చలం మాటలే" అని మళ్ళీ ఆ వాక్యాన్ని యధాతధంగా కాపీ/పేస్టు చేసిన మొద్దబాయికి అదే వాక్యంలో రామయ్యనాయుడు కాలి బూడిదై చావటానికి ముందే సుందరమ్మ చచ్చిపోయినట్టు చలం స్పష్టంగా చెప్పి ఉన్నాడని అర్ధం కాకపోతే,నాకర్ధం కానిదంతా తప్పే అన్న నత్కీరుడి లాజిక్ ప్రకారం ఆలోచిస్తే అది ఖచ్చితంగా చలం తప్పే!ఇది చదివేవాళ్ళు అందరూ తలలోని మెదడుతో ఆలోచించేవాళ్ళు మాత్రమే ఉండరు,మోకాలులోని మెదడును మాత్రమే ఉపయోగించేవాళ్ళు కూడా చదివే అవకాశం ఉండొచ్చు,వాళ్ళకి కూడా అర్ధం అవ్వాలంటే ముప్పాళ రంగనాయకమ్మలా సుత్తి రాయాలి అని తెలుసుకోలేకపోయాడు చలం - పాపం!

     కధలో చలం మాటలివి "ఈ లోకపు సంకుచిత వాసనల్ని, శరీరపు స్వల్ప బంధనాల్ని తెంచుకున్న ఆమె(సుందరమ్మ) ఆత్మ అతిక్రమించి వూర్ధ్వలోకాల జ్వలించే మహాశక్తులతో - బ్రాహ్మణ తేజస్సుతో సంబంధం కల్పించుకుంది...(రామయ్య) ఇంకో కాలు వెనక్కి వేశాడు.ఆమె కళ్ళలోంచి జవ్లించే వెలుగును భరించలేక భగ్గున మండిపోయినాడు.నిలువునా కాలిపోయినాడు.భస్మమైనాడు.వెనుకనే మందే దీపం అతని పంచె కంటుకుందా?అతని శరీరం లోంచి కాళ్ళమధ్య నించి లేచిందా మంట.... బ్రాహ్మణ కడపటి మహత్యం బ్రాహ్మణీకం ఈ కలియుగాన సుందరమ్మతో అంతమైంది" అని ముక్కస్య ముక్కగా యెత్తి రాసేటప్పుడైనా తలలోని మెదడుతో చదివి అర్ధం చేసుకుని ఉంటే రామయ్యనాయుడు కాలిపోకముందే సుందరమ్మ ఆత్మ వూర్ధ్వలోకాలని చేరినట్టు చెప్పడం ద్వారా ఆమెకి మహత్యాలు అంటగట్టలేదని అర్ధమై ఉండేది.

     నన్ను చంపి పోగులు పెట్టినా సరే తలలోని మెదడును మాత్రం చచ్చినా ఉపయోగించనని భీష్మించుకుని ఉన్న హెచ్చార్కె లాంటివాడు తలలోని మెదడును మాత్రమే ఉపయోగించగలిగిన శ్రెనివాసుడు చేసిన వాదనల్ని చచ్చినా ఒప్పుకోడు:-)అలా ఒప్పించాలనే దురద హరిబాబుకి మాత్రం పిసరంత కూడా లేదు,ఎందుకంటే హరిబాబు పుట్టేటప్పుడు బ్రహ్మలోకంలో ఒక విచిత్రం జరిగింది.ఆడాళ్ళు చెయ్యాల్సిన సృష్టికార్యం తన మొగుడు చెయ్యడం ఆడంగి పని అనిపించిందో యేమో తిక్క పుట్టి పని చెడగొట్టడానికి గీర్వాణి కొంచెం గోముగా చూసేసరికి ఆ చూపు పవరుకి అంతటి చతుర్ముఖుడూ ఢమాల్న పడిపోయి నన్నొక మాన్యుఫాక్చరింగ్ డిఫెక్టుతో బూమ్మీదకి వదిలేశాడు.అదేమిటంటే,తలలోని మెదడుతో పాటు మోకాలిలోని మెదడు కూడా ఫుల్ విగరుతో ఉండటం - ఇంకోళ్ళూ ఇంకోళ్ళూ అయిన గోగూర కట్ట గాళ్ళు అయిఉంటే ఈ రెండు మేదళ్ళూ కలిసి పంబ రేగిస్తుంటే చిన్నప్పుడే పిచ్చెక్కిపోయేవాళ్ళు.నేను చిచ్చరపిడుగును కదా,అందులోని సులుసూత్రం కనిపెట్టి మోకాలిలోని మేదడును మామూలప్పుడు జోకొడుతూ ఇలాంటి త.మె.ఉ.ఆ గాళ్ళ సాహితీసృజన చదివినప్పుడు దాన్ని నిద్ర లేపడం నేర్చ్గుకున్నా - అబ్బో,చాలా కష్టం లేండి!అసలు నేను ప్రత్యేకంగా లేపనక్కర్లేదు,తనలాంటివాళ్ళ కోసం ఆబగా,కక్కుర్తిగా ఎదురు చూస్తూ ఉంటుందేమో పాపం వెంఠనే గుర్తుపట్టేసి చాలా అనందిస్తుంటుంది.మరీ అదే పనిగా దాన్ని మెళకువగా ఉంచితే ప్రమాదం గదాని ఎక్కువగా ఇలాంటువాళ్ళవి నేను చదవడం లేదు.కానీ శ్రీనివాసుడు గారు ఇరికంచడంలో తప్పనిసరై ఇరుకుపోయా:-)

     బ్రాహ్మణీకం సరిగ్గా అర్ధం కాకపోవటానికి చలం ఏమైనా సంస్కృతంలో రాశాడా?కనీసం విశ్వనాధ సత్యనారాయణ టైపు గ్రాంధికం కూడా వాడలేదే!ఎంతసేపూ చలం సెటైర్లుగా వేసిన విశేషణాల్ని పేరు పేరునా ఉటంకించి ఇవి పొగడ్తలేగా అని ఇతర్న్లని దబాయిస్తున్నాడు గానీ "ఈ కలియుగాన సుందరమ్మతో బ్రాహ్మణీకం అంతమైపోయింది" అని బల్లగుద్ది చెప్తున్నా పట్టించుకోడు.పైగా చలం ఈ నవల్లోనూ ఇతర చోట్లా బ్రాహ్మణుల్ని విమర్శించాడు గదా పొగడాలనుకునవాడు అంత క్రూరంగా ఎందుకు విమర్శిస్తాడు అంటే దానికి చెప్పిన రీజనింగు ఇది.ఆ ముక్క చదువుతుంటే "ఆహ్హహ్హహ్హా!ఓహ్హొహ్హొహ్హో!!" అని పగలబడి నవ్వాలని తెగ సర్దా పుట్టేసింది.
------------------------------------------------
హెచ్చార్కె
“చెలం ఈ కథలోనే కాదు, చాల చోట్ల బ్రాహ్మణ కుటుంబాల లోని చాదస్తాల్ని గేఌ చేశారు. అది ఆ కులం బాగు పడ్డానికి పనికొచ్చే మాటలు. పనికొచ్చాయి కూడా. ఇవేవీ ‘బ్రాహ్మణత్వా’న్ని గేఌ చేయడం కాదు. బ్రాహ్మణత్వం అంటే కులాల్లో బ్రాహ్మణులు పవితృలని…”
హరిబాబు
అంటే చలం బ్రాహ్మణుల్ని “ఇప్పుడు మీరు పాటిస్తున్నది నిజమిన పవిత్రత కాదు,నిజమిన పవిత్రతని అలవాటు చేసుకోండి” అని గేలి చెయ్యడమో గడ్డి పెట్టడం కూడా మీకు నచ్చలేదు,అదీ యే పాయింటు మీద?ఆ విమర్శల్ని పట్టించుకుని సంస్కరించుకున్నదుకు!

అంటే,మీరు తిట్టడానికి పనికొచ్చేటట్టు బ్రాహ్మల్ని అట్లాగే ఉంచకండా బ్రాహ్మల్ని గేలి చీసి మంచివాళ్ళుగా మార్చెయ్యడం వల్ల చలం కూడా తప్పే చేఅశాదనన్మాట,బాగుంది వరస!
------------------------------------------------
     ఇందులో ఉన్న కిరికిరి యేంటో కొందరికి చదవగానే అర్ధమై ఉంటుంది,కదూ!బ్రాహ్మలు దుర్మార్గులై ఇతర కులాల్ని(మమ్మల్ని) అణిచేశారు,అందుకే మేము ద్వేషిస్తున్నాం అంటున్నాడు,మరి చలం తిట్ల వల్ల బ్రాహ్మణులు తమ దుర్మార్గాల్ని వొదులుకుంటే ఈయనకి కొత్తగా పుటుకొచ్చే నెప్పి యేంటి?"పొరపాట్న చలం తిట్ల వల్ల బ్రాహ్మలు మంచోళ్ళయిపోయిఉంటే ఇప్పుడు మేమెవర్ని తిట్టాలి?" అన్న యేడుపు కనబడింది నాకు ఇందులో.చిన్నప్పుడు చూసిన గోపాలరావు గారి అమ్మాయి సినిమాలో మోహన్ బాబు పాత్ర చాలా తమాషాగా ఉంటుంది.అందులో హీరో చంద్రమోహన్ హీరోయిన్ జయసుధని యెప్పుడు చూసినా గోపాలరావు అనే ఆసామీ ఇంట్లోనుంచి బయటికొస్తూ అక్నబడ్డంతో తను గోపాలరావుగారి అమ్మాయి అనుకుని పేమించేస్తాడు.ఈ క్యామెడీ ఆఫ్ ఎర్రర్సులో మోహన్ బాబు బహుశా హీరోయినుకి అన్నగా చెల్లిలికి ద్రోహం జరిగిందనో మరో కారణంతోనో హీరోని చంపాలని చూస్తూ ఫెయిలవుతూ నవ్వు పుటిస్తూ ఉంటాడు.ఆఖరికి కధలోని కంఫ్యూజన్ అంతా విడిపోయాక వాళ్ళ నాన్నని భుజం మీద గోకుతూ "ఇపుడు నేనెవర్ని చంపాలి?" అనడుగుతాడు అమాయకంగా.వాచికం మీద మంచి పట్టున్న మోహన్ బాబు చక్కిలిగింతలు పెట్టించేటంత గొప్పగా చెబుతాడు.అటువైపు నాన్న పాత్రలో ఉన్నవాడు నాగభూషణం - అబ్బో,ఇంక చూస్కోండి!"నన్ను చంపరా పీడా వొదుల్తుంది" అంటాడు.కళ జీవితాన్ని అనుకరిస్తుంది అంటారు,ఆ దర్శకుడు తన జీవితంలో అలాంటివాడిని ఎక్కడో చూసి ఉంటాడనుకుంటే అది నిజమేననిపిస్తుంది గానీ ఇప్పుడు హెచ్చార్కె గారు అచ్చు మోహాన్ బాబులా మాట్లాడుతూ అప్పుడప్పుడు జీవితం కూడా కళని అనుకరిస్తుందని అనిపిస్తూ అంతకన్నా పదింతలు నవ్వు తెప్పిస్తున్నాడు,అందుకన్నమాట "ఆహ్హహ్హహ్హా!ఓహ్హొహ్హొహ్హో!!"లు:-)

     బ్రాహ్మణుల్ని చలంలా సంస్కరించడం కోసం తిట్టటం తప్పు,హెచ్చార్కె లాంటివాళ్లకి బ్రాహ్మల మీద ఉన్న కసితీరేలా మాత్రమే తిట్టాలి,అంతే!చలం అన్యాపదేశంగా ప్రస్తావించిన బ్రాహ్మణులలోనూ మంచివాళ్ళున్నారని  పొరపాటున కూడా ఒప్పుకోకూడదు,అది బ్రాహ్మణుల పట్ల రగిలిపోతూ ఉండాల్సిన ద్వేషాగ్ని చల్లారుస్తుంది.ఇదీ హెచ్చార్కె గారి ఈ వ్యాస పరంపరలో పరుచుకుని ఉన్న మోకాలిలోని మెదడుతో ఆలోచించేవాళ్ళు మాత్రమే చెయ్యగలిగిన విశ్లేషణల లోని కొన్ని అర్ధవంతమయిన విషయాలు!!"రామాయణం కథలంటే ఖోపం. అన్నీ తప్పుడు ధర్మాలని. వీరత్వం కోసం కొట్టుకు చావడాలని." అనీ "ఐ రిపీట్ సర్, రామాయణ ధర్మమధర్మమే" అనీ సారంగలో కామెంట్లుగానూ "భారతం అంటే నాకు చాల అభిమానం.ప్రపంచంలో అంత గొప్ప ఎపిక్ స్టోరీ లేదని అనుకుంటాను.అందులో అడుగడుగున వచ్చే గోబ్రాహ్మణ పూజ అంటే పరమ అయిస్టం" అని చివరి వ్యాసంలోనూ అంటున్నాడు - అంటే ఇంకా డైలెమ్మా నుంచి బైటపడలేదు కాబోలు - పాపం పాపం!!నేను సారంగలో ఈ కధలో రామయ్యనాయుడు చేసినదానికీ అడాల్ఫ్ హిట్లర్ చేసినదానికీ చెప్పిన పోలికలు అర్ధమయితే చలం బ్రాహ్మణీకం నవలలో ఏమి చెప్పదల్చుకున్నాడో చాలా తేలిగ్గా అర్ధమవుతుంది.చివరిలో కలవరింతలాగ మహిషాసుర మర్దిని గుర్తు చేస్తూ కలగాపులగంగా చేసిన వర్ణన చలం యొక్క మామూలు రచనాశైలియే - ప్రత్యేకంగా సుందరమ్మకి మహత్యాలూ ంటగట్టానికి వ్హేసిన ట్రిక్కు కాదు.చలం రచనాశైలి ఇక్కడే కాదు "బుజ్జిగాడు" అని రమణాశ్రమం నుంచి అనుకుంటాను,ఒక పిచ్చుకని గురించి దైరీలా రాసే చోట కూడా చిన్నప్పుడు మనం రేడియోలో విన్న క్రికెట్ కామెంటరీలా యమా ఫాస్టుగా ఉంటుంది.రాసి,కొట్టేసి,తుడిచి,మళ్ళీ రాసినట్టు ముతక పద్ధతిలో కాకుండా కళ్ళముందు దృశ్యాల్ని చూస్తూ చూసిన దాన్ని చూసినట్టు బోమ్మ కట్టించడం చలానికి చాతనయినట్టు తెలుగుభాషలోనే కాదు ప్రపంచంలోని యే భాషారచయితకీ కుదిరిచావలేదు - ఎందుకనో!అది శ్రీశ్రీ చెప్పిన "అనుభవించి పలవరించడం",బ్రాహ్మలు మంచివాళ్లయ్యేందుకు తిట్టడం కూడా సహించలేని హెచ్చార్కె లాంటి మోకాలిలోని మెదడుతో మాత్రమే ఆలోచించేవాళ్లకి ఎప్పటికీ అర్ధం కాదు.

     ఈయన నిజంగా రామాయణ భారతాలు సొంతంగా చదివాడా?కనీసం చాలా తేలిక భాషలో రాసిన ఉషశ్రీ అనువాదమయినా చదివాడా!నాకయితే చదవలేదనే అనిపిస్తుంది.చదవటం, చదవకపోవటం, చదివినా అర్ధం కాకపోవటం, చదవకుండానే తిట్టిపొయ్యాలనే దురద పుట్టటం లాంటివాట్ని అటుంచితే నాక్కూడా అర్ధం కానిది - గోబ్రాహణ పూజ అసయ్యం అంటూనే కిరస్తానం ఐలయ్య దగ్గిర్నుంచీ గజస్నానం మురమ్నా వరకూ అది బ్రాహ్మణకులాధిపత్యాన్నీ గోబ్రాహ్మణ పూజనీ ఉగ్గడించటం కోసమే వ్యాసుడు కుట్రపూరితంగా రాశాడని బల్లగుద్దిచెప్తున్న  బారతాన్ని ఎట్లా ఇస్టపడుతున్నాడు?ఈ దైలెమ్మాని ఆయన ఎంత తొందరగా వొదుల్చుకుంటే అంత మంచిది!ఈ స్టేటుమెంటు మీకు అర్ధం కావాలంటే నా పోష్టు మొదట్లో ఇచ్చిన స్టేటుమెంటు తప్పనిసరిగా అర్ధం చేసుకోగలగాలి - స్వభావరీత్యా ఈ రెండూనూ మోకాలిలోని మెదడుతో ఆలోచించగలిగిన వాళ్ళు మాత్రమే విరజిమ్మగలిగిన మెచ్చుతునకలు!

     హెచ్చార్కె గారిని నేను మోకాలిలోని మెదడుతో మాత్రమే ఆలోచించగలిగిన వాళ్ళల్లో చేర్చటాన్ని నకారాత్మక వ్యంగ్యవైభవం కింద తీసుకుని తనని అవమానిస్తున్నానని కించపడవలసిన పనిలేదు.భారతజాతికే తలమానికమైన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి కాపు జాతికే హంవీర చూడామణి ముద్రగడ పద్మనాభం వరకు ఎంతోమంది లబ్ధప్రతిష్ఠులు ఉన్నారు!దళిత మేధావి కంచె ఐలయ్య గారు,మార్క్సిస్టు మేధావి మురమ్నా లాంటి ఎందరో మొక్కవోని పట్టుదలతో కుడియెడమల డాల్కత్తులు మెరయగ వీరంగాలు వేస్తూ ఎంతో పాప్యులారిటీ తెచ్చుకుంటున్నారు.తలలోని మెదడుతో ఆలోచిస్తే పాప్యులారిటీ రాదు.పాప్యులారిటీ తెచ్చుకోవాలంటే మోకాలిలోని మెదడుతొనే ఆలోచించాలి.కాకపోతే అసహనాన్ని తట్టుకోగలగాలి,ప్రశాంతత ఉండదు,నిరంతరం ద్వేషాగ్నిని ప్రజ్వలింపజేస్తూ ఉండాలి - అయితే ఇప్పటికే వాటికి అలవాటుపడిపోయారు గాబట్టి కొత్తగా పడాల్సిన కష్టం ఏమీ లేదు 

     కుక్క తోకని కదిలిస్తుంది అనే బ్రాహ్మణుల కుట్రని ఎదుర్కోవడానికి క్నాదు, తోక కుక్కని కదిలిస్తుంది అని వాదించగలిగినవాళ్ళు కొందరయినా ఉండాల్సిందే!మొత్తానికి ఈ పోష్టుకి ఫలశృతి ఏంటయ్యా అంటే "కత్తి గొప్పదా?కలం గొప్పదా?","విత్తు ముందా?చెట్టు ముందా?","గుడ్డు ముందా?పిల్ల ముందా?" లాంటి తింగరి డిస్కషన్ల లిస్టులోకి మరో కొత్త టాపిక్ వచ్చి పడింది.


కుక్క తోకని కదిలిస్తుందా?తోక కుకని కదిలిస్తుందా?హ్హిహ్హిహ్హీ!!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...