అధికారం వచ్చి ఒకలాగా పోయి ఒకలాగా కొందరు మనుషుల్ని చెడగొడుతుందేమో!ఇదివరకు అవునన్న దాన్ని కాదనడమూ కాదన్నదాన్ని అవుననడమూ అవసరమై పోతుంది కాబోలు?
ఈరోజు వీళ్ళ రాజకీయ అవసరాలు తెలియకనో యేమో ఆనాడు వుద్యమంలో పాల్గొన్న యే ఒక్క వ్యక్తీ ఒక్క మంచిమాట నిజాము గురించి చెప్పకపోవటం చేత ఇప్పటి మేధావులు కొందరు పడుతున్న ఇబ్బందిని చూస్తుంటే జాలిగా వుంది!రావి నారాయణ రెడ్ది గారిలాంటి వాళ్లవి వ్యక్తిగత అభిప్రాయాలట! అందుకని వీళ్ళు ఇప్పుడు లండన్ వరకూ వెళ్ళి ఆర్కైవ్స్ నన్నీ తవ్వి తీసి అధారాలతో సహా నిజాము మంచివాడని నిరూపించడానికి పరిశోధనలు చేస్తారట!!
అప్పుడు తాము చూసి విసుగు పుట్టి పోరాటం చేసిన విషయాలన్నిటినీ నిజాయితీగా గ్రంధస్తం చేసిన జ్ఞాపకాలు చెప్పని కొత్త సంగతుల్ని పనిగట్టుకుని వెతకట మంటే తమ ముందు తరాల పెద్దల నిజాయితీని శంకిస్తున్నట్టు కాదా? అసలే సంక్లిష్తమయిన తెలంగాణా చరిత్రని మరింత సంక్లిష్టం చెయ్యడం అవసరమా? అన్ని కాలాల్నీ వెతికినా గర్వంగా స్మరించుకోవడానికి మొత్తం తెలంగాణా చరిత్రలో ధర్మప్రభువులే కరువైనారా?
ఇటు చూస్తే తెలంగాణా సమాజం మొత్తం కోటి ఆశలతో కొత్త ప్రభుత్వం తమ జీవన స్థాయిని మెరుగు పరుస్తుందనే ఆశతో కేవలం ఒక సర్వే కోసం దేశం నలుమూలల నుంచీ పరుగులు తీస్తూ వచ్చి ప్రభుత్వానికి తమ వైపు నుంచి ప్రతిస్పందనని అద్భుతంగా చూపిస్తే దాన్ని వుపయోగించుకుని ప్రజలకి నిజమైన సౌభాగ్యాల్ని సమకూర్చడానికి కాకుండా ఇలాంటి దొమ్మీ తగాదాల్తో కాలాన్ని వ్యర్ధం చేస్తున్నారే?!
నేను మొదట్లోనే చెప్పాను - తెలంగాణాకి ముందరున్న సమస్యలకి తోడు వుద్యమ నేత కలిపిన కొత్త సమస్యలు చాలా వున్నాయని!ఇప్పుడు అవి చాలవన్నట్టు ఆ సమస్యల్ని పరిష్కరించాల్సిన తనకి తనే కొత్త సమస్యల్ని సృష్టించుకుంటున్నాడు? బంగారు తెలంగాణా పునర్నిర్మాణం సంగతి దేవుడెరుగు అసలు ప్రశాంతతే కరువైపోయి తను తెచ్చింది కంగారు తెలంగాణా అనిపించే విధంగా నక్సలైట్లు తమ తొలి అడుగు వేశారు! టీవీ చానళ్ళ లాగా యేమ్మెస్వోలతో నొక్కేస్తే నోళ్ళు బందు చేసుకునే కుందేళ్ళు కాదు వీళ్ళు, యెంత బలంతో నొక్కితే అంతకు పదింతల బలంతో లేస్తారు!
వుద్యమ కాలంలో రెచ్చిపోయి నోటికేదొస్తే అది మాట్లాడేశాడు, ఇప్పుడు తను మాట్లాడిన మాటల్నే ప్రశ్నలుగా సంధిస్తున్నారు! వాటికేమి జవాబు చెప్తాడు? అవి తన మాటలే గాబట్టి అవునన్నా కాదన్నా తంటాయే!నేనలా అన్లేదని తిప్పెయ్యటానికి ఇదివరకట్లా కుదరదే, అన్నవాడు తను మర్చిపోయినా విన్నవాళ్ళు అక్షరం పొల్లుపోకుండా అప్పజెప్తున్నారు.
యెదటి వాళ్లని నో ఆప్షన్స్ అని గద్దించిన దొరగారికి ఇప్పుడు రెండే రెండు ఆప్షన్లు వున్నాయి.నాదీ మావోఇష్టుల పంధాయే అని డాంబికాలు పోయినందుకు కిక్కురు మనకుండా వాళ్లకి నచ్చేలా పరిపాలించటం. వాళ్ళు కూడా దాంతో సరిపెట్టుకునే రకాలు కాదు గాబట్టి అది జరిగే పని కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీదా చట్టబధ్ధ పరిపాలన మీద వాళ్ళకి సుతరామూ నమ్మకం లేదు, సాయుధ పోరాటంతో అధికారాన్ని చేజిక్కించుకోవటమే మా లక్ష్యమని కుండబద్దలు కొట్టి చెప్తున్నారు.యెన్నికల్లో పోటీ చేస్తున్న రాఘవులూ నారాయణల్నే వాళ్ళు రివిజనిష్టులని వెటకారం చేస్తున్నారు. వాళ్ల కనుకూలంగా పరిపాలించడం అంటే అధికారం వాళ్ల కప్పగించేసి తను వాగినట్టే పౌరహక్కుల సంఘానికి నాయకుడిగా సర్దుకుపోవటం అన్నమాట! ఇక రెండోది యే మాత్రమూ సిగ్గు పదకుండా నక్సలైట్లని క్రూరంగా అణిచి వెయ్యటం?!మారిన ఇప్పటి పరిస్తితుల్లో అదీ అంత వీజీ కాదు!యేకఖండంగా వున్నప్పుదు మూడు ప్రాంతాల్నుంచీ పోలీసు బలగాల్ని సమీకరించినా సాధ్యపడనిది ఇప్పుడున్న తక్కువ బలగంతో యెలా సాధ్య పడుతుంది?
చిలక్కి చెప్పినట్టు చెప్పారు,విన్నాడా?మీరు మమ్మల్ని అగుమానిస్తున్నారు, తెలంగాణాలో పుట్టే ప్రతి పిల్లగాడూ తుపాకీ భుజానేసుకుని పుడ్తాడా అని గొప్పలు పోయాడు.మిగతా మేధావులు కూడా అప్పటి హైదరాబాదు ప్రభుత్వమూ ఆంధ్రా ప్రభుత్వమూ యెందుకు కలిసాయో తెలీని అమాయకులా మమ్మల్ని బలవంతంగా కలిపారు అని ఇవ్వాళ అంటున్నారు?నక్సలైట్లు మరియూ కమ్యునిష్తుల ప్రాబల్యాన్ని తగ్గించడానికే - పైకి అలాంటి కారణాలు చెప్పడం సభ్యతగా వుండదు కాబట్టి - భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే నినాదాన్ని వుపయోగించుకుని వాళ్ళ తంటాలు వాళ్ళు పడ్డారు!ఇవ్వాళ ముందుకు వెళ్ళాల్సిన చరిత్రని యాభయ్యేళ్ళు వెనక్కి నడిపించి రాష్ట్రాన్ని మళ్ళీ నక్సలైట్ల సాయుధ పోరాట సిధ్ధాంత ప్రయోగశాలగా మార్చటం జరిగింది!నక్సలైట్లని అణిచెయ్యటం గానీ వొదిలెయ్యటం గానీ యేదీ కూడా తెలంగాణాని ప్రశాంతంగా వుంచదు.ఒక్క తెలంగాణాతో ఆగదు.దండకారణ్యం మూడు రాష్ట్రాలకు మధ్యన విస్తరించి వుంది.ఇక్కడ కొడితే అక్కడికీ అక్కడ కొడితే ఇక్కడికీ కదులుతూ వస్తున్నారు.ఇప్పుడు నాలుగు రాష్ట్రాలు ప్రమాదంలో పడినాయి. వీళ్లలో ఒక మావోఇష్టు సభ్యుడు గుంటూరు దగ్గిర పట్టుబడ్డాడు. అసలు మొదట్లో బలహీన పడిపోయి ఆయనగారు కన్నీటి పర్యంతం అయిన దుస్థితిని కూడా చూసి మళ్ళీ పైకి లేచిందంటే వాళ్ళ వ్యూహాత్మక చేరిక వల్లనే కదా! వుద్యమ కాలంలో వాళ్ళంతా హోరెత్తించిన పాటలూ, ఆంధ్ర అనే మాట పక్కన చేర్చిన "దోపిడీదారులు","అధిపత్యవర్గాలు","వలసవాదులు","పెట్టుబడిదారులు" అనే పదజాలమంతా యెవరిది? అంత వ్యూహాత్మకంగా వుద్యమాన్ని నడిపించిన వాళ్ళు తమ లక్ష్యం నెరవేరిన తర్వాత వెనుకంజ వేస్తారనుకోవటం మూర్ఖత్వం?!
మొన్నటి రోజున వుద్యమానికి యెంతో బలమిచ్చి నిన్నటి రోజున చెప్పులు విసిరి తిరస్కారం చూపించిన వుస్మానియా కుర్రాళ్ళు కూడా రంగం లోకి దిగారు!ఈ దేశపు రాజకీయ వుద్యమాల చరిత్రలో కుర్రాళ్లని ఆపగలిగిన ప్రభుత్వం యేదయినా వుందా?అణిచివేతలో వీళ్ళు అమరులైతే ఆ 1200మందికీ అదనంగా చేరుస్తారా, కొత్త ఖాతా యేదయినా తెరుస్తారా?
మొన్నటి రోజున వుద్యమానికి యెంతో బలమిచ్చి నిన్నటి రోజున చెప్పులు విసిరి తిరస్కారం చూపించిన వుస్మానియా కుర్రాళ్ళు కూడా రంగం లోకి దిగారు!ఈ దేశపు రాజకీయ వుద్యమాల చరిత్రలో కుర్రాళ్లని ఆపగలిగిన ప్రభుత్వం యేదయినా వుందా?అణిచివేతలో వీళ్ళు అమరులైతే ఆ 1200మందికీ అదనంగా చేరుస్తారా, కొత్త ఖాతా యేదయినా తెరుస్తారా?
ఇంతకు మించి యేమయినా మాట్లాడితే నువ్వు పొరుగు రాష్త్రం వాడివి మా సంగతి మీ కెందుకోయ్ అంటారేమో, కానీ ఇవ్వాళ ఇది కేవలం తేలంగాణా వాళ్ళ సమస్య మాత్రమే కాదు దేశాన్నంతట్నీ కుదిపేస్తుంది! బాబు 2019లో తెలంగాణాలో గెలవడం గురించిన భ్రమల్ని వొదిలించుకుని రాజధాని పనులు ముమ్మరం చేసి వీలయినంత తొందరగా పరిపాలన మొత్తాన్నీ ఆంధ్రా నుంచి సాగించే విధంగా అక్కణ్ణించి బయటపడకపోతే ఆ కుమ్ములాటల్లో తనూ దారి తప్పిపోయి మన రాష్ట్రం అన్యాయమైపోతుందని నా బెంగ!
అంతం కాదిది ఆరంభం
హరిబాబు గారూ, మావోవాదీల బలం ఎంతో తెలుసుకోకుండానే ఊహాగానాలు ఎందుకు? ఆలూ లేదు చూలూ లేదు అన్నట్టుంది మీ జోస్యం.
ReplyDeleteఅలా కాదు, రేపటికి రేపే తెలంగాణా మటాష్ కాబోతుంది, ఆంధ్రులందరూ ఈ శుభఘడియ కోసం లొట్టలు వేసుకుంటూ ఎదురు చూస్తామంటే నేనేమీ అనను.
సమస్య పరిష్కారం అయితే మంచిదే!తెలంగాణా మటాష్ అయిపోవాలని కొరుకోవదం లేదు ప్రశాంతంగా వుండాలనే అనుకుంతున్నాను.కానీ సమస్య మూలం చాలా బలమైనది కాబట్టి కంగారు పడుతున్నాను,అంతే.వాళ్ళ మొండితనం కూదా సామాన్యమయినది కాదు గదా!
ReplyDeleteనక్సలైటు సమస్య ఆంధ్రతో సహా దేశంలో ఎన్నో చోట్ల ఉంది. ఈ బూచి చూపించి తెలంగాణాను ఆపుదామనే నిష్ఫల ప్రయత్నం ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు అదే పాచి పళ్ళ వాదన తెలంగాణాను శాపనార్తాలు పెట్టడానికి వాడుతున్నారు.
Deleteశాపనార్ధాలు పెడుతున్నది మేము కాదు మీ కుర్రాళ్ళే!మేము చాలా హాయిగా ధీమాగా వున్నాము ఇవ్వాళ! మిమ్మల్ని శాపనార్ధాలు పెట్టదం కాదు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాము, తెలుసా?
Deleteఅక్కద నిలదీసే వాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్పదం గురించి ఆలోచించంది ముందు!?
ఉస్మానియాలో (కొందరు) విద్యార్తులు నిలదీస్తున్నది (లేదా శాపాలు పెడుతున్నది) ఒక పార్టీ లేదా వ్యక్తిని. ఎవరిని అంటే వాళ్ళే జవాబు చెప్పాలి నాకెందుకు?
Deleteతెలంగాణా రాష్ట్రం మొత్తాన్ని శాపాలు పెట్టింది & ఇంకా పెడుతున్నది ఎవరో మనిద్దరికీ తెలుసు!
తెలంగాణా రాష్ట్రం మొత్తాన్ని శాపాలు పెట్టింది & ఇంకా పెడుతున్నది ఎవరో - నాకు మాత్రం తెలీదు!అలా శాపాలు పెడుతున్న దెవరో, నాకు దానిమీద శ్రధ్ధ కూడా లేదు?!అలా శాపాలు పెట్టాలనే దురద నాకయితే యెప్పుడూ లేదు.మొదటి నుంచీ అంతగా విడిపోవాలనుకునే వాళ్లని బలవంతంగా కలిపి వుంచటం అనవసరమనీ అలా వుంచటం సాధ్యపడేది కూడా కాదనే అభిప్రాయం లోనే వున్నాను.
Deleteజై గారు, పైన మీరన్న కామెంటులో ఒక వాక్యం
Delete"ఉస్మానియాలో (కొందరు) విద్యార్తులు నిలదీస్తున్నది (లేదా శాపాలు పెడుతున్నది) ఒక పార్టీ లేదా వ్యక్తిని. ఎవరిని అంటే వాళ్ళే జవాబు చెప్పాలి నాకెందుకు?"
ఇక్కడ టార్గెట్ చేస్తూ మాట్లాడింది ఒక పార్టి లేదా వ్యక్తిని(కేస్యార్).. అటువంటప్పుడు మేము ఎవరిని అంటే వాళ్ళే జవాబు చెప్పాలి కానీ, మీరు కాదు కదా....
మీకు, మాకు తేడా ఏమిటంటే మేము విధానాల పరంగా విమర్శించేది కేస్యార్ ని, తెలంగాణాని కాదు. కానీ మీరు విమర్శించేది మాత్రం మొత్తం ఆంధ్రప్రజలని... విడిపోయినందు వలన మేము మొదట్లో కొద్దిగా బాధపడ్డాము(కలిసుండాలనే సెంటిమెంటు ఎక్కువయి) కానీ ఇప్పుడు మాత్రం చాలా హాయిగా, ధీమగా ఉన్నాము.(కలిసుండడం దండగమారి అని అర్ద్రమయి).
'అరి' కాలం' వచ్చేసింది అంటారా !!
ReplyDeleteజిలేబి
అబ్బ! యెంత కాలానికి జిలేబీ కి నా పోష్టు నచ్చేసింది!!నా పోష్టు దగ్గిర ఆ ముచ్చటయిన ముఖారవిందం యెంత బాగుందో!!వాళ్ళకి తెలియదం లేదు గానీ యెప్పుడో వచ్చేసిందని నా భయం?!వాళ్ళనుకుంటున్నట్టు చంక లెగరెయ్యదం లేదు, గందరగోళంగా అనిపిస్తున్నాది.మనం చెయ్యగలిగింది యేమీ లేదు!
Delete