సోనియా గాంధీ అనే పేరుతో వ్యవహరించబడుతున్న ఆంటోనియో మైనో అనే రాజమాతని కానీ, కాలం కలిసొచ్చి యూపీయే-3 కల నిజమయితే ప్రధాన మంత్రి అయ్యే రాహుల్ గాంధీ గా పిలవబడుతూన్న యువరాజు రావుల్ విన్సీ ని కానీ, మరే కాంగ్రెసు వాది నయినా సరే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ అనే వ్యక్తి గురించి ఒక ఐదు నిముషాల పాటు వినేవాళ్లకి బోరు కొట్టకుండా ప్రసంగించమని చాలెంజి విసిరితే ఫలితం యెలా ఉంటుంది? "మోహన్ దాసా, ఆడెవడు?" అని గద్దించి అడిగినా ఆశ్చర్య పోనక్కర్లేదు!
100+ వయసు గల కాంగ్రెసు పార్టీ లోపలి పరిస్థితి అలా ఉంటే ఈ దేశ ప్రజల మనస్థత్వం యెలా ఉందో తెలుసా? కాంగ్రెసు యెన్ని కుంభకోణాలలో కూరుకుపోయినా, యెంత దరిద్రంగా పరిపాలించినా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనని యెంత చెయ్యగూడని విధంగా చేసినా యెన్నికల్లో కాంగ్రెసుకి ఆంధ్రా లోనే కాకుండా మొత్తం దేశమంతటా అన్ని వోట్లు యెలా పడినయ్యో, ఇకముందు కూడా యెందుకు పడుతూనే ఉంటాయో తెలుసా? ఈ దేశ ప్రజలు కాంగ్రెసుని మహాత్ముడు అని భావిస్తూ ఉన్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీతో అనుసంధానించుకుని అతని మీద ఉన్న అభిమానాన్నే ఆ పార్టీ మీదకి ప్రసరింపజేస్తున్నారు! ఒక సారి కాంగ్రెసుకు వోటు వెయ్యడానికి నిశ్చయించుకుంటే ఆ వ్యక్తి యెదటివాళ్ళు ఆ పార్టీ మీద యెన్ని ఆరోపణలు చేసినా అవి నిజమే అని తేలినా కాంగ్రెసుకే వోటు వేస్తాడు. అతనికి తన కళ్ల ముందున్న అవినీతి పరులూ, అసమర్ధులూ కనపడరు, కేవలం మహాత్మా గాంధీకి సంబంధించిన పార్టీకి మాత్రమే తను వోటు వేస్తున్నా ననుకుంటాడు. అలాంటి సాంప్రదాయికమయిన వోటర్లు ఉన్నంత కాలం కాంగ్రెసు ఈ దేశపు రాజకీయ చిత్రపటం మీద తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది.
1885లో స్థాపించబడినప్పటికీ కాంగ్రెసు అనే ఒక సంస్థ ఉన్నదనీ అది అప్పుడున్న ఆంగ్లేయుల పరిపాలనని అంతమొందించి దేశ స్వాతంత్ర్య సముపార్జన కోసం ప్రయత్నిస్తున్నదనీ సామాన్యులతో సహా అందరికీ కాంగ్రెసులోకి ఇతని ప్రవేశం జరిగిన 1920 నించే తెలిసింది. సరిగ్గా ఇతని రంగ ప్రవేశం జరిగే నాటికి నేను మొదటి భాగంలో చెప్పినట్టు ఒక రాజకీయ ప్రళయ త్రికోణం యేర్పడి ఉంది కదా!ఇతనికి ఆనాటి కాలమూ చరిత్రా నిర్దేశించిన కర్తవ్యం ఆ త్రికోణానికి మధ్యన ఉండి యే మూలనీ అతిగా సాగనీయకుండా కలిపి ఉంచటం.
కొల్లాయి గట్టటం లాంటివాటితో ఈరోజు నిరాదంబరంగా వుండటానికి గుర్తుగా వున్నాడు గానీ భారత రాజకీయ రంగంలోకి ఇతని ప్రవేశం మాత్రం ఒక యుధ్ధాన్ని గెలిచి రాజధానికి చేరుకునే రాజాధిరాజుకు తన రాజ్యంలోని ప్రజలు ఇచ్చే ఆహ్వానం తో పోల్చదగినంత వైభవోపేతంగా జరిగింది. దానికి కారణం ఇక్కడ మనల్ని ఆక్రమించుకున్న ఇంగ్లీషు వాళ్ళే యేలుతున్న దక్షిణాఫ్రికాలో ఒక సరికొత్త రకపు తిరుగుబాటుకు తెరతీసి సంచలనాన్ని రేకెత్తించటం.
ఇతను 1869లో అక్టోబర్ 2న పోర్బందర్ జిల్లా లోని సుదామపురి అనే నగరంలో పొర్బందర్ సంస్థానంలో దివానుగా పనిచేస్తున్న కరం చంద్ గాంధి కి నాలుగో భార్య అయిన పుత్లీబాయ్ ద్వారా పుట్టాడు. మోహన్ దాస్ తన తండ్రి యొక్క సంతాన మందర్లోనూ చిన్నవాడు. ఇద్దరు అన్నలూ ఒక అక్క. ఇతనికి 13 యేళ్ళ వయసులో 14 యేళ్ళ కస్తుర్బాయ్ మఖంజి తో అప్పటి సాంప్రదాయాల కనుగుణంగా వివాహం జరిగింది.
ఆ కాలం గురించి మనకి రెండు భ్రమ లున్నాయి, దేశ మంతా బ్రిటిషు వాళ్ళ పూర్తి అధికారం లోకి వెళ్లిందనీ, వాళ్ళు మన నెత్తి మీద తుపాకీ పెట్టి పరిపాలించారని! రెండూ అబధ్ధాలే! సామాన్య ప్రజలకి అసలు ఇంగ్లీషు వాళ్ళు కనబడిందే చాలా తక్కువ. అందరికీ చిన్నప్పటి హిస్టరీ పాఠాల్లో పరిచయమయిన సైన్య సహకార మైత్రి లాంటి వొప్పందాలతో పై స్థాయిలో వుండే అప్పటి రాజుల్నీ జమీందార్లనీ బానిసల్ని చేసుకుని వాళ్ళ ద్వారా తమకు కావల్సిన వాట్ని సాధించుకున్నారు! అప్పుడప్పుడూ తెల్లని రంగుతో కనిపించే కుంఫినీ దొరల్ని కళ్ళింతలు జేసుకుని చూడ్డం, కారు లాంటి వాట్ని చూసి ఇది ఆ తెల్ల వాళ్ళు తెచ్చిందని తెలిసినప్పుడు "ఔరా తెల్లోడి బిస" అని అనుకోవటం తప్ప సామాన్య జనానికి తమ కష్టాలకి కారణం ఇంగ్లీషు వాళ్లని అస్సలు తెలియదు.
ఈ పై స్థాయిలో వుండి ఇంగ్లీషు వాళ్ళకి స్నేహ పాత్రులుగా వుంటూ యెవరయితే ఇంగ్లీషు వాళ్ళు రాక ముందు నుంచీ సామాన్యుల్ని పీల్చి పిప్పి చేస్తూ వున్నారో వాళ్ళు కాంగ్రెసునీ స్వాతంత్రోద్యమాన్నీ 1945 వరకూ వ్యతిరేకిస్తూనే గడిపి చివరి దశలో జస్టిస్ పార్టీ లాంటి హడావిడిని కూడా చేసి ఆఖరి రోజుల్లో ఇంక స్వాతంత్ర్యం రావడం ఖాయమని తెలియగానే కాంగ్రెసు లోకి దూకేసి అప్పటి దాకా లెక్క లేనన్ని త్యాగాలు చేసిన పింగళి వెంకయ్య, గరిమెళ్ళ సత్యనారాయణ లాంటి వాళ్లని వెనక్కి నెట్టేసి ప్రజల ఆమోదంతో ప్రభుత్వాధినేతలుగా అవతరించారు! గాంధీ ఈ జగన్నాటక మంతా ఇలాగే జరిగేందుకు సూత్రధారిగా నిలబడి యెక్కడా ప్రాచీన భారత దేశపు సామాజిక చిహ్నాలయిన కులాలూ మతాలూ వాటికున్న రాజకీయ ప్రాధాన్యతలూ యే మాత్రమూ కదల బారకుండా అన్యాయా లన్నింటినీ తెల్లోడి ఖాతాలో వేసేసి అప్పటి దాకా ఇంగ్లీషు వాళ్లతో కలిసి జనాన్ని చెండుకు తిన్న పాత కాలం రాజుల్నీ జమీందార్లనీ ఆదర్శవంతులయిన కొత్త రకం ప్రభువులుగా అవతరింప జేశాడు!
ఇతనికి ఆపాదించిన "ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందించకుండా సాధించిన ఘనకార్యం" చాటున ఇతను సాధించిన నిజమయిన ఘనకార్యం యేమిటో అర్ధం చేసుకుంటే ఇతను మాట్లాడిన శాంతి, సత్యము, అహింస, ధర్మకర్తృత్వం అనేవి పరమ జుగుప్సాకరమయిన బూతుమాటల కన్నా వెగటు పుట్టిస్తాయి.
నేను మొదటిసారి ఈ ఒక్క నెత్తురు బొట్టుకూడా చిందించకుండా అనే మాటను వినేటప్పటికే లాఠీ దెబ్బలకి లాలా సాబ్ అమరుడు కాగా దానికి ప్రతీకారంగా భగత్ సింగ్ బృందం సాందర్స్ ని చంపాలని అనుకోవడం, అందులో ఫెయిల్ అయినా అదే స్పూర్తితో హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ ని స్థాపించి వాళ్ళు చేసిన అజరామరమైన పోరాట గాధ నంతా చదివి వుండటంతో ఆశ్చర్య మనిపించింది? అదేంటి? యెంతో మంది త్యాగధనుల రక్తం యేరులై ప్రవహించినా ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందించకుండా సాధించాడు అంటారేమిటి - అని! గాంధీని అలా పొగిడేవాళ్ల లోనూ అసలు గాంధీ మనస్సులోనూ వున్న నిజమైన లక్ష్యం ఇంగ్లీషు వాళ్ల శరీరం నుంచి గానీ వాళ్లతో నాలుగింట మూడు వంతులుగా కలిసి అధికారంలో వున్న రాజవంశీయుల శరీరం నుంచి గానీ ఒక్క నెత్తురు బొట్టును కూదా చిందనివ్వకుండా - అనేది అర్ధమవటానికి నాకు చాలా కాలం పట్టింది!
గాంధీ ఈ దేశంలో అడుగు పెట్టే నాటికి భారత దేశపు రాజకీయ సామాజిక ఆర్ధిక చిత్రపట మంతా పరమ భీభత్సమయిన గందరగోళంలో వుంది. సామాజికంగా చదువుకున్న వాళ్ళంతా లండన్ వెళ్ళి లాయర్లుగా తిరిగొచ్చి ఇక్కడీ జమిందార్లకీ ఇంగ్లీషు వాళ్ళకీ సాయపడుతూ ప్రాక్టీసు పెంచుకుంటూ గడుపుతున్నారు. ఆ ఇంగ్లీషు వాళ్ళ ఆదర్శాలతోనే ప్రభావితమయి వారి ఆధిక్యత పట్ల తీవ్రమయిన వ్యతిరేకత లేని ఇప్పటి మాదిరి మామూలు కెరీరిష్టు జర్నలిష్టులే పత్రికా రంగంలో మేధావులుగా చలామణీ అవుతూ హల్చల్ చేస్తున్నారు. రాజకీయంగా నేను మొదటి భాగంలో చెప్పిన ప్రళయ త్రికోణం మరింత స్పష్టమైన రూపం ధరించింది. ఆర్ధికంగా మధ్య యుగాల నాటి నిలవనీరు లాంటి వ్యవసాయాధారితమయిన పాత అమరిక మీద ఇంగ్లీషు వాళ్ల పారిశ్రామిక విప్లవపు కొత్త అమరిక కూడా కలిసి ప్రజల్ని మరింత భయానక స్థితి లోకి నెట్టేసింది.ఈ కొత్త రకం ఆర్ధిక చట్రం యొక్క ఫలితమే ప్రపంచంలోనే అత్యంత దయనీయమయిన కరువుల్లో వొకటయిన బెంగాల్ కరువు.
దేశ మంతటా తిరిగి ఈ వాతావరణాన్నంతా చూసిన గాంధీ దక్షిణాఫ్రికా మోడల్ ఇక్కడ పని చెయ్యదని తెలుసుకున్నాడు! జ్ఞానవృధ్ధుడయిన యువకిశోరం భగత్ సింగ్ లాగా అట్టడుగున వున్న సామాన్య ప్రజలకు మేలు కలిగించే సామ్యవాద స్పూర్తితో ప్రజల్ని చైతన్య వంతుల్ని చేసి తమ భావిని తామే తీర్చిదిద్దుకునే లాగా ప్రజల్ని నడిపించటం ఈ జ్ఞానఢింభకు డైన చీకుగద్ద లక్ష్యం కానే కాదు! అలాంటి లక్ష్యం పట్ల ఇతనికి ద్వేషం కూడా వుంది. అప్పటికే ప్రపంచం లోని అనేక దేశాల్లో పెల్లుబుకుతున్న ప్రజాస్వామిక సంస్కృతిని యెప్పటికయినా ఇక్కడా రాక తప్పదు గాబట్టి ఇక్కడికీ తీసుకురావదం, ఆ చట్రంలో అప్పుడున్న రాజవంశీయుల్ని వాళ్ళ ప్రాభవాలు యేమాత్రమూ తగ్గనివ్వని పధ్ధతిలో అమర్చటం అనేది ఇతను సాధించిన ఘనకార్యం. కుంజరయూధాన్ని దోమ కుత్తుకలో దూర్చటం అనే అనితర సాధ్యమయిన పనిని అంత ప్రతిభావంతంగా చెయ్యడం నిజంగా అద్భుతమే!
దక్షిణాఫ్రికాలో యేనాడూ సామాన్య ప్రజల్ని భాగస్వాములుగా చేసే కార్యక్రమాల్ని రూపొందించని వాడు ఇక్కడ పూర్తిగా సామాన్య ప్రజల్ని ఆకర్షించటం మీదనే దృష్టి పెట్టాడు. అప్పటి దాకా రాజు మంచివాడయితే సంతోషంగా వుంటూ రాజు దుర్మార్గుడయితే తిరుగుబాటు చేసి మరొక రాజును తెచ్చుకుంటూ తమ కష్టాలకు కారణం దేముడి దయ లేకపోవటమే నని సరిపెట్టుకోవటమే తప్ప - ఇప్పటికీ చాలామంది విద్యాధికులకి కూడా అర్ధం కానంత జటిలమయిన విషయాలు అవడం చేత - కరువులు ప్రభువుల దుర్మార్గమయిన ఆర్ధిక విన్యాసాల వల్లనే వస్తాయనీ వాటిని మార్చుకోకుండా ప్రభువుల్ని మారిస్తే ప్రయోజనం వుండదని తెలుసుకోలేని అమాయకుల ముందు మొదటిసారిగా ప్రజలకి మీ కష్టాలకి దేవుడు కారణం కాదు ఇక్కడివాళ్ళే అని చెప్పాలి, అలాగని ప్రజలు వాళ్లకి అలవాటయిన పధ్ధతిలో తిరుగుబాటు చెయ్యకుండా నిగ్రహించాలి. ప్రజలు హింసకి దిగితే తను ప్రభుత్వంలో అమర్చుదామనుకున్న వాళ్లకే ప్రమాదం మరి! అందుకనే చాలా మామూలు సంఘటన అయిన చౌరీ చౌరా ఘటనకి అంత అతిగా రియాక్ట్ అయి పక్కనున్న శుంఠలకి అది అర్ధం కాక వొద్దని మొత్తుకుంటున్నా వుద్యమం ఇంకొద్ది రోజులు గట్టిగా చేస్తే అప్పుడే స్వతంత్రం వొచ్చి వుండేదనిపించేటంత వూపులో వున్నప్పటికీ మొత్తం కార్యక్రమాన్నే ఆపేశాడు!
1920లో కాంగ్రెసు పార్టీ పగ్గాలు చేపట్టినా అతి సుదీర్ఘ కాలాన్ని కింది స్థాయిలో ప్రజలకి అస్పృశ్యత గురించీ మద్యపాన నిషెధం గురించి చెప్పటానికీ పై స్థాయిలో సంధాన కర్త లాగా స్వరాజ్ పార్టీకీ కాంగ్రెసు పార్టీకీ రాజీ చెయ్యటం అనే గర్భాదాన ప్పంతులు పనికీ ఉపయోగించుకున్నాడు. 1930లో వుప్పు సత్యాగ్రహం మొదలు పెట్తేవరకూ అతడు చేసిందంతా ప్రజల్ని తను యేం చెప్తే అది నమ్మే విధంగా ప్రజల్ని సిధ్ధం చెయ్యటమే.
వెనకటి కాలం లోని పిట్ట కధలో కొండని మోస్తానన్న వీరుడి లాగా మీరంతా నేను చెప్పినట్టు వింటే ఒక్క సంవత్సరంలో స్వతంత్రాన్ని తీసుకొస్తా నన్నాడు! మరి చూస్తావేం మొయ్యి అంటే యెవరయినా యెత్తి నా భుజాల మీద పెడితే మోస్తా నన్నాను గానీ నేనే యెత్తుతా ననలేదుగా మీరు యెత్తి నా భుజాల మీద పెడితే మొయ్యదానికి నేను యెప్పుడూ సిధ్ధమే నన్న ఆ పిట్టకధలోని హీరో లాగే మీరు నేను చెప్పినట్టు వినలేదుగా అని తేల్చి పారేశాడు?ఆ పిట్టకధ యెప్పట్నుంచో అందరికీ తెలిసిందే అయినా ఇంతమంది మేధావులూ పోలిక పట్టలేక ఈ కమెడియన్ ని అంత సీరియస్ గా నమ్మేశారంటే తెలివి తక్కువ మాటల్ని కూడా గంభీరంగా మోత మోగించడంలో ఇతని ప్రజ్ఞ నిరుపమానం!
1918లో ఇంగ్లండు మొదటి ప్రపంచ యుధ్ధంలోకి దిగింది. బోయరు యుధ్ధంలో Indian Ambulance Corps తో సరిపెట్టిన ఇతడు ఈసారి బ్రిటిషు వాళ్ల తరపున భారతీయుల్ని యుధ్ధం చేయించడానికి సమరోత్సాహంతో కదిలాడు. "In a June 1918 leaflet entitled "Appeal for Enlistment", Gandhi wrote "To bring about such a state of things we should have the ability to defend ourselves, that is, the ability to bear arms and to use them...If we want to learn the use of arms with the greatest possible despatch, it is our duty to enlist ourselves in the army." He did, however, stipulate in a letter to the Viceroy's private secretary that he "personally will not kill or injure anybody, friend or foe." ఇప్పటిదాకా అంతా అచ్చ తెలుగులో రాసి ఇది మాత్రమే పక్కా ఇంగ్ల్లీషులో యెలా వున్నది అలాగే యెందుకు దించేశానో తెలుసా? యెలా అనువదించాలో అర్ధం కాలేదు, యెన్నో సంక్లిష్టమయిన విషయాల్ని అర్ధం చేసుకోగలిగిన నా మేధస్సు కూడా ఈ గందరగోళపు భావజాలం లోని అస్పష్టత ముందు దారుణంగా ఓడిపోయింది!
ఇతని కిదేం పిచ్చ! తన కన్యాయం చేసారని వాళ్ళ మీద భీభత్సంగా పోరాడుతుంటాడు, అయినా వాళ్ల సొంత కారణాల తో వాళ్ళు వేరే వాళ్లతో యుధ్ధానికి వెళ్తే నేను కూడా సాయం చేస్తానని వురక లెత్తుతాడు? వ్యక్ర్తిగతంగా స్నేహితుణ్ణి గానీ శత్రువును గానీ చంపడటం ఇష్టం లేదట! యుధ్ధాల్లో యెంతమందిని చంపినా అభ్యంతరం లేదట! ఇంగ్లీషు వాళ్ళ శత్రువుల్ని చంపటానికి భారతీయులు సైనికులుగా వెళ్ళాలట! భారతీయులు ఇంగ్లీషు వాళ్లని మాత్రం చంపగూడదట! ఇదేమి అహింసా వాదం?
బోయరు యుధ్ధంలో అపారమయిన ఇంగ్లీషు వాళ్ళ సైన్యాన్న్ని చూసి వీళ్ళ మీదకి ఆయుధాల్తో వెళ్తే మనల్ని చంపేస్తారు అనే చావుభయాన్నీ శత్రువుకి మనల్ని చంపెయ్యాలనేటంత కోపం రాకుండా చూసుకుంటే బతికుండి బలుసాకయినా తిని బతకొచ్చనే బతక నేర్చిన తెలివినీ కలిపేసి తయారు చేసిన తిక్క ఐడియాని కేవలం నైతికంగా వున్నతులు మాత్రమే పాటించగలిగిన బలమయిన ఆయుధం అని కోతలు కొయ్యటం Neighbors Envy Owners Prideని మించిన గొప్ప అడ్వర్టైజింగ్ టెక్నిక్!
గాంధీలో కొన్ని లోపాలు వున్నప్పటికీ మొఠ్ఠ మొదటి సారిగా సామాన్య ప్రజలను రాజకీయంగా చైతన్యవంతులను చేసిఒక్క తాటి మీద నడిపించాడనిన్నీ, భిన్న సంసృతులతో కలగాపులగంగా వున్న ప్రజల్నందర్నీ బిన్నత్వంలో యేకత్వం పరిఢవిల్లే లాగ తీర్చి దిద్దాడనిన్నీ, అందువల్లనే స్వతంత్రం రాగానే మళ్ళీ ముక్కలు ముక్క లయ్యే ప్రమాదం తప్పిపోయి ఒక్కటిగా నిలబడిందనిన్నీ సుభాషితాలు చెప్తారు - మరీ తాము సమర్ధించలేని తప్పుల్ని యెదటి వాళ్ళు యెత్తి చూపిస్తూ ఇరుకున పెడుతున్నప్పుదు మధ్యేమార్గంగా రాజీ కొస్తూ! ఆ మహానుభావుడే లేకుంటే దేశం అల్లకల్లోలమైపోయేదని భయపెట్టేస్తారు. కాని శ్రీవారు కొత్తగా జాతీయ సమగ్రతను సాధించినది తొలుత అనేక సంస్థానములుగా వుండి స్వాతంత్ర్యము తర్వాత తమ ప్రాభవము లేవియునూ చెదరని రీతిన ఒకే లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వము రూపములో నూత్న వేషములు ధరించి అవతరించిన సాంప్రదాయిక భారత మనుజేశ్వరాధములకు మాత్రమే! శ్రీవారి దృష్టిలో సామాన్య ప్రజలు తను చెప్పిన కార్యక్రమములు తు.చ తప్పక పాటించుటకు - చరఖా వడకుటకు, విదేశీవస్త్రాలను తగలబెట్టుటకు,ఇంగ్లీషు వారి తరపున యుధ్ధములలో పాల్గొని చచ్చుటకు మాత్రమే వుండిరి!
మనది వ్యవసాయ ప్రధానమయిన దేశం. ప్రతి వ్యక్తికీ భూమితో అనుబంధం యెక్కువ. భూమితో అనుబంధం వున్న మనిషి యెక్కడున్నా ఒక్కలాగే వుంటాడు. అందరి కష్టాలూ కన్నీళ్ళూ ఒక్కలాగే వుంటాయి. మన ధార్మిక జీవనంలో వున్న తీర్ధయాత్రలూ, పుష్కరాలూ మనుషులు కలుస్తూ వుండేలా చేస్తూనే వున్నాయి. కొన్ని శతాబ్దాలకు ముందు నుంచే ఈ దేశ ప్రజలు వేషభాషలూ ఆచార వ్యవహారాలూ వేరయినా ఆసేతు శీతనగం ఒకే రకమయిన సంస్కారంలోనే వుండి ఐకమత్యంగానే వున్నారు. ఇంతకు ముందే వున్నదాన్ని ఇతను కొత్తగా పరిచయం చేశాడని అనటం గురువుకి శిష్యుడు పాఠాలు నేర్పినట్టు వుంటుంది!
అసలు గాంధీ చెప్పింది సామాన్య ప్రజలకు అర్ధమే కాలేదు! ఈయన గారి పొంతన లేని అసమన్వయ సుత్తిని జనాలకి అర్ధ మయ్యెటట్టు చెప్పలేక పల్లెటూళ్ళలో తిరిగే కాంగ్రెసు కార్యకర్తలు "భారతీయులంతా కలిసి ఒక్కసారిగా వుమ్మేస్తే ఆ ప్రవాహంలో ఇంగ్లీషు వాళ్ళంతా లండన్ దాకా కొట్టుకు పోతారు" అనే జోకుల్తో అలరిస్తూ వుండేవాళ్ళు! అహింసాయుత పోరాతం లాంటి గంభీరమయిన విషయా లన్నీ చదువుకున్న వాళ్లే పత్రికల్లో చూసి తెలుసుకునే వాళ్ళు. ఇతను చెప్పిన గంభీరమయిన విషయాలు సైతం కాంగ్రెసు కార్యకర్తలకే యెక్కలేదు, ఇంక సామాన్య ప్రజలకి అర్ధమయి యెలా అనుసరిస్తారు? అతను చెప్పిందంతా బుర్రలోకి యెక్కి అతని మీద నమ్మకమే వుంటే సుభాష్ చంద్ర బోసు పట్టాభి మీద అంత మెజార్టీతో యెలా గెలుస్తాడు? పైగా అక్కడ గాంధీ మొహం మీద పేలింది కింది నుంచి పైదాకా అంతరువులు అంతరువులుగా ప్రతినిధుల్ని యెన్నుకుంటూ వొచ్చిన అంతర్గత ప్రజాస్వామ్యమనే ఢాంబు! ఆ దెబ్బకి "నా బఠానీ వోడింది, నేనూ వోడినట్టే" అని చెప్పి కూడు మానేసి ముసుగు దన్ని పడుకున్నాడు. ముసలాడు చస్తాడని జాలిపడి కొందరూ, నిజంగానే బోసు గెలుపు నచ్చక కొందరూ మొత్తానికి బోసు గారిని గాంధీ గారి సహాయ నిరాకరణ మనే ఆయుధంతోనే బలవంతంగా రిజైను చేసి వెళ్ళిపోయేలా చేశారు. సాటి దేశభక్తుడి మీద ప్రయోగించినంత తీవ్రంగా ఇంగ్లీషు వాళ్ల మీద ప్రయోగించి వుంటే మనకి స్వతంత్రం ఇంకా చాలా ముందే వొచ్చి వుండేది! సరే, బోసుగారు రిజైన్ చెయ్యగానే తన బఠానీ గెలిచేసినట్టు మమ చెప్పేసుకుని తను కూడా ముసుగు తీసేసి మళ్ళీ రంగం లోకి దిగాడు.
ఈ నిరాహార దీక్ష అనేది ఇవ్వాళ ప్రతివాడూ తనకి జరిగిన అన్యయానికి నిరసన తెల్పడానికి వాడుకుంటూ అది గాంధీ ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రమని అనుకుంటున్నాడు గానీ అతను మాత్రం చరఖా వడక మనటం, విదేశీ వస్త్రాలని తగల బెట్ట మనటం, వుప్పు తయారు చెయ్య మనటం తప్ప ప్రజలకి నిరాహార దీక్ష గురించి పొరపాటున కూడా వుప్పుదేశించ లేదు!? దాన్ని ఇట్లా పార్టీలో తన మాట చెల్లుబడి కానప్పుడు బ్లాక్ మెయిలింగుకి మాత్రమే వాడుకునే వాడు!! సమిష్టి కార్యాచరణ జరుగుతున్న చోట యెదటి వాళ్లని బలమయిన వాదనతో గెలిచి వొప్పించి తన మాటకి కట్టుబడి నడుచుకునే లాగ చెయ్యటం, యెవరయినా తనకన్నా బలమయిన వాదన చేసి మెప్పిస్తే తను కూడా అతన్నే అనుసరించటం ప్రజాస్వామ్య స్పూర్తి గల నాయకుడి లక్షణం. దానికి విరుధ్ధంగా తన పాయింటు బలమయినది కాకపోయినా ఇతర కారణాలతో వొత్తిడి పెట్టి అందరూ తననే అనుసరించేలా చెయ్యటం అనేది నియంతృత్వం అయితే అది హిట్లర్ ఆక్టివ్ గా చేశాడు, గాంధీ పాసివ్ గా చేశాడు, అయినా మనం హిట్లర్నే నియంత అంటున్నాం గానీ గాంధీని అనలేక పోతున్నాం, యెందుకని?
గాంధీ దక్షిణాఫ్రికాలో వుండగా బోయెరు యుధ్ధంలో పాల్గొన్నప్పుడూ ఇండియాలో మొదటి ప్రపంచ యుధ్ధంలో పాల్గొన్నప్పుదూ వాళ్లని యుధ్ధానంతరం కొన్ని సౌకర్యాలు అడిగాడు.యుధ్ధం ముగిశాక వాళ్ళు మాట తప్పేసి వాటికి తూచ్చి చెప్పినప్పుదు కనీసపు ప్రతిఘటన కూడా చెయ్యలేదు, యెందుకు? అసలు అడిగినవి కాదనడం కాదు - ఇచ్చిన మాట తప్పినందు కయినా నిలదీయాలి గదా! మనిషి శారీరకారోగ్యానికి సంబంధించిన రక్తలేమి వ్యాధి లాగా మానసికారోగ్యానికి సంబంధించిన క్షాత్రలేమి వ్యాధి పీడితు డితను! దానికి అంటువ్యాధి లక్షణాలు కూడా వున్నాయేమో ఇతరుల్లో మానసికంగా రోగ నిరోధక శక్తి తక్కువగా వుండి బౌధ్ధిక అలసత్వం యెక్కువగా వున్న వాళ్లందరికీ అంటించి పారేశాడు! ముఖ్యంగా ప్రజల్లో అంతకు ముందు వున్న క్షాత్రాన్ని చంపేసి దేబె మొహాల్లాగా తయారు చేశాడు. ఒకప్పుడు తమకు కష్టాలు కలిగించినందుకు నిరంకుశంగా వున్న రాజుల పైనే తిరుగుబాటు చేసి రాజ్యాల్నే తల్లకిందులు చేసిన వాళ్ళు ఇవ్వాళ తమ చుట్టూ ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా స్తబ్దుగా వుండటం, లేదంటే గుడారాలు పాతుకుని దండలు మెడలో వేసుకుని యేడుపు మొహాలతో మూలుగుతూ కాలం గడపటం చేస్తున్నారు కానీ, వీటివల్ల వీళ్ళంతా సాధిస్తున్న దేమిటి?
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఇతనెప్పుడూ గడగడ లాడించనే లేదు! వీళ్ళు గొడవలు చెయ్యటం, వాళ్ళు అణిచి వెయ్యటం, మరీ గొడవ యెక్కువయితే గుండ్రబల్ల ముచ్చట్లకి లండన్ పిలవటం, వీళ్ళేం మాత్లాడే వాళ్ళో వాళ్లేం మాట్లాడే వాళ్ళో గానీ ఆఖరికి వీళ్ళ డిమాండ్లని వొప్పుకోకుండానే వెనక్కి పంపించెయ్యటం లాంటి హడావిడే జరిగింది తప్ప ఇక్కణ్నించి వెళ్ళిపోవాలనే వూపు మాత్రం వాళ్లలో కలిగించలేకపోయారు. ఇంకా నేను చదివిన విషయం ప్రకారం, "గాంధీ మాట రాజకీయ రంగంలో చెల్లుబడి అవుతున్నంత కాలం మనం భారత్ నుంచి వైదొలగడానికి తొందర పడటం అనవసరం" అనే అభిప్రాయంలో వుండే వాళ్ళు?ఇంగ్లీషు వాళ్లని నిజంగా భయపెట్టి తరిమేసిన ఒక నాటకీయమయిన అద్భుతం 1946లో జరిగింది.అది జరిగిన సంవత్సరం లోగా మనకి స్వతంత్రం ఇచ్చేసి ఆ గడువు దాటాక ఒక్క రోజు కూడా ఇక్కద వుండకూడదని ఆ రోజుకన్నా ముందే పిట్ట పురుగు కూడా లేకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే దాని పవరేమిటో అర్ధం చేసుకోవచ్చు!
అదే నావికుల తిరుగుబాటు! ఫిబ్రవరి 18న నిప్పురవ్వ ఆహారం, మరియు సాధారణ మయిన అసౌకర్యాలకు సంబంధించిన సమ్మెగా రాజుకున్నా ప్రచండ వేగంతో విరుచుకు పడి అరణ్యాన్నంతా చుట్టెయ్యగలిగిన దావానలం లాగా మొత్తం దేశాన్నంతటినీ కదిలించింది! ప్రారబ్దం యేమిటంటే మన వాళ్ళకి దీని ప్రాముఖ్యత తెలియక పటేల్ లాంటి వాళ్ళు యెప్పుడో విప్పేసిన నల్లకోట్లు మళ్ళీ తొడిగి వాళ్ళ కేసుని వాదించారు అనే చిన్న వివరం తప్ప యెక్కువగా చెప్పలేదు. కానీ ఇంగ్లీషు వాళ్ల వైపు నుంచి చూస్తే గానీ దాని ప్రాధాన్యత తెలియదు. వలస రాజ్యాల్ని తమ పట్తులో వుంచుకోవటానికీ, తిరుగుబాట్లనై అణిచివెయ్యటానికి సైన్యాన్ని కదిలించటానికీ అతి ముఖ్యమైనది నౌకా దళం! అక్కడ తిరుగుబాటు జరగట మంటే ఆయువుపట్టు మీద దెబ్బ తగలటమే!
కమ్యునిష్టులు అతిగా వుత్సాహ పరచటం వల్ల దీనికి ప్రాధాన్యత ఇస్తే వాళ్లని పెంచినట్టు అవుతుందనే కారణం కావచ్చు గానీ కాంగ్రెసు మొదట చూపించినంత వుత్సాహం చూపించ లేదు. మార్చ్ 3 స్టేట్మెంట్ ప్రకార మయితే గాంధీ దాన్ని తీవ్రంగా విమర్శించేశాడు కూడాను!? వాళ్ళకి గనక సరయిన నాయకత్వం దొరికి వుంటే ఈ దేశం అఖండం గానే స్వాతంత్ర్యాన్ని సిధ్ధింప జేసుకుని వుండేదేమో ననిపిస్తుంది, యెందుకంటే ఆశ్చర్యకరంగా ముస్లిములు కూడా నావికా పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని వ్యక్తం చేసారు!
నాదో చిన్న అనుమానం! అంత పిరికిగా వ్యతిరేకత వచ్చిన రెండేళ్లలోనే అదిరి పడి పారిపోయిన వాళ్ళు, అదీ ఈ దేశజనభాలో 5% మించని వాళ్ళూ అన్నేళ్ళ పాటు అంత మొండిగా అన్ని దుర్మార్గాలు యెట్లా చెయ్యగలిగారు?పైస్థాయిలో వున్న మనుజేశ్వరాధములు అరాచకం పేరుతో హడావుడి చేసి పోలీసుల్నీ సైన్యాన్నీ ఇంగ్లీషువాళ్ళ పేరు మీద పంపిస్తే ఈ బానిసాధముడి నట్టువాంగం మేజువాణీ గాళ్ళు ఆ పోలీసుల్ని ఇంగ్లీషు వాళ్ళ దౌష్ట్యానికి చిహ్నంగా చూపించి డబుల్ గేము యేదయినా అడారా?వాళ్ళూ వీళ్ళూ యేం చేసినా మరో నరమానవుడికి తెలియకుండా చేశా మనుకున్నారు గానీ పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడు యెవరి కేది వెయ్యాలో అది వేసేశాడు! ఒకనాడు తమది రవి అస్తమించని సామ్రాజ్యం అని మిడిసి పడిన వాళ్ళు ఇవ్వాళ యెక్కడ వుదయిస్తున్నాడో తెలియని అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు! ఒకనాడు ఈ దేశాన్ని పరిపాలించే అర్హత తమకే వుందని విర్రవీగిన వాళ్ళు ఇవ్వాళ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక పోయి - కన్నీరు మున్నెరుగా విలపిస్తూ యెక్కే గడపా దిగే గడపా అన్నట్టు అందరినీ దేబిరిస్తూ - నాలాంటి వాళ్లకు మహదానందాన్ని కలిగిస్తున్నారు! పాపపుణ్యాలు తమ ఫలితాల్ని తప్పక చూపిస్తాయి - అది యెరిగిన వాళ్ళు వినయంగా వుండి ప్రజామోదాన్ని పొందుతారు,యెరగని వాళ్ళు ఇవ్వాళ కాంగ్రెసుకు పట్టిన అధికారాంత మందు జూడవలె గదా అయ్యల సౌభాగ్యము లనే దుస్థితిని అనుభవిస్తారు!
ఇతరేతర కారణాలతో సిద్ధించినా ఫలితాన్ని మాత్రం గాంధీ నేతృత్వం లోని కాంగ్రెసు పార్టీకి దఖలు పరుస్తూ 1947 ఆగస్ట్ 15న భారత్ దేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించదంతో భారత రాజకీయ చరిత్రలో మోహన్ దాస్ కరం చంద్ గాంధీ యొక్క చారిత్రక ప్రాధాన్యత ముగిసి పోయింది. మరో నాటకీయమయిన సన్నివేశంలో గాడ్సే అనే పుణ్యాత్ముడు గాంధీని భౌతికంగా గూడా ఈ ప్రపంచం నుంచి పంపించి వేశాడు! ఒక పాత్ర ముగియగానే మరొక పాత్ర రావాల్సిన నాటక రంగ సాంప్రదాయం ప్రకారం భారత రాజకీయ రంగాన్ని శాసించేందుకు మరొక సామ్రాట్టు ఆవిర్భవించాడు! అతని కంటె ఘనుడు అతని శిష్యుడు అన్నట్టు గురువు గారి కిష్టమయిన పన్లేవీ చేయక పోయినా గురువుగారు చెప్పని వాట్ని కూడా గురువు పేరుతోనే ఝణాయించుకోగలిగిన ఆషాఢభూతి వంటి జవర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధానిగా రంగ ప్రవేశం చేశాడు!
గాంధీ చేసిన అసలు మాజిక్ ప్రజలకి తాము సరికొత్త ప్రజాస్వామ్యబధ్ధమయిన రాజకీయ వ్యవస్థలో వున్నట్టు భ్రమింప జేస్తూనే పాతకాలపు రాజస్వామ్యాన్నే పార్టీ అద్యక్షుల కుటుంబస్వామ్యం రూపంలో కనిపిస్తూనే వున్నా అది సహజమే నన్నట్టుగా ఆలోచించేలాగా ప్రజల మైండ్సెట్ ని మార్చటం! చరిత్ర కందని కాలం నుంచీ ఈ దేశంలోని మనుజేస్వరాధములు యెన్ని శతాబ్దాల పాటు ప్రయత్నించినా చెయ్యలేని దానిని కేవలం పాతికేళ్ళలో చేసి చూపించాడు! అందుకేనేమో ఇతన్ని దైవాంశ సభూతుడి గానూ అవతార పురుషుడి గానూ వాళ్ళు కీర్తిస్తున్నది!
మోహన్ దాస్ కరం చంద్ గాంధీ అనబడే ఈ వ్యక్తి యొక్క గందరగోళపు భావజాలం నుంచి పూర్తిగా బయట పడిన క్షణం ఉంచే సత్యధర్మన్యాయ ప్రతిష్ఠితమైన వ్యాస పరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం వున్న మన గురు పరంపర నిండు మనస్సుతో హర్షించే నిజమయిన ప్రస్ఠాన యాత్రలో భారత దేశం తొలి అడుగు వేస్తుంది!

మాధ్యమిక విద్యాబ్యాసం పోర్బందర్ లోనూ ఉన్నత విద్య(హై స్కూలు చదువు) రాజ్కోట్ లోనూ జరిగింది.చదువులో చాలా చాలా చాలా మామూలు స్థాయి విద్యార్ధి. క్లాస్రూం లోనూ ప్లేగ్రవుండు లోనూ మనోడు నస్మరంతి గాడే! సంవత్సరాంతపు రిపోర్టు ఇలా వుండేది, "ఇంగ్లీషులో గుడ్డు, లెక్కల్లో ఫెయిరు, జాగర్ఫీలో వీకు, కాండక్టు అదుర్సు మరియూ చేతి రాత దరిద్రం" - అయ్యా అదీ సంగతి. పాపం ఇవే లోపాలు మన పిల్లల్లో వుంటే యెంత యాగీ చేస్తున్నాం - పనికి రాకుండా పోతావురా బడుధ్ధాయా అని?!
బావనగర్ లోని సమల్దాస్ కాలెజి నుంచి మెట్రిక్యులేషన్ యెలాగోలా గట్టెక్కించాడు! బారిస్టర్ గిరీ వెలగబెడితే తండ్రి పోష్టయినా దక్కుతుందేమో నని 1888లో లండన్ కి ప్రయాణం కట్టాడు.1891లో అది పూర్తి చేసి ఇండియాకి వొచ్చి పడ్డాడు. బొంబాయిలో లా ప్రాక్టీసు మొదలెట్టి సాక్షుల్ని క్రాసెక్జామిన్ చెయ్యడంలో మానసికంగా సమర్ధుడు కాకపోవటం చేత ఆ వృత్తికి పనికి రాక రాజ్కోట్ కి తిరిగొచ్చి లిటిగెంటులకి పిటిషన్లు రాసి పెట్టటానికి మాత్రం పరిమితమై పోయాడు. ఒక బ్రిటిష్ ఆఫీసర్ తో యేదో సంథింగ్ సంథింగ్ ఇనక్కు ఉనక్కు అయ్యేసరికి అదీ బలవంతంగా ఆపెయ్యాల్సి వచ్చింది. ఏ మలుపూ లేకుండా అతని జీవితం ఇలాగే గడిచి పోతే ప్రపంచంలోని అసంఖ్యాక మయిన చెట్టు కింద ప్లీదర్లలో ఒకడిగా అనామకంగా మిగిలి పోయే వాడు?
1893లో దక్షిణాఫ్రికా నటాల్ ప్రాంతంలోని అబ్దుల్లా & కో నుంచి ఒక సంవత్సరానికి ఆకర్షణీయమయిన £105.00 నెల జీతపు కాంట్రాక్టును ఒప్పుకుని తన 24వ యేట దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టాడు. ఇక్కద గడిపిన 21 యేళ్ళూ ఇతని రాజకీయ పరమయిన భావజాలానికీ, నాయకత్వ లక్షణాలకీ పునాదిని యేర్పరచాయి. స్వదేశంలో దారుణంగా ఫెయిలయిన వాడు ఇక్కడ అద్బుతంగా చెలరేగి పోయాడు. దానికి కారణం క్రాసెగ్జామినేషన్లో తన వీక్నేసు తనకి తెలుసు గనక కోర్టులో అడుగు పెట్టే పని లేని ఒక ట్రిక్కు ప్లే చేశాడు, తన అదృష్టం బాగుండి అది గారెల బుట్టలో పడేసింది - సొమ్ముల పంట పండించింది! అదేమిటంటే కోర్టు బయట రాజీలు చెయ్యటం! ప్రపంచంలో ఇతనికి తప్ప మరెవరికీ లాభసాటిగా వుండనంత వింతయినదీ ట్రిక్కు? డబ్బులు చేతి నిండా వుండటం వల్ల రైళ్ళలో యెప్పుడూ మొదటి తరగతి టికెట్టునే తీసుకోవటం, తెల్లవాళ్ళు మాత్రమే విడిది చెయ్యగలిగిన ఖరీదయిన హోటళ్లలో మకాం చెయ్యటమూ, మొండితనం వుండటం వల్ల ఆ ప్రయాణాల్లో యెంతగా అవమానాలకి గురయినా వాటిని కొనసాగించటం మిగతా భారతీయుల్లో ఇతని పట్ల ఒక రకమయిన హీరో ఇమేజిని తెచ్చి పెట్టాయేమో? రైల్లోంచి తోసేస్తే దులుపుకుని పోవటం, ఒక హోటల్ నుంచి గెంటేస్తే మరో హోటల్ కి వెళ్ళడం తప్ప ప్రతిఘటించి పోరాటా లేమీ చెయ్యలేదు, యెందుకనో?
అప్పుడు అక్కడి శ్వేత జాతి దుర్మార్గపు విధానాల్ని అర్ధం చేసుకునేందుకు వీలుగా కొంచెం అప్పటి దక్షిణాఫ్రికా పౌర సమాజ వాతావరణాన్ని తెలుసుకోవాలి. అసలు దక్షిణాఫ్రికా ప్రజలు పల్లెల్లో వుండేవాళ్ళు, రైతులుగా, బైతులుగా, వేటగాళ్ళుగా - అదీ దేశ మంతటా చెల్లా చెదురుగా వుండే వాళ్ళు. తెల్లవాళ్ళకి వాళ్ళతో సమస్యలు లేవు. కానీ భారతీయులు అలా కాదు, వ్యాపారాల్లో ఆరి తేరి పోయి వుండటం, లేదంటే బాగా చదువుకుని గాంధీ లాగా మంచి ఆదాయాల కోసం రావడం వల్ల తెల్ల వాళ్లకి వీళ్ళు గట్టి పోటీగా తయారయ్యారు. వీళ్లని నిరోధించటం కోసమే సరిగ్గా 1890ల నాటికే నల్ల చట్టాలు చెయ్యటం మొదలు పెట్టారు.
1893 నుంచి 1914 వరకూ పిటిషన్లు రాయడంలో తన ప్రావీణ్యతని వుపయోగించుకుని కోర్టులకీ గవర్నమెంటు లోని వాళ్ళకీ పిటిషన్లు తగిలిస్తూ మధ్య మధ్యలో ఇండియాకీ ఇంగ్లాండుకీ తిరిగి మద్దతు కూడగట్టుకుంటూ ఆ ఇరవయ్యేళ్లలో విపరీతమయిన ప్రచారాన్ని తెచ్చుకున్నాడు. ఇతని యెదుగుదలకి దక్షిణాఫ్రికా మీడియా కొన్నిసార్లు మెచ్చుకుంటూ, కొన్నిసార్లు వెక్కిరిస్తూ తన వంతు పాత్ర తను పోషించింది. ఒక రకంగా మొత్తం సమాజాన్ని దీర్ఘకాలికమయిన శాంతియుతమయిన సర్వతోముఖమయిన అభివృధ్ధి పధంలోకి నడిపించగలిగిన జ్ఞాన సంపదా, దూరదృష్టీ యేమీ లేకుండా - ఒక గందరగోళపు భావజాలంతో తాత్కాలికమయిన వుద్రేకాల్ని సృష్టించి MRTP రేటింగుల మీద యావే తప్ప ప్రజల పట్ల నిబధ్ధత లేని మీడియా తన వంతు పాత్ర తనూ పోషించగా మహామహులుగా కీర్తించబడుతున్న ఇవ్వాళ్టి విభజన వాద వుద్యమ నేతల లాంటి వాడే అయినా, సహజంగా మనుషుల్లో వుండే(మేధావుల్లో కూడా) - నిశితంగా పరిశోధించడానికి వీలు పడనివ్వని - బౌధ్ధిక అలసత్వం వల్ల మరో విధంగా రూపం మార్చుకుని ప్రపంచ రాజకీయ చిత్రపటం మీద మహాత్ముడిగా మనగలుగుతున్నాడు.
1899లో బోయరు యుధ్ధంలో 1100 మంది భరతీయుల్ని తెల్లవాళ్ళ తరపున యుధ్ధంలో సాయం చెయ్యతానికి వొప్పించి తను నాయకత్వం వహించి Indian Ambulance Corps పేరుతో తెల్లవాళ్ళ ప్రభుత్వానికి సహాయ పడ్డాడు - వీళ్ళపట్ల దుర్మార్గంగా వున్నాప్పటికీ? "పాలకులు అన్నిసార్లూ న్యాయముగా ప్రవర్తించ లేకపోయిననూ పాలితులు రాజ్యానికి అనుసంధానించబడి వున్నంత కాలమూ పాలకులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించరాదు" ట! మొదటిసారి నేను ఈ అభిప్రాయం చదవగానే "ఆండాళ్ళూ నీకేమయినా అర్ధ మయిందా" గుర్తొచ్చి చక్కిలిగింతలు పెట్టినంత నవ్వొచ్చింది! కానీ "ఏ రాజ్యమైనా తిరుగు బాటు చేసిన ప్రజలను తీవ్రంగా అణచి వేస్తుంది. అందులో మారణకాండ, మాన ప్రాణ హాని సర్వ సాధారణం. మేం వాటిని డాక్యుమేంట్ చేసుకున్నాం. మీరు గుర్తించడానికే నిరాకరిస్తున్నారు... అంతే తేడా" అని అంటున్న ఈ కాలపు మేధావి అభిప్రాయాన్ని చూసినప్పుదు మాత్రం భయంగా అనిపించింది?! మోహన్ దాస్ కరం చంద్ గాంధీ అనే ఈ వ్యక్తిని అర్జెంటుగా భారత రాజకీయ రంగం నుంచి అడృశ్యం చెయ్యక పోతే చాలా ప్రమాద మనిపించింది!
అందరూ శాంతియుత ప్రతిఘటన, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే ఇతని సిధ్ధాంతాలకి భగవద్గీత నుంచి స్పూర్తి తీసుకున్నాడని పదే పదే చెప్పగా విని మొత్తం 700 పై చిలుకు వున్న శ్లోకాల్ని ఇటు నుంచి అటూ అటు నుంచి ఇటూ గిలకొట్టి చదివినా ఒక చెంప మీద కొడితే మరో చెంపని చూపించటం, కూడూ నీళ్ళూ మానుకుని కూర్చోవటం లాంటి తింగరి చేష్టలకి వుత్సాహ పరిచే సాక్ష్యాలు నా కెక్కడా కనబడ లేదు. అసలు భగవద్గీత సూటిగా "అర్జునా! ఈ దుర్యోధనాధములు యెప్పుడయితే కనీసపు పశ్చాత్తాపం కూడా లేకుండా పాపాలు చేశారో అప్పుడే చచ్చి పోయినట్టు లెక్క! పాప పుణ్యాలు విచారించకుండా చంపి పారెయ్యి. యేదొచ్చినా నేను చూసుకుంటాను గదా, నాకు వొదిలెయ్యి" అని చెప్పేటట్లుగా వుంటే అందులో ఈ సుత్తి యెలా కనబడింతో అతనికి?
అసలు తనకా ఆలోచన యెట్టా వొచ్చిందో తన ఆత్మఖద My experiments with truth లో తనే వివరంగా చెప్పాడు. ఈ పుస్తకం పేరే నాకు పెద్ద బోకులా వినిపిస్తుంది! సత్యం అంటే అన్ని ప్రయోగాలూ చేసాక ఆ ప్రయోగ ఫలితాల్ని విశ్లేషించగా తెలిసి చచ్చే విషయం కదా! ఒక విషయం రూఢిగా తెలిసాక గూడా దాని మీద మళ్ళీ ప్రయోగాలు చెయ్యట మేమిటి నా బొంద? తిక్కశ్రీ తిక్క రత్న లాంటి బిరుదుల్ని ఆశించే తిక్క వెధవ తప్ప మామూలు వాడెవడయినా చేస్తాడా?
భార్యని కక్కూసు గది కడగ మన్నాడట! దానికి ఆ అగ్ర కులానికి చందిన ఆడమనిషి ఈ పాకీ పని నేను చేస్తానా అని కించ పడి, అయినా చెప్పింది సాంప్రదాయం ప్రకారం తనకన్నా అధికుడయిన పతి దేవుడు కాబట్టి లాగి తన్నకుండా మౌనంగా వుండి పోయిందట! ఆ తిరస్కారం తనలో మార్పుని తీసుకు రాగా దానినే తన సత్యాగ్రాహ మనే బ్రహ్మాస్త్రానికి మూల మంత్రంగా చేసుకున్నాడట! ప్రపంచ మంతటా అన్ని కుటుంబాల్లోనూ అతి మామూలుగా జరిగే మొగుడూ పెళ్ళాలకి సంబంధించిన రంకు బాగోతాన్ని ఒక జాతినీ వర్గాన్నీ ప్రజల్నీ అతి క్రూరంగా అణిచేసే వాళ్ల మీద పోరాడటానికి ఆయుధంలా మలుచుకున్నాని చెప్తుంటే ఇన్నేళ్ళుగా వింటున్న వాళ్లలో యెవరికీ అసహ్యం కాదు గదా కనీసం చిరాకు గూడా వెయ్యలేదేమిటా అని చాలా ఆశ్చర్యంగా వుంటుంది నాకు!
అన్ని సంవత్సరాలు అంత హడావిడి చేసినా ఒక్క నల్ల చట్టమూ రద్దు కాలేదు? యేదో ఒక సంచలనాత్మకమయిన పని చెయ్యటం, అరెస్టవటం, తెల్లవాళ్లతో రాజీ ప్రతిపాదనతో బయటికి రావటం, రాజీ పడినందుకు సాటివాళ్లతో తిట్టించుకోవటం, ఆ తెల్లవాళ్ళు రాజీ ప్రతిపాదనల్ని రద్దు చెయ్యగానే మళ్ళీ హడావిడి మొదలు పెట్టటం తప్ప నికరమయిన విజయాన్ని దేన్నీ నమోదు చేసుకోలేక పోయాడు. అయినా సరే, "భారత దేశం పిలుస్తోంది, రా! కదలి రా!" అని భారతదేశం లోని అభిమానులు పదే పదే పిలవడం తోనూ, తనకి కూడా, "ఇక్కడయితే నేను కేవలం 150,000 మందికి మాత్రమే నాయకత్వం వహించ గలను, అక్కడ మరింత విశాల మయిన రంగస్థలమే నాకోసం యెదురు చూస్తున్నది" అని అనిపించటంతో - మొదలు పెట్టిన పనిని సగంలోనే వొదిలేసి వెళ్తున్నాడని సాటివాళ్ళు విసుక్కునే విధంగా హఠాత్తుగా 1914లో భారత దేశానికి వొచ్చి పడ్డాడు. బోయరు యుధ్ధంలో తమతో అంత బాగా అంట కాగిన సమయంలో మెడళ్ళు ఇచ్చి సత్కరించిన తెల్లవాళ్లే పురెక్కించి ఇక్కడ ఇంప్లాంట్ చేసి వుండవచ్చు నని కొందరు అనుమానిస్తున్నారు గానీ నేను ఆ కోణం మీద అతిగా పోదల్చుకోలేదు.
1915 జనవరి 9న శాశ్వతంగా దక్షిణాఫ్రికా జీవితంతో తెగదెంపులు చేసుకుని భారత భూభాగం మీద కాలు పెట్టాడు. 1915 నుంచీ 1920 వరకూ పని మొదలు పెట్తకుండా యేమి చేశాడో తెలుసా? నేను ఈ దేశాన్ని గురించి తెలుసుకోవాలని దేశ మంతటా తిరిగాడు. దేశ మంతటా గోచి పాత రాయుళ్ళే కనబడ్డంతో వాళ్లలో ఒకడిగా కలిసి పోవాలంటే తనూ వాళ్ల లాగా వుండాలని తను కూడా పైన చూస్తున్న తన ట్రేడ్ మార్క్ అయిన గోచిపాత లోకి మారాడు! ఇంకా నయం, రైళ్ల లోనూ బస్సుల్లోనూ మాత్రమే తిరిగి దాంతో సరి పెట్టేశాడు గానీ అడవుల్లో కూడా వుంది నా దేశం అని నగ్నంగా తిరిగే ఆదిమ జాతు లున్న అరణ్యాలను కూడా శోధించితే యెట్లా తయారయి వుండే వాడో!
ఆ కాలం గురించి మనకి రెండు భ్రమ లున్నాయి, దేశ మంతా బ్రిటిషు వాళ్ళ పూర్తి అధికారం లోకి వెళ్లిందనీ, వాళ్ళు మన నెత్తి మీద తుపాకీ పెట్టి పరిపాలించారని! రెండూ అబధ్ధాలే! సామాన్య ప్రజలకి అసలు ఇంగ్లీషు వాళ్ళు కనబడిందే చాలా తక్కువ. అందరికీ చిన్నప్పటి హిస్టరీ పాఠాల్లో పరిచయమయిన సైన్య సహకార మైత్రి లాంటి వొప్పందాలతో పై స్థాయిలో వుండే అప్పటి రాజుల్నీ జమీందార్లనీ బానిసల్ని చేసుకుని వాళ్ళ ద్వారా తమకు కావల్సిన వాట్ని సాధించుకున్నారు! అప్పుడప్పుడూ తెల్లని రంగుతో కనిపించే కుంఫినీ దొరల్ని కళ్ళింతలు జేసుకుని చూడ్డం, కారు లాంటి వాట్ని చూసి ఇది ఆ తెల్ల వాళ్ళు తెచ్చిందని తెలిసినప్పుడు "ఔరా తెల్లోడి బిస" అని అనుకోవటం తప్ప సామాన్య జనానికి తమ కష్టాలకి కారణం ఇంగ్లీషు వాళ్లని అస్సలు తెలియదు.
ఈ పై స్థాయిలో వుండి ఇంగ్లీషు వాళ్ళకి స్నేహ పాత్రులుగా వుంటూ యెవరయితే ఇంగ్లీషు వాళ్ళు రాక ముందు నుంచీ సామాన్యుల్ని పీల్చి పిప్పి చేస్తూ వున్నారో వాళ్ళు కాంగ్రెసునీ స్వాతంత్రోద్యమాన్నీ 1945 వరకూ వ్యతిరేకిస్తూనే గడిపి చివరి దశలో జస్టిస్ పార్టీ లాంటి హడావిడిని కూడా చేసి ఆఖరి రోజుల్లో ఇంక స్వాతంత్ర్యం రావడం ఖాయమని తెలియగానే కాంగ్రెసు లోకి దూకేసి అప్పటి దాకా లెక్క లేనన్ని త్యాగాలు చేసిన పింగళి వెంకయ్య, గరిమెళ్ళ సత్యనారాయణ లాంటి వాళ్లని వెనక్కి నెట్టేసి ప్రజల ఆమోదంతో ప్రభుత్వాధినేతలుగా అవతరించారు! గాంధీ ఈ జగన్నాటక మంతా ఇలాగే జరిగేందుకు సూత్రధారిగా నిలబడి యెక్కడా ప్రాచీన భారత దేశపు సామాజిక చిహ్నాలయిన కులాలూ మతాలూ వాటికున్న రాజకీయ ప్రాధాన్యతలూ యే మాత్రమూ కదల బారకుండా అన్యాయా లన్నింటినీ తెల్లోడి ఖాతాలో వేసేసి అప్పటి దాకా ఇంగ్లీషు వాళ్లతో కలిసి జనాన్ని చెండుకు తిన్న పాత కాలం రాజుల్నీ జమీందార్లనీ ఆదర్శవంతులయిన కొత్త రకం ప్రభువులుగా అవతరింప జేశాడు!
ఇతనికి ఆపాదించిన "ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందించకుండా సాధించిన ఘనకార్యం" చాటున ఇతను సాధించిన నిజమయిన ఘనకార్యం యేమిటో అర్ధం చేసుకుంటే ఇతను మాట్లాడిన శాంతి, సత్యము, అహింస, ధర్మకర్తృత్వం అనేవి పరమ జుగుప్సాకరమయిన బూతుమాటల కన్నా వెగటు పుట్టిస్తాయి.
నేను మొదటిసారి ఈ ఒక్క నెత్తురు బొట్టుకూడా చిందించకుండా అనే మాటను వినేటప్పటికే లాఠీ దెబ్బలకి లాలా సాబ్ అమరుడు కాగా దానికి ప్రతీకారంగా భగత్ సింగ్ బృందం సాందర్స్ ని చంపాలని అనుకోవడం, అందులో ఫెయిల్ అయినా అదే స్పూర్తితో హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ ని స్థాపించి వాళ్ళు చేసిన అజరామరమైన పోరాట గాధ నంతా చదివి వుండటంతో ఆశ్చర్య మనిపించింది? అదేంటి? యెంతో మంది త్యాగధనుల రక్తం యేరులై ప్రవహించినా ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందించకుండా సాధించాడు అంటారేమిటి - అని! గాంధీని అలా పొగిడేవాళ్ల లోనూ అసలు గాంధీ మనస్సులోనూ వున్న నిజమైన లక్ష్యం ఇంగ్లీషు వాళ్ల శరీరం నుంచి గానీ వాళ్లతో నాలుగింట మూడు వంతులుగా కలిసి అధికారంలో వున్న రాజవంశీయుల శరీరం నుంచి గానీ ఒక్క నెత్తురు బొట్టును కూదా చిందనివ్వకుండా - అనేది అర్ధమవటానికి నాకు చాలా కాలం పట్టింది!
గాంధీ ఈ దేశంలో అడుగు పెట్టే నాటికి భారత దేశపు రాజకీయ సామాజిక ఆర్ధిక చిత్రపట మంతా పరమ భీభత్సమయిన గందరగోళంలో వుంది. సామాజికంగా చదువుకున్న వాళ్ళంతా లండన్ వెళ్ళి లాయర్లుగా తిరిగొచ్చి ఇక్కడీ జమిందార్లకీ ఇంగ్లీషు వాళ్ళకీ సాయపడుతూ ప్రాక్టీసు పెంచుకుంటూ గడుపుతున్నారు. ఆ ఇంగ్లీషు వాళ్ళ ఆదర్శాలతోనే ప్రభావితమయి వారి ఆధిక్యత పట్ల తీవ్రమయిన వ్యతిరేకత లేని ఇప్పటి మాదిరి మామూలు కెరీరిష్టు జర్నలిష్టులే పత్రికా రంగంలో మేధావులుగా చలామణీ అవుతూ హల్చల్ చేస్తున్నారు. రాజకీయంగా నేను మొదటి భాగంలో చెప్పిన ప్రళయ త్రికోణం మరింత స్పష్టమైన రూపం ధరించింది. ఆర్ధికంగా మధ్య యుగాల నాటి నిలవనీరు లాంటి వ్యవసాయాధారితమయిన పాత అమరిక మీద ఇంగ్లీషు వాళ్ల పారిశ్రామిక విప్లవపు కొత్త అమరిక కూడా కలిసి ప్రజల్ని మరింత భయానక స్థితి లోకి నెట్టేసింది.ఈ కొత్త రకం ఆర్ధిక చట్రం యొక్క ఫలితమే ప్రపంచంలోనే అత్యంత దయనీయమయిన కరువుల్లో వొకటయిన బెంగాల్ కరువు.
దేశ మంతటా తిరిగి ఈ వాతావరణాన్నంతా చూసిన గాంధీ దక్షిణాఫ్రికా మోడల్ ఇక్కడ పని చెయ్యదని తెలుసుకున్నాడు! జ్ఞానవృధ్ధుడయిన యువకిశోరం భగత్ సింగ్ లాగా అట్టడుగున వున్న సామాన్య ప్రజలకు మేలు కలిగించే సామ్యవాద స్పూర్తితో ప్రజల్ని చైతన్య వంతుల్ని చేసి తమ భావిని తామే తీర్చిదిద్దుకునే లాగా ప్రజల్ని నడిపించటం ఈ జ్ఞానఢింభకు డైన చీకుగద్ద లక్ష్యం కానే కాదు! అలాంటి లక్ష్యం పట్ల ఇతనికి ద్వేషం కూడా వుంది. అప్పటికే ప్రపంచం లోని అనేక దేశాల్లో పెల్లుబుకుతున్న ప్రజాస్వామిక సంస్కృతిని యెప్పటికయినా ఇక్కడా రాక తప్పదు గాబట్టి ఇక్కడికీ తీసుకురావదం, ఆ చట్రంలో అప్పుడున్న రాజవంశీయుల్ని వాళ్ళ ప్రాభవాలు యేమాత్రమూ తగ్గనివ్వని పధ్ధతిలో అమర్చటం అనేది ఇతను సాధించిన ఘనకార్యం. కుంజరయూధాన్ని దోమ కుత్తుకలో దూర్చటం అనే అనితర సాధ్యమయిన పనిని అంత ప్రతిభావంతంగా చెయ్యడం నిజంగా అద్భుతమే!
దక్షిణాఫ్రికాలో యేనాడూ సామాన్య ప్రజల్ని భాగస్వాములుగా చేసే కార్యక్రమాల్ని రూపొందించని వాడు ఇక్కడ పూర్తిగా సామాన్య ప్రజల్ని ఆకర్షించటం మీదనే దృష్టి పెట్టాడు. అప్పటి దాకా రాజు మంచివాడయితే సంతోషంగా వుంటూ రాజు దుర్మార్గుడయితే తిరుగుబాటు చేసి మరొక రాజును తెచ్చుకుంటూ తమ కష్టాలకు కారణం దేముడి దయ లేకపోవటమే నని సరిపెట్టుకోవటమే తప్ప - ఇప్పటికీ చాలామంది విద్యాధికులకి కూడా అర్ధం కానంత జటిలమయిన విషయాలు అవడం చేత - కరువులు ప్రభువుల దుర్మార్గమయిన ఆర్ధిక విన్యాసాల వల్లనే వస్తాయనీ వాటిని మార్చుకోకుండా ప్రభువుల్ని మారిస్తే ప్రయోజనం వుండదని తెలుసుకోలేని అమాయకుల ముందు మొదటిసారిగా ప్రజలకి మీ కష్టాలకి దేవుడు కారణం కాదు ఇక్కడివాళ్ళే అని చెప్పాలి, అలాగని ప్రజలు వాళ్లకి అలవాటయిన పధ్ధతిలో తిరుగుబాటు చెయ్యకుండా నిగ్రహించాలి. ప్రజలు హింసకి దిగితే తను ప్రభుత్వంలో అమర్చుదామనుకున్న వాళ్లకే ప్రమాదం మరి! అందుకనే చాలా మామూలు సంఘటన అయిన చౌరీ చౌరా ఘటనకి అంత అతిగా రియాక్ట్ అయి పక్కనున్న శుంఠలకి అది అర్ధం కాక వొద్దని మొత్తుకుంటున్నా వుద్యమం ఇంకొద్ది రోజులు గట్టిగా చేస్తే అప్పుడే స్వతంత్రం వొచ్చి వుండేదనిపించేటంత వూపులో వున్నప్పటికీ మొత్తం కార్యక్రమాన్నే ఆపేశాడు!
1920లో కాంగ్రెసు పార్టీ పగ్గాలు చేపట్టినా అతి సుదీర్ఘ కాలాన్ని కింది స్థాయిలో ప్రజలకి అస్పృశ్యత గురించీ మద్యపాన నిషెధం గురించి చెప్పటానికీ పై స్థాయిలో సంధాన కర్త లాగా స్వరాజ్ పార్టీకీ కాంగ్రెసు పార్టీకీ రాజీ చెయ్యటం అనే గర్భాదాన ప్పంతులు పనికీ ఉపయోగించుకున్నాడు. 1930లో వుప్పు సత్యాగ్రహం మొదలు పెట్తేవరకూ అతడు చేసిందంతా ప్రజల్ని తను యేం చెప్తే అది నమ్మే విధంగా ప్రజల్ని సిధ్ధం చెయ్యటమే.
వెనకటి కాలం లోని పిట్ట కధలో కొండని మోస్తానన్న వీరుడి లాగా మీరంతా నేను చెప్పినట్టు వింటే ఒక్క సంవత్సరంలో స్వతంత్రాన్ని తీసుకొస్తా నన్నాడు! మరి చూస్తావేం మొయ్యి అంటే యెవరయినా యెత్తి నా భుజాల మీద పెడితే మోస్తా నన్నాను గానీ నేనే యెత్తుతా ననలేదుగా మీరు యెత్తి నా భుజాల మీద పెడితే మొయ్యదానికి నేను యెప్పుడూ సిధ్ధమే నన్న ఆ పిట్టకధలోని హీరో లాగే మీరు నేను చెప్పినట్టు వినలేదుగా అని తేల్చి పారేశాడు?ఆ పిట్టకధ యెప్పట్నుంచో అందరికీ తెలిసిందే అయినా ఇంతమంది మేధావులూ పోలిక పట్టలేక ఈ కమెడియన్ ని అంత సీరియస్ గా నమ్మేశారంటే తెలివి తక్కువ మాటల్ని కూడా గంభీరంగా మోత మోగించడంలో ఇతని ప్రజ్ఞ నిరుపమానం!
1918లో ఇంగ్లండు మొదటి ప్రపంచ యుధ్ధంలోకి దిగింది. బోయరు యుధ్ధంలో Indian Ambulance Corps తో సరిపెట్టిన ఇతడు ఈసారి బ్రిటిషు వాళ్ల తరపున భారతీయుల్ని యుధ్ధం చేయించడానికి సమరోత్సాహంతో కదిలాడు. "In a June 1918 leaflet entitled "Appeal for Enlistment", Gandhi wrote "To bring about such a state of things we should have the ability to defend ourselves, that is, the ability to bear arms and to use them...If we want to learn the use of arms with the greatest possible despatch, it is our duty to enlist ourselves in the army." He did, however, stipulate in a letter to the Viceroy's private secretary that he "personally will not kill or injure anybody, friend or foe." ఇప్పటిదాకా అంతా అచ్చ తెలుగులో రాసి ఇది మాత్రమే పక్కా ఇంగ్ల్లీషులో యెలా వున్నది అలాగే యెందుకు దించేశానో తెలుసా? యెలా అనువదించాలో అర్ధం కాలేదు, యెన్నో సంక్లిష్టమయిన విషయాల్ని అర్ధం చేసుకోగలిగిన నా మేధస్సు కూడా ఈ గందరగోళపు భావజాలం లోని అస్పష్టత ముందు దారుణంగా ఓడిపోయింది!
ఇతని కిదేం పిచ్చ! తన కన్యాయం చేసారని వాళ్ళ మీద భీభత్సంగా పోరాడుతుంటాడు, అయినా వాళ్ల సొంత కారణాల తో వాళ్ళు వేరే వాళ్లతో యుధ్ధానికి వెళ్తే నేను కూడా సాయం చేస్తానని వురక లెత్తుతాడు? వ్యక్ర్తిగతంగా స్నేహితుణ్ణి గానీ శత్రువును గానీ చంపడటం ఇష్టం లేదట! యుధ్ధాల్లో యెంతమందిని చంపినా అభ్యంతరం లేదట! ఇంగ్లీషు వాళ్ళ శత్రువుల్ని చంపటానికి భారతీయులు సైనికులుగా వెళ్ళాలట! భారతీయులు ఇంగ్లీషు వాళ్లని మాత్రం చంపగూడదట! ఇదేమి అహింసా వాదం?
బోయరు యుధ్ధంలో అపారమయిన ఇంగ్లీషు వాళ్ళ సైన్యాన్న్ని చూసి వీళ్ళ మీదకి ఆయుధాల్తో వెళ్తే మనల్ని చంపేస్తారు అనే చావుభయాన్నీ శత్రువుకి మనల్ని చంపెయ్యాలనేటంత కోపం రాకుండా చూసుకుంటే బతికుండి బలుసాకయినా తిని బతకొచ్చనే బతక నేర్చిన తెలివినీ కలిపేసి తయారు చేసిన తిక్క ఐడియాని కేవలం నైతికంగా వున్నతులు మాత్రమే పాటించగలిగిన బలమయిన ఆయుధం అని కోతలు కొయ్యటం Neighbors Envy Owners Prideని మించిన గొప్ప అడ్వర్టైజింగ్ టెక్నిక్!
గాంధీలో కొన్ని లోపాలు వున్నప్పటికీ మొఠ్ఠ మొదటి సారిగా సామాన్య ప్రజలను రాజకీయంగా చైతన్యవంతులను చేసిఒక్క తాటి మీద నడిపించాడనిన్నీ, భిన్న సంసృతులతో కలగాపులగంగా వున్న ప్రజల్నందర్నీ బిన్నత్వంలో యేకత్వం పరిఢవిల్లే లాగ తీర్చి దిద్దాడనిన్నీ, అందువల్లనే స్వతంత్రం రాగానే మళ్ళీ ముక్కలు ముక్క లయ్యే ప్రమాదం తప్పిపోయి ఒక్కటిగా నిలబడిందనిన్నీ సుభాషితాలు చెప్తారు - మరీ తాము సమర్ధించలేని తప్పుల్ని యెదటి వాళ్ళు యెత్తి చూపిస్తూ ఇరుకున పెడుతున్నప్పుదు మధ్యేమార్గంగా రాజీ కొస్తూ! ఆ మహానుభావుడే లేకుంటే దేశం అల్లకల్లోలమైపోయేదని భయపెట్టేస్తారు. కాని శ్రీవారు కొత్తగా జాతీయ సమగ్రతను సాధించినది తొలుత అనేక సంస్థానములుగా వుండి స్వాతంత్ర్యము తర్వాత తమ ప్రాభవము లేవియునూ చెదరని రీతిన ఒకే లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వము రూపములో నూత్న వేషములు ధరించి అవతరించిన సాంప్రదాయిక భారత మనుజేశ్వరాధములకు మాత్రమే! శ్రీవారి దృష్టిలో సామాన్య ప్రజలు తను చెప్పిన కార్యక్రమములు తు.చ తప్పక పాటించుటకు - చరఖా వడకుటకు, విదేశీవస్త్రాలను తగలబెట్టుటకు,ఇంగ్లీషు వారి తరపున యుధ్ధములలో పాల్గొని చచ్చుటకు మాత్రమే వుండిరి!
మనది వ్యవసాయ ప్రధానమయిన దేశం. ప్రతి వ్యక్తికీ భూమితో అనుబంధం యెక్కువ. భూమితో అనుబంధం వున్న మనిషి యెక్కడున్నా ఒక్కలాగే వుంటాడు. అందరి కష్టాలూ కన్నీళ్ళూ ఒక్కలాగే వుంటాయి. మన ధార్మిక జీవనంలో వున్న తీర్ధయాత్రలూ, పుష్కరాలూ మనుషులు కలుస్తూ వుండేలా చేస్తూనే వున్నాయి. కొన్ని శతాబ్దాలకు ముందు నుంచే ఈ దేశ ప్రజలు వేషభాషలూ ఆచార వ్యవహారాలూ వేరయినా ఆసేతు శీతనగం ఒకే రకమయిన సంస్కారంలోనే వుండి ఐకమత్యంగానే వున్నారు. ఇంతకు ముందే వున్నదాన్ని ఇతను కొత్తగా పరిచయం చేశాడని అనటం గురువుకి శిష్యుడు పాఠాలు నేర్పినట్టు వుంటుంది!
అసలు గాంధీ చెప్పింది సామాన్య ప్రజలకు అర్ధమే కాలేదు! ఈయన గారి పొంతన లేని అసమన్వయ సుత్తిని జనాలకి అర్ధ మయ్యెటట్టు చెప్పలేక పల్లెటూళ్ళలో తిరిగే కాంగ్రెసు కార్యకర్తలు "భారతీయులంతా కలిసి ఒక్కసారిగా వుమ్మేస్తే ఆ ప్రవాహంలో ఇంగ్లీషు వాళ్ళంతా లండన్ దాకా కొట్టుకు పోతారు" అనే జోకుల్తో అలరిస్తూ వుండేవాళ్ళు! అహింసాయుత పోరాతం లాంటి గంభీరమయిన విషయా లన్నీ చదువుకున్న వాళ్లే పత్రికల్లో చూసి తెలుసుకునే వాళ్ళు. ఇతను చెప్పిన గంభీరమయిన విషయాలు సైతం కాంగ్రెసు కార్యకర్తలకే యెక్కలేదు, ఇంక సామాన్య ప్రజలకి అర్ధమయి యెలా అనుసరిస్తారు? అతను చెప్పిందంతా బుర్రలోకి యెక్కి అతని మీద నమ్మకమే వుంటే సుభాష్ చంద్ర బోసు పట్టాభి మీద అంత మెజార్టీతో యెలా గెలుస్తాడు? పైగా అక్కడ గాంధీ మొహం మీద పేలింది కింది నుంచి పైదాకా అంతరువులు అంతరువులుగా ప్రతినిధుల్ని యెన్నుకుంటూ వొచ్చిన అంతర్గత ప్రజాస్వామ్యమనే ఢాంబు! ఆ దెబ్బకి "నా బఠానీ వోడింది, నేనూ వోడినట్టే" అని చెప్పి కూడు మానేసి ముసుగు దన్ని పడుకున్నాడు. ముసలాడు చస్తాడని జాలిపడి కొందరూ, నిజంగానే బోసు గెలుపు నచ్చక కొందరూ మొత్తానికి బోసు గారిని గాంధీ గారి సహాయ నిరాకరణ మనే ఆయుధంతోనే బలవంతంగా రిజైను చేసి వెళ్ళిపోయేలా చేశారు. సాటి దేశభక్తుడి మీద ప్రయోగించినంత తీవ్రంగా ఇంగ్లీషు వాళ్ల మీద ప్రయోగించి వుంటే మనకి స్వతంత్రం ఇంకా చాలా ముందే వొచ్చి వుండేది! సరే, బోసుగారు రిజైన్ చెయ్యగానే తన బఠానీ గెలిచేసినట్టు మమ చెప్పేసుకుని తను కూడా ముసుగు తీసేసి మళ్ళీ రంగం లోకి దిగాడు.
ఈ నిరాహార దీక్ష అనేది ఇవ్వాళ ప్రతివాడూ తనకి జరిగిన అన్యయానికి నిరసన తెల్పడానికి వాడుకుంటూ అది గాంధీ ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రమని అనుకుంటున్నాడు గానీ అతను మాత్రం చరఖా వడక మనటం, విదేశీ వస్త్రాలని తగల బెట్ట మనటం, వుప్పు తయారు చెయ్య మనటం తప్ప ప్రజలకి నిరాహార దీక్ష గురించి పొరపాటున కూడా వుప్పుదేశించ లేదు!? దాన్ని ఇట్లా పార్టీలో తన మాట చెల్లుబడి కానప్పుడు బ్లాక్ మెయిలింగుకి మాత్రమే వాడుకునే వాడు!! సమిష్టి కార్యాచరణ జరుగుతున్న చోట యెదటి వాళ్లని బలమయిన వాదనతో గెలిచి వొప్పించి తన మాటకి కట్టుబడి నడుచుకునే లాగ చెయ్యటం, యెవరయినా తనకన్నా బలమయిన వాదన చేసి మెప్పిస్తే తను కూడా అతన్నే అనుసరించటం ప్రజాస్వామ్య స్పూర్తి గల నాయకుడి లక్షణం. దానికి విరుధ్ధంగా తన పాయింటు బలమయినది కాకపోయినా ఇతర కారణాలతో వొత్తిడి పెట్టి అందరూ తననే అనుసరించేలా చెయ్యటం అనేది నియంతృత్వం అయితే అది హిట్లర్ ఆక్టివ్ గా చేశాడు, గాంధీ పాసివ్ గా చేశాడు, అయినా మనం హిట్లర్నే నియంత అంటున్నాం గానీ గాంధీని అనలేక పోతున్నాం, యెందుకని?
గాంధీ దక్షిణాఫ్రికాలో వుండగా బోయెరు యుధ్ధంలో పాల్గొన్నప్పుడూ ఇండియాలో మొదటి ప్రపంచ యుధ్ధంలో పాల్గొన్నప్పుదూ వాళ్లని యుధ్ధానంతరం కొన్ని సౌకర్యాలు అడిగాడు.యుధ్ధం ముగిశాక వాళ్ళు మాట తప్పేసి వాటికి తూచ్చి చెప్పినప్పుదు కనీసపు ప్రతిఘటన కూడా చెయ్యలేదు, యెందుకు? అసలు అడిగినవి కాదనడం కాదు - ఇచ్చిన మాట తప్పినందు కయినా నిలదీయాలి గదా! మనిషి శారీరకారోగ్యానికి సంబంధించిన రక్తలేమి వ్యాధి లాగా మానసికారోగ్యానికి సంబంధించిన క్షాత్రలేమి వ్యాధి పీడితు డితను! దానికి అంటువ్యాధి లక్షణాలు కూడా వున్నాయేమో ఇతరుల్లో మానసికంగా రోగ నిరోధక శక్తి తక్కువగా వుండి బౌధ్ధిక అలసత్వం యెక్కువగా వున్న వాళ్లందరికీ అంటించి పారేశాడు! ముఖ్యంగా ప్రజల్లో అంతకు ముందు వున్న క్షాత్రాన్ని చంపేసి దేబె మొహాల్లాగా తయారు చేశాడు. ఒకప్పుడు తమకు కష్టాలు కలిగించినందుకు నిరంకుశంగా వున్న రాజుల పైనే తిరుగుబాటు చేసి రాజ్యాల్నే తల్లకిందులు చేసిన వాళ్ళు ఇవ్వాళ తమ చుట్టూ ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా స్తబ్దుగా వుండటం, లేదంటే గుడారాలు పాతుకుని దండలు మెడలో వేసుకుని యేడుపు మొహాలతో మూలుగుతూ కాలం గడపటం చేస్తున్నారు కానీ, వీటివల్ల వీళ్ళంతా సాధిస్తున్న దేమిటి?
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఇతనెప్పుడూ గడగడ లాడించనే లేదు! వీళ్ళు గొడవలు చెయ్యటం, వాళ్ళు అణిచి వెయ్యటం, మరీ గొడవ యెక్కువయితే గుండ్రబల్ల ముచ్చట్లకి లండన్ పిలవటం, వీళ్ళేం మాత్లాడే వాళ్ళో వాళ్లేం మాట్లాడే వాళ్ళో గానీ ఆఖరికి వీళ్ళ డిమాండ్లని వొప్పుకోకుండానే వెనక్కి పంపించెయ్యటం లాంటి హడావిడే జరిగింది తప్ప ఇక్కణ్నించి వెళ్ళిపోవాలనే వూపు మాత్రం వాళ్లలో కలిగించలేకపోయారు. ఇంకా నేను చదివిన విషయం ప్రకారం, "గాంధీ మాట రాజకీయ రంగంలో చెల్లుబడి అవుతున్నంత కాలం మనం భారత్ నుంచి వైదొలగడానికి తొందర పడటం అనవసరం" అనే అభిప్రాయంలో వుండే వాళ్ళు?ఇంగ్లీషు వాళ్లని నిజంగా భయపెట్టి తరిమేసిన ఒక నాటకీయమయిన అద్భుతం 1946లో జరిగింది.అది జరిగిన సంవత్సరం లోగా మనకి స్వతంత్రం ఇచ్చేసి ఆ గడువు దాటాక ఒక్క రోజు కూడా ఇక్కద వుండకూడదని ఆ రోజుకన్నా ముందే పిట్ట పురుగు కూడా లేకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే దాని పవరేమిటో అర్ధం చేసుకోవచ్చు!
అదే నావికుల తిరుగుబాటు! ఫిబ్రవరి 18న నిప్పురవ్వ ఆహారం, మరియు సాధారణ మయిన అసౌకర్యాలకు సంబంధించిన సమ్మెగా రాజుకున్నా ప్రచండ వేగంతో విరుచుకు పడి అరణ్యాన్నంతా చుట్టెయ్యగలిగిన దావానలం లాగా మొత్తం దేశాన్నంతటినీ కదిలించింది! ప్రారబ్దం యేమిటంటే మన వాళ్ళకి దీని ప్రాముఖ్యత తెలియక పటేల్ లాంటి వాళ్ళు యెప్పుడో విప్పేసిన నల్లకోట్లు మళ్ళీ తొడిగి వాళ్ళ కేసుని వాదించారు అనే చిన్న వివరం తప్ప యెక్కువగా చెప్పలేదు. కానీ ఇంగ్లీషు వాళ్ల వైపు నుంచి చూస్తే గానీ దాని ప్రాధాన్యత తెలియదు. వలస రాజ్యాల్ని తమ పట్తులో వుంచుకోవటానికీ, తిరుగుబాట్లనై అణిచివెయ్యటానికి సైన్యాన్ని కదిలించటానికీ అతి ముఖ్యమైనది నౌకా దళం! అక్కడ తిరుగుబాటు జరగట మంటే ఆయువుపట్టు మీద దెబ్బ తగలటమే!
కమ్యునిష్టులు అతిగా వుత్సాహ పరచటం వల్ల దీనికి ప్రాధాన్యత ఇస్తే వాళ్లని పెంచినట్టు అవుతుందనే కారణం కావచ్చు గానీ కాంగ్రెసు మొదట చూపించినంత వుత్సాహం చూపించ లేదు. మార్చ్ 3 స్టేట్మెంట్ ప్రకార మయితే గాంధీ దాన్ని తీవ్రంగా విమర్శించేశాడు కూడాను!? వాళ్ళకి గనక సరయిన నాయకత్వం దొరికి వుంటే ఈ దేశం అఖండం గానే స్వాతంత్ర్యాన్ని సిధ్ధింప జేసుకుని వుండేదేమో ననిపిస్తుంది, యెందుకంటే ఆశ్చర్యకరంగా ముస్లిములు కూడా నావికా పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని వ్యక్తం చేసారు!
నాదో చిన్న అనుమానం! అంత పిరికిగా వ్యతిరేకత వచ్చిన రెండేళ్లలోనే అదిరి పడి పారిపోయిన వాళ్ళు, అదీ ఈ దేశజనభాలో 5% మించని వాళ్ళూ అన్నేళ్ళ పాటు అంత మొండిగా అన్ని దుర్మార్గాలు యెట్లా చెయ్యగలిగారు?పైస్థాయిలో వున్న మనుజేశ్వరాధములు అరాచకం పేరుతో హడావుడి చేసి పోలీసుల్నీ సైన్యాన్నీ ఇంగ్లీషువాళ్ళ పేరు మీద పంపిస్తే ఈ బానిసాధముడి నట్టువాంగం మేజువాణీ గాళ్ళు ఆ పోలీసుల్ని ఇంగ్లీషు వాళ్ళ దౌష్ట్యానికి చిహ్నంగా చూపించి డబుల్ గేము యేదయినా అడారా?వాళ్ళూ వీళ్ళూ యేం చేసినా మరో నరమానవుడికి తెలియకుండా చేశా మనుకున్నారు గానీ పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడు యెవరి కేది వెయ్యాలో అది వేసేశాడు! ఒకనాడు తమది రవి అస్తమించని సామ్రాజ్యం అని మిడిసి పడిన వాళ్ళు ఇవ్వాళ యెక్కడ వుదయిస్తున్నాడో తెలియని అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు! ఒకనాడు ఈ దేశాన్ని పరిపాలించే అర్హత తమకే వుందని విర్రవీగిన వాళ్ళు ఇవ్వాళ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక పోయి - కన్నీరు మున్నెరుగా విలపిస్తూ యెక్కే గడపా దిగే గడపా అన్నట్టు అందరినీ దేబిరిస్తూ - నాలాంటి వాళ్లకు మహదానందాన్ని కలిగిస్తున్నారు! పాపపుణ్యాలు తమ ఫలితాల్ని తప్పక చూపిస్తాయి - అది యెరిగిన వాళ్ళు వినయంగా వుండి ప్రజామోదాన్ని పొందుతారు,యెరగని వాళ్ళు ఇవ్వాళ కాంగ్రెసుకు పట్టిన అధికారాంత మందు జూడవలె గదా అయ్యల సౌభాగ్యము లనే దుస్థితిని అనుభవిస్తారు!
ఇతరేతర కారణాలతో సిద్ధించినా ఫలితాన్ని మాత్రం గాంధీ నేతృత్వం లోని కాంగ్రెసు పార్టీకి దఖలు పరుస్తూ 1947 ఆగస్ట్ 15న భారత్ దేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించదంతో భారత రాజకీయ చరిత్రలో మోహన్ దాస్ కరం చంద్ గాంధీ యొక్క చారిత్రక ప్రాధాన్యత ముగిసి పోయింది. మరో నాటకీయమయిన సన్నివేశంలో గాడ్సే అనే పుణ్యాత్ముడు గాంధీని భౌతికంగా గూడా ఈ ప్రపంచం నుంచి పంపించి వేశాడు! ఒక పాత్ర ముగియగానే మరొక పాత్ర రావాల్సిన నాటక రంగ సాంప్రదాయం ప్రకారం భారత రాజకీయ రంగాన్ని శాసించేందుకు మరొక సామ్రాట్టు ఆవిర్భవించాడు! అతని కంటె ఘనుడు అతని శిష్యుడు అన్నట్టు గురువు గారి కిష్టమయిన పన్లేవీ చేయక పోయినా గురువుగారు చెప్పని వాట్ని కూడా గురువు పేరుతోనే ఝణాయించుకోగలిగిన ఆషాఢభూతి వంటి జవర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధానిగా రంగ ప్రవేశం చేశాడు!
గాంధీ చేసిన అసలు మాజిక్ ప్రజలకి తాము సరికొత్త ప్రజాస్వామ్యబధ్ధమయిన రాజకీయ వ్యవస్థలో వున్నట్టు భ్రమింప జేస్తూనే పాతకాలపు రాజస్వామ్యాన్నే పార్టీ అద్యక్షుల కుటుంబస్వామ్యం రూపంలో కనిపిస్తూనే వున్నా అది సహజమే నన్నట్టుగా ఆలోచించేలాగా ప్రజల మైండ్సెట్ ని మార్చటం! చరిత్ర కందని కాలం నుంచీ ఈ దేశంలోని మనుజేస్వరాధములు యెన్ని శతాబ్దాల పాటు ప్రయత్నించినా చెయ్యలేని దానిని కేవలం పాతికేళ్ళలో చేసి చూపించాడు! అందుకేనేమో ఇతన్ని దైవాంశ సభూతుడి గానూ అవతార పురుషుడి గానూ వాళ్ళు కీర్తిస్తున్నది!
మోహన్ దాస్ కరం చంద్ గాంధీ అనబడే ఈ వ్యక్తి యొక్క గందరగోళపు భావజాలం నుంచి పూర్తిగా బయట పడిన క్షణం ఉంచే సత్యధర్మన్యాయ ప్రతిష్ఠితమైన వ్యాస పరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం వున్న మన గురు పరంపర నిండు మనస్సుతో హర్షించే నిజమయిన ప్రస్ఠాన యాత్రలో భారత దేశం తొలి అడుగు వేస్తుంది!
ఒకడేమిటో వాడి చావు చెబుతుందంటారు, ఈ అహింసావాది బుల్లెట్ తో చచ్చాడు!?
______________________________________________________
బ్రిటీషు వారు ఊరూరా చేరి ఈ దేశాన్ని పాలించలేదు అనీ .... ఆ బ్రిటీషు వారికి సహకరించిన ద్రోహులు మన దేశం వారేననీ చరిత్ర చదివేవారికి ఇట్టే అర్థం అవుతుంది ....
ReplyDeleteఆ ద్రోహులు నేటికీ రాజకీయం పేరుతో మనగలుగుతున్నారు ... అదే పార్టీకి సహకరిస్తున్నారు ... అదే యూరోపు ని మేపుతున్నారు ...
ఇటలి ఆర్థిక సంక్షొభం లో ఇరుక్కుంటే అగస్టా వెస్ట్లాండ్ ఒప్పందం తో సహకరించి దేశభక్తి చాటుకున్న రాజమాత ..... ఆ పనిని తేలిక గా చేసింది ఆనాటి ద్రోహుల వారసులే.
ఇప్పటికీ నా తరం వాళ్ళకి బానిస భావజాలాన్ని అందిస్తూ ధనం గడిస్తున్నది నేటి మీడియా.
ఆంగ్ల మీడియా చానళ్ళు అన్నీ యురప్ ... యు.ఎస్ లో మూలాలుంటే దెశీయ చనెళ్ళు అన్నీ కంగీల చేతిలో ఉన్నాయి.
ఇక నా తరానికి నిజం తెలియటం గగనమే ... అయినా మీ బ్లాగు ద్వారా ఈ విషయాలు తెల్వటం నా అదృష్టం.
కృతఙతలు.
గాంధీ గురించి చాలా చక్కగా వివరించారు.
ReplyDeleteGood narration and interesting
ReplyDeletethanks for praising about narration.I tried a lot to be stylish and I think I got success by your comment!
DeleteGood eye opener from a different perspective Hari Babu - Talpasai
ReplyDeleteకేవలం గాంధీని మాత్రమే మాహాత్ముడిగా చిత్రీకరించడం కాకుండా మరో కోణంలో మీరు వ్రాసిన విషయాలు పరిశీలించాల్సినవి కొన్ని ఉన్నాయి. మొత్తం టార్గెట్ మాత్రం గాంధీ వ్యతిరేకతతో వ్రాసినట్లున్నారు. మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. గాంధీ పేరుతో కాంగ్రెస్ అరాచకాలు సాగిస్తున్నమాటా వాస్తవం. మిగతా చరిత్రను తక్కువ చేసి చూపినమాటా వాస్తవం. మీ వ్యాసంతో సంపూర్ణంగా ఏకీభవించకపోయినా చాలామంది తెలుసుకోవలసిన కనీసం ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి.
ReplyDeleteవ్యక్తిగత కారణాలతో వ్యతిరేకిస్తే ద్వేషం నవచ్చు, కానీ నాకు వ్యక్తిగతంగా అతనైపైన ద్వేషం యెందుకు?నా ఆస్తి యేమయినా దోచుకున్నాడా?లేదే!సిధ్ధానత్ పరంగా గాంధీ మార్గం ఫెయిల్డ్!!ఆఖరిలో డూ ఆర్ డై అని తనే అన్నాడు - డై అనేది అర్ధ మయిన వాడు ఇంకొంచెం ముందుకెళితే కిల్ అనేది కూడా బుర్రలోకి వస్తుంది కదా, అది ఒక్కటే నేను ఇక్కడ ప్రస్తావించనిది.
Deleteమీ వ్యాసం చాలా విశ్లేషణాత్మకంగా వుంది. కొన్నేళ్ళ క్రితం వరకు, అజ్ఞానంతో, కాంగ్రెస్ పార్టీ పట్ల కొంచెం మొత్తంలో సానుభూతి ఎక్కువగానే ఉండేది నాకు. కానీ ఆ పార్టీ దేశ వ్యవస్థలను ఒక్కొక్కటిగా భ్రష్టు పట్టిస్తున్న వైనాన్ని, స్వలాభం తరువాతే దేశమైనా ఏదైనా అన్నచందాన ప్రవర్తించడం అర్ధం చేసుకోవడం మొదలైనప్పటి నుంచీ కంటి పొరలు తొలగడం మొదలైంది. నాకు నిజానికి చారిత్రక విషయాల్లో పెద్దగా విజ్ఞానం లేకున్నప్పటికీ జరుగుతున్న చరిత్ర కావాల్సిన జ్ఞానాన్నిస్తోంది. దేశ దౌర్భాగ్యానికి గాంధీ నెహ్రూలే మొదటి బీజాలు వేశారని ప్రస్తుతం నమ్ముతున్న వాళ్ళలో నేను కూడా ... మీతోటే ...
ReplyDelete