Monday, 25 August 2014

యేందీ తెలంగాణా కాంగ్రెసోళ్ళ చిలుకుడు పండగ?నాకేందో కెలకనీకి హుషారు గున్నది!

(హలొ.. హలొ ..మైక్ టెస్టింగ్,మైక్ టెస్టింగ్.వ్యాఖాతలకు ఒక మనవి, ఈ వొక్క పోష్టును మాత్రం నేను ఆంధ్రోణ్ణి గాకుండ ఒక తెలంగాణోడిగా వేస్తున్నా!కొసాకి ౘదివితే బుర్రలో దీపం వెలుగుతుంది యెందుకట్లా చేసానో?)       
              తెలుగుని తెలుగులాగ వుంచకుండ సంస్కృతంతోనో ఇంగ్లీషుతోనో సంకరం జేసెటొళ్ళంటె నాకు మా సెడ్డ సిరాకు!రెండుగ చీలింది భూమే గద, భాష గాదు గద.మొత్తం 23 జిల్లాలల్ల బహు చక్కని తెలుగుండె, ముచ్చట పడి కాలికి బలపం గట్టుకుని తిరిగి అన్నీ నేరుస్తనంటె వొద్దని యెవడయిన అంటడా?అది గాకుంటె వున్న వూర్ల నేర్చుకున్న  సొంత బాస వుండె గద!

         గదేందో కాంగ్రెసోళ్ళు దొంగలు బడ్డ ఆర్నెల్లకు మొరిగే కుక్కల మాదిరి "తెలంగాణా ఇచ్చినా మనం తెలంగాణలో యెందుకు గెల్వలేదు" అని తేల్చుకొనుడు గిప్పుడు షురూ జేసిన్రు. దానికి "మేధో మధనం" అని సంస్కృతంల పేరు బెట్తిన్రు.గింత చిన్న దానిగ్గూడ సంస్కృతం గలిస్తె గాని యవ్వారం తిన్నగ నడ్వదా ఈళ్ళకి?అచ్చ తెలుగుల "తలల చిలుకుడు" అంటే అందరికీ అర్ధమయితలేదా,  జర చెప్పున్రి?

           అయిపోయిన పెళ్లికి బాజాలు యెందు కన్న సంగతి గూడ యెర్క లేనోళ్ళు దేనికి పనికొస్తరు బై?వూరందరికి దెల్సి పాయె, నవ్వనోడు వుంటె పాపమన్నట్టు దేన్ని బడితె దాన్ని తిట్టుడే దప్ప జోకులెయ్యని కంచె అయిలయ్య మేష్టారు గూడ జోకులేసిండె - ఈళ్లకి మాత్రం దెలియక పాయె!?

         యెన్నికల సందట్లోనే మన దొర దేశానికి సొతంత్రం దెచ్చుకొనుడులో తెచ్చిన గాంధీ గొప్పోడా?ఇచ్చిన ఇంగ్లీషోడు గొప్పోడా అని ఇరగనూకిండు గద, అది గూడ యెక్కలేదా ఈ కోడి మెదడు సన్నాసులకి?!సోనియ గాంధి యెన్నో కష్టనష్టాల కోర్చి ఇచ్చిందంట, వార్ని మనకి దెల్వనట్టు?అయిదేండ్ల క్రితం యెన్నికల్ల తెలంగాణా ఇస్తనని చెప్పి పవర్ దక్కించుకుని నాలుగేండ్ల పదకొండు నెల్లు యేడిపించి ఇచ్చుడు మనమీద గారాబం కొద్దీ ఇచ్చినట్టా?ఒకేపున సెంటరోళ్ళు ఇస్తమని హడావుడీ జేస్తంటె వాళ్ళే కిరికిరిగాణ్ణొకణ్ణి ఈడ కుర్సీల బెట్టి యెంత లొల్లి జేయించిన్రు వాని తోని?యెన్నిసార్లు యేందివయా ఇది, మీ వోడే నఖరాలు జేస్తండని అడిగినా మావోడు మంచోడు మామిడి కాయంత దొడ్డోడు అని అనిందెవరు, ఈళ్ళు గాదట్నా? ఈ ఇచ్చుడు గూడ ఆంధ్రోళ్లతో గూడి నాటకమాడి మనకి ద్రోహమే జేసింది గద!

          అన్నా ఒకటి జెప్త ఇనుకో, కాంగ్రెసు అంత మాదచ్చేదు పార్టీ ఇంగొకటి లేదీ బూమ్మీద,యెవళ్ల సంగతో మనకేల?గారోజున తెలంగాణను బలవంతంగా ఆంధ్రోళ్ళతో గలిపిన పాపమూ దానిదే,అందుకోసరమని పెద్దమనుషుల ఒప్పందం అనే కంటితుడుపు మేళం ఒకటి యేర్పాటు జేసిందీ ఆ పార్టీయే, ఆ బల్లకి అటూ ఇటూ గూడ కాంగ్రెసోళ్ళే గూసోని దస్తర్ల మీద ముద్దర్లు గుద్దిందీ ఆళ్ళే, ఆ ఒప్పందాన్ని తుంగలో దొక్కి మన మీదెక్కి తొక్కిందీ  ఆ పార్టీయే గద?యెంటీ ఆర్ వొచ్చెదనుక ఆంధ్రాలో హవా అంతా ఆ పార్టీదే గద, యేం పీకింది బై?ఆంధ్రా రెడ్లూ ఆంధ్రా కమ్మోళ్ళూ ముఠాలు గట్టి రాష్ట్రం మొత్తాన్ని ఆళ్ళ సంక కింద నుంచి బయటికి రానీకపాయె?!ఒకడేమో వాని పెండ్లాం పక్కోనితో లేచిపోయినా దుఃఖ పడడు గానీ పదవి లోంచి పీకేస్తే చాలు చెవిగోసిన మేకలాగ అరెచెటోడు!మిగతోళ్ళు రాష్ట్రాన్ని  పంచుకొనుడు దంచుకొనుడు అంతా సొంత యవ్వారమల్లె ఆళ్ళలో ఆళ్ళు జేస్కుంట మనకి సందే ఇవ్వకపోతె మనకు మండదా?

           మండి యేమడిగినం? మీతోనీ మీ కరప్షన్ తోనీ మాకు విసుగెత్తి పోయింది, మాది మాకు పారెయ్యమంటిమి?అంతా శ్రీ వైష్ణవులే మరి బుట్టెడు చేపలూ యేమాయె నన్నట్టు అందరూ లేఖలిచ్చిన్రు - తెలంగాణా ఇస్తె మాకు ఫికర్ లేదని.అయినా నాలుగేండ్ల పదకొండు నెల్లు దేనికి సాగలాగినట్టు?సెంటర్లోనూ స్టేట్లోనూ వాళ్ళే వుండి ఇంత దరిద్రంగా విభజన జేసి మనకి చెడ్డపేరు దెచ్చిన పరమ నికృష్టమయిన పార్టీకి అసల్కి మొన్న యిన్ని వోట్లు యెలాగ పడినై బై?మన రాష్ట్రం మనకి ఇమ్మని అడిగినమే గాని ఇంత దరిద్రంగ ఇమ్మన్నమా?నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించినట్టు ఇచ్చిందన్నా కాంగ్రెసు తెలంగాణా  మనకి!ఆంధ్రోళ్ళ సమైక్యం హడావుడి చూసీ విడిపోతే చస్తామన్న శోకాలకి మతి పోయీ మన బోలాశంకరుడు గూడ మాకు తెలంగాణా ఇస్తె చాలు ఆంధ్రోళ్లకి యేమిస్తరో మీ ఇష్టం అనేసిండు!?అటు ఆంధ్రోళ్లని సమైక్యమని రెచ్చగొట్టి ఆఖరి మినిట్ వరకూ వస్తదా రాదా అని కంగారు పెట్టి తరుగు రెవెన్యూ పేర్న, రాజధాని పేర్న పాకేజీలు ఆళ్లకీ ఖాళీ పళ్ళెం  లాంటి వుత్త తెలంగాణా మనకీ  ఇచ్చిన్రు, సమజైందా?!ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళే, హమ్మో?!

         మాటిమాటికీ కేసీఆర్ విలీనం ప్రపోజల్ బెట్టిండు అంటరు, తప్పేందీ అంట!అవస్ర పడి వసుదేవు డంతటోడు గాడిద కాళ్ళు బట్టిండు,యేమాయె?కేసీఆర్ పట్టింది ఈ గాడిదలనె గద,యెట్లుండె రిటార్టు?వీండ్లు కష్టనష్టాల కోర్చిందీ అనే సొనియకు మొదట్నె తెలంగాణా అంటె సానుభూతి వుంటె విలీనం అనక ముందే ఇచ్చి వుండును గద! అది పచ్చ మీడియాయే గావొచ్చు, కెలకడానికే గావొచ్చు - యెన్ని సార్లు యెందు కిస్తున్నరు తెలంగాణా అంటె ఒక్క సారయినా తెలంగాణా ప్రజల కోరిక మేరకు అనకపోయె, అన్ని సార్లూ విలీనం జేస్తనన్నడు, మాకు ముఫయ్ సీట్లు రప్పిస్తనన్నడు - ఇదే గోల జేసి మాకు మేము ఆ ముఫయ్ సీట్లు గూడ దెచ్చుకోలేని యెదవలం అని వొప్పుకున్నరు గద! ఇంగిప్పుడు ఈ చిలుకుడులో కొత్తగ దేల్చే పరమ సత్య మేముంటది - బూదిలో కెలుకుడు ఇంత కన్న నయం గాద!

     అయినా ఒక కుటుంబానికి కట్టుబానిసలల్లె బతికెటోళ్ళు వీళ్లకి రాజ్యమూ అధికారమూ యేలన్నా?సొంత రాష్ట్రాల్లో దిక్కూ దివాణం లేని చిదంబరం, షిండే లాంటి కూర్పాసం గాళ్ళు కోటరీలో జేరి యెంత హవా వెలగబెట్టిన్రు, మరి నలబై రెండుకి నలభై ఒకటి వొచ్చిన్నాడు కేంద్రంలో యేమాత్రం చక్రం దిప్పిన్రు ఈ పోటుగాళ్ళు?పోరాడి గెలుస్తరంట, గెలిచి మళ్ళ పవర్లో కొస్తరంట, దేనికో?మొదటి మూల స్తంభం దగ్గిర్నుంచి ఆఖరి మూలస్తంభం వరకూ బెట్టిన కుంపట్లు జాలవనా?కొత్త కుంపట్లు రగిలించాలనా?మొదటి మూలస్తంభం నెహ్రూ ఒక్కడు యెన్ని కుంపట్లు బెట్టిండు?మొదటి కుంపటి కష్మీరే ఇంకా ఆరకుండె!హైదరాబాదు యెన్నికల్లోనూ మెదక్కులోనూ పోటీ జేస్తరు గాబోలు, ఒకే ఒక్కటి అదగాలె - లోక్ సభ యెన్నికల కయితే పవరిస్తం గానీ కష్మీరు కుంపటి ఒక్కటి ఆర్పి చూపించమని అడగాలె,అసెంబ్లీ యెన్నికల కయితే తెలంగాణాకు పాకేజీ లెందుకు ఇవ్వలేదని అడగాలె..

నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించిన మీకు తెలంగానోళ్ళ వోట్లు గావాల్నా?
మీరే బానిసలు!బానిసలకు అధికార మేలరా మాదచ్చోదు ల్లారా?

16 comments:

  1. మేధోమధనం ...
    కరెక్ట్ గానే పెట్టారు పేరు ...

    అందుకే వీ హెచ్ గారు కార్యకర్తలు అభిప్రాయాలు చెప్పుకోవడానికి అవకాశమివ్వాలని సూచించినా డిగ్గీ రాజు గారు బానిసలకంతటి అవకాశమా పొండు పొండని చీత్కరించి, వాళ్ళు మేధావులు కేటగిరిలోకి రారు గనుక మేధోమధనానికి ససేమిరా పనికిరారని, కుదరదని తేల్చి చెప్పి తమ పార్టీ యొక్క రాచరికత్వాన్ని మరువక ప్రదర్శించారు. మళ్ళీ ఈయన వెనుక పట్టాభిషేకపు పావుకోళ్లు విడవని నిద్రమత్తు యువరాజా వారు 'సద్భావనా యాత్ర' కొస్తున్నారహోయ్ ... బహు పరాక్ ...
    భజన సంఘం, కోలాటం బాచ్ రెడీ గా ఉండండి. మీకంతవరకే అవకాశం ...
    డప్పులు వగైరాలతో సిద్ధంగా ఉండండి ...

    ReplyDelete
    Replies
    1. స్పందనకు కృతజ్ఞతలు!ఆ యువరాజె యెక్కద కాలు పెడితే అక్కడ శత్రువుల కన్నా అతివేగంగా కాంగ్రెసుని ముంచేస్తున్నాడు.అయినా వీళ్ళకి తెలియదం లేదు?

      Delete
  2. బ్రహ్మాండంగా రాసావు బ్రదర్. నిఖార్సైన తెలంగాణావాదుల బుర్రల్లోకి దూరి వ్రాసినట్లుంది. 25 సంవత్సరాల పాటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో అధికారంలోనికి రాకూడదు ఇటువంటి వాళ్ళు.

    ReplyDelete
    Replies
    1. ఇప్ప్పుడే కాదండి, వుద్యమం నడిచే రోజుల్లోనే చెప్పాను, బ్రదర్స్, మీకు మొదటి ఆఖరి శత్రువు కాంగ్రెస్సే, మీ ఇదీరకటి సమస్యలకీ కారణం, అతిగా అంట కాగితే ముందు ముందు మీకు వచ్చే సమస్యలకీ కాంగ్రెసే కారణ మవుతుంది అని.యెవరూ పట్తించుకోలేదు, యేం చేస్తాం?

      Delete
    2. మీరు పొరబడ్డారు. మన కోసం కాకుండా ఆంద్ర ప్రయోజనాల కోసం నిలబడిందనే విషయం వల్లే మనకు కాంగెస్ వారిపై వైరం. అదే వైఖరి ఉన్న మిగిలిన పార్టీలకు కాంగెస్ పార్టీకి తేడా ఏమీ లేదు.

      తెలంగాణా కోసమే ఆలోచించే నాయకత్వం ఎదగకుండా, ఆంద్ర నాయకుల మోచేతి నీళ్ళు తాగే వ్యక్తులు మాత్రమె ఏలుతున్న పార్టీలకు సమీప భవిష్యత్తులో గద్దె ఎక్కే అవకాశం రాదు.

      Delete
  3. తెలంగాణా భాషలో రాయాలన్న ప్రయోగం బాగానే ఉంది. ఆంధ్రులకు మామూలుగా తెలంగాణా భాషలో తెలిసిన ఉర్దూ పదాలు & "గిప్పుడు" లాంటివి బాగానే పడ్డాయి.

    తెలంగాణా అచ్చ తెలుగు పదాలు ఇంకొన్ని వాడుంటే బాగుండేది. అనేక సార్లు అవకాశం (ఉ. సిరాకు బదులు వ్యాష్ట, మాదిరి బదులు లక్క వగైరా) వచ్చినా వినియోగించలేదు.

    శ్రమ పడ్డారు, మొత్తానికి ఫలితం ఫరవాలేదు.

    ఒక బూతు మాట రెండు సార్లు దొర్లింది, తొలగిస్తే సంతోషం.

    ReplyDelete
    Replies
    1. అయ్యా, ఈ వొక్క పోష్తు కోసం నేను సరదాగా ట్రై చేసాను!ఇంతకన్నా యెక్కువ వెళ్ళే వుద్దేశం లేదు!!
      >>
      ఒక బూతు మాట రెండు సార్లు దొర్లింది
      ? 8=<)
      చచ్చింది గొర్రె?!నేను బూతులు రాయదమా?ఆ భయంతోనే మరీ లోపలకి వెళ్ళలేదు, అయినా సెడ్దపేరు రానే వొచ్చింది.

      Delete
    2. తెలంగాణా భాషలో రాయాలన్న ప్రయోగం బాగానే ఉంది.
      ----------
      తెలంగాణా లో మెజారిటీ మాట్లాడే భాష తెలుగు కాదా? తెలంగాణా భాషా? అర్జెంట్ గా దానికి కూడా ప్రాచీన హోదా కోసం దొర గారు డిమాండ్ చేయాలని కోరుతున్నాం అద్యక్షా!!!

      ఆ భయంతోనే మరీ లోపలకి వెళ్ళలేదు, అయినా సెడ్దపేరు రానే వొచ్చింది.
      ----------------
      కాలెట్టాక, బురద అంటదా మరి :))

      Delete
    3. క్రిష్ణ క్రిష్ణా?!

      Delete
    4. Ardham kaaledaa saaruu....aabothumaata ...gade

      " maadachodu" .
      Nijaaniki deenni voothapadam gane thappa boothu ga lekka cheyyaddu.
      ........Ardham telisinaa vethakkandi.

      Delete
    5. అదా!అది బూతుమాట కాదు, కేవలం వూతపదమే.మదం లేక కొవ్వు బాగా పట్టిన వాణ్ణి అలా అంటారు.అయినా ఆ మాటని కాంగ్రెసోళ్ళకి గా వాడింది, వెనక్కి తీసుకోను!!

      Delete
  4. ఆర్యా,
    మేధోమధనం అంటే మేధావులు ఒకచోట చేరి సమస్యనెలా పరిష్కరించాలని చర్చించేదా లేక బఫూన్ గాళ్ళు ఒకచోట చేరి 'మనం మేధావులమెట్లగావాలె?' అని చర్చించేదా?

    ReplyDelete
    Replies
    1. ఆర్యా,
      మామూలుగా సంస్కృతానికి వున్న వ్యుత్పత్తి ప్రకారం మేధస్సుల్ని మధించదం - దాన్నే నేను తలల్ని చిలకడం అని తెనిగించాను.కానీ కాంగ్రెసోళ్ల తలల్ని చిలికితే అవినీతి, అసమర్ధత లాంటివే బయట పడతాయే తప్ప విలువైనవి బయట పదే అవకాశమే వుండదు.

      కాంగ్రెసు కున్న సమస్య - ఒక భూగోళ మంత పెద్ద వైరుధ్యం, చరిస్మా వున్న నాయకుడు లేకపోవటం.చరిస్మా వున్న నాయకుడు డిల్లీ మాట వినకపోవడం. రాజశెకర రెడ్డి కనీసం ప్రచారానికి కూదా తల్లీ కొడుకుల్ని పిలవలేదు యేనాడూ, చిన్న బుచ్చుకోరా మరి!.అంతా తనే అయి మోశాడు కాంగ్రెసుని.లోకల్ గా చరిస్మా వుంటే తప్ప రాష్ట్ర స్థాయిలో గెలవదు.చరిస్మా వున్న వాడు పైవాళ్ళ మాట వినడు.

      వాళ్లకి కావలసింది చరిస్మా వుండి కూడా పైవాళ్లకి జోహుకుం చెప్పే వినయశీలి.అటువంటి వాళ్ళు ఇవ్వాళ్టి రాజకీయ రంగంలో లేరు.యెక్కడో యెవడో నితీషూ లాలూ గెలిచినా సంబర పడి పోయే దుస్థితిలో వున్నారు ఇవ్వాళ వాళ్ళు?

      Delete
  5. "లోకల్ గా చరిస్మా వుంటే తప్ప రాష్ట్ర స్థాయిలో గెలవదు.చరిస్మా వున్న వాడు పైవాళ్ళ మాట వినడు"

    ఇదే విషయం అన్ని పార్టీలకు వర్తిస్తుంది. మోడీ బొమ్మ లేకుండా కనీసం కౌన్సిలర్ పదవికి పోటీ చేసే సత్తా లేని అరుణ్ జయీట్లీ, అమిత్ షా, ఆనందీబెన్ పటేల్, వెంకయ్య నాయుడు లాంటి వారు ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతారు. సొంత సామర్త్యం ఉన్న శివరాజ్ సింగ్, రమణ్ సింగ్ లాంటి వారు ఎప్పుడో ఒకప్పుడు ఎదురు తిరగొచ్చు కాబట్టి మోడీ వీరంటే జాగ్రత్తగా ఉంటున్నారు.

    తెలంగాణా విషయంలో చంద్రబాబు పరిసితి ఇంతే. అందుకే నెత్తి మీద రూపాయి పెడితే చారానా పలకని ఎర్రబల్లి రేవంత్ మోత్కుపల్లి లాంటి వాళ్ళను పెట్టుకొని సతమతవున్నాడు.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. 8=P)
      కాంగ్రెసు పరిస్తితి రాహుబాబు ఐరన్ లెగ్గు అవ్వడం వల్ల వచ్చింది.మిగతా పార్టీలకి ఆ ఖర్మ లేదు.పై స్థాయిలో సరయిన నాయకుదు లేని స్థితిలో వుంది కాంగ్రెసు మాత్రమే కదా!గాంక్రెసు కున్న సమస్యనే నేను సూటిగా చెప్పాను.మిగతా పార్టీలకి ఇంత దరిద్రం లేదు, వుంటే వాటి పరిస్తితీ ఇంతే.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...