Monday, 11 August 2014

యేక్ దిన్ కా సర్వే?బహుత్ అచ్చా!! పారా హుషార్!!!

       ఆ వొక్క రోజే? ఆ వొక్క రోజే! ఆ వొక్క రెజే?! త్వరన్ కదులుడు త్వరన్ కదలుడు ఇంటి కడనే నిలువుడు.బలే మంచి చౌక బేరము?!తెలంగాణా వాసులారా, ఆ వొక్కరోజూ శుభకార్యాలూ అశుభాలూ అన్నింటినీ వాయిదా వేసుకోండి!గుడి గోపురాలకూ దేమునికీ యముని మహిషానికీ కూడా ఆ రోజు శలవు రోజు!.తెలంగాణా సామ్రాట్టు ఆరోజు ప్రపంచ చరిత్రలోనే యెవ్వరూ చెయ్యని ఒక అధ్బుతాన్ని చెయ్యబోతున్నారు, సహకరించండి!!బలే మంచి చౌక బేరము!! ఆలసించిన ఆశాభంగము,ఆ పైని యెంత విలపించినా లేదు లాభము!

       ఆ వొక్కరోజూ తెలంగాణా సమాజం మొత్తం స్తంభించి పోవాల్సిందే,శ్రీమాన్ చంద్రశేఖర వర్మ మహారాజులుంగారు ఆదేశించారు,యేమని?ఆ వొక్క రోజు యెవరు ఇంటి దగ్గిర వుండి తమ ఇళ్ళ కడకు గంటకు వంద కుటుంబాల లెక్కన వాయువేగంతో పరిగెత్తుకు వచ్చే సర్వే అధికార్లకు తమ వివరాలు ఇస్తే చాలు,మరుసటి రోజు నుంచీ ప్రభువుల వారు కురిపించే వరాలన్నీ మీవే?! ఇవ్వక పోతిరా పంచ మహా పాతకాలూ చుట్టుకుంటాయి, అసలు మీరు తెలంగాణా వాసులే కానట్టు లెఖ్ఖ?!బంగారు తెలంగాణా కోసం ఆ మాత్రం కంగారు పడలేరా?!

    పూర్వం యెప్పుడో రాజుల కాలంలో జరిగేవి ఇట్టాంటి హదావిళ్ళు,రాజుగారు ఒక్క రాజ ముద్ర నొక్కేసి హుకుం జారీ చెయ్యగానె యేమిటిది?యెందుకు? - అనే ప్రశ్నలు లేవనెత్తకుండా జనం కకావికలై పరుగులు పెట్టటం నిజంగా చూడ చక్కని దృశ్యం!!!చరిత్ర మలుపు తిప్పే మహనీయుల్ని చూశాం గానీ చరిత్రని యేకంగా కొన్ని శతాబ్దాలు వెనక్కి నడిపించగలిగిన మహనీయుడు ఇన్నాళ్లకి మళ్ళీ పుట్టాడు?!పరిజనులారా పుణ్య భాగీరధీ తోయముల నందుకొనుడు!వందిమాగధు లారా కచరా మాహారాజును కర్ణపేయముగా కీర్తించుడు!!యేరీ తెలంగాణా కవిద్వయం, నిద్రపోవుచున్నారా?సహస్ర ఫణముల సహస్ర ఫూత్కారములతో విజృంభంచవయ్యా ఆచార్య కవీంద్రా!చందస్సుల్తో మందుగుండు దట్టించి విషజ్వాలలతో ఆంధ్ర మశకములను తరిమి కొట్టవయ్య మొద్దుసూదనా!! మీ మీ కవితా విష గంధపు ధాటికి ఆంధ్రోళ్ళు, ముఖ్యముగా చంద్రనాధుడు ముక్కులు మూసుకొని పుంజాలు తెంపుకొని పది నిముషాల్లో భాగ్యనగరిని, కాదు కాదు -  మన కంగారు తెలంగాణాను - అర్రర్రె నేనే కంగారు పడినాను, మన బంగారు తెలంగాణాను వదలి పరుగులు పెట్టునట్ట్లు చేయుడయ్య!!ప్రజాస్వామ్యంలో రాజస్వామ్యాన్ని చూపిస్తున్న చంద్రశేఖర వర్మ గారి వైభవాన్ని చూస్తా వుంటే కళ్ల నిండికీ ఆనంద భాష్పాలు వొద్దన్నా తన్నుకొచ్చేత్తన్నాయి, కర్చీఫులు చాలవేమో తుడుచుకోవటానికి?

    నా బెంగంతా ఇంట్లో ఆడోళ్ళ తిట్లు పడలేక అఫీసుల్లో యేదో పొడిచేస్తున్నట్తు హడావుడి పెట్టి పగలంతా తిట్లు తప్పించుకుని హాయిగా కులుకుతున్న మగాళ్ళు ఆ రోజంతా యెంత నరకం అనుభవిస్తారో గందా అనే!యేం గాచ్చారం వొచ్చి పడిందిరా నాయనా!!పైగా మొగాళ్ళు ఆఫీసులకి చెక్కెయ్యంగానే మారిణింగు షోలో మహేష్ బాబునీ మాట్నీ షోలో బాలయ్యనీ కళ్ల నిండికీ చూసుకునేవోళ్ళు రోజంతా ఈ పొట్టి బుడంకాయల్నీ బట్టతలోళ్లనీ చూడాల్సిన దరిద్రానికి యెంత కాక మీదుంటారో ఆడోళ్ళు?!ఇరగ దీసెయ్యరూ?సాయంకాలానికల్లా ఆ అర్భనాకారి మొగుళ్లలో యెంత మంది బతికి బట్ట గడతారో?ఆయన కేం, చూట్టానికి బక్కగా వున్నా ఆయువులో గట్టోడు - ముక్కు బలంతో బతీకేస్తన్నడు,లక్ష తిట్లు దిని కూడా తట్టుకు నిలబడ్డాడు, ఈ బక్క ప్రాణుల కంత సీను లేదే?!పోన్లెండి, పోయినోళ్ళు నిక్కచ్చిగా ఒక శాతానికి తేలినా ఆ మొత్తం ఖజానా మీద బరువు తగ్గుద్ది- కరువులో అదిగ మాసం అన్నట్టు పెరిగారీ మందంతా!! 

      తెలంగాణా వాసులారా మీరెంత అదృష్టవంతులు? యెప్పుడూ ఏసీలో హాయిగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని మిమ్మల్ని చిన్న చూపు చూసిన అధికార్లు కాగితాల కట్టలు తీసుకుని మీ దగ్గిరకి పరుగులు పెట్టుకుంటూ వచ్చే సుందర దృశ్యాన్ని తనివితీరా చూసి పులకించిపొండి!!ప్రజల వద్దకే ప్రభుత్వం అనే ఆదర్శాన్ని కనుల విందుగా వీక్షించడానికి రెండు కళ్ళూ చాలవు గదా?!అధికార్ల్లూ పరిగెత్తండి, ఆ ఒక్క రోజే మీది?!మీరు యేది రాస్తే అదే ఫైనల్! మీకు నచ్చిన వాళ్ళు లేకపోయినా వున్నట్టే రాసుకోండి, సంతకాలు ఫోర్జరీ అయినా ఫర్లేదు, యేం కాదు!అంత గాకపోతే ప్రభువుల వారు అంతా సరిగ్గా జరిగిందా లేదా అనేది తేల్చుకోవడానికి మరొక రోజు కేటాయిస్తారు. ఆ రోజు మళ్ళీ పరుగులు పెట్టొచ్చు.మాంచి యెక్సరసైజు వొంటికి మంచిది! ముఖ్యంగా ప్రభువుల వారు పైకి చెప్పక పోయినా మీరు అర్ధం చేసుకుని చెయ్యాల్సింది యేంటంటే - ఆ ఆంధ్రోళ్ళని మాత్రం లిష్టులోకి రానివ్వ మాకండి!ఆ కొంపల వేపుకు అసలు వెళ్ళకుంటే పాయే?! లేని వివరాలకి రుజువు లెవడు అడుగుతాడు? మీ సత్తా అంతా చూపించండి?!యాభయ్యేళ్ళ నుంచీ ఆంధ్రోళ్ళ అధికారంలో మొద్దు నిద్ర పోయారు,  ఇప్పుడే నిద్ర లేచి పరుగులు పెట్టే అవకాశం వచ్చింది, లేవండి పరిగెత్తండి!! యేవరు పరిగెత్తుతున్నారో యెందుకు పరిగెత్తాలో తెలియక పోయినా సరే పరుగు ఆపకండి?!నించుని నీళ్ళు తాగదం కన్నా పరిగెత్తి పాలు తాగడం మంచి దన్నారు, పాలు తాగడానిక్కూడా ఆగకుండా పరిగెత్తాల్సిందే, ఇది రాజాజ్ఞ!

      అసలు పనంతా అధికార్లదే గదా, వాళ్ళొచ్చి రాసుకునే అయిదు నిముషాలు మినహా ఇంట్లో బోరుకొట్టదా అని అనుకోమాకండి?అయాచితంగా వచ్చిన ఈ సెలవును యెలా వుపయోగించుకోవాలో ఆలోచించుకోండి, ప్రబువుల వారి దొడ్డ మనసు తెలుస్తుంది. ఆడవాళ్ళు వరలక్ష్మీ వ్రతాలూ అవీ చేసుకోవచ్చు.మగవాళ్ళు చతుర్ముఖ పారాయణాలూ ద్రవయజ్ఞాలూ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు!!అయ్య బాబోయ్, అసలు విషయం మర్చే పోయా?! అన్ని ఆఫీసులూ మూసేస్తా మన్నారు, క్లబ్బులూ బారులూ కూడా మూసేస్తారా యేంటి, కనుక్కొవాలి - వస్తా!!

8 comments:

  1. ఇంతకీ అదేదో పాతపాటలో ఉన్నట్టు సర్వేయర్లు "పేరేమి చదువేమి నను ప్రేమిస్తావా వయసెంత అని అడిగారా అసలు వచ్చారా"? మీ సర్వే అనుభవాలు పంచుకుంటే బాగుంటుంది.

    ReplyDelete
  2. నేనెక్కడో చెన్నయి లో వున్నాను.నాకు సర్వే అనుభవాలు యేమి వుంటాయండీ!మీరు చెప్తే వింటాం, మీ అనుభవాలు.టపా సర్వే కి ముందే వేసాను.ఇంత లేటుగా వచ్చారేం.యెప్పుడూ సీరీయస్ టపాలతో బోరు కొదుతున్నాదని కొంచెం సరదాగా వేసాను,అయినా కామెంట్లు రావదం లేదేమితా అని బెంగ గా ఫీలవుతున్నాను.మొత్తానికి దయ చేశారు.
    సర్వే బాగా జరిగింది.సంతోషం.అయినా జరక్కుందా వుండడానికి అదేమన్నా చెడు పనా?!

    ReplyDelete
    Replies
    1. మీరు మదరాసులో ఉంటారా హైదరాబాదులో అనుకున్నా ఇన్నాళ్ళూ. మా సర్వే 5 నిమిషాలలో అయిపొయింది, పెద్దగా విశేషాలు ఏమీ లేవు.

      Delete
    2. తర్వాతేం చెయ్యలేదా?చతుర్ముఖ పారాయణాలూ ద్రవయజ్ఞాలూ గట్రా!కానీ ఒకటి - చివర్లో ఆ ఒక్క రోజూ అవస్థలు పడేది యెన్యూమరేటర్లు గదా, తెల్లారి వాళ్లకి శలవిస్తే బాగుంటుంది అని అందామనుకుని మర్చిపోయా.అదీ జరిగింది..వాళ్లకీ తర్వాత రోజు శలవొచ్చింది!

      Delete
    3. "చతుర్ముఖ పారాయణాలూ ద్రవయజ్ఞాలూ గట్రా"

      తెలుగు సినిమాలలో డయలాగు లాగే "నేను అలాంటి వాడిని కాదండీ"!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...