Saturday, 7 June 2014

పోలవరం గురించి ఇప్పుడేడ్చి యేం లాభం?

          విభజన బిల్లు లోనే ఆర్డినెన్సుల ద్వారానే పోలవరం కు అడ్డంకు లను తొలగించాలనీ ఉంది కదా? అంతా విశదంగా చదివారూ, సభలోనే ఉండి ఆమోదించారూ అయినా మళ్ళీ మళ్ళీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, యెలాగండీ మీతో?ఇక్కడ సామరస్యంగా విడిపోయే పధ్ధతి లో అయితే పంపకాలూ వాటాలూ అన్నీ మనం మనం కలిసి కూర్చుని చర్చించుకుని నిక్కచ్చిగా ఉండేది.

          ఇదివరకు భాజపా ద్వారా విడిపోయిన రాష్ట్రాల్లో మొదట విడిపోతామన్న వాళ్ళు కూడా అంకెకు తక్కువ గానే ఉన్నారు.అయినా వాళ్ళు మీలాగా ఇక్కడి అసెంబ్లీలో చర్చించకుండా పైనించి రుద్దేలాగా తెచ్చుకోలేదు. చాలా పధ్ధతిగా ప్రశాంతంగా విడిపోయారు.సభలో చర్చ జరిగినప్పుడు వ్యతిరేకించిన అధిక సంఖ్యాకులు కూడా ఒప్పుకున్నారు.

          కానీ మీరేం చేసారు?అంకెకి తక్కువగా ఉన్నాం, ఇక్కడ మాకు న్యాయం జరగదు అని అంటూ ముందు నుంచీ ఇక్కడ చర్చిస్తే యేమి కంకాళాలు బయట పడుతాయో అని ఈ విధంగా తిట్టి సాధించుకోవాలనే తప్ప సామరస్యంగా విడి పోదామని అనుకోని మీరు మాటి మాటికీ చర్చలకి రాలేదని మమ్మల్ని అంటున్నారు? అసెంబ్లీలో యెన్నికయిన శాసన సభ్యుల మధ్య జరిగే చర్చలే కదా జరగాల్సిన పధ్ధతి.ఇక్కద బ్లాగుల్లో యే గొట్టాం యే వాదన చేసినా ఫలితం ఉంటుందా?యేంతో కొంత కాకుండా చెప్పుకోదగిన స్థాయిలో అభివృధ్ధి చేందిన ఒక మాతృరాష్ట్రం విడిపోగా యేర్పడిన ఈ రెండు రాష్ట్రాలూ యెంత అయోమయాన్ని యెదుర్కొంటున్నాయో మీకు తెలియదా?ప్రభుత్వాలు యేర్పడే సరికే ఆస్తులు, అప్పులు ఇంకా బడ్జెట్ కేటాయింపులకి అవసరమయిన వనరుల లెక్కలూ అన్నీ తెలిసేటట్టు జరగాలి గదా! జరిగినాయా?యేందుకు జరగలేదు?ఇంత అధ్వాన్నంగా విడిపోవటం యెందుకు జరిగింది?

          ఉద్యమ విధాన మంతా తిట్టి సాధించుకోవాలనే మూర్ఖత్వం వల్లనే కదా విభజన ఇంత చండాలంగా జరిగింది! సామరస్యంగా విడిపోయే ఆ పధ్ధతి నే వ్యతిరేకించి ఇక్కడ అంకెకు తక్కువున్నాం మాకిక్కడ న్యాయం జరగదు, అందుకే మేమొక న్యాయమూర్తిని యెన్నుకున్నాం అని మూడో వర్గాన్న్ని న్యాయమూర్తిగా యెంచుకున్నప్పుడు ఆ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు కట్టుబడాల్సిన బాధ్యత కూడా మీదే.యేకపక్షమయిన తీర్పు ప్రపంచంలో యే న్యాయస్థానమూ ఇవ్వదు.తీర్పులో మాకు నచ్చినదాన్నే మేము పాటిస్తాం, మాకు నచ్చని వాట్ని మేము పాటించం అంటే మీ స్థాయిని మీరే దిగజార్చుకోవటం.

          ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రమాణస్వీకారాలు మాత్రమే చేశారు, కానీ ఆస్తులూ అప్పుల వివరాల్లో స్పష్టత ఉందా?బడ్జెట్ కేటాయింపులకి కావలసిన నిధుల లెక్క తేలిందా?యేదీ లేదు!హైదరాబాదు ఆదాయం తో కలిస్తేనే తెలంగాణా ఆదాయం మిగులులో ఉంటుంది.పునర్నిర్మాణం విషయంలో తెలంగాణాకీ యేన్నో ఇతరమయిన సమస్యలు ఉన్నయి, తెలుసా?

          కరెంట్ కొనుక్కోవాలి, మీ ప్రాజెక్ట్ లలో చాలా మటుకు యెత్తిపోతల పధకాలే - వీటన్నిటి పైనా దృష్టి పెట్టాలి మీ నాయకులు.కచరా కు ముందూ తర్వాతా ఉద్యమ స్వరూపం యెందుకు ఇట్లా మారిపోయిందో తెలుసా?అతను ఈ రకమయిన సమస్యలతో కూడిన తెలంగాణా వైపుకే యెందుకు దారి తీశాడో తెలుసా?వస్తే కొండ పొతే దారం అన్న యెత్తుగడ!అంతా తను అనుకున్నట్టు జరిగితే నా అంతటి మొనగాడు లేదని కాలరెగరెయ్యవచ్చు, లేకపోతే ఆంధ్రా వాళ్ళ దుర్మార్గం వల్ల సమస్యల తో కూడిన తెలంగాణా వచ్చిందే తప్ప తన తప్పేమీ లేదని తప్పుకోవచ్చు. తెలంగాణా ప్రవక్తగా తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర పుస్తకాల్లో తన పేరు ప్రతిష్టలకి లోటు ఉండదు.తెలంగాణాకు అంతకు ముందు ఉన్న సమస్యల కన్న ఈ రకంగానే విభజన జరగడం వల్ల వచ్చి పడిన, అంటే తను తెచ్చి పెట్టిన సమస్యలే యెక్కువ - అది తెలుసా మీకు?

          మీ ప్రాజెక్టులకీ నిర్వాసితుల సమస్య ఉంది, కానీ మీరు మాత్రమే దయార్ద్ర హృదయులూ, అంధ్రావాళ్ళు నిర్వాసితుల గురించి పట్టించుకోని క్రూరులూనూ, అంతేనా?మానవత్వం అంతా మీ దగ్గీరే ఉందా?సాటి వారి కష్టాన్ని గమనించని హృదయం లేని క్రూరులమా మేము?

          వాళ్ళు యే మాత్రం ఇబ్బంది పడకుండా వాళ్లని సంతోషంగా ఉంచే పధ్ధతి లోనే సాధించుకుంటాం. యే ప్రాజెక్ట్ కయినా నిర్వాసితుల సమస్య లేకుండా ఉందా? అందరూ యెలా పరిష్కరించుకుంటున్నారో మేమూ అలాగే పరిష్కరించుకుంటాం. అన్ని రకాల అనుమతుల్నీ ఖచ్చితమయిన ఆధారాల్ని సమకూర్చటం ద్వారానే తెచ్చుకుంటున్నాం కానీ మీకు లాగా విలీనం ఒప్పందం లాంటి వికారమయిన పధ్ధతుల్తో బల్ల కింద చేతులు పెట్టి తెచ్చుకోవడం లేదుగా?కేంద్ర జలసంఘం అనుమతి నిచ్చింది.ప్రణాళికా సంఘం కూడా పెట్టుబడులకి మార్గం సుగమం చేసింది.బచావత్ నుంచి మొదలుకుని మిగతా నదీ జలాల ఒప్పందాల్ని వేటినీ ఉల్లంఘించటం లేదు.ఇప్పుడు జాతీయ హోదా కూడా వచ్చింది.మరి మేమెందుకు పోలవరాన్ని ఆపెయ్యాలి?

          పార్లమేంటులో ప్రకటన జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయి, మేము అధికారం లోకి వచ్చాక పోలవరాన్ని కట్టనివ్వం అంటున్నాడు అతను.రాజ్యాంగబధ్ధంగా యెన్నికల్లో నిలబడి గెలిచి ముఖ్యమంత్రి పదవిని కోరుకునే వ్యక్తి అదే రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేసే చట్టబధ్ధమయిన పనుల్ని అడ్డుకుంటానని అంటున్నాడు. రాజ్యాంగాన్ని ధిక్కరించాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి రాజ్యాంగ బధ్ధమయిన పదవులకి అర్హుడేనా?

          మీ తెలంగాణా కల వయస్సు యాభయ్యేళ్ళే అయితే 1940ల నుంచి మేము పోలవరం కోసం కలలు కంటున్నాం.ఉభయ గొదావరి, విశాఖ, కృష్నా జిల్లాల్లో 7.20 లక్షల యెకరాలకు సాగునీరు అందిస్తుంది.తూర్పు గోదావరి జిల్లాలో 2 లక్షల యెకరాలు లాభ పడతాయి.విశాఖ జిల్లాకు పారిశ్రామిక అవసరాల్నీ తీరుస్తుంది. 960 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న గౌతమ బుఢ్ధుడు నిరంకుశుడా?అందర్నీ ఒప్పించి అందరి అనుమతుల్నీ తీసుకుని చేసే పనులు కూడా మీకిష్టం లేదు గాబట్టి ఆపెయ్యాలా?

          మీరన్న దోచుకోవటం, దాచుకోవటం, తరలించుకుపోవటం తెల్సిన వాళ్ళమే అయితే ఇప్పుడు విడిపోతున్న రెండు భాగాల్లో రాయలాంధ్ర మిగులు లోనూ తెలంగాణా తరుగు లోనూ ఉండి ఉండేది. మాకు ఇస్తున్న పాకేజీలు కూడా ఇంత చండాలంగా విభజిస్తున్నందుకు ముఖం చెల్లక విదిలించినవే తప్ప మేము వాటి గురించి కూడా యెక్కువగా అంగలార్చటం లేదు. మీ కలని యెంతో అపూర్వంగా చూసుకుని నెరవేర్చుకున్న మీరు పోలవరం అనే మా కలను చెదరగొట్టకుండా ఉంటే చాలు. విడిపోయి కలిసుందామని అంటున్న మీరు మాకేదయినా సహృదయంతో ఇవ్వదల్చుకుంటే అది పోలవరానికి అడ్డం రాకుండా ఉండటమే!

13 comments:

  1. అసలు పోలవరం ప్రాజెక్టుకు మూలం మూడు రాష్ట్రాల మధ్య రాసుకున్న ఒప్పందం. తెలంగాణా బిల్లులో తెలంగాణా అన్ని అభ్యంతరాలను వెనక్కు తీసుకుంటుందని ఏకపక్షంగా రాసారు. ఎ ఒప్పందమయినా ఒప్పందంలో భాగస్వామి కాని పార్టీ దూరలేదన్న (a non-contracting has no locus standi in any agreement) ప్రాధమిక సూత్రానికి ఇది విరుద్దం.

    చట్టంలో తప్పిదాలు/అన్యాయాలు ఉన్నప్పుడు తద్వారా నష్టపోయిన వారు కోర్టుకు వెళ్ళడం వారి హక్కు. చట్టం అమోదమయింది కాబట్టి ఎవరూ దానిపై కోర్టుకు వెల్లొద్దని సంవిధానంలో ఎక్కడా లేదు.

    పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతి ఇచ్చిందా? Sources please.

    పోలవరం కొందరి కల కావొచ్చు. మేము కల కన్నాము కాబట్టి చట్టాలను & ఒప్పందాలను తుంగలో తోక్కుదామని అంటే మాత్రం ఎవరూ ఒప్పుకోరు.

    ReplyDelete
    Replies
    1. http://greaterrajahmundry.blogspot.in/2014/05/central-government-approved-polavaram.html
      >>
      The central government will execute the project and obtain all requisite clearances related to Environmental, forests and rehabilitation.

      >>
      http://wrmin.nic.in/printmain3.asp?sslid=899&subsublinkid=865&langid=1

      State Govt. had submitted the proposal of the project for inclusion as National Project in April, 2009 as per guidelines for National Projects issued by the Ministry of Water Resources, Govt. of India.

      Delete
    2. As the request to include it as national project was accepted, you can deduce It was completed, is it not?

      Delete
    3. Why did you not publish my reply please?

      Delete
    4. I am not removing any message with names, may be It was done by some random click?!.can you recollect and send it?

      Delete
    5. Sorry it is there just below.

      Delete
  2. The links you provide do not show either CWC approval or planning commission approval. In fact the Hindu story clearly states PC approval for revised estimate is not through.

    In fact as per the 1978 agreement, AP has to give 35 TMC of Krishna water (against the 80 TMC trans-basin diversion) to Maharashtra & Karnataka as soon as CWC approves Polavaram project "irrespective of the actual diversion taking place" (clause 7-e). Therefore the first news to expect after CWC approves Polavaram will be "Maharashtra & Karnataka demand 35 TMC from Krishna basin".

    The term "national project" relates to funding only. It does not imply any approvals/clearances etc.

    ReplyDelete
  3. ఇదంతా ఎందుకండి?
    పోలవరం ప్రాజెక్టుపై వచ్చిన ఆర్డినెన్సుని వ్యతిరేఖించటమంటే, రాష్ట్ర విభజన బిల్లుని కూడ వ్యతిరేఖించటమే.

    అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదు మరి!

    ReplyDelete
    Replies
    1. అక్కరలేదండీ, కేవలం ఒక్క అంశం చెల్లనంత మాత్రాన మిగతా చట్టం మురిగిపోదు. అలా జరిగితే దేశంలో సగం చట్టాలు చెల్లనెరవు

      Polavaram (and other matters) do *not* constitute the essence of the Telangana formation act.

      Delete
  4. @జై గారు,

    పోరాటం వలన మాత్రమే తెలంగాన వచ్చిందని మీరు అనుకొని త్రుప్తి చెందవచ్చు. కాంగ్రెస్ పార్టి రాజకీయ లబ్ధి కోసం విభజన జరిగిందని ఆంధ్రావాళ్లు అనుకోవటంలో తప్పు లేదు. పార్లమెంట్ లో విభజన బిల్లు ఆమోద ప్రహసనం పెద్ద నిదర్శనమని వారు బలంగా నమ్మవచ్చు. మీరు (తెలంగాణా మేధావులు) ఊపు తగ్గించాలి. చట్టల గురించి, ఆంధ్రుల చరిత్ర గురించి సుధీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వగల మేధావులు తెలంగాణాలో కొదవలేదు లేండి. ఇంతకు ముందులా కేంద్రం లో మీ గోడు వినటానికి ఇప్పుడు ఎవ్వరు సిద్దంగా లేరు. పోని మేధావుల అవతారమెత్తి గూడుపుఠాని చేద్దామంటే ఆ స్థాయి యం.పి.లు ఎవ్వరు లేరు. గత ప్రభుత్వంలో గుట్టు చప్పుడు కాకుండా గూడుపుఠాని(తెర వెనుక రాజకియాలు) చేసిన జైపాల్ రెడ్డి వంటి వారు ఇప్పుడు ఎవ్వరు ఉన్నారు మీకు?

    ReplyDelete
  5. పోలవరం లాభాల్లో తెలంగాణక్కూడా కొంత వాటా ఇస్తే ఈ వ్యతిరేకతలన్నీ సద్దుమణుగుతాయి. బహుశా వారిక్కావాల్సిందీ అదేనేమో ! కానీ దాని నిర్మాణంలో తమ విరాళం ఏమీ ఉందదు గనుక అలా హక్కుగా అడగలేరు. కనుక ఆ మాట పైకి డైరెక్టుగా అనకుండా ఆదివాసీలూ, ముంపుగ్రామాలూ అని సాకులు చెబుతున్నారు.

    ReplyDelete
  6. Poratam...? Evadi poratam? Kachara?
    Telangana evari vdalla vachindi? kachara kutumbam ani evaraina anukunte vaallu vatti "vedhavaayaloy" anaali.

    ReplyDelete
  7. @bonagiri:

    Polavaram (or similar points) is *not* the essence of the Telangana bill. The substantive part of the bill will stay in tact even if Polavaram or other sections are struck down in a court.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...