Tuesday, 3 June 2014

ఈ వడ్లగింజలో బియ్యపుగింజ కింత రాధ్ధాంతమా?

============================================================
                                                        యేక సభ్య సంఘం
                                                     (ఆరు సూత్రాల పధకం)

                                             జే.యం.గిర్గ్లాని, ఐ.యే.యస్(విశ్రాంత)

                                                            ఆఖరి రిపోర్ట్
                                                      మూడు భాగములలో

అధ్యాయం - 1
కీనోట్
1.1.0 11/04.1969 వ తేదీన ప్రధాన మంత్రి, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారు లోక్ సభ లో తెలంగాణా ప్రాంతమునంకు సంబంధించిన అభివృధ్ధి, విద్యా ఉద్యోగ విషయాలకు సంబంధించి ఒక ప్రకటన చేశారు.ఇక్కడి సందర్భానికి తగిన ఒక ముఖ్య విషయం పాయింట్ 6 - "The possibility, of providing for appropriate Constitutional safeguards in the matter of public employment in favor of people belonging to the Telangana region will be examined by the Government of India in consultation with a committee of Jurists ". మిగిలిన అన్ని ఫారులాల వలెనే ఈ ఫార్ములా కూడా ఆచరణ లోకి రాలేదు.

                                                     ఆరు సూత్రాల పధకం - 1973

1.3.1 ఒక అఖిల పక్ష ప్రతిపాదన రాజ్యాంగ బధ్ధంగా రాష్ట్రపతి ఆదేశంగా రూపు దాల్చింది.

రిపోర్టు యొక్క పరిమితి

*1.4.0 ప్రతి వారిలోనూ కొన్ని విషయాలకు సంబంధించి గందరగోళం నెలకొని ఉంది. ప్రభుత్వం, ఉద్యోగులు,పాత్రికేయులు,రాజకీయ వాదులు,ఉద్యోగ సంఘాలు, న్యాయశాఖ అందరి లోనూ "ఆరు సూత్రాల పధకం", "రాష్ట్రపతి ఆదేశం", "610 జీ.వో" మధ్య గల తేడాలూ వైరుధ్యాలూ విడమరివ్జి చెప్పాల్సీన అవసరం ఉంది.
1.5.0 పైన వివరించిన విధంగా 1969 నాటి తెలంగాణా ఉద్యమాన్నీ 1972 నాటి ఆంధ్రా ఉధ్యమాన్నె దృష్టిలో ఉంచుకొని రాష్త్రం భవిష్యత్తులో సమస్యలకి గురికాకుండా ఆంధ్ర ప్రదేశ్ నాయకత్వం కేంద్రంతో చర్చించి 21-09-1973 లో అపార్ధాలను(misgivings) తొలగించే నిమిత్తం ఒక ఆదేశాన్ని జారీ చేశారు.అది ఈ క్రింది విధంగా ఉంది:

(1) త్వరిత గతిన వెనుకబడీన ప్రాంతాలు అభివృధ్ధి చెందేటందుకు వీలుగా రాష్త్ర శాసన సభకు సహకరించేటందుకు నిపుణుల కలిసి అభివృధ్ధి పధకాలను పర్యవేక్షించడానికి కొన్ని ప్రాధమ్యాలను గుర్తించారు.రాష్ట్ర స్థాయిలో ప్రణాళికా సంఘం మరియు కొన్ని ఉప సంఘాలను ఇందు కొరకు యేర్పాటు చేశారు.

(2) విద్యాలయాల్లో ప్రవేశానికి రాష్ట్రమంతటా స్వప్రాంత అబ్యర్ధులకు ప్రోత్సాహం కల్పించడంలో ఒకే రకమయిన అరణ్యమెంట్లు ఉండాలని ఆదేశించారు.ఇంకా హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న విద్యావకాశాల్ని మెరుగు పర్చేటందుకు ఒక కేంద్ర విశ్వ విద్యాలయాన్ని ప్రతిపాదించారు.

(3) మొత్తం రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా స్వప్రాంత అబ్యర్ధులకు (అ) నాన్-గెజిటెడ్ పోస్టులు (ఆ) స్వప్రాంత సంస్థలలోని సంబంధిత ఉద్యోగాలు (ఇ) తహసీల్ దార్లు, జూనియర్ ఇంజనీర్లు వంటి వాటిలో స్వప్రాంత అబ్యర్ధులకే ప్రాధమ్యం ఇవ్వాలి.
......
......
(5) పైన వివరించబడిన వాటిని ఆచరణ లోకి తీసుకు వచ్చేటప్పుదు యే విధమయిన లిటిగేషను మరియు అనిశ్చితి యేర్పడకుండా అవసరమయినప్పుదు రాష్ట్రపతి కి అధికారాలను దఖలు పరుస్తూ రాజ్యాంగ సవరణలు చేయవలెను.

(6) ఈ విధమయిన దారిలో వెళ్తే ముల్కీ నిబంధనలూ ప్రాంతీయ కమిటీ రద్దు అయిపోతాయి.

1.5.2 ఇందులోని మూడవ సూత్రమే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాన్ని రాష్ట్రపతి ఆదేశం పరిధి లోకి తీసుకు వచ్చింది.రెండవ పాయింటుకు సంబంధించి కూడా వేరొక రాష్ట్రపతి ఆదేశం ఉన్నపటికీ ఈ సంఘం మూడవ పాయింటుకు సంబంధించిన ఆదేశాన్ని మాత్రమే పరిశీలిస్తుంది.ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు మాత్రమే సంబంధించినది.

కాబట్టి "ఆరు సూత్రాల పధకం", మరియు "రాష్ట్రపతి ఆదేశం" అనే ఈ రెంటినీ ఒక దాని కొకటిగా కలప కూడదు. రాష్ట్రపతి ఆదేశం ఆరు సూత్రాల పధకం లోని ఒక భాగాన్ని, అంటే ప్రభుత్వోద్యోగాల విషయాన్ని మాత్రమే పరిశీలిస్తే ఆరు సూత్రాల పరిధి చాలా విస్తృత మయినది.

                                          సంఘానికి ఇచ్చిన సూచ్యార్ధ ప్రస్తావనలు
                                      (Terms Of Reference Of The Commission)

1.8.3 పేరా 3 కు సంబంధించిన ప్రస్తావనను విశ్లేషించి చూస్తే - 'యేవయినా అక్రమాలు జరిగాయని తెలిస్తే నష్ట నివారణకు తగిన చర్యలు తీసుకోవడానికి సూచనలు ఇవ్వడానికీ' అని అర్ధంవుతుంది.

(1) One part is to suggest remedial action. The remedy is a specific antidote to a specific malady. The maladies are what we have called „deviations‟ which the Commission has brought out in this Report. Under each specific Deviation Genre, the Commission has given its Findings and suggested appropriate Remedial Action.

1.9.1 It may be mentioned that the general issues mentioned in Chapter-3 of the Preliminary Report and given in terms of the points with Commission‟s observations have been included in the Part-1 of this Report under the appropriate “Deviation Genre” and “Finding”. However where any point in the Preliminary Report is not found in the Final Report, the Commission‟s finding in the Preliminary Report may be read as a part of the Final Report.

                                                           Causes of Deviations
1.10.0  A reading of the Report will itself indicate which deviation can be attributed to which cause. Some of the causes discerned by this Commission are the following: -

1) Dynamics of administration. The pace of these has been increasing day by day. The implications of various administrative decisions that impinge on the Presidential Order have gone either unnoticed or got ignored.

1). కార్య నిర్వాహక వ్యవస్థ పని తీరు రోజు రోజుకూ వేగవంతం కావడం అనే దశలో |ప్రెసిడెన్షీల్ ఆర్డర్| కి సంబంధించిన విషయాల్ని సీరియస్ గా తీసుకోలేదు.

2) The Presidential Order had gradually been receding into the limbo of oblivion. Hence its implications in the administrative decisions, even in the matters of reorganizations and far-reaching personnel and structural changes and in the movement of personnel, did not even cross the minds of the proposers and decision-makers.While in every such decision the financial implications were always examined and legal aspects kept in mind the implications under the Presidential Order escaped attention and tended to get ignored. Even where they did occur to the concerned authorities, as in the case of work charged establishments, these were skirted and the easy way out was adopted.

2).|ప్రెసిడెన్షీల్ ఆర్డర్| క్రమేణా విస్మృతం కావడం మొదలయింది.ఉద్యోగుల స్థానచలనానికి సంబంధించి అన్ని ఆర్ద్గికపరమయిన మరియు సాంకేతిక పరమయిన విషయాల్ని తరచి చూడాల్సిన సందర్భాల్లో కూడా |ప్రెసిడెన్షీల్ ఆర్డర్| అనేది ఒకటి ఉందనేది మర్చిపోవడం, లేదా ప్రతిష్ఠంభన యేర్పడినప్పుడు తేలికగా కుదీరే పరిష్కారానికి రావడమూ జరిగింది.

3) In some situations the imperatives/compulsions of circumstances left no choice but to turn the Nelson‟s eye to the provisions of the Presidential Order.

4) In a few cases patronage, favoritism or the blue-eyed boy syndrome stand out quite patently and rather deplorably.

5) The ignorance and often misconception about or misconstruance of some of the provisions of the Presidential Order and of the instructions in G.O.s like G.O.P.No.728 and G.O.P.No.729 of General Administration (SPF) Department,both of 01-11-1975 quite often stand- out glaringly. One finds free mention in official correspondence and discussions of such things as “VII Zone” (some thing that does not exist), “Free Zone” (referring to the City of Hyderabad), “Non-local Quota” (which is nowhere contemplated in the Presidential Order), interchangeability of the concept of nativity with local candidate etc.. One finds even guiding stars misguiding - for example the advice of the General Administration (SPF) Department and orders of Finance Department in the case of work charged establishment and its absorption, and Government Memos. on the issue of compassionate appointments.

6) (a) Departments that have a very large cadre and which include certain wings which are/were excluded from the Presidential Order like Police and Irrigation and Command Area Development Department;

(b) “Umbrella” Departments which have an integrated cadre covering new offspring Departments - have some genuine difficulty in cadre management particularly in wings where they find stagnation due to original defective staffing pattern or any other reason. Such Departments tend to resort to amnesia now and then with regard to the Presidential Order as the easy way out.(For this cause, see the Chapter-2).

7) Above all, a very important cause is the absence of any device for (i) either on-going control or monitoring system as Finance Department has through pre-audit process or Law Department has through legal advice on files, or inspections that the Social Welfare Department has OR (ii)post-facto monitoring system such as audit for accounts,and (iii) absence of a nodal agency to guide and control the implementation of the Presidential Order, and (iv) absence of a legislative controlling committee like Public Accounts Committee, or Committees as there are for Scheduled Castes, Scheduled Tribes and for Women which create a feeling in the minds of the officials that they are accountable to the Legislative Assembly through a Committee. Such state of apparent absence of accountability enforcing devices or agencies has tended to create an attitude of indifference, some callousness with a sense of immunity and impunity in the implementation of the Presidential Order over the last almost three decades.

7). పైవాటన్నింటి కన్నా (1).యెప్పటి కప్పుడు మదింపు చేస్తూ నియంత్రించటానికి పనికి వచ్చే యేర్పాటు (2). Audit చెయ్యటానికి అవసరమయిన యేర్పాటు లేకపోవటం (3).మార్గదర్శకాల్ని నిర్వచించే వ్యవస్థ లేకపోవటం (4). శాసన బధ్ధమయిన అధికారిక సంస్థ యేదీ లేకపోవటం  అనేవి |ప్రెసిడెన్షియల్ ఆర్డర్| నుంచి దూరం జరగటానికి ముఖ్యమయిన కారణాలుగా కనబడుతున్నాయి.

ఇక్కడి నుంచి తెలంగాణా మేధావులు |violations| గా పిలుస్తున్నప్పటికీ గిర్గ్లానీ గారు |deviations| పేరుతో ఇచ్చిన పరిశీలనల లిస్టు వస్తుంది.

2,2.0:దృగ్విషయం 1        01-11-1975 నుంచి, గతించిన 28 సంవత్సరాలలో కార్యనిర్వాక వ్యవస్థలో వచిన గతానుగతికమయిన మార్పుల వలన మొత్తం కార్యనిర్వాహక వ్యవస్థ మరియు ప్రభుత్వ స్వభావం చాలా మార్పులకు గురయింది.

2.3.0:దృగ్విషయం 2         ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో "శాఖ యొక్క తల" మరియు "శాఖల యొక్క తలలు" అను పదములను సరిగా నిర్వచించనందువల్ల కొన్ని సార్లు సంస్థలను చీల్చి కొత్త సంస్థలను పుట్టించినప్పుడు తమ తల కార్యాలయములను కూడా "శాఖల యొక్క తలలు" గా పొరపాటున  అన్వయించుకుని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా 14 ద్వారా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుండి మినహాయింపు పొందారు.

2.6.0:దృగ్విషయం 5    ఈ కమిషన్ పరిశీలనలో తెలిసింది యేమిటంటే న్యాయశాఖ పూర్తిగా ఆ శాఖకు సంబంధించిన నియామకాల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని పాటించదం లేదని.మామూలుగా హైకోర్టు మాత్రమే ఆ శాఖ కంతటికీ "శాఖ యొక్క తల" గా ఉండి మిగిలిన జిల్లా స్థాయి నియామకా లన్నింటి లోనూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని పాటించాలి.

2.27.0: దృగ్విషయం 21     హైదరాబాద్  మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు సెవరేజ్ బోర్డ్ వారి విషయం మరీ చిత్రమయినది. చట్ట ప్రకారం దీనిని ఉత్పత్తి చేసినప్పుడు ఇది స్థానిక సంస్థ. తదనంతరము ప్రభుత్వము వారు ఇది స్థానిక సంస్థ కాదని విశదీకరించినారు, అయితే ఆంధ్ర ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వారు ఈ విశదీకరణను ఖండించినారు(ఖండించినది వ్యక్తులను కాదు గావున యెవరికీ భాద కలుగలేదు).ఆలాగున ఇది ప్రెసిడెన్షియల్ ఆర్దర్ కిందికి వచ్చు స్థానిక సంస్థయై ఉన్నది. సమస్య యేమనగా ఈ బోర్డ్ యొక్క తల కార్యాలయమును ప్రెసిడెన్షియల్ ఆర్దర్ పేరా 14(b) కిందికి వచ్చునట్లుగా గుర్తింపు నివ్వవచ్చునా?ఈ బోర్డ్ స్థానిక సంస్థయే తప్ప శాఖ కాదు.ఈ మొత్తము స్థానిక సంస్థ ఒకే స్థానిక సంస్థ కావున దీనికి శాఖ యొక్క తల అను సిధ్ధాంతము వర్తించదు.

2.29.0: దృగ్విషయం 22     ఒక శాఖ ఒకే తలను కలిగి ఉండగలదు.అది రాష్ట్రమంతటిలో పని చేయు రెక్కలు కలిగి ఉండవచ్చు. కాబట్టి ఒక శాఖకు ఒకే శాఖ యొక్క తల ఉండును, లేని యెడల అది శాఖయే కాదు.ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా 14(b) పై స్థాయిలోని అధికారికమయిన శాఖ యొక్క తలకు మాత్రమే వర్తించును.

2.29.2: సమస్య యేమనగా ఒక శాఖ యెన్ని శాఖల యొక్క తలలు గలిగిన కార్యాలయములను కలిగి ఉందవచ్చు? ఒక శాఖ లోని యెన్ని శాఖల యొక్క తలలను ప్రెసిడెన్షియల్ ఆర్దర్ 14(బ్) కిందికి తీసుకు రావచ్చు?

5.4.0:దృగ్విషయం 47    ఇక్కడ స్థానికతకు సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్దర్ లోని విషయానికి అధికారులు అనుసరిస్తున్న సాంప్రదాయికమయిన విధానానికీ ఉన్న భేదం పట్ల గందరగోళం ఉందని తెలుస్తుంది.అధికారులకు సంబంధించిన రూల్ బుక్ లో స్థానికత అంటే అతను యెక్కడ నుండి తొలి సారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు అనేది అయితే ప్రెసిడెన్షియల్ ఆర్దర్ ప్రకారం రిక్రూట్ చేసుకుంటున్న ఏరియాకు ప్రాముఖ్యత ఉంటుంది. అధికారులు తమ సర్వీస్ రూల్స్ కూ ప్రెసిదెన్షియల్ ఆర్దర్ కూ విభేదం వస్తే తమ సర్వీస్ రూల్స్ వైపుకే మొగ్గు చూపుతున్నారు.
"The entire scheme of Presidential Order is based on the premise that the unit of recruitment which is
called “local area” has nothing to do with the “unit of appointment” which is an administrative
stipulation in the service Rules of a post. The unit
of recruitment is statutorily laid down as the “local area” for direct recruitment of a post as per its local
cadre under the Presidential Order."

6.5.0:దృగ్విషయం 51   కమిషన్ ట్రాన్స్ఫర్ ల గురించిన సమాచారం సేకరించగా అది ఇలా ఉంది:716 అంతర్-జిల్లా అంతర్-జోన్ ట్రాన్స్ఫర్ లు.81 దంపతులు,113 మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లు,101 పబ్లిక్ ఇంటరెస్ట్ ట్రాన్స్ఫర్ లు,186 ఇతర కారణాలు కాగా 235 కారణాలు చెప్పనివి.ఇతర కారణాలలో 160 రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ లు. యెక్కువ ట్రాన్స్ఫర్ లు హైదరాబాద్ వైపుకి(79) జరగగా తర్వాత స్తానంగా(60) చిత్తూర్ వైపుకి జరిగాయి,కానీ చిత్రంగా హైదరాబాదు నుంచి 79  ట్రాన్స్ఫర్ లు బయటి వైపుకి జరగదంతో తేడా 0 అయ్యింది.ఇక జోన్ల వారీగా చూస్తే 72 జోన్6 లోకి,66 జోన్2 లోకి,59 జోన్4 నుంచి జరిగాయి.

అసలు ట్రాన్స్ఫర్ ల పైన బ్లాంకెట్ బాన్ లాంటిది విధించాలా అని ఆలోచిస్తే ప్రెసిదెన్షియల్ ఆర్దర్ ట్రాన్స్ఫర్ లకు పూర్తిగా సుముఖంగా లేదు. పైగా వివాహాల్లో కులాంతర మతాంతర వివాహాల మాదిరి జోనాంతర వివాహాలు కూడా సమస్యగా తయారై సమాజికంగా కూడా వ్యతిరేక ఫలితం రావచ్చు.కేవలం రెండు మూడు జిల్లా లో జరిగిన వాటిని అన్ని జిల్లాల లోనూ వర్తింప జేయడం అనవసరం

6.27.0:దృగ్విషయం 69    యెక్కడా ఫలానా జోనులో హీనపక్షంగా యెంత మంది స్థానిక వ్యక్తులను ఖచ్చితంగా తీసుకోవాలనే కనీస సంఖ్య నిర్ధారించబడనట్టుగా కనపిస్తున్నది.

7.1.0:దృగ్విషయం 74   మొదటి నుంచీ |work-charged employees|ని అది గోదావరి, కృష్ణా, తుంగభద్రా లాంటి ఇర్రిగేషన్ ప్రాజెక్టు లయినా,రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన పను లయినా ప్రెసిడెన్షియల్ ఆర్దర్ కి బయటనే ఉంచేస్తున్నారు.దీనికి సరయిన కారణం కూడా లేదు.అసలు ప్రాజెక్టుల విషయంలో ఈ |work-charged establishment| ముఖ్యమయిన పాత్ర వహిస్తుంది.

7.10.0:దృగ్విషయం 83   ఫలితం యేమిటంటే అధికంగా పోగుపడిన వీరంతా ప్రాజెక్ట్ కాలం ముగిసాక కూడా మళ్ళీ పనికొస్తారనే మిషతో పాత ఉద్యోగాలు మాత్రం పోగొట్టుకోకుండా ఉండిపోయారు.ఒకటికి రెండింతలు లాభం.సివిల్స్ రాసి పాసయి APPSC ద్వారా రాకపోవటం ఒకటే తేడాగా "దొడ్డి దారి ప్రవేశం" ద్వారా ప్రభుత్వం లోని సివిల్ పోష్టులకి రాగలిగారు.ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి మినహాయింపు పొందగలిగారు.

8.2.0:దృగ్విషయం 91  కమిషన్ దృష్టికి వచ్చిన మరొక ముఖ్యమయిన విషయం యేమిటంటే - 18.10.1975(ప్రెసిడెన్షియల్ ఆర్డర్)కి ముందు నాన్-గెజిటెడ్ గా ఉన్న పోష్టుల్ని అదే డిసిగ్నషన్ లొగానీ డిసిగ్నషన్ మార్చి గానీ గెజిటెడ్ పోష్టులుగా మార్చారు.దీని వల్ల ఆ పోష్టుకి ఉండే 70% స్థానికత హక్కును కోల్పోవటం జరిగింది.

8.8.0:దృగ్విషయం 97:  It is a paradox, or an irony of the administrative system, that has escaped the attention of the Government, that while in G.O.Ms.No.610 Government have assured about taking up with the Government of India, the question of localization of all the first gazetted posts, the contrary process of pulling out from the localized cadres of non-gazetted zonal posts through the process of gazetting them has been going on unabated, after the Presidential Order, causing jeopardy to local candidates in terms of loss of
opportunities for direct recruitment and promotions.

నాన్ గెజిటెద్ పోష్టుల్ని గెజెటింగ్ చెయ్యదం లోని హేతుబధ్ధత

8.10.0 ఈ విధంగా నాన్ గెజిటెడ్ పోష్టుల్ని గెజిటెడ్ గా మార్చటం అనేది స్థానిక అబ్యర్ధుల అవకాశాలకు సంబంధించి వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వటమే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ లో కూదా అవాంచనీయమయిన పరిణామాలకి దారి తీసింది.మొదట గెజిట్ చేసినది ప్రధమ నియంత్రిత స్థానం అనుకుంటే తర్వాత అది ద్వితీయ నియంత్రిత స్థానం అవుతుంది.ప్రధమ నియంత్రితాన్ని కంట్రోల్ చేసేది ఖచ్చితంగా ఆ శాఖాధిపతి అవుతాడు, కానీ అది కొనసాగింపు అయి అది రెండవ నియంత్రిత అంతరువుకు పెంచబడినప్పుడు శాఖాధిపతి యొక్క క్రమశిక్షణాయుతమయిన అధికారాలు పలుచన అవుతాయి.

9.4.0 దృగ్విషయం 101: కమిషన్ 01-03-1999 నుంచి 01-01-2002 వరకు 34 నెలలకు సంబంధించిన |compassionate appointment|లకు సంబంధించిన సమాచారాన్ని అదిగితే 62 శాఖలు స్పందించాయి.ఇందులో 7 శాఖలు ఈ |compassionate appointment|ని అసలు చెయ్యలేదు. 55గురు శాఖాధిపతులు 6,805 ఇటువంటి నియామకాలు జరిగినట్టు తెలిపారు.ఇందులో 6,211 మంది స్థానిక అబ్యర్ధులని స్థానిక క్యాడర్లోకి,594 మందిని స్థానికేతరుల్ని నియమించారు,అంటే 8.73%.ఈ 594 మందిలో 462 మందిని ఆయా శాఖలకు అధిపతులుగా నియమించడం ఆమోదయోగ్యమే.132 మంది స్థానికేతర క్యాదర్లోకి తీసుకోబడ్దారు.మొత్తంగా 6759 మంది రెగ్యులర్ పోష్టులకు అపాయింట్ చెయ్యబడితే 46 సూపర్ న్యూమరరీ పోష్టులు మాత్రమే సృష్టించబడ్దాయి.

12.1.0 దృగ్విషయం 112: There are four types of departments/categories of posts where the process of recruitment/allotments of recruited candidates has to be closely watched through an ongoing process of scrutiny to ensure that Presidential Order is being adhered to. These are :

1. Departments and posts which are kept outside the purview of Andhra Pradesh Public Service Commission and/or District Selection Committees.
2. Departments with multiple wings but integrated cadre.
3. “Umbrella” Departments with an integrated cadre and centralized cadre management for all the  offsprings.
4. Where a new dispensation is introduced as in the case of creation of the system of Panchayat Secretaries.

13.7.0 దృగ్విషయం 123:In Government Hospitals Auxiliary Nurses(ANMs) were allotted by Andhra Pradesh Public Service Commission overlooking the Presidential Order. Auxiliary Nurses were from among non-locals for want of local candidates. Actually, in case of non-availability of locals, if non-locals had to be brought because of the essential nature of the services of ANMs, they could have been taken on tenure basis, not appointed in the vacancies of local candidates. There has been dearth of trained Nurses in zones V and VI.

***Issuing immediate orders that the Service Registers should depict the local status of the employees must be done immediately. It appears quite strange at this stage to find that the "nativity column‟ which was originally there in the Service Registers, continues but after the Presidential Order, the "local status column‟ and "local cadre column‟ were not inserted. If this is done now and forthwith, Government would find that it will facilitate handling the contentious issues, as well as taking redressal measures effectively and promptly.

అధ్యాయం - 2

2.1.6 If we exclude 46,831 gazetted posts from the total Government employees we have 3,85,564 Government employees who are covered by the Presidential Order. (We may ignore for statistical purposes Gazetted employees presently in the Specified Gazetted Category, being negligible in number) Out of these, the Planning Department has given district-wise break-up for 3,54,131 employees. Regarding the remaining 31,433 employees the Planning Department has shown 31,281 under the heading “not covered under Presidential Order”, and 152 under the heading “employees working outside the Andhra Pradesh” (these last being in Delhi, etc.)

2.1.7 The district-wise figures of local and non-locals show the following results:

1) The lowest percentage of non-locals ranging between 3.42%to 4.81% is in eight districts of which one is in zone-I, one is in zone-II, four in zone-IV and two in zone-V. (Warangal and Karimnagar).

2) In the second range i.e. between 5.16% to 5.99% we have seven districts of which one is in zone-I, one in zone-II, three in zone-III and two in zone-VI (Mahabubnagar and Medak).

3) The third range is 8.52% to 11.63% with one district in zone-I, one in zone-II and two in zone-V (Adilabad and Khammam) and three districts in zone-VI (Ranga Reddy,Nizamabad and Nalgonda).

4) Beyond this, we have only one district viz. Hyderabad which has 18.06% non-locals which is far more than the 1st, 2nd& 3rd ranges mentioned above.

5) All the districts except Hyderabad District are far below 20%which is the highest permissible for open quota of district cadre posts in which locals and non-locals can come without reservation. Hyderabad is just below 20% which shows ‘inter alia‟, and „prima-facie‟ not only that a large part of the open quota is filled with non-locals but also that there must be a lateral inflow of non-locals through transfers,compassionate appointments, deputations etc.

2.1.35 These dis aggregated figures give an idea as to where the non-local element has entered. Mostly it is in the category of Teachers, and Paramedicals of the Health Department. Non-Locals have also entered in a big way among work-charged employees. This last category has remained under complete camouflage because they have been treated (erroneously) as outside the purview of the Presidential Order.

18.2.0 Who are the Losers and who are the Beneficiaries?
Until each Finding is taken up for action in terms of the Remedial Action proposed in the Final Report, no one can say which are the zones that are beneficiaries and which are the zones that are losers.
============================================================
తెలంగాణా వాదులు |violations| అని అంటున్న వాటిని గిర్గ్లానీ గారు ప్రత్యేకించి |deviations| అని యెందుకు అన్నారో తెలుసా?మెద మీద తలకాయ ఉన్న యే అధికారి అయినా తను రూల్స్ అతిక్రమించానని వొప్పుకోడు. పట్టుబడే అవినీతి పరులు కూడా కేవలం నిర్లక్ష్యం వల్ల దొరికి పోతారే తప్ప ప్రతి అధికారీ తను చేసే ప్రతి పనీ రూల్స్ ప్రకారం ఉందని తేల్చుకున్నాకనే చేస్తాడు.

ఈ ఉద్యోగుల నియామకాలకి సంబంధించిన కమిటీ రిపోర్టు లన్నీ సలహాల కోసమే తప్ప వీటిని ఖచ్చితంగా పాటించి తీరే విధంగా సర్వీస్ బూక్స్ లోకి యెక్కించలేదు. అది ఒక చోట గిర్గ్లానీ గారు కూడా టచ్ చేసినట్టున్నారు, గమనించారా?యేదయినా శాఖాపరమయిన విచారణ వొస్తే సర్వీస్ బుక్ ఫాలో అయ్యాడా లేదా అని చూస్తారే తప్ప పద్మనాభన్ కమిటీని ఫాలో అయ్యాదా గిర్గ్లానీ కమిటీ రిపోర్టుని ఫాలో అయ్యాడా అని చూడరు.

విశ్రాంత అధికారిగా అది ఆయనకీ తెలుసు.ఇంతకీ ఈ గొడవ లన్నీ ముఖ్యంగా యే ఉద్యోగాలకు సంబంధించినవి.ఒక ప్రభుత్వ శాఖలో శాఖాధిపతిగా రావాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రావాలి. అలా వచ్చిన వ్యక్తికి తన కింద స్థాయిలో పని చేసే ఉద్యోగుల్ని యెన్నుకునే అధికారం ఉంటుంది.ప్రతి ఉద్యోగానికీ అర్హతలూ, మార్గదర్శక సూత్రాలూ ఉంటాయి, కానీ ప్రభుత్వమే వీళ్ళకి విచక్షణాధికారం అనేది కట్టబెట్టింది.అంటే యెక్కడయినా యే రెండు రూల్స్ అయినా ఒకదాన్ని ఒకటి వ్యతిరేకిస్తూ గందరగోళం యేర్పడితే తన విచక్షణని ఉపయోగించి నిర్ణయం తీసుకోవచ్చు.

ఆంధ్రదేశం ఏర్పడిన కొత్తలో తెలంగాణా ప్రాంతంలో విద్యా సౌకర్యాలు ఇప్పుడున్నంత బాగా లేవు. ఉపాధ్యాయుల్ని తరిఫీదు చేసే సంస్థలు కూడా చాలా తక్కువ. ఒకవైపున పాఠశాలల సంఖ్య అభివృద్ధి అవుతోంటే ఉపాధ్యాయుల కొరత ఏర్పడినది.1956లో తెలంగాణా ఆసుపత్రులలో పడకల సంఖ్య 5000. 1966లో 10,000. పడకలు పెరిగిన కొద్దీ నర్సుల, మంత్రసానుల అవసరం కూడా కలుగుతుంది. తెలంగాణా అభివృద్ధికీ ఆరోగ్యానికీ అవసరమైన ఉపాధ్యాయుల్నీ, నర్సుల్నీ, మంత్రసానుల్నీ తీసేస్తే, మిగిలేవి 1100 మంది బంట్రోతు, డ్రైవర్లు ఉద్యోగాలలో వున్నవారు, ఒక లక్షా ఏడువేల ఉద్యోగాలలో 1100, పోనీ 4500 ఎన్నో వంతు? వీటి కోసం రాష్ట్ర విచ్ఛిన్న కార్యక్రమం తలపెట్టినారంటే విన్నవారు నవ్వరా?

రేపటి తెలంగాణా లోనూ ఈ జోనల్ పధ్ధతిని ఫాలో అయితే ఒక పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఆంధ్రోళ్లని తిట్టినట్టు తెలంగాణా లోని కొన్ని జిల్లాల వార్ని మిగతా వాళ్ళు తిడతారు, అది తధ్యం!ఆచార్య దేవో భవ, వైద్యో నారాయణో హరి అంటూ అప్పుడు విద్యకోసం ఆరోగ్యం కోసం అవసర మయి ఆంధ్రా నుంచి టీచర్లనీ నర్సుల్నీ కోరి పని చేయించుకున్నారు.ఇవ్వాళ వాళ్ళు రిటయిర్మెంటుకు దగ్గరయ్యాక వారికి పెన్షన్ ఇవ్వటానికి కూడా బాధ పడిపోయి తన్ని తగిలేస్తున్నారు!యేరు దాటే వరకూ వోడ మల్లయ్య గారు యేరు దాటాక బోడి మల్లయ్య గాడు!!

ఈ మధ్యనే కేంద్రం నుంచి ఉద్యోగుల విభజనకి వచ్చిన కమిటీ పరిశీలనకు ఉంచబడిన మొత్తం ఉద్యోగాలు 50, 000 రమారమి అంటున్నారు.మొదట 10,000 అని కనబడింది, వారికే సిగ్గ్గేసి ఇంకా ఘట్టిగా ఫిల్టర్ చేసారేమో ఆఖరికి 50,000 దగ్గిర ఆగింది.వారి తీర్పు నచ్చలేదని గొడవలు రేగటంతో ప్రస్తుతానికి మమ్మల్ని ఇలా వొదిలెయ్యండి, పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు యేర్పడ్డాక మీరూ మీరూ చూసుకోండని వారు దణ్ణం పెట్టేశారు.మరి ఆంధ్రా వాళ్ళు దోచుకున్న లక్షల ఉద్యోగాలు యేమయిపోయినాయో, రేపటి రోజున వారే ప్రభుత్వంలో ఉండి లెక్కలు తీసినప్పుడు గానీ ఈ లెక్క నిక్కచ్చిగా తేలదు.అయినా ఈ బతక లేని బడి పంతుళ్ళూ సిరెంజిలు కడుక్కునే నర్సులూ యాభయ్యేళ్ళ పాటు మొత్తం పది జిల్లాల తెలంగాణా మేధావుల్నీ వెనుకబాటు తనానికి గురి చేశారంటే ఆశ్చర్యం గా లేదూ!

అసలు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం యేమిటంటే |violations| అంటున్న |deviations| అన్ని జోన్ల లోనూ సమానంగానే జరిగాయి, ప్రత్యేకంగా ఒక జోను నష్టపోయింది అని చెప్పలేం అని అంత ఖచ్చితంగా చెప్తే మాకు అన్యాయం జరిగిందని గిర్గ్లానీ కమిషన్ రిపోర్తులో ఉంది, వెళ్ళి చూసుకోండని వీరంగాలు వేశారు. మిగతా అన్ని జోన్లలోనూ అంతా బాగనే ఉండి ఒక్క తెలంగాణాలోనే జరిగితే కదా వారికి ప్రత్యేకంగా అన్యాయం జరిగినట్టు?ఇంత కాలం నేను అసలు గిర్గ్లానీ కమిటీలో యేం ఉందో చూడాలని అనుకోకపోవటానికి కారణం మేధావులూ విద్యావంతులూ సంస్కారం గలిగిన వాళ్ళు మరీ దుర్మార్గంగా అబధ్ధాలు చెప్తారా అనే భరోసా తోనే!తీరా చూస్తే పరిస్థితి ఇది.

అసలు ఒక విషయం నిజమా అబధ్ధమా అని యెలా కనిపెట్టాలి?ఒక విషయం గురించి యెదటి వ్యక్తి వెయ్యి వాక్యాలు చెప్తే మొదటి వాక్యానికీ వెయ్యవ వాక్యానికి అర్ధంలో తేడా వొస్తే అబధ్ధం అని తేలుసుకుంటాం, కదా? ఒక వేళ ఈ వెయ్యి వాక్యాల్లో యే విరుధ్ధతలూ లేకపోయినా వెయ్యిన్నొకటో వాక్యం కొత్తగా తెలిసి దానికి గట్టి సాక్షాలు ఉంటే ఈ వెయ్యి వాక్యాలూ నిజమనిపించేటట్టు అంతా యేకసూత్రంగా ఉన్నా అవన్నీ అబధ్ధాలు అయి పోతాయి,అవునా? ఇప్పుడు అసలు విషయంలో వైరుధ్యాలు ఉన్నా యెదటి వాళ్ళకి తెలిసే వీలు లేదనుకుని వాటిల్లో కొన్నిట్ని దాచేసి అంతా తమ వాదానికి అనుకూలంగా ఉన్నవాట్ని మాత్రమే చెప్తే అబధ్ధం కూడా నిజమయి పోతుంది గదా!

ఈ మధ్యనే నేను ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనకి ముందరి విషయాల్ని గురించి మానసికంగా విడివడాలని ఒక నిర్ణయం తీసుకున్నాను, కేవలం విసుగు వల్ల - చెవిటి వాడి ముందు శంఖ మూదినట్టు మళ్ళీ మళ్ళీ ఒకే విషయం గురించి యేం రుద్దుతాం అని.కానీ ఒకే ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సివచ్చింది.నేను గిర్గ్లానీ కమిటీ రిపోర్తును చదివి ఈ పోష్తు వేసాక ఈ మధ్యనే ప్రజ చర్చా వేదిక దగ్గిర గ్రీన్ స్టార్ గారు తగిలారు నాకు.చర్చలో వారే ఈ రిపోర్టు గురించి యెత్తేసరికి అన్ని జోన్లలోనూ జరిగాయని అంటున్నారు కదా అనే జవాబు వేశాను.

దానికి వారు -
అన్ని జోన్లలో జరిగాయి, నిజమే. కాని వారు ఇంకో విషయం కూడా చెప్పారు, అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు అని. అంటే హైదరాబాదు అని నేను అనుకుంటున్నాను. అసలు ఏ ఏ జోన్ లలో ఎంతెంత అక్రమాలు జరిగాయో ప్రభుత్వమే ఒక శ్వేత పత్రం ఎందుకు విడుదల చెయ్యదు? 
- అని మరో ప్రశ్న వేసారు.

వారు అంటున్నది "అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు"

కానీ
ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిర్గ్లానీ గారు చెప్పింది ఇది,"ఒక్క తెలంగాణా వారే నష్టపోలేదు.అన్ని ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది.మేలు జరిగిందెవరి కంటే అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి తరలి వెళ్లగలిగిన వారు లబ్ధి పొందారు."

ఆయన చెప్పింది వెళ్ళగలిగిన వాళ్ళు లాభ పడ్దారు అని.ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కృష్నా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?స్పష్టంగా చెప్పిన దాన్నే ఒప్పుకోనప్పుడు శ్వేతపత్రాలు సాక్ష్యానికి పనికొస్తాయా?వారు యే గిర్గ్లానీ కమిటీ రిపోర్టును గురించి మాకు అన్యాయం జరిగిందని చెప్తుందని వూదరగొట్టారో ఆ రిపోర్టు తయారు చేసిన పెద్ద మనిషే అంత స్పష్టంగా మీ మాట తప్పు అంటుంటే ఇంకా శ్వేతపత్రం అంటారేమిటి?

3 comments:

  1. ఈ ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం - ఆంధ్రులు బ్రిటీషువారివంటి వలసవాదులనీ, దొంగలనీ, దోపిడిదారులనే ప్రచారం మీద ఆధారపడి జరిగిందనేది అందరికీ తెలిసినదే. ఈ ప్రచారం తెలంగాణాలో మొదలైనప్పుడే మనవాళ్ళు మేలుకుని సోపపత్తికంగా ఖండించాల్సింది. ఎందుకో ఆ పని జరిగింది కాదు. కనుక ఒకే ఒక్క అబద్ధాల వెర్షన్ వీరవిహారం చేసింది. స్వతహాగా సమైక్యవాదులైన కొందరు తెలంగాణవారు కూడా ఆ వెర్షనే నిజమేమోననే మానసిక పరిస్థితికి లోనై వేర్పాటువాదులుగా మారారు. అదంతా నిజం కాదని భావితరాలవారికి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం మీవంటి మేధావులంతా కలిసి కూర్చుని, ఒక్కొక్కరూ ఒక్కో అంశాన్ని ఈ విధంగా కులంకషంగా విశదీకరిస్తూ ఒక ప్రత్యేక పుస్తకం వ్రాయాల్సి ఉంది. కనీసం మన నిర్దోషిత్వానికి అదో చారిత్రిక రికార్డుగానన్నా మిగుల్తుంది. ఆలోచించండి.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. స్పందించినందుకు ధన్యవాదాలు!

      మన చదువులు మనకి సంస్కారాన్ని నేర్పడం లేదు, అందుకనే తెలంగానా లోని విద్యావంతులు కూడా ఇలా అబధ్ధాల్ని ప్రచారం చెయ్యడానికి పూనుకున్నారు. అది నాకు వారి పట్ల కోపం కన్నా జాలినే పుట్టిస్తున్నది.విడిపో దల్చుకున్నా ఇంతకు ముందు భాజపా ద్వారా విడిపోయిన రాష్ట్రాలకి లాగా విడిపోయినా బాగుండేది.విభజన ఇంత క్రూరంగా జరగదం వల్ల చెప్పుకో దగిన స్థాయిలో అభివృధ్ధి చెందిన ఒక పెద్ద రాష్ట్రం విడిపోయాక యేర్పడిన ఈ రెండు రాష్ట్రాలూ యెలాంటి స్థితిలో నిలబడ్డాయో చూస్తున్నారుగా?

      ప్రభుత్వాలు యేర్పడే సరికే ఆస్తుల అప్పుల లెక్కలు తేలాలి, బడ్జెట్ ప్రతిపాదనల కోసం వనరుల వివరాలు తెలియాలి.అవేవీ లేకుండా మంత్రివర్గాలు యేర్పడి పోతున్నాయి హడావుడిగా, ఆర్భాటంగా, యేమి వూడబొడుద్దామనో?!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...