Monday, 24 October 2022

సంతానం కోసం లక్షలూ కోట్లూ ఖర్చు పెట్టుకుంటూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగటమూ సరోగసీ పేరున అద్దె గర్భాల్ని అమ్మటమూ కొనటమూ తప్పు!

ఈ మధ్యన ఇండియన్ కోర్టులు ఇద్దరు ఆడవాళ్ళ మధ్యన జరిగే పెళ్ళినీ ఇద్దరు మగవాళ్ళ మధ్యన జరిగే పెళ్ళినీ చట్టబధ్ధం చేసినప్పుడు చాలామంది హిందువులు కంగారు పడ్డారు,అవునా?ఆ జడ్జీలకి తెలివితక్కువ తనం అంటగట్టేస్తూ కొందరు విసుకున్నారు కూడాను.కానీ,అవి అమాయకపు తీర్పులు కావు.ఆ తీర్పులు చాలామటుకు తమిళనాడు,కేరళ వంటి క్రైస్తవం బలమైన చోట్ల నుంచే ఎందుకు వస్తున్నాయి?

లండను మహానగరంలో Sian Norris అనే ఒక జర్నలిస్టుకి ఎదురైన ఒక వింత అనుభవం చూడండి.ఆమె women’s and LGBTIQ rights అనే టాపిక్ మీద ఫోకస్ చేస్తూ అప్పటికే కొంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నది కూడాను.మన సొంత పులుముడు కన్న ఆమె అనుభవాన్ని ఆమె మాటల్లోనే వింటే బావుంటుంది కదా!

ఆమె 29 October 2019, 10.11am సమయాన తన అనుభవాన్ని ఇలా వివరిస్తున్నారు.నేను Clarkson Academyని సందర్శించినప్పుడు తలుపు మీదనే నలుపు,నీలి వర్ణాలలో ఒక lightbulb అలంకరించబడి ఉండటం చూశాను.చూడగానే,కార్పొరేట్ ఆఫీసులూ ఉన్న లోగోలనీ క్యాప్షన్లనీ,పోస్టర్లనీ ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపిస్తుందే తప్ప ప్రత్యేకమైన భావం స్ఫురించదు.meeting room ఎక్కువ మంది శ్వేత జాతీయులతో నిండి ఉంది.

మరోసారి ద్వారబంధం మీద ఉన్న lightbulb ఫొటోని చూస్తే filament నారింజ రంగులో గీసిన గర్భస్థ శిశువులా కనిపిస్తుంది.నిజానికి అక్కద గుమిగూడిన పురుషులూ మహిళలూ మాట్లాడుకుంటున్నది యూరో డాలరు గురించీ కాదు,పర్యావ్రణం గురించీ కాదు.“blood sacrifices”,abortion, homosexuality లాంటి “Satanic revolution” సంబంధిత విషయాల గురించి.

అవును,మీరు విన్నది నిజమే,నేను చూసిందే చెప్తున్నాను.అక్కడ మాట్లాడే వక్తలూ వింటున్న సభికులూ ఆయా వర్గాలకు ప్రతినిధులై చట్టసభలలోనూ న్యాయస్థానాలలోనూ వాదించి ఆయా వర్గాలకు అనుకూల చట్టాలు చేయిస్తూ అనుకూలమైన తీర్పులను రప్పిస్తూ ఉండే లాబీయిస్టులు.ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న వక్త “the homosexual agenda is one front of the Satanic revolution. Other fronts include abortion - as well as supposed pushes to legalise cannibalism and paedophilia” అని చాలా స్పష్తమైన రీతిలో వాదిస్తున్నాడు.Abortions are “ritual child sacrifices”,claiming that Satanists conduct ritual abortions in (unnamed) “high-profile” facilities in the US, where women sway while chanting “our bodies, ourselves” అని ఒక సిధ్ధంత ప్రతిపాదన చేస్తున్నాడు.

నిజానికి,నేను పాల్గొన్న అన్ని సమావేశాల్లోనూ ఇదొక చిత్రమైన సన్నివేశం నాకు!నేనిక్కడ ఉండాల్సిన దాన్ని కాదు.Stella Creasy అనే pro-choice politician చుట్టూ రగులుతున్న సంచలనం గురించి కొంత ఎక్కువ తెలుసుకోవడానికి కొత్తగా సభ్యత్వం తీసుకున్నాను.Stella Creasy మీద చెలరేగిన  దుమారం వెనక ఉన్నది Centre for Bio-Ethical Reform UK (CBR-UK) సంస్థ.1861లో ఐఛ్చిక గర్భస్రావాన్ని కఠిన తరం చేసిన గర్భస్రావపు చట్టాల్ని బలహీన పరిచేలా గర్భిణీ అయిన ఈ MP చొరవ తీసుకుని ఐఛ్చిక గర్భస్రావాన్ని సులభతరం చేస్తున్న చట్టాల్ని ప్రవేశ పెట్టినప్పుడు #StopStella campaign మొదలుపెట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది CBR-UK.

ఇక లండన్ మహానగరపు నడిబొడ్డున ఉన్న ఇక్కడి వాతావరణం చూస్తే - నిర్వాహకులు ఆహ్వానితులను చిరునవ్వులతో ఆకర్షిస్తున్నారు,Right Wing Christians,anti-abortion groups కరపత్రాలను పంచుతున్నారు,పోగయినవాళ్ళలో తెల్లచర్మం వాళ్ళే ఎక్కువ,టీనేజర్స్ పెన్షనర్లతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు,పిల్లిగడ్డం దగ్గిర్నుంచి leopard print షర్టుల వరకు చితవిచిత్రమైన అలంకరణల వాళ్ళు కనిపిస్తున్నారు.అందరిలోనూ anti-abortion activismతో పాటు anti-EU heckling,anti-LGBTIQ rhetoric and mocking climate change activism వంటి మరికొన్ని ప్రముఖమైన ధోరణులు కనిపిస్తున్నాయి.

CBR-UK స్థాపకుడైన Andy Stephenson అనే వ్యక్తి మొదట మాట్లాడాడు.గర్భస్రావం ఎలా జరుగుతుందో చూపిస్తున్న కొన్ని భయానకమైన ఇమేజిల్ని చూపిస్తూ “vulnerable women” ఇలాంటివి చూడకూడదని అంటూ అదంతా anti-abortion intimidation tactics అనేశాడు.గర్భస్రావం ఆడవాళ్ళ హక్కు అంటున్న pro-abortion ఉద్యమం సాతానిష్టుల కుట్ర అని వాదించాడు.తర్వాత మాట్లాడిన Wilfred Wong పూర్తి సాతానిష్టు ధియరీని గురించి వివరించి చెప్పాడు.అతను sexual and reproductive rights ఉద్యమం సాతానిస్టుల ప్రభావం వల్ల బలం పెంచుకున్నదని తీర్మానించాడు.UKలో abortion rates పెరగడానికీ high-profile Satanists పెరగడానికీ సంబంధం ఉందని వాదించాడు.గర్భస్రావం ఒక అనైతికమైన చర్య అంటూ దాన్ని వ్యతిరేకిస్తూ తాము చేస్తున్న పనుల్ని - "when people prayed outside clinics,it can cause abortions to fail, and so it is not surprising that they are trying to ban prayer vigils outside clinics in the UK" అంటూ సమర్ధించుకున్నాడు.

నిజం చెప్పాలంటే, ఇక్కడ ఇమడటానికి చాలా ఇబ్బంది అనిపించింది నాకు.2019లో “educational display” చేసిన #StopStella campaign నుంచి తప్పుకున్నాను.ప్రస్తుతం CBR-UK మీద ఒక మహిళా పార్లమెంటు సభ్యురాల్ని వేధిస్తున్నందుకు గాను నిషేధం పెట్టారు.క్రిందటి వారం నా నిజమైన వివరాలను చూపిస్తూ అక్కడ చూసిన వాటిని విశ్లేషిస్తూ ఒక పోష్టు వేశాను.దానిమీద Clarkson Academy attendees నన్ను psychopath అంటూ కామెంట్లు వేశారు. Clarkson Academy దగ్గిర కనిపించినది anti-choice movement కుట్ర ధియరీల్ని వ్యాప్తి చేస్తూ LGBTIQ యొక్క కార్యక్రమాల్ని "helps Satanists to corrupt children" తరహా వాదనలతో వ్యతిరేకిస్తూ reproductive rights ఉండకూడదని వాదించే అతి చాందస వాదం.

Clarkson Academy దగ్గిర కనిపించినది anti-choice movement కుట్ర ఏది ఏమైతేనేం,అక్టోబర్ 22న Irelandలో గర్భస్రావం ఒక చట్టబధ్ధమైన హక్కు అయ్యింది Creasy పుణ్యాన.CBR-UK పోరాటం కొనసాగుతుంది, భయానకమైన గర్భస్రావపు బొమ్మల్ని బలహీన మనస్కులైన మహిళలకి చూపిస్తూ - కానీ, వాళ్ళు ఇప్పుడే ఒక పెద్ద యుధ్ధంలో ఓడిపోయారు!

విషయం అర్ధమయింది కదా,ఆమె ప్రో అబార్షన్ క్లబ్బుకి సంబంధించిన మహిళ - యాంటీ అబార్షన్ క్లబ్బుకి వెళ్ళింది వాళ్ళ తరపు వాదనల్ని వినడానికి,నచ్చక బయటికొచ్చి వాళ్ళని యేకిపారేస్తూ పోస్టుల్ని పెట్టింది,వాళ్ళూ ఈమెని సైకో అన్నారు.ఈమె కూడా ఓ నాలుగు వెక్కిరింతలు వేసింది,వీళ్ళ తరపు వాదనల్ని కోర్టులూ పార్లమెంటులూ న్యాయం అనేసి గర్భస్రావ అనుకూల చట్టాలు చేశాయి,ఈమె సంతోష పడింది, వాళ్ళ మీద జాలి కురిపిస్తూ.ఇలా ఉంటుంది క్రైస్తవ సమాజపు నీతి నియమాల పరిస్థితి.

కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు అఘోరిస్తున్న Sian Norris లాంటి ప్రో అబార్షన్ చిలకల తెలివి కూడా ఏడిసినట్టే ఉంది.శృంగారం విషయంలో కొంత నిగ్రహంతో ఏడిస్తే అవాంఛిత గర్భం రాదు కదా!ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టు ఎక్కడ మూడొస్తే అక్కడ మరుగా బయలా అన్నది చూసుకోని అధర-చుంబనం మొదలు మదన-మందిర-మధనం వరకు అక్కడి కక్కడే కానిచ్చెయ్యడమే ఆధునికత,నాగరికత అని యేడిస్తే గర్భం రాక ఏమొస్తుంది?ఇలాంటి మందని పెంచటానికి వీళ్ళకి గర్భస్రావాన్ని హక్కు కింద చట్టాలు చేసి ఇవ్వాలి.ఇవ్వం అంటే అనాగరికులు, మత ఛాందసులు, తిరోగమన వాదులు అని అరుస్తూ వీధుల్లో దొమ్మీలు చేస్తారు,కప్పెక్కి కూస్తారు, అరాచకత్వాన్ని హక్కుల పేరుతో అనుభవిస్తారు.

అక్కడి వ్యాఖ్యాతల సంభాషణలో "Science has always held that life begins at conception. Knowingly to destroy it is murder: the only sane 'choice' can be to do so when either mother's or child's -YES, that is what it is - in danger." అనేది చదివినప్పుడు "ఎంత చక్కటి మాట!" అనిపించింది నాకు.

దేశం బయట,అదీ హైందవేతర సమాజంలో ఏ వెర్రి ముదిరితే ఆ వెర్రిని నాగరికత పేరుతో మన దేశం లోకి దించే ఎర్ర,నీలి,పచ్చ రంగుల మంద తమ భుజస్కంధాల మీద మోస్తున్నది.ఈ మంద న్యాయవ్యవస్థలోకి చొరబడితే అట్లాంటి తీర్పులు వస్తాయి.ఈ మంద ప్రభుత్వవ్యవస్థలోకి చొరబడితే అట్లాంటి చట్టాలు వస్తాయి.

క్రైస్తవులకి వాళ్ళ మతగ్రంధం పెళ్ళెందుకు చేసుకోవాలి,పిల్లల్ని ఎందుకు కనాలి,దంపతులు ఒక జీవిత కాలం పాటు ఎందుకు కలిసుండాలి అనే ప్రశ్నలకి శాస్త్రీయమైన జవాబు చెప్పలేదు. "కోరికల్ని నిగ్రహించుకోలేనప్పుడు మూకుమ్మడి వ్యభిచారం తప్పనిసరి అవుతంది గనక పెళ్ళంటూ ఒకటి ఏడిస్తే వ్యభిచారం తగ్గుతుం"దని ఒక బోడి సలహా పారేసి వూరుకుంది.కేవలం అందువల్లనే Sian Norris లాంటి వాళ్ళకి ఇష్టం లేని మొగుడి నుంచి విడాకులు తీసుకోవటమూ ఇష్టం లేని మగాడి వల్ల వచ్చిన అనుకోని గర్భాల్ని తీయించుకోవడమూ పోరాడి సాధించుకోవాల్సిన న్యాయమైన హక్కులని అనిపిస్తున్నాయి.పాపం అది వాళ్ళ తప్పు కాదు.

అయితే, పెళ్ళెందుకు చేసుకోవాలి,పిల్లల్ని ఎందుకు కనాలి,దంపతులు ఒక జీవిత కాలం పాటు ఎందుకు కలిసుండాలి అనే ప్రశ్నలకి శాస్త్రీయమైన జవాబు చెప్తున్న ధర్మశాస్త్రాన్ని పాటించే హిందువులకి ఎక్కడ మూడొస్తే అక్కడ మరుగా బయలా అన్నది చూసుకోని అధర-చుంబనం మొదలు మదన-మందిర-మధనం వరకు అక్కడి కక్కడే కానిచ్చెయ్యడం ఆధునికత,నాగరికత అని ఎందుకు అనిపిస్తున్నది?వైదిక సంస్కృతి మొత్తం ఇందియనిగ్రహం చుట్టు తిరుగుతుంది.ఇక్కడ పెళ్ళిని "కోరికల్ని నిగ్రహించుకోలేనప్పుడు మూకుమ్మడి వ్యభిచారం తప్పనిసరి అవుతంది గనక పెళ్ళంటూ ఒకటి ఏడిస్తే వ్యభిచారం తగ్గుతుం"దని ప్రతిపాదించలేదు.సంతానం కోసమే వివాహం.దంపతులు ఒక జీవిత కాలం పాటు కలిసి ఉండటం అనేది తమకు భద్రతనీ ఐశర్యాన్నీ అధికారాన్నీ ఇచ్చిన సమాజానికి తమ పిల్లలకు విద్యాబుధ్ధులు నేర్పి మంచి కానుకల రూపంలో తిరిగి సమర్పించడం కోసమే వివాహ వ్యవస్థ అనేది ఏర్పడింది.

ఇవ్వాళ చేస్తున్నట్టు సంతానం కోసం లక్షలూ కోట్లూ ఖర్చు పెట్టుకుంటూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగటమూ సరోగసీ పేరున అద్దె గర్భాల్ని అమ్మటమూ కొనటమూ తప్పు.వైదిక సంప్రదాయం ప్రకారం భార్యా భర్తల శుక్ల శోణితాల సంగమ ఫలితం ఒక్కటే సంతానం కాదు - 1. స్వసంతానం 2. వనఃప్రతిష్ఠ 3. దేవాలయ నిర్మాణం 4. అగ్రహార నిర్మాణం 5. ప్రబంధ రచన 6. ధన నిక్షేపం 7. తటాక నిర్మాణం అనేవి అన్నీ కలిపి సప్త సంతానాలు అంటారు.పైన చెప్పాను కదా,"తమకు భద్రతనీ ఐశర్యాన్నీ అధికారాన్నీ ఇచ్చిన సమాజానికి తమ పిల్లలకు విద్యాబుధ్ధులు నేర్పి మంచి కానుకల రూపంలో తిరిగి సమర్పించడం కోసం ఏర్పడినదే వివాహ వ్యవస్థ" అని.సప్త సంతానం సంప్రదాయం ప్రకారం తమకు పిల్లలు పుట్టని లోపం ఉంటే ఇప్పటిలా లక్షలూ కోట్లూ ఖర్చు పెట్టుకుంటూ వెర్రిపనులు చెయ్యక తెలిసిన వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకునే వాళ్ళు.లేదంటే తమ పేరున గుడి కట్టించో చెరువు తవ్వించో సంతృప్తి పడేవాళ్ళు!

Sian Norris లాంటి వాళ్ళకి "చూడు జాన్!నీ పిల్లలూ నా పిల్లలూ మన పిల్లలతో ఎలా కలిసిపోయారో!" అని చెప్పుకుని నవ్వుకునే దరిద్రపు జోకులూ "ఆమెరికన్ ఆడపిల్ల కడుపు చేసినందుకు కాక కడుపు చేసి సారీ చెప్పనందుకు ఆ మగాడి మీద అలుగుతుంది!" అనే కుళ్ళు జోకులూ ఒక ఆడది ఒక సిటీలో ఒక మగాడితో పిల్లల్ని కని పిల్లల్ని ఆ మొగుడికే వొదిలేసి ఇంకో సిటీలో ఇంకో మొగుడితో పిల్లల్ని కన్న ఇరవయ్యేళ్ళ తర్వాత తన ఇద్దరు మొగుళ్ళ పిల్లల్లో అన్నా చెల్లెళ్ళో అక్కా తమ్ముళ్ళో పెళ్ళి చేసుకునే ఖర్మలూ తల్లి కొత్త మొగుణ్ణి వదిలేసి పాత మొగుడికి పుట్టిన కొడుకుని పెళ్ళి చేసుకుని అమ్మే నాయనమ్మ అయ్యే నీచత్వాలూ తమ పురోగామి ఉద్యమాల ఫలితమే అని ఎప్పటికీ తెలియదు.

మనం అనాగరికమైన సంస్కృతిలో ఉన్నప్పుడు మనకన్న ఉన్నతమైన సంస్కృతిని అనుసరించి బాగుపడడమూ మనం ఉన్నతమైన సంస్కృతిని పాటిస్తున్నప్పుడు మనకన్న అనాగరికమైన సంస్కృతిలో ఉన్నవాళ్ళకి మన సంస్కృతిని పరిచయం చేసి బాగు చెయ్యడమూ తప్పు కాదు గానీ భారతీయ హిందువులు రివర్సులో అఘోరిస్తున్నారు.

జై శ్రీ రాం!

Saturday, 22 October 2022

బింబిసారుడి కొడుకైన అశోకుడి గురించి భారతీయులకి ఎప్పుడు తెలిసింది?

మొదట తెలుగు ప్రజలకి సంబంధం ఉన్న కళింగ యుధ్ధం యొక్క వాస్తవికతను తెలుసుకోవాలి.మహాభారతంలో కళింగ ప్రస్తావన ఉంది.కళింగరాజ్య యువరాణి భానుమతిని కురు యువరాజు దుర్యోధనుడు వివాహం చేసుకున్నాడు. కుళక్షేత్రయుద్ధంలో కళింగులు దుర్యోధనుడి పక్షాన ఉన్నారు. ఐదు తూర్పు రాజ్యాల స్థాపకులు, వీటిలో: అంగాలు (తూర్పు, మధ్య బీహారు), వంగాలు (దక్షిణ పశ్చిమ బెంగాలు, బంగ్లాదేశు), కళింగాలు (ఒరిస్సా సముద్ర తీరం), పౌండ్రులు (పశ్చిమ బంగ్లాదేశు, పశ్చిమ బెంగాలు, భారతదేశం), సుహ్మాలు (ఉత్తర- పశ్చిమ బంగ్లాదేశు, పశ్చిమ బెంగాలు) సాధారణంగా కళింగవంశాన్ని పంచుకున్నాయి. మహాభారతంలో కళింగకు చెందిన రెండు రాజధానులు (దంతపుర, రాజపుర) ప్రస్తావించబడ్డాయి. బహుశా చాలా మంది కళింగ రాజులు ఉన్నారు. కళింగ వివిధ భూభాగాలను పాలించారు.

మగధరాజు జయసేనతో కళింగరాజు శ్రుతయసు యుధిష్ఠరుడు ఇంద్రప్రస్థలోని తన కొత్త రాజభవనంలోకి ప్రవేశించిన కార్యక్రమానికి హాజరయ్యాడు.అర్జునుడు పురాతన భారతదేశం మొత్తంలో తన 12 మాసాల తీర్థయాత్ర సాగించిన సమయంలో వంగ, కళింగలోని రాజభవనాలను సందర్శించాడు.పాంచాలరాజు ద్రుపదుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు సహాయం చేయడానికి అభ్యర్ధించే రాజుల జాబితాను తయారుచేశాడు.ఈ జాబితాలో ఇతర కళింగులతో కలిసి శ్రుతాయుల మొదలైన వారిగురించి ప్రస్తావించబడింది.

కళింగులను కౌరవులతో మద్ధతుగా పేర్కొన్నారు. కౌరవసైన్యంలోని సైనికాధికారులు కళింగరాజు శ్రుతయుద్ధుడు, స్రుతాయసు (శ్రుతయుషు) అని కూడా పిలుస్తారు. (6,16). కౌరవ సైన్యం సైన్యాధిపతులు: - 1.గాంధారరాజ్యానికి చెందిన శకుని,2.మద్రరాజ్య రాజు శల్యుడు,3.సింధురాజ్య రాజు జయద్రధుడు,4.అవంతిరాజ్యానికి చెందిన ఇద్దరు సోదరులు, రాజులు అయిన విందుడు, అనువిందుడు,5.కేకేయ రాజ్యానికి చెందిన కేకయసోదరులు (పాండవపక్షంలో ఉన్న కేకయులను వ్యతిరేకించారు),6.కాంభోజరాజ్యానికి చెందిన రాజు సుదక్షిణుడు,7.కళింగరాజ్య రాజు శ్రుతుయుధుడు,8.జయత్సేనుడు మగధరాజ్యానికి రాజు,9.కోసలరాజ్య రాజు బృహద్వలుడు,10.కృతవర్మ అనర్త రాజ్యానికి చెందిన యాదవ అధిపతి.పాండవులలోని ద్వితీయ సోదరుడు భీముడితో జరిగిన యుద్ధం కళింగ వీరులందరికీ ప్రాణాంతకం అయింది.

కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు శల్యుడి జాతిని, దానితో స్వల్ప సారూప్యత కలిగిన మిగతా తెగలందరినీ అవహేళన చేశాడు.కరాషాకులు, మహిషాకులు, కళింగులు, కేరళలు, కార్కోటకులు, విరాకులు, మతరహిత నాస్థికులు, ఎప్పుడూ ఒకరికి ఒకరు దూరంగా ఉండాలి.పంచాలులు, సాల్వాలు, మత్స్యలు, నైమిషులు, కోసలులు, కసపౌండ్రులు, కళింగాలు, మగధలు, చేదీలు అందరిలో ఎంతో శాశ్వతమైన మతం ఏమిటో తెలిసిన ఆశీర్వదించబడ్డారు.బ్రాహ్మణులు (గురువులు, మార్గదర్శులు) లేకపోవడం కారణంగా సకాలు, యవనులు, కాంభోజులు, ఇతర క్షత్రియ తెగలు శూద్రుల స్థాయికి దిగజారిపోయారు. ద్రావిడులు, కళింగులు, పులందులు, ఉసినరులు, కోలిసర్పాలు, మహిషాకులు, ఇతర క్షత్రియులు, వారి మధ్య నుండి బ్రాహ్మణులు లేకపోవటం వలన శూద్రులస్థాయికి పతనం చెందారు.

బహుశః భీముడి చేతిలో హతం కావడం వల్ల కాబోలు తర్వాత కాలంలో ఏర్పడిన మహాజనపదాల ప్రస్తావనలో కళింగ లేదు.అయితే, ప్రాంతం యొక్క విస్తీర్ణతని బట్టి చూస్తే ఇప్పటి ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువ భాగమూ 2014 నాటికి ముందరి ఆంధ్రరాష్ట్రంలో ఉత్తరం వైపున కొంత ప్రాంతమూ ఒకప్పటి కళింగ రాజ్యం అవుతుంది.అయితే 2014 తర్వాత ఏర్పడిన ఆంధ్రరాష్ట్రంలో విశాఖ జిల్లా ఒకప్పటి కళింగ రాజ్యంలోని ప్రాంతం అవుతుంది.

పూర్వ సామాన్య శకం 261 నాడు ఇక్కడ లక్ష మంది సైనికులు వధించబడిన ఒక భయంకరమైన యుధ్ధం జరిగితే స్థానిక ప్రభువులు నమోదు చెయ్యరా?ఇప్పుడు చెప్తున్న చారిత్రక కధనం ప్రకారం పూ.సా.శ 343 మొదలు పూ.సా.శ 321 వరకు జీవించిన మహాపద్మనందుడు మొదట కళింగను గెల్చి స్వాధీనం చేసుకున్నాడనీ నంఫ్దవంశం పతనం అయ్యాక స్వతంత్రించిన కళింగను అశోకుడు మళ్ళీ జయించాడనీ తెలుస్తున్నది.

అశోకుడు కళింగను జయించిన కధనంలోని అత్యంత ప్రముఖమైన హతుల సంఖ్య ఎంత అన్నది గుభేల్ దస్త్రంలా తయారైంది.అశోకుడు వ్రాయించాదని చెప్తున్న 14వ శిలాశాసనం "లక్ష మందియో.." అని కాకిలెక్కని చెప్తున్నది.ఇదెక్కడి చరిత్ర!తను స్వయాన తన మార్పును గురుంచి చెప్పుకుంటూ వ్రాయించుతున్న శిలాశాసనంలో చనిపోయిన సైనికుల లెక్క వస్తున్నప్పుడు "అంతమదియో అంతకు ఎక్కువో చచ్చి ఉందవచ్చును?" అనే రకం మాటలు చెప్పవచ్చునా?"ఎంతమంది ఛస్తే ఏంటి?చెడ్డ హిందూమతం ప్రభావంలో చంపాను.ఒక బౌధ్ధ సన్యాసి అహింస గురించి క్లాసు పీకాడు.నాకు ఏడుపొచ్చింది,మంచి బౌధ్ధంలోకి  మారాను,అంతే - నమ్మితే నమ్మండి లేకపోతే లేదు" అనే రకం పిచ్చ వాగుడుని మనం యదార్ధం అని వొప్పుకోవాలా!

కొందరు చరిత్ర కారులు లక్షా యాభై వేలు అంటున్నారు,కొందరు చరిత్రకారులు అరవై వేల మంది అంటున్నారు,కొందరు స్తనశల్య పరీక్ష చేసి రెండు వైపులా కలిపి పది లక్షల మంది సైనికులు చచ్చిపోయారని అంటున్నారు.ఒకే ఒకసారి జరిగిన ఒక భయంకరమైన యుధ్ధంలో చచ్చిపోయిన సైనికుల లెక్కలు నిక్కచ్చిగా తేల్చలేకపోవడం ఏంటి?46.1 మిలియన్ల బ్రిటిష్ ప్రజలలో మొదటి ప్రపంచ యిధ్ధంలో పాల్గొన్న సైనికులు ఎంతమందో తెలుసా - 6,100.000!39.0 మిలియన్ల ఫ్రెంచి ప్రజలలో మొదటి ప్రపంచ యిధ్ధంలో పాల్గొన్న సైనికులు ఎంతమందో తెలుసా - 8.100,000!కవులూ కళాకారులూ ఎంత చిన్న విషయం తెలిస్తే అంత స్థాయిలో తమ కళను బట్టి కావ్యాలనూ కళారూపాలనూ రూపుదిద్ది తమ పాప్యులారిటీ కోసం వాడుకోకుండా ఎలా స్తబ్దంగా ఉందగలరు?అప్పటి కళింగ రాజ్యపు భౌగోళిక వారసత్వం ఉన్న విశాఖ ప్రాంతపు సూర్యవంశపు రాజులైన గజపతులు పూర్వ సామాన్య శకం 261 నాడు ఇక్కడ లక్ష మంది సైనికులు వధించబడిన ఒక భయంకరమైన యుధ్ధం జరిగితే తమ రాజ్యపు చరిత్రలో నమోదు చెయ్యరా?

పూర్వ సామాన్య శకం 261 నాడు మగధను పరిపాలించిన అశోకుడు అనే ఘోప్ప్ప చక్రవర్తులుంగారు వ్రాయించిన శిలాశాసనాలు మొదటిసారి సామాన్య శకం 1915లో బయటపడ్డాయి - ట!ఐతే అందులో ఆ శాసనాలు వ్రాయించినది అశోకుడే అని తెలియట్లేదు - ట!ఎందుకంటే, శాసనకర్త తనను గురిచ్చి అసలు పేరు చెప్పలేట్ట - "దేవనం పియ్య!పెంటదర్శి!" అని బిరుదులు మాత్రమే వాడుకున్నాట్ట!దాంతో లోర్డు కన్నింగుహోంసు గాడు డిటెక్టివు షెర్లాక్ హోంసు అయిపోయి అడేజావు బడేజావు అని వెతికితే ఇంకో బుల్లి శాసనంలో "వాడే వీడు,వీడే వాడు" అని చరిత్ర కారుల బుర్ర బల్బులు ఒకేసారి డింగ్ అని వెలిగిపొయ్యాయి - ట!

అశోకుడి పేరున నిన్నటి రోజున హాయిస్కూళ్ళలో మనం చదువుకున్నదీ ఇప్పటికీ M.A History కుర్రాళ్ళు చదువుకుంటున్నదీ ఒక సర్వాబధ్ధాల కట్టు కధ!పైన నేను లోర్డు కన్నింగుహోంసు గాడు అన్నది 1871లో స్థాపించిన Archaeological Survey of Indiaకి first Director General అయిన ALEXANDER CUNNINGHAM అనే నీచాతినీచుడి గురించి.భారత దేశపు వాస్తవ చరిత్రలో లేని గౌతమ బుధ్ధుణ్ణీ అశోకుణ్ణీ కాళిదాసునీ సమస్తమైన హిందూద్వేషులకీ మూలపురుషుల వలె శోభిస్తున్న వందకు పైన ఉన్న కల్పిత వ్యక్తుల్నీ వాస్తవ వ్యక్తుల కింద భారత దేశపు వాస్తవ చరిత్రలోకి దూర్చిన స్కవుండ్రలాతిస్కవుండ్రల్ వీడు.

1915లో "దేవనం పియ్య!పెంటదరిశి!" అని చెప్తున్న శిలాశాసనం దొరికింది ఎవడికో తెలుసా మీకూ ఎమ్మ్యే హిస్టరీ ప్రొఫెసర్లకీ?ఆ శాసనాన్ని బయటకు తీసినవాడు C. Beadon చరిత్రవేత్త కాదు, ఒక British gold-mining engineer - నవ్వు రావట్లేదూ మీకు!ఇప్పటికీ వాళ్ళు తవ్వి తీసిన శిలాశాసనాలు నిజమే అని నమ్మి ఎమ్మ్యే హిస్టరీ కుర్రాళ్ళని కూడా నమ్మిస్తున్నందుకు ఇండియన్ యూనివర్సిటీల్లోని హిస్టరీ ప్రొఫెసర్లు అందరూ సిగ్గంటూ ఉంటే వాళ్ళ ఉద్యోగాలకి రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవటం బెటర్.

నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ - M.Sc Zoology with Anmal Physiology as Main.సబ్జెక్ట్ తేడా ఐనప్పటికీ సైంటిఫిక్ రీసెర్చికి సంబంధించిన మెధడాలజీ ఒకటే గనక హిస్టరీకి సంబంధించిన రీసెర్చి ఎలా జరగాలో తెలుసు నాకు.C. Beadon అనే ఒక బంగారు గనుల తవ్వకం గాడు "దేవనం పియ్య!పెంటదరిశి!" అని చెప్తున్న శిలాశాసనం ఒకటి తెస్తే అది నిజమో కాదో నిర్ధారించుకోవాలా వద్దా?ఎట్లా నిర్ధారించాలి అని అడుగుతారు కదూ!ఆ ప్రత్యేకమైన శిలాశాసనం దొరికిన ప్రదేశపు స్థానిక చరిత్ర మీ దగ్గిర ఉండాలి.ఆ పూర్వ సామాన్య శకం 261 నాడు కళింగను జయించిన ఆ అశోకుడు అనే రాజు అక్కడ ఆ శాసనం వ్రాయించాడనే వివరం ఏదో ఒక సాహిత్య రూపంలో నమోదు అయి ఉండాలి.ఏ శాసనం గురించీ దానికదే సాక్ష్యం అని బైబిలు గురించి పాస్టర్లూ ఖురాను గురుంచి ముల్లాలూ చెప్పినట్టు ఆకుకు పోకకు అందని సుత్తి సుధాణం కబుర్లు చెప్పకూడదు.

సామాన్య శకం 1915 నాటికి ముందర అశోకుడి గురించి మధ్యయుగాల నాటి భారతదేశపు చరిత్రకారులకి తెలియకపోవడానికి వాళ్ళు చెప్పిన దుర్మార్గమైన అబధ్ధం ఏమిటో తెలుసా - దిక్కు మాలిన అనాగరికపు హిండియన్సుకి చరిత్ర రచన అంటే ఏంటో తెలియదు - ట!సా.శ 1915 నుంచి 1920 లోపు చిన్నవీ పెద్దవీ కలిసి నలభై శిలా శాసనాలు దొరికేశాయి ఇంగ్లీషోళ్ళకి.ప్రపంచ స్థాయి తాయిగండ వెధవలైన భారత కమ్యూనిష్టు చరిత్రకారులు స్వతంత్రం వచ్చాక కూడా ఇంగ్లీషోళ్ళు చెప్పిన  పిచ్చికధల్నే పరమ సత్యాల కింద ప్రచారం చేశారు ."How the rock digger came to know of exact locations of rocks buried far away." అనే చిన్న డౌటు ఇప్పటి యూనివర్సిటీ ప్రొఫెసర్లకీ రావడం లేదంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు.

అది హిస్టరీయా ఫిజిక్సా కెమిస్ట్రీయా అనే కాదు,యూనివర్సిటీలలో జరిగే ప్రతి రీసెర్చికీ డాక్యుమెంటేషన్ ఉండి తీరాలి - Title, Abstract, Introduction, Theory/Analysis, Materals and Methods,Experiments or Data assimlation, Result or Conclusion, Discussion or Suggestions, Acknowledgements, Bibliography అనేవి ఉంటాయి,ఉండాలి,ఉండి తీరాలి.ఇప్పుడు మనముందున్న అశోకుడు వ్రాయించాడని వాళ్ళు చెప్తున్న శిలాశాసనాలు అలాంటి శాస్త్రీయమైన పరిశోధన జరిపితే బయటపడినవి కావు.లోర్డు కన్నింగుహోము గాడిలాంటి స్కవుండ్రలాతిస్కవుండ్రల్సు కొంతమందికి డబ్బులిచ్చి చెక్కించి అక్కడ పాతిపెట్టించినవి. నిజానికి ఇలా చరిత్రని మార్చిపారెయ్యటానికి యూరోపియన్లే పెట్టుకున్న ముద్దు పేరు ఒకటుంది - Doctoring the History అంటారు దీన్ని.ఆ శాసనాల్ని అన్నిట్నీ రాసింది James Prinsep అనే మరొక స్కవుండ్రలాతిస్కవుండ్రలు గాడు.

భారత దేశపు వాస్తవ చరిత్రలోని సంస్కృత భాష మాట్లాడిన సుగత బుధ్ధుడు పూర్వ సామాన్య శకం 1900వ సంవత్సరం నాడు ఉన్నాడు.పూర్వ సామాన్య శకం 563 నాటి పందిమాంసం తింటూ పాళీ భాష మాట్లాడిన గౌతమ బుధ్ధుడు కల్పిత పాత్ర.ఈ కల్పిత పాత్రని వాస్తవ వ్యక్తిని చెయ్యడం కోసం బ్యాడ్ హిందూయిజం నుంచి గుడ్డు బుడ్డిజానికి కన్వర్ట్ అయిన అశోకుడు అనే ఒక ఘోప్ప రాజుని కూడా చరిత్రలోకి దూర్చేశారు.

ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాలి ఇక్కడ - అశోకుడే లేనప్పుడు ఇప్పుడు మన దేశ పతాకం మీద కనిపిస్తున్న అశోక చక్రం ఎక్కడిది?హ్మ్,అది మరొక లిఫ్ట్ కరాడే దంచుడు ఎత్తిపోతల యవ్వారం.అది వైదిక సంస్కృతికి సంబంధించిన ధర్మచక్రం!వైదిక ధర్మంలోని అతి ముఖ్యమైన అనురాగం, పరాక్రమం, ధైర్యం, శాంతం, మహానుభావత్వం, ప్రశస్తత్వం, శ్రధ్ధాతత్వం, మృదుత్వం, నిస్సంగత్వం, ఆత్మనియంత్రణత్వం, ఆత్మహవనత్వం, సత్యవాదిత్వం, ధార్మికత్వం, న్యాయతత్వం, కారుణ్యత్వం, రాజసత్వం, అమానిత్వం, ప్రభుభక్తి, కరుణావేదిత్వం, ఆధ్యాత్మికత్వం, అకళంకితత్వం, అనాదిత్వం, ఆపేక్షత అనే 24 తత్వాలకి అవి ప్రతీకలు. పౌరులు,ప్రభువులు అనే ఇరు వర్గాలూ వీటిని అలవర్చుకుంటే ఆ రాజ్యం సర్వసమృధ్ధిని సాధిస్తుంది.

తమాషా ఏంటో తెలుసా - కొత్త పులుముడు బుడ్డిష్టు పిటక సంహితలు అన్నీ అశోకుడు ఒక్కడే తన జీవిత కాలంలో 84,000 మోనాస్టరీలు కట్టించాదని టముకేస్తున్నారు గానీ అశోకా ది గ్రేటు గారు వ్రాయించిన శిలా శాసనాల్లో "నేను పుట్టాను.తమ్ముళ్ళని చంపాని.కళింగని దుంప తెంచాను.నేను యేడ్చాను,బుడ్డిజం పుచ్చుకున్నాను" అనే సుత్తి తప్ప మోనశ్టెరీలు కట్టించిన లెక్క లేదు.మరి కొత్త బుడ్డిష్టు హిస్టోరియన్సుకి ఈ 84,000 మోనాస్టెరీల ఇవరం ఎట్లా తెల్సింది!మరీ ఇసిత్రం యేంటంటే అశోకుడు ఘారు వ్రాయించిన శిలా శాసనాల్లో బుధ్ధుడు ఫలానా బోధ చేశాడు అని చెప్తూ పొగడుతున్న మాట ఒక్కటి లేదు - హేఁవిటో మరేవిషోను,ఇదా ఇస్టొరీ అంటేనూ!

మనం చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్న చరిత్ర ప్రకారం క్రీ.పూ 326లో మాసిడోనియా ప్రభువైన అలెగ్జాండరు ఇప్పటి పంజాబు రాష్త్రంలోని జీలం నది వొడ్డున పురుషోత్తముడ్ని ఓడించాడనీ,కానీ ఓడిపోయిన పురుషోత్తముడి పరాక్రమానికి మెచ్చి గొప్ప ఔదార్యం గల నీతిమంతుడిగా అలెగ్జాండరు అతని రాజ్యం అతనికి తిరిగి ఇచ్చివేశాడనీ ఇప్పటికీ మనందరం యెంతో అమాయకంగా నమ్ముతున్నాము, కదూ!

అలెగ్జాండరు పురుషోత్తముల మధ్యన జరిగిన యుధ్ధానికి సంబంధించి మనం చదివిన విషయాలకు ఆధారాలు గ్రీకుల చరిత్రలో కన్నా ఆంగ్లేయులైన ఆధునిక చరిత్రకారుల ఉల్లేఖనాల నుంచే లభిస్తున్నది - కారణం యేమిటి?గ్రీకుల వైపు నుంచి అలెగ్జాండరు తప్ప ఇంకెవరూ భారతదేశాన్ని గెలవాలనే ఉద్దేశంలో లేరు,వారి ముఖ్యశత్రువు పర్షియా - దాన్ని గెలిచారు,అందుకే ఇక ముందుకు వెళ్ళడానికి వ్యతిరేకించారు.!బ్రిటిషు చరిత్రకారుల కల్పనాత్మకపు విశ్లేషణయే తప్ప అలెగ్జాండరుకి సైతం ప్రపంచవిజేత కావాలనే కోరిక ఉన్నదనే గట్టి సాక్ష్యాలు లేవు.

మనం చదువుకుంటున్న ఇవ్వాళ్తి చరిత్రకారులు చెప్తున్నట్టు భారతదేశపు చరిత్రలో కల్లా అతి ముఖ్యమైన సంఘటన కూడా కాదు ఆనాటి వాళ్ళకి,ఈ యుధ్ధంలో అలెగ్జాండరు పురుషోత్తముడి చేతిలో ఓడిపోవటాన్ని భారతదేశపు చరిత్రలో ప్రముఖంగా పేర్కొనబడక పోవటానికి కారణం - అప్రధానమైన విషయాలు చరిత్ర రచనలోకి యెక్కిస్తారా యెవరైనా?ఎక్కడో గ్రీకు దేశం నుంచి ఒక అనామకుడు వచ్చాడు,పురుషోత్తముడు అనే ఒక చిన్న రాజ్యపు అనామక రాజు చేతిలో ఓడాడు,తను గెల్చిన సంపదని గెల్చిన రాజుకి వొదిలి దారి ఖర్చులు అడుక్కుని వెళ్ళాడు - అంతకన్నా అధ్భుతం జరగలేదు!

యుధ్ధంలో పురుషోత్తముడే గెలిచాడనేటందుకు సాక్ష్యాలు సేకరించడం కూడా అనవసరమే -  ఇప్పుడు ప్రచారంలో ఉన్న కధలోని వైరుధ్యాలని చూపిస్తే చాలు.పురుషోత్తముణ్ణి ఓడించి ఆ రాజ్యాన్ని తనకి ఇవ్వమని అలెగ్జాండరుతో ఒప్పందం కుదుర్చుకున్న తక్షశిల రాజు అంభి మీకు గుర్తున్నాడనుకుంటాను!సహజంగా అలెగ్జాండరుతో విజయయాత్రకి బయలుదేరిన ఇతరులు ప్రాధమిక లక్ష్యమైన పర్షియా మీద గెలుపుతో వెనక్కి తిరగాలని అనుకోవటం వల్ల అలెగ్జాండరు కూడా ఇక వెనకి వెళ్ళిపోయే వాడో యేమో గానీ అంభితో ఒప్పందం ఖరారు చేసుకోవడం వల్లనే అతను పురుషోత్తముడి రాజ్యం మీదకి వచ్చాడని స్పష్తంగా తెలుస్తున్నది గదా!మరి,గెలిచాక పురుషోత్తముడు యెంత వీరోచితంగా పోరాడినా అంభితో తను చేసుకున్న ఒప్పందాన్ని భగ్నం చేసేటంత అమర్యాదకరమైన పని యెందుకు చేస్తాడు?ఇక్కడ ఇంకో క్యామెడీ కూడా ఉంది!యుధ్ధం తర్వాత పురుషోత్తముడికి తన సొంత రాజ్యం మాత్రమే దక్కలేదు,అంబి రాజ్యం కూడా కలిసింది - యేమి వింత?గొప్ప పధకం వేసి నది దాటి చుట్టు తిరిగి వచ్చి వెనకనుంచి దాడి చేసి యుధ్ధంలో గెలిచిన వాడు తన చేతిలో ఓడిపోయిన వాడికి  తను యేవరితోనైతే గెలిచాక పురుషోత్తముడి రాజ్యాన్ని ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడో ఆ రాజ్యాన్ని కూడా ఓడిపోయిన రాజుకి దఖలు పర్చేశాడట!

మన దేశపు కమ్యూనిష్టు చరిత్రకారుల్ని నేను ప్రపంచ స్థాయి తాయిగండ వెధవలు అని అనడానికి ఇది బలమైన సాక్ష్యం అవుతుంది కదూ!"లేదు,కాదు,సాక్ష్యం చూపించాల్సిందే సాక్ష్యం లేని నింద వెయ్యకూడదు.అది మానవత్వం అనిపించుకోదు" అంటారా?చూపిస్తాను.Marshal Gregory Zhukov అనే రష్యన్ యుధ్ధనీతి విశారధుడు ఈ యుధ్ధాన్ని గురించి ప్రస్తావిస్తూ అలెగ్జాండరు నేతృత్వంలో మాసిడోనియన్లు భరతఖండంలో జరిగిన యుధ్ధంలో దారుణంగా పరాజితులయ్యారని ప్రస్తావించాడు.“Following Alexander’s failure to gain a position in India and the defeat of his successor Seleucus Nikator, relationships between the Indians and the Greeks and the Romans later, was mainly through trade and diplomacy. Also the Greeks and other ancient peoples did not see themselves as in any way superior, only different.” - ఇదీ అతను నిష్కర్షగా తేల్చి చెప్పిన విషయం, ఇంకా అనుమానంగా ఉందా?అలెగ్జాండరు యుధ్ధంలో ఓడిపోతేనే అంబి రాజ్యాన్ని కూడా పురుషోత్తముడికే దఖలు పర్చడం తార్కికంగా సరయినది అవుతుంది!ఆ యుధ్ధంలో తగిలిన గాయాలతోనూ ఆ ఓటమి వల్ల కలిగిన మనోవ్యధతోనూ మరణించడం జరిగిందనేది యదార్ధంగా తోస్తున్నది.

అన్నట్టు, చాణక్యుడూ మౌర్య చంద్రగుప్తుడూ అలెగ్జాండరు సమకాలికులే నండోయ్!అలెగ్జాండరు దారిలోనే చచ్చిపోయాడు గనక అప్పటి గ్రీకులకు రాజయిన సెల్యూకస్ నికటోర్ తరపున మెగస్తనీస్ అనే చరిత్ర రచన తెలిసిన పండితుడు గ్రీకు రాయబారిగా వచ్చి కొంత కాలం గడిపి తిరిగి వెళ్ళాడు.అతను ఇక్కడ తను చూసిన విషయాల్ని నమోదు చేసిన ఇండికా అనే పేరున మనకి దొరుకుతున్నది.గ్రీకులకి మన రాజుల పేర్లు లపకటం చాతకాక చంద్రగుప్తుణ్ణి సాండ్రకోటస్ అన్నారని లోర్డు కన్నింగుహోము అనే స్కవుండ్రలాతి స్కవుండ్రలు మొదలు పెడితే  ప్రపంచ స్థాయి తాయిగండ వెధవలైన మన దేశపు కమ్యూనిష్టు చరిత్రకారులు కొనసాగించిన వెకిలి తనాన్ని తనని గౌరవించిన మౌర్య చంద్రగుప్తుడి పట్ల మర్యాదస్తుడైన మెగస్తనీస్ చూపించలేదు.పూర్వ సామాన్య సకం 350 మొదలు పూర్వ సామాన్య శకం 290 వరకు జీవించిన మెగస్తనీస్ భారతీయులకి అదీ హిందువులకి తప్పుడు చరిత్ర చెప్పి పిచ్చెక్కించాలనుకున్న స్కవుండ్రల్సుకి పనికొచ్చే నకిలీ చరిత్ర వ్రాయలేదు.తను చూసిందే చెప్పాడు.

ఇప్పుడు మనం ఉందనుకుంటున్న చాతుర్వర్ణం ఆనాటికి సైతం లేదు.భగవద్గీతలో సైతం కనపడుతున్నది కాబట్టి ఒకప్పుడు ఉందేమో అనుకుని సహిస్తున్న చాతుర్వర్ణం కూడా మన దేశంలోని కల్ల గురువుల,పుట్టు బ్రాహ్మణుల సాయంతో వీదెశీయులు మన మెదళ్ళకి యెక్కించినదే - అణుమాత్రం సందేహం లేదు నాకు!

చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహు అనే సన్నాసి బోధనలు విని జైనమతం పుచ్చుకుని శ్రావణ బెళగొళ పోయి ఆమరణ నిరాహార దీక్ష పట్టి చచ్చిపోయాడని లోర్డు కన్నింగుహోము అనే స్కవుండ్రలాతి స్కవుండ్రలు మొదలు పెడితే  ప్రపంచ స్థాయి తాయిగండ వెధవలైన భారత దేశపు కమ్యూనిష్టు చరిత్రకారులు కొనసాగించినది కూడా పచ్చి అబధ్ధం.మెగస్తనీసు ఒక్కడే గాక డిమిట్రియస్ వంటి ఇతర గ్రీకు రాయబారులు చెప్తున్న అన్ని వివరాలూ ఒకేలా ఉన్నాయి.అవి వాళ్ళు చూసినది వ్రాసిన పచ్చి నిజాలు కాబట్టి ఒకేలా ఉన్నాయి.వాటి ప్రకారం చాణక్యుడు కుటిలుడు కాదు.చంద్రగుప్తుడికి అడ్డం వస్తున్నారని ఇతర్లని వాదుకుని కుట్రలు చేసి వదిలించుకోవటం లాంటి సంఘటనలు అసలు జరగనే లేదు.చాణక్యుడి అర్ధశాస్త్రంలోని అతి ముఖ్యమైన సూక్తి ఇది:

क्षमया दयया प्रेम्णा सूनृतेनार्जवेन

वशीकुर्याज्जगत्सर्वं विनयेन सेवया

(Kshamayaa dayayaa premnaa soonritenaarjavena cha

Vasheekuryaajjagatsarvam vinayena cha sevayaa)

“క్షమ,దయ,ప్రేమ,సత్యవాక్పాలన అనే గుణాలు ఉన్న సత్పురుషుడు ప్రజల పట్ల వినయంతో ప్రవర్తిస్తూ సేవతో వాళ్లని మెప్పించి ప్రపంచాధిపత్యాన్ని సైతం అతి తేలికగా సాధిస్తాడు.”ఇటువంటి చాణక్యుదు రాజ్యసాధన కోసం కోసం హత్యలు చేస్తాడా?తన శిష్యుడైన చంద్రగుప్తుణ్ణి మాత్రం హత్యలకి ప్రేరేపిస్తాడా!

ఇంతకీ మనం పట్టించుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా - మెగస్తనీస్ ఎప్పటివాడు?పూ.సా.శ 300 నాటివాడు.పూ.సా.శ 200 నాటి అశోకుడి గురించి తెలికపోవడం సహజమే గానీ మరి పూ.సా.568 నాటి గౌతమ బుధ్ధుడి గురించి తెలిసి ఉండాలే!అస్సలు తెలీదంటండి,పాపం మెగస్తనీసుకి ఆసియా ఖండపు అకండకాంతిపుంజామ్ల గురించి!మరీ మెగస్తనీసు గారి ఛాదస్తాల అఘ్ణాణం గాకపోతే హమహావీర జైనతీర్ధంకరాకర గారి గురించి కూడా తెలీట్ట!

మన దేశపు చరిత్రకారులు నిర్ధారించి చెప్పటానికి ఎంత కాలం పడుతుందో తెలియదు గానీ బింబిసారుడు,అశోకుడు అనే తండ్రి కొడుకులు భారత దేశపు గడ్డ మీద పుట్టి బతికి చచ్చిన వాస్తవ వ్యక్తులు కాదనేది ఎవడన్నా కాదంటే ముక్కు మీద గుద్ది మరీ వాడి చెవిడొప్పలు గింగుర్లెత్తేలా అరిచి చెప్పాల్సినంత పచ్చి నిజం.భారత దేశపు వాస్తవ చరిత్రలో బింబిసారుడు, అశోకుడు అనే కల్పిత పాత్రలు గాక చంద్రగుప్త మౌర్యుడు->బిందుసారుడు->అజాతశత్రుడు మాత్రమే ఉన్నారనేది కూడా ఎవడన్నా కాదంటే ముక్కు మీద గుద్ది మరీ వాడి చెవిడొప్పలు గింగుర్లెత్తేలా అరిచి చెప్పాల్సినంత పచ్చి నిజం.

సంఝే!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...