Tuesday, 26 April 2022

కల్ల గురువులని తారణకర్తలని నమ్మి చెడ్డారు హిందువులు!

మొదటిసారి కోట తలుపులు తెరిచి టిప్పు సుల్తాన్ పరాజయానికి కారణమైన పూర్ణయ్య పంతులు గురించి తెలుసుకున్నప్పుడు అతను కూడా చంద్రబాబు ఉద్యోగం నుంచి తీసేసినందుకు  బాధపడి విసాయిరెడ్డితో కలిసి పింక్ డైమండ్ గురించి అబద్ధం చెప్పి ఎట్టకేలకు ప్రభుత్వం మారి తిరిగి తనకు ఉద్యోగం ఇచ్చిన జగన్ని శ్రీమహావిష్ణువని పొగిడిన రమణ దీక్షితులు లాంటి అతి సామాన్యుడైన బీద బ్రాహ్మణుడు అయి ఉంటాడని అనుకున్నాను.తీరా చూస్తే టిప్పు సుల్తాన్ హిందూ దేవాలయాల్ని కూలగొట్టాడని ఇప్పటి అతి హిందూత్వ వాదులు చెప్తున్న అన్ని యుద్ధాలలోనూ సర్వసైన్యాధ్యక్షుడి హోదాలో సైన్యాలను నడిపించాడు.

కృష్ణాచార్య పూర్ణయ్య అనే ఈ బ్రాహ్మణోత్తముడు టిప్పు సుల్తానుకి సలహాదారులైన మంత్రులలో అత్యంత కీలమైన ముఖ్యసచివుడు.Salman Khurshid లాంటి ఫేక్ హిస్టోరియన్స్ మాత్రమే టిప్పుసుల్తాన్ యొక్క మంత్రివర్గంలో ఉన్న ఒకే ఒక హిందువు పూర్ణయ్య అని అబద్ధాలు చెప్తారు.నిజానికి మతం మారినట్టు అబద్ధం చెప్పి Mir Miran అనే పేరుతో చెలామణి అవుతూ టిప్పుని మోసం చేశాడు.టిప్పు చేసిన ప్రతి యుద్ధంలోనూ పాల్గొన్నాడు గనక ఇప్పటి అతి హిందూత్వ వాదులు ఆయా భీబత్సాలకి టిప్పుతో పాటు పూర్ణయ్యను కూడా తప్పు పట్టాల్సిందే.మతపరమైన కారణాలతో టిప్పుని మనవాడు కాదంటున్న అతి హిందూత్వ వాదులు "టిప్పు కేరళ మీద చేసిన యుద్ధానికి టిప్పు వైపున ఫ్రాన్సు నుంచి ఆంగ్ల సామ్రాజ్యవాదాన్ని ప్రపంచం మీద రుద్దుతున్న దొంగ యూదుల మంద ఉన్నారు.ఇటువైపున కేరళ వైపున ఉన్నది బ్రిటన్ నుంచి ఆంగ్ల సామ్రాజ్యవాదాన్ని ప్రపంచం మీద రుద్దుతున్న దొంగ యూదుల మంద ఉన్నారు.మనం ఎవరికోసం ఏడ్చి ఎవర్ని తిట్టటం న్యాయం?" అనే ప్రశ్నని  వేసుకోవాలి.

తలుపులు తెరవడం, చిన్న పాటి యుద్ధం జరగడం కూడా మనచేత చదివించటానికి,అంటే మనకి చెవుల్లో పువ్వులు పెట్టటానికి పులిమిన పిట్టకధ - CE 1799 నాడు టిప్పు సుల్తాన్ చచ్చిపోయింది యుద్ధం జరుగుతున్నప్పుడు కాదు, అల్పాహారం తీసుకుంటున్నప్పుడు పేలిన తుపాకి గుళ్ళకి బలై చచ్చిపోయాడు!అప్పటికి పూర్ణయ్య పంతులు ఇంగ్లీషువాళ్ళతో కలిసిపోయి చాలా కాలం అయింది. హైదరాలీ కాలం నాటి పూర్ణయ్యకీ టిప్పు సుల్తాన్ కాలం నాటి పూర్ణయ్యకీ స్వభావంలో గానీ విధేయతలో గానీ చాలా తేదాలు ఉన్నాయి.పూర్ణయ్యకి హైదరాలీ ఇచ్చిన మర్యాద టిప్పు సుల్తాన్ ఇవ్వలేదని చెప్పటానికి లేఖన పరమైన ఆధారం ఉంది.హైదరాలీ కాలం నాడు కృష్నాచార్య పూర్ణయ్య అనింపిలిపించుకున్న వ్యక్తి టిప్పు సుల్తాన్ కాలం నాడు మీర్ మిరాన్ పేరును తగిలించుకోవడం,పూర్ణయ్య కూతురు మానభంగానికి గురై టిప్పు ఉంపుడు గత్తెల మందలో చేరడం,పూర్ణయ్యతో పాటు ఇంకొందరు కడప ప్రాంతం మీద హక్కులు ఇస్తే టిప్పుని అప్పగిస్తామని నిజాముతో బేరాలు చెయ్యడం,కుట్రని పసికట్టిన టిప్పు అందర్నీ జైల్లో పెట్టి కొంత కాలం తర్వాత పూర్ణయ్య అసలు కుట్రతో తనకి సంబంధం లేదని బతిమిలాడుకుంటే అతన్ని మాత్రం తిరిగి ప్రభుత్వంలోకి తీసుకోవటం లాంటివి చాలా జరిగాయి.

భారతదేశపు బ్రాహ్మణుల్లో అతి ప్రాచీన కాలం నుంచి వైదిక సాహిత్యాన్ని నిలిపి ఉంచిన ప్రాతస్మరణీయులూ ఉన్నారు,మధ్య యుగాల నాడు రాజ్యతంత్రంలో అఖండ ప్రజ్ఞాధురీణులైన చాణక్యుని వంటి యుగకర్తలూ ఉన్నారు,నవీన కాలంలో చెడి బతికిన వాళ్ళూ బతికి చెడిన వాళ్ళూ ఉన్నారు.కానీ పూర్ణయ్య పంతులు లాంటి చెడగరపు బతుకు మాత్రం ఎవడికీ లేదు.

ఒక తరంలో హైదరాలీ నెత్తిన పెట్టుకుని చూశాడు,మరుసటి తరంలో టిప్పు సుల్తాన్ కాళ్ళ కింద వేసి తొక్కాడు.మతం మారాడో లేదో తెలీదు గానీ కృష్ణాచార్య పూర్ణయ్య పేరుని వదిలి మీర్ మిరాన్ అయ్యాడు. టిప్పు సుల్తాన్ హిందూ దేవాలయాల్ని కూలగొట్టాడని ఇప్పటి అతి హిందూత్వ వాదులు ఏడుస్తున్న అన్ని యుధ్ధాలకూ సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో నాయకత్వం నడిపి అన్ని ఆలయ విధ్వంసాలనీ సాక్షిలా చూస్తూ నిలబడ్డాడు.శత్రువులకి తలుపులు తెరిచి సుల్తానుకి ద్రోహం చేశాడు.మళ్ళీ, గెల్చిన ఇంగ్లీషువాళ్ళు హైదరాలీ వూడగొట్టిన నాగటిదుంప వడయర్ల వంశాంకురాన్ని కుర్చీమీద కూర్చోబెట్టాల్ని చూసినప్పుడు మాత్రం నాలిముచ్చులా టిప్పు వంశాంకురాన్ని కుర్చీ ఎక్కించటానికి శతవిధాల ప్రయత్నించి విఫలుడై తను మాత్రం ఇంగ్లీషువాళ్ళను మెప్పించి వడయర్ల వంశాంకురానికి ప్రధానమంత్రి హోదాను సాధించాడు.కూతుర్ని టిప్పు మనుషులు చెరచడం లాంటివి ఇంగ్లీషోళ్ళతో బేరం కుదిరాక కల్పించి చరిత్రలోకి ఇరికించి ఉంటాడు - శత్రువులకి తలుపులు తెరిచి సుల్తానుకి ద్రోహం చెయ్యడానికి బలమైన కారణం కావాలి కద,ఇప్పుడు సెంటిమెంటు అదిరింది గదూ!

టిప్పుని అంత కాలం ప్రాణాలతో ఉంచటానికి దొంగ యూదుల మంద పిచ్చివాళ్ళు కాదు - టిప్పు చేత కేరళ లోని అత్యంత వైభవోపేతమైన ఆలయాల్ని బద్దలు కొట్టించారు. ఆలయాల నుంచి అపారమైన సంపదని శ్రీరంగపట్నానికి మోసుకొచ్చే వరకు ఆగారు.అప్పుడు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న టిప్పుని ఒకే ఒక బుల్లెట్ ఖర్చు చేసి అక్కవుంటు క్లోజ్ చేసేశారు.కేరళ హిందువుల ఆలయాల నుంచి దోచి టిప్పు మోసుకొచ్చిన సంపదని వీళ్ళు అప్పటికి కొన్ని నెలల ముందు అక్కడ లంగరు దించి ఎదురు చూస్తున్న clipper ships అనే రకం ఓడలకి ఎక్కించి లంగరెత్తి జర్మనీకి తరలించేశారు.దొంగ యూదుల మంద ప్రతి చిన్న పనినీ అది వాళ్ళు చరిత్రని తమకు లాభసాటి అయిన రీతిలో నడిపించుకోవటానికి పని గట్టుకుని చేసినది అని ఇతర్లకి అనుమానం రానివ్వని రీతిలో అనుకోని సంఘటనలా నడిపిస్తారు.

టిప్పు సుల్తాన్ వారసులూ సంకనాకి పొయ్యారు,వడయర్ల వారసులూ సంకనాకి పొయ్యారు గానీ పూర్ణయ్య వారసులు మాత్రం తెగ బలిసి పొయ్యారు.సా.శ 2013 నాడు WebEx Communications బెంగుళూరులో $4 million చెల్లించి స్వాధీనం చేసుకున్న CyberBazaar అనే conferencing company వ్యవస్థాపకుడైన రాజీవ్ పూర్ణయ్య అన్న పేరున్న గొప్ప వ్యాపారవేత్త గారు కృష్ణాచార్య పూర్ణయ్య అనే బ్రాహ్మణోత్తముడి వారసుడు గారు.పూర్ణయ్య పంతులు హిందూమతానికి చేసిన గొప్ప సేవ ఏమిటంటే అప్పటి శృంగేరి మఠం యొక్క పీఠాధిపతి సచ్చిదానంద భారతి అనే ఒక సామాన్య మానవుణ్ణి మానవాతీతుడైన సృష్టికర్తతో సమానం చేసేశాడు.

పూర్ణయ్య పంతులు ప్రధానమంత్రి అయ్యేనాటికి శృంగరీ పీఠాధిపతి గురించి ఒక మహిమ ప్రచారం అవుతూ ఉన్నది.ఆయనతో పండిత చర్చలకు ఇతరులు వచ్చినప్పుడు జగద్గురువు అయిన తనతో సామాన్యులు ముఖాముఖి చర్చ జరపటం భావ్యం కాదు గనక మధ్యన ఒక తెరను అమర్చమనే నిబంధన పెట్టాడట.అంతే గాక చర్చలో తన పక్కన కూర్చుని వాదిస్తున్న సరస్వతీ దేవి సామాన్యులకు తనను చూసే అర్హత లేదని ఆ ఏర్పాటు చెయ్యమన్నదని చెప్పాడట.మహా పండితుడైన పూర్ణయ్య పంతులు అనే బ్రాహ్మణ శ్రేష్ఠుడికి అందులోని సత్యాసత్యాలను నిర్ధారించాలనే గొప్ప ఆలోచన వచ్చి తనే సచ్చిదానంద భారతికి కబురు పెట్టాడట.

చర్చ మొదలైన కొన్ని గంటలకి అటువైపునుంచి సచ్చిదానంద భారతి కంఠస్వరానికి బదులు కలకంఠవధూకాకలీధ్వని రవళించడం మొదలైందట.అప్పుడు సంభ్రమాశ్చర్యానందవిభ్రమసందేహక్రోధాలు మనస్సుని ఘూర్ణిల్లడంతో పూర్ణయ్య పంతులు ఛెంగున ముందుకు దూకి డింగ్ అని శబ్దం వచ్చేలా తెరని పక్కకి లాగేశాడట. తన వాదనని వినిపించటంలో నిమగ్నమై ఉన్న కైటభదైత్యమర్దనునిగాదిలికోడలు పూర్ణయ్య పంతులు ఆధాటున తెర లాగుతాడని అనుకోలేదు కాబోలు - డింగ్ అని చప్పుడయ్యేసరికి తెల్లబోయి చూసిందట. వెంఠనే సత్యలోకం నుంచి ఇక్కడికి రావటానికి ఏర్పాటు చేసుకున్న విశ్వనాళిక తలుపులు గభాల్న తెరుచుకోక అధాట్న సచ్చిదానంద భారతి ద్రేహంలోకి దూకేసి మాయమైపోయిందంట!

దాంతో పూర్నయ్య పంతులుంగారు ఢామ్మని సచ్చిదానంద భారతి పాదాల మీద పడిపోయి కుళ్ళి కుళ్ళి యేడ్చాడంట - అంత గొప్ప పెద్ద మనిషిని అనుమానించి అవమానించినందుకు.యేడుపు మొహాన్ని కంటిన్యూ చేస్తూ ఇక లేచి నుంచుని సచ్చిదానంద భారతి సాక్షాత్తూ సృష్టికర్తయే అని ప్రకటించేసి పిచ్చి ముండా హిందువులు తరించటానికి కొత్త దేవుణ్ణి తయ్యారు చేసి ధన్యుల్ని చేశాడంట.

రాజకీయపరమైన అధికారం ఆంగ్ల సామ్రాజ్యవాదాన్ని ప్రపంచం మీద రుద్దుతున్న దొంగ యూదుల మంద యొక్క పెంపుడు కుక్క చేతిలో ఉండి, ఆధ్యాత్మిక పరమైన అధికారం ఆంగ్ల సామ్రాజ్యవాదాన్ని ప్రపంచం మీద రుద్దుతున్న దొంగ యూదుల మంద యొక్క పెంపుడు కుక్క చేతిలో ఉండి ఆ రెండు ఆణిముత్యాలూ ఐకమత్యం చూపిస్తే - సృష్టికర్త సైతం వాళ్ళిద్దరికీ ఉమ్మడి అమ్మకం సరుకు అవుతాడు!సచ్చిదానంద భారతి తర్వాత వచ్చిన శంకరాచార్యుడు నరసింహ భారతిలో ఆణిముత్యం లక్షణాలు లేక జగద్గురువు అయిన మూడేళ్ళకే అతన్ని పక్కకి తప్పించేసి ఆంగ్ల సామ్రాజ్యవాదాన్ని ప్రపంచం మీద రుద్దుతున్న దొంగ యూదుల మంద మరో ఆణిముత్యాన్ని జగద్గురువుని చేసింది.

శంకర పీఠాల అధిపతులలో చాలామంది జగద్గురువు బిరుదును తగిలించుకోవడం వ్యాపారం కోసమే తప్ప వారిలో ఆ బిరుదును తగిలించుకోవడానికి ఉండాల్సిన ఆధ్యాత్మిక పరమైన పవిత్రత శూన్యం.శూద్రులకి వేదాల మీద అధికారం లేదనీ ఉండకూడదనీ ఒకానొకప్పుడు శూద్రులు వేదాలను వింటే వాళ్ల చెవుల్లో సీసం కరిగించి పొయ్యమని బ్రాహ్మణులు శాస్త్రాలు రాశారని కట్టుకధలను చారిత్రక వాస్తవంలా ప్రచారం చేసింది పీఠాధిపతులే!

బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం తమిళనాడులో మాత్రమే పెరిగినది కాదు.1792-1856 మధ్యన జీవించిన వెలమ కులస్థుడు స్వామినేని ముద్దు నరసింహం వ్రాసిన "హితసూచని" అనే గ్రంధం ఒక విస్ఫోటనం అని చెప్పాలి.కందుకూరి వీరేశలింగం(1848-1919),గిడుగు రామామూర్తి(1863-1940),గురజాడ అప్పారావు(1862-1915) అనే ముగ్గురు మాత్రమే గాక అనేకమంది సంస్కర్తలను హితసూచని తయారు చేసింది.

మద్రాసు ప్రెసిడెన్సీలో 1916 నాడు పెరియార్ తదితరులు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ ప్రణాళిక  ప్రకటించే సమయానికి కృష్ణా గుంటూరు జిల్లాలలోని ప్రముఖ నగరవాసులు బ్రాహ్మణాధిపత్యం నుంచి వైదిక ధర్మాన్ని బైటికి లాగి వేదాన్ని అందరికీ పరిచయం చెయ్యాలన్న ప్రయత్నం చెయ్యటం మొదలై చాలాకాలం అయ్యింది.కమ్మ కులస్తుడైన త్రిపురనేని రామస్వామి చౌదరి(1887-1943) సూతాశ్రమం స్థాపించాడు.గుంటూరు జిల్లా ఒంగోలు తాలూకాలోని కొప్పోలు గ్రామనివాసి సింగమనేని రామయ్య యజ్ఞయాగాదులు జరిపించి తాను రామయాజి బిరుదును పొందటమే గాక 1908 నాడు మహేంద్రోపన్యాసం అనే గ్రంధం వ్రాసి ప్రచురించాడు.

అన్నింటికన్న సూర్యదేవర రాఘవయ్య చౌదరి "బ్రాహ్మణేతరోద్యమ తత్వము" అనే గ్రంధం చాలా విశిష్టమైనది.వీరిలో ఎవ్వరూ ఇప్పటి సాయి(బు)మతం,బ్రహ్మకుమారీ మతం,తొక్కలో మతం,బొక్కలో మతం అని కొత్త మతాల్ని పుట్టించి హిందూమతద్రోహానికి పాల్పడ లేదు. కొందరు పుట్టు బ్రాహ్మలు ఒళ్ళు కొవ్వెక్కి చెడగొట్టిన వైదిక ధర్మాన్ని శుభ్రం చేసి వైదిక ధర్మానికి ఒక గౌరవమైన గుర్తింపును తీసుకు రావడమే వారి లక్ష్యం.పరమహంస జి.యస్.బి సరస్వతి లాంటి బుద్ధి బ్రాహ్మణులు ఈ ఉద్యమానికి ఎంతో సహకారాన్ని అందించారు

ఇలా శూద్ర కులస్థులు తమ స్వంత మతంలోని ఆచార్యుల మీదనే తిరగబడి ఉద్యమాలు చెయ్యాల్సిన దుస్థితిని కల్పించినది పీఠాధిపతులే అనడానికి ఉన్న కొన్ని సాక్ష్యాలను చూపిస్తాను.1915వ సంవత్సరంలో అమృతలూరు గ్రామంలోని ఒక సంస్కృత పాఠశాలను సందర్శించిన పీఠాధిపతులు అక్కడ ఉన్న బ్రాహ్మణేతర కులాలవారిని "మేము వేదచర్చ చేస్తున్నాము గనక శూద్రులు బయటికి వెళ్ళిపొండ"ని పంపించేశారు.

అయితే, మన పెద్దలు వీళ్ళవలె మాతృధర్మద్రోహులు కారని శ్రీ సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారు నిరూపిస్తున్నారు.సా.శ 1000ల నాడు రెండవ అమ్మరాజ విజయాదిత్యుడు వ్రాయించిన కురవాడ శాసనం "అసీ ఛ్చిముఱు వాస్తవ్యో దేవార్యో దేవసన్నిభః,భరద్వాజాన్వయం కమ్మకులజః కులవర్ధనః, తస్యాం భవత్సుత శ్రీమాన్ గోవిందో గురునందనః, శ్రౌతస్మార్తక్రియాధార స్సత్తమ స్సద్విజోత్తమః" అని పేర్కొంటున్నది.ఇదొక్కటే కాదు,ఎపిగ్రాఫికా ఇండికా నమోదు చేసిన శిలా శాస్నాలలో సా.శ 1011ల నాడు పశ్చిమ చాళుక్య విక్రమాదితుడు వ్రాయించిన ఆలూరు శాసనం "విప్రకుళకమళభాస్కరం పార్వరోల్గండం, సప్తగ్రామాగ్రగణ్యం కమ్మకుళోద్భవం,ధీతగోత్రం దిండాపండితపుత్రం ఛాత్రక,మిత్రం పండితమండనం వెండియభట్టుం" అని పేర్కొంటున్నది.ఈ రెండింటినీ పరిష్కరించిన బ్రహ్మవేత్త శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులుగారు "ఈ శాసనములో పేర్కొనబడిన కమ్మకులజుడు దేవనయ్య శుద్ధ వైదిక బ్రాహ్మణుడుగా నున్నాడు.....ఇందు బేర్కొనఁబడిన కమ్మకులోద్భవుఁడైన వెండియభట్టు విద్వాంసుడుగను,ధార్మికుడుగను విప్రకుల కంల భాస్కరుడుగను వర్ణింపఁబడుచున్నాడు." అని తాత్పర్య సహితం అనువదించి చెప్పారు.అంతే కాదు,సా.శ 973 నాడు వంగ్రబోయ,కొళ్ళిపురబోయ,కురియెదబోయ వంటి ఆటవిక జాతుల వారు సైతం వేదం నేర్చుకుని కౌండిన్య గోత్రం తీసుకుని షట్కర్మ నిరతులై పంచమహాయజ్ఞక్రియలను  నిర్వర్తిస్తూ ఖ్యాతి గడించినట్టు తెలుస్తున్నది.

వెయ్యేళ్ళ క్రితం అన్ని కులాల వారికీ వేదం అందుబాటులో ఉండటం చారిత్రక వాస్తవం అయితే సా.శ 1915 నాడు ఈ పీఠాధిపతులు "మేము వేదచర్చ చేస్తున్నాము గనక శూద్రులు బయటికి వెళ్ళిపొండ"ని తరిమెయ్యడానికి పనికొచ్చే సాహిత్యం ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎందుకు సృష్టించారు?

వీళ్ళే!జగద్గురువులమని వాళ్ళకి వాళ్ళే బిరుదులు తొడిగేసుకుని పూర్ణయ్య సాయిబు లాంటి పుట్టు బ్రాహ్మల సాయంతో సరస్వతీ దేవిని పనిమనిషి స్థాయికి దిగజార్చిన సచ్చిదానంద భారతి లాంటి మాతృధర్మద్రోహులు మొదట తమకు నచ్చిన వారికి మాత్రమే వేదం నేర్పుతూ తమకు నచ్చని వారిని వేదాలకు దూరం చేసి వాళ్ళ చేత నిత్యం పాదపూజలు చేయించుకుంటూ తమను జగదుగురువులని నమ్మి పాదపూజలు చేస్తున్న సాటి మనుషులను నిరంతరం అజ్ఞానంలోనే ఉంచుతున్నారు.వీళ్ళు అసలు గురువులే కాదు - కల్ల గురువులు!

నాకు శ్రీవిద్యని పరిచయం చేసిన నండూరి శ్రీనివాసాచారులు గారే వాళ్ళ మేనమామ ఎక్కిరాల భరద్వాజ కుటుంబానికి వ్యాపార పరమైన లాభాలను తెచ్చిపెట్టటం కోసం ఒక సాయిబుని అపరిమితమైన పొగడ్తలతో నింపేసి వీడియోలు చేస్తున్నారు.ఆ సాయిబు మాంసం తిన్నప్పటికీ దోషం లేదని హిందువులకి నొక్కి చెప్పటానికి రాముడు మాంసం తిన్నాడని అబద్ధం చెప్పటానికి సైతం వెనుకాడటం లేదు. దీనివల్ల జరిగిన డ్యామేజి ఏంటో తెలుసా?విజయవాద నగరంలోనూ చుట్టుపక్కలా ఉన్న ధనికులైన కమ్మ కులస్థులు ప్రోత్సహించడం వల్లనే క్రైస్తవం పెరిగింది - లయోలా,మ్యారీస్టెల్లా,మాంటిస్సోరీ వంటి పేర్లు నగర సంస్కృతిలో విడదీయరాని భాగం అయ్యాయి.గుణదల మేరీమాత పాప్యులారిటీలోనూ వైభవంలోనూ కనకదుర్గతో పోటీ పడుతున్నది.విజయవాడ కమ్యునిష్టుల కంచుకోట అయ్యింది సైతం కమ్మ కులస్థుల అండదండలతోనే.కమ్యునిజం వూపు తగ్గే కాలానికి కాపుల అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఒక కమ్మ రౌడీ కమ్మ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఒక కాపు రౌడీ వాళ్ళిద్దరి పాప్యులారిటీ కోసం ఆ రెండు కులాలకీ కులపిచ్చిని అంటించారు.ఇదీ మనకు మంచి దారిని చూపించాల్సిన మన గురువులు మనల్ని చెడుదారిలో నడిపించిన పాపానికి ఫలితం.పాపం వాళ్ళు చేశారు ఫలితం మన నెత్తిన పడింది.ఇప్పటికీ దుర్గురువులకి తాము దుర్గురువులమనే సత్యం బోధపడటం లేదు - శిష్యులూ భక్తులూ తెలివి తెచ్చుకుని పిలకుచ్చుకుని నడ్డిమీదతన్ని రోడ్డుమీదకీడ్చి పారెయ్యాలి.

నిన్న గాక మొన్న ఒక సాయిబు 2030 నాటికి అల్లారాజ్యం వస్తుందని చెప్తున్న వీడియో చూశాను.కొంత కాలం  క్రితం అదే 2030 నాటికి 40 నెలలో 40 రోజులో గుర్తు లేదు గానీ మొదట సాతాను రాజ్యం వస్తుందనీ ఆ తర్వాత అది ఏసు మహిమతో దేవుడి రాజ్యం అయిపోతుందనీ ఒక పాస్టరు వేసిన పోస్టరు చూశాను.బ్రహ్మ కుమారీలు సైతం 2030 నాటికి శివపరమాత్మ తన రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్తున్న వీడియో ఒకటి చూశాను.మరి ఇంతమంది హైందవేతరులు ఆ ఫలానా 2030 నాడు వాళ్ళ మతరాజ్యం వస్తుందని చెప్తుంటే హిందూ మత ప్రచారకులూ ప్రవచన కర్తలూ 2030 నాటికి మన మతం కోసం ఏం చెప్తున్నారు?బహుశః "అన్ని మతాలూ చెప్పేది ఒక్కటే కాబట్టి మేము కూడా వాళ్ళని మన దేవుళ్ళతో సమానం అని చెప్పేశాం గాబట్టి వాటిల్లో ఏదో ఒక మతంలోకి మారిపొండి - ఈ రాజ్యం మందే అనుకోండి!" అని చెప్తారు కాబోలు.

కల్ల గురువులని తారణకర్తలని నమ్మి చెడ్డారు హిందువులు - "మ్రొక్కిన వరమీయని వేల్పును గ్రక్కున విడువంగవలయు" అన్నట్టు ఈ కల్ల గురువుల్ని తన్ని తగలెయ్యందే హిందువులు ప్రపంచాధిపత్యం సంగతి అటుంచండి కనీసం స్వదేశంలో స్వతంత్రులు కాలేరు.

జై శ్రీ రాం!

Sunday, 3 April 2022

జైన మతం మొదలు రామానుజ మతం వరకు గల మతాలు అన్నీ నాస్తిక మతాలే!

జైనమతం అనేది సకలవిద్యలసత్యగ్రంధం అయిన వేదంతో విభేదించి కొందరి స్వార్ధం కోసం జనన మరణాలు ఉండి జరారుజలను అనుభవిస్తున్న ఒక సామాన్యుణ్ణి సమస్తమైన యావన్మందికి ఏకేశ్వరుణ్ణి చేస్తూ సృష్టికర్తని అమ్మకపు సరుకులా వాడుకుంటున్న దుర్మార్గమైన మతం.వైదిక ధర్మంతో పూర్తి స్థాయి యుద్ధం చేసి గెలిచేటంత సంఖ్యాబలం లేక సఖ్యతను నటిస్తున్న ద్రవ్యలోభులైన కులీన మేధావి వర్గం (Profit Oriented Legally Imprialistic Clan Elites - POLICE) కనిపెట్టిన దోపిడీ ప్రక్రియలా అనిపించని ఒక జిత్తుల మారి జీవన విధానం అంటే ఏవరూ నమ్మలేరు కానీ అది నిజం.సృష్టికర్తని భోగవస్తువును చేసి తెలివికి తక్కువ ఆకలికి ఎక్కువ అన్నట్టు బతికేస్తున్న సమస్తమైన యావన్మందికి అమ్ముతూ తెలివికి ఎక్కువ ఆకలికి తక్కువ అన్నట్టు బతికేస్తున్న సోమరిపోతులకు విపరీతమైన లాభాలను తెచ్చిపెడుతున్నది.

జైనులు వాళ్ళ మతసాహిత్యంలొ రిషభ దేవుడు అనే ఆదినాధుడు తమ మతానికి మూలకర్త అని చెప్పుకుంటారు.హిందువులకి సంబంధించిన పౌరాణిక చారిత్రక వాజ్మయాలలో ఒక్కదాన్నీ ప్రమాణం కింద పరిగణించని భారత ప్రభుత్వం స్కూళ్లలోనూ కాలెజిల్లోనూ పిల్లలకి చెప్పాల్సిన చరిత్ర పాఠ్యాంశాలను నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన ణ్ఛేఋట్ సంస్థ పూ.సా. 4500 నాటి వర్ధమాన మహావీరుణ్ణి పూ.సా. 599 నాటివాడని చెప్పి బుద్ధుడికి సమకాలికుణ్ణి చేసి జైన మత స్థాపకుడు అని నిర్ధారించింది.

కొందరు తెలివి తక్కువ హిందువులు రిషభ దేవుడు విష్ణువు అవతారం కాదు శివుని రుద్రాంశ అని అంటున్నారు.ఇది పరమత సహిష్ణుత తమకు అధికం అని చంకలు గుద్దుకునే తెలివి తక్కువ హిందువుల గోల మాత్రమే.జైనం కూడా మన సోదర మతమే అని మనల్ని నమ్మించాలనుకుంటున్న తెలివి తక్కువ హిందువులు చెప్తున్న కట్టుకధల్ని అసలు జైనులే ఒప్పుకోరు.కీలకం ఏమిటంటే వేదం మీదా వైదిక ధర్మం మీదా తిరగబడి దానికన్న భిన్నమైనదని చెప్పుకుంటూ సొంత దేవుళ్ళనీ సొంత సృష్టి రచనా సిద్ధాంతాన్నీ సొంత కాల చక్ర వర్ణననీ సొంత పురాణ కధల్నీ వ్రాసుకున్న జైనమతాన్ని తెలివి తక్కువ హిందువులు వైదిక ధర్మం యొక్క శాఖ అని పొరపాటు పడ్డారు, పడుతున్నారు, పడుతూనే ఉంటారు.

"అది సకలావతారంబులకు మొదలి గని యైన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానం బయిన దివ్యరూపంబు; దానిం బరమ యోగీంద్రులు దర్శింతురు;" అంటూ మొదలౌతున్న పోతన విరచిత భాగవతం యొక్క ప్రథమ స్కంధము లోని ఏకవింశత్యవతారములు అనే శీర్షిక దగ్గిర "అష్టమ మూర్తిని మేరుదేవి యందు నాభికి జన్మించి యురుక్రముం డనం బ్రసిద్ధుండై విద్వజ్జనులకుఁ బరమహంస మార్గంబుం బ్రకటించె;" అని కనబడుతున్న వచనం జైనమత ప్రధమ తీర్ధంకరుడైన రిషభ దేవుడి గురించి చెప్తున్నదని అంటారు.కానీ, హిందువుల కోసం వ్రాసిన భాగవతం జైనం అనే దర్శనాన్ని సనాతన ధర్మంలోని ఒక శాఖలా భావించి కీర్తించాల్సిన అవసరం ఏమిటి?

హిందువుల పురాణ కధలు చెప్తున్న కల్యాది యుగ పరిమాణపు కాలాన్ని గ్రెగేరియన్ క్యాలేండరుకు మార్చి కుదించితే మేరుదేవి యందు నాభికి జన్మించి యురుక్రముం డనం బ్రసిద్ధుండైన రాజపురుషుడి జన్మ సంవత్సరం పూ.సా. 8190 అని తెలుస్తుంది.స్వాయంభువ మనువు నుంచి చూస్తే ఆయా రాజుల కాలనిర్ణయం ఇలా ఉంది - స్వయంభువ మనువు  పూ.సా. 8275 నాటివాడు, ప్రియవ్రతుడు పూ.సా. 8255 నాటివాడు,మధ్యలో అగ్నిధరుడు వస్తాడు,తర్వాత నాభిదేవుడు వస్తాడు,అప్పుడు నాభిదేవుని తనయుడైన రిషభుడు లేక వృషభుడు పూ.సా. 8190 నాటివాడు అవుతాడు.

ఇక్కడొక చిన్న మకతిక లాంటి తికమక నన్ను వేధించితే నేను కష్టపడి తెలుసుకున్న విషయం, రిషభ దేవుడు కాదు = అతని నూర్గురు కొడుకుల్లో ఒకడూ భరతునికి సోదరుడూ అయిన బాహుబలియే జైన మత స్థాపకుడు అని!

రిషభనాధుడికి ఇద్దరు భార్యలు.భరతుడితో కలిపి 99 మంది కొడుకులూ, బ్రహ్మి అనే ఒక కూతురూ సుమంగళ యొక్క సంతానం.బాహుబలి అనే కొడుకూ, సుందరి అనే ఒక కూతురూ సునంద యొక్క సంతానం.పెద్దవాడైన భరతుడు మూలస్థానానికి చక్రవర్తి అయ్యాడు.మిగిలిన వాళ్ళు తమకు పంచిన భూభాగాలకు స్వతంత్ర ప్రభువులై స్థిరపడ్డారు.అయితే, భరతుడు ఇతర రాజ్యాలను జయించి ఏకచత్రాధిపత్యం స్థాపించిన తర్వాత సోదరులకి సైతం తనకు సామంతులై ఉండమని వర్తమానం పంపించాడు.బాహుబలి తప్ప అందరూ ఒప్పుకున్నారు.భరతుడు తక్షశిల మీదకి యుద్ధానికి వచ్చాడు.తొలిదశలో సైన్యాల మధ్యన భీకరమైన పోరు జరిగింది.గెలుపు ఎవరో ఒకరిని వరించే లోపు సైన్యనష్టం, ధననష్టం ఎక్కువ అయ్యేటట్టు ఉందని మధ్యవర్తులు కలగజేసుకుని ఇద్దరు చక్రవర్తులకీ మధ్య ద్వంద్వయుద్ధం జరిగితే బాగుంటుందని సూచించారు.

మల్లయుద్ధం, జలయుద్ధం అనే రకరకాల యుద్ధప్రక్రియలలో బాహుబలియే భరతుడి కన్న ఎక్కువ కౌశలం చూపిస్తున్నాడు.కానీ, ఆఖరి యుద్ధంలో ఆఖరి దెబ్బ కొట్టి గెలిచే సమయంలో బాహుబలిని ఒక రకమైన నిర్వేదంతో కూడిన అహింసాభావం ఆవరించింది.రక్తం పంచుకు పుట్టిన చెల్లెలైన సుందరితో సహా అందరూ భరతుని గెలుపునే కోరుకోవడాన్ని గమనించాడు.చిన్నప్పటి ఆటపాటల నాటి ప్రేమాభినాలు గుర్తొచ్చి తను చేసిన, చేస్తున్న, చెయ్యబోతున్న తప్పులను తెలుసుకున్నాడు.అన్నను తలమీద దెబ్బ కొడదామని ఎత్తిన పిడికిలితో సన్యాస దీక్షను స్వీకరించడానికి సూచన అన్నట్టు తన తల వెంట్రుకలను పేరికివేసుకుని అందర్నీ నిర్ఘాంత పోయేలా చేశాడు.

అలా గెల్చిన భరతుడు కొంతకాలం రాజ్యం చేశాక సన్యాసం స్వీకరించాడు.అన్న భరతుడు సన్యాసం స్వీకరించేనాటికి తమ్ముడు బాహుబలి తీవ్రమైన తపస్సమాధిలో ఉన్నాడు.అనుకోని విధాన సన్యాసం స్వీకరించాడు. మనస్సులోని రాగద్వేషాలు శమించక జీవన్ముక్తుడు కాలేక పోతున్నాడు.ఆఖరికి సన్యాసం స్వీకరించిన భరతుడు సందర్శించి అతని వ్యగ్రతను పోగొట్టి శాంతచిత్తుణ్ణి చేశాకనే అహంకార విముక్తుడై బాహుబలి యోగసిద్ధిని పొందాడు.గోమఠేశ్వరుని పేరున శ్రావాణబెళగొళ వద్ద పూజించబడుతున్నాడు.

సుబ్బి పెళ్ళి ఎంకి చావుకి వచ్చిన చందాన తమ్ముడు బాహుబలి జీవన్ముక్తి కోసం తపస్సు చేస్తూ అన్న భరతుడు వ్యగ్రతను పోగొట్టి శాంతచిత్తుణ్ణి చేశాక తమ్ముడు బాహుబలి అహంకార విముక్తుడై జినుడు అయ్యాడని అందరికీ తెలిశాక జైనులకి పులిమీద పుట్రలా వచ్చిపడిన, ఎగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రహ్మహత్య లాంటి చాలా పెద్ద గొప్ప దరిద్రమైన సమస్య = అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ రిషభుడు, జైనమతాన్ని స్థాపించటానికి పనికిరాడనేది.ఎందుకంటే, అతను పదహారణాల వైదిక ధర్మ శ్రేష్ఠుడు గనక నోరు తెరిస్తే వేదం చెప్పిన సత్యం గురించి తప్ప మరొకటి మాట్లాడే అవకాశం లేదు.తెలివికి ఎక్కువ ఆకలికి తక్కువ అన్నట్టు బతికే జైనులు శతకోటి దరిద్రములకి ఉన్న ఆనంతకోటి ఉపాయముల నుంచి ఒకటి పీకి తమకు సమస్యని తెచ్చిపెట్టిన అన్నదమ్ములని వదిలి తండ్రి యొక్క నామధేయాన్నీ కొడుకు యొక్క భావజాలాన్నీ కలిపి మొదటి ఏకైక ఆదినాధుణ్ణి తయారు చేసుకుని హిందువులకి ఎగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రహ్మహత్య లాంటి చాలా పెద్ద గొప్ప దరిద్రమైన సమస్యని తెచ్చిపెట్టేశారు.

భరతుడ్ని గెలిచే అవకాశం ఉండి క్షణికోద్రేకంలో జుట్టు పీక్కుని అన్ననే గెలిపించి సన్యాసం తీసుకుని సైతం బహ్రతుడు వచ్చ్హి బోధ చేశాకనే రాగద్వేషాలను జయించిన సాక్ష్యం కనబడుతూ ఉండటం వల్ల అతన్ని "జినుడు" అని కీర్తించలేని జైనులు వ్యాపారం కోసమూ భిన్నత్వం కోసమూ 24 మంది సృష్టికర్తల తీర్ధంకర వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు.

జైనులు రిషభుడు సన్యసించడానికి కారణం అని చెప్తున్న ఖద: ఈయన గారు ఇంద్రుడితో పనుండి స్వర్గానికి వెళ్ళాడట.ఆయన గారు అప్సరసల డ్యాన్సు బ్యాలే ఏర్పాటు చేశాడట,అప్పుడు నిరంజన అనే డ్యాన్సింగళ్ స్పీడ్ డ్యాన్స్ చెయ్యలేక చచ్చిపోయి మైకేలు జాక్సనుడిలో లీనమైపోయిందట.అది చూసిన రిషభుడికి నిరంజనలానే తనకూ చావు తప్పదని తెలిసి భయమేసిందట.జనన మరణాలు ఉండి జరారుజలను అనుభవిస్తున్న తనని తెలివికి తక్కువ ఆకలికి ఎక్కువ అన్నట్టు బతికే సమస్తమైన యావన్మందికి ఏకేశ్వరుణ్ణి చేస్తూ పది బూతులు పది నీతులు కలిపి అలా బతకమని చెప్పేసి సృష్టికర్తని అమ్మకపు సరుకులా వాడుకునే సౌకర్యం కల్పిస్తే తెలివికి ఎక్కువ ఆకలికి తక్కువ అన్నట్టు బతికే ద్రవ్యలోభులైన కులీన మేధావి వర్గం (Profit Oriented Legally Imprialistic Clan Elites - POLICE) వారికి వాళ్ళు లాభం కోసం తనని సృష్టికర్తని చేసి బతికించి ఉంచుతారని అనిపించేసరికి, బుర్రబల్బు డింగ్ అని వెలిగి మొదటి స్వప్రకటిత తీర్ధంకరుడు అయిపోయాట్ట!

గౌతమ బుద్ధుడు తను సన్యసించి సంసారుల్ని ఏడుపు నుంచి లాక్కొచ్చి పడెయ్యాలని అనుకున్న క్యామిడీ స్టోరీ కూడా ఇలానే ఉంటుంది.చిన్నప్పట్నించీ టీచర్లని ఇంటికే రప్పించుకుని చదువుకుని సకల శాస్త్రాలూ నేర్చుకున్న సిద్ధార్ధ గౌతముడు అనే ఒక టీనేజి కుర్రాడు అనంగననంగ ఒక రోజున హుషారు పుట్టి వ్యాహ్యాళికి వెళ్ళాడు.ఒక ముసలాడు ఎదురయ్యేసరికి అప్పుడు బుర్రబల్బు డింగ్ అని వెలిగి ముసలితనం ఎలా ఉంటుందో తెలిసిపోయింది.ఒక శవం ఎదురయ్యేసరికి అప్పుడు బుర్రబల్బు డింగ్ అని వెలిగి చావు ఎలా ఉంటుందో తెలిసిపోయింది.ఒక సన్యాసి ఎదురయ్యేసరికి అప్పుడు బుర్రబల్బు డింగ్ అని వెలిగి అన్నీ వదిలేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలిసిపోయింది.అంతే!తను సన్యాసి అయిపోయి సంసారుల దుఃఖాన్ని పోగొట్టాలని అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయాడు.ఇక హ్యాపీగా ఇంటికెళ్ళిపోయాడు.ఇంకొంచెం సేపు గనక షికారు చేసి ఉంటే గనక ఒక  రాలుగాయి రవ్వల గజ్జెల గుర్రమంటి {వొంపుల్తో సొంపుల్తో నవ్వుల్తో పువ్వుల్తో పోజుల్తో మోజుల్తో పిచ్చెక్కించే) ఫిగరు ఎదురయ్యేసరికి అప్పుడు బుర్రబల్బు డింగ్ అని వెలిగి క్యాజనోవా టు ది పవరాఫ్ క్యాజనోవా అయిపోయేవాడు కాబోలు!

ఏసుక్రీస్తుకీ మహమ్మదుకే గాక గౌతమ బుద్ధుడికి కూడా చారిత్రక పరమైన భౌతిక సాక్ష్యాలు దొరకని పరిస్థితి ఉంది.బౌధ్ధమతం మీద ఎంతో పరిశోధన చేసిన T.W.R Davids కూడా "ఇన్ని శతాబ్దాల పాటు విస్తరించిన బౌధ్ధ మతసాహిత్యపు చరిత్రని తీరగేసినా ఖచ్చితంగా బుధ్ధుని అనుయాయులు కాలంలో ఎక్కడి నుంచి పరంపరని మొదలు పెట్టారనేదానికి సాక్ష్యం చెప్పగలిగిన ఒక్క రికార్డు కూడా కనపడలేదు నాకు" అనేశాడు.

క్రైస్తవం అయినా బౌద్ధం అయినా మతం యొక్క సారం ముఖ్యం గానీ అందర్నీ ఒక్కలాగే ఉద్వేగ పరుస్తున్న మతాన్ని ఎవరు స్థాపించితే ఏమిటి?అలాగే అన్ని ప్రాంతాలకూ వ్యాపించిన మతాన్ని స్థాపించినవాడు ఎక్కడివాడైతే ఏమిటి?” - ప్రశ్నలు సరళమైనవే గానీ సరళమైన జవాబును చెప్పడం కష్టం."ఒక వ్యక్తి కేంద్రం అయిఉండి అతనికి అద్వితీయతను ఆపాదించి అతని పట్ల విధేయతను బోధించే మతం చాలా సహజమైన పద్ధతిలో తనను అనుసరించేవారిని నియంతలకు దాసులను చేస్తుంది" అనేది చరిత్రలో చాలా సార్లు చాలా చోట్ల నిరూపణ అయిన చారిత్రక సత్యం.

రాజ్యం, మతం అనే రెండూ పైకి వేర్వేరు రూపాలతో ఉంటాయి గానీ వాటి పనితీరును గమనిస్తే మాత్రం అవి కలిసి పనిచేస్తాయనేది తెలుస్తుంది. రెండూ కలిసి పని చేసే సమాజంలోని వాస్తవ ప్రణాళికని కుటుంబ జీవితంలోని పోలికతో చెప్తాను.పిల్లల మీద ప్రేమ ఉండి వాళ్ళ మీద పెత్తనం చెయ్యాలనుకోని తండ్రి అయితే పిల్లలు అడిగినవి తన స్థోమతకు లోబడినవి అయితే కొంటాడు, లేనప్పుడు తను దగ్గరికి తీసుకుని అది తన స్థాయికి ఎక్కువని బుజ్జగించి చెప్తాడు.పిల్లలు కూడా బుద్ధిమంతులు అయితే అప్పటికి చిన్నబుచ్చుకుని తర్వాత తర్వాత తండ్రి తమమీద చూపిస్తున్న ప్రేమను గమనించి సర్దుకు పోతారు.పిల్లల మీద ప్రేమ ఉండి వాళ్ళ మీద పెత్తనం చెయ్యాలనుకోని తల్లి అయితే భర్తకూ పిల్లలకూ మధ్యవర్తిలా నిలబడి సర్ధిచెప్పి తనవంతు సాయం చేస్తుంది.అలాగాక పిల్లల మీద ప్రేమ లేక వాళ్ళ మీద పెత్తనం చెయ్యాలనుకునే తండ్రి అయితే తన స్థాయికి లోబడినది అడిగినప్పుడు సైతం కుదరదని గద్దిస్తాడు.తిరుగుబాటు మనస్తత్వం ఉన్న పిల్లలు నిలదీస్తే దేహశుద్ధి కూడా చేస్తాడు.పిల్లలకు తను చెయ్యాల్సిన వాటినుంచి తప్పుకుని వాళ్ళని నౌకర్లలా వాడుకోవాలనుకునే క్రూరత్వం ఉన్న తండ్రులు మనమధ్యనే చాలామంది ఉన్నారు.కుటుంబ జీవితంలోని తండ్రిని సామాజిక వ్యవస్థలోని రాజ్యం అనుకుంటే మతం తల్లి అవుతుంది. ప్రేమ గల తల్లి భర్తకూ పిల్లలకూ మధ్యవర్తిలా నిలబడి సర్ధిచెప్పి తనవంతు సాయం చేస్తుంది గానీ అది లేని తల్లి వీలును బట్టీ వాలును బట్టీ లెక్కలేసుకుని ఒకసారి భర్తనీ ఒకసారి పిల్లల్నీ వెనకేసుకొచ్చి వాళ్ళ తరపున పోట్లాడి ఇద్దరినుంచీ మంచిపేరు తెచ్చుకోవడం కోసం ప్లానులు వేస్తుంది.

మతసారం శాస్త్రీయమైన పునాదుల మీద కట్టినది గాక అబద్ధాల పునాదుల మీద పుట్టినది అయితే ప్రేమ లేని తల్లిలా అటు రాజ్యాన్నీ ఇటు ప్రజల్నీ మోసం చేస్తూ ఇద్దరి చేతా చప్పట్లు కొట్టించుకునే ప్రమాదం ఉంది కదా!అందువల్లనే ఒక మతాన్ని అనుసరించాలనుకునే ప్రతి వ్యక్తీ ఆయా మత స్థాపకుల చారిత్రక యదార్ధతను గురించి తెలుసుకోవాలి.పూర్వ సామాన్య శకం 4000 సంవత్సరాల నాటి సింధు నాగరికతని గురించీ ఏడు వేల యేళ్ళ వెనకటి ద్వారక గురించీ సరస్వతీ నది అంతర్ధానమైన కాలం గురించీ మెసపొటేమియన్ మాయన్ ఈజిప్షియన్ నాగరికతలను గురించీ అనేకమైన విషయాలు తెలుస్తున్నప్పుడు ఇప్పటికి మూడు వేల యేళ్ళ లోపునే పుట్టారంటున్న ముగ్గురు నలుగురు వ్యక్తుల గురించి ఒక్క సాక్ష్యం కూడా దొరకకపోవటం ఏమిటి?

Doug Smith అనే పరిశోధకుడు 2018 డెసెంబర్ 24 “Did the Buddha really exist? It's a question that concerns some of us today, given the paucity of hard evidence from the early period of the Buddha's lifetime. We'll look at some of the issues involved in reconstructing that early history and finish up by considering whether and to what extent worries about the Buddha's real existence should impact our practice.” అని బల్లగుద్ది చెప్తుంటే జీససు క్రీస్తు యొక్క చారిత్రకతలా మినుకుమినుకుమనే ఆశారేఖను కూడా మిగల్చని యదార్ధం గౌతమబుద్ధుని చారిత్రకతను అసత్యం అని తేల్చి చెప్పడం లేదూ!

బౌద్ధమతానికి సంబంధించి మనలో రెండు రకాల భ్రమలు ఉన్నాయి.ఒకటి, శంకరాచార్యుడు బౌధ్ధాన్ని నాశనం చేశాడనేది.రెండు,అశోకుడు ఒక్కడే బౌధ్ధాన్ని ఎక్కువగా ఆదరించాడనేది.బుద్ధుడు పుట్టి 80 యేళ్ళ వయస్సులో మహాపరినిర్వాణం చేసిన 300 సంవత్సరాల తర్వాతి వాడు అశోకుడు. మధ్య కాలంలో ఎవరూ ఆదరించనే లేదా?ఎవరూ ఆదరించకుండానే 300 ఏళ్ళ పాటు సజీవంగా ఉండగలిగిందా!అశోకుడి పరివర్తనకి కారణమైనదిగా చెప్పబడుతున్న  కళింగ యుధ్ధం కూడా నిజంగా జరిగిందని చెప్పలేని పరిస్థితి.ఇవ్వాళ మనం చదువుతున్న అధికారికమైన చరిత్ర అంతా నెహ్రూ ఆదరణతో విశ్వవిద్యాలయాల్లో చేరిన కమ్యునిష్టులు తమ ఎజెండాని బట్టి వండివార్చిన చరిత్ర.

చారిత్రకంగా చూస్రే క్రీ. 8 శతాబ్దానికి ముందు అప్పటికే మహాయానం ప్రముఖం కావడం వల్ల బుధ్ధుడు దేవుడుగా మారినా విష్ణువు యొక్క అవతారం అనే మాట వినబడేది కాదు.ఈమార్పు క్రీ. 8 శతాబ్దం నాటి రాజకీయ పరిస్థితుల కనుగుణంగా జరిగింది గనక దీని మూలంగా ఆధ్యాత్మికమైన కల్లోలం ఏదీ జరిగినట్టు కనిపించదు.అప్పటి రాజస్వామ్యమైనా ఇప్పటి ప్రజాస్వామ్యమైనా ప్రభుత్వానికి ప్రజల వైపు నుంచి కావలసింది విధేయత. విధేయతను భగ్నం చెయ్యనంత వరకు ప్రభుత్వమూ మతాన్నీ తిరస్కరించదు - ప్రభుత్వంలో ఉన్నవారికి మరీ వ్యక్తిగతమైన ద్వేషం ఉంటే తప్ప!మహాయాన సంప్రదాయం ప్రకారం వాళ్ళు కూడా దేవాలయాలు కట్టడం మొదలయ్యాక రాజులకి ఒక సమస్య వచ్చి పడింది.రాజు మతాన్ని ప్రోత్సహించడం అంటే ఏమిటి?ఒక ప్రాంతంలో వాళ్ళు ఆలయం కోసం సరైన స్థలం ఎన్నుకోవడం దగ్గిర్నుంచి వారి మతానికి సంబంధించిన వైభవోపేతమైన వేడుకలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు కలగకుండా చూదటం,అవునా? లెక్కన ఒక ప్రాంతంలో హిందువులనీ బౌధ్ధులనీ వేరువేరుగా ప్రోత్సహించడం కన్నా రెంటినీ కలపడం ద్వారా ప్రభుత్వ నిధుల్నీ పొదుపు చెయ్యొచ్చు లేనిపోని తలనెప్పుల్నీ తగ్గించుకోవచ్చు . ఎప్పుడైతే దేవుడు లేడన్న బుధ్ధుణ్ణి దేవుడిగా మార్చుతూ మహాయానం మొదలైందో అప్పుడే దేశంలో బౌధ్ధం ఆకర్షణ కోల్పోవడమూ మొదలైంది!అచ్చం హిందూమతంలాగే ఉన్న బౌధ్ధం లోకి హిందువైనా ఎందుకు మారాలి?బౌధ్ధానికి భారత దేశంలో ఉన్న ప్రతికూలత విదేశాల్లో ఎదురు కాలేదు కాబట్టి ఆయా దేశస్థుల్ని బౌధ్ధం విశేషంగా ఆకర్షించింది. దేశాలకి వెళ్ళింది కూడా అప్పటికే హిందూమతాన్ని అనుకరించటం మొదలుపెట్టిన నవీన భౌద్ధమతమే!శంకారాచార్యుడు చేసినదల్లా హిందూమతాన్ని చైతన్యవంతం చెయ్యడం,దానితో సహజంగానే బౌధ్ధం పెద్దగీత పక్కన చిన్నగీతగా ఉన్నది కాస్తా బుల్లిగీతగా అయ్యింది.

ఇక గౌతమ బుధ్ధుణ్ణి విష్ణువు అవతారంగా చెప్పాలంటే ఇటు హిందూ పురాణాల్లో గానీ అటు బుద్ధ వాజ్మయంలో గానీ ప్రస్తావనలు ఉండాలి కదా!అంతకు ముందరి కాలంలో ప్రస్తావనలూ లేకుండా ఒక్కసారిగా ఒక మతం దేవుణ్ణి మరో మతానికి అంటుగట్టెయ్యడం అంటే బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టెయ్యడమే కదా - ఇరుమతాల్లోని పెద్దలూ అంతటి అప్రాచ్యపు ప్రతిపాదనకి ఎలా ఒప్పుకుంటారు?"ఏకవింశతితమం బైన బుద్ధ నామధేయంబునం గలియుగాద్యవనరంబున రాక్షససమ్మోహనంబు కొరకు మధ్యగయాప్రదేశంబున జినసుతుండై తేజరిల్లు" అని పోతన భాగవతంలో బుధ్ధావతార వర్ణన ఉంటుంది."Some Blunders of Indian Historical Research" గ్రంధంలో పి.యన్.ఓక్ మహాశయుడు మగధ రాజవంశావళిని తెలుసుకోవడానికి పురాణాలు ప్రశస్తమైన ఆధారసామగ్రి అని పేర్కొన్నాడు.మహాభారత యుధ్ధం జరిగే కాలానికి సోమాధి అనే అతను మగధకు ప్రభువుగా ఉండేవాడు.అతను వంశకర్తగా 22 మంది రాజులు 1006 సంవత్సరాలు గడిచాయి.ఆతర్వాత ఆయిదుగురు రాజల పరంపరతో ప్రద్యోత వంశం 138 సంవత్సరాలు పాలించింది.దాని తర్వాత 10 మంది రాజుల పరంపరతో శిశునాగ వంశం 360 సంవత్సరాలు పరిపాలించింది. శిశునాగ వంశంలో నాలుగవ వాడై క్రీ.పూ 1892 నుంచి క్రీ.పూ 1852 వరకూ రాజ్యపాలన చేసిన క్షేమజిత్ గౌతమ బుధ్ధుడి తండ్రియైన కపిలవస్తు నగరాధీశుడు శుధ్ధోదనుడికి సమకాలికుడు! మధ్య కాలంలో పుట్టిన బుధ్ధుడు ఐదవ శిశునాగ ప్రభువైన బింబిసారుని పరిపానా కాలమైన క్రీ.పూ 1852 నుంచి క్రీ.పూ 1814 మధ్య కాలంలో జ్ఞానసిధ్ధిని పొంది తధాగతుడై ఆరవ శిశునాగ వంశపు రాజైన అజాతశత్రువు పరిపాలనా కాలమైన క్రీ.పూ 1814 నుంచి క్రీ.పూ 1787 మధ్యకాలంలో మహాపరినిర్వాణం పొందాడు."Age of Buddha, Milinda and King Amtiyoka and Yuga Purana" గ్రంధంలో పండిట్ కోట వెంకటాచలం కూడా ఇదే రకమైన విశ్లేషణ చేశారు.ఈయన లెక్క ప్రకారం బుద్ధుడు ఇక్ష్వాకు వంశపు రాజులలో 23 వాడు.క్రీ.పూ 1814 నాటికి,అంటే అజాతశత్రువు పట్టాభిషేకం జరిగేనాటికి బుద్ధుడికి 72 ఏళ్ళు.కాబట్టి అతని జననం క్రీ.పూ 1887 అవుతుంది.

కలియుగారంభంలో వైదిక ధర్మాన్ని లోపలి నుంచి భ్రష్టు పట్టించడానికి రాక్షసులు యజ్ఞయాగాదులలో జంతుబలుల్ని ప్రవేశపెట్టి చెలరేగిపోతున్నారు.శుక్రాచార్యుడు రాక్షసుల్ని అజేయుల్ని చెయ్యడానికి ఒకటి లేక అనేక యజ్ఞాల్ని చెయ్యటానికి సంకల్పించాడు.దానితో ఎప్పటిలాగే దేవతలు అర్ధించగా అజిన ప్రభువుకు 12 ఏళ్ళ వయసు బాలుడిగా కనబడ్డాడు.అతని చక్కదనానికి ముగ్ధుడై జినుడు అతన్ని సంతానంగా స్వీకరిస్తాడు.అట్లా రాక్షసుల వ్యూహాన్ని తిరిగి వారి మీదకే విసురుతున్నట్టు వారిలో ఒకడై వారికి యజ్ఞ యాగాదులలో జరిగే జంతుబలుల పట్ల అసహ్యం పుట్టించి శుక్రాచార్యుడు చేయించదలుచుకున్న యజ్ఞాలకు విముఖత్వం కలిగించటానికి అహింసను బోధించి సమ్మోహితుల్ని చేసి పరివర్తన ద్వారానే దుష్టసంహారం చేస్తాడు.ఫలితంగా వైదికధర్మవిరుద్ధమైన జంతుబలుల వంటి క్రూరమైన రాక్షసకృత్యాలు నిరోధించబడి వైదికధర్మం దోషరహితమై తిరిగి ధూమరహిత దీపకళిక వలే వెలిగింది.ఇవి హిందూ పౌరాణిక సాహిత్యరూపాల వైపు నుంచి మొదటి బుద్ధుడికి సంబంధించిన విశేషాలు.ఇప్పుడు మనం బుద్ధగయ అంటున్న దానిని పురాణాలో కీకట దేశం అని ప్రస్తావించారు.అది కూడా సరిగ్గానే కలుస్తున్నది.ఇప్పటి బుద్ధుడు జన్మించినది కపిలవస్తు,తల్లి మహామాయ,తండ్రి శుద్ధోదనుడు. తేడాల వల్ల హిందువుల పౌరాణిక గ్రంధాల వైపు నుంచి తొలిదశలో ఇద్దరు బుద్ధుల్ని గుర్తించినట్లే తెలుస్తున్నది గదా!

అటువైపు బౌద్ధమత సాహిత్యంలోనూ తొలిదశలో ఇద్దరు బుద్ధుల్ని వేరువేరు వ్యక్తులుగా గుర్తించినట్లు ఆధారాలు ఉన్నాయి.అమరసింహుడు అనే ప్రముఖ రచయిత బుద్ధ సాహిత్యంలోని చాలా గ్రంధాల్ని రచించాడు.వాటిలో అమరకోశం ఒకటి.అందులోని ఒక బుద్ధ స్తుతి ఇలా ఉంటుంది:

"సర్వజ్ఞః సుగతో ధరమ్రాజః తధాగతః

సమంత భద్రో భగవాన్ మారజిత్ లోకజిత్ జినః

శదభిజ్ఞో దశబలో ద్వయవాది వినాయకః

మునీంద్ర శ్రీఘనః శాస్తమునిః"

ఇందులోని 18 పేర్లూ సుగతబుద్ధుడికి సంబంధించిన విశేషణాలు.తర్వాతి చరణాలు ఇలా ఉంటాయి:

"శాక్యమునిస్తు యః శాక్యసింహః సర్వార్ధసిద్ధ శౌద్ధోదనిశ్చ

గౌతమశ్చ అర్కబంధుశ్చ మాయాదేఅవీ సుతశ్చ సః"

రెండవ భాగంలోని ఏడు పేర్లూ గౌతమబుద్ధునికే వర్తిస్తాయి తప్ప సుగత బుద్ధునికి కాదని మీకూ అర్ధమయ్యే ఉంటుంది.బుద్ధ వాజ్మయంలో బుద్ధమూర్తులు చాలామంది ఉంటారు అమితాభ బుద్ధుడు,సమంత భద్రుడు,మైత్రేయ బుద్ధుడు - ఒక్కొక్క బుద్ధునికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.సుగత బుద్ధునికి సమంతభద్రుడు అనేది పర్యాయపదం.మరింత గట్టి సాక్ష్యం క్రీ. 1807 నాటి H. T. Colebrooke యొక్క అమరకోశం అనువాదంలో దొరుకుతుంది.అందులోని 21 అధ్యాయంలో లలితవిస్తారగ్రంధం నుంచి ప్రస్తావనల్ని ఉదహరిస్తూ సుగత బుద్ధుడు తపస్సు చేసిన చోటనే గౌతమ బుద్ధుడు తపస్సు చేసినట్లు ప్రస్తావించాడు!

కోట వెంకటాచలం ప్రభృతులు వర్ణించిన వంశావళి లోని క్రీ,పూ 1884 నాటి బింబిసారుడూ అజాతశత్రువూ మళ్ళీ క్రీ.పూ 6 శతాబ్ది కాలంలోనూ కనిపిస్తున్నారు.మగధీరలో హీరో ఒక్కడే కాకుండా హీరోయినూ విలనూ కూడా మళ్ళీ పుట్టి మళ్ళీ అదే రకంగా తన్నుకున్న ఫార్ములా సినేమా ఖద చరిత్రలో రిపీటయ్యే అవకాశం ఉంటుందా!లేదు - మన భాగవతం వర్ణించిన సుగత బుద్ధుడు మాత్రమే వాస్తవ వ్యక్తి.గౌతమ బుద్ధుడు వాస్తవ చరిత్రలో ఉండటానికి వీల్లేని కల్పిత పాత్ర మాత్రమే - ఆమెన్.

హిందువుల సంస్కృతిలోకి జైనుల పరకాయప్రవేశం యొక్క చారిత్రక పరమైన యదార్ధ సన్నివేశం కోసం వెతికినప్పుడు మొదట జైనమతస్థుడైన కేరళ చక్రవర్తి సుధన్వుడు జగద్గురువు అయిన ఆదిశంకర భగవత్పాదుల వంటి వైదిక ధర్మ శ్రేష్ఠుడు ప్రతిపాదించిన అద్వైత భావన యొక్క శాస్త్రీయతకు ముగ్ధుడై మారు మనస్సు పొంది వైదిక ధర్మ శ్రేష్ఠుడు కావడం అనేది కనపడింది - అది ముఖ్యమైనది.

జగద్గురువు యొక్క జీవిత కాలం గురించి ఏకాభిప్రాయం లేదు.ఆదిలో జైనులూ మధ్యలో చిత్పవనులూ బ్రిటిషర్లూ ఆఖర్న కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ మన దేశ చరిత్రని చిందర వందర చేసేసి సృష్టించిన గందరగోళం వల్ల మనకు అత్యంత ప్రీతిపాత్రులైన ప్రాతస్మరణీయుల నిజమైన చరిత్ర తెలియడం లేదు.జగద్గురువుకి సంబంధించి పూ.సా. 2000 మొదలు సా. 788 వరకు నాలుగు జన్మతిధులు కనపడుతున్నాయి.ప్రస్తుతం ప్రభుత్వం వారు  సా. 788 నాడు ప్రభవించి సా. 820 నాడు అస్తమించినట్టు భావిస్తున్నారు.అయితే కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు సా. 788 అనేది వాళ్ళ అధిపత్యం కోసం పాశ్చాతులు జీసస్ క్రీస్తు పుట్టిన తేదీ కన్న ముందుకి జరిపారని అంటున్నారు.వాస్తవానికి జగద్గురువు జననం పూ.సా. 509 నాడు జరిగిందని చెప్తున్నారు.

పూ.సా. 1900 నాడు ప్రభవించిన సుగత బుద్ధుడు తన పేరున బౌద్ధ మతాన్ని ఏర్పరచలేదు.కేవలం అప్పటి అజిన ప్రభువు పరివారానికి అహింసను బోధించాడు.శుక్రాచార్యుల మార్గదర్శకత్వంలో వారు చెయ్యాలనుకుంటున్న తామసిక యజ్ఞాలను నిరోధించాడు, అంతే!అవతార ప్రయోజనం ముగిశాక అనంతాత్మలో లీనమై పోయాడు.జగద్గురువు సైతం జైనులని విమర్శించకపోవడం, జైనుల మీద చెయ్యాల్సిన ఆరోపణని సుగత బుద్ధుడి మీదకి మళ్ళించి విమర్శించడం వంటివి మనించి చూసినప్పుడు జగద్గురువు ప్రభవించే నాటికి సుగత బుద్ధుని బోధనల్ని కలుపుకుని జైనులు గుర్రపుడెక్కలా వ్యాపించి వైదిక ధర్మం దాదాపు అంతరించే స్థాయికి చేరుకున్నదనేది తెలుస్తుంది.

హేతువిరుద్ధమైన కధనాలను తిరస్కరించి చారిత్రక సాక్ష్యాలను లెక్కలోకి తీసుకుని వూహిస్తున్నది ఏమిటంటే, జగద్గురువు విమర్శించిన బౌద్ధం కేవలం గ్రంధాలకు పరిమితమైనది.సుగత బుద్ధుని అనుయాయులు ఎక్కువమంది లేరు.సుగత బుద్ధుని అహింసని కలుపుకుని జైనులు మరింత ఎక్కువ పెరిగారు.సుధన్వ మహారాజు తాత తండ్రుల వారసత్వం వల్ల జైనుడే.కాకపోతే అతనికి సత్యనిష్ఠ ఎక్కువ.సందేహాలు వచ్చాయి.ఆస్థాన పండితులు సుధన్వుడి ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయారు.విద్య పూర్తయిన జగద్గురువుల వారు సుధన్వుడి ప్రశ్నలకు జవాబులు చెప్పారు.సుధన్వుడు వైదిక ధర్మ శ్రేష్ఠుడు అయిపోయాడు.అయితే, జైనులతో పండితచర్చ గానీ విద్వద్గోష్ఠి గానీ ఏర్పాటు చేస్తానని అన్నప్పుడు జగద్గురువుల వారు కేవలం సిద్ధాంత ప్రతిపాదన చేసి అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తానని చెప్పారు.జగద్గురువు ప్రతిపాదనలు ప్రశ్నలకు తావు లేనివి కావడం వల్లనూ రాజు అప్పటికే జగద్గురువుకి అనుయాయి అయిపోయాడని తెలియడం వల్లనూ జైనపండితులు జగద్గురువుల వారి అద్వైత సిద్ధాంతాన్ని ఆమోదించేశారు.

శంకరపీఠాల వారు మనకు చెప్తున్న జీవిత చరిత్రలోని వైరుధ్యాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నది నాకు.జగద్గురువుల వారి తలిదండ్రులకు శివుడు కనిపించి "అజ్ఞాని యైన దీర్ఘయుష్కుడు" కావాలా "మహాజ్ఞాని యైన అల్పాయుష్కుడు" కావాలా అని అడిగాడు.తలిదండ్రులు "మహాజ్ఞాని యైన అల్పాయుష్కుడు" కావాలని కోరుకున్నారు.మరి, జగద్గురువుల వారు సన్యసిస్తానని చెప్పినప్పుడు తల్లి వ్యతిరేకించడం భావ్యమా, అవసరమా, సాధ్యమా?

మనకు తెలిసిన జగద్గురువు జీవిత చిత్రణలో ఎక్కడా తామ్రశాసనంలోని సుధన్వ మహారాజు పేరు వినపడదు.ఆదిశంకర భగవత్పాదులు మండనమిశ్రుని భార్యను ఓడించడం కోసం పరకాయ ప్రవేశం చేసిన రాజు పేరు సుధన్వుడు కాదు, అమరుకుడు.నిజానికి "కామసూత్ర పాండిత్యం కోసం పరకాయ ప్రవేశం చేసి అమరుక మహారాజు భార్యల దగ్గ్గిర కామశాస్త్రం నేర్చుకోవడం" అనేది దుర్మార్గమైన సన్నివేశం అనిపిస్తుంది నాకు.జగద్గురువుల వారి సాహిత్యంలోజ్ఞానంతో కూడిన శ్రద్ధఎక్కువ కనిపిస్తుంది.పాండిత్యమూ స్పర్ధా వాదనలూ భాషా కాలుష్యమూ కనిపించడం లేదు.

జగద్గురువుల వారి లక్ష్యం జైన బౌద్ధ మతాల తాకిడికి శిధిలం అయిన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించడం అయినప్పుడు వేద శాస్త్రాలకు బాహ్యం అయిన కామ శాస్త్రాన్ని ధార్మిక చర్చలోకి తీసుకు రావడం అసందర్భం అవుతుంది - అంతటి జ్ఞాని అయిన జగద్గురువు ఔచిత్యం లేని వ్యర్ధకార్యం ఎందుకు చేస్తారు?ఇందులోని అసలైన దోషం ఏమిటంటే, దేహధారి యైన అమరుక రాజు ఒక్క భార్యలు ఆత్మరూపుడైన జగద్గురువుకి పరస్త్రీలు అవుతారు.వైదిక ధర్మ స్థాపన కోసం ప్రభవించిన జగద్గురువు వైదిక శాస్త్రం కాని కామసూత్ర పాండిత్యం కోసం ధర్మ విరుద్ధమైన పరస్త్రీ సాంగత్యం చెయ్యడం భావ్యమా, అవసరమా!

సుధన్వ మహారాజు ఆస్థానంలోని జైన పండితులు జగద్గురువు చెప్పిన అద్వైత భావనని వారిలో వారు తర్కించుకుని ఆమోదించలేదు.వ్యతిరేకిస్తే రాజాశ్రయం పోతుందనే ద్రవ్యలోభం జైనులని ఆషాఢభూతుల స్థాయిలోనే ఉంచేసింది.అందువల్లనే "జగద్గురువు కామసూత్ర పాండిత్యం కోసం పరస్త్రీ సాంగత్యం చెయ్యడం" లాంటి అభూత కల్పనల్ని జీవిత చరిత్రలోకి ఎక్కించేశారు.తన లక్ష్యం పూర్తయిందని చెప్పి 32 యేళ్ళకే నాలుగు పీఠాలను ఏర్పరచి శివైక్యం చెందడం కూడా చారిత్రక వాస్తవికతని బట్టి చూస్తే అనుమానించాల్సిన విషయమే.సన్యాస దీక్షకు తల్లిని ఒప్పించడానికి చేసిన అల్లరి జ్ఞానులకి తగనిది.ఉసిరిపండు లంచం తీసుకుని కనకవర్షం కురిపించడం లాంటి చట్టవిరుద్ధమైన పనులను జగద్గురువు వంటివారు చెయ్యకూడదు కద.

పూ.సా. 1900 నాటి సుగత బుద్ధుడు శ్రీమహావిష్ణువు అవతారమే అయినప్పటికీ ఆయన ప్రవచించిన అహింస వైదిక ధర్మ శత్రువులైన రాక్షసుల్ని మోహింపజెయ్యడానికి చెప్పినది కాబట్టి వైదిక దర్శనాల ప్రకారం జగద్గురువు సుగత బుద్ధుణ్ణి దొంగ అనటమూ సుగత బుధ్ధుడి అహింసని మోసం అనడమూ దోషం కాదు.కానీ, జగద్గురువు తిరిగి స్థాపించాలనుకుంటున్న వైదిక ధర్మం "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియం అనృతం బ్రూయాత్ - ఏష ధర్మః సనాతనః" ఆంటున్నప్పుడు జగద్గురువుల వారి జననం మొదలు మరణం వరకు గల కొన్ని సన్నివేశాలు అభూత కల్పనలు అనిపించటానికి కారణం ఏమిటి?

హిందువులల్లోనూ హైందవేతరులలోనూ కొందరు అజ్ఞానులు జగద్గురువుల వారినీ పీఠాధిపతులనీ వేర్వేరు వ్యక్తులని భావిస్తూ ఉంటారు గానీ పీఠాలను ఏర్పరచటం వెనక ఉన్న సాంకేతికపరమైన నియమం ప్రకారం పీఠాధిపతులు తమను తాము జగద్గురువుతో సమానం అని భావించాలి, నమ్మాలి, అలాగే ప్రవర్తించాలి.ఇతరులు సైతం పీఠాధిపతి స్థానంలో ఉన్నవారిని జగద్గురువుల వారితో సమానం అని భావించాలి, నమ్మాలి, అలాగే ప్రవర్తించాలి - ఆశ్రమవాసులైన శిష్యులు నమ్ముతారు.శిష్యులు ఇతరులను నమ్మిస్తున్నారు.దానికి ఆయా పీఠాధిపతులను సర్వులూ "జగద్గురు!" అని సంబోధించటమే సాక్ష్యం!

జగద్గురువుల వారి శిష్యులమని చెప్పుకుంటూ కట్టుకధలు చెప్పి మన గురువులు మనల్ని మోసం చేస్తున్న నాడు ప్లేటో, అరిస్టాటిల్ వంటివారు ఇక్కడికి వచ్చి జగద్గురువు ప్రతిపాదించిన అద్వైతాన్ని అర్ధం చేసుకుని తిరిగి వెళ్ళి విజేతలను తీర్చి దిద్దారు.వాళ్ళు విజిగీషతో ఇక్కడికి వచ్చిన నాటికి ఇక్కడ జగద్గురువు చెప్తున్న "జ్ఞానంతో కూడిన శ్రద్ధ" అనే సత్యమార్గం వదిలి పుట్టగొడుగులై పుట్టుకొచ్చిన శతకోటి సహస్రకోటి పీఠాధిపతులు చెప్తున్న "జ్ఞానం అక్కర్లేని భక్తి" అనే పిచ్చిని ఒంటికి పట్టించుకుని ఎక్కడెక్కడి నుంచి వచ్చిన అందరు విజేతలకూ వక్రమార్గం పట్టిన మన తండ్రులూ తాతలూ ముత్తాతలూ సకల శాస్త్రవిద్యల సత్యగ్రంధమైన వేదాన్ని వదిలి వాళ్ళు బానిసలయ్యింది చాలక జైన వ్యాపారులూ యూదు చిత్పవన్లూ కమ్యూనిష్టులూ క్రైస్తవులూ సాయిబ్బులూ చెప్పిన ప్రతి అబద్ధాన్నీ పరమసత్యం అన్నట్టు నమ్మి వాళ్ళ వెంట తిరిగి వాళ్ళు పడేసిన ఎంగిలి మెతుకులు కతుకుతూ అష్టకష్టాలు పెడుతున్న కొరగాని యజమానులకు వెట్టి చాకిరీ చేస్తున్న గుడ్డిసూరదాసులై వాళ్ళు బతికి నేటికి నేడు మనల్ని ఐక్యత గురించీ అఖండభారతం గురించీ ప్రపంచాధిపత్యం గురించీ పగటికలలు కని సరిపెట్టుకునేలా పెంచి వెర్రి వెధవల్ని చేశారు = ఆచార్యులు అబద్ధాలను చెప్పడం వల్లా సామాన్యులు అబద్ధాలను నమ్మడం వల్లా జరిగిన అనర్ధం అది.

జగద్గురువుల వారి విశిష్టత వేదం చెప్పిన సత్యానికి వేదమే ఇచ్చిన తర్కం ప్రకారం విశ్లేషించి ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేటట్లు చెప్పడంలో కనిపిస్తుంది.ఇప్పటికిప్పుడు ధ్యానం, యోగం, అంతర్నేత్రం, సాధన వంటివి తెలియకపోయినప్పటికీ కళ్ళు మూసుకుని మీరెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించండి - ఒకే విషయం మీద ఏకాగ్రత కూడా అక్కర్లేదు.మీ జ్ఞాపకాల్నీ మీ ఆలోచనల్నీ మీ భయాల్నీ మీ కోరికల్నీ ఏమాత్రం నియంత్రించడానికి ప్రయత్నించవద్దు.అలా నిర్నిబధ్ధం అయి ప్రవహిస్తున్న అనేకానేకమైన అంశాల మధ్య క్రమేణ ఒక అంతస్సూత్రం కనబడితే సూత్రం ఎక్కడ మొదలౌతుందో అక్కడ ఉన్నది మీరు!అయితే, ఇక్కడ ఉన్న తిరకాసు ఏమిటంటే ఇతర గురువులు మీ జ్ఞాపకాల్నీ మీ ఆలోచనల్నీ మీ భయాల్నీ మీ కోరికల్నీ అంతస్సూత్రం ఎక్కడ మొదలౌతుందో అక్కడ ఉన్న మిమ్మల్నీ వేర్వేరు అంటున్నారు.ఒక్క జగద్గురువుల వారు మాత్రమే "బ్రహ్మ సత్యం జగన్మిద్ధ్య!" అని బల్లగుద్ది చెప్తున్నారు.

ఇక్కడ "సత్యం, మిధ్య" అనే పదాలను direct antonyms అనుకుని జగద్గురువుల వారు జగత్తు అనేది బ్రహ్మము కన్న భిన్నమైనది,అసత్యమైనది,నశ్వరమైనది అని చెప్పినట్టు కొందరు పొరపడుతున్నారు.నిజానికి మిధ్య అనే పదానికి ఇక్కడ అసత్యం అనేది సరైన alternative కాదు.వేదం చెప్పిన సత్యాలను axiomic truths అంటారు.అంటే, ఇతరమైన అంశాలను సత్యమా అసత్యమా అని తేల్చుకోవడానికి వేదం చెప్పిన సత్యంతో పోల్చి చెప్పడమే తప్ప వేదం చెప్పిన సత్యాన్నీ ఇతరమైన అంశాలతో పోల్చి సత్యమా అసత్యమా అని తేల్చి చెప్పటం కుదరదు - ఇది నేను చెప్తున్న కవరింగ్ స్టేట్మెంటు కాదు,వేదం చదివి అర్దం చేసుకుని తమ మాతృభాషలోనికి అనువదించుకుని పరిశోధనలు చేసిన అనేక దేశాల మేధావులు చెప్తున్న సార్వకాలిక సత్యం(axiomic truth).ఇక్కడ సత్యం యొక్క లక్షణాలలో ఉన్న స్వతంత్రతని తీసుకుంటే మిధ్య అనే పదానికి అస్వతంత్రత అనేది మాత్రమే సరైన alternative అవుతుంది.బ్రహ్మ వలెనే బ్రహ్మ నుంచి విడివడిన జగత్తుకి కూడా బ్రహ్మకు ఉన్న తక్కిన అన్ని లక్షణాలూ ఉంటాయి.అయితే జగత్తు బ్రహ్మ మీద ఆధారపడి ఉన్నట్టు బ్రహ్మ జగత్తు మీద ఆధారపడి లేడు.

జగద్గురువుల వారి జ్ఞానధార వారువీరని భేదం లేక ప్రాచ్య పాశ్చాత్య వేదాంతులను ఒక వూపువూపింది.T S Eliot అనే గొప్ప కవి "The great philosophers of India make most of the great European philosophers look like schoolboys" అని తేల్చి చెప్పాడు.Arthur Schopenhauer అనే జర్మన్ వేదాంతి "One who has also received and assimilated the sacred primitive Indian wisdom, then he is the best of all prepared to hear what I have to say to him" అంటూ, తను చెప్తున్నది ప్రేక్షకులకీ సభికులకీ అర్ధం అవ్వాలంటే వాళ్ళకి ప్రాచీన వేదవిజ్ఞానాన్ని విని చదివి అర్ధం చేసుకునే పాటి తెలివి ఉండాలని కుండబద్దలు కొట్టి చెప్పాడు.

వేదం గానీ ఉపనిషత్తులు గానీ శంకరుని అద్వైతం గానీ పొరపాటున సైతం మనుషులను "మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు" అని విడగొట్టలేదు.ఈనాటికీ హిందువులలో సైతం కొందరు మనుషుల్ని అలా విడగొట్టటం అవైదిక దర్శనాల ప్రభావమే - "తెలిసిన వారు, తెలియని వారు" అని వైదిక దర్శనం చేసిన విభజన చాలా న్యాయమైనది, కదూ!శంకరుల అద్వైతం మరొక నీ అంతట నువ్వు విప్పుకోలేని చిక్కుముడి లాంటి నువ్వు నమ్మలేని వేదం చెప్పిన నిత్యసత్యాన్ని విప్పి చెప్తుంది - నీ సమస్యని పరిష్కరించుకోవటం కోసం నీ అజ్ఞానాన్ని తొలగించుకోవటం కోసం నీ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ఆచార్యులకి సైతం సూచనలు ఇచ్చి ప్రోత్సహించటం వరకే సాధ్యం.కేవలం ధారణకి లోపల ఉన్న లక్ష్యానికే గాక ధారణకి బైట ఉన్న లక్ష్యానికి సైతం నిన్ను చేరుస్తున్నబీజం, సంకల్పం, దీక్ష, ప్రయత్నం, ఫలితం, అనుభవం, ఆనందంవిషాదం, శిక్ష, రక్ష, వేద్యం అన్నీ నీకు లోపలి నుంచే వస్తాయి.

సృష్టిలోని తత్వాలను గురించి మనం తెలుసుకునేటప్పుడు ఒక కొత్త విషయం గోచరించినప్పుడు అది మాయ అనిపిస్తుంది,గోచరించిన విషయం గురంచి ఒక కొత్త అర్ధం తెలిసినప్పుడు అది లీల అనిపిస్తుంది.సృష్టికర్తతో ముఖాముఖి అన్నట్టు కనిపిస్తున్న ఇవి రెండూ సర్వ జీవులకూ అనుభవంలోకి వస్తూనే ఉంటాయి.పిల్లల పెంపకంలోని తొలిదశలో తలిదండ్రులకూ పిల్లలకూ చాలా హుషారు అనిపించేది దాగుడుమూతలు, అవునా?మొదట తండ్రి తన ముఖాన్ని చేతుల్తో కప్పుకుని కొంతసేపు అలానే ఉండిపోయి ఒక్కసారి చేతుల్ని తీసి ఒకరినొకరు చూసుకున్నప్పుడు బిడ్డా నవ్వుతాడు, తండ్రీ నవ్వుతాడు - ఇద్దరు ఆటగాళ్లలో ఎవరి ఆనందం ఎక్కువ ఎవరి ఆనందం తక్కువ అని లెక్కలు చెప్పటం ఆటలో లీనమైన వాళ్ళకు గానీ ఆటను చూసే వాళ్ళకు గానీ భావ్యమా, సాధ్యమా, అవసరమా!సృష్ట్యాది నుంచి ప్రతి జీవితోనూ సృష్టికర్త ఇలాగే ఆడుకుంటున్నాడు.ముందు వెనకల మాయాజాలమే తప్ప ఇది ప్రతి ఒక్కరికీ ఎప్పుడో అప్పుడు ఏదో ఒకలా తెలుస్తున్న అతి మామూలు నిజం, అవునా?

జగద్గురువుల వారి అద్వైత సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ, పరబ్రహ్మ, పరమాత్మ, సృష్టికర్త, శివుడు, విష్ణువు, గణేశుడు, పార్వతి వంటి పేర్లతో తను సైతం వర్ణించిన అన్ని దేవతా స్వరూపాల వెనక ఉన్నది అవ్యక్త నిర్గుణ నిష్కామ శుద్ధ చైతన్యమే.రామానుజ, మధ్వ, వల్లభ, కృష్ణ మతాల వారు చెప్తున్న రూపధారులైన విష్ణువు గానీ శివుడు గానీ పవిత్ర స్థలాలు గానీ ఆళ్వారులు గానీ శుద్ధ చైతన్యం కానే కాదు.జగద్గురువు ప్రతిపాదించిన అద్వైతం సత్యమా రామానుజుడు ప్రతిపాదించిన ద్వైతం సత్యమా అనేది తెలియాలంటే ఇప్పటి సైన్సు నిరూపిస్తున్న "Consciousness shapes Universe" అనే చిన్న నిజం తెలుసుకుంటే చాలు.ఇప్పటికీ నేను బ్రహ్మ సత్యం జగన్మిధ్య గురించి చెప్పినది అర్ధం కాక జగద్గురువు ప్రతిపాదించిన అద్వైతం శాస్త్రీయం కాదని వాదించ దల్చుకున్న వాళ్ళు "we have been all wrong. What we have called matter is energy, whose vibration has been so lowered as to be perceptible to the senses. There is no matter" అని Albert Einstein తను కనుక్కున్న సాపేక్ష సిద్ధాంతం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాడు, వినండి!Albert Einstein అనే పాశ్చాత్యుడికి తెలిసినది మనకు తెలియనందుకు సిగ్గుపడాల్సిన పని లేదు - జగత్తునీ బ్రహ్మాన్నీ మాయ, లీల అనే రెండు ముసుగులు ఆవరించుకుని ఉండటమే అందరికీ వెంఠనే పరమసత్యం గోచరించక పోవడానికి కారణం => తపన పడాలి, ప్రయత్నించాలి, చూడాలి ఆనందించాలి, పంచుకోవాలి.

అన్ని తరాల పాటు అంతమంది పండితులు ఇంత సరళమైన విషయాన్ని ఎందుకు అంత సంక్లిష్టం చేశారో అర్ధం కావడం లేదు నాకు.ఆదిలో గురువు గారి పట్ల ఉన్న గౌరవం వల్ల అద్వైతాన్ని సమర్ధించి పోను పోను ద్వైత భావనను ప్రవేశ పెట్టి క్రమేణ జ్ఞానబోధ నుంచి మూర్తిపూజ వైపు మళ్ళడానికి కారణం ఏంటి?జగద్గురువు అంత వివరించి చెప్పిన తర్వాత మళ్ళీ పూర్వ శంకర జైనం తిరిగి శంకర మఠాల నుంచే ప్రచారం కావడం చూస్తుంటే జగద్గురువుల వారి అకాల సాయుజ్యం వెనక ద్రవ్యలోభులైన కులీన మేధావి వర్గం (ఫ్రొఫిత్ ఓరిఎంతెద్ ళెగల్ల్య్ ఈంప్రీలిస్తిచ్ ఛ్లన్ ఏలితెస్) కుట్ర ఉందని అనిపిస్తుంది నాకు.అయితే, ఇంత సుదీర్ఘమైన కాలం గడిచాక మనం పరిశోధనలు మొదలుపెట్టటం కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టు ఉంటుంది గాబట్టి విషయాన్ని ఇంతటితో మర్చిపోవడం మంచిది.దొంగనోట్లు చెలామణీ చెయ్యాలనుకున్నవాళ్ళు నోట్లకట్టలో 90 నోట్లని మంచివి పెట్టి 10 నోట్లని దొంగవి కలిపినట్టు జగద్గురువుల వారి సాహిత్యాన్ని ఇంతకాలం దాచి ఉంచి మనకు అందించారు - అంతవరకు నయమే కదా అని సరిపెట్టుకోవటం తప్ప ఇప్పుడు చెయ్యగలిగేది మాత్రం ఏముంది!

శంకారాచార్యుల వారు అంత కష్టపడి జైన,బౌద్ధ మతాలను నిగ్రహించి వైదిక ధర్మం వైపుకు నడిపించాలని చూస్తే జైనులు ఆషాడభూతుల వలె ఆయన్ని చంపేసి ఆయన పేరుతోనే పీఠాలు పెట్టి తమకూ జగద్గురువు బిరుదు తగిలించేసుకుని సృష్టికర్తని భోగవస్తువును చేసి తెలివికి తక్కువ ఆకలికి ఎక్కువ అన్నట్టు బతికేస్తున్న సమస్తమైన యావన్మందికి అమ్ముతూ తెలివికి ఎక్కువ ఆకలికి తక్కువ అన్నట్టు బతికేస్తున్న సోమరిపోతులై విపరీతమైన లాభాలను ఆర్జిస్తున్నారు.

ఆంగ్ల సామ్రాజ్యవాదులు ఇక్కడికి రాకముందు గౌతమ బుద్ధుడు లేడు - సుగత బుద్ధుడి గురించి ఎవరికీ తెలీదు.ఆంగ్ల సామ్రాజ్యవాదులు ఇక్కడి నుంచి పోయటప్పటికి సుగత బుద్ధుడు లేడు - గౌతమ బుద్ధుడి గురించి అందరికీ తెలిసింది.

ఆంగ్ల సామ్రాజ్యవాదులు ఇక్కడికి రాకముందు ఇక్కడే జైనులు అక్కడక్కడ ఉండేవాళ్ళు.ఆంగ్ల సామ్రాజ్యవాదులు ఇక్కడి నుంచి పోయటప్పటికి జైనులు ఇక్కడా అక్కడా అని లేదు ఎక్కడ చూస్తే అక్కడ వాళ్లే కనబడుతున్నారు.

ఇవ్వాళ మనం చదువుతున్న బౌద్ధ మత సాహిత్యం మొత్తం rupert makk lovell, alexander cunningham,william rhys david లాంటి వాళ్ళు శ్రీలంకలో pali text society పెట్టి తేరతిండి తింటూ  తయారు చేసి భీమ్రావ్ రాంజీ సక్పాల్ అకా డంబేద్కరు సాయంతో ఇండియాలో బయటపడినట్టు చూపించిన హిస్తారికల్ ఫిక్షన్ సినేమా - సినిమా సూపరు హిట్టు అనడానికి alexander cunningham గాడికి ఇచ్చిన నైట్హుడ్డే సాక్ష్యం!

కొసమెరుపు షాకింగ్ నిజం యేంటంటే 290 BCE నాడు చచ్చిపోయిన గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీసు 567 BCE నాటి ఆసియాకే వెలుగైన గౌతమ బుద్ధుడి గురించి ఒక్క అక్షరం కూడా రాయలేదు.కరుణామయుదైన బుద్ధుని అనుయాయి అయిన బింబిసారుణ్ణి హిందూమతదురహంకారి అయిన అతని కొడుకు అజాతశత్రువు చంపేసి రాజ్యానికి రావడం అనేది నిజం కాదు.deimachus strabo అనే గ్రీకు దేశం నుంచి వచ్చిన ఇప్పటి ఎంబసీలను పోలిన రాయబార కార్యాలయ ఉద్యోగి తన విధి నిర్వహణలో భాగంగా నమోదు చేసుకున్న వివరాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు->బిందుసారుడు->అజాతశత్రువు అనే మూడు తరాల రాజులు భౌతిక సాక్ష్యాలు ఉన్న వాస్తవ వ్యక్తులు - గౌతమ బుద్ధుడూ బింబిసారుదూ అశోకుడూ కల్పిత పాత్రలు.

వైదిక ధర్మానికి విరుద్ధమైన విషయాలను వైదిక ధర్మానికి అనుకూలం అని భ్రమింపజేస్తున్న పురాణకధలు చాలానే వున్నాయి.మచ్చుకు ఒకటి చెప్తాను.పరశురాముడు 21 సార్లు సమస్త భూమండలాన్ని చుట్టి నిక్షత్రం చెయ్యడం నిజమేనా?పరశురాముడు అనే శ్రీమహావిష్ణువు యొక్క అవతారానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.ప్రతి అవతారమూ ఇతరులకు నిర్జించ శక్యం కాని రజోగుణ ప్రధానమైన దుష్టశక్తి ఆవిర్భవించి సృష్టిలోని సమతౌల్యాన్ని భగ్నం చేస్తున్నప్పుడు శాంతిని స్థాపించే లక్ష్యంతో ఆవిర్భవిస్తుంది.కానీ, పరశురాముడి యొక్క అవతార ప్రయోజనం గురించి అటువంటి స్పష్టత లేదు.

నిక్షత్రం కధలోని జమదగ్ని గోధనాన్ని హరించి హత్యకు కూడా వెనుకాదని కార్తవీర్యార్జుండు ఇతర కధలలో ధర్మాత్ముడైన శ్రీమహావిష్ణువు భక్తుడిలా కనిపిస్తాడు.అతని పేరున ఒక మనత్రం ఉంది - మంత్రం జపిస్తే పోయిన వస్తువులు దొరుకుతాయనే నమ్మకం ఉంది.నిక్షత్రం కధలో తప్ప మిగిలిన కధలు పరశురాముణ్ణి శాంతమూర్తిలా చూపిద్తున్నాయి.కార్తవీర్యుడూ అతని కొడుకులూ చేసిన దుర్మార్గానికి అందరు రాజుల్నీ వెతికి వెతికి చంపటం న్యాయం కాదు,సృష్టికర్త యొక్క అవతార లక్షణానికి అది విరుద్ధం - అక్కడ సాత్వికంలా చెల్లిపోయిన ఇస్లామిక్ జెహాదీ రాక్షసత్వాన్ని ఇక్కడి పురాణ కధల్లోకి దూర్చేశారు,అంతే!

తొలిసారి నిక్షత్రం కధ పీష్వాల కాలం నుంచి మాత్రమే కనబడుతుంది.పరశురాముడు శవాల్ని బతికించి రాజ్యం ధార పోసింది శివాజీ అనుమానాస్పద మరణం తర్వాత అతి కొద్ది కాలంలో అతని వారసులు ముగ్గురూ మూడురకాల దుర్మరణం పాలయిన తర్వాత పీష్వాలై వంశ పారంపర్య రాజ్యమేలిన చిత్పవన్లకే.తాము లోబరచుకోవాలని అనుకున్న ప్రతి దేశంలోనూ అన్ని కీలకమైన వ్యవస్థలలోనూ తమ నమ్మకస్తులైన వాళ్ళని పాతుకుపోయేలా చేసి దేశపు చరిత్రని తమకు అనుకూలమైన దిశలో నడిపించుకోవటం అనేది ఫ్రాన్సులోనూ, జర్మనీలోనూ, రష్యాలోనూ, అమెరికాలోనూ జరిగింది - అదే వ్యూహంతో వాళ్ళు భారత భూభాగం మీద దించినవాళ్ళే చిత్పవన్ బ్రాహ్మణులు!

Ramakrishna Gopal Bhandarkar అనే పరిశోధకుడు వీళ్ళ అసలు పేర్లూ ఇంటి పేర్లూ పాలస్తీనియన్ వాసన కొడుతున్నాయని తేల్చి చెప్పాడు.జన్యుశాస్త్ర పరిశోధనలు వీళ్ళు యూరోపు నుంచి దిగబడ్డ యూదులని తేల్చి చెప్పేశాయి.ముఖ్యమైన పోలికలు సముద్రం మీద శవాలు తేలియాడుతూ వచ్చి పునర్జీవం పొందటం అనేది బైబిలులోని ఎర్ర సముద్రం దారిచ్చి మోషే స్వజనం చావును తప్పించుకోవడం అనే కధకు వికృత రూపం. అప్పటికి 35 యేళ్ళ క్రిందట అక్కడెక్కడో తమ మీద జరుగుతున్న భయానకమైన దాడిని తప్పించుకుని మన దేశం చేరుకున్న భెనె ఈస్రేల్ కధకు మరో వెర్షన్ అవుతుంది.వాళ్ళ వైపు నుంచి వాళ్ళు తమ అసలైన నేపధ్యం గురించి తెలుసుకోవటానికి చాలా క్లూలని ఇచ్చారు.కానీ మనవాళ్ళుత్త వెధవాయలు కాబట్టి కనుక్కోలేక పోయారు - హిందువులని మోసం చెయ్యటం ఇంత తేలికైన వ్యవహారమా!

చిత్పవన్ల తర్వాత మన దేశపు చరిత్రలోకి దించిన అతి పెద్ద మంద తమిళ అయ్యంగార్లు. ప్రస్తుతం రామానుజ మతానికి మూలస్తంభం అయి వాళ్ళ దృష్టిలో సృష్టికర్తకు సరిసమానుదైన రామానుజుడు మత స్థాపన చెయ్యలేదు.సా. 9 శతాబ్దపు నాదమునియే మొదటిసారి మత సాహిత్యాన్ని బయటికి తీశాడు.అంతకు ముందు తమిళ నాట అయ్యంగార్ అనే శాఖ లేదు.

అయ్యర్లు రామానుజుడి శవాన్ని సృష్టికర్తని చేసి పూజలు చెయ్యటానికి ఒప్పుకోలేదు గనకనే అయ్యంగార్లు అనే ఒక కొత్త శాఖని ఏర్పాటు చేశారు - అయ్యర్లకీ అయ్యబ్గారలకీ ఉన్న తేడాలు సున్నీలకీ షియాలకీ ప్రొటెస్టెంట్లకీ క్యాధలిక్కులకీ ఉన తేడాల మాదిరి ఉండటమే ఇది అబ్రహామిక్ మాతాల కాపీ అని చెప్పటానికి గట్టి సాక్ష్యం!అయ్యర్లు శృతికీ సున్నీలు సున్నతుకీ ప్రొటెశ్టెంట్లు ఆచారాలకీ ప్రాధాన్యం ఇస్తే అయ్యంగార్లు ఆళ్వారులకీ షియాలు ఇమాములకీ క్యాధలిక్కులు ప్రవక్తలకీ బానిసలు.

అయ్యంగార్లు వైష్ణవాన్ని ఫాలో అవుతారు గాబట్టి అయ్యర్లు అందరూ శైవులు అనుకోవడం కూడా తప్పే - శివ,విష్ణు,శక్తి,సూర్య,గనేశ పంచాయతనం పేరున వైదిక సంస్కృతికి కట్టుబడి ఉంటారు.ఎక్కువ మంది శంకరుల అద్వైతం వైపుకి మొగ్గు చూపుతారు.పొరపాటున సైతం ద్వైతాన్ని సమర్ధించరు.స్మార్తులు అనేది వీళ్ళనే!

ఇక అయ్యంగార్లు కఠోరమైన శ్రీవైష్ణవాన్ని పాటించే విశిష్టాద్వైతులు.అయ్యర్లు తరించడానికి జ్ఞానం ముఖ్యం అంటే అయ్యంగార్లు తరించడానికి భక్తి ముఖ్యం అంటారు.వేదం మా శాస్త్రం అంటారు గానీ రెండు పంచ లోహాల విగ్రహాల్ని రోజూ చింతపండేసి తోమితే మోక్షం వస్తుందని వేదం చెప్పింది వీళ్ళకి?

Jon Paul Sydnor అనే ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన పరిసోధాక్ రచయిత తన Ramanuja and Schleiermacher - Toward a Constructive Comparative Theology అనే గ్రంధంలో Indeed, when Ramanuja uses the term “Veda,” he is most often referring to the upanisads. అని బల్లగుద్ది చెప్తున్నాడు.అంటే, వీళ్ళ మతసారం కొన్ని ఉపనిషత్తులకు కలుస్తుందే తప్ప సంహితా పాఠం వీళ్ళ చింతపండు తోముడు పిచ్చని సమర్ధించడం లేదు.ఊపనిషత్తులు కూడా వైదిక సాహిత్యమే కదా అనుకుని మోసపోతున్న అమాయక హిందువులు వైదిక సాహిత్యపు విభజన గురించి తెలుసుకోవాలి.

ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం అనే వాటిని శృతి అంటే Revealed లేక Perceived అనీ మిగిలినవాటిని స్మృతి అంటే Memorizes లేక Created అనీ అంటారు.ఋగ్వేదం అనేది ఒక Collection of Prayers లాంటిది.యజుర్వేదం అంటే యజ్ఞాలకు సంబంధించిన Sacrificial Manual వలె ఉంటుంది.సామవేదం అనేది Rigvedic hymns in musical form అనేటట్లు ఉంటుంది.ఇక అధర్వవేదంలో మానవుల దైనందిన జీవితానికి ఉపయుక్తమైన Magical Charms ఉంటాయి.

ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉపవిభాగాల కింద ఏర్పరచబడి ఉంది:1).మంత్రసంహిత->ప్రధానమైన భాగం.ఋగ్వేదంలోని మంత్రాలను మాత్రం ఋక్కులు అంటారు.మిగిలినవాటిని మంత్రాలు అంటారు - వీటిని అందరూ అధ్యయనం చెయ్యవచ్చు. ప్రస్తుతం మన తెలుగువాళ్ళకి సంస్కృతం కన్న తెలుగు కన్న ఇంగ్లీషు ఎక్కువ అర్ధం అవుతుంది గనక ఇంగ్లీషులో “A compilation of all realized hymns: This section should be the best focus for who is in Brahmacharya-ashrama, that is during the stage of education” అని చెప్తున్నాను. 2).బ్రాహ్మణములు->సంహితలలోని విషయానికి వ్యాఖ్యానములతోనూ కర్మకాండలకు సంబంధించిన వివరాలతోనూ కూడుకున్న వచనభాగం.ఇంగ్లీషులో “Explanations of how to put them to practical use: This section should be the best focus for who is in Grihastha-ashrama, that is during the stage of householder” అని చెప్తున్నాను.వీటిని సంహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఆసక్తి గలవారికి బోధిస్తారు.3).అరణ్యకములు->ప్రతి వేదమంత్రానికీ సామాన్య అర్ధం,సాంకేతిక విశేషం,ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి గనుక వాటిమధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం.ఇంగ్లీషులో “Various internal observations to follow: This section should be the best focus for who is in Vaanaprastha-ashrama, that is during the stage of renounceation” అని చెప్తున్నాను.నాగరికులకూ లౌకికులకూ ఇవి అనవసరం గనక ఆచార్యత్వాన్ని  ఇష్టపడినవారికి బోధిస్తారు.4).ఉపనిషత్తులు-> ఇంగ్లీషులో “Footnotes which capture the essence of the entire veda: This section should be the best focus for who is in Sanyaasa-ashrama, that is during the final stage of before seeking/attaining moksha” అని చెప్తున్నాను.

సృష్టికర్త స్వయాన ద్రష్టలకు వ్యక్తం చేసినది సంహిత మాత్రమే కాబట్టి హిందువులకి అది ఒక్కటే పరమ ప్రమాణం అవుతుంది.ఉపనిషత్తులు మనుషులు సంకలించినవి.వాటికి వేదంతో సానుకూలత ఉందో లేదో తెలుసుకుని వేదంతో విభేదించని వాటిని మాత్రమే ప్రమానం కింద తీసుకోవాలి.వీటికి వేద ప్రమాణం ఉందా లేదా అనేది తేల్చుకోవాలని అనుకున్న వాళ్ళు మొదట వేదం చదవాలి.

కానీ, రామానుజ మత సమర్ధకులు అలా చెప్పడం లేదు."మీరు  ద్వైత,విశిష్టాద్వైత మతాలు వేదాలకు అనుబంధంగా లేదని ఎలా చెబుతారు? వ్యాసుడి కన్నా భిన్నంగా మీరు కొత్తగా చెబుతూ,.ఆయనెవరికో చాలా knowledge ఉందని మీరు conclusion చేసుకున్నారు.పైగారామానుజుల వారే తప్పుగా అర్ధంచేసుకుని ,(ఉపనిషత్తులను వేదంగా)వేదాపర్ధం చెప్పారని అభ్యంతరకరంగా చెప్పారు.వేదార్ధ సంగ్రహం రామానుజులు వేదం నుండే తీసుకుని వ్రాశారు.మీ దృష్టిలో ఉపనిషత్తుల స్థానమేమిటో?తెలియదు గానీ, వ్యాసుడూ,మరియూ ఇతర మహర్షులూ ,వాటిని వేదాలకు అర్ధం సరిగా చెప్పే వ్యాఖ్యానాలు గానే చెప్పి వాటిని ప్రమాణంగా చూపారు.ఇక మీరు బ్రహ్మసూత్రాలనూపురాణేతిహాసాలనూ, ఉపబృంహణాలనూసంహితలనూ.వేద వాజ్ఞ్మయంలో భాగంగా అంగీకరించరు కనుక, రామానుజులే అపార్ధం చెప్పినట్లు ,అనిపించటం సహజమే అయినా, దానిని వైదికులు మెచ్చరు,అంగీకరించరు.ఇది ఎన్నటికీ తెగదు." అని మూర్ఖపు వాదనలను చేస్తున్నారు.

ఆయనెవరికో చాలా knowledge ఉందని మీరు conclusion చేసుకున్నారు” అనేది నేను Jon Paul Sydnor చేసిన రీసెర్చిని గురించి చేసిన ప్రస్తావన మీద వేసిన వ్యంగ్యం.జియ్యర్ స్వామి గారు రష్యా వెళ్ళి రష్యన్ భాషలో ఒక పాట పాడిన వీడియో చూశాను - మరి వేరే దేశం ఆయనెందుకు వెళ్ళాడు?మన దేశంలో యూనివర్సిటీలు పెట్టటానికి కొన్ని చట్టాలు ఉన్నాయి.నాగార్జునఆంధ్ర,కాకతీయ యూనివర్సిటీలు చట్టబద్ధమైన గుర్తింపు ఉన్నవే కదా.ప్రిన్స్టన్ యూనివర్సిటీ కూడా ఇలాంటి చట్టాల ప్రకారం ఏర్పడిన యూనివర్సిటీయే.ఓక్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ప్రొఫెసరు యూనివర్సిటీ తరపున చేసిన రీసెర్చికి విలువ ఇవ్వకపోవడం వాళ్ళ డొల్లతనాన్ని చూపిస్తుంది.

అదే Jon Paul Sydnor మరొక రీసెర్చి స్కాలర్ From Hagiographies to Biographies: Rāmānuja in Tradition and History అనే తలకట్టుతో పబ్లిష్ చేసిన పుస్తకానికి పరిచయం వ్రాస్తూ So who is the real Rāmānuja? Or is there even a real Rāmānuja whom historians can access with any reliability? అని అనకు ప్రశ్నలు వేస్తున్నాడు.2014 నాడు Oxford University Press నుంచి విడుదల అయిన పుస్తకానికి వ్రాస్తున్న ముందుమాటలో “Just as Westerners argue about JEPDH and Moses, the Jesus of history and the Christ of faith, so Indians may one day argue about the Rāmānuja of history and the Śrīrāmānujācārya of faith. Experience suggests this will be a passionate debate, and may even get ugly. Some religious communities do not appreciate challenges to their inherited certainty.” అని అనటం వల్ల శ్రీ వైష్ణవులు భగవంతుడి స్థాయి ఇచ్చిన శ్రీ రామానుజుల వారు యదార్ధ చరిత్ర లోని వాస్తవ వ్యక్తి అనడానికి గట్టి సాక్ష్యం లేదని తెలుస్తున్నది.

శివపరమైన దక్షిణామూర్తి స్తోత్రం చదవడానికి అహం అడ్డొచ్చి హయగ్రీవ స్తోత్రం అనేదాన్ని పుట్టించడమూ శివుడు విష్ణువుకి పాకీపనులు చేశాడని చెప్తున్న కధల్ని ప్రచారం చెయ్యడమూ వీరశైవాన్ని పుట్టించింది.మొన్నటి సమతామూర్తి ఆవిష్కరణ విష్వక్సేన పూజతో మొదలవటం కాకతాళీయం కాదు.వాళ్ళ మాసపత్రికలో ఒక రచయిత ప్రస్తావన చెయ్యడం నేను చదివాను.ఒక కురాడు నాకు మెయిల్లో "మా తాతయ్యతో పెద్ద చావుగా ఉంది.శివాలయానికి వెళ్ళొస్తే శ్మశానానికి వెళ్ళొచ్చినట్టు మైలస్నానం చేసి గానీ ఇంట్లోకి రానివ్వడు!" అని తన బాధ చెప్పుకున్నాడు.

వీళ్ళ పిచ్చి చేష్టల్ని వైదిక తర్కం సమర్ధించదని తెలిసి పూర్వ మీమాంసని పుట్టించి అసలైన మీమాంసని దీని తర్వాత పుట్టిందని బొంకిన వీళ్ళు అమాయకులా?వేదం మీద భక్తి ఉన్నవాడు వేదం గురించి అబద్ధం చెప్పడు గద.రాజభటులు గురువు కోసం వస్తే గురువు గారిలా వేషం కట్టిన శిష్యుడు వాళ్ళతో వెళ్ళగానే గురువు గారు పడవెక్కి అదివిలోకి పారిపోవటం అనే కూరనాధుడి ఖద లాంటి ఖదని నిన్న  గాక మొన్న కరుణాకర్ సుగ్గున చెప్తున్న బైబిలు పాఠాల్లో విన్నాను.రామానుజుడి వరకు అక్కర్లేదు, వీళ్ళు రామానుజుల మీద పగబటి వేధించాడని అమ్రిష్ పురిలా చిత్రించి వదిలిన క్రిమికంఠ చోళుదు అనే విష్ణుదేషి యైన శివభక్తుడు చరిత్రలో ఉన్నాడని నిరూపిస్తే చాలు - లక్ష డాలర్ల బహిమతి సిద్ధంగా ఉంది.

మనవాళ్లకి చరిత్ర తెలియదు,రాయలేదు,అందుకే సాక్ష్యాలు దొరక లేదు అని పిచ్చి మాటలు చెప్పకండి.జనమేజయుడికి శాసనాల సాక్ష్యం ఉంది.పరీక్షిత్తుకీ శాసనాల సాక్ష్యం ఉంది.కేవలం నాలుగూళ్ఖని పరిపాలించిన చిన్న చిన్న రాజులు సైతం తమ గురించి చెప్పుకుంటూ శాసనాలు వేయించుకున్నారు.మార్షల్ అండ్ విలియంస్ వచ్చి మనకి చరిత్ర అంటే ఏంటో నేర్పి బయటికి తీసేవరకు మనకి చరిత్రని నమోదు చెయ్యటం తెలియదని కమ్యూనిష్టు చరిత్రకారులు చెప్పారు - నమ్మినవాళ్ళు నమ్మారు.నమ్మని వాళ్ళు వెతికితే జనమేజయుడి శాసనాలూ దొరుకుతున్నాయి.ఇవ్వాళ మనం హైస్కూల్ పాఠాల్లో చదువుతున్న శాతవాహన రాజుల రాజుల పేర్లు పురాణాల నుంచి తీసుకుని శాసనాల సాక్ష్యం దొరికాకనే చరిత్రలోకి ఎక్కించారు.అబద్ధాలు చెప్పి మీలాంటివాళ్ళని నమ్మించగలరు గానీ మాలాంటివాళ్ళని నమ్మించడం మాత్రం అంత తేలిక కాదు.

వేదం చెప్పిన సత్యం ఒక్కటే హిందువులకి అనుసరణీయం.వేదం మీద శ్రద్ధ మాత్రమే హిందువుల్ని రక్షిస్తుంది.నేను హిందువుని అని గర్వించాలని అనుకున్న ఒక్కడూ వేదనింద చేస్తున్న నాస్తిక మతాల్ని అనుసరించకూడదు, అభిమానించకూడదు, సమర్ధించకూడదనేది వ్యాసపరాశరాది చతుర్యుగపర్యంతం వ్యాపించిన ఆచార్యపరంపర పాదాల మీద ప్రమాణం చేసి మూడు కాలాలను ముడివేసి చూడగలిగిన నేను చెప్తున్న పరమసత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!! 

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...