Tuesday, 13 December 2022

దేవుడు లేడంటూ గోల చేస్తున్న అరగుండు కోడి మెదడు హేతువాదులు ఇక తోకలు ముడుచుకుని పారిపోవాల్సిందే - హరిబాబు ఆఖరు దెబ్బ కొట్టేశాడు!

చాలామంది అరగుండు కోడి మెదడు హేతువాదులు "దేవుడు ఉన్నాడు అనేవాళ్ళుమాత్రమే రుజువులు చూపించాల్సి ఉంటుంది.లేని దానికి సాక్ష్యం ఉండదు కాబట్టి దేవుడు లేడు అనేవాళ్ళు సాక్ష్యం చూపించాల్సిన అవసరం లేదు" అని అంటున్నారు కదా నిన్నటి వరకు.

నేను ముఖ పుస్తకం దగ్గిర రంగంలోకి దిగి {నమ్మకం, నిజం అనేవి రెండు వేర్వేరు పదాలు. వాటి అర్ధాలు కూడా ఒకదానితో ఒకదానికి సంబంధం లేనివి.మీరు "దేవుడు ఉన్నాడు!" అని నమ్మటానికి నిరూపణ అవసరం లేదు.కానీ మీరు ఇతర్లకి "దేవుడు ఉన్నాడు అనేది నిజం !" అని చెప్పటానికి ఇతర్లని నమ్మించగలిగే సాక్ష్యం చూపించాల్సిన బాధ్యత మీదే. అదే లాజిక్ ప్రకారం మీరు "దేవుడు లేడు!" అని నమ్మటానికి నిరూపణ అవసరం లేదు.కానీ మీరు ఇతర్లకి "దేవుడు లేడు అనేది నిజం !" అని చెప్పటానికి ఇతర్లని నమ్మించగలిగే సాక్ష్యం చూపించాల్సిన బాధ్యత మీదే.} అని కుండ పగలేస్తున్నట్టు చెప్పాక నత్తి మాటలు మాట్లాడుతున్నారు భలే సరదా సన్నివేశం లెండి!

తర్వాత కూడా "మీరు నిరూపించలేకపోతున్నారు,కాబట్టే అడ్డగోలు వాదనలు చేస్తున్నారు" అనే సుత్తికి విసుగు పుట్టి "{3.థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమం : సహజ థర్మోడైనమిక్ ప్రక్రియలో, ఇంటరాక్టింగ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్ యొక్క ఎంట్రోపీల మొత్తం పెరుగుతుంది.సమానంగా, రెండవ రకమైన శాశ్వత చలన యంత్రాలు అసాధ్యం.} రెండవ ఉష్ణగతిజ నియమం ఏమి చెబుతున్నదంటే, ఒకదానినొకటి ప్రభావితం చేసుకొనగలిగిన పరస్పర సంబంధం కలిగి ఉన్న అనేకానేక వ్యవస్థలలోని ఒక స్వతంత్రమైన వ్యవస్థలో విధమైన బాహ్యశక్తి పనిచేయని సహజ స్థితిలో ఉన్నప్పుడు entropy ఒక క్రమబద్ధమైన వేగంతో పెరుగుతూ వ్యవస్థ అప్పుడున్న ordorliness నుంచి disorderliness వైపుకి నడుస్తుంది.ఒక వ్యవస్థలో ఇప్పుడున్న order అలాగే ఉండాలంటే దానిమీద ఏదో ఒక బాహ్యశక్తి పని చేయాల్సిందే, వ్యవస్థను పట్టి ఉంచే బాహ్యశక్తి వెనుక వ్యవస్థ ఉండి తీరాల్సిన అవసరమూ అవసరాన్ని గుర్తించిన ఒక సంకల్పమూ ఉండి తీరాల్సిందే! తిరుగులేని పాదార్ధిక నియమమే దైవం అనే ఆధ్యాత్మిక భావనను శాస్త్రీయమైనది అని రుజువు చేస్తున్నది.ఎలాగంటే, విశ్వం లోని ప్రతి అంశం ఎంతో నిర్దిష్టంగా నిర్మించబడి ఉండి బాహ్యశక్తి పనిచేయనప్పటి అస్థిరత్వంలోకి జారుకుని నశించిపోవడం లేదు కాబట్టి దీనిని స్థిరంగా ఉంచడం కోసం శక్తిని ప్రయోగించుతున్న దివ్యసంకల్పమే దైవం అని తెలుస్తున్నది కదా!" అన్న జవాబు వదిలేసరికి  వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి - లేకపోతే నేను ముడ్డి కొచ్చింది పిత్తుతాను నోటికొచ్చింది వాగుతాను, నువ్వు మాత్రం చెప్పిన దానికి సాక్ష్యం చూపించి తీరాలి అంటే ఎట్టా?

ఇప్పటికీ "దేవుడు లేడు!" అని అనటమే సైంటిఫిక్ అని వాదించాలనే దురద పుడితే హైందవేతర మతాల వాళ్ళ మీదకి పోవాలి తప్ప ఇక ముందు నాస్తికులు ఎవరూ హిందువుల మీదకి రారు.అది హరిబాబు గొప్పతనం కాదు.వేదం యొక్క గొప్పతనం!

వాళ్ళ మీదకి నేను విసిరింది వైదిక తర్కం.మోడర్న్ సైన్సు కూడా ప్రయోగాలు చెయ్యడానికి ముందు సిధ్ధాంత నిరూపణ కోసమూ తర్వాత ప్రయోగ ఫలితాల్ని విశ్లేషించడం కోసమూ వైదిక తర్కాన్నే వాడుతుంది.గత రెండు వందల యాభై యేళ్ళ ఆధునిక వైజ్ఞానిక చరిత్రలో వేదం చెప్పిన సత్యాలను ఖండించే ఆవిష్కరణ ఒక్కటి కూడా లేదు.

ఒక కారును అమ్మిన కంపెనీ కారును ఎలా వాడుకోవాలో చెప్పే User Manual మనకు ఇచ్చినట్టు సృష్టికర్త తను సృష్టించిన విశ్వాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో చెప్పిన సకల విద్యల సమాహారమే వేదం.మనిషి తనంతట తను బోధ పర్చుకోలేని సత్యాలు వేదంలో చాలా ఉన్నాయి.అందుకే, వాటిని మనకు చెప్పిన వేదర్షులు సృష్టికర్త తమ తపస్సుకు మెచ్చి అనుగ్రహించి దర్శింపజేసిన సత్యాలకు ద్రష్టలం మాత్రమే తప్ప కర్తలం కాదని వారే  చెప్పుకున్నారు.

వేదాన్ని అర్ధం చేసుకోవటం చాలా కష్టం అనేది ఒక అపోహ మాత్రమే.ఒక వీడియో గేం తయారు చేసిన వ్యక్తి అది ఇతర్లకు సులభంగా అర్ధం అయ్యేటట్లు చెప్తేనే ఇతర్లు ఆడతారు గానీ "నేను తయారు చేసిన "ఆతని ఆడటం చాలా కష్టం" అని చెప్పి భయపెడితే ఎవరు ఆడతారు?మీరు చెప్పండి!

వేదాన్ని అర్ధం చేసుకునే పద్ధతిని కూడా సృష్టికర్తయే ఇచ్చాడు.శిక్ష,నిరుక్తం,ఛందస్సు అనేవి వేదమంత్రాలని ఎలా అర్ధం చేసుకోవాలో చెప్తాయి.ఇక వైదిక భాషని ప్రమాణికం చేసుకుని సంస్కృత భాషకి పాణిని వ్రాసిన అష్టాధ్యాయి కూడా ఉంది.మొదట వీటిలో ప్రావీణ్యం లేనిదే వేదం అర్ధం కాదు గాబట్టి "వేదాన్ని అర్ధం చేసుకోవటం చాలా కష్టం" అనే పుకారు ప్రబలింది లోకంలో.

ఇప్పుడు "వేదాల్లో యేసు ఉన్నాడు,అల్లా ఉన్నాడు" అని పాస్టర్లూ ముల్లాలూ వేదాలకి తప్పుడు అర్ధాలు చెప్తున్నది కూడా వాళ్ళకి వేదాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియకనే.కమ్యూనిష్టులు వేదాల్లో బ్రాహ్మణులు కూడా ఆవు మాంసం తిన్నట్టు ఉంది అని కొన్ని మంత్రాల్ని సాక్ష్యం కింద చూపించినప్పుడు హిందువులకి కూడా అనుమానం వస్తున్నది కూడా వేదాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియకనే.

శిక్ష,నిరుక్తం,ఛందస్సు,అష్టాధ్యాయి పూర్తయ్యాక కూడా వెంఠనే వేదం లోకి దూకెయ్య కూడదు.వైశేషిక, న్యాయ, సాంఖ్య, మీమాంస, యోగ, వేదాంత దర్శనాలలో ఆలోచన అంటే ఏమిటి,అది ఎలా పుదుతుంది,దానిని ఎలా వ్యక్తీకరించాలి అనే అంశాలు ఉంటాయి.అదే తర్క శాస్త్రం అయ్యింది.

వైదిక తర్కంలో సత్యాన్ని నిరూపించడానికి 8 రకాల సాక్ష్యాలు ఉన్నాయి.అంటే, మనం ఒక విషయాన్ని గురించి ఒక ప్రతిపాదన చేసి అది సత్యం అని ఇతరుల చేత ఒప్పించడానికి మనం ఎనిమిదింటిలో ఒక్క తరగతికి చెందిన సాక్ష్యం చూపించినా ఇతర్లు చచ్చినట్టు ఒప్పుకు తీరాలి.

1.ప్రత్యక్షం:Sound(శబ్దం), Touch(స్పర్శ), Picture(రూపం), Taste(రసం), Smell(గంధం) అనేవి ears(చెవులు), skin(చర్మం), eyes(కన్నులు), tongue(నాలుక), nose(నాసిక) ద్వారా మెదడును చేరి మనకు ఇతరుల సహాయం లేని జ్ఞానాన్ని అందిస్తాయి.మన ఇంద్రియాలతో తెలుసుకోగలిగిన సత్యాలాకి ఇతరులు కష్టపడి సాక్ష్యాలు చూపించనక్కర లేదు.

ప్రత్యక్షం మూడు విధాల ఉంటుంది:

():అవ్యపదేశం - వేదిక్ స్కాలర్ హరిబాబు కెమెరామెన్ గంగతో కన్ఫ్యూజ్ అయిన  రాంబాబుకి "మామిడి పండు తియ్యగా ఉంటుంది" అని చెప్తే అప్పటికే రాంబాబుకి హరిబాబు ఎప్పుడూ నిజమే చెప్తాడు అనే నమ్మకం ఉండటం వల్ల రాంబాబు దాన్ని నమ్మినప్పటికీ అది రాంబాబుకి ప్రత్యక్ష ప్రమాణం కాదు.సొంతంగా మామిడిపండుని రుచి చూసి తెలుసుకున్నప్పుడు మాత్రమే రాంబాబు ప్రత్యక్ష అవ్యపదేశ ప్రమాణం ద్వారా సత్యాన్ని తెలుసుకున్నట్టు అవుతుంది.

():అవ్యభిచార - చీకట్లో తాడును చూసి పాము అనుకోవటం కూడా ప్రత్యక్షంగా చూడటమే కదా అనిపిస్తుంది.కానీ,అలా భ్రమ పడక దీపం వెలిగించి చూసి తెలుసుకున్నప్పుడే రాంబాబు ప్రత్యక్ష అవ్యభిచార ప్రమాణం ప్రకారం తను చూసింది తాడు అని గానీ పాము అని గానీ తెలుసుకున్నట్టు అవుతుంది.

():నిశ్చయాత్మక - తను చూసింది భ్రమ కానప్పటికీ ఒకోసారి అయోమయాన్ని కలిగించవచ్చు.దూరం నుంచి చూసే ధూళీ పొగా ఒక్కలాగే కనిపిస్తాయి.

అగ్గి రేగుతుంటే ధూళే కదా అనుకుంటే కొంపలు కాలిపోతాయి:-(

ధూళిని చూసి పొగ అనుకుని హడావిడి చేస్తే ముఖాలు మాడిపోతాయి:-)

 ఒక్క మాటలో చెప్పాలంటే ప్రత్యక్ష ప్రమాణం అవ్యపదేశం,అవ్యభిచారం అయితే గానీ అది నిశ్చయాత్మకం కాదు.అన్ని ప్రమాణాలలోనూ నిశ్చయాత్మక ప్రత్యక్ష ప్రమాణం తిరుగు లేనిది.

2007 డిసెంబర్ 6 హత్యకు గురయిన అయేషా మీరా అనే 19 సంవత్సరాల వయస్సున్న ఒక ముస్లిం అమ్మాయిని చంపింది ఎవరో ఇప్పటి 2022 డిసెంబర్ 13 వరకు తేలక పోవడానికి సంఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు బృందం అక్కడ కనిపిస్తున్న నిశ్చయాత్మకమైన ప్రత్యక్ష ప్రమాణాల్ని నమోదు చెయ్యక పోవటం వల్లనే కదా!

 అది ప్రత్యక్షమా పరోక్షమా అనుమానమా ఉపమానమా అన్నది గాక ఏది ఉపయోగించినప్పటికీ ప్రమాణ సహితం ఆర్జించిన జ్ఞానం మన సత్యాన్ని తెలుసుకోవడానికి మనం పడిన శ్రమకు ఫలితం(result)అవుతుంది.అయితే, ప్రత్యక్ష ప్రమాణానికి రెండు రకాల ఫలితాలు మాత్రమే ఉంటాయి.ఒక వస్తువు గురించిన ప్రత్యక్ష జ్ఞానం వస్తువును స్వీకరించడమా తిరస్కరించడమా అన్న రెండు రకాల ఫలితాలనే ఇస్తుంది.

ఆయేషా మీరా హత్య కేసులో పోలీసులు ప్రత్యక్ష ప్రమాణాల్ని తిరస్కరించేశారు.పైన ఇతరులు తమని అసలైన నేరస్థుల కింద అనుమానించడానికి వీలున్న ప్రమాణాలను నాశనం చేసేశారు!బుర్రలో కామన్ సెన్స్ అనే గుజ్జుండి వెతికితే కొన్ని గంటల్లోనే దొరకాల్సిన రోకలి బండ అనే హంతకుడు వాడిన ఆయుధం ఆరు నెలల తర్వాత దొరికింది,అదీ హంతకుడు ఎక్కడ పారేశాడో గుర్తుంచుకుని వర్ణించి చెప్పాకనే తెలిసింది - !

 

ప్రత్యక్ష ప్రమాణం కుదరనప్పుడు మిగిలిన ఏడింటిలో మొదట తీసుకోవాల్సింది అనుమాన ప్రమాణం.

2.అనుమానం:అనుమానం అనగానే "ఠాట్! అనుమానించడం సాక్ష్యం ఎలా అవుతుంది?This is highly Idiotic!" అని రెచ్చిపోకండి - వంటవాణ్ణీ, లడ్డూ సింగునీ, సత్యంబాబునీ తెచ్చి కోర్టు ముందు నిలబెట్టిన ఆంధ్రా పోలీసుల్ని చూసి మోసపోకండి.పూర్వవత్,శేషవత్,సామాన్యత్ అనే మూడు రకాలు ఉన్నాయి అనుమానాన్ని ప్రమాణం కింద తీసుకోవడానికి.

():పూర్వవత్ - గతంలో ప్రత్యక్ష ప్రామాణం ద్వార నిరూపన అయిన సత్యంతో పోల్చి చూసి ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నది కూడా అదేలా ఉన్నట్టు చెప్పడం.హరిబాబు మేఘాలను చూసి ఒక గంటలో వర్షం రావచ్చునని చెప్పటం - ఒక గంట తర్వాత వర్షం కురవనంత మాత్రాన గంట క్రితం హరిబాబు అబధ్ధం చెప్పాడని రాంబాబు అనలేడు కదా!

హరిబాబు చెప్పిన తర్వాత గంట సేపటి వరకు రాంబాబు చచ్చినట్టు నమ్మి తీరాలి కదా!నమ్మక పోయినా రాంబాబు నమ్మినట్టు నటించాలి కదా!హరిబాబు చెప్పిన వెంటనే వెక్కిరించి తీరా గంట లోపు కురిస్తే అప్పుడు రాంబాబు ముఖం ఎక్కడ పెట్టుకోవాలి:-0)

():శేషవత్ - ఇది అనేక సార్లు ఒక సంఘటన జరిగాక ఇంకొక సంఘటన జరిగితే రెంటికీ ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకుని ప్రస్తుతం మొదటి సంఘటనని చూడగానే రెండవ సంఘటన కూడా జరుగుతందని చెప్పటం.

నిప్పు లేనిదే పొగ రాదు అన్న రూఢిగా తెలిసిన సత్యాన్ని బట్టి దూరంగా పొగ కనపడగానే అక్కడ ఏదో కాలుతుందని అనుమానించడం అందరూ చేస్తున్నదే కదా - ఇది శేషవత్ అనుమానం..

"అగ్గి రేగుతుంటే ధూళే కదా అనుకుంటే కొంపలు కాలిపోతాయి:-(

ధూళిని చూసి పొగ అనుకుని హడావిడి చేస్తే ముఖాలు మాడిపోతాయి:-)" అని నేను వేసిన జోకుల్ని యమా సీరియస్ నగ్న సత్యాల కింద తీసుకుని తాత్సారం చేసినప్పుడు అక్కడ కాలింది మీ కొంపే అయితే - కాబట్టి అనుమానం కూడా ప్రమాణమే,ఒప్పుకుంటారా?

(): సామాన్యవత్ - "అశ్విని","భరణి" అనేవి రెండూ ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉన్నాయని మనకు ముందే తెలుసు.ఇప్పుడు "అశ్విని" విశ్వంలోని చలనాలకు లోనై స్థాంభ్రంశం చెందుతున్నది అని ఎవరైనా మనకు సాక్ష్యాధారలతో నిరూపించి చెప్పినప్పుడు "భరణి" కూడా విశ్వంలోని చలనాలకు లోనై స్థానభ్రంశం చెందుతుంది అని అనుమానించడం.

ఇప్పుడు మీకు అర్ధం అయి ఉండాలి - నేను హేతువాదులకి దైవం యొక్క ఉనికి గురించి చెప్పిన "విశ్వంలోని వ్యవస్థలకి అనువర్తిస్తున్న రెండవ ఉష్ణగతిజ నియమాన్ని విశ్వానికి కూడా ఉపయోగించి సృష్టికర్తను నిరూపించడం" అనేది సామాన్యవత్ అనుమాన ప్రమాణం అవుతుందని .

గతంలో ప్రత్యక్షం కింద అందరూ అంగీకరించిన ప్రమాణాలను మాత్రమే ప్రస్తుతం అనుమానం కింద చెప్పాలి.మన సూత్రీకరణ, మనం చూపిస్తున్న అనుమాన ప్రమాణం ఎంత హేతుబధ్ధం అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రత్యక్ష ప్రమాణం లేనప్పుడు అది సత్యాన్ని నిరూపించడానికి పనికిరాదు.

ప్రత్యక్ష ప్రమాణం వలె ఇంద్రియాల మీద గాక అనుమానం హేతువు(reason) మీద ఆధారపడి ఫలితం(result) వైపుకు మనల్ని నడిపిస్తుంది.కాబట్టి హేతువు,ఫలితం అనేవి సంభావయత అనే కొనసాగింపు(extension)ని ఉనికిలోకి తీసుకొస్తాయి.పూర్వవత్,శేషవత్,సామాన్యవత్ అనేవి ప్రత్యేక(Special extension),సామాన్య(General extension),వ్యతిరేక(Reverse extension) సంభావ్యతల వైపుకి మన జ్ఞానాన్ని నడిపిస్తాయి.

 

ప్రత్యక్షం,అనుమానం అనేవి సాధ్యం కానప్పుడు మిగిలిన ఆరింటిలో ఉపమానం అనేది ప్రశస్తమైనది.

3.ఉపమానం:ఇతః పూర్వం మనకు తెలిసిన ఒక విషయంతో ప్రస్తుతం మనం పరిశీలిస్తున్న విషయానికి పోలిక ఉంటే పోలికని తీసుకుని కొత్త విషయాన్ని సత్యం అని నిర్ధారించడం.హరిబాబు రాంబాబుకి తెలియని పులిని వర్ణించి చెప్పాలనుకుంటే ఏం చేస్తాడు?మొదట రాంబాబుకి పిల్లి గురించి తెలుసని హరిబాబు నిర్ధారించుకుంటాడు.అప్పుడు హరిబాబు రాంబాబుకి "అపులి కూడా చూడ్డానికి పిల్లిలానే ఉంటుంది.కాప్పొతే సైజులో పెద్దది. రెంటిలో ఏదీ గడ్డం గీసుకోదూ.కానీ,పులికి బొచ్చు మీద అక్కడక్కడ నల్లటిచారలు ఉంటాయి." అని పోలికలూ తేడాలూ వర్ణించి చెప్తే రాంబాబు మొదటిసారి పులిని చూసీ చూదగానే అది పిల్లి కాదు పులి అని తెలుసుకుని అక్కణ్ణించి పారిపోతాడు.

 

 

ప్రత్యక్షం,అనుమానం,ఉపమానం అనేవి సాధ్యం కానప్పుడు మిగిలిన ఐదింటిలో ఉపమానం అనేది ప్రశస్తమైనది.

4.శబ్దం:సామాన్య వ్యవహారంలో ఆప్తవాక్యం అని కూడా అంటారు."పెళ్ళాం చెబితే వినాలి" అనేది పెళ్ళైన మగాళ్ళకి శబ్ద ప్రమాణం.పెళ్ళాలకి సంబంధించినంత వరకు లేటుగా ఇంటికి వచ్చిన మొగుడు చెప్పిన కుంటిసాకులు శబ్ద ప్రమాణానికి తిరుగు లేని ఉదాహరణ.

అందరికీ పెళ్ళిళ్ళు కావు గదా,హరిబాబుకి అవివాహితుల పట్ల వివక్ష ఉంది అని గొడవ చెయ్యకండి. వీళ్ళకి రెండు రకాల శబ్దాలు ప్రమాణం.బెస్ట్ ఫ్రెండు సినిమాని బావుందని చెప్తే సినిమాకి ఎగేసుకుంటూ పోవడం లాంటి సృష్టికర్త స్వయాన చెప్పిన వేదాన్ని నమ్మటం ఒకటో రకం శబ్ద ప్రమాణం.బెస్టు ఫ్రెండు వాడి ఫ్రెండు బాగుందని చెప్పిన సినిమాకి ఎగేసుకుంటూ వెళ్ళడం లాంటి వేదాన్ని ఋషుల నుంచి గానీ పండితుల నుంచి గానీ స్వయాన విని నమ్మటం.వైదికేతర మతాల అనుయాయులకు రెండవ రకమే గతి అయ్యింది - మొదటిరకం శబ్ద ప్రమాణం వాళ్ళకి దొరకనే దొరకదు.పాపం వాళ్ళేం చేస్తారు - వాళ్ళ ప్రవక్తలకు గానీ బోధకులకు గానీ మొదటిరకం శబ్దప్రమాణం పట్ల శ్రధ్ధ లేదు, సత్యనిష్ఠ ఉన్నవాళ్ళు కాదు!

 

ప్రత్యక్షం,అనుమానం,ఉపమానం,శబ్దం అనేవి సాధ్యం కానప్పుడు మిగిలిన నాల్గింటిలో ఐతిహ్యం లేదా ఇతిహాసం అనేది ప్రశస్తమైనది.

5.ఇతిహాసం:ఇప్పుడు మనం చదువుకుంటూ చరిత్రకీ అంటున్నదీ ఒకప్పుడు మనవాళ్ళు ఇతిహాసం అనేదానికీ ఒకే అర్ధం వస్తుంది.కాకపోతే ఆధునిక శాస్త్రజ్ఞులు ప్రత్యక్ష ప్రమాణం ఒక్కదాన్నే లెక్కలోకి తీసుకుంటున్నారు గనక ఆధునిక శాస్త్రజుల దృష్టిలో శాసనాల సాక్ష్యం ఉన్నదే చరిత్ర అవుతుంది.అయితే, మనం వైదిక తర్కంలోని మిగిలిన సాక్ష్యాలను సైతం ఒప్పుకోవచ్చును గాబట్టి రామాయణాన్ని ఇతిహాసం కింద తీసుకోవడానికి ఆధునిక శాస్త్రజ్ఞుల ఆమోదం(certificate/verification/attestation) అవసరం లేదు.

ఇక్కడ హరిబాబు ఉన్నాడు.బధ్ధ శత్రువులు సైతం హరిబాబు అబధ్ధం చెప్తాడని అనుకోవటం లేదు.అలాంటి వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఇతర్లకి శబ్ద ప్రమాణమూ అవుతుంది,వాళ్ళు జరిగిందని చెప్తున్న కధ ఇతిహాసమూ అవుతుంది.

ప్రత్యక్షం,అనుమానం,ఉపమానం,శబ్దం,ఇతిహాసం అనేవి సాధ్యం కానప్పుడు మిగిలిన మూడింటిలో అర్ధాపత్తి అనేది ప్రశస్తమైనది.

6.అర్ధాపత్తి:ఒక సూత్రీకరణని అర్ధం చేసుకుని దానినుంచి మరొక హేతుబధ్ధమైన సూత్రీకరనను సాధించడం అర్ధాపత్తి అవుతుంది.ఒకరు "మేఘాలు ఉన్నప్పుడు వర్షం వస్తుంది!" అని సూత్రీకరించి చెప్పినప్పుడు మనము "మేఘాలు లేనప్పుడు వర్షం రాదు!" అని సూత్రీకరించి చెప్పినప్పుడు అర్ధాపత్తిని సాక్ష్యంగా చూపించినట్లు అర్ధం అవుతుంది,కదా!

 

ప్రత్యక్షం,అనుమానం,ఉపమానం,శబ్దం,ఇతిహాసం,అర్ధాపత్తి అనేవి సాధ్యం కానప్పుడు మిగిలిన రెండింటిలో సంభవం అనేది ప్రశస్తమైనది.

7.సంభవం:అందరికీ ఇదివరకే తెలిసిన శాస్త్రజ్ఞానం ప్రకారం సామాన్య బుధ్ధి విశేషంతో చూస్తే ప్రకృతి ధర్మాల రీత్యా మనం చేసిన ప్రతిపాదన జరుగుతుంది అనే ఆస్కారం ఉన్నది సంభవ ప్రమాణం."భీమసేనుడు భూమిని కందుకం వలె భావించి ఎగిరి తన్ని విసరి పట్టి క్రీడించినాడు!" అనేది నిజంగా జరిగితే మనం ఇప్పుడు ఇక్కడ ఉండటం సాధ్యమయ్యేది కాదు గాబట్టి అది సంభవ ప్రమాణం కాదు.కవిత్వంలో ఇలాంటివి చెప్పడం తప్పు కాదు గానీ అది చారిత్రక సత్యం అని మాత్రం అనకూదదు,కదా!

 

ప్రత్యక్షం,అనుమానం,ఉపమానం,శబ్దం,ఇతిహాసం,అర్ధాపత్తి,సంభవం అనేవి సాధ్యం కానప్పుడు మిగిలిన అభావం/అభవం అనేదాన్ని తీసుకోక తప్పదు.

8.అభవం:అందరూ అభావం అంటున్నారు గానీ సంభవంతో లయ కుదురుతుందనే సరదాతో నేను అభవం అంటున్నాను,అంతే - కంగారు పదకండి.అల్లరి  డోసు ఎక్కువైనప్పుడు "ఏమిటీ అభావ చేష్టలు!" అని ఒకప్పుడు పెద్దలు పిల్లల్ని విసుక్కునేవాళ్ళు.ఇప్పుడు పిల్లలు అసలు అల్లరి చెయ్యడం లేదు గాబట్టి పెద్దలకి "ఏమిటీ అభావ చేష్టలు!" అని విసుక్కునే అవసరం కూడా లేదు. టీచరు గారు స్టూడెంట్లకి పూల తోటలోకి వెళ్ళి పసుపు రంగులో లేని పూలని తెమ్మంటే ఏం చేస్తారు?పూరేకుల్లో పసుపు రంగు లేని పూలని తీసుకొస్తారు.మాస్టారు రైఠ్ అంటారు.

ఇప్పుడు మీకు అర్ధం అయి ఉండాలి - అరగుండు కోడి మెదడు హేతువాదులు "దేవుడు ఉన్నాడు అనేవాళ్ళుమాత్రమే రుజువులు చూపించాల్సి ఉంటుంది.లేని దానికి సాక్ష్యం ఉండదు కాబట్టి దేవుడు లేడు అనేవాళ్ళు సాక్ష్యం చూపించాల్సిన అవసరం లేదు" అని అనేది అభావ ప్రమాణం అవుతుందని.అయితే, సృష్టికర్త యొక్క అస్తిత్వానికి నేను చూపించిన సామాన్యవత్ అనుమాన ప్రమాణం ముందు ఇది తేలిపోతుంది,యేడిసినట్టు ఉంటుంది.వీళ్ళు గనక క్రైస్తవుల్నీ ముస్లిముల్నీ నిలదియ్యాలనుకుంటే మాత్రం రిజల్టు అదిరిపోద్ది.ఎందుకంటే, వాళ్ళ దేవుడికి రూపం ఉంది,ఆకలి దప్పులు ఉన్నాయి - ధెర్మోడైనమిస్కుతో ఈకలు పీకటానికి తగులుకుంటే వాళ్ళ మతగ్రంధమే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.

జై శ్రీ రాం!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...