Friday, 30 July 2021

ఆలయమా నగరమా అనిపించేటట్టు ఉన్న Angkor Wat యొక్క నిజమైన చరిత్ర ఏమిటి?

ప్రస్తుతం సామాన్య శకం పన్నెండవ శతాబ్దికి చెందిన ఖ్మేర్ రాజులు నిర్మించారని చెప్తున్న ఆలయనగరం యొక్క పేరు అయిన angkor wat అనే పదానికి అక్కడి స్థానిక సంస్కృతికి చెందిన వారి ప్రాంతీయ భాష నుంచి ఇంగ్లీషుకి అనువదించిన  "Temple City" అనే పదాన్ని ఖాయం చేశారు.దానినే అందరూ వాడుతున్నారు.కానీ, దీనిని నిర్మించిన ప్రాచీన భారతీయులు ఆలయ సముదాయాన్ని "ఆది వరాహ లోకం" అని గానీ "విష్ణు వరాహ లోకం" అని గానీ "పరమ విష్ణు లోకం" అని గానీ వ్యవహరించినట్లు తెలుస్తున్నది.

ఆలయం యొక్క జ్యామితీయ ప్రణాళికా చిత్రనిర్మితి(Geometrical Plan Layout) ఒక్కటి చాలు దీనిని నిర్మించగలిగిన సాంకేతిక పరిజ్ఞానం అప్పటి అక్కడి ఖ్మేర్ రాజులకు లేదని బల్లగుద్ది చెప్పటానికి!ఇది హిందువులు నిర్మించిన ఆలయమే కానీ అంతకు ముందు గానీ తర్వాత గానీ హిందువులే నిర్మించిన ఒక్క ఆలయానికీ లేని ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.మచ్చుకు ఒకటి:ప్రతి ఆలయానికీ పుష్కరిణీ ఉంటుంది గానీ ఇక్కడిలా ఆలయం యొక్క వెలుపలి ప్రాకారం చుట్టూ ఉన్నట్టు కందకం ఉండదు, ఎందుకని?కందకం అనేది శత్రువుల నుంచి రక్షణ కోసం కోటలకు ఏర్పరుస్తారు, కాని ఇది కోట కాదు - ఆలయానికి శత్రుభీతిని ఊహించటం దైవశక్తిని అనుమానించటమే కదా!

మీరు గనక అక్కడికి వెళ్తే కందకానికి బయటనే మీ వాహనాలను నిలిపి నడుచుకుంటూ కందకం మధ్యన కట్టిన కాలి దారి మీద నడుచుకుంటూ వెళ్ళాలి.కందకాన్ని దాటి ముఖద్వారం చేరుకోవటానికి పది నిమిషాలు నడవాలంటే కందకం యొక్క వైశాల్యం గురించి తల్చుకుంటే గుండె గుభేలు మనటం లేదూ!అంతేనా, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తోడు ఉన్న ఈనాటి ఇంజనీర్లు ఒక్క కందనాన్ని నిర్మించటానికే కనీసం ఆరేళ్ళు పడుతుంటున్నారు.మరి, చారిత్రక శాస్త్రవేత్తలు  ఆనాటి కాలంలోనే కందకంతో సహా మొత్తం ఆలయాన్ని సుమారు నలభై సంవత్సరాల లోపు పూర్తి చేసేశారని అంటున్నారు,ఎంత అద్భుతం!అసలు ఎట్లా సాధ్యం?

మానవ నిర్మితమైన భవనాలకూ ఇతర నిర్మాణాలకూ కొలతలను అడుగులలోనూ లేదంటే మీటర్లలోనూ చెప్తారు.కానీ దీనికి కిలోమీటర్లలోనూ మైళ్ళలోనూ చెప్పాలి - కందకం కాదు ఇది, ఉత్తర దక్షిణాలలో 1.3 కిలోమీటర్లు ప్రాక్పశ్చిమాలలో 1.5 కిలోమీటర్లు విస్తరించిన బృహత్తటాకం, అన్ని వైపులా ఆవరించి ఉన్న ఆలయానికీ కందకానికీ మధ్యన ఉన్న దూరం కనీసం 5.5 కిలోమీటర్లు ఉంటుంది!

900 సంవత్సరాల క్రితం ఇంత విశాలమైన తటాకం నిర్మించగలిగిన ఖ్యాతిని ఖ్మేర్ రాజులకి ఇచ్చిన చారిత్రక శాస్త్రవేత్తలు వారికి అంతటి బృహత్తర నిర్మాణం చేపట్టగలిగిన సాంకేతికత ఉన్నట్టు చెప్పడం లేదు.దీన్ని కట్టిన sand stone ఖ్మేర్ రాజులు ఉపయోగించడం మినహా శాస్త్రజ్ఞులు మరే ఇతర సాక్ష్యాలనూ చూపించటం లేదు.అసలు అంతటి బృహత్తర నిర్మాణం చేపట్టగలిగిన సాంకేతికత ఖ్మేర్ రాజుల కాలపు కంబోడియన్ వాసులకు ఉన్నదా అనే కోణంలో పరిశోధన జరగడం లేదు.పరిశోధన కోణంలో జరిగితే ఖ్మేర్ రాజుల కాలపు కంబోడియన్ వాసులకు అంతటి బృహత్తర నిర్మాణం చేపట్టగలిగిన సాంకేతికత లేదని తెలిసిపోతుంది.

అదీగాక, పిరమిడ్లకి చెప్పిన పిచ్చికధనే ఇక్కడ కూడా చెప్తున్నారు,అత్యంత బలాఢ్యులైన బానిసలు కొరడా దెబ్బలు తింటూ పారలూ పలుగులూ తీసుకుని శరవేగాన పనిచేసి తవ్వేశారని.తీరా చూస్తే అది రెండు మూడు అడుగుల లోతుకు తవ్వి సరిపెట్టేశారని అనుకోవడానికి వీల్లేనంత లోతైనది.ప్రతి రోజూ కొందరు పడవల మీద తిరుగుతూ కందకం అడుగున పేరుకుంటున్న నాచును కర్రలతో మెలికలు తిప్పి లుంగలు చుట్టి పైకి లాగి శుభ్రం చేస్తూ ఉంటారు - వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కందకం లోతు సుమారు 25 అడుగులు ఉంటుంది.ఇదే కాదు, పిరమిడ్లు కూడా భవన నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పనివాళ్ళు భక్తిశ్రద్ధలతో చేస్తేనే అవి రూపంలో స్థిరమై నిలబడతాయి తప్ప కొరడా దెబ్బలకీ ప్రాణహానికీ భయపడి చచ్చే బానిసలకి అంత సూక్ష్మమైన స్థాయిలో సౌందర్య సృజన చెయ్యటం సాధ్యపడేది కాదు - మనస్సు లీనం కాని బానిసలకి తపస్సు చేస్తే తప్ప వరించని కళను బలవంతాన అంటించడం ఎవరికి సాధ్యం?

కొన్ని సహజమైన చెరువులతో సహా దాదాపు అన్ని మానవ నిర్మితమైన అన్ని చెరువులూ ఏదో ఒక సందర్భంలో ఎండిపోతుంటే ఇది మాత్రం కట్టిన నాటినుంచి ఎప్పుడూ నిండుగానే ఉందని స్థానికులు చెప్తున్నారు.సా.:2007 World Monuments Fund Organization అనే సంస్థ ఆలయం పైకప్పు మరమ్మతులు చేశారు.అప్పుడు వారు ఆలయానికి సంబంధించిన మరొక అద్భుతాన్ని గమనించి ఆశ్చర్య పోయారు.ఆలయ నిర్మాతలు ఆలయం లోపల నీరు నిలిచిపోవటానికి వీల్లేని చక్కని నీటి పారుదల వ్యవస్థను ఏర్పరచారు.కందకానికి బయట ఉన్న నదినుంచి కాలువలను ఏర్పాటు చేసినట్లే ఆలయం లోపల పడే వర్షపు నీటిలోని ప్రతి చుక్కనూ  కందకంలోనికి పంపించే ఏర్పాట్లు చేశారు.వాళ్ళని మనం నాగరికత అంటే ఏమిటో తెలియని పల్లెటూరి గబ్బిలాయలూ బడుద్ధాయలూ అని అంటున్నాం - హవ్వ!

యాభై వేల మంది సైనికులు సైతం ఆక్రమించలేని పటిష్టమైన రీతిలో ఒక కందకాన్ని ఒక ఆలయానికి ఎందుకు అమర్చారు అన్న ప్రశ్నకి జవాబు లేదు.ఇప్పుడు కనబడుతున్న పాషండ మతాలు అప్పుడు లేవు.ఆలయాలను కూల్చేస్తారనే భయం ఉండటానికే అవకాశం లేదు.ప్రాక్పశ్చిమాలలో ఉన్న సన్నని కాలి దారి మీద నుంచి తప్ప ఆలయాన్ని నరమానవుడు ఎవ్వడూ చేరలేడనేది వాస్తవం.చాలా ఎత్తు నుంచి చూస్తే కందకంతో కూడిన ఆలయ సముదాయం ఆధునికులు కేవలం పదిహేను సంవత్సరాల క్రితం కట్టిన Palm Jumeira వంటి మానవ నిర్మిత ద్వీపకల్పం!

ఒక్క కందకం గురించి ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి?అసలు ఆలయం గురుంచి ఎన్ని అద్భుతాలు తెలుస్తాయో అని ముందుకు వెళ్ళిపోవాలని తొందర పడుతున్నారు కదూ!తొందర పడకండి, అనీ చెప్తాను - నిదానించండి.ఆలస్యాత్ అమృతం విషం అని చెప్పిన పెద్దలే నిదానమే ప్రదానం అని కూడా చెప్పారు.ఎప్పుడు ఎక్కడ సామెత వాడాలి అనేది మాత్రం మనమే తేల్చుకోవాలి.ఆది వరాహ స్వామి కోవెల గురించి మాత్రం తెలుసుకున్నది చాలనే హడావిడి అస్సలు పనికిరాదు.

ఎందుకంటే, శాస్త్రజ్ఞులు అత్యాధునికమైన "lider imaging technique" వాడి చూస్తే కందకం లాంటి తటాకం అనిపిస్తున్న ద్వీపకల్పం ఇప్పటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుకోలేని మరొక అద్భుతాన్ని చూపిస్తున్నది.అది పైకి కనిపిస్తున్నట్టు నలు దిక్కుల వ్యాపించియున్న ఏకైక జలరాశి కాదు, చిన్న చిన్న కాలువలు కలిసి ఏర్పరచిన బుల్లి బుల్లి చెరువుల కలయిక అయిన ఒక పెద్ద నీటి పారుదల వ్యవస్థ నీటి అడుగున ఉంది! ఆలయ సముదాయం నుంచి చిక్కురొక్కురు కాలువల ముచ్చటైన అమరిక యొక్క అంచులు ఇప్పటి నగరానికి బయట కనిపిస్తున్నాయి.

ఇప్పుడు కడుతున్న Palm Jumeira లాంటివి సహజమైన నీటి మీద కడుతున్నారు,దానికోసం ఇప్పటికి తెలిసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు,ఇప్పటికి ఇదే అపురూపమైన సాంకేతికత అని కట్టిన వారు గర్విస్తున్నారు.అయినప్పటికీ ఆది వరాహ లోకం అనే ఆలయ సముదాయాన్ని అప్పుడు కట్టిన పద్ధతితో పోలిస్తే చాలా తేలిక అనిపిస్తుంది.ఎందుకంటే, ఆది వరాహ లోకం చుట్టూ ఉన్న జలరాశి కృత్రిమమైనది,కానీ సహజమైన జలరాశిలా అనిపించేటంత విస్తారమైనది. ఇప్పుడు అక్కడి ప్రభుత్వం ఆలయాన్ని పునరుద్ధరిస్తున్నది కూడా కాలువల వ్యవస్థను ఉపయోగించుకుని రైతులకు ప్రయోజనం చేకూర్చడానికే - ఒక రాతిని చూపించి దేవుడని చెప్పి ప్రజల్ని మోసం చెయ్యటానికి కట్టారని హిందూమతద్వేషులు యేడ్చి చచ్చే ఒక దేవాలయ నిర్మాణంలో ప్రజలకు నిత్యం అవసరమైన నీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇమిడ్చి చూపించారు ఆది వరాహ స్వామి ఆలయ నిర్మాతలు!

అయితే,అంతమంది పరిశోధకులు కొన్ని దశాబ్దాల నుంచి అహరహం శ్రమించి ఒక్కో కొత్త విషయం బయటపడిన ప్రతిసారీ "How on earth those ancients could do it?Why modern technology fails even to imitate it!" అని ఆశ్చర్యపడటమే తప్ప "ఇంత సంక్లిష్టమైన కందకాన్ని అప్పటివాళ్ళు ఎలా నిర్మించారు?ప్రస్తుతం కుహనా మేర్ధావులు కొందరు భావిస్తున్నట్టు బలాఢ్యులైన బానిసలు పారలూ పలుగులూ వంటి చిన్న చిన్న పనుముట్లు వాడేసి కట్టటం సాధ్యమా?ఈనాటి వారు కనీసం ఎలా కట్టి ఉంటారో వూహించటానికి శక్యం కాని సాంకేతికతను ఉపయోగించి ఉంటారా ఆనాటి వారు!అసలు ఆలయానికి కందకం యొక్క అవసరం ఏమిటి?" అనే ప్రశ్నలకు జవాబు లేదు.అసలు పరిశోధనలు కోణంలో జరగడం లేదు, ఎందుకని?

వేసుకోవలసిన నిజమైన ప్రశ్నలు వేసుకుని వాటికి నిజాయితీ గల జవాబుల్ని రాబడితే భారత దేశపు మూల సంస్కృతి యొక్క గొప్పతనం బయటపడుతుంది.ఇప్పుడు వీళ్ళు అంటగట్టిన కేవలం 900 సంవత్సరాల వెనకటి కాలం నాడు అక్కడి స్థానికులకి ఆది వరాహ లోకం చూపిస్తున్న సాంకేతికత తెలియదనీ భారతీయులు మాత్రం అప్పటికే అటువంటి సాంకేతికతలో ఆరితేరిపోయారనీ తెలుస్తుంది.అందుకే ఆయా దేశాల పరిశోధకులు తమ దేశాధినేతల రాజకీయ దృక్కోణాన్ని అనుసరిస్తున్నారు.

ప్రధాన ఆలయ సముదాయమే 400 ఎకరాల విస్తీర్ణం ఉంది.అంటే, ఇప్పటి వాటికన్ సిటీకి మూడింతలు పెద్దది.మరింత నిక్కచ్చి పోలిక ప్రకారం ఒక అమెరికన్ ఫుట్ బాల్ కోర్టుకన్న 300 రెట్లు పెద్దది.అసలు అలాంటి బరువులు ఎత్తడానికి కేవలం మనుషుల్ని ఉపయోగించాలంటే ఒక్కొక్క బానిసనీ సుమో రెజ్లర్ మాదిరి పోషించాలి.ఒకసారి అంతటి దేహ దారుఢ్యం సాధించినవాళ్ళు తమకన్న బలహీనులకు బానిసలై పడివుండటం ఎట్లా సాధ్యం?మతపెద్దలు ఏం చెప్తే అది గొర్రెల మాదిరి వినడానికి అలవాటు పడిన వెర్రివాళ్ళు నమ్ముతారు గానీ ఏదో ఒక విశ్లేషణ చెప్పాలనే తప్పనిసరి తద్దినంలా తమ దేశాధినేతల రాజకీయ దృక్కోణాన్ని అనుసరిస్తున్న శాస్త్రజులు చెప్తున్న అబద్ధాల్ని బుద్ధీ జ్ఞానం ఉన్నవాడు ఎవడు నమ్ముతాడు?

ఏదో ఆలయం కట్టాలి గాబట్టి కట్టేశారు అనుకోవడానికి వీల్లేదు.విశాలమైన వీధులు ఉన్నాయి.పొడుగాటి నడవాలు ఉన్నాయి.అర్చకులు, భక్తులు, తీర్ధయాత్రికులు, నిర్వాహకులు మొదలైన వారికోసం ఏర్పరచినట్టు ఆవరణ లోపల దాదాపు 108 ప్రత్యేక భవనాలు ఉన్నాయి.వీదులూ నడవాల వంటి ఖాళీ ప్రదేశాన్ని మినహాయించితే 10 మిలియన్ చదరపు అడుగుల నేలను రాళ్లతో కప్పేశారు.అదీ, పొరల పొరల వరసల వరసల స్తంభాలూ శిల్పాలూ పైకప్పులూ కలిపి వందల అడుగుల ఎత్తుకు పేర్చిన రాళ్ళకి వైశాల్యమూ బరువూ ఏడుస్తుంది కదా!స్వర్గానికి నిచ్చెన వేసినట్టు మధ్యన కనిపించే శిఖరం ఎత్తు 213 అడుగులు.పది మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం మీద 200 అడుగుల ఎత్తుకు అయిదు శంఖువుల్ని నిలబెట్టటానికి ఎంత రాయి అవసరం అవుతుంది?లెక్కలు కట్టండి!కేవలం అయిదు పిరమిడ్ల వరకు లెక్క గడితే 52 మిలియన్ టన్నుల sand stone కావాలి.పునాదులకీ కందకం చుట్టూ కట్టిన మెట్లకీ కూడా 52 మిలియన్ టన్నుల రాయి కావాలి.

కానీ, మొత్తం ఆలయం పూర్తి శిలానిర్మితం కాదు.స్తంభాల మధ్యన, గోడలకు మధ్యన ఉన్న ఖాళీలు రాళ్ళని స్పాంజిలా చేసి కట్టారని అనిపించేటట్టు ఉన్నాయి. కాబట్టి అయిదో వంతుకు తగ్గించితే మొదటి 52 మిలియన్ టన్నులు గాక 10,400,000 టన్నుల రాయి సరిపోతుంది.ఇంత సోది లెక్కలు ఎందుకు చెప్పడం అంటే ఆర్కియాలజిస్టులు ఆలయం మొత్తం కేవలం 37 సంవత్సరాల లోపు కట్టేశారని అంటున్నారు.శాస్త్రజులు చెప్తున్న ధృఢకాయులైన బానిసలు ఉలీ సుత్తీ దాగారా తీసుకుని చెక్కుతూ కట్టే పద్ధతిలో పది మిలియన్ టన్నుల రాయిని చెక్కుతూ 37 సంవత్సరాలలో పూర్తి చెయ్యడానికి ఎంతమంది మనుషులు కావాలి.అంత స్థాయి జనసాంద్రత అప్పటి కంబోడియాలో ఉన్నదా?

పోనీ అక్కడ ఉన్న కొద్దిమంది కార్మికులే ఉలీ సుత్తీ దాగరా తీసుకుని చెక్కుతూ కట్టాలంటే 37 సంవత్సరాల పాటు వాళ్ళు రాత్రింబగళ్ళూ నిద్రాహారాలు లేని నిరంతర శ్రమ చెయ్యాలి - పొట్టి శ్రీరాములు గారు వూరికే పడుకుని ఉండి యాభై రోజులకే హరీమన్నారు, ఒక జీవిత కాలం పాటు అలా ఉండగలిగిన ధృఢకాయులు అప్పటి కంబోడియాలో ఉన్నారని అనుకోవాలి శాస్త్రజులు చెప్తున్నది నిజం అవ్వాలంటే!162,060 గంటల పాటు రెప్ప వెయ్యని ఒకే ఒక మనిషిని చూపించమనండి "అబ్బో!అప్పటి కంబోడియన్లు చాలా తెలివైన వాళ్ళు,ధృడకాయులైన బానిసల్ని పట్టి తెచ్చి ఉలీ సుత్తీ ఇచ్చి వాళ్ళని కొరడాలతో ఛెళ్ళు ఛెళ్ళున కొట్టి పని చేయించి కట్టేశారు.ఏమనుకున్నారు కంబోడియన్లు అంటే!" అని కట్టుకధల్ని ప్రచారం చేస్తున్న శాస్త్రజులని.

లేదయ్యా, కార్మికులు పగలు మాత్రమే పని చేశారు, పని చేయించుకున్న వాళ్ళు అంత దుర్మార్గులు కాదని అనుకుంటే గంటకు 60 టన్నుల రాయిని చెక్కి శుభ్రం చేసి మెరుగు పెట్టి ఎక్కడ అమర్చాలో అక్కడికి తీసుకెళ్ళి పెట్టాలి.ఇంకోటి చెప్పలేదు నేను. రాళ్ళు అక్కడ లేవు.యాభై మళ్ళ దూరంలో ఉన్న ఒక పర్వతం నుంచి రెండు క్వారీలు రాళ్లని సప్లై చేశాయి.అక్కడి నుంచి రాళ్ళని తెచ్చే టైమును కూడా ఇందులోనే ఇరికించాలి.మన సోదికి బదులు వాళ్ళ శాస్త్రీయమైన విశ్లేషణ ప్రకారం 900 సంవత్సరాల క్రితం అక్కడ జరిగింది ఇది:EVery minute,ancient builders were cutting 1 ton of rock from a hill top,transported this rock for 5o miles, measured it, cut it, lifted and aligned it,polished it and even carved miniature drawings on this one ton block.All this happened in one minute, and they were doing this without even blinking for a second for 37 years.ఇంత ముందుకొచ్చేశాం అని చెప్పుకుంటున్న ఇప్పుడు కూడా నిమిషానికి ఒక టన్ను రాయిని తొలిచి, ఎత్తి, దించి,సర్ది "హమ్మయ్య!" అనుకోవటం సాధ్యపడేది కాదు - యే సబ్ బక్వాస్ బంద్ కరో యార్.

ఇది హిందువులు నిర్మించిన విష్ణు ఆలయమే - సందేహం లేదు.కానీ,మరే ఇతర హిందూ దేవాలయానికీ ఇన్ని ప్రత్యేకతలు లేవు.అసలు నిర్మాణ శైలియే మరే ఇతర ఆలయంతోనూ పోల్చలేనంత విభిన్నమైనది.శాస్త్రజ్ఞులు అందరూ శిఖరాల ఆకారాల్ని పద్మాలతో పోలుస్తున్నారు గానీ భవన నిర్మాణ కార్మికులు ఈనాటికీ ఉపయోగించే drilling machine ఆకారం అది.మనం రోజూ చూసే డ్రిల్లింగ్ మెషీన్ ఏమంత అందమైనది కాదని అనిపిస్తుంది.కానీ, శిఖరాలనీ దానినీ పక్కన ఉంచి పోల్చి చూశాక అదే డ్రిల్లింగ్ మెషీన్ అద్భుతమైన కళాఖండం అనిపిస్తుంది, కదూ!చిత్రకారులకి తన కళను సృష్టించటానికి ఉపయోగపడే కుంచెల మీద ప్రేమ ఉన్నట్టు ఇక్కడి శిల్పులు తమకు ఇష్టమైన పనిముట్లను చెక్కటం సహజమే! అయిదు శిఖరాలూ ప్రకృతి యొక్క అయిదు అంశాలైన భూతపంచకానికి చిహ్నం.మధ్యన ఉన్న శిఖరం ఆకాశ తత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది.అన్ని వైపులనుంచీ ఉన్న పన్నెండు మెట్లు సమాన దూరాల్లో సమాన కోణాల్తో ఉండి లెక్క పెట్టినట్టు పన్నెండు రాశుల్ని సూచిస్తున్నాయి.జాతక చక్ర రచన గురించి తెలిసినవాళ్ళకి అది ఒక రకం జన్మకుండలి చిత్రపటం అని చూడగానే తెలిసిపోతుంది.ఇంతటి స్థాయి ఖగోళ,జ్యోతిష,గణిత శాస్త్ర పరిజ్ఞానం 900 సంవత్సరాల వెనకటి కంబోడియన్ ప్రభువుల వద్ద ఉన్నదా?

అంతకు ముందు ఇటువంటి కట్టడం భారత దేశంతో సహా మరెక్కడా లేకపోవడం ఒక విచిత్రం అయితే ఆనాటికే ఇంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మించగలిగిన కంబోడియన్లు ఈనాటికీ ఇటువంటి మరొక కట్టడాన్ని నిర్మించలేకపోవటం మరింత విచిత్రం - గత శతాబ్దంలోనే ఈఫిల్ టవర్ అనీ బుర్జ్ ఖలీఫా అనీ పోటీలు పడి కడుతున్నారే!అలాంటిది 900 సవత్సరాల వెనకనే ఇంత అద్భుతాన్ని సాధించిన అప్పటి కంబోడియన్లు ఇలాంటి మరొక కట్టడాన్ని నిర్మించడానికి ఆసక్తిని చూపించకపోవటం ఎంత విచిత్రం?ఆలయ సముదాయాన్ని కట్టిన కాలం ఇదీ అప్పుడు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది వీరూ కాబట్టి ఖ్మేర్ వంశీయులే ఆలయనిర్మాతలు అని ఇప్పటి శాస్త్రజులు ఫిరాయించెయ్యడం తప్పితే కంబోడియన్ చరిత్ర నుంచి ఎటువంటి ఆధారమూ లేదు.

దీనిని నిర్మించిన వారు భారత దేశం యొక్క మూలసంస్కృతికి చెందిన వారు అని చెప్పటానికి బలమైన సాక్ష్యం అడిగేవాళ్లకి ప్రతి సంవత్సరం పగలు, రాత్రి సమం అయ్యే equinox రోజున ఇక్కడ కనిపించే అద్భుతాన్ని చూపించాలి.అంతే కాదు,అక్కడ గోడ మీద చెక్కబడి ఉన్న సూర్యదేవుని రధం కింద పైకి చూస్తూ నమస్కరిస్తున్న తొమ్మిదిమంది పురుషులను కూడా చూపించాలి.తొమ్మిదవ వ్యక్తిలో కొంచెం పొట్టితనం కనిపిస్తుంది.మనం చిన్నప్పుడు సైన్సు పుస్తకాల్లో dvaarf planet అనే పేరున plutoని 1930 నాడు కనుక్కున్నట్టు చదువుకున్నాం కదూ!మన పిల్లలు కూడా సైన్సు పుస్తకాల్లో dvaarf planet అనే పేరున plutoని 1930 నాడు కనుక్కున్నట్టు చదువుతున్నారు కదూ!

అసలైన విచిత్రం ఇది అతి పెద్ద ఆలయం కావడం కాదు, అంత పెద్ద ఆలయం యొక్క స్తంభాలూ గోడలూ అంగుళం ఖాళీ లేని విధాన చిన్న చిన్న బొమ్మలతో నిండి ఉన్నాయి.అక్కడి స్థానిక జాతులకి పరిచయం లేని భారతదేశపు పల్లె ప్రజల వినోదక్రీడ అయిన కోడిపందేలకు సంబంధించిన దృశ్యాలని కేవలం కొన్ని అంగుళాల పరిధిలో మెలివేసుకున్న మెడలూ ఎగిరి పడుతున్న ఈకలూ కంటి చూపుల్లోని రౌద్రమూ వంటి అతి చిన్న వివరాలను సైతం చూపించటం అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో గాక ఉలీ సుత్తీ దాగరా లాంటి పనిముట్లతో చెక్కుతూ అంత తక్కువ సమయంలో సాధ్యపడుతుందా అనే కనీసపు విచక్షణ కూడా లేదే సామాన్య శకం పన్నెండవ శతాబ్దికి చెందిన ఖ్మేర్ రాజులు నిర్మించారని చెప్తున్నవాళ్ళకి!

ఆర్కియాలజిస్టులు చెప్తున్న కొన్ని అబద్ధాలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు.ప్రస్తుతం మనం చూస్తున్న గౌతమ బుద్ధుడి శిల్పాలకు ఉన్న జులపాల తలకట్టును ఒక్కదాన్ని తిరుగు లేని సాక్ష్యం కింద తీసుకుని శ్రీమహావిష్ణువు మూర్తిని గౌతమ బుద్ధుడి మూర్తి కింద ఫిరాయించేసి బౌద్ధ మతస్థులకి దఖలు పర్చేశారు - బౌద్ధమతగ్రంధంలో బుద్ధుడికి రెండు కన్న ఎక్కువ చేతులు ఉన్నాయని చెప్పారు?దీనిని నిర్మించిన సూర్యవర్మన్ హిందువు అయితే అతని తర్వాత రాజైన అతని కొడుకు బుద్ధమతం పుచ్చుకుని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న బుద్ధ ప్రతిమల్ని చెక్కించాడట - అక్కడా ఇక్కడా అని లేదు ఎక్కడ హిందూమతానికి సంబంధించిన నిజాల్ని కప్పెట్టెయ్యాలనే అబద్ధీకుల సమూహం పోగైందో అక్కడ ఇలాంటి పిట్టకధలే వినిపిస్తాయి.తండ్రి తరంలో చెక్కిన శిల్పాల కన్న కొడుకు తరంలో చెక్కిన శిల్పాలు ఎంత అధమ స్థాయిలో ఉంటాయంటే కొడుకు  తండ్రి తరంలో అంత చక్కని శిల్పాల్ని చెక్కీన్ శిల్పుల్ని చంపేసి "శిల్పాలు చెక్కే పనితనం తెలియని అతి బలాఢ్యులైన  బానిసల్ని కొరడా దెబ్బలతో వీపు విమానం మోత మోగిస్తూ" కట్టించినట్టు అఘోరిస్తున్నాయి - కళ్ళ ముందు పచ్చి నిజం బట్టబయలు అయి కనిపిస్తున్నాక సైతం ఎందుకీ అబద్ధాలు?నిజానికి మొదట హిందూ ఆలయాన్ని నిర్మించటానికీ తర్వాత బుద్ధ ప్రతిమల్ని ఇరికించటానికీ మధ్య కొన్ని శతాబ్దుల కాలం గడిచింది.అది ఆ రెండు రకాల నిర్మాణాల మధ్యన ఉన్న తేడాల్ని చూసిన చిన్న పిల్లాడికి సైతం తెలిసే అతి మామూలు నిజం - మరి, అన్నేసి డిగ్రీలు తెచ్చుకున్న ఇంజనీర్లకీ ప్రొఫెసర్లకీ ఎందుకు తెలియడం లేదు!

ఒకచోట ఒక వీరుడు నాలుగు దంతాల యేనుగు మీద ఎక్కి యుద్ధం చేస్తున్న బొమ్మను చెక్కారు.ఇదెలా సాధ్యం?ఒకప్పుడు నాలుగు దంతాల ఏనుగులు ఉండేవి, నిజమే!కాని, ఎప్పుడు?రెండు మిలియన్ల కిందనే అంతరించిపోయాయని ఆధునిక శిలాజశాస్త్రం నిర్ధారణ చేసేసింది.అసలు శిలాజశాస్త్రం మొదలయ్యిందే సుమారు వందా నూట యాభై సంవత్సరాల వెనక.వాళ్ళు త్రవ్వి తీసి నిర్ధారణ చేశాక కూడా పరిశోధకులకి  తప్ప సామాన్యులకి తెలిసే అవకాశం లేదు.కొందరు రచయితలూ పాత్రికేయులూ తమకు ఆసక్తికరం అనిపించి చెబితే పుస్తకాలూ వార్తాపత్రికలూ చదివేవాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలియదు.మరి, తొమ్మిది వందల సంవత్సరాల వెనకటి కంబోడియన్ స్థానిక శిల్పులకి ఎలా తెలిసింది?భారత దేశంలోని కొన్ని ప్రాచీన ఆలయాలలోనూ నాలుగు దంతాల యేనుగులు కనిపిస్తున్నాయి.పాత కబుర్ల నుంచి విని వూహించి చెక్కారు లెమ్మని తీసి పడెయ్యటానికి వీల్లేదు.చెక్కుతున్న శిల్పాలలోని మానవ దేహ పరిమాణమూ ఏనుగుల దేహ పరిమాణమూ ఉండాల్సిన తులనాత్మకత కోసం శిల్పులు గానీ చిత్రకారులు గానీ కేవలం వూహల మీద ఆధారపడరు - తమ ఇంద్రియాలకు గోచరం కాని వాటిని గానీ తమకు ప్రత్యక్ష పరిచయం లేనివాటిని గానీ ఇతరులకు చూపించితే సమకాలికులు గానీ భావి తరాల వారు గానీ అపహాస్యం చేస్తారనే భయం ప్రతి కళాకారుడికీ ఉంటుంది,కదూ!

ఇందులో ఇంకొక చిక్కుముడి కూడా ఉంది.సుమారు 2,00,000 సంవత్సరాల వెనక కోతుల నుంచి విడిపోయిన మానవ జాతిలోని ఒక యోధుడు రెండు మిలియన్ సంవత్సరాల వెనక అంతరించిపోయిన నాలుగు దంతాల యేనుగు మీద ఎక్కి యుద్ధం చెయ్యడం ఎంత అసంబద్ధమైన విషయం?అయితే, ఇటీవలనే 3,15,000 సంవత్సరాల వెనకటి మానవజాతి అనవాళ్ళు దొరికాయి. ఇప్పుడు చారిత్రక పరిశోధకులు చెప్తున్నట్టు ఆలయం  కట్టి కేవలం తొమ్మిది వందల సంవత్సరాలు అయితే ఇక్కడ శిల్పాలను చెక్కినవారు వూహతోనే చెక్కినట్లు అనిపిస్తుంది.కానీ,నాలుగు దంతాల యేనుగులు ఉనికిలో ఉన్నప్పుడు గానీ అంతరించిపోయిన కొద్ది కాలం తర్వత గానీ చెక్కి ఉండటం జరిగినప్పుడే ఏనుగు దేహ పరిమాణమూ దానిమీద కూర్చున్న మనిషి దేహం యొక్క సాపేక్ష పరిమాణమూ సరిపోతాయి. చరిత్రకారులూ ఆర్కియాలజిస్టులూ చేస్తున్న మరొక పొరపాటు సూత్రీకరణ యేమిటంటే మానవజాతి శిలానిర్మితమైన భవనాలను నిర్మించడం అనే విద్యను కేవలం 5000 సంవత్సరాల వెనక నేర్చుకుందని. మధ్యనే టర్కీలోని గోబెక్లి ప్రాంతంలో బయటపడిన శిధిలాలు 12,000 సంవత్సరాల క్రితం అంటే, 10,000 BCE నాడు నిర్మించినవి అని తేలిపోయింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం అనేది కేవలం రెండు వందల సంవత్సరాల వెనకనే మొదలైంది గనక ఆది వరాహ స్వామి ఆలయం గురించి ఇంతవరకు పరిశోధనలు చేసిన శాస్త్రజుల యొక్క నిర్ధారణలు అంత ఖచ్చితమైనవి కావని అనుకుంటున్నాను నేను.

అసలు అంత సంక్లిష్టమైన రాతిపనిని ఉలీ సుత్తీ దాగరా తీసుకుని చెక్కుతూ కేవలం ముప్పయ్యేడేళ్ళలో  పూర్తి చేశారనడం ఎంత  హాస్యాస్పదం? పది మిలియన్ టన్నుల రాతిని,అందులోనూ sand stone లాంటి కఠినమైన శిలని అంత చిన్న చిన్న వివరాలను చూపిస్తూ చెక్కడం అనేది సాంకేతిక పరిజ్ఞానం లేనిదే సాధ్యం కాదు - అది తెలిసీ అబద్ధం చెప్తున్నారు,నిజం చెబితే ఖ్యాతి హిందువులకి వెళ్తుంది మరి.మనం లెక్క వేసిన పది మిలియన్ టన్నులు అనేది పైకి కనబడుతున్న రూపాన్ని బట్టి వేసిన ఉజ్జాయింపు లెక్క.అనుమానం వచ్చి క్వారీ దగ్గిరకి వెళ్ళి చూస్తే మళ్ళీ ఒకసారి మైండు బ్లాకవుతుంది - ఆలయంలో వాడిన రాళ్ళ పరిమాణానికీ క్వారీలో తొల్చిన తర్వాత కనపడుతున్న ఖాళీకీ లెక్క సరిపోవటం లేదు,హస్తిమశకాంతరం ఉంది. ఖాళీని ప్రాచీనులు ఎలా పూరించారు!ఆలయం బయటి గోడల్ని పరిశీలించి చూస్తే అది sand stone కాదని తెలుస్తుంది.అయితే, మిగిలిన వారికి ఎందుకు తెలియదు అంటే ఆలయ నిర్మాతలు ఎట్లా ఆలోచించారో వీరు అట్లా ఆలోచించడం లేదు.ఎంతసేపూ తమకు అలవాటైన పరీధిని దాటి ఒక్క అంగుళం కూడా బయటికి రావడం లేదు.

ఆలయం చుట్టూ కందకం ఉంది కదాని నిర్లక్ష్యం చెయ్యలేదు 16 అడుగుల ఎత్తైన ప్రాకారం నాలుగు వైపులా ఉంది కోట బురుజులా!అయితే, ఆలయ నిర్మాతలు చాలా తెలివైన వాళ్ళు.అందరికీ కనిపించే చోట ఇలాంటి క్లూలని ఇవ్వలేదు.గైడ్లు చూపించే వివరాలతో సరిపెట్టుకునే మామూలు యాత్రికులకి తెలియదు గానీ కొంచెం చెట్లనీ పుట్టలనీ దాటుకుని ఆలాయం చుట్టూ తిరిగి చూస్తూ వెళ్తుంటే స్థానికులు "Lava Rock" అని పిలిచే basaltic laterite  కనిపిస్తుంది.ఇది అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు పొంగిపొర్లి కిందకి ప్రవహించి గట్టిపడిన లావాయే,అయితే, దీనితో మన మిస్టరీ సాల్వ్ కాదు. ఎందుకంటే, గోడకి వాడే రాయి సుమారు ఒక శాతం మాత్రమే,మిగిలిన రాళ్ళని ఎట్లా కనిపెట్టాలి? ఆలయం గోడల్ని పరిశీలిస్తే కొన్ని చోట్ల బయట వైపుకు కనిపిస్తున్న నునుపైన రాళ్ళ వెనక దాక్కుని కొన్ని basalt రాళ్ళు కనిపిస్తున్నాయి!

అంటే,మూడొంతుల భాగం అంత నునుపుదనం అక్కర్లేని లావా రాయితో కట్టి ఒక వంతు ఇసుకరాయితో వాటిని కప్పుతూ ధృఢత్వం, సౌందర్యం అనే జంటని విడదియ్యక చెరిసగం రసజగం అన్నట్టు కలిపేసి నిర్మించారు - అంతర్నదిలా హాస్యస్పూర్తి కలిసిన సృజనాత్మత ఉండనే ఉంది.ఈ లావా రాతి క్వారీలకు పర్వతాలూ హడావిడీ అక్కర్లేదు,ఎక్కడ దొరికితే అక్కడ దుకాణం పెట్టెయ్యొచ్చును.ఆలయానికి దగ్గిర్లోనే బైటపడి ఉంటాయి. అలాంటప్పుడు రవాణా కూడా పెద్ద భారం కాదు.ఇంతకీ ఆలయ నిర్మాతలు ఇలా చెయ్యడంలోని అసలు ఉద్దేశం చూపరులను మోసం చెయ్యడం,అవును. ఇంటిదొంగను ఈశ్వరుడు పట్టలేడు గానీ ఇంటిలోనివాళ్ళు పట్టుకోగలరు - మనవాళ్ళు చేసిన మోసాలు మనమే బయటపెట్టాలి.

కళ అంటేనే మోసం చెయ్యడం,కదూ!అది ఎవరు గొప్ప స్థాయిలో చేస్తే వారికి అంత ఖ్యాతి దక్కుతుంది మరి!మన ప్రాచీనులు గొప్ప హాస్యస్పూర్తి ఉన్నవాళ్ళు.సాహిత్యం, చిత్రలేఖనం, సంగీతం, నాట్యం ఒకటేమిటి దాదాపు మన ప్రాచీనులు సృష్టించిన ప్రతి అంశంలోనూ ఇదే మాయ - తెలిశాక ఓసింతేనా అనిపించేస్తాయి.కిటుకులు చిన్నవే గానీ వాళ్ళ సృజనని పైపైన చూసి తెలుసుకోవడం చాలా కష్టం.సరే గానీ ఆలయం Sand Stone,Laterite రెంటితోనే కట్టేశారా అని మనం డౌటు బాంబును పేల్చితే "న్నో!" అని ఎవరు అన్నప్పటికీ మరో షాకు తగుల్తుంది, కదా!

వ్యాసం శ్రద్ధగా చదువుతున్న వాళ్ళకి కందకం గురించి అంత విస్తారమైన సమాచారం చదువుతున్నప్పుడు తవ్విన ఇసకని ఎక్కడ పోశారనే అనుమానం వచ్చిందా?వచ్చిందీ అంటే మీరు నికార్సయిన భారతీయ హిందూ సంతతి వాళ్ళు అని చెప్పెయ్యొచ్చు, సాక్ష్యం నేను.జనాన్ని మోసం చెయ్యడంలో మరీ ఇంత జాణతనమా!ఒకవైపున ఆలయానికి బయట అతి పేద్ద కందకం తవ్వుతూ అక్కడ తవ్విన మట్టిని లోపలికి తెచ్చి గోడలకు పేర్చారు.మీరు మరీ చెవిలో పువ్వులు పెడుతున్నట్ట్టు ఫీలైపోయి "ఛా!మట్టితోనా?" అని అనకండి.మట్టిని మట్టిలాగే ఉంచెయ్యరు కదా కామన్ సెన్సు చాలు మట్టి నుంచి ఇసకని తియ్యడం చాలా ఈజీ అని తెలుసుకోవడానికి.పునాదుల మీద మొదట రెండు లాటిరైట్ వరసల మధ్యన ఇసకని పోసి లాటిరైట్ రాళ్ళకు పైన ఇసకరాతిని వాడారు - ఇవ్వాళ త్రీడీ ప్లాటర్స్ వేసిన డిజైన్ల నుంచి ఇళ్ళని శరవేగాన కట్టెయ్యడానికి వాడుతున్న టెక్నిక్ ఇదే కదండీ బాబూ!

అయితే, శిఖరం పైకి ఎక్కడానికి ఉన్న మెట్లు చాలా నిటారుగా ఉంటాయి, ఎందుకనో!అంత కష్టపడి ఎక్కేలా ఎందుకు చెక్కారు?అలాంటప్పుడు అసలు కట్టడం దేనికి?అయితే, మనం అంత కష్టపడి పైకి యెక్కి చూస్తే శిఖరం మీద ఒక కన్నం ఉంటుంది!ఇప్పుడు కన్నం నుంచి తొంగి చూస్తే 90 అడుగుల దిగువన ఒక భూగృహం కనిపిస్తుంది,ఒకప్పుడు ఇక్కడ ఒక మందసం ఉండేది.అవును, ఆర్కియాలజిస్టులు సైతం ప్రతి రోజూ మిట్ట మధ్యాన్నం అయ్యేసరికి సూర్యకిరణాలు ఈ కన్నం నుంచి నిట్ట నిలువుగా ప్రయాణీంచి ఆ భూగృహంలో పడుతున్నాయని చెప్తున్నారు.ఇదివరకు అవి అక్కడ ఉన్న రాతితో చెక్కబడిన పెట్టె మీద పడుతూ ఉండేవి.మనదసం ఎక్కడుందో ఇప్పుడు వాళ్ళకీ తెలీదు.పనిగట్టుకుని ఆ ఒక్కదాన్నీ అక్కణ్ణించి తీసేసిన దొంగలు వాళ్ళంతట వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టరు గదా!

ఇక్కడ నుంచి తీసేసిన పెట్టెలో ఏముందో మనం ఎలా తెలుసుకోగలం?ఒక దారి ఉంది!ఇలాంటివే ఇంకెక్కడ కనిపించాయో వెతికి చూసి వాటిలో ఏముందో చూస్తే సరిపోతుంది.ఇదొక ఆలయ సముదాయం అని చెప్పుకున్నాము కదా, Banteay Samre అన్న పేరున్న మరొక చిన్న ఆలయంలో పగుళ్ళు ఉన్నప్పటికీ ఆకారం చెదరని ఒక మందసం ఉంది.స్థానికులు కూడా తరచు సందర్శించని ఈ చిన్న ఆలయంలోని మందసానికి వెళ్ళిన వాళ్ళలో కొందరు పూజలు కూడా చేస్తారు దీనికి.లోపల ఏమీ లేదు, ఖాళీ - దోచేశారు!

మందసం అంటే పెట్టె.పెట్టె అని అనాలంటే మూత తెరవడానికి వీలుండాలి గద.కానీ మూతకీ పెట్టెకీ అలాంటి యేర్పాటు లేదు గానీ మూతకు నడిమధ్య ఉన్న డిప్ప మీద ఒక చిన్న కన్నం ఉంది.దాన్ని మూసిన రాతిపలక ఇప్పుడు లేదు.మన భజంత్రీ పరిశోధకులు వీటిని శవపేటికల పేరున ఫిరాయించేశారు.వీటిని కట్టిన రాజుల శవాల్ని ఉంచారని కూడా చెప్తున్నారు.టంగుటూరి మిరియాలు తాటికాయ లంత ఉంటాయి అన్నట్టు ఉంది వీళ్ళ వ్యవహారం.వేదం శవాలని దహనం చేసి పంచ భూతాత్మకమైన దేహాన్ని తిరిగి పంచభూతాలలో లీనం చెయ్యమని చెప్తుంది గానీ ఇలా దాచి కుళ్ళబెట్టమని చెప్పడంలేదు - వైదిక ధర్మానుయాయులైన ఆలయ నిర్మాతలు పొరపాటున సైతం ఇటువంటి ఏర్పాట్లను చెయ్యరు - అది పచ్చి అబద్ధం!

పోనీ కట్టినవాళ్ళు కంబోడియన్ స్థానికులు గాబట్టి ఈజిప్షియన్ మమ్మీలను అనుకరించి కట్టారు అనుకోవదానికి వీల్లేదు - పైన కన్నాన్ని ఎందుకు తగలెట్టారు?అయితే, ఇదే మనకి ఈ మందసం యొక్క నిజమైన ఉపయోగం గురించి గొప్ప క్లూని ఇస్తుంది.ఆర్కియాలజిస్టులు చెప్పారు గద మిట్ట మధ్యాన్నపు సూర్యకిరణాలు శిఖరం పైన ఉన్న కన్నం నుంచి కిందకి సాగి భూగృహంలోనికి ప్రయాణిస్తున్నాయని.ఆ సమయంలో అక్కడ ఉన్న మందసం యొక్క మూతను గనక తీస్తే సూర్యకిరణాలు పెట్టె లోపల ఉంచిన వాటిమీదకు ప్రసరిస్తాయి గద.ఒకవేళ పెట్టె లోపల క్వార్ట్జ్ వంటి పదార్ధం గనక ఉంటే ఏమవుతుంది?

కంబోడియన్ ఆర్కియాలజిస్టులు కొందరు ఇదే ప్రాంతంలో జరిపిన త్రవ్వకాలు ఈ పెట్టెల రహస్యాన్ని విప్పి చెప్తున్నాయి - అక్కడ దొరికిన తాబేలు ఆకారంలో చెక్కిన ఆకారాలకు ఇలాంటి మూతలే ఉండటం చూసి వాటిని తెరిచినప్పుడు క్వార్ట్జ్ స్పటికాలూ కంచు తీగలూ కనిపించాయి.ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న solar panels ఆధునిక కాలపువే అయినప్పటికీ ప్రాధమికమైనవే అని చెప్పాలి - అవి చాలా తక్కువ స్థాయిలో విద్యుత్తును పుట్టిస్తాయి.అయితే, silika gel bateries మాత్రం ఆకారంలో ఆది వరాహ స్వామి కోవెలలో కనపడుతున్న మందసాలూ కఛ్చపాలను పోలి ఉంటాయి.ఎవరు ఆధునికులు?ఎవరు ప్రాచీనులు?

ఇంత వరకు ఈ ఆలయం మీద పరిశోధనలు చెసిన చారిత్రక పరిశోధకులలో ఏ ఒక్కరూ తమ పరిశోధనలో బయటపడిన అసలు నిజాల్ని మీడియా ముందు చెప్పడం లేదు.ఒకవేళ వాళ్ళు చెప్పినప్పటికీ మీడియా కత్తిరించి వేస్తున్నది.ఇక ఔత్సాహికులైన సందర్శకులు కెమెరాని అటూ ఇటూ తిప్పి వాళ్ళ "వావ్,క్యావ్, మై గాడ్డ్, వాట్టే వండర్" లాంటి పొలికేకల్తో హడావిడి చెయ్యటం తప్ప శాస్త్రీయమైన విశ్లేషణలు చెయ్యటం లేదు.పాపం వాళ్ళని విమర్శించి ప్రయోజనం లేదు.వాళ్ళ హుషారు కొద్దీ మనకి చూపిస్తున్నారు, మంచిదే!

ప్రతి ఆలయ ప్రాంగణంలోనూ ఉన్నట్టే ఇక్కడ కూడా పూజారులూ ధర్మకర్తలూ నివసించడానికీ వ్యవహార నిర్వహణ కోసం ఉద్దేశించినవీ అయిన భవనాలు ఉన్నాయి.అవి లెక్కపెట్టినట్టు 108 ఉన్నాయి,బుర్రలో బల్బు వెలుగుతున్నదా!ఇక ధ్వజస్తంభం కనపడటం లేదు గానీ ప్రదక్షిణ మార్గం, ముఖ మండపం, అంతరాలయం, గర్భగృహం, విమాన శిఖరం,రాజ గోపురం అన్నీ ఉన్నాయి.అక్కడ మనకి అయిదు గోపురాలే కనపడుతున్నాయి రాశులను సూచిస్తూ పన్నెండు ఉండేవి.తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన హైందవేతరులు కూల్చివేసిన తర్వాత నుంచే మధ్యలో ఒకటీ చుట్టూ ఉన్నవాటిలో నాలుగూ మిగిలాయి.ఇప్పటికీ కసి కొద్దీ కూల్చివేసిన ఆనవాళ్ళు కనిపిస్తాయి. సందర్శకుల తాకిడి వల్ల బయట పడుతున్న ఇలాంటి విషయాలను కప్పి పుచ్చటానికి అక్కడి హైందవేతర ప్రభుత్వం ఆధునికీకరణ పేరుతో అతుకులు వెయ్యటానికి ప్రయత్నిస్తున్నది.అవి కూడా పూర్తయితే ఇక హిందువులు "అది మాదే!" అని చెప్పుకోవటానికి ఉన్న సాక్ష్యాలు అన్నీ చెరిగిపోతాయి.

ప్రస్తుతం గోడల మీద ఉన్న శిల్పాలు మాత్రమే అది హిందువులు నిర్మించిన ఆలయం అని చెప్పడానికి మిగిలి ఉన్న సాక్ష్యం.గౌతమ బుద్ధుడికి మనం దఖలు పర్చిన కేశాలంకరణతో ఉన్న బహుళ బాహువుల విగ్రహం గర్భగృహంలో లేదు.సందర్శకులు చూసి ఆనందించే ఆటబొమ్మలా ఒకచోట నిలబెట్టారు, అంతే!మధ్య గోపురం కింద ఉన్న మందిరంలో  అత్యంత దయనీయమైన స్థాయిలోని పనితనం గలవాళ్ళు కొరడాలతో ఛెళ్ళు ఛెళ్ళున కొట్టి పని చేయించితే చెక్కినట్టు కనిపిస్తున్న గౌతమ బుద్ధుడు ఏడుపో విసుగో చిరాకో పరాకో తెలియని ముఖకవళికతో అతికీ అతకని రాతి పలకల వల్ల అమరిన దేహభంగిమలో గోడకు అతుక్కుపోయి వేళ్ళాడుతూ ఉంటాడు!ఒక్క అంగుళం పక్కన ఉన్న నిర్మాణ శైలికీ ఈ విగ్రహం నిర్మాణ శైలికీ ఉన్న తేడా వెనక ఉన్న మోసం ఏమిటో తెలుసుకోవాలంటే ఒకటే దారి.మొత్తం నిర్మాణాన్ని నఖశిఖపర్యంతం పరిశీలించాలి.అన్ని ఆలయాల్లోని గర్భగుడిలానే ఇది కూడా ఒకే ఒక గదిలా కనిపిస్తుంది. అయితే హిందూ ఆలయ నిర్మాతలు ఎవరూ మూలవిరాట్టుని గోడకి అతికించి కుడ్యచిత్రంలా వ్రేలాడదియ్యరు.మధ్యలో గానీ గోడకు దగ్గిర గానీ శాస్త్రం ప్రకారం చెక్కిన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు.ఇక్కడ జరిగిన కుట్ర ఏమిటో గది బయట వెనక వైపున ఉన్న గోడని చూస్తే తెలుస్తుంది.ప్రహరీ గోడకూ మూర్తి ఉన్న మందిరానికీ మధ్యన ఉన్న ఖాళీని రాళ్ళతో మూసేశారు.ఇవే రాళ్ళు ఇప్పుడు గౌతమ బుద్ధుడు బల్లిలా అతుక్కుపోయిన గోడలో కూడ కనిపిస్తాయి.మీరు గమనిస్తే గౌతమ బుద్ధుడి చుట్టూ ఒక ద్వారం లాంటి తాపడం కనిపిస్తుంది.అంటే, అసలు విష్ణు దేవుడి విగ్రహం లోపల అఘోరిస్తున్నది.దానిమీద రాళ్ళను పేర్చి తలుపును మూసేస్తూ గోడను కట్టి బుద్ధుడి బొమ్మను పెట్టేసి పక్కనుంచి చూస్తే బతుకు బస్టాండు అవుతుందనుకున్న కిటికీల్ని కూడా మూసేసి తాంబూలాలిచ్చేశాము తన్నుకు చావందంటున్నారు - అబద్ధం చెబితే గోడ కట్టినట్టు ఉండాలంటారు,వీళ్ళకి ఆ రెంటిలో ఏదీ చాతకాలేదు.

ఇక్కడే కాదు, మూలదైవం అని చెప్తున్న దానితో సహా అంకోర్ వాట్ ఆలయ ప్రాకారంలోని ఏ బుద్ధ ప్రతిమని చూసినా అక్కడున్న పాత శిల్పాన్ని పెకలించి పారేసి దీన్ని దాని పీఠం మీద పెట్టినట్టు తెలిసిపోతూనే ఉంటుంది.ఇది యేదో హిందూ బొందు గాళ్ళు చేస్తున్న పస లేని ఆరోపణ కాదు.Originally, the principal sanctuary of Angkor Wat's upper most terrace called "Bakan", was open to the four cardinal points, and probably sheltered a statue of Vishnu.Latere, when Angkor Wat became a center of Buddhist pilgrimage, the four entranceways into the central sanctuary filled in with sand stone; each of the newly constituted walls was then sculpted with a relief of the standing Buddha.20th century investigations inside the sanctuary revealed multiple statue and pedestal fragments, of which two pieces are of particular to note:a statue of the buddha seated on a naga,which is now venerated in Bakan's entrance gallery, and a rectangular stone object thought to served as a sarcophagus.A numberof such objects, in which the corpse would have been placed in a foetal position, have been found in other Ankorian Temples అనేవి కంబోడియన్ ఆర్కియాలజీ డిపార్టుమెంటు వారు ధృవీకరించిన కొన్ని నిజాలు.మరి దీన్ని తీసుకెళ్ళి బౌద్ధులకి అప్పగించడం ఏంటి? అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్టు లేదూ! కంబోడియన్ ప్రభుత్వాన్ని ఆ రాళ్ళని పెకలించి లోపల ఏముందో చూపించమని అడిగే దమ్ము భారత ప్రభుత్వానికి ఉందా?అసలు అక్కడ జరుగుతున్న పరిశోధనలలో భారత ప్రభుత్వం యొక్క ప్రమేయం(involvement) ఎంత? మన దేశం కూడా బృందాలను తయారు చేసి పరిశోధనకి పంపించాలి.మూసేసిన రాళ్ళను తెరవమని అడగాలి.ఇదివరకు జరిగిన పరిశోధనల పూర్తి వివరాల్ని బయటపెట్టమని కంబోడియన్ ఆర్కీయాలజీ డిపార్టుమెంటును నిలదియ్యాలి.

అంగుళం పక్కకి చూస్తే తేడా తెలిసిపోయే మోసాన్ని ఇంతవరకు పరిశోధన చేసినవాళ్ళలో ఒక్కడు కూడా కనిపెట్టలేదంటే అక్కడ జరుగుతున్న పరిశోధనల స్థాయి తెలుస్తున్నది కదా! అసలు ఆలయ నిర్మాణం వెనక ఎంత పకడ్బందీ ప్లాను ఉందో తెలిపే ఒక విచిత్రాన్ని గమనిస్తే ఎంత కరుడు గట్టిన హిందూమతద్వేషి అయినప్పటికీ ఆశ్చర్యానందాద్భుతచేతసుడై వినమ్రశిరఃకంపం చేస్తాడు.దీనిని భూమి మీద నుంచి చూస్తేనూ కొంచెం ఎత్తుకు వెళ్ళి చూస్తేనూ చతురస్రపు గోడల్నీ దీర్ఘ చతురస్రపు గోడల్నీ చిక్కురొక్కురు అమరికతో కట్టిన ఒక శిలానిర్మితమైన భవనం అనిపిస్తుంది.కానీ, ఇంకొంచెం ఎత్తుకి వెళ్ళి చూస్తే ఈనాటి Computer Chip ఆకారం గోచరిస్తుంది, ఎట్లా సాధ్యం ఇది?

ఎటు చూస్తే అటు కనుచూపు మేర విస్తరించి నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఇటువంటి ఆకారం కనపడాలంటే కట్టేటప్పుడు ప్లాన్ చెయ్యనిదే సాధ్యమా?ఆనాటి వాస్తు శాస్త్రజ్ఞులు గానీ ఈనాటి మోదరన్ ఇంజనీర్లు గానీ తమ ప్లాన్ లేఅవుట్ మీద కొన్ని direction points పెట్టుకుంటారు.భవన నిర్మాణం ఒక బిందువు నుంచి విస్తరిస్తుంది.మనం, హిందువులం శంకుస్థాపన చేసేది అక్కడే.పూజగది ఈశాన్యంలో ఉండాలి,వంటగది ఆగ్నేయంలో ఉండాలి,పడకగది దక్షిణం వైపు ఉండాలి,భోజనశాల పడమర వైపు ఉండాలి,స్నానాల గది తూర్పు వైపు ఉందాలి అనేవాటిని శంకుస్థాపన రాయి వేసిన చోటు నుంచి కొలుస్తారు.

ఈ రకమైన నియమాల్ని చాదస్తం అని కొట్టి పారేస్తున్నారు గానీ ప్రాచీన కాలంలో నిర్మించిన ఆలయాలలోనికి రాజగోపురం దాటి అడుగు పెట్టిన మొదటి క్షణం నుంచీ మనస్సు భయరహితం కావడానికి వాస్తు శాస్త్రపు నియమాల్ని ఉపయోగించి భూమి యొక్క అయస్కాంత శక్తిని పెంచడమే కారణం.అయితే, ఆది వరాహ లోకం దానిని అత్యంత తీవ్రమైన స్థాయికి తీసుకు వెళ్ళింది.మేరుశిఖరంలా అలరారుతున్న నడిమి గోపురం నుంచి ఒక నిట్టనిలువు గీత గీస్తే అది భూమిని తాకుతున్న చోట ఒక నలు చదరపు పలక ఉంటుంది. దాని నడిమధ్యన మీరు ఒక దిక్సూచిని ఉంచితే ఒక్కసారి నవ్వొచ్చి పిచ్చెక్కడం ఖాయం!ఎందుకంటే, దిక్సూచి మీద ఉన్న ఉత్తర దక్షిణాలను సూచించే సూది వైపు నుంచి కొనసాగుతున్నట్టు రాతిపలక బయట ఒక గీత గీసినట్టు కనిపించేలా దాని చుట్టు ఉన్న రాళ్ళని అమర్చారు.

ఇక్కడ ఒక్కచోటనే కాదు, ఒక దిక్సూచిని పట్టుకెళ్ళి చూస్తే ఆలయంలోని ప్రతి అంగుళానికీ direction points పెట్టినట్టు అనిపిస్తుంది.అంత నిక్కచ్చి తనం చూసి అనుభవజ్ఞులైన ఇంజనీర్లకే పిచ్చెక్కుతున్నదంటే ఇతరుల పరిస్థితి ఏమిటి?అంతే కాదు,భూవృత్తం మీద నిర్మించిన ఆలయ సముదాయంలోని పరస్పర సంబంధాలను కలిగి ఉన్న భవనాలు ఆకాశవృత్తంలోని నక్షత్ర మండలాల మధ్యన ఉన్న సంబంధాలను సైతం ఇముడ్చుకుని మనకు చూపిస్తున్నాయి.

మీరు ఆ రాతి పలక మీద నిలబడి చుట్టూ చూస్తే కంటికి కనిపిస్తున్న ప్రతి చిన్న అంశమూ ప్రతి దానికీ ఒక cardinal direction point పెట్టుకుని నిర్మించినట్టు తెలుస్తుంది.వైదిక గణిత సూత్రాల ప్రకారం దీనిని మేరుసర్గవృక్షం అంటారు.ఇప్పటి వాళ్ళకి తెలియాలంటే fractal fibonocci tree అవుతుంది.ఇప్పటి తరపు భవన నిర్మాతలకు ఒక భవనంలో ఒక fibbonocci sequence వచ్చేలా చెయ్యడమే కష్టం అయితే ఇక్కడ ఒక్కొక్క శిల్పమూ దానికే ప్రత్యేకమైన అమరికతో ఒక మేరుసర్గను పాటిస్తుంది, ఒక్కొక్క కుడ్యమూ దానికే ప్రత్యేకమైన అమరికతో ఒక మేరుసర్గను పాటిస్తుంది, ఒక్కొక్క సోపానపధమూ  దానికే ప్రత్యేకమైన అమరికతో ఒక మేరుసర్గను పాటిస్తుంది,వీటిని ఇముడ్చుకున్న భవనమూ దానికే ప్రత్యేకమైన అమరికతో ఒక మేరుసర్గను పాటిస్తుంది,వీటన్నిటిని కలుపుకున్న భవన సముదాయం దానికే ప్రత్యేకమైన అమరికతో ఒక మేరుసర్గను పాటిస్తుంది.ఇంతటితో అయిపోలేదు,భవనంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను పట్టి పట్టి చూస్తే వాటిని కలుపుతున్న ఆకారం ఇతరులు Draco అని పిలిచే ఆకాశంలోని మీనరాశిలా కనిపిస్తుంది!

ఇప్పుడు పరిశోధిస్తున్న వారు ఎవరూ ఈ కోణాన్ని అసలు స్పృశించనే స్పృశించడం లేదు.ఎందుకంటే, భూమి మీద మానవులు నిర్మించిన ఒక నిర్మాణం ఆకాశంలోని ఒకటి గానీ లేక అంతకన్న ఎక్కువ నక్షత్ర మండలాలను పోలి ఉండటం అనేది ఆలయ నిర్మాతలు గొప్ప ఖగోళ శాస్త్ర పండితులు అయినప్పుడే సాధ్యం అవుతుంది.ఇన్ని విశేషాలను తనలో ఇముడ్చుకున్న ఆలయాన్ని 900 సంవత్సరాల వెనకటి కంబోడియన్ స్థానికులే కాదు, ఇప్పటి ఆధునిక కాలంలోని ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అత్యంత ప్రతిభావంతులైన భవన నిర్మాతలు అందరూ కలిసి కూడా నిర్మించలేరనేది వాస్తవం.

900 సంవత్సరాల వెనక కంబోడియన్ హిందూ ప్రభువు సూర్యవర్మన్ దీన్ని నిర్మించలేదని తేలిపోయింది గద!అయితే, ఎవరు నిర్మించారనేది తెలుసుకునే ముందు అసలు "ఆధునిక కాలంలో ఎవరు దీన్ని కనుక్కున్నారు?విస్మృతమైనది ఎప్పుడు?ఎవరు దీన్ని ప్రజల జ్ఞాపకాల నుంచి అదృశ్యం చేశారు?" అనే ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు సాధించాలి.ఎందుకంటే,కట్టిన అసలు వ్యక్తులు ఎవరో తెలియకూడదని ఇది మళ్ళీ బయట పడిన మరుక్షణం నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.పైన చూపించిన ప్రశ్నలకు దొరికే జవాబులు ఒకేసారి దొంగల్నీ పట్టిస్తాయి దొరల్నీ చూపిస్తాయి.

మిత్రులు ఒకరు దీన్ని ప్రాచీన కాలంలో "అంకుర వాటిక" అని పిలిచేవారని చెప్తున్నారు గానీ అటువంటి సాక్ష్యం కనబడటం లేదు.నిర్మాణ శైలిలో మత్స్య వరాహ అవతారాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.ఎనిమిది చేతులు విష్ణువుకి కూడా లేవు.అది బహుశః భాగవతంలో వర్ణించబడిన సుగత బుద్ధుడికి సంబంధించిన విశేషం కాబోలు!

అందరికీ తెలిసిన Angkor Wat ఆలయం ఒక్కటే కాదు,కంబోడియాలో ఎక్కడికి వెళ్ళి చూసినా హిందూ, బౌద్ధ ఆలయాల శిధిలాలు కనిపిస్తాయి.భారతీయ సాహిత్యంలో దీనిని కాంభోజం అని పిల్చేవారు.ఇక్కడ హిందూరాజ్యం అవతరించడానికి కారణమైన కధ ఇలా ఉంది:భారత దేశం నుంచి ఒక వీరుడు రాజ్యస్థాపన కోసం తగిన చోటు కోసం వెతుకుతూ ఇక్కడ బలవంతురాలైన ఒక స్త్రీ నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు.యుద్ధం జరుగుతుండగానే ఇద్దరికీ తాము సమవుజ్జీలం అని తెలిసి సంధి చేసుకున్నారు.ఒకరినొకరు ఇష్టపడటంతో పెళ్ళి చేసుకుని రాజ్యపాలన కలిసే చేశారు.వారి సంతానమే కంబోడియా చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించిన ఖ్మెర్ వంశీయులు.

ప్రస్తుతం ఇక్కడ హిందూమతం కన్న బౌద్ధం ఎక్కువ ప్రభావశీలమైనది - రాజమతం. ప్రస్తుతం Angkor Wat మొండిగోడల్ని చూసి సంతోషించాల్సిన విహారస్థలి మాత్రమే.మూలవిరాట్టు లేని హిందూ దేవాలయం శవంతో సమానం, పూజాదికాలు జరగని చోట పవిత్రత శూన్యం!వూరికే ఆ పాడుబడిన గుడిని చూసి గతకాలపు వైభవాన్ని తలుచుకుని నిట్టూర్చడం తప్ప ప్రస్తుతానికి మనం చెయ్యగలిగింది లేదు!కంబోడియాలో బౌద్ధుల తర్వాత ముస్లిములు ఎక్కువ ఉన్నారు.ఇప్పుడు హిందువులకి ప్రాధాన్యత తగ్గిపోయింది.

ఇప్పటి చరిత్రకారులు చెప్తున్న కధ ఇలా ఉంది.అంకోరియన్ రాజ్యం A.D.802ల నాడు మొదలైంది.వాయువ్య దిశలో ఉన్న Tonle Sap Lake తీరాన రాజధాని ఉండేది.క్రమేణ రాజ్యం విస్తారమై A.D.1100ల నాటికి వారి వైభవం తారా స్థాయికి చేరుకున్నది.అతి నవీనమైన సంస్కృత లేఖనం ప్రకారం ఆలయాన్ని A.D.1295ల నాడు నిర్మించారు.లేఖనం కూడా ఆ కాలానిదే అని భావిస్తున్నారు.అతి నవీనమైన ఖ్మేర్ భాషలోని లేఖనం 1327ల నాటిది.

అంతటి తీవ్ర స్థాయిలో సాంకేతికతను ఉపయోగించి నిర్మించిన నగరం నిర్జనమై పోవడానికి కారణం ఏమిటో తెలియడం లేదు.తర్వాత ధేరవాద బౌద్ధం ప్రాచుర్యంలోకి వచ్చి రాజులు సైతం బౌద్ధమతానుయాయులు కావడం ఒక కారణం అని అంటున్నారు.కానీ, తమను తాము "God Kings" అని చెప్పుకుంటూ అంత గొప్ప ఆలయం నిర్మించి తమ సంస్కృతి పట్ల గర్వంతో ఉన్నవారు బౌద్ధం స్వీకరించడానికి బలమైన కారణం ఉండాలి కదా!చైనాతో సముద్ర వాణిజ్యం పెరగడం వల్ల ప్రాధాన్యత తగ్గి రాజులు రాజధానిని సముద్ర తీరానికి తరలించడం అనే కారణం కూడా నమ్మదగినది కాదు.రాజ్యంలో ఒక్క సముద్ర వ్యాపారం మాత్రమే ఉండదు కదా, వ్యాపారం రేపుపట్నంలో జరిగితే ఉత్పత్తి కూడా అక్కడే జరగదు కదా!ఒక రేపుపట్నం కొంచెం పెరగ్గానే రాజధానిని నిర్జనం చేసి అక్కడికి పోవడం తుగ్లక్ లాంటి పిచ్చిమారాజులు మాత్రమే చేస్తారు.వర్షాలు ఎక్కువై రాళ్ళు కరిగిపోవటం, సుదీర్ఘమైన కరువు లాంటి కారణాలతో 14వ శతాబ్దం నుంచే ప్రభువర్గం ఖాళీ చేసి వేరే చోట్లకి తరలిపోతూ ఒక శతాబ్దం తర్వాత Ayutthaya వంశస్థులు చేసిన దాడితో ఈ ప్రాంతం పూర్తి నిర్జనమై పోయిందని కొందరు చారిత్రక వేత్తలు చెప్తున్నారు. ఇంతమంది పరిశోధకులు ఇన్ని రకాల విశ్లేషణలు చేస్తున్నప్పటికీ  ఎవరి వాదనకూ తిరుగు లేని సాక్ష్యం కనిపించడం లేదు. అయితే, ఇప్పటికీ ఎండిపోని ఒక జలాశయం ఉండి అంత గొప్ప సాంకేతికతను ఇముడ్చుకున్న నగరం పట్ల ప్రజలు గానీ ప్రభువులు గానీ నిర్మానుష్యం అయిపోయేటంత నిర్లక్ష్యం ప్రదర్శించడం ఎట్లా సాధ్యం?

అయితే, ఒక పరిశోధకుడు నీటి పారుదల వ్యవస్థ గురించి చెప్పినది వింటే నగరం తన ప్రాభవాన్ని కోల్పోయి ప్రజలూ ప్రభువులూ నిర్లక్ష్యం చేసి విస్మృతం కావడానికి ఒక నమ్మదగిన కారణం తెలుస్తుంది.అదేమిటంటే, కందకం ఒక్కటే కాదు, నగరం మొత్తం కాలువలతో నిండి ఉంటుంది.సాధారణంగా మనం నీటి రిజర్వాయర్లను నేలకన్న ఎత్తున కట్టి నీటిని నిలవ చేస్తాం, కదా.కానీ, ఇక్కడ రిజర్వాయర్లు నేలకు దిగువన ఉండి చిక్కురొక్కురు అల్లికల కాలువలు కూడా అందులో ఒక భాగమై వీటిమీద పాదచారుల కోసం కట్టిన కాలిదారిని మునిగిపోనివ్వని చిత్రమైన ఏర్పాటు చేశారు.బహుశః తరాలు గడుస్తున్న కొద్దీ తొలినాటి వారినుంచి నీటి పారుదల వ్యవస్థని ఎలా నిర్వహించాలో తెలుసుకోగలిగినంత కాలం ఉపయోగించుకుని క్రమేణ అశ్రద్ధ పెరిగి ఎలా ఉపయోగించుకోవాలో తెలియక భయపడి అక్కడినుంచి వెళ్ళిపోయారు కాబోలునని అనిపిస్తుంది నాకు.బయటివాళ్ళు చేసిన దాడిలో నీటి పారుదల వ్యవస్థను నియంత్రించే సాంకేతిక నిపుణులు దుర్మరణం పాలైనప్పుడు కూడా ప్రజలూ ప్రభువులూ ఇక అక్కడ ఉండటం క్షేమమ కాదని భావించే అవకాశం ఉంది.

సరే, ఎట్లా విస్మృతం అయ్యింది అనేది తేల్చాలనే నిజాయితీ ఇప్పుడు పరిశోధిస్తున్న వారిలో ఎవరికీ లేదు.ఎందుకంటే, బయట పడింది హిందువుల సంస్కృతికి సంబంధించినది, దాన్ని ధ్వంసం చేసింది హైందవేతరులు,దాని మీద పరిశోధనలు చేస్తున్నది కూడా హైందవేతరులే - ధ్వంసం చేసింది తమవారే అని తెలిస్తే ముఖం చెల్లదు గదా!

doug juan అనే చైనా యాత్రికుడు A.D1296ల నాడు తన యాత్రాస్మృతిలో దీని నిర్మాణం గురించీ ఇక్కడ నివసించిన ప్రజల గురించీ వ్రాసినట్టు చెప్తున్నారు.కానీ, ఈ కధనం కూడా గట్టి సాక్ష్యం లేనిదే - ఇతను చూసి రాశాడా విన్నవాటిని బట్టి రాశాడా అనేది ఇప్పటికీ అనుమానమే! ఇప్పుడు మొదటిసారి ఎవరు బయటపెట్టారు అని చూస్తే 1860ల నాడు Henry Mouhut అనే ఫ్రెంచి న్యాచురలిస్టు కొత్త రకం కీటకాల కోసం వెతుకుతూ తిరుగుతుంటే ఆలయం కనపడినట్టు చెప్తున్నారు. నిజానికి 20వ శతాబ్దం ప్రధమ భాగం నుంచి ఈ ప్రాంతం ఫ్రంచి పాలకుల అధీనంలోకి వెళ్ళినప్పటినుంచే అంకోర్ వాట్ గురించి తెలిసి ప్రభుత్వంలోని కొందరూ పరిశోధకులు కొందరూ వెతకడం మొదలు పెట్టారు.

కొంత నిజమూ కొంత కల్పనా అన్నట్టు కనిపించే చైనీస్ యాత్రికుడి కధనం కన్న నమ్మదగిన కధనాన్ని António da Madalena అనే పోర్చుగీసు క్రైస్తవ సంప్రదాయానికి చెందిన వ్యక్తి వినిపిస్తున్నాడు.పుట్టిన తేదీ తెలియడం లేదు గానీ Coimbra నగరంలో పుట్టినట్టు తెలుస్తున్నది.సా.శ:1575 మొదలు సా.శ:1579 వరకు Alcobaça Monastery అన్న పేరు గల క్యాధలిక్ చర్చికి సంబంధించిన ఇతను సా.శ:1580ల నాడు తమ శాఖకు సంబంధించిన సాహిత్యంతో ఒక గ్రంధాలయాన్ని స్థాపించాలని గోవా వచ్చాడు.సా.శ:1583ల నాడు ఇప్పటి కంబోడియాను చేరుకున్నాడు.అక్కడ, అప్పుడు ఆ సా.శ:1586ల నాడు Angkor Wat అని మనం పిలుస్తున్న ఆది వరాహ స్వామి కోవెలను చూశాడు.తర్వాత తనుగా ఏ గ్రంధమూ రాయలేదు గానీ, సా.శ:1589లో Diogo do Couto అనే చారిత్రకవేత్తకు తన జ్ఞాపకాలను చెప్పాడు.అప్పటికే శిధిలమైన దానిని పునర్నిర్మించడానికి António da Madalena ప్రయత్నించాడని అంటున్నారు. అయితే ఇతని నుంచి అంత అమూల్యమైన సమాచారం సేకరించిన Diogo do Couto ఆ వివరాలను తన గ్రంధంలో ప్రస్తావించలేదు.ఒక రచయిత తన గ్రంధానికి సంబంధించి సేకరించిన సమాచారం మొత్తాన్ని గ్రంధంలోకి దించెయ్యడం కష్టం.ఎవరి ప్రయారిటీస్ వారికి ఉంటాయి.సేకరించిన సమాచారం మాత్రం అతని కుటుంబ సభ్యులు భద్రం చేశారు. ఈ మధ్యనే, 1947ల నాడు చరిత్రకారుడు Charles R. Boxer తన సొంత పరిశోధన కోసం వెతుకుతున్నప్పుడు Madalena నుంచి విని do Couto వ్రాసుకున్న వ్రాతప్రతిని చూశాడు.

Madalena చెప్పిన రెండు మూడు వాక్యాలు చదువుతుంటేనే గర్వంతో చాతీ కొలత పెరగడమే కాదు శరీరం రోమాంచితం కావడం అనే స్థాయిని దాటిపోయి వెంట్రుకలు సముద్రపు అలల మాదిరి కదులుతూ పైరగాలికి వరికంకుల్లు వూగినట్టు వూగిపోతున్నాయి - "It is of such extraordinary construction that it is not possible to describe it with a pen, particularly since it is like no other building in the world. It has towers and decoration and all the refinements which the human genius can conceive of" అంటున్నాడు.అసలు Madalena గోవా నుంచి తిరిగి స్వదేశం వెళ్ళటానికి బదులు కంబోడియా వెళ్ళినది అతను ఇక్కడ ఉన్నప్పుడే అంగ్కోర్ వాట్ గురించి చెప్తున్న కాలికట్ రికార్డుల్ని చూసి అది నిజమో కాదో తేల్చుకోవటానికే! "విన్నాడు! చూశాడు! చెప్పాడు!" - కానీ, ఏమైంది?హిందువులు తప్ప మరెవరూ నిర్మించలేని ఒక మహాద్భుతమైన ఆలయనగరం గురించిన ఒక చిన్న నిజం బయటికి రావటానికి నాలుగు వందల సంవత్సరాలు పట్టింది.

హైందవేతర సమూహాలు ఈర్ష్యతోనూ అహంతోనూ ముందుకు జరిపి సూరవర్మన్ అనే స్థానిక ప్రభువుకి ఖ్యాతిని అంటగట్టేస్తున్నారు గానీ అసలు ఆలయనగరం యొక్క నిర్మాణం 12,500 సంవత్సరాల వెనక జరిగింది.దానికి సాక్ష్యం కూడా ఆలయమే ఇస్తుంది.ఆలయం ఇముడ్చుకున్న Draco అనే మీనరాశి యొక్క అమరికలో ఉన్న విచిత్రం ఏమిటో తెలుసా!ఆలయ నిర్మాతలు తాము ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన సమయంలో కనిపిస్తున్న Draco యొక్క అమరికను అచ్చు గుద్దినట్టు దింపేశారు!ఇప్పటికీ మనం గనక ప్రతి రోజూ నక్షత్రాలను పరిశీలిస్తూ ఉంటే ఒక విచిత్రం తెలుస్తుంది.ప్రతి నక్షత్రమూ రోజుకు నాలుగు డిగ్రీలు పక్కకి జరుగుతూ మరుసటి సంవత్సరం అదే రోజుకి ఒకే చోట కనిపిస్తుంది.అయితే, ఒక నక్షత్రరాశిలోని నక్షత్రాలు అన్నీ ఇక్కడి నుంచి చూస్తున్నట్టు పక్కపక్కన ఉండవు.వాటి పరిభ్రమణ వేగాలు కూడా ఒకటి కాదు.కాబట్టి స్థూలమైన ఆకారం ఒక్కలాగే ఉన్నప్పటికీ వాటిమధ్యన ఉన్న కోణీయ దూరాల్ని బట్టి చూస్తే సూక్ష్మ స్థాయిలో విభేదిస్తాయి.ఫలిత జ్యోతిషాన్ని గణించేవారిలో అనుభవజ్ఞులు ఈ సూక్ష్మమైన తేడాల్ని సరి చేసుకోవటానికి కొన్ని స్థిరాంకాల్ని పెట్టుకుని అప్పుడప్పుడు వాటి విలువల్ని మారుస్తూ ఉంటారు.అనుభవజ్ఞులైన పండితుల జ్యోతిష ఫలితాలకు ఉన్న ఖచ్చితత్వం అంతటి స్థాయి పాండిత్యం లేని మోసగాళ్ళ జ్యోతిష ఫలితాలకు లేకపోవటానికి కారణం అదే.ఇక్కడ అంకోర్ వాట్ ఆలయం మనకు చూపిస్తున్న మీనరాశి అమరిక 12,000 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించిన చోటు నుంచి చూస్తే కనబడుతుంది.అది ఇప్పుడు అందరూ కలిసి ఫిరాయించిన సూర్యవర్మన్ నాటి కాలానికి సరిపడేది కాదు.

ఇదే లెక్కలు వేసి చూస్తే orian నక్షత్ర రాశిని సూచించే గిజా పిరమిడ్ల అమరిక కూడా 12,000 సంవత్సరాల వెనక అక్కడ ఆకాశంలో కనిపించే orian అమరికను సూచిస్తుంది.గిజా పిరమిడ్లకూ అంకోర్ వాట్ ఆలయానికీ మధ్య దూరం 4754 మైళ్ళు.దీన్ని Vedic Golden Ratio అయిన 1,618 అనే సంఖ్యతో హెచ్చిస్తే 7692 మైళ్ళు అవుతుంది.ఇది గిజాకూ నాజ్కాకూ మధ్య దూరం.మళ్ళీ 7692 అనే సంఖ్యని Vedic Golden Ratio అయిన 1,618 అనే సంఖ్యతో హెచ్చిస్తే వచ్చిన 12446 మైళ్ళు అనేది అంకోర్ వాట్ మరియు నాజ్కాల మధ్య ఉన్న దూరం - Alaska నగరాన్ని ఒక కొసన ఉంచుకుని గిజా నాజ్కాల మధ్యన భూమి అనే గోళం మీద పరుచుకున్న ఈ త్రికోణంలోకి శ్రీయంత్రం యొక్క కోణమైన 51 degrees 49 minutes 38.25 seconds ఎలా వచ్చింది!

ప్రస్తుతం భూమి మీద చెల్లా చెదురుగా ఉండి ఏ సంబంధమూ కనిపించని Easter Island, Stonehenge, Egyptian pyramids, Mexican pyramids, Bermuda Triangle వంటివి కైలాసశిఖరం నుంచి వాటి దూరాల్ని కొలిచి చూస్తే అవన్నీ ఒక క్రమ పధతిలో ప్రణాళిక వేసుకుని కట్టిన దృశ్యం కళ్లముందు కనబడి వీటిని యెలా కట్టారో అర్ధమే చేసుకోలేనివాళ్ళు ఆధునికులం అని జబ్బలు చరుచుకోవడం చూస్తుంటే జాలి వేస్తుంది!సనాతన ధార్మిక సాహిత్యం నిర్ధారించి చెప్పిన దాని ప్రకారం అనంతకోటి విశ్వాలలో ఒకటైన మన విశ్వాండం యొక్క అక్షం భూగోళం యొక్క అక్షంతో కలిసి పైకి సాగుతూ వూర్ధ్వలోకాలకు వేసిన నిచ్చెన వలె పొడుచుకుని వచ్చిన ఆకారమే కైలాసశిఖరం!కైలాసశిఖరం ఉన్న చోటు నుంచి కిందకి meridian line గీస్తే భూమికి రెండవ వైపున Easter Island ఉంటుంది.

అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం అక్కరలేదు,ఈ ప్రాంతాలని గుర్తు పట్టగలిగిన సైజు గ్లోబు గనక మీ దగ్గిర ఉంటే ఇపటికిప్పుడు కొలిచి చూసుకోవచ్చు - Mount Kailash నుంచి Egyptian pyramids వరకు ఒక సరళరేఖ గీస్తే అది Easter Island వైపు చూస్తుంది,ఆ రెంటినీ కలపండి.ఇప్పుడు కొలిస్తే Mount Kailash నుంచి Egyptian Pyramids మధ్య ఉన్న దూరం Mount Kailash నుంచి Ester Island మధ్య దూరంలో నాలుగో వంతు ఉన్నట్టు తెలుస్తుంది.అంతే కాదు, Easter Island నుంచి Mexican Pyramids వైపు ఒక సరళరేఖ గీస్తే అది Mount Kailash వైపుకు సాగుతుంది,ఆ రెండింటిని కూడా కలపండి.ఇప్పుడు Ester Island నుంచి Mexican Pyramids మధ్య దూరం కూడా Mount Kailas నుంచి Easter Island మధ్య ఉన్న దూరంలో నాలుగో వంతు ఉన్నట్టు తెలుస్తుంది.అంటే,Egyptian Pyramids నుంచి Mount kailash మధ్య ఉన్న దూరమూ Mexican Pyramids నుంచి Easter Island మధ్య ఉన్న దూరమూ సమానం అన్నమాట!

ఈ లెక్క ఇంతటితో ఐపోలేదు, Mount Kailsh నుంచి Stonehenge Monument వరకు ఒక సరళరేఖ గీస్తే అది కూడా Easter Island వైపుకే సాగుతుంది.మళ్ళీ Mount Kailash నుంచి Stonehenge వరకు గల దూరం Mount Kailash నుంచి Easter Island వరకు గల భూమి వ్యాసంలో నాలుగోవంతు ఉంటుంది.ఈ Mount Kailash నుంచి Stonehenge మీదుగా Easter Island వరకు సాగుతున్న రేఖ మీద Easter Island వైపునుంచి మూడోవంతు దూరం దగ్గిర చుక్క పెడితే - అక్కడ Bermuda Triangle ఉంది!Bermuda Triangle రహస్యం గురించి పరిశొర్ధనలు చేస్తున్నవారిలో కొందరు అప్పుడే ఈ అమరికను బట్టి కొత్త సూత్రీకరణలు చేస్తున్నారు.వారి విశ్లేషణల ప్రకారం ఈ వలయంలోని ఆ ప్రాంతంలో ఉన్న ఒక నిర్మాణం భూమిలోనికి కుంచించుకుపోయి ఉండవచ్చు.అది ఈ వలయం/శ్రీచక్రబహుభుజి/సహస్రారచక్రం వంటి నిర్మాణంలో ఉండాల్సిన చోట ఉండకపోవటం వల్ల ఐన్స్టీన్ విశ్వంలో కాంతి వంగుతుందన్నట్టు తన ప్రభావం తీవంగా ఉన్నంతమేర స్థలకాలద్రవ్యశక్తి తత్వాలను వంచించుతున్నది!

ఈ దూరాల లెక్కలో ఉన్న అసలైన విశేషాన్ని గమనించండి - Mount Kailash నుంచి Stonehenge Monument వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, Stonehenge Monument నుంచి Bermuda Triangle వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, Bermuda Triangle నుంచి Easter Island వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, North Pole  నుంచి Mont Kailash వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు కాగా Mount Kailash ఎత్తు 6714 మీటర్లు!ఒక కొలత మాత్రం మీటర్లలో ఉండి మిగిలినవి కిలోమీటర్లలో ఉండడం కూడా గణితశాస్త్రంలోని ఒక శాఖ అయిన fractal mathematics ప్రకారం చూస్తే అది అనుకోని పొరపాటు వల్ల జరిగినట్టు కాక ఈ నిర్మాణాలను ఇంత ప్రణాళికతో నిర్మించినవారు గణితశాస్త్రంలోని ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టలేదనేటందుకు సాక్ష్యంగా నిలుస్తుంది.ప్రస్తుతం ఈ అన్ని నిర్మాణాలను గురించి విడివిడి పరిశోధనలు చేస్తున్న వారిలో కొందరు ఇవి మానవనిర్మితాలనీ కొందరు గ్రహాంతరవాసుల చేత నిర్మించబడినాయనీ రెండుగా చీలిపోయి ఉన్నారు.

ఇక్కడ శ్రీచక్రం యొక్క కోణాన్ని ఇముడ్చుకున్న పై కొసని Alaska దగ్గిర పెట్టడానికి కారణం ఇప్పటికీ ఎందుకు కట్టారో తెలియని Stonehenge అక్కడ ఉండటమే కారణం.అక్కడొక శివాలయం ఉండేది.దాన్ని మాయం చెయ్యడంలో కృతకృత్యులు అయ్యారు.అది మిస్టరీ అయినది కూడా ఆ శివాలయాన్ని మాయం చెయ్యడం వల్లనే!నిజానికి మిస్టరీ అని చెప్తున్న ప్రతిదీ కొంత చెప్పి కొంత చెప్పని మోసకారి తనం వల్లనే మిస్టరీ అవుతున్నది.12,000 సంవత్సరాల వెనక అంటే 10,000 BCE కదా, ఇప్పుడు అంగ్కోర్ వాట్ కట్టిన సూర్యవర్మన్ కేవలం 1200 CE నాటివాడు - మరి, ఇప్పటి పరిశోధకులు బల్ల గుద్ది చెప్తున్న తేదీకి 11200 సంవత్సరాలు వెనక్కి వెళితే అప్పుడు వీటిని ఎవరు ఎందుకు ఎట్లా నిర్మించారు?

అది తెలియాలంటే వీటిలోనే కొన్ని భూమాతకు వడ్డాణం అమర్చినట్టు భూమధ్య రేఖ మీద ఉన్న వాటి వివరాల్ని మరొకసారి పరిశీలించి చూడాలి.మొహంజెదారో మొదలు అంగ్కోర్ వాట్ వరకు ఒక గీత మీద ఉన్నవి ఇవి - ఈజిప్షియన్ పిరమిడ్లు, లిబియన్ Siwa oasis శివాలయం,త్రిపురాసుర భంజనం కధలోనిది అయిన అట్లాంటిస్,Easter island శివాలయం మరియు అంగ్కోర్ వాట్.ఇవన్నీ కూడా భూ అయస్కాంత శక్తిని ఉద్దీప్తం చెయ్యగలిగిన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినవి.Anatom ద్వీపంలో ఉన్న హిందూ ఆలయం అప్పటి భూమధ్య రేఖ మీద Cape Verde ద్వీపంలోని Stonehenge దగ్గిర కట్టిన హిందూ ఆలయానికి కింద ఉంటుంది.రెండు అర్ధ గోళాల్ని మధ్యకి కోసి కోణాన్ని మార్చకుండా ఒక దాని మీద ఒకటి పెట్టి నొక్కి చూస్తే భలే నవ్వొస్తుంది, తెల్సా!ఎందుకంటారేమిటండీ,కవల పిల్లల మాదిరి ఒకే రేఖాంశం మీద ఒకే అక్షాంశం మీద కనబడతాయి.ఇలాంటి క్యామిడీలు మన ప్రాచీనులకే సాధ్యం, కదా!

ఎవరు కట్టారు అనేది మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను.ఇంత ప్లానింగ్,ఇంత క్నాలెడ్జి, ఇంత మెంటల్ యాటిట్యూడ్ మనోళ్ళకి తప్ప ఎవడికి ఉంది, చెప్పండి?ఇవన్నీ కట్టడానికి ప్లానింగూ, క్నాలెడ్జీ, గోంగూరా లాంటి సెఖండరీ విషయాల కన్న అత్యవసరమైనది ఏంటి?డబ్బండీ బాబూ, అదెక్కణ్ణుంచి వస్తది!అసలికి ఒకేసారి భూమ్మీద ఆ చివరొకటీ ఈ చివరొకటీ కట్టడానికి అంత డబ్బు తగలెయ్యడం మెడ మీద తలకాయ్ ఉన్నవాడు ఎవడూ చెయ్యడు గద!ఒకవేళ చేస్తే తన పేరు చెప్పుకోని వాడు పిచ్చివాడే గద!ఇవ్వాళ ఎల్కేజీ కుర్రాడు కూడా తను వేసిన పిచ్చి గీతలని చూసి పిల్లాడు గదాని టీచరు గనక గుడ్డంటే ఎంత హడావిడి చేస్తాడు!అంత డబ్బుని ఏ లాభమూ లేని కట్టడాల మీద ఖర్చు చేసి పేరు కూడా చెక్కుకోని పిచ్చివాళ్ళు ఎవరుంటారు?

నిజమే! తీరికగా కట్టి వుంటే ఇప్పటి భారత దేశపు సరిహద్దుల లోపల కట్టిన ఆలయాలకు మాదిరే అన్ని వివరాలతోనూ శాసనాలు చెక్కేవాళ్ళు గానీ అవన్నీ ఒకేసారి అతి తక్కువ సమయంలో కట్టాల్సిన అవసరం ఆ 12,000 సంవత్సరాల వెనక వచ్చింది గాబట్టే అలా ఎవరు కట్టారో ఎందుకు కట్టారో తెలియనివ్వని పరిస్థితి దాపరించింది. సుమారు 12,700 సంవత్సరాల క్రింద ఒక తోక చుక్క భూమిని ఢీ కొట్టినప్పుడు ఆ అదురుకి భూమి తల్లడిల్లి పరిభ్రమణ కోణం మారిపోయి అయస్కాంత క్షేత్రం కకావికలై పోయింది - ALASKA,GREENLAND వంటి ప్రాంతాల వద్ద ఇప్పటికీ CRATERS కనబడతాయి,విశ్వం నుంచి రాలిపడటం వల్లనే తప్ప భూమి మీద అంతకుముందు లభించని PLATINUM SPIKES దక్షిణ అమెరికాకు చెందిన అనేక చోట్ల కనబడుతున్నాయి,దక్షిణ అమెరికా ప్రాంతం ఉల్కాపాతం వల్ల BLACK MAT LAYER ఏర్పడి పచ్చిగడ్డి మొలవనిదైపోయింది!

ప్రస్తుతం మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న హిమయుగం లాంటిది భూమిమీద మొదలై శరవేగాన విస్తరిస్తున్నది.సాగర గర్భంలోని శీతోష్ణ ప్రవాహ సమతౌల్యం అతలాకుతలం అయిపోయింది.తాళోత్తాళ ప్రమాణం గల జంతువులు మొదలు మార్జాల సదృశమైన జంతువుల వరకు ఎన్నో జాతులు అంతరించిపోయినది ఇప్పుడే!

అంతటి ఘోర విపత్తు నుంచి ఎవరు రక్షించితే భూమి తిరిగి ఇప్పటి స్థితికి వచ్చింది?అసలు, పరిష్కారం ఏమిటి?పరిష్కారం తెలుసుకోవాలంటే అక్కడ జరిగిన దాన్ని  అర్ధం చేసుకోవాలి.భూమి సూర్యగ్రహం చుట్టూ తిరుగుతున్నదా, సూర్యగ్రహం భూమి చుట్టూ తిరుగుతున్నదా అనేది కాస్సేపు మర్చిపోయి భూమి తన చుట్టు తాను బొంగరంలా తిరుగుతున్నదని మాత్రం గుర్తుంచుకోండి.బొంగరాన్ని ఎంత బలంగా విసిరినప్పటికీ అది ఒకే వేగంతో తిరగదు,అప్పుడప్పుడు కొంచెం వూగుతూ ఉంటుంది.ఒకోసారి పడిపోతుందేమో అనిపించి మళ్ళీ సర్దుకుంటుంది.అయితే, అలాంటప్పుడు మనం వేలితో చిన్న దెబ్బ వేస్తే చాలు, పడిపోతుంది.ఉల్కల ధాటికి భూమి కూడా అదే స్థితికి చేరుకున్నది.పరిష్కారం "చర్య-ప్రతి చర్య" అనే న్యూటన్ మూడవ సూత్రం చెప్తుంది - అంటే, బొంగరానికి ఇటు వైపు నుంచి తగిలిన తాకిడికి సమానమైన తాకిడిని అటువైపునుంచి కూడా తగిలించాలి, కదూ!

సృష్టిలోని మాయావినోదం వల్ల ఏర్పడిన వింత ప్రమాదం చేత 200 కోట్ల సంవత్సరాల పాటు నడవాల్సిన సృష్టిగమనం ఆగిపోయేటట్టు జరిగిన ఆటలో అరిటిపండు లాంటి పొరపాటును సరిదిద్దాలని సృష్టికర్త సంకల్పించాడు.ఉత్తరార్ధం చలిజ్వరం వచ్చినట్టు అయిపోయింది గానీ దక్షిణార్ధం పరిస్థితి కొంత మెరుగుగానే ఉంది.అప్పుడు కేరళ ప్రాంతంలోని ఇప్పటి కాలికట్ నగరాన్ని స్వస్థానం చేసుకుని విరోచన సార్వభౌముడి కుమారుడు మహాబలి చక్రవర్తియై సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు.సృష్టికర్త తను జరిపించాలనుకున్న ఘనకార్యం అతని వల్లనే సాధ్యపడుతుందని నిశ్చయించుకుని ఒక వామన వటువు రూపంలో అతని ముందుకు వెళ్ళాడు.ఒక వైపుకు ఒరిగిపోయి తిరుగుతున్న భూమిని నిలబెట్టాలంటే భూమిమీద కీలకమైన స్థానాలలో ఎక్కడెక్కడ ఎంతెంత బరువు ఉంచితే భూమి ఇదివరకటి స్థితికి చేరుకుని సృష్టిగమనం సజావున కొనసాగుతుందనే లెక్కలు వేసుకుని అక్కడక్కడ అంతంత బరువును ఉంచాలి. లెక్కలో తప్పు దొర్లితే మొదటికే మోసం వస్తుంది.

వేదవిజ్ఞానం పుష్కలమై అత్యున్నత స్థాయి సాంకేతికత కరతలామలకమై గణిత, ఖగోళ, భవన నిర్మాణ శాస్త్రాలలో ఉద్దండులైన పండితులను తీసుకుని వాయువేగాన పాతాళం అని అప్పటివారు పిలిచే ఇప్ప్పటి అమెరికా ఖండాన్ని చేరుకున్నాడు మహాబలి.తండ్రి విరోచనుడు పరిస్థితిని గమనించి వానప్రస్థం నుంచి మరలివచ్చి రాజ్యభారం తీసుకున్నాడు.కార్యభారం గురుతరం కావడంతో మహాబలి తర్వాత తరాల వాళ్ళు కాలనేమి, స్వర్భాను సైతం రంగంలోకి దిగారు.అలా నాలుగు తరాల ప్రపంచాధినేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట నిలబడి వామన ఋషి ప్రణాళికను అమలు చేసి భూమికి స్వస్థత చేకూర్చినప్పుడు నిర్మించిన వాటిలో ఆది వరాహ స్వామి ఆలయం అత్యంత కీలకమైనది.

చాలామంది హిందువులకి ఇది నమ్మలేని విషయం అనిపిస్తుంది. కదూ!కానీ, 12,000 సంవత్సరాల వెనక జరిగిన భీబత్సం నిజమే,భూమి తనకు తను సర్దుకుని సృష్టి కొనసాగడానికి వీల్లేని పరిస్థితి దాపరించడం నిజమే,అది సర్దుకుని సృష్టి కొనసాగడం కూడా నిజమే - అలా జరిగి ఉండకపోతే ఇప్పుడు మనం  ఇక్కడ ఇలా కలవడం ఎట్లా సాధ్యం?మిస్టరీ గురించి పైన ఏం చెప్పానో గుర్తుందా?తెలియాల్సిన విషయంలో ఒక సగం తెలిస్తే మిస్టరీ,మరో సగం కూడా తెలిస్తే హిస్టరీ.ఇప్పటికీ గందరగోళంలో ఉన్న హిందువులకి వామనావతారం కధని హేతుబద్ధమైన విశ్లేషణ చేసుకుంటే సృష్టికర యొక్క లీలావినోదంలో ఎంత హాస్యరసం చిప్పిల్లుతుందో తెల్సి నవ్వొస్తుంది! అక్కడ వామన వటువు దానం అడిగిన మూడడుగుల తపోభూమియే ఇక్కడ  Alaska నగరాన్ని ఒక కొసన ఉంచుకుని గిజా నాజ్కాల మధ్యన భూమి అనే గోళం మీద పరుచుకున్న త్రికోణం.

వామనావతారం కధని శాస్త్రీయమైన రీతిలో విశ్లేషించడానికి ముందు సృష్టికర్త అవతారం ధరించి భూమి మీదకి రావడం అవసరమా అనే ప్రశ్నకి జవాబుని సాధించాలి.ఎందుకంటే, అసలు వామన వటువు యదార్ధ వ్యక్తి కాకపోయినప్పటికీ మహాబలి ఆస్థాన విద్వాంసులు ఖగోళ, జ్యోతిష శాస్త్రాలలో నిష్ణాతులు కాబట్టి సమస్యను గురించి తెలుసుకుని పరిష్కారం కనుక్కుని అమలు చేసి ఉండవచ్చును కదా!

లేదు!వామన వటువు ప్రమేయం లేకపోవడం అంటూ జరిగి ఆ పండితులు తమ శాస్త్ర పాండిత్యం వల్లనే సాధించితే చాలా తీరికగా మొదలుపెట్టి చాలా నిదానంగా నిర్మించి శాసనాలు వ్రాయించి తమ ప్రతిభను గురించి చెప్పుకునేవాళ్ళు.ఇప్పటిలా ఒక తేదీని dead-line కింద పెట్టుకుని వాయువేగ మనోవేగాలతో కదిలి అంత హడావిడి పడి తమ పేర్లతో శాసనాలు కూడా వేయించని  పరిస్థితి ఎందుకు వస్తుంది?

అదీ గాక, శాస్త్రం ఒక పద్ధతి ప్రకారం జరిగే చలనాలను బట్టి భవిష్యత్తును గణించడానికి ఉపయోగపడుతుంది గానీ ఇప్పుడు జరిగిన అనుకోని ఉల్కాపాతం లాంటివాటిని వూహించి చెప్పడం కుదరదు.అయితే, ఉత్తరార్ధంలో జరుగుతున్న మార్పులు దక్షిణార్ధం వైపుకు వచ్చినప్పుడు కూడా ఏమి జరిగి ఉంటుందో వూహించవచ్చును.అటువంటి హేతుబద్ధమైన ఆలోచనలు చెయ్యడం  మానవ మేధస్సుకు లోబడినదే.అయితే, ఏమి జరిగిందో వూహించగలిగిన మానవుడు తనే పరిష్కారాన్ని కూడా కనుక్కోగలగటం అన్ని వేళలా సాధ్యపడదు కదా!అలా నభూతోనభవిష్యతి అనిపించిన సమస్యను తెలుసుకోవటం, నభూతోనభవిష్యతి అనిపించిన పరిష్కారం సాధించడం అనే ఘనకార్యం చేసిన వ్యక్తినే హిందువులమైన మనం సృష్టికర్త యొక్క అవతారం అని ప్రస్తుతించడం జరుగుతుంది.

వాస్తవ చరిత్రలో మహాబలి చేసిన సాహసానికీ ప్రస్తుతం మనకు తెలిసిన వామనావతార కధలోని సన్నివేశాలకీ పొంతన లేదు.పురాణ కధలో మూడడుగులు దానం అడిగి తల మీద పాదం పెట్టి పాతాళానికి అణిచెయ్యడం ఒకింత వంచనతో కూడిన వ్యవహారం అనిపించి చరిత్రలో అటువంటి వంచనలు ఏమీ లేని పూర్తి సుహృద్భావం కనిపించి ఈ రెంటికీ ముడిపెట్టటం సబబు కాదనిపిస్తుంది, కదూ!

మనం బలి చక్రవర్తి కధను ఎక్కువ చదవకపోబట్టి అలా అనిపిస్తుంది.కానీ, పోతన గారి భాగవతం యొక్క అష్టమ స్కంధంలో క్షీరసాగరమధనం నాటి జగన్మోహినీ అవతార కధ పూర్తయిన వెంటనే బలి ప్రతాపం మొదలై తర్వాత జరిగే దేవ దానవ యుద్ధాలలో బలి ప్రతాపం వ్యక్తమై మధ్యమధ్యన జంభాసురుడి వృత్తాంతం,సముచి వృత్తాంతం,వైవస్వతుడి నుంచి ఇంద్రసావర్ణి వరకు గల మనువుల కధలు జరుగుతూ వచ్చి దాదాపు అష్టమ స్కంధం పూర్తయ్యే ముందు బలి కధ కూడా పూర్తవుతుంది.

మహాబలి ఒక చారిత్రక పురుషుడనేది మర్చిపోయి కధను యధాతధం చూస్తే చాలా హేతువిరుద్ధమైన అంశాలు కనిపిస్తాయి.కధ ప్రకారం బలి పరాక్రమవంతుడై దేవతలను ఓడించి ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చెయ్యటం తప్ప ఒక్క అధర్మ కార్యం కూడా చెయ్యలేదు.

బలిచక్రవర్తి వచ్చి పట్టణాన్ని ముట్టడించడం దేవేంద్రుడు తెలుసుకున్నాడు. కోటకు బలమైన కాపలా ఏర్పాటు చేశాడు. దేవతావీరులతో కలిసి దేవమంత్రి అయిన బృహస్పతిని పిలిపించాడు. బలిచక్రవర్తి దండెత్తి వచ్చిన సంగతి ఇలా చెప్పసాగాడు “వాడు ప్రళయాగ్ని వలె మండిపడుతున్నాడు. క్రూరులైన రాక్షసులతో కూడి ఉన్నాడు. మనతో ఓడిపోయి ఈనాడు తిరిగి మనపైకి వచ్చాడు. ఏ తపస్సువలస వాని కింత శక్తి వచ్చిందో? ఈ దురాత్ముడు ఎవరి సహాయాన్ని పొందినాడో? వీనిని గెలిచే మార్గమేది? ఏం చేయాలి? పరాక్రమంతో వీడిని రణరంగంలో ఎదిరించి నిలువగల వీరుడు ఎవడు?ఈ బలిచక్రవర్తి ఆకాశాన్ని కూడా కబళించే టంతలా ఉన్నాడు. మేరు పర్వతంకంటే ఎత్తు పెరిగి విఱ్ఱవీగుతున్నాడు. కాలయమునివలె వచ్చి మన మీద పడ్డాడు. తిరుగబడితే బ్రహ్మను కూడా భంగపరుస్తాడు అని ఇంద్రుడు వాపోతూ ఇంకా ఇలా అన్నాడు.“మహాత్మా! బృహస్పతి! రాజ్యాన్ని వీడికి వదలి పెట్టడానికి వీలులేదు. యుద్ధానికి వెళ్ళడానికి వీలులేదు. వెడితే తిరిగి వస్తామనే నమ్మకం లేదు. ఈ రాక్షసుడి చేతిలో ప్రాణాలు కోల్పోలేము. వీడి బారినుండి తప్పించుకొని బ్రతికే దారి తెలుపు.”

ఇలా బలి బారినుండి తప్పించుకోడం ఎలా అని అడిగిన ఇంద్రుడితో బృహస్పతి ఇలా అన్నాడు.“దేవేంద్రా! శ్రద్ధగా విను. బ్రహ్మవాదులైన భృగువంశపు బ్రాహ్మణులు వీనికి బల సంపదను సమకూర్చారు. ఈ రాక్షసుని ఎదిరించడానికి విష్ణువుకూ శివునికీ తప్ప, నీకు కానీ నిన్ను మించిన ఇంకెవరికి కానీ శక్తి చాలదు. నీవిప్పుడు రాజ్యాన్నీ రాజధానిని విడిచి పెట్టి వెళ్ళడమే మేలు. పగవారికి కష్టాలు వచ్చినప్పుడు పసిగట్టి మళ్లీ తిరిగి రావడం మంచిదని నా అభిప్రాయం. బలికి బ్రాహ్మణుల శక్తి వల్ల బలం సమకూరింది. కొన్నాళ్ళు పోయాక వీడు బ్రాహ్మణులను గౌరవించడు. దానివల్ల వీని పరాక్రమం సన్నగిల్లుతుంది. అంత వరకూ శత్రువు పేరు కూడా ఎత్తవద్దు."ఈవిధంగా బృహస్పతి సమయోచితమైన కర్తవ్యాన్నితెలియజెప్పాడు. ఆ మాటలకు ఇంద్రుడూ దేవతలూ ఒప్పుకున్నారు. స్వర్గలోకాన్ని విడిచి పెట్టి తమకు ఇష్టమైన రూపాలు ధరించి అనుకూలమైన చోట్లకు వెళ్ళిపోయారు.

బలిచక్రవర్తి పగవారు లేని అమరావతిని సునాయాసంగా ఆక్రమించాడు. ముల్లోకాలనూ తన వశం చేసుకున్నాడు. విశ్వవిజేత అయి చాలాకాలం పాలించాడు.శిష్యులపై వాత్సల్యం కలిగిన శుక్రుడు మొదలగువారు బలిచక్రవర్తి చేత నూరు అశ్వమేధయాగాలు చేయించారు.చేయి సాచి దానం అడిగే యాచకులు, ఆ రాక్షస మహారాజు, బలిచక్రవర్తి రాజ్యంలో, లేరు. దాతలు తమ దానం ఇచ్చే గుణం వదలిపెట్ట లేదు. సకల పంటలూ సానుకూలంగా పండేవి. శత్రువులు లేరు. దేవాలయాలు ఉత్సవాలతో వేడుకలతో వెలుగుతుండేవి. బ్రాహ్మణుల కోరికలు తీరేవి. కాలానికి తగిన విధంగా వానలు కురిసేవి. దానితో భూమికి వసుంధర అనే పేరు సార్థకమైంది." - ఇదీ బలి చక్రవర్తి యొక్క గొప్పతనం!

అలాంటిది కేవలం ఇంద్రుడు తన అసమర్ధతతో పోగొట్టుకున్న ఇంద్ర పదవిని ఇప్పించమని అదితి వేడుకున్నందుకు తను మానవ గర్భవాసాన జన్మించి సుదీర్ఘ కాలం భూమిపైన నడయాడి విద్యలు నేర్చి ఆఖరికి విద్యలతో గాక మోసం చేసి బలి చక్రవర్తిని పదవీచ్యుతుణ్ణి చెయ్యడం అన్యాయం కాదా?ఖచ్చితంగా అన్యాయమే!పైన అతను విష్ణు భక్తుడు.శత్రువైతే కొంత సర్దుకుపోవచ్చు గానీ భక్తుణ్ణి మోసం చెయ్యటం మరీ దుర్మార్గం, కదూ!

పోతన గారు మక్కీకి మక్కీ మూల్లాన్ని దించెయ్యలేదు, తన పాండిత్యాన్నీ భక్తినీ కలిపి మూలకధకి దూరం వెళ్ళాడు గాబట్టి మూలకధ తెలుసుకుంటే చిక్కుముడి కొంత విడుతుంది.అదీ గాక, కధ ప్రకారమే తల మీద పాదం పెట్టి తొక్కెయ్యడానికి కారణం రెండు అడుగులకే విశ్వాన్ని ఆక్రమించి మూడో పాదం ఎక్కడ పెట్టాలి అని అడిగితే బలియే తన తలను చూపించాడు గాబట్టి అని చెప్తారు కదా, అది హేతుబద్ధం కావాలంటే బలిచక్రవర్తి విశ్వానికి బయట నిలబడాలి, అవునా?

అలా కధను కధలా చూస్తే కనిపించే అసంగతాలు కధలోనే నిక్షిప్తం అయిన కొన్ని అంశాల్ని తీసుకుని ఒకచోట పేర్చితే అది ఇలా ఉంటుంది: వేదం చెప్పిన సత్యం ప్రకారం పుట్టుక ఉన్న ప్రతి జీవికీ మరణం కూడా తప్పదు.అందుకే స్వయాన అవతారమై ఆవిర్భవించిన సృష్టికర్త సైతం అవతార ప్రయోజనం పూర్తి కాగానే అంతర్హితుడై పోయాడు.అలాంటిది బలి చక్రవర్తి తన వంశంలోని పూర్వీకుడే అయిన హిరణ్యకశిపునికి జరిగిన పరాభవం నుంచి గుణపాఠం నేర్చుకుని తన వంశంలోని పూర్వీకుడే అయిన ప్రహ్లాదుని నుండి భక్తిమార్గం యొక్క ప్రయోజనాన్ని తెల్సుకుని అంతశ్శత్రువులను జయించి బ్రహ్మాది దేవతలను మెప్పించి వరాలు పొంది మృత్యువును తన దరికి చేరనివ్వని అమరత్వ స్థితిని చేరుకున్నాడు.సృష్టిలోని ప్రతి జీవికి మరణాన్ని కలగజేసేది రాగద్వేష భూయిష్టమైన మనస్సే - మనస్సును రాగద్వేషాలకూ శరీరాన్ని వ్యసనాలకూ దూరం ఉంచగలిగిన ప్రతి ప్రాణికీ బలిచక్రవర్తికి లభించిన అమరత్వం సిద్ధిస్తుంది!

అయితే, బలిచక్రవర్తి ఒకే ఒక పొరపాటు చేశాడు.అమరావతిని జయించాడు గానీ ఇంద్ర పదవిని స్వీకరించినట్టు కనపడటం లేదు.యజ్ఞఫలాలను ఎవరు స్వీకరించాలి?తను చేస్తున్న యజ్ఞాలకు ఫలితాన్ని సైతం వేదపండితులు ఇంద్రుడికే ఆవాహన చేస్తారు కదా!అసలైన ఇబ్బంది, తనకు సిద్ధించిన అమరత్వాన్ని చూసి ఇతరులు కూడా ఆశించితే! అమరత్వం తమలోని దుర్గుణాలను పోగొట్టుకోవడం వల్ల  సిద్ధిస్తుందని తెలియని రజో గుణ స్వభావులు బలిచక్రవర్తితో పోటీపడి సృష్టిలోని సమతౌల్యాన్ని భగ్నం చేసే ప్రమాదం ఉంది.

దానికి పరిష్కారమే బలిచక్రవర్తి యొక్క అమరత్వాన్ని గౌరవిస్తూనే అతన్ని పదవీచ్యుతుణీ చేసి ప్రజల స్మృతిపధం నుంచి పక్కకి తప్పించడం – బలిచక్రవర్తి యొక్క అమరత్వానికి కించిత్తు భంగం కలగలేదు, బలిచక్రవర్తిని గురించి ఏ ఒక్కరూ ఒక్క పొల్లుమాట మాట్లాడలేదు, బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞన్ని కొనసాగించమనే శుక్రాచార్యుడికి చెప్పాడు, పాతాళంలోకి బలి ఖైదీలా వెళ్ళలేదు,సంవత్సరానికి ఒకసారి యజ్ఞఫలాలే కాదు,భక్తులు తనకు చేసే పూజాఫలాలను కూడా బలిచక్రవర్తి వైపుకు మళ్ళించి తనతో సమానం చేశాడు. హిందువులు వామనావతారం కధని ఇలాగే సమన్వయం చేసుకోవాలి.ప్రవచన కర్తలు సైతం అది కేవలం కల్పిత కధ అనుకుని తమ సొంత కల్పనలను జోడించి చెప్తున్నారు, అది చాలా తప్పు!

దేవ దానవుల గురించి స్పష్టత రావాలంటే మొదట మనం తెలుసుకోవాల్సింది, "లంకలో పుట్టినోళ్ళందరూ రాక్షసులే!ఆంధ్రలో పుట్టినోళ్ళు అందరూ దొంగలే!" అన్నట్టు అసురులు, దైత్యులు, దానవులు అన్న పేర్లు దుష్టత్వానికి ప్రతీకలు కాదు."రాక్షస" అనే పదానికి వ్యాకరణ పరమైన వ్యుత్పత్తి "స్వరక్షణ పట్ల జాగరూకులై ఉండటం" అని వస్తుంది.అది తప్పు కాదే!ఇప్పటికీ చెయ్యాల్సిన పని ఎక్కువైనప్పుడు తిండీ నిద్రా మానేసి అంకితభావం చూపిస్తున్న వాళ్ళని "వాడు పని రాక్షసుడు!" అని పొగిడెయ్యటం లేదూ!అలాగే మిగిలిన పదాలు కూడా కొందరు రాజులు తమ వంశానికి తగిలించుకున్న ఇంటిపేర్ల లాంటి విశేష నామావళి,అంతే!అయితే, మహాబలికి ముందరి దానవ సార్వభౌముడైన హిరణ్యకశిపుడు స్వరక్షణ అనేదాన్ని పరభక్షణ స్థాయికి తీసుకెళ్ళి సాటి మానవులకి జయింప శక్యం కానివాడై విర్రవీగుతున్నప్పుడు సృష్టికర్త నృసింహ రూపం దాల్చి సంహరించి ప్రపంచాన్ని సర్వానర్ధ దాయకమైన దుర్మార్గపు పరిపాలన నుంచి రక్షించాడు. కానీ, హిరణ్యకశిపుడి పక్కనే అతని కొడుకు ప్రహ్లాదుడు సజ్జనుడే కదా!అలాగే రావణుడి పక్కన విభీషణుడు ఉన్నాడు కదా!ఇన్ని సాక్ష్యాలు కనబడుతుంటే కేసీయారు ఠపీమని అంత మాట ఎట్ల అనగలిగాడో -  మనిషిలో రాజకీయం పెరిగే కొద్దీ మానవత్వం తగ్గిపోతుంది కాబోలు!

బలిచక్రవర్తి లాంటి పుణ్యాత్ముడి గురించి మాట్లాడుకుంటూ కేసీయారు లాంటి పాపాత్ముల్ని తల్చుకోవడం ఎందుకు లెండి గానీ - సకల లోక సృష్టికర్త పిల్లికీ పిడుక్కీ ఒకటే మంత్రం అన్నట్టు ప్రతి చిన్న పనికీ అవతారం దాల్చడు.గజేంద్ర మోక్షణం వైకుంఠవాసుడిలానే చేశాడు,అది అవతారం కాదు.వృత్రాసుర సంహారంలో అసలు తను కలగజేసుకోలేదు,దధీచి చేత జరిపించాడు - అది అవతారం కాదు.మరి మత్స్య, వరాహ, కూర్మ, నృసింహ, వామన, బుద్ధ, రామ, కృష్ణ రూపాలు అవతారం ఎట్లా అవుతాయి?

సృష్టికర్త యొక్క అవతారం వల్ల జరిగినది అని చెప్తున్న ప్రతి సన్నివేశంలోనూ ఒక ప్రత్యేకత ఉంది.సృష్టి మొత్తం సత్వరజస్తమోగుణాల సమాహారమైన మహదహంకారం యొక్క వ్యక్తరూపం.ప్రతి జీవిలోనూ సత్వరజస్తమోగుణాలు ఉంటాయి గానీ అవి అవ్యక్తంలో వలె సమతాస్థితిలో ఉండక ఏదో ఒకటి కొంచెం అధికమై ఉంటుంది.

నిర్వికారుడు, సర్వాంతర్యామి, సర్వదర్శనుడు అయిన ఈశ్వరుని నుండి రజస్సు, సత్త్వము, తమస్సు అనే మూడు గుణాలు పుడుతున్నాయి. అవి ఉత్పత్తికి, స్థితికి, లయాలకి హేతువు లవుతున్నాయి. కార్యభావంలోనూ, కారణభావంలోనూ, కర్తృభావంలోనూ ద్రవ్యాలైన పృథివ్యాది పంచ మహాభూతాలనూ, జ్ఞానరూపాలైన బ్రహ్మాది దేవతలనూ, క్రియారూపాలైన ఇంద్రియాలనూ ఆశ్రయిస్తున్నాయి. జీవుడు సదా ముక్తుడే అయినా మాయతో కూడి ఉండడం వల్ల ఆ త్రిగుణాలు అతణ్ణి బంధిస్తున్నాయి. జీవుణ్ణి కప్పివేసే ఉపాధులైన ఈ మూడు గుణాలను కల్పించి తద్ద్వారా ఈశ్వరుడు ఇతరులకు ఏ మాత్రం గోచరించక తనకు మాత్రం గోచరించే తత్త్వంతో ఈ విధంగా వినోదిస్తూ ఉంటాడు. సృష్టిలో నిక్షిప్తమై ఉన్న భగవంతుని యొక్క వినోద సంభూతి మానవుడికి మాయావినోదం, లీలావినోదం అనే రెండు విధాల ద్యోతకమౌతుంది - ప్రస్తుత జ్ఞానపరిధికి అందక తెలియనిది మాయ అనిపిస్తుంది,అదే జ్ఞానం పరిధి విస్తరించినప్పుడు తెలిశాక లీల అనిపిస్తుంది!

విశ్వంలోగల సమస్త జీవుల దేహాలూ భగవంతుని స్వరూపాలు. సమస్తమైన ఆత్మలూ ఆయనే. ఆయనే సర్వానికీ ప్రభువు. పరాత్పరుడు. అనేక విధాలయిన బుద్ధులకు ఉపలక్షణమైన మహానుభావుడు. అటువంటి భగవంతుడు తన మాయవల్ల తన లోనే లీనమైన ప్రపంచాన్ని. తన గర్భంలో ధరించి ఒక్కడుగా అద్వైతుడై వెలుగుతూ ఉంటాడు. ఆ పరమాత్మ పుట్టుక లేనివాడు. సమస్తమూ పై నుండి చూచేవాడు అయినప్పటికీ, వేరే మరే వస్తువూ లేకుండా తానే సర్వమూ అయినప్పుడు ఇక ద్రష్ట కాడు. కాని-మాయాప్రధాన శక్తి కలవాడై ప్రపంచాన్ని నిర్మించే కోరికతో గొప్ప చిచ్ఛక్తి గల్గి తనను తాను లేనివాడుగా మనస్సులో భావించు కొంటాడు. సృష్టికి ఉపక్రమించిన పిమ్మట ద్రష్ట అవుతాడు.

భగవంతునికి సృష్టి చేయాలనే సంకల్పం కలగగానే కార్యకారణాల రూపమై ఘనత వహించినదై మహత్తరమైన మాయశక్తిగా ప్రకాశించే అవిద్య రూపొందుతుంది. అందు తన అంశనుండి ఆవిర్భవించిన మాయను తన శక్తిగా ప్రతిష్ఠించి, పుట్టుక లేనివాడూ పురుషోత్తముడూ ఐన ఈశ్వరుడు తన కడుపులో ఉన్న విశ్వాన్ని ఉద్భవింపజేశాడు.భగవంతుని సృష్టి కార్యానికి అంతు అనేది లేదు. దానికి వేరే వస్తువులతో, సంయోగంకూడా అవసరం లేదు. జగత్తులో కుండలు, బట్టలు, తయారయ్యే తీరు వేరు; సృష్టి నిర్మాణ తీరు వేరు. కుండ ఈ లోకంలో తయారు కావాలంటే, 1. మట్టి (ఉపాదానకారణం), 2. మట్టిని కుండగా రూపొందించటం (సమవాయ కారణం), 3. కుండను చేసేవాడు (నిమిత్త కారణం) అవసరం. అలానే బట్ట నిర్మాణం కూడా 1. ప్రత్తి (ఉపాదానం), దారాలు నేత (సమవాయి), బట్ట నేసే వాడు (నిమిత్తం). లోకంలో, ఏ కార్యానికైనా పై మూడూ అవసరం. భగవంతుని సృష్టిలో భగవంతుడే ఉపాదానకారణం,సమవాయకారణం,నిమిత్తకారణం అవుతాడు.

విష్ణువు యొక్క వ్యక్తరూపమైన విశ్వం కొన్ని నియమాలకు లోబడి చలిస్తూ ఉంటుంది.మనకు తెలిసిన భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం జడత్వంలో స్థిరమై ఉన్న ఒక వస్తువును కదిలించాలంటే స్థితి శక్తి, గతి శక్తి అనే రెండు శక్తితత్వాలతోనే సాధ్యం.కానీ, వైదిక శాస్త్రాలలోని సాంకేతిక నియమాల ప్రకారం చూస్తే మంత్రం, యంత్రం, తంత్రం అనే మూడు శక్తితత్వాలు చలనానికి కారణం అవుతాయి.ఇక్కడ యంత్రం అంటున్నది కారు, విమానం వంటి వాటిని గురించి కాదు, శ్రీయంత్రం గురించి.

అయితే, సృష్టిలోని అనేకానేకమైన జీవరాశుల యొక్క పరస్పర చర్యా ప్రతిచర్యల సంయోగ సంయోజనాల వల్ల కొన్నిసార్లు దృశ్యమాన ప్రపంచం తనంతట తను పరిష్కరించుకోలేని సమస్య ఎదురై తల్లడిల్లుతున్నప్పుడు అవ్యక్త పరంధాముడు వ్యక్తంలోకి అవతారమై వచ్చి సమస్యను పరిష్కరించి తిరిగి అవ్యక్తంలోకి నిష్క్రమిస్తాడు.

ప్రస్తుతం మనం వామనావతారం కల్పిత కధ కాదు చరిత్ర అంటున్నప్పుడు దానికి తిరుగులేని భౌతికపరమైన ఆధారాలను చూపించకపోతే మీరు నన్ను సోది చెప్పానని తిడతారు కదూ!ఒకవేళ ఇక్కడ మొహమాట పడి తిట్టుకోలేదు, సరే - మనం మనం బరంపురం కాబట్టి వినటానికి బానే వున్నాయని ఒప్పేసుకుని మీరు చెవలాయల మాదిరి నమ్మేసి ఇవన్నీ తీసుకెళ్ళి హిందూమతద్వేషుల ముందర ఎత్తిపోసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని సాక్ష్యాల కోసం నిలదీసినప్పుడు మీరేం చేస్తారు?

కంగారు పడకండి!GRAHAM HANCOCK,ROBERT BAUVAL అనే ఉద్దండులు సాయానికి వస్తున్నారు.న్యూటనుకి చెట్టు మీదనుంచి యాపిల్ పండు పడినప్పుడు గురుత్వాకర్షణ గురించి తెలియడం అనేది పచ్చి అబద్ధం.అతను కొన్ని సంవత్సరాల పాటు గ్రంధలయాలకు వెళ్ళి కొన్ని ప్రాచీన గ్రంధాల నుంచి విషయాన్ని సమీకరించి ఇతర శాస్త్రజ్ఞులతో చర్చలూ ఉత్తర ప్రత్యుత్తరాలూ జరిపి తయారు చేసుకున్న సిద్ధాంతం అది.అతనికి ఉన్న చమత్కారంగా మాట్లాడే అలవాటు ప్రకారం ఇతరులు మరీ ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నప్పుడు తన సొంత కష్టాలను గురించీ ఒక పట్టాన అర్ధం కాని సాంకేతిక విషయాలను గురించీ సుత్తెయ్యడం ఇష్టం లేక అలా జోకు వేశాడు.అతను అది సీరియస్ మొహం పెట్టి చెప్పటంతో ఇప్పటికీ అందరూ ఆ యాపిలు పండు తల మీద పడకపోయి ఉంటే న్యూటనుకి గురుత్వాకర్షణ గురించి తెలిసేది కాదని అనుకుంటున్నారు.కానీ మన ఉద్దండ పిండాలకి లైటు వెలగడం మాత్రం వాళ్ళొక విహారయాత్రలో ఉండి ఆటపాటలు బోరుకొట్టి ఆకాశం వైపుకు చూస్తున్నప్పుడు జరిగింది.

1983 నవంబరులో వీళ్ళిద్దరూ కుటుంబాలతో సహా పిక్నిక్కుకి వెళ్ళారు.అది సౌదీ అరేబియా.Bauval ఎందుకో తెల్లారగట్ట ఒంటిగంటకి లేచి కూర్చుని చుక్కల వంక మెడ రిక్కించి కళ్ళు చికిలించి నిక్కి నిక్కి  చూస్తన్నాడు.కాస్సేపటికి Hancock కూడా వొచ్చి పక్కన జేరి ఓరియాన్ బెల్టుని బట్టి లెక్కలు గట్టి Sirius అనే ఉదయతారని గుర్తు పట్టటం ఎట్లా అని లెక్చరు పీకడం మొదలెట్టాడు.ఫ్రెండ్సు ఇద్దరూ అల్లాటప్పా గోంగూరకట్ట గాళ్ళు కాదు గదా, సైంటిస్టులాయె, పిక్నిక్కు కబుర్లు కూడా యమా సీరియస్ అయిపోయాయి.మధ్యలో ఒకసారి 'Hancock' ఆవేశం తెచ్చేసుకుని భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతని బోధిస్తున్నప్పటి మొహంతో "the three stars of Orion's Belt are not perfectly aligned. If you look carefully you will see that the smallest of them, the one at the top, is slightly offset to the east." అని నొక్కి వక్కాణించేశాడు కూడాను.అయితే, అది ఇదివరకే నిరూపితమైపోయిన సత్యం, అందులో రొమ్ములు ఉబ్బించాల్సినంత దృశ్యం ఏమీ లేదు గానీ అక్కడ బోధ పడిన కొత్త సత్యం ఏమిటంటే అప్పటి వరకు అందరూ పోల్చి చూసిన మూడు పిరమిడ్లు మాత్రమే గాక నైలు నదీ నది చుట్టూ ఉన్న అన్ని పిరమిడ్లూ కలిసిన ఆకారం శిరస్సు పైకెత్తితే కనిపిస్తున్న నభస్సు మీదకి వియద్గంగ వంటి పాలపుంత ప్రవహిస్తున్న దృశ్యానికి ప్రతిబింబంలా కనిపిస్తున్నది!

పరమసత్యం బోధపడగానే మిత్రులిద్దరూ వీరేచలా శంఖమూదేశారు గానీ నిదానించి చూస్తే మొహాలు వాడిపోయాయి - అప్పుడు పైన కనిపిస్తున్న ఓరియన్ బెల్టూ కింద కనిపిస్తున్న పిరమిడ్లూ మ్యాచ్ అవ్వడం లేదు మరి!మనోళ్ళు ముదుర్లు గాబట్టి ఉస్సూరు బుస్సూరు మంటూ జావ గారి పోలేదు.కంపుస్కూటర్లు తెరిచారు.తేదీల్ని వెనక్కి వెనక్కి జరిపి చూస్తుంటే ఒక్క 10,500BCల నాడు మాత్రమే పైన కనిపిస్తున్న ఓరియన్ బెల్టూ కింద కనిపిస్తున్న పిరమిడ్లూ మ్యాచ్ అవుతున్నాయి - హిప్ హిప్ హుర్రే!

అంతే కాదండోయ్!ఇప్పటి వరకు 2100 - 1200 BCE మధ్యన కంచుయుగంలో మొదలై 336 - 30 BCE మధ్యన హెలినిస్టిక్ శకంతో అంతరించిపోయిన  గ్రీకులకు అంటగట్టేసిన స్ఫింక్స్ పిరమిడ్ మీద ఉన్న మానవ శిరస్సు సైతం 10,500BCల నాడు ఆకాశంలోని తన ప్రతిబింబాన్ని చూసుకుంటున్నట్టు ఉందని అనిపించింది వాళ్ళకి.అక్కణ్ణించి వీళ్ళిద్దరూ బయల్దేరి ప్రపంచం మీద పడ్డారు.అప్పటికి మిస్టరీలు అనుకుంటున్న అన్ని ప్రదేశాల్నీ చుట్టి నేలమీద కనిపిస్తున్న నిర్మాణాల్నీ మింటిమీద తారట్లాడుతున్న నక్షత్రాల్నీ పోల్చి చూస్తూ అవన్నీ 10,500BCEల నాటి నభోమండలపు నకలుని నేలమీదికి దించినట్లు ఉన్నాయని నిర్ధారించారు. 'Heaven's Mirror','The Message of the Sphinx' లాంటి పుస్తకాలు రాసేశారు.

అయితే, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రాలలో కొన్నింటిని శాస్త్రీయత లేని మూఢనమ్మకాల పక్కన చేర్చింది.వాటిలో వాస్తు శాస్త్రం, జ్యోతిష శాస్త్రం కూడా ఉన్నాయి. ఖగోళ శాస్త్రం,జ్యోతిష శాస్త్రం ఒకటి కాదు.ఇప్పుడు మనం జాతకరచన కోసం వినియోగిస్తున్న ఫలిత జ్యోతిషం జ్యోతిష శాస్త్రంలోని ఒక బాగం మాత్రమే.ప్రాచీన వైదిక శాస్త్రాలలో ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం వేర్వేరుగానే ఉన్నాయి.కానీ ధనార్జన కోసం పనికి వస్తున్న ఫలిత జ్యోతిషం మీద చూపించిన శ్రద్ధలో పదో వంతు కూడా చూపించకపోవడంతో ఖగోళ జ్యోతిష శాస్త్రాలు ఎదగక వాటి మీద అందరికీ చిన్న చూపు ఏర్పడింది.అవి కూడా ఎదిగి ఉంటే ఈ సాక్ష్యాలు 10,000 BCEల నాడు మహాబలియే వీటన్నిటిని నిర్మించాడని నిరూపించటానికి సరిపోయి ఉండేవి.ఇప్పటికిప్పుడు హడావిడి పడి చెయ్యగలిగింది లేదు కాబట్టి వీటిని సమర్ధిస్తున్న వ్రాతపూర్వకమైన సాక్ష్యాలను కూడా సేకరించాలి.

నిజానికి మోడర్న్ సైన్స్ అనే యూరోపియన్లు గుత్తకి తెసుకుని వృద్ధి చేసిన శాస్త్రాలు కూడా సత్య నిరూపణ కోసం తీసుకున్నది వేదంలో ఉన్న తర్కాన్నే!విశ్వంలోని ఒక దృగ్విషయం గురించి తెల్సుకోవడానికి శాస్త్రం ఉపయోగం ఎంతో ఉంది.ఎలెక్టిక్ బల్బు అనేది ఇప్పుడు కొత్త విషయం కాదు.కానీ, అది ఉనికిలోకి రావడానికి చాలా తతంగం నడిచింది.మొదట కాంతిని గురించి తెలుసుకున్నారు.అదొక శాస్త్రం అయ్యింది.తర్వాత విద్యుత్తును గురించి తెలుసుకున్నారు.అదొక శాస్త్రం అయ్యింది.తర్వాత విద్యుత్తును ఉపయోగించి కాంతిని పుట్టించవచ్చుననే ఆలోచన వచ్చింది.అప్పుడు ఎలెక్టిక్ బల్బు అనేది తయారయ్యింది.తయారు చేసిన వాడు ఇతర్లకి అమ్మాడు.ఇతర్లు కొనుక్కుని వాడుకుంటున్నారు.విద్యుత్తును ఉపయోగించి కాంతిని పుట్టించవచ్చుననే ఆలోచన వచ్చిన వాడికి లాభం వస్తుందనే గ్యారెంటీ ఉంటుంది గానీ లాభం వస్తుందనే గ్యారెంటీ ఉంటేనే శాస్త్రాన్ని వృద్ధి చేసే దుర్బుద్ధి ఉంటే పరిస్థితి ఇలాగే అఘోరిస్తుంది.

తర్కం సత్యాసత్యాలను నిర్ధారించడానికి ప్రత్యక్ష ప్రమాణం మొదలు అనుమాన ప్రమాణం వరకు ఎనిమిది ప్రమాణాలను చెప్పింది.1).ప్రత్యక్షం, 2).అనుమానం. 3).ఉపమానం, 4).శబ్దం, 5).ఇతిహాసం, 6).అర్ధపాఠి, 7).సంభవం, 8).అభవం.మన ఇంద్రియాలను ఉపయోగించి తెలుసుకోగలిగిన సమాచారం ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది.ధ్వనిని చెవి,స్పర్శను చర్మం,రూపాన్ని కన్ను,రుచిని నాలుక,వాసనను ముక్కు గ్రహిస్తాయి.ఇందులో మళ్ళీ 1.అవ్యపదేశ్యం,2.అవ్యభిచారిత్వం,3.నిశ్చయాత్మకం అనే మూడు పద్ధతులు ఉంటాయి.మొదటిది వేరేవాళ్ళు మామిడిపండు ఆకుపచ్చ రంగులో ఉంటుందని చెప్తే వినడం - మనం స్వయాన చూసి అది నిజమో కాదో తేల్చుకున్నప్పుడే అది ప్రత్యక్షం అవుతుంది, లేదా చెప్పిన వాడు మోసం చెయ్యడు అనే గ్యారెంటీ ఉన్నప్పుదే అది తిరుగు లేనిదై క్యాటగిరీ మారిపోయి శబ్ద ప్రమాణం అవుతుంది.రెండవది చీకట్లో చూసిన తాడుని పామనుకున్న దాన్ని వెలుగులో చూసి తాడని తెలుసుకోవడం.మూడవది దూరాన కదులుతున్నది పొగయో ధూళియో జ్వాలయో అని సందిగ్ధానికి తావివ్వని పద్ధతి. అన్నిటిలోకి నిశ్చయాత్మకమైన ప్రత్యక్ష ప్రమాణం ఉంటే ఇక ఎవ్వడూ నోరెత్తడానికి వీల్లేదు.

అనుమానం ప్రమాణం ఎప్పుడవుతుందంటే ఇదివరకే రుజువైన విషయాలలో ఒకదానితో మనం రుజువు చెయ్యాలనుకున్న విషయానికి సంబంధం ఉండాలి.మేఘాలు వర్షిస్తాయనేది అనుమానమే - వర్షం కురిసినప్పుడు చూసి చెప్తే అది ప్రత్యక్ష ప్రమానం అవుతుంది.ఇదివరకే మేఘాల నుంచి వర్షం కురియడం చూడకపోయినా పర్లేదు - పైన మేఘాలు ఉండటం, వర్షం పైనుంచి పడటం అనేవాటికి సంబంధం కలుపుకుని వూహించి చెప్పినప్పుడు అది అనుమాన ప్రమాణం అవుతుంది.ఒకసారి వర్షం పడుతున్నప్పుడు చూశాక అది ప్రత్యక్ష ప్రమాణం అయిపోతుంది.

ఉపమానం ప్రమాణం కావాలంటే మనం ఒక మనిషికి తెలియని విషయాన్ని ఆ మనిషికి తెలిసిన విషయంతో పోల్చి చెప్పాలి.ఒక మనిషికి పిల్లి ఎలా ఉంటుందో తెలిసి పులి ఎలాఉంటుందో తెలియనప్పుడు పిల్లికీ పులికీ పోలికల్నీ తేడాల్నీ చెప్తూ వర్ణించడం కూడా అందరూ ఒప్పుకునే ప్రమాణమే.

శబ్ద ప్రమాణం అంటే వేరేవాళ్ళు చెప్పిన దాన్ని ఉదహరించటం.మనం నిరూపించాల్సిన విషయానికి సంబంధించి మనం ఉదహరిస్తున్న వ్యక్తికి పాండిత్యం ఉందని మనం నిరూపించాల్సిన అవతలి వ్యక్తికి తెలియాలి. మనం ఉదహరిస్తున్న వ్యక్తి గత చరిత్రను బట్టి నిజమే చెప్తాడని తెలుసు కాబట్టి తను స్వయాన ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకున్నది మనకి చెప్పడం, ఇతరులు ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకుని అతనికి చెప్పిన దాన్ని తను మనకి చెప్పడం అనేవి రెండూ అందరికీ ఆమోదయోగ్యమైన సాక్ష్యాలే.

ఇతిహాసం అనేది ప్రత్యక్ష ప్రమాణం తర్వాత అందరూ ఆమోదించదగిన సాక్ష్యం.వ్రాత పూర్వకమైన శాసనాలూ ఉల్లేఖనాల వంటివీ వస్తురూపమైన ఆలయాలూ భవనాల వంటివీ మేలిరకం సాక్ష్యాలు అయితే మనం నిరూపణ చెయ్యలనుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్న సాహిత్య రూపాలు కూడా మనం ఉదహరిస్తున్న వ్యక్తికి పాండిత్యం ఉందని మనం నిరూపించాల్సిన అవతలి వ్యక్తికి తెలిసినప్పుడు మాత్రమే తిరుగు లేని సాక్ష్యాలు అవుతాయి.కల్హణుడి రాజ తరంగిణి అధికారికమైన కాశ్మీర ప్రాంతపు రాజవంశావళి.విశ్వనాధ సత్యనారాయణ గారు వ్రాసిన 12 నవలల సమాహారం అయిన పురాణ వైర గ్రంధ మాల, నేపాళ రాజవంశాల చరిత్ర పేరున వ్రాసిన ఆరు నవలలు కూడా చరిత్రయే.

అర్థాపత్తి అనేది ఇతరులు చేసిన ఒక నిరూపితమైన సూత్రీకరణ నుంచి అర్ధభేదం లేని ఇంకొక సూత్రీకరణను చెయ్యటం కూడా తిరుగు లేని సాక్ష్యమే అవుతుంది."మేఘాలు ఉన్నప్పుడే వర్షాలు కురుస్తాయి" అని తెలిసినప్పుడు "ప్రస్తుతం మేఘాలు లేవు కాబట్టి వర్షం రాదు" అని చెప్పడం సబబే కదా!

సంభవం అనేది సాధ్యాసాధ్యాలను విచారించడంతో ముడిపడి ఉంటుంది."ఒకప్పుడు భీమసేనుడు భూమిని కందుకం వలె ఎత్తి విసిరి క్రీడించినాడు" అని అంటే ప్రకృతి నియమాలను గురించి తెలిసిన సాధారణ వివేకం(common sense) ఉన్నవాడు ఎవ్వడూ ఆమోదించడు, కదా!అయితే, చెప్పిన వాడు సృజనశీలియై కొంత చమత్కారం వాడితే నమ్మే అవకాశం ఉంది.

ఇక అభవం అనేది సంభవం అనేదానికి పూర్తి వ్యతిరేకం.అక్కడ ప్రతిపాదించిన విషయం ఉనికిలో ఉండవచ్చునేమో అనే అవకాశం ఉంటే ఇక్కడ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉనికిలో ఉండదని తెలిసిన సంభావ్యతని ప్రమాణం కింద చూపించడం.మొదటి వ్యక్తి పసుపు రంగు అసలు లేని పువ్వు పేరు చెప్పమని ఎదటి వ్యక్తిని సవాలు చేసినప్పుడు పసుపు రంగు అసలు లేని పువ్వు పేరును చెప్పగలిగితే ఎదటి వ్యక్తి చెప్పినది సత్యం అవుతుంది లేదా ఎదటి వ్యక్తి పసుపు రంగు అసలు లేని పువ్వు పేరు చెప్పలేని పక్షంలో మొదటి వ్యక్తి చెప్పినది సత్యం అవుతుంది.

ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఒక్క ప్రత్యక్ష ప్రమాణం మీదనే ఆధార పడుతున్నది.మిగిలిన వాటిలో సందిగ్ధత ఉన్నప్పుడు వ్యక్తులు మోసం చేసి గెలిచే అవకాశం ఉంది గాబట్టి అది తప్పని అనడానికి వీల్లేదు.వేదం సైతం ప్రత్యక్ష ప్రమాణం వైపుకే మొగ్గు చూపింది.అయితే, ప్రత్యక్షప్రమాణం ఇవ్వడానికి వీల్లేని వాటిని మిగిలిన ప్రమాణాలతో నిరూపించవచ్చునని వేదం చెప్తుంటే ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రత్యక్షప్రమాణం ఇవ్వడానికి వీల్లేని వాటిని అసలు పరిగణించడం లేదు, పరిశీలించడం లేదు, ప్రయోగాలు చెయ్యడం లేదు.

GRAHAM HANCOCK,ROBERT BAUVAL అనే ఉద్దండులు చెప్పిన విషయాలు శబ్ద ప్రమాణం కిందకి వస్తాయి.వాళ్ళు మోసకారులు కాదు,అనామకులూ కాదు.అయితే వీళ్ళు గుర్తింపు ఉన్న సైంటిస్టులు కాదు.1999 నవంబర్ 4న BBC ప్రసారం చేసిన Horizon అనే సైన్సుకి సంబంధించిన టీవీ సీరీస్ వీళ్ళని సూడో సైంటిస్టుల కింద తేల్చి పారేసింది.astronomer Edwin Krupp వీళ్ళు చెప్తున్న ఆలయాల నమూనా ఆకాశంలోని నక్షత్రాలను ప్రతిబింబించడం అనేది న్యూయార్కులోని కొన్ని ప్రదేశాలను ఎంచుకున్నప్పటికీ సరిపోతుందని వాదించాడు.అదీ గాక వీళ్ళు తమ ధియరీకి అనుకూలమైన వాటినే చూపిస్తూ అనుకూలం కానివాటిని దాచేస్తూ మోసం చేస్తున్నారని కూడా వాదించాడు.

మిత్రద్వయం Edwin Krupp తమ ప్రతిపాదనలను తప్పుడు సూత్రీకరణలతో వ్యతిరేకిస్తున్నాడని ఎనిమిది పాయింట్లను ఎత్తి చూపిస్తూ Broadcasting Standards Commission వారికి లేఖ రాసినప్పటికీ  ఒకే ఒక పాయింటు బలంగా ఉండటం వల్ల ఆ భాగాన్ని సరిచేసి ఆ ఒక్కదానికీ సారీ చెప్పేసి మిగిలిన విషయానికి సంబంధించి Edwin Krupp వైపునే నిలబడి చర్చను ముగించేసింది.Edwin Charles Krupp కూడా తక్కువ స్థాయి వాడు కాదు - archaeoastronomy శాఖకు సంబంధించి గొప్ప పాండిత్యం ఉన్నవాడు.

గుర్తింపు ముద్ర లేని GRAHAM HANCOCK లాంటివాళ్ళ హేతుబద్ధమైన వాదనల్ని Charles Krupp లాంటి గుర్తింపు పొందిన శాస్త్రజ్ఞులు ఎందుకింత నిర్దాక్షిణ్యం చూపిస్తున్నారనేది ఆలోచించాలి.ఒకవేళ GRAHAM HANCOCK లాంటివాళ్ళు పాప్యులారిటీ కోసం మోళీ చేస్తుంటే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని మనం సాధించేది ఏముంది?ప్రత్యక్ష ప్రమాణం లేని విషయాన్ని కేవలం తర్కంతో నిరూపించాలంటే ఉన్న ఒకే ఒక పద్ధతి ప్రతిపాదనలలో అంతర్గత వైరుధ్యాలను వెదకటం.అంతర్గత వైరుధ్యాలు ఉంటే ఇక దాన్ని అసత్యం కింద తిరస్కరించెయ్యటం తప్ప మరో దారి లేదు.అలా చూసి ఇప్పటి వరకు సత్యం అని అమోదించిన విషయం ఇప్పుడు అది అసత్యం అని నిరూపించే తిరుగు లేని భౌతిక సాక్ష్యం కనపడినప్పుడు దాన్ని కూడా అసత్యం కింద తిరస్కరించెయ్యటం తప్ప మరో దారి లేదు.

కానీ గుర్తింపు ముద్ర ఉన్న శాస్త్రజ్ఞులు సత్యం పట్ల నిబద్ధతను చూపించడం లేదు.Hancock తన విశ్లేషణలకి తీసుకున్న ఉత్తరపు అమేరికాలోని 37 జంతుజాతులు 10,000 BCEల నాడు అంతర్ధానం అయిపోవడం గురించి గుర్తింపు ముద్ర ఉన్న శాస్త్రజ్ఞులు 2007 నాడు చేసిన సూత్రీకరణలని ఒప్పుకుంటూనే అదే సమయంలో దక్షిణపు అమేరికాలోని 52 జంతుజాతులు అంతరించిపోవడాన్ని గురించి చెప్పి అది ఉల్కాపాతం వల్ల గాక అప్పటి hunter gathrers ఆకలి ఎక్కువై ఎడపెడా వేటాడెయ్యడం వల్ల జరిగిందనేస్తున్నారు - అక్కడ ఉన్న మానవ సమూహం యొక్క సంఖ్య ఎంత,అంతరించిపోయిన జంతుజాతుల యొక్క సంఖ్య ఎంత,ఒక మనిషి రోజుకి ఎన్ని జంతువుల్ని తింటే అంత తక్కువ కాలంలో అంత ఎక్కువ స్థాయిలో అన్ని జంతుజాతులు అంతరించిపోతాయి అనే లెక్కలు ఇక్కడ చెప్పలేదు గానీ అసలు వాళ్ళు తీశారో లేదో తెలియడం లేదు నాకు.

ఇవి MICHAEL SHERMER అనే ప్రఖ్యాత అమెరికన్ science writer, science historian గారి అహంకారపు ఆణిముత్యాలు:"పిరమిడ్ల గురించీ ముఖ్యమైన స్ఫింక్స్ గురించీ ప్రస్తుతపు సైంటిస్టులు చెప్పినవి సర్వజనామోద యోగ్యమైన తిరుగు లేనివి కానప్పటికిన్నీ మంచిగానే ఉన్నాయి","కొత్త సిద్ధాంతములు చేయువారు తమ సిద్ధాంతములకు ధనాత్మకమైన రుజువులను చూపించినప్పుడు మాత్రమే అవి ఆమోదించబడును గానీ పాతవారి సిద్ధాంతములను కొట్టివేయు ఋణాత్మకమైన సాక్ష్యములను మాత్రమే చూపినట్లైన తిరస్కరించబడును" - ఇలాంటి తింగరి వాదనలు చేస్తూ పిరమిడ్ల గురించి ఏ ఒక్క గుర్తింపు ముద్ర ఉన్న సైంటిస్టూ తన వాదనకి అందరు గుర్తింపు ముద్ర ఉన్న సైంటిష్టులూ ఒప్పుకుని తీరాల్సిన తిరుగు లేని ఆధారాలు చూపించ లేదు గానీ గుర్తింపు ముద్ర ఉన్న సైంటిస్టులు అందరూ గుర్తింపు ముద్ర ఉన్న అందరు సైంటిస్టుల సిద్ధాంతాల్నీ ఒప్పేసుకుంటున్నారు.గుర్తింపు ముద్ర లేనివారు ఎంత బలమైన సాక్ష్యం చూపించినప్పటికీ బొక్కలు వెతికి వంకలు పెట్టి వెక్కిరించి పంపించేస్తున్నారు.

అసలు 11,000 సంవత్సరాల క్రిందట అక్కడి స్థానికులు hunter-gathrers కాబట్టి HANCOCK చెప్పినది సాధ్యపడదు అనే మొండితనమే తప్ప అదే HANCOCK వాటిని కట్టగలిగిన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వేరే చోటునుంచి వచ్చి కట్టే అవకాశం ఉంది కదా అని అర్థాపత్తి ప్రమాణం చూపిస్తూ సంభవం గురించి నసుగుతుంటే దాన్నీ కొట్టిపారెయ్యటమే తప్ప శాస్త్రీయత లేని వాదనలు చేస్తున్న బడుద్ధాయలు గయ్యాళితనం చూపించి నెట్టుకొస్తున్నారు.

కాబట్టి ఇప్పుడు మనం ఇతిహాసపు చీకటి కధల్ని వెతికి పట్టుకుని దాచేస్తే దాగని సత్యాల్ని బయటికి తియ్యాలి.ఎక్కడికో వెళ్ళడం దేనికి, అసలు కార్యక్షేత్రం అమెరికా ఖండపు మాచు పిచ్చు ప్రాంతం మనకి చాలా నిజాల్ని చూపిస్తుంది.ఇక్కడ అనాది కాలం నుంచి ఉన్న మానవ జాతిని INKAS అంటారు.వారి నాగరికత 12,000 సంవత్సరాల క్రితం మొదలైందని వారే చెప్పుకుంటున్నారు. ఆధునిక చరిత్రకారులు చెప్తున్న దాన్ని బట్టి 20,000 సంవత్సరాల క్రితం ఆసియా నుంచి ఒక మానవ సమూహం బేరింగు జలసంధిని దాటి ఇక్కడికి వచ్చి స్థిరపడింది.అప్పుడు బేరింగు జలసంధి సైబీరియాని అలాస్కాతో కలుపుతూ ఉండేది.అలా వచ్చిన మానవ సమూహం 13,000 BCE మొదలు 10,000 BCE వరకు అంకెకు పెరిగి చిన్న చిన్న గుంపుల కింద విడిపోయిన 10,000 BCEల నాడు ఒక గుంపు దక్షిణపు అమెరికా తీరప్రాంతం చేరుకుని ఆండిస్ పర్వత ప్రాంతం దగ్గిర స్థిరపడింది.

తమ దేవుడు కరుణామయుడని చెప్పుకునే ఈ క్రైస్తవ మతప్రచారకులు ఎంత జుగుప్సాకరమైన పద్ధతిలో అమేరికా ఖండాన్ని క్రైస్తవీకరించారో తెలుసుకుంటే క్రైస్తవేతరులకే కాదు, క్రైస్తవుల్లో కూడా జాలీ దయా మానవత్వం ఉండి పిల్లాజెల్లలతో సంసారపక్షమైన బ్రతుకులు గడుపుతున్నవారికి సైతం ఒళ్ళు గగుర్పొడుస్తుంది. సా.శ:1614ల నాడు ఒక ఓడ ఉత్తర అమేరికా తీరాన్ని చేరి లంగరు వేసింది.అందులో ఉన్న క్రిస్టియన్ మత ప్రచారకులు కూడా ఉన్నారు.ఓడ లంగరు ఎత్తేనాటికి వాళ్ళు ఇరవై నలుగుర్ని బానిసల కింద తీసుకుపోయారు.పాస్టర్లు మన చిన్నప్పుడు ఆటలమ్మ అనే పేరున మనల్ని భయపెట్టిన small pox వ్యాధి క్రిములు ఉన్న దుప్పట్లని పంచి పెట్టారు చిరు నవ్వులు చిందిస్తున్న మొహాలతో, సేవ పేరున.లెక్క పెట్టి మూడేళ్ళు గడిచేసరికి తొంభై ఎనిమిది శాతం రెడ్ ఇండియన్లు క్షణ క్షణం నరక యాతన అనుభవిస్తూ మృత్యుదేవత పెనం మీద పేలాలు వేయించుకుంటున్నట్టు మలమల మాడి చచ్చారు!

సరిగా ఆరేళ్ళకి 1620 నడి శీతాకాలం నాడు MAYFLOWER అనే ఓడ ఉత్తర అమేరికా తీరాన్ని చేరుకుని లంగరు వేసింది.ఈసారి 102 మంది ద్వీపాంతరం శిక్ష వేసిన నేరస్తుల్ని తోడు తెచ్చుకుని “THE PLYMOUTH PLANTATION” పేరున దాదాపు నిర్మానుష్యం అయిపోయిన PAWTUXET అన్న పేరు గల రెడ్ ఇండియన్ గ్రామలో తొలి వలస గుడిసెని నిలబెట్టారు.JOHN WINTHROP అనే వెధవ ఇంగలాండులో ఉన్న తన మిత్రుడికి వ్రాసిన ఉత్తరంలోని,“BUT FOR THE NATIVES IN THESE PARTS, GOD HATH SO PURSUED THEM, AS FOR 300 MILES SPACE THE GREATEST PART OF THEM ARE SWEPT AWAY BY SMALLPOX WHICH STILL CONTINUES AMONG THEM. SO AS GOD HATH THEREBY CLEARED OUR TITLE TO THIS PLACE, THOSE WHO REMAIN IN THESE PARTS, BEING IN ALL NOT 50, HAVE PUT THEMSELVES UNDER OUR PROTECTION.” అంటున్న భాగం చదువుతుంటేనే తమ మతం ప్రేమ,జాలి,దయ,సేవ అనే నాలుగు స్తంభాల మీద ఎదిగి ప్రపంచవ్యాప్తం అయ్యిందని చెప్పుకునే ప్రతి క్రైస్తవుడి మొహం మీదా ఖాండ్రించి ఉమ్మెయ్యాలన్నంత అసహ్యం వేసింది నాకు!

1620ల నాడు జరిగిన ఈ ఘాతుకం మొదట బయట పడింది Francis Parkman అనే సత్యం పట్ల నిబద్ధత గలిగిన చారిత్రక పరిశోధకుడి పుణ్యాన - అదీ 19వ శతాబ్దంలో!ఇది ఏదో అనుకోకుండా జరిగిన దురదృష్టకరమైన సన్నివేశం అనుకునేరు - జులై 13న Bouquet అనే వ్యక్తి Amherst అనే వ్యక్తికి వ్యాధిని అంటించుకున్న దుప్పట్లని ఇచ్చి రెడ్ ఇండియన్లని చంపటానికి ప్లాను వేసుకుని ఉన్నట్టు వాగ్దానం ఇస్తూ వ్యాధి తనకు అంటని జాగ్రత్తల్ని తీసుకుంటున్నట్టు చెప్తున్న సంభాషణ కూడా బయటపడింది పరిశోధనలో.అక్కడ మాత్రమే కాదు,అడుగు పెట్టిన ప్రతి చోటా ఇదే క్రూరత్వం - ఇండియా లోని గోవా ప్రాంతపు నరరూపరాక్షసుడు SAINT FRANCIS XAVIER ఒక్కడే అక్షరాల 30,000 మంది హిందువుల్ని ఇదే వ్యాధిని అంటించి చంపేశాడు!

ఇప్పుడు మనం చూస్తున్న Machu Picchu అనేది ఆర్కియాలజిస్టుల కధనం ప్రకారమే ఒక అద్భుతాలకు అద్భుతం.ఇప్పుడిప్పుడు కొత్త తరం ఆర్కిటెక్టులు నేర్చుకుంటున్న ప్రకృతిలో కలిపిపోయి ప్రకృతికి మేలు చేస్తూ ప్రకృతి నుంచి లాభం పొందుతూ మానవులకు తెర తీయని తెర వేయని నాటక రంగాన్ని పరిచయం చేస్తూ వసి వాడని తమి తీరని మధురానుభవాన్ని అందించే నివాస గృహాలను నిర్మించడం అనే కళని అప్పుడిక్కడ పతాక స్థాయికి చేర్చారు ఆనాటి స్థానికులకి నాగరికతని పరిచయం చేసిన  సంస్కృతీ నిర్మాతలు.

అసలు యాండిస్ పర్వత శ్రేణి ప్రపంచంలోనే అతి పొడవైనది.అమెజాన్ నది జన్మస్థానం ఇదే.అక్కడి స్థానిక Quechua భాష Tawantinsuyu అని పేర్కొంటూన్న INka Empire చిన్నదేమీ కాదు, యాండిస్ పర్వత శ్రేణి పొడవున కొలంబియా మొదలు ఆర్జెంటినా వరకు వ్యాపించి ఉంది.ఇక్కడ మనకు ఉన్న పురాణకధలలో భగవంతుడి గురించి చెప్పే కధలతో పాటు రాజవంశాల విశేషాలను చెప్పే కధలు కూడా ఉన్నాయి.కానీ Inkas వారికి అలాంటి తేడా లేదు. వారి అధికారికమైన చరిత్రలో VIRACOCHA, MANCO CAPAC అనే తండ్రీ కొడుకులు ప్రధాన పాత్ర వహించి దైవసమానులు అయ్యారు.

మొదట VIRACOCHA విమానం మీద భూమిని చుడుతూ ప్రతిచోటా మానవులకు నాగరికతలను పరిచయం చేస్తున్న క్రమంలో తమ వద్దకు వచ్చాడని చెప్తారు. అలా వస్తూ పోతూ ఉన్న VIRACOCHA కొంత కాలం గడిచాక MANCO CAPAC అనే తన కొడుకును వెంట తీసుకు వచ్చి పరిచయం చేసి తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయి ఇక మళ్ళీ రాలేదని చెప్తారు.

అప్పటి మానవ జాతికి వేట తప్ప ఇంకేమీ తెలియదని ఆధునికులు తేల్చి పారేసిన అత్యంత ప్రాచీన కాలం నాడు ఉనికిలోకి వచ్చి ఇప్పటికీ ప్రపంచ స్థాయిలో యాత్రికులను ఆకర్షించుతూ హేతువాదులైన శాస్త్రజ్ఞులను వెక్కిరిస్తూ వస్తున్న ఒక అద్భుతం ఉంది అక్కడ - Intihuatana Stone అనే నలు చదరపు వేదిక మీద నిర్మించబడిన సూర్యకాంతి మీద ఆధారపడిన గడియారం!ఇది కేవలం గడియారం మాత్రమే కాదు,తనను స్పర్శించిన వ్యక్తికి శక్తిని ప్రసాదించే మహత్యం ఉంది!2008ల నాడు TripAdvisor పత్రిక ఒక బ్రిటిష్ యాత్రికుడి అనుభవం పేరున ఒక వింత వార్తను ప్రచురించింది:“I was skeptical about a stone that emits energy.But, when you put your hands on it, it feels cold, but if you run your palms a few inches above the stone and you can put your mind blank.My hands started to feel A warmth and a tingling sensation that transcended my arms. I got scared a little, so I stopped. But I was full of energy, even though I was walking that whole day from 5 a.m., I could not sleep that night because I was full of energy.” - ఎంత అద్భుతం?

Intihuatana Stone కొంచెం దక్షిణం వైపుకి కొంచెం వంగి ఉంటుంది.ఆ కోణం 13.1 DEGREES - అది ఎందుకు వంగి ఉందో తెలుసుకున్నప్పుడు అప్పటి దాక మాయ అనిపించినది అప్పటి నుంచి లీల అనిపిస్తుంది.నలు చదరం యొక్క మూలలు అక్కడి క్షితిజం యొక్క మూలలకు సరిపోతున్నాయనేది తెలుసుకోవాలి.మనం నివసిస్తున్న భూమి నిటారై ఉంటే ఋతువులు లేక జీవం పుట్టేదీ కాదు,పుట్టిన జీవం ఎంతో కాలం జీవించగలిగేదీ కాదు.దాని వొంపు 23 డిగ్రీలు.చంద్రగ్రహం సైతం భూమినీ సూరుడినీ కలుపుతున్న వృత్తానికి కోణం చేస్తూ తిరుగుతున్నది.దాని కోణం 5 డిగ్రీలు.ఇవి రెండూ భూమి మీద జీవం పుట్టుకకి ఎంత ప్రధానమో తెలిసిన వాళ్ళకి Intihuatana Stone యొక్క కోణం యొక్క కీలకం కొంచెం అర్ధం అవుతుంది.

అక్కడ అద్భుతం జరిగేది సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే - సూర్యగ్రహం దక్షిణానికి 13.1 డిగ్రీలు వంగుతున్న మార్చి 21,సెప్టెంబర్ 23న Intihuatana Stone యొక్క నీడ కనపడదు,సూర్యకాంతి ఒక లేసర్ కిరణం మాదిరి దీని మీద పడుతుంది! ఇది ఒక్కటే కాదు, ఒక సర్పిలం గీసి దాని చుట్టూ శ్రీచక్రంలోని భూప్రస్తారం వంటి చతురస్రాలను చెక్కిన అమరిక ఎక్కడ చూస్తే అక్కడ తారసిల్లి వీటిని హిందువులు తప్ప మరొకరు నిర్మించలేరని చెప్పటానికి గట్టి సాక్ష్యం ఇస్తున్నాయి.

Machu Picchu పేరున టూరిస్టులకి ఇప్పుడు చూపిస్తున్న అద్భుతాలను INka Empire నిర్మించలేదనేది వాస్తవం.అత్యంత కఠినమైన యాండిస్ పర్వతాలను తొలిచి ఆ పర్వతం నుంచి తీసుకున్న కఠిన శిలల్ని ఉపయోగించుకుని నిర్మించిన అత్యంత సుందరమైన జనవాసాలను పూర్వ ఇన్కామీయ సంస్కృతి(Pre Inkamese Civilization) అని చారిత్రక పరిశోధకులు పిలుస్తున్నారు.ఆ చారిత్రక పరిశోహకులే పూర్వ ఇన్కామీయ సంస్కృతి వారి నిర్మాణశైలికీ ఇన్కామీయుల నిర్మాణశైలికీ హస్తిమశకాంతరం ఉందంటున్నారు.చూడగానే ఒక పద్ధతీ పాడూ లేనట్టు అనిపించే వంకర టింకర రాళ్ళ అమరికలో అధునాతన భవన నిర్మాణానికి సమబంధించి ఎంతో అనుభవం ఉన్నవారు తప్ప ఉపయోగించలేని "Criss Cross Pivotal Convergence" అనే సూత్రం ఇండి ఉంది.2D వరకు చూస్తే గరిమనాభి(Focal Point) అనేదాన్ని 3D దగ్గిరకి వచ్చేసరికి Pivot Point అంటారు.మనం చూస్తున్న రాళ్ళు ఇప్పుడు మనం వాడుతున్న క్యూబాయిడ్ ఇటుకల వలె గాక విభిన్నమైన ఆకారాలలో కనపడుతున్నప్పటికీ వాటిని కలుపుతున్న Pivot Points యొక్క అమరిక క్యూబాయిడ్ ఇటుకల కన్న ఎక్కువ ధృఢత్వాన్ని ఇస్తుంది.

ఇప్పుడు టూరిస్టులు చూస్తున్న ఇంత ధృఢమైన నిర్మాణాల మధ్యకు ముక్కలు చెక్కలై పడి ఉన్న శిధిలాలు ఎలా వచ్చాయి?అంత ఎత్తున అంత కష్టపడి అంత గొప్ప సాంకేతికతను ఉపయోగించి కట్టుకున్న ఇప్పటికీ చెక్కు చెదరని సౌందర్య వైభవంతొ అలరారే అందమైన ఇళ్ళను వదిలేసి పోవడానికి మనసెలా వొప్పింది ఆ పూర్వ ఇన్కామీయ సంస్కృతీ నిర్మాతలకి!ఆ శిధిలాలను కొంచెం పరిశీలించి చూస్తే జవాబు మీకే బోధపడుతుంది - ఏ పర్వతం నుంచి బయటకు తీసి మళ్ళీ ఆ పర్వతంలోకి దూర్చిన అన్ని మిలియన్ల సంఖ్యలో ఉన్న రాళ్ళు ఇన్ని వేల యేళ్ళ పాటూ వాతావరణంలోని అన్ని మార్పులకీ తట్టుకుని నిలబడగలిగినప్పుడు ఈ కొన్ని రాళ్ళు మాత్రం ఇలా తునకలు కావడానికి ఈర్ష్యాళువులైన క్రైస్తవ సామ్రాజ్యవాదుల బాంబుల దెబ్బలే కారణం. క్రైస్తవ సామ్రాజ్యవాద పిశాచి పెరువియన్ క్రైస్తవేతర మూలవాసీల యొక్క నిజమైన హిస్టరీని బాంబు దెబ్బలతో నాశనం చేసి మళ్ళీ ఎందుకు నాశనమైందో తెలియదని అమాయకపు కబుర్లు చెప్తూ మిస్టరీ కింద మార్చిపారేసింది -  ఇవ్వాళ వాటిని టూరిస్టు స్పాట్ల కింద మార్చి సాలీనా 100 million soles(US$ 35.9 million) ఆర్జిస్తున్నది!

ఇప్పటికే కట్టి ఉన్నవాటిని చూసి వాటి నమూనా ఆకాశంలోని నక్షత్రాలను ప్రతిబింబించడం అనేది న్యూయార్కులోని కొన్ని ప్రదేశాలను ఎంచుకున్నప్పటికీ సరిపోలుతుందని తేల్చిన Edwin Krupp గారిని ఇప్పుడు కట్టి చూపించమని చాలెంజి చేసి ఉంటే ఎలా ఉండేది?కట్ట లేడు గాక కట్టలేడు!ఎందుకంటే, వీటిని నిర్మించింది వాస్తు శాస్త్రం యొక్క నియమాలతో.ఆ వాస్తు ఇప్పటికీ భారతదేశంలో ఉంది.ఇప్పుడు జీవించి ఉన్న వైదిక శాస్త్రాలను అధయ్యనం చేసిన పండితులు వీటిని పునర్నిర్మించగలరనేది నిజం.అది ఒక్కటి చాలు భూమి మీద చెల్లా చెదరై పడి ఉన్నట్లు అనిపించే అన్ని ప్రాచీనమైన అద్భుతాలనూ అప్పుడు భరత ఖండం అని పిలిచే ఇప్పటి భారత దేశం నుంచి కొందరు వెళ్ళి నిర్మించినట్టు బల్ల గుద్ది చెప్పడానికి.

అక్కడి వారికి దైవ సమానులైన VIRACOCHA,MANCO ద్వయం కేరళను స్వస్థానం చేసుకుని 12,000 సంవత్సరాల క్రితం భూమి మీద గల సమస్త ప్రజలనూ పరిపాలించిన విరోచన,మహాబలి నామధేయులైన దానవ జాతికి చెందిన చక్రవర్తులే!సంస్కృత పదాల అపభ్రంశ రూపాలు అన్ని భాషలలోనూ సామాన్యమై కనిపిస్తున్న వ్యవహారమే - 'క్రమముగ "శ్రీమ త్సకల గుణ సంపన్న"యని యున్న జదివెడు నఱవవాడు  కడగి "చిరిమదు చగల కుణ చంపన్న" యని,కన్నడము వాడు మొనసి "సిరిమతు సగల గోణ"యని తోదనే "శంపణ్ణ"యని,మహారాష్ట్రుండు పని వడివడి జెలగుచు "శ్రీ మతూ సెకల గుణానె సంపన్నాసె"యని, యోఢ్ర భాషణుండు వెలయు "శ్రీ మొతొసొ కొలో గుణ సొంపొన్నొ"యని,యికెన్ని వేల యన్య భాష లాంధ్రు డున్న యట్లె యలరు బఠించు నంచు హాస్యవేది యాడు నాడు..' అని శ్రీకొక్కొండ వెంకటరత్నం గారు చెప్పినట్టు సంస్కృత పదాల్ని యధాతధం తెలుగువాళ్ళు తప్ప ఇంకెవ్వరూ పలకలేరనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాలి.ఇప్పుడు పెరు దగ్గిర ఉన్న మనం అక్కడి VIRACOCHA ఇక్కడి విరోచనుడనీ అక్కడి MANCO CAPAC ఇక్కడి మహాబలి అనీ అక్కడి SACSAYHUAMAN ఇక్కడి సాక్షాత్ వామన వటువు అనీ నిరూపించటానికి కేరళ వెళ్ళి అక్కడి చరిత్రను తవ్వి తీయాలి.

కేరళ యొక్క ప్రాచీన చరిత్రలో విరోచనుడు 10,650 BCE నాటివాడనీ మహాబలి 10,600 BCE నాటివాడనీ కాలనేమి 10,500 BCE నాటివాడనీ స్వర్భాను 10,400 BCE నాటివాడనీ వ్రాసి ఉంది. అక్కడి వ్రాతల్నీ ఇక్కడి వ్రాతల్నీ పోల్చి చూస్తే ఈ నలుగురూ విమానాల మీద తిరిగినట్టు తెలుస్తుంది.విరోచనుడు అమెరికాకి రెండు సార్లు వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు.మొదట తను ఒక్కడే వెళ్ళి కొంత కాలం ఉండి వెనక్కి వచ్చాడు.తర్వాత మహాబలినీ వామన వటువునీ తీసుకుని వాళ్ళని అక్కడ దింపి తను వెనక్కి వచ్చాడు.విరోచనుడు మహాబలితో కలిసి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అతిరాత్రం అనే యజ్ఞం చేసినట్టు తెలుస్తున్నది.అంకోర్ వాట్ దగ్గిర ఉన్న ఆది వరాహ స్వామి ఆలయాన్ని కాలనేమి మొదలుపెడితే స్వర్భాను పూర్తి చేశాడు.స్ఫింక్స్ పిరమిడ్ మీద ఉన్నముఖం స్వర్భానుదే.సింహం ఆకారం అతని జన్మరాశిని సూచిస్తుంది.ఇప్పటి ఈజిప్టులోనూ సూడానులోనూ కనబడుతున్న పిరమిడ్లను నిర్మించినది సైతం స్వర్భానుయే.ఇప్పటి లెబనాను లోని బాల్బెక్ ఆలయాన్ని సైతం నిర్మించినది స్వర్భానుయే.

అవి కీలకమైన స్థానాలు కాబట్టి చక్రవర్తులు అక్కడ విడిది చేసి తమకు సమీపాన ఉన్న మిగిలిన నిర్మాణాలను కూడా పరస్పరం సంప్రదింపులు చేసుకుంటూ శరవేగాన అన్ని నిర్మాణాలనూ ఒకేసారి నిర్మించడం వల్లనే ఉల్కాపాతం వల్ల భూమికి సంభవించబోతున్న ఆపద తప్పిపోయింది.అలా నలుగురు భారతీయ చక్రవర్తులు ఇతర దేశాల వారికి ఇప్పటికీ మిస్టరీ అనిపించే హిస్టరీని వంద సెంచురీల క్రితమే సృష్టించి జీవజాతులకు క్షేమాన్నీ భద్రతనీ ప్రసాదించారు.

ప్రస్తుతం మనం పెట్టుకున్న లక్ష్యం పూర్తైపోయింది - 10,000 BCEల నాడు అంకోర్ ధాం మొదలు గిజా పిరమిడ్ల వరకు గల సమస్తమైన అద్భుతాలను సృష్టించినది కేరళను స్వస్థానం చేసుకున్న ప్రపంచాధినేత మహాబలియే అని చెప్పటానికి ఉన్న తిరుగు లేని ఆధారాలను సేకరించామని నదురూ బెదురూ లేక "నినద భీషణ శంఖము దేవదత్తమే!" అన్న రీతిన దిక్కులు పిక్కటిల్లేలా గర్జించి చెప్పడమే ఇక మిగిలింది. అయితే, పానకంలో పుడకలా రామాయణంలో పిడకల వేటలా భగవద్గీతలో అప్రస్తుత ప్రసంగంలా "మరి, విమానాల గురించి హేటువాదులు నిలదీసినప్పుడు ఏం చెప్పాలి?అది కూడా నువ్వే చెప్పేద్దూ!" అని కొందరు అడగాలనుకుని కూడా సుత్తేస్తానేమోనని భయపడి అడగలేక మొహమాట పడుతున్నారని కర్ణపిశాచి అరిచేస్తోంది.అప్పటి వాళ్ళు విమాన యానం చేశారనేది నిజం.

భరద్వాజ ఋషి రచించిన యంత్ర సర్వస్వం ఇప్ప్పటికీ లభ్యం అవుతున్నది.1959లో "బృహత్ విమాన శాస్త్రం" పేరున హిందీ తాత్పర్యంతో ప్రచురణ జరిగింది.తర్వాత్ శ్రీ G.R.Josyar గారు అదే గ్రంధాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించారు.ఈ రెండూ భరద్వాజ ఋషి రచించిన "యంత్ర సర్వస్వం" నుంచి విమానాలకు సంబంధించిన భాగాలను మాత్రమే సంకలించిన అనువాద గ్రంధాలు. సమరాంగణ సూత్రధారం అనే మరొక గ్రంధం కూడా విమానాలను గురించి ప్రస్తావిస్తుంది.ఋగ్వేదంలోనూ విమానం గురించి వివరిస్తున్న మంత్రాలు ఉన్నాయి.”ఋగ్వేదం క్రీ.పూ 4500 నాటిదే కదా, మరి 10,000 BCEల నాటి వాళ్ళకి విమానం గురించి ఎలా తెలిసిందీ?" అని హేతువాదులూ హిందూమతద్వేషులూ సన్నాయి నొక్కులు నొక్కితే మొహం వేళ్ళాడేసుకుని వెనక్కి రావొద్దు - అస్సలు తగ్గొద్దు. వేదం ఎలా పుట్టింది అని ఇతమిత్ధం చెప్పలేనట్లే ఎప్పుడు పుట్టింది అనేది కూడా తేల్చి చెప్పడం కష్టం, కష్టమే కాదు నిలదీసి అడిగితే అసంభవం అని కూడా చెప్పవచ్చు!హేతువాదులైన శ్డాస్త్రజ్ఞులు కొందరు ఋగ్వేదంలో కొన్ని చోట్ల వర్ణించబడిన గ్రహతారకల స్థితిగతులను పరిశీలించి సుమారు 7000 BCE నుంచి 6000 BCE మధ్యన ఆయా సూక్తాలు చెప్పబడినట్లు నిర్ధారించారు.కానీ ఇలా నిర్ధారించెయ్యడంలో ఒక చిక్కు ఉంది.ఆ గ్రహతారకల అమరిక కొన్ని వేల సంవత్సరాల కొకసారి పునరావృతమవుతూ ఉంటుంది కాబట్టి ఆయా సూక్తాలు ఆ పునరావృతమయ్యే సంవత్సరాలలో ఎప్పుడైనా చెప్పబడి ఉండవచ్చు.

University of Edinburgh అనే ప్రపంచ స్థాయి ప్రఖ్యాతి ఉన్న విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సంస్కృత భాషలో అపారమైన పాండిత్యం గల Prof. Keith వేదాల వయస్సును నిర్ధారించడానికి ఎంతో పరిశ్రమ చేసి "The determination of the age of the Samhitas will mostly remain a mere guess work!" అని తేల్చి చెప్పారు.మిగిలినవాళ్ళు చేసిన నిర్ధారణలనీ తన పరిశ్రమనీ కలిపి చూసుకుని విసుగెత్తి ఆయన ఆ మాట అన్నాడో లేక ఈయన ఇంత మాట అనేశాక కూడా వేదసాహిత్యాన్ని ఏదో ఒక కాలానికి కుదించుదామనే చిరాశతో చేశారో తెలియదు గానీ మిగిలినవాళ్ళు చేసిన నిర్ధారణలు ఇలా ఉన్నాయి:Maxmuller వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1200BCE నుంచి 1500BCE మధ్యన అని నిర్ధారించాడు.Prof. Keith మరియు McDonald వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1200BCE నుంచి 2000BCE మధ్యన అని నిర్ధారించారు.Whitney మరియు ఇతర్లు వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2000BCE వెనక అని నిర్ధారించారు.Winternitz వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2000BCE నుంచి 2500BCE మధ్యన అని నిర్ధారించాడు.Jacobi వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 3000BCE నుంచి 4000BCE మధ్యన అని నిర్ధారించాడు.Satyavrata Samashrami వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5000BCE వెనక అని నిర్ధారించాడు.Balagangadhara Tilak వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 6000BCE నుంచి 10000BCE మధ్యన అని నిర్ధారించాడు.Sampoornananda వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 18000BCE నుంచి 30000BCE మధ్యన అని నిర్ధారించాడు.Pt.Krishna Sastri Godbol వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 18000BCE వెనక అని నిర్ధారించాడు.Avinash Chandra Das Mukhopadhyaya వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 25000BCE నుంచి 50000BCE మధ్యన అని నిర్ధారించాడు.Lele Shastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 40000BCE నుంచి 54000BCE మధ్యన అని నిర్ధారించాడు.Rajpur Patangar Sastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 21000BCE అని నిర్ధారించాడు.Pavaki వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2,40,000BCE వెనక అని నిర్ధారించాడు.Pt.Dinanath Sastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 3,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Dr.Jvala Prasad వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Nobel Laureate Materlink వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 70,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Maahrshi Dayananda వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 200,00,00,000BCE వెనక అని నిర్ధారించాడు.భారతదేశం బయట ఉండి వేదం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారికీ భారతదేశం లోపల ఉండి వేదం గురించి తెలియని వారికీ తొలిసారి వేదాలను పరిచయం చేసిన మ్యాక్స్ ముల్లరు స్వయంగా వేదం యొక్క వయస్సు నిర్ధారించడం అసాధ్యం అని చెప్పి ఉన్నాడు కాబట్టి వేదం యొక్క ప్రాచీనతను నిర్ధారించడం అసంభవం.

వేదం అనే పదానికి మూల ధాతు రూపం "విద్" - దీనికి సమానార్ధకమైన ఆంగ్ల పదం "to know".అంటే,మానవుడు తెలుసుకోగలిగిన, తెలుసుకోవలసిన, తెలుసుకోదగిన జ్ఞానం అని అర్ధం!వేదం ఒక మతగ్రంధం కానే కాదు, సార్వకాలిక సత్యాల సమాహారమైన విజ్ఞానసర్వస్వం.వైదిక సాహిత్యంలో 18 విద్యాస్థానములు ఉన్నాయి.విద్యాస్థానం అంటే Branch of Study అని అర్ధం.వేదములు నాలుగు - 01.ఋగ్వేదం,02.శుక్ల,కృష్ణ యజుర్వేదాలు,03.సామవేదం,04.అధర్వ వేదం. ఇక వేదాంగములు ఆరు - 05.శిక్ష,అంటే Phonetics,06.కల్పం,అంటే Study of Rituals,07.వ్యాకరణం,అంటే Grammer,08.నిరుక్తం,అంటే Etymology,09.ఛందం,అంటే Prosody,10.జ్యోతిషం,అంటే Astronomy. ఇవి కాక ఉపాంగములు నాలుగు - 11.మీమాంస, 12.న్యాయశాస్త్రం, 13.పురాణములు, 14.ధర్మశాస్త్రము. ఉపవేదములు అనేకం ఉన్నాయి, కానీ ముఖ్యమైనవి తీసుకుంటే - 15.ఆయుర్వేదం,అంటే Medical Science:ఇది ఋగ్వేదం నుంచి పెరిగిన శాస్త్రం,16.అర్ధశాస్త్రం,అంటే Economic Science:ఇది అధర్వవేదం నుంచి పెరిగిన శాస్త్రం,17.ధనుర్వేదం,అంటే Military Science:ఇది యజుర్వేదం నుంచి పెరిగిన శాస్త్రం,18.గాంధర్వవేదం,అంటే Musical Science:ఇది సామవేదం నుంచి పెరిగిన శాస్త్రం.

వీటిలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం అనే వాటిని శృతి అంటే Revealed లేక Perceived అనీ మిగిలినవాటిని స్మృతి అంటే Memorizes లేక Created అనీ అంటారు.ఋగ్వేదం అనేది ఒక Collection of Prayers లాంటిది.యజుర్వేదం అంటే యజ్ఞాలకు సంబంధించిన Sacrificial Manual వలె ఉంటుంది.సామవేదం అనేది Rigvedic hymns in musical form అనేటట్లు ఉంటుంది.ఇక అధర్వవేదంలో మానవుల దైనందిన జీవితానికి ఉపయుక్తమైన Magical Charms ఉంటాయి.ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉపవిభాగాల కింద ఏర్పరచబడి ఉంది:1).మంత్రసంహిత->ప్రధానమైన భాగం.ఋగ్వేదంలోని మంత్రాలను మాత్రం ఋక్కులు అంటారు.మిగిలినవాటిని మంత్రాలు అంటారు - వీటిని అందరూ అధ్యయనం చెయ్యవచ్చు. ప్రస్తుతం మన తెలుగువాళ్ళకి సంస్కృతం కన్న తెలుగు కన్న ఇంగ్లీషు ఎక్కువ అర్ధం అవుతుంది గనక ఇంగ్లీషులో “A compilation of all realized hymns: This section should be the best focus for who is in Brahmacharya-ashrama, that is during the stage of education” అని చెప్తున్నాను. 2).బ్రాహ్మణములు->సంహితలలోని విషయానికి వ్యాఖ్యానములతోనూ కర్మకాండలకు సంబంధించిన వివరాలతోనూ కూడుకున్న వచనభాగం.ఇంగ్లీషులో “Explanations of how to put them to practical use: This section should be the best focus for who is in Grihastha-ashrama, that is during the stage of householder” అని చెప్తున్నాను.వీటిని సంహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఆసక్తి గలవారికి బోధిస్తారు.3).అరణ్యకములు->ప్రతి వేదమంత్రానికీ సామాన్య అర్ధం,సాంకేతిక విశేషం,ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి గనుక వాటిమధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం.ఇంగ్లీషులో “Various internal observations to follow: This section should be the best focus for who is in Vaanaprastha-ashrama, that is during the stage of renounceation” అని చెప్తున్నాను.నాగరికులకూ లౌకికులకూ ఇవి అనవసరం గనక ఆచార్యత్వాన్ని  ఇష్టపడినవారికి బోధిస్తారు.4).ఉపనిషత్తులు-> ఇంగ్లీషులో “Footnotes which capture the essence of the entire veda: This section should be the best focus for who is in Sanyaasa-ashrama, that is during the final stage of before seeking/attaining moksha” అని చెప్తున్నాను నేను.

నాలుగు వేల సంవత్సరాల వెనకటిదిగా చెబుతున్న అగస్త్య సంహిత అనే వైదిక విజ్ఞాన గ్రంధంలో విద్యుచ్చక్తిని ఉపయోగించి యంత్రాలను నడిపే విధానం ఉన్నది.ప్రస్తుతం వోల్టా తయారు చేసిన బ్యాటరీ వర్ణనని మర్చిపోయి అగస్త్య సంహితను అనుసరించి మట్టి పాత్రలతో ఘటమాలను ఏర్పరచి విద్యుద్దీపాలను వెలిగించగలిగారు, యంత్రాలను నడిపించ గలుగుతున్నారు!కాబట్టి మహాబలి కాలం నాడు వారు విమానాలలో ప్రయాణించారనేది కల్పన గాక సంభవం అయ్యే అవకాశం ఉంది. అలా కాక పోతే అంత తక్కువ సమయంలో అంత ఎక్కువ దూరం ప్రయాణించి అంత పెద్ద నిర్మాణాలను పెట్టుకున్న కాలావధి లోపల పూర్తి చెయ్యడం ఎట్లా సాధ్యం? ఇక్కడ అభవం అనేది ప్రమాణం అవుతుంది.

"గత శతాబ్దంలోనే ఈఫిల్ టవర్ అనీ బుర్జ్ ఖలీఫా అనీ పోటీలు పడి కడుతున్నారే!అలాంటిది 900 సవత్సరాల వెనకనే ఇంత అద్భుతాన్ని సాధించిన అప్పటి కంబోడియన్లు ఇలాంటి మరొక కట్టడాన్ని నిర్మించడానికి ఆసక్తిని చూపించకపోవటం ఎంత విచిత్రం?" అని మనం వాళ్ళని పొడిచిన పోటుని తిరగేసి వాళ్ళు మనని "గత శతాబ్దంలోనే ఈఫిల్ టవర్ అనీ బుర్జ్ ఖలీఫా అనీ పోటీలు పడి కడుతున్నారే!అలాంటిది 12000 సవత్సరాల వెనకనే ఇంత అద్భుతాన్ని సాధించిన అప్పటి భారతీయులు లేక హిందువులు ఇలాంటి మరొక కట్టడాన్ని నిర్మించడానికి ఆసక్తిని చూపించకపోవటం ఎంత విచిత్రం?" అని పొడిచితే భారత దేశంలోని ప్రతి ప్రాచీన ఆలయంలోనూ కనబడుతున్న ఖగోళ గణిత శాస్త్రపు నియమాలను ఇముడ్చుకున్న వింతలు తిరుగులేని సాక్ష్యం ఇస్తాయి.కానీ విమానాల సంగతి ఏంటి?

అప్పటి విమానాల వర్ణనలను పరిశీలించి చూస్తే ఇప్పటి ప్రాధమికమైన రైట్ సోదరుల నమూనా అసలు కనపడటం లేదు.పైన అప్పటి త్రిపుర అనే ప్రాధమికమైన విమానం ఇప్పటి అధునాతనమైన డ్రోన్ విమానాన్ని పోలి ఉంది.అప్పటి వాళ్ళు పాదరసాన్ని ఇంధనం కింద వాడటం ఇప్పటి వాళ్ళకి మతులు పోగొట్టేస్తున్నది.పెట్రోలు కన్న పాదరసం ఎన్నో రెట్లు శక్తిని విడుదల చేస్తూ కాలుష్యరహితమై ఉండటం వైదిక జీవన విధానంలోని అతి ముఖ్యమైన క్షయం లేని వృద్ధి అనే లక్షణాన్ని  కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నది.అయితే, పాదరసం అరుదైన లోహం, ఎక్కువ స్థాయిలో దొరకదు.అందువల్ల ఎక్కువ సంఖ్యలో విమానాలను తయారు చెయ్యడం కుదరదు.అదీ గాక అవసరం అయినప్పుడు లేని సౌకర్యాల్ని సృష్టించుకుని వస్తువులకు యజమానులై అనుభవించడమే తప్ప లేని అవసరాన్ని సృష్టించుకుని క్షయాన్ని కల్గించే వస్తువులకు బానిసలై అఘోరించడం వారి లక్ష్యం కాదు.

వస్తువులను తయారు చెయ్యటం తప్పు కాదు.వస్తువులను అమ్మి సొమ్ము చేసుకోవటమూ తప్పు కాదు.వేదం పునాదుల మీద అన్ని శాస్త్రాలు పెరిగింది కూడా ఇతరులకు అవసరమైన వస్తువులను తయారు చేసి అమ్మి ధనం సంపాదించి సుఖభోగాలను అనుభవించడం కోసమే!అయితే, అది ధర్మబద్ధం అయినప్పుడే వస్తువుల నుంచి నిజమైన ఆనందం వస్తుందనీ అబద్ధాలను నమ్మితే వస్తువుల మీద వ్యామోహం పెరిగి కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక పోయినట్టు ఆనందానికి బదులు విచారం వస్తుందని తెలిసిన వేదం అబద్ధాన్నీ మోసాన్నీ వ్యతిరేకించింది.

అప్పుడు మహాబలి ప్రపంచాధినేత కావడానికీ వామన వటువు అంత కష్టమైన పనికి మహాబలినే ఎంచుకోవడానికీ అప్పగించిన పనిని మహాబలి పూర్తి చెయ్యడానికీ మహాబలి ఆస్థానంలోని వేద పండితులకు గల వైదిక శాస్త్ర పరిజ్ఞానం అత్యున్నత స్థాయిలో ఉండటమే కారణం అనేది నిజం.ఇప్పుడు హిందువులకు తమ స్వస్థానంలోని పరాధీనతకు స్వంత వైదిక ధర్మానికి దూరమై మోసకారులు చెప్పిన అబద్ధాలను నమ్మడమే కారణం అనేది కూడా నిజం.

ఆంధ్ర ప్రాంతపు హిందువుల దుస్థితినే చూడండి, నిజానికి 151/175 సీట్లు తెచ్చుకోగలిగిన స్థాయిలో ప్రజలకు నమ్మకం కలిగించడానికి ఇప్పటి ముఖ్యమంత్రి గారు వూడబొడిచిన ఘనకార్యం ఒక్కటి కూడా లేదు. నిన్నటి ముఖ్యమంత్రి గారి అభిమానులు మొదట ఈవీయం ట్యాంపరింగు పేరున మోదీ మీద పడి యేడ్చి అమరావతి నుంచి సైతం ఇప్పటి ముఖ్యమంత్రి గారికి పడిన వోట్లని చూసి నాలిక్కరుచుకుని రూటు మార్చి ప్రజల అమాయకత్వం గురించీ వోటర్లు పేరురూఢికాని పార్టీవారు చెప్పిన అబద్ధాలను నమ్మడం గురించీ మాట్లాడుతున్నారు - పాపం!అది నిజమే, రోడ్డున పడ్డ అమరావతి రైతులు ఇప్పటి ముఖ్యమంత్రి గారికి ఎందుకు వోటు వేశారు?పాపం, నిన్నటి ముఖ్యమంత్రి గారు వీళ్ళకి నెలనెలా కౌలు వచ్చేలా ఏర్పాటు చేసిన దిట్టమైన చట్టానికి తూట్లు పొడవటం ఇప్పటి ముఖ్యమంత్రి గారికి సాధ్యం కాదని నమ్మేసి నవరత్నాలు కూడా తీసుకుంటే ఇక తమ ఇళ్ళలో కనకవర్షం కురిసినట్టే అనుకున్నారు.ఇప్పుడు ఆత్మానుభవం అయ్యాక వాళ్ళకి తత్వం బోధపడినట్టే ఉంది.బహుశః మిగిలిన వాళ్ళకి కూడా ఆత్మానుభవం అయితే గానీ తత్వం బోధపడదు కాబోలు!

హిందువులు వేదం చెప్పిన సత్యం పునాదుల మీద తమ రాజకీయార్ధికాధ్యాత్మిక రంగాలను నిలబెట్టుకుని నిండుకుండలా బతికితే చాలు సృష్టికర్తయే తమకు వశంవర్తియై ప్రపంచాధిపత్యం సాధించగలరనేది వ్యాస పరాశరాది చతుర్యుగ పర్యంతం ఉన్న ఆచార్య పరంపర పాదముల మీద ప్రమాణం చేసి రాగద్వేషాలు లేని నిండుమనస్సు గల నేను చెప్తున్న కఠిన సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...