క్రైస్తవం పునాదులు ఎంత బలహీనమైనవో చూపించడానికి Genesis పేరున వాళ్ళ పవిత్ర గ్రంధం చెప్తున్న ఏడురోజుల సృష్టి రచన గురించి చదివితే చాలు!
*****
(దృశ్యం:ఒక మధ్య తరగతి క్రైస్తవుల ఇల్లు. తండ్రి హాల్లో కూర్చుని పేపరు చదువుకుంటున్నాడు. తల్లి లోపల వంట చేస్తున్నది.వాళ్ళ తొమ్మిదేళ్ళ కొడుకు లోపలినుండి బయటకొచ్చి తండ్రి వైపుకు వస్తున్నాడు.)
తండ్రి:ఏరా!ఇవాళ్టి ఆదివారం బైబిలు క్లాసులు ఎట్లా ఉన్నాయి?
కొడుకు:కూల్!
అతండ్రి:కూల్?లాస్ట్ వీక్ వరకు అదివారం క్లాసులంటేనే చిరాకు పడేవాడివి - అప్పుడే అంత నచ్చేశాయా?
కొడుకు:అబ్బ!కొత్తగా ఏసీ పెట్టారు.దాని గురించి అలా అన్నాను,క్లాసులు మాత్రం బోరే!
తండ్రి:ఓహో,అదా సంగతి!నేనింకా మావోడు మరోడిలా కనిపిస్తున్నాడేంట్రా అని కంగారు పడ్డాను, పోన్లే!
కొడుకు:నాన్నా, నాకో డౌటుంది - అడగనా?
తండ్రి:మీ అమ్మ నడగరాదు!
కొడుకు:అడిగాను, మిమల్ని అడగమంది.
తండ్రి:(ఈ రోజుకి నా మనశ్శాంతి పరార్!)సరే, ఏమిటి నీ డౌటు?
కొడుకు:ఇవ్వాళ స్కూల్లో ఏడురోజులసృష్టి గురించి చెప్పారు, అందులో....
తండ్రి:ఇవాళ నీకు జెనెసిస్ గురించి తెలిసిందన్నమాట, మంచిదే!
కొడుకు:ఫిల్ కాలిన్స్ 1996లో బ్యాండ్గ్రూప్ వొదిలి సోలోసింగర్ అయ్యాడు.
అతండ్రి:???దానికీ జెనెసిస్ పాఠానికీ సంబంధం ఏంటి?దాని సంగతి వొదిలేసి నువ్వు నన్ను అడగాలనుకున్న డౌటు ఏంటి???
కొడుకు:మా టీచరు సృష్టి మొత్తం ఆరు రోజుల్లో జరిగిందన్నారు.
తండ్రి:అవును,నిజమే గద!
కొడుకు:మా టీచరు చెప్పింది ఇది:"And God said,'Let there be light',
and there was light.And God sawthe light,that it was good,and God divided the
light from the darkness.And God caled the light Day, and the darkness, He
called Night.And the evening and the morning together were caled the first
day."
తండ్రి:వార్నీ!ఇదంతా భలే గుర్తుంచుకున్నావురా, నేను కూడా ఇంత ఇదిగా గుర్తుంచుకోలేదు.
కొడుకు:అవును,అమ్మ చెప్పింది!నువు మంచి క్రైస్తవుడివి కాదట.
తండ్రి:అమ్మ అలా చెప్పిందా నీకు?ఒహ్హో!!సరె,దాని సంగతి వొదిలెయ్ - నీ డౌటు ఏంటో చెప్పు.
కొడుకు:టీచరు సూర్యుడు నాల్గోరోజున సృష్టించబడ్డాడని చెప్తున్నారు.అందుకే అర్ధం కాలేదు.
తండ్రి:టీచరు అట్లా చెప్పి ఉంటే అది అట్లాగే జరిగి ఉంటుంది.ఇందులో నీకేంటి ప్రాబ్లెం?
కొడుకు:కానీ రాత్రీ పగలూ మొదటిరోజునా,మొక్కలూ జంతువులూ మూడోరోజునా పుట్టాయంటున్నారు - అదెలా కుదురుతుంది?
తండ్రి:మీ టీచరు నిజంగా అలానే చెప్పారా?
కొడుకు:అవును!
తండ్రి:అయితే, అది నిజమే అయి ఉంటుంది.
కొడుకు:అదేంటి నాన్నా?రాత్రీ పగలూ మొదటిరోజున పుట్టి మొక్కలు మూడోరోజున పుట్టి సూర్యుడు నాల్గోరోజున పుట్టటం కుదరదే!
తండ్రి:నీ పాయింటు నాకు అర్ధం కావటం లేదు, కొంచెం అర్ధమయ్యేటట్టు చెప్పు.
కొడుకు:పగలు రావాలంటే సూర్యుడు ఉండాలి.అది లేనప్పుడు ఉండేది రాత్రే కదా.మొక్కలు పెరగాలంటే సూర్యుడు కావాలి. సూర్యకాంతి లేకుండా అవి ఆహారం తయారుచేసుకోలేవు కదా;కాని సూర్యుడు నాల్గోరోజున పుట్టాడు.
తండి:నాకు తెలీదురా!దేవుడు తల్చుకుంటే ఏదైనా చెయ్యగలడని అనుకుంటే సరిపోతుంది కద!
కొడుకు:కాంతి మొదటిరోజునే పుట్టి సూర్యుడు నాల్గోరోజున పుడితే ఆ కాంతి యెక్కడనుంచి వచ్చింది?
తండ్రి:నిజంగా నాకు తెలీదు,అసలు ఈ డౌటే ఎప్పుడూ రాలేదురా!కాని, బైబిలు అట్లా చెప్పింది గాబట్టి అట్లాగే జరిగి ఉండాలి.
కొడుకు:బైబిలు ఎప్పుడు ఎవరు రాశారు?
తండి:నాకు తెలీదురా బాబూ, నన్నొదిలెయ్!ఎవరో ఒకాయన 6000 సంవత్సరాల క్రితం ఏమి జరిగిందో రాసి ఉంచాడు, అంతే!
కొడుకు:కాని పేపరు చైనాలో 2000 సంవత్సరాల క్రితమే కదా కనిపెట్టింది!6000 సంవత్సరాల క్రితం బైబిలు రాయడం ఎట్లా సాధ్యం?
తండ్రి:నేను 6000 సంవత్సరాల క్రితం రాశారని చెప్పలేదు.అప్పుడు జరిగినదాన్ని తర్వాతెప్పుడో గ్రంధస్థం చేసి ఉంటారన్నాను.
కొడుకు:బహుశా,నోవాగారు పెద్దనావనుంచి బైటపడ్డాకనా?
తండ్రి:అవును,నోవాగారు పెద్దనావనుంచి బైటపడ్డాకనే!
కొడుకు:కానీ ఆ వరదలో అంతకు ముందువాళ్ళు అందరూ చచ్చిపోయారు. నోవా గారూ ఆయన కుటుంబమే బతికి ఉంది - అంటే, ఈ కధ నోవానుంచి వచ్చిందా?
తండ్రి:అవును,ఈ కధలన్నీ నోవానుంచి వచ్చాయి.
కొడుకు:ఇవన్నీ నోవా గారికెలా తెలిశాయి?
తండ్రి:బహుశా దేవుడు చెప్పి ఉంటాడు.
కొడుకు:ఈ కధలన్నీ నోవాగారు రాశారంటావు.
తండ్రి:అవును, ఇది అర్ధం చేసుకోవడానికి పెద్ద తెలివితేటలు అఖ్ఖర్లేదు.అప్పుడు బతికి ఉన్నది ఆయనొక్కడే కదా!
కొడుకు:అంటే,4000 సంవత్సరాల క్రితమా?
తండ్రి: అవును,4000 సంవత్సరాల క్రితమే!
కొడుకు:కాని వాళ్ళకి అప్పుడు పేపరు ఎక్కడిది?
తండ్రి:అవును,నాకు తెలుసు,నువ్వు చెప్పావుగా పేపరుని 2000 ఏళ్ళ క్రితమే కనుక్కున్నారని.
కొడుకు:మరి డైనోసార్ల సంగతేంటి?
తండ్రి:ఇక్కడ డైనోసార్ల సంగతి దేనికి?
కొడుకు:అయ్యో, నాన్నా! డైనోసార్లు 65 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమ్మీద తిరిగాయంటున్నారు.కాని సృష్టి మాత్రం 6000 సంవత్సరాల క్రితమే జరిగిందంటున్నారు, ఎట్లా?
తండ్రి:చూడు,అలా బైటికెళ్ళి ఆడుకోరాదు?లేదంటే, షాపుకెళ్ళి ఏదైనా కొనుక్కోకూడదూ!
కొడుకు:ధాంక్స్ నాన్నా! అమ్మ నడిగితే వద్దంది.
తండ్రి:సరే, అమ్మకి నేను చెప్తానులే - నువ్వు వెళ్ళు!
కొడుకు:ధాంక్స్ నాన్నా - బై!!
(కొడుకు ప్రకటముగ నొక దరహాసము చేసి స్వగతమున "నీ జుట్టు ఇప్పటికి దొరికింది నాకు.ఇక అయిపోయావులే!నాకు అవసరం పడినప్పుడు నిన్ను బైబిలు గురించి కొశ్చెన్స్ అడిగితే చాలు,పని అయిపోతుంది."
అని తలంచి వికటముగ నొక అట్టహాసము చేసినాడు.)
*****
ఇదండి - జుదాయిజం,క్రైస్తవం,ఇస్లాం కొన్ని చిన్న చిన్న మార్పులతో తమ మతగ్రంధాల్లో
సృష్టి ఎలా జరిగిందనే దాన్ని గురించి కొన్ని సహస్రాబ్దాల తరబడి చెప్పుకొస్తున్న విషయాల గురించి ఈనాటి కాలపు ఒక తొమ్మిదేళ్ళ కుర్రాడి దృష్టి, అంచనా, తీర్పు!
చిన్న కుర్రాడు, వాడికేం తెలుసులే అని మనం సమర్ధించుదామని అనుకుంటే మనకు పిచ్చెత్తడం
ఖాయం!అక్కడ ఆరు రోజులు అంటున్నవి మనం చూస్తున్న ఆరు రోజులు కాకపోవచ్చు
- దేవుడి రోజులు కావచ్చు కదా అని ప్రతిపాదించుదామంటే పరిస్థితి మరీ మయోఅయం అవుతుంది!ఎందుకంటే, సైంటిస్టులు హిమయుగం 2.4 మిలియన్ సంవత్సరాల క్రితం - అంటే, మనిషి పుట్టిన 1 మిలియన్ సంవత్సరాల తర్వాత మొదలై కేవలం 11,000 సంవత్సరాల క్రితమే భూగోళం కొంచెం వేడెక్కడం మొదలైన తర్వాత అంతమైపోయిందని అంటున్నారు.ఇవి కూడా ఖచ్చితమైన లెక్కలు కావనుకోండి, కానీ ప్రస్తుతానికి ఓకే!
ఇప్పుడు మనం దేవుడి ఒక రోజును 500 మిలియన్ సంవత్సరాలు లేక 1 బిలియన్ సంవత్సరాలు అనుకుంటే దేవుడి రోజులన్నీ ఒకే ప్రమాణంలో ఉండకుండా గందరగోళం మరింత పెరుగుతుంది.దేవుడి ఒక రోజు 500 మిలియన్ సంవత్సరాలు అనుకుంటే భూమి వయస్సు 45 బిలియన్ సంవత్సరాల లెక్కకి సరిపోతుంది.కానీ, మనిషి పుట్టిన 3.3 మిలియన్ సంవత్సరాల లెక్కకి పెద్ద బొక్క పడుతుంది!
ఒకవేళ దేవుడి రోజులు మన రోజుల మాదిరి సమానమై ఉండనక్కరలేదని అనుకుంటే, జెనెసిస్ వర్ణించిన పగలు, రాత్రి, అనేవాటికీ ఇప్పుడు మనం చూస్తున్న రాత్రి,పగలు అనేవాటికీ సంబంధం లేకుండా పోతుంది."ఇదంతా ఎలా మొదలైంది?" అన్నదాని గురించి చెప్తున్నదే ఉత్త గ్యాసు అని తేలిపోతే తర్వాత జరిగిన వాటి గురించి వాళ్ళు చెప్పేది కూడా చెత్త అని తేలిపోతుంది, అవునా కాదా?
“అబ్బే!బైబిలు
సంక్లిష్టం అయితే కావచ్చు గానీ అందులో తప్పులు లేవు అని గొప్ప గొప్ప మేధావులు పొగుడుతున్న
అద్భుత గ్రంధం.ఇది కేవలం పరమతద్వేషం నిండిన హరిబాబు అనే హిందూమతోన్మాది యొక్క వెక్కిరింత” అని మీకు అనిపిస్తే "In 1967, the New York Bible Society (now Biblica)
generously undertook the financial sponsorship of creating a contemporary
English translation of the Bible. The NIV Bible was produced by more than one
hundred scholars working from the best available Hebrew, Aramaic, and Greek
texts.The NIV Bible was first published in 1973, with revisions published in
1978 and 1983.You can browse the NIV Bible verses by using the chapters listed
below, or use our free Bible search feature at the top of this page.Special
thanks to Zondervan and Biblica for permission to use the NIV, TNIV and the
NIrV" అని
చెప్పుకుంటున్న అధికారికమైన బైబులు గ్రంధం నుంచే మొదట అక్కడి వచనాన్ని చూపించి అతి తక్కువ విశ్లేషణ చేస్తాను.
నిజానికి ఇప్పుడు ప్రపంచం మొత్తం అనుసరిస్తున్న మతస్వేచ్చ నియమాల ప్రకారం ఒక మతగ్రంధాన్ని ఇతర
మతస్థులు తులనాత్మక విశ్లేషణ చెయ్యడం తప్పు కాదు.అయితే, అక్కడ లేని విషయాన్ని ఉన్నట్టు చెప్పడం, ఉన్న విషయాన్ని వక్రీకరించి చెప్పడం, మూలగ్రంధంలోని ఒక విషయానికి సంబంధించి కొంత
చెప్పి కొంత దాచి విమర్శించడం వంటివి మాత్రమే శిక్షార్హమైన నేరాలు అవుతాయి.ఇక్కడ విశేషం ఏమిటంటే క్రైస్తవులు హిందూ మత గ్రంధాల పట్ల ఇటువంటి తప్పుల్ని ఐఛ్చికమైన స్వైరవిహారం వలె చేస్తుంటే హిందువునైన నేను వ్యాసపరాశరాది చతుర్యుగ పర్యంతం ఉన్న ఆచార్య పరంపర
అందించిన సంస్కారం వల్ల బైబిలు పట్ల "అక్కడ లేని విషయాన్ని ఉన్నట్టు చెప్పడం,
ఉన్న విషయాన్ని వక్రీకరించి చెప్పడం, మూలగ్రంధంలోని ఒక విషయానికి సంబంధించి కొంత చెప్పి
కొంత దాచి విమర్శించడం" వంటి దుర్మార్గపు పనుల్ని చెయ్యడం లేదు.
నేను
సొంత విశ్లేషణ తక్కువ చేస్తాననడానికి ఇంకొక కారణం ఏమిటంటే, విశ్లేషణ ఎక్కువైతే కొందరు వితండవాదులు దాన్ని పులుముడు కింద కొట్టి పారేసే అవకాశం ఉంది కాబట్టి ఇటువైపునుంచి జాగ్రత్త తీసుకుంటున్నాను. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని చూపిస్తున్న లోపాల్ని ఒపుకోగలిగిన ఔన్నత్యం అటువైపు ఉందనే గ్యారెంటీ మాత్రం లేదు.అయినప్పటికీ ఎందుకు బైబిలు లోపాల్ని ఎత్తి చూపిస్తున్నాను?
ప్రస్తుతం ఇటు హిందువుల్లోనూ అటు క్రైస్తవుల్లోనూ మతనిష్ఠకి సంబంధించి మూడు రకాల ధోరణులూ ఆయా ధోరణులకి ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు రకాల వ్యక్తులూ ఉన్నారు.
1).తెలివైన మత ప్రచారకులు:అటు క్రైస్తవుల్లోనూ ఇటు హిందువుల్లోనూ ఈ వర్గానికి చెందిన వారికి తమ మతగ్రంధాల్లోని తప్పొప్పులు తెలుసు గనక తప్పుల్ని పరిహరించుకుని ఒప్పుల్ని ప్రచారం చేసుకుని మతాన్ని బలపరచడమే లక్ష్యం కాబట్టి వాళ్ళముందు మనం వాళ్ళ మతంలోని లోపాల్ని ఏకరువు పెట్టటం కేవలం కంఠశోష తప్ప ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.
2).మూర్ఖపు మతానుయాయులు:అటు క్రైస్తవుల్లోనే కాదు ఇటు హిందువుల్లోనూ ఈ వర్గానికి చెందినవారు తమ మతాన్ని పాటించడంలో తర్కానికి సంబంధించిన ప్రమేయం ఉండదు.ఇంట్లో పెద్దవాళ్ళని చూసి వాళ్ళు చేసిన దాన్ని కొనసాగించడం,చిన్నప్పుడు మలబద్ధకమో కడుపు నెప్పో వచ్చి అందరు దేవుళ్ళనీ వరసపెట్టి తల్చుకుని ఏ దేవుణ్ణి తల్చుకోగానే పోయిందో ఆ దేవుణ్ణే నమ్మడం లాంటివి చేస్తారు తప్ప తర్కం గురించి పట్టించుకోరు.ఒకసారి నమ్మడం మొదలుపెడితే సాక్షాత్తూ ఆ దేవుడే దిగొచ్చి నేను అనేవాణ్ణి లేనురా బాబూ అని చెప్పినా విననంతటి మొండితన్మ్ ఉంటుంది కాబట్టి వాళ్ళముందు కూడా మనం కొత్త లోపాల్ని బయటపెడితే కంఠశోష తప్ప ప్రయోజనం లేదు.వీళ్ళు ఇంట్లోవాళ్ళకి రోగాలు వచ్చినప్పుడో మరొక రకమైన కష్టాలు ముసిరినప్పుడో ఠపీమని వాలిపోయి "చిన్నప్పుడు మలబద్ధకమో కడుపు నెప్పో వచ్చి అందరు దేవుళ్ళనీ వరసపెట్టి తల్చుకుని ఏ దేవుణ్ణి తల్చుకోగానే పోయిందో ఆ దేవుణ్ణే నమ్మడం లాంటి" పన్లు చేసి మతం మార్చే పాస్టర్లకి లొంగుతారు గానీ సత్యాసత్యాల నిగ్గు చూపించి వాదించే వాళ్ళకి లొంగరు. ప్రస్తుతం హిందువుల్లో ఈ బ్యాచ్చిదే మెజార్టీ.అందుకే పాస్టర్లు నెలకో హిందూ గ్రామాన్ని క్రీస్తుగ్రామం కింద మార్చేసుకుంటూ పోతున్నారు.
3).తార్కిక మతావలంబులు:ఇటువంటివాళ్ళు ఏ మతంలో ఎక్కువమంది ఉంటే ఆ మతానికి అంతు లేని బలాన్నీ కీర్తినీ వైభవాన్నీ పెంచుతారు.ప్రస్తుతం అన్ని మతాలలోనూ వీళ్ళు చాలా తక్కువమంది ఉన్నారు.హిందువుల్లో అయితే దాదాపు శూన్యం అని చెప్పాలి.అప్పటివరకు తాము పాటిస్తున్న హిందూమతం గురించి తెలియకపోవటమూ తాము వెళ్ళబోతున్న క్రైస్తవ మతం గురించి కూడా తెలియకపోవటమూ మతం మారుతున్న హిందువుల్లో ఉన్న ప్రధానమైన లోపాలు కాబట్టి ఇది నేను తాము పాటించే మతంలో తర్కం కోసం పట్టుబట్టే బుద్ధిమంతులైన హిందూ సోదరులకి చేస్తున్న మాటసాయం, అంతే!
వాళ్ళ ఇంట్లోనూ చర్చిలోనూ పాస్టర్లు చెయ్యమని చెప్పిన అన్ని మతపరమైన విధుల్నీ నిర్వర్తించుకుంటూ న్యాయార్జనతో సుఖపడుతూ మన మర్యాదని కాపాడుతూ న్యాయార్జితాల కోసం మనం చేస్తున్న శ్రమని గౌరవించే మంచి క్రైస్తవుల పట్ల మనం మర్యాదగానే ఉండాలి, ఉంటున్నాం కూడా!వాళ్ళని మతం మారి హిందూమాతంలోకి రమ్మని ఒత్తిడి చేసే అవసరం, దరిద్రం కూడా మనకి లేదు.
ఎటొచ్చీ ఎంత ఎక్కువ మందిని తమ అధీనంలో ఉన్న చర్చికి అతికించుకుంటే మతం మారినవాళ్ళ న్యాయార్జితం నుంచి అంత ఎక్కువ దశమ భాగం నెలనెలా పెరుగుతుందనే లాభదృష్టితో ఉఛ్చ నీచాల్ని కూడా మర్చిపోయిన క్రైస్తవ మత ప్రచారకులు ఇకముందు మన దగ్గిరకి రావడానికి భయపడేలా చెయ్యటానికి ఇక్కడ నేను అధికారికమైన బైబిలు నుంచి ఎత్తి చూపించి విశ్లేషిస్తున్న వ్యాసపరంపర హిందువులకి ఉపయోగపడుతుంది.
మొదట బైబిలు యొక్క నిర్మితి గురించి చెప్తాను.మనం భగవద్గీతని ఎలా అర్ధం చేసుకుంటామో తెలుసు కదా!18 విడి విడి భాగాల్ని "అధ్యాయం" అని పిలుస్తూ మొత్తం 18 అద్యాయల సమాహారాన్ని "గ్రంధం" లేక "పుస్తకం" అంటాము, అవునా?కానీ, బైబిలులోని విడి విడి భాగాలనే "గ్రంధం" అని పిలిచి మొత్తం గ్రంధాల కలయికని "నిబంధన" అంటారు.లోకవ్యవహారం ప్రకారం "Genesis" అని పిలిచేది "Book of Genesis" అవుతుంది.హీబ్రూ మూలప్రతి 1:1 వచనం bereshith ("in [the] beginning") అని మొదలు కావటం వల్ల సంప్రదాయం ప్రకారం మూలప్రతి యొక్క పేరు కూడా అదే అవుతుంది.ఇందులోని మొదటి 38 అధ్యాయాలు అతి ప్రాచీన కాలపు Mesopotamian ప్రజల జీవితాన్ని గురించి చెప్తాయి.Enuma elish వంటి ఇతర ప్రాచీన కాలపు మెసపొటేమియన్ సాహితీ రూపాలలో ఇక్కడి సృష్టికాండలోని కొన్నింటికి ప్రతిధ్వనులూ కొన్ని రాజవంశాల కాలనుక్రమణిక వివరాలూ దేని నుంచి దేన్ని కాపీ కొట్టారో తెలియనట్టు కలిసిపోయి ఉంటాయి.
తర్వాత వచ్చే 39 నుంచి 50 అధ్యాయాలు Egyptian grape cultivation,the riverside
scene, Egypt as Canaan's breadbasket, Egyptian administrative procedures,
Egyptian autobiographical narratives వంటి విషయాలతో నిండిపోయి క్రైస్తవ మతంలోనూ క్రైస్తవ జనంలోనూ అవిభాజ్యమైన Egyptian influence గురించి చెప్తాయి.
మన పురాణ కావ్యాలలోనూ ఇలాంటి స్వల్ప భేదాలతో కూడిన రాజవంశాల కాలనుక్రమణిక వివరాలూ కధలూ పోలికలూ కనిపిస్తాయి గానీ అవేవీ దేవుడు స్వయాన చెప్పినవి కాదు గాబట్టి వాటిలో వైరుధ్యాలు ఉన్నప్పటికీ వాటికి చారిత్రక సంభావ్యత లేనప్పటికీ పెద్ద దోషం కాదు.కానీ Enuma elish రచనా కాలం bereshith ("in [the] beginning") రచనా కాలం కన్న ముందు అని తేలితే మాత్రం వాళ్ళ దేవుడు సృష్టికాండని Enuma elish రచయితల నుంచి కాపీ కొట్టి చెప్పినట్టు తేలిపోయి క్రైస్తవం ఒక్కదానివే కాదు యూదు, క్రైస్తవ, మహమ్మదీయ మతాల పునాదులు కదిలిపోతాయి!
"The book of Genesis is foundational to
the understanding of the rest of the Bible. Its message is rich and complex,
and listing its main elements gives a succinct outline of the Biblical message
as a whole. It is supremely a book that speaks about relationships,
highlighting those between God and his creation, between God and humankind, and
between human beings." అని పరిచయకర్తలు చెప్తున్న గొప్ప కబుర్లని ఒక్కొక్క దాన్ని తీసుకుని అవి ఎంత గొప్పవో పరిశీలిస్తాను.
అక్కడ వాళ్ళు మన దేవతల విగ్రహాల్ని మాత్రం పగలగొడుతున్నారు, ఇక్కడ నేను వాళ్ళ యహోవా ద్యాముణ్ణీ వాళ్ళ ద్యాముడు స్వయాన చెప్పిన
పవిత్ర గంధాన్నీ కలిపి పగలగొడుతున్నాను.
Genesis 1:1 In the beginning God created the heavens and the earth.
Genesis 1:2 Now the earth was formless and empty, darkness was over the
surface of the deep, and the Spirit of God was hovering over the waters.
Genesis 1:3 And God said, “Let there be light,” and there was light.
Genesis 1:4 God saw that the light was good, and he separated the light
from the darkness.
Genesis 1:5 God called the light “day,” and the darkness he called
“night.” And there was evening, and there was morning—the first day.
హమ్మయ్య!వారంలో పూర్తయిపోయిన యహోవా దేవుడి సృష్టి రచన యొక్క మొదటి రోజు గడిచింది - భూమినీ స్వర్గాన్నీ సృష్టించాడు,భూమి ఆకారం లేని(హ్హిహ్హిహ్హి.అసలు ఆకారమే లేకపోవడం ఏంటి నా బొంద!త్రికోణమూ చతురస్రమూ అని చెప్పలేనప్పటికీ ఏదో ఒకటి ఎక్కడో అక్కడ ఉండి తగలడిందీ అంటే అంకరమో సంకరమో వంకర టింకరో ఒక ఆకారం ఉండి ఛావాలి గదా.మతి లేని ద్యాముడూ సుతి లేని సృష్టీ - హ్హిహ్హిహ్హి.) ఖాళీతనంతో నిండి ఉంది,దేవుని ఆత్మ waters(హ్హిహ్హిహ్హి, గ్రామరు మిస్టేక్ కాదండి!యహోవ ద్యాముడి లాంగ్వేజి అంతే!మనం చదువుకున్న ఇంగ్లీషు ప్రకారం water అనేది uncountable noun.హీబ్రూలో ఏముందో దాన్ని ఇంగ్లీషులోకి అనువదించిన పండితులకి ఎలా అర్ధమయి చచ్చిందో నాకు తెలీదు గానీ దీన్ని తెలుగులోకి ఎలా అనువదించాలో అర్ధం అయి చావక అక్కడ ఉన్నది ఉన్నట్టు వ్రాసి చచ్చేశాను.తస్సదియ్య,క్రైస్తవంలోకి దూకక ముందు ఎంతటి మేధావులు అయినప్పటికీ క్రైస్తవం పుచ్చుకోంగానే కామన్ సెన్సు కూడా లేని వెర్రివెధవల్లా ఎందుకు తయారవుతారో ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది - హ్హిహ్హిహ్హి!) మీద తేలియాడుతున్నాట్ట,"కాంతి వచ్చు గాక!" అనంగానే ఢమీ మని వెలుగు భళ్ళున వచ్చేస్తే ద్యాముడు కొత్త కాంతిని పగలు అనీ పాత చీకట్ని రాత్రి అనీ పిలిచాట్ట,సాయంకాలమూ ఉదయమూ కూడా ఏర్పడ్డాయట!
Genesis 1:6 And God said, “Let there be a vault between the waters to
separate water from water.”
Genesis 1:7 So God made the vault and separated the water under the
vault from the water above it. And it was so.
Genesis 1:8 God called the vault “sky.” And there was evening, and there
was morning—the second day.
హమ్మయ్య!వారంలో పూర్తయిపోయిన యహోవా దేవుడి సృష్టి రచన యొక్క రెండవ రోజు గడిచింది. "water నుంచి water వేర్పడేలాగున(ఇహ్హిహ్హిహ్హీ!) waters మధ్యన ఒక vault వచ్చు గాక!" అని యహోవా ద్యాముడు అనంగానే ఢమీ మని vault వచ్చిపడింది.(ఇహ్హిహ్హిహ్హీ, ఎక్కణ్ణించి వచ్చింది అని మనం అడక్కూడదు.యహ్వెహే ద్యాముడికి లాజిక్కు తెలీదు మ్యాజిక్కు
తప్ప.లాజిక్కు అడిగితే నువ్వు బిలీవర్ ఎట్లా అవుతావు?అలాక్కాదండి,అస్సలు సిస్సలు శుంఠలు
కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి? దేవుడు చెప్పింది మినిమం
నమ్మబుల్ అనిపించాలి గదా అంటారా, మీ ఖర్మ.క్రైస్తవం అనే మతాన్ని పుట్టించింది మీకొచ్చే
తొక్కలో ప్రశ్నలకి జవాబులు చెప్పి మిమ్మల్ని తెలివైనవాళ్ళలా తీర్చి దిద్దటానికి కాదు,
ప్రశ్నలు అడగటానికి భయపడి ఛస్తూ మీ కష్టార్జితంలోని సింహభాగాన్ని పాస్టర్లకీ పాస్టర్లకి
ఇష్టమైన ప్రభుత్వాధినేతలకీ మీ చేతుల్తోనే ఇచ్చేసి ఆనందాశ్రువులను రాలుస్తూ రేయింబవళ్ళ
ఈతిబాధల సర్వకాల సర్వావస్థల భయభ్రాంతుల రోగిష్టి
నికృష్ట పరాధీనపు ఏడుపుగొట్టు బతుకుతో సరిపెట్టుకునే గొర్రెలా మిమ్మల్ని తయారు చెయ్యటానికి! "దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా,అస్సలు సిస్సలు శుంఠలు
కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి" అని మళ్ళీ నిలదీస్తే
మీకూ బైబిలులో హేతుబద్ధత వెతికే మామూలు క్రైస్తవులకీ నమ్మలేని నిజం ఒకటి చెప్తాను
- వాటికన్ కామందు పోపు గారు మొదలు గల్లీ చర్చి పాస్టరు వరకు గల మతప్రచారకుల్లో ఏ ఒక్కడూ
ఈ నల్లట్ట పుస్తకాన్ని నమ్మట్లేదు. అమ్మతోడు, నిజం - ఇహ్హిహ్హిహ్హీ!)దీనికి, అంటే vault గారికి Sky అని పేరు పెట్టటాన్ని బట్టి "water నుంచి water వేర్పడేలాగున waters మధ్యన ఒక vault ఇరుక్కున్న తతంగం మొత్తం నేలకి అతుక్కుని ఉన్న భూగర్భ జలమూ మబ్బుల్లోకి చేరి వేళ్ళాడుతున్న ఉన్న వార్షుక జలమూ అనేవాటిని గురించి చెప్పడానికి యహోవా ద్యాముడికి తోచిన పిచ్చ పోలిక కాబోలు:-)
అంతటితో ఐపోలేదు తర్వాతి వాక్యంలో దీని బాబు లాంటి జోకు వేస్తున్నాడు యహోవా ద్యాముడు - నేలకి అతుక్కుపోయి ఉన్న నీటిని అసుంటా పక్కకి జరిగి ఒక్కచోట పోగుపడేట్టు వెళ్ళమన్నాట్ట,అది ముక్కుతూ మూలుగుతూ తక్కుతూ తారుతూ ఉన్న చోటు నుంచి పక్కకి జరిగి చోటు సాల్దు గాబట్టి ముందు పైకి ఉవ్వెత్తున
ఎగసి నేల కన్న కింద ఉండాలి గాబట్టి కిందకి నిల్వెత్తున దిగిసి అట్టా పైకీ కిందకీ పడుతూ లేస్తూ సర్దుకుంటే బయటపడిన ముక్కకి Land అని పేరు పెట్టి(హ్హిహ్హిహ్హీ!ఒక్కచోటికి జరగక ముందు ఆ యొక్క నీరు/జలము/నీళ్ళు ఉన్నది దేనిమీద?దానికి పేరు లేదా!మొదటి వాక్యాన్ని గుర్తుకి తెచ్చుకుంటే Earth అనేదాన్ని పుట్టించింది ఎవడు?ఒకసారి పుట్టించి Earth అని పేరు పెట్టాట్ట. దానిమీద పరుచుకుని ఉన్న నీటిని పక్కకి జరగ మన్నాట్ట. నీటి చాటు నుంచి నుంచి దోబూచు లాడుతున్న Earth యొక్క ముక్కని యెహ్వెహెహే ద్యాముడు Land అని పిల్చాట్ట. అప్పటివరకు water అని అంటున్నది అది కానిదాన్ని Land అని పిలవగానే Seas అయిపోతుందా! ఏంటీ చెత్త?ఆయ్ఁ!అలా క్కాదు లెండి, Land అనేది నేలా Seas అనేది నీరూ Earth అనేది భూమీ అనుకుంటే సరిపోద్ది అంటారా - అలాక్కానీండి,లేదంటే మనకే పిచ్చెక్కి క్రైస్తవంలోకి దూకాల్సి వస్తది.ఎందుకొచ్చిన గోల?హ్హిహ్హిహ్హీ!) నీటి చాటు నుంచి నుంచి దోబూచు లాడుతున్న Earth యొక్క ముక్కని యెహ్వెహెహే ద్యాముడు Land అని పిల్చాడు...అలా రెండో రోజున మొదటి రోజున పుట్టించిన కిచ్చిడీ నుంచి ముక్కల్ని విడగొట్టి పేర్లు పెట్టడం మాత్రమే జరిగింది.ఇంతోటి దానికి ఎంత టైం పట్టిందో, ఎంత అలిసిపోయాడో పాపం!
అబ్బ!ఎంత బోరు!ఇంత పిచ్చ పుస్తకం అన్ని కోట్ల మందికి అంత గొప్ప పుస్తకం ఎట్లా అయ్యింది?ఇప్పటికి మనం తీసుకున్నది ఎనిమిది వాక్యాలే - అంటే వాక్యానికి ఒక జోకేశానా,వార్నాయనో!
Genesis 1:9 And God said,
“Let the water under the sky be gathered to one place, and let dry ground appear.”
And it was so.
Genesis 1:10 God called the
dry ground “land,” and the gathered waters he called “seas.” And God saw that
it was good.
Genesis 1:11 Then God said,
“Let the land produce vegetation: seed-bearing plants and trees on the land
that bear fruit with seed in it, according to their various kinds.” And it was
so.
Genesis 1:12 The land
produced vegetation: plants bearing seed according to their kinds and trees
bearing fruit with seed in it according to their kinds. And God saw that it was
good.
Genesis 1:13 And there was
evening, and there was morning—the third day.
హమ్మయ్య!వారంలో పూర్తయిపోయిన యహోవా దేవుడి సృష్టి రచన యొక్క మూడవ రోజు గడిచింది.అలా రెండో రోజున మొదటి రోజున పుట్టించిన కిచ్చిడీ నుంచి ముక్కల్ని విడగొట్టి పేర్లు పెట్టడం మాత్రమే జరిగింది కదా,మూడవ రోజున ఉద్ధరించిన ఘనకార్యం ఏమిట్ట?
నేలకి అతుక్కుపోయి ఉన్న నీటిని అసుంటా పక్కకి జరిగి ఒక్కచోట పోగుపడేట్టు వెళ్ళమన్నాట్ట.అది ముక్కుతూ మూలుగుతూ తక్కుతూ తారుతూ ఉన్న చోటు నుంచి పక్కకి జరిగి చోటు సాల్దు గాబట్టి ముందు పైకి ఉవ్వెత్తున ఎగసి మళ్ళీ తను నేల కన్న కింద ఉండాలి గాబట్టి కిందకి నిల్వెత్తున దిగేసి అట్టా పైకీ కిందకీ పడుతూ లేస్తూ సర్దుకుంటే బయటపడిన Earth యొక్క ముక్కని Land అని పిల్చాట్ట!అప్పటివరకు water అని అంటున్నది అది కానిదాన్ని Land అని పిలవగానే Seas అయిపోయింది - ట!
అప్పుడు యహ్వెహెహే దేవుడు "ఇదిగో, ఈ భూమి(ఇహిహీ! అలవాటులో పొరపాటు - భూమి క్నాదు నేల - ఇహిహీ!) వృక్షజాతిని:విత్తనములు గల మొక్కలను, చెట్లను పుట్టించు గాక!" అని ఆజ్ఞాపించగానే అది ఆలాగుననే జరిగినది - ట!
(హ్హిహ్హిహ్హీ!ఇందుక్కాదూ ఆ తొమ్మిదో తరగతి కుర్రాడు నవ్వింది - బైబిలు రచయితలు ఎంత తెలివైనోళ్ళు గాకపోతే "The land produced
vegetation: plants bearing seed according to their kinds and trees bearing
fruit with seed in it according to their kinds." అని మాత్రం చెప్పి ఎన్ని రకాల మొక్కల్ని ఎన్ని రకాల చెట్లని పుట్టించాడు అనే లెక్కని దాటేసి And God saw that it was good అనే మరో పిచ్చ మాటతో సరిపెట్టేస్తారు?తను చేసిన సృష్టిని చూసి తను గుడ్డనుకోవటం ఏంటి నా బొంద,చిన్న పీల్లలు కూడా వాళ్ళు చేసింది వాళ్ళకి బాగుందనిపిస్తే సరిపెట్టుకోరు - అమ్మానాన్నలకి చూపించి వాళ్ళు గుడ్డంటే కాలరెగరేస్తారు.కానీ,యహ్హోవా దేముడు వేరేవాళ్ళు గుడ్డనే చాన్సు లేని లత్తుకోరు యవ్వారం చేసి తగలడ్డాడు గనక బైబిలు రచయితలకి తాము దేవుడంటున్న యహోవాకి వాళ్ళే 100/100 మార్కులు వేసుకోవాల్సిన దరిద్రం పట్టింది.హ్హిహ్హిహ్హీ!)
మళ్ళీ సాయంత్రం, ఉదయం ఏర్పట్టం గురించి చెప్తున్నాడు, మొదట్రోజున చేసింది మర్చిపోయాడా?అప్పుడే!రెండు ఉదయాల్నీ రెండు సాయంకాలాల్నీ చూశాక కూడా మర్చిపోవటం ఏంటి?"అబ్బే, మీరు మరీ ప్రతి వాక్యాన్నీ పీకి పాకం పెడితే అస్సలు బాగోదు!వినువరులకు ఆహ్లాదం కలిగించటం కోసం అనవిందుగానూ వినసొంపుగానూ ఉన్న వాక్యాల్ని మరల మరల ఉఛ్చరించటం పునరిక్తి దోషం కూడా కాదు, వదిలెయ్యండి" అంటారా - అలాక్కానీండి, కందకి లేని దురద కత్తిపీటకా అన్నట్టు క్రైస్తవులకి లేని నామోషీ నాకు దేనికి?అయితే, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి,బైబిలు ద్యాముడికి మతిమరుపు జాస్తి.ముందు ముందు మీకే తెలుస్తుందిగా!
Genesis 1:14 And God said,
“Let there be lights in the vault of the sky to separate the day from the
night, and let them serve as signs to mark sacred times, and days and years,
Genesis 1:15 and let them be
lights in the vault of the sky to give light on the earth.” And it was so.
Genesis 1:16 God made two
great lights—the greater light to govern the day and the lesser light to govern
the night. He also made the stars.
Genesis 1:17 God set them in
the vault of the sky to give light on the earth,
Genesis 1:18 to govern the
day and the night, and to separate light from darkness. And God saw that it was
good.
Genesis 1:19 And there was
evening, and there was morning—the fourth day.
హమ్మయ్య!వారంలో పూర్తయిపోయిన యహోవా దేవుడి సృష్టి రచన యొక్క నాల్గవ రోజు గడిచింది.అలా మూడో రోజున మొదటి రోజున పుట్టించిన కిచ్చిడీ నుంచి ముక్కల్ని రెండో రోజున విడగొట్టి పేర్లు పెట్టడం మూడో రోజున మొక్కల్నీ చెట్లనీ పుట్టించడం మాత్రమే జరిగింది కదా,నాల్గవ రోజున ఉద్ధరించిన ఘనకార్యం ఏమిట్ట?
యహ్వెహే ద్యాముడి మతిమరుపు గురించి మందుముందు మీరే
చూస్తారుగా అన్నదానికి సాక్ష్యం ఇక్కడే కనిపించేస్తంది, చూస్తున్నారుగా - పగటినీ రాత్రినీ
వేరు చేయు కాంతులను sky మీదకి రమ్మన్నాట్ట.వచ్చి
అవి ఏం చెయ్యాల్ట?పవిత్ర తిధులకు, రోజులకు, సంవత్సరములకు హద్దులు చూపించాల్ట!waters, watar అనే పిచ్చ మాటల కన్న lights, light అనేవి కొంత
నయమే - గుడ్డి కన్న మెల్ల నయం కదా!light అనే పదానికి కాంతి, కాంతిని
పుట్టించే వస్తువు అనే రెండు అర్ధాలూ ఉన్నాయి గాబట్టి అంతవరకు బాగనే ఉంది గానీ భూమి
మీదకి sky మీద అమర్చిన lights నుంచి వస్తున్న light ఎక్కడిది?మొదటి రోజున సృష్టించిన lights యొక్క అవసరం లేని light, నాల్గవ రోజున సృష్టించిన lights యొక్క అవసరం ఉన్న light ఒకటేనా?ఒకటే అయితే మర్చిపోయి మళ్ళీ సృష్టించినట్టు కాదూ!ఒకటి కాదు అనాలంటే
రెండింటి యొక్క లక్షణాల్నీ ప్రయోజనాల్నీ చెప్పి వాటి మధ్యన ఉన్న పోలికలూ తేడాలూ కూడా
చెప్పి తీరాలి!
మళ్ళీ జోకులు వేస్తున్నాడు, sky అనే vault మీద రెండు అతిపేద్ద కాంతుల్ని సృష్టించేశాట్ట!దేనికీ?భూమ్మీద పవిత్ర తిధులూ రోజులూ సమ్మచ్చరాలూ లెక్క తెలియడానికని చెప్పాడు గదండీఅప్పుడే మర్చిపోయారా అని అంటారా!వస్తన్నా,వస్తన్నా, అక్కడికే వస్తన్నా - ఆయొక్క రెండు గొప్పవైన కాంతుల్లో ఎక్కువ గొప్పది పగటిని శాసిస్తుందట,తక్కువ గొప్పది రాత్రిని శాసిస్తుందట!(హ్హిహ్హిహ్హీ!రెండు గొప్పవగు కాంతులు, ఒక ఎక్కువ గొప్పదగు కాంతి,ఒక తక్కువ గొప్పదగు కాంతి అని యాడవకపోతే Sun,Moon అని యాడవొచ్చు కదా - క్లారిటీ లేదేమో పాపం!సైన్సుకు సంబంధించిన అలాంటి విషయాల్లో గభీమని తీరుమానం చేసేస్తే తర్వాత తేడా కొట్టినప్పుడు మొత్తానికి బ్యాండు పడిపోద్దని ఝడుసుకుని ఉంటాడు యెహ్వెహెహే ద్యాముడు - హ్హిహ్హిహ్హీ!)
మళ్ళీ సాయంత్రం, ఉదయం గురించి పాట ఎత్తుకున్నాడు, మొదట్రోజున చేసింది మర్చిపోయాడా?అప్పుడే!రెండు ఉదయాల్నీ రెండు సాయంకాలాల్నీ చూశాక కూడా మర్చిపోవటం ఏంటి?"అబ్బే, మీరు మరీ ప్రతి వాక్యాన్నీ పీకి పాకం పెడితే అస్సలు బాగోదు!వినువరులకు ఆహ్లాదం కలిగించటం కోసం అనవిందుగానూ వినసొంపుగానూ ఉన్న వాక్యాల్ని మరల మరల ఉఛ్చరించటం పునరిక్తి దోషం కూడా కాదు, వదిలెయ్యండి" అంటారా - అలాక్కానీండి, కందకి లేని దురద కత్తిపీటకా అన్నట్టు క్రైస్తవులకి లేని నామోషీ నాకు దేనికి?
Genesis 1:20 And God said,
“Let the water teem with living creatures, and let birds fly above the earth
across the vault of the sky.”
Genesis 1:21 So God created
the great creatures of the sea and every living thing with which the water
teems and that moves about in it, according to their kinds, and every winged
bird according to its kind. And God saw that it was good.
Genesis 1:22 God blessed
them and said, “Be fruitful and increase in number and fill the water in the
seas, and let the birds increase on the earth.”
Genesis 1:23 And there was
evening, and there was morning—the fifth day.
హమ్మయ్య!వారంలో పూర్తయిపోయిన యహోవా దేవుడి సృష్టి రచన యొక్క ఐదవ రోజు గడిచింది.అలా మొదటి రోజున పుట్టించిన కిచ్చిడీ నుంచి ముక్కల్ని రెండో రోజున విడగొట్టి పేర్లు పెట్టడం మూడో రోజున మొక్కల్నీ చెట్లనీ పుట్టించడం నాల్గవ రోజున sky అనే vault మీద రెండు అతిపేద్ద కాంతుల్ని సృష్టించడం మాత్రమే జరిగింది కదా,ఐదవ రోజున ఉద్ధరించిన ఘనకార్యం ఏమిట్ట?
అదేంటి?పక్షులు ఎప్పుడు పుట్టాయి/ఎవరు పుట్టించారు?ఆరు రోజులకి లెక్క వేసుకుని ప్రోగ్రెస్ రిపోర్టు మాదిరి లిస్టు చెప్తూ వచ్చినవాడు వరస ప్రకారం పక్షుల సృష్టి ఎప్పుడు జరిగిందో చెప్పాలి గదా!
ఓహో!తర్వాత వచనంలో చెప్పాడు లెండి.నేను ఒక్కో వచనమూ తీసుకుని దేనికి దాన్ని విశ్లేషించే హడావిడిలో ఇక్కడ ముందు చెప్పాల్సింది వెనకా వేంక చెప్పాల్సింది ముందూ చెప్పినట్టు అర్ధం చేసుకోలేక తడబడ్డాను, సారీ!
అర్రె, నీటిని జీవజాతులకు అతికించటం ఈ ఐదవరోజు వరకు జరగలేదా!ఏమిటండీ ఈ ఘోరం?అవి మొక్కలా పక్షులా అని లేదు, ఏ జీవి దేహంలో అయినప్పటికీ జీవం అనేది కదలాలంటే ఆ దేహం లోపల నీరు తప్పనిసరి అనే చిన్న పాయింటు కూడా యహొవా ద్యాముడికి తెల్వదా!అయితే, మూడవ రోజున యహోవా ద్యాముడు పుట్టించిన మొక్కలు ఐదవ రోజున యహోవా ద్యాముడు "Let the water teem
with living creatures" అని ఆజ్ఞాపించే వరకు ఎలా బతికి ఉన్నాయి?
(హ్హిహ్హిహ్హీ!ఇది సాల్దన్నట్టు ఇక్కడ కూడా ఎన్ని రకాల పక్షుల్ని ఎన్ని రకాల జంతువుల్ని పుట్టించాడు అనే లెక్కని దాటేసి according to their kinds అని కవర్ చేసేసి And God saw that it was
good అనే మరో పిచ్చ మాటతో సరిపెట్టేశారు బైబిలు రచయితలు.ఇందుక్కాదూ ఆ తొమ్మిదో తరగతి కుర్రాడు నవ్వింది - వేరేవాళ్ళు గుడ్డనే చాన్సు లేని లత్తుకోరు యవ్వారం చేసి తగలడ్డాడు గనక బైబిలు రచయితలకి తాము దేవుడంటున్న కల్పితపాత్రకి వాళ్ళే 100/100 మార్కులు వేసుకోవాల్సిన దరిద్రం పట్టింది.హ్హిహ్హిహ్హీ!)
మళ్ళీ సాయంత్రం, ఉదయం గురించి పాట ఎత్తుకున్నాడు, మర్చిపోయాడా?అబ్బే, కాదులెండి.ప్రోగ్రెసు రిపోర్టుని విడదియ్యటం కోసం ఆ సుత్తి వాక్యాన్ని అలా రిపీట్ చేస్తున్నాడని ఇప్పటికి అర్ధమయింది నాకు, మరి మీకూ!
Genesis 1:24 And God said,
“Let the land produce living creatures according to their kinds: the livestock,
the creatures that move along the ground, and the wild animals, each according
to its kind.” And it was so.
Genesis 1:25 God made the
wild animals according to their kinds, the livestock according to their kinds,
and all the creatures that move along the ground according to their kinds. And
God saw that it was good.
Genesis 1:26 Then God said,
“Let us make mankind in our image, in our likeness, so that they may rule over
the fish in the sea and the birds in the sky, over the livestock and all the
wild animals, and over all the creatures that move along the ground.”
Genesis 1:27 So God created
mankind in his own image, in the image of God he created them; male and female
he created them.
Genesis 1:28 God blessed
them and said to them, “Be fruitful and increase in number; fill the earth and
subdue it. Rule over the fish in the sea and the birds in the sky and over
every living creature that moves on the ground.”
Genesis 1:29 Then God said,
“I give you every seed-bearing plant on the face of the whole earth and every
tree that has fruit with seed in it. They will be yours for food.
Genesis 1:30 And to all the
beasts of the earth and all the birds in the sky and all the creatures that
move along the ground—everything that has the breath of life in it—I give every
green plant for food.” And it was so.
Genesis 1:31 God saw all
that he had made, and it was very good. And there was evening, and there was
morning—the sixth day.
హమ్మయ్య!వారంలో పూర్తయిపోయిన యహోవా దేవుడి సృష్టి రచన యొక్క ఆరవ రోజు గడిచింది.అలా మొదటి రోజున పుట్టించిన కిచ్చిడీ నుంచి ముక్కల్ని రెండో రోజున విడగొట్టి పేర్లు పెట్టడం మూడో రోజున మొక్కల్నీ చెట్లనీ పుట్టించడం నాల్గవ రోజున sky అనే vault మీద రెండు అతిపేద్ద కాంతుల్ని సృష్టించడం ఐదవ రోజున పక్షుల్నీ నీటి జంతువుల్నీ పుట్టించి నీటిని జీవజాతులకు అతికించటం మాత్రమే జరిగింది కదా, ఆరవ రోజున ఉద్ధరించిన ఘనకార్యం ఏమిట్ట?
అబ్బో! ఆఖరి రోజు కదూ, చాలా ఘనకార్యాలు జరిగాయండోయ్!ఇప్పుడు నేల మీద జంతువుల్ని పుట్టించాట్ట.ఇది కొంచెం తెలివిగానే ఉంది.మోడర్న్ ఇవల్యూషన్ ధియరీ కూడా ముందు అమీబా నుంచి చేప వరకు నీళ్ళలోనే పుట్టి కప్ప వంటివి నీళ్ళ నుంచి బయటికి వచ్చి రెప్టయిల్సూ మమ్మేలియన్సూ ఎవాల్వ్ అయ్యాయని చెప్తున్న లెక్కలతో సరిపోతుంది.
పోన్లే గదా, ఇన్ని తప్పుల మధ్యన తప్పు లేని ఒక గొప్ప పాయింటు దొరింది పొగిడేద్దాం అనుకునే లోపు మళ్ళీ తప్పులో కాలేశారు యహోవా ద్యాముడూ బైబిలు రచయితలూ కలిసి - మనిషిని తన రూపంలో సృష్టించాట్ట.అంటే, యహోవాకి ఒక రూపం ఉంది.అది కూడా మనలాంటి దేహమే, అవునా?ఆ దేహానికి కూడా మన దేహానికి ఉన్నట్టే రెండు కాళ్ళు,రెండు చేతులు, ఒక పొట్ట, ఒక రొమ్ము, ఒక గుండె, రెండు వూపిరితిత్తులు,రెండు భుజాలు,ఒక మెడ, ఒక తల,ఒక ముఖం, ఒక నోరు,ఒక ముక్కు,రెండు ముక్కు గొట్టాలు,రెండు కళ్ళు, ఒక నుదురు, నెత్తి మీద ఒక డిప్ప ఉన్నాయా?అవన్నీ యహోవాకి ఎట్లా వచ్చాయి?ఎక్కడి నుంచి వచ్చాయి?తనకి female ఎవరూ లేనప్పుడు మనిషికి మాత్రం male and female ఉన్నట్టు ఎందుకు సృష్టించాడు?తన రూపం ఇచ్చాడు అన్నంతవరకు గొప్పగానే ఉంది గానీ తనకి లేని పెళ్ళాన్ని మనకి తగలేసి చచ్చాడు అనేది మాత్రం చెత్తగానూ పిచ్చగానూ లేదూ!
ఇవ్వాళ మగాళ్ళకి ప్రశాంతత లేని జీవితాలు దక్కటానికి ఆడాళ్ళు కాదూ కారణం?తను మాత్రం ఒంటికాయ సొంటికొమ్ములా పెళ్ళమూ బిడ్డలూ అనే జంఝాటాలు వదిలేసి టింగు రంగా అంటూ తిరుగుతూ మనకి ఇంత అన్యాయం చేసి మళ్ళీ దాన్నే ఏదో ఘనకార్యం చేసి ఉద్ధరించినట్టు ఎంత గొప్పగా డప్పు కొట్టుకుంటున్నాడో చూడండి!ఫలవంతులై సంఖ్యని పెంచుకోమన్నాట్ట!నీటిలో ఈదే చేపల మీదా గాలిలో ఎగిరే పక్షుల మీదా భూమి మీద తిరిగే అడివి జంతువుల మీదా పెంపుడు జంతువుల మీదా సర్వాధికారాలు ఇచ్చేశాట్ట!అన్నిట్నీ ఏలేసుకోరా,కబ్బాడీ ఆడేసుకోరా అని మనిషికి పెత్తనం ఇచ్చేశాట్ట!
విక్రమార్కుడికి మౌనభంగం కలగ్గానే భేతాళుడు చెట్టెక్కేసినట్టు మళ్ళీ "God saw all that he
had made, and it was very good" అనే సుత్తివాక్యం వచ్చేసింది. And
there was evening, and there was morning అని చెప్పి సృష్టిరచనని పూర్తి చేసేశాడు. అప్పుడే అయిపోయిందా, హరిబాబు ఇంకాసిన్ని జోకులు వేస్తాడనుకున్నామే అని మీరు దిగులు పడమాకండి, ఏడవ రోజున సృష్టి మొదలైన తొలి రోజు నుంచి నేటి వరకు యహోవా ద్యాముడు స్వయాన వేసిన ప్రపంచ స్థాయి హాస్యరసగుళికలకు మాతృక అనదగ్గ బాంబు లాంటి జోకు వేస్తాడు.
Genesis 2:1 Thus the heavens
and the earth were completed in all their vast array.
Genesis 2:2 By the seventh
day God had finished the work he had been doing; so on the seventh day he
rested from all his work.
Genesis 2:3 Then God blessed
the seventh day and made it holy, because on it he rested from all the work of
creating that he had done.
హమ్మయ్య!వారంలో పూర్తయిపోయిన యహోవా దేవుడి సృష్టి రచన యొక్క ఏడవ రోజు గడిచింది.అలా మొదటి రోజున పుట్టించిన కిచ్చిడీ నుంచి ముక్కల్ని రెండో రోజున విడగొట్టి పేర్లు పెట్టడం మూడో రోజున మొక్కల్నీ చెట్లనీ పుట్టించడం నాల్గవ రోజున sky అనే vault మీద రెండు అతిపేద్ద కాంతుల్ని సృష్టించడం ఐదవ రోజున పక్షుల్నీ నీటి జంతువుల్నీ పుట్టించి నీటిని జీవజాతులకు అతికించటం ఆరవ రోజున మనిషిని సృష్టించి అన్నిటి మీద పెత్తనం ఇవ్వడం మాత్రమే జరిగింది కదా, ఏడవ రోజున ఉద్ధరించిన ఘనకార్యం ఏమిట్ట?
అలిసిపోయాట్ట!విశ్రాంతి తీసుకున్నాట్ట!ఏడవ రోజుని ఆశీర్వదించాట్ట!మనిషిని కూడా ఆ రోజున పనిపాట్లకి వెళ్ళొద్దన్నాట్ట!ఇతర్లకి మేలు చేసే పనిని పవిత్రం అంటే ఒక లెక్క, అసలు పనే చెయ్యని ఖాళీ సమయాన్ని పవిత్రం చెయ్యడం ఏంటి?
(హ్హిహ్హిహ్హీ!యహ్హోవా ద్యాముడు వాక్యానికో జోకు వేశ్శాడు కదూ!అబ్బెబ్బే!అవి నువ్వేసిన జోకులు హరిబాబూ యహ్హోవాకి అంటగట్టటం తప్పు అంటారా!అలాక్కానీండి,లేదంటే పిచ్చెక్కి క్రైస్తవంలోకి దూకాల్సి వస్తది.ఎందుకొచ్చిన గోల?హ్హిహ్హిహ్హీ!)
ఇంతటితో Book of Genesis అనే ఉద్గ్రంధం నుంచి మనం ఏడు రోజుల సృష్టి గురించి తెలుసుకోవాల్సిన సమస్తమూ పూర్తయిపోయింది.అయితే బైబులులో ఉన్న విశేషం ఏమిటో తెలుసా - ప్రతి కొత్త అధ్యయమూ పాతవాటిని మించి ఉంటుంది. అన్నట్టు, బైబిలు కధలు అన్నిట్లోకి తొలి జంట కధని విస్తరించి చెప్తే తప్ప సారం అర్ధం కాదు గాబట్టి కొత్త పోష్టు కోసం ఎదురు చూడాల్సిందే!అయితే, అప్పటి వరకు ఎదురుచూపులు బోరెత్తిపోని ఒక గొప్ప జోకుని చూపిస్తున్నాను, చూడండి.
Genesis 2:4 This is the
account of the heavens and the earth when they were created, when the LORD God
made the earth and the heavens.
Genesis 2:5 Now no shrub had
yet appeared on the earth and no plant had yet sprung up, for the LORD God had
not sent rain on the earth and there was no one to work the ground,
Genesis 2:6 but streams came
up from the earth and watered the whole surface of the ground.
Genesis 2:7 Then the LORD
God formed a man from the dust of the ground and breathed into his nostrils the
breath of life, and the man became a living being.
Genesis 2:8 Now the LORD God
had planted a garden in the east, in Eden; and there he put the man he had formed.
ఈ భాగం ఒక రకమైన సింహావలోకనం అయినప్పటికీ "This is the
account of the heavens and the earth when they were created" అన్న తర్వాత "Now no shrub had yet
appeared on the earth" అనే వాక్యంలో Now వాడటం వల్లనే కదా తెలివైనవాళ్ళకి ముందు వెనకలు తెలియని అయోమయం ఏర్పడుతున్నది!ఆరవ రోజున మనిషిని సృష్టించి మొత్తం భూమి మీద తను సృష్టించిన అన్నిటి మీద పెత్తనం ఇవ్వడం మర్చిపోయినట్టు తూర్పు దిశన ఒక తోటని పెంచి తొలిజంటని అక్కడ ఉంచాట్ట!
next
chapter is alwayas the best!