An insider is
a person who possesses either access to valuable non-public information about a
corporation or ownership of stock equaling more than 10% of a firm's equity.
This makes a company's directors and high-level executives insiders.
ఇది అసలు ఆ
పదానికి ఉన్న అధికారికమైన నిర్వచనం.ఇంకొక వింత యేమిటంటే
షేర్ల అమ్మకాలకూ కొనుగోళ్ళకూ సంబంధించిన సాంకేతికమైన నిర్వచనం ప్రకారం అది చాలా రొటీన్
వ్యవహారమే!
Legal Insider Trading
Insiders are
legally permitted to buy and sell shares of the firm and any subsidiaries that
employ them. However, these transactions must be properly registered with the
Securities and Exchange Commission (SEC) and are done with advance filings. You
can find details of this type of insider trading on the SEC's EDGAR database.
Legal insider
trading happens often, such as when a CEO buys back shares of their company, or
when other employees purchase stock in the company in which they work. Often
times, a CEO purchasing shares can influence the price movement of the stock
they own. A good example is whenever Warren Buffett purchases or sells shares
in the companies under the Berkshire Hathaway umbrella.
అనగా ఈ పదం
ఏ రంగానికి సంబంధించిందో ఆ రంగంలో కూడా
ఇది చట్టబద్ధమైన వ్యవహారమే!అయితే అసలు నేరం
కాదా అంటే ilegal అని గనక ఒక
transaction నమోదు అయితే అది ఖచ్చితంగా
శిక్షార్హమైన నేరమే!
Illegal Insider Trading
The more
infamous form of insider trading is the illegal use of non-public material
information for profit. It's important to remember this can be done by anyone
including company executives, their friends, and relatives, or just a regular
person on the street, as long as the information is not publicly known.
For example,
suppose the CEO of a publicly-traded firm inadvertently discloses their
company's quarterly earnings while getting a haircut. If the hairdresser takes
this information and trades on it, that is considered illegal insider trading,
and the SEC may take action.
ఇప్పుడు దీనిని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి గత ప్రభుత్వం చేసిన
ఆమరావతిలోని భూముల సేకరణకి వర్తింపజేసి
మీడియాలో చాలా హడావిడి చేస్తున్నారు.ఈ ఇన్సైడర్ ట్రేడింగ్
అనే పదం ఏ రంగానికి
వర్తిస్తుందో ఆ రంగంలోనే legal,illegal అనే రెండు
రకాల ట్రాన్సాక్షన్లు ఉన్నాయని ఆయనగారికి తెలుసా!
The SEC is
able to monitor illegal insider trading by looking at the trading volumes of
any particular stock. Volumes commonly increase after material news is issued
to the public, but when no such information is provided and volumes rise
dramatically, this can act as a warning flag. The SEC then investigates to
determine precisely who is responsible for the unusual trading and whether or
not it was illegal. అని
అధికారికమైన సమాచారం ఉన్నప్పుడు illegal insider
trading అనే వ్యవహారానికి కూడా Ledger Volumes ఆధారమే సాక్ష్యం అని తెలుస్తున్నది.
అంటే, legal,illegal అనే రెండు ఇన్సైడర్
ట్రేడింగుల్లోనూ ఒక వ్యాపార సంస్థ
యొక్క బ్యాలెన్స్ షీట్ నుంచి ఆ
కంపెనీ వ్యాపారవృద్ధికి సంబంధించిన గణాంకాలను బయటివాళ్ళకి తెలియజెప్పి ఆ అబ్యటివాళ్ళ చేత
ఆ కంపెనీ షేర్లని అమ్మించడం గానీ కొనిపించడం గానీ
చెయ్యడం అనే కామన్ పాయింటు
ఉంటుంది.అలా బాయ్టికి పొక్కించిన
కంపెనీ వృద్ధికి సంబంధించిన్ సమాచారం అబద్ధాలతో కూడుకుని వుండి సంస్థ గానీ
షేర్ హోల్డర్లు గానీ నష్టపోయినప్పుడు మాత్రమే
దాన్ని illegal కింద పరిగణించి SECకి
ఫిర్యాదు చేస్తారు.
ఇంత స్పష్టమైన వివరాలతో
షేర్ల అమ్మకాలకు మాత్రమే వర్తింపజెయ్యాలసిన ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని పూర్తి
బాహాటమైన ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో అమరావతి కోసం జరిగిన భూసేకరణకి
ఎలా ఉపయోగిస్తున్నారు?ఒకసారి షేరును కొన్న వ్యక్తి ముఖవిలువతో
సంబంధం లేకుండా దాన్ని ఎవరికైనా ఎంతకైనా అమ్మవచ్చు, అతి తక్కువ సమయంలో
ఒక షేరు ఎన్ని చేతులైనా
మారొచ్చు - అది చరాస్థి, ఆ
వ్యవహారం భూమి విషయంలో నడవదే
- భూమి స్థిరాస్థి!భూమిని అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ చెయ్యనిదే కుదరదు.శ్రీ బుగ్గన రాజేంద్ర
ప్రసాద రెడ్డి గారు ఎవరెవరెవరికి ఏయే
సర్వే నంబర్లు గల భూముల విషయంలో
ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం వాడుతున్నారో
ఆయా సర్వే నంబర్లు గల
భూములు ఆయా వ్యక్తుల పేరిట
రిజిస్టర్ కావడం అనేది ప్రభుత్వ
చట్టాలకు లోబడి జరిగిన బహిరంగ
వ్యవహారమే!భూమిని అమ్మిన వ్యక్తి గానీ భూమిని కొన్న
వ్యక్తి గానీ ఆ ట్రాన్సాక్షన్
వల్ల నష్టపోలేదు - కందకీ కత్తిపీటకీ లేని
దురద ప్రభుత్వానికి దేనికి?
ఒకవేళ "రాజధాని ఇక్కడే ఉంటుందని బహిరంగ ప్రకటన చెయ్యకముందు అస్మదీయులకి మాత్రమే లీక్ చేసి భూముల
రేట్లు తక్కువ ఉన్నప్పుడు కొనిపించి రాజధానిని ఇక్కడ ప్రకటించి వాళ్ళు
కొన్న భూముల రేట్లని పెంచడం"
అనేదాన్ని అక్రమం అంటున్నట్లయొతే రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర
అప్పటి ప్రభుత్వం శివరాంకృష్ణన్ కమిటీకి పులివెందుల పేరును సూచించడం సంగతి యేంటి?ఆగస్టు
27, 2014లో రిపోర్టు సబ్మిట్ చేసేవరకు ప్రజల్లో ఎవరికైనా పులివెందుల పేరు రాజధానిని ఏర్పాటు
చెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం రాజధానిని సూచించమని ఏర్పాటు చేసిన కమిటీకి పంపిన
ప్రాధమ్య నగరాల లిస్టులో ఉన్నదని
తెలుసా!
కమిటీని ఏర్పాటు చేసినది 2014, మార్చి 28న.కమిటీ తన
పనిని పూర్తి చేసి నివేదీను సమర్పించాల్సిన
ఆఖరు తేదీ 2014 ఆగస్టు 31న.భారత జాతీయ
ప్రభుత్వంలోని Ministry
of Home Affairs కార్యాలయం
AP Reorganisation Act, 2014 ప్రకారం
ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ రాష్ట్ర
ప్రభుత్వం తమకు ఇచ్చిన సమాచారాన్ని
ఉపయోగించుకుని రాజధాని యేర్పాటు ఒక్కటే కాకుండా రాష్ట్రం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధికీ
సూచనలు ఇవ్వాల్సి వుంటుంది.2014 మార్చి 1న విడుదల చేసిన గెజెట్
ఆర్డరు ద్వారా ఈ కమిటీ ఏర్పడింది,
జూన్ నెలలో రెండు రాష్ట్రాల్లోనూ
ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.మార్చి 20న ఒక రూపం
తెచ్చుకున్న కమిటీ ఆగస్టు 31న
రిపోర్టు ఇవ్వడమంటే అసలు ఉన్నదే అయిదు
నెలలు, ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 30 వరకు
ఎన్నికల వల్ల రాష్టాన్ని సందర్శించలేని
పరిస్థితి.మే 16న ఫలితాలు
వచ్చి జూన్ 8న కొత్త
ప్రభుత్వం ఏర్పడింది.ఏతావతా కమిటీ 2014 జూన్ 8 తర్వాతనే రాష్ట్రంలో అడుగు పెట్టింది.ఉన్న
12 వారాల వ్యవధిలో 13 జిల్లాలకీ 11 జిల్లాలను మాత్రమే కవర్ చెయ్యగలిగింది.వ్యవధి
తక్కువ కనక సమాచారం సేకరించటానికి
పత్యక్ష సందర్శనతో పాటు వార్తాపత్రికల సహాయమూ
తీసుకున్నారు, ప్రజల నుంచి కూడా
ఈమెయిల్స్ ద్వారానూ ఒపీనియన్ పోల్స్ ద్వారానూ సమాచారం సేకరించారు.మొత్తం సూచనలు 4728 పైనే ఉంటాయి."When the Committee visited
locations in Rayalaseema, a number of statements were made in public
consultations before the Committee. Some of these statements expressed the
desire for a capital in Rayalaseema, and threatened agitations to further this
purpose." అని 1.4.
దగ్గిర కమిటీ చెప్పిన దాన్ని
బట్టి ఏ ప్రాంతం వారు
ఆ ప్రాంతంలో రాజధాని ఉండాలని కోరుకున్నట్టు తెలుస్తున్నది కదా!
ఈ వెధవలు కూడా
residuary State అని వాడటంతో నాకు వీళ్ళ మీద
గౌరవం పోయి నాకు పిచ్చకోపం
వచ్చేసింది - ఎదురుగా వుండి వుంటే చెప్పే
వాణ్ణి, Mother State అనలేరూ!వీళ్ళు తమ తమ సబ్జెక్టులలో అఖండులై
వుండి చుట్టూ జరుగు తున్న రాజకీయాలు తెలియకపోవడం వల్ల గానీ తెలిసే తమను
పురమాయించిన వాళ్ళు చెప్పే చిలక పలుకులు పలుకుతున్నారో
గానీ "చంద్రబాబు అభివృద్ధి మొత్తాన్ని ఒక్క హైదరాబాదులోనే కేంద్రీకరించడం
వల్లనే రాష్ట్రం విడిపోయింది!" అనే చెత్తమాటని పదే
పదే వాడుతున్నారు రిపోర్టులో, మరి ఇప్పటికీ కేసీయారు
హైదరాబాదుని అట్లాగే ఉంచేశాడు, ఏం అతనికి మరోసారి
తెలంగాణ విడిపోతుందనే భయం లేదా? భవిష్యత్తులోనైనా
అక్కడ వేర్పాటు ఉద్యమాలు పుట్టే అవకాశం ఉందా? లేనే లేదు
- అది ప్రతి ఒక్కడికీ తెలుసు!
విభజనకు సంబంధించిన సమస్తమయిన పాపాల్నీ చంద్రబాబు మీదకి తోసెయ్యడానికి కేసీయారు
వాగిన చెత్త వాగుడు తప్ప
విభజనకీ హైదరాబాదు అభివృద్ధి చెయ్యటానికీ ఎలాంటి సంబంధమూ లేదు. 1962లోనూ 1969లోనూ తెలంగాణ వైపునుంచి
ప్రత్యక తెలంగాణ వాదనలూ 1972లో ఆంధ్ర వైపు
నుంచి జై ఆంధ్ర వాదనా వొచ్చినప్పుడు
హైదరాబాదు ఇప్పటిలా లేదు కదా!ఆ
రెండు సార్లూ తెలంగాణ వాళ్ళు తమకు జరుగుతున్న అన్యాయాలతో
మెలికపెట్టి ప్రత్యేక రాష్ట్రం అడిగారు, కేంద్రం ఆ అన్యాయాల్ని పరిష్కరించడంతో
చల్లబడ్డారు.కానీ, ఇప్పుడు కూడా
సమస్యల్ని బట్టి అడిగితే మళ్ళీ
సమస్యల్ని పరిష్కరించితే చల్లారిపొతుందని తెలిసి ఆదినుంచీ సమస్యలను కేంద్రం చెయ్యకుండా జాగ్రత్త పడ్డారు, "ఆంధ్రా దోపిడీ!", "ఆంధ్రోళ్ళ పెత్తనం!" అనే పదాలతో ఈ
ప్రాంతాన్నీ ఈ ప్రాంతపు వ్యక్తుల్నీ
టార్గెట్ చేసి విజయవంతంగా విడిపోవటానికి
ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు
కూడగట్టగలిగారు.
ఈ ప్రాంతాన్ని సర్వనాశనం
చెయ్యాలని కాకపోతే A.O.Hume నుంచి మొదలై అన్ని
తరాల పాటు రాజకీయాల్లో ఉన్న
కాంగ్రెసు పార్టీలోని అతిరధ మహారధులు విభజన
బిల్లుని ఇంతకన్న మెరుగ్గా రూపొందించలేకపోవడం ఏంటి?అద్వానీ బిల్లులో
లోపాలు ఉన్నాయి, అధికారంలోకి వచ్చేది మనమే, మాంకే ఆ
తలనొప్పులన్నీ తగులుకుంటాయి,ఇప్పుడు వ్యతిరేకించి మనం అధికారంలోకి వచ్చాక
సమగ్రమైన బిల్లుని పెదదాం అని చెప్పినప్పటికీ బీజేపీలో
ఒక్కడు కూడా వినకపోవడం ఏంటి?ఆనాడు ఈ విధమైన
విబజన ఆంధ్ర ప్రాంతాన్ని సర్వనాశనం
చేస్తుందని తెలిసి తెలిసీ అలానే విడగొట్టిన వాళ్ళందరూ
ఆశించినదాన్నే ఈనాడు జగన్ పూర్తి
చేస్తున్నాడు. అందుకే ఎవరూ కల్పించుకోవడం లేదు,
అతన్ని ఆపాలని ప్రయత్నించడం లేదు. అప్పుల్ని జనాభా
దామాషాని బట్టీ ఖర్చుల్ని ప్రాంతం
దామాషాని బట్టీ వాటాలు వెయ్యడం
లాంటివి చూశాక కూడా ఆ
బిల్లుని ఏకపక్షం గుండుగుత్తం తెలంగాణని బాగుచేసి ఆంధ్రని భూతలం నుంచి మటుమాయం
చెయడానికే ఆ బిల్లుని అట్లా
రూపొందించారని అర్ధం కావడం లేదా!
జూన్ 7న ప్రమాణస్వీకారం
చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని
తిరస్కరించాకనే కమిటీ ఆయా ప్రాధమ్య
నగరాలను పరిశీలన నుంచి తొలగించుకున్నట్లు కమిటీ
నివేదికలో ఉంది. ఒకవేళ అతని
బదులు జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయివుంటే అప్పుడు అతని అధ్వర్యంలో "రాజధాని
ఇక్కడే ఉంటుందని బహిరంగ ప్రకటన చెయ్యకముందు అస్మదీయులకి మాత్రమే లీక్ చేసి భూముల
రేట్లు తక్కువ ఉన్నప్పుడు కొనిపించి రాజధానిని ఇక్కడ ప్రకటించి వాళ్ళు
కొన్న భూముల రేట్లని పెంచడం"
అనేది జరిగి వండేది, అవునా
కాదా?
ఎందుకిలా అబద్ధాలనే సబద్ధాల కింద ప్రచారం చేసి
ప్రజల్ని వెర్రి వెధవల్ని చెయ్యడం? అప్పుడు చెయ్యాలనుకున్న ఇన్సైడర్ ట్రేడింగుకి అడ్డం వచ్చాడని కాదా
చంద్రబాబు మీద "ఈ ముఖ్యమంత్రిని నడిరోడ్డు
మీద నిలబెట్టి షూట్ చెయ్యాలి!" అని
ఆక్రోశించేటంత పగ.అతని వెంట్రుకని
కూడా పీకలేని నిస్సహాయత్వంతో 2014లో అతనికి వోటు
వేసి తన సంపాదనకి గండికొట్టిన
ప్రజల మీద పగ
తీర్చుకోవడం దేనికి? దమ్ముంటే అతని కన్న గొప్ప
పరిపాలన అందించి ప్రజలు అతన్ని మర్చిపోయేటట్లు చేసి అఘోరించవచ్చు కదా!
ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తమ అధికారం చూసుకుని
గర్వంతోనో తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికో
అట్లా అబద్ధాలు చెప్తున్నారని అనుకోవచ్చు, కానీ ఆ పరిపాలకులు అబద్ధాలు చెప్పి
తమని మోసం చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళనే అభిమానించే తెలివితక్కువ వోటర్లని ఎట్లా
అర్ధం చేసుకోవాలి?గత ప్రభుత్వం
పెంచింది కాబట్టి అంగన్ వాడీ కార్యకర్తల
జీతాల్ని కూడా వెనక్కి లాక్కుంటున్న
నికృష్టపు ప్రభుత్వాన్ని కొందరు ఎలా సమర్ధించగలుగుతున్నారో?
ఒకటి మాత్రం నిజం.కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వ
ప్రతిపక్ష స్థానాల్లో ఉండి కలిసి మెలిసి తల్లిని చంపి పిల్లని పుట్టించటం అనే పాపకార్యం
చేసింది ఆంధ్ర ప్రాంతాన్ని ఏడారిగానో స్మశానం గానో మార్చటానికి తప్ప ఈ ప్రాంతప్రజల్ని
అక్కున జేర్చుకుని బాగు చెయ్యటానికి ఎంతమాత్రం కాదు!ప్రత్యేక హోదాని ఇస్తామని చెప్పిన
నోటితోనే ఇవ్వలేమని చెప్పటం అనుకోకుండా జరిగినది కాదు.మనకి ఇవ్వలేం అని చెప్పాక కూడా
వేరేవాళ్ళకి ఇచ్చారు.దాని బదులు "జైట్లీ - బాబు ప్లాను" పేరుతో వచ్చిన ప్రత్యేక
ప్యాకేజీ కూడా చంద్రబాబు వాళ్ళు రాష్ట్రానికి హోదా ఇవ్వలేకపోవడానికి పెడుతున్న అన్ని
వంకల్నీ బొక్కల్నీ బొంకుల్నీ జల్లెడ పట్టి తేర్చిన ప్లాను - దాన్ని కూడా తూట్లు పొడిచారు.ఇవన్నీ
బాబు మీద ద్వేషంతో చేసినవి కూడా కావు, ఆంధ్ర ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుపడకూడదనే
బలమైన కారణంతోనే ఇప్పటి జగన్ ప్రభుత్వం యొక్క పరిపాలన ఇలా నడుస్తున్నది.బొత్స మరియు
ఇతరులు ఈ ప్రాంతాన్ని స్మశానం అనీ ఎడారి అనీ చీదరించుకోవటం వెనక అలా ఎడారిని చేసి చూపించాలనే
కృతనిశ్చయం ఉంది.ఈ ఒక్క ప్రాంతాన్ని మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రాన్ని అన్ని విధాల
అట్టడుగుకి నెట్టెయ్యడమే మోదీ, కేసీయార్, జగన్, పవన్ అనే దుష్ట చతుష్టయం యొక్క ప్రణాళికాబద్ధమైన
వ్యూహం.ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల పరిపాలన పూర్తయ్యాక నా మాటలు అక్షరసత్యాలని తప్పకుండా
తెలుస్తుంది.ఎన్నికలకి ముందు నటుడు శివాజీ చెప్పినవన్నీ అతను చెప్పినట్టే జరిగాయి.అచ్చుమచ్చు
అతను చెప్పినట్టే ఎలా జరిగాయి?ఒకసారి ఆలోచించండి!అతనేమిటి?చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు
- కరెంటు కోతలు వస్తాయి, చీకట్లోకి నెట్టేస్తాడని చెప్పింది నిజం చేసి చూపించాడు కదా
జగన్మోహన రెడ్డి!అది జోస్యమా?
అమరావతిని ధ్వంసం చెయ్యటానికి అధికారికమైన
ఒక్క ఉత్తర్వు లేకుండా ఎంత జగన్నాటకం నడిపిస్తున్నారో చూడండి - నీలం సహానీ సంతకం లేకుండా
ఆమె పేరున ఆజ్ఞలు జారీ చేసి వాటిని కోర్టు ముందు పెట్టటం అంటే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి
స్థానంలో ఉన్న ఒక వ్యక్తికి ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్న ఇంకొక వ్యక్తి మీద ఉన్న
పగని తీర్చడానికి రాజ్యాంగాన్ని కూడా ధిక్కరిస్తున్నదని తెలియటం లేదా!రేపటి మున్సిపల్/స్థానిక
ఎన్నికల్లో ప్రజలు తమ విచక్షణని చూపించి తెదెపాకి వోటు వెయ్యకపోతే తర్వాత ఈ రాష్ట్రం
ఎలా వుంటుందో వూహంచడానికే భయం వేస్తున్నది.
దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని!
No comments:
Post a Comment
సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు