Wednesday, 13 March 2019

లక్ష్మీ's NTR సినిమాలో వర్మ అన్నీ నిజాలే చెబుతున్నాడా?నాకైతే నమ్మకం కలగడం లేదు!

లక్ష్మీస్ NTR సినిమా లోని పాత్రలూ ఆ సినిమా వల్ల ప్రభావితం అయ్యే వ్యక్తులూ అందరూ రాజకీయ నాయకులే కదా!వర్మ తన sensational voyerism కొద్దీ చంద్రబాబుని ఇరుకున పెట్టడానికి తీసిన సినిమా అని నేను అనుకుంటున్నాను.

వర్మను చాలామంది "మీరు తీసిన కధలోని ప్రధాన పాత్రలకు ఆధారమైన నిజ వ్యక్తులను కలిసి సినిమాలో మీరు వారిని నిలబెడుతున్న సన్నివేశాలకు సంబంధించి వారి వెర్షన్ తెలుసుకున్నారా?" అని అడిగారు.ఇది చాలా కీలకమైన ప్రశ్న.కానీ ఇంత ముఖ్యమైన ప్రశ్నకి వర్మ చెప్తున జవాబు సరైనది కాదు.

ఎవరెవరు ఎన్నిసార్లు తిప్పి తిప్పి అడిగినా ఒకే జవాబు చెప్తున్నాడు.నిజానికి ఒకసారి ఒక వ్యక్తికి అతను ఈ జవాబు చెప్పాక మళ్ళీ ఆ ప్రశ్న మరొకరు అడగాల్సిన పని లేదు.అన్ని చానల్సూ ఒకే  సమయంలో, అంటే ఇంకొక చానల్ ఇదే ప్రశ్నని అడిగి జవాబు రాబట్టిందని తెలుసుకునే సమయం లేకపోతే అది కొంతవరకు సమంజసమే!కానీ వర్మని ఈ సిన్మా గురించి అడుగుతున్న ప్రతి కార్యక్రమంలోనూ మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్న ఎందుకు వేస్తున్నట్టు?బహుశా, వాళ్ళకి కూడా ఆ జవాబు తప్పు అని అనిపిస్తున్నప్పటికీ ఎలా తప్పవుతుంది అన్న విషయంలో వాళ్ళకి క్లారిటీ లేకపోవటం వల్ల దానికి అనుబంధ ప్రశ్న వెయ్యలేకపోతున్నారు,అయినప్పటికీ ఆ జవాబుతో సరిపెట్టుకోలేని ఇబ్బందితో మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ ఇంటర్వూ క్లిప్పింగును చూడండి.అతను చెబుతున్నది ఏమిటి?

"ఒక సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు కూడా 12 మంది 12 రకాలుగా చెప్పే అవకాశం ఉంది - అలా చెప్పారు కూడాను" అనీ "వాళ్ళు అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పటి ప్రయోజనాలకు విరుద్ధమైన వాటిని వాళ్ళు చెప్పరు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అవలేదు" అనీ అంటూ తను చెప్పినది నమ్మదగినట్టు ఉంది కాబట్టి తను చెప్తున్నది నిజం అని మనల్ని అనుకోమంటున్నాడు.ఎక్కడా కూడా "నేను చూపించినది నూటికి నూరు శాతం అలాగే జరిగింది!" అని నిర్ధారించి చెప్పడం లేదు.

అప్పుడు పత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చిన వార్తల్ని రిపీట్ చేసిన పబ్లిక్ సీన్స్ నిజాలా అబద్ధాలా అని ఎవరూ అడగరు.అవన్నీ తెలిసినవే.ఎటొచ్చీ తెర వెనక జరిగిన అసలు కధ ఇదీ అని తను చూపిస్తున్న ప్రైవేట్ సీన్స్ గురించి అతను మనకి గ్యారెంటీ ఇవ్వాలి.ఆ గ్యారెంటీ ఇవ్వకుండా తప్పించుకోవడానికే తెలివైనవిగా అనిపించే ఈ తప్పుడు వాదనలు చేస్తున్నాడు.

వాల్మీకి రామాయణాన్ని రాముడి బయోపిక్ అనగలమా?అది బయోపిక్ ఎప్పటికీ కాదు."ప్రతి మనిషీ ఆదర్శంగా తీసుకోదగిన సర్వలక్షణసమన్వితుడు ఇంతకుముందు ఎవరైనా ఈ భూమి మీద జీవించి ఉన్నాడా?" అని అడిగిన వాల్మీకి నారదుడు ఉన్నాడని చెప్పినదాన్ని విని నారదుడు అబధ్ధం చెప్పడనే నమ్మకంతో తను స్వయంగా తేల్చుకోకుండా కవితాత్మకమైన కధలా చెప్పేశాడు. కానీ నందమూరి రామారావు అలా కాదే!కళ్ళముందు జరిగిన చరిత్ర అది.ఒక వాస్తవ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన నీకు చెప్పిన 12 మంది 12 రకాల వెర్షన్లు చెప్పినా జరగటం మాత్రం ఒక్కలానే జరుగుతుంది - ఆ ఒక్క సన్నివేశం ఇలాగే జరిగింది అనేది వర్మ మనకి నిర్ధారణ చేసి చెప్పాలి, కానీ అతను ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాడు!

Verna himself accepted that he collected information from you tube videos and from third party sources, that means they are indirect references and personal openions! In a way he is not able to attest his movie as an authentic documentary with facts and proofs. 

Please note that the is avoiding to show irrefutable evidences for his version - definitely it is twisting the facts filling with lies morphed as truths!

వాళ్ళు నిజాలు చెప్పరు గాబట్టి వాళ్ళని అడగలేదు అనేది అత్యంత బాధ్యతారహితమైన జవాబు!వాళ్ళని కలవాలి,నువ్వు అడగదల్చుకున్న  ప్రశ్నలు అడగాలి,ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పటానికి సునుఖత వ్యక్తం చెయ్యకపోతే దానిని నోట్ చేసుకోవాలి - వాళ్ళు చెప్పని వాటి విషయంలో నువ్వు ఎన్ని కల్పనలు చేసుకున్నా వాళ్ళు కూడా నిన్ను బ్లేం చెయ్యలేరు. ముఖ్యమైన ప్రశ్నలకి వేధించి అయినా సరే జవాబులు రాబట్టాలి, అప్పుడు విశ్లేషణలో నీ దృక్కోణం ఏమిటో నువ్వు చెప్పటం నీ ఇష్టం, వాళ్ళు కూడా నిన్ను వ్యతిరేకించలేరు(రాజ్యాంగం ప్రసాదించిన భావవ్యక్తీకరణ హక్కు అనేది ఇక్కడే పని చేస్తుంది,ఎవడి గురించయినా నా ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాననటం భావవ్యక్తీకరణస్వేచ్చ  కాదు.ఒక మనిషి ఏదైనా పని చేస్తే ఆ మనిషి ఫలానా పని ఫలానా విధంగానే చేశాడు అని చెప్పి అతని ఉద్దేశం ఇది అయి ఉండవచ్చు అని చెప్పడంలో ఎలాంటి తప్పూ లేదు.నువు ఒకవేళ దురుద్దేశం అంటగట్టి లోపాయకారీగా అది నిజమే అయితే అటువైపు వాడు నోరు మూసుకుంటాడు, లేకపోతే defamation కేసు వేస్తే నువు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది.స్వేచ్చకి హద్దులు ఉంటాయి.హద్దులు లేని స్వేచ్చ అధికారంలో ఉన్నవాడి విషయంలో నియంతృత్వం అవుతుంది, అధికారంలో లేనివాడి విషయంలో అరాచకత్వం అవుతుంది.వర్మ మరియు అతడి ఫ్యాన్సులో రెండవ ధోరణి ఎక్కువ - ప్రస్తుతం అధికారంలో లేరు కాబట్టి కావచ్చు!) - అది నిజాయితీ గలవాడు చేసే చరిత్ర రచన!వాళ్ళని ఎప్రోచ్ అయ్యి వాళ్ళు నిన్ను కలవడానికే తిరస్కరిస్తే దాన్నే అందరికీ చెప్పి నీ పద్ధతిలో నువ్వు వెళ్ళినా నిన్నెవరూ తప్పు పట్టలేరు.కానీ అతనికీ అతని ఫ్యాన్సుకీ ఇలాంటి నిజాయితీ ఉన్నట్టు కనిపించడం లేదు.

సినిమాల్లో దేవుళ్ళ పాత్రలు వేసి మనిషిని చూడగానే పవిత్రంగా అనిపించటమే కాకుండా స్త్రీలతోఎంతో హుందాగా ప్రవర్తించే రామారావు పెళ్ళి చేసుకునే ముందు తను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న వివాహిత మహిళ యొక్క మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోవాలనే విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు?సరే, సేవలు చేసి తరించాలని వచ్చానని చెప్పిన మనిషి అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా బిడ్డని కనాలని ఇబ్బంది పెట్టటమూ ఒకసారి అబార్షన్ అయినా పట్టిన పట్టు విడవకపోవటమూ సరిపడని మందులు వాడటమూ కూడా చూపించాడా వర్మ?

"అవసరం,అవసరం,అవసరం" అని మిగతా వాళ్ళందరూ రామారావు చుట్టూ అవసరం కోసమే చేరి లక్ష్మీ పార్వతి ఒక్కర్తే ఏ స్వార్ధమూ లేకుండా ఉన్నట్టు చూపించాడే, వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నది కూడా వారివారి అవసరాల కోసమే కదా!

దృశ్యరూపంలో చూడటం కొత్త కావచ్చునేమో గానీఇన్నేళ్ళలో ఆ విషయాలు తెలియని వాళ్ళు ఎవరు?తన పాటికి తను బతికేస్తున్న వీరగంధం సుబ్బారావుని తనని పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతాననే డ్రామాలు నడిపిన చీప్ లెవెల్ బిహేవియర్ ఉన్న నెరజాణకి ఇంత గౌరవం ఇవ్వడం అవసరమా?అంత దేబిరించి పెళ్ళి చేసుకుని అన్నేళ్ళు సంసారం చేసి శృంగారం వెలగబెట్టి ముది వయసులో మరొకణ్ణి తగులుకున్న బహుపతివ్రతని సమర్ధించడం సంస్కారవంతులకి తగునా?

ఇప్పుడు నేను వీరగంధం చెప్తున్న సంగతుల్ని స్వయంగా వినేవరకు తనే చొరవ చూపించి లక్ష్మీ పార్వతిని పెళ్ళి చేసుకుని తర్వాత తనకన్న గొప్ప స్థాయిలో ఉన్న వాణ్ణి చేసుకుంటే అసంతృప్తి పడిన మామూలు మనిషి అనుకున్నాను.కానీ వీడియో చూశాక ఆయన సంస్కారం నన్ను ముగ్ధుణ్ణి చేసింది - మిగిలిన ఇద్దరూ ఆయన కాలిగోటికి కూడా సరిపోరు!

N.T.R కూడా అవసరం కొద్దీ చేసుకోవటం తప్ప ఆ పెళ్ళిలో విధవా పునర్వివాహ సంస్కరణ లాంటి గొప్ప ఆదర్శం గానీ జన్మాంతర సౌహృదాలు పలకరించిన అద్భుతం గానీ ఏముంది?

NTR దురుద్దేశాలకి లొంగే ఘటం కాదు గానీ ఎవరు ఏది చెప్పినా నమ్మే తత్వం ఉందని అందరికీ తెలుసు.వీరగంధం దగ్గిర ప్లే చేసిన LPనే ఇక్కడా ప్లే చేసేసరికి ఢమాల్న పడిపోయి ఉంటాడు!

లక్ష్మీ పార్వతికి రాజకీయ లక్ష్యాలు లేని వినయమే ఉంటే ఆడపెత్తనం లాంటి వార్తలు వస్తున్నప్పుడు పాదపూజలకే పరిమితమై ఒదిగి పోయి ఉండేది.29 మంది ఎమ్మెల్యేల్ని తనూ కూడగట్టి ఎత్తులు వెయ్యడానికి తగులుకుని చంద్రబాబు ముందు నిలబడలేక వెనక్కి తగ్గడం కూడా అమాయకత్వమేనా?

ఒక యదార్ధ వ్యక్తి యొక్క ప్రైవేటు సీన్సుని పబ్లిక్ సీన్సు కింద చూపించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా తనని సత్యహరిశ్చంద్రుడు పూనాడని అనటం కుళ్ళుజోకులానే అనిపించింది నాకు!


అతి చేస్తున్నాడూ అంటేనే ఆ మనిషి అబద్ధమాడుతున్నట్టు లెక్క - గుర్తుంచుకోండి!

8 comments:

  1. Varma, himself told many times not to believe him and follow him :)

    ReplyDelete
    Replies
    1. That is pure escapism! If he himself can not and does not state he has a credible version of incidents to which he is not an eye witness, why he has undertaken the task of doing this movie? Either he made the movie purely with the motto of making some money as he believes he can muster some curiosity of the movie goers as 'RGV has good brand value' or there are people who masterminded and/or funded the movie to en-cash the so called RGV brand to reap some political mileage. But it is not fair on the part of a veteran movie maker to purely sensationalize some story the credibility of which he is unsure. I tend to agree with the argument that, RGV must have some bad motives!

      Delete
  2. like balayya biopics this movie is also west

    ReplyDelete
  3. చిరంజీవి వై నన్ను చెన్నై వచ్చి తంతానని బెదిరిస్తున్నాడు!

    ఎందుకూ అంటే,"ఇది ఫలానా వ్యక్తి కోసమే వేస్తున్నాను!"
    అని ఇండైరెక్ట్ రెఫరెన్సు ఇచ్చి తన బ్లాగులోని ఒక పోష్టు దగ్గిర ఒక కామెంటు పెట్టాడు.చూస్తే సైన్సు పేరుతో చెత్తని పోగేసి రాసిన వ్యాసం అది.అందులో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపడమే పెద్ద తప్పు అయిపోయింది అతని దృష్టిలో!

    నేను ఇదివరకే "మీ భావాలను మీరు ఎలాంటి విమర్శలతో కూడిన వ్యాసాలు రాసుకున్నప్పటికీ నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు.కానీ నాకు పనికొచ్చేవీ నేను నేర్చుకోదగినవీ మీ బ్లాగులో ఉండటం లేదు గనక నన్ను మీరు వదిలెయ్యండి!" అని చాలా మర్యాదగా గతంలోనే బ్లాగు దగ్గిరే చెప్పాను.నాకు తనతో వాదించే ఉద్దేశం కూడా లేదన్న విషయమూ చాలా స్థిరంగానే చెప్పాను.

    అక్కడ వ్యాసంలో ఉన్న తప్పుల్ని చూపించటమూ తన తప్పులు తెలుసుకోకుండా ఇతర్లకి నీతులు చెప్తున్న వ్యాసరచయితని "దేవయ్య" అనటమూ తప్ప నేనెక్కడా వ్యక్తిగత విమర్శ కూడా చెయ్యలేదు.అయినా సరే, అతను మాత్రం ప్రతి కామెంటులోనూ నోటికొచ్చినట్టు పేలాడు, నన్ను పట్టుకుని "..వెధవ్వి.." లాంటి మాటలు వాడాడు.అతను నన్ను తిట్టినా నేను తనని ఏమీ అనకూడదట!అంటే, ఇంటికొచ్చి తంతాడట!

    దీని విషయంలో యాగ్రిగేటర్లూ ఇతర బ్లాగర్లూ ఏమి చేస్తారు?నాకు వ్యక్తిగతంగా ఎలాంటి నష్టమూ లేదు.కానీ బ్లాగులు అనేవాటిని పెట్టి యాగ్రిగేటర్ల ద్వారా సందర్శకులకు సౌకర్యం కలిగించే ఏర్పాటును ఇలా దుర్వినియోగం చెయ్యటం భావ్యమా?

    ఇది నా ఒక్కడికి సంబంధించిన వ్యక్తిగత చిషయం కాదు.ఇవ్వాళ నేను,రేపు మరొకరు, తర్వాత ఇంకొందరు - వ్యక్తిగత దాడికి గురవుతుంటే తిడుతున్నది నన్ను కాదని చూస్తూ వూరుకోవడం దేనికి?

    అతని భాషా సంస్కారపు స్థాయి ఇది:
    1.హన్నా! బుర్ర వాడటమే? మర్డర్లైపోతయ్....
    2.నీ సైన్సు మాస్టర్స్ మత్రమే ప్రపంచంలో టాపు అన్నట్టు, ఇక ప్రపంచంలో ఎవ్వడూ ఆ రేంజికి చేరుకోలేనట్టు ఎధవ బిల్డప్పులు ఎందుకు కొట్టుకొంటున్నావ్?
    3.7వ క్లాస్స్ చదివినోడి జ్ఞానంకూడా నీకులేదు మరి.. "గోడలు కూల్చుకో.. గుంతలు తవ్వుకో.. నాకు వెయ్యినూటపదార్లు చదివించుకో.. లేకపోతే సర్వనాశనమైపొతావ్" అని చెప్పుకుని బతికే నీకు మాస్టర్ డిగ్రీ ఇచ్చిన వెధవెవడు? డబ్బులుపెట్టి కొనుక్కునో, దొంగ సర్టిఫికేట్ళు తెచ్చుకునో.. మాట్లాడాలంటే..
    4.మీతాత నీకు వర్చువల్ రియాలిటీ గురించి చెప్పబోతే నీకెలా ఉంటుంది? నీకంటే ఎక్కువ తెలుసా మీ తాతకి? ఏదో ఒకలా చదివేవాడికి అర్ధం కాకుండా క్వశ్చన్ అడిగితేచాలు అనుకుంటూన్నావా??
    5.నాతో మాట్లాడాలంటే నీ బుర్ర 200% ఎక్కువచేసి వాడాలని ప్రీవియస్ ఎక్ష్పీరియన్స్లకే తెలిసుండాలికదా.. చిరంజీవి పేరు కనిపిస్తే చాలు... బుర్ర బ్లాంకైపోతే ఎలా?
    6.ఆ చదువుడుగాల్లే నీ తాత ముత్తాతల్ని వేదాలు చద్వనివ్వకుండా అడ్డుపడింది.. తర్వాతర్వాత.. వాళ్ళకి మంది బలం కావాల్సొచ్చినప్పుడు.. నీలాంటి కొన్ని జాతుల్ని చేరదీశారు.. అగ్రహారం అవతల్నుంచీ తెచ్చుకోని వాళ్ళ కాళ్ళదగ్గర పడేసుకుంటే.. చీము నెత్తురు లేకుండా.. రావుగోపల్రావ్ పక్కన అల్లు రామలింగయ్యలాగా.. వాళ్ళు మిగిల్చిన మందు తాగుతూ.. "మేం కాస్ట్లీ సారా తాగున్న దొరలం" అని బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. పిటి యు...
    7.రెండు నెలలు వెనక్కివెల్లి "నీ లవడా భాష" ఎక్కడ ఎందుకు ఏం రాశావో చూసుకోలేని వెధవ్వి... నువ్వు లక్షల సంవత్సరాల వెనక రాశారని చెప్పుకుంటున్న వేదాల్ని చదివి.. వాటిని ఉద్దరిస్తున్నావా. మూసుకోని.. నీ బ్లాగులో..పిట్టకథలురాసుకో ఫో..

    P.S:నీ బ్లాగులో నేను నేర్చుకోదగిన కంటెంట్ ఉండటం లేదు.నన్ను మర్చిపోయి నీ పోష్టులు నువ్వు ఏఅసుల్పెమని చెప్పాక నన్ను ఉద్దేశించి పోష్టు రాయటం మొదటి తప్పు!

    అగస్త్యసంహిత గురించి ఎప్పుడో తయారు చేసిన బ్యాటరీలు ఇప్పటికీ మిగిలి లేవేంటని తను అడిగితే నేను జవాబు చెప్పలేదనీ అది నా బట్టలు చింపేసిన తన ఘనకార్యమనీ ఏంటేంటో వాగుతున్నాడు.ఇతరుల బట్టలు చింపాలనే తన దురదకీ బట్టలకి సంబంధించిన తన ఫెటిషిష్టు రోగానికీ నా బాధ్యత లేదు!నేను తనతో వాదించకూడదనే మాటకి కట్టుబడి జవాబులు చెప్పలేదు.అక్కడ నేను చేసింది వ్యాసంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపించటమే. చేతనైతే అవి తప్పులు కాదని సమర్ధించుకోవాలి, లేదంటే తప్పులని ఒప్పుకోవాలి - దానికి అహంకారం అడ్డొస్తే నోరు మూసుకుని కూర్చోవాలి.తను చెయ్యాల్సిన పని వొదిలేసి నన్ను ప్రశ్నలు అడగటం ఏంటి?తను అడిగే ప్రతి చెత్త ప్రశ్నకీ జవాబు చెప్తానని నేను మాట ఇచ్చానా?లేదే!

    తను నాకు నెప్పి పుట్టేలా తిట్టాకనే నేనూ తనకి నెప్పి పుట్టేలా తిట్టాను.ఇతర్లు తనని తిడితే కోపం వచ్చేటప్పుడు తను ఇతర్లనీ తిట్టకుండా ఉంటే సరిపోతుంది కదా!

    ReplyDelete
    Replies

    1. కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్

      Delete
    2. "చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా?"
      కలల్లో విహరించాలనుకునేవారికి అబద్ధాలే ప్రియం - సత్యం బోధపడింది, నెనర్లు!

      Delete
  4. ����������������������������

    ��నేటికి థాయిలాండ్ లో రామరాజ్యమే ఉంది��.

    థాయిలాండ్ లో రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అనే మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్ " అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు.

    ☘సంక్షిప్తంగా ఇతిహాసాలలో శ్రీరాముని చరిత్ర.☘

    వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండ లోని 70,71 &73 సర్గలలో రాముని వివాహాన్ని , తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే -

    మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీనది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ , మాండవి , శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా (పేజీ 354), సీతారాములకు లవకుశులు , ఊర్మిళాలక్ష్మణులకు అంగద చంద్రకేతులు , మాండవీభరతులకు పుష్కరుడు - తక్షుడనే వాళ్ళు , శృతకీర్తిశతృఘ్నులకు సుబాహువు - శతృఘాతకుడనేవాళ్ళు జన్మించారు.

    ��శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.

    పశ్చిమంలో లవునకు లవపురం ( లాహోర్ ) , తూర్పున కుశునకు కుశావతి , తక్షునకు తక్షశిల , అంగదునకు అంగదనగరం , చంద్రకేతునకు చంద్రావతి లను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పుదిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్ లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని #చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణుభగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా ! అందువలన వీళ్ళు తమ పేర్లచివర #రామ్ అన్న పేరు తగిలించుకుని , వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే #భూమిబల్_అతుల్య_తేజ్.

    ��థాయిలాండ్ యొక్క అయోథ్య

    థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో Bangkok అని అంటున్నాము కదా ! అయితే ప్రభుత్వరికార్డులలో అధికారిక రాజధాని పేరువింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధాను లలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్ , ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి - " క్రుంగదేవ మహానగర
    అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి " .

    థాయిభాషలో పైపేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకోవిశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు , పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోథ్యలోనే నివసిస్తారు.

    �� థాయిలాండ్ లో నేటికీ రామరాజ్యం ఉంది.

    థాయిలాండ్ లో 1932 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా , రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వారనెవరినీ విమర్శించడం గానీ , వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులని విశ్వసిస్తారు. రాజవంశంవారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూధర్మశాస్త్ర పరిజ్ఞానముంది.

    �� థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం

    థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా , వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకిరామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణశక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మనదేశంలోలాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం.

    థాయిలాండ్ లో రామ్ కియేన్ ( రామాయణం) ని అనుసరించి నాటకాలు , తోలుబొమ్మలాటలు ఉన్నాయి. వారి నాటకాలలోని పాత్రలు చూద్దాం -
    1. రామ్ ( రాముడు )
    2. లక్ ( లక్ష్మణుడు )
    3. పాలీ ( వాలి )
    4. సుక్రీప్ (సుగ్రీవుడు )
    5. ఓన్కోట్ ( అంగదుడు )
    6. ఖోంపూన్ ( జాంబవంతుడు )
    7. బిపేక్ ( విభీషణుడు )
    8. తోతస్ కన్ ( దశకంఠ ) రావణుడు
    9. సదాయు ( జటాయు )
    10. సుపన్ మచ్ఛా (శూర్పణఖ )
    11. మారిత్ ( మారీచుడు )
    12. ఇంద్రచిత్ (ఇంద్రజిత్ ) మేఘనాదుడు.

    �� థాయిలాండ్ లో హిందూదేవీదేవతలు

    ఇక్కడ బౌద్ధులు అధికసంఖ్యాకులు. హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బౌద్ధులు కూడా ఈ హిందూ దేవీ దేవతలను పూజిస్తారు.
    1. ఈసుఅన్ ( ఈశ్వర్ ) శివుడు
    2. నారాయి (నారాయణ్ ) విష్ణువు
    3. ఫ్రామ్ ( బ్రహ్మా )
    4. ఇన్ ( ఇంద్రుడు )
    5. ఆథిత్ ( ఆదిత్య ) సూర్యుడు
    6. పాయ్ ( వాయు )

    ReplyDelete
  5. నిన్న కేసీఆర్ గారు రాజకీయనాయకులకు రామజన్మభూమి తో పనేమిటీ అదంతా స్వామీజీలు చూసుకుంటారు అని అన్నారు. మొన్న అసదుద్దీన్ గారేమో పండిట్ రవిశంకర్ గారికి రామజన్మ భూమితో పనేంటీ అని అన్నారు. మీరు రాజకీయ నాయకులూ కాదు స్వామీజీ కూడా కాదు.
    ఏవిటీ ధాయ్‌లాండ్ గోల ?

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...