Sunday, 31 March 2019

డబ్బుని ఎవరు పుట్టిస్తున్నారు?డబ్బుని ఎలా పెంచుతున్నారు?డబ్బు ఎలా ఉపయోగించుకుంటున్నారు?డబ్బుని లేకుండా చెయ్యలేరా!

          గత వ్యాసంలో డబ్బు ప్రజల మధ్య ఎలా వ్యాపిస్తుంది అనేది చూశాం, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అసలు కరెన్సీని ఎలా ముద్రిస్తుందో చూద్దాం.మొదటి వ్యాసం కేవలం పరిచయం మాత్రమే గనక పైపైన తడిమి వదిలేశాను.ఇప్పటినుంచి విషయం క్రమేణ సంక్లిష్టం అవుతుంది.ఈజీగా తేల్చెయ్యాలంటే రిజర్వ్ బ్యాంక్ ఎలా పని చేస్తుందో చెప్పేస్తే చాలు.కానీ, ఇది ఇలాగే ఎందుకు జరగాలి అనే సందేహం తీరాలంటే కొంచెం చరిత్రలోకి తొంగి చూడాలి.

          "దేశభక్తి" ఇవ్వాళ ఆకర్షణీయమైన పదం. కాని, ఒకప్పుడు "దేశం" అనే పదానికి ప్రాంతం ఆని తప్ప్ప మరొక ప్రత్యేకత లేదు.అప్పుడు "రాజభక్తి" ఆకర్షణీయమైన పదం - ఈ రెంటికీ తేడా ఏమిటి?దేశం అంటే ఏమిటి, రాజ్యం అంటే ఏమిటి, దేశానికీ రాజ్యానికీ మధ్యన తేడాలూ పోలికలూ ఏమిటి అని సవాలక్ష సందేహాలతో సతమతం అయిపోకుండా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే రాజ్యానికి కావలసిన డబ్బుని రాజ్యం చెప్పుచేతల్లో నడిచే ఖజానా ముద్రిస్తుంది, దేశానికి కావాల్సిన డబ్బుని ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండని ఒక సెంట్రల్ బ్యాంక్ ముద్రిస్తుంది. 

          ప్రపంచ చరిత్రలోని అనేక ప్రాచీన కాలపు రాజ్యాలు విచ్చిన్నమై ఆధునిక కాలపు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతనే వాటిని దేశాలు అని వ్యవహరించటం గమనిస్తే ఇది ఎంత ఖచ్చితమైన నిర్వచనమో అర్ధం అవుతుంది.

          మన దేశపు ఆర్ధిక వ్యవస్థకు అతి కీలకమైన Reserve Bank of India(RBI) ఒక సర్వస్వతంత్రమైన సంస్థ - 1. Issue of Bank Notes, 2. Banker to Government, 3. Custodian of Cash Reserves of Commercial Banks, 4. Custodian of Country’s Foreign Currency Reserves, 5. Lender of Last Resort, 6. Central Clearance and Accounts Settlement, 7. Controller of Credit అనే అతి ముఖ్యమైన విధుల్ని నెరవేరుస్తున్నది కాబట్టి ఆర్ధికశాస్త్రంలో పట్టు లేని వ్యక్తులు దాన్ని ఉపయోగించుకుని సత్ఫలితాలు పొందాలే తప్ప దర్పాన్ని ప్రదర్శించితే శృంగభంగం తప్పదు - అటువైపున ఉన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నరు కూడా అహంకారి అయితే తన మీద ప్రభుత్వం చేస్తున్న పెత్తనానికి కినిసి తప్పుడు సలహాలు ఇస్తే ప్రధాని పరువూ పోతుంది ప్రజలూ కల్లోలానికి గురవుతారు!

          రిజర్వ్ బ్యాంకు నోట్లని ముద్రించటానికి ఉన్న సాంకేతికపరమైన మార్గదర్శకాలు చాలా తక్కువ.ఇందుకోసం 1956లో Minimum Reserve System అనే ఏర్పాటు చేసుకుంది.దీని ప్రకారం రిజర్వ్ బ్యాంకు సర్వకాల సర్వావస్థల్లోనూ తన అధీనంలో 200 కోట్ల రూపాయలను బంగారం నిల్వల రూపంలోనూ విదేశీమారకద్రవ్యం రూపంలోనూ ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుంటుంది.నోట్ల తయారీలో గానీ ఇతర విధుల విషయంలో గానీ ఇది ఎలాంటి ప్రభావాన్నీ చూపించకపోయినా ఒక కంపెనీ ప్రభుత్వానికి చూపించాల్సిన మూలధనంలా ఉంటుంది.

          ఇక ప్రతి సంవత్సరం కొత్త నోట్లని ముద్రించడానికి స్థూల జాతీయోత్పత్తిని కాక growth rate అనే దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.కరెన్సీ అనేది చేతులు మారేది అమ్మకం, కొనుగొళ్ళు అనేవి జరిగే చోటనే కదా - మరి ఇన్ని కొత్త ట్రాన్సాక్షన్లు జరుగుతాయని రిజర్వ్ బ్యాంకు ఎలా వూహిస్తుంది?

          వూహలతోనూ స్వప్నాలతోనూ ఆర్ధికాన్ని నడిపిస్తే హార్దికం ఫెడేల్ మంటుంది - గ్రోత్ రేట్ 9% ఉంటే 9 x 2 + 4 = 22% అని లెక్క ఉంది.అంటే రాబోయే సంవత్సరంలో సాధించగలమని అంచనా కట్టిన గ్రోత్ రేటుకి రెండింతల స్థాయిలో కరెన్సీ కావాలి,ఇక 4 శాతం అనేది నిరంతరం ఎదుగుతున ఆర్ధిక వ్యవస్థలో ఉండే మినిమం ఇన్‌ఫ్లేషన్ యొక్క శాతం.ఈ 4% ద్రవ్యోల్బణం వాంఛనీయమే!

          మనం ఒక ఉద్యోగం చేస్తే వచ్చే నెల జీతం,మనం ఒక వస్తువును అమ్మితే వచ్చే లాభం, మనం వేరేవాళ్ళకి అప్పు ఇస్తే వచ్చే వడ్డీ అనే రకరకాల మార్గాలలో వచ్చే డబ్బు రిజర్వ్ బ్యాంక్ ముద్రించి ఇచ్చినదే అయి వుండాలి - దీన్నే వైట్ మనీ అంటారు.అలా కాక మనం ఒక వస్తువుని లక్ష రూపాయలకి అమ్మి క్రయపత్రంలో పదివేలకే అమ్మినట్టు రాస్తే ఆ మిగిలిన తొంభై వేలూ బ్లాక్ మనీ అవుతుంది. దీనితో గనక బహిరంగ మార్కెట్టు దగ్గిర క్రయవిక్రయాల్ని చేస్తే ఠపీమని రిజర్వ్ బ్యాంకు పట్టేసుకోగలుగుతుంది!మరి, బహిరంగ మార్కెట్టు దగ్గిర దేన్నీ కొనడానికి పనికిరాని పద్ధతిని ఏ లాభమూ లేకుండా ఎందుకు అనుసరిస్తున్నారు?

          నల్ల ధనంలో ఎక్కువ శాతం దేశంలో అరాచకం సృష్టించే అరాచక మూకలకు ఆయుధాలను కొనుగోలు చేయడానికి పోతుంది,మత సంస్థలకు విరాళాలు ఇవ్వడం ద్వారా తన నలుపుని తొలగించుకుని కొంత శాతం తెలుపు అయిపోతుంది.దీనికి కేవలం క్రైస్తవ మత సంస్థలే కాదు హిందూ మత సంస్థలు కూడా సహాయం చేస్తున్నాయి. తర్వాత స్థానం తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రభుత్వంలో ఉన్నవారికి ముడుపుల కింద పోతుంది - జగన్ కావచ్చు, కేసీయార్ కావచ్చు,చంద్రబాబు కావచ్చు,మోదీ కావచ్చు, అద్వానీ కావచ్చు, యడ్యూరప్ప కావచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు - నల్లధనాన్ని సృష్టించేవాళ్ళు గానీ వ్యాపింపజేసేవాళ్ళు గానీ అందుకునేవాళ్ళు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు నిజమైన అభివృద్ధిని చూపించటానికి తమ శక్తియుక్తుల్ని ఉపయోగించరు!

          విచిత్రమైన విషయం ఏమిటంటే, అది వాళ్ళ తప్పు కాదు, నిస్సహాయత మాత్రమే! అసలైన విషాదం ఏమిటంటే వాళ్ళని నిస్సహాయుల్ని చేసింది జాతిపిత అని కీర్తించబడుతున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ లాంటి గోముఖ వ్యాఘ్రాలే!ఆ చిత్రం ఏమిటో తెలియాలంటే Utsa Patnaik పరిశోధన ప్రకారం 1765 నుంచి 1938 వరకు మొత్తం $45మిలియన్ల సంపదని సృష్టించి ఇప్పుడు "మా దేశంలో ఒకప్పుడు జరిగిన పారిశ్రామిక విప్లవం వల్లనే మేము ప్రపంచమంతటికీ వ్యాపించి వాళ్ళకీ వీళ్ళకీ నాగరికత నేర్పి బీద దేశాల్ని అభివృద్ధి చేసి గొప్పవాళ్ళమయ్యా"మని విర్రవీగుతున్న అప్పటి బీద దేశాలకి కళ్ళు చెదిరే వైభవాలను సమకూర్చిన పాడియావు లాంటి భారతదేశం కేవలం ఒక దశాబ్దం గడిచి స్వతంత్రం వచ్చేనాటికి ఎగ్గొడితే తప్ప ఎంత నిజాయితీగా శ్రమించినా ఏనాటికీ తీరనంత అప్పుని నెత్తిన వేసుకున్న కధ తెలియాలి - అది వచ్చే వ్యాసంలో చెబుతాను.

(this is the second part of a series on macro economy!)

Saturday, 30 March 2019

డబ్బు ఎలా పుడుతుంది?డబ్బు ఎలా పెరుగుతుంది?డబ్బు ఎలా ఉపయోగపడుతుంది?డబ్బు లేకుండా బతకలేమా!

          డబ్బుని తయారు చెయ్యటానికి కూడా చాలా డబ్బు ఖర్చవుతుందండోయ్!కాగితం,సిరా, సాంకేతికత, ముద్రణ సౌకర్యం - ముఖ్యంగా నకిలీ నోట్లని తయారు చేసే వీలు లేకుండా తీసుకోవలసిన జాగ్రత్తలతో సహా ప్రతి సంవత్సరం కొత్త కరెన్సీని ప్రజలకి అందుబాటులోకి తేవటానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ రేంజిలోనే ఉంటుంది - 2016లో అక్షరాలా 3,421 కోట్లు, అంటే 502 మిలియన్ డాలర్లు!

          ఆ యేడాది స్థూల జాతీయోత్పత్తి 84 లక్షల కోట్లలో ఇది 0.04% మాత్రమే కావచ్చు, కానీ అంత తక్కువ శాతం పొదుపైన విషయమే అయినప్పటికీ నిర్వహణ చాలా చాలా కష్టం. మనకన్న అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ కరెన్సీ తయారీని out-source చేసేసుకుని హ్యాపీగా ఉంటున్నాయి.ఎక్కువ స్థాయిలో కరెన్సీ నోట్లని ఉపయోగించేవీ సొంతంగా తయారు చేసుకునేవీ అయిన దేశాల్లో చైనా తర్వాత రెండవ స్థానంలో ఉంది మన దేశం.ఫెళఫెళలాడే కొత్త నోట్లని మురిపెంగా చూసుకుని పదే పదే తడుముకుని మురిసిపోయే మనస్తత్వం వల్లనే డెబిట్ కార్డు వాడకం పెరగటంలేదు, అన్ని విషయాల్లోనూ అమెరికన్లని ఇమిటేట్ చెయ్యటమే ఆధునికత అనుకునేవాళ్ళు కూడా ఈ విషయంలో మాత్రం కార్డు కన్న కరెన్సీనే ముద్దు చేస్తున్నారు!!

          అన్ని వారసత్వాల లాగే నోట్లని తయారు చేసుకునే వారసత్వం కూడా తెల్లదొరల నుంచి సంక్రమించినదే. నిన్నమొన్నటివరకు అన్ని ముడిసరుల్నీ దిగుమతి చేసుకుని వాటితో నోట్లని తయారు చేసుకునేవాళ్ళం - ముఖ్యమైన watermarked paper జర్మనీకి చెందిన Giesecke & Devrient నుంచీ బ్రిటనుకి చెందిన De La Rue వంటి కంపెనీల నుంచీ కొనుక్కునేవాళ్ళ్ళం - మొత్తం ఖర్చులో 95% దీనికే సరిపోతుంది.

     భారత దేశం ప్రతి సంవత్సరం 22,000 మెట్రిక్ టన్నుల కాగితాన్ని ఉపయోగించుకుంటున్నది.2016 జూన్ ఆఖరుకి Reserve Bank of India (RBI) తయారు చేసి వదిలిన నోట్ల సంఖ్య 21.2 బిలియన్లు.వాటికి అయిన ఖర్చే పైన మనం చూసిన 4,321 కోట్ల రూపాయలు.

          ఈ ఖర్చును తగ్గించి పేపర్ కరెన్సీ వాడకం వల్ల ఎదురయ్యే సవాళ్ల నుంచి ఆర్ధిక వ్యవస్థని రక్షించటానికే మోదీగారు De-Monitization అస్త్రాన్ని ప్రయోగించారు.మొత్తం డీమోనిటైజేషన్ ప్రక్రియలో పెద్దనోట్లరద్దు ఒక భాగమే, కానీ ఈ దేశంలో సామాన్య ప్రజలకే కాదు విద్యావంతులకి కూడా  మార్పుని వ్యతిరేకించే మూర్ఖత్వమూ ఎజెండాలకు అంటుగట్టుకుపోయిన మొండితనమూ ఉండటం వల్ల ఆ మొత్తం వ్యవహారాన్ని పెద్దనోట్లరద్దు అనే తంతు కిందనే పరిగణించేసి కరెన్సీ వాడకాన్ని మాత్రం యధేచ్చగా కొనసాగిస్తున్నారు.

     నా మట్టుకు నేను ప్రభుత్వం ఆమోదించిన ఒక యాప్ నా మొబైలు ఫోనులో పెట్టుకున్నాను.కరెంటు బిల్లు లాంటి పేమెంట్లన్నీ దానిద్వారానే చేస్తున్నాను - ఇదివరకు గంట పట్టే కరెంటు బిల్లు కట్టడం అనే పని ఒకట్రెండు నిముషాల్లో పూర్తయిపోతున్నది!IRCTC యాప్ నుంచి రైల్వే టిక్కట్లు బుక్ చేసుకోవడం ఎంత ఈజీ!ఫలానా మాట చెప్పినవాడు నాకు నచ్చలేదు, ఫలానా పని చెయ్యమన్నవాడు బ్రాహ్మణ మతానికి చెందిన అగ్రకుల దురహంకారి - కాబట్టి వాడు చెప్పింది మంచి అయినా నేను చెయ్యను అని హఠం చేస్తే ఎవరికి నష్టం?GST ఫెయిలవటమూ, యడ్డీ డైరీల తరహా చెల్లింపులూ ప్రజలు డీమోనిటైజేషనుని ప్రోత్సహించకపోవటం వల్లనే జరిగాయేమో కదా!

          ఏమైతేనేం, 2015 నుంచి out-sourcing ఆగిపోయింది.ప్రస్తుతం అన్ని 500, 2000 నోట్లూ మైసూరులోనే తయారవుతున్నట్టు తెలుస్తున్నది - రిజర్వ్ బ్యాంక్ పూర్తి వివరాల్ని చెప్పటం లేదు. మన నోట్లని మనమే ముద్రించుకోవటం మొదలుపెట్టిన 90 యేళ్ళకి పూర్తి స్వదేశీ నోట్లని వాడుకోగలుగుతున్నాం - నిజంగా గొప్ప విషయమే!

          British colonial government ఈ దేశంలో చలామణి చెయ్యాలనుకుంటున్న కరెన్సీని ముద్రించటం 1862లో మొదలుపెట్టింది.మొట్టమొదట out sourcing contract తీసుకున్న Thomas De La Rue సంస్థ అసలు playing cardsనీ postage stampsనీ ప్రింట్ చేస్తూ చిన్న స్థాయిలో మొదలై క్రమేణ కరెన్సీ నోట్ల వ్యాపారంలోకి అడుగుపెట్టి 200  సంవత్సరాల తర్వాత ఇవ్వాళ దాదాపు ప్రపంచంలోని అన్ని కమర్షియల్ బ్యాంకులకీ నోట్లని ముద్రించి ఇవ్వటంలోనూ కాగితాన్ని సప్లై చెయ్యటంలోనూ ఏకఛ్చత్రాధిపత్యం సాధించేసింది!

          మన దేశానికి కావలసిన కరెన్సీని దేశం లోపలే తయారు చేసుకోవాలనే నిర్ణయం 1920లలో జరిగింది.అలా 1926 నుంచి మహారాష్ట్రలోని నాసిక్ ముద్రణాలయం యొక్క నిర్మాణం మొదలైంది.రెండు సంవత్సరాల తర్వాత అంతకుముందు ఉన్న డిజైనునే తీసుకుని 5 రూపాయలనోట్లని ముద్రించటం మొదలుపెట్టి క్రమేణ సొంత డిజైన్లను కూడా రూపొందించుకుని 100, 1000 రూపాయల నోట్లనే కాకుండా 10000 రూపాయల నోట్లని కూడా ముద్రించటం కొనసాగించింది. స్వతంత్రం వచ్చాక కూడా చాలా కాలం పాటు నాసిక్ ప్రెస్ ఒక్కటే అన్ని నోట్లనీ ముద్రిస్తూ ఉండేది.కానీ, భారతీయులకి నోట్ల వాడకం అవసరమే కాక సరదాగా మారి స్టేటస్ సింబల్ కూడా అయిపోవడం వల్ల  భారత ప్రభుత్వం 1973లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని Dewas దగ్గిర మరొక ప్రెస్సుని మరింత కట్టుదిట్టమైన సెక్యూరిటీతో ప్రారంభించింది. 

           1997 నాటికి మొత్తం నోట్లన్నీ ఈ రెండు చోట్లనుంచే వస్తూ ఉండేవి. కానీ, పెరిగిన జనాభా ఇబ్బడిమిబ్బడిగా నోట్లని వాడుతుండటం వల్ల పెరిగిన డిమాండును తట్టుకోలేక అప్పటి ప్రభుత్వం 3.6 బిలియన్ నోట్లని ముద్రించటానికి American, Canadian, European(including De La Rue) కంపెనీలకి ప్రింటింగ్ ఆర్దర్ ఇచ్చింది - ఇది $95 million వ్యవహారం కావటంతో సహజంగానే దీని చుట్టూ వివాదం చెలరేగింది!ఇంక లాభం లేదని, ఆ వివాదాన్ని ఎలాగోలా తట్టుకుని 1999లో మైసూరు ప్రెస్సునీ 2000 సంవత్సరంలో సల్బోని ప్రెస్సునీ ప్రారంభించింది.నోట్ల తయారీకి కావలసిన పేపరును 1968 నుంచి Hoshangabadలోని Security Paper Mill అందిస్తున్నది.కానీ దీని సామర్ధ్యం 2,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కావటం వల్ల మిగిలిన కాగితాన్ని Britain, Japan, Germany వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తూనే ఉన్నది.

          2015లో ప్రధాని మోదీ ఈ పరిస్థితి పట్ల గట్టి వ్యతిరేకతని వ్యక్తం చేసి Hoshangabad మిల్లు సామర్ధ్యాన్ని పెంచడానికీ మైసూరు ప్రెస్సుకి దగ్గిర్లో 12,000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో మరొక మిల్లుని నిర్మించడానికీ తగిన చర్యలు తీసుకున్నారు.అయితే, ఇప్పటికీ దిగుమతులను పూర్తి స్థాయిలో ఆపెయ్యలేకపోవచ్చు గానీ దిగుమతుల భారంలో మట్టుకు చాలా తేడా వస్తుంది.

          అన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించేసి అది శక్తి చాలక చతికిల పడుతుంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళని తిట్టేసి ఘనకార్యం చేసినట్టు ఫీలవ్వడం కాదు, మనం చెయ్యాల్సిన చిన్న చిన్న పనుల్ని మనమూ చెయ్యాలి.మన బాధ్యతని మనం నెరవేర్చి అప్పుడు బాధ్యత లేనివాళ్ళని విమర్శించితే ఆ విమర్శకు బలం వస్తుంది. అలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తుల వల్లనే చరిత్ర తన గతిని పతనం నుంచి పురోగతికి మార్చుకుంటుంది - దురదృష్టవశాత్తు  ఇవ్వాళ దేశంలో అలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తుల సంఖ్య చాలా తక్కువ, అసలైన మైనారిటీ వీళ్ళే!
(this is the first part of a series on macro economy!)

Friday, 22 March 2019

హైందవేతరులు విగ్రహారాధన పాపం అని ఎందుకు అంటున్నారు?హిందువులు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా!

హిందువులు ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఒకటే!

వేదం దేన్నీ పాపం పేరున నిషేధించలేదు.కొన్నింటి విషయంలో "ఇది చెయ్యదగినది!" అని ప్రోత్సహించడమూ కొన్నింటి విషయంలో "ఇది చెయ్యకూడనిది!" అని సలహాలూ హెచ్చరికలూ ఇవ్వడం తప్ప "ఇది పాపం!ఈ పని చేస్తే నేను మిమల్ని నరకంలోకి పడదోసి అనంతకాలం వరకూ అక్కడే ఉంచి భయంకరమైన శిక్షలకు గురిచేస్తాను!" అని గానీ "ఇది పుణ్యం!ఈ పని చేస్తే మిమల్ని స్వర్గానికి పంపించి అనంతకాలం వరకూ అక్కడే ఉంచి సకలసౌఖ్యాలూ అమర్చి సుఖపెడతాను!" అని గానీ మన దేవుడు ఎక్కడా చెప్పలేదు.

ఇది గుర్తుంచుకుంటే చాలు - సందేహాలు రావు.అసలు కీలకం చాగంటి వెంకట రమణ గారికి కూడా తెలియకపోవడం వల్ల ఇన్ని వీడియోలతో ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నారు!

"విగ్రహారాధన మహా పాపం!" అనేది హైందవేతరులైన ఫాదర్లూ ముల్లాలూ చేస్తున్న వింత వాదన.వింత వాదన అని ఎందుకు అంటున్నానంటే, నాకు వారి మతగ్రంధాలలో పాపం అని చెప్తున్న దాని గురించి కూడా స్పష్టంగా తెలుసు.రమణ గారికి వేదం మీద మంచి పట్టు ఉన్నది.కానీ మనం దీన్ని వేదం ఏమి చెప్తుంది అనే కోణంలో చూస్తే అర్ధం కాదు.విగ్రహారాధన పాపం అంటున్న అబ్రహామిక్ మతాల ప్రకారం పాపం అంటే ఏమిటో తెలుసుకుంటే గానీ ఈ చిక్కుముడి విడిపోదు.

అసలు బైబిలు లోని ఉల్లేఖనం ప్రకారం పాపం అంటే ఏమిటో చివరి భాగంలో చెప్పి ముగిస్తాను.ప్రస్తుతం ఆ మతాల ప్రచారకుల ప్రకారం వాళ్ళ హడావిడికి కంగారుపడి ఇప్పుడు చేస్తున్న విగ్రహారాధన మానేసినప్పటికీ వాళ్ళ దృష్టిలో అప్పటికి కూడా హిందువులు పాపులే అవుతారు.అది యెట్లా అంటే - క్రైస్తవుల దృష్టిలో "యహోవా ఒక్కడే దేవుడు!యేసు మాత్రమే నా రక్షకుడు!" అని నమ్మకపోవటమే పాపం, ముస్లిముల దృష్టిలో "అల్లాహ్ ఒక్కడే దేవుడు!మహమ్మదు మాత్రమే నా ప్రవక్త/మార్గదర్శి!" అని నమ్మకపోవటమే పాపం.

వాళ్ళ మతాంతరీకరణ వ్యూహంలో మిమ్మల్ని విగ్రహారాధనకి దూరం చెయ్యటం మొదటి మెట్టు,ఒకసారి వాళ్ళు పాపం అంటున్నారు కదాని చేస్తున్న విగ్రహారధనని మానేశారనుకోండి "శభాష్!మీరు ఇప్పుడు సరైన దారిలో నడుస్తున్నారు!" అని ఉబ్బేసి "మరి, మా మతంలోకి వచ్చి మా దేవుణ్ణి ఒప్పుకుంటే ఇంకా మంచిది,అనంతకాలపు స్వర్గసుఖాలు అనుభవించవచ్చును కదా!" అని బేరం పెడతారు - మీరు అది కూడా నమ్మేశారనుకోండి, అంతటితో ఒక హిందూ సింహం క్రైస్తవ/మహమ్మదీయ గొర్రె అయిపోతుంది!

మన పెద్దలు కూడా విగ్రహారాధన మొదటి మెట్టు మాత్రమే, వీలయినంత త్వరలో విగ్రహాల మీద వ్యామోహం తగ్గించుకుని విశ్వం అంతటిలోనూ దైవాన్ని చూడండి అనే చెప్తున్నారు, తేడా అల్లా మన గ్రంధాల గురించి తెలియని వాళ్ళు మనల్ని భయపెట్టడంలో ఉంది!

అసలు ఆయా మతాల్ని ఫాలో అవుతున్న గొర్రెలకి కూడా తెలియని వింత యేమిటంటే, ఒక మనిషి క్రైస్తవుడైనా ముస్లిమయినా చనిపోయిన మరుక్షణమే స్వర్గానికి వెళ్ళడు - యేసు రెండవ రాకడ అనే కధ దానికోసం సృష్టించబడినదే, దాని ప్రకారం యేసు రెండవసారి వచ్చేవరకు అన్ని తరాల మృతులూ ప్రేతాలుగా బుద్ధిమంతులైతే వాళ్ళ శవాల్ని అంటిపెట్టుకుని ఉండియో అసంతృప్త జీవనం గడిపినవాళ్ళైతే ఎగ్జార్సిస్ట్, హాంటెడ్ లాంటి సినిమాల్లో చూపించినట్టు బతికున్నవాళ్ళని ఆవహించి అల్లరి చేస్తూనో గడుపుతారు.

యేసు రెండవసారి వచ్చినప్పుడు అధికారికమైన బాప్తిజం పొందినవారికి మాత్రమే స్వర్గవాసం దక్కుతుంది!వాళ్ళు పాపం అని చెప్తున్నారు గదాని విగ్రహారాధన మాత్రం మానేసి బాప్తిజం తీసుకోకుండా హిందువులుగానే ఉన్నా నరకానికే వెళ్తారు.నేను చెప్తున్నది నమ్మలేకపోతే ఏ పాస్టరునైనా అడిగి తెల్సుకోండి, లేదంటే, తెలుగు బైబిలు పుస్తకం చదివినా తెలుస్తుంది.మా ప్రవక్తయే ఆఖరి ప్రవక్త అయినప్పటికీ ముందరి ప్రవక్తల్ని కూడా  గౌరవిస్తాము అనే మెలికతో ముస్లిం మతప్రచారకులు కూడా దాదాపు ఇదే చెబుతారు.అయితే, వాళ్ళకి జెహాదులో పాల్గొంటే. గనక వీరు యేసు రెండవ రాకడకు ప్రత్యామ్నాయంగా చెప్పిన  తీర్పు దినం వరకు ఎదురు చూడకుండా చచ్చిపోయిన వెంఠనే స్వర్గవాసం దక్కుతుందనే వెసులుబాటు ఇచ్చారు - అది వారి సరుక్కి అదనపు ఆకర్షణ అని అర్ధం చేసుకోవాలి. మరి, క్రైస్తవ్యం నుంచి కూడా మహమ్మదీయంలోకి లాగడానికి ఏదో ఒక రాయితీ ఇవ్వాలి కద!

మనకి చచ్చాక కూడా ఏవడో గొట్టాంగాడు వచ్చేవరకు ఎదురు చూడాల్సిన దరిద్రం లేదు - పాపరాశి శూన్యం అయితే మోక్షం, మిగిలి ఉంటే మళ్ళీ జన్మ!,మీదుమిక్కిలి వాళ్ళలా మా దేవుణ్ణి నమ్మినవాళ్ళకే స్వర్గం, మా దేవుణ్ణి నమ్మనివాళ్ళకి నరకమే గతి అనే వేర్పాటు కూడా లేదు!

నేనే కాదు ఏ హిందువూ ఇతర  హిందువులకి ఈ విషయం గురించి ఇంతకన్న వివరమైన సమాధానం ఇవ్వలేరు - ప్రస్తుతానికి!

ఇప్పటికీ సమాధాన పడలేని హిందువులు తమ ముందర "విగ్రహారాధన పాపం!" అంటున్న అవతలివాళ్ళనే "మీ దృష్టిలో పాపం అంటే ఏమిటి?" అని అడిగితే వాళ్ళు తెలివైనవాళ్ళయితే మౌనం వహిస్తారు, తెలివితక్కువవాళ్ళయితే మరింత చెత్త లాజిక్కులతో మిమ్మల్ని ఇంకొంత గందరగోళానికి గురి చేస్తారు - అప్పుడు ఖచ్చితంగా జ్ఞానోదయం కావచ్చు!

ఆఖర్లో చెప్తానన్న అసలైన విషయం యేమిటంటే, బైబిలు ప్రకారం పాపం అంటే "ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవటం" అని ఈడెను తోట కధలో అసందిగ్ధం అవిస్తరం సందేహరహితం అన్నంత కొట్టొచ్చినట్టు కనబడుతుంది!పోనీ అనువాదం తప్పు చేశారేమో అనుకోవడానికి వీల్లేకుండా ఇంగ్లీషు ప్రతి కూడా దానినే రూఢి పరుస్తుంది!

మీరు హిందువా క్రైస్తవుడా మహమ్మదీయుడా అనేది మర్చిపోయి మతగ్రంధాల సంగతి కూడా వదిలేసి కామన్ సెన్సుతో ఆలోచించినా "ఏది మంచి ఏది చెడు అని తెలిశాక పనిగట్టుకుని చెడు చేసినప్పుడే అది పాపం అవుతుంది!" అని చెప్పడమే సరైనది కానీ అసలు "ఏది మంచి  ఏది చెడు అని తెలుసుకోవడం" అనే సమస్త జంతుజాలం నుంచి మానవుణ్ణి వేరు చేసి అధికుడిగా నిలబెట్టిన ప్రత్యేకతని చిన్నబుచ్చడం తప్పు అని తెలుస్తుంది.ఈ పాయింటుతో ఇప్పటికి నాలుగు గొర్రెల్ని చంపేశాను.పాస్టర్లనే కాదు పోపుని సైతం చంపగలిగిన బ్రహ్మాస్త్రం ఇది.

హిందువులు దేని గురించీ కంగారు పడాల్సిన పని లేదు!

Wednesday, 20 March 2019

కేసీయారు జాతీయ రాజకీయాలలోకి వెళ్ళి యేమి సాధించాలని అనుకుంటున్నాడు?అందులో అతను విజయం సాధించగలడా!

ఏరుల జన్మం శూరుల జన్మం అన్నట్టుగానే రాజకీయ నాయకుల జననం కూడా పుట్టుకతోనే మొదలు కాదు.రాజకీయాల్లో ఇవ్వాళ యే స్థానంలో ఉన్న నాయకుడైనా అతనికి యవ్వనం నుంచీ రాజకీయాలంటే ఆసక్తి ఉండి ఏదో ఒక రాజకీయ పార్టీలో సామాన్య కార్యకర్తగా నమోదు కావడంతోనే మొదలవుతుంది.అయితే, ఇలాంటి అనామక జీవితం గడిపే కోటానుకోట్ల కార్యకర్తల మధ్య నుంచి పదిమందికీ పరిచయమయ్యే తొలి సన్నివేశం నుంచి ఒక నాయకుడి జీవితాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది.

అట్లా చూస్తే "నవ తెలంగాణ నిర్మాత" అనే ఇవ్వాళ్టి దుర్నిరీక్ష్య శక్తి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనే 65 సంవత్సరాల వ్యక్తి యొక్క తొలినాటి ముద్దు పేరు "దుబాయ్ శేఖర్"!అది సా.శ 1980ల నాటి ముచ్చట - పాస్‌పోర్ట్ కన్సల్టెన్సీ అనేది గౌరవప్రదమైన వ్యవహారమే కానీ, చాలామంది బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్ళాలనుకునే వారికి సహాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ అక్రమార్జనకు ఉపయోగించుకునేవారు - ఇతను కూడా అలాంటివారిలోనే ఒకడు, ఆ ముద్దుపేరే అందుకు సాక్ష్యం!

కాంగ్రెసులో తాలూకా స్థాయి నాయకత్వం వెలగబెడుతున్నప్పుడే ఒక దొంగనోట్ల కేసులో ఇరుక్కున్నాడు.ఇప్పుడు జగన్ మాదిరే కోర్టుల్లో ఉన్న వాయిదా పద్ధతిని ఉపయోగించుకుని సాగదీస్తూ సాగదీస్తూ కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని బయటపడాలని ప్రయత్నించాడు గానీ పార్టీ వైపునుంచి సహకారం రాలేదు.సహజంగా ఏ పార్టీ అయినా పార్టీకి లాభం అనుకున్న  పైస్థాయి వ్యక్తులకు ఇలాంటి లోపాయకారీ సహాయాలు చేస్తుంది గానీ కింది స్థాయి వ్యక్తుల కోసం ముందుకు రాదు.దాంతో, సమయానికి చెలరేగిన తెలుగుదేశం అవిర్భావ ప్రభంజనంలో అవకాశం చూసుకుని దూకేశాడు.అది 1983 నాటి తొలి గోడదూకుడు సన్నివేశం!

తెలుగుదేశం అధికారంలోకి రావటంతో రామారావు ప్రాపకం సంపాదించి దొంగనోట్ల కేసునుంచి బయటపడి తేరతిండికి అలవాటు పడిన కక్కుర్తి చావక దుబాయ్ శేఖర్ అవతారం ఎత్తాడు! ఆ కాలంలో అతను చేసిన ఘనకార్యం ఏమిటీ అంటే, ఒంటరి మహిళలకి వివాహిత మహిళపేరున పత్రాలు పుట్టించి దుబాయికి వెళ్ళే ఏర్పాట్లు చెయ్యటం, ఒక్కో క్లయింటు నుంచీ లక్షల్లో ఉంటుంది ఆదాయం - అది అక్రమ రవాణా కాబట్టి అక్కడ వాళ్ళకి ఏమన్నా తేడా వచ్చినా ఇతని పూచీ ఉండదు,తన సంపాదనకి మాత్రం ఏ ఢోకా ఉండదు.డబ్బు కోసం ఇంత నీచమైన పని చెయ్యటానికి కూడా సిగ్గుపడని ఇతను ఒక రాష్ట్ర్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే అది ఆ ప్రజల దురదృష్టం అయినా అవ్వాలి,లేదంటే ఆ ప్రజలు కూడా ఇంత నీచమైన వాళ్ళే అవ్వాలి! 

2008లో New York Timesకి చెందిన Jim Yardley అనే అతని చేత "A politician who went hungry to redraw India's map." అని గుర్తించబడిన తన సహజసిద్ధమైన ఆకలితో ఉన్న ఇతను నవజాత శిశువైన తెలుగు దేశం పార్టీకి రాజకీయ పునాదిని బలపర్చటం కోసం శిక్షణా తరగతులను నిర్వహించి రామారావు చంద్రబాబుల అభిమానం చూరగొని 1994లో రవాణా శాఖ మరియు అటవీ శాఖల్ని తీసుకుని మంత్రి పదవిని దక్కించుకున్నాడు."ఒక్కసారి మంత్రిని చెయ్యి గణనాధా!" అన్నట్టు ఆ ఒక్కసారి చేసిన నిర్వాకం వల్ల తిరిగి 1999 నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో  మంత్రి పదవి ఇవ్వటానికి భయపడి కుల సమీకరణల సమతౌల్యం కోసం ఇతని బదులు విజయ రామారావును మంత్రివర్గంలోకి తీసుకున్నారు!తర్వాత ఆలోచించుకుని ఇతన్ని పూర్తిగా అవమానించలేక స్పీకర్ పదవి ఇచ్చినప్పటికీ అది పాప్యులారిటీ ఇవ్వని సంపాదనకు తావులేని కంచిగరుడసేవ కావడంతో ఇతనే 2001లో రాజీనామా చేసి అప్పటికే నక్సలైట్లు మొదలుపెట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి దూకాడు.

ప్రపంచంలో తమ జాతికీ ప్రాంతానికీ అన్యాయం జరిగిందని చెప్తూ అత్యంత బలహీనమైన స్థాయిలో మొదలై ఉద్యమకారుల రుజువర్తనతోనూ ఉత్తేజభరితమైన ప్రసంగాలతోనూ విజయం సాధించిన ఎన్నో ఉద్యమాలకి భిన్నమైన శైలిలో "ఆంధ్రా గోంగూర గోబ్యాక్!" అనే ద్వేషప్రలాపాలతో తెలంగాణ ఉద్యమం నడవటానికి ప్రధాన కారణం డబ్బు కోసం ఏ గడ్డయినా తినటానికీ గెలుపు కోసం ఏ అడ్డదారినైనా తొక్కటానికీ అలవాటు పడిన తమ నాయకుడి సంస్కారలేమినే అనుచరులు కూడా అలవాటు చేసుకోవటమే అని చెప్పాలి.ఇప్పటికీ ఆంధ్రావాళ్ళకి ఉన్న బాకీల్ని ఎగ్గొట్టేస్తూ గట్టిగా నిలదీస్తే "ఏంరో ఆంధ్రోడా!ఓళ్ళెలా వుంది?" అనే బెదిరింపులు నడుస్తున్నాయంటే కేసీయారు తన నీచత్వాన్ని తెలంగాణ ప్రజల మనస్తత్వంలోకి ఎంత లోతున దించాడో అర్ధం చేసుకోవచ్చును.!

తన రాష్ట్రపు సమస్యల్ని గాలికొదిలేసి పొరుగురాష్ట్రపు గొడవల్లో తల దూరుస్తున్నా ప్రజలు వ్యతిరేకించకపోవడం అతని పట్ల ఉన్న భయం వల్ల అని నేను అనుకోవడం లేదు - సామాన్య ప్రజలు భయపడ్డారంటే అర్ధం ఉంది, నిన్న గాక మొన్న అంత వీరత్వం ప్రదర్శించిన ఉద్యమవీరులు కూడా భయపడుతున్నారంటే నాకు నమ్మకం కలగడం లేదు.మనస్సులో ఏ మూలనో అతని పట్ల మొహమాటమో అభిమానమో సానుకూలతయో అతని ప్రభావం నుంచి బయటపదలేని అంతర్గత బలహీనతయో లేకుండా ఇంత స్థాయిలో అర్ధాంగీకారం లాంటి మౌనం అసాధ్యం!

అలా 2001లో తెరాస స్థాపించి హడావిడి చేసిన కేసీయార్ 2004లో కేంద్రమంత్రి అయ్యాడు.తను కేంద్రంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన రెండేళ్ళలో తెలంగాణ ఉద్యమం కోసం చేసింది ఏమీ లేదు గానీ తన కక్కుర్తి ప్రకారం సహారా ఇండియాతో ఒప్పందమూ ఈయస్సై కుంభకోణమూ లాంటి డబ్బులు వెనకేసుకునే ఉద్యమంలో మాత్రం ముందున్నాడు!2006లో బైటికి రావటానికి తను కాంగ్రెసువాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని నిర్లక్ష్యం చెయ్యటం అని చెప్పుకున్నప్పటికీ తన శాఖకి సంబంధించిన అవినీతి గబ్బు పెరిగి పెరిగి ఇంకా చూరు పట్టుకుని వేలాడితే తన్నించుకుని రావాల్సి వస్తుందని తెలియటమే కారణం.

కేంద్రంతో తెగదెంపులు చేసుకుని బైటికి వచ్చాక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు - అంటే, ప్రైవేటుగా వ్యాపారస్తుల్నీ పారిశ్రామికాధిపతుల్నీ సినిమారంగానికి సంబంధించిన ప్రముఖవ్యక్తుల్నీ బ్లాక్ మెయిల్ చెయ్యటమూ పబ్లిక్ డయాస్ మీద ఏకంగా అశుద్ధం తిని మాట్లాడుతున్నాడనిపించే నీచభాషని తను మాట్లాడి ఇతర్లని కూడా ప్రోత్సహించటం అన్నమాట - ఈ నీచత్వంలో తమకీ వాటా ఉందన్న మొహమాటం వల్లనే ఇవ్వాళ ఉద్యమవీరులు కేసీయారుని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చెయ్యలేకపోవటానికి కారణం అని నా నమ్మకం!

ఇక 2007 నాటి చరిత్రకి వెళ్తే - బహుశా,తమని బ్లేం చేస్తూ విడిపోవటం వల్ల కాంగ్రెసు పని చేసిందో దానంతటది బయటపడిందో గానీ తన దుబాయ్ శేఖర్ అవతారం నాటి భాగోతం ఇప్పుడు బయటపడింది! అయితే మిగిలినవాళ్ళ కన్న తెలివైనవాడు గనక ముందు తనే చొరవ చూపించి ఆలె నరేంద్ర లాంటి వాళ్ళని బలిపెట్టి తను తప్పుకున్నాడు.దెబ్బ తిన్నాక ఆరోపణలు చేస్తే ఎవరు పట్టించుకుంటారు? అవి నిరాధారమైన ఆరోపణల కింద కొట్టుకుపోయాయి - అవతలి వాళ్ళూ పులుగడిగిన ముత్యాలు కాదు గదా!

పార్టీలోని ప్రత్యర్ధుల్ని దెబ్బతీసిన తన చురుకుదనాన్ని చూసి తను కూడా సంతోషపడలేని అత్యంత భయానకమైన దశ అది - రాజశేఖర రెడ్డి కొడుతున్న వరస దెబ్బలకి విలవిలలాడి వలవల విలపిస్తూ వేదనలో శోధనలో అంతర్మధనలో గడిచిన నిస్సహాయమైన కాలం!చివరికి అద్భుతమైన ఎత్తుగడ అని పార్టీవాళ్ళని నమ్మించి చట్టసభల్లో ఉన్న అందర్నీ రాజీనామాలు చెయ్యమని ఆదేశించాడు - తెలుగు, ఇంగ్లీషు,ఉర్దూ పడుగుపేకల అనర్గళమైన ప్రసంగాలతో ప్రజల్ని ఉర్రూతలూగించి అంతకు రెట్టింపు మెజార్టీ సాధించగలననే ధీమాతో!కానీ అది బెడిసికొట్టి కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు అంతకు ముదరి 16 స్థానాలకి 7 మాత్రమే దక్కటంతో తెల్లమొహం వెయ్యాల్సి వచ్చింది.

మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు రాజశేఖర రెడ్డి దెబ్బల్ని తప్పించుకోవడానికని తనకి రెండవసారి మంత్రిపదవి దక్కకపోవటానికి కారణమని ఫీలవుతున్న చంద్రబాబుతో కలిసి పోటీ చేసిన 2009 ఎన్నికల్లో ఫలితం full wash out!శతకోటి ఆశలతో స్థాపించి పదేళ్ళు కూడా పూర్తి కాకుండానే తెరాస పార్టీ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, కేసీయార్ రాజకీయ జీవితం శూన్యమైపోయిన పరిస్థితి - నిజంగా హృదయమున్న ప్రతి వ్యక్తికీ కడుపు తరుక్కుపోయి పగవాళ్ళకి కూడా కోరుకోకూడనంత పెద్ద కష్టమే. పులి మీద పుట్రలా ఉద్యమాన్ని స్పాన్సర్ చేసిన కాంట్రాక్టర్లు నష్టంతో వెనక్కి  తగ్గడానికి ఏమాత్రం ఇష్టపడక ఏదో ఒక ఎత్తు వేసి ఫలితం చూపించమని ఒత్తిడి పెడుతున్నారు, ఎత్తులు వేయాల్సిన కీలకమైన పావు ఖాళీ మందు గ్లాసులా అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది - సదాజపా, ఏమిటి శాయడం?కేసీయార్ పరిస్థితి "అంతా భ్రాంతియేనా?ఆశా నిరాశేనా!జీవితాన పవరింతేనా?మిగిలిందీ మాజీ బతుకేనా!" అన్నట్టు, తయారైంది.

నిజానికి, అప్పుడు గనక రాజశేఖర రెడ్డి చచ్చిపోకుండా ఉంటే కొద్ది నెలల తర్వాత ఉద్యమాన్ని స్పాన్సర్ చేసినవాళ్ళు బాకీల కింద కేసీయారు ఆస్తుల్ని లాక్కుని నడిరోడ్డు మీద నిలబెట్టటంతో పాటు కేసీయారు బ్యాచ్చి బ్లాక్ మెయిల్సుకి బలయిన వ్యాపారవేత్తలూ పారిశ్రామికాధిపతులూ అందర్నీ ఫుట్ బాల్ ఆడుకునేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం, కాంగ్రెసులో చెలరేగిన గందరగోళం కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు కేసీయారుకి పునర్జన్మని ప్రసాదించింది!

September 2009లో రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు, December 9, 2009 నాటికి గొట్టాలతో సెలైన్ ఎక్కించుకుంటున్న భీబత్సమయిన నిరాహార దీక్షతో హడావిడి చేసి చిదంబరంతో కేంద్రం చొరవ చూపించి సమైక్య రాష్ట్ర అసంబ్లీలో బల నిరూపణతో పని లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యడానికి ప్రకటన చేయించుకున్నాడంటే ప్రజల్ని మోసం చేసి తను అనుకున్నది సాధించడంలో అతను ఎంత గుండెలు తీసిన బంటో అర్ధం చేసుకోవచ్చును - అంత బేఖారీ క్యామెడీ సన్నివేశంతో విషాదాన్ని పండించటంలో తెర వెనక ఉన్న కాంట్రాక్టర్ల పక్కన నిలబడి we dicide, you follow అంటున్న మీడియా మొగల్సు యొక్క చాతుర్యం చాలా ఉంది సుమా!

అదీ గాక, అసెంబ్లీకి తగినంత మంది ఎమ్మెల్యేల్ని పంపించే స్థాయిలో తెలంగాణ సామాన్య ప్రజానీకం వేర్పాటుని సమర్ధించకపోయినా అప్పటికే కేసీయార్ బ్యాచ్చి రెండు ప్రాంతాల్లోనూ విద్యావంతులూ మేధావులూ రాజకీయ విశ్లేషకుల మధ్య ఆవేశకావేషాలను రెచ్చగొట్టి ఉన్నారు,అటు చూస్తే ఉద్యమానికి పెట్టుబడి పెట్టిన వాళ్ళు అంతర్యుద్ధం సృష్టించటానికి కూడా వెనుకాడని మొండితనంతో ఉన్నారనేది పైస్థాయిలో జరుగుతున్న నాటకీయమైన సన్నివేశాల్ని దగ్గరినుంచి గమనిస్తున్న ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుడికీ తెలుసు.

సొంత బలం గురించి తెలియని రోజుల్లో తెరాసని కాంగ్రెసులో విలీనం చేస్తానని వాగ్దానం చేసి సొంత బలం తగినంత పెరిగిందని తెలిశాక గతిలేక స్వతంత్రం ఇచ్చిన ఇంగ్లీషొడి లాంటి కాంగ్రెసుతో పోరాడి తెచ్చుకున్న గాంధీలాంటి తెరాస ఎట్లా కలుస్తుందనే వింత లాజిక్కుతో కాంగ్రెసుకి జెల్లకొట్టడం నుంచి దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తనే ముఖ్యమంత్రి కావడం వరకు కధ అతి వేగంగా నడిచింది - ఇది చరిత్ర కుండబద్దలు కొట్టి చెప్తున్న కేసీయార్ గతం!

"తెలంగాణ‌ను గాలికొదిలేసి.. ఏపీతో లొల్లేందీ..?" అని అడుగుతున్న వీరయ్య గారి ప్రశ్నకి జవాబు లేదు. ఇదే వీరయ్య గారు బడ్జెట్ గురించి "కేసీఆర్ ఎందుకు దాచిపెడుతున్నారు?" అని ఒక ప్రశ్నని మనకి వేసి తనే కేసీయార్ అధ్వర్యంలో ప్రభుత్వమే ప్రజల్ని ఎట్లా దోచుకుంటున్నదో కళ్ళకి కట్టినట్టు వివరించారు.మిషన్ భగీరధని ఒక కార్పొరేట్ సంస్థ తరహాలో డిజైన్ చేశారు.అంటే, దానికి కావలసిన మొత్తం నిధులు ప్రభుత్వం పన్నుల ద్వారా సేకరించిన నికరమైన ఆదాయం నుంచి ఇవ్వదు. బయటనుంచి సమకూర్చుకుని పని చెయ్యాలి.ఆ నిధుల సేకరణ వడ్డీకి తీసుకునే ఋణాలుగా కూడా ఉండవచ్చు.ఇది నేను చెప్తున్నది కాదు,వీరయ్య గారు చెప్తున్నదే.ముఖ్యమంత్రియే మిషన్ భగీరధ కోసం కేంద్రాన్ని 12000 కోట్లు ఋణం అడుగుతున్నాడు.ఆ అప్పు తీర్చడం కోసం అవసరమైన ప్రతి రూపాయినీ ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తానని కేంద్రానికి హామీ కూడా ఇచ్చేశాడట!

మిషన్ భగీరధ సక్సెస్ అయితే ఆ కీర్తి కేసీయారుకి దక్కుతుంది.మరి, ఫెయిలయితే?ఫెయిల్ కావడం అంటే అప్పుల పాలు కావడం అని అర్ధం!ఆ సంస్థ చేసిన అప్పుల్ని ఎవరు తీర్చాలి?అక్కడ ఉన్నవాళ్ళు యజమానులు కాదు కదా, కేవలం ఉద్యోగులు!చచ్చినట్టు ప్రభుత్వమే తీర్చాలి.అంటే, పన్నుల ద్వారా వెళ్తున్న అధికారికమైన ఆదాయం నుంచి ప్రజలు తీర్చాలి.ఇదీ కేసీయార్ ఆవిష్కరిస్తున్న బంగారు తెలంగాణ!

ఇదే అనుకుంటే నీటి పారుదల ప్రాకెక్టుల్ని పూర్తి చెయ్యడానికి కేంద్రం నుంచి తీసుకుంటున్న నలభై వేల కోట్ల అప్పుని కూడా ప్రజల నుంచే వసూలు చేస్తాడట - అమ్మతోడు, కేంద్రానికి రాసిన లేఖలో ఇదీ ఉంది!నిజానికి, తెలంగాణ ప్రజల అజ్ఞానం, అమాయకత్వం, నిస్సహాయతలను గురించి పూర్తి పరిజ్ఞానం ఉన్న కేసీయార్ తప్ప ఇంత ఘాతుకానికి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ సాహసించి ఉండడు - ఎందుకంటే, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం అనేది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం నుంచి మిగులూ తరుగూ చూసుకుని తీర్చాల్సినవీ తెచ్చుకున్నవీ ఐన అప్పుల్ని మినహాయించి కేటాయింపులు చేస్తే గానీ సాధ్యపడని వ్యవహారం!ఈ అనాలిసిస్ చేస్తున్న వీరయ్య గారికే కాదు,వింటున్న నాకూ గుండె గుభేలు మనేసింది - తెలంగాణ లోని కొందరు అమాయకత్వం ఎక్కువై కేసీయారు మాటలు నమ్మి మనల్ని తిట్టారని మనలాంటి తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతుంటే పైశాచికానందం పొందే జై గొట్టిముక్కలని కాదు గదా!

వేర్పాటులోని తమ రహస్య లాభాల కోసం ప్రత్యేక తెలంగాణను కోరుకున్న కాంట్రాక్టర్లు  తెలంగాణ ప్రజల మీద కసిబూని వదిలిన మాయల మరాఠీ కేసీయార్.కేసీయారుని మాయల మరాఠీతో పోల్చడం కేసీయారుకి కాదు - మాయల మరాఠీకే అవమానం!ఎందుకంటే, బాలనాగమ్మని మోహించక ముందరి మాయల మరాఠీ అత్యంత ప్రతిభావంతుడైన సంగీత కళాకారుడు, నిజమైన రసికత గలిగిన సౌందర్య పిపాసి, చావుని జయించగలిగిన మహాజ్ఞాని.కానీ కేసీయార్ గతమూ నీచమైనదే,వర్తమానమూ నీచమైనదే - ఆగతం కూడా నీచమైనదే!

కొన్నిసార్లు ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ప్రజాకర్షణలో అఖండ ప్రజ్ఞ కలిగిన నందమూరి తారక రామారావు సైతం ఒక దశలో భారతదేశం గురించి ఆలోచన చేసి వెనక్కి తగ్గాడు - జాతీయ స్థాయి నేతలతో మిత్రబృందాన్ని ఏర్పాటు చేసుకుని సరిపెట్టుకున్నాడు!అంతటి ఆకర్షణ లేని తను సభ్యుల సంఖ్య కూడా తగ్గిపోయిన ఇప్పుడు ఏమి సాధించాలనుకుని వెళ్తున్నాడో దాన్ని ఎట్లా సాధించగలనని అనుకుంటున్నాడో నాకు అర్ధం కావటం లేదు!

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టిన ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ స్థాయికి వెళ్ళడం ప్రధానమంత్రి పదవిని సాధించటం కోసమే చెయ్యాలి!అది లేనప్పుడు చంద్రబాబు చేసినట్టు ఆసులో కండెలా తిరుగుతూ హదావిడి చెయ్యటం కూడా తనకి గానీ తన పార్టీకి గానీ తన రాష్ట్రానికి గానీ గౌరవప్రదం కాదనేది చంద్రబాబు దుస్థితిని బట్టే తెలుస్తున్నది కదా!ప్రధాని పదవిని  అందుకోవాలంటే కనీసం 160 పార్లమెంటు సీట్లని తన సొంత ప్రతిభతో గెల్చుకోగలగాలి!ఆంధ్రాలో పోర్టుల మీద పెత్తనాన్ని అస్మదీయులకి కట్టబెట్టటం కోసం ఆంధ్రప్రజల నెత్తిన జగన్ని రుద్దాలని చూస్తున్నాడని అందరికీ తెలిసిపోయిన ఇప్పుడు పొరుగున ఉన్న తెలుగు  రాష్ట్రంలోనే ఎన్ని సీట్లని గెల్చుకోగలడో తెలియని స్థితిలో ఉన్న మనిషి తెలుగేతర రాష్ట్రాల్లో ఎంతమందిని పార్లమెంటుకి తనతో పాటు తీసుకెళ్ళగలనని అనుకుంటున్నాడు?

లగడపాటి రాజగోపాల్ దగ్గిర్నుంచి దాదాపు అందరు పరిశీలకుల అంచనాల్ని తారుమారు చేసిన నిన్నటి గెలుపుకి ఎలక్షన్ కమిషనరుతో లాలూచీ పడి తనకి వోటు వెయ్యని ఇరవై లక్షలమందిని ఓటర్ల లిస్టునుంచి తొలగించడమే కారణమనేది తనకు సొంత రాష్ట్రంలోనే తగినంత బలం లేదని రుజువు చేస్తున్నది గద!ఒకవేళ ఇతర రాష్ట్రాలలో కొత్తగా అడుగుపెడుతున్న తనకు అప్పటికే అక్కడ పాతుకుపోయిన పాతకాపులు ఇదే సినిమా చూపించరని గ్యారెంటీ ఏమిటి?

అసలు జాతీయ స్థాయికి వెళ్ళకుండానే తనకు సమాన స్థాయిలో ఉన్న పొరుగు రాష్ట్రం మీద కేసులు పెట్టి వేధించాలని చూస్తున్న వాణ్ణి ఏ రాష్ట్రపు నాయకుడు నమ్మి స్నేహం చేసి తనమీద అధికారం చెలాయించటానికి  ప్రోత్సహిస్తాడు?అలా ఇతన్ని ప్రోత్సహించినందుకు ఇతను వాళ్లకివ్వగలిగిన లాభం ఏమిటి?

ఎటునుంచి ఎటువైపుకు తిరగేసి మరగేసి చూసినా కేసెయార్ ప్రధాని కావడం సాధ్యం కాదనే నాకు అనిపిస్తున్నది!తమకి తోచిన వూహ కాబట్టి తండ్రీ కొడుకులు సాధ్యమేనని కలలు కనవచ్చును గానీ వాస్తవాల ప్రాతిపదికన అంచనా వేసుకోవాల్సిన ఇతరులు అలాంటి భ్రమల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది!

కేసీయారు కూడా జాతీయ స్థాయిలో అద్భుతాల్ని చెయ్యడం కోసం గాక కొడుక్కి ముఖ్యమంత్రిత్వం కట్టబెట్టడం కోసం తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్ప్పుకోవడానికి ఒక గౌరవప్రదమైన మిష కోసమే ఈ జాతీయ స్థాయికి వెళ్ళడం అనే హడావిడి చేస్తున్నాడని నా అనుమానం!

కొడుక్కి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాక సాగినంత కాలం హడావిడి చేసి సాగనప్పుడు ఆగిపోతాడు - అది నీచత్వంతో మొదలైన ఒక రాజకీయ నాయకుడి నిరంతర నీచత్వపు అవిశ్రాంత జీవితానికి నీచమైన ముగింపు అవుతుంది కాబోలు!

నిజమైన సమర్ధత ఉందో లేదో తెలియని కొడుక్కి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టటం కోసం ఇప్పటికే సమర్ధతని ఎన్నోసార్లు రుజువు చేసుకున్న హరీష్ రావును బహిరంగ వేదికల మీద నుంచి మాయం చేసి పక్కకి తప్పిస్తూ అవమానిస్తున్న తీరు తెరాసలోని అతని అభిమానుల్ని కూడా కష్టపెడుతున్నది."నవ తెలంగాణ సృష్టికర్త!" అన్న పేరుని తీసేస్తే హరీష్ కేసీయారుతో దీటుగా నిలబడగలిగిన వాడు!ముఖ్యంగా మంచిపేరు తెచ్చుకోవటానికి ఒక రాజకీయ నాయకుడికి కావలసిన నాలుగు అంశాలూ కేసీయారు కన్న హరీష్ రావుకే అనుకూలంగా ఉన్నాయి.

కేసీయారు కన్న హరీష్ రావు ప్రసంగాలు హుందాగా ఉంటాయి.కేసీయారు కున్న అవినీతి మరకలు అతనికి లేవు.ప్రజలతో కలిసిపోయి పార్టీకి ప్రజల్లో అభిమానం సంపాదించగలగడంలో అతని ప్రజ్ఞ అసామాన్యం.అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, పబ్లిక్ డయాస్ మీద ఎన్ని విమర్సలు చేసినప్పటికీ వ్యక్తిగత స్థాయిలో అన్నిపార్టీల నాయకులతోనూ మర్యాదగా ఉంటాడు!ఆ సానుకూలత ఉండటం వల్లనే గతంలో చాలాసార్లు అతన్ని ఉపయోగించుకోవాలని ఇతర్లు చూసినా అప్పుడు పార్టీలో ఉన్న మర్యాదని చూసుకుని అటువైపు మొగ్గు చూపలేదు - కానీ ఇప్పుడు హరీష్ రావు తనకోసం కాకపోయినా తనను అభిమానించే తెరాస శ్రేణుల కోసమైనా కేసీయారు మీద తిరగబడాల్సిన అవసరం ఉంది!

చరిత్ర ఎవరికీ అవకాశాల్ని బంగారుపళ్ళెంలో పెట్టి ఇవ్వదు,లేని అవకాశాల్ని సృష్టించుకోవాలి, ఉన్న అవకాశాల్ని ఇతర్ల కన్న ముందే ఉపయోగించుకోవాలి.కాంగ్రెసు పార్టీని ఏయే రకాల అవినీతుల గురించి మోదీ కేసీయార్ విమర్శిస్తున్నారో అవే అవినీతుల్ని అంతకు రెట్టింపు స్థాయిలో వాళ్ళే చేస్తుంటే కాంగ్రెసు ఎందుకు సిగ్గుపడి వెనక్కి తగ్గుతున్నదో నాకు అస్సలు అర్ధం కావటం లేదు!మా ఎమెల్యేల్ని కొంటున్నాడు లబోదిబో అని మీడియా ముందు యేడ్చే బదులు వాళ్ళు రివర్సులో తెరాస నుంచే ఎమ్మెల్యేల్ని కొనుక్కోవచ్చును గద!తమకి ఫైనాన్స్ చెయ్యటానికి స్పాన్సర్లే లేనంత స్థాయిలో దేశం ఎప్పుడు పవిత్రమైపోయింది?

ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ చేతిలో చచ్చిపోవటం ఆ పార్టీ నాయకులకే కాదు, ఆ పార్టీని అభిమానించే వారికి కూడా అవమానమే! నిన్న కాక మొన్న పైకొచ్చినవాడు చేస్తున్న చిలిపిపనులు ఎప్పట్నుంచో పాతుకుపోయిన కాంగ్రెసు చెయ్యలేకపోవడం ఏమిటి?పెట్టుబడి కోసం ఇవ్వాళ కేసీయార్ పక్కన చేరిన కాంట్రాక్టర్ల పోటీదారులతో మాట్లాడాలి!తెరాసని కొనుగోళ్ళతో అతలాకుతలం చెయ్యాలి!ఉద్యమవీరులు మొహమాటాలు వదిలించుకుని కలాలూ గళాలూ పదునుపెట్టుకోవాలి!

ఉద్యమం నాటి ఆవేశంలో మమ్మల్ని తిట్టిన తిట్లకి ఒకసారి క్షమాపణ చెప్తే చాలు మాలాంటివాళ్ళం మీకు పైనుంచి మాటసాయం కూడా చేస్తాం - ఇంకెందుకు ఆలశ్యం?

Wednesday, 13 March 2019

లక్ష్మీ's NTR సినిమాలో వర్మ అన్నీ నిజాలే చెబుతున్నాడా?నాకైతే నమ్మకం కలగడం లేదు!

లక్ష్మీస్ NTR సినిమా లోని పాత్రలూ ఆ సినిమా వల్ల ప్రభావితం అయ్యే వ్యక్తులూ అందరూ రాజకీయ నాయకులే కదా!వర్మ తన sensational voyerism కొద్దీ చంద్రబాబుని ఇరుకున పెట్టడానికి తీసిన సినిమా అని నేను అనుకుంటున్నాను.

వర్మను చాలామంది "మీరు తీసిన కధలోని ప్రధాన పాత్రలకు ఆధారమైన నిజ వ్యక్తులను కలిసి సినిమాలో మీరు వారిని నిలబెడుతున్న సన్నివేశాలకు సంబంధించి వారి వెర్షన్ తెలుసుకున్నారా?" అని అడిగారు.ఇది చాలా కీలకమైన ప్రశ్న.కానీ ఇంత ముఖ్యమైన ప్రశ్నకి వర్మ చెప్తున జవాబు సరైనది కాదు.

ఎవరెవరు ఎన్నిసార్లు తిప్పి తిప్పి అడిగినా ఒకే జవాబు చెప్తున్నాడు.నిజానికి ఒకసారి ఒక వ్యక్తికి అతను ఈ జవాబు చెప్పాక మళ్ళీ ఆ ప్రశ్న మరొకరు అడగాల్సిన పని లేదు.అన్ని చానల్సూ ఒకే  సమయంలో, అంటే ఇంకొక చానల్ ఇదే ప్రశ్నని అడిగి జవాబు రాబట్టిందని తెలుసుకునే సమయం లేకపోతే అది కొంతవరకు సమంజసమే!కానీ వర్మని ఈ సిన్మా గురించి అడుగుతున్న ప్రతి కార్యక్రమంలోనూ మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్న ఎందుకు వేస్తున్నట్టు?బహుశా, వాళ్ళకి కూడా ఆ జవాబు తప్పు అని అనిపిస్తున్నప్పటికీ ఎలా తప్పవుతుంది అన్న విషయంలో వాళ్ళకి క్లారిటీ లేకపోవటం వల్ల దానికి అనుబంధ ప్రశ్న వెయ్యలేకపోతున్నారు,అయినప్పటికీ ఆ జవాబుతో సరిపెట్టుకోలేని ఇబ్బందితో మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ ఇంటర్వూ క్లిప్పింగును చూడండి.అతను చెబుతున్నది ఏమిటి?

"ఒక సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు కూడా 12 మంది 12 రకాలుగా చెప్పే అవకాశం ఉంది - అలా చెప్పారు కూడాను" అనీ "వాళ్ళు అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పటి ప్రయోజనాలకు విరుద్ధమైన వాటిని వాళ్ళు చెప్పరు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అవలేదు" అనీ అంటూ తను చెప్పినది నమ్మదగినట్టు ఉంది కాబట్టి తను చెప్తున్నది నిజం అని మనల్ని అనుకోమంటున్నాడు.ఎక్కడా కూడా "నేను చూపించినది నూటికి నూరు శాతం అలాగే జరిగింది!" అని నిర్ధారించి చెప్పడం లేదు.

అప్పుడు పత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చిన వార్తల్ని రిపీట్ చేసిన పబ్లిక్ సీన్స్ నిజాలా అబద్ధాలా అని ఎవరూ అడగరు.అవన్నీ తెలిసినవే.ఎటొచ్చీ తెర వెనక జరిగిన అసలు కధ ఇదీ అని తను చూపిస్తున్న ప్రైవేట్ సీన్స్ గురించి అతను మనకి గ్యారెంటీ ఇవ్వాలి.ఆ గ్యారెంటీ ఇవ్వకుండా తప్పించుకోవడానికే తెలివైనవిగా అనిపించే ఈ తప్పుడు వాదనలు చేస్తున్నాడు.

వాల్మీకి రామాయణాన్ని రాముడి బయోపిక్ అనగలమా?అది బయోపిక్ ఎప్పటికీ కాదు."ప్రతి మనిషీ ఆదర్శంగా తీసుకోదగిన సర్వలక్షణసమన్వితుడు ఇంతకుముందు ఎవరైనా ఈ భూమి మీద జీవించి ఉన్నాడా?" అని అడిగిన వాల్మీకి నారదుడు ఉన్నాడని చెప్పినదాన్ని విని నారదుడు అబధ్ధం చెప్పడనే నమ్మకంతో తను స్వయంగా తేల్చుకోకుండా కవితాత్మకమైన కధలా చెప్పేశాడు. కానీ నందమూరి రామారావు అలా కాదే!కళ్ళముందు జరిగిన చరిత్ర అది.ఒక వాస్తవ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన నీకు చెప్పిన 12 మంది 12 రకాల వెర్షన్లు చెప్పినా జరగటం మాత్రం ఒక్కలానే జరుగుతుంది - ఆ ఒక్క సన్నివేశం ఇలాగే జరిగింది అనేది వర్మ మనకి నిర్ధారణ చేసి చెప్పాలి, కానీ అతను ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాడు!

Verna himself accepted that he collected information from you tube videos and from third party sources, that means they are indirect references and personal openions! In a way he is not able to attest his movie as an authentic documentary with facts and proofs. 

Please note that the is avoiding to show irrefutable evidences for his version - definitely it is twisting the facts filling with lies morphed as truths!

వాళ్ళు నిజాలు చెప్పరు గాబట్టి వాళ్ళని అడగలేదు అనేది అత్యంత బాధ్యతారహితమైన జవాబు!వాళ్ళని కలవాలి,నువ్వు అడగదల్చుకున్న  ప్రశ్నలు అడగాలి,ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పటానికి సునుఖత వ్యక్తం చెయ్యకపోతే దానిని నోట్ చేసుకోవాలి - వాళ్ళు చెప్పని వాటి విషయంలో నువ్వు ఎన్ని కల్పనలు చేసుకున్నా వాళ్ళు కూడా నిన్ను బ్లేం చెయ్యలేరు. ముఖ్యమైన ప్రశ్నలకి వేధించి అయినా సరే జవాబులు రాబట్టాలి, అప్పుడు విశ్లేషణలో నీ దృక్కోణం ఏమిటో నువ్వు చెప్పటం నీ ఇష్టం, వాళ్ళు కూడా నిన్ను వ్యతిరేకించలేరు(రాజ్యాంగం ప్రసాదించిన భావవ్యక్తీకరణ హక్కు అనేది ఇక్కడే పని చేస్తుంది,ఎవడి గురించయినా నా ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాననటం భావవ్యక్తీకరణస్వేచ్చ  కాదు.ఒక మనిషి ఏదైనా పని చేస్తే ఆ మనిషి ఫలానా పని ఫలానా విధంగానే చేశాడు అని చెప్పి అతని ఉద్దేశం ఇది అయి ఉండవచ్చు అని చెప్పడంలో ఎలాంటి తప్పూ లేదు.నువు ఒకవేళ దురుద్దేశం అంటగట్టి లోపాయకారీగా అది నిజమే అయితే అటువైపు వాడు నోరు మూసుకుంటాడు, లేకపోతే defamation కేసు వేస్తే నువు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది.స్వేచ్చకి హద్దులు ఉంటాయి.హద్దులు లేని స్వేచ్చ అధికారంలో ఉన్నవాడి విషయంలో నియంతృత్వం అవుతుంది, అధికారంలో లేనివాడి విషయంలో అరాచకత్వం అవుతుంది.వర్మ మరియు అతడి ఫ్యాన్సులో రెండవ ధోరణి ఎక్కువ - ప్రస్తుతం అధికారంలో లేరు కాబట్టి కావచ్చు!) - అది నిజాయితీ గలవాడు చేసే చరిత్ర రచన!వాళ్ళని ఎప్రోచ్ అయ్యి వాళ్ళు నిన్ను కలవడానికే తిరస్కరిస్తే దాన్నే అందరికీ చెప్పి నీ పద్ధతిలో నువ్వు వెళ్ళినా నిన్నెవరూ తప్పు పట్టలేరు.కానీ అతనికీ అతని ఫ్యాన్సుకీ ఇలాంటి నిజాయితీ ఉన్నట్టు కనిపించడం లేదు.

సినిమాల్లో దేవుళ్ళ పాత్రలు వేసి మనిషిని చూడగానే పవిత్రంగా అనిపించటమే కాకుండా స్త్రీలతోఎంతో హుందాగా ప్రవర్తించే రామారావు పెళ్ళి చేసుకునే ముందు తను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న వివాహిత మహిళ యొక్క మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోవాలనే విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు?సరే, సేవలు చేసి తరించాలని వచ్చానని చెప్పిన మనిషి అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా బిడ్డని కనాలని ఇబ్బంది పెట్టటమూ ఒకసారి అబార్షన్ అయినా పట్టిన పట్టు విడవకపోవటమూ సరిపడని మందులు వాడటమూ కూడా చూపించాడా వర్మ?

"అవసరం,అవసరం,అవసరం" అని మిగతా వాళ్ళందరూ రామారావు చుట్టూ అవసరం కోసమే చేరి లక్ష్మీ పార్వతి ఒక్కర్తే ఏ స్వార్ధమూ లేకుండా ఉన్నట్టు చూపించాడే, వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నది కూడా వారివారి అవసరాల కోసమే కదా!

దృశ్యరూపంలో చూడటం కొత్త కావచ్చునేమో గానీఇన్నేళ్ళలో ఆ విషయాలు తెలియని వాళ్ళు ఎవరు?తన పాటికి తను బతికేస్తున్న వీరగంధం సుబ్బారావుని తనని పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతాననే డ్రామాలు నడిపిన చీప్ లెవెల్ బిహేవియర్ ఉన్న నెరజాణకి ఇంత గౌరవం ఇవ్వడం అవసరమా?అంత దేబిరించి పెళ్ళి చేసుకుని అన్నేళ్ళు సంసారం చేసి శృంగారం వెలగబెట్టి ముది వయసులో మరొకణ్ణి తగులుకున్న బహుపతివ్రతని సమర్ధించడం సంస్కారవంతులకి తగునా?

ఇప్పుడు నేను వీరగంధం చెప్తున్న సంగతుల్ని స్వయంగా వినేవరకు తనే చొరవ చూపించి లక్ష్మీ పార్వతిని పెళ్ళి చేసుకుని తర్వాత తనకన్న గొప్ప స్థాయిలో ఉన్న వాణ్ణి చేసుకుంటే అసంతృప్తి పడిన మామూలు మనిషి అనుకున్నాను.కానీ వీడియో చూశాక ఆయన సంస్కారం నన్ను ముగ్ధుణ్ణి చేసింది - మిగిలిన ఇద్దరూ ఆయన కాలిగోటికి కూడా సరిపోరు!

N.T.R కూడా అవసరం కొద్దీ చేసుకోవటం తప్ప ఆ పెళ్ళిలో విధవా పునర్వివాహ సంస్కరణ లాంటి గొప్ప ఆదర్శం గానీ జన్మాంతర సౌహృదాలు పలకరించిన అద్భుతం గానీ ఏముంది?

NTR దురుద్దేశాలకి లొంగే ఘటం కాదు గానీ ఎవరు ఏది చెప్పినా నమ్మే తత్వం ఉందని అందరికీ తెలుసు.వీరగంధం దగ్గిర ప్లే చేసిన LPనే ఇక్కడా ప్లే చేసేసరికి ఢమాల్న పడిపోయి ఉంటాడు!

లక్ష్మీ పార్వతికి రాజకీయ లక్ష్యాలు లేని వినయమే ఉంటే ఆడపెత్తనం లాంటి వార్తలు వస్తున్నప్పుడు పాదపూజలకే పరిమితమై ఒదిగి పోయి ఉండేది.29 మంది ఎమ్మెల్యేల్ని తనూ కూడగట్టి ఎత్తులు వెయ్యడానికి తగులుకుని చంద్రబాబు ముందు నిలబడలేక వెనక్కి తగ్గడం కూడా అమాయకత్వమేనా?

ఒక యదార్ధ వ్యక్తి యొక్క ప్రైవేటు సీన్సుని పబ్లిక్ సీన్సు కింద చూపించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా తనని సత్యహరిశ్చంద్రుడు పూనాడని అనటం కుళ్ళుజోకులానే అనిపించింది నాకు!


అతి చేస్తున్నాడూ అంటేనే ఆ మనిషి అబద్ధమాడుతున్నట్టు లెక్క - గుర్తుంచుకోండి!

Sunday, 10 March 2019

వందమంది పరుగుపందెంలో పాల్గొంటే వందమందికీ ప్రధమ స్థానం రాకపోయినా పాల్గొనే ప్రతివాడూ ప్రధమ స్థానాన్ని ఆశించడం సహజమే!కానీ, ముందు పరిగెత్తుతున్న వాడి కాళ్ళు విరగ్గొట్టి ప్రధమ స్థానం తెచ్చుకోవాలనుకోవడం మాత్రం దుర్మార్గమే!

మొదటి సంచలన వార్త:డాటా చోరీ కేసు గురించి మొదటి రోజుల టాక్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజల వ్యక్తిగతమైన సమాచారాన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి లీక్ చేసిందని.ఆ కంపెనీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగించుకుని ఒక యాప్ తయారుచేసి ఆ యాప్ ద్వారాప్రతిపక్ష పార్టీ అనుకూల వోటర్లని మాయం చేసేసిందట - ఈ అభియోగాన్ని ఒక వైకాపా కార్యకర్త/జగన్ దూరపు బంధువు తెలంగాణ రాష్ట్రంలో కేసు వేశాడు.

జర్నలిస్టు సాయి గారి కధనం ప్రకారం  తెలంగాణ పోలీసులు మొదట సదరు కంపెనీ యజమానిని కలిసి ప్రశ్నించారు.అతను అప్పుడు మరోసారి వస్తే ప్రింటవుట్ ఇవ్వడానికి ఒప్పుకుని మళ్ళీ పోలీసులు వచ్చేసరికి పరారీ అయ్యాడు.దానితో పోలీసులు నలుగురు జుద్యోగుల్ని తమవెంట తీసుకెళ్ళారు విచారణ కోసం.

ఇందులోని అసంబద్ధతలు:
మొదటి అసంబద్ధత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సమాచారం లీక్ కావడం.సంబంధిత అధికారులు చెప్పిన వివరణ సహేతుకమైనదే - దీనికి నిదర్శనం కేసు స్వభావంలో వూహించని మార్పు వచ్చి కధ వూహించని మలుపు తిరగడమే!

తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డాటా చోరీకి గురయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలనీ దాని గురించి ఏ చర్య తీస్కోవాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెయ్యాలనే కామన్ సెన్సు కూడా లేకుండా కేసుని ఆంధ్రాకు బదిలీ చేసి డాటా చోరీ గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలర్ట్ చెయ్యాల్సింది పోయి తను స్వయంగా విచారణకి పూనుకోవటం రెండవ అసంబద్ధత.

రోహింగ్యా ముస్లిముల వల్ల మన దేశానికి ముప్పు ఉందని తెలిసినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చేసింది?తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన పరీక్షల క్వశ్చెన్ పేపర్లు వేరే రాష్ట్రంలో లీకయితే ఆ రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మీద కేసు పెట్టిందా?పెట్టి ఉంటే తండ్రీకొడుకులకెలా ఉండేది!

రెండవ సంచలన వార్త:పోలీసులు ఉద్యోగుల్ని కోర్టులో హాజరు పర్చినప్పుడు జడ్జి వేసిన కొన్ని చివాట్ల వంటి ప్రశ్నల వల్ల బయటపడినది యేమిటంటే ఉద్యోగులని అధికారికమైన అరెస్టు వారెంటుతో కేసు బుక్ చేసుకుని తీసుకు వెళ్ళలేదని తెలిసింది.ఉద్యోగుల చేత తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకోవడం లాంటి వింత సంగతి కూడా వెల్లడైంది.

ఇందులోని అసంబద్ధతలు:
ఉద్యోగులు తమని నిర్బంధించలేదని చెప్పినప్పటికీ తెల్ల కాగితాల మీద సంతకాలు చెయ్యటం లాంటి పిచ్చిపని ఎందుకు చేశారో!ఒకవేళ పోలీసులు నేరం జరిగిన మాట వాస్తవమనీ దానికి తామే బాధ్యులమని ఉద్యోగుల పేరున రాసి ఉంటే వాళ్ళు జైలుకి వెళ్ళిపోయి కోసు ముగిసిపోయి ఉండేది కదా - ఆ ప్రమాదం ఉందని తెలియదా వాళ్ళకి?

మూడవ సంచలన వార్త:ఎలెక్షన్ కమిషన్ వారికి అతి తక్కువ కాలంలో కొన్ని వోట్లని తొలగించాలని అబ్యర్ధిస్తూ ఫారం 7 ద్వారా లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వెళ్ళాయి.ఆంధ్ర ప్రతిపక్ష పార్టీ ముఖ్యనేత "అవును, ఆ పని మేమే చేశాం.అక్రమగా చేర్చిన వోట్లని తొలగించమని అబ్యర్ధించడంలో తప్పు లేదు కదా!"అని బహిరంగ ప్రకటన చేశాడు.

ఇందులోని అసంబద్ధతలు:
అతను ఈ ప్రమాదకరమైన ఆత్మవిధ్వంసకర మలుపు తీసుకోవడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి.ఒకటి, ఆంధ్రరాష్ట్రప్రభుత్వం యొక్క డాటా భద్రంగా ఉందని తెలియటం.రెండవది ఒక యాప్ ద్వారా వోటర్ల వివరాలు కేవలం చూడగలమే కానీ ఆ యాప్ నుంచి వోట్లని ఎన్నికల కమిషన్ డాటాబేస్ నుంచి తొలగించడం కుదరదని తెలంగాణ పోలీసులు ప్రెస్ ముందు ఇచ్చిన mock demo వల్ల సమస్తజనులకీ తెలిసిపోవటం.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదిక మీద నడుస్తున్న గొప్ప హాస్యరసప్లావితమైన అసంబద్ధత ఏమిటంటే పొగకు పాము ఉక్కిరిబిక్కిరై పుట్టనుండి వచ్చినట్టుంది జగన్ పరిస్థితి.టిడిపి వాళ్లు పెద్ద ఎత్తున ఓట్లను తొలగించేసారు అని కేంద్ర & రాష్ట్ర ఎన్నికల కమీషన్లు అన్నీ తిరిగి, ఫిర్యాధులు చేసామని, తమ మీడియాలో గగ్గోలు పెట్టారు. రోజూ అదే రోత పాట పాడుతుంటే సాధారణంగా ఎవడికైనా అనుమానం వస్తుంది. పైగా పొరుగు రాష్ట్రంలో మాయల్ ఫకీర్ చేసిన పని, దాని ఫలితాల పర్యవసానాలతో స్వయంగా కంగుతిన్న తెలుగు తమ్ముళ్లకు అనుమానం వస్తుంది. పైగా జగన్ బ్యాచ్ ఎప్పుడూ, రక్త కన్నీరు నాగభూషణం నుండి రావుగోపాలరావు & సత్యనారాయణ వరకు పండించిన విలనిజం పాత సినిమాలు చూసి కుట్రలు పన్నుతారని తెలుసు కాబట్టి ఆ విధంగా ఆలోచించారు.

అసలే టిడిపిలో పార్టీ ప్రెసిడెంట్ నుండి గ్రామంలో సేవా మిత్ర వరకు టెక్ బ్యాచ్. పెద్ద ఎత్తున ఓటర్లు తొలిగిస్తున్నారని, ఉప్పెనలా సోషల్ మీడియా హోరెత్తింది. అందరూ చెక్ చేశారు. ఫారం 7 తో పెద్ద ఎత్తున లక్షల్లో తొలగించమని అభ్యంతరాలు వచ్చాయని గుర్తించారు.

అప్పుడు కూడా వైకాపా మేకపోతు గాంభీర్యంతో, మా ఓట్లు తొలగించేస్తున్నారని గగ్గోలు పెట్టింది. కొంచం పరికించి చూస్తే నెల్లూరు & ప్రకశం జిల్లాలలో తక్కువగా ఫారం 7 ఫిర్యాధులు అందినట్టు తెలుసుకొంది టిడిపి. ఎన్నికల కమీషనును కలిసి గట్టిగా నిలదీసే సరికి, నకిలీ ఫిర్యాధులు పెద్ద ఎత్తున ఏ ఐపి అడ్డ్రెస్స్ నుండి వచ్చాయో, వాళ్లమీద కేసులు పెట్టండి అని ఆదేశాలు వచ్చాయి. మొత్తం 45 చోట్ల జరిగాయని 45 కేసులు పెట్టారు.

అనుమానం రాకుండా వివేకానంద రెడ్డితో పులివెందులలో నాటకం మొదలెట్టారు. తరువాత, నాకు తెలియకుండా నా పేరుతో, ఎవరో ఫారం 7లు అప్లోడ్ చేసారు, నేను అమాయకుడిని అని పోలీస్ స్టేషనుకు ఫిర్యాధులు ఇవ్వమని అదే దొంగలకు వాట్సాప్ టెంప్లేట్ మెసేజులు పంపారు.

మధ్యలో టిడిపి కొన్నేళ్లుగా, సేకరిస్తున్న డాటా మీద కన్నుపడింది. అదే తెలంగాణాలో కెసీఅర్ & కేటీఅర్ సహకారంతో ఎలా కొట్టేయాలో ప్రణాళికలు వేసారు. వారి వుద్దేశం వోట్లను చెక్ చెయ్యకుండా టిడిపి సేవా మిత్రలను బ్లాక్ చెయ్యడం, ఆ డాటా లోని టిడిపి బూతు స్థాయి వ్యక్తులకు కాల్ చేసి మీరు చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు, పాదయాత్ర సమయంలో జగన్ మీ గురించి తెలుసుకొన్నారు. కలుస్తారా, జగనుకు సలహాలు ఇస్తారా అని కాల్ సెంటర్లతో, మైండ్ గేం మొదలెట్టారు. ఒకటి, మన డాటా జగన్ దగ్గర వుంది అని బయపెట్టడం. కలిస్తే ఏమన్నా డబ్బు వస్తుందేమో అని ఆలోచించేలా మైండ్ గేం అన్నమాట.

అక్కడ చాలా రోజుల ముందే ఐటి గ్రిడ్ కంపెనీదగ్గర పోలీసులు మఫ్టీలో రావడం, నువ్వేం చేస్తావు గట్రా ప్రశ్నలతో అడగడం, సాయి రెడ్డి మీడియాకు తెలియజేయడం, మరుసటి రోజు, షర్మిల & జగన్ మేయర్ మేన మామ తమ్ముడి భార్య మొగుడు లోకేశ్వర రెడ్డి తో ఫిర్యాధు చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు గట్రా పట్టుకుపోవడం జరిగాయి. కోర్టుకు వెళ్లి అక్షింతలు వేసుకొని, వారి మీదే కేసులు అయ్యేలా తప్పుడు పనులతో వైకాపా & తెరాస బండారం బయటకు వచ్చింది.

వీళ్ళిద్దరి మధ్యన పెరిగిన అనుబంధం అందరికీ తెలిసిందే గానీ డాటా చోరీ కేసుతో పబ్లిక్ అయిపోయింది.చంద్రబాబు మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టి రాంగ్ స్ట్రాటజీ వల్ల ఆశించిన ఫలితం సాధించలేక బిక్కమొగం వేసినప్పటి నుంచీ పుట్టిన హుషారులో ఒకింత ఆదమరిచి ఓటుకు నోటు కేసులోలా సరయిన జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు దూసుకెళ్ళడంతో అప్పుడు బాబు ప్లాన్ బాబు మీదకే బూమరాంగ్ అయినట్టు ఇప్పుడు తమ ప్లాన్ తమ మీదకే బూమరాంగ్ అయ్యింది - అప్పటి విజయం కేసీయార్ సమర్ధతకీ ఇప్పటి అపజయం కేటీయార్ అసమర్ధతకీ చిహ్నమా!అప్పుడు కేసీయార్ అంత తక్కువ సమయంలో ఎంత చురుగ్గా స్పందించాడు!ఇప్పుడు కేటీయార్ ఇంత ఎక్కువ సమయం ఉన్నా అంత మందకొడిగా ఎందుకు ఉన్నాడు?

వోటుకు నోటు కేసు అనేది చంద్రబాబు కేసీయార్ ప్రభుత్వాన్ని పడగొట్టటానికి వేసిన ప్లానుని ఆఖరి నిముషంలో కనిపెట్టి దాన్ని బూమరాంగ్ చెయ్యటం.మా వెలమ కులస్తులకి రోషం చాలా ఎక్కువ.అలాంటప్పుడు తనని తొక్కెయ్యాలని చూస్తున్న బాబు పట్ల కేసీయార్ అలా కాకుండా ఇంకెలా రియాక్ట్ అవుతాడు?కానీ కధని ఇక్కణ్ణుంచే మొదలుపెడితే బాబు విలన్ లాగే కనిపిస్తాడు. కానీ ఆంధ్రాకి కొంత వెసులుబాటు కల్పించే విభజన బిల్లుకి సంబంధించిన మెలికల్ని పరిష్కరించుకోవడానికి ముందుకు రాని కేసీయార్ తనకి కావల్సిన హైకోర్టును గురించి పట్టుపట్టటాన్ని మర్చిపోగలమా?

విభజన బిల్లులో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుందా?తనకి ఒక్క రూపాయి కూడా నష్టం రానప్పుడు ఆంధ్రాకి ఒక్క రూపాయి కూడా వెళ్ళకూడదు అనే ఉద్దేశం తప్ప విభజన బిల్లు సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా ముందుకు రాకపోవటానికి ఇంకొక కారణాన్ని తెరాసా అభిమానులే కాదు సాక్షాత్తూ కేసీయార్ అయినా చెప్పగలడా?

మోదీ గృహప్రవేశానికి వస్తూ కుండెడు మట్టీ చెంబుడు నీళ్ళూ ఇచ్చి సరిపెట్టడం ఆంధ్రాకి ప్రత్యేక హోదా రాకపోవటానికి కారణం సాంకేతిక కారణాల వల్ల భాజపా యొక్క అసహాయత కాదనీ ఎంత గింజుకున్నా సరే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని వాళ్ళు ముందునుంచీ కృతనిశ్చయులై ఉన్నారనీ తెలుసుకోవడానికి ఎంత గట్టి సాక్ష్యమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విభజన బిల్లుకి  సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకుందామని ఎన్నిసార్లు పిల్చినా  ముందుకు రాకపోవటం కేసీయార్ ఆంధ్రాని ఆర్ధికంగా దెబ్బదియ్యడం ద్వారానే తెలంగాణలోనూ జాతీయస్థాయిలోనూ రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడని భావించటానికి అంత గట్టి సాక్ష్యం!

ద్వేషం పునాదుల మీద సిద్ధాంతం నిర్మించుకుని ద్వేషం పరిధిని రాజకీయానికి పరిమితం చెయ్యకుండా సామాజిక సైద్ధాంతిక సాంస్కృతిక సాహిత్య కళారూపాల వరకు విస్తృతం చేసి కొన్ని దశాబ్దాల పాటు భాషాహింసానలరణఘోషతో మమేకమైపోయిన ఉద్యమాన్ని నిర్మించుకుని న్యాయమా అన్యాయమా అనే తర్కవితర్కాలతో పనిలేకుండా తమకు కావల్సినది ఇవ్వకపోతే ఎదటివాళ్ళ తనుధనమానప్రాణాల్ని హరిస్తూ రక్తపుటేరులు పారించటానికి కూడా సిద్ధపడి అధికారం చేపట్టినవాళ్ళకి సామరస్యం మృదుభాషిత్వం ఎట్లా అలవడుతాయి - మాడదిరే దెబ్బ ఎదటివాడు కొడితేనే తల్లోని జేజెమ్మ దిగి కళ్ళు అసలు బొమ్మని చూస్తాయి!

యజమానిని సంతోషపెట్టటానికి బానిసలు ప్రాణాలను సైతం పణం పెట్టి శత్రువుల తలలు నరికి తెచ్చి ప్రభువు పాదాల మీద పడవెయ్యాలనుకున్న మధ్యయుగాల నాటి హంవీరచూడామణుల వంటి తేలున్‌గాణ పోలీసులు కేటీయార్ గారిని సంతోషపెట్టటానికి చూపించిన అత్యుత్సాహం వల్ల ఈసారి అంబ పలికి పంబ రేగి పట్టిన దెయ్యం దిగేటట్టు ఉంది చూడబోతే!ఎన్నికల కమిషన్ వద్ద భద్రంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సమాచారం చోరీకి గురైందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి గత నెల 19న ఢిల్లీలో జాతీయ ఎన్నికల కమిషనుకు ఫిర్యాదు చేశారు.అయితే ఎన్నికల కమిషన్ తన పని మొదలుపెట్టటానికి ముందే ఫిబ్రవరి 22న తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు.దీంతో సైబరాబాద్ పోలీసులు ఐటీగ్రిడ్స్ కంపెనీలో అనధికారిక తనిఖీ నిర్వహించారు.తమాషా ఏమిటంటే, ఈ ఫొటోలు బయటికి వస్తే అవి ఎలా బయటికి వచ్చాయో దర్యాపు చేస్తాం అన్నారు తప్పితే కేసు నమోదు చేయకుండా దర్యాప్తు చేయటం ఖచ్చితంగా తప్పే అయినప్పటికీ దాన్ని మాత్రం ఒప్పుకోలేదు.అప్పటికే వైకాపాకీ తెరాసకీ వైవాహికేతర సంబంధం ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే అయినా ఎంత మాంసాహారి అయినప్పటికీ ఎముకలు మెళ్ళో వేసుకు తిరగనట్టు విజయసాయిరెడ్డి ఫిర్యాదుకు రియాక్టయితే మరీ పబ్లిక్ రొమాన్స్ అవుద్దేమోనని కించిత్తు సిగ్గు పడినట్టున్నారు లోకేశ్వరరెడ్డి అనే దూతిక నుంచి ఫిర్యాదు తీసుకుని మార్చి 2వ తేదీన కేసు నమోదు చేశారు.

అసలు ఆంధ్ర డాటా చోరీకి గురి కానప్పుడు ఇవన్నీ వేస్ట్ కదా!మరి, పేపర్లలోనూ టీవీల్లోనూ చూస్తున్న మనకి తెలిసిన మాత్రం కేసీయారుకి తెలియదా?తెలుసు!అటూ ఇటూ కొన్ని రోజుల పాటు మాటల యుద్ధం జరగటం తప్ప తను ఈసారి చంద్రబాబుని కనీసం ఓటుకు నోటు కేసులోలా కూడా ఇరుకున పెట్టలేనని తెలిసే ఉండొచ్చు - మరి  ఎప్పుడూ ఎఫెన్సివ్ గేమ్ ఆడే కేసీయార్ ఇప్పుడు డిఫెన్సివ్ గేమ్ఎందుకు ఆడాడు?

తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైకుంఠపురం బ్యారేజి కట్టడానికి వీల్లేదని కృష్ణా రివర్ మ్యానేజిమెంట్ బోర్డుకి ఫిర్యాదు చేసింది!ఎప్పుదు?ఫిబ్రవరి 26వ తేదీన!అబ్బే!ఈ రెండూ కో ఇన్సిడెన్స్ కావచ్చు అంటారా?ఇప్పుడే కాదు,ఇదొక్కటే కాదు - మొదటి రోజు నుంచీ మన రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టు మీదా తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసింది!ఇలాంటి వెధవపనులు చేస్తున్నప్పుడల్లా తెలంగాణ ప్రజల మరియు ఆంధ్ర ప్రభుత్వ దృష్టిని మళ్ళించడానికి ఇదే విధమయిన సంచలనాన్ని సృష్టించడంలో కేసీయార్ సృజనాత్మకత అద్భుతం!అత్యద్భుతం!పరమాద్భుతం!!!

ఇలా ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమూలాల్ని దెబ్బతీస్తున్న కేసీయార్ స్పాన్సర్ చేస్తున్న వై ఎస్ అర్ పీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో పయనిస్తుందని ఇదా ప్రపంచం బ్లాగర్ చెబుతున్నారు - ఎంత అమాయకత్వం!. "ప్రత్యేక హోదా కోసమయితే వై ఎస్ ఆర్ పీ గెలిచినా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓటు వేయొచ్చు"నట! ఇటు బీజేపీ తోనూ, కేసీఆర్ తోనూ సఖ్యతగానే ఉంటున్నారు అనేది వారి వాదన.

కానీ, అటు బీజేపీ దగ్గిరా ఇటు తెరాస దగ్గిరా జగనుకే ప్రత్యేక హోదా లేదు!కనీసం సమానస్థాయి కూడా ఇవ్వటం లేదు వాళ్ళు - ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి పీఠం అనే వ్యామోహానికి గురైన జగన్ బలహీనతలతో ఇద్దరూ ఆడేసుకుంటున్నారు. పెతి యెదవ ప్లానుకీ మొదట్లో ఈసారి సక్సెస్ ఖాయం అని ఉర్రూత లూగుతున్నాడు, ఫెయిలయినప్పుడల్లా పిచ్చెక్కి పోతున్నాడు, ఈ బలిపశువు ఇట్లా చిత్రహింస పడుతుంటే వాళ్ళేమో ఈ బలిపశువు ఆక్రందనల్ని చూసి వినోదిస్తున్నారు, ముఖ్యమంత్రి అయ్యాక కూడా సుఖంగా ఉండనివ్వరు, ఎదురు తిరిగితే తొక్కేస్తారు!

విభజన బిల్లులోని సమస్యల్ని పరిష్కరించుకున్నందువల్ల కేసీయారుకి గానీ ప్రత్యేకహోదా ఇచ్చినందువల్ల మోదీకి గానీ ఒక్క రూపాయి నష్టం లేకపోయినా యెందుకు ముందుకు రావడం లేదో తెలుసా!ఆ వెసులుబాట్లు ఏవీ లేకపోయినా వీళ్ళు ఎన్ని అడ్డుకట్టలు వేసినా చంద్రబాబు రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వ అధికారికమైన నివేదికల సాక్ష్యంగా దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్యన శిఖరాగ్రం మీద నిలబెట్టాడు!
=====================
Andhra Pradesh has achieved the number one rank in the country with an average growth of 10.5% during the last four years.

It has surpassed many developed States such as Maharashtra and Gujarat following a “focused approach” and setting high targets for itself.

According to the State Planning Department, the average growth in the country stood at 7.3% during the last four years.Probably, Andhra Pradesh is the only State to clock the double-digit growth rate.

While Telangana has slipped to the second place, Maharashtra is ranked sixth. Punjab is placed 14th and Karnataka third.

The growth in Andhra Pradesh was 9.2% in 2014-15, the year of bifurcation. Later, it was ranked second. In the subsequent year, it achieved a double-digit growth of 10.6% though its rank had slipped to the 4th place.

Double-digit progress
Since then, the State has been achieving double-digit growth rates.

Gujarat, which is considered the most developed State, registered a growth of 10.5% in 2014-15. But it slipped to 10.1 in 2016-17. The data pertaining to 2017-18 is not available.

Telangana, which registered 6.8% growth in 2014-15 could achieve 10.4% in 2017-18, officials said.

The Per Capita Income (PCI) also increased by more than ?40,000 during 2017-18 in the State, which started its journey with “the lowest PCI of ?93,903” in the southern States.

The PCI crossed the ?1 lakh mark in 2015-16. The trend has been upward since then.

The PCI grew to ?1,08,163 in 2015-16 and to ?1,23,664 in 2016-17 and ?1,42,054 in 2017-18.
=====================
వందమంది పరుగుపందెంలో పాల్గొంటే వందమందికీ ప్రధమ స్థానం రాకపోయినా పాల్గొనే ప్రతివాడూ ప్రధమ స్థానాన్ని ఆశించడం సహజమే!కానీ, ముందు పరిగెత్తుతున్న వాడి కాళ్ళు విరగ్గొట్టి ప్రధమ స్థానం తెచ్చుకోవాలనుకోవడం మాత్రం దుర్మార్గమే!

పత్రికల వాళ్ళు మొదటి పేజీలో తాటికాయంత హెడ్డింగులు పెట్టి చూపించే డాటా చోరీ లాంటి సంచలన వార్తలకి బుర్ర తిరిగిపోయి లోపలి పేజీల్లో తెలంగాణ వైకుంఠపురం బరాజును ఆపమని కృష్ణా రివర్ మ్యానేజిమెంట్ బోర్డుకి పిటిషన్ వేసిన  బుల్లి వార్తల్ని చదవటానికి పేజీ తిప్పకుండా వెంటనే మరిన్ని విశేషాల కోసం టీవీ ముందు కూర్చుంటే బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అంటూ హడల గొడుతూ డాటా చోరీ లాంటి సంచలన వార్తలను మాత్రమే చూసే మనకి తెలియదు గానీ జగన్ తెలంగాణ దుర్మార్గం తెలుసుకోలేనంత దూరంగా లేడు - మరి, ఎందుకు మాట్టాడ్డూ!

హయ్యోరామ, "ఏమిటండీ!తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి అంత అన్యాయం చేస్తుంటే మీరు ఒక్క ముక్క మాట్లాడరేంటి?" అని నిలదీస్తే అతనికి కలిగే ఇబ్బందిని తొలగించడానికే సరిగ్గా అదే సమయంలో ఇలా సంచలనాలను సృష్టిస్తున్నారండీ బాబూ!

కేసీయార్ మరియు మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ని ముఖ్యమంత్రిని చెయ్యటంలో కేవలం రాజకీయపరమైన కారణాలు మాత్రమే లేవు - ఆర్ధిక కోణం, అంటే లాభాపేక్ష కూడా వుంది. ప్రకాశం జిల్లాలో వివాదాస్పదంగా మారిన వాన్‌పిక్ ప్రాజెక్టులో కొంత వాటాను కేసీయారుకు అత్యంత సన్నిహితులు కొనుగోలు చేశారు.ఏపీలో జగన్మోహనరెడ్డి అధికారంలోకి వస్తే వాన్‌పిక్ ప్రాజెక్టును క్లియర్ చేయించుకుని ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఓడరేవును నిర్మించుకోవాలన్నది  కేసీయార్ సన్నిహితుల కోర్కె!అలా నిర్మించే ఓడరేవుతో తెలంగాణ ప్రభుత్వం సరుకుల ఎగుమతులు దిగుమతుల కోసం ఒప్పందం  కుదుర్చుకుంటుందట!

మోదీ చాయ్‌వాలాయే కావచ్చు, కానీ అమిత్‌షా కాదు గదా - ఆ వ్యాపారి కూడా ఆ పోర్టులో వాటా తీసుకుంటాడు!నేడు ఆంధ్రా మీద డేటా చోరీ కేసు  పేరున రంకెలు వేస్తున్న కేసీయార్ నిన్న తనే తెలంగాణ ఎన్నికల కమిషనరుతో కలిసి చేసిన మోసాన్ని రేపు జాతీయ ఎన్నికల కమిషనరుతో కలిసి దేశమంతటా తమ పార్టీ కోసం చేద్దామనుకుని సుప్రీం కోర్టు చివాట్లు పెట్టటంతో ఆగిపోయిన ప్రబుద్ధుడు మోదీ!

మా ప్రాంతాన్ని దోచుకున్నారు,మమ్మల్ని దోచుకుని ఆంధ్రోళ్ళు బాగుపడ్డారు,విడిపోతేనే బతుకుతాం,కలిసుంటే చచ్చిపోతాం అని రంకెలు వేసి విడిపోయినవాళ్ళకీ మంచితనంతో కలిసి ఉండటం గురించి చెప్పినప్పుడల్లా విడిపోతే మమ్మల్ని దోచుకోవడం కుదరదని మొసలికన్నీళ్ళు కారుస్తున్నారు, మీ మోసపు కబుర్లకి మేం లొంగం, విడిపోయి తీరతాం అని ఇంకా వెఱ్ఱెక్కిపోయినవాళ్ళకీ విడిపోయాక ఇన్న్నేళ్ళూ జరిగింది ఆంధ్రావాళ్ళు తెలంగాణా వాళ్ళని దోచుకోవడం కాదనీ తెలంగాణా వాళ్ళే ఆంధ్రావాళ్ళ కష్టం మీద పెరిగారనీ ఆంధ్రప్రాంతంలో ఉన్న భూములూ పోర్టులూ లేకుండా తెలంగాణాయే బతకలేదనీ అర్ధమయినట్టుంది!

అంత క్రూరంగా తిట్టి విడిపోయి మంచిగా అడిగితే వాటా ఇవ్వరు గాబట్టి  ఆంధ్రాలో తమ కుక్కని కూర్చోబెట్టగలిగితే వాన్‌పిక్ ఒక్కటే యేంటి,మొత్తం రాష్ట్రాన్నే దున్నేసుకోవచ్చునని మరో ఎదవ ప్లానెయ్యటమే కేసీయార్ నీచత్వానికి పరాకాష్ఠ.

ఎవరీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు?తనకి వీళ్ళతో అనుబంధమే లేదా!సమైక్య రాష్ట్రంలో ఒకనాడు తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగానూ మంత్రిగానూ ప్రమాణం చేసేటప్పుడు వీళ్ళని రక్షించటం కోసం తన సర్వశక్తులూ ధారపోస్తానని చెప్ప్పినది అబద్ధమా?అది తన గతజన్మ అనుకుంటున్నాడేమో - డెబ్బయి వేలపుస్తకాలు నమిలిన జ్ఞాని కదా!పోనీ, తెలంగాణ వోటర్లు 16 పార్లమెంటు సీట్లూ తనకిస్తే జాతీయస్థాయిలో చక్రం తిప్పేటప్పుడు కూడా ఈ ఆంధ్ర ప్రజలు తను రక్షించాల్సిన వాళ్ళలో ఉంటారు కదా!బహుశా, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని నిర్ధూమధామం చేశాకే జాతీయస్థాయికి వెళ్తాడు కాబోలు!

చంద్రబాబు కూడా తన ప్రాభవం కోసమే ఎత్తులు వేస్తున్నప్పటికీ అందులో ఆంధ్రప్రజల భవిష్యత్తు ముడిపడిఉంది!ఎన్నికల తర్వాత కూడా ఆంధ్రాకి ప్రత్యేక హోదా దక్కాలన్నా విభజన బిల్లు పూర్తి రూపంలో అమలు కావాలన్నా ఆంధ్రాలో చంద్రబాబు మరింత బలపడటం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడటం చాలా అవసరం అనేది ఆంధ్ర వోటర్లు గుర్తుంచుకోవాలి!పుల్వామా ప్రతీకార దేశభక్తి ప్రదక్షిణల్ని చూసి ముగ్ధులైపోయి ఇక్కడ బాబుని గెలిపించి అక్కడ మోదీని గెలిపించుదాం అని మొహమాట పడినా రాష్ట్రం "అవశేషం"గా మిగిలిపోతుంది!


తెలంగాణ ప్రజలు పొరుగు రాష్ట్ర ప్రజల పట్ల న్యాయంగా ఆలోచించాలి.మీ ముఖ్యమంత్రి మీకు మేలు చేస్తున్నాడు గాబట్టి అతను పొరుగు రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తూ రాజకీయంగా ఎదగాలనుకోవడాన్ని సమర్ధించకూడదు!


మిమ్మల్ని చూసి మేము ఏడవట్లేదు!మమ్మల్ని చూసి మీరు ఏడవకండి!

Wednesday, 6 March 2019

కేసీయార్ మరియు కేటీయార్ అనే సుందోపసుందులకు మైండు పని చేస్తున్నదా లేదా?

కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు మాకూ మా ప్రాంతానికీ ఆంధ్రోళ్ళు అన్యాయం చేశారని యేడ్చి అధికారం తెచ్చుకున్నవాళ్ళు మీ యేడుపు మీరు యేడ్చే పని మానేసి ఇంకా ఆంధ్రా మీద పడి యేడవటానికి సిగ్గూ శరం మానం అభిమానం ఏమీ లేవా?

చంద్రబాబు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు "పొరుగు రాష్ట్రం వాడికి ఇక్కడేం పని?" అని కూసిన మీరు ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఆంధ్రా వ్యవహారంలో తల దూరుస్తున్నారు?

దావోస్ పర్యటనలో కాళ్లరిగేలా తిరిగి నోరు నొప్పెట్టేలా అరిచి ఏమీ పీకలేక దాని గురించి చెప్పుకోవటం కూడా మానేసిన జూనియరు కూడా సీనియారిటీ చూసుకోకుండా రెచ్చిపోతున్నాడు - ఏంటి, వొళ్ళెలా వుంది?

దమ్ము ఉంటే ఇక్కడి కొచ్చి ప్రచారం చేసి ఆంధ్రాలో ఎన్ని సీట్లు గెల్చుకోగలవో  తేల్చుకోవడానికి బదులు గల్లీ లెవెల్ చీప్ ట్రిక్స్ ప్లే చెయ్యడానికి సిగ్గు వెయ్యడం లేదా?

ఏ రాస్ట్ర ప్రభుత్వం యొక్క డాటా చోరీకి గురయితే ఆ రాస్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలనీ దాని గురించి ఏ చర్య తీస్కోవాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెయ్యాలనే కామన్ సెన్సు కూడా లేదా తండ్రీ కొడుకు లిద్దర్లో ఏ ఒక్కడికీ - నాలుగేళ్ళ పైన అధికారంలో ఉండి చట్టానికి సంబంధించిన కనీస పరిజ్ఞానం కూడా లేదా మీకు?ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాల్సిన పని మీరు చెయ్యాల్సిన అవసరం ఏమిటి?

రోహింగ్యా ముస్లిముల వల్ల మన దేశానికి ముప్పు ఉందని తెలిసినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చేసింది?మీ రాష్ట్రం నిర్వహించిన పరీక్షల క్వశ్చెన్ పేఅర్లు వేరే రాష్ట్రంలో లీకయితే ఆ రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు మీరు చేసినట్టు మీ రాష్ట్రప్రభుత్వం మీద కేసు పెట్టిందా?పెట్టి ఉంటే మీకెలా ఉండేది!

ఇన్ని రోజులూ మీరూ ఆంధ్ర గజదొంగన్ కలిసి మా రాష్ట్రప్రభుతపు డేటా చోరీకి గురయిందని అంత హడావిడి ఎట్లా చేశారో!ఇప్పుడు ఆంధ్రా డేటా పక్కా సేఫ్ అని తేలిపోయింది.ఇప్పుడు అసలు చోరీకి గురైనది టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రైవేట్ డాటా అని తేలాక అసలు మీరు ఎవర్ని ముందు పెట్టి డ్రామా ఆడాల్నుకున్నారో ఆ కంత్రీ "అవును!ఆ ఘనకార్యం మేమే చేశాం!అక్రమంగా చేర్చిన టీడీపీ అనుకూల వోట్లని తీసేయించాలని పోరాడుతున్నాం" అని కొత్త క్యామెడీ మొదలు పెట్టాడు,ఇంక మీరు ఏ క్యామెడీ స్టేట్మెంట్ ఇస్తారో చూసి నవ్వుకోవడమే మిగిలింది ఈ ఆంధ్ర డేటా చోరీ కేసులో!

కేసు ఏ క్లైమాక్సుకి వస్తుందో అందరికీ తెలిసిపోయింది, మీ చదువుకున్న తెలివిలేమితనం తెలంగాణ పోలీసులు  ఉద్యోగుల చేత తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారన్న విషయం బయటపడినప్పుడే తెలిసిపోయింది:-)

మీరు ఆంధ్రలో గేం ఆడటానికి ఎంచుకున్న పావు ఎంత బలహీనమైనదో తెలుస్తున్నదా మీకు!నిన్న గాక మొన్న "ఇంకేముంది అన్ని ఉద్యోగాలూ కమ్మవాళ్ళకే ఇచ్చేసుకున్నారు,కాపు కులానికి అన్యాయం జరిగింది!" అని బిల్డప్ ఇచ్చాడు తన సొంత మీడియాలో ఈ బుజ్జాయి పబ్లిక్ డయాస్ మీద పేర్లు చెప్పి నా శత్రువులని ప్రకటించిన మీడియా రంగంలోకి దిగి లెక్క తీసి అక్కడ ఉన్న కమ్మకులస్థులు ఇద్దరే ఇద్దరని చూపించాక టెంకిజెల్ల తిన్న స్కూలుపిల్లాడిలా సైలెంట్ అయిపోయాడు.ఎక్కడో ఓక మారుమూల పల్లెటూళ్ళో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే సరాసరి చంద్రబాబే వెళ్ళి అతని కడుపులో కత్తి గుచ్చి చంపేసినంత స్థాయిలో ఆందోళన చహెశాడు.చంద్రబాబు తారాబలం బాగుండి అసలు "జరిగిన కధ!" వీడియో బైటికి రావడంతో అవాక్కయ్యాడు!

ఇప్పుడే ఇట్లా ఉన్నాడు, ఆ మనిషి అధికారంలోకి వచ్చాక ఇంకెన్ని పిచ్చిపన్లు చేస్తాడో అని ఆంధ్ర జనం హడిలి చస్తున్నట్టున్నారు ఇప్పటికే!మీరూ మోదీ కలిసి గాలి కొట్టిన కొద్దీ ఉబ్బిపోయి ఇలాంటి ఎదవ ప్లాన్లు వేస్తా ఉంటే ఆంధ్రా జనం "I KNOW WHAT YU DID LAST SUMMER!","WHAT LIES BENEATH" లాంటి హర్రర్ సినిమాలన్నీ ఓకేసారి చూసినట్టు మరింత భయపడిపోయి బాబుని మరింత మెజార్టీతో గెలిపించటం ఖాయం!మీరుముగ్గురూ వేసిన వేస్తున్న ప్లానులన్నీ బూమరాంగ్ అవటం చూస్తుంటే చంద్రబాబుకు అదృష్టం కూడా తోడైనట్టు ఉంది - జగన్ మీద అనవసరపు ఆశల్ని పెట్టుకుని చిల్లరపనులు చేసి ఎన్నికల తర్వాత నవ్వులపాలు కాకుండా ఉండటం కోసమైనా తండ్రీ కొడుకులు కొంత నిదానించితే బాగుంటుందనేది నా ఉచిత బోడి సలహా!

ఆంధ్ర వోటర్లు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుని ఉంటారు - ఇవ్వాళ ఆంధ్ర ప్రజలు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో కాంగ్రెసు పార్టీకి భారీ మెజార్టీని చేకూర్చడం తెలివైన పని అనేది నా మనసులోని మాట!

Friday, 1 March 2019

శివపురాణం శివుడే విష్ణువుతో సహా అన్నింట్నీ సృష్టించాడంటుంది!విష్ణుపురాణం విష్ణువే శివుడితో సహా అన్నింట్నీ సృష్టించాడంటుంది!దేవీభాగవతం ఆదిశక్తియే శివుణ్ణీ విష్ణువునీ సృష్టించిందని చెప్తుంది!హిందూద్వేషులు సంస్కృతం నేర్చుకుని అల్లరి చెయ్యక ముందే వీట్ని సమర్ధించి పారెయ్యాలి - వేదం అబద్ధం చెప్పదని కూసేశాను, ఇప్పుడెట్లా?

హైందవేతరులకే కాదు హిందువులకి కూడా ఇది భూగోళం బద్దలయ్యేటంత పెద్ద సందేహమే!అయితే, అసలు ఇంతమంది దేవుళ్ళు అవసరమా?సృష్టికర్త ఒకడే అని చెప్తున్నప్పుడు ఆ ఒక్క సృష్టికర్తనే పూజించితే సరిపోతుంది కదా, ఇంతమంది సృష్టికర్తల్ని చూపించి గందరగోళంలో పడెయ్యటం దేనికి?మళ్ళీ ఆ  గందరగోళం నుంచి బయట పడెయ్యటానికి కొంతమంది గురుత్వం వహించడం దేనికి?

దీనికి సరైన సమాధానం చెప్పబోయేముందు హిందూమతం గురించి ఒక పరమసత్యం చెప్పాలి - ఇది ఒక మతం కాదు,ఒక పవిత్ర గ్రంధం లేదు,ఒక ప్రత్యేకమైన మార్గం లేదు!ఇది ఎలా సాధ్యపడింది?శంకర మతం,రామానుజ మతం,మధ్వ మతం,  జైన మతం,బౌద్ధ మతం వంటివి ఉన్నాయి కానీ అవి కాక ఇతరులు పాటించే దానిని వైదిక ధర్మం అంటారు.పైన చెప్పిన మతాలు కూడా వేదం నుంచే కొంత భాగాన్ని తీసుకుని తమ సొంత మార్గాన్ని ఏర్పరచుకున్నాయి. అబ్రహామిక్ మతాల వారి దృష్టిలో నాస్తికత్వం అంటే దేవుడు లేడని అనటం, కానీ సనాతన ధర్మం  నాస్తికత్వం  అనే పదానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం వేదం పరమ ప్రమాణం అని అంగీకరించకపోవటం కాబట్టి జైనం, బౌద్ధం, అజీవకం,కాపాలికం వంటివాటిని నాస్తిక మతాలు అని కూడా అంటారు.అయితే పునాదిని బట్టి ఇవి కూడా సనాతన ధర్మంలోని శాఖల వలె అమరిపోయినాయే తప్ప ఆధిక్యత కోసం పరస్పర దూషణ హననాదులు చేసుకోలేదు!

సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తల యొక్క ప్రధాన ఉద్దేశం అబ్రహామిక్ మతాల వారి వలె అందరినీ తీసుకెళ్ళి ఒక్కరికో లేక కొందరికో బానిసల్ని చెయ్యడం కాదు గనక మానవులకి నిజమైన భద్రతనీ శాంతినీ పురోభివృద్ధినీ ఇచ్చే సామాజిక వ్యవస్థ గురించి శోధించారు, సాధించారు. పూర్వ ఋషులు వారి నిశిత పరిశీలనతో మానవులే కాదు, సమస్త జీవుల లోనూ తమ ముందు ఉన్న అనేకానేకమైన వస్తువులలో భావాలలో లక్ష్యాలలో దేనిని స్వీకరించాలనే విషయంలో త్రిగుణాత్మకత కనిపిస్తుందని గమనించారు.

ఐన్స్టీన్ ప్రకృతిలోని కొన్ని దృగ్విషయాలను పరిశీలించి చెప్పిన సాపేక్షతా సిద్ధాంతాన్ని సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తలు ఆనాడే దర్శించారు, సమస్త విషయాలనూ ఆ రకమైన అవగాహనతోనే పరిశీలించారు.అయితే, ఆధునిక సాపేక్షతా సిద్ధాంతంలోని కాంతివేగం వలె సనాతనులు "మార్పు అనివార్యం!" అని ఒక శాశ్వత సత్యాన్ని ప్రతిపాదించారు.తామసం, రాజసం, సాత్వికం అనే మూడు గుణాలు మానవులలోనే కాదు ప్రతి జీవిలోనూ ఉంటాయి.అయితే  ఏదో ఒక గుణం అధిక స్థాయిలో ఉంటుంది.తన ముందు ఉన్నవాటిలో దేన్ని తీసుకోవాలి,తను ఏ పని చెయ్యాలి,తనకు ఏది సంతోషాన్ని కలిగిస్తుంది అనే రకరకాల అంశాలకు సంబంధించి ఆయా ప్రవృత్తులు గలవారి అనుభూతులూ ఆపేక్షలూ భావాలూ లక్ష్యాలూ పూర్తి వైవిధ్యంతో నిండి ఉంటాయి.

వ్యక్తి->వ్యష్ఠి->సముష్ఠి జీవనం సుఖవంతం కావాలంటే ఇతర వర్గాలన్నిటినీ నాశనం చేసి ఒక వర్గాన్ని మాత్రమే మిగిలించడం. ఇతర మతాలన్నిటినీ నాశనం చేసి ఒక మతాన్ని మాత్రమే మిగిలించడం. ఇతర కులాలన్నిటినీ నాశనం చేసి ఒక కులాన్ని మాత్రమే మిగిలించడం. ఇతర కుటుంబాలన్నిటినీ నాశనం చేసి ఒక కుటుంబాన్ని మాత్రమే మిగిలించడం పరిష్కారం కానే కాదు - అసలు అలాంటిది వాస్తవ ప్రపంచంలో సాధ్యపడదు కూడా!సువిశాల ప్రజాసమూహాన్ని ఒక్క తాటి మీద నడిపించాలంటే సమూహంలోని ఈ మూడు ధోరణులనీ పట్టించుకుని ఎవరికి ఏది ఇస్తే సంతోషంగా ఉంటారో వారికి అది ఇవ్వగలగటమే సమర్ధవంతమైన ప్రభులక్షణం అవుతుంది, కదా!

అందుకే సనాతన ధర్మం ఒకే లక్ష్యాన్నీ ఒకే మార్గాన్నీ ఒకే అంశాన్నీ ప్రజల ముందు ఉంచలేదు.తను ఇవ్వగలిగిన అన్ని ప్రత్యామ్నాయాలనీ ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమనడం గొప్ప విషయమే తప్ప తప్పుడు ధోరణి ఎంతమాత్రం కాదు.ఇప్పుడు మనముందు కొన్ని కీలకమయిన ప్రశ్నలు ఉన్నాయి.

వేదం శివుడే సృష్టికర్త అని చెప్పిందా?
సోమః పవతే జనితా మతీనాం జనితా దివో జనితా పృధివ్యాః|
జనితాగ్నేర్జనితా సూర్యస్య జనితేంద్రస్య జనితోత విష్ణోః||
ఋగ్వేదం 9.86.5

పదార్ధ తాత్పర్యం:(సోమః)ఆ సర్వోత్పాదకుడగు పరబ్రహ్మ (పవతే) అన్నిటిని పవిత్ర పరచును,(జనితా మతీనాం) జ్ఞానముల నుత్పన్న పరచును, (దివో జనితా) ద్యులోకము నుత్పన్న పరచును, (పృధివ్యా జనితా) పృధివి నుత్పన్న పరచును, (అగ్నేర్జనితా)అగ్ని నుత్పన్న పరచును, (సూర్యస్య జనితా) సూర్యు నుత్పన్న మొనర్చును (ఉత) మరియు (విష్ణోః జనితా) జ్ఞానయోగుల నుత్పన్న పరచును మరియు (ఇంద్రస్యజనితా) కర్మయోగుల నుత్పన్న పరచును.

భావార్ధ ప్రతిపత్తి:ఈ మంత్రమున పరమాత్మ యొక్క సర్వకర్తృత్వం  నిరూపించబడినది సోమ నామం శివుణ్ణి సూచిస్తున్నది గనక ఇది శివపురాణం వేదసమ్మతమేనని తెలియజేస్తున్నది.
కాబట్టి శివపురాణం - వేదం ఒకదానితో ఒకటి విభేదించటం లేదనీ శివపురాణం శివుడే సృష్టికర్త అని అనడాన్ని వేదం సమర్ధిస్తున్నదనీ నిరూపణ అయింది, కదా!

వేదం ఆదిశక్తియే సృష్టికర్త అని చెప్పిందా?
ఆరావీదంశుః సచమాన ఊర్మిణా దేవావ్యం మనుషే పిన్వతి త్వచం|
దదాతి గర్భమదితేరుపస్థం ఆ యేన తోకం చ తనయం చ ధామహే||
ఋగ్వేదం 9.74.5

పదార్ధ తాత్పర్యం:(ఊర్మిణా)తన ఆనంద తరంగములతో (సచమానః) కూడియున్న (అంశుః)సర్వవ్యాపకుడగు ఆ పరమాత్మ (ఆరావీత్) సదుపదేశము నిచ్చుచున్నాడు. మరియు (మనుషే) మనుష్యుల కొరకు (దేవావ్యం) దైవభావము నుత్పన్నపరచు శరీరమును (పిన్వతి) పుష్ఠి పరచును మరియు (అదితేరుపస్థే) ఈ పృధివిపై (గర్భ) నానావిధములగు ఓషధులను ఉత్పన్నపరచు గర్భమును (ఆదధాతి) ధరించును.(యేన) దేనిచే (తోకం) దుఃఖములను నాశనమొందించునట్టి (తనయం) పుత్ర పౌత్రాదులను (ధామహే) మనము ధారణ మొనర్చవలెను.

భావార్ధ ప్రతిపత్తి:పరమాత్మ కృప చేతనే సత్కర్మ లొనర్చువారికి వ్యాధిరహితమగు దివ్యశరీరము లభించును.దీనిచే వారు సత్సాంతానమును పొంది ఈ ప్రపంచములో అభ్యుదయశీలురు కాగలరు.ఈ మంత్రంలోని కార్యకారణఫలితసంబంధం నిరూపించబడిన అదితి గౌరికి గల అనేక నామాల్లో ఒకటి కాబట్టి ఇది దేవియే సృష్టికర్త అని చెబుతున్నది.

గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ|
అష్టపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్
ఋగ్వేదం 1.164.41

పదార్ధ తాత్పర్యం:(గౌరీః)గౌరవర్ణాః (మిమాయ) శబ్దాయతే (సలిలాని) జలానీన నిర్మలాని వచనాని (తక్షతీ) (ఏకపదీ)ఏకవేదాభ్యాసినీ (ద్విపదీ)అభ్యస్తద్వివేదా (చతుష్పదీ) చతుర్వేదాధ్యాపికా (అష్టాపదీ) వేదోపవేద్విద్యాయుక్తా (నవపదీ) చతుర్వేదోపవేదవ్యాకరణాదిశిక్షాయుక్తా (బభూవుషీ) అతిశయేన విద్యాను భవంతీ (సహస్రాక్షరా) సహస్రాణి అసంఖ్యాతాస్యక్షరాణి యస్యాః సా (పరమే) సర్వోత్కృష్టే (వ్యోమన్)వ్యోమనద్వ్యాప్తే

అన్వయ భాష్యం:హే స్త్రీపురుషా యైకపదీ ద్విపదీ చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా సతీ పరమే వ్యోమన్ ప్రయతతే గౌరీర్విదుషీర్మిమాయ సలిలానీన తక్షతీ సా విశ్వకళ్యాణకారికా భవతి.

భావార్ధ ప్రతిపత్తి: ఏ స్త్రీలు ఒక్క వేదమును మాత్రము అభ్యసించిన గానీ లేక రెండు వేదములను నేర్చిన గానీ లేక నాల్గు వేదములను చదివిన గానీ లేక నాల్గు వేదములు నాల్గు ఉపవేదముల యందు శిక్షణ పొందిన గానీ లేక నాల్గు వేదములు, నాల్గు ఉపవేదములు, వ్యాకరణాది విద్యలను అభ్యసించిన గానీ గౌరీ యని పిలువబడుచు మృధుభాషులై అవిద్యను పోగొట్టి విశ్వమునకు శాంతిని ప్రసాదించగలరు.


ఇక్కడ సృష్టికి ఆధారభూతమైన వేదవిద్యలకు మూలం గౌరి అని చెప్పడమే కాకుండా వేదం చదివిన స్త్రీలు కూడా గౌరీ సమానులు కాగలరని చెప్పడం వల్ల ఏమి తెలుస్తున్నది?ఆడవాళ్ళని వేదం చదవనివ్వలేదని కొందరు విమర్శించడం  తప్పు కదా!
కాబట్టి దేవీభాగవతం - వేదం ఒకదానితో ఒకటి విభేదించటం లేదనీ దేవీభాగవతం శక్తియే సృష్టికర్త అని అనడాన్ని వేదం సమర్ధిస్తున్నదనీ నిరూపణ అయింది, కదా!

వేదం విష్ణువే సృష్టికర్త అని చెప్పిందా?
సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదం
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణం హరిం
విశ్వమేవేదం పురుషః తద్విశ్వ ముపజీవతి
ఋగ్వేదం - నారాయణ సూక్తం

దీనిని వ్యాఖ్యానం అఖ్ఖర్లేదనుకుంటాను.చాలా స్పష్టంగా విష్ణువు యొక్క గొప్పదనాన్ని చెప్తున్నది.
కాబట్టి విష్ణుపురాణం - వేదం ఒకదానితో ఒకటి విభేదించటం లేదనీ విష్ణుపురాణం విష్ణువే సృష్టికర్త అని అనడాన్ని వేదం సమర్ధిస్తున్నదనీ నిరూపణ అయింది, కదా!


శివుడే సృష్టికర్త అనే శివపురాణాన్నీ విష్ణువే సృష్టికర్త అనే విష్ణుపురాణాన్నీ శక్తియే సృష్టికర్త అనే దేవీభాగవతాన్నీ సమర్ధించడం అంటే వేదం ఏ ఎండకా గొడుగు పడుతున్నట్టు కాదా!కాదు, ఎందుకంటే వేదం పరమ పవిత్రమని చెప్తున్న ఓంకారం ఈ ముగ్గురికీ అనుసంధానించింది గనక  వారిలో ఒకరు అధికులూ మిగిలిన ఇద్దరూ అల్పులూ అని చెప్పటం అసాధ్యం!

“స యద్ ధృవం దిశం అను వ్యచలద్ విష్ణుర్ భూతానువ్యచలద్ విరజం అన్నదిం కృత్వా |” (అధర్వ వేదం 15:14:5) అన్న మంత్రం “వ్రత్య నామధారియైన శివుడే కదాచిత్ లీలావినోదియై విష్ణు రూపమును దాల్చి విరజ అనే అన్నద స్వభావం గలిగిన శక్తిస్వరూపాన్ని సృష్టించాడు” అని స్పష్టం చేస్తున్నది. ఋగ్వేదం 9.74.5 ప్రకారమే అదితి గర్భంలో బీజాన్ని ఉంచి సంతానకారకుడౌతున్నది సోముడే అని తెలుస్తున్నది కదా! “నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ | నమః పూర్వజాయ చ పరజాయ చ | నమో మధ్యమాయ చ పాగల్భాయ చ |” (యజుర్వేదంలోని శ్రీ రుద్ర అనువాకం-6) అనే మహావాక్యం “ఒకేసారి జ్యేష్ఠుని గానూ కనిష్ఠుని గానూ ఉండగలిగిన వానికి నమస్కారం. ఒకేసారి పూర్వజుని గానూ పరజుని గానూ ఉండగలిగిన వానికి నమస్కారం. ఒకేసారి మధ్యస్థుని గానూ గర్భస్థుని గానూ ఉండగలిగిన వానికి నమస్కారం” అని కీర్తిస్తున్నది దేవి యొక్క మూడు అండాల నుంచి ప్రభవించిన త్రిమూర్తులనే కానీ ఎవడో వల్లకాట్లో రామనాధాయ కొడుకుల్ని కాదు.ఈ రుద్రనమకం ప్రకారం ఆ త్రిమూర్తులలోనూ ఉన్నది ఒకే పరబ్రహ్మ అన్నది నిరూపణ అయినట్లే కదా!వేదం శివుడు,విష్ణువు,శక్తి అని పేర్లు పెట్టి పొగిడినది ఒకే పరతత్వాన్ని అని అర్ధం అయింది గనక ఇంక పురాణ కధల విషయం చూడాలి.

ఉపనిషత్తులూ పురాణాలూ ధనుర్వేదం లాంటి ఉపవేదాలూ వేదాలకి కొనసాగింపు మాత్రమే తప్ప మరొకటి కాదు.వేదవ్యాసుడు అన్నిటినీ చదివి అర్ధం చేసుకుని విషయాన్ని బట్టి విభజించిన తర్వాతనే నాలుగు వేదాలు అయ్యాయి.అంతకుముందూ తర్వాతా సత్యాన్ని బట్టి చూస్తే వేదం ఒక్కటే.వేదం బీజరూపం కాబట్టి దానిని  అర్ధం చేసుకోవడం ఆ మంత్రద్రష్టల స్థాయిలో పాండిత్యం సాధించిన వారికి మాత్రమే సాధ్యం.ఆనాడు విద్య అంటే వేదవిద్యయే, ఆ విద్యని ఉపాధి కోసమో కీర్తి కోసమో నేర్చుకుంటూ ఉంటే కాలక్రమేణా వాటికి పనికొచ్చే భాగం మాత్రమే ఉండి మిగిలిన భాగం నశించి ఉండేది.అలా జరగకుండా ఉండటానికి పూర్వరుషులు రెండు మార్గాలను అనుసరించారు.అద్భుతమైన ధారణాశక్తి కలిగిన కొందరిని స్వాధ్యాయం పేరుతో నియోగించడం, వేదార్ధ ప్రతిపాదకాలైన పురాణ కధలని రచించి సామాన్య ప్రజలకు కూడా సమగ్రమైన వైదిక ధర్మాన్ని పరిచయం చెయ్యడం.

కధా సాహిత్యం అనగానే పాత్రల రూపకల్పన, సన్నివేశ కల్పన, సంవిధానం, నాటకీయత వంటి భావోద్వేగాలను రగిలించే అంశాలు ఉంటాయి.కధ అంటేనే జరగని దాన్ని జరిగినట్టు చెప్పడం,జరిగిన దాన్ని జరిగినట్టు చెప్తే అది చరిత్ర - ఈ తేడా కూడా తెలియని మూర్ఖులు హిందువుల పురాణ కధలలోని కల్పిత పాత్రల్ని వాస్తవ ప్రపంచంలోని వ్యక్తుల కింద ఫిరాయించేసుకుని వాళ్ళ మతగ్రంధాలు వాస్తవవ్యక్తులని నొక్కి చెప్తున్న కల్పిత పాత్రల కున్న అవలక్షణాల్నీ అనైతికతల్నీ అంటగట్టి ఆవేశపడిపోతున్నారు. అదీగాక, ఇవ్వాళ కనిపిస్తున్న ఉపనిషత్తులూ పురాణాలలో అధికారికమైనవి చాలా తక్కువ.ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక,మాండూక్య, ఐతరేయ, తైత్తిరీయ, ఛాందోగ్య, బృహదారణ్యక అనే పది ఉపనిషత్తులు మాత్రమే అధికారికమైనవి.ఇవి తప్ప ఏకాక్షర ఉపనిషత్తు నుంచి అల్లోపనిషత్తు వరకు గల సమస్తాన్నీ తీసుకెళ్ళి గోదాట్లో కలిపేసినా హిందూమతానికి ఎలాంటి నష్టమూ జరగదు.

పద్మ పురాణంలోనే వ్యాసప్రోక్తమైన 19 పురాణాలను గురించి  "వైష్ణవానాం నారదీయం చ తధా భాగవతం శుభం గరుడం చ తధా పద్మం వరాహం  శుభదర్శనే సాత్వికాని పురాణాని విజ్ఞేయాని శుభాని వై, బ్రహ్మాండం బ్రహ్మవైవర్త మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం రాజసాని నిబోధ మే, మత్స్యం కూర్మం తధా లైంగం శైవం స్కంధం తధైవ చ అగ్నేయం  చ షడ్ ఏతాని తాంసాని నిబోధ మే" అని చెప్పారు.

మహాభారత కాలం(పూ.సా 3102) వరకు భారతదేశంలోని ఆధ్యాత్మికత సమస్తమూ వేదాల నుంచే తీసుకోవడం జరిగింది.అప్పటికి బహ్మయే సకలలోకాధిపతి, ఐశ్వర్య ప్రదాత - ब्रह्मा लोकाधिपो यथा (శ్రీమద్ రామాయణం, బాల కాండ)! ఇంద్రుడు విజయ ప్రదాత.కురుక్షేత్ర యుద్ధం అప్పటి బలమైన  సామ్రాజ్యాలను నాశనం చేసింది.ముఖ్యంగా పాందవుల వారసులు బలహీనులైపోవడంతో ఏ ప్రాంతంలో ఏ రాజు బలవంతుడైతే ఆ రాజు తన ఆస్థాన పండితుల చేత కొత్త పురాణాలను రాయిచి కొత్త దేవుళ్ళని సృష్టించి ఇప్పటి అబ్రహామిక్ మతాల వలెనే సంఖ్యను పెంచుకోవడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.అయితే, అప్పటికే వ్యాసప్రోక్తం శిరోధార్యం అని స్థిరపడింది గనక మౌలిక స్వరూపాన్ని చెదరగొట్టటానికి జంకి వీలయినంతవరకు వేదవాక్యంతో విభేదించకుండా జాగ్రత్త పడ్డారు - తమ కర్తృత్వాన్ని కూడా వదులుకుని తమ రచనల్ని కూడా వ్యాసప్రోక్తం అని చెప్పేశారు.వేదం 33 మందిలో ఒకరని చెప్పిన విష్ణువు దేవాధిదేవుడు గానూ వేదంలో అరుదుగా ప్రస్తుతించబడిన రుద్ర నామధారిని శివుడి పేరున మహాదేవుడు గానూ కీర్తించడం ఈ కాలం నుంచే ప్రారంభం కావడం చారిత్రక వాస్తవం.భౌతికపరమైన సాక్ష్యాలతో తెలుస్తున్న అతి ప్రాచీనమైన ఆలయాలు ఈ కాలం తర్వాతనే నిర్మించబడినాయనేది కూడా వాస్తవమే.శక్తి యొక్క రాజరాజేశ్వరి నామం వేదసంహితలలో కనపడదు.గణపతి యొక్క ప్రస్తుత రూపం నాల్గు వేదాలలో ఎక్కడా కనిపించదు.ఈ దేవతల స్థాయిని పెంచే ప్రయత్నంలో బ్రహ్మ యొక్క స్థాయిని తగ్గించేశారు.ఇప్పటికీ ఇండొనేషియాలో బ్రహ్మయే ప్రధాన దైవతం కావడం ఈ మార్పులు జరగక పూర్వపు కాలంలోని ఇక్కడివారు అక్కడికి వెళ్ళి స్థిరపరచిన సంప్రదాయం అని మనం భావించవచ్చును.

వేదం తప్ప మిగిలిన వాటిని వ్యాసప్రోక్తమైతేనే అవి అధికారికమైనట్టు మనం భావించాలి అనే నియమం ఉండటం వల్ల తొలిదశలో తాము ఎవర్ని ప్రధాన దైవం అని చెప్తున్నారో అ దైవాన్ని కీర్తించి సరిపెట్టుకోవడం వల్ల సమస్యలు రాలేదు గానీ పోను పోనూ సంఖ్యను పెంచుకోవడం అనే దుర్గుణం ప్రవేశించి ఇతర దైవాల్ని తూలనాడే అవలక్షణం ప్రవేశించి వైష్ణవం, శైవం, శాక్తేయం అనే స్పష్టమైన విభజన ఏర్పడి వాటిమధ్య కలహాలు మొదలై కొంతకాలం పాటు ప్రచ్ఛన్నయుద్ధం తారాస్థాయిలో జరిగింది!

అంతకు ముందు ఒక వ్యక్తి వేదం చెప్పిన ప్రకారం జీవిస్తున్నాడా లేదా ఆనెది మాత్రమే ప్రధానం అయితే ఈ కాలానికి వచ్చేసరికి అతను ఏ దేవుడి భక్తుడు అనేది ప్రధానం అయింది.దండకారణ్యంలో సీతా రామ లక్ష్మణులు అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు అక్కడి వాతావరణం ఇలా ఉంది:
स तत्र ब्रह्मणः स्थानम् अग्नेः स्थानम् तथैव च || 
विष्णोः स्थानम् महेन्द्रस्य स्थानम् चैव विवस्वतः |
सोम स्थानम् भग स्थानम् स्थानम् कौबेरम् एव च || 
धातुर् विधातुः स्थानम् च वायोः स्थानम् तथैव च |
स्थानम् च पाश हस्तस्य वारुणस्य महात्मनः || 
स्थानम् तथैव गायत्र्या वसूनाम् स्थानम् एव च |
स्थानम् च नागराजस्य गरुड स्थानम् एव च || 
कार्तिकेयस्य च स्थानम् धर्म स्थानम् च पश्यति |
(అరణ్య కాండ 12వ సర్గ 17 - 21 శ్లోకాలు)
Sri Rama entered inside the hermitage and saw therein the sanctus of Brahma, Fire-god, Vishnu, Indra, Vivasvat - the Sun-god, Soma - the Moon-god, Bhaga - one among the twelve Suns, and the sanctusms of Kubera, [Wealth-Management-god, are seen and passed by the three of them, sanctums of Dhaata, Vidhaata - Vedic deities created by Brahma to help Svayambhuu Manu, santucm of Vaayu - the Air-god, and also like that the sanctum of great-soloed VaruNa - the Rain-god who also wields noose, and the sanctum of Gayatri - the presiding deity of gnosis, sanctum of Vasus - eight of them, and the sanctum of cobra's king - aadi sheSa, the divine Thousand-headed serpent that bears this globe on its head, and even the sanctum of GaruDa - the Divine Eagle , and the half brother of aadi sheSa, and the sanctum of Kaartikeya - chief of gods army,and the sanctum of Dharma - Dharmaraaja, presiding deity of Virtue-Vice-Time of living beings, in-charge of the hell.ఇక్కడి విశేషం గమనించారా!శివుడు లేడు,శివుని కుమారుడని ఇప్పుడు మనం భావిస్తున్న కార్తికేయుడు ఉన్నాడు.విష్ణువు వాహనమైన గరుడమూర్తికి కూడా ఆలయం ఉంది.

ఇప్పుడు నా మెడకీ మీ మెడకీ అతి పెద్ద ఉరితాడు తగిలించేశారు మన పూర్వఋషులు, అవునా?వేదం చెప్పని మూర్తిపూజని సమర్ధించడం వేదవిరుద్ధమే కదా - అది పాపకార్యం కాదా!కానే కాదు, ఎందుకంటే వేదం దృష్టిలో అసత్యం చెప్పడం, ఇతర జీవుల్ని హింసించడం,అన్యాయార్జన చెయ్యడం వంటివి మాత్రమే పాపకార్యాలు - మూర్త్యారాధనని కానీ బహుళదేవతారాధనని కానీ వేదం నిషేధించలేదు కాబట్టి అవి పాపకర్మలు కావు! అంతే కాదు,నారాయణ సూక్తం నుంచి పురుష సూక్తం వరకు గల వేదమంత్రాలు అన్నీ ఈ విశ్వమూ దైవమూ ఒకటే అని చెప్పాయి కదా - చూసి, తెలుసుకుని, ధ్యానించి, లీనమై తరించమనే కదా వేదం చెప్పింది!కంటికి కనిపించే వాటిలో కొన్నింటికి వాటి పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ రెండు చేతులూ జోడించి చేసే నమస్కారం మూర్తిపూజలోని భాగమే!

"పూరణాత్ పురాణం ఇతి చన్యత్ర" అని చెప్పిన దాని ప్రకారం వేదం బీజరూపంలో చెప్పినదాన్ని విస్తరించి చెప్పడమే పురాణ కధల ప్రధానమైన లక్ష్యం కాబట్టి .గ్రాడ్యుయేట్ లెవెల్లో చెప్పే పాఠాలు ఇంటర్‌మీడియట్ లెవెల్లో  చెప్పడం లేదు గాబట్టి డిగ్రీలో చెప్తున్న పాఠాలు ఇంటర్‌మీడియట్ పాఠాలతో విభేదించనట్టే పురాణకధలు కూడా వేదంతో విభేదించడం లేదని అర్ధం చేసుకోవాలి.


తామసం కన్న రాజసం ఉన్నతమైనది - ఎందుకంటే అది కనీసం కర్మలు చెయ్యడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించేలా చేస్తుంది కాబట్టి.రాజసం కన్న సాత్వికం ఉన్నతమైనది - ఎందుకంటే అది సత్కర్మలు చెయ్యడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించేలా చేస్తుంది కాబట్టి.ఈ మూడు గుణాలని బట్టి విభజించిన అన్ని పురాణాలూ సాత్వికమైన శ్రీకృష్ణ చరితామృతమైన భాగవత పురాణం అతిశ్రేష్ఠం పరమ ప్రమాణం అని అంటున్నాయి.ఇంక భేదాభిప్రాయం, సంఘర్షణ,పరస్పర హననం వంటివాటికి చోటు ఎక్కడ ఉంది?వైష్ణవం, శైవం, శాక్తేయం మధ్యన కూడా ఆయా శాఖలకి చెందిన పండితుల మధ్యన వాదోపవాదాలు జరగడమూ ఆయా మతాలకు చెందినవారి మధ్య జరిగిన చెదురు మదురు  హింసాత్మక సంఘటనలు జరగడమూ తప్ప మార్క్సిష్టు చరిత్రకారుల ప్రకారం కూడా ఏ రాజూ మతయుద్ధం పేరున యుద్ధం చేసి రక్తపుటేరులు పారించలేదు!

అయితే, "వేదం మూర్తిపూజనీ బహుళదేవతారాధననీ నిషేధించలేదు అనే కారణంతో ఒకరి దేవుణ్ణి మరొకరు దూషించుకునేటంతవరకు వెళ్ళినప్పుడు హిందూమతం సర్వోత్తమమైనది ఎట్లా అవుతుంది?" అనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది - దాన్ని తప్పించుకుని తిరగడం కూడా కుదరదు!

ఇంతవరకు చెప్పాక చల్లకొచ్చి ముంత దాచినట్టు శైవ, వైష్ణవ, శాక్తేయ కలహాల చరిత్రని దాచిపెట్టెయ్యటమూ సాధ్యం కాదు.వేదం చాలా స్పష్టంగానే చెప్పింది సృష్టికర్త ఒక్కడే అని, కానీ ఇంద్ర,అగ్ని,వరుణ, రుద్ర వంటి దేవతలను ప్రస్తుతించే సూక్తాలూ మంత్రాలూ కూడా ఉన్నాయి కదా!ఆలయాలలోని అర్చామూర్తుల పూజావిధానాలకు సంబంధించిన ఆగమం వేదంలోని భాగమే కదా!అదీగాక, "న తస్య ప్రతిమా అస్తి" అనే మంత్రం కూడా విశ్వమే తానైన సృష్టికర్తను ఒక రూపానికి కుదించటం అసాధ్యం అని చెప్పింది గానీ అసలు రూపం లేదని అనలేదు - అన్ని రూపాలూ ఆయనవే అని నొక్కి చెప్పింది! వివిధ దేవతలకు అర్చామూర్తులను చెక్కడానికి శిల్పులు అనుసరించే శిల్పాగమ శాస్త్రం కూడా వేదంలోని భాగమే అయినప్పుడు ఇంక వేదం మూర్తిపూజనీ బహుళదేవతారాధననీ వ్యతిరేకించినట్లు ఎట్లా అవుతుంది?

ఈ వైష్ణవ, శైవ, శాక్తేయ కలహాలు వ్యాస భగవానుడు ఆయా పురాణాలను తామస, రాజస, సాత్విక విభజన చేసిన ఉద్దేశాన్ని గమనించని రాజులూ పండితులూ అతి చెయ్యడం వల్ల జరిగాయి - అతి సర్వత్ర వర్జయేత్ అన్న సామాన్య నియమం ప్రకారం ప్రజలు వారి అతి ధోరణుల్ని తిరస్కరించారు.

వ్యాసదేవుని అవగాహన ప్రకారం వ్యక్తులలో గానీ సమాజాలలో గానీ మొదట తామసం(ignorance) ఉంటుంది.వీరికి, అంటే పరమేశ్వరుడి పట్ల ఆసక్తి కూడా లేని స్థితిలో ఉన్నవారికి తామసిక స్వభావం నింపుకున్న కధలు ఆకర్షణీయంగా ఉంటాయి.తామసం కన్న రాజసం(passion) కొంత ఉన్నతమైనది.ఎందుకంటే, ఇది మనిషిని చైతన్యవంతుణ్ణి చేస్తుంది.ఈ మనఃస్థితిలో ఉన్న మనిషికి రాజసిక స్వభావం గలిగిన కధలు సంతృప్తిని ఇస్తాయి.ఒకసారి రజస్సు పుడితే అది మనిషిని ఆ స్థాయిలోనే ఉండిపోనివ్వదు - సాత్వికం(realization) వైపుకు మనిషిని నడిపిస్తుంది.అప్పుడు సాత్విక స్వభావం కలిగిన పురాణ కధలు ఈశ్వర తత్వాన్ని సాధకుడిలో సుస్థిరం చేస్తాయి.ఇది ఆయా పురాణ కధల ప్రారంభాన్ని గమనిస్తే అర్ధం అవుతుంది.

ఉదాహరణకు, లింగ పురాణం ప్రారంభంలో శౌనకాది మునులు సూత మహర్షిని లింగరూపంలో ఉన్న శివుడి గొప్పదనాన్ని చెప్పమని అడుగుతారు - ఆ ప్రశ్నలోనే సూత గోస్వామికి వారు కొన్ని పరిధులు విధించారు.సూత మహర్షి కూడా అడిగిన ప్రశ్నకి మాత్రమే జవాబు చెప్తూ ఆ మూర్తి తత్వాన్ని ప్రశంసించే పురాణ కధల్ని వినిపిస్తాడు.అదే సాత్విక పురాణమైన భాగవతం దగ్గిర పరబ్రహ్మ తత్వాన్ని గురించి చెప్పమని అడుగుతారు.సాక్షాత్తూ వేదవ్యాసుడే హరివంశంలో "వేదే రామాయణే చైవ పురాణే భారతే తధా ఆదే అంతేచ మధ్యేచ హరిః సర్వత్ర గీర్యతే" అని స్పష్టం చేశాడు.

అయినా సరే, ప్రమాదో ధీమతా మపి అన్నట్టు ఆ పురాణ కధలని వ్యాసుడు అలా యెందుకు రాశాడో గమనించనివారు ఆ సంకుచితమైన ప్రశ్నల నుండి పుట్టిన పాక్షిక జ్ఞానాన్నే సమస్తం అని పొరబడి పక్షపాత బుద్ధిని ప్రదర్శించారు.ఆ చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం ఇక లేనట్టే - ఐతే అలాంటి ధోరణులని మళ్ళీ ప్రోత్సహిస్తే మాత్రం ఇక సనాతన ధర్మం అంతరించి పోయినట్టే!

ఒకటి గమనించండి, వేదమంత్రాలలో ప్రస్తుతించడిన ఓంకారాన్ని ఏ దేవత నామానికి ముందు చేరుస్తారో ఆ దేవతామూర్తి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే అవుతుంది.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पुर्णमुदच्यते
पूर्णश्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే|
పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే||
"That is complete, This is complete, From the completeness comes the completeness.If completeness is taken away from completeness, Only completeness remains." - ఈ భావంలోని completeness అనే పదాన్ని తీసేసి  Shiva, Vishnu అనే పదాల్ని చేరిస్తే "Shiva is complete, Vishnu is complete, From the Shiva comes the Vishnu.If Vishnu is taken away from Shiva, Only Shiva remains." అయి శివుడే పరిపూర్ణుడు అని అర్ధం వస్తుంది, అవునా?దీనినే బ్రహ్మ, శక్తి, గణపతి, రామ, కృష్ణ, హనుమ, అయ్యప్ప వంటి మూర్తులకి కూడా అనుసరించవచ్చును - ఎవరి తారణ వారిదే!

తారణకు సర్వులూ అర్హులే అనేది సనాతన ధర్మం యొక్క ప్రధాన సూత్రం అని వ్యాసపరాశరాదిషిర్డిసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి నేను చెబుతున్న పరమ సత్యం!ఏది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...