Friday, 27 April 2018

పరిపాలనకీ టీ అమ్మడానికీ సంబంధం ఏమిటి?దిగుమతై వచ్చిన టీ మనదే అయినప్పుడు సోనియా పరాయిది ఎట్లా అవుతుంది?

          సోనియా ప్రధాని కాకుండా అడ్డుకోవటానికి భాజపా వాళ్ళే కాక కాంగ్రెసులోని కొందరు కూడా ఆమె పరాయిది అంటున్నారు గాబట్టి తమాషాగా ఈ ప్రశ్న వేశాను గానీ ఈ పోష్టులో శ్రీమతి సోనియా గాంధీని విమర్శించడం గానీ సమర్ధించడం గానీ చెయ్యదల్చుకోలేదు! ఒకనాటి గజపతులని అభిమానించే ఈనాటివాళ్ళకి శ్రీకృష్ణదేవరాయలు స్ఫోటకం మచ్చలవాడు అయిన ఈ తెలివి మీరిన కాలంలో ఎవరు పరాయి,ఎవరు స్వరాయి?పరాయితనం ఎక్కడ లేదు?మనదైన ధోవతిని ఎంతమంది కడుతున్నారు?మనదైన భాషని పలకడానికే సిగ్గు పడుతున్నారు - గోగినేని బాబు "నాకు తెలుగు రాదు" అని చెప్పుకోవడం విన్నాను!మన పిల్లలకి మన భాషలో చదువు చెప్పడానికి అడ్డుపడుతున్నది ఎవరు?స్వతంత్రం వచ్చిన దగ్గిర్నుంచీ  కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు గల సమస్త జాతుల వారికీ పరాయితనాన్ని ఇంత ప్రణాళికాబద్ధమైన నిష్ఠతో అలవాటు చేసిన కాంగ్రెసు పార్టీ కూడా తమ పార్టీ అధ్యక్షురాలిని ప్రధానిని చెయ్యడానికి ఎందుకు వెనకాడిందో నాకిప్పటికీ అర్ధం కావటం లేదు!

          సోనియా గురించి కాంగ్రెసువాళ్ళు ఆలోచించుకుంటారు గానీ ఇప్పుడు ప్రధానిత్వం వెలగబెడుతున్న మోదీ చరిత్రని తవ్వి చూస్తుంటే నాకొక చిత్రమైన విషయం పదే పదే గుర్తుకొస్తున్నది - అది గానీ నిజమే అయితే ఇవ్వాళ మోదీ నిలబడిన దిక్కుమాలిన పరిస్థితికి కారణమూ దాని వెంటనే పరిష్కారమూ తెలుస్తాయి.మోదీ గుజరాతుని ఏలిన కాలం మొత్తం సంక్షోభాల మయం.గోధ్రా అల్లర్లని అతను ఎదుర్కొన్న తీరు అమోఘం - బహుశా అదే హిందువులని అతని  వైపుకి ఆకర్షించిన ఒకే ఒక్క కారణం కాబోలు!అయితే, నేను నిర్ధారించుకోవలసిన విషయం అది కాదు  - అతన్ని ప్రధాని పదవికి ఖరారు చేసిన తొలిదశలో గానీ అంతకు ముందు గానీ తర్వాత గానీ మోదీ అమెరికా వెళ్ళి ఒక బిజినెస్ స్కూలులో అడ్వర్టైజింగ్ పాఠాలు నేర్చుకున్నాడనేది నిజమా?అదే నిజం అయితే వస్తువులని అమ్మడానికి సంబంధించిన సూత్రాల్ని ఆకళింపు చేసుకుని తనకి తను "ప్రధాని" అని లేబుల్ తగిలించుకుని అడ్వర్తైజింగ్ చేసుకుని ప్రధాని పదవికి అమ్ముడు పోయాడా?"నరేంద్ర మోదీ - ప్రధాని పదవి" అనే రెండింటిలో అతను దేన్ని అమ్మాడు?దేన్ని కొన్నాడు?

          అమ్మకం - కొనుగోలు అనే పదాలు వచ్చిన ప్రతిచోట వస్తువు, ధర, అమ్మకందారు, కొనుగోలుదారు, లాభం, నష్టం అనేవి కూడా పరస్పరాశ్రితమై ఉంటాయి.మోదీలో ఈ రెండు అస్తిత్వాలు వేరుగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు ఎవరికీ రాలేదు, ఇప్పుడు ఈ రెంటికీ విడి అస్తిత్వాలని కనిపెట్టలేము - "తన్నోడి నన్నోడెనా?నన్నోడి తన్నోడెనా" అన్నంత జటిలమైన ఈ ప్రశ్నకి ఈ ప్రశ్న పుట్టడానికి కారణమైన మోదీ కూడా జవాబు చెప్పలేడు.అయినప్పటికీ కొన్ని ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి.ప్రశ్నలే అశాంతికి మూలం అని తెలియని అజ్ఞానులం గనక మన మనస్సులలో ఇలాంటి జవాబు లేని ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి - సంచిత ప్రారబ్ధం అనుభవించక తప్పదు!మనం ఇవ్వాళ జ్ఞానులు ఆనుకునేవారికి మొదట్లోనే ఈ సత్యం బోధపడి సన్యసించి ప్రశ్నల నుంచి విముక్తులయ్యారు - మోదీ ఏకధాటి రెండో విడత పరిపాలన కూడా ముగిశాక మనమూ ఆ స్థితికి చేరుకోవటం ఖాయం! ఆ అదృష్టం ఇంకా పట్టలేదు గనక నా ఆజ్ఞానం నన్ను వీడిపోనందువల్ల ప్రస్తుతం నన్ను తొలుస్తున్న ప్రశ్నలు ఇవి - ప్రధాని పదవి యొక్క ధర యెంత?నరేంద్ర మోదీ యొక్క ధర ఎంత?నరేంద్ర మోదీ ప్రధాని అవడం వల్ల ఎవరు లాభపడ్డారు?

          ఇవ్వాళ దేశంలో బీజేపీకి పడుతున్న వోట్లు ఆ పార్టీ యొక్క హిందూత్వ అనుకూల విధానాల వల్ల కాదనీ తను బరితెగించి రాజకీయ పార్టీలు తమకి సమకూరుతున్న లోపాయకారీ విరాళం/లంచం/పెట్టుబడి వివరాలని  బైటకి చెప్పాల్సిన పనిలేదనే చట్టం చేసేసుకుని ఆ వెసులుబాటును ఉపయోగించుకుని మోదీ ప్రధానిగా ఉండటం వల్ల లాభపడుతున్నవాళ్ళ నుంచి కురుస్తున్న డబ్బుని వెదజల్లడంలోని విచ్చలవిడితనం వల్లనే అని అందరికీ తెలిసిన విషయమే కదా - అందువల్లనే నేను కూడా  నైతికత, జనహితం, దూరదృష్టి వంటివాటితో భాజపా రాజకీయాన్ని అంచనా వెయ్యడం లేదు.అలాగని ఇందులో నేను కురిపిస్తున్నది వ్యంగ్యమూ కాదు.వాస్తవం యేమిటంటే భౌతిక ప్రపంచంలో మనిషి యొక్క జీవితాన్ని వ్యాపారసూత్రాలే ప్రభావితం చేస్తాయి.ఉద్యోగులు నెలల చొప్పున తమ శ్రమని యజమానికి అమ్ముకుంటారు.  రైతులు సంవత్సరాల చొప్పున తమ శ్రమని ఇతర్లకి అమ్ముకుంటారు. ఒక గృహస్థు జీవితకాలం పాటు భార్యాబిడ్డల్ని పోషించి వాళ్ళనుంచి గౌరవాల్ని కొనుక్కుంటాడు.ఇక్కడ కొంచెం తేడా కొడుతుంది, కదూ!శక్తినిత్యత్వసూత్రం ప్రకారం శక్తి రూపాలు మార్చుకున్నట్టు ఇలాంటి చోట్ల భౌతికమైన డబ్బు ఆధ్యాత్మికమైన గౌరవం కింద మారుతుంది, అంతే! ఆధ్యాత్మిక విపణిలో కూడా వస్తువు, ధర, ఆమ్మకందారు, కొనుగోలుదారు, లాభం, నష్టం అనే అస్తిత్వాలు ఉంటాయి.గురువుని ఎందుకు గౌరవించాలి?ఆ గురువు నేర్పిన జ్ఞానం మనకు లాభసాటి అవుతున్నది గనకనే గౌరవిస్తున్నాము - ఆ గ్యారెంటీ లేనప్పుడు ఇతర్లు అతన్ని ఎంత గొప్పవాడని చెప్పినా గౌరవించం -  చాగంటి కోటేశ్వరరావు అంటే హిందువులకి ఉన్న గౌరవం గోగినేని బాబుకి ఉండకపోవటానికి కారణం అదే!

          ఎక్కువ సోది చెబితే విషయం పక్కదారి పడుతుంది గానీ "0" నుంచి "9" వార్కు ఉన్న్న అంకెలకీ దేవుడు అనె భవన లాగనే భౌతికపరమైన అస్తిత్వం లేదు.మరి అంకెల్ని ఎందుకు ఉన్నాయని అంటున్నాడు గోగినేన్ బాబు?అంకెలతో తనకి అవసరం ఉంది గనక ఒప్పుకుంటున్నాడు,దేవుడితో అవసరం తనకి లేదు గనక లేదని అంటున్నాడు!అవసరం,అనవసరం,లాభం,నష్టం,అమ్మడం,కొనడం మాత్రమే ముఖ్యం అనుకునేవాళ్ళకి  నైతికత, ఔన్నత్యం, సహాయం, ఔదార్యం వంటివి ఎక్కవు.ఇతరులకి తను గొప్పది అనుకునే మానవవాదం చింతనని ఎక్కించడం మాత్రమే అతని అవసరం,అందుకే తన దాడికి జ్యోతిష్కులని మాత్రమే టార్గెట్ చేస్తాడు గానీ ఇతరులు ఎన్ని చాలెంజిలు చేసినా రాజకీయ నాయకుల్నీ అక్రమవ్యాపారుల్నీ టార్గెట్ చెయ్యడు - నిలదీసి అడిగితే అది నాపని కాదంటాడు.మానవుల కోసం మానవవాదం గురించి మాట్లాడే హేతువాదుల్ని కూడా అవసరమే నడిపిస్తున్నప్పుడు లాభదృష్టియే విజయాల్ని అందిస్తున్నప్పుడు మోదీ-షా ద్ద్వయం పాటిస్తే నేరం,ఘోరం అనడం అన్యాయం.

          ఇట్లా మనకు తెలియకుండానే ఇచ్చిపుచ్చుకునే సంస్కృతిని వొదిలేసిన ఇంత కాలానికి మన చుట్టూ ఉన్న సమస్తాన్నీ అమ్మడం,కొనడం అనే రెండింటికి కుదించేశాక మోదీ ప్రధాని పదవిని కొనుక్కున్నా ప్రధాని పదవి కోసం ఆత్మని అమ్ముకున్నా అతన్ని తప్పుపట్టి ప్రయోజనం ఏమిటి?ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్నది కూడా వ్యాపారియే - అందుకే ఆంధ్రాకి ప్రత్యేకహోదా గురించి అడిగిన తమ పార్టీవాళ్ళతో ఆంధ్రాలో పరిస్థితి మనకి లాభసాటి అయ్యాకే ఇద్దాం అనగలిగాడు!ఇవ్వాళ మనం జాతిపిత హోదాని కట్టబెట్టినవాడు కూడా కోమటియే కదా - అతను కూడా భగత్సింగు లాంటి హింసావాదుల మాదిరి పోరాడి ఉరి తీయించుకుని చచ్చిపోయి నష్టపోవడం బదులు బతిమాలుకోవడం ద్వారా  ఒకటి రెండేళ్ళలో స్వతంత్రం తెచ్చుకుని లాభపడటం మంచిది అని చెబితేనే కదా జనం అతని వెంట నడిచారు!మరి,అన్నిటినీ లాభదృష్టితో చూసినవాళ్ళు మోదీని మాత్రం లాభదృష్టికి బదులు ఆదర్శాలతో ఎందుకు తూచాలి?

          ప్రతి ఒక్కడికీ తన గురించి తనకి తెలుసు,కొందరు తమ బలహీనతల్ని దాచేసుకుని తమ సామర్ధ్యాల్ని మాత్రమే బైటికి చూపిస్తారు - వాళ్ళు సమర్ధులు, విజయులు, వైభవోద్ధతులు!కొందరు సమర్ధతలి దాచేసుకుని బలహీనతల్ని బైటపెట్టుకుని అపజయాల పాలుతారు - సాగినంతకాలం నా అంత గొప్ప పార్టీ లేదని లేదని విర్రవీగి ఇప్పుడు వరాస్ తప్పులు చేస్తూ అఘోరిస్తున్న కాంగ్రెసు లాగ!నిన్నటి వరకు మోదీ అంటే ప్రతికక్షులకి కూడా సమర్ధుడి కిందే లెఖ్ఖ,మరి ఇవ్వాళ కర్ణాటకలో మొదట అనుకున్న 50 మోదీ ప్రచారసభల్ని కుదించి అతని బదులు ఒక సన్నాసిని దించారు - లక్సు సబ్బు అమ్మేవాళ్ళు రీగల్ పేరుతో ఒక రకం సబ్బు ఫెయిలైతే దానికే డీలక్స్ అని పేరు అమార్చి అమ్ముకున్నట్టు పాలిట్క్సులో క్వాలిటీని పెంచుకోకుండా ప్యాకేజీ డీజీను మార్చి చూడాల్నుకుంటున్నారు కాబోలు!అంటే,నిన్నటి వరకు లాభసాటి అయిన మోదీ ఇవ్వాళ నష్టకారి అయ్యాడన్నమాట - వ్యాపారంలో అంత నిక్కచ్చితనం పాటించే మోదీ-షా ద్వయం లెక్క ఎక్కడ తప్పింది?బహుశా మోదీ ఆర్ధిక పరిజ్ఞానం లీటరు పాలల్లో పావు లీటరు నీళ్ళు కలిపితే పదిమందికి అమ్మే టీని పదిహేనుమందికి అమ్మితే చాలు లాభం ఇబ్బడిముబ్బడి అనే స్థాయి నుంచి ఎదగకపోవడం వల్లనా!అరువు బేరాలతో అమాయకపు కస్టమర్లని బుట్టలో వేస్తూ తెలివి ఎక్కువై తన దగ్గిర సరులు కొననివాళ్లని బూతులు తిట్టే పాతకాలపు పల్లెటూరి కోమటి మనస్తత్వం అమిత షాను వదలకపోవటం వల్లనా - ఏమో!

          అది కూడా కాదేమో, ముందిస్తావా తర్వాతిస్తావా ఆన్నది నాకనవసరం నాకిచ్చేది ఇస్తేనే నీ పక్కలోకి వస్తాను అని కండిషన్లు పెట్టేది వ్యాపారం కాదు వ్యభిచారం, అవునా?ఆంధ్రాకి సాయం చెయ్యకపోవడానికి అక్కడ వోట్లూ సీట్లూ రాకపోవడమే కారణం అయితే వాళ్ళు ఆంధ్ర ప్రజలతో చేస్తున్నది వ్యభిచారమే కదా - 2014 ఎన్నికలకి ముందు ఈ దేసం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్నీ పరిష్కరించగలడని ఆశలు రేకెత్తించిన ఒక సమర్ధుడైన పురుషపుంగవుడు ఇవ్వాళ నాకు వోట్లు వేసేవాళ్ళకి మాత్రమే నేను సేవ చేస్తాననే ఉంపుడుకత్తె స్థాయికి దిగజారిపోయాడు.అయితే, ఇతని టీకొట్టు తరహా సంప్రదాయిక వ్యాపారసూత్రాలే అర్ధం కానివాళ్లకి ఈ వినూత్న తరహా వ్యభిచారసూత్రాలు అసలు ఎక్కడం లేదు - అందుకే మోదీకీ ప్రజలకీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది.మోదీ-షా ద్వయం ధోరణి చూస్తుంటే ప్రజలకి కూడా వ్యభిచారసూత్రాల్ని ఎక్కించి ముందుకు తీసుకు వెళ్ళటమే తప్ప టీకొట్టు-గల్లాపెట్టె సూత్రాల్ని సైతం వదుకుకుని నైతికత, ప్రజాహితం వంటివాటిని అలవాటు చేసుకునే వెనకటి పద్ధతికి మళ్లడానికి ఇష్టపడటం లేదని తెలుస్తున్నది. కాబట్టి, ప్రజలు కూడా ఇక వ్యభిచారం నేర్చుకోవాల్సిందే!.

          మోదీ అధికారంలో ఉండటం వల్ల ఎవరు లాభపడుతున్నారో తెలుసుకోవాలంటే మీరు షెర్లాక్ హోమ్స్ అంతటి ప్రజ్ఞావంతులు కానక్కర లేదు -పెట్రోలు వాహనం ఒకటి ఉంటే చాలు.అన్ని దేశాల్లో పెట్రోలు రేట్లు తగ్గుతూ ఉంటే మోదీ దేశంలో మాత్రం ఎందుకు పెరుగుతూ ఉన్నాయో అని ఆలోచిస్తే చాలు తెలియాల్సినది తెలిసిపోతుంది.వాళ్ళు చేసిన పొలిటికల్ పార్టీలు తమకి విరాళాలు ఎక్కణ్ణించి వస్తున్నాయో చెప్పనక్కర్లేదనే ఒక్క చతం చాలు వాళ్ళు ఎంత దుర్మార్గులో చెప్పటానికి.ప్రజలకి ఎవరు అధికారంలో ఉంటే తమకి లాభం అన్న విషయంలో స్పష్టత లేనంతవరకు మోదీ-షా ద్వయం వంటివారియొక్క వ్యాపార/వ్యభిచార రాజకీయ పద్ధతులు వాళ్లకి అధికారాన్ని కట్టబెడుతూనే ఉంటాయి.


తత్ ఓం సత్!

45 comments:

  1. చాయ్ పకోడీ అమ్ముకుంటే మంచిది. భవిష్యత్తులో ప్రధానమంత్రి కావచ్చు. అవును బయ్యా ఇంత పెద్ద ఆర్టీకిల్స్ ఎందుకు. క్లుప్తంగా రాయవచ్చు గదా.

    ReplyDelete
  2. జిలేబికి రామకృష్ణ భోజనం పెట్టిస్తే పెంకు పద్యాలు ఆపేస్తుందేమో.

    ReplyDelete
    Replies

    1. వుల్టా యే రైటు :). రామకృష్ణ గారికి‌ వరస వెట్టి జిలేబీలను తినిపించేస్తే బ్లాగ్లోకం లోని మారామారీ ఒండికిఒండి యెదరా మేలా తంటాలన్నీ హాంఫట్ గా సాల్వ్ అయిపోతాయి‌ :)


      జిలేబి

      Delete
    2. జిలేబి గారు, మీరు వ్యంగం లో శ్రీనాథుడు కే మాత!
      మీకు ఉంటే జామాత, తప్పక చెప్పాలి తత్ జాగురత!

      Delete
  3. You mean to say ''every thing for sale'' to whom you were. :)

    ReplyDelete
    Replies
    1. I mean "selling ourselves is no wrong,because It is natural.But what I say is People also must demand profits from political parties" - that is practical morality!

      Delete
  4. बहुत बडिया!

    राहूल जी को प्रधानी और सॊनिया जी कॊ राष्ट्रपती बनालॆंगॆ! इस काम मॆ लगॆ रहॊ मुन्नाभाइ! सब ठीक हॊ जाय आपाकी!

    श्शांक

    ReplyDelete
  5. Is everyone in this world are following Hinduism. Like Muslims are following Shaivism (Praying Makkeshwara) and Christians are following vaishnavism (Christianity / Krishna Unity) and other religions are also branches of hinduism.

    ReplyDelete
    Replies
    1. expecting answer from your side sir

      Delete
    2. Anonymous27 April 2018 at 21:59
      Is everyone in this world are following Hinduism......

      hari.S.babu
      Yes,indeed!There was no islam before 1500 years.Even ahmed Qureishi also doesn't know at the age of 25 years in his life time that he will create a religion.There was no Christianity before 3000 years.Even Jesus Christ also doesn't know at the age of 25 years in his life time that he will create a religion.There was no Judaism before 6000 years.But hindusim aka sanaatanadharma is there.In one of my posts I touched about its influence on all of the ancient cultures and civilizations including these two religions.

      What we call as modern science and modern history - entire sceintific literature is made up to claim supremacy.We need not to cry communists and congress fellows tampered our history - all over the world It is a common with power manglers!

      I will give you one crystal clear example how reality can be hidden by the scientific circles.

      What is the age of pyramids?We simp;y tell ourselves that Pharohs built them to keep their remnants after death.But it is not correct.Because They look eroded,some of them were partially disfigured.

      It is a natural fact that wind or water has an erosion effect even upom hard structures like stones if exposed for centuries.Only granite can withstand such harsh erosion caused by nature for longer when compared to other types.In the case of pyramids It is highly impossible to face that much erosion in such a short time span.One freelancer geologist already got this clue and worked on it.He proved the antiquity of pyramids beyond any doubt.But Still the prominent scientific circle is suppressing the truth.Recently I wrote a post on oregan Srichakra.Why they covered it with such a silly story?All these are the true evidences of the presence of hinduism everywhere!

      Delete
    3. Guruvugaaru, Can you explain the real reason behind the birth of islam

      Delete
    4. The birth and spread of islam is too much complicated to explain in a short answer for me and to understand for you.Earlier I wrote 18 posts on islam,but removed them now.To be most simple and real - by the lineage,culture and rise both Jesus Christ are political leaders who want power to rule other people.

      Both Jesus and Ahmad belongs to well-to-do families.Please remember that Jesus giving bith to mary the virgin is fabricated after Constantinople changed its structure.See how christians refer him now also?"King of Kings!" - It s not just coincidence,He belong to a royal family and lead a rebelion to make himself a king of his own independent kingdom.It is a strange historical Irny - Jesus depended on,preached to and want to raise jews.Still thereare so many sayings of Jesus declaring Iam intersted only in the welfare of jews.But now The same jews were the enemies of christianity!

      Whwn comes to the Story of Ahmed is much more clear - He is the Son/Granson of Abu mattalib.This man Abu Mattalib is unofficial ruler of the and surrounding Macca and Madina.Both Bible and Quran were compiled as the teachings of these two persons after 100 or 200 years of their mortal exit and converted as holy books!

      Bit It is a truth that no one of these two preaches "Morality","Celibacy","Self-Control","equality" which makes men and women pure.Instead, They preach submisssion to the king or priest for the believers - because ruling lambs is easier than ruling humans!Both books seperate man from nature saying god made man to enjoy the booties of nature - per se, man is superior to nature!Both religions devide humankind as believers of their own religion and non believers - To make it easier for their followers to kill others which they branded as non-believers!

      Delete
  6. పవన్ అభిమానులు "పవన్ ఈజ్ గాడ్!" అంటుంటే నమ్మలేదు - ఇప్పుడు నమ్మాల్సిందే,1994లో నాని పాల్కీవాలా రాసిన పుస్తకం 1980లోనే చదివినవాడు దేవుదే!

    ReplyDelete
  7. Below posts are not available. Could you pls restore it.


    హిందూ ధర్మ ప్రహేళికలు - ద్రౌపది మానభంగ పర్వం!


    బ్రాహ్మణుడికి ప్రాధాన్యత లేని హిందూమతం నిలబడుతుందా?హిందూమతానంతర భారతదేశం ఎప్పటికైనా ఆవిర్భవిస్తుందా!

    ReplyDelete
    Replies
    1. Second is updated,
      First is missing at admin list also.
      Need to search by taking tims.

      Delete
  8. కొండలరావుగారికి నమస్కారం,

    నేను రామకృష్ణ డయట్ ప్లాను మీద ఎక్కడా మీరు చెబుతున్న రాళ్ళు వెయ్యలేదు.నా అభ్యంతరం మొత్తం కేవలం రామకృష్ణ దయట్ ప్లానుకీ వాల్మీకి చరిత్రని ఎత్తుకుని మాట్లాడిన మీ ధోరణి పైనే - కామెంటు డేలిట్ చేసినంత మాత్రాన ప్రతి సన్నివేశంలోనూ అవసరం ఉన్నా లేకపోయినా హిందువుల్ని తేలిక చేసి మాట్లాడే మీ ధోరణి మారినట్టు కాదుగా

    హిందూమతంలో ఉన్న మంచిని నేను వ్యతిరేకించలేదు అంటున్నారు నిజమే,యోగాని ప్రోత్సహించడం కూడా నిజమే.కానీ శ్యాంలీయం ధాలిడోమైడ్ అనే అంశాన్ని ప్రస్తావించి మీకు సలహా ఇస్తే మీరు శ్యామలీయం ఒక్కడే కాకుండా నేనూ ఇతర హిందువులూ ఎక్కువమంది నమ్ముతున్న జ్యోతిషాన్ని గురించి అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటి?ఇప్పుడు ఏ విధమైన సమర్ధనలు చెప్పుకున్నా మీరు అప్పుడు ఉన్న మానసిక ధోరణి తప్పు.

    ప్లాసిబోలు కూడా మనస్సులో ఉన్న నమ్మకం వల్ల పనిచేస్తున్నప్పుడు కచ్చితమైన రిపోర్టు ఇవ్వకుండా ఎట్లా నమ్మాలండీ!ఇది వెయిట్ లాస్ గురించిన కోర్సు కదా, కనీసం కోర్సు వాడుతున్నప్పుడు ప్లాసిబో తరహాలో ఫీలవడం కాకుండా బరువు కొలిచి చూసుకోవడం, దాని సాక్ష్యం చూపించడం కూడా చెయ్యడం లేదే - సరే, మొత్తం బ్లాగుల నుంచే తప్పుకుంటున్న నాకు ఇంకా ఈ సుత్తి సుధాణం అనవసరం!

    నావైపునుంచి నేను నిజాయితీగా గతంలో వేరేవాళ్ళు చేసిన పరిశోధనల్లో ఉన్న స్టాటిస్టిక్స్ చూపించాను.మిమ్మల్ని మీ సొంత స్టాటిస్టిక్స్ చూపించమంటున్నాను.ఇప్పటికీ ఆ సూచనకి స్పందించడమే లేదు.మీదు మిక్కిలి నాకు అబద్ధాలు అంటగడుతూ ఈ పోష్టు వేశారు.అబద్ధాలకోరుగా నేను బ్లాగులోకంలో కొనసాగలేను.అందుకే హరికాలం బ్లాగును మూసివేద్దామని అనుకుంటున్నాను.

    నేను నా పోష్టులో ఎత్తి చూపించినది తప్పుడు ధోరణియా కదా?దానికి మీరు ఇప్పటికీ జవాబు చెప్పకుండా అది ముగిసిపోయిన వ్యవహారం అనేస్తున్నారు.అంటే ఇకముందు కూడ మీరు ఆ ధోరణిని వదలరు అనేది నిశ్చయం, అవునా?

    తలకట్టులో అడ్డగాడిద ఆని పెట్టాను,నిజమే!కానీ మీరు దానికి సరయిన తీరులో స్పదించి ఉంటే ఆ పొష్టు మొత్తం తీసేసి దానికి మీకు క్షమాపణ చెప్పి ఉండేవాణ్ణి, నిజం!

    ఇక రామకృష్ణ డయట్ ప్లానుకి సంబంధించి మీరు రిజల్ట్ రిపోర్టులు కలక్ట్ చేసుకుంటున్నారా అన్న ప్రశ్నకీ ఇన్ని సార్లు పదే పదే అడిగినా దానికి తప్ప అనవసరమైన వాటికి మాత్రం జవాబులు చెప్పారు.కాబట్టి నాకు ఇంక మిగిలినది ఒకటే దారి.

    దీనికి ముందరి కామెంటులో కూడ అడిగాను "ఈ విషయం గురంచి గానీ ఏ విషయం గురించి గానీ నేను చెప్పిన అబద్ధం ఏమిటో నిరూపించాలి,లేదా ఈ పోష్టు తీసెయ్యాలి." అని.దానికీ రెస్పాన్స్ లేదు.
    కాబట్టి నేను బ్లాగుల్లో ఇక కనిపించను వ్యాఖ్యాతగా కూడా.ఇదివరకటిలా ఇది ఎత్తుగడ కాదు.

    ఎంతమంది ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేదు.హరికాలం బ్లాగు మూతపడిపోయింది.మీకు నామీద ఏమాత్రం జాలి ఉన్నా ఈ తలకట్టుకి న్యాయం చేస్తూ నేను చెప్పిన అబద్ధాలు ఏమిటో సాక్ష్యాలు చూపించండి,లేదంటే ఈ పోష్టుని తీసెయ్యండి.

    ayitae,మీఉ ఇది చేసినా చెయ్యకపోయినా హరికాలం బ్లాగులో ఇక కొత్త పోష్టులు ఉండవు.

    హరికాలం బ్లాగు మూతపడిపోయింది.

    స్వస్తి!

    ReplyDelete
    Replies


    1. హమ్మయ్య ! పీడా పోయింది !

      మళ్ళీ యేమన్నా వస్తారా లేదా ? :)



      జిలేబి

      Delete
  9. హరిబాబు గారూ, మురమ్నాని డైరెక్టుగా మీరు ఆడుకునే అవకాశం వచ్చింది. ఈ పత్రికలో మరీు నేరుగా ఆమెని ఏ ప్రశ్నలైనా అడగవచ్చు....

    https://rasthamag.com/2018/05/01/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b6%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c%e0%b0%b5%e0%b0%be%e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/#comments


    https://rasthamag.com/2018/05/01/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%95%e0%b0%9f%e0%b0%a8-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%82%e0%b0%a8%e0%b0%9f/

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. bluecake May 5, 2018 at 11:54:00 AM GMT+5:30
    ఎంటీ నొచ్చుకున్నాడా? అస్సలు నొచ్చుకోవడం అనే పదానికి మీనింగే తెలియని దరిద్రుడు హరిబాబు. ఏకొంచెం తన అభిప్రాయాన్ని వ్యతీరేకించినా బూతులతో, అబద్దపు రాతలతో విరుచుకుపడే హరిబాబును మళ్ళీ బతిమాలి బూతులు తిట్టించుకోడానికి వెనక్కి పిలవాలా? బ్లాగ్లోకానికి పట్టిన దరిద్రం వదిలిపోయిందని జనాలు సంతోషపడుతున్నారు ఇక్కడ. మళ్ళీ పెంట మీద రాయెయ్యకండీ


    hari.S.babu
    అంత ఆశ పెట్టుకోమాకు దరిద్రమున్నరా!

    డాక్టర్లు ఎప్పట్నించో జబ్బు అని గుర్తించి వైద్యం చేస్తున్న ఎలర్జీని కూడ ఆమనాసిక భ్రమ అనగలిగిన వాళ్ళకి సైన్సు గురించి చెప్పబోవడమూ వాళ్ళేదో గొప్పవాళ్ళనుకుని నేను భ్రమపడటమూ నాకు నచ్చలేదు - ఎక్కడికీ పోను,ఇక్కడే ఉంటాను.నీలాంటివాళ్ళని డొక్క చించి డోలు కడతాను.

    కభీ కభీ రస్తా మే కుచ్ కుచ్ హోతా హై భై:-)

    హరిబాబు ఎప్పటికీ చిచ్చరపిడుగే!

    ReplyDelete
  12. నీహారికApril 27, 2018 at 3:10:00 PM GMT+5:30
    భగవద్గీతలో కూడా నెయ్యి వాడమన్నట్లు గుర్తు.కృష్ణుడికి వెన్న ఇష్టమా లేక వ్యాసుడికి (రచయత)ఇష్టమా అన్నది కూడా నాకు డౌటే !

    hari.S.babu
    JOke of the post!

    ReplyDelete
  13. I don't want this comment to be published. Now it is your choice.

    A person will be judged by the company they keeps.
    Look around, who are along with you! ADHD,BPD etc, etc. Can you get rid off those people? No ! impossible for you. How to judge you?
    Have you ever discussed about the matter of the post written by you, in comment section, please go back and see dispassionately.
    You write lengthy articles with out a point, a point over emphasized or under played. Even if there is a point in the article it is lost by the length of the article.
    You confuse people and get confused about the matter you write.
    Your arguments are lengthy and emotional but not to the point.
    Your blog had become a public dustbin to throw any nonsense.
    You published a book. How many copies were sold? Give correct answer some where else, will be watching you.
    You will get annoyed and angry with this comment, What was said is not true???

    ReplyDelete
    Replies
    1. My dear Dutbin,
      You don't know what I am!I am one of the most practical and truthful Political Analyst!Just recently when I declared this at somewhere else somebody questioned me here with a sample test and cheered me up after reading my Answer.

      In coming year that is 2019, after I have succeeded in settling my daughter I would jump into direct politics and will become a successful Political Activist!All my blog posts are just Mike Testing for my Political Career!

      I have a full road map to rule Tamil Nadu for 20 years!That too I won't take much time to get enough focus.If my plan goes as expected I could become a strong political figure in TN politics within 1 or 2 years!

      Now about the Poor sale of my book - I know fully that It won't go well. You can check my statement with jyoti valaboju at her site!Earlier I have posted some topics about islam to counter M.A.Abhilash.I sent the content to hirasam publications for which Mr.M,V.R.Sastri is connected.The Title is "ఇస్లాం రహిత ప్రపంచమే నా లక్ష్యం!" and I know It will go like a hot cake just like "హిందూమతానంతర భారతదేశం!" of kanche ailayya and you will be definitely happy with its sale!

      What the catch word here is I feel bad about my first book to be like that - with that sentiment only I sent "శ్రీ రాఘవం!శ్రీ మాధవం!" into the market as my first book!

      Please don't show your sadism to me.I am also a Sadist - more cruel than You.
      You DumbAss!

      Delete
    2. తమిళులు తమిళభాషాభిమానులు.తమిళ్ మాట్లాడడం రానివారిని ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారా ?తమిళ రాజకీయాలు గురించి కూడా మీరు వ్రాయడం లేదు.తమిళ పొలిటికల్ ఫిగర్ ఎలా అవుతారు?
      జిలేబీ (పొన్ను) అసలు ఒప్పుకోదు !

      Delete
    3. I will raise telugu racism against tamil racism:-)

      It is not a silly plan.Statistics shows telugu people are also strong by numbers,In some of the areas locally telugu people are stronger than tamil people.But political representation in higher levels,that is in state assembly and central parliament house is very weak just because of ignoarnce and carelessness!Tamil people doesn't accept telugu CM is just a myth that too was spread very recently for the convenience of DMK and AIDMK.In unified maadras state If you count how many CMS were tamil and how many CMs were telugu you would get a shock of your life!T.Prakasham is liked by tamil people also ust like by telugu people!That too not all tamils are in favour of D clout.tamil hindus are also against this D culture.This Dravidian culture was made up to protect their power over the land and to rule the state by then political bigwigs like periyar and others.My plan involves chanakyan split and win strategy,but not for pleasure.It is neccessory to break the nexus of D family and church in tamilnadu.

      Necessity is the mother of al inventions.I have checked,revised and was ready with three alternative starting game sequence.Just like in chess,If the game started well and the sequence of moves were going as I expected middle game ultimately very easy to play! But,fate and god will always play major role - Let us wait for 2019/2020!

      Delete
    4. ఇంట గెలిచి రచ్చ గెలవడం మంచిదేమో?

      Delete
    5. I will raise telugu racism against tamil racism:-)

      కేసీఆర్ నీ ట్రంప్ నీ రోల్ మోడళ్ళుగా తీసుకుంటున్నారన్నమాట !

      వాళ్ళిద్దరూ ఇపుడు ప్రపంచాన్ని ఏకం చేసేపనిలో ఉన్నారు.వారి గతం వాళ్ళిద్దరినీ చచ్చేవరకూ వెంటాడుతూనే ఉంటుంది.

      Delete
    6. గతాన్ని ఎవడూ పట్టించుకోడు,
      నిన్నటివరకూ Mr.Lolipop కొరియా బుజ్జాయి ఎంత్ అవిర్రవీగాడు!ఇంకేముంది,నేను తల్చుకుంటే వైట్ హౌస్ మీదే ఆటంబాంబు వేస్తానన్నాడు.మరి అంకులు శాం కుసిన్ని క్రాకర్లు పేల్చి శాంపిలు చూపించగానే ఎట్లా మారిపోయాడు?కరవలేనివాణ్ణి గొర్రె కూడ అకరుస్తుంది!కార్వగళ్గినవాణ్ణి చూసి పులి కూడ అబహ్యపడుతుంది!
      గతం ఒక్ అజ్ఞాపకం మాత్రమే.

      Delete
    7. కే సీ ఆర్ లాంటివాడికి గతం ఒక జ్ఞాపకం కాదు గతం ఒక శాపం. అర్జెంటుగా రాజ్యాంగం మార్చెయ్యాలని బుద్ధి ఎందుకు పుట్టిందో తెలుసా మీకు ? విభజన సమయంలో తప్పు చేసాడని తనకు తెలుసు కాబట్టి...ఓటుకి నోటు కేసు ఎందుకు ముందుకు జరుపుతున్నాడో తెలుసా ? చదరంగం ఆడేవాళ్ళకి కే సీ ఆర్ ఎత్తులు అర్ధం కావా ? బోనగిరి గారి మాటే నాది కూడా ఇంట గెలిచి రచ్చ గెలవాలి ! ఇక్కడ సరైన నాయకులు లేక ఆంధ్రా ప్రజలు అల్లాడిపోతుంటే మీరు తమిళ తంబి లను ఉద్ధరిస్తానంటారేవిటీ ? కరిచే ప్రతి కుక్కనీ పట్టించుకోనవసరం లేదు కానీ కుక్కని చూసి పులి భయపడుతుందనుకోవడం కొంచెం అతిగా ఉంది !

      Delete
    8. మీరు కాదూ కూడదంటే...తమిళనాడులో రేసిజం తీసుకొచ్చి తమిళనాడుని ఆంధ్ర ప్రదేశ్ లో కలిపేయండి ఒక పనైపోతుంది బాబూ !

      Delete
    9. neehaarika
      అర్జెంటుగా రాజ్యాంగం మార్చెయ్యాలని బుద్ధి ఎందుకు పుట్టిందో తెలుసా మీకు ?

      hari.S.babu
      Is it?where and when he expressed about constitutional modifications?Why It is required?Alraedy he got the state!

      Delete
    10. ఇప్పుడు ఓటుకు నోటు కేసుతో ఏం పీకుదామని అనుకుంటున్నాడు?

      అది చంద్రబాబుని తనకి పోటీ రాకుండా చేసుకోవడానీ అయితే అది వేస్ట్ ప్లాన్!కేసీయార్ జాతీయ రాజకీయాలో పైకి రావాలంటే చంద్రబాబుని కెలక్కుండా ఉండటమే మంచిది!కేసీయార్ తన డైనమిక్ పర్సనాలిటీ మీదా ఆఫెన్సివ్ కంబాటింగ్ స్టైల్ మీదా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బాబు చేతుల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది.ఓటుకి నోటు కేసుకి టెలిఫోన్ ట్యాపింగ్ ఎత్తు వెయ్యలేదా, అప్పుడు ఏమి పీకగలిగాడు కేసీయార్?

      ఇప్పుడు కేసీయార్ లాంటివాళ్ళు మోదీ కొట్టిన దెబ్బకి బాబు గింగరాలు తిరిగి కూలబడ్డాడని చంకలు గుద్దుకుంటున్నారేమో నాకు తెలియదు గానీ చంద్రబాబు పద్ధతి కేసీయార్ కన్న భిన్నమైనది.తను దెబ్బకొట్టే అవకాశం వచ్చేవరకు ఎదటివాడు ఎంత అవమానించినా రెచ్చిపోడు బాబు - అది చూసి తేలిక చెయ్యకూడదు.

      బీజేపీ వాళ్ళు కూడా బాబుతో రాజీ చెసుకోవడమే మంచిది!

      ప్రస్తుతమున ఎలెక్టొరేట్ మూడ్ ఇలాగే కొనసాగితే సింగిల్ లార్జెస్ట్ బెంచిమార్కు రాక సంకీర్ణం తప్ప దిక్కులేని పరిస్థితి రావచ్చు!అలాంటి పరిస్థితిలో చంద్రబాబు మిత్రుడుగా ఉంటేనే చాలా ఉపయోగం!కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పెద్ద లీడర్స్ అందరితోనూ మంచి స్నేహం ఉంది బాబుకి.బీజేపీ మెజారిటీ తగ్గి సంకీర్ణం అవసరమైన స్థితిలో ఉండి కూడా బాబుని కన్సిడర్ చెయ్యకపోతే అతను ఖచ్చితంగా బీజేపీకి శత్రువే అవుతాడు, బీజేపీని ప్రశాంతంగా ఉండనివ్వడు!

      కేసీయార్ స్టేట్మెంటు ఇవ్వడమే తప్ప తొలి అడుగు కూడా వెయ్యలేదు కదా!తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రంలో ఇతను ఎంతమంది ఓటర్లని ప్రభావితం చెయ్యగలడు అనే నికరమైన లెక్క తేలలేదు.అందులో అతను ప్రూవ్ చేసుకుంటేనే ఓటుకు నోటు కేసు వ్యూహాత్మక ఎత్తుగడ కిందకి వచ్చి మంచిపేరు తెస్తుంది.అక్కడ మంచి రిజల్ట్ రాకపోతే ఇదే చీప్ ట్రిక్ కింద పరువు తీస్తుంది!

      కేసీయార్ జాతీయరాజకీయాల్లో సక్సెస్ అవుతాడా లేదా అనేది చాలా సున్నితమైన విషయం - ఒక ఎన్నికలో అయినా అతని పుల్ తెలియనిదే అంచనాకు రావదం కష్టం!

      గతంలో బీజేపీ చంద్రబాబు పక్కన ఉండటం వల్లనే తమ పార్టీ అంటరాని ముద్రని చెరుపుకోగలిగిందనేది బీజేపీ వాళ్ళు మర్చిపోతున్నారు.ఓటుకు నోటు కేసు విషయంలో ఆంధ్రా ప్రజల్లో కూడా పక్క రాష్త్రంలో ఉండి పరిపాలిస్తున్నాదనే ఒపీనియన్ రావడం అవ్ల్ల బాబు వెనక్కి తగ్గాదనేది కేసీయార్ మర్చిపోతున్నాడు.

      Delete
    11. కర్నాటక ఎన్నికలలో బిజెపి వాళ్ళు జగన్‌కి టార్గెట్ ఏమైనా ఇచ్చారా? (భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవడానికి)

      Delete
    12. జగన్ టార్గెట్ పూర్తి చేసినట్టు లేదు..

      Delete
  14. హరిబాబు గారూ, మీరు thrifty genotype థియరీ గురించి విన్నారా? కుదిరితే దీన్ని పరిశోదించండి.

    ReplyDelete
    Replies
    1. It is not a genuine theory!Just like hitler prompted his pet scientists to declare Aryans were genetically more able to rule No-Aryans.
      see below link,experiments were not proving it.
      https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2723682/
      ఈ మాట మీకు ఎక్కద తగిలిందో నేను అర్ధం చేసుకోగలను.ఆ సుందోపసుందుల ఆర్భాటం గురించి నేను పట్టించుకోవాలని అనుకోవడం లేదు.
      -------------------

      నీహారికMay 2, 2018 at 2:15:00 PM GMT+5:30
      పల్లీలతో చేసిన కొబ్బరి చట్నీ నాకు సరిపడదు. తలనెప్పి వస్తుంది.మావారికి బాగా ఇష్టం.నాటు కోడికూరలో కూడా నేను కొబ్బరి వేయను.


      Kondala Rao PallaMay 2, 2018 at 2:30:00 PM GMT+5:30
      మీకు పడడం, పడక పోవడం మీ శరీరతత్వం, మీరు పెరిగిన వాతావరణంలో ఏర్పడిన సైకలాజికల్ ఫీలింగ్స్ ను బట్టి ఉంటాయి. ప్రకృతి పరంగా కొబ్బరిలో ఉండే ధర్మాలు (దీనిని పదార్ధ ధర్మం అంటారు), అవి శరీరంపై పని చేసే విధానంలో మార్పు ఉండదు. కొబ్బరి లో ఏ ధర్మాలున్నాయో అదే ఫలితాన్నిచ్చే ఇంకో ఆహారం తీసుకోవడమే ప్రత్యామ్నాయం.
      --------------------
      ఎలర్కీ కూడా మాన్సిక భ్రమయే అంటున్నవాళ్ళకి నిజమైన సైన్సు గురించి చెబితే ఎక్కదు.

      Delete
    2. of course,he didn;t press to much on mind as the main factor of elergy,but why he is attaching it?

      నేను పట్టించుకుని విమర్శించిన వాల్మీకి,బోయవాడు సుత్తి సాక్షాత్తూ రామకృస్ణ తన వీడియోల్లో చెప్పుకున్న విషయమట!మొత్తానికి దిందూ దొందే అనుకునేట్టు కుదిరారు.రామకృష్ణ ఏం చెప్తే అది ఈయన చిలకలా పలుకుతున్నాడు.ఆయనకి మాత్రం దయట్ ప్లాను గురించి చెప్పటానికి బోయవాదైన వాల్మీకి ఎందుకు గుర్తొచ్చాడో!

      డాక్తర్ల కన్న నీ గొప్పేమిటి అనే ప్రశ్నకి క్రెడిబిలిటీ కోసం సెంటిమెంటు గుప్పించి ఉండాలి.ఒకసారి కడిగేసుకున్న చెత్తని మళ్ళీ పులమకండి సార్!

      Delete
    3. Thanks for the clarification.

      ఈ థియరీ Jared Diamond రాసిన "World Until Yesterday" పుస్తకంలో చదివాను. దాంట్లో ఉప్పు సంబంధ సమస్యల గురించి కూడా ఇదే తరహా థియరీ చెప్పారు.

      నాకు ఈ విషయాలలో సున్నా నాలెడ్జీ. మీకు బయాలిజీ బాగా వచ్చు కనుక తెలుసుకుందామని అడిగాను.

      Delete
  15. https://mvrsastri.blogspot.in/2018/05/blog-post_7.html?utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed:+MvrSastry+(MVR+Sastry)

    ReplyDelete
  16. https://bharatabharati.wordpress.com/2017/08/27/
    https://youtu.be/QGt2D2m03kU

    ReplyDelete
  17. Lt. Col. Purohit’s letter to PM Modi dated May 31, 2014 (PDF)

    ReplyDelete
  18. This comment has been removed by the author.

    ReplyDelete
  19. కభీ కభీ రస్తా మే కుచ్ కుచ్ హోతా హై భై

    ఆదిమ కమ్యునిష్టు సమాజం గురించి కొంచెం శాస్త్రీయమైన వివరణ ఇవ్వఫలరా?

    ఎందుకంటే, మార్క్స్ గారు ప్రతిపాదించిన మానవాళి యొక్క అంతిమలక్ష్యమైన వర్గరహితసమాజం కొన్ని తేడాలతో ఇదే దశను ప్రతిఫలిస్తుందని చెప్పారు కదా – మరి ఆ దశ ఉనికిలోకి ఎలా వచ్చింది!మానవాళి చరిత్రని అక్కణ్నించే ఎందుకు మొదలుపెట్టాలి?గతితార్కికచారిత్రకభౌతికవాదం ప్రకారం ప్రతి దశ యొక్క స్వభావం దాని ముందరి దశ యొక్క ధీసిస్,యాంటిధీసిస్ కలిసి ఏర్పడిన సింధీసిస్ కదా!ఈ ఆదిమ కమ్యునిష్టు సమాజం అనే దశ యొక్క పూర్వ చరిత్రని వదిలివెయ్యడానికి గల కారణం ఏమిటి?మళ్ళీ వర్గరహితసమాజం అనేది ఇక యాంటిధీసిస్ ఆనెది లేని అంతిమదశ అయితే అసలు “ధీసిస్+యాంటిధీసిస్->సింధీసిస్” సిద్ధాంతమే అబద్ధం అవుతుంది కదా!

    ఇది నాకు చాలా గందరగోళంగా ఉంది.కొంచెం అర్ధం అయ్యేలా వివరించగలరా?

    P.S:మీ జవాబు వీలున్నంతవరకు మార్క్సుగారి మౌలిక విశ్లేషణకి దగ్గిరగా ఉంటే బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. ప్రశ్న బ్రహ్మాండం! జవాబు ఏమిస్తారో చూద్దాం.

      Delete
    2. Must watch Hari Babu

      https://m.facebook.com/story.php?story_fbid=2444529965572529&id=100000466491994

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...