మన
చరిత్రకారులు " - The Great!" తోకలు తగిలించి పొగిడినవాళ్ళందరూ హైందవేతరులే
- అశోకా ది గ్రేట్,అక్బర్ ది గ్రేట్,కనిష్క ది గ్రేట్!మార్క్సు కళ్లదాలతో చూసే కమ్యునిష్టులకి
సిగ్గు లేదు సరే,ఈ దేశం కోసం త్యాగాలు చేసి స్వతంత్రం తీసుకొచ్చి దేశభక్తికి పేటెంటు
పుచ్చుకున్న కాంగ్రెసు వాళ్ళకి ఏం మాయరోగం వచ్చింది?స్వతంత్రం తీసుకొచ్చారు, అధికారం
తమకే దక్కింది.అలాంటప్పుడు చరిత్రని భ్రష్టు పట్టించడం లాంటి దేశభక్తి లేని పనులు చెయ్యడం
దేనికి?
మీకు
నేనొక సంగతి చెప్తే మీరు నమ్మలేకపోవచ్చు - ఇంగ్లీషువాళ్ళకి తొత్తులై స్వతంత్ర పోరాటాన్ని
వ్యతిరేకించారని తమిళ జస్టిస్ పార్టీ పెద్దల్ని విమర్శిస్తున్నాము గానీ గాంధీ దగ్గిర్నుంచి
బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించిన మదన్ మోహన్ మాలవ్య వరకూ అందరూ ఇంగ్లీషువాళ్ళని
అభిమానించి ఆదరించి గౌరవించి పొగిడేటప్పుడు భాష్పవారిపరిపూర్ణలోచనహర్షపులకాంకితగాత్రులైనవారే!చెప్పడం
ఎంత గంభీరమైన పదజాలంతో చెప్పినప్పటికీ గాంధీ తను చెప్పిందీ చేసిందీ ప్రజలతో చేయించిందీ
ఇంగ్లీషువాళ్ళు భారతీయుల్ని ఎంత క్రూరంగా హింసించినా సరే ఓర్చుకోవాలే తప్ప ఒక్క భారతీయుడు
కూడ ఒక్క ఇంగ్లీషువాణ్ణి కనీసం కొట్టను గూడా కొట్టకూడదు అనే రకం విచిత్రమైన పోరాటమే!
గాంధీ
స్వతంత్రం తీసుకు రావటానికి వాడిన చిట్కావైద్యపు కార్యక్రమాలు, - విదేశీ వస్త్రాలు(విదేశీయుల
వస్త్రాలు కాదు, మనవాళ్ళు కష్టపడి ఆర్జించిన సొమ్మునుంచి కొనుక్కుని తొడుకుంటున్న స్వదేశీయుల
వస్త్రాలు) తగలబెట్టటం,చరఖా తిప్పటం, మన ఉప్పు మనమే తయారుచేసుకోవటం, ఇంగ్లీషువాళ్ళు
ఈ చెంపన కొడితే ఆ చెంపని చూపించటం, రెండు చెంపలూ అయ్యాక వీపు చూపించటం.మొదలుపెట్టటం
వీరావేశంతో మొదలుపెట్టేవాడు - "అయ్యబాబోయ్! ఎంత అద్భుతమైన పోరాటవిధానం!!ఈ దెబ్బకి
ఇంగ్లీషువాళ్ళు అదెశం వొదిలి పారిపోవటం ఖాయం!!!" అనిపించేది అతన్ని వెర్రివెధవ
కింద జమకట్టిన వాళ్ళకి కూడా.కానీ ఏ ఒకటీ నెలకి మించి జరగలేదు,కొన్ని మొదటి వారంలోనో
కొన్ని మూడో వారంలోనో ఆగిపోయినాయి - కొన్ని ఇంగ్లీషువాళ్ళు నాయకుల్ని అరెస్టు చెయ్యడం
ద్వారా ఆగినాయి, కొన్ని పాల్గొనేవాళ్ళకి ఉద్రేకం ఎక్కువై ఇంగ్లీషువాళ్ళకి నెప్పి పుడుతుందనిపిస్తే
గాంధీ ఆపటం వల్ల ఆగినాయి!చౌరీచౌరా సన్నివేశం నాడు చూశారుగా అయ్యగారి ఆంగ్లభక్తి
- నెహ్రూ లాంటి వాళ్ళు ప్లీజ్ ప్లీజని ఎంత
కాళ్ళావేళ్ళ పడినా వినలేదు, వినలేదు, చావనైనా చస్తాను గానీ ఇంగ్లీషువాళ్ళకి హాని జరిగితే
మాత్రం సహించేది లేదని బల్లగుద్ది చెప్పాడు!
అయ్యా!ఇంగ్లీషువాళ్ళ
మీద అంత బానిసత్వపు మమకారం ఉండి తమలోకి తాము చూసుకున్నప్పుదల్లా ఘోరమైన ఆత్మన్యూనత రగిలిపొయ్యేవాళ్లకి హిందువుల్లో
"ది గ్రేట్!" అనదగినవాడు ఎలా కనపడతాడు
- క్రీ.శ 1947 నుంచి భారత ప్రభుత్వం అచ్చొత్తించి పిల్లలకి చెప్పిన చరిత్రలో ఏ హిందూ
నాయకుడికి ది గ్రేట్ తగిలించి తగిలించారో వెదికి చూపించండి!అట్లాని వాళ్ళు హిందువులు
కాదా?అబ్బే!పదహారణాల నిఖార్సైన హిందువులు!ఎప్పుడు?ఎన్నికలు ప్రకటించి అవి అయిపోయేవరకు!సొంత
ప్రతిభ మీద నమ్మకం లేదు గాబట్టి నామినేషన్ వేసే ముందునుంచీ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు
అయ్యలు తిరగని గుడిఉండదు,చెయ్యని పూజ ఉండదు,పట్టని సన్నాసి పాదం ఉండదు.దేనికీ అవస్థ
అంటే,తను ఏనాడూ హిందువులా ప్రవర్తించకపోయినా తెలివితక్కువ హిందువులు చచ్చినట్టు తనకే
వేస్తారన్న విశ్వాసం,ఇతరులకి మంచివాడిగా కనపడి వాళ్ళ ఓట్లు రాబట్టుకుంటే గానీ గెలవనేమోనన్న
యేడుపు - ఈ రకమైన నాటకాన్ని ఇప్పటివరకు కాంగ్రెసు ఒకలా నడిపించింది, ఇప్పుడు భాజపా
మరొకలా నడిపిస్తున్నది.ఈ రెండు పార్టీలకీ బలి అవుతున్నది మాత్రం ఒకే గ్రూపు - అమాయకులైన
హిందువులు!
ఇంగ్లీషువాళ్ళని
ఏ కుర్రవేధవన్నా ఉడుకునెత్తురు కొద్దీ ఒక నాలుగు తిట్లు తిడితే చాలు ఉలిక్కిపడి ఆ తిట్టినవాణ్ణి
చావుతిట్లు తిట్టి వాళ్ళు లెంపలేసుకుని తిట్టినవాడితో లెంపలేయించిన ఈ వేడికోళ్ళ పద్ధతికి
పోరాటం అని పేరు దేనికి పెట్టారో!గాంధీ అనేవాడు రాజకీయ రంగంలో అడుగు పెట్టిన అతి కొద్ది
కాలంలోనే ఈ దేశప్రజల మనస్తత్వంలోకి క్షాత్రలేమి
అనే అంటురోగం గాంధీ నుంచి సంక్రమించి ప్రజల్ని దేశభక్తిరహితుల్ని చేసేసింది
- అందుకే మెకాలె పుటిన రోజులు జరుపుకున్నంత వైభవంగా మన ప్రాతస్మరణీయుల్లో ఏ ఒక్కడి
జయంతినీ జరుపుకోలేకపోతున్నాం.కనీసం రామాయణ భారతలని గుర్తుంచుకున్నారు గాబట్టి గానీ
లేకపోతే ఇవ్వాళ్టి కంచె ఐలయ్య కలలు గంటున్న హిందూమతానంతరభారతదేశం ఎప్పుడో అవతరించి
ఉండేది!
రామాయణం.మహాభారతం
అనే రెండు మహాకావ్యాలలోనూ యుద్ధమే ప్రధానం. అందుకు మనం సిగ్గుపడాల్సిన పని లేదు.ఇక్కడే
కాదు, ప్రపంచ సాహిత్యంలోని అపురూపమైన ఇలియడ్ లాంటివి కూడా యుద్ధం చుట్టూనే తిరుగుతాయి.నెత్తురూ
కన్నీళ్ళూ ఇంకని కళారూపం ఇంతవరకు పుట్టలేదు, పుట్టినా ఎక్కువకాలం బతకలేదు.ఎప్పుడో పుట్టి
ఇప్పటికీ నిలిచినవీ ఇప్పుడు పుట్టి రేపటికీ నిలుస్తాయని అనుకుంటున్నవీ - అన్ని కళారూపాలూ
యుద్ధం చుట్టూరానే తిరుగుతున్నాయి.ఏముంటుంది యుద్ధంలో?అన్యాయం ఉంటుంది, హింస ఉంటుంది,
విషాదం ఉంటుంది!రామరావణ యుద్ధం స్త్రీ సౌందర్యం కోసం జరిగింది, కురుపాండవ యుధం రాజ్యశ్రీ
వైభవం కోసం జరిగింది.
శూర్పణఖ
వేరే ఆడదాని మొగుడితో పొందు కోసం అంగలార్చినందువల్లనూ రావణుడు వేరేవాడి పెళ్ళాంతో పొందు
కోసం అంగలార్చినందువల్లనూ ఒక యుద్ధం జరిగింది,హస్తినాపురానికి యువరాజైన ధర్మరాజుని
ధృతరాష్ట్రుడు ఖాండవప్రస్థానికి పంపించినందువల్లనూ ధర్మరాజు చేస్తున్న రాజసూయానికి వెళ్ళిన దుర్యోధనుడికి ధర్మరాజు వైభవం
చూసి కన్నుకుట్టి మాయాద్యూతంతో వారి సంపదని హరించి పాండవ కులస్త్రీని అవమానించినందువల్లనూ
ఒక యుద్ధం జరిగింది.
మరి,
దోపిడీని అంతం చేసి వర్గరహితసమాజం స్థాపించాలని కలలు గంటున్న ముప్పాళ రంగనాయకమ్మ గారికి
రావణ దుర్యోధనులకి బదులు రాముడూ పాండవులే దుర్మార్గులుగానూ రావణ దుర్యోదనులు కీర్తనీయులుగానూ
కనబడటం విచిత్రమే!రావణుడు బలవంతంగా ఎత్తుకొచ్చాడనీ మొగుడు దూరమయ్యాడనీ ఏడుస్తూ కూచోకపోతే
చక్కహా అలాంకరించుకుని నవ్వుతూ ఉండొచ్చు కదా అని మండోదరితో సీతకి బోడిసలహాలు ఇప్పించి
అశోకం పేరుతో గుక్కపట్టి యేడ్చిన వోల్గా అనే మరో రచయిత్రిని ఇదే ప్రశ్న అడిగితే వాల్మీకి
ఒక దృక్కోణంలో చూసి రాసిన కధని నేను మరొక దృక్కోణంలో చూసి రాశాను అనేసింది - తొక్కలో
దృక్కోణం! మంచితనాన్ని వంచన కిందనూ వంచనాపరుల్ని మంచివాళ్ళ కిందనూ మార్చటమా దృక్కోణం
అంటే? ఈ రెండు శంఖిణీ జాతి స్వైరిణులకీ నేనూ వాల్మీకి అంతటిదాన్ని అని డప్పు కొట్టుకోవాలన్న
దురద తప్ప ఇంకేం లేదు. వీళ్ళకి తోడు గుడిసేటి చలం ఒకడు దొరికాడు - బూతునే నీతి పేరున
గయ్యాళితనం చూపించి వదరటం తప్ప వీళ్ళు చేసింది విప్లవమూ కాదు, వీళ్ళు గౌరవనీయులూ కారు.
ద్వారక
బయటపడి కృష్ణుడు చారిత్రకవ్యక్తియే అని సాక్ష్యం దొరికినా అసలు కధ ఇలాగే జరిగిందని
చెప్పలేము కాబట్టి ఇప్పుడు మనం చదువుతున్న భారతాన్ని కధలాగే చూడాలి.కానీ ద్వారక ఒకటే
కాదు,కధలోని వ్యక్తుల వంశావళి మిగిలిన అన్ని పురాణాలతోనూ సరిపోలుతున్నాయి, కొన్నింటిని
ఆధునికులు కూడా ధృవీకరించటం వల్ల అది చరిత్రయే అనుకోవాలి.స్వతత్రభారతప్రప్రధమప్రధాని
ముత్తాత ఢిల్లీ పాదుషాల కొలువులో ఉద్యోగస్తుడు గనక స్కూలు పిల్లకి చెప్పే చరిత్ర మొత్తం
ఢిల్లీ నగరం చుట్టూ తిప్పారు.బైబిల్లో సృష్టి జరిగిందని చెబుతున్న క్రీ.పూ 4000 సంవత్సరాల
క్రితం దిక్కుమాలిన హిండియన్సుకీ ఏమీ ఉండడానికి అవకాశం లేదని ఇంగ్లీషువాళ్ళు వైదిక
యుగాన్ని ఆ తర్వాత కాలానికి లాక్కొచ్చి కూలేశారు. వాళ్ళూ వీళ్ళూ కూడా తెలిసే అబద్ధాలు
చెప్పారు!ఇప్పుడు బయటపడిన ద్వారక హిందూద్వేషుల మెదళ్ళలో పెద్ద బాంబునే పేల్చింది.ద్వారక
కాలం ఇంకా నిర్ధారించలేదు - 7000 యేళ్ళ నాటిదా 12000 యేళ్ళ నాటిదా అని సందేహాలు ఉన్నాయి.ఎలా
తేలినా ఇప్పుడు వేదాలు గ్రంధస్థం చెయ్యబడిన వైదిక కాలం ఖచ్చితంగా ఆ తేదీకి వెనకనే ఉండాలి.ఎందుకంటే
ద్వారకావాసి యైన శ్రీకృష్ణుడు అప్పటికి పూర్తి
స్పష్టత వచ్చిన వైదిక ధర్మాన్ని పాటించాడు మరి!
రామాయణ
భారతాలు కల్పిత కధలు కావచ్చు గానీ వైదిక సాహిత్యం మాత్రం కాల్పనికం కాదు.నిజానికి వైదిక
సాహిత్యం సనాతన ధార్మికులు గురుశిష్యపరంపరతో ఆర్జించిన జ్ఞానరాశి - అందులో అబద్ధాలు
ఉండటానికి వీల్లేదు.ఎప్పుడో బవిష్యత్తులో వచ్చే హిందూద్వేషుల్ని ఏడిపించటానికో రాబోయే
తరాలని మోసం చెయ్యటానికో అబద్ధాలు రాయాల్సిన అవసరం వారికి లేదు.ఆనాటికి వారి పూర్వులు
ఆధించిన జ్ఞానరాశిని గ్రంధస్థం చెయ్యదం అనేది గౌరవభావంతోనే జరుగుతుంది.వైదిక ఋషులైన
దీర్ఘతమస,మధుచ్చంద, అంగిరసాది ఋషులు వాస్తవ వ్యక్తులే!భౌతికమైన ఆధారాలు లేనంత మాత్రాన
కల్పితవ్యక్తులు అనాలంటే అలేగ్జాండరు ది గ్రేట్ కూడా కల్పితవ్యక్తియే అవుతాడు - చేతులు
పైకిపెట్టి సమాధి చెయ్యమన్నాడు అన్న కబుర్లతో సహా వేటికీ భౌతికపరమైన ఆనవాళ్ళు లేవు!జీసస్
క్రీస్తు,మహమ్మదు ప్రవక్త వంటి ప్రపంచ వ్యాప్త మతశాఖల మూలపురుషులకే చారిత్రకపరమైన సాక్ష్యాలు
కనపడటం లేదు - నిజం!
హిందూదేశంలోని
ఒక బుల్లి రాజునే గెలవలేక వెనక్కి తిరిగిన అలెగ్జాండరు గ్రేట్ అయితే ఎవడికి వాడికి
కళ్ళు చెదిరే స్థాయిలో బలమూ బలగమూ తెలివీ పొగరూ ఉండి విడివిడిగా చూసినా ఒక్కొక్కడూ
అబ్బా అనిపించే పదిమంది బలమైన శత్రువులు అన్ని వైపుల నుంచీ నొక్కుతున్నా పదే పదే జరుగుతున్న
అంతిమ విజయం తేలని వ్యూహాత్మక దాడుల చీకాకుల్ని తట్టుకుంటూ పాతికేళ్ళ పాటు నిలబడి అందర్నీ
ఓడించి విజయామృతదరహాసం చేసినవాడు గ్రేట్ కాకుండా ఏలా ఉంటాడు?ఎవడి పేరు చెబితే హిందూద్వేషులకి
దిమ్మ దిరిగి మైండు బ్లాకవ్వుద్దో ఆడే సుదాస పాంచాలుడు!
Now
I am telling you about that Dasarjaneya war, the Battle of Ten Kings,
incidentally it is the first war recorded in history, which is described in the
Vedas.Give me a big hand and listen with fullest attention!
దివోదాసు
భరతుని తర్వాత 49వ రాజు. దివోదాసు మనుమడే సుదాసుడు.తండ్రి పిజవనుడు కాబట్టి సుదాసుణ్ణి
పైజవనుడు అని కూడా అంటారు.ఈ సుదాసుడే మన కధానాయకుడు - మన దేశపు కమ్యూనిష్టు చరిత్రకారుల
విశ్లేషణలకి భిన్నమైనదీ సనాతన ధార్మికులు పాటించిన కులసమీకరణల పరమైన సామాజిక వాస్తవమూ
అయిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా?ఈతని మూలాన్ని బట్టి వెనక్కి వెళ్ళి చూస్తే
ఇతను బ్రాహ్మణేతరుడనీ మీదుమిక్కిలి శూద్రజాతి వాడనీ తెలుస్తుంది. అయినా ఇద్దరు బ్రహ్మర్షులు
ఇతనికి మంత్రులై పురోహితులై మార్గదర్శకులై యుద్ధకాలంలో సహాయం చేసి విజయం పొందాక పొగిడి
సూక్తాలను వెలయించారు!అసలు కధలోకి వెళ్ళబోయేముందు హిందూద్వేషులకి అత్యంత ఇష్టురాలైన రోమిల్లా ధాపర్ ఈ దాశరాజ్ఞ యుద్ధం
గురించి ఏమని విశ్లేషించిందో చూచెదము గాక, "If you read the hymns the plea
to the gods Indra, Agni, whomsoever it is, is help us go and attack this 'dasa'
village or this 'dasapua',help us get the cattle of the 'dasa'.It is always
cattle that they are wanting.There is no question of help us go into battle and
take over a whole territory.It is limited to small areas of attack.They are
mobile pastoralists and the cattle raids and predatory raids are surrogate for
warfare. There are in fact no great battles or campaigns.Even the famous battle
of ten kings is over the change that is taking place that is being brought into
function over the river waters of the Ravi. It is not as if there is huge
encampment on a plain and the two armies have got together and are fighting
each other. None of that.It is something i.e. very much localized and
controlled" - అయ్యా!గ్రీకులూ మయన్లూ మరియూ ఇతర యూరోపియన్లూ బుల్లి బుల్లి నగరాల
చుట్టూ తిరిగినా వీళ్ళకి రాజులు, మహారాజులు, చక్రవర్తుల్లా కనిపిస్తారు.ఈ దాశరాజ్ఞేయ
యుద్ధం పూర్తయిన అతి కొద్ది కాలానికే హరప్పన్ నాగరికత అని మనం ఇవ్వాళ చెప్పుకుంటున్న
మహానగరాలను నిర్మంచగలిగిన మహాబలవంతులైన రాజులు కూడా వీళ్ళకి పశువుల కాపర్లుగా కనిపిస్తారు,ఎక్కడ
పుట్టి ఎక్కద పెరిగి ఎవరికి వూడిగం చేస్తున్నారు వీళ్ళు? ఛీ!వీళ్ళని గురించి తల్చుకోవటానికే
కంపరంగా ఉంది నాకు.
హిందూద్వేషులైనవాళ్ళు
అలా అవమానిస్తే హిందూపండితులు కూడా పట్టించుకోకపోవడం వల్ల తెలియలేదు గానీ నేనిప్పుడు
ఈ యుద్ధానికి ముందరి తర్వాతి కాలాల ప్రపంచ సంస్కృతులను పోల్చి చూడటం వల్ల ఈ యుద్ధం
ప్రపంచంలోని ఇతర చోట్లకి కూదా వైదిక సంస్కృతి వ్యాపించడానికి దోహదపడిందనేది నాకు తెలిసింది.సుదాస
ది గ్రేట్ చేతిలో వోడిపోయిన శత్రురాజులు కొత్త ప్రాంతాలను వెతుకుతూ వెళ్లారు.అలా వెళ్ళినవాళ్ళలో
కొందరు -
పృధువులు(Prthus or
Parthavas) ఇప్పటి Parthians,
పర్శువులు(Parsus or
Parsvas) ఇప్పటి Persians,
ఫక్తవులు(Pakthas) ఇప్పటి
Paktoons,
భలనులు(Bhalanas) ఇప్పటి
Baluchis,
శిమ్యులు(Simyus) ఇప్పటి
Albanians,
అళినులు(Alinas) ఇప్పటి
Greeks అయ్యారు.
Alina
అనేది కొంచెం మార్పు చేందితే Hellennes వస్తుంది.ఈ పదం వైజ్ఞానిక సాంకేతిక శాస్త్రాల్లో
గ్రీకూల పారిబాషిక పదాల్లో తరచు కనపడుతుంది.ఇంత గొప్ప స్థాయిలో ప్రపంచగతిని మార్చగలిగిన
యుద్ధాన్ని కొందరు పశువుల కాపర్లు పిల్లకాలవల మీద చేసిన చిన్న సైజు దొమ్మీ కింద తేల్చేసిన
మనిషి గొప్ప పరిశోధనా చాతుర్యంతో ఎన్నో ఉద్గ్రంధాల్ని రాసిన విదుషీమణి - ఈ పిచ్చిరాతలు
రాస్తున్న కాలంలో కనీసపు స్థాయిలోనైనా అబద్ధాలు చెప్తున్నందుకు సిగ్గు గానీ తను అబద్ధాలు
చెప్పినట్టు బయటపడితే ఎట్లా అనే భయం గానీ కలగలేదా వీళ్ళకి?
సరే,
ఈ గొట్టాంగాళ్లని గురించి యాష్టపడి టైం వేస్ట్ చెయ్యకుండా అసలు కధలోకి వెళ్ళబోయేముందు
సుదాసుని వంశ మూలపురుషుడైన చక్రవర్తి భరతుడి
గురించి ముందు కొద్దిగా తెలుసుకుందాం.హిందూ,బౌద్ధ,జిన సాహిత్యాలు అన్నీ ఈ భరతుడి
పేరు మీదనే భరతఖండం అనే పేరు వచ్చిందని చెబుతున్నాయి - ఆధునిక చరిత్రకారులు కూడా విధిలేక
ఒప్పుకున్నారు.ఈయనొక్కడే 130 అశ్వమేధాలూ 50 రాజసూయాలూ చేశాడు - మొత్తం పౌరాణిక సాహిత్యమంతా
వెతికినా మరో రాజుకు ఈ ఖ్యాతి లేదు!రాజుల కోసం నిర్దేశించబడిన మహాయజ్ఞాలు నాలుగు -
सौत्रामणि,
वाजपेय,
राजासूय,
अश्वमेध.
వీటిలో అశ్వమేధం రాజ్యాన్ని వ్యాప్తి చెయ్యడానికీ రాజసూయాన్ని తన ఆధిక్యతని నిరూపించుకోవడానికీ
చేసేవాళ్ళు.భారతదేశం ఎప్పుడూ ఒక్కటి కాదనీ అనేకమంది చిల్లర మల్లర రాజుల పరిపాలన్లో
ఐకమత్యం లేకుండా ఉండేదనీ అందువల్లనే విదేశీయులకి తేలిగ్గా లొంగిపోయారనీ చెప్తున్నది
పచ్చి అబద్ధం!ఇవన్నీ సోదర వంశాలు - తమ ప్రాంతం పేరుతో పిలిపించుకుంటూ ఉన్నప్పటికీ సంస్కృతి
రీత్యా అందరూ ఒక్కటే.
అత్యంత
ప్రాచీనమైన ఋగ్వేదంలోనే साम्राज्य (kingdom), भोज्य
(state, large kingdom), वैराज्य (extended
sovereignty), पारमेष्ठिकराज्य (supreme empire) అనే విభిన్నమైన
సాంకేతిక నామాలతో వర్ణించబడిన రాజ్యవ్యవస్థలు ఉండేవి.అయినప్పటికీ విష్ణుపురాణం ఈ మొత్తం
అన్నింటిని కలిపి భరతజాతి అనే వ్యవహరించింది.
उत्तरं
यत्समुद्रस्य
हिमाद्रेश्चैव
दक्षिणम्
|
वर्षं
तद्
भारतं
नाम
भारती
यत्र
संततिः
||
(VP 2.3.1)
అటువంటి
భరతజాతిలో సుదాసుని తాత దివోదాసు శంబరుదనే అనార్యరాజుకి సమబంధించిన 100 నగరాలను ధ్వంసం
చేసిన ఘనుడు!అతని కాలం నుంచీ అణిగి మణిగి ఉన్న ఇతర ఆర్యరాజులు సుదాసుని కాలంలో తిరగబడ్దారు.వాళ్ళని
కొన్ని సంవత్సరాల పాటు నిగ్రహించి నిలబడి పోరాడి తన బలమూ కాలమూ ప్రకృతీ కలిసి వచ్చినట్టు
అంతిమవిజయం సాధించాడు.సుదాసుడికి అటువైపున ఉన్నవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు.
Alinas(అళిన): కొందరు వీరిది ఇప్పటి ఆఫ్ఘనిస్థాన్ లోని నురిస్థాన్(Nuristan)
ప్రావిన్స్ ప్రాంతం అని చెబుతున్నారు – చైనా యాత్రికుడు Hiouen Thsang ఈ ప్రాంతం గురించి
వర్ణించాడు.
Anu(అను): కొందరు వీరిని
పరుష్ని(ravi) తీరవాసులని పేర్కొన్నారు
Bhrigus(భృగు): భృగు మహర్షి
వంశస్థులు ఈ కాలానికి రాజ్యపాలన చేపట్టి ఉండవచ్చు.తర్వాత కాలంలో మళ్ళీ అధ్యయనానికి
ప్రాధాన్యం ఇచ్చి ఉందవచ్చు.అధర్వణ వేదంలో వీరి పాండిత్యం కనబడుతుంది..
Bhalanas(భల్లాణ(?)): కొందరు వీరిని బోలన్ కనుమ ప్రాంతం వారని వ్యవహరించారు.
Druhyus(ద్రుహ్యు): కొందరు
వీరిని గాంధారికి సంబంధం ఉన్న గాంధార(kandahar) ప్రాంతం వారని చెబుతున్నారు.క్రైస్తవమే
కాదు అబ్రహామిక్ మతాలలో ఏ ఒక్కటీ పుట్టని కాలపు యూరోపీయ సంస్కృతీ నిర్మాతలైన
Druids వీరే కావచ్చునని చాలామంది చరిత్రకారులు
భావిస్తున్నారు.
Matsya(మత్స్య): వీరిని
గురించి తెలిసిన సాంకేతిక వివరాలు చాలా తక్కువ, ఒక కవి కవితాత్మకంగా చెప్పిన
"ఆకలి గొన్న చేపల వలె సుదాసుని మీదకి యుద్ధానికి వచ్చి నీటిని విడిచిన చేపల వలె
అంతమయ్యారు" అనే వర్ణన ప్రముఖమైనదిగా కనిపిస్తుంది అనేక చోట్ల.
Parsu(పర్శు): ప్రాచీన కాలపు
పర్షియన్ నాగరికత నిర్మాతలు వీరేనని చాలామంది భావిస్తున్నారు.
Purus(పురు): సుదాసుని మీదకి
అందరినీ కూడగట్టగలిగిన ఈ బలమైన వంశమే యుద్ధం తర్వాత పురు,కురు అనే రెండుగా చీలింది
వీరి వారసులైన కురు పాండవుల మధ్యనే కురుక్షేత్ర సమరం జరిగింది.
Panis(పణి): ఆర్యఋషులు వీరిని
పూర్తి దానవజాతిగా వ్యవహరించారు.తర్వాత కాలంలో వీరే Scythians అయ్యారు.
ఇప్పటి
చరిత్రకారులు ఒప్పుకోని ఒక వింత యేమిటంటే సుదాసునికి విజయాన్ని ప్రాప్తించిన ఇంద్రుని
గురించి ఆయా జాతుల ప్రాచీన సాహిత్యంలో పూజింపదగనివాడుగా వ్యవహరించే ప్రస్తావనలు ఉన్నాయి.అయితే
రాజకీయపరమైన కారణాలతో ప్రాంతం దాటి దూరం జరిగినప్పటికీ చాలాకాలం వరకు వారు తమ మూలస్థానం
పట్ల మమకారం ప్రదర్శించారు.అబ్రహామిక్ మతాలు ఈ మౌలిక సంస్కృతిని విభేదించి అ సంబంధాన్ని
తెంచివేసి ఆయా నాగరికతలలో కల్లోలాన్ని సృష్టించాయి!ఆయా జాతుల, ప్రాంతాల, రాజ్యాల ప్రాచీన
చరిత్రను ఆధునికులు కావాలని విస్మరించడం వెనక నిన్నటి కాలంలో తమచేత పరిపాలించబడిన వారే
మొన్నటి కాలంలో తమకు నాగరికతను నేర్పినవారని
గుర్తించడానికి నిరాకరించే అహంభావం ఉన్నది - వారిని కీర్తించే మనవారిలో వారిపట్ల
బానిసత్వం ఉన్నది!
ఇంగ్లీషువాళ్ళూ
వాళ్ల అంతేవాసులైన మార్క్సిస్టు చరిత్రకారులూ బుద్ధుడికి ముందు రాజ్యాలు గానీ రాజులు
గానీ ఉందడానికి వీల్లేదని తీర్మానించేశారు - కానీ బౌద్ధమతసాహిత్యమే षोडशमहाजनपद(Sixteen
Graet Repablics) గురించీ బుద్ధుడికి సమకాలికుడైన ఉదయన వత్సరాజును గురించీ చెబుతున్నది,
ఇవన్నీ గాల్లోంచి పుట్టుకు వచ్చాయా!
బౌద్ధ
సాహిత్యం ప్రకారమే ఉత్తర భారతంలో మగధ,కోసల,వత్స రాజ్యాలు ప్రముఖమైనవి.రాజగృహం మగధకి
రాజధాని.శ్రావస్తి కోసలకి రాజధాని.కౌశాంబి వత్సరాజ్యానికి రాజధాని.విదర్భ కొంచెం దక్షిణానికి
ఉంటుంది.ఉజ్జయిని దీనికి రాజధాని.కురు,పాంచాల రాజ్యాలు గంగాతీరంలో ఉండేవి.యమునా తీరంలో
ఉన్న ఇప్పటి ఆగ్రాని అప్పుడు ఆగ్రోదకం అనేవాళ్ళు.దీనికి కొంచెం దాపుల మధుర రాజధానిగా
శూరసేన రాజ్యం ఉంది.వత్స రాజ్యం నుంచి సాగితే గంగా యమునల సంగమ క్షేత్రమైన ప్రయాగ దగ్గిర
కాశీ రాజ్యం ఉంది.ఇక్కడి నుంచి తూర్పుకి వెళితే ఇప్పటి బీహారులోని దర్భంగాకి దగ్గిర
మిధిల ఉంది.ఇంకా తూర్పుకి వెళితే గంగా సాగర సంగమం దగ్గిర అంగ రాజ్యం ఉన్నది.ఇంకొంచెం
ముందుకి వెళితే వంగ, పుళింద, గౌడ దేశాలు ఉంటాయి.వీటి కొసన ఉన్న ఇప్పటి అస్సామును కామరూప
పేరుతో పిలిచేవాళ్ళు.ఓఢ్ర,ఉత్కల జనపదాలు కలిసినది ఇప్పటి ఒరిస్సా అవుతుంది.ఇప్పటి గుజరాత్
అప్పటి ఘూర్జర,సౌరాష్ట్రలు కలిసినది.ఇప్పటి రాజస్థాన్ అప్పటి త్రిగర్త,సౌభ్య(సాల్వ)
రాజ్యాలు కలిసినది.ఇప్పటి కర్నాటకలో ఎక్కువ భాగం అప్పటి కుంతల దేశం.ఆంధ్ర ప్రాంతానికి
త్రిలింగదేశం అనే పేరు కూడా అప్పటినుంచే ఉన్నది.పాండ్య,చేర,చోళ ప్రాంతాల్ని ద్రవిడ
రాజ్యాలు అని పిలిచేవాళ్ళు - ఇవన్నీ ఎక్కడున్నాయి?ఇవే కాదు, హిందువులకి సంబంధించిన
ఏ ఒక్క గొప్ప విషయమూ బయటికి రానివ్వకూడదనే గట్టి పట్టుదలతో చరిత్రని భ్రష్టు పట్టించిన
వీళ్ళు ఎవరు?C.E 1947 నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసువాళ్ళు!ఎడ్వినా ప్రియుడి అండతో
యూనివర్సిటీల్లో పీఠం వేసుకున్న కమ్యునిష్టులు!
పైన
పేర్కొన్నవి ఏవీ ఆటవిక తెగలు కావు.సువ్యవస్థితమైన రాజ్యాంగ యంత్రం ఉండి సకల సంపదలతో
తులతూగే ఆనాటికి ప్రపంచ స్థాయి వాణిజ్య కేంద్రాలు - అది కూడాబౌద్ధ సాహిత్యమే చెబుతున్నది,
అయినా మనకి తెలియదు, మన ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేర్చి చెబితే గదా తెలిసేది!దాశరాజ్ఞయుద్ధం
గురించి కూడా అంతే - ఆటవిక తెగలు ఆవులమంద కోసం బురదలో పడి దొర్లారని తేల్చిపారేశాక
ఇంక పరిశోధన ఎలా జరుగుతుంది?నేను వెతికి పట్టుకున్న మేరకు విషయాన్ని గందరగోళం లేకుండా
చెబుతాను.ఎవరికి ఎంత అర్ధమైతే అంతే ప్రాప్తం!
యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఇప్పుడు
మనం క్రీ.శ 2018లో ఉన్నాము.చాలామంది చరిత్రకారులు దాశరాజ్ఞ యుద్దం జరిగిన కాలాన్ని
ఇప్పటినుంచి 8000 సంవత్సరాల వెనక జరిగిందని చెబుతున్నారు.ఇవ్వాళ పూనుకుని పరిశోధనలు
చేసినా ఖచ్చితమైన అంచనాకు రావడం కష్టమే,ఎందుకంటే వైదిక సాహిత్యంలో తప్ప మరెక్కడా ఈ
యుద్ధం గురించిన ప్రస్తావనలు లేదు.భక్తియార్ ఖిల్జీ అనే అడ్డ గాడిద తగలబెట్టిన నలందా
విశ్వవిద్యాలయపు సేకరణలో ఉండి ఉండాలి - కొన్ని వందల వేల లక్షల తరాల పాటు గురుశిష్యపరంపరలో
సముపార్జించిన జ్ఞానరాశి అది.అందులో ఒక సహస్రాంశపు జ్ఞానరాశిని సైతం తిరిగి సృష్టించడం
సాధ్యమా!గాలికెగిరిన పేలపిండిలా పోయింది ఎటూ తిరిగి రాదు.కానీ ఉన్నదాన్ని కూడా నిలబెట్టుకోలేని
దౌర్భాగ్యం దేనికి?నిలబెట్టుకోవడం వరకు వెళ్ళనక్కరలేదు, తెలుసుకోవడానికే ఇష్టపడటం లేదు.
మన దేశపు గొప్పవాళ్ళని గౌరవించడానికి కూడా ఆంగ్లేయుల పట్ల పాతుకుపోయిన సాంస్కృతిక భావదాస్యం
నుంచి పుట్టిన inferiority complexకి ఈ పిలక బ్యాచ్చి కన్న మేము చాలా తెలివైనవాళ్లం
అనే superiority complex కలిసిన రోగిష్టి మనస్తత్వం ఒప్పుకోనివ్వడం లేదు.
దాశరాజ్ఞ
యుద్ధానికి వామదేవ శాస్త్రి(David Frauley) తన The Myth of the Aryan Invasion అనే
గ్రంధంలో 3700 BCE అని చేసిన నిర్ధారణ యుక్తియుక్తమే - ఇటువైపునుంచి చూస్తున్న చారిత్రక
సంభావ్యతలకీ అటువైపునుంచి పౌరాణిక రాజవంశావళి వర్ణనలకీ మధ్యన సమన్వయం కుదురుతున్నది.అయితే,
P.L.Bhargava అనే మరొక ప్రముఖ చరిత్రకారుడు 3100 BCE సంవత్సరాన్ని కూడా తనదైన శైలిలో
ఆధారాలు చూపిస్తూ నిర్ధారించడం జరిగింది.వైవస్వత మనువు కాలం నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క
తరానికీ 16 సంవత్సరాల చొప్పున సుదాసునికి ముందర నలభైమంది పారిపాలించారు అనే లెక్క ప్రకారం
ఈ విశ్లేషణ సాగింది.
ఏది
ఏమైనప్పటికీ యుద్ధం ముగిశాక శత్రుభీతి లేని ప్రశాంతత ఉత్పత్తినీ వైభవాన్నీ పెంచడం వల్ల
హరప్పా,మొహెంజెదారో,డోలవిర లాంటి మహానగరాల నిర్మాణం జరగడానికి కొంత ముందు కాలంలో జరిగి
ఉందవచ్చును.ద్వారక,హరప్పాల వంటి నగరాల కాలం గురించి ఇప్పటికీ సందేహాల కతీతమైన నిర్ధారణ
జరగలేదు కాబట్టి అవి వెనక్కి జరిగితే దీనినీ వెనక్కి జరపాల్సి వస్తుంది.సరస్వతి ప్రస్తావన
కూడా ఉండటం వల్ల సరస్వతి ఇంకిపోక ముందరి కాలంలో ఈ యుద్ధం జరిగినట్టు భావించాలి.
యుద్ధం ఎక్కడ జరిగింది?
ఋగ్వేదం
ఏడవ మండలం ఈ యుద్ధం గురించి చాలా సమాచారాన్ని ఇస్తుంది.సుదాసునికి ఒకరి తర్వాత ఒకరుగా
పౌరోహిత్యం వహించి దాశరాజ్ఞ యుద్ధంలో కీలకపాత్రని పొషించిన వశిష్ఠ విశ్వామిత్రులు స్వయంగా
చెప్పుకున్న సూక్తాలకు తోడు ఇతర వైదిక ఋషులు చెప్పిన సూక్తాలు చాలాచోట్ల కనిపిస్తున్నాయి.అన్నింటిలోనూ
ప్రధాన విషయాలలో వైరుధ్యం లేదు గానీ కొన్ని చిన్న చిన్న విషయాలకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం వల్ల పాఠాంతరాలు కనబడుతూ గందరగోళాన్ని
సృష్టిస్తున్నాయి.అన్నింటినీ ఒకచోటికి చేర్చి పండితులు ఏకసూత్రతని సాధించాల్సిన అవసరం
ఉంది.
విశ్వామిత్రుడు
అంతిమవిజయాన్ని ప్రసాదించిన సందర్భంలో ఇంద్ర వరుణులకు కృతజ్ఞతలు చెబుతున్న సూక్తంలో
పరుష్ణి జలయుద్ధాన్ని ఎక్కవ ప్రస్తావించాడు గనక దానినే అసలైన యుద్ధరంగం అని పేర్కొనడం
సముచితంగా ఉంటుంది.మిగిలిన విషయాలలో సంధిగ్ధత ఉన్నది గానీ భౌగోళిక వర్ణనలు కచ్చితంగానే
ఉన్నాయి. ఈ రాజులు అందరూ గంగా-సిందు మైదాన ప్రాంతం వారే,ఈ యుద్ధం రామ రావణ యుద్ధంలా
పదిరోజుల్లోనూ కురు పాండవ యుద్ధంలా పద్ధెనిమిది రోజుల్లోనూ ముగిసిపోలేదు.కొన్ని సంవత్సరాల
పాటు చిన్న చిన్న యుద్దాలతో కలిపి యమునా తీరంలో
జరిగిన ఒక యుద్ధం, పరుష్ణీ(రావి) తీరంలో జరిగిన యుద్ధం ప్రముఖమైనవి.పరుష్ణీ జలయుద్ధం
సుదాసునికి అంతిమవిజయాన్ని ఖరారు చేసింది.
యుద్ధం ఎందుకు జరిగింది?
వశిష్ఠుడు,విశ్వామిత్రుడు
- ఇద్దరూ సుదాసుడికి పౌరోహిత్యం చేశారు,అంతిమ విజయం తర్వాత ఇద్దరూ సుదాసుబి మీద ప్రసంసలు
కురిపించారు.అయితే,ఇద్దరూ కలిసి ఒకే సమయంలో సుదాసుడికి పౌరోహిత్యం చెయ్యలేదు.అనేకమైన
అపారమైన పౌరాణిక సాహిత్యంలో వీరిద్దరీకీ మధ్యన జరిగిన కలహాల కధలు ఎంతో విస్తారమై ఉన్నాయి.తను
రాజైనప్పటికీ వశిష్ఠుడికి బ్రహ్మర్షిత్వం వల్ల రాజులకి మించి జరుగుతున్న గౌరవ మర్యాదలని
చూసి ఈర్ష్యపడి తను కూడా బ్రహ్మర్షియై వశిష్ఠుడి కన్న అధిక స్థాయిలో గౌరవ మర్యాదలను
పొందాలనుకున్నాడనీ ఒకానొక సందర్భంలో ఒక రాక్షసుడిని
ప్రోత్సహించి వశిష్ఠుడి నూరుగురు కుమారుల్నీ హత్య చేయించాడనీ చాలా కధలు ప్రచారంలోకి
వచ్చాయి.వాటి ప్రభావం వల్ల కాబోలు మొదట విశ్వామిత్రుడు సుదాసుడికి పురోహితుడుగా ఉండి
అతన్ని తొలగించి వశిష్ఠుణ్ణి తీసుకోవడంతో విశ్వామిత్రుడు పగబట్టి మిగిలిన రాజుల్ని
రెచ్చగొట్టి దాశరాజ్ఞ యుద్ధానికి బీజం వేశాడని చాలామంది చరిత్రకారులు విశ్లేషణలు చేస్తున్నారు.కానీ
నాకు మాత్రం అలా అనుకోవడానికి ఆధారాలు కనబడటం లేదు. మన పౌరాణిక సాహిత్యం నుంచి తొలగించాల్సిన
వాటిలో ఈ వశిష్ఠ విశ్వామిత్రుల వైరం కూడా ఒకటి.
మిగిలిన
పురాణకదల్ని పట్టించుకోకుండా ఈ దాశరాజ్ఞ యుద్ధం గురించిన ఋగ్వేద సూక్తాలను మాత్రం పట్టించుకుంటే
నాకు కనబడిన విషయాలు ఇలా ఉన్నాయి.గెలుపు తర్వాత విశ్వామిత్రుడు చెప్పిన సూక్తంలో పూర్వ
పురోహితుడు సాధించలేని దానిని తను సాధించినందుకు గర్వం వ్యక్తం చేశాడు.అందువల్ల యుద్ధం
మొదలయ్యేటప్పటికి గానీ తొలిదశలో గానీ వశిష్ఠుడు సుదాసుని పక్కన ఉండి తర్వాత వశిష్ఠుడు
దూరమై విశ్వామిత్రుడు సుదాసుడికి పురోహితుడయ్యాడనేది నా అభిప్రాయం.అదే సూక్తంలో విశ్వామిత్రుడే
వశిష్ఠుడు కూడ సుదాసుణ్ణి ప్రశంసించినట్టు ప్రస్తావించడం వల్ల వీళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతమైన
శత్రుత్వం లేదనే భావించాలి.వ్యతిరేకత గనక ఉంటే ఏదో ఒక నిందావాచకం అక్కడ ఉండి ఉండేది.ఎందుకంటే,
వైదిక సాహిత్యంలోని ఏ ఋషీ కూడా వ్యక్తిగతమైన రాగద్వేషాలని దాచుకోవాలని ప్రయత్నించలేదు,
కపట నాటకాలను ప్రదర్శించలేదు.సుదాసుడికి పౌరోహిత్యం వహించని కాలంలో విశ్వామిత్రుడు
గానీ వశిష్ఠుడు గానీ అటువైపున ఉన్న రాజులకి పౌరోహిత్యం వహించిన దాఖలాలు కూడా కనపడటం
లేదు.
RV
7.18.6 దగ్గిర చెప్పినట్టు అప్పటికే చాలా సంవత్సరాల నుంచి సుదాసుడి ఆధిక్యతని సహించలేని
యదు,తుర్వశ గణాలు మొదట మత్స్యులను కలుపుకుని తిరుగుబాటు మొదలుపెడితే తర్వాత పురు,పణి
వంటి బలమయిన వాళ్ళు కలిశాక ఒక సమూహం ఏర్పడినట్టు చెప్పుకోవచ్చు.సుదాసుని వైపు ఉన్నవారిని
శ్వేతవస్త్రధారులుగానూ (daksinataskaparda)కుడివైపున జుట్టును ముడివేసినట్టు గానూ వర్ణించారు.అటువైపువారిని
అయజ్వులని వర్ణించారు.దీనిని బట్టి వైదిక సంస్కృతిని తిరస్కరించిన వారు వైదిక సంస్కృతికి
కట్టుబడిన సుదాసుని మీద చేసిన సాంస్కృతిక యుద్ధమని కూడా చెప్పుకోవచ్చును.కాకపోతే ఈ
సంస్కృతీ భేదం తొలిదశలోనే ఉన్నది గాబట్టి ఇది యుద్ధానికి బలమైన కారణం కాకపోవచ్చు.సుదాసుడికి
ఉన్న కృతధ్వజుడు అనే విశేషణం తన సైన్యానికి ముందు ధ్వజాన్ని నిలబెట్టుకోగలిగిన వైభవానికి
సంకేతం.బుస్సీ సాయంతో బొబ్బిలి కోటని ముట్టడించిన విజయనగరం రాజుకి నవలక్షకళింగాధీశ్వరుడు
అనే బిరుదు ఉంది.ఇవన్నీ వూరికే వాడిన మాటలు కావు.వాళ్ళ సామర్ధ్యాన్ని బట్టి లెక్క ప్రకారం
ఇచ్చిన గుర్తింపులు - వీటిని పట్టించుకోకుండా వాళ్ళని ఆటవిక తెగలని అనడం అలా అన్నవాళ్ళ
అజ్ఞానాన్ని సూచిస్తుంది.సుదాసుడి వైభవానికి కన్నుకుట్టి అతని మీద చక్రవ్యూహం అమలు
జరిపారనేది నిశ్చయం! ఒక్కొక్కరు పోరాడి గెలవలేని బలవంతుడైన శత్రువుని అన్ని వైపుల నుంచి
చుట్టుముట్టి గెలిచి ఆనందించాలనే సైనికపరమైన వ్యూహాత్మక తప్పిదమే వారిని యుద్ధానికి
దింపి ఉంటుంది.
"రాజనే
ప్రతివాడికీ కంటి యెదుట జయింప శక్యం గాని వాడు కనబడుతూ ఉంటే కంటికి నిదర వస్తుందా"
- కవియైన శ్రీనాదుడికే డండిమభట్టును తల్చుకుంటే నిదర పట్టలేదు గదా అతన్ని గెలిచే ఒక
గొప్ప యెత్తుగడ తట్టేవరకు! వ్యూహం పన్నిన తొలిదశలో అద్భుతమైనది అనిపించినప్పటికీ పదిమంది
అల్లిన ఎత్తుగడ బెడిసికొట్టి చివరాఖరికి ఒక చిట్టెలుక పది సింహాల్ని గెలిచినంతటి అద్భుతం
జరిగింది. అగ్నికి వాయువు తోడైనట్టు సుదాసుడికి విశ్వామిత్రుడు కలవడంతో.
యుద్ధం ఎట్లా జరిగింది?
విశ్వామిత్రుడు
చెప్పిన సూక్తం ప్రకారం శత్రువుల దురాశయే వారిని అపజయం వైపుకు నడిపించింది!సుదాసుడికి
ఏవైతే ప్రతికూలతలు అయ్యి తాము తేలికగా అతన్ని గెలవగలమని భావించారో సుదాసుడు వాటినే
తనకు అనుకూలతల కింద మలుచుకుని విజయం సాధించాడు.
Sudas’ battle with the
ten tribes
Hymn 7.18
Translated by Kant
Singh
1. Cherished by
ancestors, Indra,the world has loved you since the ancient times till the
present.To you, we sing for milch cows, fast horses, wealth, o lord,will all
our devotion.
2. O’ king of kings,
you are known for showering your generous donations upon the wise sages, since
ages.(Indra is garlanded)We adorn you lord, with our praise,to cause us to have
cattle, horses, good fortune, our hero.
3. Here,
wholeheartedly, with pleasing voices,we worship your divine form.We had prayed
to you o’ heavenly king,that you consider our respectful prayer for protection.
4. We had sacrificed a
cow for you, we had cherished you by sprinkling milk upon you,the Vasisthas had
garlanded you and prayed to you.We had called upon you, o’ chief of the
world,and you Indra, had understood our prayer
5. Thanks to the
devotion displayed by Sudas,Indra had made the speeding waters, easy to
cross.That made Simyu, the most disparaging one, to decry the river,shouting at
it with a new curse.
6. Puru and Turvasu
were as eager to attack,as fish out of water (are eager to get back into
water).The hurt and unhappy circle, from Bhrgu to Druhyu,friend had called
friend, to cross over from both sides.
7. On came the
Pakthas, the Bhalanas,calling Alinas, Visanins and Sivas.To the Arya’s aid, came
the singer Trtsu mercenaries,to support him with pleasure,
8. and the difficult
to cross, free flowing,unconcerned, uncontrollable Parusni (river).Great
spreading, regal, dropping down the mountains,full of cattle, regarded highly
by sages and poets.
9. They failed to
control her,the fast flowing swallowed them in her currents.Sudas had prayed to
Indra,to kill the unfriendly people talking derisively.
10. Sang to the lord,
the guardian, to avert losses,to make possible for his friend the heaping (of riches).Speedily
moving, sent down by force, the burning arrows,he (Indra) effectively warded
off with ease.
11. 21 kings of
various tribes, were killed,nay butchered or laid low.The wonderful waters were
granted freedom of the blockadeand let loose by Indra.
12. Under water went
old Kavasa, and Druhyu,cursing the Vajra holder (as they went down).We praise
the friend of friends,you sent down that Anu, who was unhappy with you.
13. Soon as the
speeding stream had caused havoc all over,Indra led bravely, overtaking and
scattering.Seeking a portion of all the wealth,even (cousin) Puru had joined
hands with the scoffers.
14. He too went to
long sleep,like Anu and Druhyu. Six thousandsix hundred and sixty six of
world’s most famous and celebrated heroes, were massacred.
15. Indra had consumed
Trtsu’s water,even though they were low on resources.Nevertheless, with a roar,
he drove out the unfriendly,capturing the worldly possessions of the
irreverent.
16. Half the warriors
succumbed to the bravery of Indra,the rest perished in the floods.Passionately,
Indra roared angrily,sent them down the course of destruction.
17. Holding
concentration, he eliminated them,like how a wildcat concentrates when hunting
down a Ram.(What happens to the booty and land won in the war? Vasistha asks
Indra. Let’s hear about his generosity.)Having selected just one quick brown
horse for himself,Indra has handed all the spoils, over to Sudas.
18. Indeed numerous
hostile enemy soldiers you subdued,on oath, tore through them, cut them down
and gave them death.The hymns of the sacrificers you listened to,you moved
forward leading with your swift bolt, o’ Indra.
19. Celebrate Indra,
the dam that others had built, he broke,and the enemy on both banks was washed
away.(News of Sudas’ victory has spread far and wide; some foreign countries
have sent emissaries to the function.)Aja, Sigru and Yakshu have joined the
celebrations,to pay tribute, they have brought in as presents,a selection of
their topmost, speedy horses.
20. No one is as respected
as you Indra,no king like you was seen before and will never be.Devak, the Son
of Manyamana, you had killed,certainly hurt Sambar, the coward.
21. For these deeds of
seizure and subduing,Parasar, Satayatu and Vasistha praise you, to enjoy your
enduring friendship,o’ bright as Sun, o’ fulfiller of desires.
(So Sudas is now
master of everything won in the war, except that one horse. How generous will
he be in turn? Vasistha goes up to him and asks.)
22. Sudas, the
grandson of Devavata, has given us 100 cows and a mare driven chariot.Fire is
the proof, Paijavan’s donation will always draw high praise.
23. All over,
Paijavan’s donation and bestowment are hereby decreed a deed indeed above
all.He occupies the top position amongst kings.He is a man amongst men. His
praise flows all over.
(The above praise is
not for the mere 100 cows, but for what Sudas has done with the kingdoms of all
the others that he has now become master of.)
24. These waters and the
land between these waters,portion by portion, he has divided and distributed
amongst all those who supported him.Hail Indra, he purged countless in the
war,he killed them and spread terror amongst the enemy.
(Not to leave out the
Marutas.)
25. The Maruta men
supported Divodasa’s descendant Sudas against his enemies.Those filled with
contempt for Sudas,who were said to be almost impossible to defeat, they were
either slaughtered or submerged indeed.
ఇందులో
సుదాసుడి పక్షం తమ ప్రాంతపు నైసర్గిక స్వరూపం తెలిసినవాళ్ళు కావడం చేత రావి నది మీద
ఒక వంతెన నిర్మించుకుని నది దాటినట్టు గానూ తర్వాత దానినీ నది గట్లని తెగగొట్టి శత్రువులని
జలదిగ్బంధనం చేసి హతమార్చినట్టుగానూ తెలుస్తున్నది!
యుద్ధంలో
విజయాన్ని సాధించేది సైనికబలం కాదు, వ్యూహనిర్మాణచతురతయే ముఖ్యం! సూక్తం తమకు ప్రాప్తించిన
విజయానికి ఇంద్రుడు కారణమని చెప్పి స్తుతించడం వల్ల కొందరికి సుదాసుడు వాతావరణం. ప్రకృతి
అనుకూలించి అదృష్టం వల్ల గెలిచాడు అనే అనుమానం రావచ్చు,కానీ అక్కడ సూక్తంలో కనబడుతున్న
దానిని బట్టి తాము పన్నిన వ్యూహం విఫలం కాకుండా ప్రకృతి శక్తులు కూడా అనుకూలించడం వల్లనే
వారు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారని అర్ధం అవుతున్నది.ఇటువంటి వ్యూహమే బ్రిటిషువాళ్ళకీ
ఫ్రెంచివాళ్ళకీ మధ్యన జరిగిన ట్రఫాల్గర్ యుద్ధంలో కూడా కనబడుతుంది.క్రీ.శ 1805లో
Admiral Lord Nelson 27 నౌకలతో Admiral Villeneuve నాయకత్వం వహించిన ఫ్రాంకో స్పానిష్
సంయుక్త దళాల 33 నౌకలతో తలపడ్డాడు.తన నౌకలలో ఒక్కదాన్ని కూడా పొగొట్టుకోకుండా శత్రువుల
232 నౌకల్ని మఠధ్వంసం చేసేశాడు - చదరంగపు బల్ల మీద సెంటర్ దగ్గిర ఉన్న శకటు పుట్టుగడిలో
ఉన్న మంత్రి కన్న బలమైనదవుతుందనే స్థానబలిమిని ఉపయోగించుకున్నాడు!
అక్కడ
బ్రిటిష్ సేనానీ ఇక్కడ సుదాసుడూ కూడా “శత్రువుల యొక్క అందరూ కలిసి చేసే ఒక్కుమ్మడి దాడి యొక్క భీబత్సం
గురించి మాత్రమే ఆలోచించి భయపడకుండా కేంద్రం దగిర ఉన్నవాడు దాడి చేసే కోణాన్ని కొంచెం
మారిస్తే చాలు అతి తక్కువ సమయంలో ఎక్కువమందిని చంపగలడు” అనే విషయాన్ని పట్టించుకోని
శత్రువుల తెలివితక్కువతనాన్ని ఉపయోగించుకుని గెలిచారు!
యుద్ధం తర్వాత ఏమైంది?
"The
vedic war is a question of values, not race. It is a conflict between spiritual
values and materialistic values, which occurs in all societies. Sometimes arya
becomes unarya by a change in values, as indicated in the battle of
sudas....Even names of famous kings, such as Dvodasa and Sudasa have ending of
dasa meaning servent. Sudas ruled the land of Sapta Sindhu, centered around the
mighty Sarasvati river, which flowed from Himalayas to Rann of Kutch. After the
battle of the Ten Kings, many indians migrated westwards into Iran and
beyond." అని వామదేవ శాస్త్రి(David Frawley) చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం.
దాశరాజ్ఞయుద్ధంలో
మన ప్రాచీనుల జీవన విధానంలోని ఒక కోణమైన సైనిక వ్యూహాలు మాత్రమే కనబడుతున్నాయి,కానీ
భరతుడు తన తర్వాత అసమర్ధులైన రక్తం పంచుకుని పుట్టిన కొడుకులని వదిలి ఎక్కడో తపస్సు
చేసుకుంటున్న ఒక ఋషిని ప్రార్ధించి రాజ్యాన్ని అప్పగించాడు - అతనికి ఒక ఋషి మీద అంత
నమ్మకం ఎట్లా కలిగింది?ఆంత ధీమాగా ఆ ఋషి మాత్రం ఎట్లా ఒప్పుకున్నాడు?వాళ్ళిద్దరి ధైర్యానికి కారణం అప్పటికే రాజ్యవ్యవస్థ పూర్తి
అమరికతో ఏర్పడి ఉండటమే - రాజు ఒక్కడే సర్వజ్ఞుడూ సర్వసమర్ధుడూ సర్వాంతర్యామీ కాదు!సభలు,
సమితులు అనే రెండింటిని గురించి వైదిక ఋషులు చెప్పారు.అప్పటి రాజసభలు ఇప్పటి చట్టసభల
పనినే చేస్తూ ఉందేవి.అప్పటి సమితులు ఇప్పటి కమిటీల వలెనే తాత్కాలిక సమస్యలని పరిష్కరించడం
కోసం ఏర్పాటు చేసేవారు.రాజనేవాడికి కొన్ని లక్షణాలని నిర్దేశించారు.ఆ రాజలక్షణాలు ఉన్న వ్యక్తి ఈ వ్యవస్థలని ఉపయోగించుకుని
పరిపాలన సాగిస్తే చాలు, ప్రజలు భయభ్రాంతులు లేకుండా సుఖశాంతులను పొందగలుగుతారు!
నేను
పైన ఒకచోట మొదట వశిష్ఠుడు సుదాసునికి పౌరోహిత్యపుమంత్రిత్వం అందిస్తూ ఉండేవాడనీ విశ్వామిత్రుడు
సుదాసునికి దగ్గరైన తర్వాత మంత్రిత్వం నుంచి తప్పుకున్నాడనీ చెప్పాను కదా, అది ఎట్లా
జరిగిందో తెలుసా?మొదట వశిష్ఠుడు కూడా అనార్య సంస్కృతులను ద్వేషిస్తూ ఉండేవాడు - దాశరాజ్ఞయుద్ధం
మొదలు అయ్యే సమయంలో. కొందరు చారిత్రకుల పరిశోధనాత్మకవిశ్లేషణ ప్రకారం విశ్వామిత్రుడు
ఇప్పటి యూరోప్(హరివర్షం!) ప్రాంతం నుంచి వలస వచ్చిన కాందిశీకుడు.అతను వశిష్టుడి సహాయం
కోరితే ఆశ్రయం ఇచ్చాడు.క్రమేణ వశిష్ఠుడు అనార్యుల పట్ల ద్వేషాన్ని తగ్గించుకుని వారి
సంస్కృతులని అధయ్యనం చెయ్యడం మొదలుపెట్టాడు.(Rigveda7.86 [2-7]) ప్రకారం అనార్య దేవతామూర్తులను
ఆర్యధర్మానికి దగ్గర చేశాడు.అతను ఈ ప్రయత్నాలలో ఉండటం వల్ల మంత్రిత్వానికి దూరమైనప్పుడు
విశ్వామిత్రుడు ఆ బాధ్యతలను స్వీకరించాడు.అంటే, ఇటువైపు విశ్వామిత్రుడు military
exponentగా వాళ్ళని ఓడించి నాశనం చేస్తుంటే అటువైపు వశిష్ఠుడు cultural ambassadorగా
వాళ్ళ సంస్కృతిని అధ్యయనం చేస్తూ తర్వాత కాలపు భారతీయ సమాజం పాటించిన జీవధారకు అవసరమైన
రెండు పరస్పర విరుద్ధమైన భావధారలను వృద్ధి చేసి సుదాసుని విజయం తర్వాత వీటిని సమన్వయించి
కొత్త సంస్కృతిని సృష్టించారు.
ఈ
కొత్త సంస్కృతిని పాటించిన ఏ రాజూ కొత్త ప్రాంతాలని ఆక్రమించడంలో కేవలం విస్తరించడానికే
ప్రయత్నించారు తప్ప స్థానిక సంస్కృతులను నాశనం చెయ్యలేదు.క్రీ.శ 1వ శతాబ్దిలో అరేబియా
ఖండం వరకు జైత్రయాత్ర చేసి మక్కా గుడిని నిర్మించిన విక్రమార్క మహారాజు గానీ నేటి కంబోడియా
ధాయిలాండ్ వంటి ప్రాంతాలకు తరలివెళ్ళి రాజ్యస్థాపన చేసినవారు గానీ సనాతనధర్మాన్ని పరిచయం
చెయ్యడమే తప్ప స్థానిక సంస్కృతులను నాశనం చెయ్యకపోవడానికి వశిష్ఠ విశ్వామిత్రుల సమిష్ఠి
కృషి ఫలితమైన సంస్కారమే కారణం!
పూర్వకవులు
రామాయణ,భారతాల స్థాయిలో ఇతిహాసం అనిపించుకోదగిన దీనిని ఎందుకు వదిలేశారో తెలియదు గానీ
పట్టించుకుని కధాకావ్యం వలె మలిచినట్లైతే ఇదే మొదటి ఇతిహాసం అయి ఉండేది! రామరావణయుద్ధం
రాముడికి సీతని సాధించి పెట్టింది,కురుపాండవయుద్ధం పాండవులకి తమ రాజ్యాన్ని సాధించి
పెట్టింది - కానీ దాశరాజ్ఞయుద్ధం విస్తారమైన గంగా-సింధు మైదాన ప్రాంతం మీద భరత వంశానికి
చెందిన సుదాసుడికి ఏకచ్చత్రాధిపత్యం సాధించి పెట్టటమే కాక సుదాసుడికి భయపడి దూరతీరాలకి
వెళ్ళినవాళ్ళ వల్ల నేల నాలుగు చెరగుల ఇక్కడి సంస్కృతి వ్యాపించడానికి దారులు వేసింది!
ఉపసంహారం:
బంధుత్వాలని
కూదా చూడకుండా సుదాసుడి మీదకి వచ్చినవాళ్ళు ఖచ్చితంగా భౌతిక సుఖాల కోసం నైతికతకి సెలవిచ్చిన
ధర్మద్రోహులే!ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రతివాడూ సుదాసుడి విజయాన్ని తమ విజయంగానే
భావిస్తాడు - అది సహజం!అంతే కాదు, నిన్నా నేడూ రేపూ "అన్ని కష్టాలూ నాకే రావాలా?ఒక్కడినీ
ఇని కష్టాలని ఎలా గట్టెక్కను!" అని అలమటించే ప్రతి మధ్యతరగతి కుటుంబీకుడూ సుదాసుడే
అవుతున్నాడు.
ఇవ్వాళ
మొత్తం ఆంధ్రదేశమే సుదాసుడు నిలబడిన దశరాజ్ఞ వ్యూహంలో ఇరుక్కుపోయి ఉంది.విభజన బిల్లుని
ఎట్లా రూపొందించాలో కూడా తేలియని అజ్ఞానం.అహంకారం,అనౌచిత్యం రూపు దాల్చిన మదోధ్ధురులు
అడ్డంగా ఒక గీత గీసేసి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అనంతకాలం వరకూ తిట్టుకుంటూ గడపటానికి
కావలసినన్ని బొక్కల్ని పెట్టి వదిలేశారు!మాతృరాష్ట్రం అనేపాటి కనీసపు సంస్కారం లేకుండా
అవశేషం అని అవమానించారు!
ఆంధ్రప్రాంతపు
వోట్లు అక్కరలేదనుకున్నదో లేక తమ ప్రాంతానికి అన్యాయం జరిగే దరిద్రగొట్టు విభజనలో తమ
పార్టీ ప్రమేయం కూడా ఉన్నదని తెలిసిన ఆంధ్రావాళ్ళు అడిగినా వెయ్యరనుకున్నదో అసలు విభజన
తర్వాత ఆంధ్ర ప్రాంతం బతికి బట్టకట్టదని అప్పటికే నిర్ధారణ ఆయిపోయందో ముందే బతకనివ్వకూడదని
వ్యూహప్రకారమే విడగొట్టారో గానీ చిన్నమ్మ నన్ను గుర్తుంచుకోమని తెలంగాణనే అడిగింది!బిల్లులో
ఉన్న లోపాలని అమలుచెయ్యలేని చెడ్డపేరు మనకి దేనికి అని చెప్పిన కురువృద్దుణ్ణి అవహేళన
చేసి అది అక్రమవిభజన అని తెలిసీ సహకరించారు!
ఎవరూ
అడక్కపోయినా తల్లిని చంపి పిల్లని పుట్టించారని సెంటిమెంటు వొలకబోసిన పెద్దమనిషి అసలు
సాయం చెయ్యాల్సిన సన్నివేశంలో కుండెడు నీళ్ళూ చెంబెడు మట్టీ ఇచ్చి పోయాడు! మాకూ ఆంధ్రాకి
సాయం చెయ్యాలనే ఉంది గానీ ఆంధ్రాకి సాయం చేస్తే దేశంలో కల్లోలం వస్తుందని భయపడుతున్నాం
అని కూసినవాళ్ళు వాళ్ళ భయానికి కారణాలు చెప్పలేదు!చట్టప్రకారం ఇవ్వాల్సిన 10 రూపాయలు
అడక్కపోతే దొడ్డిదారిని 20 రూపాయలు ఇస్తామనే పోరంబోకు మాటకి అర్ధం ఏమిటో అడిగినవాడు
ఒక్కడూ లేడు!
అడగాల్సిన
ఒకే ఒక్కడూ ఈ నాలుగేళ్ళూ వాళ్ళ చంకనే ఎక్కికూచుని వాళ్ళ భుజం మీదనే తల పెట్టుకుని లాలి
పాటలు పాడించుకుంటూ నిద్రపోయి ఇప్పుడు నిద్రలేచి ఒళ్ళు విరుచుకుని ఆవులించి మళ్ళీ అసమన్యాయం
ఏడుపుపాట అందుకున్నాడు!ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి కుర్చీ తప్ప ప్రజల కష్టాలు
కనపడటం లేదు - అధికార పక్షం తప్పుల్ని ఎండగట్టాల్సిన అవకాశం వచ్చినప్పుడు చేజేతులా
సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ నవ్వులపాలు అవుతున్నాడు!
అందర్నీ
ప్రశ్నిస్తానని బయల్దేరిన శ్రంగార పవనుడికి ప్రజలు తనని అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు
చెప్పటానికే ముఖం చెల్లటం లేదు! నిన్నటివరకు తన మంత్రివర్గంలో కూదా భాగమైన ఒక మిత్రపక్షం
హఠాత్తుగా మీ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తున్నదని తనమీద అవిశ్వాసం పెడుతుంటే కనీసం
ఎక్కడ పొరపాటు జరిగిందో పరీశీలించుకుని దాన్ని పరిష్కరించుకుందామనే స్పందన కూడా చూపించకుండా
"ఈ ఆంధ్రాగొట్టాంగాళ్ళు ఎంత గోల చేస్తే నాకేంటి?వీళ్ళవోట్లతోనే నేను అధికారంలోకి
నిన్న వచ్చానా, రేపు వస్తానా!" అన్నంత నిర్లక్ష్యపు అహంభావాన్ని చూపిస్తున్నాడు!
జాతీయ
ప్రాంతీయ రాజకీయ పార్టీలు అన్నీ తమ రాజకీయ దురాశలతో ఆంధ్రప్రజల్ని సుదాస పైజవనుడి స్థానంలో
నిలబెట్టారు - ఏ ప్రతికూలతలని చూసి శత్రువులు ఉత్సాహం పొందారో వాటినే అనుకూలతలుగ మార్చుకుని
గెలిచిన నాటి సుదాస పాంచాలుడి లాగే ఆంధ్రులు కూడ స్వయంకృషినీ దైవశక్తినీ నమ్ముకుని
ఆంధ్రా ది గ్రేట్ అనిపించాలి!
గతంలోని
వీరవరుల్ని స్మరించుకుని పులకించని జాతినుంచి ఆగతాన్ని సుందరతరం చేసే వీరవరులు ప్రభవించరనేది
చరిత్ర మళ్ళీ మళ్ళీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్న కఠిన సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ
అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం
శివం సుందరం!!!