ఒక వైపున పనిభారం,ఇంకోవైపున ఇస్లాం గురించిన వ్యాసపరంపరకు కావలసిన రీసెర్చిలో పడి ఒక
ముఖ్యమైన విషయం గురించి రాద్దాం రాద్దాం అనుకుంటూనే ఒక చిన్న కామెంటుని మాత్రం
ఫీలరుగా వొదిలి తర్వాత విషయం పాతబడి పోయి ఉంటుందని
వొదిలేశాను.తీరా చూస్తే ఎప్పుడూ రాముడి మీద పజ్యాలు రాసుకుంటూ అంతే నాకు చాలు అని సరిపెట్టుకునే శ్యామలీయం ఒక పెద్ద నిరసన పోష్టు రాసెయ్యటం,దాని దగ్గిర ఎడాపెడా కామెంట్లతో పెద్ద చర్చ కూడా జరిగిపోయింది!
మొదట వనం వారికి ఒక చిన్న ప్రశ్న
వేస్తున్నాను.ఆయన రామాయణ కధారచనకి సరళతరమైన అనువాదం కూడా చేస్తున్నారు.ఆ రాముడి పేరుతోనే రామరాజ్యానికి
సంబంధించినదిగా చెప్తున్న ఒక పిట్టకధ ఉంది.ఇది అసలు వాల్మీకి రామాయణంలోనూ ఉత్తర
రామాయణంలోనూ ఉందో లేదో నాకు తెలియదు.ఈ దేశంలో ప్రతిదాన్నీ రామ నామాంకితం చెయ్యటం
పండితుల నుంచి పామరుల వరకు చేస్తూనే ఉంటారు.ఏదైనా నీతికధ చెప్పాలనుకుంటే దాన్ని
తీకుకెళ్ళి రాముడికి తగిలిస్తే చాలు వినేవాళ్లకి ఎముక మూలగలోకంటా ఎక్కేస్తుందని
చాలామందిలో ఒక మూఢనమ్మకం ఉంది!
ఒకనాడు ఒక కుక్క ఒక పెద్దమనిషిని
రాముడి దగ్గిరకి తీసుకొచ్చి నేరారోపణ చేసింది.తన పాటికి తన కుక్కబతుకేదో తను
బతుకుతుంటే వుత్తి పుణ్యానికి తనని హింసించాదని ఆరోపణ.నేరం రుజువైంది,కానీ ధర్మశాస్త్రాలు అన్నీ మనుషుల కోసం రాసినవి గాబట్టి కుక్కని
హింసించిన వాళ్లకి వెయ్యాల్సిన శిక్షలు లేకనో యేమో రాముడు ఆ కుక్కనే అడిగాడు,"ఏ శిక్ష వెయ్యమంటావో నువ్వే చెప్పు!" అని.దానికి కుక్క ఏదైనా ఒక
అలయానికి ధర్మకర్తగా వెయ్యమంది.ఇదేమి తిరకాసో రాముడికే అర్ధం
కాలేదు."భగవత్సేవకి నియోగించటం శిక్ష ఎలా అవుతుందబ్బా!" అని ఆయనకీ
అనిపించి ఉండవచ్చు - కుక్కనే అడిగాడు.దానికి కుక్కగారు,"అయ్యా!గతజన్మలో నేనూ ఒక ఆలయానికి ధర్మకర్తనే.కక్కుర్తి కొద్దీ దేవుడి
సొమ్ము సొంతానికి వాడుకున్నాను.అందుకే ఈ జన్మలో ఈ బతుకు దక్కింది.వీడికీ అదే
జరిగీతే చెల్లుకుచెల్లు హళ్ళికిహళ్ళి అవుతుంది - నా కక్ష తీరుతుంది, వీడి రోగం కుదురుతుంది!" అని చెప్పింది.కధని కల్పించిన రచయిత
ఇందులో చాలా నీతుల్ని ఎక్కించాడు - ఒక సామాన్యుడు చేసిన తప్పునే అసామాన్యుడు
చేస్తే శిక్ష కూడా అధికంగా ఉంటేనే సమన్యాయం అవుతుంది,మందిసొమ్ముని సొంతానికి వాడుకోవటం ఎవరు చేసినా పాపమే - ఇత్యాదయః చాలా నీతుల్ని ఒక
చిన్న కధలో ఇమిడ్చాడు!
ప్రభుత్వాధికారిగా ఉన్నందువల్ల తమ
ప్రభుత్వం చేసిన తప్పును సమర్ధించుకోవాల్సిన దుస్థితి వనం వారిది - దానికి నేను
సానుభూతి వ్యక్తం చేస్తున్నాను!ఆయన రాస్తున్న రామాయణం చదివి ఆనందిస్తున్న నేను ఆయన్ని
నేను క్రూరంగా విమర్శించలేను - కానీ అది ఖచ్చితంగా తప్పే!నేను కొత్తగా వాదనల్ని వింపించాల్సిన అవస్రం లేదు - శ్యామలీయం వ్యాసంలో చేసిన వాదనా జై గొట్టిముక్కల వ్యాఖ్యలలో చేసిన
ప్రశ్నాపూర్వకప్రతిపాదనలూ చాలు.అసలు విషయానికి సంబంధించిన తీర్పు అయిపోయింది గానీ
కొసరు విషయం మాత్రం - అక్కద కేసీయార్ చేసినదాన్ని ప్రముఖహిందూబ్లాగర్లు
అరిభీకరంగా సమర్ధించటం - వింతగా అనిపించింది!
ముస్లిముల హజ్ యాత్రకి ప్రభుత్వం
డబ్బిస్తే అది సెక్యులరిజమా,హిందూ అలయానికి ఆభరనాలు ఇస్తే మతతత్వమా
అనే సవాలు విసురుతున్నారు!అంటే ముస్లిములకి హజ్ యాత్రకి డబ్బివ్వతాన్ని వీఉ ఆనాడు
వ్యతిరేకించి ఈనాడు హిందువుల ఆలయానికి ఆభరణాల్ని సమర్పించటాన్ని సమర్ధించటం ద్వారా
వీరిని వీరు ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు?హజ్ యాత్రకి
డబ్బివ్వటం వల్ల ఏం జరిగిందో తెలుసా?1950ల నాడు హజ్ యాత్రికులు చాలా తక్కువమంది ఉండేవాళ్ళు.హజ్ యాత్ర మొత్తం హిందూ సంప్రదాయమే,ఇస్లాము మతం పుట్టకముందు అది హిందూ దేవాలయమే,ప్రవక్తగా
మారకముంది అహ్మద్ ఖురేషీ కూడా మక్కా మందిరం చుట్టూ సవ్యదిశలోనే ఏడు ప్రదక్షినలు
చేసేవాడు - అన్ని ఖురేషీ ప్రార్ధనా విధుల్నీ పాటించేవాడు!కొత్త మతాన్ని స్థాపించాక
కూడా వాటినే కొనసాగించాడు,కానీ ప్రాధాన్యతని
అత్గ్గించాడు.తప్పనిసరి తద్దినంగా సంవత్సరాని కొకసారి అని ఉంచేసి విగ్రహారాధనని
తీవ్రంగా వ్యతిరేకించాడు.అంతర్జాతీయంగా షియా,సున్నీ అనే ప్రముఖమైన భెదాలతో పాటు అరబిక్ ఇస్లాం,ఇండిక్ లేదా వైదిక్ ఇస్లాం అనే మరొక విభజన కూదా తయారైంది ఉపఖండంలోని
అన్ని ప్రభుత్వాలూ పోటీపడి హజ్ యాత్రలకి ప్రోత్సాహకాలు ఇవ్వటం వల్ల!
పక్కనే ఉన్నా అరబ్బులు ఎక్కువగా హజ్
యాత్రకు అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కాదు,మనవాళ్ళు మాత్రం ప్రభుత్వం
దబ్బిస్తున్నాది కదాని ఎగేసుకు పోయేవాళ్ళు.ఆ మధ్యన మక్కాలో మందిరానికి అతి
దగ్గిరగా పేలుళ్ళు జరిగితే చాలామంది ఇండిక్
ఇస్లాం మేధావులు ఖంగారు పడ్డారు!ఆ పని చేసింది అరబిక్ ఇస్లామును
పాటించేవాళ్లు,చేసింది ఈ వైదిక పద్ధతులు నచ్చక!ఆ రకంగా హజ్ యాత్రలకి డబ్బివ్వటం వల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరిగింది.మరి హిందువులు కూడా పులిని చూసి
వాత పెట్టుకున్న నక్కలా ఇవ్వాళ అదే తప్పు చేసి రేపు అదే రకం బురద నెత్తిన రుద్దుకోవాలా?సెక్యులరిజం అనే డొల్ల సిద్ధాంతాన్ని పాటించకపోతే పోనివ్వండి,సనాతన ధర్మం చేప్పే సర్వధర్మసమభావనకీ తూట్లు పొడవడం దేబికి? హిందూమతం మీద దాడి జరుగుతున్నది అనేది వాస్తవమే!కానీ ఆ బూచిని
చూపించి కొత్తగా పక్షపాతం అలవాటు చేసుకోవడం అనవసరం - తమ్ముడు తనవాడైనా ధర్మమే
చెప్పాలి!
తొక్కలో డెమోక్రసీ!తొక్కలో
సెక్యులరిజం!తొక్కలో హిందూత్వం - ధర్మం అన్నిటికన్న ముఖ్యం!!