నేను గతంలో సూచనగా చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించిన మిత్రులకు ముందుగా ధన్యవాదాలు!ఇప్పటికి అప్లికేషన్ పూర్తిచేసి లైవ్లో ఉంచగలిగాము.ఇది మన సంప్రదాయకమైన తెలుగు పంచాంగం మీద ఆధారపడింది - వంగిపురపు వారి వెర్షన్ చూపిస్తున్నాం ఇందులో.
ఇవ్వాళ మనం ఉన్న కాలం చాలా భిన్నమైనది.ఒకే ఒక ఉదాహరణ:మామూలుగా రోజువారీ పనుల్లో ఇంగ్లీషువాళ్ళు అలవాటు చేసిన గ్రెగేరియన్ క్యాలెందరు వాడుతున్నాం,కానీ మన పండగలు ఎప్పుడొస్తాయో తెలుసుకోవాలనుకున్న చిన్న చిన్న విషయాలకీ ఏదైనా ముఖ్యమైన పని శుభప్రదంగా జరగాలంటే ఎప్పుడు మొదలుపెట్టాలి అనే పెద్ద పెద్ద విషయాలకి తప్పనిసరిగా పంచాంగమే చూడాలి.ఈ రెంటికీ చాలా చాలా తేడాలు ఉన్నాయి.ఇంగ్లీషువాళ్లకి సంవత్సరం ఒక అంకె మాత్రమే,నెల అంటే ఏదో ఒక పేరు మాత్రమే,మళ్ళీ తేదీ కూడా ఒక సంఖ్య మాత్రమే.ఇక కాలం విషయానికి వస్తే గంటలు,నిమొషాలు,సెకండ్లు - అంతే!మనకి అట్లా కాదు,ప్రతి సూక్ష్మమైన వివరానికీ ఎంతో ప్రత్యేకత ఇచ్చిన ఒక సంక్లిష్టమైన కాలగణనశాస్త్రం ఉంది ఇక్కడ!మీరు మరీ గందరగోళం పడిపోతారని ఎక్కువగా చెప్పను గానీ భూగోళశాస్త్రం, ఖగోళశాస్త్రం, భౌతికశాస్త్రం, కాలస్వరూపం, వాస్తు, జ్యోతిషం - ఇవన్నీ వేరువేరు కాదు మనవాళ్ళకి!మన పండగలనే తీసుకోండి - ప్రతి పండుగా ఏదో ఒక ఋతువుకీ కాలానికీ మొదలో చివరో వస్తూ గట్టిగా కలిసిపోయి ఉంటుంది.గ్రహతారకాదుల చలనాన్ని బట్టి నిర్ణయించిన కాలప్రమాణాలు మనవి.మన కుర్రాళ్ళు హాప్పీ హాప్పీ న్యూ యియర్ పేరుతో డిసెంబర్ 31 కీ జనవరి 1కీ మధ్యన తాగి తాగి తందనాలాడుతూ వెర్రెత్తి పోవడానికి కేవలం తేదీ మారటం తప్ప ఇతర ప్రాముఖ్యత ఏమైనా ఉందా?లేదు గాక లేదు!కానీ చైత్ర మాసారంభపు ఉగాది అట్లా కాదు,అప్పటి తారాలోకపు విశేషాల దగ్గిర్నుంచీ భూమి మీద వాతావరణంలో జరిగే మార్పుల వరకూ ప్రతిదీ విశేషమే,అయినా ఉత్సాహం ఉండటం లేదు!
హిందువైన ప్రతి వ్యక్తికీ పంచాంగం అవసరమే,కానీ మొత్తం పంచాంగ గణితమంతా తెలుసుకోనక్కర లేదు - సిద్ధాంతులు వ్రాసి ఇచ్చిన పంచాంగం చూసుకుంటే చాలు.మళ్ళీ ఇక్కడ అవన్నీ గ్రిగేరియన్ క్యాలెండరు సాయంతో చెబితేనే అర్ధం అయ్యే పరిస్థితి ఉంది.అదీ సిద్ధాంతులే చేసారు - బేసిక్స్ తెలుసుకుని ఆ క్యాలెందరు చూస్తే సరిపోతుంది.కానీ ఎంత ఆసక్తి ఉన్న వ్యక్తి అయినా ప్రతిచోటుకీ పంచాగం మొత్తాన్ని తీసుకుపోలేడు గదా!ఆ సులువునే ఈ అప్లికేషను మీకు ఇస్తుంది.పంచాగంలో ఉండే మొత్తం సమాచారాన్ని ఒకేచోట ఇరికించకుండా విడగొట్టి వేర్వేరు చోట్ల చూపించడం మిగతావాటికన్నా "శ్రీకృష్ణ తెలుగు క్యాలెండరు"కి ఉన్న ప్రత్యేకత.
మీరు పైన ఉన్న యాప్ పేరుగా ఉన్న లింకును క్లిక్ చేస్తే గూగుల్ ప్లేస్టోర్ మీకు యాప్ వివరాలను చూపిస్తుంది.ఇన్స్టాల్ చేసుకున్నాక ఐకాన్ మీద నొక్కితే మొదట బటన్లతో నిండిన మెయిన్ మెను కనబడుతుంది.
ఇందులో పైవరసలో ఉన్న మూడు బటన్లూ క్యాలండరుకు సంబంధించినవే!మొదటిది ఆ బటన్ మీద ఉన్న బొమ్మ చూపిస్తున్నట్టు ఆ నెలమొత్తాన్ని చూపిస్తుంది.మామూలుగానే అన్ని డైనమిక్ క్యాలెందర్ల మాదిరే ఆరోజుని ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంది.ముఖ్యమైన శెలవుల్నీ చూపిస్తుంది.దిగువన ఆ నేలలోని పండుగల్నీ ప్రతయేకమైన రోజుల్నీ చూపిస్తుంది.
చూశారుగా,పైన గ్రెగరియన్ క్యాలెండర్ నెల దాని కింద త్గెలుగు నెల పేరు ఉంది కదా.దానికి అటూ ఇటూ మామూలుగా అన్ని అప్లికేషన్లన్లో ఉండే prev మరియు next బటన్లు.పసుపురంగులో మొత్తం నెలలోని అన్ని తేదీలూ ఉన్నాయి.మీరు ఏరోజున ఓపెన్ చేస్తే ఆరోజు నీలం రంగులో కనిపిస్తుంది.ప్రత్యేకమైన రోజులు జేగురు రంగులో కనిపిస్తున్నాయి.ఇంక ఆరోజుకి సంబంధించిన తిధి,వార,అనక్షత్ర వివరాలు రెండు బ్లాకులుగా విదగొట్టి ఎడమవైపున వారం, దానిమీద ఆధారపడిన రాహుకాలం, యమగందం, దుర్ముహూర్తం చూపిస్తూ కుడివైపున తేదీనీ దానిమీద ఆధారపడిన మాసం, తిధి, నక్షత్రం, వర్జ్యం చూపిస్తున్నాము.తిధి నక్షత్రాలు చూపించే బ్లాకులో కుడి పక్కన పైమూలలో కనిపిస్తున్న అంకె శాలివాహన సకపు ఆ మాసం యొక తేదీ. సాధారణంగా పంచాంగం ప్రకారం ప్రతి నెల అమావాస్య త్ర్వాత వచ్చే శుద్ధ పాడ్యమి నుంచి మొదలై నెల మధ్యలో పౌర్ణమి వచ్చేటట్టు ఉండి బహుళ చతుర్దశి తర్వాత వచ్చే అమావాస్యతో పూర్తి అవుతుంది.ఈ కాలనిర్ణయం శక సంవత్సరంతో కూడా పూర్తిగా కలిసి ఉందదు.అందుకని ప్రతి గ్రిగెరియన్ నెల మొదటి తేదీనా మరియు శక కాలమానంలో నెల మారి 1వ తేదీ వచ్చేటప్పుడూ శకమాసం పేరులోని మొదటి అక్షరాన్ని మాత్రం బ్రాకెట్లో ఇచ్చాను.ఆ నెలలో వచ్చే పండుగలు చూడాలంటే స్క్రోల్ చేసి చూడాలి.పైన నెల పేరు ఉన్న నీలపు బార్ మీద టచ్ చేస్తే తెలుగు సంవత్సరమూ ఋతువుల వివరాలతో వేరే స్క్రీన్ కనబడుతుంది.మళ్ళీ ఆ స్క్రీన్ మీద ఎక్కడ టచ్ చేసినా చాలు వెనకటి స్క్రీన్ వస్తుంది!
ఇంక శుభసమయాలు క్లిక్ చేస్తే మొత్తం సంవత్సరంలో ఉన్న శుభసమ్యాల లిస్టు వస్తుంది - చాలా మామూలు స్క్రీన్!కాకపోతే, స్క్రీన్ మీరు క్లిక్ చెసినప్పటి రోజును హైలైట్ చేసి చూపిస్తుంది.అయితే, మొత్తం 365 రోజుల శుభాశుభాలనూ పైకీ కిందకీ స్క్రోల్ చేసి చూసుకోవచ్చు.
మాస ఫలితాలు అనెది రాశిని బట్టి చూస్తారు.ఇక్కడ పన్నెండు రాశులనీ చూపితూ ఏ రాశివారైనా తమ రాశిని క్లిక్ చేస్తే ఆ రాశివారికి ఆ మాసానికి సంబంధించిన మంచిచెడుల ఫలితం కనబడుతుంది.నెల మొదట్లో ఆ నెలకి సంబంధించిన వివరాలే కనబడినా 20వ తేదీ తర్వాత ఇప్పటి నెలకి మరియు వచ్చే నెలకి సంబంధించిన వివరాలు కూడా కనబడతాయి.
క్యాలెండరుకి సంబంధించిన డాటా అంతా సిద్ధాంతిగారు ఇచ్చింది ఇచ్చినట్టు బ్లాకులుగా విడగొట్టి చూపించడం తప్ప నేను ప్రత్యేకించి కష్టపడి సొంతంగా చేసింది ఏమీ లేదు.కానీ దేవాలయాలు,పరిహారాలు,శుభాకాంక్షలు/సుభాషితాలు,సామెతలు అనే సెక్షన్ల మొత్తం కంటెంటు అంతా నేను తయారు చేసిందే. ఇంక మెయిన్ మెనులో రెండో వరస మొదటి బటన్ పూర్తిగా నా సొంతం!
ఇది దేవాలయాలకి సంబంధించిన విభాగం.పంచాంగానికీ దేవాలయలకీ సంబంధం ఏమిటని మీకు సందేహం రావచ్చు,కానీ మొదటే చెప్పానుగా మన సంప్రదాయంలో అన్నిటికీ సంబంధం ఉంటుందని!ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞులు ఐన్స్టీన్ లాంటివాళ్ళు చెప్పడానికి చాలాముందుగానే స్థలానికీ కాలానికీ అభేదం చేప్పేశారు.కాలంలో కొన్ని తిధులు ఎలా ప్రత్యేకమైనవో కొన్ని స్థలాలకీ ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇక్కడ చూపించే దేవాలయాలని మూడు రకాల లిస్టులుగా విదగొట్టాను,పైన కనిపించే మూడు ట్యాబ్ బటన్లలో మొదట default listలో అన్ని ఆలయాలూ వస్తాయి,popular ట్యాబ్ నొక్కితే ఎక్కువ పాప్యులర్(మేము అనుకుని సర్వర్ డాటాబేస్ లిస్టుని మార్చినదాన్ని బట్టి) అయిన ఆలయాలు మాత్రం వస్తాయి.మూడో ట్యాబ్ బటన్ నొకితే మొదట శివుడు,విస్ణువు,సరస్వతి,శక్తి లాంటి మాస్టర్ లిస్టు వస్తుంది.వాటిలో ఒకదాన్ని క్లిక్ చస్తే ఆ క్యాటగిరెకి సంబంధించిన ఆలయాల లిస్టు వస్తుంది.అన్ని చోట్లా చివరి లెవెల్ మీరు ఆఖరున ఎంచుకున్న ఆలయానికి సంబంధించిన వివరాలతో టార్గెట్ స్క్రీన్ వస్తుంది.ఇక్కడ ఆలయం చరిత్ర,ఆలయ విశేషాలు,ప్రత్యేక పూజలు వంటివి వివరంగా చెప్పాను.దానికి తోడు ఆలయం ఎక్కడ ఉంది,ఎలా చేరుకోవాలి అనేది కూడా చెప్పాను.వచనం అందరికీ అర్ధమయ్యే శైలిలో చక్కని పదబంధాలతో ప్రవాహవేగంతో చదివించేలా,చదివిన కొద్దీ భక్తిభావం ఇనుమడించేలా ఉంటుంది!
ఏ ఆలయానికి సంబంధించిన వివరం అయినా మీకు నచ్చితే లిస్టులో కుడిపక్కన ఉన్న లింకు దాన్ని షేర్ చెయ్యడానికి వీలు కల్పిస్తుంది. మెయిన్ మెనులో తర్వాతి బటన్ పరిహారాలు అనేది కూడా ఒకవిధంగా ఆలయాలకి సంబంధించినదే.ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే,హిందువులకి కొన్నిసార్లు ప్రత్యేకమైన దోషపరిహారపూజలు చెయ్యాల్సి వస్తుంది - సర్పదోషం, గ్రహపీడ, వివాహప్రాప్తి, సంతానయోగం, ఐశ్వర్యప్రాప్తి, ఆయురారోగ్యం లాంటివి కొన్ని ఆలయాల్లో చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అలాంటి ఆలయాల్ని పరిహార పూజల ప్రకారం చూపిస్తున్నాము.బటన్ నొక్కితే మొదట ప్రత్యేకపూజ/పరిహారం పేర్లు వస్తాయి.వాటిలో ఒకదాన్ని క్లిక్ చేస్తే ఆ పూజల్ని ప్రత్యేకంగా జరిపించే ఆలయాల లిస్టు వస్తుంది.ఉదాహరణకి కాలసర్ప దోషం/రాహుకేతు గ్రహదోషం పూజలకి కాళహస్తి ప్రత్యేకం - ఇట్లా ఆసక్తిని బట్టి తెలుసుకోవచ్చు.
మెయిన్ మెనులో తర్వాతి బటన్ శుభాకాంక్షలు/సుభాషితాలు మెను అనేది కేవలం వాటిని చూసి సరిపెట్టుకోవటానికి కాకుండా వాటిని మీరు మీ స్నేహితుల్లో ఎవరికయినా సందేశాలుగా పంపించుకునే వీలు కూడా ఉంది.
లోపలికి వెళ్ళాక కుడివైపున ఉన్న బటన్ నొక్కి మీ స్నేహితులకి సందేశం పంపించవచ్చు.అది వారికి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది.మెయిన్ మెనులో తర్వాతి బటన్ సామెతలు కూడా దాదాపు ఇలాంటిదే.ఇక్కడ ఒక్కొక్క సామెతనీ వూరికే చూపించి వొదిలెయ్యకుండా,అర్ధం వివరించి,ఎక్కడ ఎట్లా ఉపయోగిస్తే బాగుంటుందో సూచన/ఉదాహరణ కూడా ఇచ్చాను.
ఇంక మెయిన్ మెనులో తర్వాత వచ్చే చేయవలసినవి మరియు జ్ఞాపికలు అనే రెండు మెనూలు ఈ యాప్ ద్వారా మీరు రిమైండర్స్ తయారు చేసుకోవటానికి పనికి వస్తాయి.అవన్నీ లోపల వెబ్ డాటా ఇన్పుట్ ఫారంస్ మాదిరిగానే ఉంటాయి.మిగిలిన రెందు మెనూలు ఈ యాప్ మీకు నచ్చితే సోషల్ మీడియా ద్వారా ఇతర్లకి దీని గురించి చెప్పటం కోసం పెట్టినవి.
ఇంతకన్నా ఎక్కువగా చెబితే బోరు కొడుతుంది.ఏ అప్లికేషన్ అయినా అతిగా వ్యాఖ్యానించి చెప్పకుండా ఉపయోగించే వ్యక్తి తనంతట తను తెలిసుకోగలిగితేనే అది మంచి అప్లికేషన్ అవుతుంది.చూడగానే అర్ధం అయ్యి ఉపయోగించుకోగలిగినప్పుడే తయారీదారు కొనుగోలుదారుడి అవసరాన్ని తీర్చగలిగినట్టు - ఒక కొనుగోలుదారుడిగా నేను కూడా అందుకు భిన్నం కాదు!ఆ లక్షణం ఇందులో ఉందనే విషయం మీద్వారా తెలిస్తే నాకు సంతోషం.లోపాలు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం,అయినా మీకు కనిపిస్తే చెప్పండి - వీలున్నంత తొందరగా వాటిని సరిచేస్తాం.ఏవైనా సామెతలు అందులో లేనివి,ఉంటే బాగుంటుందనిపించినవి మీరు ఉదహరిస్తే వాటినీ కలుపుతాం.సామెతల్ని నేను కేవలం లిస్టుగా ఇచ్చేసి వూరుకోలేదు,మొత్తం యాప్ హిందువుల జీవన విధానంలో అతి ముఖ్యమైన ఆలోచనా ధోరణిని తీర్చిదిద్దే అంశాలని క్రోడీకరించి చూపిస్తునాము కాబట్టి కంటెంట్ కేవలం నా స్వంతమే ఉండాలి అనే అహంకారం నాకు లేదు..శుభాకాంక్షలు/సుభాషితాలు విభాగంలో కూడా మీరు ఇచ్చిన సూచనల్ని తర్వాతి వెర్షన్లో చేర్చి యాప్ మరింత సమగ్రమైనదిగా ఉండేలా చూస్తాను.
మీ అరచేతిలో ఇమిడిపోయిన పంచాంగం ఈ శ్రీకృష్ణ తెలుగు క్యాలెండర్ యాప్!
ధన్యవాదాలండీ. ఒక సూచన . ఇది భారత్ కాలమానం ప్రకారం తయారు చెయ్యబడింది అని అనుకొంటున్నాను. ప్రవాస భారతీయుల సౌకర్యార్థం భౌగోళికమైన మార్పు చేసుకొనే సౌకర్యం కూడా ఉంటే బాగుంటుందని నా సూచన
ReplyDeleteమీ సూచన బాగుంది!అయితే,ప్రాంతాన్ని బట్టి ప్రత్యేకించి చెప్పాలంతే ఒక్క ఆంధ్రాలోనే పది వెర్షన్లు చూపించాల్సి వస్తుంది.పంచాంగం యొక్క గణితం మొత్తం తిధి మీదా నక్షత్రం మీదా ఆధారపడి ఉంటుంది.మధ్యలో కొన్ని స్థిరాంకాలని వేసి సరిచూసుకునే సంక్లిష్తత ఉంది. కానీ ఇవన్నీ సూర్యచంద్రుల ఊద్యాస్తమయాల మీద ఆధారపడి ఉంటాయి.కాబట్టి ప్రవాస భారతీయులు ప్రస్తుతానికి తమ ప్రాంతంలో సాపేక్షంగా ఆయా గ్రిగరియన్ తేదీలూ సమయాలూ ఎప్పుడు వస్తాయో చూసుకుని ఫాలో అవడం మంచిది.
Deleteతదుపరి వెర్షన్ తయారు చేసేటప్పుదు మీ సూచనని తప్పక పరిశీలిస్తాం.భూమి మొత్తాన్ని సూర్యోదయం చంద్రోదయం అనే విషయాలను బట్టి జోన్లుగా విడగొట్టి మీరు యాప్ ఓపెన్ చెయ్యగానే జోనుని కనుక్కుని ఆ వివరాల్ని చూపించాల్సి ఉంతుంది - మొంచెం కష్టమే,అయినా చెయ్యవచ్చు!
మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు!
Hari garu, this app is really nice.
ReplyDeleteThanks for your appreciation!
Deleteఐఫోన్ ఆప్ కూడా పరిశీలించండి
ReplyDeleteముందు ముందు పరిశీలిస్తాం.దీని రెస్పాన్సుని బట్టి!
DeleteImpressive work andee! Congratulations! I look forward to trying the iPhone app (when it is available).
ReplyDeleteబ్యాటరీ పవర్ ని ఎక్కువగా తీసుకుంటుంది. దీనిని సరిచేయండి.
ReplyDeleteOK sir!This is very useful suggestion.We will try to rectify it.
DeleteThanks!
I downloaded it. Good app. Thank you so much.
ReplyDeleteThanks for your response.Please check temples section!
Deleteబెలూచిస్థాన్ లోని హింగ్లా మాత ను చేర్చండి. అక్కడొక హిందూ దేవాలయం ఉన్నట్లు చాలామందికి తెలియజెప్పినవారౌతారు.
ReplyDeleteదేవాలయాల కేటగిరి లో తిరుత్తణి, శ్రీపెరుంబుదురు, తిరువళ్ళూరు, షోలింగర్, చెన్నై పార్థసారధి కోయిల్,కంచి,అరుణాచలం,హంపి వీటిని కూడా సమయమున్నపుడు చేర్చండి. తెలుగు వాళ్లకి ఈ దేవాలయాలతో చారిత్రకంగా చాలా సంబంధాలు ఉన్నాయి. మీరు మైలాపూర్ పార్థసారధి కి వెళితే తెలుగు శిలాపథకాలు ఇప్పటికి చూడవచ్చు. అలాగే తిరుత్తణి ఆలయ బోర్డ్ లో ఇప్పటికి తెలుగువారే చాలా పదవులలో నియమితులౌతూంటారు.
పార్థసారధి కోయిల్ ట్రిప్లికేన్ లో ఉందండి. మైలాపూర్ లో ఉన్నది కపాలీశ్వరాలయం.
Deleteహరి బాబు గారు, ఇంత చక్కటి యాప్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతః :) iphone app వస్తే తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటాను
ReplyDeleteచంద్రిక గారూ,
Deleteమీకు అంత బాగా నచ్చినందుకు సంతోషం!మోద్ట రెంటిలోనూ ఒకేసారి రిలీజ్ చేద్దామనుకున్నాం.కొంత టైం పడుతుంది,కానీ ఐఫోనుకి కూడా ఒక వెర్షన్ చేస్తాం.
అభినందనకి కృతజ్ఞతలు!!