Sunday, 23 October 2016

కాశీక్షేత్రం ఎందుకు అంత పవిత్రమైంది?దేశానికీ కాదు,భూమికీ కాదు - విశ్వానికే ఇది ప్రతిరూపం గనక!

     భరతఖండమున పూర్వరుషులు దర్శించి నిర్మించిన విశ్వనియతి మరియు సాంస్కృతిక ఖగోళ శాస్త్రము యొక్క ప్రాచీనత కొన్నివేల సంవత్సరముల వయస్సు గలది.రామాయణ కాలము నాటి చిత్రకూటము,మలి వైదిక కాలమునకు సంబంధించిన గయ,భారతదేశపు సాంస్కృతిక రాజధాని కాశీ - ఈ క్షేత్రములు అప్పటి భారతీయ మేధావులు తమ వైజ్ఞానిక పరిజ్ఞానముతో విశ్వశక్తిని కంద్రీకరించి నిలిపిన విశ్వశక్తిగ్రాహకములు(Cosmic Energy Transmitters) తప్ప సామాన్య భవనములు కావు!ఈ యాత్రాస్థలము లన్నియు వాటిని నిర్మించిన స్థలము యొక్క విశిష్టతను బట్టి వివిధ స్థాయులలో నిర్మాణ కౌశలము మరియు క్షేత్రగణిత విజ్ఞానము చెరిసగమై కలగలిసిన ఒక కడుచక్కని కలనేతను ప్రదర్శించుచున్నవి.ఆయా క్షేత్రముల యొక్క రేఖాగణితనిర్మితులను పరిశీలించిన యెడల ఒక విషయమును మనము స్పష్టముగ తెలుసుకొనగలము - పిపీలికముల వంటి మానవులు నిర్మించిన ఈ సనాతన ధార్మిక క్షేత్రములు కేవలము రేఖలుత్రికోణములుచతురస్రములువృత్తములను క్రమబద్ధముగ పేర్చిన సరళమైన క్షెత్రగణిత సూత్రముల నుపయోగించియే తమలోపలి సూక్ష్మవిశ్వమును తమవెలుపలి మహావిశ్వము ననుకరించునట్లు నిర్మించబడిన వామనవిశ్వముల(Bonsai Universe) వలె కనబడును!ప్రాచీన భారతీయ విశ్వగణిత సిద్ధాంతులు ఒకదాని నొకటి ఖండించుకొను రేఖలతో బిగుతైన ఒక వలను అల్లి వస్త్రవిశేషము వలె పరచిన కాశీ నగర క్షేత్రము ఈ మహావిశ్వమునకు సూక్ష్మరూపము!

     ఆధునిక ఖగోళ శాస్త్రమునకు అతి చిన్నదీ అతి పెద్దదీ అని రెండు గట్టి హద్దులు గలవు.ఈ విశ్వము యొక్క సూక్ష్మ ప్రమాణము -10 టు ద పవరాఫ్ -32 సెంటిమీటర్లు అను విలువను సూచించు ప్లాంక్ స్థిరాంకము.దీనికన్న అతి చిన్న ప్రమాణములో ఉన్న విశ్వము మనము అర్ధము చేసుకొనుటకు అవసరమైన క్రమత్వమునకు భిన్నముగ యుండును గనక ఆ సూక్ష్మస్థాయిలోని విశ్వమును మనమెప్పటికీ తెలుసుకొనలేము.మానవుని మేధస్సు క్రమపద్ధతిలో ఉన్నదానిని మాత్రమే అర్ధము చేసుకొనగలదుకానీ ఈ పరిధిని దాటిన చోట విశ్వము ఈ క్రమత్వమును పాటించుట లేదు. అటులనేఈ విశ్వము యొక్క అతిపెద్ద ప్రమాణము 15 మిలియన్ కాంతి సంవత్సరములకు సమానమైన 10 టు ద పవరాఫ్ 27 సెంటిమీటర్లు.ఈ హద్దుకు ఆవల గల విశ్వము ఇప్పటికి తెలియనిదిఎప్పటికీ తెలియనిదే యనుట సత్యము!ఏలయన,ఈ హద్దుల కావల కాంతివేగము కూడ మారిపోవుచున్నది.విశ్వమునకు సంబంధించిన మన జ్ఞానమంతయు ఏ కాంతివేగమును స్థిరవిలువగ తీసుకొని నిర్మించుకొంటిమో ఆ పునాదియే మారినచోట ఈ జ్ఞానము వ్యర్ధము.

     కాశీ నగరపు ప్రాచీన కుడ్యముల వలెనె ఈ సంఖ్యలు కూడ నేటి విజ్ఞానశాస్త్రమునకు పరిమితులై  ఉన్నవి - అనగాఈ పరిమితుల లోపల ఉన్న విశ్వమునే మనము అర్ధము చేసుకొనగలము తప్ప ఈ పరిమితుల కావల ఏమియును లేదని కాదు.ఈ ఆవరణలో ఉన్న సమస్తము చిన్న చిన్న దారపు పోగులతో జిగిబిగిగా అల్లబడిన వస్త్రవిశేషము వలె యున్నది.ఈ విశ్వము నందు ఏ శక్తిరూపమైనను ఏ ద్రవ్యరూపమైనను తక్కినవాటి నుండి వేరుపడి ఒంటరి ద్వీపకల్పము వలె లేదు,మరియు నేటి భౌతికశాస్త్రము ఆయా బాగము లన్నింటి మధ్యగల పరస్పర సంబంధమును మనకు మరింత స్పష్టముగ గోచరింప జేయుచున్నది.

     ప్రపంచమున మొట్టమొదట ఈ మహావిశ్వము ననుకరించు నగర నిర్మాణము సుమారు 4,500 సంవత్సరముల వెనుక సింధు లోయలో జరిగినది - బహుశాక్షరమైన భువిపై ఎట్టెట్టులో బ్రతికి నశించుట గాక  అక్షరమైన మహావిశ్వమునే ధరిత్రి పైకి దించి అందు తాను జీవించి శాశ్వతుడను గావలెనను సంకల్పము చేత అది సిద్ధించినది కాబోలు!హరప్ప నగరపు నిర్మితి ఒక ఖగోళ శాస్త్రజ్ఞుని ప్రజ్ఞను ఒక నగరనిర్మాణ సాంకేతికుని ప్రజ్ఞను కలిపి క్షేత్రగణితము నుపయోగించి అప్పటి మేధావులు తీర్చిదిద్దిన అగోచరమైన మహావిశ్వమునకు గోచరమగు నకలు వలె తోచుచున్నది. హరప్పన్ శైలి నగర నిర్మాణము అంతకు ముందొక వంద సంవత్సరముల ముందర లేదు - మానవుని మేధస్సు సాధించగలుగు అత్యున్నత స్థాయి సృజనాత్మకత అప్పటివరకు నిద్రాణముగ నుండి ఒక్కసారిగా జలపాత సదృశమై ఎగసిపడి ఇట్టి యధ్భుతములు భువిపైన సాక్షాత్కరించుట సంభవించినది! తొలి యధ్భుతము ఢృవనక్షత్రపు స్థానమును బట్టి ఉత్తర దిక్కును నిర్ణయించగలుగుట,క్షేత్రగణిత రచనకు ఇది చాల ముఖ్యమైనది.దీని తదుపరి యద్భుతము తూనికలను కొలతలను అత్యంత సూక్ష్మ స్థాయిలో నిర్ధారించుట - వేయేల వారి దేహమూ మేధయూ ఏకశృతిలో స్పందించగలుగునట్లు సహస్రాబ్దములుగా తమను తాము సిద్ధపరచుకొనిన యోగవైభవము నాటికి సహస్రారమును చేరినదని చెప్పవచ్చునులేనియెడ నిట్టిది సాధ్యము కాదు!

     హరప్పా మరియు మొహెంజెదారో ఎటు చూసినను కి.మీ. పరిధిలో విస్తరించి వారు నేర్చిన ఖగోళ శాస్ర రహస్యాలను ఇముడ్చుకున్న రేఖాగణిత శాస్త్రపు సహాయముతో సుమారొక 40,000 మందిని మహావిశ్వమున కనుకరణలుగ భాసించెడి ఆవాసముల యందు నిలుపుటకు భూమిపైన 400X200మీ కొలతలతో మీ. ఎత్తున నిలబడి విశ్వశక్తిని గ్రహించెడి మేరుసదృశమైన నిర్మాణములు. ఇక ఇక్కడి స్నానఘట్టములో మంత్రోచ్చాటనలతో జరిగే వ్యవహారము విశ్వాంతరాళములో జీవసృష్టి జరిగిన తీరును తెలిసిన వారు దానిని ఇక్కడ కూడా ఆవాహన చెయ్యడానికి చెప్పుకుంటున్న సంకల్ప చిహ్నాలు.

     ఇక్కడి నగరముల పైన ఆవరించి ఉన్న నభస్సుకి తన రహస్యాల్ని కొన్నింటిని తానే ద్యోతకపరుస్తూ కొన్నింటిని మీరే తెలుసుకోండని వెంటాడి వేధించే లక్షణమేదో ఉన్నది కాబోలు! ఉదయభానుడు పునరపి జననం పునరపి మరణం అను మానవజీవితపు చక్రనేమిని స్ఫురింపజేయు అహోరాత్ర దినముల సంయుక్తకాలప్రమాణమైన సంవత్సరములను వ్యక్తీరించగసూర్యకాంతిని గ్రహించి కౌముదులను వెదజల్లు చంద్రుడు మరల ఈ సంవత్సరము అనబడు అంశమును  స్వీకరించి విశ్వలయని చెదరనివ్వకుండునట్లు మాసము,కాలము,ఋతువులుగ విడగొట్టి కొలిచెడు చాంద్రమానమును సృజించినాడు.కాలుష్యమును వెదజల్లు వీధిదీపములు లేకపోవుట ఆకసమును చిక్కని నలుపుతొను చక్కని తారకలతోను నింపి ప్రకాశవంతముగ నుంచినది.బహుశా,భువిమీదా దివిలోనూ ఉన్న అన్ని అంశాలూ మిళిత మిళింద మనోహరమై అంతమనునది లేని ఒక నదీప్రవాహపు అలలుగా కనబడుతూ రాత్రి కాగానే నశ్వరమైనదాన్ని అక్షరమైనదానితో కలిపేస్తూ క్షితిజం కూడా అదృశ్యమైపోయి ఉండవచ్చు

     ఉత్తరగిరి శిఖరపు క్షితిజరేఖ దగ్గిర ఏ ప్రాంతము నుండి చూసినా ఏ కాలము నందు చూసినా కదలక మెదలక కనిపించెడి నక్షత్రము - నేడు మనము Alpha Draconis అని వ్యవహరించెడి నక్షత్రము క్రీ.పూ 2780 వచ్చునప్పటికి తపోనిష్ఠలోనున్న మౌని యొక్క శ్వాసవలె మెల్లమెల్లగ కదలుచు విశ్వభ్రమణాక్షమునకు 0.6 డిగ్రీలకు చేరుకుని స్థిరపడినది.సరిగ నిదే సమయమున భూభ్రమణములోని అతి సూక్ష్మమైన మార్పులు భూమి యొక్క భ్రమణాక్షమునకు చేసిన చేర్పుల వంటివి గడిచి తొలుత మధ్యకు ఉన్నట్టు గోచరించెడిది ఉత్తరదిశకు జరిగి మూడు మిలియన్ సంవత్సరముల వరకు యే నక్షత్రమును దాపులకు రాని ఏకైకత్వము ననుభవించినది.ఇదియే భారత దేశపు జీవన పరంపర కంతటికి కేంద్రబిందువైన ధృవతార!


(హరిబాబు:ఈ ధృవనక్షత్రం తొలిదశలో స్థిరంగా ఉండక చలిస్తూ ఆఖరికి స్థిరమై నిల్చిన సంగతినే తండ్రి దగ్గిర ఆవమానించబడి సుదీర్ఘకాలం పాటు తపస్సు చేసి ధృవత్వాన్ని పొందిన కధలో ఇమిడ్చినట్టు తెలుస్తుంది.ఢృవనక్షత్రానికీ భూమికీ మధ్యన ఉన్న వూహాత్మకమైన శంకువునే మేరుపర్వతం అని వర్ణించినట్లు తెలుస్తున్నది.భూమి మీద నుంచి ఈ విశ్వంలోకి దృష్టిని సారించితే ఈ శంకువు చుట్టూరానే సమస్త విశ్వమూ పరిభ్రమిస్తున్నట్టు కనబడుతుంది కదా!నిజానికి ఈ ధృవనక్షత్రం కూడా పూర్తిగా అక్షం మీదకి లేదు.అది కూడా అతి చిన్న వ్యాసార్ధంతో అక్షం చుట్టూ తిరుగుతూనే ఉన్నది.కానీ భూమి సూర్యుడి చుట్టూ తిరగడం సూర్యుడు పాలపుంత అక్షం చుట్టూ తిరగడం లాంటివాటితో లెక్కించినప్పుడు అది లెక్కించదగిన దూరం కాదు ఒక మైలు దూరంలో ఉన్న వ్యక్తిని మీరు చూస్తున్నారనుకోండి,అతనొక గీతలాగా కనపడుతున్నప్పుడు అతను ఉన్నచోటనే ఉన్నా ఒక అయిదడుగులు పక్కకి నడిచినా మీకతను నిశ్చలంగానే ఉన్నట్టు కనిపిస్తుంది,అవునా?నిజానికి సున్నాని కనిపెట్టడంచక్రాన్ని యంత్రంగా ఉపయోగించడం లాంటి వాటన్నిటి కన్నా ఈ ధృవనక్షత్రం ద్వారా తెలుసుకున్న విజ్ఞానమే అన్ని రకాల శాస్త్రాలకీ పునాది అని నాకనిపిస్తున్నది.తూనికలూ,కొలతల కోసం ఏర్పడిన లేఖనం భాషకి లిపిని కూడా ఏర్పాటు చేసుకోవటం నేర్పింది.ఇవ్వాళ మనం వైదిక కాలం అంటున్నది వేదసాహిత్యం తొలిసారిగా గ్రంధస్తమైన కాలం అని తెలుసుకోవాలి.


దీపావళి నాడు రవ్వలు వెదజల్లుతూ తిరిగే విష్ణుచక్రంలా కనబడుతున్న పాలపుంత వైశాల్యం 100,000 కాంతి సంవత్సరాలు!ఈ పాలపుంతలో అంచున సూర్య మండలం ఉంది.మొత్తం పాలపుంతలో సూర్యమండలం ఎంత చిన్నదంటేమనం తింటున్న ఇడ్లీలో రుబ్బేటప్పుడు కరగకుండా మిగిలిపోయిన ఒక మినప్పప్పు బద్ద పైకి కనబడుతున్నదనుకోండి  - అంత చిన్నది!పాలపుంత గిర గిరా తిరుగుతున్నట్టు ఉంది అంటే అక్కడొక భ్రమణాక్షం ఉండాలి గదాఆ అక్షం చుట్టూ పాలపుంతతో కలిసి సూర్యమండలమూ తిరుగుతున్నది గదా. మళ్ళీ ఈ సూర్యగ్రహం  చుట్టూ నవగ్రహాలూ ఇంకొక పిల్ల అక్షం చుట్టూ తిరుగుతున్నాయి గదావీటిల్లో ప్రతిదీ తన చుట్టూ తను తిరుగుతూ తనకన్నా పెద్ద దాని చుట్టూ తిరుగుతున్నవే - ఈ బొంగరాల చెట్టు లాంటి విశ్వంలో ఒక్క ధృవనక్షత్రం మాత్రమే మనకి ఉన్నచోటే ఉన్నట్టు కనబడుతున్నదిఎంత విచిత్రం?


మనవాళ్ళు గుర్తించిన 27 నక్షత్రాలలో ఒక్కొక్కటీ ఒక నక్షత్ర సమూహం.అంశతారలు కలిసి స్పష్టాస్పష్టంగా కనబడే ఆకారాన్ని బట్టి గానీ వాటి ప్రత్యేకతని బట్టి గానీ ఆ పేర్లు పెట్టారు.మనవాళ్ళు కాకుండా ఈ విశ్వరహస్యాల్ని గురించి పరిశోధించిన వాళ్లలో గట్టివాళ్ళు గ్రీకులూ,చైనీయులూ.వాళ్ళు కూడా కొంచెం అటూ ఇటూ ఇవే నక్షత్రసమూహాల్ని గుర్రించి చెప్పారు గానీ పేర్లు తేడా - మనం సప్తర్షి మండలం అనేదాన్ని వాళ్ళు ఎలుగుబంటిలా చూశారు.

Ursa Major points towards Polaris which is in Ursa Minor
మొత్తం అందరూ కలిసి తేల్చిన విషయం ఈ దిక్కుల్ని తెలిపే నక్షత్రాలు రెండు ఉన్నాయి.ఒకటి థుబన్ అనీ మరొకటి పోలారిస్ అనీ పేర్లు గల ఈ రెంటినీ గుర్తుపట్టడానికి మనం సప్తర్షి మండలం అని పిలుచుకునే ఉర్సా మేజర్ కీలకం.ఇదే ఆకారంలో మరొక చిన్నసప్తర్షి మండలాన్ని కూడా చూడగలిగితే ఆ రెంటితోనూ ఈ ధృవతారలు రెంటినీ గుర్తుపట్టడం తేలిక.)


విశ్వమేరువును కల్పిస్తున్న వలయనర్తనం
     ఈ ధృవప్రాంతము నుండి దూరముగ పోయిన కొలది క్షితిజము పైన కనబడు విశ్వచత్రపు వలువ పైన  గొప్ప నేర్పు గల చిత్రకారుడు తీర్చిదిద్దిన రేఖాచిత్రముల వలె గోచరించు కొన్ని నక్షత్రరాశులు క్రమముగ విస్తరించు వలయపధమ్ముల పరిభ్రమించుచు నిశలయందు మాత్రమే గోచరమై పరిపరి విధముల సమ్మోహితులను జేయుచున్నవి.మరికొన్ని మరింత వేగవంతముగను తక్కిన నక్షత్రముల కన్న వింతైన పద్ధతిన తిరుగుచు మిగుల కుతూహలము రగిలించుచున్నవి;ఇవి భువిపైనుండి చూడగలుగు సూర్యుడుచంద్రుడుబుధుడుశుక్రుడుకుజుడుగురుడుశని - "గ్రహములు" అనునవి ఏడు.ఈ విధముగ నీ గ్రహతారకలు పరిభ్రమించు దీర్ఘవృత్తాకార పధమే నిరంతర పరిభ్రమణ సంజనిత చుళుకీకృత తరంగ ఘోషాయమాన బుద్బుదాలంకృత ధవళవస్త్రసంశోభిత యైన జలదాంగన - దివిజగంగ! హరప్ప వాసులు ప్రత్యేకించి యా పేరిడకున్నను,వారు నిత్యము గ్రుంకులిడుచున్న ఈ భువిజగంగ ఆ దివిజగంగ ప్రతిబింబమని భావించియే యుండవచ్చును.హరప్ప వాసుల చిత్రలిపి యందు హరితమత్స్యము వలె సూచించబడిన బుధగ్రహము మత్స్యము వలెనె వేగముగ పరిభ్రమించుచు నుండుటయు,నల్లనిదై జీమూతము వలె మిగుల పెద్దదియై ఉండి భయము గొల్పు శనిగ్రహము కచ్చపము వలె మందగమనమున పరిభ్రమించుటయు సైతము వారికి తెలియును.నేటికిఈ సూర్యుడుఇతరగ్రహములుకాలమాన కర్తయైన చంద్రుడు క్రమము తప్పక పరిభ్రమించు దీర్ఘవృత్తకార మార్గము 28 నక్షత్రరాశులుగ విభజించబడినది.ఈ చంద్రగమనమును ఇంత నిర్దుష్టముగ విభజించుట హరప్ప వాసుల నుండియే మొదలైనదని యనుట యదార్ధము.

     సప్తర్షిమండలము తూర్పు దిశయందు పైకి జరుగుటయే గాక క్రీ.పూ 2240వ సంవత్సరపు Spring Equinox నాటి ఉదయ కాలమునకు సూర్యుని కన్న ముందుకు జరిగి కొంత తడవు సూర్యకాంతి పలుచనయై తారకలు దర్శనమిచ్చి సూర్యుడు రెండుసార్లు ఉదయించినట్లు భాసించెను.నాటినుండి దీనిని హరప్ప వాసులు సంవత్సరమునకు తొలిదినముగ పరిగణించి యుందురు.ఈ చిత్రమైన సన్నివేశమే ప్రాచీన భారతీయ సాహిత్యమున ఎన్నియో విశేషార్ధములు గల చిత్రాతి చిత్రములైన కధలను సృష్టించినది.నేటికిని వశిష్ఠునికి జంటగ నిలిచియున్న అరుంధతి స్తవనీయురాలు గాగ అగ్నిని కామించినారని,పతులచే దూరముగ తరమబడిన మిగిలిన యార్వురి భార్యలు కృత్తికలై ఆరు ఋతువులను ఆరు ముఖములుగ దాల్చి ఆదిదంపతులకు జన్మించినాడని వర్ణించబడిన సంవత్సరమను కాలవిభాగమునకు ప్రతినిధియైన  కార్తికేయునికి పెంచిన తల్లులగుట యనునది ఒక రమ్యమైన కల్పన!ఈ క్రీ.పూ 2240 సంవత్సరమునకు పూర్వము అనగా క్రీ.పూ 3050 నాటినుండి అప్పటివరకు గులాబి వర్ణమున ప్రకాశించు రోహిణీ నక్షత్రము నూత్నవత్సరమును ప్రారంభించెడిది.ధొలవిర,ఇట్టి మహాద్భుత శాస్త్ర విజ్ఞానమును రంగరించి తీర్చిదిద్దిన హరప్ప నగరములలో కెల్లను సువిశాలమైనది.

(హరిబాబు:మనవాళ్ళు కృత్తికలు అని షణ్ముఖుడికి దాదులుగా చెప్పిన నక్షత్ర సమూహాన్నే గ్రీకులు Pleiades అనే పేరుతో పిలుచుకుంటూ కధలు అల్లుకున్నారు.వీళ్ళు మహాబలశాలి అయిన అట్లాస్,సాగరకన్య ప్లీయోన్ సంతానం - ఏడుగురు.ఈ నక్షత్రసమూహానికి ఆ పేరు తల్లి పేరుమీదనే వచ్చింది.వీళ్ళందరూ గ్రీకుల దేవాధిదేవుడైన జ్యూస్ వల్ల తల్లులయి ఉపదేవతలకి జన్మనిచ్చారు.అట్లాస్ విశ్వాన్ని భుజాని కెత్తుకుని నిశ్చలంగా ఉండటం చూసి ఓరియన్ వీళ్ళని చెరబట్టాలని చూస్తే జ్యూస్ అట్లాస్ మీద ఉన్న అభిమానంతో వీళ్ళని మొదట పావురాలుగానూ,తర్వాత నక్షత్రాలుగానూ మార్చి ఇట్లా శాశ్వతం చేశాడు.ఆ ఓరియన్ కూడా నక్షత్రంగా మారిన మరొక ఉపదేవుడే,ఇప్పటికీ అతని చూపు ఈ సప్తకన్యల మీదనే ఉంటుంది!వీటిలో ఒక నక్షత్రం స్పస్టంగా కనబడకనో యేమో  Legend of the Lost Pleiad అనే మరొక రమ్యమైన కధని కూడా పుట్టించారు.రొమాంటిసిజం ఎక్కువగా ఉన్న వాళ్ళు కళ్ళు చెదిరే సౌందర్యంతో మత్తెక్కించే అప్సరసల మాదిరి వూహించి హుషారు పుట్టిస్తుంటే మనవాళ్ళు శ్రోత్రియులు గనక మునిపత్నులుగా పవిత్రీకరించి బోరు కొట్టిస్తున్నారు - వీళ్ళు కూడా కొంచెం రొమాంటిగ్గా ఆలోచిస్తే ఎంత బాగుండేది!

ఈ ఉర్సా మేజర్ అనే పెద్ద నక్షత్రసమూహం,ఉర్సా మైనర్ అనే చిన్న నక్షత్ర సమూహం రెంటిలోనూ 7 నక్షత్రాలు ఒకే ఆకారంలో ఒక్కలాగే ఉండి దూరంగా ఉండటం అనే విషయానికి మనవాళ్ళు కల్పించిన కధ ఇది:సపర్షులు వారి వారి భార్యలతో అన్యోన్యంగా కాపురం చహెసుకుంటూ ఉంటే ఒక కధ ప్రకారం అగ్నీ,మరొక కధ పకారం శివుడూ వశిష్ఠ పత్నిని తప్ప మిగిలిన వారిని మోహితుల్ని చేస్తారు.ఈ అనైతికతకి కోపించి ఆరుగురు రుషులూ తమ భార్యల్ని దూరంగా తరిమి వేశారు.శివపురాణంలోని కధ ప్రకారం రుషులు శివుడి మీదకి మంతరశక్తితో పులుల్నీ,ఏనుగుల్నీ,భూతాల్నీ పంపిస్తారు.కానీ శివుడు వాటిని తనకు ఆభరణాలుగా చేసుకుంటాడు.శివుడికి భూతపతి అనేది కూడా ఈ రుషులు పంపిన భూతాల్ని జయించిన తర్వాతనే వచ్చి ఉండవచ్చు.చాలామటుకు మన పురాణ కధలకి మూలాలు నక్షత్ర మండలాలకి సంబంధించిన విశేషాలే!నక్షత్రాల్ని ప్రతి రోజూ చూసి చూసి వాటిని ప్రేమించి వాటిచుట్టూ కధలు అల్లటం అన్ని చోట్లా జరిగింది.పైగా వాళ్ళెవరూ చిన్నపిల్లలు కాదు,ఆ రహస్యాలు తెలిశాక మరింత అశ్చర్యపోయి చిన్నపైల్లలైపోయిన పెద్దవాళ్ళు.)

     సప్తర్షిమండలము తూర్పు దిశయందు పైకి జరుగుటయే గాక క్రీ.పూ 2240వ సంవత్సరపు Spring Equinox నాటి ఉదయ కాలమునకు సూర్యుని కన్న ముందుకు జరిగి కొంత తడవు సూర్యకాంతి పలుచనయై తారకలు దర్శనమిచ్చి సూర్యుడు రెండుసార్లు ఉదయించినట్లు భాసించెను.నాటినుండి దీనిని హరప్ప వాసులు సంవత్సరమునకు తొలిదినముగ పరిగణించి యుందురు.ఈ చిత్రమైన సన్నివేశమే ప్రాచీన భారతీయ సాహిత్యమున ఎన్నియో విశేషార్ధములు గల చిత్రాతి చిత్రములైన కధలను సృష్టించినది.నేటికిని వశిష్ఠునికి జంటగ నిలిచియున్న అరుంధతి గాక మిగిలిన యార్వురి భార్యలు అగ్నిని కామించినారని,పతులచే దూరముగ తరమబడిన మిగిలిన సప్తర్షుల భార్యలు ఆరుగురు కృత్తికలై ఆరు ఋతువులను ఆరు ముఖములుగ దాల్చి జన్మించినాడని వర్ణించబడిన సంవత్సరమను కాలవిభాగమునకు ప్రతినిధి యైన  కార్తికేయునికి పెంచిన తల్లులగుట యనునది.ఈ క్రీ.పూ 2240 సంవత్సరమునకు పూర్వము క్రీ.పూ 3050 నాటినుండి కాంతివంతమైన గులాబి వర్ణమున ప్రకాశించు రోహిణీ నక్షత్రము నూత్నవత్సరమును ప్రారంభించెడిది.ధొలవిర,ఇట్టి మహాద్భుత శాస్త్ర విజ్ఞానమును రంగరించి తీర్చిదిద్దిన హరప్ప నగరములలో కెల్లను సువిశాలమైనది.

     క్రీ.శ 1991 నందు జెఫ్రీ మెయర్ అను శాస్త్రజ్ఞుడు ఈ విశ్వముతో అనుసంధానించబడిన పవిత్ర నగరములో కల్లా బీజింగు నగరమే అర్వాచీనమైనదని నిర్ధారించినాడు.క్రీ.పూ 1700 నుండి క్రీ. పూ 1100 మధ్యన పరిపాలించిన Shang వంశీయులు చైనీయుల ప్రణాళికాబద్ధమైన రాజధానిని గురించి  వూహించినారని తెలియుచున్నది.ఆనాటి శిలాజ శాస్త్రపు నిరూపణలను బట్టి Zhengzhou మరియూ Anyang నగరములు నలు చదరముగను దీర్ఘ చతురస్రముగ నుండి చక్కని సౌష్ఠవముతో నిర్మించబడినవని తెలియుచున్నది.రాజ్యము యొక్క వైభవము రాజధాని యొక్క గణిత శాస్త్రపు సౌష్ఠవమును బట్టి ఉండునని వారి పరంపరానుగతమైన నమ్మకము చేతనే వారట్లు చేసియుండవచ్చును.తన రాజధానిని ఒకచోటునుండి మరియొకచోటికి మార్చు సందర్భమున ఒక ప్రభువు వాదన ఇది:"కూలిన చెట్టు నుండి కొత్త మొలకలు,శాఖలు విస్తరించు లాగున దైవము నూతన నగరమును ఆశీర్వదించును!"ఏ ప్రాంతమునందు నిర్మించినారనునది గాక అది రేఖాగణితశాస్త్రపు విషయములను పుణికిపుచ్చుకొని నిర్మాణము సౌందర్యభరితముగ నుండుట ప్రధానము. క్రమబద్ధమైన ఏ నిర్మాణమునకైనను మొదట దిక్కులు తెలియవలెను,దిక్కులు తెలియవలెనన్న ఒక స్థిరబిందువు తప్పనిసరి - ధృవనక్షత్రము యొక్క ప్రాముఖ్యత అదియే!ప్రాచీన భారతీయ వైజ్ణానికశాస్త్ర వైభవమంతయునూ ధృవనక్షత్రము యొక్క స్థిరత్వమును గుర్తించిన నాటినుండియే ప్రారంభమైనది - ధృవునికి సంబంధించిన కధలో ఈ వైజ్ఞానిక సత్యమునే అలంకారికముగ నుడివినారు!

     ఇట్టి నగరములను ప్రాంతమును బట్టి గాక ఉద్దేశపూర్వకముగ జరిపిన క్రమబద్ధమైనవి,ప్రాంతము యొక్క విశిష్తతను గమనించిన నైసర్గికమైనవి అను రెండు రకములుగ విభజించవచ్చును:మొదటి రకమగు రాజధానుల వంటివి పునాదుల నుండి గోపురముల వరకు మేధోజనితమైన ప్రణాళికలతో నిర్మించినవి - వీనియందు పరిమిత సంఖ్యలోనే  జనులు స్థిరనివాసముల నేర్పరచుకొందురు.రెండవ రకమగు క్షేత్రమును బట్టి నిర్మించినవి - వీనియందు అపరిమిత సంఖ్యలో జనులను ఆకర్షించి వారినుండి తమ దేహమనోసంబంధములైన నీరసాదులను స్వీకరించి వారికి నూత్నతేజస్సును ప్రసాదించి ఉత్సాహవంతులై తమ స్వస్థలములకు మరలిపోవునట్లు చేయగలిగిన విశేషము గలదు!మానవుని మేధోజనితమైన ప్రణాళికల కిందు ప్రాధాన్యత లేదుప్రాంతము యొక్క విశిష్టతయే ప్రధానము!ఆ ప్రాంతము యొక్క ఆధ్యాత్మిక శక్తిపాతపు అయస్కాంత తరంగముల ప్రభావమును గుర్తించగలిగిన శక్తిమంతులకు దక్క మిగిలినవారికి అవి కేవలము శిలాసైకతసదృశములుగ గోచరించును.ప్రభువులు నిర్మించిన నగరముల వలె మానవమేధోజనితప్రణాళిక లేకున్నను ఈ దివ్యక్షేత్రములు ప్రత్యేకముగ నిర్మించిన రాజధానులలోని ప్రణాళికాబద్ధతనూ సామాన్యముగ నిర్మించిన ఇతర నగరములలోని ప్రణాళికారాహిత్యమునూ కడుచక్కని నిష్పత్తిలో గలిగియున్నవి.

     ప్రాచీన భారతీయ నగరములలో సృష్టికర్తయగు బ్రహ్మ తొలిగా తనను ఆవిష్కరించుకొనిన పవిత్రస్థలమని చెప్పబడు వారణాసి రాజకీయావసరములతో గాక క్షేత్రమాహాత్మ్యమును సాకల్యముగ దెలిసికొనిన పూర్వఋషులు నిర్మించిన ఇట్టి నిర్మాణములతో విశ్వమునకు సూక్ష్మరూపమై అలరారుచున్నది.అష్టదిక్పాలకులు సైతమిచ్చటనే ప్రభవించిరని భావించి దానికి సంకేతముగ 56(8X7) గణేశమూర్తులను పంచక్రోశ వలయాకారమున నిక్షేపించి ఈ మహావిశ్వమునకు ప్రతిరూపమైన ఒక వామనవిశ్వమును సందర్శకుల కనుల ముందు సాక్షాత్కరింపజేసినారు!యాత్రికులు ఈ పంచక్రోశి నగరమునకు ప్రదక్షిణ చేయుట యనగా విశ్వమునకు ప్రదక్షిణ చేయుట - అందులకే కాశీలోని శివుడు విశ్వనాధుడను పేరున పిలువంబడుచున్నాడు.

     గత పదిహేను సంవత్సరముల నుండి నేను ఆచార్య "Rana P.B. Singh" గారితో కలిసి ప్రయాణించి ఎన్నియో మహాద్భుత విషయములను గ్రహించినాడను.భువిపైని స్థలములను దివిలోని శక్తులతో అనుసంధానించుట ఎట్లో సోదాహరణముగ వివరించెడి ఈ నవీన విజ్ఞాన శాస్త్రము మానవాళికి మరింత ప్రయోజనకారి కాగలదు.
―Prof. John McKim Malville,
Emeritus Professor, Astrophysics & Planetary Sciences,
University of Colorado, Boulder, U.S.A.
     నా జీవితమంతా స్థలంతో అనుబంధం ఎక్కువ.స్థలం నాతో మాట్లాడుతుంది.నాకు సంబంధించినంతవరకు స్థలం కాలంతో పాటు ఎదుగుతూ కదలగలిగిన ఒక జీవం తొణికిసలాడే వ్యక్తిత్వం.స్థలం అనేది మనిషికీ విశ్వానికీ మధ్య నిలబడి క్రీడిస్తున్న ఒక పరస్పరాశ్రితమైన అంశాల సమాహారం.అది పనిచేసే విధానం,దానిలో ఉన్న శక్తుల గురించి తెలియటానికి చాలాకాలం ముందునించీ స్థలం యొక్క ఉనికి నాకు ఎక్కడ చూస్తే అక్కడ కనపడుతూ ఉండేది.ప్రతి స్థలం చుట్టూ "ఏదో ఒకటి" ఆవరించుకుని ఉందని చిన్నప్పటినుంచీ అనిపిస్తూనే ఉండేది.ఈ కనిపించేవీ కనిపించనివీ అయిన వాటితో సంభాషణ నుంచి జారిపడిన సందేశాలే నా జీవితానికి నిజమైన అర్ధాన్ని బోధపరిచాయి.నేను ఒక స్థలం నుంచి మరొక స్థలానికి మారినప్పుడల్లా మనుషులతో ఉన్న అనుబంధం లాంటిదే ఆయా స్థలాలతో కూడా జ్ఞాపకాలుగా మారి ఒక రకమైన ఆప్యాయత కలుగుతూ ఉండేది.ఇది ఎప్పుడు ఎలా ఏర్పడిందో నాకయితే తెలీదు.తర్వాత కొంతకలానికి నాకొక్కడికే కాదు,ప్రతి మనిషికీ తనని విశ్వంతో కలుపుతున్న స్థలం గురించి తెలుసుకోవాలనే తృష్ణ ఉంటుందని తెలిసింది.

     మనచుట్టూ కనిపిస్తున్న ఈ ప్రపంచం కనిపించని ఆత్మలనీ వినిపించని రాగాల్నీ తనలో ఇముడ్చుకోవటం వల్లనే జీవంతో,అర్హంతో,అందంతో కలిసి ఆశావహంగా బతికేటట్లు చేస్తున్నదని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను.పవిత్రస్థలాలలో మన ప్రాచీనులు చేసిన కృషిని అర్ధం చేసుకుంటే మనం మరింత తెలివిగా ఉండి సకలజీచరాశులతో సుహృద్భావపూరకమైన సంబంధాలతో జీవించగలమని కూడా అనుకుంటూ ఉంటాను.ఈ రకమైన ఆలోచనలతో నేను అప్పుడప్పుడూ వారణాసిలో గంగాతీరపు మెట్లపైన పచార్లు చేస్తూ ఉండేవాణి.కొన్ని దశాబ్దాలు అలాంటి పచార్లతో కాలక్షేపం చేశాక,ఒకానొకరోజు(1993 జనవరి 13న) పొడుగ్గా కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తున్న ఒక వ్యక్తి నేను రాసిన పాత వ్యాసం "pilgrimage mandala of Kashi"(1987) చదువుతూ కనిపించాడు - ఆ వ్యాసరచయితని వెదుక్కుంటూ వచ్చాడు అతను.అతని పేరు John McKim Malville.అదే రోజున విశ్వానికీ మనిషికీ ఉన్న సంబంధాలని అన్వేషిస్తూ ధార్మికక్షేత్రాల్ని సందర్శించే సహయాత్రికులం అయిపోయాం మేమిద్దరం.ఆ రకంగా మొదలైన మా ప్రయాణం ఎన్నో మజిలీలను దాటింది.కొన్నిచోట్ల ఆగి విశ్రాంతి తీసుకున్నాం,కొన్నిచోట్ల వేర్వేరు దారుల్ల్లో నడిచాం - దారులు వేరైనా మాటలు ఒకటే!ఈ పదహారు సంవత్సరాల కాలంలో స్వదేశంలోనూ విదేశాల్లోనూ ఎన్నో సెమినార్లలో కలిసి పాల్గొన్నాం.1998 నుంచి 2003 వరకు కొలరాడో విశ్వవిద్యాలయం వారి పర్యవేక్షణలో "the Cultural Astronomy and Sacred Space in Banaras" ప్రాజెక్టుకి సంబంధించి మేమిద్దరం కలిసి పనిచేశాం;ఇది పౌరాణిక విశేషాలకీ ఖగోళశాస్త్రానికీ ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకోవడానికి మాకు ఉపయోగపడింది .

     అనేక విధాలైన సృజనాత్మకత గలిగిన ఆలోచనాస్రవంతులు కలిసి ఏకోన్ముఖంగా కదలగలిగినప్పుడే academic research అనేది గొప్ప స్థాయిలో జరుగుతుందని నేను భావిస్తాను. వ్యక్తిగతంగా,ఒక సౌకర్యవంతమైన చట్రం పెట్టుకుని అందులోకి కుదించుకుపోవటం - ఉదాహరణకి cultural geographer అనో historical geographer అనో చెప్పుకుని సరిపెట్టుకోవటం ఇష్టం ఉండదు నాకు . నావరకు అలా సింప్లిఫై చేసి విడగొట్టాల్సిన అవసరం లేదు - భూగోళశాస్త్రం అంటేనే మొత్తం విశ్వం యొక్క అనావృత స్థితిని గురించి చెప్పేది!కొన్ని విభిన్నంగా కనిపించే విషయాలని ప్రయోజనాత్మకంగా మలచగలిగేటంత సమగ్రంగా అర్ధం చేసుకోవటానికీ మేదోపరమైన సంభాషణల ద్వారా పంచుకోవటానికీ వాటిని ఒకేసారి అనేక దృక్కోణాల ద్వారా పరిశీలించి వాటితో సంబంధం ఉన్న అన్ని జ్ఞానశాఖల్ని కలిపి విశ్లేషించటం సాధ్యమే, అవసరం కూడా. కొందరు మరోరకంగా భావించవచ్చు,గందరగోళం ఏర్పడుతుందనీ పరస్పర విరుద్ధాంశాలతో పరిశోధన సజావుగా జరగదనీ అనుకుంటారు;కానీ నాకు మాత్రం ఈ మార్గం ఈ అన్నింటి వెనుకా ఉన్న వైరుధ్యాలనీ సారూప్యాలనీ పూర్తి వాస్తవికంగా చూపించి అన్నింటిలో ఏది ఉత్తమమైనదో దాన్ని తీసుకునేటట్టు చేసింది.

నాలుగు దశాబ్దాల పాటు ఈ దారిలో నడిచాక నేను గట్టిగా చెప్పగలను భూగోళశాస్త్రం అనేది అనేక జ్ఞానశాఖల సమాహారం అని. అది తన జ్ఞానపు విస్తృతిని పెంచుకుని ఎన్నో అద్భుతాలతో నిండిన ఈ ప్రకృతి నుండి కొంత గ్రహిస్తూ కొంత సమర్పిస్తూ మానవకల్పితమైన సిద్ధాంతాల్ని సమూలంగా మార్చివేస్తున్నది. అందువల్లనే నేను అన్ని జ్ఞానశాఖల సారాంశాన్ని ఒకచోట చేర్చి జ్ఞానసమగ్రతని సాధించడానికి ప్రయత్నిస్తున్నాను.ఈ వ్యాసాలన్నీ ఆ ప్రయోగ ఫలితాలే.

నేను ఎంత సమయం దొరికితే అంత astronomy, philosophy of science, anthropology, sociology, Indology వంటి విషయాలకి స్మబంధించి విస్తృతంగా చదువుతాను - ఆయా శాఖలలో కాలగమనంలో మారుతున్న అభిప్రాయాల చరిత్రను కూడా పరిశీలించి ప్రాచీనకాలపు పౌరాణిక సాహిత్యానికీ నవీనకాలపు భౌతికశాస్త్రాలకీ మధ్యన ఉన్న సంబంధాన్ని వెతుకుతున్నాను.ఈ పుస్తకంలోని విషయాన్ని International Conference on Development Geography (Vaasa, Finland: 21-23 June 1999), the 6th Oxford & SEAC Conference on Astronomy &
Cultural Diversity (La Laguna, Spain: 24-29 June 1999), the International SASNET Workshop on Global Networking in South Asian Studies (Lund, Sweden: 27-28 August 2001), International Interdisciplinary Conference on Symbology, Myths, History: Weapons and Wars in, from Rudra to Mahatma Gandhi (Milan, Italy: 19-20 May 2003), the 3rd International Convention of Asia Scholars (Singapore: 19-22 August 2003), the 18th European Congress of Modern South Asian Studies (Lund, Sweden: 6-9 July 2004), the 19th World Congress of the International Association of History of Religions (Tokyo, Japan, 24-30 March 2005), the 19th European Conference of Modern South Asian Studies (Leiden, the Netherlands: 27-30 June 2006), the 2nd SSEASR Conference of South and Southeast Asian Association for the Study of Culture and Religion (Bangkok, Thailand: 24-27 May 2007), Indo-Swedish Workshop on Cultural Geography and Religion (Gothenburg, Sweden: 13-27 October 2008), 16th World Congress of International Union of Anthropological and Ethnographical Sciences (Kunming, China: 27-31 July 2009), and the 17th SEAC Conference of European Society for Astronomy in Culture (SEAC), held in the Library of Alexandria, Egypt (25 - 31 October 2009) లాంటి చోట్ల ప్రసంగాలుగా,ప్దర్శనలుగా ఇచ్చి ఉన్నాను.

     నా ఆత్మీయ స్నేహితుడు,సహ యాత్రికుడు మరియు నా సాంస్కృతిక ఖగోళ శాత్ర పరిశోధనా యాత్రలో మార్గదర్శి అయిన Kim Malville గారు దయతో ముందుమాట రాసినారు;ఆయన మాత్రమే ఈ కానుక ద్వారా నన్ను ఆసీర్వదించగలరు,కేవలం ఆయన మాత్రమే ఈ జ్ఞానశాఖల సమన్వయానికి మానవుణీ విశ్వానికి అనుసంధానించటంలో ఉన్న ప్రాముఖ్యతని అర్ధం చేసుకోగలరు. ఆయన పట్ల నాకున్న కృతజ్ఞతనీ గౌరవాన్నె మాటలలో పూర్తిగా వ్యక్తపరచలేను.ఆయనకూ ఈ పుస్తక ప్రచురణలో సహకరించిన మిత్రులకు అందరికీ నేను సదా కృతజ్ఞుడనే.

     నా కుటుంబసభ్యులు(పెద్దకొడుకు ప్రవీణ్,చిన్నకొడుకు పర్శాంత్,కూతురు ప్రభ,కోదలు జ్యోతి,ఇంకా 1,3/4 యేళ్ళ మనవడు విష్ణు) అందరూ అనేక విధాలుగా సహాయం చేశారు.నా పెద్దకొడుకు, Pilgrimage tourism in Banaras region గురించి doctoral dissertation పూర్తి చేసిన Pravin S. Rana నా కంప్యూటర్ చక్కగా పనిచెయ్యడానికి చాలా శ్రమించాడు;నా జీచితంలో నేను ఏమి సాధించానో దాన్ని అతను కొనసాగించగలడని ఆశగా ఉంది! ఒక విధంగా ఇది నా భార్య మంజు(ఉష)కు ఒక చిన్న కృతజ్ఞతాపూర్వకమైన కానుక,ఎందుకంటే ఈ ముఫ్ఫై తొమిదేళ్ళు తనపట్ల నా నిర్లక్ష్యాన్ని భరించటమే కాకుండా కాశీ క్షేత్రాన్ని పరిశోధించడం అనే నా మంచి పనికి ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చిన సహనశీలి ఆమె.ఇప్పటికైనా తనపట్ల నా నిర్లక్ష్యాంకి నన్ను క్షమిస్తుందని ఆశిస్తున్నాను.

Rana P.B. Singh (Professor of Cultural Geography, Banaras Hindu University,
India)

"To understand and appreciate how the sky modulates culture, you have to see how it lands on earth. In India, cosmic order is brought to ground in sacred cities, and Professor Singh surveys that landscape and establishes a foundation for these studies with deliberation, accuracy, and precision.‘Cosmic Order and Cultural Astronomy: Sacred Cities of India’ is a pilgrimage toward a sophisticated but accessible perspective on a familiar issue ― the role of celestial alignments and hierophanies in the sacred and symbolic environment".
―Dr. Edwin C. Krupp,
Director: Griffith Observatory, Los Angeles, U.S.A.
===============================================================
అన్నీ కలిసొస్తే ఈ Cosmic Order and Cultural Astronomy పుస్తకాన్నీ Rana P.B. Singh గారి మిగిలిన పుస్తకాల్నీ తెలుగులోకి తీసుకురావాలని ఉంది.దానికి ఇది కేవలం మైక్ టెస్టింగ్ లాంటిది.

ముందు పుస్తకాల్ని సంపాదించాలి.చదివి అర్ధం చేసుకోవాలి.ఆయన నుంచి పర్మిషన్ తీసుకోవాలి - అయినా వదలను.మనసులో ఒక ఆలోచన రగిలితే అది పూర్తి చేసి తీరతాను - చూద్దాం!

Wednesday, 12 October 2016

ఇదే నా మొదటి యాండ్రాయిడ్ యాప్!పోయి పోయి తెలుగు పంచాగం మీద పడ్డాను - ఎలా ఉంది?

     నేను గతంలో సూచనగా చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించిన మిత్రులకు ముందుగా ధన్యవాదాలు!ఇప్పటికి అప్లికేషన్ పూర్తిచేసి లైవ్లో ఉంచగలిగాము.ఇది మన సంప్రదాయకమైన తెలుగు పంచాంగం మీద ఆధారపడింది - వంగిపురపు వారి వెర్షన్ చూపిస్తున్నాం ఇందులో.

     ఇవ్వాళ మనం ఉన్న కాలం చాలా భిన్నమైనది.ఒకే ఒక ఉదాహరణ:మామూలుగా రోజువారీ పనుల్లో ఇంగ్లీషువాళ్ళు అలవాటు చేసిన గ్రెగేరియన్ క్యాలెందరు వాడుతున్నాం,కానీ మన పండగలు ఎప్పుడొస్తాయో తెలుసుకోవాలనుకున్న చిన్న చిన్న విషయాలకీ ఏదైనా ముఖ్యమైన పని శుభప్రదంగా జరగాలంటే ఎప్పుడు మొదలుపెట్టాలి అనే పెద్ద పెద్ద విషయాలకి తప్పనిసరిగా పంచాంగమే చూడాలి.ఈ రెంటికీ చాలా చాలా తేడాలు ఉన్నాయి.ఇంగ్లీషువాళ్లకి సంవత్సరం ఒక అంకె మాత్రమే,నెల అంటే ఏదో ఒక పేరు మాత్రమే,మళ్ళీ తేదీ కూడా ఒక సంఖ్య మాత్రమే.ఇక కాలం విషయానికి వస్తే గంటలు,నిమొషాలు,సెకండ్లు - అంతే!మనకి అట్లా కాదు,ప్రతి సూక్ష్మమైన వివరానికీ ఎంతో ప్రత్యేకత ఇచ్చిన ఒక సంక్లిష్టమైన కాలగణనశాస్త్రం ఉంది ఇక్కడ!మీరు మరీ గందరగోళం పడిపోతారని ఎక్కువగా చెప్పను గానీ భూగోళశాస్త్రం, ఖగోళశాస్త్రం, భౌతికశాస్త్రం, కాలస్వరూపం, వాస్తు, జ్యోతిషం  - ఇవన్నీ వేరువేరు కాదు మనవాళ్ళకి!మన పండగలనే తీసుకోండి - ప్రతి పండుగా ఏదో ఒక ఋతువుకీ కాలానికీ మొదలో చివరో వస్తూ గట్టిగా కలిసిపోయి ఉంటుంది.గ్రహతారకాదుల చలనాన్ని బట్టి నిర్ణయించిన కాలప్రమాణాలు మనవి.మన కుర్రాళ్ళు హాప్పీ హాప్పీ న్యూ యియర్ పేరుతో డిసెంబర్ 31 కీ జనవరి 1కీ మధ్యన తాగి తాగి తందనాలాడుతూ వెర్రెత్తి పోవడానికి కేవలం తేదీ మారటం తప్ప ఇతర ప్రాముఖ్యత ఏమైనా ఉందా?లేదు గాక లేదు!కానీ చైత్ర మాసారంభపు ఉగాది అట్లా కాదు,అప్పటి తారాలోకపు విశేషాల దగ్గిర్నుంచీ భూమి మీద వాతావరణంలో జరిగే మార్పుల వరకూ ప్రతిదీ విశేషమే,అయినా ఉత్సాహం ఉండటం లేదు!

     హిందువైన ప్రతి వ్యక్తికీ పంచాంగం అవసరమే,కానీ మొత్తం పంచాంగ గణితమంతా తెలుసుకోనక్కర లేదు - సిద్ధాంతులు వ్రాసి ఇచ్చిన పంచాంగం చూసుకుంటే చాలు.మళ్ళీ ఇక్కడ అవన్నీ గ్రిగేరియన్ క్యాలెండరు సాయంతో చెబితేనే అర్ధం అయ్యే పరిస్థితి ఉంది.అదీ సిద్ధాంతులే చేసారు - బేసిక్స్ తెలుసుకుని ఆ క్యాలెందరు చూస్తే సరిపోతుంది.కానీ ఎంత ఆసక్తి ఉన్న వ్యక్తి అయినా ప్రతిచోటుకీ పంచాగం మొత్తాన్ని తీసుకుపోలేడు గదా!ఆ సులువునే ఈ అప్లికేషను మీకు ఇస్తుంది.పంచాగంలో ఉండే మొత్తం సమాచారాన్ని ఒకేచోట ఇరికించకుండా విడగొట్టి వేర్వేరు చోట్ల చూపించడం మిగతావాటికన్నా "శ్రీకృష్ణ తెలుగు క్యాలెంరు"కి ఉన్న ప్రత్యేకత. 

     మీరు పైన ఉన్న యాప్ పేరుగా ఉన్న లింకును క్లిక్ చేస్తే గూగుల్ ప్లేస్టోర్ మీకు యాప్ వివరాలను చూపిస్తుంది.ఇన్స్టాల్ చేసుకున్నాక ఐకాన్ మీద నొక్కితే మొదట బటన్లతో నిండిన మెయిన్ మెను కనబడుతుంది.
     ఇందులో పైవరసలో ఉన్న మూడు బటన్లూ క్యాలండరుకు సంబంధించినవే!మొదటిది ఆ బటన్ మీద ఉన్న బొమ్మ చూపిస్తున్నట్టు ఆ నెలమొత్తాన్ని చూపిస్తుంది.మామూలుగానే అన్ని డైనమిక్ క్యాలెందర్ల మాదిరే ఆరోజుని ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంది.ముఖ్యమైన శెలవుల్నీ చూపిస్తుంది.దిగువన ఆ నేలలోని పండుగల్నీ ప్రతయేకమైన రోజుల్నీ చూపిస్తుంది.
     చూశారుగా,పైన గ్రెగరియన్ క్యాలెండర్ నెల దాని కింద త్గెలుగు నెల పేరు ఉంది కదా.దానికి అటూ ఇటూ మామూలుగా అన్ని అప్లికేషన్లన్లో ఉండే prev మరియు next బటన్లు.పసుపురంగులో మొత్తం నెలలోని అన్ని తేదీలూ ఉన్నాయి.మీరు ఏరోజున ఓపెన్ చేస్తే ఆరోజు నీలం రంగులో కనిపిస్తుంది.ప్రత్యేకమైన రోజులు జేగురు రంగులో కనిపిస్తున్నాయి.ఇంక ఆరోజుకి సంబంధించిన తిధి,వార,అనక్షత్ర వివరాలు రెండు బ్లాకులుగా విదగొట్టి ఎడమవైపున వారం, దానిమీద ఆధారపడిన రాహుకాలం, యమగందం, దుర్ముహూర్తం చూపిస్తూ కుడివైపున తేదీనీ దానిమీద ఆధారపడిన మాసం, తిధి, నక్షత్రం, వర్జ్యం చూపిస్తున్నాము.తిధి నక్షత్రాలు చూపించే బ్లాకులో కుడి పక్కన పైమూలలో కనిపిస్తున్న అంకె శాలివాహన సకపు ఆ మాసం యొక తేదీ. సాధారణంగా పంచాంగం ప్రకారం ప్రతి నెల అమావాస్య త్ర్వాత వచ్చే శుద్ధ పాడ్యమి నుంచి మొదలై నెల మధ్యలో పౌర్ణమి వచ్చేటట్టు ఉండి బహుళ చతుర్దశి తర్వాత వచ్చే అమావాస్యతో పూర్తి అవుతుంది.ఈ కాలనిర్ణయం శక సంవత్సరంతో కూడా పూర్తిగా కలిసి ఉందదు.అందుకని ప్రతి గ్రిగెరియన్ నెల మొదటి తేదీనా మరియు శక కాలమానంలో నెల మారి 1వ తేదీ వచ్చేటప్పుడూ శకమాసం పేరులోని మొదటి అక్షరాన్ని మాత్రం బ్రాకెట్లో ఇచ్చాను.ఆ నెలలో వచ్చే పండుగలు చూడాలంటే స్క్రోల్ చేసి చూడాలి.పైన నెల పేరు ఉన్న నీలపు బార్ మీద టచ్ చేస్తే తెలుగు సంవత్సరమూ ఋతువుల వివరాలతో వేరే స్క్రీన్ కనబడుతుంది.మళ్ళీ ఆ స్క్రీన్ మీద ఎక్కడ టచ్ చేసినా చాలు వెనకటి స్క్రీన్ వస్తుంది!

     ఇంక శుభసమయాలు క్లిక్ చేస్తే మొత్తం సంవత్సరంలో ఉన్న శుభసమ్యాల లిస్టు వస్తుంది - చాలా మామూలు స్క్రీన్!కాకపోతే, స్క్రీన్ మీరు క్లిక్ చెసినప్పటి రోజును హైలైట్ చేసి చూపిస్తుంది.అయితే, మొత్తం 365 రోజుల శుభాశుభాలనూ పైకీ కిందకీ స్క్రోల్ చేసి చూసుకోవచ్చు.
     మాస ఫలితాలు అనెది రాశిని బట్టి చూస్తారు.ఇక్కడ పన్నెండు రాశులనీ చూపితూ ఏ రాశివారైనా తమ రాశిని క్లిక్ చేస్తే ఆ రాశివారికి ఆ మాసానికి సంబంధించిన మంచిచెడుల ఫలితం కనబడుతుంది.నెల మొదట్లో ఆ నెలకి సంబంధించిన వివరాలే కనబడినా 20వ తేదీ తర్వాత ఇప్పటి నెలకి మరియు వచ్చే నెలకి సంబంధించిన వివరాలు కూడా కనబడతాయి.
     క్యాలెండరుకి సంబంధించిన డాటా అంతా సిద్ధాంతిగారు ఇచ్చింది ఇచ్చినట్టు బ్లాకులుగా విడగొట్టి చూపించడం తప్ప నేను ప్రత్యేకించి కష్టపడి సొంతంగా చేసింది ఏమీ లేదు.కానీ దేవాలయాలు,పరిహారాలు,శుభాకాంక్షలు/సుభాషితాలు,సామెతలు అనే సెక్షన్ల మొత్తం కంటెంటు అంతా నేను తయారు చేసిందే. ఇంక మెయిన్ మెనులో రెండో వరస మొదటి బటన్ పూర్తిగా నా సొంతం!
     ఇది దేవాలయాలకి సంబంధించిన విభాగం.పంచాంగానికీ దేవాలయలకీ సంబంధం ఏమిటని మీకు సందేహం రావచ్చు,కానీ మొదటే చెప్పానుగా మన సంప్రదాయంలో అన్నిటికీ సంబంధం ఉంటుందని!ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞులు ఐన్స్టీన్ లాంటివాళ్ళు చెప్పడానికి చాలాముందుగానే స్థలానికీ కాలానికీ అభేదం చేప్పేశారు.కాలంలో కొన్ని తిధులు ఎలా ప్రత్యేకమైనవో కొన్ని స్థలాలకీ ప్రత్యేకతలు ఉన్నాయి.

     ఇక్కడ చూపించే దేవాలయాలని మూడు రకాల లిస్టులుగా విదగొట్టాను,పైన కనిపించే మూడు ట్యాబ్ బటన్లలో మొదట default listలో అన్ని ఆలయాలూ వస్తాయి,popular ట్యాబ్ నొక్కితే ఎక్కువ పాప్యులర్(మేము అనుకుని సర్వర్ డాటాబేస్ లిస్టుని మార్చినదాన్ని బట్టి) అయిన ఆలయాలు మాత్రం వస్తాయి.మూడో ట్యాబ్ బటన్ నొకితే మొదట శివుడు,విస్ణువు,సరస్వతి,శక్తి లాంటి మాస్టర్ లిస్టు వస్తుంది.వాటిలో ఒకదాన్ని క్లిక్ చస్తే ఆ క్యాటగిరెకి సంబంధించిన ఆలయాల లిస్టు వస్తుంది.అన్ని చోట్లా చివరి లెవెల్ మీరు ఆఖరున ఎంచుకున్న ఆలయానికి సంబంధించిన వివరాలతో టార్గెట్ స్క్రీన్ వస్తుంది.ఇక్కడ ఆలయం చరిత్ర,ఆలయ విశేషాలు,ప్రత్యేక పూజలు వంటివి వివరంగా చెప్పాను.దానికి తోడు ఆలయం ఎక్కడ ఉంది,ఎలా చేరుకోవాలి అనేది కూడా చెప్పాను.వచనం అందరికీ అర్ధమయ్యే శైలిలో చక్కని పదబంధాలతో ప్రవాహవేగంతో చదివించేలా,చదివిన కొద్దీ భక్తిభావం ఇనుమడించేలా ఉంటుంది!

     ఏ ఆలయానికి సంబంధించిన వివరం అయినా మీకు నచ్చితే లిస్టులో కుడిపక్కన ఉన్న లింకు దాన్ని షేర్ చెయ్యడానికి వీలు కల్పిస్తుంది. మెయిన్ మెనులో తర్వాతి బటన్ పరిహారాలు అనేది కూడా ఒకవిధంగా ఆలయాలకి సంబంధించినదే.ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే,హిందువులకి కొన్నిసార్లు ప్రత్యేకమైన దోషపరిహారపూజలు చెయ్యాల్సి వస్తుంది - సర్పదోషం, గ్రహపీడ, వివాహప్రాప్తి, సంతానయోగం, ఐశ్వర్యప్రాప్తి, ఆయురారోగ్యం లాంటివి కొన్ని ఆలయాల్లో చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అలాంటి ఆలయాల్ని పరిహార పూజల ప్రకారం చూపిస్తున్నాము.బటన్ నొక్కితే మొదట ప్రత్యేకపూజ/పరిహారం పేర్లు వస్తాయి.వాటిలో ఒకదాన్ని క్లిక్ చేస్తే ఆ పూజల్ని ప్రత్యేకంగా జరిపించే ఆలయాల లిస్టు వస్తుంది.ఉదాహరణకి కాలసర్ప దోషం/రాహుకేతు గ్రహదోషం పూజలకి కాళహస్తి ప్రత్యేకం - ఇట్లా ఆసక్తిని బట్టి తెలుసుకోవచ్చు.

     మెయిన్ మెనులో తర్వాతి బటన్ శుభాకాంక్షలు/సుభాషితాలు మెను అనేది కేవలం వాటిని చూసి సరిపెట్టుకోవటానికి కాకుండా వాటిని మీరు మీ స్నేహితుల్లో ఎవరికయినా సందేశాలుగా పంపించుకునే వీలు కూడా ఉంది.
     లోపలికి వెళ్ళాక కుడివైపున ఉన్న బటన్ నొక్కి మీ స్నేహితులకి సందేశం పంపించవచ్చు.అది వారికి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది.మెయిన్ మెనులో తర్వాతి బటన్ సామెతలు కూడా దాదాపు ఇలాంటిదే.ఇక్కడ ఒక్కొక్క సామెతనీ వూరికే చూపించి వొదిలెయ్యకుండా,అర్ధం వివరించి,ఎక్కడ ఎట్లా ఉపయోగిస్తే బాగుంటుందో సూచన/ఉదాహరణ కూడా ఇచ్చాను.
     ఇంక మెయిన్ మెనులో తర్వాత వచ్చే చేయవలసినవి మరియు జ్ఞాపికలు అనే రెండు మెనూలు ఈ యాప్ ద్వారా మీరు రిమైండర్స్ తయారు చేసుకోవటానికి పనికి వస్తాయి.అవన్నీ లోపల వెబ్ డాటా ఇన్పుట్ ఫారంస్ మాదిరిగానే ఉంటాయి.మిగిలిన రెందు మెనూలు ఈ యాప్ మీకు నచ్చితే సోషల్ మీడియా ద్వారా ఇతర్లకి దీని గురించి చెప్పటం కోసం పెట్టినవి.

     ఇంతకన్నా ఎక్కువగా చెబితే బోరు కొడుతుంది.ఏ అప్లికేషన్ అయినా అతిగా వ్యాఖ్యానించి చెప్పకుండా ఉపయోగించే వ్యక్తి తనంతట తను తెలిసుకోగలిగితేనే అది మంచి అప్లికేషన్ అవుతుంది.చూడగానే అర్ధం అయ్యి ఉపయోగించుకోగలిగినప్పుడే తయారీదారు కొనుగోలుదారుడి అవసరాన్ని తీర్చగలిగినట్టు - ఒక కొనుగోలుదారుడిగా నేను కూడా అందుకు భిన్నం కాదు!ఆ లక్షణం ఇందులో ఉందనే విషయం మీద్వారా తెలిస్తే నాకు సంతోషం.లోపాలు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం,అయినా మీకు కనిపిస్తే చెప్పండి - వీలున్నంత తొందరగా వాటిని సరిచేస్తాం.ఏవైనా సామెతలు అందులో లేనివి,ఉంటే బాగుంటుందనిపించినవి మీరు ఉదహరిస్తే వాటినీ కలుపుతాం.సామెతల్ని నేను కేవలం లిస్టుగా ఇచ్చేసి వూరుకోలేదు,మొత్తం యాప్ హిందువుల జీవన విధానంలో అతి ముఖ్యమైన ఆలోచనా ధోరణిని తీర్చిదిద్దే అంశాలని క్రోడీకరించి చూపిస్తునాము కాబట్టి కంటెంట్ కేవలం నా స్వంతమే ఉండాలి అనే అహంకారం నాకు లేదు..శుభాకాంక్షలు/సుభాషితాలు విభాగంలో కూడా మీరు ఇచ్చిన సూచనల్ని తర్వాతి వెర్షన్లో చేర్చి యాప్ మరింత సమగ్రమైనదిగా ఉండేలా చూస్తాను.

మీ అరచేతిలో ఇమిడిపోయిన పంచాంగం ఈ శ్రీకృష్ణ తెలుగు క్యాలెండర్ యాప్!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...