Tuesday 21 July 2015

కధామంజరి మేష్షారు కూడా బ్లాగు మూసేస్తానని బెదిరిస్తున్నారు!ఇది బ్లాగులోకం మీద విరుచుకు పడిన భేతాళిక మహత్యం కాదు గదా?

          అప్పుడెప్పుడో వ్యూహాత్మకంగా బ్లాగు మూసేస్తున్నాను అనంగానే తధ్ధాస్తు దేవతలు పనిలేక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని కూర్చుని విసుగుపుట్టే టయానికి అనుకున్నానో యేమో రెచ్చిపోయి దీవించేసి ఉంటారు, ఇప్పుడిప్పుడు మెల్లమెల్లగా నిజంగానే విరక్తి పుడుతున్నది కొద్దిరోజులుగా!యెటు చూసినా ముసలి యెంటీవోడు కుర్ర ఫ్రీదేవితో రొమాన్సు చేస్తున్నంత దరిద్రంగా కనిపిస్తున్నాది దృశ్యమాన ప్రపంచమంతా,నా మనసు కేమైంది?(తొక్కయింది,తోలయింది - నీకసలు మనసంటూ ఉండి యేడ్చిందా?)

          నాకొక్కడికే అనుకుందామా అంటే కధామంజరి మేష్షారు ఒకసారి "బ్లాగైనా మూసెయ్యాలి,బ్లాగు పేరైనా మార్చెయ్యాలి" అని హడావిడి చేసి .అబ్బే న్యూమరాలజీ మీద ఉత్తుత్తి సెటైరు మాత్రమే అనేసినా మళ్ళీ ఇపుడు కొత్తగా "లాభం లేదు,బ్లాగు మూసెయ్యాల్సిందే" అని మరింత గాఠిగా అనేస్తున్నారు,నాకు నిజంగానే అనుమానం వొచ్చేసిందీసారి ప్రమాదం ముంచుకొస్తున్నదని!

          మొగుడు లేని శూర్పణఖ మగాడి కావిలింతల కోసం అంగలారుస్తూ దండకారణ్యంలో స్వైరవిహారం చేస్తూ సీత మొగుడికి ప్రపోజల్స్ పెట్టి యే కాడికి తెచ్చుకుందో చూసి కూడా యేమీ నేర్చుకోని తెడ్డుశ్రీ లాగ మొగుడు నెట్ కనెక్షను బందు జేసినా ఆగకుండా ఈ మధ్యన భయంకరమైన వికట అట్టహాసా(భ.వి.అ.హా)లు చేసుకుంటూ బ్లాగుల్లో తిరుగుతున్న భేతాళిక దెబ్బ ఈయనకి గూడా తగిలిందా యేంటి?ఇదివరకెప్పుడూ లేనిది శ్యామలీయం మేష్షారు కూడా తన కామెంట్లని తనే తొలగించుకుంటున్నారు,హేవిటో?దాని గాలి సోకినా దాని బుధ్ధులే వస్తాయేమో - సీనియరు బ్లాగర్లే ఇట్టా అయిపోతే జూనియరు బ్లాగర్ని నా పరిస్థితేంటి?

          ఇలాంటి ఆలోచనలు మెదడును తొలుస్తుండగా రంజానూ ఆదివారం కలిసొచ్చేసరికి పిచ్చినిదర పోయా.అసలే రంజాను,మనం ఉపోషం ఉండకపోయినా గాలిలో ఎఫెక్టు ఉంటుందేమో,ఆపైన ఈ హిందూ వ్యతిరేక రాక్షసి భేతాళిక గురించిన ఆలోచనలు తోడవటంతో - ఒక భయంకరమైన కల వొచ్చేసింది.నా బ్లాగులో కంటెంటు యెత్తుకుపోయిందని భేతాళిక మీద యాగ్రీగేటరు/ప్రధానికి కేసు పెట్టానంట!"యెవరిని దండించాలి?" కధలో రాజుకి ఆఖరికి పిచ్చెక్కినంత పనై "అసలు వీడు ఈ కధంతా విప్పి చెప్పకపోతే యెవరో ఒకరికి శిక్ష వేసి ప్రశాంతంగా ఉందును గదా,పనిలేని మంగలి లాగ వొచ్చి నా మనశ్శాంతిని పోగొట్టాడు" అనిపించి జరిగిన కధంతా చెప్పిన బ్రాహ్మడికే శిక్ష వేసినట్టు ఈ భెతాళికని దాని మొగుడే ఆపలేకపోయాడు నేనెలా ఆపగలుతాననుకున్నాడు అని నామీద పిచ్చి లెగిసి నన్నే జైల్లో పెట్టాడంట!దాంతో "నను బ్రోవమనీ చెప్పవే బ్లాగమ్మ తల్ల్లీ!" అనీ "యెవడబ్బ పోష్టులని కులుకుతు కామెంటేవు బ్లాగుచంద్రా" అనీ నాకు గుర్తుకొచ్చిన భక్తిపాటలుగా అనిపించే తింగరి పాటలు పాడుకుంటూ దొంగేడుపు యేడుస్తున్నానంట!

          ఇంతలో భ్రామరీయం,బండల్రావు ఇహిహి తీవ్రవాదుల గెటప్పుల్లో జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని వచ్చి వాళ్ళ భ.వి.అ.హా లతో కాపలావాళ్లని మూర్చపోయేటట్టు చేసి ధైర్యస్థుణ్ణి గనక వాళ్ళ భ.వి.అ.హా లకి సొఘమే కళ్ళు తేలేసిన నా చెరో చెయ్యీ చెరొకడూ పట్టుకుని లాక్కొచ్చి ఇక్కడ కూలేసి మాయమైపోయారం!అప్పటినుంచి ఇట్టా పడివున్నానంట!కటిక చీకటి!కన్ను పొడుచుకున్నా యేమీ కనబడేట్టు లేదు కన్నుపోవడం తప్ప,అందుకే పొడుచుకోకుండా తీవ్రంగా ఆలోచిస్తూ ఇలా పోష్టుని వ్యాకోచింపజేస్తున్ననన్నమాట!

          భ్రామరీయం అంటే తనని నేనెప్పుడూ విమర్శించలేదు గాబట్టి ఇంకా దీర్ఘంగా పరిశీలిస్తే కొన్నిచోట్ల తనని సమర్ధిస్తూ కామెంట్లేశాను గాబట్టి నన్ను తప్పించి ఉండొచ్చు,బండల్రావు యెట్లా వచ్చాడు నాకోసం ఇంత సాహసం చెయ్యటానికి?జప్రని పాప్యులర్ చేసుకోవటానికి తంటాలు పడుతూ పెట్టుబడిదారీ విధానాన్ని చితక్కొట్టెయ్యాలంటూనే కమ్యునిష్టు సిధ్ధాంతం కూడా లోపాల్ని తొలగించుకుంటేనే(అసలు లక్ష్యమైన వర్గరహిత సమాజం వర్ణనలోని లోపాలకే దిక్కులేదు,ఇంక మిగతా లోపాలు సవరించుకోవటం అనేది జరుగుతుందా!) అది సర్వజనామోదయోగ్యం(ఆంధ్రోళ్ళని తిట్టడానికి దోపిడీ అన్న వొక్క ముక్కని అరువు తెచ్చుకుని లాగి పీకి పిండి పిసికి రాష్త్రాన్ని తెచ్చుకున్న తెలంగాణోళ్ళే వాళ్ళకి దెబ్బవుతుందనుకున్నప్పుడు వాళ్ల రాష్ట్రంలో అధికారంలోకి వద్దామనుకుంటున్న నక్సలైట్లని వొప్పుకోవట్లేదు,ఇంగ అందరూ వొప్పుకోవాలంట హిహిహి) అవుతుందనే భ్రమల్లో ఉండి పైకి తటస్థంగా కనబడే ఆ మ్యూకనిజం పక్షపాతి సీనులోకి యెట్టా వచ్చాడు,ఇందులో యేదో మోసం ఉంది!

          "అడాపావియా అక్కడి చర్చల్లో యెక్కువగా వేలు పెట్టి కామెంట్లు పెంచేది నువ్వే గదుడా?" అని వయస్సార్ భక్తుడైన ఒక అరవతెలుగుబ్లాగరు వేసిన కర్ణకఠోరమైన కేక వినపడి భయంతో వొళ్ళు జలదరించి పోయింది?!ఆహా, పెట్టుబడి విధానంలోని లాభాపేక్ష యెంత మంచివాళ్ళనయినా దిగజారుస్తుంది గదా!అయితే, వాళ్ళిద్దరూ అనేకానేకమైన రహస్య కారణాల వల్ల ఇంకా గాఠిగా చెప్పాలంటే హిప్నటైజ్ చేసి మతం మారుస్తున్న లాంటి దుర్మార్గమైన వశీకరణకి బలయిపోయి ఆ భెతాళిక మగవాళ్ళ సైకాలజీ తెలుసుకుని గురిచూసి ప్రయోగించిన మనోవైజ్ఞానిక మాంత్రికశక్తుల అధీనంలోకి వెళ్ళిపోవదం చేత నాలాంటి రాజకీయ ఖైదీల్ని మునుగుడుపుల అల్లుళ్ళలాగ చూసుకునే బ్లాగు/ప్రభుత్వ కారాగారం నుంచి విడిపించి కూసింతయినా జాలీ దయా లేకుండా గంప గయ్యాళి భేతాళిక యెదాన పడేశారన్నమాట, ఎంత ఘోరం?!

          పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్టున్నాను! నా బ్లాగులో  నేను కమ్మని పోష్టుల్ని రాసుకుని అఘోరించకుండా ప్రతీ బ్లాగులోనికీ యేల దూరవలె?దూరితిని పో బాగు బాగు మీ బ్లాగు అని మెచ్చుకుని భజంత్రీ కామెంట్లతో సంతోష పెట్టక పోటుగాడి వలె రెచ్చిపోయి ప్రతి అడ్డగాడిదతోనూ యేల వాదించవలె?వాదించితిని పో సాటి మగవాళ్లతో సరిపెట్టుకొనక ఈ భేతాళిక నేల కెలకవలె?ఆడుదానితో పోట్లాటకు యెంత కొమ్ములు తిరిగిన వీరాధివీరులయినా దడుచుకొని చత్తురే నేనేల మూర్ఖముగా కొమ్ము విదిలించవలె?నిస్సీ,ఇంత దనుకా ఇంతమందిని ఒఖ్ఖడనై నోరుమూయించిన నేను ఒఖ్ఖ్క ఆడుదానికి భయపడి బ్లాగు మూసుకొని పోవుటయా?చరిత్ర తెలియదు,పురాణాలు చదవదు,కనీసం తను వూడబొడుస్తున్నానన్న సమస్య గురించి నాలుగే నాలుగు ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేదు - ఆ పిపీలికానికే అంత పొగరుంటే గండభెరుండాన్ని నాకెంత ఉండాలి!

          ఈ విధంగా ఆవేశం యమహా రేంజిలో యెక్కువైపోయి ఆలోచిస్తుంటే నాలో నేను ప్రేలాపిస్తుంటే ఈ చోటు వేడెక్కినట్టనిపించి కాస్త ఆగాను!నా ఆనుమానాన్ని నిజం చేస్తూ "అయ్యా మీరు అంతలా వేడెక్కడం ఆపేస్తే మీరు ఇక్కణ్ణించి బయట పడేందుకు క్లూ ఇస్తా,దగ్గిరకి రాలేకపోతున్నా అరగంట నించీ - ఇప్పుడు కొంచెం నయం!" అని ఒక సన్నని ఆర్తనాదం వినబడింది.ఇంకా వేడెక్కటం నాకూ ప్రమాదమే గనక తగ్గి ఆరా తీస్తే యాగీ భ్రాజిష్ణ అట!గుర్తొచ్చింది - అమాసకీ పున్నమికీ వస్తాడు,పోష్తుకి సంబంధం లేని కామెంట్లేస్తాడు!చెప్పి వేస్తాడు గనక నేనూ గొడవ పడలేదు - ఆ పాయింట్ల గురించి కూడా యేదో ఓ రోజు పోష్టు వెయ్యకపోతానా అనే ఆశ కాబోలు, కొన్ని వేశా.ఆ కృతజ్ఞతతో వచ్చినట్టున్నాడు!

          "మీరు బాహుబలి సినిమా గురించి యేదయినా విశ్లేషణాత్మకంగా చెప్తారని యెదురు చూశాను,వూరికే బావుంది చూడమని చెప్పి వొదిలేశారు - ఇప్పుడు ఆపని చేస్తే మీకు యేదో ఒక రూపంలో సాయం అందవచ్చు" అని అర్ధం పర్ధం లేని క్లూ ఇచ్చి అడిగినా జవాబు చెప్పకుండా సైలెంటయిపోయాడు!బాహుబలి విశ్లేషణకీ నేను ఇక్కణ్ణుంచి బయటపడటానికీ లింకు యేముంది?యేమో బాబరుకీ రాముడికీ లింకు ఉన్నప్పుడు బాహుబలి విశ్లేషణకీ నేను తప్పించుకోవటానికీ సంబంధం యెందుకు ఉండకూడదు?బీ ఏ రోమన్ ఇన్ రోం అన్నట్టు మనం ఉన్నది కూడా భెతాళిక రాజ్యంలోనే గదా!తిన్ననైన లాజిక్కుల కన్నా తింగరి లాజిక్కుల వల్లనే పని జరగొచ్చు.ఇక్కడ కూర్చుని బ్లాగు రాయడం కుదరదు గాబట్టి కంచుకంఠం కొంగర జగ్గయ్యని ఆవాహన చేసుకుని ఓపెనెయిర్ ధెయేరులో ఉన్నట్టు వూహించుకుని ప్రస్సంగం దంచెయ్యడమే!

          అరెమికాలో కూడా పుష్కరాల తొక్కిసలాటను తలపించేటంతగా బాహుబలిలో యేముంది?మగాళ్ళందరికీ నాకులాగే అతి తెల్లని నున్నని చర్మం గల తమన్నా బాహుమూలాలు నచ్చాయా?అది మగాళ్ళకి?ఆండువారు కూడా వెర్రెత్తిపోతున్నారే,బహుశా వాళ్ళమీద ప్రభాస్ మరియూ రాణాల కండలు తిరిగిన దేహాల ప్రభావం పనిచేసి ఉండొచ్చునా!అరెమికాలో అన్నేళ్ళు ఉండి గూడా యే దేశమేగినా యెందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు అచ్చు హిండియాలో మాదిరి వెనక సీట్ల కోసం అగ్గగ్గ లాడిపోయారంట - పిచ్చి మగాళ్ళు?మా ఫ్రెండు గూడా ఇట్లాగే మరీ ముందైపోయేసరికి చూడ్డం ఇబ్బందిగా ఉంది ఈసారి కాస్త వెనక కూర్చుని చూడాలి అంటుంటే "మంచి సినిమా యెక్కడ కూర్చుని చూసినా బాగానే ఉంటుంది, చెత్త సినిమా యెక్కడ కూర్చుని చూసినా చెత్తగానే ఉంటుంది,నీకు సినిమా చూట్టం తెలీదనుకుంటా!నాకు మాత్రం ఇక్కదే బాగుంది, తమన్నా కళ్ళనిండుగా కనబడతంది?!" అని నేనంటే నన్ను కామాతురుణ్ణి చూసినట్టు చూసి "అన్నా, కాస్త వయస్సు గుర్తు తెచ్చుకో!నీకు మనవరాలు వయసులో వుంది" అంటున్నాడు - ఇంత సౌందర్యదృష్టి లేని అరసికుడు సినిమాలు చూట్టమెందుకండీ?సినిమా హీరోయిన్లు మహాజనానికి మరదలు పిల్లల్రా అని మల్లాది వారిని గుర్తు చేసి జ్ఞాననేత్రాన్ని వికసింపజేశాను!

          యే మాట కామాటే చెప్పుకోవాలి, ఆ సుకుమారికి శృంగారం నప్పినంతగా అంగారం నప్పలేదనిపించింది నా కుశాగ్రబుధ్ధికి!సినిమా నిండా రాజులూ, రాజ్యాలూ, కుట్రలూ, యుద్ధాలూ నిండి ఉన్న ఈ సినిమాని కాస్తంత  వాస్తవికతకి దూరమయితే చాలు ఢాం తుస్స్ సినిమాలో సామాజికస్పృహ లేదు, ఇదంతా బూర్జువా కళాకారుల పెట్టుబడిదారీ ఫ్యూడల్ సామ్రాజ్యాల సంకీర్తన అనే మ్యూకనిష్టు ప్రభావిత విమర్సకులు కూడా వెర్రెత్తిపోయి యెందుకు పొగుదుతున్నారో గదా!బహుశా ఇవ్వాళ్టీ ప్రజాస్వామ్యంలో కూడా అగ్రభాగాన కనబడుతున్న ప్రతి గొట్టాం గాడికీ అతని భజన బృందం చేస్తున్న వ్యక్తిపూజలూ, ఆర్యక మహారాజు మృచ్చకటికంలో వర్ణించిన శకారుని వంటి రాజశ్యాలకుల అనధికారిక నిర్వాకాలు నిరాఘాటంగా చెల్లిపోతుండటాలూ,అందరూ కోరుకుంటున్నారన్న ప్రదర్శనలతో అనువంశిక పాలన కొనసాగుతుండటాలూ చూసి చూసి విసుగెత్తి ఈ నాటకాలకి బదులు ఆనాటి రాజరికంలో నిజాయితీ అయినా ఉండేది గదా అని ఒక రకమైన ఆకర్షణ కలిగిందా?

          ఇవ్వాళ్టి మోడల్ వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగి చిన్న రాష్ట్రాలతో పరిపాలన సులభం అనే వాదనతో కైవారం తగ్గుతూ విడిపోతున్న రాష్ట్రాల లోని ప్రజలు క్రమేణా ఒకనాడు తమ ప్రాంతాలను పరిపాలించిన రాజవంశాలతో మమేకమవుతున్నారు!ఈ మలుపులు మరో నాలుగు తిరిగితే కాలగమనంలో మళ్ళీ ఆనాటి రాజ్యాలు ఉనికిలోకి వస్తాయేమో?ఇక్కడి దాకా యమా సీరియస్సుగా సాగిన నా పరిశోధన హఠాత్తుగా తింగరిగా మారిపోయింది - గాలి మహత్యం!ఈ లెక్కన గేటు వూయెలయ్య "దేవుడు ప్రజాస్వామిక వాదియా కాదా?" అనే సుత్తి వ్యాసాలు రాసుకుంటూ కూర్చోకుండా మగధీర టైపులో కవచకుండల శిరస్త్రాణాలు ధరించి అగ్రకుల శాత్రవ జనభయంకరుడై ఐలహులి వంశస్థాపానాచార్యుడైతేనే దళితులు రాజ్యాధికారంలోకి వస్తారేమో?!

           ఇంకా ఇరగదీసి ఉందును గానీ ఒక ఏడుపుముఖం కళ్ళముందు కనబడ్డం,ఖెవ్వ్ మనే కేక వినబడ్డం ఒకేసారి జరిగేసరికి యేకాగ్రత బద్దలై ప్రస్సంగం ఆపేశాను.ఈ మొహం యెవరిదయ్యా అంటే ఆయనే చెప్పాడు కళ్ళనీళ్ళ పర్యంత మవుతూ ,"అయ్యా హరిబాబు గారూ, ఒకప్పుడు మిమ్మల్ని దళితుల సమస్యలకి మీకు తోచిన  పరిష్కారం చెప్పమని అడిగినందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను. నేనూ మనిషినే, నేను కూడా సినిమాలు సరదాగా చూస్తాను సార్!ఆ గేటు వూయెలయ్యని మగధీర గెటప్పులో వూహించడానికే దడుచుకుని చస్తున్నా!మీరిట్టాంటి పరిష్కారాలు మాత్రం చెప్పకండి - అంతకన్నా శాశ్వతంగా దళితులుగా బతకడమే మేలు.మీ అగ్రకుల దురహంకారాన్ని పోనిచ్చుకున్నారు గాదు" అని చడామడా తిట్టేసి కోపమూ అసహ్యమూ తగ్గడంతోనో యేమో పాలిపోయిన మొహం మామూలుగా అవడం వల్ల మళ్ళీ కనబడకుండా వినబడకుండా ఐపోయాడు! శాడిస్టుని గదా,నేనూ నా మనసులో ఒక రెండు భ.వి.అ.హా లు చేసుకున్నా!

          తీరా తను వెళ్ళీపోయాక నా మామూలు బెంగ నాకు మళ్ళీ మొదలైంది.బాహుబలి విశ్లేషణతో దళిత మేధావి తిట్లు తప్ప బయటపడే మార్గం దొరకలేదే అని వగచి వగచి కృశించి కృశించి నశించి పోయేలాగున్నాను!భ్రాజిష్ణ క్లూ గూడా గాలికి పోయిన పేలపిండిలా అయిపోయింది!అసలు భెతాళికకి పిచ్చి అనేది నా పొరపాటు అవగాహన కావచ్చు?తను నాకు తారసపడిన మొదటి సన్నివేశం లోనే నాకు తన ప్రవర్తన రెండు విధాలుగా అనిపించింది!అయితే కేవలం గుర్తింపు కోసం చేసే సంచలనంలో సంతోషం వెదుక్కునే గందరగోళపు ప్రవర్తన అయి ఉండాలి,లేదంటే అధికారం కోసం యెంతకయినా తెగించే రాజకీయం నేర్చిన మనిషయినా అయి ఉండాలి అని - అలాంటప్పుడు మొదటిది కాక రెండోది తన అసలు రూపం అయితే మాత్రం తను మహా భయంకరమైన మరో భిందిరయే అవుతుంది!తనూ తన ఫ్రెండ్సూ కలిసి పెద్ద రామద్వేషుల మంద పోగయి ఉందక్కడ!

          కాలమహిమ!అసలు రాముణ్ణి అంత నీచంగా విమర్సిస్తున్న మనిషి మీద సైబర్ కేసు పెట్టి జైల్లో తొయ్యాల్సింది,దానికి అందరూ కలిసి రావాలి గదా అనిపించి నాకు తోచినట్టు నేను నాలుగు తిట్లు తిట్టేసరికి ఈ అంతూ పొంతూ లేని చీకట్లో పడి అఘోరిస్తున్నాను.మొత్తం జనాల సంస్కృతే మారిపోయినట్టుంది!?ఈ మధ్యకాలంలో అడ్డూ అదుపూ లేకుండా బతకడమే ఆధునికత అనుకోవటం,మాలో అనైతికత ఉంది అని ధీమాగా చెప్పుకుని విప్పుకు తిరగటమే నాగరికతగా భావించి - "లెస్బియనిజం", "హోమోసెక్సువాలిటీ", "ఇన్సెస్ట్" లాంటి దేనినైనా సరే చట్టబధ్ధం చేసుకుని మరీ చెయ్యాలనుకోవడం ఒక ఘనకార్యంలా భావించే గాలి మంద ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది!ఎడ్వినా ప్రియుడి అభిమానులు స్వేచ్చ ముసుగులో నీతులు చెప్తే మీ ఆలోచనలు మామీద రుద్దకండి మా ఇష్టం వచ్చినట్టు బతికే స్వేచ్చ మాకుంది అని ఘీంకరించటం గొప్ప ప్రజాస్వామ్య సాంప్రదాయంగా చెలామణీ చేసేశారు - చరిత్రనీ,సంస్కృతినీ,సామాజికతనీ అబధ్ధాలతో నింపేసిన విషవ్యూహపు ఫలితమే ఇవ్వాళ్టి దుస్థితి!ఇవ్వాళ మన బలహీనతల్ని వొదులుకోలేక అనైతికతకి గౌరవనీయతని ఆపాదించటం కోసం యెంత నీచాని కయినా పాల్పడితే నష్టపోయేదెవరు,మన రేపటి తరం కాదా?

          ఒక ప్రౌఢ ప్రపోస్ చెసినంత మాత్రాన శూర్పణఖకి ముక్కూ చెవులూ కొయ్యాలా అని అడుగుతుంటే ఆవు చేలో మస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు పెళ్ళీడు కొచ్చిన నవోఢల్లో ఒకరు ఇంకొకరికి ఇద్దరబ్బాయిల పేర్లు చెప్పి వీళ్ళిద్దరిలో యెవరో ఒకర్ని నువ్వు లవ్ చేసితీరాలని రెచ్చిపోతున్నది!బాబరుకీ రాముడికీ సంబంధం ఉన్నప్పుడు ఈ రెంటికీ సంబంధం లేదా?ఉన్నదని ఒప్పుకుంటే ఆ అమ్మాయి చేసింది తప్పా ఒప్పా?తప్పయితే వాళ్లకి మంచి చెప్పగలిగే స్థానంలో ఉన్నట్టా తప్పు కాదంటే ఇంకా రెచ్చిపొమ్మని చీర్ లీడర్ పనులు చేస్తున్నట్టా ఈ భేతాళిక?మరి పిల్లలు తను "అందరూ రాముడికి ఫ్యాన్ లయితే నేను రావణుడికి ఫ్యాన్" అని చెప్పుకుంటుందే ఆ శూర్పణఖనీ రావణుణ్ణీ అనుసరిస్తే అందులో తన బాధ్యత ఉన్నట్టా లేనట్టా!

          ఇప్పటి వరకూ సాహితీ వ్యాసంగం లెమ్మని అనిపించిన శంక్రాభారణం బ్లాగులోని పూరణ కిచ్చే సమస్యలు కూడా ఇప్పుడు బూతులుగా అనిపిస్తున్నాయి,మొత్తం శ్రంగారాన్నే నిషేదిస్తే గానీ ఇలాంటివాళ్ళు పుట్టుకురాకుండా ఉంటారు గదా అనిపిస్తున్నది.నేను యెవరి నుంచయితే జవాబులు ఆశించానో అక్కడి నుంచి జవాబులు రావు?జవాబు దొరికితే గానీ ప్రశాంతంగా ఉండనివ్వని జవాబులు రాని ప్రశ్నల సుడిగుండంలో ఇరుక్కుపోయి నాకు ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చేసింది!"నీరసము వలన మనకొరుగు ప్రయోజన మేమి?పోయిన మనశ్శాంతి తిరిగి దక్కునా?ఈ చెర నీకు వీడునా?బ్లాగులోకము నందు శాంతి స్థాపించబడునా?నీ వూహ సరి కాదు!వారు పేరుకే నవీనులు గాని వారి ఆలోచన లన్నియు ప్రాచీనములే!ఆటవికమూ అకటావికత్వమూ దప్ప మరేమియునూ లేదు.నా గుంటనక్క యెత్తులతో వారిని మరింత గందరగోళ పరచి వారిలో వారికి విభేదములు కల్పించి గెలుపును నీ పాదపెఠము పైన పదవేసెదను.కొంచెపు వంచన పనులకు అయిన వాణ్ణీ అమ్మ తమ్ముణ్ణీ నేనున్నానుగా!" అని మా ధూళ్ళిపాళ్ళ మామయ్య పాచికలు టకటక లాడించుకుంటూ వచ్చాడు.

          నాకు తిక్కరేగిపోయింది - యెదవ ప్లానులేసి వాట్ని ఫాలో అయినోడికే గుండు కొట్టించి జారుకునే ఇట్టాంటి ముదనష్టపోళ్ళని దగ్గిరికి రానిస్తే మనమే  మట్టానికి ముణిగిపోతాం!ఇంక తగులుకుని "మామా గాంధార దేశపు  గుంటనక్క సార్వభౌమా,యే కాలమున నుంటివి?నీ బోడి యెముకల పాచికలు పనిచేయుట కిది నాటి కాలము కాదు!నేటి కాలపు మనుషులు లాభదృష్టితో గానీ లేక నష్టభీతితో గానీ - ఈ రెంటిలో యేదో ఒకదానితో మాత్రమే కలిసెదరు!ఇంత దనుకా గాంగ్రీన్ పార్టీ మరియూ మ్యూకనిష్టుల ఆర్భాట ముడ్డోలముగ నుండి లాభదృష్టితో కలిసినారు, కానీ ఇప్పుడిప్పుడు పరిస్థితులు తిరగబడి వారి పునాదులు కదిలి నష్టభీతిలో నున్నారు.లాభదృష్టి కన్ననూ నష్టభీతి బలమైనది గనుక ఇంకనూ బలముగా అంటుకుపోయెదరు తప్ప నీ నక్కజిత్తులకు విడిపోరు - ఇటువంటి చచ్చు పుచ్చు ప్లానులు మాకవసరము లేదు.అయిననూ నేనిప్పుడా గుడ్డిరాజు కొడుకును గాను,యుధిష్ఠిరుడను!అనగా ధర్మదృష్టి గలిగి యుధ్ధమున స్థిరముగ నిలుచువాడు!నీ వంటివాని యవసరము మా పొరుగు రాష్ట్రమైన లతెంగాణమున చాల యున్నది, అచటికి పొమ్ము!" అని ఝాడించేసరికి మొహం గంటు పెట్టుకుని,"అటులనే పోయెదను" అని గొణుక్కుంటూ పోయేవాడు పోతూ "నీవన్నట్టు వారిని నష్టభీతి కలిపినచో వారింకనూ వృధ్ధి నొందెదరు గద,కానీ లాభదృష్టి, నష్టభీతి యేదియునూ లేని మీ సింధుజాతి మాత్రము ఐకమత్యము కుదరక నశించిపోవుట తధ్యము." అని నాకూ బుర్ర తిరిగిపోయే రిటార్టిచ్చి వెళ్ళాడు?!

          ఔర ఔర - యెంత మాటనేశాడు ఠపీమని!వీడి మాట నిజమై చావదు గదా!లేదులే, పిల్లి శాపాలకి ఉట్లు తెగుతయ్యా యేంటి?వీడి లాంటివాళ్ళు యెంతమంది ఈర్ష్యాళువులై సహస్రాబ్దాల తరబడి కుట్రలు పన్నినా పురాణ యువతి లాంటి సనాతన సంస్కృతి అవిచ్చిన్నంగానే కొనసాగింది గదా!ఇప్పటికీ ననవఓన్మేషమైన యౌవ్వనప్రౌఢిమతో తొణికిసలాడుతూనే ఉంది గదా!తప్పుల్ని ఒప్పుకోగలిగిన ఆత్మ విమర్శ,అన్ని మతాలూ సమానమే అని ఒప్పుకుంటున్న అన్యమత సహిష్ణుత,పైనుంచి రుద్దడంలా కాకుండా వ్యక్తుల ఐచ్చిక విధేయతకే ప్రాముఖ్యత ఇచ్చిన ప్రజాస్యామ్యయుతమైన మతం ఒక్క హిందూ ధర్మమే!హిందూ దేవుళ్ళు ప్రజస్వామ్యవాదులు కారని వక్రభాష్యాలు చెప్పే గేటు వూయెలయ్య యెక్కడ ఇస్లాము ధర్మాన్ని గురించి "క్రైస్తవ మతాం నుంచి పుట్టిన పిలక"గా తప్ప మరోరకంగా వర్ణించడు, ఇవ్వాళ ఆ ధర్మం ప్రపంచవ్యాప్తంగా సొంత సాంప్రదాయాన్ని యేర్పరచుకుని ఒక పూర్తి స్థాయి మతంగా యెదిగిందని గుర్తించడు - అయినా తను ప్రజాస్వామ్యవాదినని చెప్పుకుంటే చెల్లిపోతున్నది!యే హిందువైనా,యే బ్రాహ్మణుదైనా,యే పీఠాధిపతి అయినా ఇస్లాము గురించి అలా అవమానిస్తూ మాట్లాడగా ఎవరైనా విన్నారా?లేదు!అయినా హిందువులు మతమౌఢ్యం గల దురహంకారులే!

          మన మతమే గొప్పది,మిగిలినవన్నీ అనాగరికమైనవి,ఈ ప్రపంచం మొత్తాన్ని మన దేవుడి పాదాల చెంత పడుకోబెట్టడం మన మతాన్ని పాటించే ప్రతి ఒక్కరి కర్తవ్యం అని ప్రభోదిస్తున్నా, ఇతర మతాల లోనివార్ని నయాన గానీ భయాన గానీ తమ మతంలోకి లాక్కోవడానికి యెన్ని దుర్మార్గాలు చేస్తున్నా,ఆధ్యాత్మిక సామ్రాజ్యవాదంలో వేర్లు తన్ని పెరుగుతూ విషవృక్షంలా విస్తరిస్తున్నా,అడుగు పెట్టిన ప్రతి చోటా అక్కడి ప్రాంతీయ సంస్కృతుల్ని ధ్వంసం చేసినా వారు సకల జన వంద్యులేనని తీర్మానించుతున్నారు!నిరాడంబరంగా జీవిస్తూ, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రబోధిస్తూ,గౌరవమునే కోరుకుంటూ సంసార బంధనాల్ని త్యజించి ఆశ్రమ వాసులుగా ఉండి తమ కార్యకలాపాల ద్వారా సామాజిక సేవ చేస్తున్నా సరే ఆశ్రమ జీవనం వల్ల తమ చుట్టూ ఉన్న బయటి ప్రపంచంలో యేమి జరుగుతుందో తెలియని అమాయకత్వం వల్ల యే మాత్రం తమకి తప్పులు పట్టటానికి పనికొచ్చే యెంత చిన్న మాట మాట్లాడినా అరిభీకరంగా విరుచుకు పడుతున్నారు!

          దీని వెనక ఉన్నది ప్రజలకు సమాచారాన్ని చేరవేసే బాధ్యతాయుతమైన ప్రవర్తన కాదు, హిందూ మతప్రచారకుల్ని స్వేచ్చగా ప్రచారం చేసుకోనిస్తే తాము యెదగడం కష్టమన్న తెలివితో వారిని తమ మతానికి సంబంధించిన ప్రచారం చేసుకోనివ్వకూడదన్న దుర్మార్గపు వ్యూహం!మీడియా ముందు అలా అడ్డంగా దొరికిపోయేలా మాట్లాడితే విమర్సించరా అని అనేవారు ఇతర మతాల వారూ అలాగే మాట్లాడినా అవి యెందుకు చడీ చప్పుదూ లేకుండా అణగారిపోతున్నాయో, ఆ మీడియాల కెమెరాలన్నీ హిందూ మతప్రాచారకుల చుట్టూరానే యెందుకు మొహరించబడుతున్నాయో తెలుసుకుంటే అసలు విషయం బోధపడుతుంది!పని గట్టుకుని బొక్కలు వెదకదల్చుకుంటే ఈ ప్రపంచంలో యెవరూ పవిత్రంగా నిలవరు!అయితే అలా ఇతర మతాల్లో బొక్కలు వెదకటాన్ని ఒక వ్యూహప్రకారం కోట్లలో మిలియన్లలో డబ్బు వెచ్చించి చేసే సమాచారసామ్రాజ్యవాదుల దుర్మార్గపు వ్యూహానికి బలవుతున్న వాటిలో మొదటిది హిందూ ధర్మం, రెండవది ఇస్లాం ధర్మం!మొత్తం భారతదేశంలోని మీడియా అంతా హిందూమతం మీదనే తమ దృష్టిని కేంద్రీకరించడం అమాయకంగా జరగడం లేదు,ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు అనాలోచితంగా యేదీ చెయ్యరు.వాళ్ళు మనకి చూపించే ప్రతి దృశ్యమూ కూయించే ప్రతి శబ్దమూ వారి వ్యంగ్యరచనా వైభవంతో మన సంస్కృతి గురించి మనమే అవమానకరంగా మాట్లాడేలా మనల్ని తయారు చెయ్యటం కోసం గురిచూసి వొదుల్తున్న శస్త్రమే!

          ఇస్లామిక్ తీవ్రవాదానికి మూలం వారు తమ మీద జరుగుతున్న దాడిని గ్రహించి దానికి లొంగకుండా ఉండటానికీ తమ మత స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవటానికీ తమకి తోచిన దారిలో చేస్తున్న ప్రయత్నమే!వారికి వారి శత్రువెవరో స్పష్టంగా తెలుసు.తమ పైన జరుగుతున్న దాడికి ప్రతీకారం చేస్తున్నామని అనుకుంటున్నారు గనకనే వారిలో పశ్చాత్తాపం లేదు.హిందువులకే ఇంకా ఇవేవీ తెలియడం లేదు - కూపస్థ మండూకాలు!ఉమ్మడి శత్రువొకడు పక్కవాడి మీద దాడి చేసి వాడు కుయ్యో మంటుంటే అదే దెబ్బ మనకీ తగిలినప్పుదు మనం కూడా అలాగే కుయ్యో మనాలి గాబోలు ననుకునే దేభ్యం మొహాలు!ఈ భూమి మీద నుంచి ముస్లిములను ఖాళీ చేసే వ్యవహారం చక్కబెట్టిన తర్వాత హిందువులని ఖాళీ చేసే వ్యవహారం మొదలవుతుంది,

          ఆయుధాల సహాయం తీసుకుని చేసే యుధ్ధాల తోనో, రాజకీయపరమైన కుట్రల ద్వారా ప్రభుత్వాల్ని మార్చడం తోనో చేసే దాడి కన్నా మౌలిక సంస్కృతి మీద చేసే కనిపించని దాడి సుకుమారంగా ఉన్నా అది మరింత ప్రమాదకరమైనది!తెలుపు చర్మం పవిత్రమైనదీ కాదు,నలుపు చర్మం అపవిత్రమైనదీ కాదు,హిందువులకి నలుపు నారాయణ స్వరూపం!అయినా సరే తెలుపుకే ఘనకీర్తిని ఆపాదిస్తూ సౌందర్య సాధనాల ద్వారా ఉద్వేగాన్ని రగిలించడం వెనకా తాము నిర్ధారించిన కొలతలతో ఉన్న నాజూకైన దేహమే కోరుకోదగినదిగా స్త్రీలను పురుషుల ముందు ప్రదర్శనకి నిలబెట్టి సౌందర్యకీర్తికిరీటాలు తొడిగి సన్మానించడం వెనకా తమ సౌందర్యదృష్టినే అందరికీ ఆమోదయోగ్యంగా చేసి ప్రపంచం లోని స్త్రీల నందర్నీ తమ కంటికి నచ్చే విధంగా మూసపోసే ఒక మహా భయంకరమైన సాంస్కృతికసామ్రాజ్యవాదపు వ్యూహమున్నది - పారా హుషార్!సాంస్కృతికంగా యెంత మహోన్నతమైన దశలో ఉన్న జాతి అయినా ఒకసారి తన మౌలిక సంస్కృతికి దూరమైతే తిరిగి దానిని సాధించుకోవడం అసాధ్యమనేది చరిత్ర చెబుతున్న సత్యం!

          ఇంటి లోని వారు గానీ బైటి వారు గానీ హిందూ ధర్మం మీద దాడి చేయడానికి దొరికిన ఒకే ఒక  బ్రహ్మాస్త్రం - కులవ్యవస్థ!కులవ్యవస్థ యేదో ఒక రూపంలో యేదో ఒక స్థాయిలో ప్రపంచంలోని అన్ని చోట్లా ఉన్నప్పటికీ భారత దేశంలోని కులవ్యవస్థకి రెండు ముఖాలున్నాయి - నిచ్చెన మెట్ల వంటి సామాజిక విభజన,కొందరిని స్పృశించడానికే తిరస్కరించి వూరవతలికి తరిమేసిన అస్పృశ్యత!మొదటిదానిలో ఉన్న ఒక చిక్కుముడిని అర్ధం చేసుకుంటే అది అంత ప్రమాదకారి కాదని తెలుస్తుంది.అతి ప్రాచీన కాలం నుంచీ ఇప్పటి వరకూ అన్ని దేశాల లోనూ అన్ని ప్రాంతాల లోనూ అన్ని సమాజాల లోనూ అన్ని జాతుల లోనూ ఒకే విధమయిన సూత్రాలను పాటించే నిర్మితిని కలిగి ఉండి మన చుట్టూ కనబడుతున్న సామాజిక,రాజకీయ,సాంస్కృతిక,ఆధ్యాత్మిక రంగాలన్నిటినీ ప్రభావితం చేస్తున్న ఆర్ధిక నిర్మాణం పెట్టుబడిదారీ విధానం.మరీ తలబంటిగా మునగకుండా పైపైన విశ్లేషిస్తే పెట్టుబడి,శ్రమ,మార్కెట్,వెల,పోటీ అనే అయిదు విషయాలు ఇమిడి ఉంటాయి.పెట్టుబడి దారుదు పెట్టుబడితో వస్తాడు,కొందరు శ్రామికుల్ని  నెలజీతాలకి తీసుకుంటాడు,తయారు చేసిన వస్తువుకు మార్కెట్ దాని డిమాందునీ సప్లైనీ అంచనా వేసి వెల నిర్ణయిస్తుంది,యెవరు యెంత లాభాన్ని కిట్టించుకోవాలనే దానిలో పోటీ ఉంటుంది.ఈ పోటీలో రెండు విభిన్న కులాల వాళ్ళు పోటీ పడుతున్నప్పుడు అక్కడ గెలుపును  నిర్ణయించే రెఫరీ ఆ రెండు కులాల్లో యే కులానికైనా చెందినప్పుడు న్యాయంగా గెలవలేని పరిస్థితిలో రెఫరీని తార్చి గెలవడం కోసం కులం కార్డు ముందుకొస్తుంది!పోటీలో ఈ రకమైన పరిస్థితి వస్తే గేటు వూయెలయ్య గానీ శంకర శాస్త్రి గానీ చంద్రశేఖర రావు గానీ చంద్రబాబు గానీ రఘువీరా రెడ్డి గానీ అందరూ ఒక్కలాగే ప్రవర్తిస్తారు!లాభం కోసం యెంత నీచానికైనా దిగజారడం యే ఒక్క కులానికో పరిమితమైనదా?యెదిగే కుర్రాడికి ప్యాంటు సైజు మార్చినట్టు జనాభాకి తగ్గట్టు ఆర్ధిక కార్యకలాపాల విస్తృతి పెరుగుతుంటే యెంత చెట్టు కంత గాలి అన్న విధంగా ప్రతి ఒక్కరికీ తమ శ్రమకి తగ్గ ఫలితం లభించి ఆర్ధికంగా భద్రత వస్తుంది.ఆత్మగౌరవం ఉన్నచోట ఆత్మన్యూనత ఉండదు గనక అస్పృశ్యత కూడా అంతమవుతుంది!

          కళ్ళముందు కార్యక్షేత్రం కనబడగానే అప్పటి వరకూ నాచుట్టూ పరుచుకున్న అంధాంధ తమసాల నుంచి కళ్ళు చెదిరే కాంతిచ్చటలతో విలసిల్లే సువర్లోకంలోకి ప్రవేశించినట్లయింది!అంతలోనే మృధుమధురమైన స్వరంతో యెవరో నాకోసమే ఆలపిస్తున్నట్టు "అయ్యారే అమరావతి పౌరుడా,సయ్యారే సమరావతి శూరుడా,ఈర్ష్యారే జుగుప్సామతుల చెండాడగ లేవరా" అనే నా భావి కార్యాచరణ జీవితానికి ఆహ్వానగీతం లాంటి కావ్యగానం నన్ను మరింత ఆనంద పరవశుణ్ణి చేసింది.సాధురే సాధు సాధు హసాదు బల్ పసందు ఈ కల సామాన్యమైనది కాదు!అదృష్టం ఈడ్చి తన్నే ఒక క్షణంలో వచ్చే కల - మన లక్ష్యాన్ని కళ్ల ముందు బొమ్మ కట్టించి మనల్ని చరితార్ధుల్ని చేసే ఆ కల ఇదే ఇదే?!

          ఇంతకీ కార్యక్షేత్రం కళ్ళ ముందు కనబడినా యెంతకీ తగ్గని ముసురులా సంజెవేళ ముసిరిన చీకట్లలా ఈ కల మాత్రం ఇంకా చెదరిపోదేం!హరిబాబుగా ఈ లోకంలోకి రావడమే ఒక కల,ఆ కలలో ఇదింకో చిన్న కల.కలలోనే ఒక మెలకువగా మెలకువలోనే ఒక కలగా యెంత కాలమిట్లా?వెనకటికి లావోతజూ అనే వేదాంతికీ ఒకనాడు ఒక చిత్రమైన కల వచ్చిందట.తను ఒక సీతాకోకచిలకగా మారినట్టు.రావణుడు పూనాడో యేమో వాలిన పువ్వునల్లా రేప్ చేస్తూ పోతున్నాదట.పువ్వుల్ని, రేప్ చేసినా తేనెనే స్రవిస్తాయి!కొన్ని పువ్వుల్ని రేప్ చేశాక యెంతైనా వేదాంతి గదా భళ్ళున పశ్చాత్తాపం బద్దలై కలలోంచి ఇలలోకి జారిపడ్డాడట.అప్పుడొక చిత్రమైన సందేహం వచ్చిందట "నేనిప్పుడు - సీతాకోకక చిలుకనని కలగంటున్న లావోతజూనా?లావోతజూనని కలగంటున్న సీతాకోకచిలుకనా!" అని.

          హరిబాబుగా నా బతుకూ అలాంటి చిత్రమైన కల కావచ్చు.ఇక్కడ మూసినకన్ను యే గంధర్వలోకంలోనో తెరుస్తానా!.పక్కనే ఉన్న మనోహరితో,"చూశావా మనోహరీ,ఈ విశ్వాంతరాళంలో యెక్కడో సుదూరంగా ఉన్న భూమి అనేదానిపైన మనమిద్దరం మనుషులుగా పుట్టామట.అక్కడ సుఖపడాలంటే డబ్బు అనేది చాలా అవసరమట.మిగతా వాళ్ళకి దొరికినది హరిబాబు కెందుకు దొరకలేదో తెలియదు గానీ ఆ డబ్బు లేకపోవటంతో ప్రేమ అన్నిట్నీ మరపించినా దరిద్రం ప్రేమని చంపేసి నువ్వూ నేనూ కూడా ఒకళ్ళ నొకళ్ళం తిట్టుకున్నామంట." అని నేను చెప్తుంటే తను "అవునా మనోహరా, నేను నిన్ను తిట్టటమా?అయితే అది రాకూడని కలే!అయినా, మనం అనిమిషులం కదా!అనిమిషులకు కూడా కలలు వస్తాయా?మరి మీకెందుకొచ్చిందో?" అని నవ్వుతూ అంటుంటే ఒకరీ ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటామా?లావోతజూ గారిలాగే ఇప్పుడు నాకూ ఒక ధర్మసందేహం పట్ట్టి పీడిస్తున్నది.


నేనిప్పుడు - గంధర్వుణ్ణని కలగంటున్న హరిబాబునా? హరిబాబబునని కలగంటున్న గంధర్వుణ్ణా!

28 comments:

  1. కొన్ని కొన్ని పేర్లు మీరు తేటగీతి బ్లాగ్ లో చూసి ఇన్ స్పైర్ అయినట్టున్నారు. ఒకళ్ళకి భయపడి మనం చేసే పని మానుకుంటే అవతలి వాళ్ళకి లేనిపోని వీరత్వాన్ని ఆపాదించినట్లవుతుంది.
    అరెమికాలో మీరు చెప్పిన బాహుబలి - తోపులాట నేను వినలేదు, బహుశా అది బెబ్బేబ్బే ఏరియాలో జరిగి ఉండొచ్ఛు.

    ReplyDelete
  2. పేర్లలో కొన్ని అక్షరాల్ని జంబుల్ చెయ్యడం వరకూ కరెక్టే!
    వీలు చూస్కుని సార్ దగ్గిర ఓ మాత వెయ్యాలి!

    ReplyDelete
  3. కొనసాగించండి సర్...బావుంది..

    ReplyDelete
  4. >ఇదివరకెప్పుడూ లేనిది శ్యామలీయం మేష్షారు కూడా తన కామెంట్లని తనే తొలగించుకుంటున్నారు,హేవిటో?

    పరిస్థితుల ప్రాబల్యం అండీ. కొండ అద్దమందు కొంచెమై యుండదా అన్నట్లుగా నన్ను సరిగా అర్థం చేసుకోలేని/చేసుకో దలచని వారి దృష్టిలో నాది 'ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’ ధోరణిగానూ, నేను ఇతరుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కట్టడి చేయడానికి అతిగా ఆరాటపడే వాడిగా కనిపిస్తున్నప్పుడు, ఆ అభిప్రాయాన్ని పూర్వపక్షం చేయవలసిన పరిస్థితిలో వాదనపై వాదనలను కేవలం వాదనలకోసమే చేసుకుంటూ పోయే పరిస్థితి కన్నా, నా అభిప్రాయానికి విలువ సరిగా లేని చోటినుండి తలవంచుకుని తప్పుకోవటమే సరైనదన్న నిర్ణయానికి వచ్చాను. దాని వెనుక మరొక బలమైన కారణం నేను ఇలా వాదనలలో చిక్కుకుని పలుచన కావటం పెద్దలకూ ఇతర హితైషులకూ క్షోభ కలిగించటం. పైగా మరొక కారణం సమయాభావం ఉండనే ఉంది.

    ReplyDelete
  5. నంగి మాటల హీరో వీణు,టు పీస్ హీరోయిన్ భేతాళిక నటించిన సినిమా, బండలరావు హాస్యం. రొట్టిముక్కల, ఛీ కాంతలు గాణా బయాణా, జిలేబి డైరెక్షన్ లో పిక్చర్ ఫ్లాపై ప్రొడ్యూసర్ బండచర్చ బందరు గొడుగుపేట చెట్టుకిందకి చేరేడంట. ఈ సినిమాకెందుకొచ్చేనో పనిలేక అని బాబుహరి, హారీ హారీ నాతోరావా అని భేతాళి పాటతో సినిమా నానా కంగాళీగా ఉందంటు ఉప్పుడే అందిన వార్త :)

    ReplyDelete
    Replies
    1. మధ్యలో అనాని "ముచ్చులు" కామెడి ట్రాక్ ఒకటి ఉంటే మరీ బావుంటుంది !

      Delete
  6. కధామంజరి మేష్షారు కూడా బ్లాగు మూసేస్తానని బెదిరిస్తున్నారు!ఇది బ్లాగులోకం మీద విరుచుకు పడిన భేతాళిక మహత్యం కాదు గదా? :)))

    ReplyDelete
  7. ప్రశంసించిన మిత్రు లందరికీ ధన్యవాదాలు!నేనిప్పటి వరకూ రాసిన వన్నీ కేవలం వ్యాసాలు.చెప్పాల్సిన విషయం స్పష్టంగా తెలియడం,నాలోని హాస్యదృష్టీ కలిసి వాటితో మిమ్మల్ని హుషారుగా ఉంచగలిగాను.

    కానీ ఇది మొదటిసారిగా కధ లాగా నడిపించాల్సి వచ్చింది!ఇంతకు ముందు ప్రయత్నించనిది,అందుకే అక్కడి వరకూ రాగానే పబ్లిష్ చెయ్యకుండా ఉండలేకపోయా!దానికి రెండు కారణాలు.

    కొన్ని పోష్తుల్ని నేను యెంతో ఇష్తంగా వేస్తే ఒక్క్క కామెంటు గూడా రాలేదు:-<)
    కొన్ని పోష్తులకి అదో మాదిరిగా ఉంది,మీ స్టెయిల్లో లేదని కూడా అన్నారు?

    అందుకే ఉబలాటం ఆగక ముందుగానే పబ్లిష్ చేశా,మీ ప్రతిస్పందన నా బాధ్యతని మరింత పెంచింది__/\__

    తొందర్లోనే పూర్తి చేస్తాను..ఈ లోపుబ్లాగుల్లోనే అక్కడక్కడా కొంచెం టెన్షన్లు పడుతున్నాను,సర్రియలిస్టిక్ సరదా మూడ్ రావట్లేదు.అవి కాస్తా ఒక కొలిక్కొస్తే ప్రస్తుతం బ్లాగుల్లోనూ బయటా నడుస్తున్న చరిత్రకి రన్నింగ్ కామెంటరీగా ఊపయోగించుకునే అవకాశం కూడా వుంది!

    అలా అలా ఇంకో నాలుగైదు మలుపులు తిప్పి పూర్తి చేస్తా.పూర్తయినప్పుడు కామెంటు ద్వారా తెలియ పరుస్తాను.

    మిత్రులు కాఫ్కా స్టెయిల్ సర్రియలిష్టిక్ రచన అన్నప్పుదు నిజంగానే సిగ్గు పడ్డాను:-)

    సర్వం గాంధర్వం!

    ReplyDelete
  8. "కధామంజరి మేష్షారు కూడా బ్లాగు మూసేస్తానని బెదిరిస్తున్నారు!ఇది బ్లాగులోకం మీద విరుచుకు పడిన భేతాళిక మహత్యం కాదు గదా?" పేరుతో నేను వేసిన కొత్త పోష్తులో ఒక చిన్న ప్రయోగం చేశానని ఆ పోష్తును చూసి మెచ్చుకున్న మిత్రులకు తెలుసు.అందులో మొదటిసారిగా సర్రియలిస్టిక్ వ్యంగ్య కధాత్మక విధానాన్ని వాడాను.కాకపోతే అంతవరకూ రాశాక అది సర్రియలిస్టిక్ రచన కాబట్టి యెలా కొనసాగించాలి అనే సందేహమూ,అసలు ఇది చదివిన వాళ్ళు యెలా రిసీవ్ చేసుకుంటారు అని అనుమానం వచ్చి పూర్తి కాకపోయినా ఆ నాలుగో వంతు భాగాన్నే పబ్లిష్ చేసేశాను.తీరా రెస్పాన్స్ చూస్తే చాలా బాగుంది.అందరూ కంటిన్యూ చెయ్యమని సలహా ఇచ్చారు.అది ఇప్పటికి పూర్తయింది.పూర్తి పోష్తుని కూడా చూసి మొత్తం పోష్టు మీద మీ అభిప్రాయాన్ని చెప్తారని ఆశిస్తున్నాను.

    _/\_

    ReplyDelete
  9. లోతైన విశ్లేషణతో హాస్యం జోడిస్తూ మీరిస్తున్న వివరణలు చాలాబాగున్నాయి. మీపోరాటం ధర్మంవైపు .అదెన్నడూ ఆగదు. సాగుతూనే ఉంటుంది కాకుంటే నదిలా వంపులుతిరుగుతూ.

    ReplyDelete
  10. ఓస్లా కూస్లా కుర్యే కుట్టా హ్టా..

    ReplyDelete
    Replies
    1. బాహుబలి సినిమాలో కాలికేయ భాష.
      శూర్పణఖ భర్త కాలికేయులకు రాజు :)

      Delete
    2. అప్పుడు పోష్టులో భాగాల్ని కాపీ కొట్టేదానివి కదూ!
      ఇప్పుడు కామెంట్ల స్టయిల్ని కాపీ కొడుతున్నావూ?

      Delete
    3. హరిబాబుగారూ,
      "నేను చాలా నిగ్రహంగా ఉంటాను", అని రాత్రి 8:24ని. సమయంలో అన్నవారు మరికొద్ది నిమిషాల్లోనే రాత్రి 8:59ని. సమయంలో మళ్ళా ఆవిడను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. స్వభావో దురతిక్రమణీయః అన్న మాట నిజం చేస్తున్నారు!

      Delete
    4. మాస్టారూ, హరిబాబు 35 నిమిషాల పాటు పాటించిన నిగ్రహమే ఆశ్చర్యం కనుక అభినందనయోగ్యమే :)

      Delete
    5. మాటమీద "నాగార్జునా" సిమెంట్ లాగా నిలబడడానికి హరిబాబుగారేమన్నా రాముడా ?

      Delete
  11. నేను రచ్చబందలో వాగ్దానం చేసి ఉన్నానునావైపు నుంచి తన వ్యాఖ్యలకి రెస్పాండ్ అవ్వనని.కాబట్టి యెవ్వరూ ఆమే వ్యాఖ్యలకి ప్రతిస్పందించకండి!మాట ఇచ్చాక నేను చాలా నిగ్రహంగా ఉంటాను,అది నా పధ్ధతి.

    తను కామెంట్లు వెయ్యడం వెయ్యకపోవడం తనిష్టం!

    ReplyDelete
  12. చిన్న సవరణ చెయ్యడం మర్చిపొయా.మధ్యలో "అసభ్యంగా" అనేమాట మిస్సయ్యా విజ్ఞప్తి చేసే కామెంటులో!అస్సలు జవాబు చెప్పకుండా ఉండలేముగా?

    అయినా బ్లాగు ఓనరునే నిలదీస్తున్నారు డెమోక్రసీ యెక్కువైనట్టుంది.మళ్ళీ డిక్ట్టేటర్ అయిపోవాలి.

    ReplyDelete
    Replies
    1. హరిబాబుగారూ, మీ బ్లాగు మీ యిష్టం అన్నది నిజమే అనుకోండి. కాని మీ బ్లాగులో మీరే అన్నమాటను మీరే కొంచెం మీరకుండా ఉంటే తీరుగా ఉంటుందీ అని మా సాగతీత అంతే అంతే! అస్సలు జవాబు చెప్పకుండా ఉండలేముగా అంటున్నారు కాని అలా ఉండక తప్పదండీ కొన్ని బ్లాగుల విషయంలోనూ కొందరు వ్యాఖ్యాతల విషయంలోనూ. కనీసం అలా జవాబు చెప్పకుండా ఉండటానికి ప్రయతం చేయకతప్పదు మరి. మీకు తెలిసిన శ్లోకమే అయ్యుంటుందని అనిపిస్తున్నా ఒకసారి మననం చేసుకుందాం.

      బాలసఖిత్వ మకారణహాస్యం
      గార్ధభయాన మసంస్కృతవాణీ
      స్త్రీషువివాద మసజ్జనసేవా
      షట్‍సు నరో లఘుతాముపవీతి.

      అంతేకదా

      Delete
    2. నిగ్రహంగా ఉండడానికి ప్రయత్నించండి,నేను శ్యామలీయం గారి బ్లాగులో (అన్నీ రాముడి పోస్టులే) అడుగుపెట్టకుండా నిగ్రహంగా ఉండడం లేదూ ? రాముడు మంచి బాలుడే ఉడుత కూడా లెక్కచేయదు. భారత దేశానికి డిక్టేటర్లు ప్రస్థుతం అవసరం.

      Delete
    3. అవునండీ. అన్నీ రాముడి నుద్దేశించి ఉండటం సహజమే.

      ఉ. రాముడు నాకు సర్వమగు రాముడు నాకు గురుండు దైవమున్
      రాముడు నాకు స్నేహితుడు రాముడు నాకు విశిష్టబంధువున్
      రాముడు నాదు చిత్తమున రాజిలు తేజము గాన నేను నా
      రాముని గూర్చి పల్కుదు విరామ మెఱుంగక సంతసంబునన్

      కాబట్టి రామసుధారసపానవిలోలచిత్తులే నా బ్లాగులోనికి వస్తారు. వారికి నా స్వాగతం.

      కం. రాము నెఱుంగగ నొల్లని
      సామాన్యులు రాక యున్న సంతాపము నా
      కేమాత్రము గలుగదు శ్రీ
      రాముని ప్రేమించువారి రాకయె చాలున్

      స్వస్తి.

      Delete
  13. నిగ్రహంగా ఉండాలనే ఉంటుంది అందరికీ
    మాటిమాటికీ బుధ్ధి దాట్లు వేస్తుంది,అంతే!
    లక్ష్మణుడు కోపాన్ని నిగ్రహించుకుని ఉంటే బాగుండేది.
    కోపం తమ్ముడిదీ,శాపం అగ్రజుడికీ అయ్యింది పాపం?!

    ReplyDelete

  14. సర్రియలిజం ఓస్లా కూస్లా కుర్యే కుట్టా హ్టా..అంత బాగుంది. ఇట్లాటి పంథా లో మీరు మరిన్ని టపాలు 'గెలకాలని' ఆశిస్తో :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీరింకా రాలేదేమిటా అనుకుంటున్నా!
      మీరూ వచ్చారూ!అగ్గిపుల్ల్ల లేవీ?హన్నా!

      Delete
    2. హరిబాబు గారూ, మీరెంత బ్లాగు యజమాని అయితే మాత్రం, బ్లాగ్మాత తెలుగు బ్లాగ్లోక జగత్జనని జిలేబీ గారిని అనడం బాలేదు. :)

      Delete
    3. అయ్యో రామా!
      నేనేమి అన్నానండీ?
      నారదా నారదా?!
      మిమ్మల్ని కూడా నారదుడు పూనాడా?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...