Wednesday, 15 November 2023

డబ్బు అనగ నేమి?డబ్బు ఎందుకు సంపాదించాలి?పెళ్ళి అనగ నేమి?పెళ్ళి ఎందుకు చేసుకోవాలి?(part 01)

డబ్బు అనేది వస్తువులు మరియు సేవల చెల్లింపు కోసం, రుణాల చెల్లింపు కోసం ప్రజలు అంగీకరించే ఏదైనా వస్తువు లేదా ఒప్పందం.ఇది రెండు రకాలు.మారకం కోసం నిర్ధారిత విలువ గల వస్తువును వాడితే దానిని వస్తురూపధనం(Commodity money) అంటారు,ఒప్పందం రూపంలో అనుమతి ఇస్తున్న దానిని వాక్యరూపధనం(Fiat Money) అంటారు.

దీని పుట్టుకని తెలుసుకుంటే గానీ అసలు దీని అవసరం తెలియదు."ఓం ఋధ్నోతి  పునరాధేయ మా" అన్న వేదమంత్రం మనువు మొదట సంపదని ఎలా సృష్టించాడు అనే కీలకమైన విషయాన్ని గురించి చెప్తుంది.తనకు కావలసిన ఆహారం కోసం ప్రకృతి నుంచి యధాతధం స్వీకరించక ప్రకృతిని కొంత మార్చి తన పోషణకు చాలినంత మాత్రమే స్వీకరించి అదనంగా చేరిన ఆహారాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవడమూ ఇతరుల ఆకలిని తీర్చడానికి వినియోగించడం అనేది ఇతర జంతువులకీ మనిషికీ ఉన్న మొదటి,ఆఖరి ప్రత్యేకత.

తొలిదశలో అలా అదనంగా చేరిన ఆహారమే సంపద అయ్యింది.తర్వాత కాలంలో ఎక్కువ స్థాయిలో ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగం అయిన వస్తువులూ జంతువులూ కూడా సంపదలు అయ్యాయి.తొలినాటి ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయమే లాభదాయకమైన వృత్తి.లాభం అనే పదం వచ్చింది కదా,ఇప్పటికీ దీని చుట్టూరానే ఆర్ధిక వ్యవస్థ తిరుగుతున్నది కదా,మరి దీని అర్ధం ఏమిటి?

ఆహారమే సంపద అయిన కాలం నుంచి ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగం అయిన వస్తువులూ జంతువులూ కూడా సంపదలు అయిన కాలం వచ్చాక ప్రతిసారీ అందరూ అన్నిటినీ సృష్టించడం కన్న కొందరు కొన్నిటికి మాత్రం పరిమితం అయ్యి ఇతరులకి ఇస్తూ ప్రతిఫలం కింద ఇతరుల నుంచి కొంత సంపదని తీసుకోవడం అనే కొత్త ప్రక్రియని కనుక్కున్నారు.

దీన్ని వినిమయ ద్రవ్య విధానం(Barter Money System) అంటారు.ద్రవ్య విధానం(Money System) మొదలైన మరుక్షణమే రాజ్యవ్యవస్థ(Political System) కూడా మొదలైంది.అందుకే మనువును తొలి ప్రభువు అని కూడా చెప్పి ప్రాచీన రాజవంశాలు అన్నీ మనువునే తమ తమ వంశాలకు మొదటి వ్యక్తి అని చెప్పుకున్నాయి. మొత్తం ప్రక్రియని "ఓం ఋధ్నోతి  పునరాధేయ మా" అన్న ఒక్క మంత్రమే విశ్లేషించి చెప్పడం వల్ల అన్ని దశలూ అతి తక్కువ కాలంలోనే పూర్తయినట్టు మనం అర్ధం చేసుకోవాలి.

వినిమయ ద్రవ్య విధానం ప్రకారం వస్తువులనీ సంపదలనీ మారకం చేసేటప్పుడు ఉపయోగాన్ని బట్టి ఒక్కొక్క వస్తువుకీ ఒక్కొక్క విలువను నిర్ధారించి  విలువల మధ్యన సమతూకం కోసం నిష్పత్తిని కనుక్కుని మారకం కోసం నిర్ధారించిన ప్రమాణమే ద్రవ్యం(Currency) అవుతుంది.

ఒక ఉదాహరణ చూపిస్తే గానీ ద్రవ్యం(Currency) అర్ధం కాదు.ఒక వ్యక్తి దగ్గిర ఒక ఆవు ఉంది,ఒక వ్యక్తి దగ్గిర ఒక గొర్రె ఉంది. ఇద్దరూ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఒకచోట ఆవు వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటే ఒక ఆవుకీ ఒక గొర్రెకీ మారకం వేస్తే గొర్రెని తీసుకుని ఆవుని ఇచ్చిన వ్యక్తికి నష్టం జరుగుతుంది కదా!అలా కాక ఒక ఆవుని ఇచ్చి పది గొర్రెల్ని తీసుకుంటే నష్తం రాదు.అంటే 1 ఆవు = 10 గొర్రెలు అయినప్పుడు ఒక గొర్రె విలువ 1 అనుకున్నప్పుడు  "1" అన్న విలువని రాజ్యవ్యవస్థ(Political System) వేరొక వస్తువుకి ఇచ్చి దాన్ని మధ్యవర్తిలా వాడుకోవటానికి అనుమతి ఇస్తే దానిని ద్రవ్యం(Currency) అంటారు.సంపద అనేది మన అధీనంలో ఉన్న వినిమయం చెయ్యగలిగిన వస్తుసేవల కలయిక.ధనం లేక ద్రవ్యం(Currency) అనేది వస్తుసేవల వినిమయం కోసం రాజ్యవ్యవస్థ(Political System) మనకు అనుమతి ఇస్తున్న ఒప్పందపత్రం.అందుకే, రూపాయి నోటు మీద రిజర్వ బ్యాంక్ చైర్మన్ యొక్క సంతకం ఉంటుంది.

అయితే, ప్రస్తుతం మనం వాడుతున్న రూపాయి నోటు వస్తురూపధనం(Commodity money) కాదు, వాక్యరూపధనం(Fiat Money).దీనిని ఇప్పుడు వాడుతున్నట్టు సర్వకాల సర్వావస్థలలో వాడకూడదు.మనకు మహమ్మద్ బీన్ తుఘ్లక్ పిచ్చివాడు అనిపించిన వాటిలో వస్తురూపధనం(Commodity money) వాడాల్సిన చోట వాక్యరూపధనం(Fiat Money) వాడటం కూడా ఒకటి.మహమ్మద్ బీన్ తుఘ్లక్ ఒక్కసారి వాక్యరూపధనం(Fiat Money) విడుదల చేసినందుకే ఇప్పటికీ నవ్వుకుంటున్న మనం మన ప్రభుత్వాలే ప్రతి రోజూ వస్తురూపధనం(Commodity money) బదులు వాక్యరూపధనం(Fiat Money) విడుదల చేస్తుంటే ఎందుకు ఎందుకు నవ్వడం లేదు?

 

జవాబు తర్వాత చెప్తాను గానీ మీరూ ఆలోచించండి!

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...