Tuesday, 21 March 2023

పోతన విరచిత శ్రీ మదాంధ్ర మహాభాగవతాంతర్గత మాధుర్యం!

ప్రథమ స్కంధము : ఉపోద్ఘాతము

1-1-శా.

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ - లోక ర

క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో

ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా

నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.

టీకా:

శ్రీ = శుభకర మైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని; చేరుట = పొందుట; కున్ = కోసము; ఐ = ఐ; చింతించెదన్ = ప్రార్థించెదన్; లోక = లోకా లన్నిటిని; రక్ష = రక్షించుటనే; ఏక = ముఖ్యమైన; ఆరంభ = సంకల్ప మున్న వాడు; కున్ = కి; భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = కళ యందు; సంరంభ = వేగిరపాటు ఉన్న వాడు; కున్ = కిన్; దానవ = రాక్షసుల; ఉద్రేక = ఉద్రేకమును; స్తంభ = మ్రాన్పడేలా చేసే వాడు; కున్ = కి; కేళి = ఆట లందు; లోల = వినోదా లందు; విలసత్ = ప్రకాశించే; దృక్ = చూపుల; జాల = వల నుండి; సంభూత = పుట్టిన; నానా = వివిధ; = బ్రహ్మాండముల {కంజాత భవాండకం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టిన వాని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశి తనలో కలిగిన వాడు; కున్ = కి; మహా = గొప్ప; నంద = నందుని; అంగనా = భార్య యొక్క; డింభ = కొడుకు; కున్ = కున్.

భావము:

సర్వలోకాలను సంరక్షించుట అందు గట్టి సంకల్పం కల వాడిని, భక్తజనులను కాపాడుటలో మిక్కిలి తొందర కల వాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండభాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) కైవల్య పదము (నీవుగానే తప్ప నాకంటూ వేరే ఉనికి లేనంతగా నీలో ఐక్యం అయ్యే పదవిని) అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను.

ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథారంభ ప్రార్థనా పద్యం. ఈ తెలుగసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమాన మైంది. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో ఆరు (6) ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షణ చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు యివి.

(అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది.

(ఆ) లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపు కంస కాలయవనాదులను (తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది.

(ఇ) భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహా విష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది.

(ఈ) దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచణు డైన స్వామి వామనుడై, ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది.

(ఉ) కేళిలోల... కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్ళల్లో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామికళ్ళు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది.

(ఊ) మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక.

ఇక్కడ నారాయణ తత్వం లక్ష్మీతత్వం వైపు విలాసమైన దృష్టిని ప్రసరించటం వల్ల సృష్టి జరిగిందని చెప్తున్న విషయానికి శ్రీవిద్యా సంబంధమైన తంత్రశాస్త్రం శివశక్త్యాత్మకమైన వివరణ ఇస్తున్నది.రెండింటిలోనూ జ్ఞానస్వరూపుడైన సృష్టికర్త చలనానికి కారణమైన శక్తిని ప్రేరేపించడం వల్ల స్థలకాలద్రవ్యత్రిత్వం ఏర్పడుతుందనే సత్యం వ్యక్తం అవుతున్నది.

"అహం" అనేది సృష్టికర్త ద్రష్టలకు తనను గురించి చెప్పుకున్న ఆత్మసంబోధన.భాషాపరమైన విశ్లేషణ చేసిన పాణిని అచ్చులలోని మొదటిదైన "అ",హల్లులలోని చివరిదైన "హ"తో కలిసి సృష్టికి ఆదిలోనూ అంతంలోనూ ఉండటాన్ని సూచిస్తుందనీ తర్వాత కలిసిన "అం" అనేది సృష్టియొక్క అంతం తర్వాత కూడా సృష్టికర్త ఉండగలగటాన్ని సూచిస్తుందనీ చెప్పాడు. అచ్చులలోని మొదటిదైన "అ" పరమేశ్వరుని ప్రకాశ తత్త్వానికి ప్రతీక.హల్లులలోని చివరిదైన "హ" పరమేశ్వరి యొక్క విమర్శాతత్వానికి ప్రతీక.ప్రత్యేకాక్షరమైన "అం" అనేది వ్యక్తమానమైన ప్రకృతికి ప్రతీక.అలా చూస్తే అనంతకోటి బ్రహ్మాండాల సమాహారమైన ఏకైక సృష్టి ప్రకాశ(Luminosity or consciousness) విమర్శ(the Object as the reflector) వ్యక్త(the Object that received reflection) అనే మూడు తత్వాల నుండి ఆవిర్భవించింది - సంక్షిప్తం చేసి చెప్తే ప్రకాశ స్వరూపుడైన శివుడు విమర్శరూపిణియైన శక్తియందు లీనమై శివుడి నుంచి తన మీదకి ప్రసరించిన ప్రకాశతత్వాన్ని శక్తి ప్రతిఫలింపజేసినప్పుడు వ్యక్తం ఆవిర్భవించింది.వ్యక్తంలోని వైదిక ఋషులకు తనను గురించి తను "అహం" అని ప్రకటించుకోవడం వల్ల వ్యక్తం కూడా శివతత్వమే అన్న నిర్ధారణ ఇస్తున్నట్టు మనం అర్ధం చేసుకోవాలి,అంతే!

ప్రకాశ స్వరూపుడైన శివుడు విమర్శరూపిణియైన శక్తియందు లీనమై తనను గురించి తను "అహం" అని ప్రకటించుకోవడాన్ని మొదట తెలుసుకోగలిగినది ద్రష్టలు.మొట్టమొదట వారి ధారణలో "అహం" అనేది ప్రతిధ్వని వలె వినబడినప్పుడు దాని గురించి ఏమీ తెలియని స్థితిలో "కో2హం?(నేను ఎవరు?)" అనే ప్రశ్న పుట్టింది.ఆ ప్రశ్ననే లక్ష్యం చేసుకుని తపస్సు చేశారు.అప్పుడు వారికి "సో2హం!(ఇక్కడి నేను!)" అనే జవాబు తట్టింది.అయితే,ఇక్కడ ఉన్న - "సః" అనేది ఎవరో ఇతమిత్ధం తెలియడం లేదు.అందుకని ఆ జవాబునే లక్ష్యం చేసుకుని మళ్ళీ తపస్సు చేశారు."సోహం" అనే పదం యొక్క పునరుక్తి వల్ల వల్ల ఏర్పడిన "సోహంసోహం" అన్న పదబంధం యొక్క అర్ధపాఠం నుంచి "సో" అన్న సర్వనామాన్ని తొలగించి చూసినప్పుడు "హంసోహం!" అనే పరమసత్యం గోచరించింది.దాని అర్ధం "నేను హంసను!" అని,కదా!అది గోచరించింది ఎవరికి?సృష్టికర్త యొక్క "అహం" అనే పదం మీద దృష్టి నిలిపి తనను గురించి తెలుసుకోవాలని తపస్సు చేసిన వైదిక ఋషికి!

ప్రకృతిలోని సమస్త తత్వాలూ హంసలు.కాయం నుంచి జీవం పోతే హంస లేచిపోయింది అనేది అందుకే, బ్రహ్మదేవుడి వాహనం హంస అనేది అందుకే, సృష్టిని గురించీ ఈశ్వరుణ్ణి గురించీ పరమార్ధం తెలుసుకున్న ఆచార్యులను పరమహంసలు అనేది కూడా అందుకే.

జై శ్రీ రాం! 

Wednesday, 8 March 2023

బ్రాహ్మణుల చేత జరిగిన తప్పుని బ్రాహ్మణుల చేతనే సరిదిద్దించి వాళ్ళు తమ చెడ్డపేరును పోగొట్టుకుని మంచిపేరుని తెచ్చుకుని పునీతులు అయ్యే అవకాశం ఇద్దామా?దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు అవుతుంది గాబట్టి ఇప్పటి బ్రాహ్మణేతర కులస్థులం ఇప్పటి కులబ్రాహ్మణుల్ని వెనక్కి నెట్టి ముందుకు వచ్చి అధికారం చేపట్టి బుధ్ధి బ్రాహ్మణులకి సముచిత స్థానం ఇద్దామా?

వందకి డెభ్భయ్యేడు మంది ఉన్న బ్రాహ్మణేతరులు వందకి ముగ్గురు ఉన్న బ్రాహ్మల్ని కూర్చోబెట్టి మేపుతూ వేదం పేరు చెప్పి మరీ తమలోనే కొందర్ని పంచములని అవమానిస్తూ ఉంటే సిగ్గూ శరం లేక వీళ్ళని నెత్తిన పెట్టుకు మోస్తే అది హిందూ జాతి గొప్పదనం అవ్వుద్దా!

Naidu Bogineni

 

4 hours ago

 

కమ్మ వాళ్ళను పక్కనబెట్టాలని ప్రకాశం పంతులు నీలం సంజీవరెడ్డి ని అందలం ఎక్కించాడు.

 

ఆయన రెడ్డి కులగజ్జి తో

 

బూర్గుల రామకృష్ణ రావు నూబ్రాహ్మణులనూ పనికి రాకుండా చేసాడు.

 

కాదనగలరా?

 

9 replies

 

PUNYALOKAM

 

3 hours ago

 

కమ్మవాళ్ళు బ్రహ్మణులకోసం ఏమి చేశారు? బ్రాహ్మణుల అవసరం మాకు లేదు, మా పౌరోహిత్యం మేమే చేసుకుంటాం అని బ్రాహ్మణులకు రెస్ట్ ఇచ్చారా?

 

పుష్పగిరి అగ్రహారం పీఠాన్ని నాశనం చేసి బ్రాహ్మణ పండితులకు మేలు చేసారా? కమ్మవారి ప్రభుత్వంలో అర్చకులకు జరిగిన మేలు ఏమిటి?

 

Reply

 

Naidu Bogineni

 

3 hours ago

 

 @PUNYALOKAM

 

బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఆంధ్ర ప్రదేశ్ లో తొలిసారిగా ఎవరు పెట్టారు?

 

నీ తాతా?

 

లేక మీరు ఎక్కదీసిన రెడ్లా?

 

Reply

 

PUNYALOKAM

 

3 hours ago (edited)

 

 @Naidu Bogineni! బ్రాహ్మణ సంఘం కమ్మవాళ్ళో, లేదా నేరుగా మీ తాతో పెట్టినది కాదు. అప్పటి సీఎం సహకరించారు అంతే. గ్రౌండ్ వర్క్ బ్రహ్మణులది.

 

Reply

 

Naidu Bogineni

 

2 hours ago

 

 @PUNYALOKAM

 

ఇప్పుడు జగన్ ఎంత ఇచ్చాడేమిటి?

 

బ్రాహ్మణులు ఎంత ఇచ్చారు అప్పుడూ ఇప్పుడూ?

 

అద్భుతమైన సంభాషణ - నేనొక్కణ్ణే కాదు,ఇతరులు కూడా నాలానే ఆలోచిస్తున్నారన్న ఉత్సాహం ఒక్కసారి గోదావరి వరదలా పొంగుకొచ్చేసింది నాకు!2020 నాటి ఆంధ్రాలో బీజేపీ నాయకత్వం ఎందుకు అర్జునుడి స్థానంలో గాక శిఖండి స్థానంలో నిలబడిందో అర్ధం కావాలంటే ప్రకాశం పంతులు గారి కాలానికీ ఇంకొంచెం ముందరి కాలానికీ వెళ్ళి చూడాలి.అసలు ఏవో హ్యూం అద్వర్యంలో కాంగ్రెసు స్థాపన జరిగిన తొలినాళ్ళనుంచి మొదలుపెట్టి 1930 వరకు ఉత్తరాదిన చిత్పవన్లూ జైన్లూ కాంగ్రెసులో చేరి చక్రం తిప్పుతుంటే దక్షిణాదిలో స్థానిక బ్రాహ్మణులు కాంగ్రెసులో చేరి చక్రం తిప్పడం నడిచింది.

అయితే, 1924 నాడు బెల్గాములో మోహన దాసు గాంధీ అధ్యక్షతన జరిగిన 39 కాంగ్రెస్ సమావేశంలో అస్పృశ్యత నివారణని కాంగ్రెసు పార్టీ లక్ష్యం కింద పెట్టిన నాటి నుంచి ముసుగులు విప్పేసి కాంగ్రెసులోకి వాళ్ళు వచ్చిన అసలైన లక్ష్యం కోసం పనిచెయ్యడం మొదలుపెట్టారు.1925,ఏప్రిల్ 26 ఆంధ్రపత్రిక ప్రధాన వ్యాసం ఇలా నడిచింది:"సాంఘికార్ధికాదుల విషయమై బ్రాహ్మణేతర సంఘము నిరంతరము దేశ క్షేమమునకై కృషి చేయవలసి యున్నది.బ్రాహ్మణేతరోద్యమమును తిన్నగ నడుపుచో నెట్ట్టి యాక్షేపణము నుండజాలదు.ఏలన ప్రజాసామాన్యము  నందధిక సంఖ్యాకులు బ్రాహణేతరులగుటచే వారి యభ్యుదయమే హిందూ దేశాభ్యుదయ మగును.ఇంతకంటెను గావలసినదేమి గలదు?బ్రాహ్మణేతరోద్యమము రాజకీయ రూపము దాల్పక సంఘోధ్ధరణకై కృషి సల్పినచో నయ్యది దేశమున కమూల్యమైన లాభమును గలిగించెడిది.నానాటికి కృశించుచున్న సంఘమత సంస్కరణలకు తప్పక ప్రోద్బలము కల్పించి యుండెడిది.బ్రాహ్మణేతరులను ఆర్ధికముగ నేమి, సాంఘికముగ నేమి పైకి తెచ్చుట కీ యుద్యమము నుపయోగించుచో దేశమునకు లాభము కలుగు ననుటకు సందియము లేదు."

ప్రజల్లో ఎక్కువమంది నాన్ బ్రాహ్మిన్స్ ఉన్నారని తెలుసు, కానీ వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు.రాజకీయాల్లోకి వచ్చి బ్రాహ్మిన్ పొలిటీషియన్లతో పోటీపడి అధికారంలోకి రాకూడదు అని దేశోధ్ధారకుల వారు కుండబద్దలు కొట్టి చెప్పేశారు."బ్రాహ్మణేతరోద్యమమును తిన్నగ నడుపుచో నెట్ట్టి యాక్షేపణము నుండజాలదు" అనటం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి?రాజకీయాల్లోకి వచ్చి మాతో పోటీ పడనంత కాలమే మీ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తాం,మాకు నష్టం చేస్తే తొక్కేస్తాం అనే వార్నింగ్ కూడా అందులోనే ఉంది.

"బ్రాహ్మణేతర సంఘము" అని దేశోధ్ధరకుల వారు ప్రస్తావించిన ఉద్యమం తెలుగునాట తమిళనాడు కన్న చాలా కాలం ముందే మొదలైంది.ఆదికాలంలో లేని బ్రాహ్మణాధిక్యత మధ్యలో వచ్చింది. మధ్యస్థ దశలోని 17 శతాబ్దం నాటికి బ్రాహ్మణులే పూజారి వర్ణం కింద చెలామణీ అవుతూ తమకు, మిగిలిన రెండు ద్విజ వర్ణీయులకు ఉపనయనంతో పాటు మిగిలిన వైదిక క్రతువులను చేస్తూ ఉండేవారు. రెండు దశల మధ్య తేడా ఏమిటీ అంటే ముందరి దశలో మూడు వర్ణాల వారికీ వేదోక్త రీతిలో ఉప్నయనం జరిగేది.అయితే, తాము కూడా ద్విజులం గనక తమకు వేదోక్తంగా ఉపనయనం ఎందుకు చెయ్యడం లేదని 1764 పుట్టి 1835 వరకు జీవించిన వైశ్య వర్ణానికి చెందిన మామిడి వెంకయ్య లేవనెత్తిన ప్రశ్నతో కల్పిత విప్రాధిక్యతకి మొదటి దెబ్బ తగిలింది.

మంత్రపఠనం మీద అధికారం,ఉపనయన సంస్కారం,షోడశ కర్మల నిర్వహణ విషయంలో వేదోక్తం పురాణోక్తం అనే తేడా ఉండకూడదు.ఆదిలో లేనిది మధ్యలో ఎప్పుడు చొప్పించారు అని చూస్తే మనకి అసలు కుట్ర ఎప్పుడు జరిగిందో తెలుస్తుంది.షడంగ యుక్తమైన మంత్రాలకి వేదోక్తం అనీ సంస్కృత వాక్యాలతో ఆయా పౌరాణిక సంకలన కర్తలు కూర్చిన మంత్రాలని పురాణోక్తం అనీ చెప్తున్నారు.ఇది నిజానికి పెద్ద దోషం కాదు.అసలు సాంకేతికార్ధాన్ని చూస్తే అక్కడ భేదం కూడా లేదు.అందుకు వేదోక్త విధానం గురించి చెప్తున్న యాజుషస్మార్తానుక్రమణిక లోని విషయ సూచికా పురాణోక్త విధానం గురించి చెప్తున్న పురాణోక్త ప్రకాశిక లోని విషయ సూచికా ఒక్కలానే ఉంటుంది,పోయి చూసుకోండి!

వేదోక్తం బ్రాహ్మణులకి మాత్రమే అనీ ఇతరులకి పురాణోక్తం చాలు అనీ మొదట లేదు,తర్వాత కల్పించారు.పురాణోక్తం యొక్క మహాసంకల్పం "యుధిష్ఠిర, విక్రమార్క, శాలివాహన, విజయాభినందన, నాగార్జున, కలిభూపతి శకనృపతి షట్త్రింశ(షట్+త్రింశ) పంచోత్తర శతయుతే" అనీ చూర్ణిక "హరిశ్చంద్ర,నల,కార్తవీర్య,విక్రమార్క,భోఅజ్రాజాది పుణ్య పురుషాణాం" అనీ ఉంటాయి.

శాలివాహనుడు పూ.సా.(క్రీ.పూ) 2 శతాబ్దానికి చెందినవాడనీ నాగార్జునుడు సా.(క్రీ.) 2 శతాబ్దానికి చెందినవాడనీ విక్రమార్కుడు సా.(క్రీ.) 6 శతాబ్దానికి చెందినవాడనీ భోజరాజు సా.(క్రీ.) 11 శతాబ్దానికి చెందినవాడనీ చరిత్ర చెప్తుంది గనక పరంపర భోజరాజు తర్వాత ఏర్పరచి ఉంటారని తెలుస్తున్నది.భోజరాజు పేరు వేదోక్తంలో కూడా కనపడుతుంది కాబట్టి వేదోక్తం కూడా భోజరాజు తర్వాత ఏర్పడిందా అని కూడా సందేహం వస్తుంది.కానీ,దశరధుడి కాలం నుంచే వేదోక్త స్మార్త క్రియలు మార్పూ లేకుండా నడుస్తున్నాయి కాబట్టి అలా జరగడానికి ఆస్కారం లేదు.కాకపోతే పురాణోక్తంలో ప్రభువులని చేర్చుతున్నప్పుడు వారిమీద గౌరవంతో వేదోక్తంలో కూడా చేర్చి ఉండాలి.ఇవన్నీ మొదట లేని విప్రాధిక్యత మధ్యలో ఎలా ఉనికిలోకి వచ్చింది అనే ప్రశ్నకి నావైపునుంచి ఒక శాస్త్రీయమైన వివరణలే.అయితే, మొదట వేదోక్తం,పురాణోక్తం అని విభిజించడం సదుద్దేశంతోనే జరిగిందనేది నిజం.

ఇక్కడున్న అపారమైన సంపదని దోచుకునే విదేశీయులు మన దేశంలోకి అడుగు పెట్టటం అనేది 8 శతాబ్దం నుంచే మొదలైంది.10 శతాబ్దం నాటికి వాళ్ళకి అసలు విషయం అర్ధమై పోయింది.వేదం అనే ఒక సకల విద్యల సత్యగ్రంధం అందరికీ అందుబాటులో ఉన్నంతకాలం కాఫిర్లని జయించడం కష్టం అని తెలుసుకోగలిగారు,అందరి నుంచీ వేదాన్ని దూరం చెయ్యాలంటే అది బ్రాహ్మణుల వైపునుంచే జరగాలని కూడా తెలుసుకోగలిగారు.ఇకనేం,ఇటు వైపు నుంచి బయటి వాళ్ళకి సాయం చేసి లోపలి వాళ్ళకి గుండు కొట్టే కుల బ్రాహ్మణులూ కల్ల గురువులూ వేల కొద్ది తయరయ్యారు.వేరే కులస్థుల నుంచి వేదాన్ని దూరం చెయ్యడం కన్న వీళ్ళు కూడా వేదాన్ని చదవదం మానేసి వ్యవసాయం,పశుపోషణ,వ్యాపారం,రాజ్యపాలన - ఒకటేమిటి వేదమూ మనుధర్మశాస్త్రమూ బ్రాహ్మణుడు చెయ్యకూడదని చెప్పిన అన్ని పనుల్లోకీ దూరారు. అందుకే, జ్ఞానంతో కాక భక్తితో మోక్షాన్ని పొందడం గురంచి నొక్కిచెప్తున్న భక్తిమత సాహిత్యం సమస్తమూ 10 శతాబ్దం తర్వాతనే పుట్టాయనేది ఆయా మతాల మూలకర్తల జీవిత చరిత్రలని బట్టే తెలుసుకోవచ్చు - మన గురువులే మనల్ని వేదం నుంచి దూరం చేశారు,కల్ల గురువులు వాళ్ళు!

మామిడి వెంకయ్య గారి కాలం నాడు అది ప్రశ్న మాత్రమే. కానీ, అది ఒక సిధ్ధాంత రూపం తీసుకున్నది 1972 పుట్టి 1856 వరకు జీవించిన స్వామినేని ముద్దు నరసింహం అనే ఉద్దండపిండం వల్లనే!చరిత్రలో గ్రంధస్థం అయిన అతని కార్యక్రమం పేరు హితసూచని.ఇప్పటి వాళ్ళకి తెలియదు గానీ వీరేశలింగం పంతులు గారు,గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఉత్తేజం పొందినది హితసూచని అనే విస్ఫోటనం నుంచే - అతను వెలమ కులస్థుడు, శూద్రుడు!అయితేనేమి,ఎంతోమంది బ్రాహ్మణశ్రేష్ఠులు ఆయన్ని పొగిడారు, అనుసరించారు!ఇరవయ్యవ శతాబ్దం మొదటి దశకానికి వచ్చేసరికి (1887-1943) మధ్య జీవించిన కమ్మ కులస్థుడు త్రిపురనేని రామస్వామి చౌదరి సూతాశ్రమం పేరున ఒక ఆశ్రమం స్థాపించాడు.

వీళ్ళలో ఒక్కరూ వైదిక ధర్మాన్ని వ్యతిరేకించ లేదు.ఇక, స్వయాన బ్రాహ్మణుడైన వీరేశలింగం పంతులు గారు విధవా పునర్వివాహం కోసం మూర్ఖ బ్రాహ్మణులతో పోరాడింది కూడా వేదశాస్త్రాల సాయంతోనే - "విధవలు మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదని వేదంలో మందలంలో సూక్తంలో ఉంది?చూపించండి!" అని ఆయన నిలదీస్తే ప్రతివాదన చెయ్యలేక వెనక్కి తగ్గారు. వేదంలోనూ లేని తప్పుడు శాస్త్రాల్ని చూపించి వాళ్ళు కష్టపెట్టింది ఎవర్ని?వాళ్ళింటి ఆడపిల్లల్ని వాళ్ళు అన్ని తరాల పాటు ఎందుకు ఏడిపించారు!ఇవ్వాళ నేను గాంధీ బ్రిటిష్ వాళ్ళ కుక్క అనే అంటున్నాను.అయితే, అస్పృశ్యతని పాటించడం మానుకోమన్నాడు గాబట్టి నెత్తిన పెట్టుకుంటానా?లేదే!దేనికదే, గాంధీ ఒక్క డే చెప్పలేదు గదా - బ్రాహ్మణుల్లోనూ చాలామంది బ్రాహ్మణేతర ఉద్యమంలో ఉన్నారు!

అస్పృశ్యతా నివారణ,బ్రాహ్మణేతరుల రాజకీయ ప్రవేశం అనే రెండింటినీ అప్పటి పొలిటికల్ బ్రాహ్మిన్స్ దేశోధ్ధారకుల వారు బెదిరించినట్లుగానే మాటలతో సరిపెట్ట లేదు.శ్రీమాన్ ముడుంబ నరసింహాచార్యులు గారు 1934,మే 3 తేదీన "సనాతనమత విరుధ్ధముగ నస్పృశ్యతను తొలగించు ప్రయత్నము చేయుట చేత మేము కాంగ్రెసును విదచుచున్నా"మని మహాహాత్మా గాంధీజీకి బహిరంగ లేఖ వ్రాసి కాంగ్రెసు నుంచి బయటికి వచ్చేశారు.అంటరాని తనాన్ని తొలగిస్తే హిందూజాతికి ముప్పు వచ్చేస్తుందని పత్రికా ప్రకటనలు చేశారు, సనాతన సంస్కృతీ పరిరక్షణ పేరున వూరేగింపులూ స్లోగన్లూ మీటింగులూ - అబ్బో, చెయ్యకూడని వెధవ పన్లు అన్నీ చేశారు!

జస్టిస్ పార్టీ అనేది పుట్టింది పొలిటికల్ బ్రాహ్మిన్స్ కాంగ్రెసులో ఇతర కులాల వాళ్ళని తొక్కెయ్యాలని చూడ్డం వల్లనే అని ఇప్పటి తరంలోనే కాదు,అప్పటి తరంలోనే చాలామంది హిందువులకి తెలియదు.1935,అక్టోబరు 12 ఆంధ్ర రాష్ట్ర సంఘాధ్యక్షులైన ప్రకాశం పంతులు గారు "జస్టిసు పార్టీ కోటి రూపాయలను చేర్చుట" అన్న తలకట్టు పెట్టి ఒక వార్తాప్రకటన ఇచ్చారు.అందులో "తాం(జస్టిసు) పార్టీవా రనుసరింపుచున్న మతసాంఘికదురభిమాంపధ్ధతి" ఆనె వాక్యాన్నీ "వోటర్లు కాంగ్రెసు అబ్యర్ధులకే వోట్ల నిచ్చి మాత్సాంఘికదురభిమాన మంతరించినదని వెల్లడి చేయవలెను" అనే వాక్యాన్నీ ప్రయోగించారు.కాంగ్రెసులో ఉన్న పొలిటికల్ బ్రాహ్మిన్స్ అణిచేస్తుంటే సొంత రాజకీయ అస్తిత్వం కోసం బ్రాహ్మణేతరులు పెట్టిన జస్టిస్ పార్టీ మతదురభిమాన సంస్థ అనీ అస్పృశ్యతని సదాచారం కింద పాటించే తమలాంటి వాళ్ళతో నిండిన కాంగ్రెసు మతదురభిమానం లేని సంస్థ అనీ దాని అర్ధం,అవునా?

ఇటువైపున బ్రాహ్మణేతర ఉద్యమం ఉన్నట్టే అటువైపున వర్ణాశ్రమోధ్ధరణ ఉద్యమం కూడా ఉంది.1931, డిశెంబర్ 21 ఒక కరపత్రం వేశారు.అందులో,"1921 సంవత్సరమున గాంధీగారు సహాయనిరాకరణోద్యమమును బూని సంవత్సరాంతములోనే స్వరాజ్యము సాధింతునని యాసబెట్టి గ్రాం మునాస్బు,కార్నము,వెట్టి మొదలగు గ్రామోద్యోగులచే రాజీనామాల నిప్పించి వంశపరంపరాగతములగు హక్కులయిన జీవనోపాధులను పోగొట్టిరి.ఆంగ్లేయ విద్య నభ్యసించు బాలుర పాఠశాలల నుండి పోద్రోలి మరియొక విద్యాభ్యాసమును సూచింపకయ యుభయ భ్రష్టులను జేసిరి.రాజ్యాంగ విషయములో గాంధీగారి సహాయనిరాకరణ శాసనోల్లంఘనములను ప్రజలనుసరించినందున వారి యాశయమగు స్వరాజ్యము రాకపోగా పడరాని బాధలు అప్డుటయే గాక ప్రజల యందు దైవభక్తి,స్త్రీల యందు పతిభక్తి,బాలుర యందు గురుభక్తి పూర్ణముగా నిర్మూలన అగుట మాత్రము జరిగినది" అని వ్రాశారు.అవి నిజాలే గానీ వాళ్ళు చేసింది మాత్రం వెక్కిరిచడమే - గాంధీ గారి పార్టీలో ఉండి ఫెయుల్యూరుకి కారణం అయిందీ బ్రాహ్మణులే కదా అనేది మనం మర్చిపోకూడదు కదా!

శ్రీ జగ్గన్న శాస్త్రి గారు అనే మరొక వర్ణాశ్రమోధ్ధారక సంఘ సభ్యుడు గాంధీ గారు తమకి చేసిన ద్రోహాన్ని వివరిస్తున్నాడు - "40 సంవత్సరముల నుండియు మన దేశమందలి వివిధ మతసమాజములలోని ముఖ్యు లెందరో కాంగ్రెస్ సంస్థలో అధ్యక్ష పీఠము నధిష్టించిన వారెవ్వరు గాని, గాంధీగారివలె స్వీయమతోద్దేశములను ప్రజలచే బలాత్కారముగ నాచరింపజేయుటకు యత్నించినవారు కారు.అస్పృశ్యతా నివారణ మనగా పంచములను దూరముగా కసిరి కొట్టక పరమతస్థులతో బాటుగా నైన ఆదరించుటే యని మొదట అర్ధము చెప్పిన గాంధీగారు,ఐకమత్యము కొరకై ఆపధ్ధర్మముగా నైనను వారిని దరిజేర్పక తప్పదని తొలుదొల్త సమరసభావముతో బల్కుచు వచ్చిన గాంధి నాయకుడు నేడు పంచములతో భోజనము చేసినను వివాహసంబంధాదులు చేసికొనినను వర్నము చెడదని అర్ద్గము చెప్పుచు,పంచములను తాక్కుండుట మహాపాపమనియు అందుకు తగు ప్రాయశ్చిత్తము చేసుకొనవలెనని అసభ్య బోధనలు చేయుటయు, మతవిరుధ్ధములగు దుష్టశాసనములను ప్రోద్బలపరుచు చుండుటయు ఎంత దేశానర్ధకమో యోచింపుడు.ఇట్లు ఒక మతము వారి సదాచారములను నాసనము జేసి వారిని కష్టపెట్టవలెనను ఉద్దేశముతో బయలుదేరిన యేయుద్యమము గాని మనదేశమున నిదివర కెన్నడును వృధ్ధి జెందలేదు.ఇకముందెన్నడును వృధ్ద్గి చెంద జాలదు.",విన్నారు గద!

గాంధీ మొదట్లో వీళ్ళకి అస్పృశ్యుల్ని పార్టీలోకి లాక్కోవటానికీ వాళ్ళ చేత చప్రాసీ పన్లు చేయంచుకోవటానికీ వూర్కే కబుర్లు చెప్తే చాలు అని చెప్పాడంట.అందుకని కాంగ్రెసులో చేరటానికి ఒప్పుకున్నారంట.ఇవ్వాళ నిజ్జంగా నిజ్జాయితీగా సాటి మనుషుల్ని తమతో సమానంగా చూడమంటున్నాడంట.అందుకని వీళ్ళకి కష్టం వేసి కాంగ్రెసు నుంచి బయటికి వచ్చేశారంట - ఇవ్వాళ వీళ్ళ వారసులే గానీ ఇలా మాట్లాడితే చెప్పుచ్చుకు కొట్టరూ మీరు!వందకి డెభ్భయ్యేడు మంది ఉన్న బ్రాహ్మణేతరులు వందకి ముగ్గ్గురు ఉన్న బ్రాహ్మల్ని కూర్చోబెట్టి మేపుతూ వేదం పేరు చెప్పి మరీ తమలోనే కొందర్ని పంచములని అవమానిస్తూ ఉంటే సిగ్గూ శరం లేక వీళ్ళని నెత్తిన పెట్టుకు మోస్తే అది హిందూ జాతి గొప్పదనం అవ్వుద్దా!

కమ్మ వాళ్ళను పక్కనబెట్టాలని ప్రకాశం పంతులు నీలం సంజీవరెడ్డి ని అందలం ఎక్కించాడుఅన్న వాక్యం మొత్తం కుట్రలోని ఒక అంశం మాత్రమే. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బోర్డులోని తెనాలి ఫిర్కా ఎన్నిక వచ్చింది.జంపాల సుబ్బారాయడు చౌదరి గారు,వాసిరెడ్డి వెంకటప్పయ్య చౌదరి గారు,కొత్త రామస్వామి చౌదరి గారి లాంటి వారు కలిసికమ్మవా రెన్నిక్ల ద్వారా మెంబర్లు కాలేకపోవటం అగౌరవమని మాట్లాడుకుని కోగంటి కోటయ్య చౌదరి గారిని అబ్యర్ధిని చేశారు.ఇప్పటిలానే డెమోగ్రఫీని బట్టి తీసుకున్న నిర్ణయమే అది.అయితే,అటు వైపున ఉన్న పొలిటికల్ బ్రాహ్మిన్స్ చాలా తెలివైన ఎత్తు వేశారు.వాళ్ళలో ఒకణ్ణి నిలబెడితే పని జరగదని తెలిసి వైశ్య కులానికి చెందిన వ్యక్తిని పోటీ చేయించి అతన్ని గెలిపించారు.కాంగ్రెసు లోపల పార్టీ పదవుల కోసం కూడా కులపరమైన రాజకీయాలు నడిపి బ్రాహ్మణేతరుల్లో మోతుబరులైన అగ్రకులాల వాళ్ళు సైతం తమకు పోటీ వస్తుందనుకున్న ప్రతి కులాన్నీ ఇతరేతర మార్గాల్లో కూడా అణీచెయ్యడానికి ప్రతి ఒక్క పొలిటికల్ బ్రాహ్మిన్ యధాశక్తి కృషి చేశాడు.

  ఇతరేతర మార్గాల్లో పీఠాధిపతులు వీళ్ళకి అనేక సాయాలు చేశారు.1917 నాడు ఒక సంఘం రూపంలో బ్రాహ్మణేతరులు సంఘటితం కావడానికి ముందు జరిగిన కొన్ని సన్నివేశాలు ఇప్పటి తరపు సాధు సజ్జను లైన బ్రాహ్మణులు కూడా నమ్మలేరు.విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్న అమృతలూరు అనే గ్రామంలో వేద కళాశాల నడుస్తున్నది.సుమారు 1915 నాడు అనుకుంటాను,వేద కళాశాల విద్యార్ధులకి పరిక్షలు పెడుతున్నప్పుడు "మేమిప్పుడు వేదం గురించి చర్చించుకోవాలని అనుకుంటున్నాం.శూద్రులు వినకూడదు కాబట్టి ఇక దయ చేయండి" అని బ్రాహ్మణేతర విద్యార్ధుల్ని అక్కణ్ణించి పొమ్మన్నారు.అప్పటికి కష్టం అనిపించింది గానీ గభాలన బ్రాహ్మణుల్ని అవమానించ లేరు గదా!

ఇదొక్కటే కాదు,కమ్మవారు శూద్రులు కాబట్టి సంస్కృతం చదవకూడదని కృష్ణాజిల్లాలో ఉన్న కమ్మకులస్థులకి రిజిస్టరు నోటీసులు పంపించారు.ఇప్పుడు చౌదరి అనే కులనమం వాడుతున్నారు గానీ అప్పట్లో కమ్మవారికి "దాసు" అనే కులనామం ఉండేది.దానిమీద అప్పటి పీఠాధిపతులతో శ్రీముఖం వ్రాయించి తెచ్చి నానా యాగీ చేసి కమ్మవారు దాసు అని పేరు చివర్న తగిలించుకోవటాన్ని మాన్పించేశారు.మనుస్మృతి రెండవ అధ్యాయం 32 శ్లోకం "శర్మవ ద్బ్రాహ్మణస్య స్యా ద్రాజ్ఞో రక్షాసమన్వితం,వైశ్యస్య పుష్టిసంయుతం శూద్రస్య ప్రైష్యసంయుతం" అని చెప్తుంది.దీని ప్రకారం బ్రాహ్మణులకు "(శుభ)సర్మ", క్షత్రియులకు "(బల)వర్మ",అవిశ్యులకు "(వసు)భూతి",శూద్రులకు "(దీన)దాస" అనేవి పేర్ల చివర వస్తాయి.మరి,19 శతాబ్దంలో వీళ్ళు కమ్మ కులస్థుల్ని దాసు అనే కులనామం గురించి ఎందుకు వేధించారు?ఒళ్ళు బలిసి!వేదాధ్యయనం నుంచి ఇతర కులాల్ని దూరం చేసిందీ వాళ్ళే,వేదాధ్యయనం చేసే అర్హత మీకు లేదు గాబట్టి దాసు అనే కులనామం వాడుకోవటానికి వీల్లేదని గొడవ చేసిందీ వీళ్ళే."నేడు అజ్ఞాతవాసం ఏగినందున కమ్మ,రెడ్డి,బలిజ,వెలమ శాఖలు క్షత్రియులను మీ వాదనను ఖండింపజాల"మని కొల్లూరులో జరిగిన మహాసభయందు శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి పీఠము వారు ప్రకటించటం కూడా జరిగింది.ఇవేవీ తెలియక కాబోలు మధ్యనే ఒక రాజకీయ బ్రాహ్మణ వృధ్ధుడు,"త్యాగాలు చేసేటప్పుడు ముందు నిలుచున్నాం,అధికారం వచ్చేటప్పుడు వెనక్కి పోయాం!" అంటున్నాడు.

ఆఖరికి కోర్టుల్లో ముద్దాయిలు గానీ సాక్షులు గానీ తమ కులం పేరుని అడిగినప్పుడు "కమ్మవారు" అని చెప్తే సబ్ మేజిస్ట్రేట్ అయిన బ్రాహ్మణోత్తములు "కమ్మ" అని చెప్పుకున్నందుకు పదీ "వారు" అని తమని తాము గౌరవించుకున్నందుకు పదీ కలిపి మొత్తం ఇరవై రూపాయలు జరిమానా వేసేవారు.బ్రాహ్మణేతర సంఘం ఉనికిలోకి వచ్చాకనే కుల బ్రాహ్మణుల ఉధృతం తగ్గింది.అయితే, "కమ్మ వాళ్ళను పక్కనబెట్టాలని ప్రకాశం పంతులు నీలం సంజీవరెడ్డిని అందలం ఎక్కించాడు.ఆయన రెడ్డికులగజ్జితో బూర్గుల రామకృష్ణ రావునూబ్రాహ్మణులనూ పనికి రాకుండా చేసాడు." అన్న దృశ్యం నడిచి ఎవరు తీసిన గోతిలో వారే పడతారు, ఎవరు చేసిన దుష్కర్మ ఫలితం వారినే పట్టి పీడిస్తుంది అన్నట్టు రాజకీయాధికారం రెడ్ల పరమై కేవలం వాళ్ళకి వూడిగం చేసే ఉద్యోగాలు మాత్రం బ్రాహ్మలకి దక్కాయి.

వాళ్ళు చేసిన దుర్మార్గం వల్ల వాళ్ళకి తిట్లు మాత్రమే తగిలాయి గానీ హిందూ సమాజం చాలా భయంకరమైన ప్రమాదానికి గురయింది.అప్పటి బ్రాహ్మణేతరోద్యమ ప్రచారకులు అందరూ వేదాధికారం కుల బ్రాహ్మణుల వద్ద ఉండకూడదు బుధ్ధి బ్రాహ్మణులే వేదాధ్యయనం చెయ్యాలి అన్న సదుద్దేశంతో మొదలైంది.అది బలహీనమై కమ్మకులస్థులు బ్రాహ్మణుల మీద పగబట్టి క్రైస్తవ మతాన్నీ కమ్యూనిష్టు పార్టీనీ ఆదరించి పోషించి ఈనాటికి గుణదల కొండ మీద కొలువైన మేరీమాతని ఇంద్రకీలాద్రి మీద కొలువైన దుర్గామాతకి సరిజోదులా నిలబెట్టారు.భూకైలాస్, సీతారామకల్యాణం వంటి చిత్రాల నాడు ప్రతినాయకుడి వేషం వేసి కూడా నాయక పాత్రలని గౌరవించిన నందమూరి తారక రామారావు దానవీరశూర నాటికి దుర్యోధనుణ్ణి సంస్కర్తగానూ పాండవులని జాత్యహంకారులు గానూ చూపించడం వెనక సూతాశ్రమం నుంచి కమ్యూనిజానికి దూకిన డొంకవీటి సంకటకవి ప్రభావం ఉందనేది వాస్తవం. బ్రాహ్మణేతర సిధ్ధాంత కర్తల కన్న భిన్నమైన అసహ్యకరమైన దోరణి వీళ్ళది - బ్రాహ్మణద్వేషం, ధర్మద్వేషం, స్వానురాగం, అన్యమతసమర్ధనం!అప్పుడు మొదలైన బ్రాహ్మణద్వేషం, ధర్మద్వేషం, స్వానురాగం రామారావులో ఆజీవపర్యంతం ప్రదర్శితం అయ్యాయి.

రామారావు ఎట్లా ఛస్తే ఎవడికి కావాలి గానీ ఒక వెయ్యి మంది అస్పృశ్య కులాల వాళ్ళు హిందూమతం నుంచి పోయిన హాని కన్న ఒక కమ్మ భూస్వామి హిందూమతం నుంచి పోవడం వల్ల జరిగే హాని వెయ్యింతలు ఉంటుంది అనే లెక్క ప్రకారం తమ కులపిచ్చితో కమ్మవాళ్ళని తొక్కెయ్యడానికి రెడ్డికులపిచ్చిగాళ్ళని పైకి తెచ్చి సంకనాకిపోయిన కొద్దిమంది బ్రాహ్మణుల వల్ల సంభవించిన ధర్మగ్లానిని చక్కదిద్దాల్సింది ఎవరు?బ్రాహ్మణుల చేత జరిగిన తప్పుని బ్రాహమ్ణుల చేతనే సరిదిద్దించి వాళ్ళు తమ చెడ్డపేరును పోగొట్టుకుని మంచిపేరుని తెచ్చుకుని పునీతులు అయ్యే అవకాశం ఇద్దామా?దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు అవుతుంది గాబట్టి ఇప్పటి బ్రాహ్మనేతర కులస్థులం ఇప్పటి కులబ్రాహ్మణుల్ని వెనక్కి నెట్టి ముందుకు వచ్చి అధికారం చేపట్టి బుధ్ధి బ్రాహ్మణులకి సముచిత స్థానం ఇద్దామా?

ఇప్పటి ఆంధ్ర రాజకీయాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని చూపిస్తాను.పేరు చెప్పడం తప్ప వాళ్ళు చేసినవెధవ పన్లు అన్నీ చెప్తాను.జాతీయ స్థాయిలో ప్రభుత్వం నడుపుతున్న ఒక హిందూ అనుకూల పార్టీ నాయకులకి ఉచిత బోడి సలహాలు ఇచ్చే ఒక ఉద్యోగి ఒక లక్ష కోట్ల దొనగని సమర్ధించడానికి స్థానిక ప్రతిపక్షం వాళ్ళు విమర్శలు చేసిన వెంటనే రాష్ట్రంలోని అధికార పక్షపు నాయకుల కన్న ముందే ఖోపం తెచ్చేసుకుని ఢిల్లీ నుంచి హడావిడి చేస్తూ వచ్చి ప్రెస్మీట్లు పెట్టేవాడు.అంటే, ఎక్కడ తనకిష్టంలేని కమ్మకులస్థుల తిట్లకి తనకిష్టమైన రెడ్డికులస్థుడు నొచ్చుకుంటాడో అని అధికార పక్షం వాళ్ళకన్న ఎక్కువ నెప్పి ఫీలవడం కాదూ ఇది.

"రాజకీయాధికారం రెడ్ల పరమై కేవలం వాళ్ళకి వూడిగం చేసే ఉద్యోగాలు మాత్రం బ్రాహ్మలకి దక్కాయి" అన్నప్పుడు వాళ్ళకి నష్టం జరిగందని అర్ధం కాదు.నాడూ నేడూ కూడా ప్రజాస్వామ్యం చాటున రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటుతోనే ప్రజల మీద జరుగుతున్న దోపిడీకి ఎన్నికల్లో గెల్చి ప్రభుత్వాధినేతలు అవుతున్న వ్యక్తుల కన్న పరిక్షలు వ్రాసి ప్రభుత్వాధికారులు అవుతున్న వ్యక్తులే మొదటి ముద్దాయిలు అయ్యారు, అవుతున్నారు, అవుతారు. ఉచిత బోడి సలహాల ఆత్రగాడికి ఉద్యోగి రాజకీయాలు మాట్లాడకూడదని తెలియదా!తన విలువైనఅభిప్రాయాలు ఎలాగైనా ప్రజలకి చేరాలంటే తను అభిమానించే పార్టీ నాయకుల్లో ఎవరికైనా చెప్పి వాళ్ళని ఉషారు చెయ్యొచ్చు కదా!అబ్బే, ఇక్కడున్న వేరే కులంలో పుట్టిన గొట్టాం గాళ్ళకి ఆయన బ్రాహ్మణోత్తముడిలా కనిపిస్తాడు గానీ ఆయనకి వీళ్ళు మనుషుల్లా కనిపించరు గదా!

ఇంతకీ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పార్టీ అధ్యక్షుణ్ణి సాక్షాత్తూ ప్రదాని మోదీగారు,"మీరెవరో తెలియడం లేదు నాకు.కాస్త మీ గురించి చెప్పుకోండి!" అన్న సన్నివేశం జరిగినప్పుడు "అదేంటి!మన రాష్ట్ర బీజేపీఅ ధ్యక్షుడు ఎవరో మన జాతీయ స్థాయి నాయకుడికి తెలియకపోవడం ఏంటి?" అనే అనుమానం ఎందుకు రాలేదు?అబ్బే, పైన చెప్పిన బుజ్జాయి గారి బాకాలు "అబ్బే!అది పచ్చ పత్రిక!వాడు బూతుక్రిష్ణ!నమ్మకండి!" అని సర్దేశారు గద.ఇప్పటి ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడి గురుంచి నేను "బిజినెస్ రిలేషన్స్ కోసం జగనుతో మిలాకత్ అయ్యా"డని అన్నప్పుడు భాజపా వారే ఒకరు "ఆయనకి వ్యాపారాలూ ఆస్తులూ ఏమీ లేవండి,పార్టీ అధ్యక్షుడు అయ్యేనాటికి ఆయన అనామకుడు కూడాను" అనేశారు.

అదీ సంగతి!ఇతను రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు ఎప్పుడయ్యాడు?కన్నా అనే ఒక హిందూ అనుకూల పార్టీకి చెందిన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇప్పటి ప్రభుత్వం మీద,ఇప్పటి ప్రభుత్వం హిందువుల మీద చేస్తున్న విధ్వసం మీద పోరాడుతూ హిందువులకి ధైర్యం చెప్తున్నప్పుడు "ప్రస్తుతం మన ప్రధాన శత్రువు జగన్ కాదు,తుమ్మబాబు.తుమ్మబాబు బతికున్నంతకాలం మనల్ని అధికారంలోకి రానివ్వడు.తుమ్మకులాన్ని రెడ్డికులం తొక్కేస్తుంటే చప్పట్లు కొడదాం.అప్పుడు రెడ్డికులాన్ని మనం తొక్కేద్దాం.అలా పవర్లోకి వచ్చేద్దాం!" అని వీరంగాలు వేసిన వేస్తున్న కమ్మకులద్వేషులైన రెడ్డికులమిత్రులు రంగంలోకి దిగి కన్నాని తన్నేసి సోమూని తెచ్చారు.ఇదంతా, అధికారం అయితే తమకి కావాలి,లేదంటే తమ చెప్పులు నాకే బొచ్చుకుక్కలకి కావాలి అనే పైత్యంతో ఎవరు తీసిన గోతిలో వారే పడతారు,ఎవరు చేసిన దుష్కర్మ ఫలితం వారినే పట్టి పీడిస్తుంది అన్నట్టు సంకనాకిపోయిన కధనే మరోసారి నడిపించటం తప్ప ఇలాంటి చెత్త ప్లానుల వల్ల వాళ్ళకి గానీ పార్టీకి గానీ లాభం ఏంటి?తమ కులపిచ్చితో కమ్మవాళ్ళని తొక్కెయ్యడానికి రెడ్డికులపిచ్చిగాళ్ళని పైకి తెచ్చి సంకనాకిపోయిన కొద్దిమంది బ్రాహ్మణుల వల్ల సంభవించిన ధర్మగ్లానిని చక్కదిద్దాల్సింది ఎవరు?

ఒక ఎనలిష్టు హోదాలో బీజేపీ జాతీయ స్థాయి నాయకులని కూడా విమర్శించాను నేను.కానీ, హైందవేతరులు కొడుతున్న చాటుదెబ్బల్ని మాత్రం మిగిలిన వారికన్న ముందే పసిగట్టి మనవాళ్ళని ఎలర్ట్ చేస్తున్నాను - ఆదానీ మీద జరుగుతున్న గొడవకు సంబంధించి "ఒక హిందూ అనుకూల పార్టీకి వ్యాపారస్థుల్లో అనుకూల వర్గం ఉండి తీరాలి!" అన్న గర్జనకి తిరుగు ఉందా?జగనుకి 151/175 రావటం వెనక బాబుని లాగి పారెయ్యాలన్న వ్యూహం ఉండి మోదీ ఎన్నికలని మ్యానిప్యులేట్ చేశాడని తెలుగుదేశం వర్గాలు అంటున్నప్పుడు వాళ్ళ వాదనని నమ్మాను, జాతీయ స్థాయినాయకుల్ని విమర్శించాను,నిజమే!కానీ, ఇప్పుడు నా వూహ యేంటంటే రాష్ట్ర బీజేపీ నాయకులకి ఒక క్రైస్తవ మతోన్మాదిని ప్రజలకి బూచిలా చూపించి పార్టీని అధికారంలోకి తెచ్చే అవకాశం ఇచ్చారు.అలాంటి వ్యూహాలు ఏవీ పిల్లలకి అన్నం కలిపి ముద్దలు నోట్లో పిట్టినట్టు పబ్లిక్ డయాస్ మీదే కాదు,ఇన్సైడర్ మీటింగుల్లో కూడా నోరు విప్పి చెప్పరు.

ఆంధ్ర రాష్త్రానికి చెందిన పార్టీ అధ్యక్షుణ్ణి సాక్షాత్తూ ప్రదాని మోదీగారు,"మీరెవరో తెలియడం లేదు నాకు.కాస్త మీ గురించి చెప్పుకోండి!" అన్న సన్నివేశం అనుకోని పొరపాటు కాదు - ప్రధాని స్థానంలో ఉన్న బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు మీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు అనామకుడు,సమర్ధుణ్ణి ఎన్నుకుని పార్టీని చైతన్యవంతం చెయ్యండి అని ఆంధ్రాలో బీజేపీ అభిమానులకీ క్షేత్రస్థాయి కార్యకర్తలకీ మధ్య స్థాయి నాయకులకీ సంకేతం ఇచ్చాడు.

బ్రాహ్మణుల చేత జరిగిన తప్పుని బ్రాహ్మణుల చేతనే సరిదిద్దించి వాళ్ళు తమ చెడ్డపేరును పోగొట్టుకుని మంచిపేరుని తెచ్చుకుని పునీతులు అయ్యే అవకాశం ఇద్దామా?దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు అవుతుంది గాబట్టి ఇప్పటి బ్రాహ్మణేతర కులస్థులం ఇప్పటి కులబ్రాహ్మణుల్ని వెనక్కి నెట్టి ముందుకు వచ్చి అధికారం చేపట్టి బుధ్ధి బ్రాహ్మణులకి సముచిత స్థానం ఇద్దామా? రెండింటిలో ఏది చేసినా ఆంధ్రలో బీజేపీ ఎదుగుతుంది గానీ ఇప్పటిలా కమ్మకులద్వేషం,రెడ్డికులభక్తి ఉన్న పొలిటికల్ బ్రాహ్మిన్స్ మరోసారి వాళ్ళు సంకనాకిపోయి మనల్ని కులాల వారీ విడగొట్టటానికి ఆడుతున్న మాయాద్యూతం నుంచి బయటికి రాకపోతే మాత్రం ఆంధ్ర ప్రాంతం కాలగర్భంలో కలిసిపోతుంది,ఆంధ్రలో హిందువులు మాయమై పోతారు.

జై శ్రీ రాం!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...