Wednesday, 18 January 2023

క్రీస్తు శకం 18వ శతాబ్దం తర్వాత యూరోపియన్ క్రిస్టియన్లు కనిపెట్టిన పాళీ భాషలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి అశోకుడు శాసనాలను వ్రాయించడం ఎలా సాధ్యం?

బౌద్ధమతానికి సంబంధించి మనలో రెండు రకాల భ్రమలు ఉన్నాయి.ఒకటి, శంకరాచార్యుడు బౌధ్ధాన్ని నాశనం చేశాడనేది.రెండు,అశోకుడు ఒక్కడే బౌధ్ధాన్ని ఎక్కువగా ఆదరించాడనేది.బుద్ధుడు పుట్టి 80 యేళ్ళ వయస్సులో మహాపరినిర్వాణం చేసిన సన్నివేశానికి 300 సంవత్సరాల తర్వాతి వాడు అశోకుడు. మధ్య కాలంలో ఎవరూ ఆదరించనే లేదా?ఎవరూ ఆదరించకుండానే 300 ఏళ్ళ పాటు సజీవంగా ఉండగలిగిందా!అశోకుడి పరివర్తనకి కారణమైనదిగా చెప్పబడుతున్న  కళింగ యుధ్ధం కూడా నిజంగా జరిగిందని చెప్పలేని పరిస్థితి.ఇవ్వాళ మనం చదువుతున్న అధికారికమైన చరిత్ర విశ్వవిద్యాలయాల్లో చేరిన కమ్యునిష్టులు తమ ఎజెండాని బట్టి వండివార్చిన తప్పుడు చరిత్ర.

ఇప్పటికీ గౌతమబుధ్ధుడి జీవితకాలనిర్ణయం విషయంలో అన్నీ అనిశ్చితంగానే ఉన్నాయి.బౌధ్ధ మత గ్రంధాలు కూడా ఒక్క తేదీ విషయంలోనూ ఏకీభవించటం లేదు.దీని వల్ల కొందరికి అసలీ గౌతమబుధ్ధుడు వాస్తవంగా ఉన్నాడా లేక కల్పితమా అనే అనుమానాలు కూడా వచ్చాయి.యెందుకంటే ఓక వైపున మతాన్ని స్థాపించిన వ్యక్తి దేవుడి ఉనికిని పూర్తిగా తిరస్కరించి యజ్ఞయాగాదుల్నీ పూజా విధానాలనీ త్రోసిరాజని తర్కంతో బ్రతకమని శాసించాడని చెప్తూ మళ్ళీ అతను బోధిసత్వుదనే దేవుడి 28 అవతారం అనడం హేతువిరుధ్ధం కాదా?బౌధ్ధమతం మీద ఎంతో పరిశోధన చేసిన T.W.R Davids కూడా "ఇన్ని శతాబ్దాల పాటు విస్తరించిన బౌధ్ధ మతసాహిత్యపు చరిత్రని తీరగేసినా ఖచ్చితంగా బుధ్ధుని అనుయాయులు కాలంలో ఎక్కడి నుంచి పరంపరని మొదలు పెట్టారనేదానికి సాక్ష్యం చెప్పగలిగిన ఒక్క రికార్డు కూడా కనపడలేదు నాకు" అనేశాడు.

Thomas William Rhys Davids(12 May 1843 – 27 December 1922) అనే వ్యక్తి అతి హిందూత్వ వాది కాదు.ఇతను తూర్పు ఇంగలాడుకు చెందిన ఎస్సెక్స్ అనే కౌంటీలోని ఒక చర్చి ఫాధరుకి పుట్టాడు.ప్రతి చర్చిలోనూ జరిగేటట్టు తండ్రి నడుపుతున్న చర్చిలో ఆదివారపు ప్రార్ధనలు చేయించేవాడు.A.F. Stenzler అనే Breslau యూనివర్సిటీ ప్రొఫెసరు దగ్గిర సంస్కృతం నేర్చుకున్నాడు.Civil service exams ప్యాసయ్యాక 1863 నాటికి శ్రీలంకలో పోష్టింగు పడింది.1871 నాటికి Assistant Government Agent హోదాని సాధించాడు.అనూరాధపురం దగ్గిర సెటిలయ్యాడు.Pali Text Society ఏర్పాటు చేశాడు.అయితే ఒక ఫ్రాడ్ కేసులో ఇరుక్కుని విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో జరిమానాలు కట్టి లండనుకి తిరిగొచ్చాడు.ఈసారి లా చదివి బారిస్టర్ అయ్యాడు.University of London వాళ్ళని బతిమిలాడుకుని 1882 మొదలు 1904 వరకు జీతం బత్తెం లేని పాళీ భాష గురించి లెక్చర్లకి డబ్బులు పుచ్చుకునే రకం చెత్త పోష్టు ఒకటి వెలగబెట్టాడు.[BOOK] Pali-english dictionary,[BOOK] Buddhist India లాంటి పుస్తకాలు చాలా వ్రాశాడు.

ఇంతకీ ఇతనూ ఇతనిలాంటి ఇంతటి గొప్ప చారిత్రక వేత్తలు శ్రీలంకలో Pali Text Society పెట్టి అంతటి గొప్ప త్రవ్వకాలు చేసి లండనులో పాళీ భాష మీద లెక్చర్లు దంచి డిక్షనరీలూ ఎన్సైక్లోపెడియాలూ రాసిన తర్వాత సైతం అసలు క్రీ.పూ 623 సంవత్సరం మొదలు బుధ్ధుని మహాపరినిర్వాణం జరిగిన కాలం మధ్యన గౌతమ బుధ్ధుడు తిరిగిన ప్రాంతాలలో పాళీ భాష ఎంతమంది మాట్లాడారు,ఎంతమందికి అది వాడుక భాష అయ్యింది అనేది పరిశీలించి చూడాలా వద్దా?

మనం చెప్తే అతి హిందూత్వ వాదుల బనాయింపు పాండిత్యం అంటారు.Kenneth Roy Norman అనే వ్యక్తి సామాన్యుడు కాదు.ప్రపంచ ప్రసిధ్ధి ఉన్న University of Cambridgeకి చెందిన Middle Indo-Aryan languages మీద సాధికారిక పరిజ్ఞానం ఉన్నవాడు.అతనే its emergence was based on a misunderstanding of the compound pāli-bhāsa, with pāli being interpreted as the name of a particular language అనేస్తున్నప్పుడు భారతదేశంలో బుధ్ధుడు తిరిగిన ప్రాంతాల్లో పాళీ భాష కోసం ఇప్పుడు ఎంతమంది వెతికితే మాత్రం తిరుగులేని ఆధారాలు ఎలా దొరుకుతాయి?

అత్యంత సుదీర్ఘమైన పరిశోధనల అనంతరం వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్న ఆణిముత్యాలు ఇట్లా ఉన్నాయి:Pali was first mentioned in Western literature in Simon de la Loubère's descriptions of his travels in the kingdom of Siam.An early grammar and dictionary was published by Methodist missionary Benjamin Clough in 1824, and an initial study published by Eugène Burnouf and Christian Lassen in 1826 (Essai Sur Le Pali, Ou Langue Sacree de La Presqu'ile Au-Dela Du Gange).The first modern Pali-English dictionary was published by Robert Childers in 1872 and 1875.తెలుగులోకి అనువదిస్తే మార్చి చెప్పానని అంటారు గాబట్టి యధాతధం దించేశాను.చదివారు కదూ!

అసలు పాళీ భాషయే హుళక్కి బుళక్కి అని తేలిపోయింది గద. అందాల రాముడు సినిమాలో ఏయన్నార్ నాగభూషణాన్ని ఏడిపించటానికి వంటపాత్రల్నీ కూరగాయల్నీ చెట్లకింద దాచేసి తుఫానొచ్చి లాంచీలు కొట్టుకుపోయాయని అబధ్ధం చెప్పాక ఏయన్నారూ రాజబాబూ "ఇదిగో ఇక్కడ బూరెల గంగాళం దొరికింది,ఇదిగో ఇక్కడ పళ్ళాలూ గ్లాసులూ దొరికాయి - వనదేవత ఇచ్చింది!" అన్న టైపు క్యామిడీ చేసినప్పుడు ఆడియన్సు పగలబడి నవ్వుకున్నారు.కదూ!అయితే,లార్డు కన్నింగుహ్యమూ రైసు డేవిడ్డూ తదితర ఆంగ్లేయ క్రైస్తవ సామ్రాజ్యవాద చారిత్రకులూ చేసింది కూడా అలాంటి క్యామిడీయే - పాతకాలపు రాళ్ళని కొట్టుకొచ్చి వాళ్ళ ఆస్థాన శిల్పుల చేత వీళ్ళ కాపీడ్ పేష్టెడ్ రీప్లేస్డ్ జంబుల్డ్ స్క్రాంబుల్డ్ స్క్రిప్టుని వాళ్ళ సొంత ప్రింటింగు గిడ్డంగుల్లో చెక్కించి చీకటి మాటున వెళ్ళి పాతిపెట్టి రావటం,మళ్ళీ పట్టపగలు పటాలాన్ని వెంటేసుకుని తవ్వి తీసి అప్పుడే దొరికాయని చెప్పటం లాంటి క్యామిడీ చేష్టలతోనే 2000 యేళ్ళ పాటూ మూర్ఖ భారతీయులకి తెలియని అశోక సామ్రాట్టునీ లైటాఫేషియానీ ప్రపంచానికి పరిచయం చేశారు. రొమ్హిల్లా డప్పారు,బీట్ రూట్ రణధివే, డిమాండు డ్రాఫ్టు కౌశాంబి,శ్రీపాద ఆమృత డూంగే లాంటి తాయిగండ వెధవలు ఆ క్రూడాయిలు తవ్వకాల తప్పుడు చరిత్రనే ప్రామాణికం అని సర్టిఫై చేసేశారు.ఒక కొత్త మతాన్ని హిందువుల మీద రుద్దడానికి వీళ్ళే ఒక చెత్తభాషని పుట్టించి రెండు కల్పిత పాత్రల్ని సృష్టించి వాటిని వాస్తవ వ్యక్తుల కింద చూపించటానికి కొన్ని కట్టుకధల్ని చరిత్ర చొప్పున అల్లేశారనేది యావన్మంది హిందువులకీ అర్ధం అయి ఉండాలి!

Doug Smith అనే బౌధ్ధమతానుయాయి అయిన చారిత్రకవేత్త 2018 డెసెంబర్ 24 “Did the Buddha really exist? It's a question that concerns some of us today, given the paucity of hard evidence from the early period of the Buddha's lifetime. We'll look at some of the issues involved in reconstructing that early history and finish up by considering whether and to what extent worries about the Buddha's real existence should impact our practice.” అని బల్లగుద్ది చెప్పటం గౌతమబుద్ధుని చారిత్రకతను అసత్యం అని తేల్చి చెప్పడం లేదూ!

విచిత్రం ఏమిటంటే,బుద్ధుడికి సంబంధించి పూర్తి వాస్తవికమైన అవగాహన కల్పించే "చారిత్రక బుద్దుడు" అనే గ్రంధంలో కూడా "Few personalities in the history of human thought have had such a wide and lasting influence as Siddhardha Gotama." అని గౌతమ బుద్ధుడి యొక్క మతసిద్ధాంతాన్ని పొగుడుతున్న వ్యక్తియే బుద్ధుడికి సంబంధించి ప్రస్తుతం దొరుకుతున్న వివరాలను యదార్ధం అని తను నమ్మట్లేదని బల్లగుద్ది చెప్తున్నాడు.అసలు విషయంలోకి వెళ్ళటానికి ముందే Note on Chronology అన్న తలకట్టు కింద “A word of explanation is called for the dating of the historical Buddha adopted in this book, according to which, following the widely recognized ‘corrected Ceylonese chronology’, the Buddha lived from 563 to 483 b c. Some early Indologists, led Professor P. H. L. Eggermont to reopen the question in four articles in Persica between 1965 and 1979.He has been supported by Professor Heinz Bechert (Indologia Taurinensia X , 1982). Both scholars believe the Sinhalese chroniclers are wrong, and date thie Buddha about 115 years later. Accordingly, I do not (yet) accept them, but it is open to the reader to subtract 115 years from the dates given for events in the life of the historical Buddha.” అంటూ చదువర్లని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. బుధ్ధుడి చరిత్రకి నిక్కచ్చి తేదీలు లేవనీ ఒకే వ్యక్తి యొక్క వంశీకుల లిస్టుకి నాలుగు వెర్షన్లు ఉన్నాయనీ అతని భక్తులు చెప్తున్న కధల్లో కూడా చాలా బొక్కలు  ఉన్నాయనీ చెప్పేసిన తర్వాత H.W.Schumann గారు తన పుస్తకానికి The Historical Budhdha - The Times, Life and Teachings of the Founder of Buddhism అని పేరు పెట్టి సాధించింది ఏమిటి?

268 BCE మొదలు 232 BCE వరకు ఉత్తర దక్షిణాలలో ఇప్పటి ఆఫ్ఘనిష్తాన్ నుంచి అస్సాము తప్ప ఇప్పటి ఈశాన్య రాష్ట్రాలని కలుపుకుని తూర్పు పడమరలలో హిమాలయాల దిగువ నుంచి కేరళ తప్ప  ఇప్పటి భారతదేశపు రాష్ట్రాలను పరిపాలించిన అశోక సామ్రాట్టు "Major rock edicts,Minor rock edicts,Separate rock edicts,Major pillar edicts,Minor pillar edicts" అన్నీ కలిపి 33 శిలా శాసనాలు వేయించితే 20 శతాబ్దంలో లార్డ్ కన్నింగుహాం గారు వచ్చి తవ్వి తీసేవరకు మనలో ఎవరూ అంత గొప్ప సాహిత్య విలువలు ఉన్న శాసనాలను చూడనే లేదంట,ఎవరికీ అశోకుడు అనే గొప్ప చక్రవర్తి గురించి తెలియనే లేదంట!పూర్వ సామాన్య శకం 4000 సంవత్సరాల నాటి సింధు నాగరికతని గురించీ ఏడు వేల యేళ్ళ వెనకటి ద్వారక గురించీ సరస్వతీ నది అంతర్ధానమైన కాలం గురించీ మెసపొటేమియన్ మాయన్ ఈజిప్షియన్ నాగరికతలను గురించీ అనేకమైన విషయాలు తెలుస్తున్నప్పుడు వీళ్ళు ఇప్పటికి మూడు వేల యేళ్ళ లోపునే పుట్టారంటున్న వీళ్ళే ప్రపంచ స్థాయిలో సంచలనం సృష్టించారని అంటున్న ముగ్గురు నలుగురు వ్యక్తుల గురించి ప్రసిధ్ధుల సమకాలీన చరిత్రలో ఒక్క సాక్ష్యం కూడా దొరకకపోవటం ఏమిటి?

పాళీ భాష,గౌతమ బుధ్ధుడు,అశోకుడు,అశోక శిలా శాసనాలు అనే నాలుగు అంశాల్లో ఏ ఒక్కదానికీ irrefutable physical evidence లేవు.అయినప్పటికీ మనని అవన్నీ సత్యాలని నమ్మించేశారు.అశోకుని శాసనాలను అర్థంచేసుకున్న మొదటి వ్యక్తి జేమ్స్ ప్రిన్సెప్, బ్రిటీష్ పురాతన మరియు కలోనియల్ అడ్మినిస్ట్రేటర్.ఈ అశోకుని శాసనాలు బౌద్ధమతానికి మొదటి ప్రత్యక్ష సాక్ష్యం.ఎప్పటి వాడు ఈ మహాజ్ఞాని?1799 ఆగస్టు 20న పుట్టి 1840 ఏప్రిల్ 22న గిట్టి numismatics, metallurgy, meteorology వంటి శాస్త్రాలను అధయనం చేసిన ఒక బ్రిటిష్ జాతీయుడు వారణాశి టంకశాలలో assay master అనే హోదాలో పనిచెయ్యడానికి వచ్చి తవ్వి తీసేవరకు అశోకుడు అనే ఒక చక్రవర్తి వేయించిన 40 పైచిలుకు శిలా శాసనాలు అంత సుదీర్ఘమైన కాలంలో భారతీయులు ఎవరూ చూడలేదు - ట!

అలా చెప్తున్నది ఎవరు?NCERT వారు చెప్తున్నారు!"They were kept in public places and along trade routes so that the maximum number of people would read them.(వాటిని బహిరంగ ప్రదేశాల్లో మరియు వాణిజ్య మార్గాల్లో ఉంచారు, తద్వారా గరిష్ట సంఖ్యలో ప్రజలు వాటిని చదవగలరు.)" అని కూడా వారే చెబుతున్నారు.ఇంతకన్న పోరంబోకు తనం ఎక్కడ ఉంటుంది,చెప్పండి!ఇంకొక దగుల్బాజీ స్టేట్మెంటు ఏంటంటే ఇంగ్లీషోళ్ళు రాకముందర మనవాళ్ళకి చరిత్రని రికార్డు చెయ్యడం తెలియదంట!కల్హణుడు కాశ్మీర దేశపు రాజులను గురించి చెప్పిన "రాజ తరంగిణి" ఎప్పటిది?పాందవాగ్రజుడి మనవడు జనమేజయుడు తన తాతగారిని ప్రస్తావిస్తూ యుధిష్టిర శకంలో కాలాన్ని చెప్తూ వేయించిన శాసనం దొరికింది కదా,కనిపిస్తున్నది కదా!శాతవాహన వంశ స్థాపకుడైన శ్రీ ముఖ శాతకర్ణి గురంచీ శాలివాహన శక స్థాపకుడైన గౌతమి పుత్ర శాతకర్ణి గురించీ వాళ్ళు వేయించిన శాసనాల వల్లనే కదా తెలిసింది!

మన వాస్తవ చరిత్రలోకి కల్పిత పాత్రల్ని దూర్చిన స్కవుండ్రల్స్ వాళ్ళు చెప్తున్న అబధ్ధాల్ని నిజం అని నమ్మించడానికి మనకి చరిత్రని నమోదు చెయ్యడం తెలియదని వాగితే మనం ఎందుకు నమ్మాలి? నేను మిమ్మల్ని ఇక్కడ అడిగిన అడుగుతున్న ప్రశ్నలని మీరు కూడా హిస్టరీ మ్యాస్టర్లని అడగండి.వాళ్ళకి తెలియకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్లని అడిగి తెలుసుకుని చెప్పమనండి.గోల్మాల్ గుమాయించి సుత్తి వాయించడం కాదు,సాక్ష్యాలు చూపించమని నిలదియ్యండి.జవాబు చెప్పేవరకు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండండి.అన్ని ప్రశ్నలూ గుర్తు లేకపోతే ఒకే ఒక్క ప్రశ్నకి జవాబును రాబట్టండి.

క్రీ.శ 18 శతాబ్దం తర్వాత పుట్టిన పాళీ భాషని క్రీ.పూ 3 శతాబ్దం నాటి అశోకుడు ఎలా నేర్చుకున్నాడు?

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...