Monday, 10 May 2021

భారతీయ జనతా పార్టీ అభిమానులూ రాస్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులూ నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు?

నేను భారతీయ జనతా పార్టీని గానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని గానీ ద్వేషించడం లేదు!నన్ను నేనొక political analyst అని చెప్పుకుంటున్నాను.రాజకీయ విశ్లేషణ అనేది చాలా కష్టమైన వ్యవహారం.నేనొక్కణ్ణే కొత్తగా మొదలుపెట్టలేదు.సీనియర్లు ఉన్నారు.అయితే సీనియర్లలో దాదాపు నూటికి తొంభై తొమ్మిది శాతం ఏదో ఒక పార్టీకి అనుకూలం అయిపోయారు.అందువల్ల వారి విశ్లేషణలు తమకు ఇష్టమైన పార్టీకి అనుకూలం అయిపోయాయి.అరుణ్ శౌరి గారినే తీసుకోండి.భారతీయ జనతా పార్టీ ప్రాభవం ఒక స్థాయిని చేరుకునే వరకు ఆయనను హిందూత్వ అనుకూల వాది అని ఎవరూ గుర్తించలేదు.మరి, ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ అభిమాని అయిపోయారు.మన తెలుగు వారిలో జర్నలిస్టు సాయి గారిని చూస్తే యవ్వన దశలో ఎన్నో సాహసాలు చేసి సంచలన కధనాలను వెలువరించే నాడు ఎలా ఉన్న్నారు, ఇప్పుడెలా ఉన్నారు. అప్పుడు మారుమూల గ్రామాల్లో జరుగుతున్న మూఢనమ్మకాలను కూడా బయట పెట్టిన సాహసం ఇప్పుడు లేదు, భారతీయ జనతా పార్టీ పరిపాలన వల్ల కార్ల పరిశ్రమ మూతబడుతుందని అందరూ గగ్గోలు పెడుతుంటే తాపీగా జనం నడక నేర్చుకుంటారు లెమ్మని భరోసా ఇస్తున్నారు!

బహుశః నేను కూడా వాళ్ళు తొలిదశలో చూపించిన నిష్పాక్షికతను గాక ఇప్పుడు చూపిస్తున్న భజన పరత్వాన్ని చూపిస్తే భారతీయ జనతా పార్టీ అభిమానులూ రాస్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులూ నన్ను అభిమానిస్తారు కాబోలు!

మొదట నా చరిత్ర చెప్తాను.నేను యవ్వన కాలంలో నాస్తికుణ్ణి, కమ్యూనిష్టు భావజాలం వైపుకి కూడా మొగ్గు చూపాను.అయితే, కొన్ని చిత్రమైన వ్యక్తిగతమైన కారణాలతో ఆస్తికుణ్ణి అయ్యాక కూడా చాలా కాలం పాటు కమ్యూనిష్టు భావజాలం యొక్క ప్రభావంలోనే ఉన్నాను.చిన్నప్పటి నుంచీ ప్రతి రోజూ న్యూస్ పేపరు చదివే అలవాటు ఉండటం వల్ల సంచలనం సృష్టించిన అయోధ్య రామాలయం కేంద్రంగా మొదలైన ఉద్యమాన్ని తొలినాళ్ళ నుంచీ గమనించాను.అప్పుడు ఉద్యమానికి అనుకూలుడైన మా మామయ్యని "ధర్మ స్వరూపుడైన రాముడు తనకి ఆలయం నిర్మించటానికి హింసని రెచ్చగొట్టమని చెప్పాడా?" అని అడిగి ఆయన తత్తరపడేటట్టు చేశాను.అయితే, మసీదును కూలగొట్టటానికి తొలినాళ్ళలో వ్యతిరేకించిన నేను రూటు మార్చుకుని భాజపా అభిమానిని కావడానికి అప్పుడు కళ్ళముందు కనబడుతున్న అద్వానీ, వాజపేయి లాంటి వారి వ్యక్తిత్వమే ప్రముఖమైన కారణం!నా మెయిల్ ఐడిలో ఉన్న లెనిన్ ఫొటోని గురించి కొందరు వెక్కిరిస్తున్నారు.అతన్ని కూడా అతని నాయకత్వ ప్రతిభ వల్లనే అభిమానించాను తప్పితే కమ్యూనిష్టు సిద్ధాంతం మీద ఉన్న అభిమానం కాదు.ఇంతకీ భారతదేశపు వీరకిశోరం భగత్సింగును ఇదే భాజపా వారూ రాష్ట్రీయ స్వయం సేవక్ కూడా పొగుడుతున్నారు కదా!అతనేమైనా హిందూత్వవాదియా?పక్కా కమ్యూనిష్టు అయిన భగత్సింగ్ ఏనాడూ హిందూమతాన్ని ప్రశంసించలేదు, అయినా భాజపా వారికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులకూ ఉత్తేజాన్ని కలిగిస్తున్నాడు కదా, మరి నేను అదే లెక్కన లెనిన్ అనే మరో కమ్యూనిష్టుని అభిమానిస్తే తప్పేమిటో!

విశ్వహిందూపరిషత్ భారతీయ జనత పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి పొరపాటున తన అసలు లక్ష్యానికి దూరం అయిపోయి తన పూర్వ వైభవాన్ని కోల్పోయిందనీ అందువల్లానె ప్రస్తుతం వ్యతిరేక్త బలపడిందనీ మళ్ళీ విశ్వహిందూపరిషత్ లేక రాస్ట్రీయ స్వయం సేవక సంఘం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటే చాలు సమస్య చక్కబడుతుందనీ అనుకుంటున్నారు కొందరు అమాయక కార్యకర్తలు.

వారిలో ఒకరు తన రాజకీయ పరిజ్ఞానం నాకు తెలియక ఆయన అభిప్రాయాన్ని తప్పు పడుతున్నాని అంటున్నారు.కానీ నేను కేవలం రాజకీయ విశ్లేసహ్ణకు మాత్రమే పరిమితం కాలేదు.చరిత్ర అంటే నాకు చాలా అభిమానం. రెండు సంస్థల చరిత్రలోని సూక్ష్మమైన మలుపులు కూడా నాకు తెలుసు.తొలినాటి హిందూ మహా సభ ఏర్పడిన నాటినుంచి 1985లో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ఏర్పడే వరకు జాతీయత/హిందూత్వం/భారతీయత అనే పారిభాషిక పదాలు ఎన్ని నిర్వచనాలను కలుపుకున్నాయో ఫ్రెండు సంస్థలలోని నాయకులు ఎవరేరు ఏయే సన్నివేశాలలో ఎలా ప్రవర్తించారో అన్నీ నాకు తెలుసు.

నిన్నటి వరకు పార్టీ లోపలా బయటా ఉన్న హిందూత్వ వాదులకి ఒక భ్రమ ఉంది - మోదీతోనే మోదీ వల్లనే హిందూత్వం బలపడి హిందువులు ఏకమయ్యారని!నిన్న గాక మొన్న ఒక తొంభై యేళ్ళ వృధ్ధుడు ఇంకొంచెం సేపు అలాగే చేస్తే చస్తాడేమో అనిపించేటట్టు "నమోనమోనమో" అని వినేవాళ్ళ మాడుపెంకులెగిరిపోయే శ్రుతిలో  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం తంటాలు పడుతున్నాడనిపించే స్థాయిలో భజన చేస్తున్నాడు - అవసరమా అంత బానిసత్వం!

అయితే, మోదీ పట్ల వారు కూడా సమర్ధించలేని స్థాయిలో వ్యతిరేకత బలపడిన ఇప్పుడు VHP/RSS యొక్క పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకుని పశ్చాత్తాపం వెలిబుచ్చే కొత్త నాటకం మొదలు పెట్టారు!ఇంతకీ, వీరు పూర్వ వైభవం అంటున్న కాలంలో RSS/VHP ఏమి చేశాయి?అది వైభవం అయితే ఇపుడెందుకు అప్పుడు చేసిన పనుల్ని మానేశాయి?అప్పుడు అనుభవించిన వైభవం తర్వాత తర్వాత బోరు కొట్టేసిందా!

ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి.నా రాజకీయ విశ్లేషణలో నిష్పాక్షికత ఉండటం వల్లనూ మీరు ఎదటివారినుంచి భజనను మాత్రమే ఆశించడం వల్లనూ నేను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ నమ్మలేకపోతున్నారు గానీ దేశంలో హిందూ అనుకూల ప్రభుత్వం ఉండాలని నేను కూడా ఆశిస్తున్నాను.నిజానికి నా విశ్లేషణలో భారతీయ జనతా పార్టీ గురించి చేస్తున్నవి ద్వేషంతో కూడిన విమర్సలు కావు.నిజమైన హిందూ అనుకూల ప్రభుత్వాన్ని సాధించలేని నిస్సహాయత వల్ల హిందూ అనుకూల ప్రభుత్వంలా నటిస్తున్న మోసకారి తనాన్ని బట్టబయలు చేసి నిజమైన హిందూత్వ అనుకూల విధానాలతో ప్రభుత్వాన్ని నడిపించమని ఒత్తిడి చేస్తున్నాను.

అవును, అది వారి మోసకారి తనమే!రాష్ట్రీయ స్వయం సేవక సంఘం క్షేత్రస్థాయిలో చేసిన కృషి వల్లనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగలిగిందని ఇప్పుడు ఒప్పుకుంటున్న నిజాన్ని నిన్నటి వరకు మీరు కూడా ఒప్పుకోకపోవడం వల్లనే కదా ఇవ్వాళ పొరపాటు జరిగిందనీ తప్పుల్ని సరిదిద్దుకోవాలనీ అంటూ పూర్వ వైభవం కోసం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు -ఇది మీ మోసకారి తనం, కాదా!

భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దారి తప్పిందని మీరు చేస్తున్న వాదనని అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఉండి ప్రయాణంలో చురుకైన పాత్రని పోషించిన నాయకుల చెత ఒప్పించగలరా మీరు?ఒప్పించలేరు!ఎందుకంటే, ప్రయాణం మీరు అనుకుంటున్నట్టు దారి తప్పిన పొరపాటులా జరఫలేదు.అన్నీ ఆలోచించి భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దశల వారీ ఆటుపోట్లని ముందే వూహించి ఎదుర్కుని వైఫల్యాల్ని కూడా విజయాల కింద మార్చుకుని చేసిన సుదీర్ఘమైన ప్రయాణం అది - దాన్ని దారి తప్పిన పొరపాటు వల్ల వచ్చిన తప్పుడు ఫలితం అనడం మీ రాజకీయ అజ్ఞానం తప్ప మరొకటి కాదు!

పార్టీ అయినా సిద్ధాంతం అయినా అంకితభావంతో ప్రజలకి మేలు చేసే ఆదర్శవంతమైన అనుచరుల వల్లనూ కార్యకర్తల వల్లనూ మాత్రమే తన విశ్వసనీయతను ప్రదర్శించి ప్రాభవాన్ని సాధించుకోగలుగుతుంది, అవునా?ఒకనాడు ఇందిరాగాంధీ చేతిలో దుర్మార్గమైన అణిచివేతకి గురై కూడా ఎన్నో కేసుల్ని తాన మీద వేసి అరాచక శక్తిగా నిరూపించాలని చూసినా కోర్టుల నుంచి ప్రశంసల్ని అందుకుని నిషేధాన్ని ఎత్తి వేయిచుకుని నిలబడిన ధృఢత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థది.కేవలం 2 సీట్లతో అపహాస్యానికి గురయిన భాజపా వాజపేయి మహాశయుడు ప్రకటించినట్టు ఇంత గొప్ప స్థితికి చేరుకోవడానికి భాజపా అనే రాజకీయ పార్టీలో ఆనాడు ఉన్నవారి మూలాలు రాష్ట్రీయ స్వయం సేవక్ అనే పవిత్రమైన సంస్థలో ఉండటమే కారణం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.మొదటిసారి భాజపా అధికారంలోకి రావడానికి తొలినాళ్ళలో ద్వేషించి మలినాళ్ళలో అభిమానించిన నాలాంటి అనేకానేక సహస్రాధిక అనామక వ్యక్తులే కారణం అనేది కూడా యదార్ధమే, అవునా?

మరి వ్యతిరేకులను కూడా మెప్పించి తనవైపుకు తిప్పుకోగలిగిన సచ్చీలత బదులు ఇవ్వాళ వ్యతిరేకత నుంచి సానుకూలత వైపుకి వచ్చిన నాలాంటి అనేకానేక సహస్రాధిక అనామక వ్యక్తుల నుంచి ఎదురౌతున్న ఛీత్కారాలను కూడా లక్ష్యపెట్టని నీచత్వానికి కారణం ఏమిటి? ప్రశ్నకి సరైన జవాబు తెలియాలంటే వాజపేయి ప్రభుత్వం కూలిపోయిన నాటికీ మోదీ తొలిసారి అధికారంలోకి రావడానికీ మధ్యన అటువైపు భాజపా మరియు రాస్వసే అనే జమిలి సంస్థల సంస్కృతిలోనూ ఇటువైపు హిందూ సమాజంలోనూ అంతకుముందు ఎవరూ వూహించని కొన్ని భీబత్సమైన మార్పులని పసికట్టాలి.హైందవేతర సమూహాలు అంటే, కమ్యూనిష్టులూ వారిని వెనకేసుకొచ్చిన కాంగ్రెసు పార్టీ హిందూమతం మీద తమ దాడిని పెంచాయి. వారు దీనికి చెప్పుకున్న సమర్ధన భాజపా అయోధ్య ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే చేపట్టినదనేది సమర్ధించదగిన కారణమే గానీ పేరున వారు చేసిన చేష్టలు మాత్రం చాలా నీచ స్థాయిలో ఉండి అప్పటి వరకు తటస్థులుగా ఉన్న సహనశీలురైన హిందువుల్ని కూడా రెచ్చగొట్టి విధి లేక తమ రక్షణ కోసం భాజపాను తమ ప్రతినిధిగా ఎన్నుకోవలసి వచ్చింది. అయితే, వూపును భాజపా మరియు రాస్వసే నిర్మాణాత్మకమైన దృక్పధంతో ఉపయోగించుకుని ఉంటే రెండు సంస్థలకీ ఇవ్వాళ్టి దుస్థితి ప్రాప్తించి ఉండేది కాదు.కానీ భాజపా నాయకులు అప్పటివరకు తమకి కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెట్టిన నైతిక విలువల్ని గాలికి వదిలేసి అధికారంలో ఉంటే చాలును అనే ధోరణిలో పడిపోయి కాంగ్రెసును అనుకరించటం మొదలుపెట్టారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులూ కార్యకర్తలూ క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ సేవా తత్పరతనీ నైతిక ధృఢత్వాన్నీ కలిగి ఉన్నారా లేక వారు కూడా బద్ధకస్తులైపోయి భాజపా ద్వారా లాభపడాలని సర్దుకుపోతున్నారా?వృద్ధాప్యంలో శక్తులు ఉడిగిపోయినప్పుడు రాజీ పడటం సహజమే - కానీ రాస్వసేలో కుర్రవాళ్ళు ఎవరూ లేరా?అందరూ ముసలివాళ్ళైపోయారా?రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థలో నిర్ణయాత్మక స్థానంలో ఉన్నవారికి ఇప్పుడు రెండే రెండు దారులు ఉన్నాయి.హిందూమతానికి మూలమైనది సత్యము, నైతికత కాబట్టి విలువల కోసం పట్టుబట్టి భాజపాని మంచి దారికి తీసుకు రావటం ఒక దారి.కొంచెం విచక్షణతో ఆలోచిస్తే భాజపా ఇప్పుడు చేస్తున్న లత్తుకోరు పనులు చెయ్యడం వలనే కాంగ్రెసు ఇవ్వాళ ఉన్న స్థితిని అనుభవిస్తున్నదనేది తెలుస్తుంది.ఇవ్వాళ చీప్ ట్రిక్కులు ప్లే చేసి ఒకటి రెండు ఎన్నికల్లో గెల్చినా నిరంతరం గెలవాలంటే తమ కార్యకర్తల ప్రచారంతో ప్రజలు తమను మెచ్చి వేసిన వోట్లతో అధికారంలోకి రావడమే గౌరవప్రదమయినదనేదీ అదే సుదీర్ఘ కాలం పాటు తమని నిలబెడుతుందనేదీ రాస్వసే నాయకులు భాజపా నాయకులకి తెలియజెప్తేనే రెండు సంస్థలూ చిరకాలం మన్నుతాయి.

భాజపాతో మితిమీరిన రాజకీయ ప్రేరితమైన అనుబంధాన్ని తెంచుకుని ఇప్పటివరకు తమకు హిందూ సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టిన సేవా కార్యక్రమాలకీ ధర్మ ప్రచారానికీ పూర్తి సమయం కేటాయించటం రెండవ దారి.ఇందులో అలసత్వం చూపిస్తే నేను చెప్పినట్టు త్వరలోనే కనుమరుగు అయిపోవడం ఖాయం!హిందూ సమాజం రాస్వసే భాజపాతో తెగదెంపులు చేసుకోగానే మళ్ళీ నెత్తిన పెట్టుకుంటుందన్న గ్యారెంటీ కూడా లేదు.రాస్వసే భాజపా మీద పెత్తనం చెయ్యడంలో మునిగిపోయిన కాలంలో కొత్త సంస్థలు కొన్ని ఆవిర్భవించాయి.తెలుగు రాష్ట్రాల్లో శివశక్తి సంస్థ చాలా ప్రముఖమైనది.రాస్వసే కేవలం ధర్మ ప్రచారానికి మాత్రమే పరిమితం కావడం వల్ల రాజకీయ రంగంలో భాజపాను తనకు మారుగా ఉపయోగించుకుంటున్నది. బలహీనత శివశక్తికి లేదు.కరుణాకర్ సుగ్గున మధ్యనే ఉత్తరాదికి కూడా విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.భవిష్యత్తులో రాజకీయ పార్టీని కూడా స్థాపించే ఉద్దేశం ఉన్నట్టు అతని మాటల వల్ల తెలుస్తున్నది.అదే గనక కార్యరూపం దాలిస్తే తెలివి తక్కువా ఆకలి యెక్కువా అన్నట్టు సుస్థిరమైన వోటుబ్యాంకును ఏర్పాటు చేసుకోలేని భాజపాకు తప్పనిసరిగా నష్టం జరుగుతుంది.ఇప్పటివలెనే భాజపా మీద అధారపడి విస్తరించే బద్ధకపు ధోరణిలో ఉంటే రాష్ట్రీయ స్వయం సేవక్ కూడా నష్టపోతుంది.అయ్యవారు వచ్చేదాక అమావాస్య ఆగుతుందా?హిందువులు అనంతకాలం వరకు మిమ్మల్నే నమ్ముకుని కూర్చుంటారా?

దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే "మా మామ చెవిలో మీసాలు మొలిపించు మిగతాది నేను చూసుకుంటా" నన్నట్టు VHP/RSS పూర్వ వైభవం సాధిస్తే చాలు BJP కూడా పులు గడిగిన ముత్యం అయిపోతుందని సంబరపడుతున్న అమాయకులకి అసలు రెండు సంస్థలూ ఒకప్పటి వైభవం సాధించడం అసంభవం అనేది  తెలియడం లేదు.

లేదు, సాధించగలం అని అనుకుంటున్న రెండు సంస్థల కార్యకర్తలకూ అభిమానులకూ నేను ఒక సవాలు విసురుతున్నాను - జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలో గానీ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల చేత అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలలో గానీ బహిరంగ సమావేశాలలో గానీ మీ మూడు సంస్థల యొక్క భావజాలాన్ని రూపు దిద్దిన గోల్వాల్కర్ వంటి మహనీయులను గురిచి కేవలం రెండే రెండు ప్రశంసా వాక్యాల్ని పలికించగలరా?

ఇప్పుడు నేను సవాలు విసరడం అనవసరం అనీ అనిపించవచ్చు,నాలోని హిందూద్వేషాన్ని కవరప్ చేసుకోవడం కోసమూ మీనుంచి తిట్లు తప్పించుకోవడం కోసం వేస్తున్న ఎత్తుగడ అని కూడా అనుకోవచ్చు.కానీ, కాంగ్రెసు ముక్త భారతం గురించి గర్జనలు  చేస్తున్న సమయంలోనే మోదీగారు అదే కాంగ్రెసు మూలస్తంభం అయిన మోహన్ దాస్ కరం చంద్ గాంధీని జాతిపిత కింద గుర్తించడమూ జయంతుల్నీ వర్ధంతుల్నీ భక్తితో జరిపించడమూ మీకు ఎబ్బెట్టుగా అనిపించలేదా,ఎందుకు?

మోప్లా విధ్వంసం మొదలు డైరెక్ట్ యాక్షన్ వరకు అన్ని భీబత్సాలు హిందువుల మీద జరుగుతుంటే ముస్లిములు నా సోదరులు వాళ్ళని ఏమన్నా చేస్తే నేను ఛస్తానన్నంత హడావిడి చేసి హిందువుల చేతులు కట్టేసిన హిందూమతద్రోహిని మీ సంస్థలలో ఎప్పుడు పొగిడారు మీరు?మరి, మీ సంస్థ భావజాలంతో పెరిగి మీ కార్యకర్తల త్యాగాలతో అధికారంలోకి వెళ్ళారని అంటున్న రాజకీయ నాయకులు ఒక హిందూమతద్రోహిని జాతిపిత అని పొగుడుతుంటే మీ రక్తం ఎందుకు మరిగిపోలేదు?

జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలో గానీ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల చేత అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలలో గానీ బహిరంగ సమావేశాలలో గానీ మీ మూడు సంస్థల యొక్క భావజాలాన్ని రూపు దిద్దిన గోల్వాల్కర్ వంటి మహనీయులను గురిచి కేవలం రెండే రెండు ప్రశంసా వాక్యాల్ని పలికించగలగడం మీ వల్ల కాదని బల్లగుద్ది చెప్పగలను నేను!ప్రయత్నించి చూడండి, అప్పుడు మీ సంస్థల నుంచి వెళ్ళిన భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకులకి నిజమైన హిందూత్వం పట్ల మీకు ఉన్నంత అంకితభావం లేదనీ వాళ్ళు మిమ్మల్ని వాడుకుని వదిలేశారనీ ఇప్పటికీ మిమ్మల్ని మోసం చేస్తున్నారనీ తెలుస్తుంది.

ఒకవేళ మీరు వాళ్ళను నిజమైన హిందూత్వం వైపుకి నడిపించగలిగితే మిమ్మల్ని విమర్శించాల్సిన అవసరం నాకూ లేదు, నేను విమర్శించినప్పటికీ పట్టించుకోవాల్సిన అవసరం మీకూ ఉండదు.

జై శ్రీ రాం!

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...