ఇప్పటికీ లాక్ డౌన్ ఎప్పుడు
ఎత్తేస్తారో తెలియడం లేదు.పైన టీవీలో
స్క్రోలింగులు చూస్తుంటే పూర్తిగా ఎత్తెయ్యడం కాదు, మరోసారి మరింత
కఠినమైన లాక్ డౌన్ పెట్టినా
ఆశ్చర్యం లేదనిపిస్తుంది. లాక్ డౌన్ గురించి
కొందరు ఫ్యామిలీతో గడపటం, పరిశుభ్రతని నేర్చుకోవటం లాంటి సిల్వర్ లైన్
చూపిస్తున్నారు గానీ బ్రాహ్మణులు పాటిస్తున్న
పరిశుభ్రతనీ కరోనా జాగ్రత్తల్నీ పోలుస్తూ
కవిత్వం చెప్పినందుకు జొన్నవిత్తులని వేధించడం కూడా జరిగింది కదా!ఇసక తరలింపు ఆగలేదు,
మడ అడవుల నరికివేత ఆగలేదు,
రౌడీల కొట్లాటలు ఆగలేదు, చిన్న పిల్లలు బోరుబావుల్లో
పడటం ఆగలేదు, హత్యలు ఆగలేదు, మానభంగాలు ఆగలేదు - మనం బయటకెళ్ళి చూడని
కొరతని టీవీల వాళ్ళు తీరుస్తున్నారు!మనుషుల మనస్తత్వాలు ఏమాత్రమూ మారలేదు - చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అయిపోలేదు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోలేదు!కరోనా కట్టుదిట్టం అయ్యిందా?లేదు!కరోనా వ్యాప్తి
తగ్గిందా?లేదు!మరి ఈ
లాక్ డౌన్ ఏమి సాధించింది?
నాలుగు రోజుల క్రితం నాకు
తెలిసిన ఒక పచ్చి నిజం
మీకు చెప్తున్నాను.మీరు నమ్మలేరని నా
అనుమానం.నమ్మితే మాత్రం ఇంకెన్నో రోజులు ప్రశాంతంగా ఇంట్లో కూర్చోలేరు మీరు.మా బంగారం కోలీగ్
ఒకామెకి వాళ్ళాయనతో సహా కరోనా పాజిటివ్
వచ్చింది.గవర్నమెంటు హాస్పిటలు వాళ్ళు వరండాలో పడుకోబెడతామన్నారు.అది కష్టం అనిపించి
ప్రైవేట్ హాస్పిటలుకి వెళ్తే తలకు ఒక్కరికి ఒక్క
రోజుకి మూడు లక్షలు అడిగారు!మీరు విన్నది పొరపాటు
కాదు, నేను చెప్పింది తడబాటు
కాదు - ఇల్లు దాటి కదలకపోవడం
వల్ల మన చుట్టూ ఏమి
జరుగుతుందో తెలియక డాక్టర్లని దేవుళ్ళనుకుని వాళ్ళ కోసం చప్పట్లు
కొట్టమంటే కొట్టి దీపాలు వెలించమంటే వెలిగించి గుండ్రాయిల్లా కూర్చున్న గ్రహచారం మనది!అసలైన కొసమెరుపు
ఏంటో తెలుసా - వాళ్ళు రోజుకి మూడు లక్షలు పెట్టుకోలేక
పరిచయస్తుల ద్వారా ఒక డాక్టరుని సంప్రదిస్తే,
"పారాసిటమాల్ వేసుకుంటూ ఇమ్యూనిటీ పెంచే తిండి తింటూ
ఇల్లు కదలకుండా కూర్చోడి, భయం లేదు!" అన్నాడు.ఏమో!వాళ్ళు హాస్పిటలుకు
వెళ్ళలేని స్థితిలో ఉన్నారు గాబట్టి ఆ డాక్టరు వీళ్ళకి
అదృష్టం తాయత్తు కట్టాడేమో అని నాకూ అనిపిస్తున్నది
గానీ ఇందులోని నిజానిజాలు తెల్సుకోవాలంటే కరోనా రోగులని ఉంచిన
క్వారంటైనులో ఏ మందులు వాడుతున్నారో
ఏమి వైద్యం చేస్తున్నారో అడిగితే చాలు.
జగనూ కేసీయారూ పారాసిటమాల్
గురించి చెప్పినప్పుడు నవ్వనివాళ్ళు లేరు!ప్రతిదాంట్లోనూ కేసీయారుని
ఇమిటేట్ చేస్తున్న జగనే కాదు, నేను
సైంటిస్టుల్ని కనుకున్నానని ఎంతో ధీమాగా చెప్పిన
కేసీయారు కూడా కేంద్రప్రభుత్వం WHO పేరు మీద
చేసిన హెచ్చరికల వంటి నిర్దేశికాల తర్వాత
లాక్ డౌన్ ప్లానుకి ఓకే
చెప్పేశాడు - కేంద్రం నొక్కి చెప్పాక కాదంటే బాగోదు, తన మాటల మీద
అప్పటికే విమర్శలు వస్తున్నాయి, కేంద్రం ఇచ్చే ప్యాకేజిలో ఎంతో
కొంత నొక్కెయ్యొచ్చు.ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో
అది చేసేసి కూచుంటే పోలా అని ఆలోచించే అతి మామూలు రాజకీయ నాయకుడు కేసీయార్, జగనూ అంతే,
చంద్రబాబు కూడా అంతే కదా!
ఇంతవరకు వైరస్ వ్యాదుల మొహమే
చూడనట్టు ఈ కరోనాకే ఇంత
హడావిడి ఎందుకు చేశారు, చేస్తున్నారు, చెయ్యబోతున్నారు?ఒకసారి ఆలోచించండి!అసలు, టీవీ స్క్రోలింగులో
చూపిస్తున్న లెక్కల్ని చూస్తేనే కరోనా వచ్చి వైద్యసహాయం
అందుతున్నవాళ్ళలో చనిపోతున్నవాళ్ళ సంఖ్య చాలా తక్కువ
అని తెలియటం లేదూ!కానీ, జనం
మెదళ్ళలో ప్రవేశపెట్టిన భయం ఏ స్థాయిలో
ఉందంటే కరోనాతో చచ్చిపోయిన వాళ్ళని తాకడానికి స్వంత కుటుంబం వాళ్ళే
భయపడుతుంటే అంతిమ సంస్కారాల్ని హాస్పటల్
వాళ్ళే పదడుగుల దూరం పాటించి అనాధప్రేతాలకి
చేసినట్టు చేస్తున్నారు - ఇదేనా కరోనా వల్ల
వికసించినదంటున్న మానవత్వం!ఎందుకింత పిచ్చితనం?
నేను ఇదివరకు ఒకసారి
చెప్పాను కదా, లాక్ డౌన్ అసలు
లక్ష్యం ప్రజల ఆరోగ్య పరిరక్షణ
కోసం కాదు, దేశపు ఆర్ధిక
ప్రగత్ని ఛిన్నాభిన్నం చెయ్యడం కోసమని - నమ్మనివాళ్ళు భవిష్యత్తులోకి ఒకసారి తొంగి చూడండి.తిరిగి
తమ తమ ఉదోగాలలోనూ వ్యాపారాలలోనూ
అడుగుపెట్టినవాళ్ళకి పూర్తి జీతాలు రాకపోవచ్చు. ఇప్పటికి అయిదు నెలలపాటు ఉద్యోగం
చెయ్యని వాళ్ళు యజమానుల్ని జీతం ఎట్లా అడగగలరు?అయిదు నెలలపాటు అమ్మకాలు
స్తంభించిన తర్వాత ఏ యజమాని తన
ఉద్యోగులకి జీతాలు ఇవ్వగలడు?ఎవరూ భయపడనక్కర్లేదు, అందర్నీ ఆదుకుంటానని
ధైర్యం చెప్తున్న కేంద్రప్రభుత్వం ఇన్ని కోట్లమంది ప్రజల్ని
కూర్చోబెట్టి మేపడానికి డబ్బు ఎక్కణ్ణించి తెస్తున్నది?దేశం నిలవలో ఉండిందా?నిర్బయ భారత్ పేరు మీద
విదిల్చిన ముష్టి ఇరవై వేల కోట్లు
మోదీ తన సొంత జేబు
నించి తీసి ఇచ్చాడా?ఎక్కణ్ణించో
తెచ్చిన అప్పు కాదూ!పాత
అప్పుకి కొత్త అప్పును జోడించింది
మోదీ అయితే తీర్చాల్సింది ఎవరు
- మనమే కదా!ఎందుకింత పిచ్చితనం?జీతాలలో కోత తప్పినప్పుడు కూడా సంతోషించడానికీ వీల్లేదు, అంతవరకు వూరుకున్న నెలసరి వాయిదాల వాళ్ళు వూరుకోరు.పెరిగిన ధరలు తగ్గుతాయనే గ్యారెంటీ
లేదు.ఆంధ్రాలో అయితే కరెంటు చార్జీలు
కూడా లక్షల్లో వచ్చి అదనపు భారం అవుతాయి!ఇదివరకటి
సేవింగ్స్ అన్నీ లాక్ డౌన్
సమయంలో కూర్చుని తినడానికి ఖర్చు పెట్టేసిన పిచ్చిపుల్లయ్యలు
అంత భీబత్సాన్ని తట్టుకుని బతికి బట్టకట్టడం సాధ్యమా!కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ లాక్ డౌన్ ఎత్తివేసే
సూచనలు కనపడటం లేదు.బహుశా, ఈ
ఆర్ధిక సంవత్సరం మొత్తం దేశమంతా కరోనా అనే శారీరక వ్యాధితోనూ లాక్ డౌన్
అనే మానసిక వ్యాధితోనూ సహజీవనం
చెయ్యాలి కాబోలు!ఎందుకింత పిచ్చితనం?
"ముడ్డిమీద తంతే మూతిపళ్ళు రాలినట్టు"
అని మనకో మోటు సామెత
వుంది.అసలే నమ్మటానికి వీల్లేని
ఒక పని జరగటానికి ఎదటివాడు చెప్పే కారణం చచ్చినా నమ్మటానికి వీల్లేనట్టు ఉన్నప్పుడు
ఆ చెప్పినవాణ్ణి వెక్కిరించటానికి ఈ సామెత వాడతారు.అయితే, 2020ల నాటి కరోనా
వ్యాప్తికి December 29,
1809 – April 2, 1891 మధ్యన
బతికిన ఒక వ్యక్తి 1871ల
నాడే ప్లాన్ చేశాడని నేను అంటున్నాను గానీ
తొందరపడి ఆ సామెత వాడకండి,
విషయం మొత్తం చదివేవరకు ఓపికపట్టి ఆ తర్వాత నన్ను
వెక్కిరించాలో సత్కరించాలో తేల్చుకోండి.Albert Pike అనే ఒక వ్యక్తి
Giuseppe Mazzni అనే ఒక వ్యక్తికి August 15, 1871 తేదీన వ్రాసిన ఒక
ఉత్తరం మూడు ప్రపంచ యుద్ధాలను
తీసుకురావడానికి అతను ప్రణాళిక వేస్తున్నాడని
కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది.ఇతను తనకున్న యుద్ధవ్యూహరచనానైపుణ్యాన్ని
ఉపయోగించి అంతకు ముందు Adam Weishaupt వేసిన ప్రణాళికనే
అమలు చేస్తున్నాడు.ఈ ఇల్యూమినాటీ ఫ్రీమాసన్రీల
గుంపులోని వ్యక్తులు తమ తొలితరం వారు నిర్దేశించిన ఉమ్మడి లక్ష్యాన్ని
చేరుకోవటం కోసం తమ జీవిత కాలంలోని ప్రతి క్షణమూ శ్రమిస్తూ వెనుకటి తరం ఎక్కడ ఆగిందో
మరుసటి తరం అక్కడ నుంచి కొనసాగిస్తూ తరాల తరబడి చాలా క్రమశిక్షణతో పని చేస్తారు.
Albert Pike అనే ఒక వ్యక్తి
Giuseppe Mazzni అనే ఒక వ్యక్తికి "The First World War must be
brought about in order to permit the Illuminati to overthrow the power of the
Czars in Russia and making that country a fortress of atheistic Communism. The
divergences caused by the "agentur" [agents] of the Illuminati
between the British and Germanic Empires will be used to foment this war. At
the end of the war, Communism will be built and used to destroy the other
governments and in order to weaken religions." అని విశదీకరిస్తున్న
దాని ప్రకారం రష్యాలో కమ్యూనిష్టు విప్లవానంతరం కుటుంబసమేతం దారుణహత్యకు గురి కావడానికి అప్పటి జార్ ప్రభువు చేసిన
పాపం ఏమీ లేదు.ఆయన
తాత అప్పటి Rothschilds అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తరహా సెంట్రల్ బ్యాంకును
రష్యాలో పెట్టుకోవటానికి ఒప్పుకోలేదు, అంతే - తాత మీద పగని
మనవడి మీద తీర్చుకున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం
కూడా వాళ్ళ ప్రణాళిక ప్రకారమే
మొదలయ్యింది, నడిచింది, ఆగింది - "The Second
World War must be fomented by taking advantage of the differences between the
Fascists and the political Zionists. This war must be brought about so that
Nazism is destroyed and that the political Zionism be strong enough to
institute a sovereign state of Israel in Palestine. During the Second World
War, International Communism must become strong enough in order to balance
Christendom, which would be then restrained and held in check until the time
when we would need it for the final social cataclysm." - Mmmm.....So World
War Two was also planned?అంటే,
1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి
ప్రపంచ యుద్ధమూ 1939 నుంచి 1945 వరకు జరిగిన రెండవ
ప్రపంచ యుద్ధమూ అనుకోకుండా జరిగినవి కాదన్నమాట!ఎక్కడి 1914, ఎక్కడి 1871!Albert Pike వ్రాసిన ఉత్తరం రహస్యంగా ఉండటం వల్ల ఈ
రెండు యుద్ధాల్నీ ఎవరూ ఆపలేకపోయారని అనుకోవడానికి
వీల్లేదు.Adam Weishaupt
ఫ్రెంచి విప్లవం తీసుకురావడానికి ప్లాను వేస్తున్నాడని 1784లో ప్రమాదవశాత్తూ బయటపడినప్పటికీ,
అప్పటి బవేరియా ప్రభుత్వం దానికి సంబంధించిన వర్తమానం అన్ని సంబంధిత దేశాలకీ
పంపించినప్పటికీ, ఇప్పుడు నేను చెప్తుంటే మీరు
నమ్మలేనట్టు అప్పుడు ఆయా దేశాల వారూ
నమ్మకపోవడం వల్ల అయిదు సంవత్సరాల
తర్వాత 1789లో మొదలై
1793 వరకు జరిగింది. ఆ కాలమూ
ఈ కాలమూ అని లేకుండా ఆ ప్రాంతమూ ఈ ప్రాంతమూ అని లేకుండా అసంఖ్యాక ప్రజల ఆకాంక్షలకు
అనుగుణమై సాకారం కావాల్సిన చరిత్రని తన సహజమైన దిశనుంచి తప్పించి కొందరు రహస్య ప్రణాళికలతో
తమకు అనుకూలమైన దిశకు మళ్ళించుకోగలగడం ఎంత దుర్మార్గమైన అద్భుతమో కదా!
వాళ్ళ అసలు లక్ష్యం
ప్రపంచాధిపత్యం, దానికి వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు New World Order.వాళ్ళ భావజాల ప్రచారం
కోసం వ్రాసుకున్న సాహిత్యంలో దానిగురించి వాళ్ళు వర్ణించిన విధానం చూస్తే అంత మంచి వ్యవస్థని
వ్యతిరేకించడం దేనికి, ప్రపంచ మానవాళి సమస్తం సుఖశాంతులతో తులతూగేటట్టు చేస్తే తప్పేమిటి అనిపిస్తుంది.కానీ ఆ నూతన
ప్రపంచ ప్రభుత్వాన్ని
సాధించడానికి వాళ్ళు ఎన్నుకున్న పద్ధతిలోనే అసలు మోసం దాగుంది
- "Ordo Ab Chao" అంటే
Order out of Chaos! శాంతిని
స్థాపించడానికి అశాంతిని రగిలించడం.తమ లక్ష్యాన్ని సాధించుకోవడం
కోసం వాళ్ళ మధ్యన ఉన్న ఐకమత్యం,
పట్టుదల, తరాల తరబడి రహస్య వ్యూహాలను వేస్తూ అడ్డంకులు వస్తే కొత్త వ్యూహాలు పన్నుతూ
ప్రపంచంలోని మహా మేధావులని సైతం తమ లక్ష్యాలకు అనుగుణంగా నడిపించుకుంటూ నేడు మనం ఉన్న
ఈనాటి చరిత్రని కొన్ని వందల యేళ్ళ క్రితమే ప్రణాళిక రచించి వాస్తవం చేసి కొన్ని వందల
యేళ్ళ తర్వాత ఏమి చెయ్యాలో ఇప్పుడు ప్రణాళిక వేసుకుంటున్న కర్కశమైన క్రమశిక్షణ నాలాంటి
ఆగర్భ శత్రువుల్ని సైతం ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నది!
Adam Weishaupt
నుంచి Albert Pike వరకు గల లూసిఫర్
మతస్థులు వేసుకున్న మొత్తం ప్లాను మూడు ప్రపంచ యుద్ధాలతోనూ
మూడు మహా విప్లవాలతోనూ ప్రపంచ
దేశాలను అతలాకుతలం చేసి 2050 నాటికి ప్రపంచ జనాభాని ఒక మిలియన్ స్థాయికి
తగ్గించి ఆ బానిస గొర్రెలకి అబ్రహాము యొక్క 13 మంది కొడుకుల వంశీయులను
కాపర్లని చెయ్యటం.మొదటి ప్రపంచ యుద్ధమూ
రష్యన్ విప్లవమూ కలిసే వచ్చాయి.ఫ్రెంచి
విప్లవం అన్నిటికన్న ముందే వచ్చేసింది.చైనా
విప్లవం కూడా వచ్చేసింది.రెండవ
ప్రపంచ యుద్ధమూ వచ్చింది - ఇక మిగిలింది ఆఖరి
ఘట్టం!"The Third
World War must be fomented by taking advantage of the differences caused by
"agentur" of the "Illuminati" between the political Zionists
and the leaders of Islamic World. The war must be conducted in such a way that
Islam (the Moslem Arabic World) and political Zionism (the State of Israel)
mutually destroy each other.Meanwhile the other nations, once more divided on
this issue will be constrained to fight to the point of complete physical,
moral, spiritual and economical exhaustion...We shall unleash the Nihilists and
the atheists, and we shall provoke a formidable social cataclysm which in all
its horror will show clearly to the nations the effect of absolute atheism,
origin of savagery and of the most bloody turmoil.Then everywhere, the
citizens, obliged to defend themselves against the world minority of
revolutionaries, will exterminate those destroyers of civilazation, and the
multitude, disillusioned with Christianity, whose deistic spirits will from
that moment be without compass or direction, anxious for an ideal, but without
knowing where to render adoration, will receive the true light through the
universal manifestation of the pure doctrine of Lucifer, brought finally out in
public view.This manifestation will result from the general reactionary
movement which will follow the destruction of Christianity and atheism, both
conquered and exterminated at the same time." – ఇది Albert Pike అనే
ఒక 33rd degree
Freemason మరొక Freemason
అయిన Giuseppe Mazzniకి వివరించిన ప్రణాళిక.
వ్రాతలో ఇలాగే ఉంటుంది - ఛా,ఇది నిజం కాదేమో
అనిపిస్తుంది.కానీ అక్షరం పొల్లు
పోకుండా జరుగుతుంది.
ఇప్పుడు ఫేస్ బుక్ దగ్గిర
వేస్తుంటే కొందరు కొత్త ఫీలవుతున్నారు గానీ
నేను ఇది చదివి చాలాకాలం
అయింది.వీళ్ళ గురించి హరికాలం
బ్లాగులో దాదాపు ఇరవై పోష్టుల వరకు
వేసి ఉంటాను.వాళ్ళ మొత్తం ప్లానులోని
ఆఖరు దశలో రెండు ఉపదశలు
ఉంటాయి.మనం ఇప్పుడు మొదటి
ఉపదశలో ఉండి లాక్ డౌన్
ఎత్తి వేసిన తర్వాత వెళ్ళేది,
రెండవ ఉపదశలోకి!The Third World War
must be fomented by taking advantage of the differences caused by
"agentur" of the "Illuminati" between the political Zionists and the leaders of Islamic World అనేది పెద్ద చేప
లాంటి ప్లాను.Meanwhile the other
nations, once more divided on this issue will be constrained to fight to the
point of complete physical, moral, spiritual and economical exhaustion అనేది చిన్న చేప
లాంటి ప్లాను.మొదటిసారి ఇది చదివినప్పుడు నేను
కూడా "ఛా - అన్ని దేశాల్నీ
ఒకేసారి అన్ని విభిన్న రంగాల్లో
exhaust చెయ్యటం సాధ్యమా!" అనుకున్నాను.ఒక రకమైన ధైర్యం
వచ్చింది ఇది జరిగే పని
కాదని. అయితే కరోనాని వ్యాప్తి
చెయ్యడమూ దానికి లాక్ డౌన్ అనే
చిత్రమైన ప్లానుని పరిష్కారం చెయ్యడమూ చూశాక తర్వాత జరగబోయే
భీబత్సాన్ని తల్చుకున్నప్పుడల్లా "గత కాలమె మేలు
వచ్చు కాలము కంటె" అనే
కవివాక్యం గుర్తొచ్చి ఒళ్ళు ఝల్లుమంటున్నది - భయంతో!లాక్ డౌన్ ఎత్తేశాక
మీరు "physical,
moral, spiritual and economical exhaustion" అనేది
మీలోనూ మీచుట్టూ జడలు విప్పుకుని నాట్యం
చెయ్యడం చూస్తారు.
ఆంధ్రాలో తను చేస్తున్న అరాచకాలకి
ప్రతిపక్షం అడ్డు పడటాన్ని నిరోధించడానికే
జగన్ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్ని
వాడుకుంటున్నది.లాక్ డౌన్ పెట్టింది
కరోనా వ్యాప్తి నియంత్రణకి కాదనీ ఆర్ధిక విధ్వంసం
కోసమనీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికీ
తెలుసు.అందుకే వైకాపా ఎమ్మెల్యేలూ మంత్రులూ మొదటి రోజునుంచీ లాక్ డౌన్
నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వీర విహారం చేశారు,
అంతకుముందు చేస్తున్న ఆర్ధిక విధ్వంసాన్ని మరింత ఉత్సాహంతో కొనసాగిస్తున్నారు.తమ వైపునుంచి ఎంత బలమైన కారణంతో చేసినప్పటికీ
రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు 2019లో జగన్ అధికారంలోకి వచ్చేలా చేసిన తప్పుకి ఫలితం
యేమిటంటే, కోర్టుల నుంచి వచ్చిన ఒత్తిడితో సహా ఎంత బలమైన కారణం ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వాన్ని
బర్తరఫ్ చేసిన మరుక్షణం ఆంధ్రలో రక్తపుటేరులు పారడం ఖాయం!
అందువల్లనే బీజేపీ అతనితో ఆచి తూచి వ్యవహరిస్తున్నది
- లేకపోతే కేంద్రం కలగజేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిగ్రహించడానికి అవసరమైన సాంకేతిక తప్పిదాలు జగన్ ఇప్పటికే చాలా
చేశాడు, అయినా కేంద్రం ఎందుకు కలగజేసుకోవడం
లేదు?జగన్ విషయంలో బీజేపీ
ఆచి తూచి వ్యవహరించడం వెనుక
ఉన్నది స్నేహం కన్న భయం ఎక్కువ
అనేది మోదీ అభిమానులు ఒప్పుకోలేరు
గానీ అది వాస్తవం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి చూస్తుంటే
వ్యాక్సిన్ కనుక్కోవడం పేరుతో అది జరిగే వరకు ఏళ్ళ తరబడి జనాన్ని ఇళ్ళలోనే కూర్చోబెట్టేలా
ఉన్నారు.వాళ్ళు బడ్జెట్లు వేసేది వాళ్ళ కష్టార్జితం నుంచి కాదు, మన పేరు మీద IMF దగ్గిర
అప్పు తెచ్చి ఘనకార్యం చేస్తున్నట్టు పోజులు కొడతారు.మరి, మనకి అట్లా కాదే - వ్యవసాయం
అయినా ఉద్యోగం అయినా వ్యాపారం అయినా మన కండల్ని కరిగించి వస్తువుల్ని తయారు చేసి వాటిని
మార్కెట్టు దగ్గిర అమ్మితే వచ్చే లాభాల నుంచే కదా డబ్బు వచ్చేది.
ఎవరో వస్తారని ఏదో
మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా
అనే మహాకవి వాక్యాన్ని తల్చుకుని మన బతుకుల్ని మనమే ఉద్ధరించుకుంటే సరిపోతుంది
కదా!ప్రస్తుతం లాక్ డౌన్ విషవలయం
నుంచి బయటపడి మాస్కులు తొడుక్కుంటూ శానిటైజర్లు పూసుకుంటూ హడిలి పోకుండా ఇదివరకటి
నిర్భయ జీవితాన్ని కొనసాగించడానికి బ్రహ్మాస్త్రం లాంటి ఉపాయం ఒకటి
చెప్తున్నాను, వినండి.అది
వేదం మీద సత్యం మీద
మీకు ఎంత భక్తి ఉంటే
ఆంత గొప్ప స్థాయిలో ఫలితాన్ని
ఇస్తుంది.ఒక వారం రోజుల
పాటు నిరంతరం చాగంటి వెంకట రమణ గారు
అమెరికాలో చేసిన కరోనా నిగ్రహ
యజ్ఞం ఆంధ్ర లోని ప్రతి
హిందువూ పూనుకుని చేస్తే ఎనిమిదవ రోజుకి కరోనా అంతం కావడం
మీరు చూస్తారు.ఆయన అమెరికాలో అయిదు
రోజులు చేసింది చాలా తక్కువ స్థాయిలో,
అదీ అనుమానంతోనే చేశారు సాక్ష్యం కోసం - మంచి ఫలితాన్ని ఇచ్చింది!ఇక నిన్న గాక
మొన్న విశాఖలో L.G వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి
విడుదలయిన విషవాయువుల్ని వాతావరణం నుంచి తొలగించడానికి ముగ్గురు
వేద పండితులు పది రోజుల పాటు
చేసిన యజ్ఞం అయితే ఆశించిన
ఫలితాన్ని అద్భుతమైన స్థాయిలో ఇవ్వటంతో పాటు ఆశించని ఒక
అదనపు కానుకని కూడా ఇచ్చింది.
ఇంకొక టుమ్రీ వార్త
- అప్పుడెప్పుడో ట్రంపు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో భూమి మీద పడే
సూర్యకాంతిని ఆస్వాదించి మన దేహాలకి అంటిస్తే
కరోనా తగ్గుముఖం అప్డుతుందని సైంటిస్టులు చెప్తే మరి ఆ కాంతిని
శరీరం లోపలికి పంపిస్తే ఎట్లా వుంటుంది అంటే
మన దేశంలో కొందరు రెటమతం గాళ్ళు నవ్వారు గానీ అక్కడి సైంటిస్టులు
మాత్రం అది మంచి సూచనే
గానీ ప్రస్తుతం అలాంటి టెక్నాలజీ లేదన్నారు గుర్తుందా!ఇప్పుడు మీరు నన్ను నమ్మి
యజ్ఞం చేసినట్లయితే యజ్ఞ వీచికలు ఆ
పని కూడా చేస్తాయి - అవి
గాలిలో తేలియాడుతూ వెళ్ళి క్వారంటైనులో ఉన్నవాళ్ళకి కూడా కరోనా నెగటివ్
వచ్చేటట్టు చేస్తాయి!
భగవద్గీత మొత్తం 700 పైచిలుకు శ్లోకాలతో అర్జునుణ్ణి నిలబెట్టి వాయించేసిన శ్రీకృష్ణుడు ఆఖరున "నేను చెప్పాను గాబట్టి
చెయ్యకు,నీకు నువ్వు తర్కించుకుని
నమ్మకం కుదిరాకే ముందుకు అడుగు వెయ్యి!" అని
ఎందుకు అన్నాడో తెలుసా?ఒకవేళ అర్జునుడు అన్యమనస్కం యుద్ధం చేసి
ఫెయిలయితే "బావా, నువ్వు నా కొంప ముంచావు!తప్పుడు సలహా ఇచ్చి నన్నీ
రొంపిలో ఎందుకు దింపావు?" అని నిలదీస్తాడేమోనని పాలిటిక్సు
ప్లే చేశాడు.ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నానని అనుకుంటే
పొరపాటు - నేను చెప్పింది చేస్తే ఫలితం 100% గ్యారెంటీ అని బల్లగుద్ది చెతున్నాను.ఈ
కలియుగంలోనే హేతువాదులు సాధికారికమైన పరిశోధన చేసి శాస్త్రీయమైన జవాబు చెప్పలేని ఒక
లీలావినోదం 1979 నవంబర్ 7 నాటి అర్ధరాత్రిన తిరపతి కొండ మీద జరిగింది!
ఆ యేడాది వర్షాలు కురవక తిరపతి కొండ మీద
నీటి ఎద్దడి తీవ్రమయింది - భక్తుల్ని రావద్దని చెప్పాలని కూడా కొందరికి అనిపించింది.కానీ
అప్పటి CEO అయిన PVRK అలా కాదని నీటి సమస్యకి పరిష్కారం కోసం వారినీ వీరినీ సంప్రదిస్తుంటే
చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామి వరుణ యాగం చేయమని సలహా ఇచ్చారు.దాన్ని పట్టుకుని వెతికితే
ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు దొరికారు.కానీ అప్పటికే పెద్ద వయస్సు కావడం వల్ల ఆయన
వేరేవారి వివరాలు చెప్పారు.అందర్నీ కలుసుకుని యజ్ఞ ప్రారంభానికి నవంబర్ 1వ తేదీని నిర్ణయించారు.కానీ
ప్రధాన యాజకుల వారి అస్వస్థత కారణాన వాయిదా పడింది.రెండవసారి అనుకున్న తేదీ కూడా మరొక
యాజకులకి వచ్చిన సమస్య వల్ల అచ్చి రాలేదు.ఇక మూడవసారిగా నవంబర్ 8వ తేదీని నిర్ణయించుకుని
అదే ఆఖరుసారి కావాలని నిశ్చయించుకుని PVRK 7వ తేదీ రాత్రి స్వామి సముఖాన నిలబడి ప్రార్ధించారు.సరే,
ఆనాటి పూజాదికసేవలు అన్నీ ముగించాక తాళాలు వేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాక అర్ధరాత్రి
సమయాన ఆలయంలోని రెండు గంటలు "ఠంగ్!ఠంగ్!"మని మ్రోగుతూ మళ్ళీ అందర్నీ ఆలయం
దగ్గిరకి రప్పించాయి.పత్రికల వారు వచ్చారు,పోలీసులు వచ్చారు,ధర్మకర్తలు వచ్చారు,అధికారులు
వచ్చారు, పూజారులు వచ్చారు - అయితే ఆగమశాస్త్ర
నియమాల ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు తలుపులు తెరవకూడదు కాబట్టి ఉదయం వరకు ఆగి తలుపులు
తెరిచాక వెతికితే మనుషుల అలికిడి లేదు.మరి గంటలు ఎవరు మ్రోగించారు?PVRK గారు అది ఆ
రోజు ప్రారంభం కావల్సిన యజ్ఞానికి తన ఆమోదం తెలుపుతూ స్వామి జరిపించిన లీలావినోదం అని
అర్ధం చేసుకున్నారు.అలా ఒక అద్భుతాన్ని సృష్టిస్తూ మొదలైన యజ్ఞం రెండు రోజులు జరిగింది.మూడవ
రోజున ఉత్సవబేరుకి వరాహ స్వామి ఆలయం దగ్గిర స్నపనతిరుమంజనం అనే స్నానసేవ కూడా ముగిసింది.అప్పటికీ
ఆకాశం నిర్మలంగానే ఉంది.అసలే PVRK గారికి కూడా లోపల్లోపల గుబుల్గుబుల్గా ఉంటుంటే
"మంత్రాలకు చింతకాయలు రాల్తాయా?యజ్ఞాలకు వర్షాలు కురుస్తాయా!వర్షం ఆకాశం నుంచి
కాదు గానీ ఇంకో పది నిమిషాల తర్వాత PVRK కళ్ళనుంచి కురుస్తుందిలే:-)" అనే ఎత్తిపొడుపులు
మొదలయ్యాయి.అయితే, స్నపన పూర్తయ్యాక అక్కణ్ణించి ముఖద్వారం దగ్గిరకి వచ్చేలోపున ఒక్కసారి
కుండపోత మొదలై ఉత్సవబేరుని మోస్తున్నవాళ్ళు పరుగులు పెట్టుకుంటూ ఆలయంలోకి వచ్చిపడ్డారు
- ఎంత అద్భుతం!అప్పుడు మొదలైన వర్షం సుమారు 48 గంటలు కురిసింది.గోగర్భం నిండింది.ఇంతకీ
వీళ్ళు ఎక్కడ వర్షం కురవాలని యజ్ఞం చేశారో అక్కడ తప్ప ఆ చుట్టుపక్కల ఒక్క చినుకు పడలేదు
- ఎందుకంటారు?
ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మీద ఒట్టుపెట్టి
చెప్తున్నాను - ఆంధ్రలోని ప్రతి హిందువూ యజ్ఞ వరాహ స్వామి మీద నమ్మకం ఉంచి ఒక్క ఏడు
రోజుల పాటు రాష్ట్రం మొత్తాన్ని యజ్ఞవేదిక కింద మార్చి విషక్రిమినాశకహోమం చేసినట్లయితే,
ఎనిమిదవ రోజుకి ఆంధ్రరాష్ట్రం ప్రపంచంలోని తొలి కరోనారహిత ప్రాంతం అవుతుంది.పదే
పదే రిపీట్ అయ్యే సమస్యలకి అనుభవం
పనికొస్తుంది గానీ ఎవరూ వూహించని
కొత్త సమస్యలకి రిస్క్ తీసుకుని కొత్త సొల్యూషన్ వెతకాల్సిందే!ఇన్ని నెలలు ఇంట్లో
కూర్చున్నాక కూడా మన దేహంలోకి
రాని కరోనా క్రిమి ఒక
వారం రోజులు దాన్ని అంతం చెయ్యడానికి అన్ని
జాగ్రత్తలూ తీసుకుని బయటికి వెళ్ళి యజ్ఞం చేస్తే వచ్చేస్తుందా?ఇంటి దగ్గిర శానిటైజర్ పూసుకుని యజ్ఞశాలకి వెళ్ళడం కూడా ప్రమాదమే అనుకుని
ఎంతకాలం ఈ ఏకాంతవాసం చేస్తాం?
మన పరిమిత జ్ఞానానికి అర్ధం కాని ప్రతిదీ
నిరర్ధకం అనుకోవడమే అజ్ఞానంతో కూడీన అహంకారానికి మొదటి గుర్తు.ఇవ్వాళ అర్ధం కానిది
జ్ఞానం పెంచుకుంటే రేపు అర్ధం కావచ్చు - కానీ నాకు ఇప్పటికి తెలిసిందే సమస్తం,ఇంతకు
మించి ఏదీ లేదు,ఉందంటే నువ్వు ఛాందసుడివీ మతోన్మాదివీ అనేవాళ్ళు అత్యంత ప్రమాదకారులు.
నిజం చీర సింగారించే లోపు అబద్ధం వూరంతా
చుట్టి వస్తుందన్నట్టు చెలరేగి పోతున్న ఈ బొంకుల దిబ్బలు వైదిక ధర్మం తన జడత్వాన్ని
వదిలించుకుని ఒకే ఒక్క సారి పాంచజన్యం పూరించితే చాలు కకావికలై పారిపోతాయనేది సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన
ఆచార్య పరంపర నుండి సంక్రమించిన మూడు కాలాలనూ ముడి వేసి చూడగలిగే జ్ఞానదృష్టితో నేను
చెప్తున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ
అవుతుంది!
సత్యం శివం సుందరం!!!