Friday, 10 May 2019

భారతదేశం మోయలేని ఋణభారం నుంచి విముక్తి పొందడానికి సరైన మార్గం ఏమిటి?

        ఆర్ధికశాస్త్రం మీద గౌరవం ఉండి సత్యం పట్ల నిబద్ధులై ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకుందామనే నిజాయితీ గల అనుభవజ్ఞులైన ఆర్ధిక శాస్త్ర విశ్లేషకులు సూచించిన "కరెన్సీ తయారీని బ్యాంకుల నుంచి తొలగించి ప్రభుత్వమే మూలధనపు ద్రవ్యనిల్వల నుంచి తయారుచేసి అందించడం - ఇది ప్రభుత్వాధినేతలు చెయ్యాల్సిన పని,అనుత్పాదక రంగాలను ప్రోత్సహించి inflation సృష్టించటానికి బదులు పెట్టుబడుల్ని/ఋణాల్ని ఉత్పాదక రంగాలకు మళ్ళించాలి - ఇది బ్యాంకర్లు చెయ్యాల్సిన పని,  మొదట పొదుపు చేసి పిదప మదుపు పెట్టటం - ఇది సామాన్యప్రజలు చెయ్యాల్సిన పని." అనేది అబ్రహాం లింకన్ కాలంలో ప్రయత్నించి చూశారు.కానీ అతను హత్యకు గురవడంతో మిగిల్మినవాళ్ళు నీరసించి పోయారు.ఇలాంటి దుష్కర కార్యాలు చెయ్యాలనుకునేవాళ్ళు శత్రువుల నుంచి వచ్చిపడే ప్రమాదాల నుంచి ఆత్మరక్షణకి సంబంధించిన వ్యూహ రచనలు కూడా చేసుకోవాలిసుమారు 2000 సంవత్సరాల నుంచి అద్భుతమైన వ్యూహనిర్మాణదక్షతను ప్రదర్శిస్తున్న బలమైన శత్రువుని అమాయకమైన ప్రధమ ప్రయత్నంలోనే గెలవడం అసాధ్యం!

        వాళ్ళ భావజాలమే "మేము ఇతరుల మీద అధికారం చెలాయించడానికే పుట్టాము,ఇతరులు మాకు అణిగిమణిగి పడి వుండాల్సిందే,ప్రపంచంలోని జ్ఞానం అంతా మా దగ్గిరే ఉంది.ఇతరులు మాకు సమవుజ్జీలు కాదు" అనే అహంభావంతో నిండి ఉంటుంది. క్రైస్తవం, ఇస్లాం, మాసన్రీ, ఇల్యూమినాటీ వంటి మతశాఖల సాహిత్యం ప్రజలకు తమపట్ల విధేయతను అలవాటు చేసేటట్టు రూపొంచించబడ్డాయి - మేము తయారు చేసిన వస్తువునే కొనాలి అనటానికి మేము చూపించిన దేవుణ్ణే పూజించాలి  అనేది ప్రత్యామ్నాయం,మాకు ఎవరూ పోటీ రాకూడదు అనటానికి ఇతర దేవతల్ని ధ్వంసం చెయ్యమనటం ప్రత్యామ్నాయం, మా సరుకులో క్వాలిటీ లేకపోయినా చచ్చినట్టు కొనాలి అనటానికి నమ్మితే స్వర్గం-నమ్మకపోతే నరకం అనేది ప్రత్యామ్నాయం!

      అమెరికన్ డాలర్ మీద ఉన్న రెండు శంఖువులూ ఆర్ధిక రంగంలో వారు ఆశిస్తున్న గుత్తాధిపత్యానికి చిహ్నాలు - కింది భాగంలో ఇటుకలతో కట్టినట్టు ఉన్న మూడొంతులు పూర్తయిన పెద్ద శంఖువు మాసన్రీకి చెందుతుంది, పై భాగంలో కన్నును ఇముడ్చుకున్న చిన్న శంఖువు ఇల్యూమినాటీలది. ప్రకృతిలోనూ సమాజంలోనూ ఆహార శంఖువు, కీర్తి శంఖువు, అధికార శంఖువు వంటివి ప్రతి చోటా కనపడతాయి గానీ వీళ్ళు తీసుకున్నది సంపద శంఖువు. ఆహార శంఖువు ఎట్లా ఉంటుందో తెలుసుకుంటే మిగిలిన శంఖువుల గురించి అర్ధం చేసుకోవడం తేలికగా ఉంటుంది.దేహం పైన పత్రహరితం ఉండి సూర్యకాంతిని ఉపయోగించుకుని తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలిగిన వృక్షజాతులు  అట్టడుగున ఉంటాయి.ఇలాంటి సౌకర్యం లేని జీవులు వృక్ష సంబంధమైన ఆహారం తింటూ శాకాహారులు వృక్షజాతులకి పైన ఉంటాయి.వృక్ష సంబంధమైన ఆహారం జీర్ణం కావడం కష్టం కాబట్టి కొన్ని ఈ శాకాహారుల్ని తినే మాంసాహారులై శాకాహారులకి పైన ఉంటాయి.సంఖ్యని బట్టీ విస్తృతిని బట్టీ అంతస్థుల సైజుని సూచిస్తే మూడు అంతస్థుల పిరమిడ్ మనకి కనబడుతుంది.కళా రంగంలో కీర్తి ప్రతిష్ఠల విషయంలోనూ రాజకీయ రంగంలో అధికారం బిషయంలోనూ ఈ శంఖువులు కనబడతాయి.N.T.R అనే ఒక నటుడు దైవసమానుడిగా పేరు తెచ్చుకోవడం వెనక అతను దేవుడి పాత్రలు ధరించిన సినిమాలకి పనిచేసిన అన్ని శాఖల సాంకేతిక నిపుణుల కృషి కూడా ఉంటుంది - కాకపోతే చూస్తున్న దృశ్యమే ప్రధానం అని భ్రమపడటం వల్ల మిగిలినవాళ్ళు మనకి గుర్తు రావడం లేదు, అంతే!

        చిత్రం ఏమిటంటే, ఇల్యూమినాటీలూ మాసన్రీలూ ఇంత హడావిడి చేసి ఇన్ని మాయకబుర్లు చెప్పి గందరగోళం సృష్టించినప్పటికీ ఈ restricted competetion monopalistic economics ప్రకారం రాక్ ఫెల్లర్ లాంటివాళ్ళతో సహా ప్రతి ఒక్కరికీ శిఖరాగ్రం చేరడానికి ఉన్న ఒకే ఓక పద్ధతి ఎట్లా ఉంటుందో "వేలాదిమందిలో ఒక్కరు ఉద్యమిస్తారు, ఉద్యమించిన  వేలాదిమందిలో ఒక్కరు శ్రద్ధని కుదిరించుకోగలుగుతారు, శ్రద్ధను కుదుర్చుకోగలిగిన వేలాదిమందిలో ఒక్కరు నన్ను చేరుకోగలుగుతారు" అనే గీతావాక్యం చెప్తుంది. నేను వేదాంతం చెప్పడానికి ఈ పోలిక తీసుకు రాలేదు,వాళ్ళ మనసుల్లో సర్వలోకాధిపత్యం, అజరామరత్వం వంటి భావనలు లేకపోతే 1900 నాటికి ఒకడు ప్రపంచ సంపదలో సగభాగమూ మరో ఆరుగురు ప్రపంచ సంపదలో నాలుగో భాగమూ కూడబెట్టి సాధించేది ఏమిటి?రోజుకి మిలియన్లు సంపాదిస్తున్నవాడు రోజుకి టన్నుల లెక్కన తిండి తినగలడా?ఇతరుల మీద పెత్తనం చెయ్యాలన్న దురదే New World Order అనే పిచ్చితో ఇన్ని యుద్ధాల్నీ ఇంత భీబత్సాన్నీ సృష్టించేలా చేస్తున్నది.

      ఇతరుల మీద అధికారం చెలాయించడానికి కూడా ఒక పద్ధతి ఉంది - ఇతర్లకి వాళ్ళ ఎదుగుదలకి సాయం చేస్తారనీ వాళ్ళకి ప్రమాదం వచ్చినప్పుడు రక్షిస్తారనీ నమ్మకం కలిగితే కావల్సిన గౌరవాదరాల్ని అడక్కుండానే ఇస్తారు.కానీ ఇతర్లకి ఏదీ ఇవ్వకుండానే ఇతర్లనుంచి వాళ్ళ కష్టారితాన్ని లాక్కోవాలనుకుంటున్నారు, గాలిలోనుంచి పుట్టించిన డబ్బుని మనకి అప్పుగా ఇవ్వడానికి మన దగ్గిర్నుంచి అన్ని సెక్యూరిటీలు తీసుకుంటున్న వీళ్ళు మనకి  అప్పు ఇస్తున్న డబ్బు ఎక్కణ్ణించి తెస్తున్నారో చూపించమని అడిగితే ఏమి చేస్తారు?

       రిజర్వ్ బ్యాంక్ నోట్లు ఎలా ముద్రిస్తుందో చెప్పిన భాగంలో చెప్పని ఒక కొత్త విషయాన్ని ఇక్కడ చెప్తాను. కొత్త కరెన్సీ అవసరం అనుకుంటే ప్రభుత్వం ట్రెజరీ శాఖని లెక్కలు చూసి చెప్పమని అడుగుతుంది.ఆ లెక్కలు తేలాక ప్రభుత్వం బాండ్లను తయారు చేస్తుంది - ఇవి కమర్షియల్/ప్రైవేట్ బ్యాంకులో అక్కవుంట్ ఉన్న వ్యక్తి రాసే విత్డ్రాయల్ స్లిప్ లంటిది. ప్రభుత్వం ఒకోసారి వీటిని ప్రజలకి కూడా ఇస్తుంది.ప్రజలు తమంతట తాము గానీ ప్రభుత్వం అధికారుల ద్వారా గానీ రిజర్వ్ బ్యాంకుకు అప్పగిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆ మొత్తానికి చెక్కు ఇస్తుంది.అది ప్రజలు కానీ ప్రభుత్వం కానీ క్యాష్ చేసుకోవడం ఎలాగో మీకూ తెలిసిందే కదా.కానీ, రిజర్వ బ్యాంక్ చెక్కు రాసే ముందు తన అక్కవుంటులో అంత డబ్బును ఉంచుకోవాల్సిన అవసరం లేదు.అదే పని, మన ఎక్కవుంటులో ఉన్నదానికన్న ఎక్కువ డబ్బుకు చెక్ ఇస్తే ఫ్రాడ్ అవుతుంది - ఇదెక్కడి న్యాయం, చెప్పండి! 

       ప్రైవేట్/కమర్షియల్ బ్యాంకులు కూడా అంతే!వాళ్ళు మనకి లోనుగా ఇచ్చే డబ్బు వాళ్ళ అధీనంలో ఉండాల్సిన పని లేదు, వాళ్ళు తమ దగ్గర లేని వంద రూపాయల్ని మనకిస్తూ మన కష్టార్జితం నుంచి నూట యాభై రూపాయలు గోళ్ళూడగొట్టి వసూలు చేసుకుంటున్నారు!అధికారంలో ఉన్నది మోదీ గానీ రాహుల్ గానీ మరో గొట్టాం గానీ ఒకోసారి, "ఆర్ధిక వ్యవస్థ బాగు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం, సహకరించండి!" అని బుజ్జగిస్తూ చెప్తున్న మాటల వెనక ఉన్న అసలైన అర్ధం "బ్యాంకింగ్ వ్యవస్థ బాగు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం, సహకరించండి!" అని తప్ప అవి ప్రజలకు మేలు చెయ్యడం కోసం తీసుకునే నిర్ణయాలు కావు.Inflation, deflation అనుకోకుండా ఉనికిలోకి రావు - Reserve Bank అవసరమైన దానికన్న ఎక్కువ కరెన్సీ ప్రింట్ చేస్తే inflation  వస్తుంది, Reserve Bank అవసరమైన దానికన్న తక్కువ కరెన్సీ ప్రింట్ చేస్తే deflation  వస్తుంది.మొదటి దానివల్ల తక్కువ వస్తువుల వెనక ఎక్కువ కరెన్సీ పరుగులు పెట్టటం జరుగుతుంది,రెండవ దానివల్ల వస్తువుల్ని కొనడానికి చేతిలో కరెన్సీ ఉండదు - మొదటి దానికన్న రెండోది పదింతలు భయానకమైనది,అప్పుడప్పుడు మనకి మీడియాలో కనపడుతున్న నడి రోడ్డు మీద వందలాది జనం మీద కాల్పులు జరిపే పిచ్చోళ్ళు వీటి వల్లనే పుడతారు!

      ఇక ప్రైవేటు బ్యాంకులకి జనం అనుత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టటమే ఎక్కువ లాభం అని ఎందుకు చెప్పానో తెలుసా!ఒక చోట నల్ల టులిప్ పూలతో ఆర్ధిక విధ్వంసం సృష్టించారు.రంగుల్లో పూచే టులిప్ పూలు నల్లరంగులో పూస్తుండేసరికి అవి జెనెటికల్ ఇంజనీరింగ్ ద్వారా సృష్టించబడిన మేలురకమనీ వాటిని ఫ్లవర్ వాజుల్లో పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుందనీ మోతెక్కించేశారు.ఇంకేముంది, విత్తనాల్ని అమ్మేవాళ్ళూ అంట్లు కట్టేవాళ్ళూ ఎరువుల్ని సప్లయి చేసేవాళ్ళూ జనం మిడతల దండులా వచ్చిపడి పెట్టుబడులు పెట్టారు - బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని.దీన్ని boom అంటారు.తర్వాత "అబ్బే!వాటికంత సీను లేదు, ఏదో వైరస్ వల్ల రంగు మారింది" అనే వార్త  పొక్కడంతో bust అయ్యింది - ఈ దిక్కుమాలిన జంటపనులకి ముద్దుపేరు bubble creation, అంటే బుడగల్ని పేల్చటం!ఒక్కో బుడగ పేలినప్పుడు ఒక మెట్టు పైకి ఎక్కుదామనే పేరాశతో అక్కడ చేరిన అనేకమంది బడుగుజీవుల కష్టార్జితం అప్పటికే బలిసి ఉన్న బ్యాంకర్లని మరింత బలిసేటట్టు చేస్తుంది.

        సామాన్య ప్రజలు తమకి తెలియని చోట్ల పెట్టుబడులు పెట్టకూడదు - అదీ బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని.ఇక్కడ ఇల్యూమినాటీ మ్యాసన్రీ వంటి క్రూరమైన సంస్థలు లేవు గనక మన ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం కన్న స్వతంత్రతనే అనుభవిస్తున్నది, అంతవరకు సంతోషమే! World Bank ఇప్పటికిప్పుడు తీర్చమని ఒత్తిడి పెట్టడం లేదు గనక జాతీయ ఋణం గురించి కంగారు పడనక్కర లేదు గానీ లండను బ్యాంకర్లు కోరుకుంటున్నట్టు ఒక్కో రంగానికి ఒకే ఒక అతిపెద్ద పిరమిడ్ అన్నట్టు గాక ప్రజల్లో పోటీతత్వాన్ని పెంచి చిన్న చిన్న పిరమిడ్ల కింద విడగొట్టి ఎంత చెట్టు కంత గాలి అన్నట్టు ప్రజలు తమ శక్తికి తగ్గట్టు సంపాదించుకునే వీలుని కల్పించాలి,ప్రజల పట్ల నిజాయితీ గల ఆర్ధికవేత్తలు ప్రజలకి ఇలాంటి విషయాల పట్ల అవగాహన పెంచాలి.అజ్ఞానం నుంచి పుట్టే సమస్యలకి జ్ఞానం వైపుకి ప్రయాణించడం ద్వారానే పరిష్కారం సాధ్యపడుతుంది.

     We, only, are illuminated అనే అహంకారంతో మిడిసి పడుతున్న లందను బ్యాంకర్లు నిర్మించిన దుర్జన శంఖువును all of us, are, equally illuninated అనే వినయభావంతో ఒదిగి నిలుచున్న గీతాచార్యులు నిర్మించే సజ్జన శంఖువులు మాత్రమే నిర్జించగలవనేది సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన వ్యాసపరాశరాదిషిర్డిసాయినాధపర్యంతం ఉన్న ఆచార్య పరంపర పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్న  సార్వకాలిక సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

Wednesday, 8 May 2019

అందరూ యూదుల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు?యూదుల వైపు నుంచి దోషం ఏమీ లేదా!

       భౌతికమైన సాక్ష్యాలతో కూడిన యూదుల చరిత్ర పూర్వ సామాన్య శకం 750 నుంచి మొదలవుతున్నది.తూర్పు ఐరోపా ప్రాచీన కాలపు శిలా లోహ యుగాల తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడుతున్న కాలంలో ఉత్తరాన అస్సీరియన్లూ దక్షిణాన ఈజిప్షియన్లూ ఉన్న ప్రాంతపు స్థానికులైన ఇశ్రాయేలీయులనే యూదులు అంటారు.వీరి ప్రధాన దైవం Yahweh అయినప్పటికీ ఇతర దేవతల్ని కూడా పూజిస్తూ ఉండేవారు.722 BCEలో రాజధాని Samaria అస్సీరియన్లకు స్వాధీనం అయ్యింది.అప్పుడు చాలామంది పారిపోయి JUdah, Jerusalem నగరాలో తల దాచుకున్నారు.అయితే అస్సీరియన్లు కూడా తమ విస్తరణలో భాగంగా వారి వెనకాలే వచ్చారు.ఒక శతాబ్దం తర్వాత బాబిలోనియన్లు ఆక్రమించుకునే వరకు ఈ ప్రాంతం వారి అధీనంలోనే ఉంది.ఇప్పటినుంచి ఈజిప్షియన్లూ బాబిలోనియన్లూ ఒకరిని ఒకరు ఆక్రమించుకుంటూ దేశాల సరిహద్దుల్ని మార్చేసే కార్యక్రమంలో ఎక్కువ శాతం బాబిలోనియన్లదే పైచేయి అవుతూ ఉండేది.జెరూసలేం కూడా శక్తి వంచన లేకుండా పోరాడుతూనే ఉండేది.

         539 BCEలో Achaemenid పర్షియన్ సామ్రాజ్యం బాబిలోన్ నగరాన్ని ఆక్రమించేసింది.ఈ కొత్త రాజు జుడియన్లకి అభయం ఇచ్చి జెరూసలేం నగరానికి తిరిగి వచ్చేలా చేశాడు.అప్పుడు నగరాన్ని తిరిగి నిర్మించుకుంటున్న కాలంలోనే ఇప్పుడు మనం చూస్తున్న యూదు మతానికి పునాదులు పడ్డాయి - వాళ్ళ మతగ్రంధం తోరాను రాసుకున్నదీ సాల్మన్ టెంపుల్ కట్టుకున్నదీ ఇప్పుడేనట!334 BCEలో అలెగ్జాండరు మాసిడోనియా నుంచి బయలుదేరి అప్పటికి తనకి తెలిసిన కొన్ని చిన్న చిన్న దేశాల్ని గెలిచి ప్రపంచాన్ని గెలిచేశానుకుని సంతృప్తిపడి  తిరిగి తన రాజ్యం చేరుకునే ప్రయాణంలో బాబిలోన్ నగరంలో చనిపోయాడు.వారసుడు లేక జనరల్స్ రాజ్యాన్ని పంచున్నారు.వీటిని Hellenic రాజవంశాలు అంటారు.జుడియా ప్రాంతం Ptolemic వంశం కిందకి వచ్చింది.ఒక యూదు సమూహం Alexandria నగరంలో స్థిరపడింది -  తోరా గ్రీకు భాషలోకి అనువదించబడింది.

        సెల్యూసిడ్ రాజ్యం గురించిన ఒక యుద్ధం తర్వాత హెలెనిక్ జ్యూయిష్ సంస్కృతుల మధ్య సామరస్య సంబంధాలు సన్నగిల్లి పొయాయి.దీనినుంచి యూదు జాతిలో పుట్టిన Maccabees అనే ప్రపంచంలోని మొట్టమొదటి తీవ్రవాద ఉగ్రవాద మతవాద సైనిక శక్తి పుట్టి బలం పెంచుకుని 164 BCE కల్లా maccabean revoltతో జెరూసలేముని తన పరిపాలనలోకి తెచ్చేసుకుంది.అంతకు ముందు హెలెనిక్ వర్గాలు ధ్వంసం చేసిన సాలమన్ ఆలయాన్ని తిరిగి కట్టుకున్నారు యూదులు.శతాబ్దం గడిచేసరికి జుడియా ప్రాంతం రోమన్లకి చిక్కడంతో యూదులకి మళ్ళీ పరాధీనత ప్రాప్తించింది.రెండుసార్లు తీవ్రమైన విమోచన ప్రయత్నాలు చేసినప్పటికీ రోమన్లు ఆణిచివేయగలిగారు.చాలామంది యూదులు గలీలీకి పారిపోయారు.మిగిలిన వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు.రోమన్ సామ్రాజ్యం యొక్క అంతమూ క్రైస్తవమతం యొక్క ఆరంభమూ ఒకేసారి జరిగాయి.

          క్రైస్తవం పుట్టుకే చాలా గందరగోళంతో నిండి ఉంటుంది.ఆ మతానికి మూలస్తంభం అయిన జీసస్ క్రీస్తు యూదు జాతీయుడే,అతని జీవిత కాలంలో అతని లక్ష్యం కూడా విశ్వ మానవులకి కొత్త మతాన్ని ప్రవచించడం కాక రోమన్ల మీద యుద్ధం చేసి యూదులకి స్వతంత్రమైన రాజ్యం సాధించి దానికి తను రాజు కావడం - అప్పటికే రెండు సార్లు  రోమన్ల చేతిలో ఓడిపోయి జడిసి ఉన్న యూదులు అతన్ని తోమన్లకి అప్పగించారు.రోమన్ల చేతిలో క్రీస్తు హతుడు కావటంతో ఆజ్ఞాతంగా ఉండటం వల్ల రోమన్ల పతనానికి క్రైస్తవులు కారణం అని చెప్పటం సరైనది కాదు.

     ఆనాటి క్రైస్తవ మతం యొక్క స్వరూపానికీ ఈనాటిక్రైస్తవ మతం యొక్క స్వరూపానికీ ఏమాత్రం పోలిక లేదు.సుమారు మూడో శతాబ్దం అనుకుంటాను, కాన్‌స్టాంటిన్ తనకున్న రాజకీయ కారణాలతో రూపం మార్చినప్పటి నుంచి క్రైస్తవం యొక్క వైభవం ప్రారంభమైంది.అగ్నికి వాయువు తోడైనట్టు కాన్స్‌టాంటిన్ కూడా యూదుద్వేషి కావటంతో ఏసుని రోమన్లకి పట్టివ్వటాన్ని దుర్మార్గం కింద చిత్రించడం వల్ల యూదుల పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టు తయారైంది! అసలైన విచిత్రం ఏమిటంటే క్రైస్తవులు పేరు మాత్రమే ఒకటి తీరులో తేడా ఉందని అనుకోవడానికి వీల్లేకుండా యూదుల దైవాన్నే తమ దైవంగా ఒప్పుకుంటున్నారు,తోరాకి రూపం మార్చి పాత నిబంధన కింద ఉంచేసుకునారు, మతానికి మూలస్తంభం పుట్టింది యూదు జాతిని ఉద్ధరించడానికే - మరి, ఆ మతస్థులకి యూదులు శత్రువులు కావడం ఏంటి, ఖర్మ!

        దీనికి తోడు జీసస్ క్రీస్తు రోమన్ల చేతిలో హతం కావడం తమ గ్రంధంలోని భవిష్యవాణికి విరుద్ధమైనదని వ్యతిరేకించటం కూడా క్తైస్తవులకి కుట్రలా కనపడింది - అణచివేత మొదలైంది!399లో యూదులకీ క్రైస్తవులకీ మధ్యన వివాహాలని నిషేదిస్తూ ఒక చట్టం చేశారు.439లో యూదులు ప్రభుత్వంలోని అధికార స్థానాలకి పోటీ పడకూడదని ఒక చట్టం చేశారు.531లో కోర్టులో యూదులు క్రైస్తవులకి వ్యతిరేక సాక్ష్యాలు చెప్పడాన్ని నిషేధిస్తూ ఒక చట్టం చేశారు.యూదులకి కొమ్ములూ తోకలూ ఉంటాయనీ బలుల పేరుతో తమ పిల్లల్ని చంపేస్తున్నారనీ పుకార్లు లేవదీశారు.ఆఖరికి,యూదుల పట్ల అంటరాని తనం పాటించి ఘెట్టోలనే వెలివాడల్లోకి నెట్టేశారు!

         భూమి హక్కునే కాదు, ఆస్తి హక్కుని కూడా లాగేసుకోవడంతో యూదులు వడ్డీ వ్యాపారానికి పరిమితం కావలసి వచ్చింది - క్రైస్తవం తన మతస్థులకి వడ్డీ వ్యాపారాన్ని నిషేధించడం వల్ల అది ఆనాడు యూదులకి వరమైంది, వాళ్ళు అది తప్ప ఇంకేదీ చెయ్యలేనట్టు అందులో ఆరితేరిపోయి బ్యాంకింగ్ వ్యవస్థను సృష్టించడం ఈనాడు ప్రపంచానికి శాపమయ్యింది!

        క్రిస్టియన్ల ఇహలోక వైభవం  సమస్తానికీ సంపదని సృష్టించగలిగిన యూదులే కారణం అంటే అతిశయోక్తి కాదు.నలుగుర్ని పోగేసి సువార్త కూటములు నిర్వహించడం దగ్గిర్నుంచి కళ్ళు చెదిరే శిల్పకళతో అద్భుతమైన చర్చిల్ని కట్టడంతో పాటు సైన్యాన్ని సమకూర్చుకుని చేసే యుద్ధాల వరకు అంతటా యూదుల విశ్వరూపమే!ఇలా కొంతకాలం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకొంటినమ్మ వాయనం అన్నట్టు గడిచింది - మధ్యే మధ్యే ఆచమనం సమర్పయామి అన్నట్టు అలవాటు చొప్పున తిక్క రేగినప్పుడు వేస్తున్న చెదురు మదురు తిరగమోతలు ఉన్నప్పటికిన్నీ!

      7వ శతాబ్దం వచ్చేసరికి అరేబియా నుంచి ముస్లిముల విజృంభణ మొదలై  వాళ్ళనుంచి తట్టుకోవడానికి యుద్ధాలు మొదలు కావటంతో యూదుల సహాయం క్రైస్తవులకి అవసరం కావడంతో యూదుల వడ్డీ వ్యాపారం వ్యవస్థీకృతమై తొలినాటి బ్యాంకింగ్ వ్యవస్థ ఆవిర్భవించింది.ఈ యుద్ధాల్లో గెలుపు సాధించిన ముస్లిములు కేవలం బహుళదేవపూజకుల్ని మాత్రం నిర్జించి మిగిలిన వాళ్ళని వాళ్ళ మతాలకి వాళ్ళని వదిలివెయ్యటంతో యూదులు ముస్లిములను కూడా తమ వడ్డీ వ్యాపారపు తెలివితో మచ్చిక చేసుకోగలిగారు.

      యూదులనే ఏముంది లెండి వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు  అన్ని కాలాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ చెడ్డవాళ్ళుగానే కనిపిస్తారు - మనకి అవసరమై అప్పుకోసం వెళ్ళినప్పుడు ఆపద్బాంధవుడిలా కనిపించిన మనిషి అప్పు తీర్చమని అడిగినప్పుడు బ్రహ్మరాక్షసుడిలా కనపడటం సహజమే కదా!ఈనాడు పక్కపక్కనే కనిపిస్తున్న వడ్డీ వ్యాపారం, బ్యాంకింగ్ వ్యవస్థల మధ్యన ఉన్న తేడాల్ని చూస్తే యూదులు బ్యాంకింగ్ వ్యవస్థని ఎట్లా సృష్టించారో కొంతవరకు అర్ధం కావచ్చును.మన ఇంటి పక్కనున్న వడ్డీ వ్యాపారి ప్రామిసరీ నోటు రాయడం పూర్తయ్యాక తన అధీనంలో ఉన్న డబ్బు నుంచే కొన్ని నోట్లని మన చేతుల్లో పెడతాడు, కానీ బ్యాంకులు తమ అధీనంలో లేని డబ్బుని మనకి అప్పుగా ఇస్తున్నాయి.వడ్డీ వ్యాపారి ఇతరుల నుంచి డబ్బుని తీసుకుని దాచిపెట్టి తిరిగి కొంత వడ్డీ కలిపి ఇచ్చే బాధ్యత తీసుకోడు, కానీ బ్యాంకులు అలా చేస్తాయి - అందువల్లనే ప్రజలు తమకి ఇచ్చే అప్పుని బ్యాంకు అలా సేకరించిన డబ్బు నుంచి తీసి ఇస్తున్నదని భ్రమ పడుతున్నారు.వడ్డీ వ్యాపారి మనం తన దగ్గిర అప్పుగా తీసుకున్న డబ్బుని ఉత్పాదన రంగంలో పెట్టుబడి పెడితే తన అప్పు అనుకున్న సమయానికి తీర్చగలుగుతామనే దృష్టితో ఆలోచించి సంతోషిస్తాడు,అనుత్పాదక రంగంలో పెట్టుబడి పెడితే తన అప్పును మనం తీర్చలేమని ఆందోళన పడతాడు.కానీ బ్యాంకులు మాత్రం మనం అనుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టి నష్టపోతేనే సంతోషిస్తాయి!

       Freemasonsకి ముందరి రూపమైన Knights Templar బృందమే ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థకి రూపు ఇచ్చి "bond market" అనే ఏర్పాటును కూడా ఒక భాగం చేసి మూర్ఖపు European Nobles మధ్య కలహాలను రగిల్చి వాళ్ళను యుద్ధాలకు పురి కొల్పి యుద్ధరుణాలు ఇచ్చి తమ బానిసల్ని చేసుకుని ఆడించటం మొదలుపెట్టారు. ఒకసారి Crusader Knights Templar ఆశపోతు తనం పెరిగిపోయి Jerusalem నగరంలో యూదు మతస్థులు ఇతరులు కూలగొట్టిన ప్రతిసారీ మళ్ళీ కట్టుకుంటూ వస్తున్న Solomon Temple మీద దాడి చేసి అక్కడ పెద్ద మొత్తంలో పోగైన బంగారపు నిల్వల్నీ ఎన్నెన్నో విలువైన పురాతన వస్తువుల్నీ కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారు - తాము House of Davidకి సంబంధంచినవారు కాబట్టి అది దొంగతనం కాదనీ వారి పూర్వీకుల ఆస్తిని స్వాధీనం చేసుకోవడమనీ సమర్ధించుకున్నారు.

      వాస్తవ ప్రపంచంలో అద్భుత విజయాలను సాధించిన  చారిత్రక వ్యక్తులతో గాక దైవాంశ సంభూతులని మతసాహిత్యం వర్ణించిన కల్పిత పాత్రలతో తమకు వారసత్వాన్ని ఆపాదించుకున్న విపరీత ప్రవృత్తియే వారిని ప్రపంచాధిపత్యం కోసం అమానవీయమైన నీచ కార్యాలను చేయటానికి సైతం వెనుకాడని మనస్తత్వానికి అలవాటు చేసి ఉత్సాహవంతులను చేస్తున్నది! Oligarchs, ఈ దోపిడీ వ్యవస్థ పుట్టిన తర్వాత గడిచిన 2,500 సంవత్సరాల నుంచి  "an elite identifying itself as a master race rules over a degraded mass of slaves or other oppressed victims" అని చెప్తున్న Aristotle యొక్క ఎప్పుడు తల్చుకుంటే అప్పుడు సాంస్కృతిక విభేదాలు,కులమత భేదాలు, ప్రాంతీయ తత్వాలు, భాషా ద్వేషాలు, ఆర్ధిక మాంద్యం, కరువు, రోగాలు, యుద్ధం, తీవ్రవాదం, విధ్వంసం వంటివాటిని సృష్టించి ప్రజల్ని భీతావహుల్ని చేసి చంపటానికి మాత్రమే పనికొచ్చే క్రూరమైన సిద్ధాంతాన్న్ని పాటిస్తున్నారే తప్ప దీనికి భిన్నమైన Plato యొక్క epistemology(theory of knowkedge) అనే సౌమ్యమైన పద్ధతిని చెత్త కింద తిరస్కరించి పారేస్తున్నారు!

          Aristotle బానిసల వ్యవస్థ తప్పనిసరి అని వాదించాడు, కొందరు పుట్టుకతోనే పాలించడానికీ మరికొందరు పుట్టుకతోనే బానిసత్వానికీ విభజించబడ్డారు గనక. విద్యా జ్ఞానమూ తర్కమూ మేధస్సూ శాస్త్రీయతా వంటివి ఆ ఒక్క కుటుంబానికి తప్ప ఇతరులకి అనవసరం అనే పచ్చి నిజాన్ని కూడా నొక్కి చెప్పాడు. Aristotle అనే ఒక వడ్డీ వ్యాపారి తత్వవేత్త వేషం కట్టి ప్రవచించిన దళారీ సిద్ధాంతం మానవ సహజమైన సృజనాత్మకతని చంపేసి oligarchsకి తాము తప్ప ఇతరులు అసలు మనుషులే కాదని నమ్మి తమ బానిసల చేత నమ్మించే స్థాయిలో పొగరుని ఎక్కించింది!

            1684లో House of Orangeకి సంబంధించిన King William III ఇదివరకు the City of London చేత స్థాపించబడిన Bank of England అనే ప్రభుత్వ బ్యాంకును, అంటే England యొక్క ఆస్తిని ఒక international bankers బృందం చేతికి అప్పగించాడు. Vatican City వలెనే, the City of London కూడా సామాన్యులకు వర్తించే legal constraints బెడద లేని ఒక సొంత రాజ్యాంగం ఉన్న 100% స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. అక్కడ కొలువు దీరిన international bankersకి మన పురాణ కధలోని హిరణ్యకశిపుడు సాధించి, కొంతకాలం పాటు సాగించి స్తంభజుని విజృంభణతో అంతమైపోవడానికి కారణమైన త్రిలోకాధిపత్యం అనే లక్ష్యాన్ని పోలిన ప్రపంచ ప్రభుత్వం అనే ఆర్ధిక స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అవకాశం కల్పించడం కోసమే బ్రిటిష్ ప్రభువు ఈ ఏర్పాటు చేశాడు.

           1744 CEలో మొదటి తరం హిరణ్యకశిపుడు dynasty founder Mayer Amshel Rothschild (1744-1812) పుట్టాడు! వీళ్ళ కుటుంబం యొక్క చరిత్ర 1577 నాటి Izaak Elchanan Rothschild అనే అతని కాలం నుంచీ ప్రముఖమైనదే!Rothschild అనే ఇంటి పేరు zum rothen Schild (with the old spelling "th") అనే జర్మన్ పదం నుంచి వచ్చింది - "with the red shield" అని అర్ధం.అప్పటి సంప్రదాయం ప్రకారం ఇళ్ళని డోర్ నంబర్ చూసి కాక అక్కడ చెక్కిన రంగు రంగుల డిజైన్లని బట్టి గుర్తు పట్టేవారు.Rothschild అంటే Yiddish భాషలో "Red Coat" అని అర్ధం.అతని మనమల తరమైన 1664లో ఇల్లు మారుతున్నప్పుడు వాళ్ళు దీన్నే ఇంటి పేరు కింద ఖాయం చేసుకున్నారు - అప్పుడు మారిన కొత్త ఇల్లే ఎన్నెన్నో వ్యాపార వ్యూహాలతో చరిత్రను  తమ ఇష్టం వచ్చినట్టు నడిపించగలిగిన కొన్ని తరాల మృత్యు బేహారుల శరీరాలకి రక్షణ కల్పించింది, కల్పిస్తున్నది, కల్పిస్తుంది!

         Amschel తండ్రికి goods-trading, currency exchange వ్యాపారాలు ఉండేవి. Prince of Hesseకి అతను వ్యక్తిగత నాణేల సప్లైదారుడు.దగ్గరి బంధువుల సహాయంతో Amshel Rothschild అప్పటికే బ్యాంకింగ్ రంగంలో పేరున్న Hanover లోని Simon Wolf Oppenheimer Banking Firmకి వ్యవస్థాపకుడైన Samuel Oppenheimer మనుమడు Jacob Wolf Oppenheimer దగ్గిర apprenticeship మొదలు పెట్టాడు. 1757 నుంచి Jacob శిక్షణలో foreign trade, currency exchange వంటి కీలకమైన విషయాలలో మంచి అవగాహన కలిగించుకుని 1763లో అన్నకి సహాయం చెయ్యటానికి Frankfurt నగరానికి వచ్చాడు. నాణేల వ్యాపారం మొదలుపెట్టి తండ్రిని ప్రోత్సహించిన Wilhelm of Hesse ప్రాపకం  సంపాదించాడు - త్వరలోనే రాజైన Wilhelm IXకి నమ్మకస్తుడైన బ్యాంకరు కావడంతో ఎదుగుదల మరింత వేగం పుంజుకుంది! సమయానికి వచ్చి పడిన French Revolution హడావిడిలో పారిస్ నుంచి పారిపోయి వచ్చిన కులీన కుటుంబాల వారికి లండన్ నుంచి నిధుల బదలాయింపుతో నక్కని తొక్కి వచ్చినట్టు వ్యాపారం పదింతలు పెరిగింది! 

         Wilhelm తన శత్రువైన Prussiaకి సాయం చేస్తున్నందుకు Napoleon కోపగించుకుని 1806లో  Hesse మీద యుద్ధానికి వచ్చాడు. Landgrave భయపడి Holstein వెళ్ళి తల దాచుకున్నాడు - ప్రవాసంలో ఉన్న Wilhelm యొక్క లావాదేవీలను Rothschild చక్కబెడుతూ తన ఆర్జనకి లోటు లేకుండా చూసుకున్నాడు.యుద్ధ సమయంలోనూ ఇతర సమయాల్లోనూ సరుకుల రవాణాకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ Napoleon దగ్గిర నుంచి కూడా ఆదాయం కిట్టించుకున్నాడు!

     యుద్ధాలని సృష్టించటానికి వీళ్ళు చేసే గారడీ చాలా నిక్కచ్చి లెక్కలతో కూడిన చిక్కురొక్కురు మలుపులతో నిండిన వైకుంఠపాళి ఆటలా తెలుసుకుంటున్నవాళ్ళకే సంభ్రమాశ్చర్యానందవిషాదక్రోధనిర్వేదాలను ప్రతి సన్నివేశంలోనూ కలిగించేటంత గొప్ప నవరసాత్మకమైన దృశ్యకావ్యంలా గోచరిస్తుంది! మొదట ప్రభువుల స్థానంలో ఉన్న తమ అవసరం కోసం ఇదివరకే అక్కడ నిలబెట్టిన పావుల అహంకారమమకారవ్యామోహాదులనే మెట్ల మీద వాక్యకోవిదుల వలె యుద్దవీణాతంత్రులను కొనగోట మీటుతూ వారు ప్రజల ముందు నిలబడి కలహం తప్ప్పనిసరి అని ప్రజలను ఒప్పించి సమరశంఖం పూరించేలా చేస్తారు!   ఒకసారి రణభేరి మ్రోగాక కొందరు తెలివైనవాళ్ళు యుద్ధాన్ని నివారించటానికి ప్రయత్నిస్తే వారికి ప్రజాద్రోహుల ముద్ర వేసి చెఱసాలకు తరలించడానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యే ఉంటాయి!యుద్ధం మొదలయ్యాక తమ గోదాముల్లో అమ్ముడు పోకుండా పడి ఉన్న పాత సరుకులతో సహా అన్నింటినీ బైటికి తీసి రాజే కింకరుడవటం వల్ల పోటీదారులు లేని అవకాశాన్ని వినియోగించుకుని రూపాయి సరుకుని వంద రూపాయలకి అమ్మి లాభసాగర తరంగాల మీద తేలియాడుతూ ఉంటారు!యుద్ధం ఎంత కాలం కొనసాగాలి,ఎవరు ఓడిపోవాలి,ఎవరు గెలవాలి అనేవి కూడా ముందే నిర్ణయించుకుని ఉంటారు కాబట్టి వారికి సంతృప్తి కలిగిన తర్వాత యుద్ధ విరమణ ప్రకటిస్తారు!అప్పుడు రెండు వైపులా యుద్ధానంతర పునరావాస పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతాయి - ఇప్పుడు ద్వితీయ శ్రేణి మృత్యుబేహారులు రంగంలోకి దిగి తమ లాభకండూతిని సంతృప్తి పరుచుకుంటారు!ఏ రెండు కల్పిత కధలూ ఒక్కలా ఉండవు గానీ అన్ని యుద్ధాలూ ఒక్కలానే ఉంటాయి - ఇలాగే మొదలవుతాయి, నడుస్తాయి, ఆగుతాయి!

1      815 CEలో Rothschilds నడిపిస్తున్న Barings Bank చైనావాళ్ళ నల్లమందు వ్యాపారాన్నీ ఆఫ్రికన్ బానిసల వ్యాపారాన్నీ తన అధీనం లోకి తెచ్చుకుంది.Prussian War, the Crimean War అనే రెండు లాభసాటి యుద్ధాలకి finance చేసింది.బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచివాళ్ళ నుంచి సూయజ్ కెనాల్ స్వాధీనం చేసుకోవటానికి సహాయపడింది. సుమారు 19వ శతాబ్దపు తొలినాళ్ళలో Pope అప్పు కోసం Rothschilds ముంగిట వాలాడు.అప్పటి నుంచి Vatican ఆర్ధిక వ్యవహారాలను కూడా తనే చూడటం మొదలుపెట్టారు. 1823 నుంచి అధికారికమైన గుర్తింపు పత్రం తీసుకుని worldwide Catholic Church యొక్క అన్ని లావాదేవీలను Rothschilds పర్యవేక్షించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం financial business రంగంలో Catholic Church వాటా చాలా చాలా చాలా ఎక్కువ!

        "debt-based monetary system అనేది econimicsని control చెయ్యటానికి ఉపయోగిస్తున్న పద్ధతి, డబ్బు చేతులు మారుతున్న ప్రతిచోట credit అనేది capitalకి ప్రత్యామ్నాయం కావడం వల్ల ప్రభుత్వాలు సైతం దాని పరిధిలోకి వచ్చేశాయి. రాజకీయ నాయకులు కూడా కొనగలిగే,అమ్మగలిగే,ఎన్నుకోబడే,తొలగించబడే,అవసరమైనప్పుడు చంపబడే పనిముట్ల కింద మారిపోయారు. Global Monetary System అనేది ప్రపంచంలోని అతి కొద్ది మంది అత్యంత ధనవంతుల కోసం పనిచేసే central banks యాజమాన్యం చేత అల్లబడిన చిక్కురొక్కురు అల్లిక - దాని పరిధి నుంచి తప్పుకోవడం అసాధ్యం!" - Andrew Gavin Marshall, Global Research.

       Freidrich Hegel(1770-1831) సమాజం యొక్క చలనం గురించి కొన్ని విషయాలను పరిశీలించి కొన్ని విశ్లేషణలను చేసి కొన్ని సూత్రీకరణలు చేస్తూ గతి తార్కిక భావ వాదం అనే సిద్ధాంతం చెప్పాడు.దీని ప్రకారం మానవాళి యొక్క పురోగమనం "thesis", "antithesis" అనే ద్వంద్వాలు సంఘర్షించుకుని వాటి మేలు కలయిక అనిపించే "synthesis" పుట్టుకొస్తూ నడుస్తున్నదని చెప్పాడు.ఇతన్ని sponsor చేసిన Rothschild Business Roundtable వారికి ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది!

        అదేమిటంటే, capitalism  అనే thesisకి తామే communism అనే antithesisని సృష్టించితే ఈ రెంటి సంఘర్షణ వల్ల తాము కోరుకుంటున్న New World Order ఆవిర్భవిస్తుందని అంచనా కట్టారు!పేరు గంభీరంగానే ఉంది గానీ దీని తీరు monopoly capitalism మాత్రమే!అప్పుడున్న liberal capitalist econimy అనే thesis నుంచి మొదట Prolitariat Dictatorship అనే antithesisని ఫెయిలవుతుందని తెలిసే సృష్టించారు, దానంతటది ఫెయిలయ్యిందో మరి చరిత్ర గమనాన్ని వేగవంతం చెయ్యడానికి వారే ఫెయిల్ చేశారో తెలియదు గానీ - అది ఫెయిల్ కాగానే restricted capitalist economy అనే synthesని కూడా ఉనికిలోకి తీసుకొచ్చారు!

        ఉలిక్కి పడకండి - మనమిప్పుడు New World Order యొక్క మొదటి దశలోనే ఉన్నాం, రెండవ దశలోకి ఇంకా అడుగు పెట్టలేదు.రెండవ దశలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న Illuminati banking familiesకి చెందినవారూ Black Nobility monarchsకి చెందినవారూ 300 మంది కలిసి ఏర్పడిన సంఘానికి మాత్రమే ఈ భూమి మీద ఉన్న వనరుల మీద నిజమైన  అధికారం ఉంటుంది. ప్రపంచ జనాభాని 1 బిలియన్ దగ్గిర స్థిరపరచగలిగినప్పుడు రెండవ దశలోకి వెళ్ళినట్టు అర్ధం చేసుకోవాలి.ఆ లక్ష్యానికి చేరుకోవటానికీ చేరుకున్నాక దాన్ని నిలబెట్టి ఉంచటానికీ సంతాన పరిమితిని విధించడం, రోగాల్ని వ్యాపింపజేయ్యడం,యుద్ధాల్నీ కరువుల్నీ సృష్టించడం లాంటి సృజనాత్మకమైన ప్రక్రియలను వాడుకుంటారు.

        New World Order యొక్క ముఖ్యమైన లక్షణాలు ఇలా ఉంటాయి:ఎన్నికలు ఉండవు - ఆ ప్రాచీన యూరొపీయ రాజవంశాల వారి అనువంశిక పాలన నడుస్తూ ఉంటుంది, మధ్య తరగతి ఉండదు - పాలకులు,పాలితులు మాత్రమే ఉంటారు, వీదేశీ మారక ద్రవ్యం ఉండదు - ఒకే కరెన్సీ ప్రపంచం మొత్తానికి చెల్లుతుంది, మత విద్వేషాలు ఉండవు - క్రైస్తవమే పాలకులకీ పాలితులకీ కూడా ఆమోదయోగ్యం అవుతుంది, నేరాలు చాలా తక్కువ - పాలితులకి నేరాలు చేసే అవకాశం ఇవ్వరు, ప్రభువులకి సేవలు చెయ్యడమే వారి ఏకైక లక్ష్యం, జన్మకారణం కూడాను.నేరాలూ, ఘోరాలూ పాపాలూ అన్నీ ప్రభువులే చేస్తారు. తిరగబడిన వాళ్ళని కడుపు మాడ్చి చంపెయ్యటమో సమాజం నుంచి బహిష్కరించటమో చేస్తారు. ఒకే ప్రభుత్వం,ఒకే చట్టం,ఒకే సైన్యం,ఒకే సంస్కృతి - విధేయత ఉంటే అంగరంగవైభోగమే, వైవిధ్యం లేకపోవటం ఒకటే లోపం!

      New World order అనేది సకల మానవాళి శ్రేయస్సు కోసం అయితే రహస్యం దేనికి? "మిమ్మల్ని మేము ఆ ఇరవై కుటుంబాలకి బానిసల్ని చెయ్యాలనుకుంటున్నాం,మా లక్ష్యానికి సహకరించండి!" అని బహిరంగ వేదికల మీద చెప్పి ప్రజల నుంచి మద్దతు కూడగట్టటం అసాధ్యం గనక రహస్య సంస్థలను ఏర్పాటు చేసి వాటితో ప్రజలని తమకు తెలియకుండానే వీరికి అనుకూలమైన దారిలోకి నడిపించవచ్చునని ప్రణాళికలు వేశారు. దాదాపు 1880ల నుంచి ఆమెరికా లోనిRockefellera మరియు Rothschilds కలిసి పనిచెయ్యటం మొదలుపెట్టారు. House of Rothschild యొక్క సంపద, అధికారం, వైభవం, ప్రాభవం ఎంత మేరకు పెరిగాయంటే, 1900 నాటికి భూమి మీద సృష్టించబడిన సంపదలో సగం వారి  అధీనంలో ఉంది.

         ఈ పెట్టుబడి దారీ విధానం చాలా భయంకరమైనదని తేల్చి చెప్పి దీన్ని అంతం చేసే రహస్యం తనకి తెలుసునని గతి తార్కిక భౌతికవాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రపంచంలోని స్వాప్నికులందర్నీ ఉర్రూత లూగించిన మార్క్సిజం  రష్యాలో సాకారం కావటానికి కూడా Lord Alfred Milner, Kuhn Loeb అనే ఇద్దరు finance చేశారంటే అంతకన్న విచిత్రమైన విషయం ఇంకొకటి లేదు, కానీ అది అలానే జరిగింది!Rockefellers తరపున పనిచేస్తున్న వీళ్ళే తోలుబొమ్మ ప్రెసిడెంట్ Woodrow Wilson గారిని ఉపయోగించుకుని అంత అసాధ్యం అనిపించే పనిని కూడా సుసాధ్యం చేసేశారు.

      1929 CE నాటి Depression ప్రమాదవశాత్తు వచ్చినది కాదు.bankers తమ క్రూరమైన తెలివితేటల్ని ఉపయోగించి రప్పించినదే - international bankers ప్రజల్ని మొదట భయభ్రాంతుల్బి చేసి తర్వాత దాన్ని పోగొట్టిన రక్షకుల అవతార మెత్తి ప్రజల్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికే చేశారు. World War Iలో పాల్గొన్న చాలా దేశాలు పెద్ద స్థాయిలో అప్పుల పాలయ్యాయి.యుద్ధానికి బీజం వేసి, పోషించిన international bankersకి అవి మొండిబాకీల కింద తయారయ్యాయి.ఈ మొండిబాకీల నష్టాన్ని పూడ్చుకోవటానికి వేసిన ఎత్తుగడ తర్వాత World War IIకి దారి తీసింది.వీళ్ళు చేసినది యేమిటంటే, అస్మదీయులు తమ షేర్లని అమ్మేశాక artificial inflation వచ్చేలా చేసి stock marketలో ఉత్తుత్తి boom సృష్టించారు.అలా చేస్తే తర్వాత ఏమౌతుందో షేర్ మార్కెట్ గురించి పరిజ్ఞానం వున్నవాళ్ళకి తెలుస్తుంది.అందరూ ఎగబడి కొన్నాక షేర్ల విలువలు వాటంతటవే పడిపోతాయి.ఇలా సృష్టించబడిన Great Depression ఒక్క అమెరికానే కాదు,అమెరికాతో వ్యాపార సంబంధాలు ఉన్న అన్ని దేశాలలో ఒకేసారి భూకంపం వచ్చినంత పనయ్యింది.శ్రీశ్రీ లాంటివాళ్ళు తమ జ్ఞాపకాల్లో దీన్ని ప్రస్తావించారు.

         ఇది అమాయకులైన చిన్న investersని దెబ్బ తీసింది కానీ insiders క్షేమంగానే ఉన్నారు. Paul Warburg 1929 మార్చిలోనే  Crash రాబోతుందని tip అందించడంతో John D. Rockefeller, Bernard Baruch, Joseph P. Kennedy వంటి money barons ముందుగానే అమ్మేసుకున్నారు కదా! ముందుగానే బైటికి వెళ్ళిన ఈ మహరాజులు ఆ దెబ్బని తప్పుకోవటమే కాకుండా Crashకి గురై మూతబడిన కంపెనీల్ని చవక ధరకి కొనేసి మొండి బాకీల నష్టాన్ని పూడ్చుకుని ఆనందించారు!

        "ఎట్టి పరిస్థితుల్లోనూ World Government సాధించే ప్రయత్నాలని ఆపేది లేదు - అది మా ఏకైక లక్ష్యం! అది conquestతోనా, consentతోనా అన్నది మాకు ముఖ్యం కాదు." అని Feb. 7, 1950లోనే James Warburg అనే పెద్దమనిషి బల్ల గుద్ది చెప్పాడంటే తాము సృష్టిస్తున్న యుద్ధాలలోనూ కరువులలోనూ inflation, deftaltion, boom and bust cyclesలోనూ ధన మాన ప్రాణాలను పోగొట్టుకుంటున్న అమాయకుల పట్ల వారికి ఏమాత్రం జాలి లేదని తెలుస్తున్నది కదా - ఇంతటి క్రూరుల్ని ద్వేషించక ప్రేమించటం సాధ్యమా!

         ఇంతటి క్రూరులు సుమారు 2,500 సంవత్సరాల నుంచి ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినంత కౌశలంతో నిర్మించి మెరుగులు దిద్దుకుంటూ వస్తున్న మోసకారి బ్యాంకింగ్ వ్యవస్థని బద్దలు కొట్టడం అంత సులభం కాదు, దాదాపు అసాధ్యమే అయినా ప్రయత్నించాలి కదా, స్వాభిమాని ఎవడూ పరాధీనతని సహించకూడదు.గతంలో జరిగిన అలాంటి ప్రయత్నాలనీ అవి విఫలం కావటానికి గల కారణాల్నీ మనం పాటించాల్సిన భవిష్యత్తు వ్యూహాల్నీ తర్వాతి భాగంలో చర్చిస్తాను.

(this is the eighth part of a series on macro economy!)

Monday, 6 May 2019

వినరా భారత వర్తక వీరుడా అమెరికను రాక్ ఫెల్లరు గారి సంక్షిప్త జీవిత చరిత్రమును!

       ప్రపంచంలో ఎంతోమంది ధనవంతులైన వ్యాపారులు ఉండగా ప్రత్యేకించి ఈ John Rokefelar గురించే ఎందుకు చెప్పదల్చుకున్నానో తెలుసా!ఒక మనిషి ఎంతటి ప్రతిభాశాలి అయినప్పటికీ ఇతన్ని మించి డబ్బు సంపాదించటం అసాధ్యం అని నిర్ద్వంద్వంగా తేలిపోయింది గనక!

          పుట్టి నాలుగేళ్ళయినా నిండక ముందునుంచే వూరికూరికే వూళ్ళను మార్చే దేశదొమ్మరి బతుకు అలవాటైపోయి  నాలుగిళ్ళలో పాలేరు పన్లు చేస్తే తప్ప పొట్ట గడవని దుర్భర దారిద్య్రం నుంచి నక్కని తొక్కి వచ్చినట్టు నదమంత్రపు సిరి పట్టి మట్టిని ముట్టుకుంటే బంగారమౌతూ నట్టింట నవధాన్యాల పొంగులను చవిచూడటం వరకు ఎదిగిన అన్ని కధల్లాగే John Rockefellar యొక్క కధ కూడా అతి సామాన్యంగానే మొదలైంది.డాబుసరి కోసం కావచ్చు, తనని తను "botanic physicist"నని చెప్పుకునే ఆనాటి కాలంలో ఈనాటి హోమియోపతిని పోలిన సంప్రదాయ వైద్యం చేస్తూ "తోటకు తోబుట్టువును... ఏటికి నే బిడ్డను, పాట నాకు సైదోడు.. పక్షి నాకు తోడు, విసుగు రాదు.. ఖుషి పోదు.. వేసట లేనే లేదు, విసుగు రాదు.. ఖుషి పోదు.. వేసట లేనే లేదు, అసలు నా మరో పేరు ఆనంద విహారి, నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి" అని పాడుకునే తండ్రికి 1839లో ఇతను పుట్టినప్పుడు గ్రహాలు కంపించలేదు, పిశాచ గణాలు పగలబడి నవ్వలేదు, దుశ్శకునాలు గోచరించలేదు,జ్యోతిష్కులు పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఈ బిడ్డ భవిష్యత్తులో నీచకార్యాలు చేసి లోకాలను హింసించే దుర్మార్గుడు అవుతాడు కాబట్టి లోకహితం కోసం చంపెయ్యమని సలహాలు ఇవ్వలేదు - అంతా మామూలుగానే ఉంది, మీదు మిక్కిలి తొలి కాన్పు కాబట్టి తల్లి గర్వంతో సెలవివార నవ్వింది కూడాను.

          ఆ తండ్రికి ఇతని తల్లి ఒకతే కాదు వేరే చోట ఇంకో భార్య ఉంది, సంతానంతో సహా మనవాడి తండ్రి శ్రీమాన్ కుచేల స్వామియే!తండ్రి ఒకసారి ఇల్లు దాటి వెళ్తే మళ్ళీ రావటానికి వారాలు పట్టేది - అందర్నీ ఓకచోటకి చేర్చి కుదురైన జీవితం గడపాలనే చిన్న కోరిక కూడా తీరని దురదృష్టం ఆ తండ్రిది!

          ఈ తరహా గందరగోళపు కుటుంబ జీవితం వల్ల చిన్నప్పటి నుంచే ఇతరుల్ని రుబాబు చేస్తూనే ఎలా బుజ్జగించాలో,  చిన్న చిన్న ట్రిక్స్ నుంచి పెద్ద పెద్ద ప్రాఫిట్స్ ఎలా కొట్టెయ్యాలో నేర్చుకున్నాడు. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే తనకి దక్కిన ప్రతి పైస నుంచీ పది పైసల్ని పిండటంలో అఖండప్రజ్ఞని సాధించాడు.మూడేళ్ళ వయసు నుంచే ఆటపాటల గురించి ఆలోచించి ప్రలోభపడి సమయం వృధా చేసుకోకుండా తల్లికి సాయపడటానికి పనిపాటల్లోకి దిగిపోయాడు.బాతుల్ని పెంచటం దగ్గిర్నుంచీ పక్కింట్లో పాచిపని చెయ్యటం వరకు దేనినీ నామోషీ అనుకుని ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పని చేశాడు - అప్పటి రాక్ ఫెల్లర్ ఇలాంటి కొడుకు నాకూ ఉంటే బాగుండునని ప్రతి తల్లీ కోరుకునే బుద్ధిమంతుడైన పెద్ద కొడుకు.

         1854లో కుటుంబం Cleveland చేరుకున్నప్పటినుంచీ బుజ్జిగాడి తెలివితేటలకి తగ్గ గుర్తింపు రావటం మొదలైంది.స్కూల్లో చేరి చదవటం,రాయటం కూడా నేర్చుకున్నాడు, కానీ సంవత్సరం తిరిగేసరికి బయటి కొచ్చేసి HEWITT & TUTTLE అనే Produce broker(కిరాణా కొట్టు లాంటిది)లో జమాఖర్చులు రాసే గుమస్తా ఉద్యోగానికి కుదిరాడు.ఎంత గింజుకున్నప్పటికిన్నీ బాసు $0.50 కన్న ఎక్కువ ఇచ్చేవాడు కాదు.అదనపు ఆదాయం కోసం చాలాచోట్ల పని చేసీ చేసీ చచ్చి ముతమారినా జీతం పెంచేది లేదని భీష్మించుకుని కూర్చున్న బాసుల మీద కడుపు రగిలిపోయి వాళ్ళ మీద కసి కొద్దీ రెండేళ్ళ తర్వాత సొంత వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు.

         బాసులు పిసనార్లయ్యి జీతం పెంచలేదు గానీ పనిమంతుడని అందరికీ తెలియడంతో $4000 అప్పుని కిట్టించుకోగలిగాడు - గడ్డి,ధాన్యాలు,మాంసాలు అమ్మడం మొదలుపెట్టి సంవత్సరం తిరిగేసరికి అర మిలియన్ డాలర్లు వెనకేశాడు!మెరుగూ తరుగూ లెక్కలు తీస్తే తనకి దక్కింది తక్కువే గానీ గెలుపు మాత్రం తక్కువది కాదు!Clevelandలో పేరున్న బ్యాంకులన్నీ అప్పులివ్వటానికి పిలుపులు మొదలెట్టాయి - తీరా చూస్తే అతనికి పద్ధెనిమిదేళ్ళు మాత్య్రమే, అప్పటి రాక్ ఫెల్లర్ ఇలాంటి మొగుడు నాకూ వస్తే బాగుండునని ప్రతి ఆడపిల్లా కోరుకునే కత్తిలాంటి కుర్రాడు!

        కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు ఆ 1859లో Clevelandకి తూర్పున వంద మైళ్ళ లోపున చమురుబావి ఉన్నట్టు తెలిసింది, మొత్తం అమెరికాకే అది మొదటి చమురుబావి, కెపాసిటీ ఏడాదికి 4,500 బ్యారల్సు!అప్పట్లో ఇప్పటిలా పెట్రోలు వాడకం లేదు, దీపాలు వెలిగించుకునే కిరోసిన్ కోసం మాత్రమే పనికొచ్చేది, అయితే మాత్రమేం, దాని విలువ కూడా తక్కువేం కాదు.మన కధానాయకుడు అన్నివైపుల నుంచీ పరిశీలించి ఆయిల్ తవ్వి తియ్యటానికి గండభేరుండాలు పోటీ పడటం చూసి అక్కడ దూరే దమ్ము లేక నిదానించి చూస్తే తీసిన ఆయిల్ని శుద్ధి చేసే refinaryని గనక పెడితే తవ్వేవాళ్ళంతా చచ్చినట్టు తన దగ్గిరకే వస్తారని పసి కట్టాడు - అప్పటికి గండభేరుండాల చూపు ఇటు పడకపోవటమే రాక్ ఫెల్లర్ జీవితాన్ని  వూహించని మలుపు తిప్పింది!

        వేట మీదకి వేసే ఆఖరి దూకు కోసం పులి ఎదురు చూసినంత సహనంతో 1863లో ప్రభుత్వం Pennsylvania oil fields నుంచి Cleeland వరకు రైలు వేసేవరకు ఆగి అప్పటికే భాగస్తుల్ని కలుపుకుని బ్యాంకుల్ని మచ్చిక చేసుకుని ఉన్న రాక్ ఫెల్లర్ వెంటనే రంగంలోకి దిగిపోయాడు.రిఫైనింగ్ కోసం పేరు మోసిన కెమిస్టుల్ని తీసుకోవడంతో వాళ్ళు ఖర్చుని తగ్గించటంతో పాటు  కిరోసిన్ ఒక్కటే గాక paraffin wax, tar, naphtha వంటి కొత్త ఉత్పత్తుల్ని కూడా వేరు చెయ్యొచ్చునని కనుక్కున్నారు.దీంతో కేవలం రెండేళ్ళలో రాక్ ఫెల్లర్ డెబ్భయి వేల డాలర్ల ఆదాయంతో శిఖరం చేరాడు!

          శిఖరం చేరిన రాక్ ఫెల్లర్ అంబరం కోరాడు:1865 నాటికి తనది కాక మిగిలిన 26 రెఫైనరీల్లో అయిదేళ్ళు గడిచేసరికి కొరుకుడు పడని నాల్గింటిని తప్ప అన్నింటినీ మింగేశాడు - జీర్ణం చేసుకుని బ్రేవుమని త్రేన్చాడు.అప్పటికే వ్యాపారం పెద్దదైపోయి భాగస్వామ్యపు లిటిగేషన్లని తట్టుకోవటానికి 1870లో తన రిఫైనరీని Standard Oil of Ohio అనే సంస్థ రూపం తీసుకొచ్చాడు.కొరకరాని కొయ్యల్ని మెత్తబరచటానికి అతడెన్నుకున్న వ్యూహం చాలా చిత్రమైనది.చాలా మర్యాదగా తన దగ్గిరకి పిలిపించుకుని చూపించాల్సిన అన్ని లెక్కల్నీ చూపించి ఖర్మ కాలి మొత్తం పరిశ్రమ నష్టాల్లోకి వెళ్తే నష్టాన్ని భరిస్తూ తను కొనసాగినంత సుదీర్ఘ కాలం వాళ్ళు కొనసాగలేరు కాబట్టి వాళ్ళ కంపెనీల్ని తనకి అమ్మితే బాగుంటుందని సూచించేవాడు.ఇక్కద మెలిక ఏమిటంటే అతను చెప్తున్న "పరిశ్రమకి వచ్చే నష్టాలు" వాతంతటవి రావు, బ్యాంకుల సాయంతో ఇతను రప్ప్పిస్తాడు!డబ్బే కావాలనుకుంటే ఎక్కువ రేటుకి అమ్మొచ్చు, లేదంటే తక్కువకి అమ్మి తన కంపెనీలో ఉద్యోగం చెయ్యొచ్చు అనే పద్ధతిలో వ్యవహారం నడిపేవాడు - మొదటి ఆప్షన్ మామూలు తెలివి ఉన్నవాడు ఎవడయినా ఇస్తాడు గానీ రెండో ఆప్షన్ మాత్రం రాక్ ఫెల్లర్ లాంటి కాలాంతక నరాంతక దేవాంతకుడు తప్ప ఇంకెవడూ ఇవ్వలేడు!

          ఈ ఎత్తుగడతో అంబరం కోరుకున్న రాక్ ఫెల్లర్ పతనం వైపుకి మొదటి మెట్టుని దిగాడు!ఎలాగంటే, ఆయిల్ తవ్వకాల దగ్గిర ఉన్న గండభేరుండాలతో పోటీ పడలేకనే కదా అప్పటికి పోటీ లేని శుద్ధి చెయ్యటాన్ని ఎంచుకున్నాడు, తనే గండభేరుండం అయ్యాక కొత్తవాళ్ళు తనకి గట్టి పోటీ ఇస్తున్నారంటే వాళ్ళు తనకన్న మెరుగైన క్వాలిటీనో చవకైన రేట్లనో కస్టమర్లకి ఇవ్వడం వల్లనే కదా తను వెనకబడిపోయింది,వాళ్ళకన్న నీకు అనుభవమూ ఆదాయమూ సాంకేతికతా ఎక్కువ ఉండి కూడా మెరుగైన క్వాలిటీని గానీ చవకైన రేటును గానీ ఒచ్చి నీ సామర్ధ్యాన్ని నిరూపించుకునే బదులు కస్టమర్లకి నీ సరుకుని ఏడుస్తూ కొనాల్సిన దుస్తితిని కల్పించడంలోని అర్ధం ఏమిటి?అప్పటి రాక్ ఫెల్లర్ కేవలం సంపదా వైభవమే కాక సమాజంలో గౌరవం కూడా కోరుకునే ప్రతి వ్యాపారవేత్తా తను ఇలా ఉండకూడదని కోరుకునే పులిలా మారుతున్న లేడి!

         ఎంత సంపాదించావు అనే ప్రశ్నతో పాటు ఎలా సంపాదించావు ఆనె ప్రశ్నకి కూడా జవాబు చెప్పాలి కదా!ఆ ప్రశ్న అనవసరం అనుకుంటే ఇవ్వాళ లైటు స్తంభం పక్కన అయిదు రూపాయలకు మానం అమ్ముకున్న ఆడమనిషి పదేళ్ళు గడిచేసరికి సామ్రాజ్యాధినేతల్ని పాదాక్రాంతం చేసుకోగలిగిన మాతాహరీ క్లియోపాట్రాల సరసన నిలబడగలదు- అయినప్పటికీ అలాంటివాళ్ళ ముందు నిలబడాల్సి వస్తే చావుకి భయపడి శిరస్సు వంచవచ్చును గానీ మనస్సులో కులస్త్రీ స్థానం ఇవ్వరు కదా!రాక్ ఫెల్లర్ నీచత్వాన్నే ఇప్పటికీ కొందరు కొనసాగిస్తున్న take-over నాటకాన్ని ప్రజలూ ప్రజల మేలు కోరిన నాయకులూ సహించకూడదు - అది వాళ్ళ అంతరంగిక విషయమో వ్యాపార మెళకువయో కాదు,కస్టమరుని మోసం చెయ్యడం అనే దుర్మార్గం అక్కడ నడుస్తున్నది.

         వ్యాపారంలొకి ప్రవేశించిన ప్రతివాడికీ శిఖరం చేరుకోవాలని ఉంటుంది - అది అతని హక్కు కూడాకస్టమర్లని మోసం చెయ్యని వ్యాపారులకి కీర్తి కిరీటాలు పెట్టడం ఎంతమాత్రం తప్పు కాదు.అయితే, ఈ రహదారిని వదిలి దొడ్డిదారికి మళ్ళిన రాక్ ఫెల్లర్ చేసిన మొదటి దాడికి అందరూ లొంగలేదు -.ఆ మిగిలిన వాళ్ళని తన దారి నుంచి తప్పించటానికి రాక్ ఫెల్లర్ పతనం వైపుకి రెండో మెట్టును దిగాడు.తన సరుకుల రేట్లని అమాంతం తగ్గించాడు, కొన్ని చోట్ల 80 % వరకు తగ్గించేశాడు!ఈ వ్యూహం తిరుగులేని ఫలితాన్ని ఇచ్చింది.కంపెనీల బోర్డు రూముల్లో జరిగే రహస్యమైన కుట్రలు వీటిమీద ఆసక్తి గానీ వీట్ని పట్టించుకునే తీరిక గానీ లేని కస్టమర్లకి ఎలా తెలుస్తాయి?అలా 1880 నాటికి అమెరికా లోని Northeastern oil belt  మొత్తం రాక్ ఫెల్లర్ హస్తగతమయి మొత్తం దేశంలోని ఆయిల్ నిల్వలు 90% ఇతని అధీనంలోకి వచ్చేశాయి.

         కధ ఈ మలుపు తీసుకునే సమయానికి అతని శక్తి సామర్ధ్యాలు అందరికీ తెలిసిపోవటంతో రైలు మార్గాల అధినేతల్ని వ్యక్తిగత పరిచయాలతో మచ్చిక చేసుకుని వారి రైళ్ళలో సరఫరా అయ్యే తమ సరుకులకి రవాణా ఖర్చుల్లో రాయితీలని సాధించుకోగలిగాడు.అప్పటికే అతని ఆదాయపు విస్తృతిని బట్టి చూస్తే ఇఒది కక్కుర్తి పనిలానే తోస్తుంది.కానీ రాక్ ఫెల్లర్ మరియూ అతన్ని ఇమిటేట్ చేస్తున్న వాళ్ళు ఒక ప్రత్యేకమైన ధోరణిలో ఉంటారు."నేను పెట్టాలనుకున్న పరిశ్రమకి కావలసిన భూవసతి అయితే ఉచితంగా గానీ లేదంటే అతి తక్కువ ఖర్చుతో గానీ సమకూడాలి,నాకు అవసరమైన కార్మికులూ సాంకేతిక నిపుణులూ అయితే ఉచితంగా గానీ లేదంటే అతి తక్కువ జీతాలకి గానీ పని చెయ్యాలి,సరుకుల్ని తయారు చెయ్యటానికి అవసరమైన ముడిసరుకులూ అదనపు వనరులూ అయితే ఉచితంగా గానీ లేదంటే అతి తక్కువ ఖర్చుతో గానీ వచ్చి పడాలి, నాతో పోటీ పడి నన్ను ఒత్తిడికి గురి చేసే పాపాత్ములు రంగంలో ఉండకూడదు,ప్రభుత్వం నా లాభాల మీద పన్నులు వెయ్యకూడదు!" - మనకి ఇవన్నీ కలలో తప్ప ఇలలో జరగటానికి వీల్లేని గొంతెమ్మ కోరికలు అనిపిస్తాయి గానీ వీళ్ళకి అప్పులిచ్చి ప్రోత్సహించే బ్యాంకింగ్ వ్యవస్థ మాయాజాలం వల వీళ్ళ కోరికలు చక్కగా నెరవేరుతూనే ఉన్నాయి!

          అయితే కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి నన్నెవరూ చూడలేదనుకున్నట్టు జరిగిన ఈ తెరచాటు భాగోతం కేవలం ఆయిల్ పరిశ్రమ ఒక్కటే గాక అన్ని రంగాల పరిశ్రమల అధిపతుల్నీ ఉలిక్కి పడేలా చేసింది - వ్యతిరేకులు బలం పుంజుకున్నారు,కోర్టుల్లో antitrust క్లాజులతో కేసులు వేశారు, మీడియాలో వ్యతిరేక ప్రచారం వూపందుకుంది, రాజకీయ నాయకులు కూడా Standard Oil సంస్థ విజృంభణని కట్టడి చేసే కొత్త చట్టాలను చెయ్యటానికి సిద్దహమయ్యారు.రాక్ ఫెల్లర్ మాత్రం నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇఛ్చయే గాక నాకేటి వెరపు అన్న చందాన తన విజయ పరంపరని కొనసాగిస్తూనే ఉన్నాడు.1882లో New Jersey నగరంలో Standard Oil Trust అనే సంస్థని స్థాపించాడు.ఈ సంస్థ 40 స్థానిక కంపెనీల్లో వాటాల్ని కొనుగోలు చేసింది.ఇది నిజానికి రాక్ ఫెల్లర్ సాధించిన విజయాలకి మకుటాయమానమైనదని చెప్పవచ్చు - రాక్ ఫెల్లర్ కూడా తన విజయామృత దరహాస రుచుల్ని చూసుకుని పులకించి పోవటం కోసం బ్రాడ్వేలో హెడ్ క్వార్టర్స్ కట్టాడు - ఆ మధుర క్షణాల నాటికి అతను 20,000 బావులకి యజమాని, అతను వేసిన పైప్ లైన్ల పొదవు 4,000 మైళ్ళు, అతని ఉద్యోగులు 100,000 పైన ఉన్నారు!

          ఆ మధుర క్షణాలను అనుభవించిన కొద్ది కాలంలోనే కరి మింగిన వెలగపండులా అతని ప్రాభవం ఇంటా బయటా సన్నగిల్లిపోవటం కూడా మొదలైంది.రష్యాలోనూ ఆసియాలోనూ పెద్ద స్థాయిలో బయటపడిన ఆయిల్ నిక్షేపాలతో జువ్వలా రంగంలోకి దూసుకొచ్చిన Rothschild కుటుంబం అమెరికాని కూడా ఆక్రమించాలని చూస్తున్నది.పులి మీద పుట్రలా 1890 కల్లా Sherman Antitrust Act సభలో ఆమోదం పొంది బ్యాంకింగ్ వ్యవస్థలోని complex legal structure వల్ల అన్ని కంపెనీల వ్యవహారాల్నీ లొసుగులు లేకుండా నిర్ధారించుకోవటం వంటి ప్రక్రియలు కొనసాగి కొనసాగి ఎట్టకేలకి 1911 నాటికి Standard Oil కంపెనీని ముక్కలు ముక్కలు చేసి రాక్ ఫెల్లర్ దూకుడుని ఆపగలిగారు!

         అయితే విచారణ ఇలా నత్తనదక నడవటం వల్ల రాక్ ఫెల్లర్ ప్రతికూలతని అనుకూలత కింద మార్చుకుని తంతే గారేల్ బుట్టలో పడ్డట్టు ఇతరులు తనని దెబ్బ కొట్టాలనుకున్న ప్రయత్నం నుంచి కూడా రెట్టింపు లాభాల్ని పిండుకుని చచ్చేవరకూ చిద్విలాసంగానే బతికాడు.తన ఆస్తుల్నీ  వాటాల్నీ క్యాష్ చేసుకుని కంపెనీతో అధికారికమైన సంబంధాన్ని తెంచేసుకున్నాడు - చివరి ఇరవై సంవత్సరాల్లో షేర్ హోల్డర్లకి అర బిలియన్ డాలర్లు డివిడెండ్ అతని కంపెనీ ఇవ్వగలిగిందంటే అతని తెలివితేటలూ చురుకుదనమూ ఎంత గొప్పవో కదా!సుప్రీం కోర్టు anticompetitive practices అనే కారణంతో Standard Oilని రద్దు చేస్తూ 34 చిన్న చిన్న ముక్కల కింద విడగొట్టినప్పటికీ రాక్ ఫెల్లర్ ఆ కంపెనీల్లో కొనుగోలు చేసిన stakes మాత్రం అలాగే ఉంచేసింది - బ్యాంకింగ్ చట్టాల ప్రకారం అది కోర్టు పరిధికి అతీతమైనది.అంతటితో రాక్ ఫెల్లర్ నడక ఆగిపోయింది, కానీ అతను పరాజితుడు కాదు.ఎందుకంటే, నష్టాన్ని కూడా లాభం కింద మార్చుకున్న చతురత వల్ల అక్కడ విడగొట్టి ఏర్పాటు చేసిన చిన్న చిన్న కంపెనీల పరిమాణమే చాలా ఎక్కువ. తర్వాత వాటిలో అవి విలీనం అయిపోయిన మార్పులు చేర్పులతో సహా రాక్ ఫెల్లర్ అధిపత్యం కింద ఉన్న అన్ని కంపెనీల మొత్తం విలువ $400 బిలియన్లు!

       ఇప్పటికే మీకు బ్యాంకింగ్ వ్యవస్థ నడుస్తున్నది సామాన్యుల సంక్షేమం కోసం కాదనీ ప్రజలను దోచుకునే రాక్ ఫెల్లర్ లాంటి వారికే అవి ప్రోత్సాహం ఇస్తాయనీ అర్ధమై ఉంటుంది.బ్యాంకింగ్ వ్యవస్థని అలా రూపు దిద్దింది యూదులు.ఇప్పటికీ ఆ లక్ష్యాన్ని మార్చటానికి వ్యతిరేకించే యూదుల వెనక ఇల్యూమినాటీ భావజాలం ఉంది - ఈ మూడిళ్ళ ముచ్చట్లని వచ్చే భాగంలో చెప్తాను.

(this is the seventh part of a series on macro economy!)

Sunday, 5 May 2019

"అప్పు చేసి అప్ప్పుకూడు తినరా ఓ నరుడా!" అని ప్రజాప్రతినిధులే బరితెగించి చెప్తుంటే దేశపు జాతీయఋణం ఎట్లా తీరుతుందిరా దేవుడా?

      ఆర్ధికశాస్త్రం మీద గౌరవం ఉండి సత్యం పట్ల నిబద్ధులై ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకుందామనే నిజాయితీ గల అనుభవజ్ఞులైన ఆర్ధిక శాస్త్ర విశ్లేషకులు ప్రస్తుతం మనల్ని కలవరపెడుతున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కల్పిస్తున్న సమస్యలకు సూచించిన అన్ని పరిష్కారాల్ని క్రోడీకరించి చూస్తే నాకు మూడు ముఖ్యమైన సూచనలు కనిపించాయి.కరెన్సీ తయారీని బ్యాంకుల నుంచి తొలగించి ప్రభుత్వమే మూలధనపు ద్రవ్యనిల్వలనుంచి తయారుచేసి అందించడం - ఇది ప్రభుత్వాధినేతలు చెయ్యాల్సిన పని,అనుత్పాదక రంగాలను ప్రోత్సహించి inflation సృష్టించటానికి బదులు పెట్టుబడుల్ని/ఋణాల్ని ఉత్పాదక రంగాలకు మళ్ళించాలి - ఇది బ్యాంకర్లు చెయ్యాల్సిన పని,  మొదట పొదుపు చేసి పిదప మదుపు పెట్టటం - ఇది సామాన్యప్రజలు చెయ్యాల్సిన పని.వినగానే బాగుండి ఆచరిస్తే మేలు జరుగుతుందనే ఆశను రగిలిస్తున్నప్పటికీ ఇవి మన దేశపు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల వంటివే!

        ఎందుకంటే, ప్రాచీన కాలపు venitian blaack oligarchy ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో అప్పటి కయ్యది సుకృతం అన్నట్టు అనేక చారిత్రక దశలలో knights templar, freemaasontry, illuminati వంటి  రాజకీయం,ఆర్ధికం,ఆధ్యాత్మికం కలిసిపోయి రూపు దిద్దుకున్న చిన్న చిన్న సాలీళ్ళను సృష్టించుకుని నేటికి వీటన్నిటి సంకీర్ణ రూపమైన పెద్ద సాలీడును తలపిస్తున్న British financial oligarchy యొక్క స్వభావం కొన్ని వందల యేళ్ళ పాటు నక్కలో ఉండే జిత్తులమారి తనాన్నీ, ఎలుగుబంటిలో ఉండే మొండితనాన్నీ, తోడేలులో ఉండే క్రూరత్వాన్నీ, వేటకుక్కలో ఉండే తెగింపునీ, పులిలో ఉండే ఓపికనీ, కోతిలో ఉండే వెకిలితనాన్నీ, ఒంటెలో ఉండే సోమరితనాన్నీ, ఏనుగులో ఉండే భారీతనాన్నీ, సింహంలో ఉండే గర్వాన్నీ అలవాటు చేసుకునే ప్రయత్నంలో మానవత్వాన్ని పోగొట్టుకోవడం వల్ల అలా తయారైంది - సుభాషితాలతోనూ సంధి ప్రతిపాదనలతోనూ మార్చడం గానీ ఏమార్చడం గానీ సాధ్యం అయ్యే పని కాదు. మానవమాత్రులకి వాళ్ళని గెలవటమే కాదు, వాళ్ళకి ఎదురు నిలబడటం కూడా సాధ్యం కాదు. Europeలో,Britainలో కూడా కొందరు ప్రయత్నించారు. కానీ, సమయం చాలకనూ వనరులు లేకనూ విరమించుకున్నారు.అసలు ఎదిరించాలని అనుకోని బుద్ధిమంతులు మాత్రం చాలా సౌకర్యాలు పొందారు!

         ప్రాచీన కాలపు అమెరికా చరిత్ర చాలా చిన్నది.కొలంబస్ ఇండియాకు దారి కనుక్కోవడానికి బయల్దేరి దారి మధ్యలో సరిగ్గా తనకు తెలిసిన అప్పటి భారతీయ సంస్కృతిని పోలిన సంస్కృతిని ప్రతిబింబిస్తున్న జనసమూహాన్ని చూసి గమ్యం చేరినట్టు మురిసిపోయి అక్కడి ప్రజలకు "రెడ్ ఇండియన్లు" అని పేరు పెట్టి తాను ఆశించిన వైభవం కనబడక  అసలైన ఇండియాను కనుక్కోవడం కోసం అక్కడినుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలాకాలం పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది.అయితే, బోస్టన్ టీ పార్టీ అనే సంచలనాత్మకమైన సన్నివేశం నుంచీ మనకు తెలుస్తున్న ఆధునిక కాలపు ఆమెరికా చరిత్ర సమస్తం సామాన్యులు బ్యాంకింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలతో ముడిపడి ఉంటుంది!

        అప్పటికి చాలాకాలం క్రితమే అమెరికాలో కాలనీలు ఏర్పాటు చేసుకుని ఆఫ్రికా నుంచి బానిసల్ని తెచ్చుకుని పని చేతించుకుని తెగ బలిసిన అమెరికన్ కాలనిస్టులు బ్రిటిష్ ప్రభుత్వం తమ మీద విధించిన పన్నులకి అలిగి December 16, 1773న 342 బ్రిటిష్ టీ కార్టన్లని సముద్రంలోకి విసిరి ముంచేసి నిరసన ప్రకటించడంతో నిప్పురవ్వ రగులుకుని క్రమేణ అంతర్యుద్ధం కింద మారి తర్వాత స్వాతంత్య్రపోరాటం రూపం తీసుకుని జార్జి వాషింగ్టన్ నేతృత్వంలో స్వతంత్రదేశపు హోదాని పొందింది.అయితే, ఇది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల నుండి ఉద్భవించిన ధర్మయుద్ధం కాదు, కేవలం తమ మీద ప్రభుత్వం పెత్తనం చెయ్యడాన్ని సహించలేని అమెరికాలోని 13 కాలనీల వ్యాపారుల కూటమి ఇల్యూమినాటి, ఫ్రీ మాసన్రీ వంటి మతసంస్థల సాయంతో తమ స్వార్ధానికి ప్రజల క్షేమం అనే ముసుగు తొడిగేసి చేసిన మర్మయుద్ధం - అమెరికన్ కరెన్సీ మీద ఇల్యూమినాటి పిరమిడ్ కొట్టొచ్చినట్టు కనబడటమే అందుకు బలమైన సాక్ష్యం!

         ఆదినుంచీ అనేకమంది అమెరికన్ మేధావులు ప్రజల తరపున ఈ దుర్మార్గమైన బ్యాంకింగ్ సిస్టం మీద పోరాడుతూనే ఉన్నారు, ఒకసారి గెలుస్తున్నారు, అంతలోనే అటువైపున ఉన్నవారి చాటుదెబ్బలకి బలై ఓడిపోతున్నారు.దాదాపు 19వ శతాబ్దపు చివరి దశకంలో Rothschilds అత్యంత ధనిక దేశమైన అమెరికాని తన పట్టులోకి తెచ్చుకోవాలని అనుకుంది. 1900 దరిదాపుల Paul Warburg అనే సమర్ధుణ్ణి Kuhn Loeb & Co అనే banking firmతో కలిసి పనిచెయ్యమని U.Sకి పంపించింది.  మొదట Jacob Schiff, Paul Warburg కలిసి FEDERAL RESERVE BANK పేరుతో ఒక private central bank స్థాపించటం కోసం ప్రచారం మొదలుపెట్టారు.

        1907లో New York Chamber of Commerce ముందు Jacob Schiff గంభీరంగా “If we don’t get a central bank with sufficient credit control, this country will experience the most severe and far-reaching financial panic in its history!” అని ప్రకటించాడు. వాళ్ళు ఇలా చెప్పారు, అది అలా జరిగింది! monetary crisis మొదలైంది, financial market అల్లకల్లోలమైంది, దేశం మొత్తంలో పదిల వేల సంఖ్యలో జనం సర్వనాశనమైపోయారు - ఒక్క దెబ్బకి రెండు పెట్టలు, ఇక్కడి నష్టం లాభం రూపంలో Rothschildsకి వెళ్ళడమూ central bank  ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలియజెయ్యడమూ వెంటవెంటనే జరిగిపోయాయి.  FEDERAL RESERVE SYSTEM (the private central bank of the U.S.) యొక్క విధి విధానాలకి సంబంధించిన final version మొత్తం Georgiaలోని Jekyll Islandలో ఉన్న Morgan Estateలోనే రూపు దిద్దుకుంది.

         అది December of 1910, Nelson Aldrich అనే senator  Paul Warburg,Frank Vanderlip, Benjamin Strong, Henry Davidson, Charles Norton, Abe Andrews  అనే ఆనాటి ప్రపంచపు మొత్తం సంపదలో నాలుగో వంతును మూటగట్టిన ఆరుగురితో కలిసి New York నగరంలోని ఒక private train car ఎక్కాడు.వాళ్ళు Georgiaలోని Jekyll Islandలో ఉన్న Morgan Estate వెళ్ళారు.అక్కడ తొమిది రోజులు గడిపి తమను అక్కడికి పిలిపించుకున్న మేధావి సూచనల ప్రకారం,federal reserve sustemకి ముసాయిదా ప్రతిని రూపొందించారు.ఈ ముసాయిదా ప్రతిలో ఉన్న దుర్మార్గం తెలియాలంటే తర్వాత కాలంలో wanderlip తమ Jekyll Island ప్రయాణం గురించి చెప్పిన మాటల్ని వింటే చాలు - "I was aas secretive - indeed, as furtive - as any conspirator.Discovery, we knew, simply must not happen , or else all our time and effort would be wasted.If it were to be exposed that our particular group had got together and written a banking bill, that bill would have no chance whatever of passage by congress." అంటే, వాళ్ళు అంత రహస్యం పాటించటానికి కారణం అమెరికన్ ప్రజలకి వీళ్ళ అసలు సంగతి తెలిసి వ్యతిరేకించే కృతనిశ్చయంతో ఉండటమేనని తెలుస్తూనే ఉన్నది కద!అప్పటికే "Wherever a central bank went, there would be wealth inequality, wild swings between economic booms and bursts and after each burst, those in the top of cociety mysteriously came out richer,while everyone else got poorer" అనే సత్యాన్ని Bank of England చరిత్రని బట్టి తెలుసుకుని ఉన్నారు.

         చాలా మామూలుగానే  Aldrich Bill సభలోకి వచ్చినప్పుడు అప్పటికే "తగినంత స్థాయిలో అప్పు ఉండటం ఆర్ధికరంగానికి ఉత్సాహం తీసుకొస్తుంది, అసలు అప్పు లేకపోతే భద్రత ఎక్కువైపోయి ప్రజలకు బద్ధకం పెరిగిపోయి ఆర్ధికాభివృద్ధి నిలవనీరులా ఉంటుంది" అని ప్రగల్భిస్తున్న ఈ మహనీయతేజుడైన ఋణదార్శనికుడి ప్రమేయాన్ని చూసి ప్రమాదం పసికట్టిన ఇటువైపు మేధావులు బిల్లుని తిరక్కొట్టెయ్యాలని అనుకున్నారు.అటువైపు మేధావులు కూడా ప్రమాదం పసికట్టి ఇద్దరు మిలియనీర్ మిత్రుల్ని రాయబారం పంపించి Federal Reserve Act అని పేరూ రూపూ మార్చి పై స్థాయిలోని వారి వ్యతిరేకతని తగ్గించారు.దీని తర్వాత కింది స్థాయిలో ఉన్న అసంఖ్యాక ప్రజానీకాన్ని మోసం చెయ్యటానికి ఒక బహుముఖీనమైన అంతర్నాటకం నడిపించారు.దాని ప్రకారం దేశంలోని బ్యాంకర్లు అందరూ ఈ బిల్లు అవ్ల తమకు ముప్పు వస్తుందన్నట్టు ఆందోళన నటించారు.పేపర్లలో ఈ బ్యాంకర్ల ఏడుపుల్ని చూసిన అమాయకులకి బ్యాంకులు ఇంత వ్యతిరేకతను చూపిస్తున్నాయంటే అది తమకు అనుకూలమైనదని అనుకున్నారు.ఈ సజీవ నటనని మరింత తారాస్థాయికి తీసుకెళ్తూ బ్యాంకుల తోకల్ని కత్తిరిస్తున్నట్టు కనిపించే క్లాజుల్ని బిల్లులో చేర్చారు.ఆఖరికి 1913 డిసెంబర్ 23న అమెరికన్ కాంగ్రెసు సభ్యులలో చాలామంది శెలవులో ఉన్న శుభదినాన ఫెడరల్ రిజర్వ్ యాక్ట్ సభ ఆమోదం పొంది చట్టరూపం దాల్చేసింది!

         అమెరికాతో వ్యాపార వ్యవహారాలు జరపాలని కోరుకునే వారంతా తమ లావాదేవీల కోసం సంప్రదించాల్సిన  Federal Reserve Systemని ఏర్పాటు చేసేశారు - Paul Warburg మొదటి chairman అయ్యాడు.FEDERAL RESERVE SYSTEM (the private central bank of the U.S.) యొక్క విధి విధానాలకి సంబంధించిన final version మొత్తం Bank of England  యొక్క విధి విధానాలకి ప్రతిరూపం.శ్రీమాన్ అంబేద్కర్ మన దేశపు రిజర్వ్ బ్యాంక్ రూపకల్పనలో ఇదే చట్రాన్ని అనుసరించారు. పాటిస్తున్న ఆర్ధిక చట్రం మనసా వాచా కర్మణా ప్రజల కోసం కాక బ్యాంకుల యజమానుల కోసం నడిచేటట్టు  ఉంటే ఆర్ధిక విశ్లేషకులకు గానీ రాజకీయ నాయకులకు గానీ ప్రజల పట్ల ఎంత నిజాయితీ ఉన్నా ఏమి లాభం?

         ఇంతకీ, Georgiaలోని Jekyll Islandలో ఉన్న Morgan Estate ఎవరిదో కాదు, John Rockefellar అనే ఇతరుల నుంచి చిన్న స్థాయి పోటీని కూడా సహించలేని మోనాపలిస్ట్ ఎకానమీ సిద్ధాంతకర్త గారిది - "Comptetion is a sin!" అనేది ఆయనగారి సుస్థిరమైన అభిప్రాయం.ఆ తరహా వ్యాపారస్థుల జీవితాలకు దర్పణం పట్టే ఆయన గారి సంక్షిప్తజీవితచరిత్రను వచ్చే భాగంలో చెప్తాను. 

(this is the sixth part of a series on macro economy!)

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...