Friday, 22 September 2017

అనగననగ రాగ మతిశయిల్లు, తినగ తినగ వేము తియ్యగనుండు!

అనగననగ రాగ మతిశయిల్లు,
తినగ తినగ వేము తియ్యగనుండు!

అందరికీ నిత్యామీనన్ లాంటి పెళ్ళామే రావాలా?
వచ్చినదాన్నే నిత్యామీనన్ అనేసుకుంటే పోలా!

అందరికీ రానా, ప్రభాసు లాంటి మొగుళ్ళే వస్తారా?
కట్టుకున్నవాణ్ణే సినిమాహీరోలా చూసుకుంటే పోలా!

చూసిన కొద్దీ సరికొత్తగ కనిపించడమే అందం,
చూడని వేళల బెంగగ అనిపించడమే బంధం!

చీరైనా స్కర్టైనా జీన్సైనా వీనెక్ బ్లౌజైనా
విప్పకనే విప్పినట్టు కవ్వించడమే జాణతనం -
అమ్మడూ!జాణతనంలో నీ స్కోరెంత?

మూసీ మూయని కనురెప్పల చాటున
తొణికిసలాడే చెలి చిరునవ్వుల సిరిమువ్వల్ని
ఏరుకుని దాచుకోవడమే
సరసులకి మదనుడు వేసిన పందెం - 
తమ్ముడూ!పురుషత్వంలో నీ స్కోరెంత?

ఆనందో బ్రహ్మా, బ్రహ్మేతి వ్యజానాత్ -
శృంగారమే అసలైన మోక్షమార్గం!
(హరి ఓం సత్)

Saturday, 9 September 2017

ప్రపంచ హిందువులారా ఏకం కండి! గబ్బుసెక్యులరిజం నుంచి విముక్తులు కండి - మీకు పోయేది లేదు అవమానం తప్ప!

          హిందూమతం అని ఇప్పుడు పిలువబడుతున్నది మతం కానే కాదు - ధర్మం, సనాతన ధర్మం!నేను నా పేరు హరిబాబు అని చెప్పుకున్నాక మీరు నన్ను ఆ పేరుతోనే పిలవాలి - కాదు, ఆ పేరు నాకు నచ్చలేదు,సుబ్బారావు అని పిలుస్తాను అంటే ఎట్లా ఉంటుంది?నాకు ఒళ్ళు మండుతుంది!వాడికి నాతో పనివుండి ప్రాణం పోతుందని సాయం అడిగినా పట్టించుకోనంత తిక్క నాకు రేగితే నష్టం ఎవడికి?అబ్రహామిక్ లేదా సెమిటిక్ మతాలని అనుసరించే వాళ్ళు సనాతన ధర్మం గురించి అట్లాగే ప్రవర్తిస్తున్నారు - తొలిసారి ఈ జీవన విధానం గురించి తెలిసినప్పుడు వాళ్ళకి అర్ధం కాలేదు.అర్ధం కాకపోతే మరింత ఓపిక చేసుకుని అర్ధం చేసుకోవాలి, కానీ అంత తీరిక లేక వాళ్ళకి తోచిన పేరు వాళ్ళు పెట్టేసుకుని వాళ్లకి అర్ధం కాలేదు గాబట్టి ఇదంతా అర్ధం లేనిదని తీర్మానించేసుకున్నారు.

          వాళ్ళ దృష్టిలో ఒక దేవుడు,ఒక పుస్తకం,ఒక ప్రవక్త,ఒక నమ్మకం,ఒక భయం,తమ లాంటి వాళకి ఒక స్వర్గం,తమకి నచ్చని వాళ్ళకి ఒక నరకం ఉండటం వల్లనే మనుషులు భయపడి మంచితనం అలవాటు చేసుకుంటారనే విషయాలు లేకుండా ఈ ధర్మం,మోక్షం లాంటివి అయోమయం అనిపించి అది ఆ సింధు ప్రాంతపు వాళ్ళ మతం కాబోలుననుకుని పెట్టుకున్న పేరు సింధు మతం - ఒత్తులు పలకలేని తనంతో మారి తయారయినది హిందూమతం!.తీరు గురించి తప్ప పేరు గురించి పట్టింపు లేనందువల్ల మనం కూడా అప్పుడప్పుడు హుందువులం అని అనేసుకుంటున్నాం, తప్పు లేదు లెండి!ఈ అబ్రహామిక్ మతాలు పుట్టక ముందు ప్రపంచం మొత్తాన్ని భారతీయ సనాతన ధర్మమే ప్రభావితం చేసింది.ఎంతటి సంక్లిష్టమైన ప్రశ్నకైనా శాస్త్రీయమైన జవాబును చెప్పగలిగిన హేతుబద్ధతయే అప్పటికీ ఇప్పటికీ సనాతన ధర్మాన్ని ఒక గౌరవప్రదమైన స్థాయిలో నిలబెడుతున్నది - సృష్టి గురించి ఆయా మతాలు చెప్పే వివరణయే అందుకు సాక్ష్యం!

          క్రైస్తవులు సృష్టి క్రీస్తు పూర్వం నాలుగువేలయేళ్ళ క్రితమే జరిగినట్టు తమ మతగ్రంధమైన బైబిలుని ఉటంకించి చెబుతారు,అంటే ఇప్పటికి ఆరువేలయేళ్ళ క్రితమే సృష్టి జరిగింది బైబిలు ప్రకారం.వారి తర్వాత ఆరు వందల సంవత్సరాలకి పుట్టుకొచ్చిన ఇస్లాము సృష్టి మొదలై యేడువేలయేళ్ళు మాత్రమే గడిచాయంటుంది అప్పుడు పుట్టిన అంతిమఋషి చెప్పిన ఖురాను ప్రకారం.ఆధునిక శాస్త్రజ్ఞులే సృష్టి గురించి ఆ మతాలు చెప్తున్నవి తప్పని కొట్టి పారేస్తున్నారు,అదే ఆధునిక శాస్త్రవేత్తలు సనాతన ధార్మిక సాహిత్యం విశ్వసృష్టి గురించీ సూర్యచంద్రాదుల వ్యాసార్ధాల గురించీ గ్రహాల పరిభ్రమణ వేగాల గురించీ గ్రహణాల గురించీ చెప్పీన లెక్కలు ఖచ్చితమైనవని నిర్ధారించి చెబుతున్నారు.ప్రకృతి పరిశీలన, శాస్త్రీయ విజ్ఞానం, భయరహితులైన ప్రజల స్వచ్చంద నైతిక ప్రవర్తన, ఉదారమైన శ్రేయోరాజ్య నిర్వహణ మొదలైన ఏ విషయాన్ని తీసుకున్నపటికీ దీని కాలిగోటికి కూడా సరిపోలని వాటిని దీనితో సమానం చెయ్యాలని ప్రయత్నించడం కూడా సనాతన ధర్మాన్ని అవమానించడమే అవుతుంది!

          వాళ్ళు సృష్టి జరిగినదని చెబుతున్న కాలానికి చాలా ముందు నుంచే భారతదేశంలో మహోన్నతమైన నాగరికతని సాధించుకుని మహానగరాలు నిర్మించుకుని అంగరంగవైభోగాన్ని చవి చూస్తున్నారు భారతీయులు.ఈ రెండు మతాలు పుట్టడానికి కొన్ని వేల అసంవత్సరాల నాటి కాలపు వైదిక సాహిత్యంలో మా అంతిమఋషి గురించి ఉన్నది, మా ఏసు క్రీస్తు గురించి ఉన్నది అని చెప్పుకుంటున్నారు - దాని అర్ధం ఏమిటి?అలా గనక చెప్పి వుంటే అది వైదిక సాహిత్యపు గొప్పదనం అవుతుందే తప్ప దానివల్ల వీళ్లకి గొప్పదనం యెట్లా వస్తుందనే ఇంగితజ్ఞానం కూడా లేదు వాళ్ళకి!

          మక్కా గుడి చరిత్రనే తీసుకోండి,అహ్మద్ ఖురేషీ మేనమామ రచించిన శివస్తోత్రం యొక్క సాక్ష్యం వల్లనూ పూర్వ ఇస్లామీయ అరబిక్ సాహిత్యపు ప్రస్తావనల వల్లనూ అది శివాలయమేననేది వాస్తవం!అయితే,కాలక్రమేణ హిందువులలో ప్రచారం పట్ల ఉన్న నిరాసక్తత వల్ల మక్కా గుడికి  సనాతన ధర్మంతో సంబంధం తెగిపోయింది - అక్కడ గుడి ఉండటం,ఆ పూజల కోసం ఎప్పుడో ఏర్పరచిన విధుల్ని పాటించటం తప్ప ఇంకేమీ తెలియక పోవడం వల్లనే ముసలి waraqaతో పాటు నలుగురు జ్ఞానులూ "మనం పాటిస్తున్నది మతం కాదు!" అనే నిర్ధారణకు వచ్చి తమ చుటూ ఉన్న మతాలలో ఉన్న తప్పులు లేని కొత్త మతం కోసం వెతికారు, ఆ వెతుకులాడిన వాళ్ళ వరసలోనే అహ్మద్ ఖురేషీ ఇస్లామును స్థాపించాడు.మనం ఇస్లాం చెత్తది అని అనుకుంటే మిగిలినవి ఇస్లాము కన్న చెత్తవి గనకనే ఇస్లాము బలపడి ఉండొచ్చు - ఉన్నతమైన దాన్ని పరిచయం చేసి దాన్ని వాళ్ళు ఒప్పుకోనప్పుడు కదా ఎదటివాళ్ళని తప్పు పట్టాల్సింది.తమ మతం గురించి గొప్పగా చెప్పుకోవడానికి నిన్నటి తరం హిందువులు సిగ్గుపడటం వల్లనే భారత దేశంలో ఇప్పటి తరం హిందువులు అవమానాలకి గురై అగచాట్లు పడుతున్నారు.
Pura Ulun Danu Bratan - The Lake Temple Bali
          ఇండొనేషియాలో హిందూమతం ఆనవాళ్ళు క్రీ.పూ 5వ శతాబ్దం నుంచీ ఉన్నాయి.తర్వా కాలంలో మొదట బౌద్ధం వచ్చి వెనక్కి నెట్టేసి క్రీ..శ 17వ తాబ్దంలో ఇస్లాము విజృంభించేవరకు బౌద్ధమే పెత్తనం చేసింది, అక్కడ కూడా వ్యాపించే లక్షణం లేకపోవడం వల్ల అధికారం కోసం అర్రులు చాచడం లాంటివి చెయ్యకుండా తమ సంప్రదాయాన్ని తాము కాపాడుకుంటూ వస్తున్నారు బాలినీస్ హిందువులు!
a traditional balinese village
          సనాతన ధర్మంలో ముఖ్యమైన సిద్ధాంతం "విశ్వంలో క్రమత్వాన్ని స్థాపించేద్త్ ధర్మం,విశ్వాన్ని అస్థిరపరచేది అధర్మం - ఈ రెండింటి మధ్యన సమన్వయాన్ని సాధిస్తూ జీవించడమే మానవుల లక్ష్యం!" అనే దాన్ని వీరు కూడా పాటిస్తున్నారు.అయితే బాలినీయులు విశ్వాన్ని మూడు పొరలని అన్నారు - స్వర్గం అనేది దేవతల నివాసం, భువం అనేది మానవుల నివాసం, భుర్ అనేది దానవుల నివాసం.కాలం గడిచే కొద్దీ స్థానిక చింతనాపరుల వల్ల కొన్ని కొత్త విషయాలు చేరినప్పటికీ వివాహాది క్రతువులూ ఆచార వ్యవహారాలూ సనాతన వైదిక సంప్రదాయం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి.పైన కనబడుతున్న శివాలయమే కాదు బాలి ద్వీపంలో ఉన్న ఆన్ని దేవాలయాలూ ఎంతో అందంగా ఉంటాయి!Besakih Temple అన్నిటికన్న పెద్దదీ విశిష్తమైనదీనూ!
Besakih Temple
          విశేషమేమిటంటే, ఆసియా ఖండానికి బయట ఎక్కువమంది హిందువులు ఇండోనేషియాలోనే ఉన్నారు!2010లో ఇండోనేషియా ప్రభుత్వం వారి అధికారికమైన లెక్కల ప్రకారం అన్ని దీవులలో కలిపి 10 మిలియన్ల మంది హిందివులు ఉన్నారు. భారత దేశంలో సెక్యులరిస్టులు గీతని గౌరవించడానికే ఏడిచారు,కానీ ఇండొనేషియాలో ప్రభుత్వం గుర్తించిన ఆరు అధికారిక మతాల(official religions)లో హిందూ మతం ఒకటి!

          ముస్లిములు ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ బాలినీస్ హిందువుల్ని orang yang belum beragama (people without religion) అని పిలిచి ఇస్లాములోకి మారిపొమ్మని శాసించినప్పుడు స్థానిక బాలినీస్ ప్రభుత్వం దాన్ని ధిక్కరించి తనకు తనే స్వయం ప్రతిపత్తిని ప్రకటించేసుకుంది.అంతకు ముందు బాలి ద్వీపాల్ని పరిపాలించిన డచ్ వాళ్ళనీ,ఇండియానీ సాయం కోరింది.భారత్-బాలి సాంస్కృతిక సంబంధాల వల్ల క్రీ.శ 1950లో అహింసామార్గంలోనే ఉద్యమం మొదలుపెట్టి పట్టు వదలకుండా నిలబడి ఆఖరికి 1958లో ఇండొనేషియన్ ప్రభుత్వానికి పెట్టుకున్న ఒక తెలివైన ఉమ్మడి దరఖాస్తుతో విజయం సాధించారు!అందులో వారు "ఓం తత్ సత్ ఏకమేవాద్వితీయం" అన్న వాక్యాన్ని ఉదహరించారు.అది ఇస్లాము యొక్క monothweism సిద్ధాంతంతో విభేదించడం లేదు గనక ఇండొనేషియా ప్రభుత్వానికి బాలినీస్ హిందూమతాన్ని గుర్తించక తప్పలేదు.
The Balinese Om symbol
          అసలు టిక్కు యేంటంటే,"Om, thus is the essence of the all prevading, infinite, undivided one" అని అర్ధం వచ్చే ఈ శ్లోకం ఇండొనేషియా ప్రభుత్వానికి అది ఏకత్వాన్ని సమర్ధిస్తున్నట్టున్నూ బాలినీస్ హిందువులకి చతుర్వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలతో కూడుకొన్న తమ బహుళ దేవతా మూర్తుల ఆలయ ప్రతిష్ఠాపనకి వీలు కల్పించేట్టున్నూ ఉపయోగపడటం - అద్దిరబన్నా గువ్వలచెన్నా, ఏం తెలివి చూపించారు బాలినీస్ హిందువులు!

          ఈ మతాలు పుట్టక ముందు ప్రపంచ మంతటా సనాతన ధర్మమే వ్యాపించి తనను పాటించిన వారికి నిజమైన శాంతిని ప్రసాదించి ఎల్లర నుంచి గౌరవాదరరణలు పొందింది.సంఖ్యాబలం పెంచుకోవటం, మందబలం పెంచుకుని అనుకూల ప్రభుత్వాలని ఏర్పరచుకోవటం, ప్రజల నుంచి బలవంతపు విధేయత కోసం అడ్డదారులు తొక్కడం, తమ దేవుడు తమ మతం వారికే స్వర్గాన్ని ఇచ్చి ఇతర మతస్తుల్ని నరకంలోకి తోసి శిక్షిస్తాడని చెప్పటం వంటి హిందువులు పోటీ పడలేని క్రూరత్వాలతో ఎంత హడావిడి చేస్తున్నప్పటికీ సనాతన ధర్మం ప్రతి చోటా తన పరిధిలో తను ఒదిగి ఉండి తనని అనుసరించే వారిని ఉత్సాహపూరితుల్ని చేస్తూనే ఉన్నది!ఎంత తక్కువలో తక్కువ లెక్కించినా ఇప్పటికీ 1.15 బిలియన్లు,అంటే ప్రపంచ జనాభాలో సుమారు 16 శాతం హిందువులు ఉన్నారు.

          సంఖ్యని బట్టి ఎక్కువ నుంచి తక్కువకి వరస వేస్తే - India, Nepal, Bangladesh, Indonesia (especially in Bali- 84% Hindu), Pakistan, Sri Lanka, Malaysia, United States, Myanmar, United Kingdom, Canada, South Africa, Mauritius, the Caribbean (West Indies), and Fiji దేశాలలో గణనీయమైన సంఖ్యలో హిందువులు ఉన్నారు.నిజం చీర సింగారించే లోపు అబద్ధం వూరంతా తిరిగి వస్తుందన్నట్టు సారంలో హేతువు లేని ఈ అబ్రహామిక్ మతాలు ఆర్భాటం చేసి అదరగొడుతుంటే హేతుబద్ధమైన తార్కిక చింతనతో నిండి వున్న హిందూమతం వీటి ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నది - ఏమిటీ దౌర్భాగ్యం?
          ఆధునిక కాలంలో క్రీ.శ 1883లో తన 19వ యేట అమెరికా గడ్డ మీద అడుగు పెట్టి  Women's Medical College of Pennsylvania నుంచి 1886 మార్చి 11న Western medicineలో MD పట్టాను తీసుకున్న Anandibai Joshi అమెరికా ఖండంలో కొంతకాలం నివసించిన తొలి హిందువుగా గుర్తింపు పొందింది.ఇక ఇవ్వాళ డాలర్ల మోజులో వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ చట్టసభల్లో కూడా అమరికా తెల్లవాళ్ళతో కలిసిపోయిన హిందువులు ఎంతమంది ఉన్నప్పటికీ వీళ్ళని మనం పట్టించుకోకూడదు - వీళ్ళందరూ ఇవ్వాళ అక్కడ చూపించేది డబ్బు వల్ల వచ్చిన అహం తప్ప నిజమైన హిందూత్వం కాదు.

          అమెరికా చరిత్రని పరిశోధించిన చరిత్రకారులు చాలామంది భారత అమెరికా భూఖండాల మధ్యన pre-Columbian travel జరిగిందనే విషయాన్ని అసలు పట్టించుకోలేదు - పట్టించుకున్నా ఎక్కువ పరిశోధనలు చెయ్యలేదు.మొదటిసారి ఆ రకం ప్రస్తావనలు చేసింది Theosophical societyకి సంబంద్గించిన H. P. Blavatsky. మన దేశస్థురాలు కాకపోయినా మేడం బ్లావట్శ్కీ మన దేశాన్ని మనకన్న ఎక్కువ ప్రేమించి మన దేశపు గౌరవం కోసం ప్రపంచ వేదికల మీద తన జీవితకాలం పాటు ఎంత పోరాడిందో!అయితే,  క్రీ.శ 1940లో Mr. Chaman Lal గట్టి పరిశోధన చేసి అన్ని వైపుల నుంచి సమాచారం సేకరించి పద్ధతి ప్రకారం విశ్లరెషించి రచించిన Hindu America అనే 247 పేజీల గ్రంధం మనం కూడా నమ్మలేని ఎన్నో నిజాలని నమ్మి తీరాల్సినంత గొప్పగా తెలియజేసింది.

          తెల్లవాళ్ళు కాలనీలు స్థాపించక ముందరి స్థానిక అమెరికన్ తెగల సంస్కృతిలో హిందూ మతానికి ముఖ్యంగా భారత దేశానికి సంబంధించిన గట్టి సంబంధం కనబడుతున్నదని అనుమానాలకి తావు లేకుండా నిరూపించారు చమన్ లాల్.అక్కడి ప్రాచీన కాలపు శిల్పాలలో భారతీయత ఉట్టిపడే ఏనుగుతల గల మానవమూర్తి కనిపిస్తున్నది.ఆ కాలంలో ఆ రకం ఏనుగులు అమెరికా మొత్తం వెతికినా ఎక్కడా కనిపించకపోవడం విశేషం.ఇంకా ఆ కాలపు అమెరికన్ దేవుడు Tlaloc గురించిన వర్ణనలు గణేశుణ్ణి పోలి ఉన్నాయి.అప్పటి అమెరికన్ ఆధ్యాత్మిక సాహిత్యంలో చతుర్యుగాల వర్ణన,విశ్వ రచనా సిద్ధాంతం,యౌగిక ప్రక్రియలు,ఆచార వ్యవహారాలు అన్నీ భారతీయ సనాతన ధర్మంలో వివరించబడిన విధంగానే ఉన్నాయి.అతి ముఖ్యమైన సాక్ష్యం వారి గణితంలో కూడా శూన్యాంకం ఉండటం - ప్రాచీన నాగరికతలలో అది తెలిసినది భారతీయులకీ మాయన్ నాగరికతకి చెందిన వారికీ మాత్రమే అనేది అందరికీ తెలిసిన వాస్తవమే!ఈ మధ్యనే Boliviaలో Tiahuan-aco అనే ప్రాంతంలో ప్రాచీన కాలపు రాతి చక్రాలు బయటపడినాయి.చక్కని వృత్తాన్ని గీయటం ఆధునిక కాలపు అమెరికన్లకే ఇతరుల వద్ద నుంచి నేర్చుకుంటే వచ్చింది - మరి, ఈ రాతి చక్రాల నిర్మాణం ఎవరిది?

          ఆనాటి అమెరికన్ ఆధ్యాత్మిక సాహిత్యంలో పేర్కొనబడిన నాగపూజ భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలోని విషయాలతో నిర్మించబడి ఉంది.అసలు ప్రాచీన కాలంలోని అన్నిమతాలలోనూ ఆఖరికి క్రైస్తవంలో కూడా నాగం అనేది జ్ఞానానికి చిహ్నం.జీసస్ తన పన్నెండు మంది అపోస్తలులకీ "Be ye therefore wise as serpents, and harmless as doves." అని చెప్పడం ఈ పరంపర యొక్క ప్రభావమే - how different the story of the European Penetration into and domination of America might have been if the pure teachings of Jesus had been followed by the professed Christians!

          ఈ పుస్తకం చదివిన ప్రతి Theosophical student ప్రాచీన కాలంలోనే భూమి సమస్తం ఒకే Wisdom-Religion వల్ల జ్ఞానాన్ని పొంది కాలక్రమేణ జీవధారతో సంబంధం తెగిపోయి మార్పులకి గురయిన వాటిలో కొన్ని నశించి కొన్ని మిగిలి ఈనాడు మనం చూస్తున్న మతభేదాలకి కారణమై హింసని పెంచుతున్నాయని నమ్ముతున్నాడు, చమన్ లాల్ విశ్లేషణని సమర్ధిస్తున్నాడు.తనకు లభించినది చాలా తక్కువ సమాచారమేననీ స్థానిక తెగల్ని వశపరుచుకునే సమయంలో తెల్లజాతి క్రైస్తవులు ఎంతో సమాచారాన్ని ధ్వంసం చేశారనీ చమన్ లాల్ అన్నారు.అయితే ఇప్పటి అమెరికా లోని హైందవం కొత్త దశలోకి నడుస్తున్నది - అక్కడ సనాతన ధర్మం పురావైభవాన్ని సంతరించుకునే అవకాశం కనుచూపు మేరలోనే ఉన్నది.

          ఈ పరిశోధన కోసం అమెరికాని కలయదిరిగిన చమన్ లాల్ the culture of the Indian will revive again and will redeem America. There are already clear signs to that effect. The most advanced and scientifically brought up Americans are already . . . looking for a philosophy that will "save their souls." అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.Dr. Gregory Mason అనే Americanist కూడా సాటి అమెరికన్లని "if we, modern Americans of all types, shall not carry on the American tradition that has come down from antiquity and build a real civilization in all respects suitable to Western conditions, and in which we shall no longer depend upon European culture." అని అడుగుతున్నారు.

          ULUPI (Sk.) A daughter of Kauravya, King of the Nagas in Patala (the nether world, or more correctly, the Antipodes, America). Exoterically, she was the daughter of a king or chief of an aboriginal tribe of the Nagas, or Nagals (ancient adepts) in pre-historic America — Mexico most likely, or Uruguay. She was married to Arjuna, the disciple of Krishna, whom every tradition, oral and written, shows travelling five thousand years ago to Patala (the Antipodes). The Puranic tale is based on a historical fact. Moreover, Ulupi, as a name, has a Mexican ring in it, like "Atlan," "Aclo," etc. అని H. P. Blavatsky ఉదహరించటాన్ని బట్టి చూస్తే అర్జునుడికీ ఉలూచికీ మధ్యన జరిగిందని చెబుతున్న ప్రణయ వృత్తాంతం కల్పన కాదని తెలుస్తున్నది.ఆధునిక ప్రయాణ వసతులున్న ఇప్పుడే మనకి అమెరికా వెళ్ళడానికి ఇంత కాలం పడుతుంటే అర్జునుడికి మొత్తం తీర్ధయాత్రని ముగించటానికి పట్టిన కాలంలో ఉలూచితో గడిపాడని చెబుతున్న కొద్ది కాలంలో భూమి ఈ చివర నుంచి ఆ చివరకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అప్పటివాళ్ళకి ఎట్లా సాధ్యపడిందో!
          ఇది క్రీ.పూ 106 సెప్టెంబర్ 29కీ క్రీ.పూ 48 సెప్టెంబర్ 28కీ మధ్యన జీవించిన Pompey the Great యొక్క ముఖచిత్రం - అతని నుదుటి మీద కనబడుతున్నది శ్రీవైష్ణవులు ధరించే తిరునామమే, సందేహం లేదు!అప్పటి రోమన్ చక్రవర్తులు ఇప్పుడు మనం హిందూమతం అని అంటున్న సంప్రదాయాన్ని పాటించారు అనేది తెలుస్తున్నది కదా!వాళ్ళు కూడా భారత దేశపు రాజుల లాగే Dev అనే బిరుదుని తమ పేర్లకి ముందు పెట్టుకున్నారు.ఇక రష్యా చుట్టుపక్కల హిందూదైవికత్రయాన్ని కొలుస్తారు.సైబీరియా పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ ఆత్మీయులు జబ్బు పడితే "ఆయు-దేవత"ని పూజిస్తారు.
          ఈ బొమ్మ ఇటలీలోని త్రవ్వకాలలో ప్రాచీన కాలపు గృహాలలో తరచుగా కనబడుతూ వస్తున్నది - వీళ్ళెవరో కాదు దశరధుని భార్యలైన కౌసల్య,కైకేయి,సుమిత్ర!ఇటలీలోనే మరొక చోట లవ కుశులు శ్రీరాముడి అశ్వాన్ని పట్టుకోవటాన్ని చూపించే బొమ్మ దొరికింది.

          "I am the wind that blows across the sea; I am the wave of the ocean; I am the murmur of the billows; I am the bull of the seven combats; I am the vulture on the rock; I am a ray of the sun; I am the fairest of flowers; I am a wild boar in valor; I am a salmon in the pool; I am a lake on the plain; I am the skill of the craftsman; I am a word of science; I am the spear point that gives battle; I am the God who creates in the head of man the fire of thought. Who is it that enlightens the assembly upon the mountain, if not I? Who tells the ages of the moon, if not I? Who shows the place where the sun goes to rest, if not I? Who is the God that fashions enchantments-- The enchantment of battle and the wind of change?" - Ireland గడ్డ మీద పాదం మోపిన తొలి Druid అయిన Amairgen గానించిన గొప్ప కవితాత్మకమైన ఈ వచనకవిత గురించి "Celt and Roman," "Celt and Greek," "Dictionary of Celtic Mythology," "Celtic Women" వంటి విలువైన గ్రంధాలను రచించిన Peter Berresford Ellis ఏమి చెప్తున్నారో తెలుసా!"In this song Amairgen subsumes everything into his own being with a philosophic outlook that parallels the declaration of Krishna in the Hindu Bhagavad-Gita." అని వ్యాఖ్యానించడాన్ని బట్టి ఏమి తెలుస్తున్నది?

          వారి ప్రాభవం కొనసాగిన కాలంలో Celts పశ్చిమాన Ireland నుంచి మొదలుకొని తూర్పున మధ్య Italy వరకు,ఉత్తరపు పై కొసన ఉన్న belgium నుంచి కిందకి దిగి దక్షిణాన Spain  వరకు విస్తరించటం వల్ల ఆయా ప్రాంతాలకి నాగరికతని అలవాటు చేసిన celtic సంస్కృతి కూడా సనాతన ధార్మిక సంప్రదాయం యొక్క ప్రతిబింబమే!అన్ని గొప్ప నాగరికతలను సృష్టించగలిగిన అఖండమైన బుద్ధి చాతుర్యంలోనే కాదు, ప్రతిభ ఉండీ ఎందులోనూ తమకు సాటిరాలేని తమ కన్న అధముల చేత నాశనానికి గురవడంలోనూ  ఈ celticలు హిందువులకి తగిన వారసులే అనిపించుకున్నారు!కాని కొన్ని దశాబ్దాల నుంచి యూరోపియన్ మేధావులకి కూడా తమ వాస్తవ చరిత్ర పట్ల నిజమైన ఆసక్తి పెరిగి celtic-indic సంబంధాలు మరింత బయటపడుతూ వస్తున్నాయి.

          ఇక తొలి మానవజాతి ప్రభవించిన ప్రాంతం అని రుజువైన ఆఫ్రికా ఖండంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ప్రపంచం నలుమూలలకి వ్యాపించిన సనాతన ధార్మికుల కర్మభూమి అయిన భరతఖండంతో ఉన్న పోలికలు చాలా ఎక్కువ.అన్నింటినీ చెప్పాలంటే కష్టం గనుక కొన్ని ప్రముఖమైనవి చెబుతాను.ఇక్కడి వలెనే అక్కడ కూడా ruler-caste, priest-caste ఉన్నాయి.Afro-Asian భాషా కౌటుంబిక సంబంధం వల్ల Hebrew yasuah->సంస్కృతం asvah - ముక్తి/మోక్షం,Semitic svam->సంస్కృతం svah - స్వర్గం లాంటి ఎన్నో పదాలలో సామీప్యం కనిపిస్తుంది.ఇక్కడ ఉదహరించబడిన ruler-priestsని క్రైస్తవ మత సాహిత్యంలోని Genisis కాండలో క్రైస్తవ మత సాహిత్య రచయితలు "the mighty men of old" అని పొగుడుతూ చెప్పడం గమనిస్తే సనాతన ధర్మపు ప్రాచీనత తెలుస్తుంది.Turkey లోని Mt. Silpius దగ్గిర Orontes నది ఒడ్డున ఉన్న Meroe అనే ఎత్తైన ప్రదేశాన్నే భారతీయ సనాతనులు మేరు పర్వతం పేరుతో కీర్తించి ఉంటారు!

          The royal priests traveled as far as Nepal where they are called Harwa, the ancient Egyptian word for priest. These ruler-priests are largely responsible for the diffusion of the Afro-Asiatic religious life that took root around the large water systems from west central Africa to the Indus River Valley. It is a religious life that shares eight features, all of which are found in the Bible and constitute the biblical worldview. Many of these features are found in Hinduism also.

          నైలు నుంచి గంగ వరకు ప్రవహించిన సంస్కృతి ఒక్కటే గనుక ప్రాచీన కాలపు భారత - ఆఫ్రికా ప్రజల ఆధ్యాత్మిక సాహిత్యం లోని ముఖ్యమైన సామీప్యతలు ఇవి - వామన దైవాలు, వికసితాత్మను సూచించే పద్మాలు, నాగపూజలు, కోరికలు తీర్చే చెట్టు కల్పవృక్షం వంటివి చాలా ఉన్నాయి.రూపురేఖలు మారిన ఇప్పటి క్రైస్తవంలో వీటి జాడలు స్పష్టంగా కనపడవు గానీ Jesus Christ బోధించినది ఈ Afro-Asiatic సారభూతమైన చింతననే.బైబిలు తన దైవకుమారుడికీ ఇతర ప్రవక్తలకీ గొప్పదనాన్ని ఆపాదించడానికి పెట్టిన పేర్లలో ఈ ruler-priest పద్ధతినే పాటించారు.

          దైవకుమారుడికీ ఇతర ప్రవక్తలకీ గొప్పదనాన్ని ఆపాదించడానికి వారు ఈ పద్ధతిని పాటించారు అనడం కన్న Jesus Christ వంశచరిత్రని గమనిస్తే క్రైస్తవులు అతను అద్వితీయుడని భావించటానికి అతని కులీనతయే కారణం అని మనం భావించవచ్చు!The divine appointment of the ancient Habiru is evident in the solar cradle attached to their names. The Canaanite Y is found in the names of these Habiru rulers: Yaktan (Joktan), Yishmael (Ishmael), Yitzak (Isaac), Yosef (Joseph), Yetro (Jethro), Yeshua (Jesus/Joshua), etc.అందుకే క్రైస్తవులు క్రీస్తును "రాజులకు రాజు" అని పొగిడి మురిసిపోతారు.
          హిందూ మతం యొక్క వైభవాన్నీ ఉన్నతినీ భారత దేశపు సరిహద్దులకి బయట ఇక్కడికన్న మనం కంబోడియా లోనే ఎక్కువ.అందరికీ తెలిసిన Angkor Wat ఆలయం ఒక్కతే కాదు,కంబోడియాలో ఎక్కడికి వెళ్ళి చూసినా హిందూ, బౌద్ధ ఆలయాల శిధిలాలు కనిపిస్తాయి.భారతీయ సాహిత్యంలో దీనిని కాంభోజం అని పిల్చేవారు.ఇక్కడ హిందూరాజ్యం అవతరించడానికి కారణమైన కధ ఇలా ఉంది:భారత దేశం నుంచి రాజ్యస్థాపన కోసం తగిన చోటు కోసం వెతుకుతూ కాంబోజ రాజు ఇక్కడ బలవంతురాలైన ఒక స్త్రీ నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు.యుద్ధం జరుగుతుండగానే ఇద్దరికీ తాము సమబుజ్జీలం అని తెలిసి సంధి చేసుకున్నారు.ఒకనినొకరు ఇష్టపడటంతో పెళ్ళి చేసుకుని రాజ్యపాలన కలిసే చేశారు.వారి సంతానమే కంబోడియా చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించిన Khmer వంశీయులు.
ఇదీ ఇవ్వాళ్టి పరిస్థితి - బుద్ధుడా,విష్ణువా?
          ప్రస్తుతం ఇక్కడ హిందూమతం కన్న బౌద్ధం ఎక్కువ ప్రభావశీలమైనది - రాజమతం.Angkor Wat ఇప్పుడు కేవలం మొండిగోడల్ని చూసి సంతోషించాల్సిన విహారస్థలి మాత్రమే.మూలవిరాట్టు లేని హిందూ దేవాలయం శవంతో సమానం, పూజాదికాలు జరగని చోట పవిత్రత శూన్యం!వూరికే ఆ పాడుబడిన గుడిని చూసి గతకాలపు వైభవాన్ని తలుచుకుని నిట్టూర్చడం తప్ప ప్రస్తుతానికి మనం చెయ్యగలిగింది లేదు!కంబోడియాలో బౌద్ధుల తర్వాత ముస్లిములు ఎక్కువ ఉన్నారు.ఇప్పుడు హిందువులకి ప్రాధాన్యత తగ్గిపోయింది!
          ధాయ్‌లాండ్ మొత్తమ్మీద కేవలం 52,631 మంది హిందువులు ఉన్నట్టు 2005లో ప్రభుత్వం వారి లెక్కల వల్ల తెలిసింది = దేశపు మొత్తం జనాభాలో 1% కూడా ఉండదు.అయినప్పటికీ దేశపు సంస్కృతి మీద హిందూ మతం ప్రభావం ఎక్కువ కనబడుతుంది.ఇక్కడి ప్రాచీన ఆధ్యాత్మిక సాహిత్యంలో ప్రముఖమైన Ramakien నే కధ వాల్మీకి విరచిత రామాయణ కధయే!థాయ్ దేశాన్ని పరిపాలించేది బౌద్ధమతాన్ని పాటించే రాజవంశం అయినప్పటికీ రాజగురువు మాత్రం హిందూ బ్రాహ్మణ వంశీకులే అయి ఉంటారు.పట్టాభిషేకం జరిగేటప్పుడు మొదట హిందూ పధతిలో క్రతువులు జరిగాకనే బౌద్ధులు అందుకుని తమ సంప్రదాయం ప్రకారం పూర్తి చేస్తారు.ఈ దేశపు రాజముద్రలోని గరుడ చిహ్నం హిందూ పురాణాల నుంచి తీసుకున్నదే!అసలైన విశేషం తొలినాటి రాజచానికి Ayutthaya అని శ్రీరాముడి జన్మస్థానమైన అయోధ్యను గుర్తు చేసుకుంటూ పేరు పెట్టుకున్నారు.

          భారతీయ సంప్రదాయానికి భిన్నంగా ఇక్కడి హిందువులు చతుర్ముఖ బ్రహ్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.Siam, Bangkok, ChiangMai నగరాల దేవాలయాలు చాలా ప్రత్యేకమైనవి.Bangkok నగరంలోని పెద్ద ఆలయంతో పాటు బ్రహ్మదేవుడికి ఇతర చోట్ల చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.మనం బ్రహ్మను సృష్టికి చిహ్నం అని భావిస్తే ధాయ్ హిందువులు ఐశ్వర్యప్రదాత అని భావిస్తారు.ధాయ్ గురించిన నిజం కూడా అదే - ప్రాచీన కాలం నుంచి ఇతరుల ఆక్రమణకి గురై పరాధీనతకి లోను కాలేదు,ఇతరులని ఆక్రమించి చెడ్దపేరు తెచ్చుకోలేదు,చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే ఇదే ధనిక దేశం!

          హిందువుల జనాభా అంత తక్కువ ఉన్నపటికీ భారతీయ హిందువుల కన్న నిష్ఠలోనూ గర్వంలోనూ అధికులు ధాయ్ హిందువులు. ఆదివారం మనం 8కి లోపు నిద్ర లేవం, మొహం కడుక్కోగానే కాఫీ కూడా టీవీ చూస్తూ తాగుతాం. కానీ ధాయ్ హిందువు ఎవ్వడూ ఆదివారం ఇంటిపట్టున ఉండడు, కుటుంబాలకి కుటుంబాలు వందల వేల మైళ్ళు దాటి Siam, Bangkok, Chiang Mai వంటి చోట్లకి వచ్చి ఆలయ సందర్శనం సత్సంగ గోష్ఠులలో కనబడతారు.

          ఇండియాలో సెక్యులరిజం పేరు చెప్పి మసీదుల్నీ చర్చిల్నీ వదిలేసి హిందూ ఆలయల్ని మాత్రమే స్వాధీనం చేసుకుని హిందువుల్ని వెర్రివెధవల్ని చేసినట్టు కాకుండా ధాయ్ ప్రభుత్వం వారి religiopus Departmentకి చెందిన నిజాయితీ గల అధికారులని ఉపయోగించుకుని సంవత్సరానికి ఒకసారి దేశంలో ఉన్న ప్రతి మతానికి సంబంధించిన ప్రతినిధుల్ని పిలిచి సమస్యలు అడిగి పరిష్కరించటం వల్ల అన్ని మతాల వారికీ సమానమైన ప్రోత్సాహం కలుగుతున్నది.

          అయితే,ఒక రెండు మూడు తరాలు గడిస్తే ధాయ్ హిందువులు మాయమైపోయే పరిస్థితి దాపరించింది - మొదటిది వారిలోనూ ఇంగ్లీషు మీద వ్యామోహం ఎక్కువై తలిదండ్రులు పిల్లల్ని క్రైస్తవ మిషనరీలు నడిపే ఇంగ్లీషు స్కూళ్ళకి పంపిస్తున్నారు. దీనివల్ల యువతరం హైందవానికి దూరమై క్రైస్తవానికి దగ్గరవుతున్నారు.దీనికి తోడు ఇస్లాం,క్రైస్తవ మత ప్రచారకులు డబ్బు పంచిపెట్టి మతమార్పిడులు చెయ్యటం కూడా జరుగుతున్నది.భారత దేశం నుంచి మార్గదర్శకత్వం కోసం చూస్తుంటే  హిందూ మత ప్రచారకులు అప్పుడప్పుడూ వ్యాపారస్తులు బిజినెస్ టూరుకి వచ్చినట్టు వచ్చి మొక్కుబడి ఉపన్యాసాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు.వారిలో కూడా టూర్ నిర్వాహకులు ఇచ్చే పారితోషికం కోసమే వస్తుండటం చూసిన చురుకైన యువకులకి హిందూమతం పట్ల ఆసక్తి పెరగడానికి బదులు వ్యతిరేకత పెరుగుతున్నది.ఇప్పటికే ధాయ్ దేవాలయాల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ కనబడటం తగ్గిపోయింది. అసలు హిందూమతం అంటేనే శ్యామలీయం లాంటి ముసలాళ్ళకి భక్తి పద్యాలు రాసుకోవడానికి తప్ప హరిబాబు లాంటి కుర్రాళ్ళకి హుషారు పెంచే సరదా కంటెంట్ లేదనే మూఢనమ్మకం ఒకటి ఏర్పడిపోయింది - దీన్ని వదలగొడితే గానీ హిందూమతం కుర్రాళ్లని కలుపుకుని కుర్రమతాలతో పోటీపడి పరిగెత్తలేదు!

          ఆఖరున ధాయ్ గురించి నేను తెలుసుకున్న రెండు అద్భుతమైన విషయాల గురించి చెప్పకపోతే ఈ వ్యాసం రాయడమే అనవసరం అనిపిస్తున్నది గాబట్టి చెబుతాను - ఇక్కడి హిందువులు చాలావరకు వ్యాపారులు కావటం వల్ల మైనారిటీల పేరుతో చవకబారు రాజకీయాలకి పోవడం లేదు. కేవలం హిందూమతానికే కట్టుబడి ఉండకుండా బౌద్ధమతానికి సంబంధించిన ఉత్సవాలలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు,ఇక దేశపు సామాజిక వాతావరణంలో హింసాప్రియత్వం, వ్యసనలోలత తక్కువ - ఇక్కడే కాదు బౌద్ధం ఎక్కడ ప్రాచుర్యంలో ఉంటే అక్కడ హింస తక్కువగానే ఉంటుంది!మరీ ముఖ్యం, ధాయ్ వాతావరణం కాలుష్యం లేనిది, నగరాలు కూడా సాగదీసిన పల్లెటూళ్ళకి మల్లే ఉంటాయి - నా జన్మ పరంపరలో ఏదో ఒక జన్మలో ధాయ్ హిందువుగా పుడితే బాగుండు!

          It is enough to prove that once upon a time Hinduism was all pervading in all aspects, so every traces of civilization is marked with it - though politically motivated scholars deny the fact still, It is true!

          ప్రపంచంలొ ఎక్కడికి వెళ్ళినా ఎన్ని తరాల పాటు అక్కడ బతికినా ప్రతి హిందువుకీ తమ మూలం భారతదేశంలోనే ఉందని తెలుసు - సందేహాలు వస్తే వాటికి జవాబులు ఇక్కడే దొరుకుతాయనీ తెలుసు, అహ్మద్ ఖురేషీ మేనమామలా ఈ వేదభూమిని ఒక్కసారైనా దర్శించాలని అనుకోవడం సహజం!కానీ భారతదేశపు హిందువులు ఇప్పుడు వారికి సందేహాలు తీర్చే స్థితిలో లేరు."This year Durga Puja and Muharram fall on same day. Except 24 hour period on Muharram day, immersions can take place on October 2, 3 and 4", the West Bengal CM said on Wednesday night.This can happen only in India. Why she cannot ensure that both the religious festivities occur simultaneously without any problem. If she has courage can she do otherwise?Looks like a lot of the Hindus who vote for a nasty anti Hindu creature like Mamata are creatures with low intelligence and no sense of self worth. They are for the most part a bunch of nasty, servile creatures!" 60 మంది గోరఖ్పూర్ పిల్లల గురించి భూమి కంపించేలా గొంతు చించుకుని అరిచిన కాంగ్రెస్సోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ,కునిష్టి మీడియావోళ్ళూ 293 మంది కోలారు పిల్లల్ని అస్సలు పట్టించుకోవటం లేదు.అక్కడ గోల చేసినవాళ్ళు ఇక్కడ ఎందుకు చెయ్యడం లేదని అడిగితే "ప్రశ్నకి ప్రశ్న జవాబు కాదు, మేము దేన్ని పట్టించుకోవాలో దేన్ని పట్టించుకోకూడదో మీరు చెప్పక్కర్లేదు, మేము మీలో పట్టిన తప్పు నిజమే కదా - అది సరిదిద్దుకోకుండా తప్పుకోవడానికే ఇలా మమ్మల్ని నిలదీస్తున్నారు!" అని అడిగిన వాటికీ అడగని వాటికీ కలిపి ఓ పది కలగాపులగం జవాబులు మన మొహాన కొడతారు.ఈ బైరూపుల వేషాల వెనక ఉన్న అసలు కారణం రహస్యమైనదేమీ కాదు, అందరికీ తెలిసిందే!

          కర్నాటకలో ర్తాజ్యమేలుతున్నది వారి బుల్లి బాబాయి వేలు విడిచిన చిన్న మేనమామ పెద్ద కొడుకు, ఉత్తర ప్రదేశ్ పీఠం మీద ఉన్నది హందూ మతతత్వ వాది - ఈ ఘనత వహించిన సెక్యులరిష్టుల గర్జనలకి హిందువులు బిక్కచచ్చిపోయి మొహాలు వేళ్ళాడేసుకుని తిరుగుతున్నారు,నేను తప్పు పట్టేది అక్కడొకలా ఇక్కడొకలా ప్రవర్తించిన  బహురూపుల వాళ్ళని కాదు, హిందువులనే!ఇప్పుడు కోలారు సంఘటన జరిగింది కాబట్టి నాకైనా అవతలి వాళ్లని తపు పట్టటానికి పాయింటు దొరికింది,అసలు గోరఖ్పూర్ సన్నివేశం జరిగినప్పుడు హిందువులు ఎందుకు కంగారు పడాలి?

          1947 ఆగష్టు 15 నుంచి అలాంటి సన్నివేశం ఒక్కటి కూడా జరగలేదా?అవన్నీఎందుకు జరిగాయి,ఎవరి వల్ల జరిగాయి?దేశంలో ఏ గవర్నమెంటు హాస్పటల్ ఆరోగ్యంగా నడుస్తున్నదో చూపించమనండి!ఒక హాస్పటల్ చక్కగా నడవాలంటే దానికి తగిన స్థాయిలో నిధులు ఇవ్వాలి, విజిలెన్స్ ఉండాలి, ఉద్యోగులు తగినంత మంది ఉండాలి, ఉన్నవాళ్ళకి నిజాయితీ ఉండాలి - డాక్టరు కోర్సు చదవాలనుకుంటున్న టీనేజి కుర్రాళ్ళే సేవ చెయ్యాలనే పవిత్రమైన ఆశయంతో కాకుండా మామగారు ఇచ్చే కట్నం డబ్బుతో హాస్పటల్ పెట్టి రెండు చేతులా ఆర్జించాలనే దురాశతో చేరుతున్నప్పుడు  ఒక ఉత్తరప్రదేశ ముఖ్యమంత్రి కానీ ఒక కర్నాటక ముఖ్యమంత్రి కానీ నాణ్యమైన వైద్యాన్ని ఎట్లా అందించగలడు - ఆ ఒక్క రాష్ట్రంలో, ఆ ఒక్క హాస్పటల్ దగ్గిర అల్లరి చెయ్యడం వల్ల ప్రజలకి జరిగే మేలు ఏమిటి?

          అన్నిటికీ సరిపోయే స్థాయిలో నిధులు కావాలంటే దేశం మొత్తం బాగుండాలి.దేశం బాగుండాలంటే ముందు వీళ్ళు ఇలాంటి తట్టుపర్ల యవ్వారాలు చెయ్యటం మాని ప్రజలకి కష్టపడి సంపాదించటాన్ని అలవాటు చెయ్యాలి.అందరూ తేరతిండికి అలవాటు పడి  పనులెగ్గొట్టేసి ఇతరుల్ని పని చెయ్యనివ్వకుండా గొడవలు రేపెడుతూ మధ్యలో హిందువుల మీద పడి యేడుస్తుంటే హిందువులు ఎంతకాలం ఎవరి మెప్పు కోసం భరించాలి?

          అసలు ఈ దేశం విడిపోవటానికి కారణమైన వాదన ఏమిటి?హిందువులు దుర్మార్గులు,మత దురహంకారులు,కలిసి ఉంటే ముస్లిముల్ని బతకనివ్వరు అని కాదా?మరి, డైరెక్ట్ యాక్షన్ డే ఒక్క రాత్రిలోనే ఒక్క బొంబాయిలోనే అంతమందిని చంపినవాళ్ళు, మా దేశం మాకివ్వకపోతే రక్తపుటేరులు పారిస్తాం అని రంకెలు వేసినవాళ్ళు ఏ ధైర్యంతో పాకిస్తాను ఏర్పడిన తర్వాత కూడా బొంబాయిలోనూ హైదరాబాదులోనూ కేరళలోనూ ఉండిపోయారు?వేరే దేశంగా విడిపోకుండా కలిసి ఉంటే హిందువులు ముస్లిముల్ని బతకనివ్వరు అని ఢంకా బజాయించి చెప్పేసిన స్వయం ప్రకటిత సెక్యులరిస్టులూ కమ్యూనిష్టు మేధావులూ ఏ ముఖం పెట్టుకుని హిందువుల నుంచి ముస్లిముల పట్ల సౌజన్యాన్ని ఆశిస్తున్నారు?

          సంఖ్యకి తక్కువ ఉండి కూడా అంత హింస రగిల్చి దేశం నుంచి విడిపోయి అనుకున్నది సాధించుకున్న సమర్ధులు కదా వారు - ఏ రకం వాదనతో వారిని బలహీనులు అని సమర్ధించగలరో చెప్పగలరా!అంతటి సమర్ధతని దేశాన్ని విడగొట్టడంతోనే ఎందుకు ఆపారు?కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పాకిస్తాను ఏర్పాటు కోసం కష్టపడిన తమవారిని మత దురహంకారులైన హిందువుల మధ్యన ఎందుకు వదిలేశారు?పాకిస్తానుకి ఎందుకు తరలించుకు పోలేదు?అంకెకి తక్కువ కారణంతో హిందువుల్ని ముస్లిములకి బూచిలా చూపించి విడగ్గొట్టాక కూడా ఇక్కడ ఉండిపోయిన వాళ్లని మళ్ళీ ఇక్కడ అంకెకి తక్కువ ఉన్నందువల్ల వాళ్ళకి న్యాయం చెయ్యాల్సిన బాధ్యతని కూడా హిందువుల నెత్తి మీదనే పెట్టినవాళ్ళు నోటికి తింటున్నది అన్నమా, గడ్డియా, మరొకటా?

          ఇప్పుడు మమతా బెనర్జీ ఏరి కోరి ఎంపిక చేసిన ఒక ముస్లిం పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గాన్ని మిని పాకిస్తానులా తీర్చి దిద్దుతున్నాడు. ముస్లిముల కోసం పాకిస్తాను అనే ఒక దేశం ఏర్పడ్డాక కూడా కేరళలో నంబూద్రిపాద్ అనే అధముడు మళ్ళీ ముస్లిములకి ఒక జిల్లాని మిని పాకిస్తాను కింద దఖలు పరచడానికి కారణం ఏమిటి?అప్పుడు అధికారంలో ఉన్న తను కూడా ఇండియాలోని ముస్లిముల్ని రక్షించలేని ఎదవ అని ఒప్పుకున్నట్టు కాదా?వాళ్ళకి మెజారిటీ ఉన్న ప్రాంతంలో ఆంబోతుల్లా వొదిలెయ్యాలి, వాళ్ళు తక్కువ ఉన్నచోట నెత్తిన పెట్టుకుని మొయ్యాలి - అప్పుడే హిందువులు మంచివాళ్ళలా కనిపిస్తారు!ఒక ప్రాంతంలో మెజారిటీగా ఉన్న ఏ జాతికైనా మైనారిటీల రక్షణ/హక్కుల పేరుతో ఇండియన్ సూడో సెక్యులరిష్టుల నుంచి హిందువులకి జరిగినంత అవమానం ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా?


          The Army of God(A network of violent Christianists that has been active since the early 1980s),Eastern Lightning(Founded in Henan Province, China in 1990),The Lord’s Resistance Army(founded by Joseph Kony, a radical Christianist of Uganda in 1987),TheNational Liberation Front of Tripura(Active in the state of Tripura in Northeastern India since 1989),The Phineas Priesthood(whose members have been involved in violent activities ranging from abortion clinic bombings to bank robberies from 2014) లాంటి క్రైస్తవ తీవ్రవాద సంస్థలూ ISIS(Islamic State of Iraq and Syria),Al-Qaeda(a Wahhabi organization),Taliban(annual revenue of nearly $400 million resulting from their activities ranging from extortion, human trafficking, drug trafficking among others),Boko Haram(an Islamist based militant group in Nigeria),Lashkar-e-Toba(sworn to free Muslims living in Indian Kashmir),Tehrik-i-Taliban(active in the Pakistani-Afghan border in direct association with Taliban),HEZBOLLAH(established by Muslim clerics headed by Ayatollah Khomeini) లాంటి ముస్లిం తీవ్రవాద సంస్థలూ చెలరేగి పోతున్నప్పటికీ ఆ రెండు మతాల లోని మతాధిపతులు కనీసం ఆపడానికి కొంచెపు ప్రయత్నం కూడా చెయ్యడం లేదు,పైన వాళ్లలో ఆ దుర్మార్గపు పనులు చేస్తూ చచ్చినవాళ్లని అమరవీరులని పొగుడుతూ స్వర్గప్రాప్తికి ఆశీస్సు లిస్తూ పెంచి పోషిస్తున్నారు - అయినా అవి మంచి మతాలే!ఒక్క తీవ్రవాద సంస్థని సైతం కనీసం ప్రోత్సహించను కూడా ప్రోత్సహించని హిందువులు మాత్రం భయంకరమైపోయారు వీళ్ళ దృష్టిలో,ఎందుకు?దేశంలో ఎక్కడ ఎవడు తుమ్మినా దగ్గినా దానికి మోదీ ప్రధాని కావటమే కారణం అనేవాళ్ళు అప్పటి కాలంలో శంబూకుడి తపస్సే బ్రాహ్మణశిశువు మృతికి కారణం అనటాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు - ఇప్పటి కాలంలో వీళ్ళ ప్రవర్తనా అలాగే ఉంది కదా!

          బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టి అడుగుతున్నారని తెలిసినా చైనా వాళ్లలా మూర్ఖానికి పోయి క్రూరంగా అణిచి పారెయ్యకుండా, ఇస్తే వాళ్ళ చావు వాళ్ళు చస్తారని - పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని సర్వసత్తాక సార్వభౌమాధికారంతో ఏర్పాటు చేసి ఇచ్చాక కూడా మళ్ళీ భారతదేశపు సరిహద్దుల లోపల ఇన్ని పాకిస్తానులు అవసరమా?హిందువులు చేసిన మొదటి తప్పు అప్పటి వరకు ఉద్యమంలో పాల్గొనక్లుండా ఇంగ్లీషువాళ్ళతో ఇచ్చకాలు ఆడుతూ గడిపేసినవాళ్ళు హఠాత్తుగా ముందుకొచ్చి వాళ్లలోనే ఒక దుర్మార్గమైన వ్యూహాన్ని పెట్టుకుని హిందువుల్ని అనంతకాలం వరకు దోషులుగా నిలబెడుతూ జరిపించిన పాకిస్తాన్ ఏర్పాటుకి ఒప్పుకోవటం అయితే రెండవ తప్పు మసీదుల్నీ చర్చిల్నీ వొదిలేసిన తేడా కళ్ళకి కటినట్టు కనబడుతున్నప్పటికీ అడుగుతున్నది హిందూ మతానికి చెందిన పెద్ద మనుషులే కదా అని గుడ్డిగా నమ్మి తమ ఆలయాల్ని ప్రభుత్వాలకి అప్పగించటం!మమతా బెనర్జీ హిందువే కదా, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ హిందువులు తమ నాయకుల చేతుల్లోనే మోసపోయారు, మోసపోతున్నారు, మోసపోతారు.

          మొదటి తప్పు వల్ల బలవంతం చేసి కలుపుకుంటే నిరంతరం మన మీద పడి యేడ్చే దరిద్రం పోయింది గాబట్టి అంతా మన మంచికే అని సరిపెట్టుకునే వీలు చిక్కింది కానీ రెండో తప్పు వల్ల ఆలయాలు ప్రముఖ పాత్ర వహించే సనాతన ధార్మిక ప్రవాహం నీరసించి పోయింది - ఇవ్వాళ హిందూమతం ఎదుర్కొంటున్న అన్ని కష్టాలకీ తమ ఆలయాల మీద తమకి అధికారం లేకపోవటమే కారణం!హిందువుల దృష్టిలో దేవాలయం అంటే ఒక రాతిబొమ్మని చూపించి దానికి పూజలు చెయ్యమనటం, దాని చుట్టూ భవనాలు కట్టడం, భక్తుల నుంచి కానుకలు స్వీకరించి సంపదల్ని పోగేసుకోవడం కాదు - వ్యక్తిగతం,వ్యష్ఠిగతం అయిన ఎన్నో ప్రయోజనాలని అక్కడికి వచ్చే భక్తులకీ,రాకుండా దూరంగా ఉన్న ఇతరులకీ,దేశాన్ని పాలించే ప్రభువులకీ అడగని కానుకలుగా అందించే విశ్వ-సం-భువం!
          "దేహో దేవాలయో ప్రోక్తః" - అంటే దేహమే దేవాలయం అని అర్ధం.సనాతనులు ఈ రెండింటికీ వూరికే పోలిక చెప్పి వూరుకోలేదు - ఆ రెంటి మధ్యన ఒక విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచారు.సనాతన ధార్మిక సాహిత్యంలో మూడు ముఖ్యమైన పురుషకారములు ఉన్నాయి.పురుషకారం అంటే ఒక లక్ష్యం పెట్టుకుని ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధించే స్వభావం .దీనిని స్త్రీలకి కూడా వాడవచ్చు - ఉదాహరణకి రుద్రమదేవి, దుర్గాబాయి దేశ్‌ముఖ్, కిరణ్ బేడీ లాంటివాళ్ళు పురుషకారులే!ఇక సనాతన ధర్మం చెప్పిన మూడు పురుషలూ  పురుష,పరమ పురుష,వాస్తు పురుష - మొదటిది జీవుడు,రెండవది దేవుడు అని అందరికీ తెలిసిందే,మూడవదైన వాస్తు పురుష ఆ రెంటినీ కలిపి చూపించే స్థలం(cosmic space)!

          వాస్తు శాస్త్రం సుమారు క్రీ.ఫొ 6000 సంవత్సరాల నుండి క్రీ.పూ 3000 సంవత్సరాల మధ్యన వృద్ధి చెయ్యబడినట్టు తెలుస్తున్నది.దీని ప్రకారం  మానవుడు ఒక సరిహద్దును గీసి నివాసయోగ్యం చెయ్యదల్చుకున్న ప్రతి ఆవరణకీ వాస్తు పురుషుడు అధిదైవతం అవుతాడు.మానవుడికి సుఖశాంతులు ప్రసాదించే ప్రతి దైవమూ ఇతని ఒక్కొక్క శరీర భాగాన్ని అధివసించి ఉంటాడు.అంటే, ఇతను సకలదేవతాస్వరూపుడు అని అర్ధం!అలాంటి ఒక స్థలాన్ని చూసిన మరుక్షణమే అనుభవజ్ఞుడైన వాస్తుశాస్త్రవేత్త మనస్సులో ఒక వాస్తుపురుషమండలం గీసేసుకుంటాడు.వాస్తు పురుషుడి తల ఈశాన్యాన్ని చూడాలి, కాళ్ళు నైఋతి మూలకి ఉండాలి - మధ్యన ఉన్నదాన్ని బ్రహ్మస్థానం అంటారు.ఈ శాస్త్రాన్ని రచించింది హిందువులు కాబట్టి హిందూదేవతల పేర్లు కనబడుతున్నందు వల్ల హైందవేతరులకి నచ్చకపోయినా హేతువాదులకి అయోమయం అనిపించినా వెనక ఉన్నది మాత్రం గణితశాస్త్రమే!ఆ మాటకి అసలు అర్ధం ఏమిటో నాకు తెలియదు గానీ నేను పైన విశ్వ-సం-భువం అనడానికి కారణం  ఆలయ నిర్మాణం వెనక ఉన్నది విశ్వాన్ని సంకోచింపజేసి భూమిపైకి తీసుకురావడం అని చెప్పడమే నా ఉద్దేశం.
          గృహవాస్తు కన్న ఆలయ వాస్తు మరింత ప్రత్యేకమైనది.వాస్తుశాస్త్రం ప్రతి స్థలాన్నీ నాలుగు దిక్కులతోనూ నాలుగు మూలతోనూ వర్ణించి ఊర్ధ్వః,అధః అనే వాటిని కలిపి దశ దిశల మధ్యన ఒదిగి ఉన్న విశ్వం గురించి తమకు తెలిసిన ప్రతి విషయాన్నీ గణితశాస్త్రపు సహాయంతో దృశ్యరూపంలోకి తీసుకొచ్చింది.

          వాస్తుశాస్త్రం ప్రతి దిశకీ ఒక అధిష్ఠాన దేవత ఉన్నట్టు చెబుతున్నది.స్థలం యొక్క సహజ స్వభావాన్ని గమనించి గృహనిర్మాణంలో ఏ దిశకి ప్రాధాన్యత పెంచితే ఆ దిశాధిదేవత అనుగ్రహించే ఫలితం అక్కడ నివసించే వారి మీదకి ప్రసరిస్తుంది. 

1.ఈశాన్యం(North East):శివుడు జలాధిపతియై ఉంటాడు.ఫలితం మానసిక సమతౌల్యం,
2.తూర్పు(East):ఇంద్రుడు సూర్యకాంతిని శాసిస్తాడు.ఫలితం దీర్ఘాయువు,
3.ఆగ్నేయం(South East):అగ్ని శక్తి కారకుడు.ఫలితం సంతాన వృద్ధి,
4.దక్షిణం(South):యముడు దుఃఖ కారకుడు.ఫలితం సరిగ్గా ఉపయోగించుకుంటే దృష్టిదోషాన్ని తగ్గిస్తుంది,
5.పడమర(West):వరుణుడు జలాధిపతియై ఉంటాడు.ఫలితం విజయం,
6.నైఋతి(South West):నైఋత్యుడు రక్షణ ఇస్తాడు.ఫలితం స్థిరత్వం,
7.వాయువ్యం(North West):వాయువు చలన కారకుడు.ఫలితం ప్రశాంతత,
8.ఉత్తరం(North):కుబేరుడు ఐశ్వర్య కారకుడు.ఫలితం సంపద వృద్ధి,

          ఇక యోగశాస్త్రం మానవ దేహంలో ఏడు విశిష్టమైన చక్రాలను గుర్తించింది.ప్రతి చక్రానికీ ఒక అధిష్ఠాన దేవత, ఆ దేవతకు కొన్ని లక్షణాలు ఉంటాయి.దీని అర్ధం యేమిటంటే, మానవుని సంస్కార ఫలితమైన ఇఛ్చాసంకల్పశక్తి ఏ చక్రం వద్ద ఉంటే అతను ఆ చక్రాధిష్ఠాన దేవతతో సముడై ఆ లక్షణాలను ప్రదర్శిస్తాడు.

1.మూలాధారం:వెన్నుపాము మొదలయ్యే చోట ఎఱుపు రంగులో ఉన్న నాలుగు దళాల పద్మం,స్వభావం అమాయకత్వం.వాస్తు మండలంలో నైఋతి దిశతో సంబంధం ఉంటుంది,
2.స్వాధిష్ఠానం:నాభికి కొంచెం దిగువన నారింజ రంగులో ఉన్న ఆరు దళాల పద్మం,స్వభావం స్వానురాగం.వాస్తు మండలంలో పడమరతో సంబంధం ఉంటుంది,
3.మణిపూరం:నాభికి కొంచెం ఎగువన పసుపు రంగులో ఉన్న పది దళాల పద్మం,స్వభావం ఉత్సాహం.వాస్తు మండలంలో మధ్యన ఉన్న బ్రహ్మస్థానంతో సంబంధం ఉంటుంది,
4.అనాహతం:వక్షానికి మధ్యన ఆకుపచ్చ రంగులో ఉన్న పన్నెండు దళాల పద్మం,స్వభావం అనుకంప.వాస్తు మండలంలో వాయువ్యంతో సంబంధం ఉంటుంది,
5.విశుద్ధం:కంఠానికి మధ్యన లేతనీలం రంగులో ఉన్న పదహారు దళాల పద్మం,స్వభావం వైభోగం.వాస్తు మండలంలో ఈశాన్యంతో సంబంధం ఉంటుంది,
6.ఆజ్ఞ:ఫాలభాగం మధ్యన వంగపండు రంగులో ఉన్న రెండు దళాల పద్మం,స్వభావం విజ్ఞానం.వాస్తు మండలంలో ఊర్ధమైన ఆకాశంతో సంబంధం ఉంటుంది,
7.సహస్రారం:శిరోభాగం నడిమధ్యన అనేక రంగులలో ఉన్న సహస్ర దళాల పద్మం,స్వభావం ఆనందం.వాస్తు మండలంలో అన్ని దిశలతొనూ అనుబధాన్ని కలిగి ఉంటుంది.

"Garba Gruha Sirahapoktam antaraalam Galamthatha
Ardhamandapam Hridayasthaanam Kuvchisthaanam Mandapomahan
Medhrsthaaneshu Dwajasthambham Praakaaram Janjuangeecha
Gopuram Paadayosketha Paadasya Angula Pokthaha
Gopuram sthoopasthatha yevam Devaalayam angamuchyate"

- "Viswakarmyam vaastu Saastra"

          దీని భావం:దేవాలయమనే పురుష దేహానికి గర్భగృహం-శిరస్సు, అంతరాలయం-మెడ, అర్ధమండపం-వక్షం, మహామండపం-ఉదరం, ధ్వజస్తంభం-పురుషాంగం, గోపురం-పాదాలు అవుతున్నాయి అని అర్ధం.

          ఇక్కడ మానవదేహంలోని శక్తి స్థానాలని గుర్తించి వాస్తుశాస్త్రంలోని గణిత నియమాలని ఉపయోగించి విశ్వంలోని శక్తులతో ముడివెయ్యటం జరుగుతున్నది.ఇంత స్థాయిలో పరిశీలన, పరిశోధన, పరిశ్రమ, పరిచర్య ఎందుకు చేశారో తెలుసా?ఆలయంలో అడుగు పెట్టి మళ్ళీ బయటికి వచ్చే లోపు "అహం బ్రహ్మాస్మి(I am Brahman - So, I am part of the Universe)" ,"యధా పిండే తధా బ్రహ్మాండే(What is going on within Human Body is the same as What is going on in Universe)" అనే సత్యాలని ఆ కొద్ది సమయంలోనే నోటితో చెప్పను  కూడా చెప్పకుండా ఎవరికి వారికి తెలిసేటట్టు చెయ్యడం కోసం చేశారు!ఇంతటి పరిశోధన చేసి ఇంతటి సాంకేతికతని కలిపి అందించిన సంస్కృతిని హిందువులు నిర్లక్ష్యం చెయ్యడం ఎంత ఘోరం?

          ముస్లిములు కూలగొట్టినవి కాక మిగిలిన వాటిల్లో కొన్ని వందల వేల సంవత్సరాల పాటు తుఫాన్లనీ, వరదల్నీ, భూకంపాల్నీ తట్టుకుని నిలబడటం ఎలా సాధ్యపడింది?తమ చుట్టూ ఉన్న సమస్తమూ అతలాకుతలం అయిపోయిన సందర్భాల్లో కూడా ఇంటి కన్న గుడి పదిలం అన్నట్టు అవి నిలబడి ఉండటానికి కారణం ఏమిటి?వేదానికి ఉన్న ముఖ్యమైన వాస్తు అనే అంగంలో ఆలయవాస్తుని భూగర్భ శాస్త్రం, ధ్వని శాస్త్రం, కాంతి శాస్త్రం లాంటివాటితో అనుసంధానించి తీర్చిదిద్దిన ఆలయాలు హిందూ జీవన విధానంలో అత్యంత ప్రాచీన కాలంలోనే ఒక భాగమై తరతరాల హిందూ సంస్కృతిలో అవిభాజ్యమై కనబడుతుంటే  సంస్కృతంలో ఓనమాలు కూడ రాని ముష్టాఖ్ అహ్మద్ లాంటి గాడిద వేదాల్లో విగ్రహారాధన లేదు, వాటిని తర్వాత చేర్చారు, మీ పంతుళ్ళు/శాస్తుర్లు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని వాగుతున్నాడంటే అది వాడి తప్పు కాదు, వాడిని హద్దుల్లో ఉంచలేని హిందువులదే తప్పు!

          వాడి మతం వాళ్ళలా మెడ నరికి చంపరు,హిందువులు పిచ్చి పుల్లయ్యలు.మనం ఎంత రెచ్చిపోయినా మనకేమీ కాదు అని మక్కాలో పట్టుబట్ట కట్టుకుని ఏడు ప్రదక్షిణలు చేసి గంగాజలం తాగి రేండు గుట్టల మధ్యన పరుగులు పెట్టి సైతాను స్తంభాల మీదకి రాళ్ళు విసిరే సిగ్గులేని వెధవకి హిందువుల శాంతికాముకత్వం మీద ఎంత గట్టి నమ్మకం?సహనం చచ్చి ఏ కుర్రాడన్నా నాలుగు తంతే సెక్యులరిష్టు మేధావుల్ని వెంటేసుకుని పగటి వేషాల వగలమారి మాతాహరి లాంటి మీడియా ముందు హిందువుల్ని అల్లరి చెయ్యొచ్చు, అల్లరి భరించలేక వాళ్లే వెనక్కి తగ్గుతారనే చావు తెలివి అనుకుంటాను!హిందువుల మతం గురించి అబద్ధాలు చెప్పడం వల్ల హిందువులతో మరింత శత్రుత్వం పెంచుకోవడం తప్ప సామరస్యం యెలా కుదురుతుందో కొంచెమైనా క్లారిటీ ఉందా వాడికి?

          హిందువుల దేవాలాయాల్లో అందులో పని చేసేవాళ్ళే బైబిళ్ళు పంచిపెట్టే దుస్థితి ఎందుకు దాపరించింది?తిరుమల తిరుపతి దేవస్థానం. విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానం లాంటివాటికి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నా కొందరు ఆలయ పూజారులు అడుక్కు తింటూనో స్వామివారి నగలు తాకట్టు పెట్టుకునో బతకాల్సిన దుస్థితికి ఎవరు కారణం?మేమైతే ఆలయాలని ధర్మకర్తల కన్న గొప్పగా సంరక్షిస్తాము అని వాగ్దానం చేసి ఆలయాలని చంకలో ఇరికించుకున్న ప్రభుత్వాలు కాదా!

          ఆలయాలని తమ రాజకీయాలతో కలుషితం చెయ్యడం తప్ప ఈ పుట్టు హిందూ బుద్ధి నాస్తికులు హిందూ ధర్మానికి ప్రభుత్వంలో ఉండి చేసిన మేలు ఒక్కటి లేదు!ముస్లిములకీ క్రైస్తవులకీ లేని సెక్యులరిజం పిచ్చి హిందువులకే ఎందుకు పట్టుకుందో నాకు అర్ధం కావడం లేదు!వీళ్ళ నిర్వాకం వల్ల భారతదేశం నుంచి కూడా హిందువులు అదృశ్యం అయిపోయే పరిస్థితి దాపరించింది.

          ఆలయాలని ప్రభుత్వానికి స్వాధీనం చెయ్యటం వల్ల ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే ప్రాచీన కాలపు చరిత్రనీ నవీన కాలపు చరిత్రనీ వాస్తవదృష్టితో చూసి సమీక్షించుకోవాలి."రాజు దైవంతో సమానుడు!" అన్నది "భూమి మీద మేమే దేవుళ్ళం!" అనే అహంకారంతో పెత్తనం చెయ్యడానికి వీలు కల్పిస్తూ రాజులకి ఆధిక్యతని ఇవ్వడానికి చేసిన కుట్ర కాదు.ఆనాటి రాజరికపు సంప్రదాయాన్నే పాటించిన ఇటీవలి కాలంనాటి జమీందార్లు కూడా ఏనాడూ దేవుడి కన్న గొప్పవాళ్లమని అహంకరించలేదు సరి గదా, వాళ్ళు కూడా దేవుడి పట్ల వినయాన్నే ప్రదర్శించారు.నూజివీడు జమీందార్లు తాము చెప్పే తీర్పులను కోటలేని వేణుగోపాలస్వామిని మధ్యవరిని చేసి ఇచ్చేవారు.అంతే కాదు కోటను విడిచి వెళ్ళేటప్పుడు,తిరిగి కోటలోకి వచ్చేటప్పుడు కోట మహిషమ్మ ఆలయానికి వెళ్ళి అనుమతిని తీసుకునేవారు.ఆలయాలని ఈ కుహనా లౌకికవాదుల చేతికి అప్పగించడం వల్ల దేవాలయాలకీ హిందువులకీ మధ్యన ఉన్న సంబంధం తెగిపోయింది - ఇదివరలో హిందువులకి ఆలయాల పట్ల ఆప్యాయత ఉండేది,ఇప్పుడు మనసు నిండిన భక్తితో చెయ్యాల్సిన ఆలయసందర్శన కూడా కొందరికి మొక్కుబడి వ్యవహారమూ కొందరికి తమ వైభవాన్ని ప్రదర్శించుకునే అవకాశమూ అయిపోయింది!ఇంగ్లీషువాళ్ళూ రొమిళ్ళా డప్పారులూ మెక్కాలే శిష్యులూ రాసిన అబద్ధాల చరిత్ర కాదు,ఈ దేశపు నిజమైన చరిత్రని పరిశోధించండి - ఆలయాల వైభవమే హిందువుల వైభవం,ఆలయాల పతనమే హిందువుల పతనం అనేది తెలుస్తుంది!

          దీనికి ఆలయాలకి ఉన్న అతీత శక్తులో,దైవలీలయో,శాపనుగ్రహసమత్ర్ధులైన బ్రాహ్మణవాక్యమో కారణం అని కూడా అనుకోనక్కర లేదు,అప్పుదైనా ఇప్పుదైనా ఎప్పుదైనా ఆలయాలకి వెళ్ళే హిందువులు మూడు రకాల ఉద్దేశాలతో వెళతారు.కొందరు అప్పటికే ధనధాన్యసమృద్ధులు ఉండటం వల్ల గానీ వాటి మీద ఆసక్తి లేకపోవడం వల్ల గానీ కేవలం ప్రశాంతతని కోరుకుని వెళ్తారు.పైన చెప్పుకున్న యౌగిక స్థాయిలలో వారు ఉన్న స్థాయికి ఏ ఆలయం ప్రశాంతతని ఇస్తే ఆ ఆలయానికి మళ్ళీ మళ్ళీ వెళతారు.కొందరు తమ జీవితంలో వృద్ధిలోకి రావడానికి మానవ ప్రయత్నం ఎంత చేసినా ఫలితం సంతృప్తిని ఇవ్వనప్పుడు దైవసహాయం కోరుకుని వెళ్తారు - మొక్కులు మొక్కుకుని అక్కడ మొక్కుకోవటం వల్లనే తమ కోరిక నెరవేరిందని తెలిసినప్పుడు కృతజ్ఞత చూపిస్తూ మొక్కుల్ని తీర్చుకుంటారు.కొందరు సనాతన ధర్మం నిషేధించిన పనుల్ని చెయ్యడం వల్ల గానీ జన్మ కారణం వల్ల గానీ వచ్చిన దోష పరిహార పూజలకి వెళ్తారు.నాకు తెలిసినంత వరకు హిందువులు ఆలయాలకి వెళ్ళడానికి మరో కారణం కంబడటం లేదు.ఈ మూడింటిలోనూ భక్తుల్ని ఎవరూ ఒత్తిడి పెట్టకపోవటం అనేది విశేషం!ఒక హిందువు అసలు ఏ ఆలయానికీ వెళ్ళకపోయినా కూడా ఆజీవపర్యంతమూ ప్రశాంతంగానే బతకవచ్చు - చర్చిలకీ మసీదులకీ ఉన్నట్టు ఇక్కడ హాజరుపట్టీల వ్యవస్థ లేదు, రాకపోతే మతంనుంచి వెళ్ళగొట్టే దుర్మార్గం అస్సలు లేదు!

           ఆలయాల వద్ద జరిగే భజనలూ సత్సంగాలూ ప్రజల్నీ రాజునీ కూడా ధర్మానికి కట్టుబడి ఉండేలా చేసేవి - దీనివల్ల ఒతర మతస్తులకీ సెక్యులరిస్టులకీ కలిగే ప్రమాదం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు!పైనుంచి ప్రజల మీద రుద్దడంలా కాకుండా ప్రజలు ఆలయానికి రాకపోయినా భయపడనక్కరలేని స్వేచ్చ ఇచ్చిన హిందూమతానిది దుర్మార్గమా?మా మతంలో చేరితేనే స్వర్గం వస్తుంది, మా మతంలో చేరకపోతే నరకం తప్పదు అంటూ భయపెట్టేది చాలక సంఖ్యని పెంచుకోవడానికి డబ్బులు కూడా వెదజల్లుతున్న వారిది సన్మార్గమా?ఈ డబ్బుకు గడ్డి తినే రంగసాని మీడియా పొగిడితేనే గొప్పోళ్ళం అవుతామనే భ్రమ నుంచి హిందువులు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది."గుళ్ళో హాజరు ప్రతి శనివారం, గూడుపుఠాణీ ప్రతి ఆదివారం!" అనే విశేరెడ్డి లాంటి బటాచోరు హిందువుల్ని కూడా ఎంత తొందరగా మన మధ్య నుంచి తన్ని తగిలేస్తే అంత తొందరగా హిందూమతం మళ్ళీ పునర్వైభవం సాధించుకునేటందుకు మొదటి అడుగు వేస్తుంది.
          జగిత్యాలలో ఒక ముస్లిం నాయకుడు అంతమంది హిందువుల మధ్యన నిలబడి కూడా గణనాథుని విగ్రహాన్ని కనీసం చేతితో తాకలేదు.నాలుగేళ్ళు గడిచినా కేంద్రం నుంచి రాష్ట్రానికి కావలసినవి తీసుకురాలేని అసమర్ధుడైన చంద్రబాబు గారు ముస్లిముల దగ్గిరకి వెళ్తే మాత్రం అంతులేని ఆత్మవిశ్వాసంతో హజ్ భవనాలు నిర్మించి ఇస్తానని గొప్పలు చెబుతాడు,ముస్లిముల పండగ వస్తే చాలు మసీదుకు వెళ్ళీ వాళ్ళ పక్కన కూర్చుని పులకిస్తాడు.ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక హిందువు ముసిముల మధ్యన ఎలా ప్రవర్తిస్తున్నాడు?ఈ అనామక ముస్లిం నాయకుడు హిందువుల మధ్యన ఎలా ప్రవర్తిస్తున్నాడు?ఇస్లామిక్ రాజ్యం ఏర్పడలేదు అని తప్ప ఏ ముస్లిం దేశంలోమూ ఇతర మతాల వారు తమ పండుగల్ని బహిరంగంగా జరుపుకొలేరు!బహిరంగం అటుంచండి తమ ఇంటిలో తమ ఆచారాల్ని పాటించుకోవడానికి కూడా జిజియా పన్ను కట్టాలి, అవునా?సెక్యులరిజం అంటే అన్ని మతాలనీ సమానంగా గౌరవించడమా లేక అల్పసంఖలో ఉన్నారనే కారణం చెప్పి ముస్లిముల్ని పరిధులు దాటి గౌరవించి అధికసంఖ్యలో ఉన్నందువల్ల ప్రత్యేకించి గౌరవించాల్సిన పని లేదని చెప్పి హిందువుల్ని అవమానించడమా?అటు వైపు నుంచి reciprocation ఉండటం లేదని తెలిసినా టోపీలు పెట్టుకుని ఎగబడి మరీ పండుగ శుభాకాంక్షలు తెలిపే మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు లాంటి కుహనా లౌకిక వాదుల్ని ఆదర్శవంతులని నమ్ముతున్నంత కాలం హిందూమతం బాగుపడదు - అది ఖాయం!

          హిందువులది సహజంగా అంతటా దేవుణ్ణి చూసే మనస్తత్వం కాబట్టి చంద్రబాబు మసీదుకి వెళ్ళడాన్నీ తమ మతంలో ప్రత్యేకించి విగ్రహారాధన మీద నిషేధం ఉంది కాబట్టి ఆ జగిత్యాల ముస్లిం నాయకుడు గణేశ ప్రతిమని ముట్టుకోకపోవడాన్ని పటించుకోకపోయినా ఫరవాలేదు గానీ కాషాయం కనిపిస్తే చింపుతానని కొవ్వుపట్టి వాగినవాణ్ణి హిందువుల దుర్మార్గానికి బలైపోయిన దళితుడిగా చూపించి వాడి ఆత్మహత్యని కూడా హిందువులంతా కలిసి చేసిన హత్యలా మార్చి గొడవ చేసినవాళ్ళు వాడి రౌడీతనానికి గురై హాస్పటల్లో చేరినవాణ్ణి హిందూమతతత్వవాదుల తొత్తు అనడంలో ఉన్న మతలబు తెలిశాక కూడా హిందువులు సెక్యులరిష్టుల మెప్పు కోసం అంగలార్చటం వెర్రిబాగులతనం తప్ప ఆదర్శం ఎంతమాత్రం కాదు!

          హిందువుల జీవన విధానంలోని ఏ అంశమూ - ఆలయ సందర్శనంలో గానీ,విగ్రహారాధన విషయంలో గానీ,నమ్మకాలలో గానీ ఇతర మతస్థులని అవమానించేది ఒక్కటి కూడా లేదు.హేతువాదులు మూఢనమ్మకాల విషయంలో గానీ, దొంగ స్వాముల విషయంలో గానీ చేసే పోరాటాలకి హిందువులు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు.మీదు మిక్కిలి వాటి మీద పోరాడిన వారిలో హేతువాదుల కన్న హిందువులే ఎక్కువ!హిందువుల్ని విమర్శించితే వచ్చే పేరు ప్రతిష్ఠల కోసం మీడియా ముందు అల్లరి చెయ్యటమే తప్ప క్షేత్రస్థాయిలో మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పనిచెయ్యటం పట్ల హేతువాదులకి నిజాయితీ లేదనేది వారి ప్రవర్తనలోని వైరుధ్యాలని గమనించినవారికి తేలికగానే బోధపడుతుంది.ఎటు చూస్తే అటు శత్రుమూకల మధ్యన నిలబడి ఉన్న హిందువులు శతాబ్దాల పాటు పట్టి పీడించిన స్తబ్దతని ఇక వదిలించుకుని చురుకు తెచ్చుకోవాలి.మనం పడిపోతే పగలబడి నవ్వే శాడిష్టులు తప్ప మనకోసం యేడ్చి సాయానికి వచ్చేవాడు ఒక్కడూ లేడు!వీళ్ళతో మనకేంటి?అయినా మనకేం తక్కువ!! హిందూమతాన్ని మళ్ళీ మేరు శిఖర సదృశం చేసి నిలబెట్టడానికి ప్రయత్నాలు మొదలయినాయి - తిరుమల మనదే అన్న పాంచజన్య శంఖారావం మారుమ్రోగింది!

          హిందువుల మనసుల్లో ఎప్పటి నుంచో రగులుతున్న ఆవేదన ఇన్నాళ్ళకి భక్తి చానల్ వారి చొరవతో జరిగిన ఒక కార్యక్రమం రూపంలో బయటపడింది.ప్రసంగించిన వారందరూ నిస్వార్ధపరులే, సన్యాసులే, పరివ్రాజకులే!ఇప్పటి వరకు హిందువులకి తమ భవిష్యత్తు గురించి ఆలోచినప్పుడల్లా ఎన్నో సమస్యలు, ఎన్నో సందేహాలు, ఎంతో గందరగోళం అనిపించేది!ముందుకడుగు వేద్దామనుకున్నప్పుడల్లా ఒక అనిశ్చితి, ఒక తడబాటు వెనక్కు లాగేది - ఈ సభతో అన్నింటినీ దాటుకుని ఉద్యమం కొంత స్పష్టమైన దశకి వచ్చింది.అక్కడ ప్రసంగినంచిన వారిలో నన్ను ఎక్కువ స్పందింపజేసిన ఇద్దరి ప్రసంగాలని మాత్రం ఇక్క ప్రస్తావించుతున్నాను.

          పూర్వ డి.జి.పి శ్రీ అరవింద రావు గారు సనారన ధర్మం మీద దేశం బయటి నుంచి విదేశీ మేధావులూ దేశం లోపల నుంచి స్వదేశీ మేధావులూ కలిసి చేస్తున్న దాడిని గురించి ఆధారాలతో సహా వివరించారు.దేశం బయట మూడు agencies కలిసి పని చేస్తున్నాయి.ఇవి పూర్తిగా కలిసిపోయి లేవు,అలా ఉంటే గుర్తు పట్టటం తేలికయ్యేది..విడి విడి సంస్థలుగా ఉంటూనే ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయి ఈ మూడు బహుళజాతి మత సంస్థలు!మొదటి వర్గం Scholors:జకీర్ నాయక్ ఈ మధ్యనే బయలు దేరాడు,అతనూ అతని గురువూ కూడా ఎప్పటినుంచో క్రైస్తవ మేధావులు చేస్తున్న పనినే ఇస్లాము కోసం మొదలు పెట్టారు.వీళ్ళు పేరు మోసిన యూనివర్సిటీలలో ప్రొఫెసర్లుగా ఉంటారు,ఇతర మతాలను గురించి వివరాలను సేకరించి విశ్లేషణ పేరుతో తమ మతాలను గొప్పవనీ ఇతర మతాలు చెత్తవనీ చెప్పడం కోసం వీరు చాలా గౌరవప్రదమైన వ్యక్తులుగా చెలామణీ అవుతూ ఉంటారు.భాషలో మర్యాద ఉంటుంది, కానీ భావంలో ఉంటుంది అసాలు సిసలు నీచత్వం!

          పేరుకీ స్థాయికీ ప్రొఫెసర్లు అయినపటికీ ఇతర మతాలను వీరు విమర్శించే పద్ధతి అసహ్యం కలిగించేలా ఉంటుంది.ఉదాహరణకి మన గణేశ మూర్తిని తీసుకుంటారు.ముఖం ఉండాల్సిన స్థానంలో వృషణాలు వేలాడుతున్న పురుషాంగం బొమ్మని ముద్రిస్తారు.ఇంక విశ్లేషణ పేరుతో గణేశ రూపకల్పన వెనక ఉన్నది పురుషాధిక్యత,అణిచిపెట్టబడిన కాముక ప్రచోదనలు,మానసిక రోగ సంబంధమైన స్వభావం లాంటివి ఉన్నట్టు సూత్రీకరణలు చేస్తారు.వీరి నుంచి సమాచారం తీసుకున్న Missionaries అనే రెండవ agency క్షేత్రస్థాయిలో అమాయకులకి మీ మతంలో ఈ తప్పులున్నాయి,మీరు పడుతున్న కష్టాలన్నిటికీ ఆ మతాన్ని పాటించటమే కారణం, మా మతం మీ మతం కన్న చాలా మంచిది,ఒక్కసారి మా మతంలోకి అడుగు పెడితే చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని కల్లబొల్లి కబుర్లు చెప్తారు.ఏదో ఒక రకంగా సంఖ్యని పెంచుకోవడమే తప్ప వాళ్ళ కష్టాలకి కారణమైన తప్పులు చెయ్యకుండా ఉండేందుకు అవసరమైన ఇంద్రియనిగ్రహం లాంటి మంచి విషయాలను వీరు పొరపాటున కూడా ప్రస్తావించరు.ఇక మూడవ agencyగా ప్రతి క్రైస్తవ మెజారిటీ దేశమూ ఈ రెండు agencyలకీ సహాయం చెయ్యడానికి తమ అధికారాన్ని ఉపయోగిస్తాయి.వీటన్నిటికీ పైన వాటికన్ ప్రభుత్వాలను కూడా శాసించగలిగిన స్థానంలో ఉంది.

          ఇక మన దేశం లోపలి పరిస్థితి యెలా ఉందంటే హిందూమతం మీద విదేశాల నుంచి జరుగుతున్న వ్యవస్థీకృతమైన దాడి గురించి బాగా చదువుకున్న హిందువులకే తెలియదు.అరవిందరావు గారే చెబుతున్నారు తనకి కూడా ఇవన్నీ రిటైరయాకనే తెలిసినాయని.మన మతం మీద జరుగుతున్న దాడి గురించే కాదు అసలు మన మతం గురించే చాలామంది హిందువులకి తెలియదు.చెప్పకపోవడం పెద్దలదే తప్పు - కష్టంగా అనిపించినా సరే అన్నింటినీ బ్రాహ్మణుల చేతుల్లో పెట్టేసి ఇతర కులాలు మతం గురించిన విషయాలకి దూరంగా ఉన్నారు.పతనానికి పూర్తి బాధ్యతని బ్రాహ్మణుల మీద పెట్టేసి తప్పుకునే ధోరణి చాలామందిలో కనిపిస్తున్నది.ఇప్పుడు జరగవలసింది ఒకరినొకరు దెప్పుకోవడం కాదు ఎవరి తప్పులు వాళ్ళు సరిదిద్దుకోవాలి.
          ఉద్యోగ జీవితంలోని హడావిడి తీరిక ఇవ్వదు కాబటి మేధావుల అజ్ఞానం క్షమించదగినదే కానీ శాసనాధికారం ఉండి ప్రజల జీవితాలని తీర్చిదిద్దగలిగిన హిందూ రాజకీయ నాయకుల అజ్ఞానం మాత్రం చాలా ప్రమాదకరమైనది - "మనం మెజారిటీ మతస్థులం కదండీ!మైనార్టీల్ని ఆదరించితే తప్పేమిటి?ఔదార్యం మంచిదే గదా" అంటూ ఉంటారు.వీళ్ళ ఓట్లు-సీట్లు-నోట్లు-స్వింగు పాట్లతో ఇవ్వాళ హిందువులు అందరు మైనార్టీల కన్న కిందకి దిగజారిపోయి బతుకుతున్నారు.అరవిందరావు గారు చెప్పిన అసలైన లోపం క్రైస్తవంలో వాటికన్,ఇస్లాంలో ముల్లాల వ్యవస్థ మాదిరి  హిందూమతానికి ఒక central autharity లేకపోవటం అన్నది నాకు మాత్రం ఒప్పుకోవాలని అనిపించటం లేదు.ఒకసారి central autharity ఏర్పడితే నాటి నుంచి నేటి వరకు ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం దెబ్బతిని మరింత కీడు జరుగుతుందని అనిపిస్తున్నది నాకు.కొత్త structure కోసం క్రైస్తవాన్నీ ఇస్లామునీ imitate చెయ్యనక్కర లేదు,శంకరాచార్యుల వారు స్థాపించినవీ, రామానుజులు మధ్వాచార్యుల వంటి వారు స్థాపించినవీ అయిన పూర్వగురుపరంపరనే మరింత దగ్గరకి చేరిస్తే చాలునని నాకు అనిపిస్తున్నది.

          అయితే మనం కూడా మన మతాన్ని globalaization నేపధ్యానికి తగ్గట్టు తీర్చి దిద్దుకోవటం తప్పనిసరి అని నేనూ ఒప్పుకుంటున్నాను.గ్లోబలైజేషన్ లెక్కల ప్రకారం ఒకనాడు ప్రపంచమంతటా విస్తరించిన మన మతం ఇవ్వాళ క్రైస్తవం,ఇస్లాం,బౌద్ధం తర్వాత నాలుగో స్థానంలో ఉంది.ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఆలయాలని స్వాధీనం చేసుకోవటం కోసం మాత్రమే జరుగుతున్న హడావిడి కాదు, హిందూమతాన్ని తిరిగి ప్రపంచ స్థాయిలో మొదటి స్థానానికి తీసుకువెళ్ళాలనే ప్రణాళిక ఉందనేది మర్చిపోకూడదు!

          హిందూ రాజకీయ నాయకులలోని హిందువుల ప్రయోజనాల పట్ల ఉన్న నిర్లక్ష్యం వల్లనే హిందువులు తమ ప్రయోజనాల కోసం అందరూ కలిసి ఉద్యమించలేని పరిస్థితి దాపరించింది.ఇవ్వాళ మనం నిజాలను ఒప్పుకుని మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నవాళ్లకి ఒక assurance ఇవ్వకపోతే రేపటి రోజున అసహనం ఎక్కువై హిందూ కురాళ్ళు కూడా తీవ్రవాదులుగా మారే ప్రమాదం ఉంది.దేశ విభజన జరిగే సమయానికి పాకిస్తానులో 14 శాతం ఉన్న హిందువులు 1 శాతానికి తగ్గారు,బంగ్లాదేశ్ పరిస్థితి కూదా అంతే - మొదట 24 శాతం ఉన్న హిందువులు 7 శాతానికి తగ్గారు.ఇతర మతస్థులు తాము అధికారంలో ఉన్న చోట హిందువుల్ని విడతలు విడతల మూకుమ్మడి హత్యలతో చంపి తగ్గిస్తుంటే కనీసం చీమ కుట్టినంత నెప్పి కూడా తెలియని సూడో సెక్యులరిజం మత్తులో జోగుతున్నారు భారతీయ హిందువులు!సమస్యని సరయిన సమయంలో గుర్తించి పరిష్కరించకపోతే ఎంత అమాయకపు కుర్రాళ్ళయినా ఏదో ఒక రోజుకి radicals అయి తీరుతారు.

          శ్రీ పరిపూర్ణానంద స్వామి గారు ఇవ్వాళ హిందువులు ఉన్న వాస్తవమైన పరిస్థితిని చూపించి భవిష్యత్తులో హిందూ సమాజం ఎలా ఉండాలో కూడా చెప్పి దానికి గట్టి కార్యాచరణ ప్రణాళీకను కూడా అందించారు - అద్భుతమైన ప్రసంగం!కేవలం కబుర్లపోగులా కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అనుభవం స్వామీజీకి ఇంత చక్కటి పరిష్కారం అందించటానికి ఉపకరించింది.మామూలుగా 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు అని కొందరు అమాయకంగా భావిస్తున్న విషయాన్ని స్వామీజీ లెక్కలు చెప్పి మరీ అబద్ధం అని నిరూపించారు.120 కౌట్ల మంది భారతీయులలో క్రైస్తవులు, మహమ్మదీయుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.ఇంకా శిఖ్ఖులు, జోరాష్టియన్స్, అలాగనే పార్శీలు, సింధీలు,జై నులు అనే తెగలుగా విడిపోయాక అందరూ హిందువులు ఎట్లా అవుతారు?వీళ్ళే కాదు నాస్తికులు, బౌద్ధులు - ఇవి కాక హేతువాద, మానవవాద, శాస్త్రీయవాద విజ్ఞాన వేదికలు బోల్డున్నాయి.వీళ్లందర్నీ పక్కన పెడితే నిఖార్సైన హిందువులు ఒక 50 కోట్లు ఉండవచ్చును.మళ్ళీ ఇందులో మేము హిందువులమా కాదా అన్న అయోమయంలో ఉన్నవాళ్ళు ఒక 30  కోట్లు ఉన్నారని అనుకుంటే "నేను హిందువును!" అని రొమ్ము విరుచుకుని చెప్పుకోగలిగిన వాళ్ళు కేవలం 20 కోట్లు మాత్రమే నన్నమాట - హిందువుల మెజారిటీ ఎప్పుడో చంకనాకిపోయి9ంది!రంజానుకి ఒక మైనారిటీని, క్రిస్మసుకి ఇంకో మైనారిటీని బుజ్జగించటంతో పాటు ఈ కొత్త మైనారిటీని కూడా పట్టించుకోవాలి!వారిని బుజ్జగించడం తప్పు కాదువాళ్ళు కూడా బాగుండాలి,హిందువులం మనం బాగుండాలి అందరూ బాగుందాలి అని కోరుకుంటాం.

          294 మంది శాస్నసభ్యులలో హిందువుల కోసం కనీసం 265 మంది ఉంటే, ఒక్క శాసనసభాపతి అయినా,శాసన సభాధ్యక్షుడైనా ఉండాలి.అప్పుడే శాసనసభలో హిందూ వాణి వినబడుతుంది.హిందువుల గురించి పార్టీల కతీతంగా మాట్లాడే నాయకులు ముందుకు రావాలి.అయితే వాళ్ళు ఏమి మాట్లాడాలి అనేది మనం స్పష్టం చెయ్యాలి.ఇవ్వాళ చాలామంది హిందువుల ధోరణి యెలా ఉందంటే - తిరుపతి వెళ్ళాం, క్యూలో నుంచున్నాం, గోవిందలు కొట్టాం, స్వామి దర్శనం చేసుకున్నాం. లడ్డూలు తీసుకున్నాం, తిరిగొచ్చాం, అయిపోయింది అనుకుంటున్నారు!హిందూత్వం అంటే ఇంతే అనుకుంటే you are a partial Hindu,ఏ ధర్మం స్వామిని మనకు చూపించిందో ఆ ధర్మాన్ని అహర్నిశలూ అనుసరించినప్పుడే ధర్మం నిలబడుతుంది.ధర్మాన్ని నూటికి నూరు శాతం అనుసరించనివాడు complete Hindu కాడు.మన సంస్కృతికి మూలమయిన వేదం "మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిధిదేవోభవ" అంటుంది.ఇంకా చాలా చెప్తుంది గానీ ఈ నాలుగూ ప్రతి ఒక్కరూ చెయ్యగలిగినవి.అయితే ఆచరణలో మనం ఫెయిలయ్యామేమోనని అనిపిస్తుంది.స్వామి వారి తల్లి వకుళామాత!ఆమె గుడి నిరాదరభకి గురయి ఎలాంటి దుస్థితిలో పడిపోయిందంటే ఆవిడకి శిరచ్చేదనం చేసి ఆభరణాల్ని దొంగలు ఎత్తుకుపోయి మైనింగ్ పేరిట ఆలయం మొత్తాన్ని చిన్నాభిన్నం చేశారు.అంటే మనకి తల్లి అఖ్ఖర్లేదు,సంపాదించి పెట్టే కొడుకు చాలు!ఇది ఏ రకమైన వైఖరి - ఆలోచించుకోండి!

          నాకు కూడా ఇవ్వాళ అక్కడికి వెళ్ళాకనే తెలిసింది - ధర్మో రక్షతి రక్షితః అని ప్రగల్భాలు పలుకుకుంటున్నామేమో,మనందరం paper tigers అయిపోయామేమో అని అనుమానం వచ్చేసింది.ఈ వ్యవస్థని కాపాడుకోవాలంటే ప్రభుత్వం పట్ల మన వైఖరి స్పష్టంగా ఉండాలి.అదగందే అమ్మైనా పెట్టదు అనే మాట నాకు చాలా దరిద్రంగా అనిపిస్తుంది.అడక్కుండా పెట్టేదే అమ్మ.అడిగాక పెదదాంలే అనుకునేది సవతి తల్లి మాత్రమే.కన్నతల్లికి బిడ్డ ఆకలి ముందే తెలుస్తుంది - బిడ్డ తన వైపు చూసేసరికే బట్టే అన్నం గిన్నెతో రెడీగా ఉంటుంది!

          అట్లా మనకి కన్నతల్లిలా ఉన్న ప్రభుత్వాన్ని మనం అడగాల్సింది ఒకటే - తిరుమలని హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించాలి.అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు ఇప్పటికే ఇక్కడ కూర్చుని సమస్త హిందువులనీ అనుగ్రహిస్తున్నాడు.దానికి సాధికారికత కల్పించాలి, అంతే!క్షేత్రం అంటే అన్నీ క్షేత్రాలే - అన్నవరం క్షేత్రమే, శ్రీశైలం క్షేత్య్రమే.అయితే, అన్ని క్షేత్రాలకు ఒక కేంద్రం కావాలి, అది తిరుమల అవ్వాలి.ఇలా చెయ్యడం వల క్రైస్తవులకి ఇబ్బంది లేదు, మహమ్మదీయులకి ఇబ్బంది లేదు,అసలు ఎవరికీ అభ్యంతరం ఉండటానికి వీల్లేదు.మరొక ముఖ్యమైన అంశం తిరుమల తిరుపతి చుట్టూ 4,722 చదరపు అడ్డుగుల కిలోమీటర్ల పరిధి మేర biosphere zone కింద ప్రకటించాలి.అంటే ఇక్కడున్న భూమిని ఎవ్వరూ తొలచకూడదు, వ్యక్తిగతమైన వ్యాపారాలకి వాడుకోకూడదు.సుమారు చిత్తూరు నుండి కడప వరకు మొత్తం భూమి స్వామివారి అధీనంలో ఉన్నట్టు భావించాలి.

          నిజానికి ఒక చట్టం ఉంది,అయినా మైనింగులు జరుగుతున్నాయి - చట్టంలో ఉందని సామాన్యులకి తెలియదు,తెలిసిన వాళ్ళు వాటిని అమలు చెయ్యడం లేదు.ఈ మైనింగుల భీబత్సంలోనే వకుళామాత ఆలయం కూలిపోయింది.అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఒక ప్రబుద్ధుడు నన్ను అక్కడ వకుళామాత ఉందని ఆధారం ఏమిటి అని అడిగాడు.మన గుడి కూలిపోయింది గానీ ఆ పక్కనే ఒక చర్చి మాత్రం క్షేమంగానే ఉంది.వాళ్ళు ఆ మనిషిని పంపారు.నేను అసలు నువ్వు ఈ స్థలంలో ఉన్నట్టు ప్రమాణం ఏమిటి అని అడిగాను.వాళ్ళకి ప్రమాణాలు చూపించాల్సిన దౌర్భాగ్యం మనకి లేదు.మీరు ఒకటి గమనించండి - వకుళా మాత ఆలయం ఎప్పుడు కూలింది?సమాజంలో అస్థిరత్వం ఎప్పుడు మొదలైంది?వ్యాపారాలు సజావుగా సాగడం లేదు, రైతులు నష్టపోతున్నారు,ఒక్క వకుళామాత ఆలయాన్ని నిర్మించండి, కొడుకు ఆనందిస్తాడు, మనందరం బాగుంటాం - ఇది సత్యం!
          తాటికాయంత తప్పు వాళ్లలో ఉంచుకుని మనలోని గుండుసూదంత తప్పుని పట్టుకుని రెచ్చిపోతున్నారు హిందూద్వేషులు.వాళ్ళ పసలేని విమర్శలకి అతిగా స్పందించి హిందూ దేశం నడిబొడ్డున హందువునని చెప్పుకోవడానికి సంకోచపడుతున్నాం - ఎందుకు?అలాంటి దౌర్భాగ్యపు మనస్తత్వంలో ఎప్పటికీ ఉండకూడదు - భయపడకూడదు!ఒక హందువు "నేను హిందువుని!" అని ఇక్కడ చెప్పుకోకపోతే ఎక్కడ చెప్పుకోవాలి - బెత్లెహేము లోనా?వాటికన్ లోనా?దుబాయ్ లోనా?అలా మనం హిందువులమని చెప్పుకోవటం పెదవి చివరి పలుకులా కాకుండా ప్రణాళికాబధమైన పని జరగాలి.

          నేను దళితవాడల్లో పర్యటిస్తున్నాను,మొన్న 18 కుటుంబాలని నేను మళ్ళీ హిందూత్వానికి చేరువ చేశాను.ఒకాయన అడగనే అడిగాడు మీరు మార్చారు,ఎందుకు మతమార్పిడి చేశారని.నేను చెప్పాను - ఒక క్రైస్తవుణ్ణి మార్చలేదు,ఒక మహమ్మదీయుణ్ణి మార్చలేదు,వాళ్ళు హిందువులే!మా మతంలోనే దూరంగా ఉన్నవాళ్లని దగ్గరికి తీసుకొచ్చాను.ఇలాగ ఒక యేడాదిలో 18 కుటుంబాల్ని కాదు 18 లక్షల కుటుంబాలని దగ్గర చేసే స్థోమత నాకుంది.వొద్దు,మాకు మతమార్పిడులు అవసరం లేదు.ఇప్పటికే ఇక్కడ తిరుమలలోనే "వొద్దు, రావొద్దు - రూములు ఖాళీగా లేవు, సెల్లార్లు నిండిపోయాయి. గంట పట్టే దర్శనం పది గంటలు పడుతుంది!" అనే పరిస్థితి ఉంది.క్రైస్తవుల్నీ మహమ్మదీయుల్నీ కూడా మతం మార్చుకుని హిందువుల్లో కలిసిపోతే స్వామివారికే చోటు మిగలదు.

          నేను క్షేత్రస్థాయిలో తిరగడం వల్ల నాకు తోచిన కొన్ని సూచనలు ఇస్తున్నాను. తిరుమలని హిందూ ధార్మిక కేంద్రంగా గుర్తించడంతో సరిపోదు,ఒక హిందూ ధార్మిక మండలి కావాలి అనిపిస్తున్నది.ఇందులో ఒక రిటైర్డ్ ఐ.ఏ.యస్ ఐ.పి యస్ అధికారి కానీ మేజిస్ట్రేట్ కానీ హిందూత్వం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు సాధువులు పండితులు కలిపి ఒక మండలి ఏర్పడితే ప్రభుత్వానికి సమానతరంగా పని చేస్తూ ఉంటుంది.వాళ్ళు ద్వారా వచ్చే సూచనలని ప్రభుత్వాలు అన్ని ఆలయాలకీ వర్తించేటట్లు అమలు చేయగలిగేలా ఉంటే హిందూమతం ఖచ్చితంగా పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది - ముస్లిములకి వక్ఫ్ బోర్డు ఉన్నట్టు క్రైస్తవులకి ప్యానల్ ఉన్నట్టు అది ఉపయోగపడుతుంది.

          నా దృష్టిలో ఈ మొత్తం వ్యవస్థ ఎలా పనిచేస్తిందంటే ఆంధ్రరాష్ట్రంలో సుమారిఉ 5000 గ్రామాలున్నాయి.ఉజ్జాయింపుగ అజిల్లకి 200 గ్ర్మాలు ఉన్నాయని అనుకుందాం.ఈ 5000 గ్రామాలో ప్రతి గ్రామంలోనూ ఒక ఆలయాన్ని నిర్మించవచ్చు, TTD 5 లక్షల రూపాయల ఖర్చుతో ప్క ఆలయాన్ని నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకుంది.ఆ 5 లక్షలూ స్థానికులకి ఇచ్చి కట్టుకోమనడం కన్న TTDయే తన ఇంజనీర్ల ద్వారా తన సిబ్బందిని ఉపయోగించుకుని ఆ పని చెయ్యాలి.తర్వాత అక్కడ ఏ వర్గం వారు ఎక్కువ ఉంటే వారిలో ఒకరికి అర్చకత్వంలో ట్రయినింగ్ ఇచ్చి అతని జీవనభృతికీ ఆలయానికి ధూపదీపనైవేద్యాలకీ కలిపి 3,500 రూపాయలు గనక ఏర్పాటు చేస్తే అతను ఆ అలయం అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే సైనికుడిలా తయారవుతాడు.దీనికి పైన జిల్లాకి పదిహేను మంది అంకితభావం గలిగిన ప్రచారకులు కావాలి.OCల నుండి అయిదుగురు, BCల నుండి అయిదుగురు, SCల నుండి అయిదుగురు - రాజ్యాంగంలో ఎలా వుందో అలాగే వెళదాం, మనకి అభ్యంతరం దేనికి?ఒక్కొక్కరికి 8000 రూపాయలు గౌరవవేతనం వాళ్ళకిస్తే వాళ్ళ జిల్లాని వాళ్ళు కాపాడుకుంటారు.వీటన్నిటికీ నేను లెక్కలు కూడా వేశాను.సుమారు 5 కోట్లు మాత్రమే అవుతుంది,TTD 200 కోట్ల వరకు ధర్మప్రచారం కోసం ఖర్చు చెయవచ్చునని నియమావళిలో ఉంది.మొత్తం చెయ్యగలిగిన ఖర్చులో ఇది చాలా స్వల్పం.కానీ ఫలితం మాత్రం అమోఘంగా ఉంటుంది.
          శ్రీ పరిపూర్ణానంద స్వామి చెప్పినది చాలా బావుంది - హిందూమతాన్ని ఉద్ధరించాలనుకునేవాళ్లలో చాలామందికి భిన్నమైన వాస్తవికత ఉంది.అయితే, ఆయన చేసిన కొన్ని ప్రతిపాదనలు  మాత్రం కొంచెం గందరగోళం అనిపించాయి నాకు.ముఖ్యంగా రాజకీయ నాయకులు పార్టీలకి అతీతంగా హిందూత్వం కోసం పనిచెయ్యడం అన్నది సాధ్యపడదు.ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుడు ఆ పార్టీలో తను యెదగడానికి హిందూత్వం ఉపయోగపడుతుందని నమ్మకం ఉంటేనే హిందూత్వాన్ని సమర్ధించుతాడు,ఇందుకు బీజేపీతో సహా యే రాజకీయ పార్టీ సభ్యుడూ మినహాయింపు కాదు.అలాంటప్పుడు 200 పైచిలుకు శాసనసభ్యులు హిందూమతం కోసం మాట్లాడటం అనేది జరిగే పని కాదు.ప్రస్తుతానికి రాజకీయ నాయకుల నుంచి సపోర్టు ఆశించకుండా ప్రజలని చైతన్యవంతం చెయ్యటం మీదనే దృష్టి పెట్టాలి.ఉద్యమం ప్రజల్లో మంచి స్పందన తేగలిగితే మనం పిలవకపోయినా వస్తారు - అప్పుడు వాళ్ళని సొంత గొప్పల కోసం చూసుకోకుండా కంట్రోల్ చెయ్యగలగడమే ముఖ్యమైన సవాలు!అరవిందరావు గారు జాలిపడుతున్నారు గానీ వాళ్ళు భయపడాల్సిన వాళ్ళు.

          లక్ష్యం విషయంలో కూడా మరింత స్పష్టత తెచ్చుకోవాలి.లక్ష్యం విషయంలో స్పష్టత లేనప్పుడు ఎంత గొప్పగా మొదలైన ఉద్యమమైనా తొందర్లోనే అణగారి పోతుంది.మొదటి నుంచీ అందరిలోనూ ఉన్నది ఆలయాల్ని ప్రభుత్వం తీసుకున్నప్పటికి ముందున్న ధర్మకర్తల వ్యవస్థని పునరుద్ధరించటం.ఒకేసారి అన్ని ఆలయాలనీ ప్రభుత్వం నుంచి విడిపించుకుని ధర్మకర్తల వ్యవస్థని పునరుద్ధరించడం గనక జరిగితే తిరుమలని హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించటం కోసమూ హిందూ ధార్మిక మండలి ఏర్పాటు కోసమూ ప్రబ్బుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదు.ఎందుకంటే, ప్రతి ఆలయానికి సంబంధించిన ధర్మకర్త యొక్క బాధ్యతల్లో ఆ రెండూ ఇమిడి ఉంటాయి.ప్రతి ధర్మకర్తకీ ఆలయానికి భక్తులని రప్పించుకోవాలంటే ఆలయం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోనూ నగరాలలోనూ ధార్మిక చింతన పెంచటం తప్పనిసరి అవుతుంది - ఆలయానికి వచ్చే ఆదాయం భక్తులు సంతోషం కొద్దీ ఇచ్చే కానుకలు మాత్రమే తప్ప ప్రభుత్వం పన్నుల్ని వసూలు చేసినట్టు బలవంతం చెయ్యడం కుదరదు కదా!ఎటు తిరిగీ హిందూ ధార్మిక ప్రచారంలో పీఠాధిపతుల మాటయే శిరోధార్యం కదా!

          ఇక హిందూ ధార్మిక మండలిని కొత్తగా ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఏమిటి?అదీ పీఠాధిపతుల్నీ సన్యాసుల్నీ రిటైర్డ్ అధికారుల్నీ ఒకే గాటన కట్టడమా!అసలు కొత్త ఏర్పాటు అనవసరం - ఇప్పటికే ఉన్న ఆది శంకరులు స్థాపించినవీ, రామానుజులు స్థాపించినవీ అయిన పీఠాలకి అధిపతులనే ఒక్కచోటికి తెచ్చి కలిపితే హిందూ ధార్మిక మండలి తయారైపోతుంది.దీనికి ప్రభుత్వం అనుమతి కూడా అక్కరలేదు,ప్రస్తుతం ధర్మకర్తల వ్యవస్థని పునరుద్ధరించడం గురించి కాకుండా ఆలయాల నిర్వహణ ప్రభుత్వం దగ్గిరే ఉంచి తిరుమలని హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించమని కోరుతున్నారు గనక దానికి ముందుగానే హిందూ ధార్మిక మండలిని ఏర్పాటు చేసుకోవచ్చు - ఓ పనైపోతుంది!మాజీ అధికారుల్ని ఆ మండలికీ ప్రభుత్వానికీ మధ్యన వారధిలా ఉపయోగించుకుంటే బాగుంటుంది.మన హిందూ స్వామీజీలకీ పీఠాధిపతులకీ ఇతర మతాల్లో,ముఖ్యంగా చర్చి ఫాదర్లతో పోలిస్తే లోకజ్ఞానం తక్కువ.వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్పడం తప్ప తమ మాటని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మన్నించే పధతిలో యెట్లా చెప్పాలో వాళ్ళకి తెలియదు - అక్కడ ఈ విశ్రాంత అధికారుల్ని ఉంచితే ఆ లోటు తీరుతుంది.
          సూటిగా ధర్మకర్తల వ్యవస్థని పునరుద్ధరించమని అడగకుండా ఆలయాలని ప్రభుత్వం కిందనే ఉంచి తిరుమలని మాత్రం హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించమని అడగటంలో చాలా చిక్కులు ఉన్నాయి.తిరుపతి సభలో ప్రసంగించినవారు తిరుమలని హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించడాన్ని రాష్ట్రపరిధిలో కోరుకుంటున్నారా లేక జాతీయ స్థాయిలో కోరుకుంటున్నారా?అక్కడ మాట్లాడిన వారి ధోరణిని బట్టి చూస్తే హిందూ ధార్మిక మండలి మొత్తం దేశంలోని అన్ని ఆలయాలకీ వర్తించాలని అంటున్నదాని ప్రకారం అది కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సి ఉంటుంది.జాతీయస్థాయిలో మనం తిరుమల కోసం అడుగుతున్నామని తెలిసి తమిళులు శ్రీరంగం కోసమో చిదంబరం కోసమో అడిగితే ఏం చెయ్యాలి?అడగరని గ్యారెంటీ లేదు!అప్పుడు తిరుమల కోసం లాబీయింగ్ కూడా చెయ్యాల్సి ఉంటుంది.

          వీటన్నింటి పట్ల మరింత స్పష్టత తెచ్చుకుని ధర్మకర్తల వ్యవస్థని పునరుద్ధరించటం అనే ఒక్క లక్ష్యంతోనే ముందుకెళ్ళడమా,ఆలయాలని దేవాదాయ శాఖ అజమాయిషీలోనే ఉంచి ఈ మూడు కోరికల్నీ ప్రభుత్వం నెరవేర్చేలా చేసుకోవడమా అనేది నిర్ణయించుకుంటే తర్వాత దశలో ఉద్యమానికి ఒక నాయకుడు అవసరం .ప్రస్తుతానికి ఎవరూ కనబడటం లేదు. కానీ వెతకాలి.వెతికితే దొరకనిదంటూ లేదు కదా!ఉద్యమం ఎప్పటికైనా రాజకీయ కోణం సంతరించుకోక తప్పదు - ఉద్యమానికి నాయకత్వం వహించే వ్యక్తి ఆ సమయం వచ్చేవరకు ఉద్యమాన్ని అటు పోనివ్వకుండా ఆపగలిగి సమయం వచ్చినప్పుడు వెనక్కి లాగకుండా క్రమశిక్షణతో నపగలిగి ఉండాలి.

          ప్రస్తుతం జరగాల్సినది సామాన్య హిందువులలో సెక్యులరిజం,సోషలిజం లాంటి వాటిపట్ల ఉన భ్రమల్ని వదలగొట్టటం.అందరు వక్తలూ "అన్ని మతాలూ సమానమే అని చెప్తున్నది హిందూమతం ఒక్కటే!" అని పదే పదే ఉద్ఘాటిస్తున్నారు - అది కుదరదు.అన్ని మతాలూ సమానమే అయినప్పుడు హిందువులు మాత్రం హిందూమతానికే కట్టుబడి ఉండాల్సిన అవసరం ఏమిటి?అసలు పెద్దలు చెప్తున్నది కూడా అది కాదు.ఒక పర్వతం ఉంది.ఆ శిఖరం మీద ఒక భవనం ఉంది.ఆ భవనాన్ని చేరుకోవడమే అందరి లక్ష్యమూ అయినప్పుడు ఎవరు ఏ దారిలో వెళ్ళినా అక్కడికే చేరుతారు,గమ్యం ఒక్కటే దారులు మాత్రం వేరు అని చెప్పారు.స్థూలంగా చూస్తే ప్రాచ్యమతాలకీ పశ్చిమమతాలకీ గమ్యం మాత్రమే ఒక్కటి మార్గాలు వేరు అన్నది స్పష్టం!సూక్ష్మ పరిశీలన చేస్తే గమ్యం కూడా ఒక్కటి కాదు అని తెలుస్తుంది.
          పశ్చిమమతాలు అంటే జుదాయిజం ,క్రైస్తవం, ఇస్లాం వంటివి అనీ ప్రాచ్యమతాలు అంటే హిందూమతం, బౌధ్హమతం, జైనమతం వంటివి.దైవాన్ని పశ్చిమమతాలు వ్యక్తిలా చూస్తాయి - ఆ దైవం గురించి తెలుసుకోవడం,ఆ దైవాన్ని ప్రేమించడం,ఆ దైవానికి విధేయులై ఉండటం వాటిలోని ప్రధానమైన అంతస్సూత్రం.వారి విశ్వాసాల ప్రకారం దేవుడు ఈ భూమి మీద ఉండు,ఈ సృష్టికి అవతల ఎక్కడో స్వర్గంలో ఉంటాడు,శిక్షించినా రక్షించినా ఆయన ఇష్టానుసారం చేస్తాడు,ఎందుకని అడక్కుండా ఉండటమే మంచిది,రక్షణ పొందాలంటే ఆయనకి విధేయులు కావడం తప్పనిసరి.ఇక్కడ ఒక విశేషం గమనించాలి.పశ్చిమమతాల వారి దేవుడికి ఆకారం ఉంది,కానీ వారు ఆ దేవుడి రూపాన్ని చూడటానికి సంకోచిస్తారు - దేనికో తెలియని భయం!ప్రాచ్యమతాల ప్రకారం దేవుడికి రూపం లేదు,కానీ వారు దేవుణ్ణి రూపంలోకి అనువదించుకుని చూడటానికి ఇష్టపడతారు - ఏమిటో తెలియని మాయ!ప్రాచ్యమతభావనల ప్రకారం దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, తమలోని ఆత్మను గురించి తెలుసుకుంటే దైవాన్ని గురించి తెలుసుకున్నట్టే .ప్రాచ్యమతా ప్రకారం శిక్షలూ రక్షణా దేవుడు చెయ్యడు, మన కర్మల యొక్క ఫలితాలే అవి!ప్రాచ్యమతా వారు దైవాన్ని ప్రార్ధించేది దుష్కర్మలు చెయకుండా ఉండే సద్బుద్ధి కోసం అయితే పశ్చిమమతాల వారి ప్రార్ధనలో చేసిన దుష్కర్మకి శిక్ష నుంచి తప్పించుకోవడానికి గాను క్షమాపణ వేడుకోవటం ఒక భాగమై ఉంటుంది.

          పశ్చిమమతాలు మానవుడికి అత్యున్నత స్థానం ఇచ్చాయి - వారి మతఫ్రంధాల్లో చాలాచోట్ల దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని మానవుల భోగార్ధం సమకూర్చి పెట్టాడు అని చెప్పడం గమనించవచ్చు.అందువల్లనే వారిలోని అత్యధికుల్లో భౌతికసుఖాల పట్ల వెంపర్లాట, ద్రవ్యార్జన పట్ల కండూతి, ఆ ప్రయత్నంలో వనరుల విధ్వంసం పట్ల నిర్లక్ష్యం, పోటీలో నిలబడిన ఇతరుల పట్ల క్రూరత్వం  అనేవి కనబడుతున్నాయి.ప్రాచ్యమతాలైన హిందూమతం, బౌద్ధమతం వంటివి దేవుడు సృష్టిలోని అన్ని జీవరాశుల్నీ సమానమైన భావంతోనే సృజించాడని చెబుతున్నాయి.వీటిలో మానవుడికి మితభోక్తత్వాన్ని ఆదేశించే సూక్యులే ఎక్కువ కనబతాయి.అందువల్లనే ఈ మతాల్ని పాటించేవారిలో భౌతికసుఖాల పట్ల విముఖత, న్యాయమైన ఆర్జనకే మొగ్గు చూపటం, అందులోనూ వనరుల్ని కాపాడుకోవటం, ముందుకురికి పోటీ పడి సాధించుకోవటానికి బదులు ప్రాప్తించిన దానితో సర్దుకుపోయి బతకటం వంటివి సహజ స్వభావాలుగా ఉంటున్నాయి.

          అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వేరు వేరు పేర్లతో ఉన్నప్పటికీ పశ్చిమమతాల అంతస్సారం ఒక్కటే - మూలమతంలో ఉన్న పదాలకి నిర్వచనాల్నీ పాత మతంలోని సంప్రదాయాలకి రూపురేఖల్నీ మార్చి ఎవరికి వారు మా మతం ప్రత్యేకమైనది అని చెప్పుకుంటారు, అంతే!అదే ప్రాచ్యమతాలలో మూలం ఒక్కటే అయినా అవి ప్రతిపాదించి అంకితమైన సత్యాలు వేరు వేరు - హిందూమతం ధర్మానికీ బౌద్ధమతం నిగ్రహానికీ జైనమతం అహింసకీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి.ఇన్ని విభిన్నతలు ఉన్నవాటిని పట్టుకుని అన్నీ ఒక్కటే అనటం హిందువుల్ని మోసం చెయ్యటానికీ వాళ్లని భ్రమల్లో ఉంచటానికే పనికొస్తుంది.ఇప్పుడు హిందువుల్ని జాగృతం చెయ్యాలనుకుంటున్నవారు కూడా చెప్పే విషయంలో క్లారిటీ లేకపోతే సామాన్యులకి అర్ధంకాక తెల్లమొహాలు వేసే ప్రమాదం ఉందనేది తెలుసుకోవాలి.
          పుట్టిన తొలినాళ్ళలో పశ్చిమమతాలు కూడా ఉన్నతమైన భావాలతోనే పుట్టాయి, కానీ ఇవ్వాళ మనకి కనిపిస్తున్న ముఖం మాత్రం అప్పటి ఉన్నతమైన ముఖం కాదు - చాలాసార్లు రూపాలు మార్చుకుని తొలినాటి తేజస్సునీ ఓజస్సునీ పోగొట్టుకున్న సామ్రాజ్యవాదపు దోపిడీ ముఖాలు!అయితే,ప్రాచ్యమతాలైన హిందూమతం,బౌద్ధమతం,జైనమతం వంటివి సహస్రాబ్దాలు గడించినా అసలైన స్పూర్తిని మార్చుకోకుండా కొనసాగుతున్నాయి.వాటి వైవిధ్యం నిజమైనది కాబట్టే రూపం మార్చుకోకుండా కొనసాగడం సాధ్యపడింది.

          2000 సంవత్సరాల క్రితం పుట్టిన క్రైస్తవం,1400 సంవత్సరాల క్రితం పుట్టిన ఇస్లాం - అవి ఎక్కడ అడుగుపెడితే అక్కడ ప్రశాంతంగా బతుకుతున్న స్థానిక ప్రజల సంస్కృతుల్ని అనాగరికమైనవని పేరుపెట్టి పరమ కిరాతకమైన పద్ధతులతో రూపమాపి వెయ్యగలిగాయి - ఒక్క భారతదేశం మాత్రం ఇప్పటివరకు ఈ రెండింటిలో దేనికీ లొంగకుండా నిలబడింది, ఇకముందు కూడా నిలబడుతుంది.నిలబడటమే కాదు ప్రపంచంలోని ప్రతి హిందువునీ నడిచే కత్తిలా తయారుచేస్తుందనేది వ్యాసపరాశరాది షిర్డీసాయునాధ పర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి నేను చెబుతున్న తిరుగులేని సత్యం - ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...