Afghanistanతో 76 క్ల్.మీ,Bhutanతో 470 క్ల్.మీ,Hong Kongతో 30 క్ల్.మీ,Indiaతో 3380 క్ల్.మీ,Kazakhstanతో 1533 క్ల్.మీ,Kyrgyzstanతో 858 క్ల్.మీ,Laosతో 423 క్ల్.మీ,Macauతో 3 క్ల్.మీ,Mongoliaతో 4677 క్ల్.మీ,Myanmarతో 2185 క్ల్.మీ,Nepalతో 1236 క్ల్.మీ,North Koreaతో 1416 క్ల్.మీ,Pakistanతో 523 క్ల్.మీ,Russiaతో 3645 క్ల్.మీ,Tajikistanతో 414 క్ల్.మీ,Vietnamతో 1281 క్ల్.మీ - తన చుట్టూ ఉన్న 16 దేశాలతో భౌగోళిక సరిహద్దును పంచుకుంటూ మోరెత్తి కలహకుక్కుటనాదం చేస్తున్న బలిసిన కోడిపుంజులా కనిపించే చైనా స్వభావంలో కూడా పందెపుకోడినే తలపిస్తున్నది.
తన చుట్టూ ఉన్న ఈ దేశాల్లో దాదాపు ప్రతి దేశంతొనూ ఏదో ఒక దశలో సరిహద్దు వివాదం రావటం,అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అన్న చందాన మొదట చిన్న చిన్న దాడులతో విసిగించటం గానీ లేదా పెద్ద యుద్ఢం చేసి గానీ తన శక్తిని చూపించి భయపెట్టి తర్వాత వ్యాపార ఒప్పందాల లాభసాటి ఆశలను ఎర చూపించడం ద్వారా ఏకపక్షమైన ప్రయోజనాలనే సాధించింది.అయితే,1962లో భారత్ మీద జరిగిన యుద్ధంలో పూర్తి గెలుపు దాదాపు ఖాయమైన స్థితిలో కూడా ముందుకు వెళ్ళి గెలుపును పూర్తి చేసుకోవటానికి బదులు నిర్నిబంధమైన యుద్ధవిరమణ ప్రకటించి McMahon Line వెనక్కి వెళ్ళి సర్దుకోవడం విశేషం!
North Koreaతో సరిహద్దుకు సంబంధించిన ఒక ఒప్పందం 1962లో చేసుకున్నప్పటికీ అది Yalu, Tumen అనే రెండు నదులతో కలిసి ఉంది కాబట్టి దాని లంకల విషయంలోనూ ఈ రెండు నదుల జన్మస్థానమైన Mount Paektu విషయంలోనూ రెండు దేశాల మధ్యన గొడవలు మొదలయ్యాయి.దీనికన్న పెద్ద సమస్య Tumen నది చివర్న సాగి రష్యాని కొరియాతో కలుపుతుంది.కొరియా వాళ్ళు చైనాకి ఉన్న అతి తక్కువ తీర ప్రాంతంలో 200 మైళ్ళ Fishing Zone ఏర్పాటు చేసుకున్నారు - ఇది చైనా యొక్క maritime military strategic borderకి బొక్క వేసింది!రష్యా 1990ల నాడు North Koreaతో సర్దుబాటు చేసేసుకున్నది గానీ చైనాకీ North Koreaకీ మధ్యన మాత్రం గొడవలు అలాగె ఉన్నాయి - దీనికి రెండు కారణాలు.
ఆర్ధిక కోణంలో చూస్తే చైనా కుదుర్చుకునే ఏ ఒప్పందంలోనైనా లాభం పూర్తిగా గానీ లేదా ఎక్కువ గానీ తనకే రావాలనుకుంటుంది తప్ప 50-50 పద్ధతికి కూడా ఒప్పుకోదు - చైనా "విన్-విన్" దారిని ఎంచుకోవడం చాలా అరుదు!రాజకీయ కోణంలో చూస్తే North Korea పాక్షికంగా చైనా మీద ఆధారపడి ఉంది - అది North Korea పట్ల ఔదార్యంతో కూడిన ఉపేక్ష కాక ఎప్పుడో ఒకప్పుడు దారికి వచ్చే వీలున్నప్పుడు ఇప్పుడే తొందరపడి తక్కువ లాభంతో సర్దుకుపోవడం దేనికనే ఎదురు చూపు కావచ్చు.1998లో Kazakhstanతో Baimurz pass దగిర 680 square-kmల భూమి కోసం,Sary-Charndy River దగ్గిర 380 square-kmల భూమి కోసం చైనా Kazakhstanకి ధారాళంగా నూనె గనుల్లో పెద్ద యెత్తున పెట్టుబడులు,Kazakhstan అంతణినీ కలుపుతూ 3,000 కిలోమీటర్ల పొడుగున gas pipeline వెయ్యటం,15 సంవత్సరాల పాటు ఆర్ధికపరమైన సహకారం అందిస్తానని వాగ్దానం చేసింది.తన ప్రయోజనం కోసం దెబ్బ కొట్టటానికీ దబ్బు చల్లటానికీ - కూడా సిద్ధంగా ఉంటుంది చైనా - మొహమాటం లేదు!
Afghanistanతో చైనాకి నిన్నమొన్నటి వరకు మంచి సంబంధాలే ఉండేవి.Wakhan Corridor అని పిలిచే ఈ రెండు దేశాల సరిహద్దు ప్రాంతం కొన్ని శతాబ్దాలుగా తేయాకు,పండ్ల క్యార్వాన్లు తిరుగుతూ మంచి లాభసాటి అయినది.ఒక సరిహద్దు ఒప్పందం 1963లోనే ఏర్పడింది,Cold War సమయంలో కూడా రెండు దేశాల స్నేహం చెదరలేదు.Afghanistanలో Taliban regime మొదలయ్యాకనే Afghanistanతో చైనాకి సమస్యలు మొదలయ్యాయి.వాళ్ళు చైనాలోని Xinjiang provinceలో ‘East Turkestan Islamic Movement’ పేరుతో Uyghur separatistsని రెచ్చగొట్టటం మొదలు పెట్టారు!అయితే, Afghanistan ప్రభుత్వం మాత్రం చైనాతో స్నేహంగానే ఉంటున్నది.
మనకీ చైనాకీ గొడవలు మొదలైనది ఇంగ్లీషు వాళ్ళ పుణ్యమే!ఇంగ్లీషు వాళ్ళు వాళ్ళ సౌకర్యం కోసం చేసిన అడ్డదిడ్డం సరిహద్దుల మార్పులే ఈ రెండు దేశాల మధ్యన పెద్ద యెత్తున ఉద్రిక్తతలు పెరగడానికి కారణం.ఈ గొడవలు లేని మిందరి కాలంలో కొన్ని సహస్రాబ్దాల పాటు ఈ రెండు దేశాల మధ్యన రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక మేళవింపు జరిగి రెండు దేశాల్నీ తమ అత్యున్నతమైన గత కాలపు వైభవాన్ని చూసులుని గర్వించేలా చేసింది!సాంస్కృతికంగా,సామాజికంగా,ఆధ్యాత్మికంగా,వైజ్ఞానిక విజయాల పరంగా ప్రాచీన కాలంలోనే సాటి వారెవ్వరూ చేరుకోలేని అత్యున్నత శిఖరాలను అందుకుని ఇప్పటికీ చెక్కు చెదరని తేజస్సునీ ఓజస్సునీ చూపిస్తున్నవి ఈ రెండు దేశాలే!ఈ రోజున గుర్తింపు పొందిన సరిహద్దులు ఒకనాడు లేకపోయినా ప్రాంతం పరిధిని బట్టి చూస్తే ఇప్పుడు ప్రపంచంలో గురింపు పొందిన నూట యాభై పైచిలుకు దేశాలలో అత్యంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది ఈ రెండు దేశాలకే.అలాంటి ఈ రెండు దేశాల మధ్యన యుద్ధం కోరుకోకూడనిదే!
ఇప్పుడు దేశంలో చైనాతో యుద్ధం వస్తేనే బాగుండునని కోరుకుంటున్నవారిలో చాలామందికి అలా అనిపించడానికి 1962 నాటి యుద్ధం చేసిన గాయమే ముఖ్యమైన కారణం - అప్పటి దెబ్బకి ఇప్పుడు దెబ్బ తీసి జరిగిన అవమానానికి ప్రతెకారం తీర్చుకోవాలనే భావన ఉంది - సహజమే!కానీ ఆ యుద్ధానికి కారణాలు ఎన్ని, చైనా ఏయే కారణాలతో దూకుడుగా వచ్చి దాడి చేసిందో ఆయా కారణాలకి సమబంధించి ఏ లాభమూ పొందకుండా నెల రోజుల తర్వాత యుద్ధంలో తనదే పైచేయి అని తెలిసి కూడా తన కోరికల్ని తీర్చాల్సిందేనని పట్టు పటకుండా యుద్ధం ఆపేసి ఎందుకు నిశ్శబ్దం అయిపోయింది అనే విషయాలని పరిశీలిస్తే చాలా విచిత్రమైన విషయాలు తెలుస్తాయి!అసలు ఈ రెండు దేశాల మధ్యన నెల రోజుల పాటు అంత తీచ్రమైన యుద్ధం జరిగాక కూడా కొద్ది రోజుల్లోనే తమ మద్జ్యన ఏమీ జరగనట్టు వ్యాపార ఒప్పందాలూ దౌత్య సమబంధాలూ రెండు దేశాల ప్రభుత్వాలూ యధావిధిగా నడుపుకోవటం ఎలా సంభవించింది?సామాన్య ప్రజల్లో ఇప్పటికీ రగులుతున్న క్రోధం ప్రభుత్వ,అధికార వర్గాలలో ఎందుకు కనిపించ లేదు?ఈ అనుమానాలకి సరయిన కారణాలు తెలిస్తే ఇప్పుడు భారత్ ఎట్లా ప్రవర్తిస్తే బాగుంటుందో తెలుస్తుంది.
వాస్తవానికి 1962లో అసలు యుద్ధం జరిగినప్పటికీ, సరిహద్దుకు సంబంధించిన సమస్యలు చాలాకాలం నుంచి కొనసాగుతున్నప్పటికీ 1959లో జరిగిన Tibetan uprising తర్వాత జరిగిన గొడవల్లో వాళ్ళు తరిమసిన దలై లామాకి మన దేశం ఆశ్రయం ఇవ్వడం ముఖ్యమైనది.నిజానికి అంతర్గత సమస్యల వల్ల ఈ కలహం 1950ల నుంచీ ఉన్నప్పటికీ 1959లో ఉద్గృతం కావడానికి United States ప్రమేయమే కారణం.టిబెటన్ గెరిల్లాలకి CIA తన అధ్వర్యంలో శిక్షణ ఇచ్చి పంపిస్తున్నదని తెలిసినప్పుడు చైనా తన దేశంలో విదేశీయుల సహాయంతో జరుగుతున్న తిరుగుబాటుని అణిచివేయాలనుకోవడం తప్పూ కాదు, దాని నాయకుడైన దలై లామా తన వైపు నుంచి దోషమేమీ లేని అమాయకుడూ కాదు - అవునా?
Mao Zedong టిబెటన్ గెరిల్లాల తిరుగుబాటు బలం పెంచుకోవడానికి సంబంధించిన వార్తలు తెలిసినప్పుడు 1959 February 18వ తేదీన “The more chaotic [the situation] in Tibet becomes the better; for it will help train our troops and toughen the masses. Furthermore, [the chaos] will provide a sufficient reason to crush the rebellion and carry out reforms in the future.” అని అనటాన్ని బటి వ్యతిరేకుల పట్ల చైనా ఎట్లా వ్యవహరిస్తుందో తెలుసుకోవచ్చు - ఎంత ఉద్గృతంగా గొడవ చేస్తే అంత క్రూరంగా అణిచివెయ్యడమే తప్ప సమస్యని ఉభయతారకమైన పద్ధతిలో పరిష్కరించడం చైనా ఎప్పటికీ చెయ్యదు.భారత్ చైనాతో వ్యవహరించేటప్పుడు ఈ విషయంలో హెచ్చరికగా ఉండాలి!
చైనా మొత్తానికి దలై లామా ఒక్కడే బౌద్ధ మతస్థుడు కాదు,మిగిలిన వాళ్ళు ఇప్పటికీ చైనా ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నారు.అతని సొంత రాజకీయపరమైన కారణాలతో అతను చైనా ప్త్రభుత్వాన్ని వ్యతిరేకించి ఉండవచ్చు - ఏ మతానికి సంబంధించినవైనా సరే ఆలయాలు, విహారాలు, చర్చిలు, మసీదులు, దర్గాలు వంటి స్థలాలు ఆర్ధికంగా బలమైనవి అయితే అవి రాజకీయాలకి అతీతంగా ఉండలేవు!ఈ రకమైన సంక్లిష్టతని అర్ధం చేసుకోలేని పండితుడు నెహ్రూ మానవత్వం, తొక్కా, తోలు అంటూ అడుసులో కాలెట్టాడు.చైనాకి కాలగూడని చోట కాలింది.వార్నింగులు ఇచ్చింది.అయినా పట్టించుకోలేదు.దీనికి తోడు "చైనా మనమీద దాడి చెయ్యటమా?నెవ్వర్!" అనుకుంటూనే ప్రతిపక్షాల నుంచి విమర్శల్ని తప్పించుకోవడం కోసం భారత్ Forward Policy అంటూ అప్పటికే వివాదాస్పదమైన McMahon Line వెంబడి Military Outpostలని పెంచింది - ఎందుకు పెంచాలో తెలియకుండా, ఎంత సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందో తెలుసుకోకుండా, ముందు వెనకలు చూసుకోకుండా చేసిన ఈ దుందుడుకు పనితోనే భారత్ అవమానానికి కారణమైన దిక్కుమాలిన యుద్ధం మొదలయ్యింది!
ఈ Forward Policy అనేది 1961 November 2న నెహ్రూ అధ్యక్షతన defence minister Krishna Menon, foreign secretary M.J. Desai, Army Chief General P.N. Thapar, Intelligence Bureau director B.N. Mullick సభ్యులుగా ఉన్న ఒక కమిటీ ఆలోచించి పన్నిన వ్యూహం తెలివి తక్కువ నిర్ణయమేమీ కాదు.1962, February 4న ఢిల్లీలో Home Minister చేసిన "If the Chinese will not vacate the areas occupied by her, India will have to repeat what she did in Goa. She will certainly drive out the Chinese forces." అనే ప్రకటన కూడా గొప్పగానే ఉంది.
కానీ యుద్ధం ముంచుకు వచ్చినప్పుడు కఠినమైన నిర్ణయాలు సత్వరం తీసుకోగలిగిన నెహ్రూ,మీనన్ ఇద్దరూ తమకున్న వామపక్ష భావజాలం పట్ల ఉన్న మక్కువ వల్ల చైనాతో సరైన పద్ధతిలో వ్యవహరించలేకపోవడమే ఆనాడు యుద్ధం రావడానికీ మన దేశం దుర్భరమైన అవమానానికి గురి కావడానికీ ఉన్న ముఖ్యమైన కారణం!వీళ్ళిద్దరూ చెయ్యకుండా మిగిల్చిన దరిద్రం ఏదైనా ఉంటే ఆ కొరతని Lieutenant General Brij Mohan Kaul తీర్చాడు.ఈ ముగ్గురు మూర్ఖులూ ఎవడికి తోచిన తలతిక్క పని వాడు చేసుకుంటూ పోయిన గందరగోళం వల్లనే ఆ యుద్ధం అంత తెలివితక్కువగా మొదలై ఒక నెల రోజుల పాటు భారత సైన్యాన్ని దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేసి అంత హఠాతుగానూ ఆగిపోయింది - చైనాకి జాలిపుట్టి యుద్ధవిరమణ ప్రకటించింది గానీ ఇంకాస్త ముందుకెళ్ళి యుధాన్ని పూర్తి చేసి మన దేశాన్ని ఆక్రమించుకుంటే మనం చెయగలిగినది ఏమిటి?మన బంగారాలు మంచివి కాక ఓడిపోయామని ఏడవటం తప్ప చైనాని తిట్టుకుని ప్రయోజనం లేదు.
ప్రాచీన కాలం నుంచి ఎన్నో రాజవంశాల చేత పరిపాలించబడిన టిబెట్ క్రీ.శ 1912 నుంచి 13వ దలై లామా అధికారం కిందకి వచ్చింది.దలై లామా కేవలం ఒక బౌధ సన్యాసి కాదు.టిబెట్ ప్రాంతానికి రాజకీయ అధిపతి!ఇప్పుడు మనం చూస్తున్న ది 14వ దలై లామాని.క్రీ.శ 1914లో టిబెట్ బ్రిటిష్ ఇండియాతో ఒపందం కుదుర్చుకున్నది.స్వతంత్రం వచ్చాక సాంకేతికంగా తన స్థానాన్ని భరతదేశానికి దఖలు పరిచింది బ్రిటిష్ ఇండియా.కానీ,1949లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సాంస్కృతిక సారూప్యత పేరుతో టిబెట్,అరుణాచల్ ప్రదేశ్‌లని తమకి దఖలు పరచమని చైనా వాదనతో పొరపొచ్చాలు మొదలయ్యాయి!నిజానికి అది సాధ్యమా?ఆ లెక్కన అంతకు ముందెప్పుడో ఏ భారత దేశానికి చెందిన ప్రభువో చైనా ప్రాంతం మొత్తాన్ని పరిపాలించాడనేది రుజువైతే చైనా భారతదేశంలో కలిసి పోతుందా?
అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచీ చైనా కమ్యునిష్టు పార్టీ దక్షీణ టిబెట్ కోసం అడుగుతూనే ఉంది,భారత్ చైనాకి అన్ని రకాల సహాయాలూ చేస్తూనే ఉన్నది,1950లో భారత్ "Indo-Chinese border" విషయంలో పర్వర్తిస్తున్న తీరుని గురించి చైనా నుంచి ప్రశంసలు పొందింది కూడా!భారత ప్రధాని పార్లమెంటులో అధికారికమైన బారత దేశపు map చూపించి "Our maps show that the McMahon Line is our boundary and that is our boundary...we stand by that boundary and we will not let anyone else come across that boundary" అని స్పష్తం చేశాడు,చైనా కూడా విన్నది,దాని మీద ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు,1851లో మన దేశం లడఖ్ దగ్గిర పాకిస్తానుతో పోరాడుతునన్ సమయంలో Aksai Chin దగ్గిర హదావిడి పెంచింది,తనకూ భరతదేశానికీ ఎలాంటి సరిహదు వివాదాలు లేవని చైనా చెప్తూనే ఉన్నది,అంతర్జాతీయ రాజకీయ రంగం చైనాని ఒంటరిని చేసిన సమయంలో భారత్ చైనాకి నామినీగా పని చేస్తూనే ఉన్నది,1950లో చైనా యొక్క People's Liberation Army ఉత్తర టిబెట్ సైన్యాన్ని ఓడించి తన అధికారాన్ని స్థాపించుకున్నది,భారత్ చైనాతో పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకున్నది,చైనా వెళ్ళగొట్టిన టిబెట్ రాజకీయ ప్రభువుని చేరదీసింది - మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే CIA 1956లో టిబెటన్ గెరిల్లాలకి శిక్షణ ఇచ్చిన స్థావరం భార్తదేశంలోని Kalimpong.ఇన్ని వరస తప్పులు మనవైపున ఉన్నప్పుడు చైనాని నిందించి ప్రయోజనం ఏమిటి?
పై స్థాయిలో జరిగిన రాజకీయ నిర్ణయాల వెనక ఉన్న తప్పిదాలకి కృష్ణ మీనన్ కన్న తమ Forward Policyని చైనా తీవ్రంగా పరిగణించదని నమ్మబలికిన IB chief Mullickదే ఎక్కువ బాధ్యత ఉంది.అప్పటి ప్రతిపక్షాల అజ్ఞానం వల్ల జరిగిన రాజకీయ దాడికి కృష్ణ మెనన్ బలయ్యాడు - అతని తప్పులూ ఉన్నాయి గానీ IB chief హోదాలో ఉన్న Mullick సరయిన సమాచారం ఇవ్వడంలో ఫెయిలయినప్పుడు నెహ్రూ గానీ మీనన గానీ చెయ్యగలిగింది ఏముంది?మిగిలిన సగం దరిద్రాన్ని General B.M.Kaul పూర్తి చేశాడు.
యుద్దం తర్వాత బలవంతంగా గెంటించుకున్న Brij Mohan Kaul అనే ఈ అతి మేధావి Royal Military College నుంచి బయటికి వచ్చాక 1933 ఆగస్టు 31న Indian Armyలో Unattached List కింద Second Lieutenant హోదాలో చేరాడు.అప్పటి నుంచి ఇంగ్లీషు వాళ్ళ కాలంలోనూ స్వతంత్రం వచ్చాకనూ ఇతను పై స్థానాలకి ఎదగడంలో సైనికుడికి కావలసిన లక్షణాల కన్న అధికారంలో ఉన్నవాళ్లతో పరిచయాలే ముఖ్యపాత్ర వహించాయి - సాటి సైనికాధికారులకి ఇతని ఎదుగుదల అసహ్యాన్ని కలిగించేది!junior officer రోజుల నుంచీ జవహర్ లాల్ నెహ్రూకి ఇతను "personal favourite" అయ్యాడు.ఈ పరిచయం వల్ల అతను కెరీర్ మొత్తంలో ఏనాడూ సైనికుడిగా జీవించలేదు, అర్హతలేని అందలాల్ని అందుకోవడంలో ఎలాంటి సిగ్గునీ చూపించలేదు!ఇటువంటి వెధవలకి personal favorite హోదా ఇవ్వడంలోనే నెహ్రూ వెధవాయిత్వం కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది.
అప్పటి వరకు Chief of General Staff (CGS) హోదాలో ఉన్న Lt General B.M. Kaul మన దరిద్రం కొద్దీ General officer Commanding (GOC) అయ్యాడు.మొట్టమొదటి రోజునే పటాలం పాండులా Namkachu లోయలోకి పోయి హడావిడి మొదలెట్టాడు.ఇతని నాయకత్వంలో భారత సైన్యం చైనా అధీనంలో ఉన్న Tse Jong స్థావరాన్ని పటుకున్నది,కానీ ఈ పెద్దమనిషి జబ్బుపడి తిరుగుటపాలో ఢిల్లీ చేరుకోగానే చైనా సైనికులు 800 మంది విరుచుకు పడి భార్త సైన్యాన్ని తుడిచి పెట్టేశారు.నిజానికి భారత్ యొక్క Forward Policyకి ఇది పూర్తి విరుద్ధం - వీలున్నంతవరకు చైనాని రెచ్చగొట్టకుండా defensive game ఆడాలనేది మంచి ప్లానే,చైనా కూడా తనంతట తను యుద్ధానికి రాకుండా చర్చలకి పిలుస్తూనే ఉంది.కానీ ఈ B.M. Kaul నెహ్రూ దగ్గిర తనకున్న personal favorite హోదాని అడ్డం పెట్టుకుని సొంత పెత్తనం చేశాడు.మనలో చాలామంది అనుకుంటున్నట్టు తొలిదాడి చైనా చెయ్యలేదు,భారత్ వైపునుంచి కౌల్ తొలిదాడి చేశాకానె చైనా తనకి కావలసిన సన్నివేశం జరగగానే తన శైలిలో తను రెచ్చిపోయింది.
ఎంత సేపూ చైనా తమ Forward Policyని తీవ్రంగా తీసుకుని భారత్ మీద పెద్ద యెత్తున దాడి చెయ్యదు అన్న గట్టి నమ్మకంతో నెహ్రూ నుంచి కౌల్ వరకు అమాయకంగా ఉంటే చైనా వ్యూహం వీళ్ళ కెవరికీ తర్వాతెప్పుడో చైనా చెబితే తప్ప తెలియనంత రహస్యమైనది!కలింపాంగ్ విషయం తెలిసి చైనాకి భారత్ టిబెట్ వ్యవహారంలో కుట్ర చేస్తున్నదని చైనా అనుమానించినట్టు కొందరు చేస్తున్న విశ్లేషణ ఆధారాలు ఉన్నదే గానీ అసలు కారణం మరింత లోతైనది.ఆ లోతు తెలియక పోవడం వల్లనే భారత్, ముఖ్యంగా నెహ్రూ తనకి చేస్తున్న సహాయాల్ని మర్చిపోయి ఆ ఒక్క విషయానికి కనీసపు కృతజ్ఞత కూడా లేకుండా రెచ్చిపోయిందంటే మనలో చాలామందికి కష్టం అనిపిస్తున్నది!
దాడికి దిగడంలోనూ వెనక్కి తగ్గడంలోనూ చైనాకి ఉన్న priorities వేరు,.RS Kalhaఅనే Iraqలో పనిచేసిన Indian ambassador ఒక వ్యాసంలో The then Chinese President Liu Shaoqi told the Sri Lankan leader Felix Bandaranaike that the 1962 conflict was ‘to demolish India’s arrogance and illusions of grandeur. China had taught India a lesson and would do so again and again.’ Mao Zedung confirmed this line of thinking when he told a Nepalese delegation in 1964 that the ‘major problem between India and China was not the McMahon Line, but the Tibetan question’. In 1973, Zhou Enlai was to tell Kissinger that the conflict took place because Nehru was getting ‘cocky’. అని చెప్పడాన్ని బట్టి చైనా కమ్యూనిష్టు పార్టీ ఎంత దుర్మార్గమైనదో వూహించుకోవచ్చు.ప్రపంచ స్థాయిలో తనకి లభిస్తున్న ఆదరణని చూసుకుని మురిసిపోతున్న నెహ్రూకి ఝలక్ ఇచ్చి కంగు తినిపించడమే చైనా లక్ష్యం - అది నేరవేరగానే యుద్ధం ఆపేసింది,అంతా తన క్రూరమైన లెక్క ప్రకారమే చేసింది చైనా.ఇవ్వాళ చైనాతో యుద్ధం వస్తే బాగుండునని కోరుకునేవాళ్ళు దీన్ని గుర్తుంచుకోవాలి!ఇంత క్రూరమైన చైనాతో యుద్ధం ఎంత ప్రమాదకరమైనదో తెలియని అవివేకులే చైనాతో యుద్ధానికి ఉవ్విళ్ళూరుతారు.
భారతీయులు 1962 ఓటమిని ఎక్కువ చేసుకుని కుంగిపోవాల్సిన అవసరం లేదు. సరిగ్గా అయిదేళ్ళ తర్వాత 1967లో సిక్కిం సరిహదుల దగ్గిర భారత సైన్యం కేవలం 88 మందిని పోగొట్టుకుని హద్దును దాటి వచ్చిన చైనా సైనికుల్లో 340 మందిని మట్టుబెట్టి 450 మందిని క్షతగాత్రుల్ని చేసి 1962 నాటి అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నది.అసలు 1962 నాటి యుద్ధంలోనే అన్ని ప్రతికూలతల మధ్య మన సైనికుల పోరాట పటిమ చూసి చైనా సైనికులు జోహారు లర్పించారు.On October 10, these 50 Indian troops were met by an emplaced Chinese position of some 1,000 soldiers. The Chinese troops opened fire on the Indians believing that the Indians had intruded upon Chinese land. The Indians were surrounded by a Chinese positions which used mortar fire. However, they managed to hold off the first Chinese assault, inflicting heavy casualties. In the second assault, the Indians began their retreat, realising the situation was hopeless. The Indian patrol suffered 25 casualties, with the Chinese suffering 33. The Chinese troops held their fire as the Indians retreated, and then buried the Indian dead with military honors, as witnessed by the retreating soldiers. This was the first occurrence of heavy fighting in the war.చరిత్రలో ఒక దేశపు సైన్యం శత్రు దేశపు సైనికులకి గౌరవ వందనం చేసిన సన్నివేశం బహుశా ఇదొక్కటే కాబోలు!
1949లో red army యొక్క ప్రపంచాన్ని కుదిపేసిన పది రోజుల తిరుగుబాటు జైత్రయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన చైనా కమ్యూనిష్టు పార్టీ 1962లో నిర్నిబంధ యుద్ధవిరమణ నాటి నుంచి మిగతా అన్ని సరిహద్దు దేశాలతో సమస్యల్ని సామ,దాన,భేద,దండాలలో ఏది వీలయితే అది ఉపయొర్గించి పరిష్కరించుకుని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడానికి కొంతకాలం పాటు చీకటి తెర వెనక దాక్కుంది.బయటికి రావడం రెండు విధాల దారుల్లో జరిగింది - 1990ల నుంచి economic infastructure పూర్తి చేసుకుని ప్రపంచ వాణిజ్యరంగంలోకి వచ్చి పెనుతుఫాను సృష్టించడం,ముత్యాల హారం లాంటి అమరికతో భారతదేశాన్ని కబళించడానికి తిరుగులేని సైనికవ్యూహం పన్నడం.
1990ల వరకు భారత్,చైనాలు ఆర్ధిక విషయంలో దాదాపు సరిసమానంగానే ఉండేవి.ఆ తర్వాతనే చైనా అనూహ్యమైన వేగంతో మన దేశాన్ని దాటి ముందుకు వెళ్ళింది.చైనా 1979లో ఇంటికి ఒకే బిడ్డ అనే నియమాన్ని గట్టిగా అమలు చెయ్యడంతో పనిచేసేవాళ్ళ మీద పోషించాల్సిన వాళ్ళ బరువు తగ్గింది.మావో జనాభాని తగ్గించడంలో కృషి చేసి వూరుకోకుండా ఆ తక్కువ మనుషుల్ని చక్కగా ఉపయోగించుకున్నాడు.విద్య,ఆరోగ్యం అనే రెంటినీ యెంత గట్టిగా సాధించాడంటే 1981 నాటికే చదువుకున్న చైనా ఆడవాళ్ళు చదువుకున్న ఇండియన్ ఆడవాళ్ళ కన్న రెట్టింపు అయ్యారు - ఇప్పటికీ మనం ఈ రెంటిలో వెనకబడిపోయే ఉన్నాం.మనవైపున చూస్తే నెహ్రూ అంతర్జాతీయ విషయాలపైన మక్కువతో కీర్తి ప్రతిష్థల వ్యామోహంలో క్షేత్రస్థాయి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు.చైనాకి విద్య,ఆరోగ్య రంగాల్లో ధృఢంగా ఉండి మానవవనరులు పుష్కలంగా ఉండటం వల్ల అభివృద్ధికి కావలసిన రోడ్లు,భవనాలు,రైల్వేలు,విమానాశ్రయాల వంటి infra structure ఏర్పరచుకోవడం సులువైంది.భారత్ మొదటి దానిలో వెనకబడటం వల్ల రెండో దానిలో కూడా వేగం మందగించింది.ఇలా ఆర్ధికంగా కొంత పుంజుకున్నాక చైనా భారతదేశాన్ని కబళించడం కోసం ముత్యాల హారం ప్లాను వెయ్యడం మొదలు పెట్టింది.
ఇప్పటికి ముత్యాల హారం దాదాపు పూర్తయిపోయింది.China-Pakistan Economic Corridor (CPEC) పూర్తయితే ఆ కొసన ఉన్న పాకిస్తాన్ నౌకాశ్రయం చైనా అధీనంలోకి వస్తుంది - అదే ఆఖరు ముత్యం!ఈ 15 ముత్యాలు పరుచుకుని ఉన్న దేశాలలో ముఖ్యమైనవి - Myanmar, Bangladesh, SriLanka, Pakistan.చైనా Myanmarలో ఉన్న Kyaukpyu portని ఉపయోగించుకునే సౌకర్యం కోసం ఆ దేశంలో 2400 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ వేస్తున్నది.శ్రీలంకతో భారతదేశానికి కొన్ని శతాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి,అయినా చైనా అక్కడ కూడా అడుగు మోపి ఒక ముత్యాన్ని నాటింది!ఇక పాకిస్తాను ఇండియా మీద ద్వేషంతో ఇవ్వాళ చైనాకి వలస కన్న హీనంగా తయారైంది.అప్పుడు బ్రిటిష్ అద్గీనంలో ఉన్న ఇండియాని బ్రిటిష్-ఇండియా అని పిల్చినట్టు ఇప్పుడు చైనా-పాకిస్తాన్ అని పిలిపించుకుంటున్న దుస్థితి పాకిస్తానుది.
అయితే,చైనా ఇంత గొప్ప ప్లాను వేసినా మన దేశపు సైనిక వర్గాల ముందుచూపు వల్ల బంగాళాఖాతం,హిందూమహాసముద్రం రెండింటిలోనూ భారత్ దుర్నిరీక్ధ్యంగానే ఉంది కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు.విదేశాంగ విధాన రూపకర్తలు కూడా Look East policyని ప్రతిపాదించారు.మోదీ అధికారంలోకి రాగానే Look East policyని Act East policy చేసి ముత్యాల హారాన్ని బదలు కొట్టాలనే ప్రయత్నాలు మొదలైనాయి - ఆ పని కూడా దాదాపు పూర్తయింది!ఇరాన్-ఇండియా సంయుక్తంగా chabahar portని వాడుకునే ఒపందం వల్ల ఇండియాకి central asia వైపుకి పాకిస్తానుతో సంబంధం లేకుండా ఒక అడ్డదారి ఏర్పడింది,ఇది చైనా పీఠం వేసుకుని కూర్చున్న పాకిస్తాన్ పోర్టు Gawadarకి కేవలం 70 కి.మీ దూరంలో ఉంది.ఇండీయాకి Maldivesతో ఉన్న సుదీర్ఘమైన చారిత్రక సంబంధాల వల్ల ఆ దేశం చైనా స్థావరాల్ని తమ గడ్డ మీద అనుమతించనని మనకి వాగ్దానం చేసింది.మనకీ Maldivesకీ మధ్యన సైనిక సహకారం కూడా నడుస్తున్నది.
శ్రీలంకలో చైనాని అనుమతించిన rajaPaksa ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయి పదవి నుంచి దిగిపోవటంతో పాటు చైనాతో అతను చేసుకున్న ఒపందాలు కూడా రద్దయినాయి.అక్కడ ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారత్ వైపుకి మొగ్గు చూపుతున్నది - ఒక ముత్యం దానంతటదే పగిలింది!Andaman-Nicobar దీవుల్ని ఇదివరకటి కన్న ఎక్కువ ఉపయోగించుకోవాలని నౌకాదళం పెద్ద సంఖ్యలో యుధనౌకల్నీ యుద్ధవిమానాల్నీ చేరుస్తున్నది.ఈ మధ్యనే మోదీ Bangladesh వెళ్ళినప్పుడు Hassinaతో ఒప్పందం కుదుర్చుకుని chittagang ముత్యాన్ని చైనా నుంచి లాగి వేశాడు.చైనాకి ఇదివరకే Miyanmarలోని coco దీవి స్థావరంలా ఉపయోగపడుతున్నది,కానీ భారత్ కూడా చైనా వ్యతిరేకతని లెక్క చెయ్యకుండా ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల్ని మెరుగు పరుచుకుంటున్నది.Myanmar తన సైనిక దళాలకి సాగర సంబంధమైన రక్షణ విషయంలో చైనా కన్న భారత్ మీదనే ఎక్కువ ఆధార పడాల్సిన పరిస్థితి ఉంది - ఇండియా దాన్ని ఉపయోగించుకుని Myanmarకి దగ్గరవుతున్నది.చైనా వల్ల ఇబ్బందులకి గురయిన Vietnam సహజంగానే మనవైపుకి వస్తుంది = రెండు దేశాలూ ఈ మధ్యనే సైనిక సహకారం కోసం ఒపందాలను కుదుర్చుకున్నాయి.మోదీ గారు దేశాలు పట్టి తిరుగుతున్నది పిల్లి తల గొరగడానికి కాదు, చైనా దురాక్రమణ నుంచి మన దేశాన్ని రక్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాడు!
కమ్యూనిష్టులు మోదీ ఎప్పుడు అమెరికా వెళ్ళినా తనేదో అమెరికా పాదాల మీద పడిపోతున్నట్టు గగ్గోలు పెడుతున్నది మన దేశాన్ని పాకిస్తాను వాళ్ళు చేసినట్టు తమ కిష్టమైన చైనా పక్కలో పడుకోబెట్టకుండా అడ్డుకుంటున్నందుకే తప్ప దేశభక్తితో కాదు!నిజానికి అమెరికాయె "బాబ్బాబు!మీ మార్కెట్లో కొంచెం వాటా ఇవ్వు, హందూమహాసముద్రంలో కాస్త చోటివ్వ"మని బతిమిలాడుకుంటున్నది.ఆర్ధిక రంగాన్ని మినహాయిస్తే రాజకీయం, సాంస్కృతికం, సామాజికం, సైనికం వంటి రంగాల్లో ఏ దేశమూ మన దేశపు కాలిగోటికి కూడా సరిపోలదు!ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడూ మనం ఎవరినీ దేబిరించాల్సిన దుస్థితిలో లేము.ఆర్ధికంగా ఎదగకపోవడానికి Quality Education లేకపోవడమే కారణం.అది ఒక్కటీ సమకూర్చుకోగలిగితే పది చైనాలు కలిసి వచ్చినా తల తిరిగి ముద్ద నోట్లోకొచ్చేలా జవాబు చెప్పగలం!చైనా నుంచి దురాక్రమణ భయం లేకపోతే అమెరికా నుంచి ఇరాన్ వరకు గల పెద్దా చిన్నా అదెశాల్ని ఈ కాస్త సహాయం కూడా అడగాల్సిన పని లేదు - తమకి నచ్చిన చైనా మన దేశాన్ని ఆక్రమించుకుంటే వాళ్ళకి నెప్పి దేనికి ఉంటుంది?ఉంటే గింటే చమ్మగా ఉంటుంది గానీ - కోవర్టు పనులు చేసి భారత్ ఓడిపోయేలా చెయ్యటానికైనా సిద్ధమే!
ఇప్పుడు కూడా చైనా యొక్క దూకుడుకి అసలు కారణం డోక్లా వివాదం కానే కాదు,దెబ్బ తిన్నాకనే నెహ్రూకి అసలు నిజం తెలిసింది.కానీ, తన అమాయకత్వానికి మూల్యం చెల్లిస్తూ నెహ్రూ పతనం కూడా మొదలై తప్పును సరిదిద్దుకునే సమయం అతని చేతి నుంచి జారిపోయింది!అప్పుడు తనకు సమ ఉజ్జీ స్థానాన్ని కోరుకున్నందుకు అన్ని సహాయాలు చేసిన నెహ్రూనే క్షమించని చైనా ఇప్పుడు మోదీని సమ ఉజ్జీ స్థానంలోకి రానివ్వకుండా జెల్ల కొట్టటానికి డోక్లాం వివాదం ఒక ముసుగు మాత్రమే!చైనాలో కమ్యూనిజం యొక్క ఉన్నతాదర్శాలు ఎప్పుడో చచ్చిపోయాయి - ఇప్పుడు అది కూడా కమ్యునిష్టులు విమర్శించే పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదపు నియంతలు చేసే అన్ని దుర్మార్గాల్ని చేసేసి మానవుల సామాజిక జీవితంలోని నైతికపతనానికి పరాకాష్ఠకి ఉదాహరణగా నిలుస్తున్నది.ప్రపంచ మానవాళి యొక్క నాగరికతని ముందుకు తీసుకెళ్ళడంలో ఉపయోగపడిన కాగితం, అచ్చు యంత్రం, తుపాకి మందు వంటి వాటిని ఆవిష్కరించిన చైనాకీ ఇప్పటి చైనాకీ పోలికే లేదు!
ఇవ్వాళ చైనా తయారీ అంటే చవక ఫోన్లు మాత్రమే గుర్తుకు వస్తున్నాయి.చైనా ప్రపంచ మార్కెట్టులోకి .వచ్చి సాధించినది ఇతర దేశాల వాళ్ళ వస్తువుల్ని దొరకబుచ్చుకుని రివర్స్ ఇంజనీరింగ్ చేసి లేబరు చవగ్గా దొరుకుతుంది గనక అతి తక్కువ రేట్లకి అసలు వస్తువులకి పోటీగా వదలటం.ఒక పదిహేడేళ్ళ కుర్రాడికి మీరో సెల్ ఫోను ఇచ్చారు,వాడు ఒక్కొక్క స్క్రూ వరసగా విప్పుతూ ఏ వరసలో విప్పాడో గుర్తు పెట్టుకుని మళ్ళీ బిగించి పని చేయించగలిగితే అతనికి దాన్ని తయారుచెయ్యడం తెలిసిపోయినట్టే కదా!విడి పార్టులు గనక చవగ్గా దొరికితే వాడే సెల్ ఫోను తయారు చెయ్యగలడు.షాపు పెట్టేస్తాడు.చైనా యెదుగుదల కూడా ఇలాగే జరిగింది. చైనాలో కమ్యునిష్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ప్రపంచానికి ఇచ్చ్గిన సొంత క్వాలిటీ ప్రోడక్టులు చాలా తక్కువ.
మనిషైనా దేశమైనా యెదగడానికి రెండే దారులు ఉన్నాయి - ఇతరుల్ని కూడా ప్రోత్సహిస్తూ తన శక్తికి తగిన స్థానం వరకు ఎదిగి ఆగిపోవడం, శిఖరాగ్రానికి చేరుకోవడం కోసం ఇతరుల్ని వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్ళడం - రెండవ దారిని యెంచుకుంది చైనా భారత్ విషయంలో.ఈ దారిని యెంచుకున్నవాళ్ళు యెవరూ సామరస్యానికి లొంగరు,కాబట్టి రెండు అదెశాల మధ్యన యుద్ధం తప్పదు - కాస్త వెనకా ముందూ,అంతే!విజయావకాశాల్ని లెక్కించేటప్పుడు సహజంగా చైనాకి పెద్ద దేశం,జనాభా యెకువ,ఒకసారి గెలిచి ఉంది ఆనెవి సానుకూలమైన అంశాలు.బహుశా,చైనా లోని నాయకులూ మీదీయా వీటిని చూసుకునే దూకుడు చూపిస్తున్నారు కాబోలు!కానీ,ఇప్పటి పరిస్థితి అంత ఏకపక్షం కాదు.
ఇవ్వాళ భారత్ త్రివిధ దళాలూ మహా శక్తివంతమైనవి.చైనాతో యుద్ధం గనక వస్తే ఈసారి పదాతిదళానికి అప్పటి వ్యతిరేకతలు లేకపోగా యుద్ధరంగం చాలా అనుకూలమైనది.చైనాకు ఇప్పటికీ బలమైన నౌకాదళం లేదు.భారత్ మూడు రంగాలతోనూ ధృఢంగా ఉన్న స్థితిలో ఒక్క వాయుసేనతో చైనా గెలవడం అంత తేలిక కాదు.రాజకీయ నాయకులు బహిరంగ ప్రకటనలు ఎన్ని చేసినా యుధానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాల విషయంలో సైనికాధికారుల యొక్క నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది,అవి రహస్యంగానే ఉంటాయి.అయినాసరే, మొండికెత్తి యుద్ధానికి దిగితే భారత్ కన్న చైనాకే నష్టం యెక్కువ!
ఆయుధ రంగ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చైనా బలహీనతలలో లోకల్ మేడ్ ఆర్టిలరీ కూదా ఒకటి.భారత్ వద్ద ఉన్న ప్రతి ఆయుధమూ ప్రతి క్షిపణీ ప్రతి జలాంతర్గామీ బ్రాండ్ వాల్యూ ఉన్నది కాగా చైనా ఎక్కడా ఆయుధాలు కొన్న దాఖలాలు లేవు, అవి కూడా రివర్స్ ఇంజనీరింగ్ ముద్దుబిడ్డలే కాబోలు - ఎంత గొప్పగా పనిచేస్తాయో ఇప్పుడు జరగబోయే యుద్ధంలో భారత్ మీద ప్రయోగించాకే తెలుస్తుంది.
అయితే,రాజకీయంగా సామాజికంగా చైనాకు ప్రతిపక్షం లేకపోవడం వల్లనూ ప్రజల నుంచి వ్యతిరేకత ఉండనందువల్లనూ యుద్ధం ఎంత క్రూరమైన స్థాయిలో చేసినా అడిగేవాళ్ళు ఉండరు.కానీ భారత్ మాత్రం ఇంటిలోనిపోరును ఎదుర్కోవలసి వస్తుంది.ఇక్కడ చైనా గెలిస్తే బాగుండునని కోరుకునేవాళ్ళు కూడా ఉన్నారు.యుద్ధంలో గెలిచిన చైనా యోధులకి "మానవత్వం పరిమళించిన మంచిమనిషికి స్వాగతం" టైపు ఆహ్వానపు వీడియోలు కూడా వస్తాయేమో!ఇప్పుడు విజయశాంతి కాస్త ఒళ్ళు చేసింది గనక ఆ పార్టు బీవీ రాఘవులు ప్లే చేస్తే వరవరరావూ హరగోపాలూ కజీరు కనాయక్కూ అహస్తఫా ముస్తాఖు పక్కతాళం ముత్తయిదువుల వేషాలు వేస్తారు.హీరోగా సుమన్ అస్సలు ఉండకూడదు పొట్టివీరయ్యని తీసుకురావల్సిందే,ఎట్లాగూ ఆ వచ్చే చైనావాడు పొట్టిబుడంకాయే కదా!
యుద్ధం రావడమంటూ జరిగితే సైనికులకి వాళ్ళ జీవితలక్ష్యమే అది కాబట్టి ప్రాణాల్ని పణం పెట్టి పోరాడుతారు.కానీ మామూలు జనానికి మాత్రం పంబ రేగుతుంది.యుద్ధం వార్తల్ని చూసి సంతోషించడానికి క్రికెట్టు పోటీల్లా రంజుగా ఉండవు,అంత హింస!వ్యాపారస్తులు వెంటనే సరుకుల్ని దాచేసి కొంచెం కొంచెం వదులుతూ రేట్లు పెంచిపారెస్తారు.అమ్ముడుపోకుండా మిగిలిపోయిన పాత సరుకుల్ని కూడా బయటికి తీసుకొస్తారు.1962 యుద్ధం నెల రోజులు జరిగింది.సిక్కిం దగ్గిర దాడిని తిప్పి కొట్టటానికి పది రొర్జులు పట్టింది.నాలుగు నెలల కన్న ఎక్కువ సాగితే సామాన్య పౌర జీవనం అస్తవ్యస్తం కాక తప్పదు.పెద్ద నోట్ల రద్దు వరకు జరిగిన అన్ని నిర్ణయాలు మిశ్రమ ఫలితాలని ఇచ్చాయి గానీ "ఒక దేశం ఒక పన్ను" విధానం మాత్రం అమలు చేసిన ఇన్ని రోజుల తర్వాత కూడా గందరగోళం,అనుమానం కలిగిస్తున్నదే తప్ప సత్ఫలితాల నిస్తున్నట్టు కనబడటం లేదు.ఇప్పటి కిప్పుడు యుద్ధం వచ్చి అది సుదీర్ఘకాలం కొనసాగితే తట్టుకోగలమో లేదో తెలియదు.భారత ప్రభుత్వం తొందర పడకూడదు.వీలున్నంత వరకు యుద్ధాన్ని పనిబడి నెత్తిమీదకి తెచ్చుకోకూడదు.చైనా వేసిన ముత్యాల హారం అక్కడ ఉన్నంతవరకు భారత్ యుద్ధానికి దిగకపోవటమే మంచిది - ముత్యాల హారం పగలగొట్టాకనే భారత్ ప్రశాంతంగా ఉండగలదు!
నేను పరిశీలించిన మేరకు చైనా కూడా ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని కోరుకోవడం లేదు, వర్షాకాలం వరకు స్టేట్మెంట్ల ద్వారా బెట్టు చేసి అప్పుడు పనులు ఆపివేస్తున్నామని సైన్యాన్ని ఉపసంహరించుకుంటుంది - మోర్టారు పనులూ యుద్ధమూ ఈ రెండూ తలకు మాసినవాడు తప్ప వర్షాకాలంలో ఎవడూ చెయ్యడు.ఎందుకంటే, భారత్ ఇదివరకులా నంగిరిపింగిరి కబుర్లు చెప్పడం లేదు.చైనా గనక యుద్ధానికి దిగితే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నది.1962 గురించిన డైలాగులు అటువాళ్ళూ ఇటువాళ్ళూ పేల్చారు గానీ 1962లో భారత సైనికులు ఎదుర్కొన్న ప్రతికూలతల మధ్యన కూడా వారి పోరాటపటిమ చైనా సైన్యాధికారుల్ని చాలా భయపెట్టింది.
ఇవ్వాళ భారత్ త్రివిధ దళాలూ మహా శక్తివంతమైనవి.చైనాతో యుద్ధం గనక వస్తే ఈసారి పదాతిదళానికి అప్పటి వ్యతిరేకతలు లేకపోగా యుద్ధరంగం చాలా అనుకూలమైనది.చైనాకు ఇప్పటికీ బలమైన నౌకాదళం లేదు.భారత్ మూడు రంగాలతోనూ ధృఢంగా ఉన్న స్థితిలో ఒక్క వాయుసేనతో చైనా గెలవడం అంత తేలిక కాదు.రాజకీయ నాయకులు బహిరంగ ప్రకటనలు ఎన్ని చేసినా యుధానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాల విషయంలో సైనికాధికారుల యొక్క నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది,అవి రహస్యంగానే ఉంటాయి.అయినాసరే, మొండికెత్తి యుద్ధానికి దిగితే భారత్ కన్న చైనాకే నష్టం యెక్కువ!
ఆయుధ రంగ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చైనా బలహీనతలలో లోకల్ మేడ్ ఆర్టిలరీ కూదా ఒకటి.భారత్ వద్ద ఉన్న ప్రతి ఆయుధమూ ప్రతి క్షిపణీ ప్రతి జలాంతర్గామీ బ్రాండ్ వాల్యూ ఉన్నది కాగా చైనా ఎక్కడా ఆయుధాలు కొన్న దాఖలాలు లేవు, అవి కూడా రివర్స్ ఇంజనీరింగ్ ముద్దుబిడ్డలే కాబోలు - ఎంత గొప్పగా పనిచేస్తాయో ఇప్పుడు జరగబోయే యుద్ధంలో భారత్ మీద ప్రయోగించాకే తెలుస్తుంది.
అయితే,రాజకీయంగా సామాజికంగా చైనాకు ప్రతిపక్షం లేకపోవడం వల్లనూ ప్రజల నుంచి వ్యతిరేకత ఉండనందువల్లనూ యుద్ధం ఎంత క్రూరమైన స్థాయిలో చేసినా అడిగేవాళ్ళు ఉండరు.కానీ భారత్ మాత్రం ఇంటిలోనిపోరును ఎదుర్కోవలసి వస్తుంది.ఇక్కడ చైనా గెలిస్తే బాగుండునని కోరుకునేవాళ్ళు కూడా ఉన్నారు.యుద్ధంలో గెలిచిన చైనా యోధులకి "మానవత్వం పరిమళించిన మంచిమనిషికి స్వాగతం" టైపు ఆహ్వానపు వీడియోలు కూడా వస్తాయేమో!ఇప్పుడు విజయశాంతి కాస్త ఒళ్ళు చేసింది గనక ఆ పార్టు బీవీ రాఘవులు ప్లే చేస్తే వరవరరావూ హరగోపాలూ కజీరు కనాయక్కూ అహస్తఫా ముస్తాఖు పక్కతాళం ముత్తయిదువుల వేషాలు వేస్తారు.హీరోగా సుమన్ అస్సలు ఉండకూడదు పొట్టివీరయ్యని తీసుకురావల్సిందే,ఎట్లాగూ ఆ వచ్చే చైనావాడు పొట్టిబుడంకాయే కదా!
యుద్ధం రావడమంటూ జరిగితే సైనికులకి వాళ్ళ జీవితలక్ష్యమే అది కాబట్టి ప్రాణాల్ని పణం పెట్టి పోరాడుతారు.కానీ మామూలు జనానికి మాత్రం పంబ రేగుతుంది.యుద్ధం వార్తల్ని చూసి సంతోషించడానికి క్రికెట్టు పోటీల్లా రంజుగా ఉండవు,అంత హింస!వ్యాపారస్తులు వెంటనే సరుకుల్ని దాచేసి కొంచెం కొంచెం వదులుతూ రేట్లు పెంచిపారెస్తారు.అమ్ముడుపోకుండా మిగిలిపోయిన పాత సరుకుల్ని కూడా బయటికి తీసుకొస్తారు.1962 యుద్ధం నెల రోజులు జరిగింది.సిక్కిం దగ్గిర దాడిని తిప్పి కొట్టటానికి పది రొర్జులు పట్టింది.నాలుగు నెలల కన్న ఎక్కువ సాగితే సామాన్య పౌర జీవనం అస్తవ్యస్తం కాక తప్పదు.పెద్ద నోట్ల రద్దు వరకు జరిగిన అన్ని నిర్ణయాలు మిశ్రమ ఫలితాలని ఇచ్చాయి గానీ "ఒక దేశం ఒక పన్ను" విధానం మాత్రం అమలు చేసిన ఇన్ని రోజుల తర్వాత కూడా గందరగోళం,అనుమానం కలిగిస్తున్నదే తప్ప సత్ఫలితాల నిస్తున్నట్టు కనబడటం లేదు.ఇప్పటి కిప్పుడు యుద్ధం వచ్చి అది సుదీర్ఘకాలం కొనసాగితే తట్టుకోగలమో లేదో తెలియదు.భారత ప్రభుత్వం తొందర పడకూడదు.వీలున్నంత వరకు యుద్ధాన్ని పనిబడి నెత్తిమీదకి తెచ్చుకోకూడదు.చైనా వేసిన ముత్యాల హారం అక్కడ ఉన్నంతవరకు భారత్ యుద్ధానికి దిగకపోవటమే మంచిది - ముత్యాల హారం పగలగొట్టాకనే భారత్ ప్రశాంతంగా ఉండగలదు!
నేను పరిశీలించిన మేరకు చైనా కూడా ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని కోరుకోవడం లేదు, వర్షాకాలం వరకు స్టేట్మెంట్ల ద్వారా బెట్టు చేసి అప్పుడు పనులు ఆపివేస్తున్నామని సైన్యాన్ని ఉపసంహరించుకుంటుంది - మోర్టారు పనులూ యుద్ధమూ ఈ రెండూ తలకు మాసినవాడు తప్ప వర్షాకాలంలో ఎవడూ చెయ్యడు.ఎందుకంటే, భారత్ ఇదివరకులా నంగిరిపింగిరి కబుర్లు చెప్పడం లేదు.చైనా గనక యుద్ధానికి దిగితే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నది.1962 గురించిన డైలాగులు అటువాళ్ళూ ఇటువాళ్ళూ పేల్చారు గానీ 1962లో భారత సైనికులు ఎదుర్కొన్న ప్రతికూలతల మధ్యన కూడా వారి పోరాటపటిమ చైనా సైన్యాధికారుల్ని చాలా భయపెట్టింది.
రెండు దేశాలకీ తమకంటూ బలమైన సైన్యమూ,వ్యూహ నిర్మాణ చాత్రుర్యమూ ఇతరుల నుంచి సహాయాన్ని ఆశించని స్వాభిమానమూ ఉన్నాయి కాబటి యుద్ధం ఈ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కావచ్చు.అలాగే ఎవరికీ సంపూర్ణ విజయం దక్కకపోవచ్చు.భారత్ గనక టిబెట్ ప్రాంతాన్ని పట్టుకుని దలై లామాని అక్కడ నిలబెడితే చైనాకి నడుం విరిగినట్టు అవుతుంది.ఇది యుద్ధసమయంలో కుదరకపోయినా గెలుపోటములతో సంబంధం లేకుండా తర్వాతనైనా చెయ్యాల్సిన పని.ఎందుకంటే విస్తీర్ణం ఎక్కువయినప్పటికీ చైనాలో జనావాసానికి తగిన భూమి తక్కువ.ఒక్క టిబెట్ ప్రాంతమే మిగిలిన వాటికన్న మెరుగు.మొత్తం చైనా జనాభాలో 12% ఉండి వ్యాపారులకి లాభం తెచ్చిపెట్టేది అది ఒక్కటే - అప్పుడు చైనా దాన్ని వశపరచుకోవడానికి ప్రయత్నించిందీ దలై లామా తిరగబడిందీ అందుకే.దాన్ని గనక చైనా నుంచి వేరు చేస్తే ఇక మళ్ళీ భారత్ వైపుకి కన్నెత్తి చూసే ధైర్యం చెయ్యదు చైనా!
ప్రేమలోనూ యుద్ధంలొనూ గెలుపే ముఖ్యం - ఎలా గెల్చినా తప్పు లేదు!