If triangle made a god,they will give three arms and one body - just like themselves!ఈ లెక్క ప్రకారమే మనిషి దేవుడికి తన రూపాన్నే ఇచ్చాడు కాబోలు!అనేక విధాలుగా తనని తనే అర్చించుకుంటాడు మానవుడు - అతని ఆత్మపూజకు నామాంతరమే దేవుడు!అతని ఆహారమే అతని దేవుడి నైవేద్యం - బ్రాహ్మణుడు పాయసం పెట్టాడు, శూద్రుడు పొంగలి పెట్టాడు, బోయతిన్నడు మాంసం పెట్టాడు!ఇతర జీవులైన వృక్షాలకీ జంతువులకీ అవసరం లేని దేవుడు మానవుడికే ఎందుకు అవసరం అయ్యాడు?
ఆధునిక విజ్ఞానశాస్త్రం కొన్ని కీలకమైన చోట్ల త్రవ్వకాలు జరిపి అక్కడ దొరికిన వస్తువుల వయస్సును విశ్లేషించి ఆఫ్రికా లోని Rift Valey 4-5 మిలియన్ సంవత్సరాల వెనక Australopithecines అనే తొలి hominid సమూహం భూమిమీద నడిచిన తొలి ప్రాంతం అని నిర్ధారించారు.అలా తూర్పు ఆఫ్రికా ఒడిలో పెరిగిన పూర్వమానవజాతి Homo erectus యొక్క శిధిలాలు Ethiopia,Kenya మరియూ Tanzaniaలోని Turkana సరసు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఆ పూర్వమానవసమొహం ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర దక్షిణ భాగాలు రెండింటా వ్యాపించారని తెలియజేస్తున్నాయి.ఈ Homo erectus జాతియే ఆసియా,యూరోప్ ఖండాలకు కూడా విస్తరించింది.ప్రాచీనమైన Homo erectus జాతి నుంచి ఆధునికమైన Homo sapiens జాతి ఆవిర్భావం కొంత నెమ్మదిగా జరిగింది - ఇది బహుశా 200.000 నుండి 100.000 మధ్య జరిగి ఉండవచ్చును!ప్రస్తుతం అందరు శాస్త్రవేత్తలూ ఈ ఆధునిక Homo sapiens జాతినే అసలైన మానవసంస్కృతీనిర్మాత అని గుర్తించారు. ఇతని ఆవాసాలు యెక్కడెక్కడ దొరికితే ఆ ప్రాంతం అత్యంత ప్రాచీన కాలం నుంచి మానవజాతికి అనుకూలంగా ఉన్నట్టు పరిగణించి అక్కడ యెన్నెన్నో పరిశోధనలు చేస్తున్నారు - మానవుల సామాజిక మనస్తత్వం లోని చిక్కుముడులను విప్పడానికి పనికొచ్చే పనిముట్ల కోసం!తొలి మానవ జాతి ఆఫ్రికాలో పుట్టి మొదట భరతఖండాన్ని చేరడం, తర్వాత ఆఫ్రికా నుండి మానవచలనం ఆగిపోవడం, తర్వాత ప్రపంచమంతటికీ భారత దేశాన్ని చేరిన సమూహమే వ్యాపించడం అనే మొత్తం వివరాలను క్రె.శ 2003లో Stephen Openheimer బృందం తాము చేసిన పరిశోధనలను గుదిగుచ్చి ఒక యానిమేషన్ వీడియోను రూపొందించింది.అరచేతులు రంగుదేలి కనిపిస్తూ రక్తారుణ నేత్రాలను కలిగి ఉండి నల్లని దేహంతో విలసిల్లే మహామాతను గురించీ సకల నాగరికతలూ భరతభూమి నుంచే మొదలు కావడాన్ని గురించీ సనాతనులు చెప్పినప్పుడు ఈ దేశంలోనివారే కొందరు వెక్కిరించారు.మరీ నీచమయిన విషయం యేమిటంటే, చరిత్రను చరిత్రలా చదివితే వారికి కూడా తల్లియే ఐన జగన్మాతను కేవలం హిందువులకు మాత్రమే అంటగట్టి sex worker అని అవమానించారు - తల్లిని కూడా దూషించగలిగిన సంస్కారహీనమైన హిందూద్వేషం వారిది!
మనుష్యులు లిపిని కనిపెట్టి తమ జ్ఞానాన్ని అక్షరబద్ధం చేసిన తర్వాత వాటిని చదివితే అప్పటి వారి ఆలోచనలను కూడా చదివి స్పష్తమైన చరిత్రను నిర్మించగలం కాబట్టి అప్పటి నుంచి తెలుస్తున్న దానిని చరిత్రయుగం అని అంటున్నాము.దీనికి ముందరి కాలమైన చరిత్ర పూర్వయుగంలో మానవుల జీవన విధానం యెట్లా ఉండేది అని తెలుసుకోవడానికి వాళ్ళు నివసించిన ఇళ్ళు, వాడిన వస్తువులు మాత్రమే ఆధారం.ఇంటి ఆనవాళ్ళు కనిపిస్తే తలుపులు,గోడలు,కిటికీలు ఉన్న అమరికని బట్టి అవి కట్టినవాళ్ళ తెలివిని అంచనా వెయ్యడం,ఏ పనికి తగిన పనిముట్లు ఎక్కువ దొరికితే వాటిని దేనికి ఉపయోగిస్తారో ఆ పని అప్పుడు ఎక్కువమంద్ చెసేవాళ్ళు అని అనుకోవడం - అంతే!ఆంధ్ర ప్రాంతంలో తొలి మానవుడి ఆనవాళు 1,50,000 సంవత్సరాల ముందునుంచి దొరుకుతున్నాయి.ఈ కాలం గురించి సరైన తీరులో విశ్లేషించడానికి దీన్ని కొన్ని దశలుగా విడగొట్టారు - రాతి యుగం,ఇనుప యుగం,కంచు యుగం అని చాలా ఉన్నాయి.తమకు దొరికిన సమాచారం యొక్క విస్తృతిని బట్టి ఎవరికి వారు రకరకాల దశలను, అంతర్దశలను వర్ణించారు.అన్ని దశలలోనూ ఇంటిలో వాడే వస్తువులలో కుండ ప్రముఖ పాత్రని వహిస్తుండటం విశేషం!మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేసి ఇతర జీవుల కన్న అధికుడిగా నిలబెట్టిన లక్షణం ఆహారాన్ని దాచుకుని తినడం - అందుకు పనికివచ్చే సాధనమే కుండ.అందుకే అప్పటి ముంచి ఇప్పటి వరకు మనుషులు సంప్రదాయకంగా పాటించే అన్ని క్రతువులలోనూ, పూజలలోనూ, యజ్ఞాలలోనూ కుండ ప్రముఖపాత్రని వహిస్తున్నది - ఇప్పటి మనుషులు డబ్బు చుట్టూ తిరుగుతున్నట్టు అప్పటి మనుషుల జీవితం కుండ చుట్టూ తిరుగుతూ ఉండేది కాబోలు!
దక్కను పీఠభూమి రాతియుగపు మానవునికి అత్యంత అనుకూలమైన ప్రదేశం.ఇక్కడి నేల హిమాలయాల కన్న చాలా పూర్వపుది. ఇక్కడి కొన్ని రాతిపొరలు మరింత ప్రాచీనమైనవి.ఇక్కడి వాతావరణం ఈనాటి కన్న మరింత వేడిగా ఉండేది.విపరీతమైన వర్షాలు కురిసేవి.నదీనదాలూ వాగువంకలూ ఎడతెగక పారుతూ ఉండేవి.వర్షాలు,ఎండలు ఒకదాని వెంట మరొకటి వస్తూ ఉండటం వల్ల లాటిరైట్ రాయి ఏర్పడింది.ఇది పనిముట్లూ ఆయుధాలూ చెయ్యడానికి అనువైనది.పాత రాతియుగంలో ఒకే పనిముట్టును అన్ని పనులకూ వినియోగించిన మనిషి ఏ పనికా పనికి విడివిడీగా పనికి తగ్గ పనిముట్టును వాడటం నేర్చుకుని కొత్త రాతియుగంలోకి అడుగు పెట్టాడు.ఈ పనిముట్లని అమర్చి పటుకోవడానికి కర్రను వాడాడు.కర్ర స్థానంలోనూ పనిముట్టు స్థానంలోనూ లోహాన్ని వాడటంతో లోహయుగం మొదలైంది.రాతియుగం నుంచి లోహయుగం వరకు ఉన్న జీవనవిధానాన్ని నాగరికత అని పిలవలేము - లోహం ఇచ్చిన సౌకర్యం వల్ల స్థిరత్వం అవసరమై నగరాలను నిర్మించుకున్నాకనే నాగరికత మొదలైంది.
పాత రాతియుగం నుండి చారిత్రక దశ వరకు అన్ని దశల పనిముట్లు గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ వద్ద దొరకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఇక్కడ కేవలం నాలుగు చరపు మైళ్ళ పరిధిలోనే ఆరు చోట్ల పనిముట్లు కనిపించాయి.ఖమ్మం జిల్లాలోని భద్రావ్=చలానికి 40 మైళ్ళ దూరంలో 35 రకాల పనిముట్లు కేవలం 50 గజాల మేరలో దొరికాయి.ఆగ్నేయాసియాలో కెల్లా రాయచూరు,బళ్ళారి జిల్లాలను కొత్త రాతియుగపు జన్మస్థలాలుగా పేర్కొనవచ్చును.ఇక్కడినుంచి తూర్పునా పడమరనా ప్రక్కన ఔన్న నెల్లూరు,అనంతపురం,కడప,కర్నూలు జిల్లాలకు విస్తరించింది.సమాజం వేటదశ నుంచి పశుపాలక వ్యసాయ దశకు యెదిగేసరికి పరిసరాలను గురించిన విజ్ఞానం పెరిగింది.జ్ఞానం విస్తరించిన కొద్దీ కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి.పాత సమస్యలు పరిష్కారమయ్యాయని సంబరపడనివ్వకుండా కొత్త సమస్యలు మనశ్శాంతిని పోగొడుతున్నాయి - దానితో కొత్త దేవుళ్ళు,కొత్త నమ్మకాలు,కొత్త కర్మకాండలు పుట్టి మతం వ్యవస్థీకృతమై స్పష్టమైన రూపం తీసుకోవడం మొదలైంది.
ఆది మానవ జాతి అడివి జంతువుల తర్వాత ఎక్కువగా భయపడింది అగ్నికే!అడవిలో తరచుగా పుట్టే నిప్పు కార్చిచ్చు - అది సమస్తాన్నీ దహిస్తుంది కాబట్టి భయపడి పారిపోవడం సహజం.అయితే అదే నిప్పు శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇస్తుందనీ, అడివి జంతువుల్ని భయపెడుతుందనీ, చీకటిలో వెలుతురు నిస్తుందనీ, నిప్పుల మీద కాల్చిన మాంసమూ దుంపలూ తేలిగ్గా జీర్ణమవుతాయనీ తెలిశాక దానిని లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు.ఆఖరికి రెండు కర్రలను రాపాడించి అగ్నిని చెయ్యడం సాధించిన మానవుడికి శూన్యం నుంచి మహాశక్తిని ఉద్భవింపజేసినంత మహోత్సాహం కలిగింది.ఈ కర్రలతో అగ్నిని ప్రజ్వలింపజేసే ప్రక్రియకే సంస్కృతంలో ఆరణి మధనం అని పేరు.అలా తమకు స్వాధీనమైన మహాశక్తి ఎల్లప్పుడూ తమని క్షేమంగా ఉంచాలని భావిస్తూ దానికి దివ్యత్వాన్ని కటబెట్టి ఆరాధించడంలో దైవం అనే భావన మొదటిసారి మనిషి ఆలోచనలోకి చొచ్చుకుని వచ్చింది!
పాత రాతి యుగంలో మానవులు చనిపోయిన తమవారిని ఎక్కడ చనిపోతే అక్కడే వదిలి పోయేవారు,కొత్త రాతియుగం వచ్చేసరికి కళేబరాలను భద్రంగా కొన్నిచోట్ల పాతిపెట్టి గుర్తులు ఉంచడం నేర్చుకున్నారు.వైదిక సాహిత్యంలో పరోత్పసులు(మృతకళేబరాలను వదిలేసి పోయేవారు),ఉద్ధితులు(మృతకళేబరాలను ఎత్తయిన చోట దాచేచారు) అనే పేర్లు వినబడతాయి.మానవుడి ఆధ్యాత్మిక జీవనంలో క్రతువ్లు ముఖ్యపాత్ర వహించడంలో ఈ శవసంస్కారం మొదటి దశ కావచ్చు.ఇందులో చనిపోయిన మనిషి పట్ల ఉన్న ఆత్మీయతనీ అనుబంధాన్నీ ప్రద్ర్శించడం కనిపిస్తుంది - ఎక్కడ బడితే అక్కడ వదిలేసిన నిర్లక్ష్యం వల్ల కలిగిన అపరాధ భావనకి బదులు ఇతను ఎక్కడికి వెళ్ళాడు అనే ప్రశ్నకి దివ్యలోకాలకి వెళ్ళాడు అనే జవాబు,అక్కడ ఎవరు ఉంటారు అనే ప్రశ్నకి దేవుడు ఉంటాడు అనే జవాబు కలిసి అతని మనసుకి ఓదార్పుని ఇచ్చింది!ప్రతి మనిషి శరీరంలో ఒక ఆత్మ ఉంటుందనీ అది మనిషిని విడిచిపెట్టడమే మరణం అనీ భావించేవారు.విగతాత్మ,మృతశరీరం కొంతకాలం వరకు పకపక్కనే ఉంటాయని భావించి చనిపోయినవారిని నిలువునా పడుకోబెడితే పట్టేటంత మట్టిపాత్రలో పెట్టి పక్కనే ఆహార పదార్ధాలను కూడా ఉంచి పూడ్చిపెట్టేవారు
వీటికి సమాంతరంగా సృష్టిని గురించిన అలోచనలు కూడా దైవభావన మరింత బలపడటానికి కారణం అయ్యాయి.ఏనాడు దైవభావన మానవుడి మనస్సులో ప్రవేశించిందో ఆనాటి నుంచి తనకు సంబంధించిన సమస్తాన్నీ దానికే అంటుగట్టెయ్యటం మొదలు పెట్టాడు - మంచి జరిగితే అతను కరుణీంచాడని పొంగిపోవటం,చెడు జరిగితే అతను శిక్షించాడని కుంగిపోవటం,అతన్ని ప్రసన్నం చేసుకుని శిక్షని తప్పించుకోవటానికి పడరాని పాట్లు పడటం!క్రతువులు ఎక్కువై చింతన తగ్గి జీవితం మరింత సంక్లిష్టమై కొందరికి విసుగు పుట్టి దైవభావనను తిరస్కరించేసి నాస్తికత్వాన్ని ప్రబోధించి పాటించటం మొదలు పెట్టారు!దేవుడు ఉన్నాడు అని వాదించి ఆ దైవభావన చుట్టూ తమ జీవితాలను తిప్పుకునేవారూ, దేవుడు లేడని వాదించి దైవభావనని తిరస్కరించి తమ కష్టసుఖాలను తమ బుద్ధికే అప్పగించేవారూ అప్పటి నుంచి ఇప్పటి వరకు పక్కపక్కనే బతుకుతూ ఒకరిని మరొకరు అవహేళన చేస్తూ బతికేస్తున్నారు తప్ప ఏవరూ ఎవరినీ మార్చలేకపోతున్నారు.మన తెలుగువాడే అయిన మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వైవీ రెడ్డిగారు నిన్నమొన్నటివరకు నాస్తికుడిగా ఉండి ఈ మధ్యనే ఆస్తికులయ్యారు - ఎలా జరిగిందీ మార్పు అని అడిగితే "దేవుడు ఉన్నాడనటానికి సాక్ష్యాలు లేనట్టే లేడనటానికీ గ్యారెంటీ లేదు కదా!" అనేశారు.మనకి ఏ విషయమైనా శాస్త్రీయమైనది అనిపించాలి అంటే అది మన నమ్మకాలకి అతీతంగా సంక్లిష్తత లేకుండా మన అనుభవానికి అందాలి, కదా!మరి, రెడ్డి గారి లిటిగేషను ఆస్తికత్వాన్నీ నాస్తికత్వాన్నీ కూడా అశాస్త్రీయం చేసేస్తున్నది - అందుకే, ఈ రెడ్లని చచ్చినా నమ్మకూడదు:-)
ఐతే, ఇన్నాళ్ళూ నాస్తికులు తమకు సపోర్టుగా తెచ్చుకుంటున్న సైంటిస్టులు కూడా ఈ మధ్య ఆస్తికపు మాటలు మాట్లాడుతున్నారు - వారిలో కొందరు నాస్తికులు కూడాను!ఆధునిక యుగంలో మనకి టీవీలూ,ఫ్రిజులూ,కార్లూ,విమానాలూ ఇచ్చిన సైన్సు మహా అయితే ఒక రెండు వందల సంవత్సరాల నుంచే కొంచెం వూపు తెచ్చుకుంది.అంతకుముందు సైన్సు అంటే ఏమిటో కూడా తెలియని జనాలు ఉండేవాళ్ళు - ఎన్టీవోడి సినిమా చూడని తెలుగోళ్ళలా!మొదటి దశలో సైంటిస్టులు ఆస్తికులా నాస్తికులా అనే తేడా లేకుండా తమ సిద్ధాంతాలకీ విశ్లేషణలకీ భౌతికపరమైన ఆధారాల కోసమే వెతికేవాళ్ళు.దానినే తర్వాత తరాల వాళ్ళూ అందిపుచ్చుకున్నారు.నిన్నమొన్నటివరకు బాగానే నడిచింది కానీ ఇపుడిప్పుడు కొంచెం ఎదురుదెబ్బలు ఎక్కువ కావటంతో ఆగి ఆలోచిస్తున్నారు, ఏమో దేవుడు ఉన్నాడేమో అని సందేహిస్తున్నారు.
మొదటి కుదుపు 1919లో Edwin Powell Hubble (November 20, 1889 – September 28, 1953) విశ్వం వ్యాకోచిస్తున్నదని ప్రకటించినప్పుడు వచ్చింది.20వ శతాబ్దపు తొలినాళ్ళ వరకు పాశ్చాత్య దేశాల శాస్త్రవేత్తలు కేవలం 100 మిలియన్ల నక్షత్రాలు ఉన్న మన పాలపుంత ఒక్కటే మొత్తం విశ్వం అనుకునేవారు.వీళ్ళందరూ విశ్వానికి ప్రారంభం అంటూ లేకుండా mass,space,energy వంటి సమస్తమైన ద్రవ్యాలూ ఎప్పుడూ ఉండేవని అనుకునేవారు.Sir Frederick Hoyle అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విశ్వం వ్యాపిస్తునదన్న సిద్ధాంతాన్ని చాలా గట్టిగా వ్యతిరేకించాడు - ఇతను steady state సమర్ధకుడు,Hubble కనుక్కున్న సృష్టి ప్రారంభానికి Big-Bang అనే వెక్కిరింత పేరు పెట్టింది ఇతనే!ఐన్‌స్టీన్ కూడా కంగారు పడ్డాడు - మొదట తన లెక్కల్లో విశ్వం వ్యాపిస్తునదన్న విషయం చొరబడకుండా మోళీ చేసి తర్వాత దాన్ని ఒప్పుకోలేకపోవటం ఒక చారిత్రక తప్పిదం అనేశాడు!ఆఖరికి, 1992లో COBE Satellite Experiments వ్యాకోచించే విశ్వానికి ఒక ప్రారంభం ఉన్నదని ఋజువు చెయ్యటంతో ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సి వచ్చింది.మొదటి కొత్త పాఠం కొట్టిన దెబ్బ నుంచి తేరుకుని ఆలోచిస్తే everything అనుకుంటున్న పదార్ధం nothing అనే శూన్యం నుంచి వచ్చిందనే రెండో పాఠం కూడా దానికే అతుక్కుని ఉందని తెలుసుకున్నారు.ఇక్కడి నుంచి శాస్త్రవేత్తల పరిభాషలోకి కొత్త పదాలు రావటం మొదలుపెట్టాయి.Edward Milne అనే బ్రిటిష్ రచయిత సాపేక్ష సిద్ధాంతం గురించి ఒక గణితశాస్త్రగ్రంధం రాసి చివర్లో "As to the first cause of the universe,in the context of expansion.that is left to the Readr to insert,but our picture is incomplete without Him" అని ముక్తాయించాడు.Edmund Whittakerఅనే మరొక బ్రిటిష్ శాస్త్రవేత్త విశ్వం యొక్క ప్రారంభం గురించి "Divine will constiruting Nature from Nothingness" అనేశాడు.కొందరు నాస్తికులైన శాస్త్రవేత్తలు కూడా ఆస్తికత్వం గురించి తమ కరుకైన భాషను మార్చి ఒక సమాంతరమైన దృగ్విషయం ఉన్నదని ఒప్పుకుంటున్నారు!అటువైపు నుంచి Cosmology కూడా ఇంత సంక్లిష్టమైన గ్రహతారకాదులతో కూడిన విశ్వనిర్మాణం అనుకోకుండానో దానంతటదిగానో జరగడం కుదరనిదని తేల్చి చెప్పి ఇది ఒక సంకల్పం చేత ఏయే సంభావ్యతలు ఏయే విధంగా జరిగితే విశ్వం ఇప్పుడున్న విధంగా ఉంటుందో ప్రణాళిక వేసి నిర్మించినట్టు ఉన్నదని బల్లగుద్ది చెబుతున్నది.దానితో తప్పనిసరై విశ్వం మొదలు కావటానికి కారణం గురించి చెప్పేటప్పుడు శాస్త్రవేత్తల నోటి నుండి "Super Intellect","Creator","Supreme Being" అనే మాటలు దొర్లడం మొదలు పెట్టాయి.
ఈ రెండు పాఠాలూ వంటబట్టాక కొంత కాలానికి ఈ విశ్వమంతా జీవం అనేది ఆవిర్భవించడానికి తగినట్టు దశల వారీ మలుపులతో ల్కెక ప్రకారం నడుస్తున్నదనే మూడవ పాఠం కూడా తెలిశాక శాస్తర్రంగం దైవసృష్టి వైపుకే మొగ్గు చూపుతున్నది!ఒక చిత్రమైన విషయం ఏమిటో తెలుసా!మహావిస్ఫోటనం గనక కొంచెం నెమ్మదిగా జరిగి ఉంటే అప్పుడు ఆవిర్భవించిన ద్రవ్యం యొక్క విభిన్న అస్తిత్వాలు తమను తాము ఆకర్ధించుకునే గురుత్వాకర్షణ శక్తి యొక్క తీవ్రత వీటిని వ్యాకోచిమంప జేస్తున్న విస్ఫోటనం యొక్క శక్తి కన్న అధికమై వెనక్కి కుంచించుకుపోయి ఉండేవి - అలా జరిగితే మనం ఇప్పుడిలా ఉండేవాళ్ళం కాదు - If the rate of expansion one secnd after the Big Bang had been smaller by even one part in a hundred thousand-million-million, the universe would have re-collapsed before it ever reached its present size.మన చుట్టూ ఉన్న విశ్వం మొత్తం మనం ఉన్న భూగ్రహం మీద జీవం పుట్టడానికి సరిపడినట్టు లెక్క ప్రకారం ఉండటాన్ని గమనించిన జీవధర్మశాస్త్రవేత్తలు(Biologists) మరింత విస్తుపోయారు.ఆమ్లజని(Oxygen)తో కూడిన వాతావరణం అతి ముఖ్యం, ఇతర మూలకాలు ఉదజని(Hydrogen), నత్రజని(Nitrogen), కర్బనం(Carbon), భాస్వరం(Phosphorus) వంటివి కూడా ముఖ్యమే!కేవలం Cytosine, Guanine, Adenine, Thymine అనే నాలుగు nitrigen containing nucleobase ఇటుకలతో ఏర్పడిన DNA అనే సంక్లిష్టమైన నిర్మాణం విశ్వరచనకి సంబంధించినంత వరకు ఒక కోతిని Typing Machine ముందు కూర్చోబెట్టి రామాయణాన్ని రచింపజేయవచ్చుననే THeory of Probability సిద్ధాంతం నవ్వుకోవడానికి మాత్రమే పనికివస్తుందని తేల్చి చెప్పింది!
జీవధర్మానుసారం జీవకణాలలో జరుగుతున్న జీవ రసాయనిక చర్యలు సమస్తం Photosynthetic Reaction,Respiratory Reaction అనే రెంటి మధ్య జీవశక్తి ఉయ్యాల వూగుతూ ఉండటం వల్ల జరుగుతున్నాయి - వుయ్యాల ఆగితే దేహంలోని హంస విశ్వంలోని పరమహంసను చేరుకున్నట్టే!నిజానికి ఈ రెండు reactions లోనూ reactants,productsగా ఉన్న మూలకాలు ఒకటే - ఒక చర్యలోని reactants మరొక చర్యలో products అవుతూ వస్తున్నాయి:
Photosynthetic Reaction on chlorophyll of plants is:
The equation expressed in words would be:
carbon dioxide + water + energy -> glucose + oxygen
Respiratory Reaction at cellular level is:

glucose + oxygen -> carbon dioxide + water + energy
మొదటిది విశ్వశక్తిని రూపం మార్చి దృశ్యమాన ప్రపంచం ఉపయోగించుకోగలిగిన స్థితిశక్తిని ఉనికిలోకి తీసుకొస్తుంది. రెండవది ఒక వస్తువులో దాని నిర్మాణాన్ని పట్టి ఉంచుతున్న స్థితిశక్తిని వస్తువును బద్దలు కొట్టడం ద్వారా రూపం మార్చి గతిశక్తిని ఉనికిలోకి తెచ్చి క్రియకు కారణం అవుతున్నది. శక్తిని సృజించేది స్త్రీత్వం అనీ క్రియను జరిపించేది పురుషకారం ఆనీ అనుకుంటే సృష్టిని స్త్రీపుంసయోగోద్భవం అని సనాతనులు అనడంలోని అంతరార్ధం తెలుస్తుంది. ఈ రెండు చర్యల్నీ శాసించే నియమాలే విశ్వంలోనూ శక్తి, ద్రవ్యం మధ్యన జరిగే సయ్యాటను శాసిస్తున్నాయి - అవే ఉష్ణగతిజశాస్త్రం(Thermodynamics) యొక్క నాలుగు నియమాలు.
-------------------------------
1.Zeroth law of thermodynamics: If two systems are in thermal equilibrium with a third system, they are in thermal equilibrium with each other. This law helps define the notion of temperature.
2.First law of thermodynamics: When energy passes, as work, as heat, or with matter, into or out from a system, the system's internal energy changes in accord with the law of conservation of energy. Equivalently, perpetual motion machines of the first kind are impossible.
3.Second law of thermodynamics: In a natural thermodynamic process, the sum of the entropies of the interacting thermodynamic systems increases. Equivalently, perpetual motion machines of the second kind are impossible.
4.Third law of thermodynamics: The entropy of a system approaches a constant value as the temperature approaches absolute zero. With the exception of non-crystalline solids (glasses) the entropy of a system at absolute zero is typically close to zero, and is equal to the logarithm of the product of the quantum ground states.
The second law was postulated earlier (1824) in the Sadi Carnot’s study of the working of steam engine, and the first law in 1848 by Hermann Helhholts and William Thomson.Later in year 1931 Fowler realized that thermal equilibrium had to be defined before first law.
-------------------------------
ప్రస్తుతం సైంటిఫిక్ ప్రపంచం ఒప్పుకుంటున్న సిద్ధాంతాలలో చాలామటుకు వెసులుబాటు కోసం చేసిన తప్పనిసరి అమరికలే ఎక్కువ. రాగద్వేషాలకు ఎవ్వరూ అతీతులు కారు కదా, సైంటిస్టులలో కూడా వ్యక్తిగతమైన అహంకారాలకు లోనై ఇతరులు కనుగొన్న సత్యాలను మరుగుపర్చటానికి ప్రయత్నించేవారూ ఉన్నారు..సైంటిఫిక్ ప్రపంచంలో కూడా అప్పుడప్పుడు లాబీయింగ్ పనిచేస్తూ ఉంది , క్రైస్తవుల అధిపత్యానికీ క్రైస్తవుల మీద చర్చి అధికారానికీ బీటలు కొట్టే యే సిద్ధాంతం కూడా ఆదరణకి నోచుకోదు!అయితే, ఈ ఉష్ణగతిజనియమాలు మాత్రం చిన్నా పెద్దా శాస్త్రవేత్తలు నిజమైన జ్ఞానదాహంతో కలిసి సాగించిన సమిష్టి కృషితో నిగ్గుదేల్చిన సత్యాలు.ఒక్క రెండవ నియమమె తొలినాటి ప్రహేళిక(Puzzle) స్థాయి నుంచి అన్ని అడ్డంకుల్నీ దాటుకుని సిద్ధాంత రూపం ఏర్పడటానికి ఒక శతాబ్దం పైనే పట్టింది = కాబట్టి, నమ్మవచ్చును!ఈ రెండవ నియమం ఏమి చెబుతున్నదంటే, ఒకదానినొకటి ప్రభావితం చేసుకొనగలిగిన పరస్పర సంబంధం కలిగి ఉన్న అనేకానేక వ్యవస్థలలోని ఒక స్వతంత్రమైన వ్యవస్థలో entropy ఏ విధమైన బాహ్యశక్తి పనిచేయకుండా ఉంటే క్రమబద్ధమైన వేగంతో పెరుగుతూ ఆ వ్యవస్థ అప్పుడున్న ordorliness నుంచి disorderliness వైపుకి నడుస్తుంది.ఒక వ్యవస్థలో ఇప్పుడున్న order అలాగే ఉండాలంటే దానిమీద ఏదో ఒక బాహ్యశక్తి పని చేయాల్సిందే, ఆ వ్యవస్థను పట్టి ఉంచే బాహ్యశక్తి వెనుక ఆ వ్యవస్థ ఉండి తీరాల్సిన అవసరమూ ఆ అవసరాన్ని గుర్తించిన ఒక సంకల్పమూ ఉండి తీరాల్సిందే!
ఈ తిరుగులేని పాదార్ధిక నియమమే దైవం అనే ఆధ్యాత్మిక భావనను శాస్త్రీయమైనది అని రుజువు చేస్తున్నది.ఎలాగంటే, విశ్వం లోని ప్రతి అంశం ఎంతో నిర్దిష్టంగా నిర్మించబడి ఉండి బాహ్యశక్తి పనిచేయనప్పటి అస్థిరత్వంలోకి జారుకుని నశించిపోవడం లేదు కాబట్టి దీనిని స్థిరంగా ఉంచడం కోసం శక్తిని ప్రయోగించుతున్న దివ్యసంకల్పమే దైవం అని తెలుస్తున్నది కదా!ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే,పాదార్ధిక ప్రపంచంలోని భౌతిక రసాయనిక చర్యలను మాత్రమే కాదు, మానవ సమూహపు చరిత్రగమనంలోని మలుపులను కూడా ఈ నియమమే ప్రభావితం చేస్తున్నది!ప్రాచీన కాలపు చరిత్రలో ఒక రాజవంశం పుట్టినా, ఒక రాజవంశం అంతరించిపోయి మరొక రాజవంశం ప్రభవించినా అక్కడొక అవసరమూ క్రాంతదర్శకులైన కొందరి బలమైన సంకల్పమూ కనిపిస్తున్నది. ఆధునిక కాలంలో జరిగిన, జరుగుతున్న మహోద్యమాలలోనూ భీకరమైన యుద్ధాలలోనూ కూడా అది జరిగి తీరాల్సిన అవసరమూ ఆ అవసరాన్ని గుర్తించిన కొందరి సంకల్పమూ స్పష్టంగా గోచరిస్తున్నది, అవునా!
కానీ, సమాంతర ప్రతిపాదన పేరున అది కూడా వాస్తవమే అని ఒప్పుకున్న నాస్తికులైన ఆ శాస్త్రవేత్తలు ఇంకా నాస్తికులుగానె ఉన్నారనేది మనం తెలుసుకుంటే ఇంతటితో పరమసత్యం నిరూపించబడినదని అనుకునే అవకాశం లేదు.ఇప్పటికీ దేవుడు ఉన్నాడని ఒపుకోవడమా ఒప్పుకోకుండా ఉండిపోవటమా అనేది వారి వారి వ్యక్తీగతమైన అవసరాలే నిర్ణయిస్తాయి.ఇతర దేశాల్లో కన్న మన దేశంలో విభిన్న ధోరణుల పట్ల సహిష్ణుత ఎక్కువ. ఏకేశ్వరోపాసకులున్నారు. బహుళదేవతారాధకులున్నారు. ఈశ్వరుని విషయంలో ఒక నిర్ణయానికి రాని రకరకాల విశ్వాసాల వాళ్ళూ ఉన్నారు. అవిశ్వాసులూ ఉన్నారు. ఈ దేశం అఖండ భారతంగా లేని స్థితిలో, అంటే పెద్ద చిన్న రాజ్యాలుగా ఉంటున్న సందర్భంలోనూ విశ్వాస - మత - ప్రాతిపదికన అట్టి రాజ్యాలు ఏర్పడడం గానీ, విశ్వాస ప్రాతిపదికన పాలన జరగడం గానీ లేదు. రాజులెవరైనా, రాజ్యాలేవైనా, వివిధ విశ్వాసాల వాళ్ళు వారారాధించే దేవుళ్ళ మందిరాలూ అన్నీ, అంతటా విస్తరించే ఉంటుండేవి. అందరినీ ఆరాధించే వాళ్ళు కొందరైతే, తామంగీకరించిన దేవతామూర్తిని మాత్రమే ఆరాధిస్తూ మిగిలిన విశ్వాసాల పట్ల ఆరాధ్యుల పట్ల ఉదాసీనంగా ఉండేవారు ఇంకొందరు. తమ దైవాన్ని అభిమానిస్తూ ఇతరాలను సరైనవి కావని గానీ, తమ దైవం కంటే అల్పశక్తిమంతాలని గాని తలుస్తుండే వాళ్లు మరికొందరు. ఇలాటివన్నీ తెలీనివీ, తేలనివీ, జీవితానికి అవసరం లేనివి అనే దృష్టి కల రకరకాల ధోరణులవారూ ఈదేశంలో సామరస్య పూర్వకంగా సహజీవనం చేస్తూనే వచ్చారు. సైద్దాంతిక స్థాయిలో ఆ స్థాయి కలవాళ్ళ మధ్య వాద వివాదాల రూపంలో పరస్పర విభేదాలుంటున్నా, సాధారణ ప్రజలంతా ఆ వివిధ సైద్దాంతికులందరినీ పెద్దలు - జ్ఞానులుగానే విశ్వసించి గౌరవిస్తూనే ఎవరికి వారు, తమకు నచ్చిన ధోరణిని యధాశక్తి అనుసరిస్తూ, అందరూ సామాజికంగా సామరస్యంతో సహజీవనం సాగిస్తూ వచ్చారు. ఈ సంస్కృతి - ఈ దేశ సంస్కృతిగా ఇక్కడి వారికి నరనరాన జీర్ణించుకుని అలవాటుగా మారి ఉంది కనుకనే చక్కగా కొనసాగుతూ వచ్చింది.ఈ సనాతన ధర్మం యొక్క సూత్రాన్ని తెగనివ్వకూడదు - ఇతరుల నమ్మకాల్ని అవహేళన చెయ్యడానికి వీల్లేదు, నీకంట్లో దూలముంచుకుని నాకంట్లో నలుసును తప్పు పడుతున్నట్టు ఇతరుల మతాల్లో తప్పుల్ని వెదకడం సంస్కారహీనం, ఒక మతం పేరుతో ఏకమై ఇంకో మతం మీద పెత్తనం చెయ్యడం దుర్మార్గం!
దేవుడు లేడని తీర్మానించుకుంటే ఆ దేవుణ్ణి సంతోషపెట్టి తప్పు చేసి కూడా శిక్షల్ని తప్పించుకోవడం కోసం క్రతువులు చెయ్యాల్సిన బాదరబందీ లేకుండా తన విజయాలకి తనే కారణమని భావించి గర్వంగా బతికెయొచ్చు,దేవుడు ఉన్నాడని నిర్ణయించుకుంటే ఆయనకి కోపం తెప్పించే అడ్డదిడ్డం పనులు చెయకుండా ప్రాప్తించినదానితో సరిపెట్టుకుని వినయంగా బతికెయ్యొచ్చు. విశ్వరచనలోని క్రమబద్ధమైన పురోగతిని అర్ధం చేసుకుని ప్రకృతి నియమాల్ని పాటిస్తే చాలునని ప్రతి ఒక్కరూ అనుకుంటే పరస్పరహననకాంక్ష తగ్గి సామరస్యం వెల్లివిరుస్తుందనేది అత్యంత ప్రాచీనకాలం నుండి నేటికీ కొనసాగుతున్న సనాతనధర్మం అనుభవం మీద నేర్చుకుని చెబుతున్న సత్యం!యేది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!