Thursday, 12 January 2017

దున్నపోతు మీద ఎంత వాన కురిసినా ఒకటే, హిందూమతద్వేషుల్ని ఎంత తిట్టినా ఒకటే - నిజాలు వీళ్ళని మార్చలేవు!

     మంచోడు మంచోడని మురిస్తే మంచమంతా చెడగొట్టినట్టు పండితుడని భ్రమించి అపురూపంగా అన్నేళ్ళు ప్రధానిగా నిలబెడితే ఆ స్త్రీలోలుడు సాధించిన ఘనకార్యం అన్వేషు పఱ్ఱ్ లాంటి ఎర్రిపప్పలకి కొవ్వు పెంచడం!
Anvesh Pr10 January 2017 at 10:25
మొత్తానికి బ్రాహ్మణులు అస్సలు విషయాన్ని దాచి, పిట్టకతలతో జనాల్ని భయపెట్టి బతికేశారని ఒప్పుకున్నావ్,. కంగ్రాట్స్.. రణం ఒద్దు అని శరణుజొచ్చినందుకు. ఇక ఈ మోసగాళ్ళని అంటరానివాళ్ళుగా ప్రకటిస్తే తప్ప, వాళ్ళకెక్కిన మధం దిగదు అంటున్న పోటుగాడికి తెలుగు - ఇంగ్లీషు సరిగ్గా చదవటం వచ్చా! అక్కడ కామెంట్లు పబ్లిష్ చెయ్యటం లేదు,వేసినా జవాబు చెప్పటం లేదు,అందుకే ఇక్కడ వేస్తున్నాను అని చెప్పినా మళ్ళీ అక్కదే అడగొచ్చుగా ఇక్కడెందుకు వేశావు అంటాడు కనీసపు కామన్ సెన్స్ కూడా లేదా?నా బ్లాగులో నేను పొష్టు వేసుకోవడానికి ఈ గొట్టాం పర్మిషను తీసుకోవాలా!నేను చెప్పిందాంట్లో ఏ విషయాన్ని బ్రాహ్మణులు దాచిపెట్టి భయపెట్తి బతకడం గురించి చెప్పాను?తనకి బ్రామ్మల మీద ఉన్న కసిని బట్టి ఎక్కడ ఎవడు కాస్తంత తన శాడిజాన్ని సంతృప్తి పరిచే ముక్క వొదిలినా చెప్పినవాడు తనని సమర్ధించేస్తున్నట్టు లెఖ్ఖలో వేసేసుకుంటాడన్నమాట - బల్లే తెలివి!

పోనీ అధాట్న చదివేసి గభాల్న అట్టా అర్ధం చేసుకున్నాదని అనుకున్నా గానీ 
Haribabu Suranenii10 January 2017 at 15:45
Do you have your mind in your head?If you say Brahmins hide something you have to prove it with references which are historical and scientific!And by the satire about "pittakatalu" you cannot make any valid argument,haribaabu is not a child to Die with fear for this
Much silly arguments.

Come up with some brainy stuff -like an educated man?! అని నేను అంత సీరియస్ జవాబు ఇచ్చినా పాయింటు అర్ధం కాలేదా? బ్రాహ్మణుల మీద తను వేస్తున్న నిందకి ఆధారాలు చూపించమంటున్నాను.పిట్టకధలు అన్ని మతాల్లోనూ ఉన్నాయి,కిరస్తానంలో ఉన్నాయి,ముసల్మానంలో ఉన్నాయి - వాటితో హిందువుల్ని మాత్రమే ఎట్లా విమర్శిస్తాడు?ఇది నేను తర్వాతి కామెంటలో స్పష్తంగా అడిగాను,అయినా పట్టించుకోకుండా "ధూ..చీ..ఛా" అనటం గొప్ప తెలివి అనుకుంటున్నాడు.

     ఒకవేళ తను నాస్తికుడైతే తన విశ్వాసాలు తనకి ఎంత గొప్పగా అనిపిస్తాయో ఆస్తికులకి తమ విశ్వాసాలు అంత గొప్పగా అనిపిస్తాయి - తను పత్తిత్తు అయినట్టు ఇతరుల్ని "చీ..చా..ధూ" అనే అధముడు,తను చాలెంజి చేస్తే నేను నా బ్లాగు స్పేస్ వేస్ట్ చేసుకుని తన పైత్యమంతా ఇక్కడ  చూపించాలా?పబ్లిష్ చేసే దమ్ము గురించి మాట్లాదే మేధావికి ఇక్కద మోదరేషన్ పెట్టినదే ప్రతి అడ్డమైన చెత్త కామెంటూ వెయ్యకుండా నాకు నచ్చినవే వెయ్యడానికి అని తెలియదా?వేసినా వెయ్యకపోయినా నా గుల నేను తీర్చుకుంటే చాలు. పబ్లిష్ చెయ్యకపోయినా హరిబాబు చూస్తాడుగా,చూసి యేడుస్తాడుగా అనే దురదతో వేస్తున్నాడని నాకు తెలియదా?

     మతం అనగానే దైవపూజావిధానం మాత్రమే అనే అపోహ చాలామందిలో ఉంటుంది.కానీ అది నిజం కాదు - 1.దైవభావన,2.నైతికబోధ,3.కర్మకాందలు,4.శిక్షాస్మృతి,5.ఋషిపరంపర అనే అయిదు భాగాలు ఉంటాయి.నాస్తికులు దైవభావనని వదలివేసినా నైతికబోధన మాత్రం వారికీ సామాన్యమే కదా!సనాతన ధర్మం మాత్రం నైతికత విషయంలో ఇహలోకపు సౌభాగ్యాన్ని మాత్రమే పట్టించుకున్నది."శ్రేయము","ప్రేయము" - రెండింటిని గురించి చర్చించి శ్రేయమునే పాటించమని హితవు చెప్తుంది. నీకు తిక్క ఎక్కువై నేను పాటించనని మొండికేస్తే నీ చావు నువ్వు చచ్చే స్వేచ్చ కూదా ఇచ్చింది.శాస్త్రీయమైన పద్ధతుల్లో మతాల్ని పోల్చాలంటే అన్ని మతాలలోనూ గట్టి పాండిత్యం ఉండాలి.ప్రతి మతంలోనూ పైన చెప్పిన విభాగాలు ఎలా ప్రతిఫలిస్తున్నాయో ఉదాహరణలతో చూపించాలి.అన్ని మతాలూ ఒక్కటే అనే మాటా తప్పే,అసలు సంబంధం లేదనటమూ తప్పే - పైన చెప్పిన విషయాలు స్థూలంగా ఉంటాయి కానీ సూక్ష్మంగా చూస్తే ప్రతి అంశానికి సంబంధిన కొన్ని విషయాలు మాత్రమే కలుస్తాయి.ఈ విధమయిన విశ్లేషణ చెయ్యడంలో తప్పు లేదు,కానీ జకీర్ నాయక్ మరియు అభిలాష్ లాంటివాళ్ళు మాత్రం పొరపాటున కూడా చెయ్యకూడని పని. వీళ్ళు పోలుస్తున్నాం అనే ముసుగులో ఇతర మతాల్లో వాళ్లకి తప్పులుగా అనిపించినవాట్ని ఎత్తి చూపిస్తూ ఇవి మా మతంలో లేవు గాబట్టి మా మతం గొప్పది అని డప్పు కొట్టుకుంటున్నారు - దాన్ని ఆధ్యాత్మిక దురాక్రమణ అనాలే తప్ప ఆధ్యాత్మిక విశ్లేషణ అని అనకూడదు.

     ఒక హిందువుగా అభిలాష్ నా మతాన్ని అవమానిస్తున్నాడని అంటుంటే ఇతని ఆత్మబంధువుని తిడుతున్నట్టు ఇక్కడ వాంతులు చేసుకోవడం దేనికి?అసలు ఇతనికి బ్రాహ్మణుల్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏమిటి?తను నాస్తికుడైతే బ్రాహ్మణుడితో అవసరం లేదు - మూసుకుని ఉండవచ్చు.హిందువు అయిన ప్రతివాడికీ బ్రాహ్మణుడితో తప్పనిసరిగా అవసరం ఉంటుంది - దానికి సంబంధించి అభ్యంతరం ఉంటే హిందువులకి ఉండాలి.ఏ మతానికి ఆ మతానికి ప్రత్యేకమైన కర్మకాం ఉన్నప్పుడు.మిగిలిన మతాలకి సంబంధించిన కర్మకాంలకి అభ్యంతరం లేనప్పుడు హిందువుల మీదే ఒంటి కాలిమీద లేవడం ఎందుకు? హిందువులు ఇదివరకట్లా ఏర్రిపప్పలుగా లేరు - ఖబడ్దార్!

     "నేను హిందువు నెట్లయిత?" అని క్రైస్తవం పుచ్చుకున్న కంచె ఐలయ్య "బ్రాహమ్ణులు ఉత్పత్తి కర్మలు చెయ్యడం లేదు,శ్రమ చెయ్యకుండా గౌరవాలు పొందుతున్నారు - ఇది దోపిడీ!" అంటాడు కదా,మరి క్రైస్తవంలో కూడా చర్చి ఫాదర్లు ఖాళీగా చేతులూపుకుంటూ చర్చి వరండాల్లో పచార్లు చేస్తున్నారు గదా,బ్రాహ్మణులకి "రాళ్ళు కొడితేనే ఉత్పత్తి శ్రమ చేసినట్టు,మీరూ చెయ్యండి" అని నీతులు చెప్తున్నవాడు చర్చి ఫాదర్లతో కూడా రాళ్ళు కొట్టిస్తాడా?ఉత్పత్తి శ్రమ చేసినవాణ్ణి మాత్రమే గౌరవించాలని అంత పట్టుదలగా ఉన్నవాడు ముందు వాళ్ళ మతంలో ఫాదర్లతో అది చేయించితే బాగుంటుంది కదా - ఎదవ తెలివి!

     అందరూ ఒప్పుకుని పాటించిన కులవ్యవస్థకి ఎవడో గొట్టాంగాడు చెప్పిన తప్పూలతదక చరితర్ని పట్టుకుని బ్రాహంలు వేదం మొత్తం వాళ్ళ దగ్గిరే దాచుకున్నారు,మాకు చెప్పలేదు,అందుకే మేం చంక నాకిపోయాం,ఇంగ్లీషోడి వల్లే మేం బాగుపడ్డాం,అందుకే తిడతన్నాం అనేవాళ్లకి చరిత్రలో ఏం జరిగిందనేది రెండు నుక్కలైనా తెలుసా?వీళ్ళు మాటకి ముందు మావోడు అని మురుసుకు చచ్చే అంబేద్కర్ రచనలైనా తిన్నగా చదివారా?ఋగ్వేదం 2వ మండలం,3వ సూక్తం,6వ ఋక్కు:బట్టలు నేయు విద్య,ఋగ్వేదం 3వ మండలం,53వ సూక్తం,19వ ఋక్కు:బండ్లు,రధములు మరియు లోహపు పనులు చేయుట,ఋగ్వేదం 1వ మండలం,140వ సూక్తం,10వ ఋక్కు:బంగారు పని చేయుట,ఋగ్వేదం 2వ మండలం,34వ సూక్తం,6వ ఋక్కు:బంగారమును త్రవి యెత్తెడి విధానం,ఋగ్వేదం 4వ మండలం,57వ సూక్తం,1 మరియు 8వ ఋక్కులు:కృషి విద్య,ఋగ్వేదం 10వ మండలం,101వ సూక్తం,3 మరియు 7వ ఋక్కులు:బావులను త్రవ్వి నగలిని చేసి విత్తులు చల్లదం వంటి విషయాలు,ఋగ్వేదం 10వ మండలం,93వ సూక్తం,13వ ఋక్కు:బావుల నుండి నీరు తోడి పైరులకు పారించు విధానం,ఋగ్వేదం 1వ మండలం,23వ సూక్తం,2వ ఋక్కు:సముద్రంపైన ఓడలు నడిపే విధానం - ఇవన్నీ బ్రాహ్మణేతరుల కులవృత్తులకి సంబంధించిన విషయాలే కదా!బ్రాహ్మణులు ఈ పనులు చెయ్యలేదనే గదా ఈ శుంఠలు వీరంగాలు వేస్తున్నది!బ్రహ్మణులు చెప్పకుండా ఈ విద్యలు కులవృతుల వాళ్ళకి ఎలా తెలిశాయి?చెప్పకుండా తెలిస్తే కొట్టేసినట్టు - ఇంక మాకు చెప్పలేదని వాగడం దేనికి?చెల్లుకి చెల్లు,హళ్ళికి హళ్ళి అని సరిపెట్టుకోవచ్చుగా!

     పోనీ వాళ్ళ దగ్గిరే పెట్టుకున్నారు,నేర్పటం మాత్రమే చేసారు,మమ్మల్ని పైకి ఎదగనివ్వలేదు అని అనటానికీ వీల్లేదు.ఎందుకంటే, క్రీ.శ 1000వ సంవత్సరంలోని కురవాడ శాసనంలో "అనే చ్చిమూరువాస్తవ్యో దేవార్యో దేవసన్నిభః భ్రద్వాజాన్వయః కమ్మకులజఆహ్ కులవర్ధనః తస్యాం భవత్సూత్ శ్రీమాన్ గోవిందో గురునందనః శ్రౌతస్మారత్క్రియాధార స్సత్తమ స్సద్విజోత్తమః" అని స్పష్టంగా ఉంది.ఈ శాసనం వేయించినది రెండవ అమ్మరాజ విజయాదిత్యుడు.ఇలాంటి అనేక శాసనాలను పరిశోధించిన చిలుకూరి వీరభద్రరావు గారు విశ్లేషించి చెప్పిన దాని ప్రకారం కమ్మకులజుడైన దేవనయ్య వేదం నేర్చుకుని శుద్ధవైదికబ్రాహ్మణుడిగా జీచించినట్టు స్పష్టంగా తెలుస్తున్నది.అబ్బెబ్బే,వీళ్ళు పెద్ద్ద కులాల వాళ్ళు,బాగా డబ్బు సంపాదించి కొనుక్కున్నారు,మా కులాలకి మాత్రం ఆ చాన్సు రాలేదు అనటానికి వీల్లేకుండా ఎపిగ్రాఫికా ఇండికా సం.6 పే.236 ప్రకారం క్రీ.శ 973లో కమ్మకులస్థుల్లో షట్కర్మ నిరతులు ఉండేవారనీ, కౌండిన్య గోత్రులైన వంగ్ర బోయ,కొళ్ళిపుర బోయ,కురియెద బోయ అను బోయ కులాల నుండి కూడా వేదం నేర్చుకుని బ్రాహ్మణులుగా జీవించినవారు ఉన్నారని దృష్టాంతాలు ఉన్నాయి.నేను పైన చెప్పిన ఋగ్వేదంలోని విషయాలు 17వ శతాబ్దానికి చెందిన ఒక బ్రాహ్మణేతరుడు రాసిన వేదార్ధ ప్రకాశిక అనే గ్రంధం లోనివి.మరి, బ్రాహ్మణులు ఇతర కులాల వాళ్ళని వేదం చదవనివ్వకుండా చేసి దాచుకుని దోచుకున్నది ఎక్కద?మెకాలే విద్యావిధానం ఈ దేశంలోకి రాకముందు ఉన్న ఓరియెంటల్ ఎడ్యుకేషన్  సిస్టం ఉన్నప్పుడు కూడా స్టూడెంట్లుగా బ్రహ్మణేతరులే  ఎక్కువగా ఉండేవాళ్ళు - కట్టుకధలు కాదు ఖచ్చితమైన లెక్కలే ఉన్నాయి వీటికి, గుర్తుంచుకోండి!ఆ రిపోర్టులు రాసింది హిందూమతతత్వవాదులు కాదు - అది కూడా తెలుసుకోండి!

     తన కామెంటు పబ్లిష్ చెయ్యటానికి నాకు దమ్ము కావాలని అంటున్న అన్వేషు పఱ్ఱ్ గారికి ఈ ఆధారాలని కాదనగలిగే దమ్ము ఉందా? కామెంటు మొదలుపెట్టటమే వెకిలితనంతో మొదలుపెట్టినా ఎంతో హుందాగా నీ వాదనకి ఆధారాలు చూపించమన్నాను.అది మర్చిపోయి "ధూ..చా.చీ"అంటూ బజారుభాష రాసి నా కామెంటు పబ్లిష్ చెయయ్డానికి దమ్ము లేదంటున్నాడు.బ్రయినీ స్టఫ్ఫ్ తీసుకురమ్మంతే అది లేదని నిరూపించుకున్నాడు. నోటికొచ్చినట్టు "ధూ..ఛా...చీ" అని వాగిన అన్వేషు పఱ్ఱ్ దగ్గిర్నుంచి బ్రాహ్మణులు నేర్పిన కులవృత్తులకి వారసులుగా ఉన్న ఎవరయినా సరే బ్రాహ్మణుల్ని తిట్టడం అంటే పెట్తిన చేతిని కరవడం లాంటిది. క్షేత్రస్థాయిలో హిందువులలో వస్తున్న మార్పుల గురించి తెలుసుకోకుండా పిచ్చివాగుడు వాగితే నోటి తీట తీరడం తప్ప ఫలితం ఉండదు. ఒక మామిడి తోటకి ఇనపతీగ వెయ్యటానికి మూడు రోజులకి 18,000 తీసుకుంటున్నాడు ఒక మనిషి. మొత్తం పని చేసినవాళ్ళు నలుగురు. మేస్త్రి పని చెయ్యడు, చేయించుతాడు.అయినా,మేస్త్రి తను ఎక్కువమొత్తం తీసుకుని మిగిలినదే కూలీలకి సరిపెడతాడు.అది కమ్యూనిష్టులు విమర్శిస్తున్న నిచ్చెనమెట్ల ఆర్ధికవ్యవస్థ కాదా?ఏ కమ్యునిష్టు అయినా అక్కడ "కుర్మికాలు","అపునదవలువి","పిడిదోమశ్ర"ల గురించి చెప్పి మొత్తం 18,000ని అయిదుగురూ సమానంగా పంచుకునేటట్టు చెయ్యగలడా?అసలు కమ్యూనిష్టు సిద్ధాంతమే చచ్చిపోతుంటే దాని పిలక సిద్ధాంతమయిన బ్రాహ్మణాధిక్యత,దళిత దోపిడీ అంటే ఎవడు పట్టించుకుంటాడు?

     ముందు భాషలోకి సంస్కారం తెచ్చుకోండి!మీ చెత్త కామెంట్లు ప్రచురించే బ్లాగులు ఏవైనా ఉంటే అక్కడ కక్కుకోండి,అన్ని కులాల్లోనూ మంచివాళ్ళూ ఉన్నారు,చెడ్డవాళ్ళూ ఉన్నారు.మంచిని మెచ్చుకోవటం,చెడుని తిట్టుకోవటం సంస్కారం గలవాడు చేసే పని.మంచిచెడులతో సంబంధం లేకుండా నాకు బ్రాహ్మల్ని తిడితే సంతోషం కలుగుతుంది, ఎక్కడ సందు దొరికితే అక్కడ తిడతాను అంటే అది నీ సొంత యవ్వారం.ప్రస్తుతం నేను ఒక వ్యక్తి నా మతం గురించి అబద్ధాలు చెప్తున్నాడు.అతని సంగతి తేల్చుకోవాలి.ఆ వ్యవహారం పూర్తయ్యేవరకు ఇంకొకటి ఆలోచించను.

     నెల రోజులు టైంఇచ్చాను,మధ్య మధ్యలో కెలుకుతున్నాను,అయినా స్పందన రావటం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి పధకం ప్రకారం చేస్తున్నవాడు ఒక్క రోజులో మారతాడా?తను ఏం చేస్తున్నాడో తెలియని చిన్నపిల్లాడు కాదుగా!నెల రోజుల వరకు ఆగకుండా వరస ఉతుకుడు మొదలుపెట్టేస్తున్నాను - కాసుకోండి!

ఖాళీదా మాత తొడల మహాత్యం సినిమాస్కోపులో చూపిస్తా - లొట్టలు వేసుకుంటూ ఉండండి!

Saturday, 7 January 2017

విశ్వసృష్టిరహస్యం మేడీజీ - ఫ్రం వేదవ్యాస టు హరిబాబు!

     పరమాత్మ యొక్క పరాపర ప్రకృతుల సంయోగజనితమైన సృష్టిని అర్ధం చేసుకోవడానికి ప్రపంచంలో తీవ్రమైన అన్వేషణను ప్రారంభించినది భారతీయులే!సహస్రాబ్దాల తరబడి గురుశిష్యపరంపరలో పరిశోధనలు సాగిస్తూ ఫలితాలను తర్వాతి తరానికి అందిస్తూ అపురూపమైన విజయాలను సాధించి మానవాళి శ్రేయస్సు కోసం సర్వులకూ అందించినది కూడా భారతీయులే!ఈ అపూర్వమైన అవకాశం భారతీయులకే దక్కడానికి ముఖ్యకారణం సృష్టికి మొదట పరుచుకుని ఉన్న అనంతమైన జలరాశి నుండి పైకి తేలి మానవనివాసానికి అన్ని విధాలా అనువైన మొట్టమొదటి భూఖండం కావడమే!ప్రాచీన భారతీయ ఋషులు తమ శక్తికి ఎన్నోరెట్లు శక్తిమంతుడైన సృష్టికర్తతోనూ ఆయన పాలనాయంత్రాంగమైన ఇతర దేవతాశక్తులతోనూ ప్రతీకార భావంతో గానీ,వారిని లొంగదీసుకోవాలనే అహంకారంతో గానీ ఏనాడూ ప్రవర్తించలేదు - ప్రార్ధనాపూర్వకమైన ప్రయత్నంతో విశ్వరూపుని ఆమోదం పొంది తాము అనుకున్నది సాధించారు!

     ఇప్పటివరకూ పాశ్చాత్యులు ఎన్నో దశాబ్దాల పాటు శ్రమించి నిర్మించిన ఆధునిక పదార్ధ విజ్ఞానశాస్త్రం పునాదుల్ని కదిలిస్తూ తామిప్పటివరకూ పరమసత్యాలుగా భావించిన అన్ని నియమాల్నీ కొత్తగా నిర్వచించుకునేటట్లు చేస్తున్న గుళికా(quantam) సిద్ధాంతం యొక్క ప్రతిపాదనలు ప్రాచీన భారతీయ ఋషులు విశ్వజననం గురించి చేసిన విశ్లేషణలకు చాలా దగ్గిరగా ఉంటున్నాయి. వాటిలో ఒకటి: మొలకెత్తిన తర్వాత యెదిగి కనబడే చెట్టుకి సంబంధించిన సమస్తమైన విషయాల్నీ తనలో దాచుకున్న విత్తనం వలె విశ్వనిర్మాణానికి అతి సూక్ష్మమైన ఇటుక లాంటి ప్రతి ఒక్క గుళిక నుంచి వెలువడే శక్తి తరంగం మొత్తం విశ్వానికి సంబంధించిన సమాచారాన్ని ఇముడ్చుకుని ఉంటుంది. "ప్రాబడిన వస్త్రాల నరుడెట్లు విడిచి కొత్తవి తాను ధరించు"నన్న గీతావాక్యాల వలె భావగర్భితమైన నియమాలని ప్రతిపాదిస్తున్న ఈ గుళికా సిద్ధాంతం మూలంగా ఇదివరకటి వైజ్ఞానిక నియమాలలో ఉన్న "మానవుడు","విశ్వం" అనే రెంటికీ ఉన్న "వస్తువు","ద్రష్ట" అనే భేదం నశించిపోయి జ్ఞానాన్ని ఉపాసిస్తున్న వ్యక్తితో సహా అన్నింటినీ సిద్ధాంత నిర్మాణానికి సంబంధించిన దృగ్విషయం, పరిశోధన, విశ్లేషణ, నిరూపణ లాంటి విషయాలలో ఒక భాగం చేసి తీరాల్సి వచ్చింది.ఇప్పటివరకు పొడిగా ఉన్న పాశ్చాత్యవిజ్ఞానశాస్త్రం ఇప్పుడిప్పుడు కొంచెం తడిగా ఉండటం నేర్చుకుంటున్నది!

     క్రీ.శ 13వ శతాబ్దికి చెందిన అరేబియా దేశవాసుడైన ఉమర్ ఖయ్యాం ఒక రుబాయీలో "మొట్టమొదటను పుట్టిన మట్టితోనె ఆదిమనుజుడు నిర్మాణ మందినాడు,తుదిని పండిన గింజలతోనె మొదటి నాటులు పొలాల లోపల నాటినారు,సృష్టి తొలిప్రొద్దు నాటి క్లిష్టలిపిని సకలమును కూడ తుదిప్రొద్దు చదువగలదు" అని అంటాడు.వేదవ్యాస విరచితమైన అష్టాదశాధ్యాయి లోని రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగం 12వ శ్లోకం "న త్వే వాహం జాతు నాసం,నత్వం నేమే జనాధిపాః,న చైవ న భవిష్యామి,సర్వే వయ మతః పరం" అని చెబుతుంది.ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టంగా "పరమేశ్వరుడనైన నేను, ప్రాణిరూపులైన మీరు గతంలో లేమనుట  భవిష్యత్తులో ఉండమనుట నిజం కానే కాదు.మనం అందరం సృష్టికి పూర్వం ఉన్న అనంతాత్మలో అవ్యక్తంగాను,సృష్టి ప్రారంభమై ప్రస్తుతం నడుస్తున్న నిత్యాత్మతలో వ్యక్తరూపంగానూ,సృష్టిచలనం ఆగిన తర్వాత మళ్ళీ అప్పటి అనంతాత్మలో అవ్యక్తంగానూ కలిసే ఉన్నాము, ఉంటున్నాము, ఉంటాము.వ్యక్తావ్యక్తములు రెండింటికీ కారణమై శాశ్వతుడనైన నేను,నా తేజసాంశలైన మీరు నశించేవారము కాము.నానుండి ప్రభవించిన మీరు కూడా నావలెనే శాశ్వతులు,సుస్థిరులు,అనంతులు" అని చెబుతున్నాడు!భారతీయ కాలగణనంలోని మెళకువలు తెలుసుకుని అరబిక్ క్యాలెండరులోని లోపాలను సరిచేసిన ఖయ్యాముకు ప్రాచీన భారతీయ వైజ్ఞానికాధ్యాత్మిక సాహిత్యంతో పరిచయం ఉంది - ఖయ్యాము కూడా గీతలో చెప్పినట్టే చావనేది లేనేలేదు పొమ్మని బల్లగుద్ది చెప్పాడు!

     "అదేమిటి?ప్రతిరోజూ ఎన్నో చావుల్ని చూస్తున్నామే!లేదంటే ఎట్లా?" అని సందేహం వొస్తే జీవించి ఉండి మనం ఏమి చేస్తున్నామో తెలుసుకోవాలి.బ్రతికి ఉండటానికి తిండి తినటం,మనల్ని అంతం చెయ్యాలని చూసే శత్రువుల నుంచి రక్షించుకోవటం - రెంటికీ మన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి తెలుసుకోవటం తప్పనిసరిగా చేస్తాము, చెయ్యాలి!ఈ జ్ఞానమే మనం తప్ప చర్మం,మాంసం,కండరాలు,నాడులు కాదు - అదే జీవాత్మ!లింగభేదాన్ని చూసుకుని జతకట్టి సంతానాన్ని పొంది వారికి మన జ్ఞానాన్ని అందించి పెంచితే మన దేహం నశించినా మనం బ్రతికి ఉన్నట్టే కదా!ఇంక మనం మరణించినది ఎక్కడ?మన శిక్షణలో పెరిగిన మన పిల్లలూ మనం మాట్లాడిందే మాత్లాడతారు,మనం చేసిన పనులే చేస్తారు - ఈ గొలుసుకట్టు తెగనంతవరకు మనం చిరంజీవులమే!

     జీవుడి చిరంజీవిత్వం అనే సనాతన ధర్మంలోని అతిముఖ్యమైన ప్రతిపాదన గురించి తెలుసుకోవడం అవసరమే అయినా ఈ విషయాంతరం ఇక చాలించి ఇప్పుడు విశ్వసృష్టి యొక్క తొలి మజిలీ నుంచి మన ప్రయాణం మొదలుపెడితే బాగుంటుంది కదా!దృశ్యమాన ప్రపంచంలో మనకు తెలిసిన రెండు శక్తులు స్థితిశక్తి,గతిశక్తి అనేవాటికి సంకల్పం ఉండదు - వాటిని ఎవరు ఎక్కడ ఉపయోగించితే అక్కడ తమ విధిని నిర్వర్తించే పనిముట్లు అవి.కాని పరబ్రహ్మ స్వరూపమైన దైవశక్తికి సంకల్పం ఉంటుంది.ఈ అక్షరపరబ్రహ్మము మొదట అవ్యక్తంగా ఉంటుంది.ఈ అనంతాత్మను వైష్ణవులు ప్రియమారగ కొలిచే శ్రీకృష్ణ పరంధాముడు, శైవులు ఉత్సాహంతో కొలిచే ఆదినర్తక నాయకమణి నటరాజు పాలిస్తూ ఉంటారు.ఈ అవ్యక్తమైన అనంతాత్మ అంధకార బంధురమై ప్రణవనాదం కూడ ప్రభవించని నిశ్చలనిశ్శబ్దనిర్మోహానందస్థితిలో ఉంటుంది.

     వ్యక్తమాన ప్రపంచంలో ఉన్నట్టే సృష్టి ప్రారంభానికి ముందు అవ్యక్తంగా ఉన్న అనంతాత్మకు కూడా సత్వరజస్తమస్సులు ఉంటాయి.అయితే దృశ్యమాన ప్రపంచంలోని స్థావర జంగమాలన్నిటికీ త్రిగుణాలలో ఒకటి ఎక్కువగా ఉండటం సంభవించి అసంపూర్ణసమతాస్థితి(steady state)లో ఉంటే అవ్యక్తంలో ఇవి సమపాళ్ళలో ఉండటం సంభవించి సంపూర్ణసమతాస్థితి(equlibriuam)లో ఉంటాయి.అవ్యక్తం వ్యక్తమయ్యేది కూడా వీటి సంతులనం చెదరడం వల్ల - ఆ చెదరడం నటరాజ మూర్తి చేతిలోని ఢమరుకం ప్రకంపించడం వల్లనే!ఆ ప్రకంపన మొదలై ఆది ప్రణవ నాదం ధ్వనించగానే అవ్యక్తం నుండి దృశ్యమాన ప్రపంచాన్ని నిర్మించడానికి అవసరమైన ఇటుకల వంటి పంచభూతాలు ప్రభవిస్తాయి.

     వీటినే పంచతన్మాత్రలు అని కూడా అంటారు. ’తన్మాత్ర’ అంటే ‘అది మాత్రమే అయి ఉన్నది’ అని అర్ధం.ఈ తన్మాత్రలు ఏర్పడే సమయం నుంచే ప్రాచీన భారతీయ విజ్ఞానులు సృష్టిని గణితశాస్త్రం యొక్క మౌలికాంశాలతో నిర్వచించడం ప్రారంభించారు.ఏ తన్మాత్ర ఆవిర్భవిస్తున్నదో దాని సూక్ష్మాంశం సగమై మిగతా సగంలో ఇతర తన్మాత్రల సూక్ష్మాంశాలు ఎనిమిదో వంతు కలిసి ఒక నూతన తన్మాత్ర ఆవిర్భవిస్తుంది.వ్యక్తమైన అనంతాత్మ వ్యక్తరూపం దాల్చే సృష్టి ప్రారంభ సమయంలో తొలుదొల్త ప్రభవించినది పంచభూతాలలోని ఆకాశం.ఇది అన్నిటికన్న అత్యంత సూక్ష్మమైనదీ,అన్నింటిలోనూ భాగమైనదీ అయిన ఆది తన్మాత్ర - శబ్దం దీని లక్షణం!ఆకాశం నుండి రెండవదైన వాయువు ప్రభవించింది - శబ్దం, స్పర్శ దీని లక్షణాలు!వాయువు నుండి అగ్ని ప్రభవించింది - శబ్దం, స్పర్శ, రూపం దీని లక్షణాలు!అగ్ని నుండి జలం ప్రభవించింది - శబ్దం, స్పర్శ, రూపం,రసం దీని లక్షణాలు!జలం నుండి పృధ్వి ప్రభవించింది - శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం దీని లక్షణాలు!వ్యక్తమాన ప్రపంచంలోని అనంతకోటి విశ్వాలు, విశ్వధాతువులైన కృష్ణబిలాలు, అరుణతారలు, పాలపుంతలు, గ్రహతారకలు మొదలైన సమస్త పదార్ధతత్వాలూ ఈ పంచతన్మాత్రలతోనే నిర్మించబడి ఉన్నాయి.అవ్యక్తం నుండి వ్యక్తం ప్రభవించడానికి కారణమైన అవిద్యాయుత అహంకారం తర్వాత రూపాంతరం చెంది "ద్రవ్యశక్తి" అయిన తామసం,"క్రియాశక్తి" అయిన రాజసం,"జ్ఞానశక్తి" అయిన సాత్వికం అని మూడు గుణాలు ఏర్పడినాయి.

     ఋగ్వేదం 10వ మండలంలోని 129వ సూక్తమైన నాసదీయ సూక్తం అవ్యక్తంలో జన్మించిన ఒక వాంచ వల్ల వ్యక్తం ప్రభవించడం గురించి ఇలా చెబుతుంది-

नासदासींनॊसदासीत्तदानीं नासीद्रजॊ नॊ व्यॊमापरॊ यत् ।
किमावरीव: कुहकस्यशर्मन्नभ: किमासीद्गहनं गभीरम् ॥१॥

Then even nothingness was not, nor existence,
There was no air then, nor the heavens beyond it.
What covered it? Where was it? In whose keeping
Was there then cosmic water, in depths unfathomed?

न मृत्युरासीदमृतं न तर्हि न रात्र्या।आन्ह।आसीत् प्रकॆत: ।
आनीदवातं स्वधया तदॆकं तस्माद्धान्यन्नपर: किंचनास ॥२॥

Then there was neither death nor immortality
nor was there then the torch of night and day.
The One breathed windlessly and self-sustaining
There was that One then, and there was no other

तम।आअसीत्तमसा गूह्ळमग्रॆ प्रकॆतं सलिलं सर्वमा।इदम् ।
तुच्छॆनाभ्वपिहितं यदासीत्तपसस्तन्महिना जायतैकम् ॥३॥

At first there was only darkness wrapped in darkness.
All this was only unillumined water.
That One which came to be, enclosed in nothing,
arose at last, born of the power of heat.

कामस्तदग्रॆ समवर्तताधि मनसॊ रॆत: प्रथमं यदासीत् ।
सतॊबन्धुमसति निरविन्दन्हृदि प्रतीष्या कवयॊ मनीषा ॥४॥

In the beginning desire descended on it -
that was the primal seed, born of the mind.
The sages who have searched their hearts with wisdom
know that which is is kin to that which is not.

तिरश्चीनॊ विततॊ रश्मीरॆषामध: स्विदासी ३ दुपरिस्विदासीत् ।
रॆतॊधा।आसन्महिमान् ।आसन्त्स्वधा ।आवस्तात् प्रयति: परस्तात् ॥५॥

And they have stretched their cord across the void,
and know what was above, and what below.
Seminal powers made fertile mighty forces.
Below was strength, and over it was impulse.

कॊ ।आद्धा वॆद क‌।इह प्रवॊचत् कुत ।आअजाता कुत ।इयं विसृष्टि: ।
अर्वाग्दॆवा ।आस्य विसर्जनॆनाथाकॊ वॆद यत ।आबभूव ॥६॥

But, after all, who knows, and who can say
Whence it all came, and how creation happened?
the gods themselves are later than creation,
so who knows truly whence it has arisen?

इयं विसृष्टिर्यत ।आबभूव यदि वा दधॆ यदि वा न ।
यॊ ।आस्याध्यक्ष: परमॆ व्यॊमन्त्सॊ आंग वॆद यदि वा न वॆद ॥७॥

Whence all creation had its origin,
He, whether He fashioned it or whether He did not,
He, who surveys it all from highest heaven,
He knows - or maybe even He does not know.

     దీనినే సృష్టి సూక్తం అని కూడా అంటారు. విశేషం యేమిటంటే ఆధునికులైన పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఇటీవల సూత్రీకరించిన Big Bang Theoryలో దానికి ముందరి స్థితి అయిన Singularity గురించి చేసిన వర్ణనలు కూడా నాసదీయ సూక్తం చేసిన వర్ణనల వలెనే ఉన్నాయి.

Pradhāna
SB 3.26.10p, SB12.4.20,21
Singularity
ref : [1]-[4]
*Unmanifested/undifferentiated form of matter.
*No manifestation of gross/subtle element (i.e. no space, air, fire, etc).
*No formation of matter or space.
*Undifferentiated, yet total material elements are contained therein.
*Void & No space.
Total matter in zero space=infinite density
*Contained all of the matter of the universe, condensed in an infinitely small point of zero space.
Total matter in zero space=infinite density        
*No manifestation of  cause/effect. No reaction of material elements.                
*All the laws of physics break down.
*No time.                
*time=0                
*Indescribable
                
*Cannot be described by any                mathematical/physical model. Defies our current understanding of physics & common sense.          
*Original substance, it is the actual basis of material creation.
*The origin of universe.
*No consciousness/soul
*N.A.

     అవ్యక్తం నుంచి వ్యక్తం ప్రభవించడానికి శ్రీకృష్ణ పరంధాముడి చేత ఉంచబడిన బీజం పేరు అహం.దీనినే మాయ అని కూడా అంటారు.దీనివల్ల తనలోకి తను చూసుకున్నప్పుడు "ఇది నేను!" అనీ ఇతరాల్ని చూసినప్పుడు "ఇది నాది!"  అనీ అనిపిస్తుంది.ఇన్ని జరిగినా ఒక తన్మాత్ర కలవకపోతే వ్యక్తమాన ప్రపంచం వ్యక్తం అయిన తొలిక్షణంలో ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది ఏ మార్పూ లేకుండా - అదే కాల తన్మాత్ర!ఈ కాలం అనేది జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగినది,దీనికి అస్తిత్వం లేదు.ఇది కదలదు,కానీ అన్నింటిని కదిలిస్తుంది.తనలో ఎప్పుడూ అనేకానేకమైన పదార్ధతత్వాలు నిరంతరం కదులుతూ ఉన్నప్పటికీ ఆ కదలికల వల్ల అది ప్రభావితం కాదు.అవ్యక్తంలో దీని అవసరం లేదు,వ్యక్తంలో అత్యవసరం - అయినా వ్యక్తం కాదు!కాలానికి కొలతలుగా మనం చెప్పుకునే నిన్న,నేడు,రేపు అనేవి కాలంలో మనం ఉన్న స్థితిని గురించి అర్ధం చేసుకోవడానికి మనం ఏర్పరచుకున్న కాలగణనానికి పనికివచ్చే వర్ణనాత్మకమైన పదాలు తప్ప అవి కాలానికి లక్షణాలు కావు.వ్యక్తంలో ఉన్న సమస్తమూ మాయతో ఆవరించబడినవే - ఒక్క కాలం తప్ప!అందుకే కాలాన్ని భగవత్స్వరూపం అనీ భగవంతుణ్ణి కాలస్వరూపుడు అనీ అన్నారు.వ్యక్తమాన ప్రపంచంలో అన్ని పదార్ధతత్వాలూ కాలవిషయంగా  1).ఏ ఒక్క పదార్ధతత్వమూ ఒకే సమయంలో రెండు స్థలాల్లో ఉండలేదు,2).ఏ రెండు పదార్ధతత్వాలూ ఒకే సమయంలో ఒకే స్థలంలో ఉండలేవు అనే రెండు నియమాలను అతిక్రమించలేవు - కాలోహి దురతిక్రమం!


     శివమనోహరి తన భర్త చిద్విలాసాన్ని కళ్ళింతలు చేసుకుని చూస్తూ ఉండగా ఆదినర్తన నాయకమణి ఢమరుకం నుండి ప్రణవనాదం మొదలు కాగానే శ్రీకృష్ణ పరంధాముడు విశ్వరాజ్యాంగసంవిధానం ప్రకారం సృష్టిరచనకు ఉపక్రమిస్తాడు.మహత్వంలో తనకు సాటియైన స్త్రీతత్వం శ్యామలాదేవి శ్రీకృష్ణ పరంధాముడి నుండి వేరుపడి పక్కన నిలుస్తుంది.తర్వాత అక్షరపరబ్రహ్మ కూడా ఉద్భవిస్తాడు.వీరినుండి జనించిన దేవతా సమూహాలే శ్రీకృష్ణ పరంధాముడు సృజించిన అనంతకోటి విశ్వాలలో విశ్వరాజ్యాంగసంవిధానం సరైనతీరున అమలుజరిగేలా నియంత్రించే విశ్వప్రభుత్వయంత్రాంగం అవుతారు.శ్రీకృష్ణ పరంధాముడి సంకల్పంతో ప్రభవించిన అనంతకోటి విశ్వాలు అండాకారంలో ఉండటం వల్ల వీటినే బ్రహ్మాండాలు అని కూడా అంటారు.ఢమరుకం నుండి వినిపించే ప్రణవనాదం ఆగిపోయేవరకు కొత్త విశ్వాలు పుట్టుతూ పాత విశ్వాలు గిట్టుతూ ఉంటాయి.


     విశ్వానికి ఉన్న నిలువు అక్షం విశ్వం యొక్క కింద ఉన్న అంచుకు తగిలేచోట ఒకప్పుడు క్షీరసాగరంలో లక్ష్మీసమేతుడై శయనించియో,ఒకప్పుడు వైష్ణవజనులతో సభదీరియో నారాయణుడు ఉంటాడు.తేజసాంశం ఒక్కలాగే ఉన్నా ఈ నారాయణుడు శ్రీకృష్ణ పరంధాముడు కాడు - ఆయన యొక్క బింబరూపం మాత్రమే,ఓం నమో భగవతే కేశవాయ నమః!ఈ క్షీరసాగరంపైన విశ్వాండం యొక్క అక్షం పొడుగునా వ్యాపించి పదునాల్గు భువనాల స్వరూపమైన విరాడ్రూపం ఉంటుంది.ఆ రూపానికి కోటి యోజనాల విస్తీర్ణమైన అండకటాహమే మొదటి ఆవరణమైన భూమి అవుతుంది. కొందరు దీనిని ఏబదికోట్ల యోజనాల విశాలమని వర్ణిస్తారు.భగవంతుడైన విరాటస్వరూపంలో జరిగిన, జరుగుతున్న, జరగనున్న ప్రపంచమంతా గోచరిస్తుంది. భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్త్వము అనే ఆవరణాలు ఏడూ మహాండకోశమైన విరాట్పురుషుని శరీరమే అయి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు నెలవై విరాట్పురుషుడు ప్రకాశిస్తున్నాడు. ఆ మహాత్ముడికి పాతాళం అరికాలు, రసాతలం కాలిమడమ మునివ్రేళ్ళు, మహాతలం చీలమండలు, తలాతలం పిక్కలు, సుతలం రెండు మోకాళ్ళు, వితలము అతలము తొడలు, భూతలం పిరుదు, ఆకాశం బొడ్డు, గ్రహాలూ తారకలూ మొదలైన జ్యోతిస్సమూహంతో కూడిన నక్షత్రలోకం వక్షస్థలం, మహర్లోకం మెడ, జనలోకం ముఖం, తపోలోకం నొసలు, సత్యలోకం శిరస్సు!విశ్వానికి ఉన్న నిలువు అక్షం విశ్వం యొక్క పైన ఉన్న అంచుకు తగిలేచోట హిమశైలసానువుల మధ్యన ఒకప్పుడు యోగముద్రలో ధ్యానమగ్నుడుగానో,ఒకప్పుడు పార్వతీసమేతుదై లాస్యతాండవం చేస్తూనో,ఒకప్పుడు ప్రమధగణాలతో కౌలువుదీరియో పరమశివుడు ఉంటాడు.తేజసాంశం ఒక్కలాగే ఉన్నా ఈ పరమశివుడు ఆదినర్తన నాయకమణి కాడు - ఆయన యొక్క బింబరూపం మాత్రమే,ఓం నమో భగవతే శంకరాయ నమః!


     వ్యక్తంలో ఉండటం వల్ల వీరు కూడా మాయకు లోబడినవారే.వారి నిరంతర యోగనిష్ఠ కూడా మాయకు బద్ధులు కాకుండా ఉండటానికే!వ్యక్తమాన ప్రపంచంలోని అనంతకాలగమనంలో ఆజీవ పర్యంతం మాయకు ఏమాత్రం లోబడనివాడు దేవకీనందనుడైన భగవాన్ శ్రీకృష్ణుడు మాత్రమే - ఆయన తనను తాను అవ్యక్తంలో ఉన్న శ్రీకృష్ణ పరంధామునితో అనుసంధానించుకోగలిగి తామిర్వురిలో అభేదాన్ని సాధించినవాడు.అందువల్లనే బ్రహ్మదేవుడు కూడా మాయకు లోనై సామాన్యగోపబాలకుడని భావించి భంగపడ్డాడు!

     భారతీయుల కాలగణనము పరమాణువు నుండి మొదలై మహాయుగముల వరకు విస్తరించి యున్నది!పాశ్చాత్యుల కాలగణనములోని 26 మైక్రోసెకండులకు సమానమైనది పరమాణువు, రెండు పరమాణువు లొక అణువు, మూడు అణువు లొక త్రసరేణువు, మూడు త్రసరేణువు లొక తృటి, వంద తృటు లొక వేధ, మూడు వేధ లొక లవము, మూడు లవము లొక నిమేషము, మూడు నిమేషము లొక క్షణము, అయిదు క్షణము లొక కాష్ఠము, పదిహేను కాష్ఠము లొక లఘువు, పదిహేను లఘువు లొక దండ, రెండు దండలు కలిసి పాశ్చాత్యుల 48 నిముషములకు సమానమైన  ఒక ముహూర్తము, ముప్పది ముహూర్తము లొక అహోరాత్ర దినము, ముప్పది దినము లొక మాసము, రెండు మాసముల కొక ఋతువు, మూడు ఋతువు లొక ఆయనము, రెండు ఆయనములు కలిసి దేవతల యహోరాత్ర మయ్యెడు ఒక సంవత్సరము, దేవతల మాసమునకు ముప్పది దినములు, దేవతల సంవత్సరమునకు రెండు ఆయనములు మరియు పండ్రెండు మాసములు, 4,800 దివ్యవత్సరము ఒక సత్య యుగము, 3,600 దివ్యవత్సరము లొక త్రేతా యుగము, 2,400 దివ్యవత్సరము లొక ద్వాపర యుగము, 1,200 దివ్యవత్సరము లొక కలి యుగము, ఈ నాల్గు యుగములు కలిసి 4,320,000 మానవ సంవత్సరములకు సమమైనదియునూ సూర్య గ్రహము తన చుట్టు తాను తిరుగు 12000 భ్రమణములకు సమమైనట్టిదియు నైన కాలమొక మహాయుగము, 1000 మహాయుగము లొక కల్పము. 2 కల్పములు విధాత కొక యహోరాత్ర దినము, విధాత మాసమునకు ముప్పది దినములు, విధాత వత్సరమునకు 12 మాసములు అనగా 3.1104 ట్రిలియన్ల మానవ సంవత్సరములు, ఇట్టివి యేబది విధాత వత్సరములు గడిచిన ఒక పరార్ధము, రెండు పరార్ధములు కలిసి 311.04 ట్రిలియన్ల మానవ సంవత్సరముల కాలము మహా కల్పమను పేరున నిర్ధారించి విధాత పూర్ణాయుర్దాయముగ నిర్వచించబడినది, 306,720,000 సౌర సంవత్సరములకు సమమైన 71 మహా యుగములు కలిసి ఒక మన్వంతరము, ప్రతి మన్వంతరమున కొక మనువు శాసన కర్త, ప్రతి రెండు మన్వంతరములకు మధ్యన కృతయుగ కాల పరిమాణముతో నొక సంధికాలము వచ్చును!

     విశ్వం ఆవిర్భవించిన వెంటనే సృష్టికార్యం మొదలు కాలేదు.ఒక 1000 మహాయుగాల పాటు నారాయణుడు యోగనిద్రలోనే ఉండిపోయాడు.బహుశా విశ్వంలోని అన్ని పదార్ధ తత్వాలనూ సృజించేటందుకు సరిపడినంత ద్రవ్యం అవ్యక్తం నుండి ప్రవహించడానికి అంత సమయం పడుతుంది.కాబోలు!పక్కనే స్త్రీతత్వమైన శ్యామలా దేవి అంశ అయిన మహాలక్ష్మి కూడా అంతకాలం వేచి ఉన్నది.

     మానవ జీవితంలో ఒక పని యెకాయెకిన చెయ్యడం కన్న మొదట పూర్వాపరాలను సరిచూసుకుని మొదలుపెట్టిన పనులే విజయం సాధిస్తున్నాయనేది తెలుసుకుంటే శ్రీకృష్ణ పరంధాముడిచే నియోగించబడిన సృష్టికార్యం సజావుగా సాగడానికి ప్రయత్నపూర్వకంగా మొదలుపెట్టే నారాయణుడు అనే పురుషతత్వం ఎంత ముఖ్యమో అన్నింటినీ సరిచూసుకుని ఆ ప్రయత్నానికి అనుమతినిచ్చి ప్రోత్సహించే స్త్రీతత్వమైన శ్రీలక్ష్మి కూడా అంతే అవసరమని తెలుస్తుంది.అలా సృష్టిలోని సకల సంపదలకు రాజ్ఞియైన లక్ష్మి 1000 మహాయుగాల పాటు విశ్వద్రవ్యాన్ని లెక్కగట్టి సంతృప్తిపడి పతిని ప్రోత్సహించటానికి సూచనగా పాదం నిమరగానే ఆ సూచన అందుకుని యోగనిద్ర నుండి మేలుకుంటాడు శ్రీహరి.మేలుకున్న శ్రీహరి యొక్క నాభి నుండి ఒక కమలం ఉద్భవించి సాగి పోయి బ్రహ్మలోకం చేరి ఆగుతుంది.అది విచ్చుకునేసరికి అందులో బ్రహ్మ పద్మాసనస్థుదై ఉంటాడు.ప్రతి విశ్వాండంలోని బ్రహ్మ యొక్క ఆయుర్దాయం 100 విధాత సంవత్సరాలు. విశ్వం యొక్క వయస్సు కూడా అదే - అప్పుడు విశ్వంలోని పదార్ధతత్వాలకు ఆధారభూతమైన వ్యక్తమంతా తిరిగి అవ్యక్తంలోకి జారిపోతుంది!సత్యయుగం,త్రేతాయుగం,ద్వాపరయుగం,కలియుగం కలిసిన మహాయుగం యొక్క కాలం 4.32 మిలియన్ మానవ సంవత్సరాలు.1000 మహాయుగాలు కలిసి విధాతకు ఒక అహస్సు అవుతుంది,దాని తోడుగా వచ్చే రాత్రి కూడా అంతే సమయం అవుతుంది.ఈ సమయంలో తాత్కాలికంగా భూమిపైన జీవం ఉండదు.భూమి మొత్తం జలరాశితో కప్పబడి ఉంటుంది.

     తొలిసారి కమలం విచ్చుకుని పద్మాసనస్థుడై ఆవిర్భవించిన బ్రహ్మకు తనచుట్టూ పరుచుకుని ఉన్న అనతజలరాశిని చూసి అయోమయం అనిపించింది.తను ప్రభవించిన పద్మం యొక్క మొదలు కనుక్కోవడానికి ప్రయత్నించి విఫలుడై భాష్పపూరిత నయనాలతో స్థాణువై ఉండిపోయాడు.ఆ కన్నీటి నుంచి పుట్టి ఆకాశమంత ఎత్తున పరమశివుడు దర్శనమిచ్చి మంత్రోపదేశం చేశాడు.వంద మహాయుగాలు తపస్సులో గడిచాక తనను సృజించిన శేషతల్పసాయిని దర్శించి ఆయనను ప్రార్ధించి విశ్వరచన ప్రారంభించాడు బ్రహ్మదేవుడు - అలా సుమారు 155.524752 ట్రిలియన్ మానవ సంవత్సరాల క్రితం విశ్వంలో సృష్టిక్రమం మొదలైంది!

     ప్రతిఫలం ఆశించని తన పరమధర్మానికి ఫల స్వరూపముగా దేవతలు, పశు పక్ష్యాదులు, మానవులు ఇంకా అనేక రకాలైన స్ధావరాలు మొదలైన వాటితో కూడిన నానావిధాలైన సృష్టిని క్రమంగా బ్రహ్మదేవుడు కొనసాగించాడు.మొదలు తుద లేనిదీ, తరిగిపోనిదీ అయిన తత్వమే ఈ సృష్టికంతటికి ప్రధాన కారణం. అందువల్ల గుణాలూ, ఇంద్రియార్థాలూ మహత్తూ, పంచభూతాలూ, తన్ను ఆశ్రయించగా, ఈశ్వరుడు కాలానికి అనురూపమైన రూపం ధరించిన వాడై వినోదానికై తనను తాను సృష్టించుకున్నాడు. ఈవిధంగా సృష్టించిన సమస్త లోకాలందూ ఈశ్వరుడు ఉంటాడు. ఆ ఈశ్వరుని యందు సమస్త లోకాలూ ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వానికి కార్యము కారణమూ రెండూ తానే. ఆ పరమపురుషుని శరీరంనుండి విడివడి ఈ విశ్వం విరాజిల్లుచున్నది. ఈవిధంగా వర్తమానసృష్టి ఏర్పడింది.పురుషోత్తముని మాయ వలన, ఈ జగత్తు అంతా ఒక క్రమంలో పుట్టి, పెరిగి నశిస్తూ ఉంటుంది. ఇలాగే పూర్వకాలంలో జరిగింది. భవిష్యత్కాలంలో కూడ ఇదే విధంగా జరుగుతుంది.అటువంటి సృష్టి తొమ్మిది విధాలు. వాటిలో ప్రాకృతాలు, వైకృతాలు అనేవి రెండు రకాలు. కాలం, ద్రవ్యం, గుణం అనే మూడు భేదాలతో ఉంటాయి. అవి పరస్పరం సంకరం అవుతూ ఉంటాయి. వాటిలో మహత్తత్వం మొదటి సృష్టి. ఆది నారాయణుని సమీపంలో గుణభేదాన్ని పొందుతుంది. ద్రవ్య జ్ఞాన క్రియాత్మకమైన అహంకారం రెండవ సృష్టి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే పంచ తన్మాత్రల ద్రవ్యశక్తితో కూడిన పృథివి మున్నగు పంచభూతాల సృష్టి మూడవది. జ్ఞానేంద్రియాలైన చర్మం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు మరియు కర్మేంద్రియాలైన నోరు, చేతులు, కాళ్ళు, పాయువు, జననేంద్రియం కలిసి ఈ పది ఇంద్రియాల పుట్టుక నాలుగవ సృష్టి. సాత్వికాహంకారం వలన పుట్టిన దేవతాగణాల సృష్టి అయిదవది. అది కేవలం మనోమయమై ఉంటుంది. సకల ప్రాణులకు అజ్ఞాన కృత్యాలైన ఆవరణ విక్షేపాలు కలిగించే తామస సృష్టి ఆరవది. ఈ ఆరూ భగవంతుని లీలా విలాసాలయిన ప్రాకృత సృష్టులు. ఇక ఏడవదాని నుండి వైకృత సృష్టులు, పూలు పూయకుండానే ఫలించే రావి, మేడి, పనస, మఱ్ఱి మొదలైన వనస్పతులు, పూచి ఫలించిన వెంటనే నశించే వడ్లు(బియ్యం), యవలు (గోధుమలు), పెసలు మున్నగు ఓషధులు, పైకి ఎగపాకడానికి అవకాశం లేని మాలతి, మల్లె, మొదలైన తీగలు, గట్టి బెరడు కలిగిన వెదుళ్ళు మొదలైనవి, నేలలో దృఢమైన వేళ్ళు కలిగి నేలపై బాగా విస్తరించే లతా విశేషాలైన దుబ్బులు, పొదలూ, పుష్పించి ఫలాలను ఇచ్చే మామిడి మొదలైన వృక్షాలు, అవ్యక్తమైన చైతన్యంతో పైకి పెల్లుబుకుతూ తమోమయాలై లోపల మాత్రమే స్పర్శ జ్ఞానం కలిగినవై కదలి పోలేని ఈ ఆరూ ఏడవ సృష్టి. ఇక ఎమిమిదవ సృష్టితో ఇరవై ఎనిమిది రకాల భేదాలు ఉన్నాయి. రేపు అనే జ్ఞానం లేనివై, ఆహారం మొదలైన వాటి యందు మాత్రమే ఆసక్తి కలవై, వాసన చూసి తెలుసుకోదగిన వాటిని తెలుసుకుంటూ, మనస్సులో పెద్దగా ఆలోచన చేయలేనివై, చీలిన గిట్టలు కలవైన ఎద్దు, ఎనుము, మేక, జింక, పంది, ఒంటె, గురుపోతు, నల్లచారల దుప్పి, పొట్టేలు ఈ తొమ్మిది; చీలని గిట్టలు గలవైన గాడిద, గుఱ్ఱం, కంచరగాడిద, గౌరమృగం, శరభమృగం, చమరీమృగం ఈ ఆరూ; అయిదు గోళ్ళు గలవైన కుక్క, నక్క, తోడేలు, పులి, పిల్లి, కుందేలు, ఏదు పంది, సింహం, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము ఈ పన్నెండు (ఇవన్నీ భూచరాలు) మొసలి మొదలైన జలచరాలూ, రాబందు, గ్రద్ద, కొంగ, డేగ, తెల్లపిట్ట, గబ్బిలం, నెమలి, హంస, బెగ్గురు పక్షి, జక్కవ పిట్ట, కాకి, గుడ్లగూబ, మొదలైన ఆకాశాన సంచరించేవి తిర్యక్కుల సృష్టి ఎనిమిదవది. ఇక తొమ్మిదవది మానవ సృష్టి. ఇది రజోగుణంతో పురికొల్పబడి కర్మలు చేయటంలో నేర్పు కలిగి ఉంటుంది. దుఃఖంలో కూడా సుఖాన్నే కోరుతుంది. ఈ మూడు విధాలైన సృష్టులు వైకృత సృష్టులు. ఇక దేవ సర్గం. అది కూడా ఎనిమిది విధాలు. అందులో విబుధులు, పితృదేవతలు,సురాదులు మూడు భేదాలు; గంధర్వులు, అప్సరసలూ ఒకటీ; యక్షులు, రాక్షసులు ఒకటీ; భూత, ప్రేత, పిశాచాలు ఒకటీ, సిద్ధ చారణ విద్యాధరులు ఒకటీ, కిన్నర కింపురుషులు ఒకటీ; ఈ ఎనిమిది కలిసి దేవ సర్గం అయింది. ఇందులో మరో విశేషం ఉంది. అదేమిటంటే, కౌమారసర్గం అనేది దేవ సర్గంలో ఒక భాగమే అయినా ప్రాకృత వైకృతాలు రెంటి స్వభావమూ కలది. అందులో దైవత్వం మానుషత్వం కలిసి ఉంటాయి. ఇదే సనత్కుమారాది సర్గం. సఫల సంకల్పుడైన పురుషోత్తముడు తానే ఈ విధంగా వివిధ భేదాలతో కూడిన విశ్వాన్ని కల్పించాడు.భగవంతుని సృష్టి కార్యానికి అంతు అనేది లేదు. దానికి వేరే వస్తువులతో, సంయోగంకూడా అవసరం లేదు. జగత్తులో కుండలు, బట్టలు, తయారయ్యే తీరు వేరు; సృష్టి నిర్మాణ తీరు వేరు. కుండ ఈ లోకంలో తయారు కావాలంటే, 1. మట్టి (ఉపాదానకారణం), 2. మట్టిని కుండగా రూపొందించటం (సమవాయ కారణం), 3. కుండను చేసేవాడు (నిమిత్త కారణం) అవసరం. అలానే బట్ట నిర్మాణం కూడా 1. ప్రత్తి (ఉపాదానం), దారాలు నేత (సమవాయి), బట్ట నేసే వాడు (నిమిత్తం). లోకంలో, ఏ కార్యానికైనా పై మూడూ అవసరం. భగవంతుని సృష్టిలో భగవంతుడు సమవాయ కారణం అవుతాడు.

     చతుర్ముఖుడు తన దివ్యదృష్టితో అస్ఖలిత బ్రహ్మచారులు, పరమ పావనులు, సత్వగుణ సంపన్నులు, ధీర వరేణ్యులు, మాన్యులు అయిన సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అను నలుగురు మునులను సృష్టించాడు. భగవదనురక్తులైన వారితో “మీమీ అంశలతో ప్రజల్ని సృష్టించి ప్రపంచాన్ని వృద్ధి చేయండి” అన్నాడు. బ్రహ్మదేవుని మాటలు విన్న సనకాదులకు నవ్వు వచ్చింది. మోక్షాసక్తులు, శ్రీమహావిష్ణువు పరమ భక్తులు అయిన వారు పద్మసంభవుని అపహాస్యం చేస్తూ ప్రపంచ నిర్మాణానికి ప్రతికూలంగా మాట్లాడారు. వారు తన ఆజ్ఞను తిరస్కరించినందుకు చతుర్ముఖునికి కోపం వచ్చింది. బుద్ధిబలంతో ఆగ్రహాన్ని ఎంత నిగ్రహించుకున్నా ఆయన కనుబొమల నడుమ నుండి నీలం, ఎరుపు రంగుతో “నీలలోహితుడు” పుట్టాడు. అతడు పుడుతూనే పెద్దగా రోదనం చేశాడు.ఆవిధంగా జన్మించిన నీలలోహితుడు బ్రహ్మదేవుని “ఓ దేవా! నేను ఎవరిని? నా పేరు ఏమిటి? నా నివాస స్థలం ఏమిటి?” అంటూ ప్రశ్నించాడు. అప్పుడు పద్మంలో పుట్టిన ఆ చతుర్ముఖుడు అతనిని లాలిస్తూ ఇలా అన్నాడు “పుత్రా! నువ్వు పుట్టగానే గట్టిగా ఏడ్చావు కదా!అలా పుట్టగానే రోదన చేయటం వలన నీకు “రుద్రుడు” అనే పేరు స్థిరపడింది. 1) చంద్రుడు, 2) సూర్యుడు, 3) అగ్ని, 4) వాయువు, 5) జలం, 6) ఆకాశం, 7) భూమి, 8) ప్రాణం, 9) తపస్సు, 10) హృదయం మరియు 11)ఇంద్రియాలు అనే పదకొండు నీకు నివాస స్థానాలు.” అని బ్రహ్మదేవుడు చెప్పాడు. వాటిని ఏకాదశ రుద్ర నివాస స్థానాలు అంటారు.అలా చెప్పిన బ్రహ్మదేవుడు రుద్రునితో ఇంకా ఇలా అన్నాడు “అంతేకాదు కుమారా! మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతస్కుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు అనే ఏకాదశనామాలు కలిగి ఉండు. ధీ, వృత్తి, ఉశన, ఉమ, నియుత్తు, సర్పి, ఇల, అంబిక, ఇరావతి, సుధ, దీక్ష అనే పేర్లు కలిగిన ఏకాదశ పత్నులుతో కూడి ఏకాదశ స్థానాల యందు ఉంటూ ప్రజల్ని సృష్టించు” అని విశ్వానికి గురువు అయిన బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారంగా తనతో సమానమైన సత్తువ (బలం), ఆకారం, స్వభావం కలిగిన ప్రజలను సృష్టించాడు రుద్రుడు. ఈ విధంగా రుద్రుడు సృష్టించిన రుద్రగణాలు ఈ విశ్వాన్నంతా అమాంతం మ్రింగేశాయి. ఆ మహా ప్రమాదాన్ని శాంతింపచేయటానికై బ్రహ్మదేవుడు వారిని చేరపిలిచి “కుమారులారా, చూసారా! మీ చూపుల అగ్నిజ్వాలలలో సమస్తలోకాలూ మండిపోయాయి.నాయనలారా! మీరు బుద్ధిమంతులు, ధైర్యవంతులు, నా మాట వినండి. ఇంక చాలు; మీరు సృష్టించటం చాలించండి. చక్కగా అరణ్యాలకు వెళ్ళి ఏకాగ్రచిత్తులై, తపస్సు చేసుకోండి. మీకు తప్పక శుభం కలుగుతుంది.శ్రీమన్నారాయణుడు భగవంతుడు, పురుషోత్తముడు కరుణాసముద్రుడు, లక్ష్మీవల్లభుడు, సద్గుణసంపన్నుడు, అచ్యుతుడు, పరమాత్ముడు, పరంజ్యోతి, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, అధోక్షజుడు, జగన్నాధుడు, ఆర్త జన రక్షా పరాయణుడు; అయనను సజ్జనులైనవారు తమ తపశ్శక్తివల్ల దర్సించగలుగుతారు. మీరు కూడా తపస్సు చేసి ఆయనను దర్శించండి” అన్నాడు బ్రహ్మదేవుడు.ఆ సచ్చరిత్రులైన రుద్రులు చతుర్ముఖుని ఆజ్ఞానుసారం తమ రౌద్రావేశాన్ని అణుచుకున్నారు. ఉద్రేకాన్ని తగ్గించుకున్నారు. అరణ్యాలకు వెళ్ళి తపోనిమగ్నులైయ్యారు. అనంతరం బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించాలనే దృష్టి కలవాడై ఈసారి మానవ లోకానికి శరణ్యులూ మతిమంతులలో, అగ్రగణ్యులూ అయిన వారిని సృజించాడు.భగవంతుని అనుగ్రహ బలంతో కూడిన సద్గుణాలు కలవారు, జీవుల అభివృద్ధికి కారణభూతులు, బ్రహ్మతో సమానమైన ప్రభావం కలవారు, విశాలమైన యశస్సు కలవారు, అయిన పదిమంది కొడుకులు బ్రహ్మదేవుడికి జన్మించారు.బ్రహ్మ బొటనవ్రేలు నుండి “దక్షుడు”, తొడనుండి “నారదుడు”, నాభి నుండి “పులహుడు”, చెవులనుండి “పులస్త్యుడు”, చర్మంనుండి “భృగువు”, చేతి నుండి “క్రతువు”, ముఖంనుండి “అంగిరసుడు”, ప్రాణంనుండి వశిష్టుడు, మనస్సునుండి మరీచి, కన్నులనుండి “అత్రి” ఆవిర్భవించారు. ఈవిధంగా పదిమంది కుమారులు పుట్టారు. ఇంకా బ్రహ్మ దేవుని కుడి వైపు స్తనంనుండి “ధర్మం” జనించింది. వెన్నునుండి లోకభయంకరమైన “మృత్యువూ” జనించాయి. ఆత్మనుండి “మన్మధుడు” పుట్టాడు.బ్రహ్మదేవుని కనుబొమ్మలనుండి “క్రోధం” , పెదవులనుండి “లోభం” పుట్టింది; ముఖమునుండి “సరస్వతి”; పురుషాంగం నుండి “సముద్రాలు”, మలద్వారం నుండి పాపాశ్రయుడైన “నిరృతి”, నీడనుండి దేవహుతి భర్త యగు “కర్దముడు” జన్మించారు. అంత బ్రహ్మదేవుడు తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి ఆమె సౌందర్యానికి మోహపరవశుడు అయ్యాడు. మన్మధుని పుష్పబాణాలు ఆయన హృదయాన్ని భేదించాయి. కన్నకూతురు అనే సంకోచం లేకుండా పాపానికి వెనుకాడక వ్యామోహంతో ఆమె వెంటపడ్డాడు. తమ తండ్రి దుశ్చర్యను మరీచి మొదలుగాగల మునివర్యులకు తెలిసింది.“ఓ పద్మంలో పుట్టిన బ్రహ్మదేవుడా! చాలు చాలయ్యా. సన్మార్గాన్ని కాలదన్ని కన్నకూతురుపై కన్నేసి కలవాలని చూస్తున్నావు. ఇదెక్కడి ధర్మమయ్యా! ఎంతటి మోసగాడిని అయ్యావు. ఇంతటి పాపానికి ఒడిగట్టి, నీ న్యాయం, పెద్దరికం మట్టిపాలుచేసావు. నీ శీలం అంతా పోయింది. ఇలా చేసిన ఘనులు ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నారా!నీవు మహానుభావుడవు. నిర్మల చరిత్ర కలవాడవు. కదా లోకులు వింటే ఏమనుకుంటారు? విధాత విధినిషేధాలు తెలియకుండా ప్రవర్తించాడనుకోరా? బ్రహ్మదేవుడు వావి వరుసలు వదలిపెట్టి మన్మధబాణాలకు లొంగిపోయి, కన్నబిడ్డనే కామించాడని చెడతిట్టరా?పాపకృత్యం అని అనుకోకుండా క్షణికమైన సౌఖ్యానికి ఈ నీచానికి పాల్పడ్డావు. కామాంధుడికి కళ్ళు కన్పించవు. అని లోకోక్తి ఉండనే ఉన్నది కదా.”అని ఇలా మునీంద్రులు మందలించి పలికిన ములుగుల వంటి పలుకులు విని బ్రహ్మదేవుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. వెంటనే తన శరీరాన్ని విడిచిపెట్టాడు. దిక్కులు వచ్చి ఆ శరీరాన్ని ఆక్రమించాయి. వెంటనే ఆ దిక్కులలో నుంచి చీకటి, మంచూ ఉద్భవించాయి.అటుమీద బ్రహ్మదేవుడు ధైర్యం వదలక, మరొక దేహాన్ని ధరించాడు. సృష్టికి పూర్వం సంప్రాప్తమైన సృజన శక్తి తనకు అప్పుడు లేకపోవడంతో ఎంతగానో చింతిస్తూ ఉండిపోయాడు.అంతలో అతని ముఖంనుండి పరమధర్మప్రబోధాలైన వేదాలు పరిపూర్ణ స్వరూపాలతో ఆవిర్భవించాయి.అంతేకాదు, యజ్ఞాలు, పుణ్య కృత్యాలు, తంత్రాలు, సదాచారాలు, చతురాశ్రమాలు ఆయన నాలుగు మోములనుండి జన్మించాయి.బ్రహ్మదేవుని తూర్పు వైపు ముఖమునుండి “ఋగ్వేదము”, దక్షిణ ముఖంనుండి “యజుర్వేదము”, పశ్చిమ ముఖంనుండి “సామవేదము”, ఉత్తర ముఖంనుండి “అధర్వణవేదము” ఉద్భవించాయి.బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమ చతుష్టయం కూడా చతుర్ముఖుని చతుర్ముఖాల నుండి క్రమంగా జనించాయి. పై నాలుగు ఆశ్రమాలలో, ఒక్కొక్కటీ నాలుగు విధాలైన వృత్తులు ఉంటాయి.బ్రహ్మచర్యంలో వృత్తులు నాలుగు. అవి 1. సావిత్రం (సవిత అంటే సూర్యుడు. ఆయన్ని ఆరాధించే గాయత్రి ఇందులో ప్రధానం కనుక దీనికి ఈ పేరు వచ్చింది.) అనగా ఉపనయనం మొదలుకొని మూడు దినాల పర్యంతం గాయత్రీ మంత్రం జపించటం; 2. ప్రజాపత్యం అనగా వేదాలు నాలుగు చదువుకొనుట; 3. బ్రాహ్మం అనగా వేదవ్రతాలు నాల్గింటిలో ఒక్కొక్కొటి ఒక్కొక్క సంవత్సర పర్యంతం ఆచరించేది; 4. బృహత్తన నైష్టికం అనగా వేదం పూర్తిగా నేర్చుకున్న అనంతరం ఆచరించేది;గృహస్ఠ వృత్తులు నాలుగు. అవి 1. నిషిద్ధం కాని వ్యవసాయం జీవనోపాధిగా గలవారు వార్త అంటారు; 2. యజ్ఞయాగాది కర్మలకు ఉపయోగించే పనులు చేసి జీవించటాన్ని సంచయం అంటారు; 3. పరులను యాచించకుండా వుండటం శాలీనం; 4. పొలాలలో రాలిన ధాన్యం కంకులు ఏరుకొని, వానిని శిలలపై నూర్చుకొని జీవించటం శిలోంఛం;వానప్రస్ధ వృత్తులు నాలుగు. అవి 1. పండించకుండా లభించిన ఆహారాలు తీసుకొనేవారు వైఖాసనులు. 2. క్రొత్త పంట లభించగానే పూర్వం దాచిపెట్టిన పదార్ధాలను మిగలకుండా ఇతరులకు పంచిపెట్టేవారు వాలఖిల్యులు, 3. ప్రొద్దున లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు పోయి అక్కడ ఆయాచితంగా లభించిన పదార్ధాలను భుజించేవారు ఔదుంబరులు. 4. చెట్టునపండి రాలిన ఫలాలను తిని జీవించేవారు ఫేనపులు.పరమేశ్వరునకు వ్యక్తము, అవ్యక్తము అని రెండు రూపాలు. వ్యక్తరూపం వైఖరీవాక్కు; పరా, పశ్యంతీ, మధ్యమా అనే వాక్కులు అవ్యక్తరూపం. ఈ వ్యక్తావ్యక్తరూపాలు రెండింటికి ప్రణవమే ఆత్మ. భగవంతుడు, అవ్యక్తాత్ముడు కావటంవల్ల పరిపూర్ణుడు. వ్యక్తాత్ముడు కావటంచేత ఇంద్రాది శక్తి సంయుక్తుడు అయి కనిపిస్తాడు. అనంతరం అనంత వీర్యవంతులైన ఋషుల సంతానం సవిస్తారమై వృద్ధి కాలేదని తలచి బ్రహ్మ తన పూర్వ శరీరాన్ని వదిలాడు. నిషిద్ధం కాని కామంపై ఆసక్తి కల మరొక్క దేహాన్ని ధరించాడు. నిత్యం ప్రజా సృష్టి యందు ఆసక్తుడు అయ్యాడు. అయినా ప్రజాభివృద్ధి జరుగ లేదు. కారణం తెలియక ఆశ్చర్యపడ్డాడు. అది వృద్ది అయ్యే విధానాన్ని గూర్చి ఆలోచించాడు. దైవం ఇచట ప్రతికూలం; కాబట్టి దైవానుకూలత అవసరం అనుకున్నాడు; దైవానుకూలత కోసం ఎదురు చూస్తూ దైవాన్ని ధ్యానిస్తూ సందర్భోచిత కర్తవ్యాలు నిర్వర్తించసాగాడు.తొలుత మన్మధ ప్రభావంతో సరస్వతిని కామదృష్టితో చూసి భంగపడిన బ్రహ్మ ఆ శరీరం వదలి కామదృష్టి లేని మరొక సరీరం దాల్చిన పిదప వాక్కు,జ్ఞానం,భాష వంటివాటికి అధినాయకి అయిన సరస్వతి సహాయం లేకుండా అప్పటివరకు జరిగిన సృష్టి నిరర్ధకం అవుతుందని గ్రహించి తనకు సాయపడుతూ తన పక్కన వసించవలసిందిగా ప్రార్ధించినాడు.ఆమె కూడా పరిస్థితిని అర్ధం చేసుకుని సమ్మతించి సత్యలోకాన బ్రహ్మకు సహచరిగా స్థిరపడింది. వీరిది కేవలం సహచర్యమే తప్ప దాంపత్యం కాదు గనకనే లక్ష్మీ నారాయణుల వలె పార్వతీ పరమేశ్వరుల వలె దంపతులుగా ప్రస్తావించడం లేదు.వాక్కుకు అర్ధము వలె,మంత్రమునకు శక్తి వలె సరస్వతి బ్రహ్మకు తోడుగా రావటంతో సృష్టికార్యం అర్ధవంతమైన మలుపు తీసుకుని వేగవంతం అయ్యింది..అంతట బ్రహ్మదేవుని దేహం రెండు భాగాలయింది. అందొకటి స్వరాట్టు అయిన, స్వాయుంభువు మనువుగా; మరొకటి అతని భార్య శతరూప అనే అంగనగా రూపొందాయి. ఈ దంపతుల వల్ల కలిగిన అనంత ప్రజా సంతతుల వల్ల జగత్తులన్నీ నిండుగా అయ్యాయి.

     అబ్బ!జీవజాతుల్ని పేరుపేరునా ఎంత శాస్త్రీయంగా వర్గీకరించారు?Father of Modern Taxonomy అని కీర్తించిన Carolus Linnaeus క్రీ.శ 17వ శతాబ్దం వాడు,మరి ఇదెప్పటిది?అయినా ఎంత వివరంగా ఉంది!ఇక్కడ కొంచెంసేపు సేదదీరి మళ్ళీ ప్రయాణం మొదలుపెడదాం - ఖాళీగా ఉండకుండా ఇలాంటి చిన్న చిన్న సందేహాల్ని కొన్నింటిని తీర్చుకుందాం.మనం చిన్నప్పటినుంచీ సూర్యుడు పాలపుంతలో ఉన్నాడు.ఆ సూర్యుడి చుట్టూ తిరిగే నవగ్రహాల్లో భూమి ఒకటి,చంద్రుడు భూమి చుట్టూ ఇరిగే ఉపగ్రహం అని చదువుకున్నాం కదా!మరి ఇక్కడ భూమి విరాట్ పురుషుడి కటిస్థలం అనీ ఆకాశం నాభి అనీ గ్రహతారకాదులు ఉండేది వక్షస్థలం అనీ వేర్వేరు పొరల్లోకి తీసుకెళ్లారు - ఇది మోడర్న్ సైన్సు సూత్రాలకి ఎట్లా పొసగుతుంది?అయితే భూకేంద్రక విశ్వం,సూర్యకేంద్రక విశ్వం అనే రెండు సిద్ధాంతాలనూ చెప్పిన ఆధునిక పాశ్చాత్య శాస్త్రవేత్తలలో ఇప్పటికీ తాము చెప్తున్నది నూటికి నూరు శాతం సరైనదని చెప్పగలిగిన ధీమా లేదు.

     భూకేంద్రక సిద్ధాంతాన్ని దాన్ని మొదట వూహించి చెప్పిన టాలెమీ పేరుమీద టాలెమిక్ మోడల్ అని కూడా అంటారు,కానీ క్రీ.పూ 4వ శతాబ్దికి చెందిన ప్లాటో,అరిస్టాటిల్ దీనిమీద బాగా కృషి చేశాకనే ప్రాచుర్యంలోకి వచ్చింది.16వ శతాబ్దం తర్వాత క్రమంగా సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రాచుర్యంలోకి రావడంతో ఇప్పుడు దీన్ని పట్టించుకోవడం లేదు.బైబిలుతో పోలిక ఉన్న భూకేంద్రక సిద్ధాంతాన్ని కాదంటున్న సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చర్చి మొదట్లో ససేమిరా ఒప్పుకోలేదు.వీరు కూడా మొదట్లో బల్లపరుపు భూమినీ దానిమీద బోర్లించిన మూకుడు లాంటి దృశ్యాల్ని వూహించినా తర్వాత మధ్యలో తన చుట్టూ తాను తిరిగే గోళాకారపు భూమిని ఉంచి దానిచుట్టూ 47 నుంచి 55 పారదర్శకమైన గోళాలు దొంతరలుగా ఏర్పడి భూమిచుట్టూ తిరుగుతున్నట్టు వూహించారు.ఇదంతా చాలా గందరగోళంగా ఉంటుంది.ప్రతి గ్రహమూ deferent, epicycle అని రెండు వలయాలలో తిరుగుతుందట - deferent ఏమో భూమి చుట్టూ తిరిగే వలయం అయితే, epicycle ఏమో తన చుట్టూ తను తిరుగుతున్నట్టు కాకుండా deferent వలయంలో మరో చిన్న వలయం అవుతుందట!

     క్రీ.శ 15వ శతాబ్దంలో పుట్టిన కోపర్నికస్ భూకేంద్రక సిద్ధాంతాన్ని బలహీనం చేసి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చాడు.అయితే ఇతను వాడిన గణితశాస్త్రపు సాంకేతిక విషయాలు 13వ శతాబ్దికి చెందిన అరబిక్ మేధావుల రచనలను పోలి ఉండటం వల్ల సొంతం కాదేమో అని కొందరూ తనే అరబిక్ సిద్ధాంతుల సూత్రాలను ప్రస్తావించి కొన్ని కొత్త ప్రతిపాదనలు చేశాడు గనక సొంతమేనని కొందరూ అంటున్నారు.అయితే ఇతను సూర్యుణ్ణి పూర్తిగా విశ్వానికి కేంద్రంగా ప్రతిపాదించలేదు,కొంచెం పక్కకి పెట్టి చెప్పాడు.భూమికి ఇతను మూడు రకాల కదలికలు ఉన్నాయని చెప్పాడు - రోజువారీ తనచుట్టూతాను తిరగటం,ఏడాది పాటు సూర్యుడి చుట్టూ తిరగటం,ఏడాదికోసారి అక్షం వంగటం.భూకేంద్రక సిద్ధాంతం కన్నా సూర్యకేంద్రక సిద్ధాంతం కొంత మెరుగైనదే - గ్రహాలకీ సూర్యుడికీ మధ్య దూరాన్ని మరింత ఖచ్చితంగా లెక్కకట్టగలిగారు,ఋతువులు మారటాన్ని మరింత స్పష్టంగా నిర్వచించగలిగారు!కానీ సమకాలికులు కొందరు ఈ దూరాల్ని ఖచ్చితంగా చెప్పలేకపోవటాన్ని బట్టి ఇతని సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు.వీళ్లలో ముఖ్యుడు ఆ కాలపు ఖగోళ శాస్త్రవేత్తలలో అత్యంత ప్రతిభాశాలియైన టైకోబ్రాహి.కోపర్నికస్ చేసిన కొన్ని సూత్రీకరణల్ని ప్రశంసించినా భూమి కదలడం అనే భౌతిక,ఖగోళ,ఆధ్యాత్మిక శాస్త్రాల రీత్యా అసంబద్ధమైన విషయాన్ని టైకోబ్రాహి ఒప్పుకోలేదు!కోపర్నికస్ కూడా పరిశీలనార్హమైన ఋజువు ఏదీ చూపించలేక భూకేంద్రక సిద్ధాంతం కన్నా తన సిద్ధాంతంలోని సమగ్రతనీ నూతనత్వాన్నీ మాత్రమే సమర్ధించుకోగలిగాడు.టైకో వేసిన అతి కీలకమైన ప్రశ్న ఇతర గ్రహాల కదలిక భూమిని ప్రభావితం చేస్తున్నప్పుడు భూమి యొక్క కదలిక ప్రభావం ఇతర గ్రహాల మీద ఎందుకు కనిపించడం లేదు అనేదానికి ఇప్పటికీ జవాబు లేదు!

     ఇతని సిద్ధాంతంలోని కొన్ని ప్రతిపాదనల్ని తీసుకుని కొన్నిట్ని వొదిలేసి సరిపెట్టుకున్నారు. అసలైన గొడవ చర్చి దగ్గిర్నుంచి మొదలైంది.విశ్వాసులు తల్లడిల్లిపోవటం మొదలుపెట్టారు.ఇక్కణ్ణించి మనం మొదలయ్యాము అని బైబిలు బల్లగుద్ది చెప్పే జెనెసిస్ కాండ ఎగిరిపోతే ఇంకేముంది - కాళ్ళు తేలిపోయిన మనిషి బాపతు అవుతుంది క్రస్తవం!ఆఖరికి ఇద్దరు పోపులు "we have to contend against those who, making an evil use of physical science, minutely scrutinize the Sacred Book in order to detect the writers in a mistake, and to take occasion to vilify its contents. . . . There can never, indeed, be any real discrepancy between the theologian and the physicist, as long as each confines himself within his own lines, and both are careful, as St. Augustine warns us, "not to make rash assertions, or to assert what is not known as known." అని కర్రా విరక్కుందా పామూ చావకుండా క్లాసురూముల్లో సూర్యకేంద్రక సిద్ధాంతాన్నీ చర్చిగోడల మధ్యన భూకేంద్రక సిద్ధాంతాన్నీ వాడుకునేటట్టు సర్దుబాటు చేశారు.

     ఇంతకీ ఈ రెండు సిద్ధాంతాల్లో దేనివల్లనయినా ప్రాచీన భారతీయ విజ్ఞానుల విశ్వసృష్టి సిద్ధాంతం నిజమని గానీ అబద్ధమని గానీ తేల్చిచెప్పేలా ప్రభావితం అవుతుందా?అస్సలు కాదు!ఎందుకంటే,వాళ్ళకయినా వీళ్ళకయినా ఏ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో అయినా సిద్ధాంత రచనకి ఉన్న ప్రమాణాలు ఒకటే.ప్రాక్కల్పన(prototype),కల్పన(thesis),విశ్లేషణ(analysis),గణితం(maths),ప్రయోగం(experiment),వ్యతిరిక్తత(exception) అనే అంశాలు ఉంటాయి.కొన్ని సిద్ధాంతాల్లో విశ్లేషణ అద్భుతంగా ఉండి గణితం తేడా వొస్తే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు,కొన్ని సిద్ధాంతాల్లో విశ్లేషణ గొప్పగా లేకపోయినా గణితం సరిపోతే ఆమోదిస్తారు.ప్రాచీన భారతీయ విజ్ఞానులు రెంటిలోనూ గట్టిగా ఉన్నారు.ప్రాచీన భారతీయ విజ్ఞానుల ప్రకారం భూమండల వృత్తంలో సూర్యుడు ఒకసారి పూర్తి చేసే దూరం 95,100,100 యోజనాలు ఉంటుంది.నిమిషానికి 2000 యోజనాల 2 క్రోసుల చుప్పున తిరుగుతాడు - అది వేగం.వీటిని మెట్రిక్ కాలమానంలోకి మారిస్తే దూరం 760,800,000 మైళ్ళు,వేగం సెకండుకు 16,004 మైళ్ళు - ఇద్దరి లెక్కలూ సరిపోతున్నాయి!

     ఒకవేళ నిజంగానే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ సూర్యుడు పాలపుంతలో భాగమై దాని అక్షం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటికీ ఈ చలనాలన్నీ సాపేక్షంగానే జరుగుతూ గ్రహతారకాదుల మధ్యనున్న సాపేక్ష దూరాలు మారటం లేదు కదా - కాబట్టి ప్రాచీన భారతీయ విజ్ఞానులు అనవసరమైన గందరగోళానికి గురి కాలేదు,అందుకే లెక్కలు ఖచ్చితంగా తేలాయి!అన్ని రకాల కదలికలు జరుగుతున్నా ధృవ నక్షత్రం ఒక్కచోటనే కనిపించడాన్ని ఈ సిద్ధాంతాల ప్రకారం ఎట్లా అర్ధం చేసుకోవాలి?యెకాయెకిన ప్రాచీన భారతీయ విజ్ఞానులు చెప్పింది చెప్పేసి పోకుండా ఆధునిక పాశ్చాత్య విజ్ఞానుల సిద్ధాంతాల్ని ఎందుకు ఎత్తుకున్నానని అస్మదీయుల్లో కొందరికి సందేహం రావొచ్చు,తసమదీయులైతే నేనేదో వాళ్లని చిన్నచూపు చూస్తున్నట్టు కుళ్లుకోవడమో వాళ్లనుంచి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నట్టు పొంగిపోవటమో చేస్తారు - కానీ నాకు వాళ్లమీద ఎలాంటి ద్వేషమూ లేదు.వాళ్ల కష్టం వాళ్ళు పడ్డారు,అదీ తక్కువేం కాదు!మన దేశంలో తయారయిన "అన్నీ వేదాల్లో ఉన్నాయిష గాళ్ళు!" అని వెక్కిరించిన మహానుభావుల వల్ల కొంత సిగ్గుపడి మనం చెప్పలేదు గాబట్టి వాళ్ళకి తెలియలేదు - తెలిశాక వాళ్ళూ ఇది ముందే తెలిస్తే ఇంత టైం వేస్ట్ చేసేవాళ్లం కాదని ఒప్పుకున్నారు పాపం!

     జిజ్ఞాస అందరికీ సంబంధించిన జనరల్ విషయం కాబట్టి బుర్రలోంచి తుడిచేసినా పర్లేదు, కానీ నాకు సంబంధించిన ఒక ఒక పర్సనల్ విషయం ఉంది - అది మాత్రం తప్పకుండా పట్టించుకోవాలి.పధ్నాలుగు లోకాలు అని కాకుండా చక్కగా భూమిని మధ్యలో పెట్టి అటు ఏడూ ఇటు ఏడూ లోకాల్ని అమరిస్తే సమన్యాయం కుదిరేది కదా,ఊర్ధ్వలోకాల్ని ఏడు అనుకుని అధోలోకాల్ని ఆరు అనుకుంటే మనసు చివుక్కుమనిపించింది - ఆంధ్రావాణ్ణి కదా!వెతికితే దొరికింది - పితృలోకం,అన్నిటికన్నా కింద ఉంటుంది.హమ్మయ్య!మనం నమ్ముతున్నట్టు ఉన్నవాటినే ఋషులు వర్ణించారు అనుకున్నా,హేతువాదులు "ఠాట్!ఇవన్నీ నిజం కాదు,బ్యామ్మర్ల స్టోరీలు." అనేసినా దాని వెనక ఉన్న లిటిగేషను మాత్రం రెండు వైపులా పదునైన కత్తి లాంటిది.భూలోకం ఖగోళలోకం తప్ప మిగిలిన లోకాలలో శాశ్వత నివాసాలు గల జీవులు ఉంటారు,వారికి ప్రబువూ ఉంటాడు,రాజ్యాంగమూ ఉంటుంది - అవి స్వతంత్ర లోకాలు.భూలోకం మాత్రం వీటన్నిటి వల్ల ప్రభావితమయ్యే అస్వతంత్రమైనది.ఇక పితృలోకంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు,భూలోకంలో మరణించినవారి తాత్కాలిక విడిది.భూమిమీద వారసులకి పితృకార్యాల కోసం శాస్త్రం నిర్దేశించిన మాసికాలు,త్రైమాసికాలు,సంవత్సరీకాల మొత్తం కాలం పూర్తయ్యేవరకు ఇక్కడ ఉండి ఆ తర్వాతనే స్వర్గనరకాలకు వారి పాపపుణ్యాల రాశిని బట్టి వెళ్తారు.ఇందులో ఉన్న అసలైన మెలిక ఏమిటంటే,తండ్రి ఎంత పుణ్యం చేసినా కొడుకు పాపాత్ముడైతే పితృకార్యాల ద్వారా తండ్రి పుణ్యాన్ని కొడుకు పాపం తగ్గిస్తుంది,తండ్రి పాపాత్ముడైనా కొడుకు మంచివాడైతే పితృకార్యాల ద్వారా తండ్రి పాపాన్ని కొడుకు పుణ్యం తగ్గిస్తుంది - అదీ లెక్క!తండ్రి మంచివాదైనా కొడుకు చెడ్దవాడయితే ప్రయోజనం లేదని చెప్పడంలో ఎంత కాఠిన్యం ఉందో తండ్రి చెడ్దవాడైనా కొడుకు మంచివాడయితే ఫరవాలేదనటంలో అంత మృదుత్వం ఎంత నిక్కచ్చిగా ఉందో చూశారుగా - ఒళ్ళు జాగర్త,బుద్ధి జాగర్త,పరంపర జాగర్త!

     అసలు ప్రయాణం పట్ల ఎక్కువ హుషారుగా ఉన్నవాళ్ళు నన్ను తిట్టుకుంటున్నట్టు కర్ణపిశాచి ఇందాకట్నించి చెవిలో జోరీగలా అరుస్తున్నది గాబట్టి మజిలీ ఇంతటితో ఆపేసి మళ్ళీ రహదారిలోకి వద్దాం.బ్రహ్మ మానవజాతికి మూలపురుషుడిగా మనువునూ అతనికి భార్యగా శతరూపనూ సృజించి సంతృప్తిగా నిశ్వసించడంతో విశ్వచలనం కొనసాగడానికి కావలసిన సమస్తజీవజాలమూ ఆవిర్భవించినాక భూమిమీద పరిస్థితి ఇలా ఉంది: ప్రాణికోటి రెండు రకాలు – స్థావరాలు, జంగమాలు. జంగమాలలో అండజ,స్వేదజ,జరాయుజాలనే మూడు భేదాలు ఉన్నాయి.వీటిలో జరాయుజాలు శ్రేష్ఠమైనవి.జరాయుజాలలో పశువులు,మనుష్యులు మరింత ఉత్తమశ్రేణికి చెందినవి. ఇవి పధ్నాలుగు భేదాలతో ఉన్నాయి.యజ్ఞయాగాదులకు పనికివచ్చే గ్రామ్యపశువులు అన్నింటికన్న శ్రేష్ఠం.వన్యమృగాలలో సింహం శ్రేష్ఠమైనది.జీవుల ఆహార వ్యవహార నిర్వహణ పరస్పర సంబంధితం - ఒక ప్రాణి మరొక ప్రాణికి అహారం అవుతుంది,ఒక ప్రాణి మరొక ప్రాణిని పోషిస్తుంది!నిత్య విహారాన్ని బట్టి చూస్తే జంతువులను భూచరాలు,జలచరాలు,ఖేచరాలు,ఉభయచరాలు అని కూడా విభజించి చెప్పవచ్చును.ఇక స్థావరాలు చెట్లు,లతలు,పొదలు,వల్లులు,త్వక్సారాలు అని అయిదు రకాలు.వీటినే ఉద్భిజాలు అని కూడా అంటారు.మొత్తం స్థావర జంగమాలు పందొమ్మిది రకాలు, వీటితో పంచభూతాలను కలిపితే ఇరవైనాలుగు.ఈ చతుర్వింశతి భూతాలే గాయత్రీ మంత్రాక్షరాలని తెలుస్తున్నది.అందువల్లనే గాయత్రీమంత్రార్ధం తెలిసినవారు నశించరని ఋషివాక్యం చెబుతున్నది!

     జరాయుజాలు పధ్నాలుగు రకాలు - వీటిలో వనాలలో సంచరించేవి ఏడు,జనపదాలలో సంచరించేవి ఏడు.సింహ, వ్యాఘ్ర, మహిష, వరాహ, గజ, భల్లూక, వానరాదులు వన్యప్రాణులు.ఆవు, మేక, గొర్రె, గుర్రం, గాడిద, కంచరగాడిద, మనిషి జనపదాలలో నివసించే జంతువులు.మిగిలిన జంతుజాలమంతా ఏనాటికానాటి ఆహారసేకరణతో సరిపెట్టుకుంటే మానవుడు ఆహారం,సంపద వంటివాటిని ఆర్జించి దాచుకుని వాడుకోగల్గుతున్నాడు.అయితే మానవాళి సమస్తం ఆర్జించే సంపదలు అన్నీ భూమినుండే వస్తాయి.భూమి ఎవరి అధీనంలో ఉంటే వారే సంపదలకు అధిపతి అవుతారు - వారే ప్రభువులు!ఈ ప్రభుత్వం కోసమే ఎందరో క్షాత్రపురుషులు పరస్పరహననంతో మారణహోమం సాగిస్తూ ప్రజానీకాన్ని అశాంతికి గురి చేస్తున్నారు.వీరిలో బుద్ధిమంతులు తమ బలాధిక్యతను జ్ఞానసంపత్తిని సరిగా అంచనా వేసుకుని తమకు అనుకూలమైన ప్రాంతాన్ని ఎన్నుకుని ప్రశాంత రీతిలో పరిపాలిస్తూ సంపదను పెంచి అక్కడి ప్రజలకు సుఖశాంతులను కలిగిస్తుంటే  ధనలోభమే తప్ప సంపదని సృష్టించే సమర్ధత లేని కొందరు ఇతరులను దోచుకోవడం ద్వారానే సంపద పెంచుకోవాలనే రాక్షసవ్యూహంతో యుద్ధోన్మాదులై భీబత్సరచన చేసి చివరకు తామూ అందులో హతులౌతున్నారు

     సప్తద్వీపసమన్వితమైన భూమండలం మీద మనది భరతవర్షం.ఇక్కద మహేంద్ర, సహ్య, శుక్తిమంత, ఋక్షవంత, మలయ, వింధ్య, గంధమాదనాది కులపర్వతసప్తకం ఉంది.ఇవికాక చిన్న చిన్న పర్వతపంక్తులు అనెకం ఉన్నాయి.ఇక్కడ ప్రవహించే నదుల జలాలు అమృతస్వాదువులు!మనస్సులో ధర్మదృష్టిని కలిగివుండి ఈ భూమండలం యొక్క యదార్ధతత్వాన్ని తెలుసుకుంటే ఇది కేవలం నిర్జీవమైన శిలాసైకతఖండం అని గాక పరమాత్మ స్వరూపం అనే విషయం గోచరమౌతుంది - ఆ విశ్వాత్మ భావన వల్ల మానవుడు విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ సర్వజీవాత్మకుడు కాగలడు.అలాంటి పవిత్రభావం లేకపోవడం వల్లనే శునకాలు మాంసఖండం కోసం కొట్లాడుకుంటున్నట్టు ప్రతివారూ వసుధాతలాన్నంతా తామే అనుభవించాలనే దురాశతో నిరంతరం యుద్ధాగ్నిని ప్రజ్వలింపజేస్తున్నారు!అనంతకాలగమనంలో పునరావృతమౌతూ వస్తున్న నాల్గు యుగాలలో సత్వయుగాన సత్వగుణసంపన్నులూ బుద్ధిమంతులూ ప్రియదర్శనులూ ఎక్కువగా ప్రభవిస్తారు.తర్వాతిదైన త్రేతాయుగాన ఉత్సాహవంతులూ మానధనులూ యుద్ధకళావిశారదులూ ఎక్కువగా ప్రభవిస్తారు.ద్వాపరయుగాన  విభిన్న ప్రవృత్తులు గలవారు ప్రభవించి ఒకరినొకరు అధిగమించాలని ప్రయత్నిస్తూ ఉంటారు.కలియుగాన అల్పచేతసులూ అసత్యవాదులూ క్రోధావేశపూరితులూ ఎక్కువగా ప్రభవిస్తారు.ద్వాపరంలో ప్రారంభమైన గుణన్యూనత కలిలో ఇంకొంత అధికమై పరస్పరారోహణోద్యోగం మరింత క్రూరమౌతుంది.భరతవర్షం కంటె హైమవత,హరివర్ష ప్రజలు కొంత ఉన్నతగుణాలను కలిగి ఉంటారు.

     సృష్టికి ఆధారభూతమైన పంచతన్మాత్రలు సామాన్యస్థితిలో ఒకదానితో ఒకటిగా కలియవు.విషయవాంచ పుట్టి శుక్లశోణితాలు సంగమించే సమయంలో వీటి కలయిక వల్ల ప్రాణి దేహాన్ని పొందుతుంది - ఇది జననం!సత్వగుణప్రభావం అధికంగా ఉండి ప్రశాంతజీవనం సాధ్యపడటంతో సత్యయుగంలో మానవుని ఆయుర్దాయం 400 యేళ్ళుగా ఉంటుంది.రజస్సు పెరిగి ప్రశాంతత భగ్నం కావడం వల్ల త్రేతాయుగంలో మానవుడి జీవితకాలం 300 యేళ్లకు తగ్గుతుంది.తమస్సు కూడా పెరిగి అశాంతి అధికం కావడం వల్ల ద్వాపరయుగంలో మానవుడి ఆయుర్దాయం 200 యేళ్ళు మాత్రమే ఉంటుంది.సర్వభ్రష్థతలకు నిలయమైన కలిలో మానవుడి సగటు ఆయుర్దాయం 100 ఏళ్ళుగా నిర్ధారించినా దాన్ని చేరుకోవటం అందరికీ సాధ్యపడదు.కాలం గడిచేకొద్దీ జీవశక్తి తేజస్సును కోల్పోయి జఠరాగ్ని చల్లబడిపోయినప్పుడు భూతపంచకం విడిపోయి ఒక్కొక్కటిగా ప్రాణినుండి విశ్వంలోకి జారుకుంటాయి - ఇది మరణం!త్రిగుణాలలో మేటి అయిన సాత్వికతను నిష్థతో సాధించుకుని రజస్తమస్సులను తమ అవసరం మేరకు ఉపయోగించుకోగలిగిన జ్ఞానాధికులు  అకాలమృత్యువు నుండీ దారిద్ర్యబాధల నుండీ ప్రమాదహేతువుల నుండీ తమను తాము రక్షించుకంటూ ఇతరులను రక్షిస్తూ కీర్తివంతులవుతారు - ఇది అమృతజీవనం!

     ప్రస్తుతం మనం సంచరిస్తున్న ఇప్పటి విశ్వంలో బ్రహ్మ యొక్క ఆయుర్దాయంలో 50 విధాతవత్సరాలు గడిచి 51వ శ్వేతవరాహకల్పంలోని తొలి అహస్సులో ఉన్నాము.ఈ ఆహస్సు పూర్తి కాగానే బ్రహ్మ నిద్రకు ఉపక్రమిస్తాడు.ఆయన నిద్రకు దిగేముందు రెండు సంఘటనలు జరుగుతాయి,జరిగితీరాలి.సప్తర్షిమండలంలో కొలువుదీరిన ఋషిసప్తకం భూమిమీద సంచితమయిన జ్ఞానరాశిని సంగ్రహించి భద్రపరుస్తారు.అప్పుడు భూమండలాన్ని పరిపాలించే రాజులలో ఉత్తముడు మనువు స్థానాన్ని పొందుతాడు.ఆనాటికి భూమిమీద ఉనికిలో ఉన్న ప్రతి జీవజాతి నుండి ఆడ,మగ జంటలను సేకరించి ఒక మహానౌకను నిర్మించుకుని మనువు సిద్ధంగా ఉంటాడు.బ్రహ్మ నిద్రకు ఉపక్రమించగానే సూర్యచంద్రాదులు నిస్తేజం కావడం వల్ల ఉష్ణోగ్రత తగ్గి భూమి సమస్తం అనంతజలరాశితో కప్పబడిపోతుంది.మనువు తన నౌకతో ఈ సాగరతరంగాల పైన తేలియాడుతూ మరుసటి పగలు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.

     సరిగ్గా ఇక్కడే ఇప్పుడే మననం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది - ప్రళయకాలంలో ఈ భూమి సమస్తం మునిగిపోయినా ప్రయాగ మాత్రం మునిగిపోదట!అప్పుడు శ్రీమహావిష్ణువు వటపత్రశాయిలా బాలునివలె క్రీడిస్తూ ఈ ప్రయాగ వద్దనే కాలోదధి తరంగాలపై తేలియాడుతూ గోచరిస్తాడట!పరమశివుడు మాధవేశ్వరి దేవాలయంలోని అక్షయవట రూపంలోనూ బ్రహ్మదేవుడు నగరానికి ఉత్తరంగా ఉన్న ప్రతిష్ఠానంలోనూ పరివేష్ఠించి ఉంటారట!అందుకే పెద్దలు హిందువైన ప్రతివాడూ జీవితంలో ఒకసారైనా ప్రయాగలో కేశఖండనం చేయించుకోవాలని,కురుక్షేత్రంలో పితృదేవతలకు తర్పణం అర్పించాలని,గయలో పితృదేవతలకు పిండప్రదానం వదలాలని చివరకు కాశీలో ప్రాణత్యాగం చెయ్యాలని అంటారు.



     అలా రాత్రి గడిచి బ్రహ్మ కన్నులు తెరవగానే మనువు జలరాశినుండి పైకి తేలిన భూఖండం మీదకు జీవజాతులను తిరిగి వదులుతాడు.సప్తర్షులు తాము దాచిన జ్ఞానరాశిని యోగ్యతానుసారం ఆయా జీవజాతులలో తిరిగి ప్రవేశపెడతారు.శాంతి,సహనం,పట్టుదల అనే ఉన్నతగుణాలతో పరిశోధించి సృష్టిక్రమాన్ని గురించి ఇంతటి సూక్ష్మమైన వివరాలతో విశదీకరిస్తున్న ప్రాచీనభారతీయదార్శనికులు చెప్తున్న అనేక విషయాలలో రెండు ప్రముఖమైన విషయాల్ని అర్ధం చేసుకుంటే దేని గురించీ మనకు భయసందేహాలు ఉండవు.జీవమా నిర్జీవమా అనే తేడా లేకుండా సృష్టిలోని ప్రతి వస్తువుకూ జననం,వృద్ధి,మరణం అనేవి సహజం అయినప్పుడు మన దేహాలకి సంభవించే జరామరణాలను గురించి ఆందోళన చెందటం వ్యర్ధం!మన దేహాలు నిర్మించబడిన పంచతన్మాత్రలూ త్రిగుణాలూ సాక్షాత్తూ ఈశ్వరతేజసాంశలే గనక దేవుడు అసలెక్కడా లేడు,ఉన్నా ఇక్కడెక్కడా చూడకూడదు అని వితండవాదనలు చెయ్యకుండా తనయందు సర్వభూతాళినీ సర్వభూతాలయందు తననూ చూడగలిగితే ఆ మనిషి జన్మ ధన్యం!

     మన ప్రయాణంలో ఇంక కొన్ని మలుపులే మిగిలినాయి గనక ఇక్కడ మరోసారి చిన్న మజిలీ వేసుకుని దైవభక్తుల్ని కూడా తరచుగా వేధించే కొన్ని ప్రశ్నలకి జవాబులు తెలుసుకుందాం."నిజంగా ప్రపంచాన్ని దేవుడే సృష్టిస్తే అందర్నీ ఎంచక్కా మంచివాళ్ళుగానే సృష్టించకుండా కొందర్ని చెడ్డవాళ్ళుగా ఎందుకు సృష్టించాడు?అందర్నీ తనే సృష్టించినప్పుడు సంపదల్ని సరిసమానంగా పంచకుండా అసమానతల్ని ఎందుకు ఉంచాడు?మొదట అసురులు పుడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయి,వాళ్ళు మంచివాళ్లని వేధిస్తున్న తొలిదశలోనే గభాల్న వొచ్చేసి వాళ్ళ దుర్మార్గాన్ని ఆపకుండా ఎంతోమంది మచివాళ్ళు చచ్చిపోయాక తీరిగ్గా వొచ్చి చంపటం వల్ల లాభం ఏంటి?అంతకుముందు చచ్చిపోయిన మంచివాళ్ళ సంగతి ఎవరికీ పట్టదా!" - ఇవన్నీ పైకి చాలా గంభీరమైన ప్రశ్నల్లా ఉన్నా వీటిల్లో కొంచెం తెలివితక్కువతనం ఉంది.అదేమిటో తెలియాలంటే నేను మీకొక తమాషా ప్రశ్న వేస్తున్నాను, జవాబు ఆలోచించండి!క్రికెట్టులో గానీ మరో ఆటలో గానీ ఆటగాడు బంతిని విసిరాక బంతితో పాటూ తను కూడా ఎగురుతూ బంతితో పాటూ నేలకి తగుల్తూ వెళ్తున్నాడా?లేదే!దేవుడు సృష్టిని నడిపించటం కూడా అంతే - ఈ లాజిక్కుని కాదన్నవాళ్లని అమ్మతోడు అడ్డంగా నరికేస్తా!తమకన్నా ముందు ఇంకెవరికీ హేతుబద్ధంగా ఆలోచించటం తెలియదనుకునేవారు ఇవే ప్రశ్నల్ని తిప్పి తిప్పి వొదుల్తున్నారు గానీ జనమేజయుడు ఎప్పుడో "సర్వభూతములకు సముఁడు నెచ్చెలి ప్రియుం; డైన వైకుంఠుఁ డనంతుఁ డాద్యుఁ డింద్రుని కొఱకు దైత్యేంద్రుల నేటికి; విషముని కైవడి వెదకి చంపె? నసురులఁ జంపంగ నమరులచేఁ దన, ;కయ్యెడి లాభ మింతైనఁ గలదె? నిర్వాణనాథుండు నిర్గుణుం డగు తన, ;కసురుల వలని భయంబుఁ బగయుఁ గలుగనేర వట్టి ఘనుఁడు దైత్యులఁ జంపి సురులఁ గాచుచునికి చోద్య మనుచు సంశయంబు నాకు జనియించె మునినాథ! ప్రజ్ఞమెఱసి తెలియఁ బలుకవయ్య!" అని అడిగాడు,సూత మహర్షి జవాబు చెప్పటం కూడా జరిగిపోయింది.

     అసలు మిగిలిన అన్ని జంతువులూ ఏపూటకాపూట ఆహారసేకరణతో సరిపెట్టుకుంటే మానవుడు మాత్రమే ఈరోజు సంపాదించినదాన్ని రేపటికి దాచుకోగలగటం ఎట్లా సాధ్యపడిందో తెలుసా?మనిషి దేహనిర్మాణంలోని రెండు ప్రత్యేకతలు అందుకు కారణం!నిటారుగా నిలబడటం చలనాన్ని సులభతరం చేసింది,బొటనవేలు మిగిలిన వేళ్ళకు ఎదురుగా వచ్చి పనిముట్ల వాడకానికి పనికొచ్చింది - దీనివల్ల మిగిలిన సమయాన్ని కొత్త విషయాలను నేర్చుకుని గుర్తుంచుకుని ఇతర్లకి చెప్పగలిగే బుద్ధి అనే ఒక కొత్త లక్షణం సమకూరింది.ఈ బుద్ధిని సక్రమంగా వినియోగించుకుంటూ పైన చెప్పిన ముప్పుల్ని తప్పించుకునే జ్ఞానం అనే ఆయుధాన్ని కూడా ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుని బాగుపడకుండా బుద్దినీ జ్ఞానాన్నీ ఇచ్చినవాణ్ణి తిడితే ఏమి లాభం?

     ఒకసారి దృశ్యమాన ప్రపంచం ఆవిర్భవించి కాలం అనే భగవత్స్వరూపం అందులోకి ప్రవేశించినాక మారకుండా ఏదీ స్థిరంగా ఉండదని ప్రాచీన భారతీయ విజ్ఞానులు ఎలాంటి అనుమానాలకీ తావులేకుండా తేల్చిచెప్పేశారు!అయినా సరే,ఈ మార్పు అనే విషయానికి మానవులు మూడు విధాలుగా స్పందిస్తారు.ద్రవ్యశక్తి స్వరూపమైన జడత్వం ఎక్కువగా ఉన్న తమోగుణసంపన్నులు నిన్నటివలె నేడూ,నేటివలె రేపూ గడిచిపోతే చాలునని మార్పుని వ్యతిరేకిస్తారు - మారక తప్పదని తెల్సినప్పుడు కొందరు చచ్చిపోతారు, వేముల రోహిత్ వలె!క్రియాశక్తి స్వరూపమైన రజోగుణప్రధానులు నిన్నటివలె నేడూ,నేటివలె రేపూ గడిచిపోయే జీవితాన్ని ద్వేషించి మార్పుకోసం ఉత్సాహంగా ఉరుకుతారు - ఒక్కోసారి ఆ మార్పు నాశనాన్ని తెస్తుందని తెలిసినా పట్టించుకోరు!జ్ఞానశక్తి స్వరూపమైన సత్వగుణోపేతులు మాత్రం మార్పుయొక్క అవసరాన్నీ పరిమితినీ గ్రహించి క్షయంలేనివృద్ధిని సాధిస్తారు.మార్పు అనేది ఏకపక్షంగా ఎప్పుడూ ఉండకూడదు.మనిషి చేసిన పనిముట్ల వాడకం వల్ల తనలో కలుగుతున్న మార్పుల్ని రద్దు చేసే వ్యతిరేక దిశలో ప్రకృతి కదులుతుంది - విశ్వంలోని అసంపూర్ణసమతాస్థితిని నిలిపి ఉంచడం కోసం!తన కార్యాచరణ ద్వారా ప్రకృతిని మార్చిన మానవుడు ప్రకృతి వైపునుంచి తనమీదకి వస్తున్న మార్పుల్ని కూడా పట్టించుకోవాలి - ఈ రెండోది చెయ్యకపోవడం వల్లనే మానవజాతి తను సాధించిన ప్రగతిని చూసి తనే భయపడాల్సిన దుస్థితి దాపరించింది ఇవ్వాళ.

     ప్రాచీనభారతీయదార్శనికులు సంపదలకి మూలం సురభి అనే కామధేనువు అని ఎందుకు చెప్పారో తెలుసా!ఆవు పొదుగు నుండి పాలు పిండుకోవాలంటే మొదట దానికి గ్రాసం వెయ్యాలి,లేదంటే ఆవు చస్తుంది - దాంతోపాటు నువ్వూ చస్తావు!కాబట్టి,ఓర్పుతో మొదట భూమిని పోషించు,సారం పెంచు,పాలమీద తేరిన మీగడతరకలా పైకి తేలిన దాన్ని మాత్రం తీసుకుంటూ ఉంటే క్షయంలేనివృద్ధి నీకు సొంతం అవుతుందని సనాతన ధర్మం ఎప్పుదో ఋజువు చేసింది. ప్రపంచ స్థాయిని అందుకున్న భరతఖండపు ఆర్ధికచరిత్రని సుమారు క్రీ.పూ 3500 నుంచి క్రీ.పూ 1500 వరకు విస్తరించిన వైదికయుగంతో మొదలుపెట్టాలి.సమకాలికులైన ఇతర ప్రాంతాల వారికన్నా వస్తూత్పత్తి లోని నాణ్యత విషయంలోనూ సరుకుల రవాణాలోని వేగం విషయంలోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించారు. అంతటి విపరీత స్థాయిలో పోగుపడిన సంపద వల్లనే అద్భుతమైన మహానగరాల నిర్మాణం సాగిందనేది వాస్తవం.క్రీ,పూ 300 నాటికి మౌర్య్లులు బలవంతులై ఉపఖండంలోని అధికభాగాన్ని పరిపాలిస్తూ రాజకీయపరమైన ఏకత్వాన్ని నిలబెట్టి అభివృద్ధికి కావలసిన ప్రశాంతతను సాధించి వ్యవసాయాన్ని వ్యాపారాన్ని సమతూకంగా ప్రోత్సహించి క్షయంలేనివృధికి గట్టి పునాది వేశారు.క్రీ.శ 1వ శతాబ్దం నుండి క్రీ.శ 17వ శతాబ్దం వరకు మొత్తం ప్రపంచంలోని సంపదలో మూడవ వంతు నుంచి నాలుగవ వంతు వరకు ఇక్కడ సృజించబడుతూ ఉండేదని Angus Maddison అనే economic historian తన The World Economy: A Millennial Perspective పుస్తకంలో సాక్ష్యాధారాలతో సహా తేల్చి చెప్పాడు.



     ఇట్లా కొన్ని సహస్రాబ్దాల పాటు బీదరికం లేని సమాజాన్ని సృష్టించి,నిలిపి,కొనసాగించడం అలౌకిక శక్తుల సాయంతోనో జపతపాల మాయాజాలంతోనో జరిగింది కాదు - మంత్రాలకు చింతకాయలు రాలవు!ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో కనిపించే స్వర్గనరకాలు కల్పితాలని అవి రాసినవారికీ తెలుసు,చదివి అర్ధం చేసుకునేవారికీ తెలుసు."మదువాతా ఋతాయంతే.." అని కోరుకుంటున్న మధుచ్చంద సూక్తం నుంచి "సర్వేజనాఃసుఖినోభవంతు!" అనే కళ్యాణభావన వరకు ఎక్కడ చూసినా ఇహలోకంలో మానవుడి సుఖజీవనం గురించే ఆర్యఋషులు తపించిపోయారు.తలమీద ఉన్న గ్రహతారకల గురించిన హేతుబద్ధమైన విశ్లేషణలనే కాదు,కాళ్ళకింద ఉన్న భూమిని ప్రయోజనకారిగా మలుచుకోవడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అత్యున్నత స్థాయిలో సాధించగలిగారు.ప్రాచీనభారతీయవిజ్ఞానులు సకలశాస్త్రాలలో కనిపించకుండా ఒదిగిపోయి వాటికి అర్ధాన్నీ పరమార్ధాన్నీ సమకూర్చే గణితశాస్త్రాన్ని సర్వోన్నత స్థాయికి తీసుకువెళ్ళడమే మానవులకి సుఖసంతోషాల్ని కలిగించే ఆర్ధికరంగంలోనూ క్షయంలేనివృద్ధిని సాధించటానికి తోడ్పడింది.

     విశ్వంలోని ప్రతి చోటా తాము గమనించిన త్రిగుణాలు ఆర్ధికరంగంలోనూ ఉన్నాయని వారు గమనించారు.క్రియాశక్తిని ప్రతిబింబించే రజోగుణం కొనుగోలుదారులలో ఉండి వారు సమాజాన్ని తమ అవసరాలను తీర్చమని ఒత్తిడి చేస్తారు.ద్రవ్యశక్తిని ప్రతిబింబించే తమోగుణం ఉత్పత్తిదారులలో ఉండి వారు కొనుగోలుదారులకు అవసరమైన వస్తూత్పత్తులను భూమినుండి వెలికితీస్తారు.జ్ఞానశక్తిని ప్రతిబింబించే సత్వగుణం వ్యాపారులలో ఉండి వారు వస్తూత్పత్తులను కొనుగోలుదారులకు చేర్చే విపణిని ఏర్పరచి సంపద సృష్టికి కారకులు అవుతారు.తమలోని త్రిగుణాలను నియంత్రించుకోగలిగిన ప్రభువర్గం ఆర్ధికచట్రపు ఈ మూడు శక్తులను సరైనతీరున శాసించి నిరంతరాయమైన అభివృద్ధిని సాధించగలుగుతారు.

     చరిత్రగతిని శాసించే ఒత్తిడి కొనుగోలుదారుల నుంచే వస్తుంది తప్ప ఉత్పత్తిశక్తుల నుంచి కాదు,విపణిలోని లాభనష్టాల కనుగుణంగా ఉత్పత్తులను మార్చుకునే ఉత్పత్తిశక్తులు వాటంతటవిగా సమాజాన్ని ప్రభావితం చెయ్యలేవు - చరిత్రగతిని శాసించలేవు.ఒక వ్యక్తి ఒక పరిశ్రమలో గానీ,వ్యాపారంలో గానీ పెట్టుబడి పెట్టబోయేముందు ఆ మదుపు వల్ల తనకు లాభం ఉంటుందని నిర్ధారించుకున్నాకనే ఆ పని చేస్తాడు.ఆ నిర్ధారణకు వచ్చే సమయంలో ఒకోసారి అసలు ఉత్పత్తిరంగం ఉనికిలోనే లేకపోవచ్చు, ఒకవేళ ఉన్నప్పటికీ కొనుగోలుదారుల నుంచి వచ్చే ఒత్తిడీ(demand and supply) ఆ వస్తూత్పత్తి యొక్క విపణిసామర్ధ్యమూ (business capacity) అతని నిర్ణయానికి కీలకాలు అవుతాయనేది ప్రతిరోజూ కళ్ళముందు కనబడుతున్న వాస్తవం!ఇలాంటి ఆర్ధికశాస్త్రపు అసలైన సాంకేతిక విషయాల్ని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా "కుర్మికాలు","డిబట్టుపె","అనదపువలువి","అరుగులత్రాలయంద","రాటంపోయుధసా","పిడిదోలురుదా" అంటూ ఉత్పత్తిశక్తులలోనే చెరిసగమై ఒకరికొకరు సహకరించుకుని ఉత్పత్తిని కొనసాగించాల్సినవాళ్లని బద్ధశత్రువులుగా నిలబెట్టి కలహించుకునేలా చేస్తే ఉత్పత్తి ఆగిపోవటమో కుంటుపడటమో జరుగుతుందే తప్ప "రర్గవహితమసాజం" ఎప్పటికీ ఏర్పడదు! మొత్తం సమాజాన్ని రెండు వర్గాలుగా చీలగొట్టి ఒక వర్గాన్ని మరో వర్గంతో అంతం చేయించితే చాలు వర్గాలు మాయం అనే హుళక్కి బుళక్కి గారడీలతో మిల్లు కార్మికుల వృద్ధకాలం గడిచిపోయి స్టార్టప్ అంటున్న కుర్రకాలంలో నెట్టుకురావటం కష్టం!

     ప్రాచీనభారతీయవిజ్ఞానులు కార్లనీ విమానాల్నీ తయారుచెయ్యలేకపోయారు గాబట్టి వాళ్ళు వేస్ట్ క్యాండిడేట్లు అంటున్నవాళ్ళు వాటివల్ల పెరుగుతున్న కాలుష్యానికి జవాబు కనుక్కోగలిగారా?వీటివల్ల వచ్చే కాలుష్యం ప్రమాదస్థాయికి చేరిందని కొన్ని దశాబ్దాల క్రితమే తెలిసినా ఇంతవరకూ పరిష్కారం లేదు - ఇంకా వాడకం పెరుగుతూనే ఉన్నది!దీనికి బిన్నంగా ప్రాచెనభారతీయవిజ్ఞానులు ఆవిష్కరించి నేటికీ ఉపయుక్తమవుతున్న ప్రతి ఆవిష్కరణలోనూ సనాతన ధర్మం యొక్క ట్రేడ్ మార్క్ అయిన క్షయంలేనివృద్ధి కనబడుతున్నది – దర్శయామి అక్షరపరబ్రహ్మం!

     పుట్టినప్పుడు అందరూ మంచిగానే ఉంటున్నప్పుడూ పెరిగి పెద్దయ్యాకనే పెడబుద్ధులు పుడుతున్నప్పుడూ  దేవుడు మాత్రం పుట్టుకని బట్టి దుర్మార్గుల్ని చంపదం అన్యాయమైపోతుంది కదా! ఏ కాలంలో ఏ ప్రాంతంలో చూసినా అందరూ ఒక్కలా ఉండరు - కొందరిలో సాత్వికం అధికంగా ఉంటుంది,కొందరిలో రాజసం అధికంగా ఉంటుంది,కొందరిలో తామసం అధికంగా ఉంటుంది.ఈ మూడు గుణాల సమ్మిళిత చుళుకీకృత వ్యాపనం(random assorted distribution) వల్ల ఆయా మానవ సమూహాలలో రెండు పరస్పర విరుద్ధమైన ధోరణులు కనబడుతూ ప్రజలను నిరంతరం సంఘర్షించుకునేలా చేస్తాయి.పంచమవేదమైన జయేతిహాసంలోని అంతర్భాగమైన అష్టాదశాధ్యాయి ఈ ప్రవృత్తులు గల మానవుల లక్షణాలను చక్కగా వర్ణించింది.

అమర సంపత్ ప్రభూతులు:
తేజం, క్షమా, ధృతీ, శౌచ మద్రోహం, నాతిమానిత
దైవ సంపత్ ప్రభూతుండు పొందు గుణాలు భారత!
                                                                          (16-03)
అసుర సంపత్ ప్రభూతులు:
దంభం,దర్పం,దురభిమానం,క్రోధ పారుష్యభావముల్
అజ్ఞానం అసురీ సంపదభిజాతుని లక్షణాలు పార్ధ!

                                                                          (16-03)


     వృద్ధిలేనిక్షయం వచ్చేది అసుర సంపత్ ప్రభూతుల వల్ల గనుక వారిని గురించి వివరంగా తెలుసుకుంటే తొలిదశలోనే వీరిని నిరోధించవచ్చును.కాబట్టి కొంచెం కాలాతీతమైనా భరించి వీరి ప్రవర్తన ఎట్లా ఉంటుందో దగ్గరనుంచి గమనించుదాం.

దుష్పూర కామ చేతస్కులు,దంభమాన మదాన్వితులు,
అసద్వాద రతుల్, ముగ్ధులు - వర్తింతు రశుచి వ్రతులై!
                                                                          (16-10)
ఆశాపాశాల చిక్కి కామక్రోధవశాత్మకులై
వాంచింత్రు కామభోగార్ధం అన్యాయార్జిత విత్తమున్
                                                                          (16-12)
"సాధించితిని నేడిద్ది,పొందెద నీ మనోరధమ్ము,
ఇంత ఉన్నది ఇంకింత ఆర్జించెదను భావిలోన
                                                                          (16-13)
వధించినాడ నీ వైరిన్,అన్యులన్ గూడ గెల్చెద,
నేనె ఈశ్వరున్,భోగిన్,సిద్ధుండను - బలిన్,శుచిన్
                                                                          (16-14)
ఆఢ్యుండ నభిజాతుండను సాటి యెవ్వరు నాకిలన్?
యాగదానాల మోదింతు" నందు రజ్ఞాన మోహితులై
                                                                          (16-15)
అహంకార, బల, దర్ప, కామ క్రోధ వశాత్మకులై
అసూయన్ నన్ను ద్వేషింతు రాత్మాన్యదేహసంస్థితున్
                                                                          (16-18)

     చూశారా, భగవాన్ శ్రీకృష్ణుడు చిన్నపిల్లాడు కూడా గుర్తుపట్టగలిగేటట్టు ఎంత వివరంగా చెప్పాడో!వీరి లక్షణాలనే వాల్మీకి రావణుడిలోనూ వ్యాసుడు దుర్యోధనుడిలోనూ ప్రతి లక్షణానికీ ఉదాహరణలుగా నిలిచే సన్నివేశాల్ని సాక్ష్యాలుగా చూపించి మరీ నిరూపించారు.రామాయణ భారతాలు కేవలం కల్పిత కధలు కావు, వీటిల్లో లేనిది ఎక్కడా లేదు అని గొప్పగా చెప్పుకోదగిన సాహితీ విజ్ఞాన సర్వస్వాలు - ప్రతి కాలంలోనూ సమాజంలో వ్యక్తులుగా కనబడుతూ ఉండేటంతటి సజీవమైన పాత్రచిత్రణతో కూడిన విశ్లేషణాత్మక చరిత్రలు!

     ఉద్యోగపర్వంలో సంజయుడు ధృతరాష్ట్రునితో "మీకు పితృపైతావహంగా సంక్రమించినవి కురు జాంగల జనపదాలు మాత్రమే.ఈనాడు మీరు దేనినైతే మీ సొంతముల్లెగా భావించి పాండవులకు సస్సేమిరా ఇవ్వం అని అంటున్నారో ఈ సామ్రాజ్యమంతా పాండురాజూ ఆయన పుత్రుల పరాక్రమం వల్ల పెరిగిందే" అని చెప్తాడు - వినికూడా విననట్టే వూరుకున్నాడు గుడ్డిరాజు!ఎంతసేపూ ఇతర్లు తనని తప్పు పట్టినప్పుడల్లా నా కొడుకు నా మాట వినట్లేదని మొత్తుకుంటాడే తప్ప నువ్వు రాజువి కావడానికి ఏం చేసినా నాకు కించిత్తు కూడా అభ్యంతరం లేదని చెప్పి కొడుకుని అచ్చోసి వదిలింది తనే కదా!ఒకప్పటి పరాక్రమం ఇప్పటికీ ఉండి కూడా అయిదూళ్లడిగి దేబిరించింది అంతటి విస్తారమైన సామ్రాజ్యాన్ని మళ్ళీ సాధించలేక కాదు,దుర్యోధనుడు ఇవ్వడని తెలిసే అడిగాడు ధర్మరాజు - ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసమే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది, అందుకే తిక్కనగారు ధర్మరాజుని మెత్తనిపులి అని వర్ణించాడు.అజ్ఞానం వల్ల,దంభం వల్ల,దురభిమానం వల్ల  కళ్ళు మసకలు గమ్మి దుర్యోధనుడికి అది తెలియక కుక్కచావు చచ్చాడు.తనకు లేని పరాక్రమాన్ని ఊహించుకుని గొప్పలు చెప్పుకుని అవసరం వచ్చినప్పుడు తమ గొప్పలే తమకు తిప్పలు తెస్తే అసురసంపత్ప్రభూతులు పడే అవస్థలకి కర్ణదుర్యోధనులు నిలువెత్తు సాక్ష్యం!

     ఒకే ఒక సుదర్శన ప్రయోగంతో అందర్నీ సంహరించగలిగిన కృష్ణుడు రాయబారంలో అమ్మా బాబూ అని బతిమిలాడుతుంటే అదంతా పాండవులు తననీ కర్ణుణ్ణీ చూసి జడుసుకుని చేసిన దేబిరింపులనుకుని సూదిమొన మోపినంత భూమికూడా ఇవ్వనని ఘీంకరించిన వీరాధివీరుడు యుద్ధం మొదలయ్యాక "బాబ్బాబూ,ఇంకొంచెం గట్టిగా యుద్ధం చేస్తే నీ సొమ్మేం పోయింది?నిన్ను చూసుకునే గదా యుద్ధానికి దిగాను!నా మానమర్యాదలు నీ చేతుల్లో ఉన్నాయి" అని కాళ్ళూగడ్దాలు పట్టుకుని బతిమిలాడుకుంటూ వాళ్లతో చివాట్లు తింటూ నరకం అనుభవించాడు - ఆప్తమిత్రుడు కూడా చేసిన పాపం వూరికే పోతుందా అని విసుక్కున్నాడు!అంతటి ప్రాణస్నేహితుడు చచ్చాడన్న దుఃఖం కొంచెంకూడా లేకుండా తన ప్రాణం రక్షించుకోవటం కోసం గద భుజానేసుకుని చీకటి మాటున దొంగలా యుద్ధభూమి నుంచి పలాయనం చిత్తగించాడు - వీడు మానధనుడు?చచ్చే ముందర తన తప్పుల్ని ఎత్తి చూపించిన శ్రీకృష్ణుడితో " నువ్వు చెప్పినట్టు నీతిగా బతికిన పాండవులు ఏమి సాధించారు?యవ్వనమంతా కారడవుల్లో కందమూలాలు తింటూ గడిపారు!మరి, నేను?శత్రువులని అవహేళన చెయ్యడం అనే రాజోచితమైన ఆనందంతో వైభవంగా బతికాను.వాళ్ళూ అధర్మయుద్ధమే చేశారుగా!ఇప్పుడు నా వరకు నేను ధర్మంగా పోరాడి వీరస్వర్గాన్ని పొందుతున్నాను, నాకు కొదవేంటి?" అనేశాడు.బతికినంతకాలం నా వొళ్ళు పట్టుపరుపుల మీద పడుకుంటే చాలు,అది పరధనం అయినా ఫర్లేదు,అంతా నేనే తినాలి,పక్కోడికి సూదిమొనంత కూడా ఇవ్వను అనే మొండితనం ఇవ్వాళ కూడా కొందరిలో కనబడుతున్నది - వాళ్ళ అంతం కూడా రావణ దురోధనుల అంతాన్నే తలపిస్తున్నది.ఆర్యులు-ద్రవిడులు అంటూ ఈ దేశప్రజల్ని రెండుగా చీలుస్తూ అబద్ధాలు చెప్పినవాళ్ళలోనూ, రామాయణాన్ని విషవృక్షంతో పోల్చినవాళ్ళలోనూ,వాలీ కర్ణుడూ నా ఆభిమాన హీరోలు అని గొప్పగా చెప్పుకుంటున్నవాళ్లలోనూ, పక్కోడి పెళ్లాన్ని ఎత్తుకెళ్ళినవాణ్ణీ పక్కోడి సొమ్ముని కబళించినవాణ్ణీ పట్టుకుని వాళ్ళు మా మూలవాసీల ఆదిమూర్తులు అంటున్నవాళ్లలోనూ దంభం,దర్పం,దురభిమానం,అజ్ఞానం కనబడుతూనే ఉన్నాయి కదా!వాళ్ళ అబద్ధాలు బయటపడినప్పుడు తోకలు ముడుచుకుని జారుకోవటంలోనూ అచ్చం దుర్యోధనుడిలాగే ప్రవర్తిస్తున్నారు కదూ!

     ఈశ్వరుడి సృష్టిలోని అసలైన ఇరకాటం ఏమిటంటే, అమర సంపత్ ప్రభూతులు ఎంత గట్టిగా ప్రయత్నించినా ఈ అసుర సంపత్ ప్రభూతులు పూర్తిగా నశించిపోవటం ఎప్పటికీ సాధ్యపడదు. కాలం కలిసిరానప్పుడు తాత్కాలికంగా సద్దుమణిగి అమరసంపత్ప్రభూతులు కాస్త తమస్సులోకి జారుకోగానే మళ్ళీ హద్దుమీరుతూ ఉంటారు - నాలాంటి ధీరులు వీరిని వినోదంగా తీసుకుంటే మీలాంటి భీరులు వీరిని ప్రమాదంగా పరిగణించి భయపడతారు,అంతే!ఏ ఒక్క దృక్పధమూ పూర్తిగా నశించని స్థితిలో వీరిరువురూ మార్పుకోసం తాము ఎంచుకున్న మార్గమే సరైనదని భావిస్తూ దానినే అందరూ పాటిస్తే చాలు అంతటా శాంతి ఏర్పడిపోతుందని భ్రమిస్తూ ఉంటారు.అజ్ఞానంతో అబద్ధాల్ని సబద్ధాలని నమ్మడం వల్ల అసుర సంపత్ ప్రభూతులకు సమకూడిన బలం వాపులాంటిదే.అయినా,అమర సంపత్ ప్రభూతులలోని క్షమాగుణమే తొలిదశలో వారికి ఉత్సాహాన్ని ఇస్తుంది.కాలం గడిచేకొద్దీ అశాంతి అధికమై అమర సంపత్ ప్రభూతులలో మొదట రజోగుణం పెరుగుతుంది.దీనివల్ల అశాంతికి కారణమైన సమస్యకు పరిష్కారం కనుగొనడానికి తొందర పుడుతుంది.దానిమూలంగా జ్ఞానం విస్తృతమై అసురసంపత్ప్రభూతులపై విజయం సాధించి క్షయంలేనివృద్ధిని సాధించుతారు.ఏ కాలంలో ఏ ప్రాంతంలో ఈ అమరాసురసంఘర్షణ జరిగినా అటువైపునా ఇటువైపునా దేహధారులు కొందరు నశించినా యుద్ధం ముగిశాక లాభనష్టాలు బేరీజు వేస్తే జ్ఞానరాశిలో మాత్రం వృద్ధియే కనబడుతూ ఉండటం ఇక్కడ మనం గమనించాల్సిన గతితార్కికచారిత్రకభౌతికసత్యం!

     ఇంతటితో ఈ క్షీరసాగరమధనాన్ని ఆపి మళ్ళీ రహదారి మీదకి వెళ్ళి విశ్వసృష్టియానంలో మనం ఎక్కడ ఉన్నామా అని చూస్తే అహంకారం ప్రవృద్ధం కావడం వల్ల మానవులు సత్యయుగం నుండి క్రమేణా పతనమై కలియుగాన్ని చేరుకుని కూడా అమరసంపత్ప్రభూతుల కార్యాచరణతో మళ్ళీ కృతయుగంలోకి ప్రవేశిస్తారని అర్ధం అవుతుంది - మజిలీలు అని చెప్పినంత మాత్రాన నేను మీ టైం వేస్ట్ చెయ్యడం లేదండోయ్!ఈ నాలుగు యుగాల పరంపర గడుస్తూ విధాతకు శతమానం పూర్తి కాగానే మనం సంచరిస్తున్న ఈ విశ్వం ఇక పూర్తిగా అంతం అయిపోతుంది - వ్యక్తంలోని ద్రవ్యం సమస్తం మళ్ళీ అవ్యక్తంలోకి జారుకుని శక్తియే మిగులుతుంది!ఆది నర్తన నాయకమణి కరకంపిత ఢమరుధ్వని  అవ్యక్తంలో తొలి ప్రకంపన సృష్టించిన క్షణం నుండి ఎన్నెన్నో విశ్వాలు ఇలా పుట్టుతూ గిట్టుతూ ఉంటాయి.ఎప్పుడు కుడిచేతిలోని కదలిక ఆగుతుందో అప్పుడు ఎడమచేతిలోని జ్వాల చెలరేగుతుంది - పెరిగి పెరిగి అనంతకోటి విశ్వాలతో సహా మాయను కూడా మిగలనివ్వకుండా దహించివేసి భస్మరాశిగా మారుస్తుంది.అంతటితో జలమో జాలమో తెలియని సాగర తరంగాల పైన డోలనావర్తన చలనాలు చేస్తున్న విశ్వలోలకాల ఉయ్యాల సయ్యాటల చరిత్ర సమాప్తం.ఇది ఆది నర్తన నాయక మణీ శ్రీకృష్ణ పరంధాముడూ చెరొకవైపునా నిలబడి ఒకరితో ఒకరు పోటీపడుతూ నిరంతరం కొనసాగిస్తున్న నృత్యగాన వినోదకేళి - వందే జగతః పితరౌ!

     ఒకనాడు పౌరాణిక పారిషదుల ప్రసంగాల వల్ల సామాన్య జానపదులకు కూడా ఇలాంటి విశేషాలు తెలుస్తూ ఉండేవి.అమాయకమైన తమ సందేహాలతో వారు కూడా పండితులలో జ్ఞానం వృద్ధి పొందటానికి దోహదం చేస్తూ ఉండేవారు.ప్రాచీన భారతీయ విజ్ఞానులు గురుశిష్యపరంపరతో సహస్రాబ్దాల పాటు సాగించిన కృషివల్ల పోగుపడిన జ్ఞానం అనంతమైనది - ఒక మనిషి ఒక జీవితకాలంలో పూర్తిగా అర్ధం చేసుకోగలగటం ఊహలో కూడా సాధ్యం కాదు.జ్ఞానం ఎంత విస్తృతంగా ఆర్జించాం అనేదానికన్న ఎంత నిష్ఠగా ఆచరణలోకి అనువదించుకున్నాం అనేదానిమీద తన శక్తిని చూపిస్తుందనేది పరమ వాస్తవికమైన సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...