Wednesday, 28 October 2015

కులకర్ణి మీద శివసేన రంగు పులమటం నిజంగా తప్పేనా?పాకిస్తాను అంత అమాయకమైన దేశమా!అయితే భారత్ విషప్రచారం చేస్తున్నదా?!


     పాకిస్తానం ఒక దుర్మార్గమైన దేశం,ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని వారి పట్ల యెన్ని చీకటి వార్తల్ని ప్రపంచ మీడియా వ్యాపింపజేసినా ఒక కాంతిరేఖ విరుస్తున్నది అక్కడి నుంచి - ప్రపంచంలోని పెట్టుబడుల మదుపుదార్ల కందరికీ ఇప్పుడు పాకిస్తాను బంగారు గుడ్లు పెట్టే బాతు!



     కలయా, నిజమా, వైష్ణవ మాయా అని అనుకోకండి!నిజమే, ఇప్పుడు నూట అరవై మిలియన్ల జనాభాలో ముప్పై మిలియన్ల మంది 10,000 - 15,000 డాలర్ల సంపాదనతో ఉన్నారు.వస్తుసేవల మార్కెట్ యేర్పడితే కొనుగోలుదారులుగా వీరు మంచి లాభాలని తెచ్చిపెడతారు.యూరోపియన్ మార్కెట్లు మొత్తం యెదగడానికి అవకాశం లేక ముసలివైపోయినాయి,ఈ కుర్ర మార్కెట్ ప్రపంచంలోని పెట్టుబడి దారులందర్నీ విపరీతంగా ఊరిస్తున్నది.ఇంకా ఆర్ధికపరమైన స్థిరత్వం,పేదరిక నిర్మూలన,ఉపాధి కల్పన వంటి విషయాల్లో అధ్భుతమైఅన యెదుగుదల కనపడుతున్నది.2001లో 1.8% ఉన్న ఆర్ధీక పరమైన యెదుగుదల గత నాలు సంవత్సరాలకి 7% అయింది.పాకిస్తాన్ ఆర్ధికానికి అతి ముఖ్యమైన మాన్యుఫాక్చరింగ్,ఎగుమతుల రంగాలో ఈ అయీదేళ్ళలో రెట్టింపు వృధ్ధి కనపడుతున్నది.భౌగోళికంగా పాకిస్తాన్ ఇండియాకీ ఇరాన్,ఆఫ్ఘనిస్తాన్ లాంటి మధ్యా అసియా దేశాలకి నడుమన ఇరుక్కుని ఉంది కనుక యెటు నుంచి యెటు వెళ్ళాలన్నా ఈ దేశపు పోర్టుని తగలాల్సిందే,ఈ దేశాన్ని దాటాల్సిందే!

     పాకిస్తాన్ అనే పదానికి అర్ధం "పవిత్ర భూమి" అని!దక్షిణాసియాలోకల్లా అత్యంత ప్రాచీన మానవ నాగరికతలు ఉధ్భవించిన భూమి ఇది.పంజాబు లోని సోన్ లోయలో పాత రాతియుగానికి చెందిన మానవ సమాజపు ఆనవాళ్ళు ఉన్నాయి.వైదిక సంస్కృతికి సంబంధించిన హరప్పా,మొహంజదారో నగరాలు ఈ దేశంలోనే ఉన్నాయి.క్రీ.పూఒ 2500 నుంచి క్రీ,పూ 500 వరకు వైదిక సంస్కృతిలో ఉండి క్రీ,పూ 519 నాటికి పర్షియన్ల అధిపత్యం కిందకి వెళ్ళీంది.క్రీ,పూ 185 వరకూ మౌర్యసామ్రాజ్యంలో భాగంగా ఉండి బాక్ట్రియా పరిపాలకుదైన డెమెట్రియస్ అనే గ్రీకు ప్రభువు ఆధీనం లోకి వెళ్ళీంది.క్రీ,పూ 165 నుంచి క్రీ.పూ 150 మధ్యన మినాందర్ కాలంలో మంచి వైభవాన్ని చూసింది.ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తక్షశిల విశ్వవిద్యాలయం ఈ దేశం లోనిదే!క్రీ.శ 6వ శతాబ్దం నుంచి ఇక్కడ మెల్లమెల్ల్లగా ఇస్లాం వ్యాపించటం మొదలైంది.అప్పటి వరకూ బౌధ్ధులుగా,హిందువులుగా ఉన్న ఈ ప్రాంతపు ప్రజల్ని ఇస్లాము వైపుకి నడిపించటంలో సూఫీ వేదాంతులు ప్రముఖ పాత్ర వహించారు.క్రీ.శ 711లో ముహమ్మద్ బిన్ క్వాసిం సింధ్ నుంచి ముల్తాన వరకు గల ప్రాంతాన్ని ఆక్రమించుకున్న నాడు మొదటిసారిగా పాకిస్తాను ఆవిర్భావం జరిగిందని పాకిస్తాన్ ప్రభుత్వపు అధికారిక చరిత్రలో ఉన్నది.క్రీ.శ 975 నుంచి క్రీ.శ 1187 వరకు గజనీ సామ్రాజయంలో,క్రీ.శ 1206 నుంచి క్రీ.శ 15266 వరకు ఘోరీల సామ్రాజ్యంలో,తర్వా త లోడీ సామ్రాజ్యంలో భాగమై క్రీ.శ 1526 నుంచి క్రీ.శ 1857 వరకు మొఘల్ సామ్రాజ్యంలో భాగమై ఉంది.క్రీ.శ 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటు వైఫల్యం అనంతరం బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ద్వారా ఇంగ్లాడు రాణి అధీనంలోకి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం పనిగట్టుకుని చేసిన విభజించి పాలించటం అనే వ్యూహానికి గురయి అప్పటివరకూ కలిసిమెలిసి బతుకుతున్న హిందువులు,ముస్లిముల మధ్యన విభేదాలు క్రమక్రమంగా పెరిగి ముస్లిముల ప్రయోజనాల్ని కాపాడటానికి క్రీ.శ 1901లో ద్విజాతి సిధ్ధాంతంతో పుట్టిన అఖిల భారత ముస్లిం లీగ్ క్రీ.శ 1930 కల్లా మరింత బలోపేతమై 1940లో పాకిస్తాన్ నిర్మాత అయిన మహమ్మదాలీ జిన్నా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మార్చి 24 నాడు పాకిస్తాన్ ప్రతిపాదనగా పిలువబదే లాహోరు ప్రతిపాదన చేసింది!ఆ తరవాత రెండవ ప్రపంచ యుధ్ధానంతరం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని సంకల్పించుకోవడంతో క్రీ.శ 1947  ఆగస్టు 14న పాకిస్తాన్ ఒక సార్వభౌమాధికారం గలిగిన స్వతంత్ర దేశంగా అవతరించింది!

     1947లో దేశానికి స్వతంత్రం వచ్చాక పాకిస్తాను ఆవిర్భావానికి కారణమైన ముహమ్మద్ అలి జిన్నాయే తొలి గవర్నర్ జనరలుగా,తొలి దేశాధ్యక్షుడిగా,పార్లమెంటుకి తొలి స్పీకరుగా వ్యవహరించారు.లియాకత్ ఆలి ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.అయితే 1956లో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా ఇస్కందర్ అలి మిర్జా అధికారికంగా తొలి దేశాధ్యక్షుడిగా గుర్తించబడుతున్నారు.ఇతని పాలనాకాలం కేవలం రెండేళ్ళు మాత్రమే!ఈ కాలమంతా అంతర్గతంగా రాజకీయపరమైన అస్థిరత్వాలు,అంతర్జాతీయ సంబంధాలలో ఒడిదుడుకులతో గడిచింది.1958లో దేశంలో అశాంతి పెచ్చరిల్లి పోవడంతో మార్షల్ లా ప్రవేశపెట్టి రాజ్యాంగాన్నీ,పార్లమెంటుతో సహా అన్ని రాజ్యాంగసంస్థల్నీ రద్దు చేసి తొలిసారి పాకిస్తాను రాజకీయాల్లోకి సైనిక పాలన రావటానికి కారకుడయ్యాడు.ఇతనిచే చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్ పదవిలో నియమితుదైన జనరల్ అయూబ్ ఖాన్ కేవలం 20 రోజులో ఇతన్ని పదవీచ్యుతుణ్ణి చేసి ప్రవాసానికి పంపించాడు.1962లో అధ్యక్ష తరహా పాలనని వ్యవస్థీకరించిన తర్వాత 1965లో భారతదేశంతో రెందవ యుధ్ధం జరిగేవరకు పాకిస్తాను అనూహ్యమైన అభివృధ్ధిని సాధించి యుద్ధం తర్వాత పరిస్థితి దిగజారి ఇతని ప్రాభవం తగ్గుతూ వచ్చి 1967లో యాహ్యా ఖాన్ అధ్యక్షుడయ్యాడు.1970లో తొలిసారి సైనిక పాలన నుంచి ప్రజాస్వామ్యబధ్ధమైన పరిపాలనకు మారడానికి యెన్నికలు జరిగినా తూర్పు పాకిస్తానుకు చెందిన ఆవామీ లీగ్ గెలవటంతో సైన్యం అధికారాన్ని అప్పగించటానికి నిరాకరించింది.దీనితో ప్రజల నుంచి వచ్చిన నిరసన వెల్లువ బెంగాలి ముక్తి వాహిని అధ్యక్షతన పోరాడి భారత్ సహకారంతో బంగ్లాదేశ్ అవతరించింది.ఈ కాలంలో జరిగిన ప్రాణనష్తం 300,00 నుంచి 3 మిలియన్ల వరకూ ఉండొచ్చుననై అంచనా వేసారు.అక్కడి విమోచనోద్యమాన్ని పశ్చిమ పాకిస్తానులో అంతర్యుధ్ధంగా పరిగణించి అందులో భారత్ ప్రమేయం ఉండటం వల్ల చిన్న చిన్న దాడులతో మొదలై 1971 నాటికి యుధ్ధం తీవ్రరూపం దాల్చింది.ఆ యుధ్ధంలో ఓటమి తర్వాత జుల్ఫికర్ అలి భుట్టో అధికారంలోకి వచ్చి 1972 నుంచి 1977 వరకూ పాకిస్తాను ప్రజానీకం ఒకింత ప్రజాస్వామ్యాన్ని అనుభవించేఅటట్టు చేశాడు.ఈ కాలంలోనే పాకిస్తానులో వామపక్ష భావజాలం తొలినుంచీ నామమాత్రంగా ఉన్న తన పలుకుబడిని యెక్కువగా పంచుకోగలిగింది.1977లో మళ్ళీ వామపక్ష భావజాలం కలిగిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైన్యం రంగంలోకి దిగి 1978 నుంచి మళ్ళీ జియా ఉల్ హక్ అధ్యక్షుడుగా సైనిక పాలన మొదలైంది.ఇతని నేతృత్వంలో 1978 నుంచి 1088 వరకు ఇతను పాటించిన ఆర్ధిక ఇస్లామీకరణ విధానంతో మళ్ళీ అభివృధ్ధి పధంలో పయనించింది.1988లో జియా విమాన ప్రమాదంలో మరణించడంతో బెనజిర్ భుట్టో తొలి మహిళా ప్రధానిగా యెన్నికైన తర్వాత ఒక దశాబ్దం పాటు ఒకరి మీద మరొకరు పైచేయి సాధించాలనే రాజకీయ కుమ్ములాటల వల్ల అభివృధ్ధి వేగం మందగించి అతి త్వరగా భయానక స్థాయికి దిగజారింది.ఈ కాలమంతా తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటానికి భారతదేశంతో ఘర్షణలకి దిగటం,అవినీతి,కుడి-యెడమ భావాల మధ్య సంఘర్షలు తప్ప యే విధమైన ప్రగతి లేని చీకటి రాజ్యం.దీని ఫలితంగా అఖండ ప్రజాదరతో నవాజ్ షరిఫ్ అధ్వర్యంలో 1997లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ ప్రభుత్వం యేర్పడింది.కానీ 1999లో కార్గిల్ యుధ్ధంలో ఓడిపోవడం వల్ల మళ్ళీ పర్వెజ్ ముషారఫ్ రక్తరహితవిప్లవంతో అతన్ని కూలదోసి సైనిక పాలన తీసుకొచ్చాడు.ఇతను పాకిస్తానుని 1999 నుంచి 2001 వరకు చీఫ్ ఎగ్సెక్యూటివ్ హోదాలోనూ,2001 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగానూ పరిపాలించాడు.ఇతని కాలంలో జరిగిన ఆర్ధిక సంస్కరణలు సత్ఫలితాల నివ్వటం వల్ల మరోసారి అభివృధ్ధి వూపందుకుంది.తొలిసారిగా ఇతని కాలంలో నేషనల్ అసెంబ్లీ తన అయిదేళ్ళ పదవీకాలాన్ని పూర్తి చేసుకోగలిగింది!

     కానీ 2008లో సరిగ్గా యెన్నికల సమయంలో బెనజిర్ భుట్టో హత్యకు గురి కావడంతో సానుభూతి పవనాల సాయంతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి యౌసఫ్ రజా గిల్లాని ప్రధానిగా ప్రభుత్వాన్ని యేర్పాటు చేసింది.ఇంపీచ్మెంటు చేస్తామని బెదిరించడంతో ముషారఫ్ రాజీనామా చేసి అసిఫ్ ఆలి జర్దారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.న్యాయవ్యవస్థతో యేర్పడిన కలహాలు పెద్దవై 2012లో గిల్లాని ప్రభుత్వం పడిపోయింది.ముషారఫ్ టెర్రరిజం మీద చేసిన యుధ్ధం వల్ల అంతర్గత అంచనాల ప్రకారమే పాకిస్తాన్ ఆర్ధిక రంగం మీద 67.93 బిలుయన్ డాలర్ల బరువు పడింది.,మూడు మిలియన్ల మంది నిరాశ్రయూలయ్యారు.ఈ పరిణామాలన్నీ కలిసివచ్చి మళ్ళీ 2013లో జరిగిన యెన్నికల్లో నవాజ్ షరిఫ్ పధ్నాలుగేళ్ళ తర్వాత మూడవసారి దేశప్రధానిగా తిరిగి అధికారంలోకి వచ్చాడు.

     ఇంత సుదీర్ఘమైన పాకిస్తాను రాజకీయ చరిత్రలో అధికారంలో యెవరు ఉన్నా తమ అంతర్గత వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటానికి భారత్ మీద విషం కక్కడం లోనూ యే కొంచెం ఆర్ధికం పుంజుకున్నా భారత్ మీద యుధ్ధం చేసి నవ్వులపాలవడం లోనూ ఆ తర్వాత ఆర్ధికంగా దేశాన్ని భ్రష్టు పట్టించడం లోనూ మాత్రం అందరూ ఒక్కలాగే ప్రవర్తిస్తూ వస్తున్నారు!ఇట్లాంటి రాజకీయ వాతావరణంలో కనీసం పునరాలోచన కూడా లేకుండా కొనసాగుతున్న ప్రభుత్వంలో చెప్పుకోదగిన కాలం పాటు భాగస్వామి అయిన కసూరి భారత్ అన్ని సాక్ష్యాధారాలతో ఆ దేశాన్ని టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని డిమాండు చేస్తున్న తరుణంలో ఈ దేశపు నడిబొడ్డున "మా దేశం చాలా అమాయకమైనది,మేము గొప్ప శాంతికాముకులం,మాలో కొందరు ఉద్యోగులు ప్రసంగాలని మార్చటం లాంటివి చెయ్యటం వల్లనే అభాసు పాలవుతున్నాం" అని ఒక పంచరంగుల ముఖచిత్రాన్ని తమ దేశానికి కట్టబెట్టాలని ప్రయత్నిస్తుంటే దాన్ని వ్యతిరేకించటానికి బదులు వ్యతిరేకించిన వాళ్ళని హిందూ మతోన్మాదులుగా ముద్ర వేస్తున్నారు ఈ దేశంలో లౌకికత్వానికీ వసుధైక కుటుంబ భావనకీ అధికారిక పేటెంటును తమకు తామే ఇచ్చేసుకున్న కొందరు బుద్ధిమంతులు - ఇక్కడ మన దేశంలో మన పరువు తీస్తుంటే ఇప్పుడు చూస్తూ వూరుకుని తర్వాతేప్పుడో తీరిగ్గా మనం మరో పుస్తకం రాసి వాళ్ళ దేశం వెళ్ళి మసి పూయించుకుని వస్తే పోతుంది గదా,,ఈ కొంచానికి అంత తీవ్రంగా రియాక్టు కావాలా,పుస్తకం చదవకపోతే చాలుగా లాంటి వాదనలతో అతన్ని ప్రోత్సహించడం అంటే భారత్ పాకిస్తాను మీద చేస్తున్నది అబధ్ధపు ప్రచారం అనిపిస్తుందనే పాటి ఆలోచన కూడా లేదా?మాతృదేశపు పరువుని బద్నాం చేసుకుని పరదేశం కుట్రకి జై కొట్టడం యేమిటి?మీడియా - అది స్వదేశీ అయినా వీదెశీ అయినా సంచలనం కోసం యెంత దుర్మార్గాని కయినా తెగిస్తున్న సంగతి కొన్ని లక్షల సార్లు చూసి కూడా వీరికి జ్ఞానోదయం కావటం లేదా?కార్గిల్ యుధ్ధానికి కారకుడైన నవాజ్ షరీఫ్ వామపక్ష భావజాలం అనుకూలుడే.అంటే పాకిస్తానులో ఉన్న కమ్యునిష్టులు భారత్ మీద యుధ్ధం చేసి గెలవటానికి ప్రధానుల్ని ప్రోత్సహిస్తూ తమ దేశభక్తిని చాటుకుంటున్నారు.భారత్ లోని కమ్యునిష్టులు ఇప్పుడు పాకిస్తానులో ఉన్నది వామపక్ష భావాలు ఉన్నవాడు గాబట్టి ఆ బాదరాయణ సంబంధంతో పాకిస్తానుని చెడ్డపేరు నుంచి తప్పించడం కోసం దేశభక్తిని "high-end-limit","low-end-limit" పేరుతో బూతుమాట కింద దిగజార్చి  శివసేనకి యెటూ మతతత్వపు ముద్ర ఉంది కాబట్టి దొరికిందిరా ఛాన్సని మిగతావాళ్లకి సెక్యులరిజం పోజులు కొడుతూ పాకిస్తాను కుటిలయత్నాన్ని నిరసించినందుకు వీళ్ళు వాళ్లని విమర్శిస్తూ "పాకిస్తాను నిజంగానే అమాయకమైన దేశం,మా దేశమే లుచ్చా,పాకిస్తాను మీద విషప్రచారం చేస్తున్నది" అని తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలన్నంత గొప్ప హృదయవైశాల్యాన్ని చూపిస్తున్నారు,ఇదే ఈ రెండు దేశాల్లో వర్గరహితసమాజాన్ని స్థాపించడానికి వారికి దొరికిన దగ్గరి దారి కాబోలు!

సెక్యులరిజం యెక్కువైతే,కమ్యునిజం ముదిరితే దేశభక్తి కూడా బూతుమాట అవుతుంది కాబోలు!

Monday, 26 October 2015

జపాను ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే బుధ్ధుణ్ణి పొగడాలా?మరి, ఇన్నాళ్ళూ అమెరికా కోసం క్రీస్తుని పొగడ లేదుగా!

     "Veni,Vidi,Vici" - అన్నట్టు మీడియా చేసిన అతి వూహాగానాలతో మోదీ ప్రత్యేకహోదా గురించి ప్రకటన చేస్తాడని నమ్మినవాళ్ళ ఆశల మీద ఇంత మట్టీ ఇన్ని నీళ్ళూ జల్లి పోయాడు ప్రధాని మోదీ!అలాంటి వాళ్ళకి మాత్రం అమరావతి శంకుస్థాపన కార్యక్రమం "ఆపరేషన్ సక్సెస్,బట్ పేషెట్ ఈజ్ డెడ్" అన్నట్టు కనిపించినా ఆ సన్నివేశం ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చెయ్యడం అనే చంద్రబాబు లక్ష్యం మాత్రం నెరవేరింది!మొదటి నుంచీ భాజపా తరపున యెవరూ గట్టి హామీ ఇవ్వకపోయినా శుభకార్యానికి వచ్చేవాడు తీపి కబురు చెప్పడం అనే సంప్రదాయాన్ని పాటించకపోతాడా అనే అమాయకత్వం తప్ప ప్రత్యేకహోదా దక్కుంతుందనేటందుకు యే గట్టి ఆధారమూ లేదు, ఆధారం లేకుండా ఆశ పడితే భంగపాటు తప్పదు కదా!ఆంధ్రులకి ఆశపడి భంగపడటం వారసత్వం అయిపోయినట్టుంది!మన పెద్దలు తమిళుల నుంచి విడిపోయినప్పుడు ఒకే భాష మాట్లాడేవాళ్ళు గాబట్టి సరిగ్గా అప్పుదే నిజాము పరిపాలనకి వ్యతిరేకంగా పోరాడి విముక్తమయిన హైదరాబాదు రాష్ట్రాన్ని కూడా కలిపి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖమైన అభివృధ్ధిని సాధిస్తుందని యెన్నో కలలు కన్నారు - యేమైంది?దశాబ్దం పైన రెండేళ్ళ పాటు ప్రపంచమంతా వినేటట్టు బూతులు తిట్టుకుని విడిపోయారు!రాజకీయాలకి సెంటిమెంట్లు ఉండవు,చరిత్రకి పక్షపాతం ఉండదు,కాలానికి దాక్షిణ్యం ఉండదు - జీర్ణమంగే సుభాషితం!?

     అభివృధ్ధి నంతా ఒకచోట పోగేశాడని చంద్రబాబుని ఒక్కణ్ణే తిట్టి లాభం లేదు,చాలా కాలం క్రితమే కొందరు దార్శనికులు విజయవాడని రెండవ రాజధానిని చెయ్యాలని ప్రతిపాదించినప్పుడు ఆ ప్రాంతం నుంచి హైదరాబాదు వెళ్ళి స్థిరపడిన వారే తమ ప్రాభవం తగ్గుతుందని పడనివ్వలేదు,ఇప్పుడేమయింది - కేసులు పెట్టి మెడ పట్టుకు గెంటీనంత పనిచేస్తే బిక్క చచ్చిపోయి వస్తున్నారు!మొత్తం రాష్ట్రానికి రాజధాని ముఖద్వారం కాబట్టి రాజధానిలో హడావిడి ఉండాల్సిందే,కానీ చేపల పెంపకం కేంద్రాలు కూడా అక్కదే ఉండాలా?ఇప్పుడు విభజన చట్టపు 9,10 షెడ్యూళ్ళలో చేర్చబడి తెలంగాణా ముఖ్యమంత్రి మా రాష్త్రంలో ఉన్నాయి గాబట్టి మావే అంటున్నవి వందల్లో ఉన్నాయి - తాము యెక్కడుంటే ఆన్నీ అక్కడే ఉండాలి,మందబలం కోసం తమ కులం వాళ్ళనే పైకి తీసుకు రావాలి అనుకుంటే మొదట్లో కధ బాగానే నడుస్తుంది, క్లైమాక్సు మాత్రమే ఇట్లా యెదురు తంతుంది!కనీసం తెలంగాణలో పొరుగు జిల్లాలకి కూడా పాకించలేదు అభివృధ్ధిని, యెందుకని?ఆంధ్రోళ్ళని అమ్మనాబూతులూ తిట్టినా శంకుస్థాపన కార్యక్రమలో చప్పట్లు కొట్టించుకున్న కేసీయారూ,ఇంటికెళ్ళి ఆహ్వానపత్రం అందించి కేటీయారుతో అంకుల్ అని పిలిపించుకున్న చంద్రబాబూ ఇద్దరూ ఇద్దరే!అక్కడ కాంగ్రెసు ఉంది గనకనే విభజన ఇంత యేకపక్షంగా జరిగిందని చెప్పడానికి వీలు లేదు,భాజపా చేసినా ఇట్లాగె జరిగి ఉండేది!ప్రజల్లో ఉన్న మనలాంటి తెల్లమొహాలకి అర్ధం కాకపోయినా,పైకి చంద్రబాబు సమన్యాయం అని గోల చేసినా విభజన ఉద్యమం వెనక ఉన్న ఉద్దేశంలోనే సమన్యాయం యెట్టి పరిస్థితిలోనూ కుదరని ఒక పీటముడి ఉంది.నిజంగానే సమన్యాయం పాటించి అన్నీ సమానంగా పంచితే ఇప్పుడు తెలంగాణ కున్న ధీమా తగ్గుతుంది,అప్పుడు వాళ్ళు యేమంటారో తెలుసా?ఇన్నేళ్ళుగా మీ మూలంగా వెనకబడి సొంతంగా నిలదొక్కుకోవటానికి విడిపోతుంటే ఇప్పుడూ ఖాళీచిప్ప ఇస్తున్నారు అని కొత్త పల్లవి లంకించుకునేవాళ్ళు!కాబట్టి యెప్పుడు యెవడు విదగొట్టినా విభజన భారం మొయ్యాల్సింది మాతృరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని పై స్థాయిలో ఉన్నవాళ్ళలో ప్రతి ఒక్కడికీ ముందే తెలుసు,మనకి ఇప్పుదు తెలుస్తున్నది,అది మన అజ్ఞానం+అమాయకత్వం!

     ఆంధ్రోళ్ళ తప్పేమిటంటే మూలాన్ని మర్చిపోయి తొందరగా పరాయి సంస్కృతిని కావిలించుకోవటం.ఒక తమిళుడు ప్రపంచంలో యే మూలకి వెళ్ళినా తన భాషని మర్చిపోడు,తన సంస్కృతిని కూడా తనతోనే మోసుకెళ్తాడు.కానీ తెలుగువాడు తెలుగుని తొందరగా మర్చిపోగలడు,తెలుగుదనాన్ని కూడా వొదులుకోగలడు!తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం తెలుగుని అధికార భాషగా మళ్ళీ రెండు ముక్కలయ్యేవరకూ చేసుకోలేకపోయింది - సిగ్గుచేటు!ఇంకొకటి, యెక్కడ ఉంటే అక్కడ తను అక్కడివాళ్ళకి సృష్టించి ఇచ్చిన సంపద వల్ల తనకు కృతజ్ఞతాపూర్వకమైన గౌరవాభిమానాలు వచ్చి పడతాయనే వెర్రి - అప్పుడు తమిల తంబీ ఇప్పుడు తెలంగాణ తమ్ముడూ రౌడీతనం దొంగతనం అంటగట్టి తరిమేశాక ఇప్పటికయినా బుధ్ధి వచ్చిందో లేదో రేపు రాయలసీమ వాళ్ళు చెప్పాలి!ఇలాంటి వెర్రులన్నీ ఒక స్థాయిలో మనల్ని చూసి మనం నవ్వుకోవడానికి పనికొస్తాయి కాబట్టి ప్రమాదకరం కాకపోవచ్చు గానీ వీటన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైన వెర్రి - నాయకుల్ని అతిగా నమ్మి మోసపోవడం మాత్రం తారాస్థాయిలోనే ఉంది!కొన్ని దశాబ్దాల పాటూ కేంద్రంలో ఉన్నవాళ్ళకి మనం ఆంధ్రాని అభివృధ్ధి చేసినా చెయ్యకపోయినా వాళ్ళు చచ్చినట్టు మనకే వోటు వేస్తారు అనే ధీమాని ఇచ్చాం!ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాల్లోని తెలుగువాళ్ళకి ఆ  వెర్రి వదలటం లేదు - ఇప్పుడప్పుడే వొదిలే సూచనలు కూడా కనపడటం లేదు!ఇద్దరు ముఖ్యమంత్రులకీ సమస్యలతో కూడిన విభజనయే లాభసాటి!నాలుగేళ్ళ తర్వాత చెప్పినవి చెయ్యకపోతే మిమ్మల్ని ఓట్లడగను అంటున్న కేసీఆర్ అప్పుడు నాలిక మడతేసి "ఆంధ్రోళ్ళు మనిష్త ప్రకారం విడిపోనియ్యలే, కొర్రిలు పెట్టిర్రు, బద్నాం చేసిర్రు" అనడానికి సమస్యలతో కూడిన తెలంగాణ పనికొస్తుంది గానీ అన్నీ అమర్చిపెట్టి ఇస్తే కుదరదు గదా!బాబుకి విభజన సరిగా జరగలేదు అనే పాట దొరికింది గదా!

     చంద్రబాబుకి 2019లో మళ్ళీ తెదెపాని అధికారంలోకి తీసుకురావడానికి పనికొచ్చేవి మూడు - రాజధాని నిర్మాణం,రాయలసీమ నుంచి విభజన రాగం రానివ్వకుండా పట్టి ఉంచటం,పోలవరం పూర్తి చేసి చూపించటం!వీటన్నింటిలో అద్వితీయ రాజధాని నిర్మాణాన్ని ప్రపంచ స్థాయిలో యెత్తుకోవడం లోనే చంద్రబాబు చాణక్యం బయటపడుతుంది!2018లోపు రంగురంగుల ముఖచిత్రాల్ని చూపించి కుదిరినంతవరకు పూర్తి చేసి మిగిలింది పూర్తి చెయ్యాలంటే మీరు మళ్ళీ మాకే అధికారం ఇవ్వాలి అని ప్రజల ముందు బేరం పెడతాడు!ప్రజల కది చౌకబేరం మాత్రం కాదు, చాలా ఖరీదయిన బేరం!యెందుకంటే పోలవరం పూర్తి చెయ్యలేకపోయినా,అప్పటికి పరిస్థితులు తిరగబడి రాజధాని యెగదీస్తే గోహత్యా దిగదీస్తే బ్రహ్మహత్యా అన్న చందంగా తయారయినా సరే ప్రజలు చచ్చినట్టు బాబుకే పట్టం కట్టాలి, యేమి తెలివి?అందుకే ప్రతిపక్ష నాయకుడు రాజధాని గురించి అంత గింజుకుంటున్న్నది,అంతగా దిగజారిపోయి అడ్డం పడుతున్నది - కానీ చంద్రబాబు చాణక్యం ముందు నిలవలేకపోతున్నాడు, పాపం!రాయలసీమ నాయకులు కొందరు వెళ్ళవద్దని విజ్ఞప్తులు చేసినా రాయలసీమ జనం కూడా పెద్ద సంఖ్యలోనే వచ్చారు.అసలు "మన మట్టి - మన నీరు" కార్యక్రమాన్ని హైదరాబాదు లాగ ఒక ప్రాంతానికి చెందినది అనుకోకుండా ఉండటానికీ,అద్భుతమైన రాజధానిని రేపెప్పుడయినా తిక్కరేగి విడిపోవాలనుకున్నవాళ్ళకి ఇంత గొప్ప రాజధానిని వొదులుకోవాలిసొస్తుంది గదా అనిపించటానికీ యేర్పాటు చేశాడు,ఔరా ఒక్క ప్లానుకి మూడు పిట్టలు?!

     కార్యక్రమం మాత్రం నభూతోనభవిష్యతి అన్నట్టుగానే జరిగింది!అమరావతి అదిరింది!!దేశవిదేశాల నుంచి వచ్చిన అంతమంది ప్రముఖుల్ని సైనికకవాతు చేయించినంత క్రమశిక్షణగా నడిపించటం మరొకడెవడూ చెయ్యలేడు,ఇంతకాలం నిజంగా అంత అద్భుతమైన రాజధాని కట్టడం సాధ్యమా అని పీకులాడుతున్న వాళ్ళు గూడా చంద్రబాబు కట్టి చూపించగలడు అని నమ్ముతున్నారు!అక్కడ జరిగేది హిదూ పధ్ధతిలో జరిగే క్రతువు కాబట్టి మాట రాకుండా పవిత్రజలమృత్తికల్ని సేకరించడంలో అన్ని మతాల వారి సంప్రదాయాల్ని గౌరవించడం యెవ్వరూ వంక పెట్టకుండా చేసింది.కానీ తర్వాత దలు యెలా కడతారు అనే ప్రశ్న వస్తే మాత్రం నమ్మడానికి ఠికానా లేదు.మంత్రివర్గంలో నలుగురు ఉండి కూడా తను కేంద్రం నుంచి ప్రత్యేకహోదా సాధించలేకపోయినందుకు జనమే ఇటుకల్తో పాటు డబ్బులూ సిమెంటు కూడా ఇవ్వాలి గాబోలు?ఇప్పటికే రాజధాని హైప్ వల్ల ఈ ప్రాంతంలో భూముల రేట్లు పెరిగిపోయినాయి,రేపు అధికారులు భాగ్యనగరం నుంచి తరలివస్తే ఉండటానికి అద్దె ఇళ్ళు కావాలంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి!రైతుల దగ్గిర నుంచి తీసుకున్న భూములకి నమ్మకమే తప్ప గ్యారెంటీ లేదు!ఖర్మకాలి జగన్ వస్తే ఈ రైతులంతా గొల్లు మనాల్సిందే,అతను  భూములు తిరిగి ఇవ్వాలంటే రైతులు తిన్నది కక్కాలి!ప్లాను వేసింది సింగపూరు ప్రభుత్వం,ఇంఫ్రాస్ట్రక్చరు సమకూర్చేది జపాను - మనవాళ్ళు కేవలం  కాంట్రాక్టర్లుగానూ కూలీలుగానూ ఉంటారు.కాంట్రాక్టులు తెదెపా వాళ్లకి దక్కుతాయి,మిగతా జనం మాత్రం ఇటుకలు కొని ఇవ్వాలి,తట్టలు మొయ్యాలి.రోడ్డు వేసిన కంట్రాక్తరుకి టోల్ గేట్లకి పర్మిట్ ఇచ్చినట్టు అంతా పూర్తయ్యాక సింగపూరు వాళ్ళకీ జపాను వాళ్ళకీ లోపాయకారీగా లాభం ముట్టజెప్పాలి?!అవును,ఇప్పటికే కొందరికి ఆ అనుమానాలు వచ్చేశాయి,వాటికి ఆధారాలూ ఉన్నాయి!ఎప్పటికప్పుడు సీనులోనే దైలాగులు తెలిసే కొత్త సినిమా తీసే పధ్ధతిలో యాక్టర్లకి తర్వాతి సీన్ల గురించి అన్నీ సందేహాలే!డైరెట్రు గారు చిద్విలాసంగా ఉన్నాడు గనక ప్రస్తుతానికి ఓకే,కానీ వారి మొహం యేమాత్రం కళ తప్పినా ఢాం ఢమేల్ తుస్స్!

     మొదటి నుంచీ అమరావతి విషయాలను వదలకుండా గమనిస్తున్న నాకు మరో సందేహం క్రమక్రమంగా పెరిగి పెద్దదవుతున్నది.మొదట్లో ఆంధ్ర శాతవాహనుల రాజధాని అనే ప్రాచీన వారసత్వపు వాదనతో ఊదర గొట్టినవాళ్ళు హఠాత్తుగా బుధ్ధుడూ,నాగార్జునుడూ,బౌధ్ధమత ప్రస్తి ప్రాముఖ్యతని యెత్తుకోవడానికి కారణ మేమిటి?శాతవాహనులు యే విధమయిన దుర్మార్గాలూ నమోదు కాని ఆదర్శవంతమయిన పరిపాలన అందించి అన్నిమతాల్నీ గౌరవంగా చూడటం వల్ల హిందూ మతానికి మాత్రమే పరిమితమయిన వాళ్ళ అనే ముద్ర లేదు!తొలిదశ లోని వంశమూలం వారి వంశకర్తలు అతి సామాన్యులని తెలియజేయడం వల్ల వాళ్లని చూపిస్తే సామాన్యులు కూడా సామ్రాజ్యాలని స్థాపించగలరనే స్పూర్తిదాయకత ఉంటుంది కదా!మరి వాళ్లని వదిలేసి బౌధ్ధానికి అనుకూలంగా జరగడం దేనికి?ఇంతకీ ఇలా జరిపిన వారికి బౌధ్ధం గురించి యేమయినా తెలుసా?ఇక్కడ బుధ్ధుడి బొమ్మ ఉందని జపాను వాడు మరిన్ని పెట్టుబడులు పెడతాడని అనుకుంటే అది దేబిరింపు!టూరిష్టుల్ని ఆకర్షించడానికి పనికొస్తాయి గానీ వ్యాపారి యెవ్వడూ ఇలాంటివాటికి లొంగడు - అలా అయితే నిన్న జరిగిన క్రతువుకి వచ్చి ముఖం చిట్లించి ఉండాల్సింది గదా!అయినా జపానుతో వ్యాపారం చెయ్యాలంటే జపాను కిష్టం గాబట్టి బుధ్ధుణ్ణి చూపిస్తున్నారు,అమెరికా వాడి కిష్టం గాబట్టి క్రీస్తు బొమ్మని చూపించలేదేమిటి ఇన్నాళ్ళూ?ఉదయం పదింటికి జపాను క్లెయింటుని కలవడానికి బౌధ్ధాన్ని కావిలించుకుని మధ్యాన్నం రెండింటికి అమెరికా క్లెయింటుని కలవడానికి క్రైస్తవాన్ని కావిలించుకుని సాయంకాలం అయిదింటికి అరబ్బు క్లెయింటుని కలవడానికి ఇస్లాముని కావిలించుకుని హడావిడి చెయ్యటం అవసరమా!

     ఒకప్పుడు మోహనదాసు మాటల్లో మతాన్నీ రాజకీయాన్నీ వేరు చెయ్యాలంటూ  హడావిడి చేసి చేతల్లో మాత్రం వాటిని కలపగూడని పధ్ధతిలో కలిపాడు, యేమైంది?యే మహాత్ముడైతే హిందువుల్నీ ముస్లిముల్నీ అన్నదమ్ముల్లా కలిపి ఉంచాలని పాటుపడ్డాడని చెప్తున్నారో ఆ జాతిపీత చేసిన పనుల వల్లనే ఇద్దరూ రెండు జాతులుగా చీలిపోయారు.ఆశ్చర్యంగా ఉందా?నమ్మలేకపోతున్నారా!ఈ వైమానిక సిధ్ధాంతాలతో జరుగుతున్న ఉద్యమాలకి దూరంగా ఉన్న రవీంద్రనాధ్ ఠాగోర్ "ఘరే - బైరే" నవలలో చాలా వాస్తవికంగా గాంధీ మార్గం పేరుతో అప్పుడు జరుగుతున్నవాటిని వార్తాకధనంలా చెప్పి భవిష్యత్తుని కూడా సూచించాడు - సరిగ్గా తర్వాత అలాగే జరిగింది?!"ఇంటా-బయటా" అని తెలుగులో కూడా వచ్చిన ఈ కధ మనకి చెప్పే నిజం ఇది:అప్పట్లో ముస్లిములు దర్జీలుగా మంచి సంపాదనతో ఉండేవాళ్ళు!ఇంగ్లీషు ఆడవాళ్ళకి దగ్గిరయి ఫ్యాషన్లు నేర్చుకుని మన ఆడవాళ్ళకి పరిచయం చెయ్యటంతో ఆదాయం బాగానె ఉండేది.ఆదాయం ఉంటే సంఘంలో గౌరవమూ ఉంటుంది కదా!విదేశీవస్త్రబహిష్కరణ అనేసరికి వాళ్ళ జీవనోపాధికి తీరని నష్టం జరిగింది.దానికి తోదు హిందూ సంస్థల ఆలయ జీర్ణోధ్ధరకి బలవంతంగా చందాలు వసూలు చెయ్యడమనె హడావిడితో వాళ్ళు హిందువుల పట్ల మరింత ద్వేషం పెంచుకుని కాంగ్రెసుకి దూరంగా జరిగి ద్విజాతి సిధ్ధాంతం వైపుకి దగ్గిరయ్యారు!ఆదాయాలు దెబ్బతినకుండా ఉంటే వాళ్ళూ అడగ్గానే ఇచ్చేవాళ్ళేమో,ఈ ఉద్యమాల మూలంగానే బతికి చెడ్డ స్థితిని బోర్డు పెట్టుకోలేక వాళ్ళు విసుక్కుంటే అది ముస్లిము గాబట్టి హిందూ ఆలయానికి ఇవ్వమంటే విసుక్కోవడం వీళ్ళకి తిక్క రేగిందేమో!ఒక గందరగోళపు సిధ్ధాంతం యెంత నిజాయితీగా పాటించినా అది వికటించి  తీరుతుందనీ, ఫలితం కూడా గందరగోళమే అవుతుందనీ చెప్పడానికి గట్టి సాక్ష్యం గాంధీ ప్రతిపాదించిన ప్రతి అహింసాయుతమైన సత్యాగ్రహపు కార్యక్రమమూ హింసకు దారితీసి మధ్యలోనే ఆగిపోవటం!

     బొమ్మ బాగుంది కాబట్టి వూరికే చూపెడితే తప్పు లేదు గానీ అతిగా బౌధ్ధమతాన్ని వ్యాపార ప్రయోజనాలకి ముడిపెడితే మట్టుకు మళ్ళీ మోహనదాసు నిర్వాకం గజ్జె కట్టి ఆడి రక్తచరిత్ర సినిమా చూపిస్తుంది.రేపు ఆ జపాను వాళ్ళకీ చైనా వాళ్ళకీ యేదైనా అడ్డంగా దోచిపెట్టినట్టు బయటపడితే వీళ్ళు కలిపిన మతం లింకు మూలంగా హిందువులూ బౌధ్ధులూ తన్నుకుంటారు!ఇప్పుడున్న హిందూ ముస్లిం కొట్లాటలకి తోడు ఇదొకటి కలుస్తుంది.రాజకీయం దెబ్బ ప్రజలకి యెప్పుడో గానీ తగలదు. యే మతం వాళ్ళయినా యెక్కువ మంది ఒక్కచోట చేరినప్పుదు ఇంకో మతం వాళ్ళు అటుకేసి వచ్చినప్పుడు అనుకోనిది జరగడమో మరొకటో యెప్పుడో తప్ప జరగవు గాబట్టి మతం-రాజకీయం జంట మరీ విపరీతమైన స్థాయిలో భయపెట్టడం లేదు,కానీ వ్యాపారం అలాకాదే!దానితో ప్రజలకి ప్రతిరోజూ అవసరం ఉంటుంది,అక్కడ ఈ రెండూ అతిగా కలిస్తే ఏమాత్రం తేడా వచ్చినా - ఇంతే సంగతులు, చిత్తగించవలెను.

శ్రీ మద్రమారమణ గోవిందో హారి!

Wednesday, 21 October 2015

యేమిరా!ఈ బడుధ్ధాయలు భారతీయవిజ్ఞానశాస్త్రము నపహాస్యము చేయుచుండిరి?

     నేను మన దేశంలో పుట్టి  తమ ఎజెండాకి విరుధ్ధంగా ఉన్నదన్న ఒకే ఒక్క కారణంతో తాము పుట్టి పెరిగిన దేశపు చరిత్రనే మాయం చేసిన దౌర్భాగ్యుల్ని విమర్శిస్తే సూటిగా జవాబు చెప్పలెక ఆ ప్రసంగంలో ప్రస్తావించిన ఒక అప్రస్తుత విషయాన్ని పట్టుకుని భారత్యీవిఘ్ణాణ శాస్త్రాం -- అహ్హహ్హహ్హ అని నవ్విన మేధావుల కోసమే ప్రత్యేకంగా ఈ ప్రసంగం చేస్తున్నాను.వీటిల్లో యే ఒక్కటి కూడా నా స్వకపోలకల్పితం కాదు.ఇక్కడ నేను ప్రస్తావించిన ఆవిష్కరణల ప్రాచీనత కూడా యదార్ధమే!ఇక్కడ ఉన్నట్టే పాకిస్తాను లోనూ కమ్యునిష్టులు/మంచివాళ్ళు ఉన్నారు గాబట్టి పాకిస్తాను వాడు ఇక్కడ గుడ్విల్ కొట్టెయడానికి ప్రయత్నించినా వాడిపట్ల గట్టిగా నిరసన వ్యక్తం చేయ్యకూడదట!నిజమే,వర్గచైతన్యం యెక్కువగా ఉన్న కొద్దిమంది, మెజార్టీ ప్రజల కోరికల్ని పెట్టుబడిదారీ ఆర్ధిక విధానంలోని విషఫలాలుగా లెక్కగట్టి, పెట్టుబడిదారీ ఆర్ధికం తనలోని వైరుధ్యాలకి తనంతట తనే కూలిపోతుందని భయపెట్టి, అలా భయపడిన వారికి తరుణోపాయంగా వర్గరహితసమాజమనే మోక్షమార్గాన్ని చూపించి, దాన్ని వ్యతిరేకించిన వాళ్లకి వర్గశత్రువులని పేరు పెట్టి సాయుధపోరాటం పేరుతో పెద్దమొత్తంలో లేపెయ్యటం నచ్చిన వాళ్ళకి ఈ చిన్నా చితకా రంగులు పులమటం లాంటి బూర్జువా నిరసనలు సిల్లీగా అనిపిస్తాయి కాబోలు?!విదేశీయులు మన చరిత్రని భ్రష్టు పట్టించారంటే అర్ధం చేసుకోవచ్చు - ఈ దేశంలో పుట్టినవాళ్లే అంత ఘాతుకం తెలిసే చేశారు,అయినా పశ్చాత్తాపం లేకుండా చరిత్రని యేకపక్షంగా మార్చేస్తున్నారని వదరుతున్నారు - చీ!ఆ ప్రసంగంలోనూ ఈ ప్రసంగంలోనూ నేను ప్రస్తావించిన ప్రతి విషయానికీ ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి.ఇక్కడే కాదు,నేను యెప్పుడు యెక్కడ యే విషయం గురించి ఇచ్చిన సాక్ష్యాలు అయినా సరే నాకు మాత్రం తెలిసేవి ఇవ్వను - వెతికితే యెవరికయినా దొరికే సాక్ష్యాలనే నేను ఇస్తాను.హిందూ ధర్మం గురించి అయినా సరే అబధ్ధాలు చెప్పి మోసం చెయ్యను - సత్యమే నా విశ్వాసం!


నాదబిందుకళాధరి అంటున్న పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం!

     ఆదిశంకరులు రచించిన గురుపాదుకా స్తోత్రంలో "నాద బిందు కళా ధరి!" అనే విశేషణం ఉంటుంది.అది కేవలం చందస్సులో ఇమిడ్చిన పదపూరణ కాదు.ఆధునిక విజ్ఞాన శాస్త్రం మూలకాలను వేరు చెయ్యటానికి ఉపయోగించే వాటిల్లో మూడు రకాల పరీక్షలు ముఖ్యమైనవి ఉన్నాయి.చలనం ఉన్నచోట ధ్వని తప్పనిసరిగా ఉంటుంది.ఆ ధ్వనికీ చలనానికి కారణమైన శక్తికీ సంబంధం ఉంటుంది.కాబట్టి ధనాత్మకమై కేంద్రకం చుటూ గుణాత్మకమైన అంశాలు తిరుగుతున్నప్పుడు పుట్టే ధ్వనిని అయస్కానత ప్రతిధ్వని రూపంలో గుర్తిస్తారు.దీనిని Nuclear magnetic resonance అంటారు.ఇది నాద స్థితి!మొదట్లో పరమాణు సంఖ్యని మూలకాల వర్గీకరణకి ప్రమాణం చేసుకున్నారు.కానీ ఒకే పరమాణు సంఖ్య ఉన్నప్పటికీ కొన్ని మూలకాల(Isotopes) ధర్మాలు వేరుగా ఉండటం వల్ల ఇప్పటి శాస్త్రజ్ఞులు పరమాణువుల భారాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నారు.ఇది బిందు స్థితి!ఇక ఆయా మూలకాల వాయుస్థితిలో కాంతిని ప్రసరింపజేసి తీసిన పరమాణు వర్ణపటాలు యెంతో ప్రధానమైనవిగా ప్రతి ఒకరికీ తెలిసినదే,ఇది కళా స్థితి!

గుడులన్ని తిరగగలవా నరహరి?స్థలమందు మర్మము తెలియగలవా ఓ నరహరి!

     అమెరికాకు చెందిన McKim Malville అనే ఒక astrophysicist భారతదేశంలోని కొన్ని పుణ్యక్షేత్రాల్ని పండితుల సహాయంతో తిరిగి చూసి వాటి క్షితిజాంశపు విశేషాల్ని గమనించి ఆశ్చర్యపోయాడు.అవన్నీ ఆయా ప్రదేశాల్లో, రెండు విధాలైన భూభ్రమణాల వల్ల సూర్యకాంతి ప్రసరించే భ్రమణాభ్రమణాత్మకమైన ఆవర్తనాయుత కోణాలలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన క్షితిజరేఖాంశాల దగ్గిర నిలబడి భౌమ అయస్కాంత ప్రవాహాల పరంగా కొన్ని ప్రత్యేకమైన లక్షణాల్ని ప్రదర్సిస్తున్నాయి!చిత్రకూటం,రాముడితో అనుసంధానించబడిన ప్రదేశం కదా!రాముడికి శరం చిహ్నం.ఆశ్రమాన్ని GPS తో మ్యాప్ చేస్తే summer solstice నాడు ఉదయాస్తమయాల్ని సూచించే అమ్ము మాదిరిగా ఉంది.వారణాశి లోని 14 ఆదిత్య మందిరాలూ నెలల వారీగా సూర్యగమనపు దశల్నీ అంతర్దశల్నీ సూచిస్తున్నాయి!మొదట అతను ఆయా దేవుళ్ళకి భక్తుడై తీర్ధయాత్రలకి రాలేదు,అతని రోజువారీ జ్ఞానసమీకరణలో యేదో క్లూ దొరికి ఉంటుంది,అనుమానం తీర్చుకోవడానికి వచ్చాడు!మనవాళ్ళు మాత్రం అసలు అనుమానమే లేకుండా "INDIAN SCIENCE IS A JOKE" అనేస్తున్నారు,యెక్కడుంది లోపం?


యెన్ని ఫస్టులో ఈ మొద్దబ్బాయిలకి?!

10,000 సంవత్సరాల క్రితమే గంగా మైదానంలో మొదట వ్యవసాయం చేసింది ఇక్కడి వాళ్ళే!

10,000 సంవత్సరాల క్రితమే కుండల్ని తయారు చేసింది ఇక్కడి వాళ్ళే!

9,000 సంవత్సరాల క్రితమే రాగి వాదకం మొదలుపెట్టింది ఇక్కడి వాళ్ళే!

9,000 సంవత్సరాల క్రితమే పత్తిని నేసింది ఇక్కడి వాళ్ళే!


శ్రీదేవి ముక్కందం పెంచిందెవడ్రా?శుశ్ర్రుతుల వారండీ!రైఠో - గుడ్ బాయ్?! 

     చరక సంహిత,అష్టాంగ హృదయ,శుశ్రుత సంహిత ఈనాటికీ భారతీయ సంప్రదాయిక వైద్యులకి అందుబాటులో ఉన్నాయి.సుశ్రుతుడు చేసిన శస్త్రచికిత్సల కోసం అతను వాడిన పరికరాలను గురించిన వర్ణనల వల్ల అతి సూక్ష్మమైన స్థాయిలో కూడా అతను శస్త్రచికిత్సల్ని చేశాడని తెలుస్తున్నది.క్రీ.పూ 6వ శతాబ్దం నాటికే శుశ్రుతుడు చేసిన ప్లాస్టిక్ సర్జరీ గురించిన ఉదాహరణ కూడా నేటికీ లభ్యమే!

     The portion of the nose to be covered should be first measured with a leaf. Then a piece of skin of the required size should be dissected from the living skin of the cheek, and turned back to cover the nose, keeping a small pedicle attached to the cheek. The part of the nose to which the skin is to be attached should be made raw by cutting the nasal stump with a knife. The physician then should place the skin on the nose and stitch the two parts swiftly, keeping the skin properly elevated by inserting two tubes of eranda (the castor-oil plant) in the position of the nostrils, so that the new nose gets proper shape. The skin thus properly adjusted, it should then be sprinkled with a powder of licorice, red sandal-wood and barberry plant. Finally, it should be covered with cotton, and clean sesame oil should be constantly applied. When the skin has united and granulated, if the nose is too short or too long, the middle of the flap should be divided and an endeavor made to enlarge or shorten it.


ఎంతెంత దూరం?లెక్కెంత ఖచ్చితం!

     ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించే మార్గం వలయంలా కాకుండా దీర్ఘవృత్తంలో ఉంటుంది.ఈ దీర్ఘవృత్తంలో సూర్యుడికి సమీపంగా వచ్చేటప్పటి దూరం 91,445,000 మైళ్ళు అంటే 147,166,462 కిలోమీటర్లు.సూర్యుడికి సుదూరంగా ఉండేటప్పటి దూరం 94,555,000 మైళ్ళు అంటే 152,171,522 కిలోమీటర్లు.ఈ రెంటికీ సరాసరి కడితే 92,955,807 మైళ్ళు అంటే 149,597,870 కిలోమీటర్లు.రికార్డుల కెక్కిన దాని ప్రకారం తొలిసారి 1672లో Jean Richer మరియు Giovanni Domenico Cassini భూమి వ్యాసార్ధానికి 22,000 రెట్లు అంటే 22000 * 6371 kms = 140,162,000 అని కొలిచి చూపించారు.

     అయితే ఇక్కడ 15వ శతాబ్దానికి చెందిన గోస్వామి తూలసీదాసు తన హనుమాన్ చాలీసాలోని "యుగసహస్ర యోజన పర భానూ,లీల్యో తాహి మధుర ఫల జానూ" అనే దోహాలో ప్రస్తావించాడు.దీనిని వైదిక సాహిత్యం లోని విషయాల ప్రకారం మార్చి చూస్తే:
1 యుగం = 12000

1 సహస్రం= 1000

1 యోజనం = 8 మైళ్ళు

వీటిని బట్టి

12000 X 1000 X 8 =  96,000,000  మైళ్ళు

1 మైలు = 1.6 కి.మీ.లు

మైళ్ళని కిలోమీటర్లుగా మారిస్తే  96,000,000 * 1.6 = 153,600,000 కి.మీ.లు అవుతుంది!

     According to modern scientific measurements we orbit the Sun at a distance of about 150 million kilometers. This number is actually an average, since we follow an elliptical path. At its closest point, the Earth gets to 147 million km, and at its most distant point, it’s 152 million km.You might be surprised to know that the distance from the Sun to the Earth was only determined within the last few hundred years. There were just too many variables. If astronomers knew how big it was, they could figure out how far away it was, or vice versa, but both of these numbers were mysteries.

ఆపవయ్యా నీ వేగం!చూడవయ్యా ఈ వేదం?

तरणिर्विश्वदर्शतो जयोतिष्क्र्दसि सूर्य | विश्वमा भासिरोचनम |
తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్క్రదసి సూర్య!విశ్వమా భాసిరోచనం! - ఋ.1:50
     క్రీ.శ 14వ శతాబ్దంలోని విజయగరాన్ని పరిపాలించే బుక్కరాయల ఆస్థానంలోని సాయణాచార్యులు దానికి భాష్యం రాస్తూ "తత చ స్మర్యతే యోజనం సహస్రే ద్వే ద్వే శతే ద్వే చ యోజన యేకేన నిమిషార్ధేన క్రమణం" అని విపులీకరించారు.దీని అర్ధం సూర్యకాంతి అరనిమేషంలో 2202 యోజనాలు ప్రయాణిస్తుందని!మహాభారతం లోని శాంతిపర్వంలో ఉదహరించబడిన ప్రకారం:

15 నిమేషలు = 1 కాష్ఠ.

30 కాష్ఠలు = 1 కళ,

30.3 కళలు = 1 ముహూర్త,

30 ముహూర్తలు = 1 అహోరాత్రం

మనకి తెలుసు ఒక అహోరాత్రం అంటే 24 గంటలని,కాబట్టి 24 గంటలు = 30 x 30.3 x 30 x 15 నిమేషలు, మరోలా చెప్పాలంటే 409050 నిమేషలు.

కొత్త లెక్క ప్రకారం చూద్దాం,

మనకి తెలుసు 1 గంట = 60 x 60 = 3600 సెకండ్లు.

కాబట్టి 24 గంటలు = 24 x 3600 సెకండ్లు. = 409050 నిమేషలు.

ఈ మామూలు లెక్కలన్నీ సరిపోయాయి గదా?అనుమానం ఉంటే కాలిక్యులేటర్లు వాడి సరిచూసుకోవచ్చు!



409050 నిమేషలు = 86,400 సెకండ్లు,

నిమేష = 0.2112 సెకండ్లు (This is a recursive decimal! Wink of an eye=.2112 seconds!).

½ నిమేష = 0.1056 సెకండ్లు



ఇక దూరమానాలు చూద్దాం:

10 యవలు = 1 అంగుళ (1.89 cm or approx ¾ inch),
6 అంగుళాలు = 1 పాదం
2 పాదలు = 1 వితస్తి
2 వితస్తులు = 1 హస్త
4 హస్తలు = a ధనువు
2000 ధనువులు = 1 గవ్యూతిi(12000 అడుగులు)
4 గవ్యూతులు = 1 యోజనం = 9.09 మైళ్ళు
     Calculation: So now we can calculate what is the value of the speed of light in modern units based on the value given as 2202 Yojanas in ½ Nimesa = 2202 x 9.09 miles per 0.1056 seconds = 20016.18 miles per 0.1056 seconds = 189547 miles per second !!As per the modern science speed of light is 186000 miles per second ! And so I without the slightest doubt attribute the slight difference between the two values to our error in accurately translating from Vedic units to SI/CGS units. Note that we have approximated 1 Angula as exactly ¾ inch. While the approximation is true, the Angula is not exactly ¾ inch


యెవరక్కడ?బౌధాయనుడా!పైధాగరస్సా!

     క్రీ,పూ 400 కాలం నాటి పైధాగరస్ తన రేఖాగణిత నియమాల్లో ఒక లంబత్రికోణానికున్న మూడు భుజాలకీ మధ్యన ఉన్న నిష్పత్తిని గురించి "In any right-angled triangle,the area aof the square where side is hypotenuse(the side opposite the right angle) is equal to the sum of  the areas of the squares whose sides are the two lehs(the two sides meet at  right angle)" అని చెప్పాడు.

కానీ భారతదేశంలోని క్రీ,పూ 800 నాటి బోధాయనుడు ఇంకా సరళంగా "दीर्घचतुरश्रस्याक्ष्णया रज्जु: पार्श्र्वमानी तिर्यग् मानी च यत् पृथग् भूते कुरूतस्तदुभयं करोति ॥" అని తేల్చి చెప్పాడు."దీర్ఘచతురస్రస్యా క్షణయా రజ్జు పార్శ్వమానీ తిర్యగ్మానీ చ యత్ పృధగ్ భూతే కురుతస్తదుభయం కరోతిఅంటూ ఒక తాడుని ఉదాహరణగా చేసుకుని అంతకన్నా సూటిగా చేప్పేశాడు!


ఆట గద శివా,నీ పాట గద కేశవా!

     ఈ శతాబ్దపు తొలి మూడు దశాబ్దాలలో భౌతిక శాస్త్రం తన రూపురేఖల్ని విశేషంగా మార్చుకుంది.1905లో ఐన్స్టీన్ ఆవిష్కరించిన సాపేక్ష సిధ్ధాంతం భౌతిక శాస్త్ర పరిధిని దాటి అన్ని రంగాల ఆలోచనల్నీ ప్రభావితం చసింది.సాపేక్ష సిధ్ధాంతం ప్రకారం కాలానికి ప్రత్యేకమైన అస్తిత్వం(Entity) అంటూ లేదు.ఇంకా విశ్వం త్రిమితి(three dimensional) కాదు,స్థల-కాల ద్వయాల పరస్పర సంయోజనం వల్ల చాతుర్మితిక గతిశీలత(four dimensional continuam) సంభవించింది.ఒక కమ్యునిష్టు రచయిత "బుధ్ధికొలత" సిధ్ధాంతం గురించి రాస్తే మురంనా అతను మార్క్సిస్టు అయి వుండీ మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నాడని వెక్కిరించింది - అదండీ ఆవిడ విజ్ఞానం!నూతన ఆవిష్కరణల ప్రకారం ఈ ప్రపంచాన్ని వర్ణించటానికి యేడు రకాల కొలతలు ప్రతిపాదించబడినాయి.సాపేక్ష సిధ్ధాంతం క్వాంటం సిద్ధాంతంతో కలిసి అంతకు ముందు భౌతిక శాస్త్రం యేర్పరచుకున్న "I,The Observer","World,The Object" అనే విభజనని చెరిపేసింది!ఈ సమస్త ప్రపంచమూ కొన్ని ఖచ్చితమైన నియమాలకి లోబడి నడుస్తున్నదనే పాత నిబంధన స్థానంలో చిన్న చిన్న అంశాల కలయికతో యేర్పడిన ఒక పెద్ద అంశంలో మన జ్ఞాన పరిధికి రాని యే ఒక్క చిన్న అంశంలో మార్పు జరిగినా మనం చూస్తున్న పెద్ద అంశంలో విపరీతమైన మార్పులు కనబడతాయి,కాబట్టి ప్రపంచమూ అది పాటిస్తున్నదని అనుకుంటున్న నియమాలూ మారకుండా స్థిరంగా ఉండటం అసంభవమనే కొత్త నిబంధన వచ్చింది!

     ఒక్క కాంతివేగం తప్ప మిగిలినవన్నీ సాపేక్షం అన్నాడు ఐన్స్టీన్.ఇలా వేగాన్ని స్థిరంగా ఉంచుకోవడం కోసం కాంతి విశ్వంలో ప్రయాణించేటప్పుడు గురుత్వాకర్షణ కలిగిన అస్తిత్వాల యొక్క ఆకర్షణకి లోనై వంగుతుందని చెప్పాడు.దీనివల్ల కాలం సాపేక్షం అయింది.దాంతో మానవుల అనుభవంలోకి వచ్చే నిన్న,నేడు,రేపు అనేవి ఇదివరకటి లెక్క ప్రకారం ఖచ్చితమైన విభజనతో ఉన్నట్టు కాకుండా ఇవన్నీ కలిసి ఉండే అవకాశం కూడా కనబడుతూ "కాలంలో ప్రయాణం" లాంటి తమాషా కధలు నిజమేనేమో అని భ్రమించేటట్టు చేసింది!తను ప్రతిపాదించిన గణితసూత్రాన్ని మినహాయిస్తే ఇతని సిధ్ధాంతం చదువుతుంటే భారతీయుల ప్రాచీన వేదాంత బోధనలు చదువుతున్నట్టు ఉంటుంది."Time Warp" అనే దృగిషయానికి చెప్తున్న ఉదాహారణ ఇట్లా ఉంటుంది:ఒకే వయస్సు గల ఇద్దరు సోదరుల్లో ఒకరు 20 యేళ్ళ వయసులో కాంతివేగం వల్ల జరిగే కాలం యొక్క స్థానభ్రంశానికి గురై 20 యేళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి వస్తే తన సోదరుడు 40లో ఉంటాడు,తను మాత్రం 20లోనే ఉంటాడు!ప్రస్తుతానికి మనిషి కాంతి వేగానికి దగ్గిరగా ప్రయాణించటాన్ని కూడా సాధించలేకపోయాడు గాబట్టి దీన్ని నిరూపించలేము గానీ సాపేక్షవాదం యొక్క ప్రభావం అలా ఉంటుందని చెప్పటానికి మాత్రం ఈ ఉదాహరణ పనికొస్తుంది.అయితే మహాభారతంలోని ఒక కధ ప్రకారం "కకుద్మి అను పేరు గల ఒకానొక రాజు,తన కుమార్తె అయిన రేవతికి తగిన వరుణ్ణి వెదికి వెదికి విసుగెత్తి అసలు తన కూతురికి యెవర్ని భర్తగా లిఖించాడో అడిగి తెలుసుకుందామని సరాసరి బ్రహ్మలోకమే వెళ్ళాడు.అప్పుడు బ్రహ్మదేవుడు గంధర్వుల గానకచ్చేరి(Divine Rock Music) వింటూ ఉండటం వల్ల అది ముగిసేవరకూ అట్లాగే వేచి ఉన్నాడు:-)తీరా సంగీత సభ పూర్తయ్యాక రాజు విషయం విన్నవిస్తే ఆయన నవ్వేసి నువ్విక్కడ నాకోసం యెదురు చూస్తున్న సమయంలో భూమి మీద 27 మహాయుగాలు గడిచిపోయినాయి.నీ రాజ్యమూ గతించిపోయింది,నీ కాలంలో వివాహార్హత గలిగిన రాజయువకులూ నశించిపోయారు - ప్రస్తుతం ద్వారకలో బలరాముడు నీ కుమార్తెకు తగిన వరుడు" అని చెప్పే కధలో ఉన్నది యేమిటి?


     1900 సంవత్సరంలో మాక్స్ ప్లాంక్ ద్వారా ప్రవచించబడి ఐన్స్టీన్ ప్రోత్సాహంతో విపరీతంగా కొనియాదబడుతున్న క్వాంటం సిధ్ధాంతం అయితే సాపేక్షతా సిధ్ధాంతం కన్నా ఒకడుగు ముందుకేసి పూర్తిగా శివతాండవానికి వ్యాఖ్యానమా అన్నట్టు ఉంటుంది!దీనిని విషయాన్ని బట్టి తరంగ సిధ్ధాంతం అని పిలవాలి.ఈ విశ్వం లోని యే ఒక్క అస్తిత్వం గల పదార్ధాన్నీ మిగిలిన అస్తిత్వాల నుంచి విడదీయలేము.పైగా చెట్టు నుంచి పుట్టిన విత్తనం తిరిగి చెట్టుగా పెరగడానికి అవసరమైన జ్ఞానాన్ని దాచుకున్నట్టు ప్రతి వస్తువూ ఈ విశ్వం యొక్క మొత్తం సమాచారాన్ని ఇముడ్చుకుని ఉంటుంది.యే రెండు అస్తిత్వాల మధ్యన ఉన్న సంబంధమూ శాశ్వతం కాదు.రెండు అస్తిత్వాలు కలవడం,విడిపోవడం అనే ప్రక్రియలో సంభావ్యతలు మాత్రమే ఉంటాయి తప్ప శాశ్వతమైన అస్తిత్వం దేనికీ లేదు.మన చుట్టూ కనబడే వస్తుగతమైన ప్రపంచం కూడా సంభావ్యతల లోని ఒక ఉద్భవం(one probability among multiple possibilities) మాత్రమే!దీని నంతట్నీ చూస్తున్న,గ్రహిస్తున్న,అనుభూతిస్తున్న కర్త గూడా ఈ సంభావ్యతల లోని ఒక శకలమే అవుతాడు,మరి నియమాలు మారకుండా యెలా స్థిరంగా ఉంటాయి?


     The relativistic field theory asserts that:“the ultimate material reality that physics can apprehend is the ‘field’ and in the aspect of the quantum field, it is both a continuum and a discontinuum, the discontinuities being temporary condensations of space-time where the field is unusually intense giving rise to matter (Pantda: 1991, 154).According to the field theory, reality is nothing but the transformation and organization of the field quanta.  Particles are interactions between fields, and are ephemeral manifestations.  They only appear to be substantial as a result of the dynamic, energetic interplay of the quantum fields (155).All types of particle-pairs are constantly generated and absorbed by the field.  The “dance” of all possible particles, may be regarded as the fundamental activity of Nature."My dear Lord,this visible cosmic manifestation is a demonstration of Your own creative energy.Since the countless varieties of forms within this cosmic manifestation are simply a display of your external energy.this virat-roopa is not your real form". - Srimad bhaagavatam 5:18:31,


     చూశారుగా,చలనం,జ్వలనం,ప్రణవం,నర్తనం గురించి భారతీయులు చెప్పిన వాటికి ఆధునికులు యెంత దగ్గిరగా వచ్చారో - ఇప్పుడు కూడా భారతీయులు విజ్ఞానం అంటే యేమిటో తెలియని వాళ్ళే అంటారా?శివుని చేతిలోని ఢమరుకం మ్రోగుతున్నంత కాలం నాదమయమైన సమస్త ప్రపంచమూ ఆ తరంగఘోష లోని లయకు అనుకూలంగా నర్తిస్తూనే ఉంటుంది.ఢమరువు ఆగితే జ్వాల రేగుతుంది,సమస్తాన్నీ భస్మీభూతం చేస్తుంది.మళ్ళీ ఢమరుకం మోగే వరకూ అంతటా నిశ్శబ్దం 
తాండవిస్తుంది!మరోవైపు నారాయణుడు క్షీరసాగర తరంగాల పైన అనంతశయనుడై లీలామానుషంగా తన నుండే పుడుతున్న అనాహత మోహన వంశీ గానం వింటూ మందహాసవదనారవిందుదై ఉంటే అక్కడ సంభ్రమిస్తున్న క్షీరసాగర తరంగాల నుంచి బుద్బుదాల వలె అనంతకోటి విశ్వాలు(Multiverses) పుట్టి గిట్టుతూ ఉంటాయి!

     ముందు ముందు సైన్సుకీ మతానికీ మధ్య ఉండే తేడా అదృశ్యమై పోతుంది.ఒకదాన్నే పట్టుకు వేలాడతానంటే కుదరదు.Science also has religious spirit, when you go on searching for a reason,some where you may find your reason fails and settles into  belief!Religion also has scientific spirit, When you go on trying to believe,some where you may find your belief ask question and seeks for reason?అసలు అపహాస్యం కాబోయేది నాస్తికత్వమే!

నెత్తి మీద పడిన యాపిలు కధేంటి?ఆ మాత్రం దంపుడుపని మేము చెయ్యలేమా!

     ఈ సృష్టిలో మారకుండా ఉండేది యేదీ లేదు.ఒక పదార్ధం మరొక పదార్ధంగా మారుతుంది,అప్పుదు మొదటి పదార్ధం ధర్మాలు కూడా రెండవ పదార్ధం యొక్క ధర్మాలుగా మారుతాయి - వైశేషిక సూత్ర 1.1.10!ఇది ఇప్పుడు ఉష్ణగతిజశాస్త్రపు ప్రధమనియమం అని మనం చిన్నప్పుడు చదువుకున్న నియమమే.కార్య విరోధి కర్మ(వైశేషిక సూత్ర 1.1.14) సూత్రం యేమి చెప్తుందంటే ఒక వస్తువు మీద యేదైనా కర్మ చెయ్యాలంటే వస్తువులోని స్థితిశక్తి దాన్ని నిరోధిస్తూ వ్యతిరేక దిశలో పనిచేస్తుంది అని!ఇక్కడ చప్పట్లు కొట్టాల్సిందే ఈ దేశాన్ని ప్రేమించేవాడు యెవడయినా సరే - యెందుకంటే Work done = Energy Required; And the direction is opposite సూత్రం స్పష్టంగా కనబడుతున్నది గనక?!
     అందమైన ఆడపిల్ల వడ్లు దంచుతుంటే చూట్టానికి రెండు కళ్ళూ చాలవు గదూ!సీను తల్చుకుంటేనే బాలయ్య ఫ్యాన్లు "దంచవే మేనత్త కూతురా" పాట లంకించుకుంటారని నాకు తెలుసు:-)కాస్త అందులోని సైన్సు యేమిటో కణాదుల వారు సవివరంగా చెప్పారు,చూడండి!
వైశేషిక సూత్ర 5.1.1 - ముసలాన్ని చేతబట్టి నిలువుగా పైకెత్తుతాం(ఇది మొట్టమొదటి దశ,కదూ!)
వైశేషిక సూత్ర 5.1.2 - హస్తం ముసలంలో కర్మని పుట్టిస్తుంది.
వైశేషిక సూత్ర 5.1.3 - హస్తం ముసలాన్ని వొదిలెయ్యడం వల్ల ముసలం ఉఖల మీద పడటంలో హస్తం ప్రమేయం లేదు,అయినా పడుతున్నది అంటే ఆ కర్మకి భూమి యొక్క ఆకర్షణ కారణం.
వైశేషిక సూత్ర 5.1.4 - ఉఖల మీద పడిన ముసలం పైకి యెగదన్నడంలో హస్తం ప్రమేయం లేదు,అది ఉఖల నుండి పుట్టే  కార్య-విరోధి-కర్మ యొక్క ప్రతిచర్య.
వైశేషిక సూత్ర 5.1.5 - పైకి వెళ్ళే ముసలాన్ని పట్టి ఉన్న హస్తంలో ముసలంతో ఉన్న సంబంధం వల్ల కర్మ పుడుతున్నది.
వైశేషిక సూత్ర 5.1.6 - ఈ విధంగా ముసలం అనే యంత్రాన్ని ఊపయోగిస్తున్న హస్తం మీద కర్త్రాధీన కర్మ మరియు వస్త్వాధీన కర్మ అను రెండు కర్మలు పుడుతున్నాయి.
వైశేషిక సూత్ర 5.1.7 - ముసలం మీద వ్యక్తి యొక్క పట్టు లేకపోతే ముసలం గురుత్వాకర్షణ వల్ల కింద పడిపోతుంది - గురుత్వాత్ పతనం!
వైశేషిక సూత్ర 5.2.3 - అపం సమ్యొగభవె గురుత్వత్ పతనం - అర్ధం అయిందా?మేఘాలు వర్షించడానికి కారణం కూడా గురుత్వమే అంటున్నాడు!
-----------------------------------------------------------------------------------------------------------------
సంఖ్య   సూత్రం                                               వ్యాఖ్యానం
-----------------------------------------------------------------------------------------------------------------
1)        వేగః నిమిత్తవిశేషాత్ కర్మణో జాయతే     Change of motion is due to impressed force.
2)        వేగః నిమిత్తాపేక్షాత్ కర్మణో జాయతే      Change of the motion is proportional to the 
           నియతదిక్ క్రియా ప్రబంధ హేతుః           impressed force and is in the direction of the force. 
3)        వేగః సంయోగవిశేషవిరోధీ                     Acyion and Reaction are equal and opposite
-----------------------------------------------------------------------------------------------------------------
     ఈ కణాదుడు యెప్పటీవాడో తెలుసా?క్రీ.పూ 6వ శతాబ్దికి చెందిన వాడు!ఇప్పటికీ గురుత్వాకర్షణ నియమాన్ని తొలిసారిగా కనుక్కున్నది న్యూటనే అని వాదిస్తారా మీరు?మొత్తం ఈ భూమి నంతా తమ కిష్టమైన ఒక ఎజెండాతో నిరంకుశంగా ఏకం చేసి నియంతృత్వంతో పట్టి ఉంచగలమనుకోవటం దురాశ!భూమి మీద సముద్రాలూ నదులూ వాగులూ వంకలూ గుట్టలూ మిట్టలూ అడవులూ అగాధాలూ తీసేసి సౌకర్యం కోసం వెదికి చూస్తే మానవనివాసయోగ్యమైన స్థలమే చాలా చాలా చాలా తక్కువగా ఉంది!ఆ ఉన్న కొంచెం కూడా ఖండాలుగా విడిపోయి ఉంది.రవాణా,సమాచారం లాంటివి యెన్నయినా కొంతవరకే మనుషుల్ని దగ్గిర చేస్తాయి.యెంత తిరిగినా యేమి చేసినా చీకటి పడే సమయానికి ఒక గూడు కిందకి చేరటం తప్పనిసరి.ఒకచోట గుమిగూడీన వారు భద్రత కోసం ఏదో ఒక స్థాయిలో రాజ్యం అనే గొడుగు కిందకి రాక తప్పదు.రాజ్యం సజావుగా నదవాలంటే విధేయత తప్పనిసరి.ఈ చట్రంలో ఇమడలేని వారికి రెండే దారులు - సొంత ప్రయోజనాల కోసం ముఠా కట్టి అందినంత దోచుకోవడం,తనకు కోరుకున్న అధిక ప్రయోజనాన్ని అందరికీ సాధించగలగటం,ఎవరు యెన్ని రకాల సిధ్ధాంతాలతో ఊదరగొట్టినా అన్నింటిలోనూ ఉండే రాజనీతి ఇదే కదా!మనిషికి తీరవలసిన పాంచభౌతికమైన అవసరాలలో అధికభాగం భూమి నుండే వస్తున్నాయి.మనిషి తన అలవాట్ల కోసం ప్రకృతిని మార్చటం,మారిన ప్రకృతి వల్ల పుట్టిన సమస్యలు మనిషికి మళ్ళీ అలవాట్లని మార్చుకోవాల్సిన అవసరాన్ని పుట్టించటం మానవావిర్భావం నుంచీ జరుగుతున్నదే,కొందరు భయపెడుతున్నట్టు అది వింతైనదీ కాదు!అయితే,భారతీయులు ఈ దేశానికి నైసర్గికంగా అమరి ఉన్న అనేకానేకమైన అనుకూలతల్ని ఉపయోగించుకుని ప్రకృతి - పురుష సంయోజనం(Interactivity) యొక్క క్రియ - ప్రతిక్రియ అనే ద్వంద్వాల్ని అర్ధం చేసుకున్నారు గనక వీరి జ్ఞానధార అవిచ్చిన్నంగా సాగింది,సాగుతున్నది,సాగుతుంది!దేశభక్తినే "high end limit","low end limit" అంటూ వెక్కిరించేవారికి సంప్రదాయం విలువ యేమి తెలుస్తుంది?

     న్యూటను మహాశయుడు తను యేమి సాధించినా అది తనకన్నా ముందున్న పెద్దల భుజాల మీద నుంచి చూడటం వల్ల్లనే అని అన్నది వినయంతో కాదు,తన ప్రతిస్పర్ధి అయిన రాబర్ట్ హూక్ యొక్క గూనితనం మీద వేసిన వ్యంగ్యం అని యెంతమందికి తెలుసు?"నా నెత్తి మీదొక యాపిల్ పడింది,అందులోంచే ఐడియా పుట్టింది" అనటం కూడా కేవలం అతని కున్న హాస్యప్రీతి నుంచి ఊడిపడిన చతురు మాత్రమే.యెన్నో సంవత్సరాల పాటు పరిశోధించి యెన్నో గ్రంధాలు చదివి ఇతర్లతో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంభాషించి తయారుచేసిన మొత్తం విషయాన్ని ఆ విషయాలతో అసలు పరిచయమే లేనివాళ్ళకి యెట్లా చెప్పగలడు?అందుకే యాపిల్ నా నెత్తిమీద పడిందనే జోకుతో సరిపెట్టేస్తే ఆ యాపిలే ఇప్ప్పుడు బుర్రలో జ్ఞానం వెలగటానికి పెద్ద సింబలై కూర్చుంది - ఒక్కొక్కప్పుడు బోడిగుండుకీ మోకాలికీ కూడా సంబంధం కుదురుతుందండోయ్!

గతమెంతొ ఘనకీర్తి గలవోడ భారతీయుడ!ఇప్పటి సంగతి చెప్పవేందిర చాదస్తుడ?
     కొందరిప్పటికీ "మరి అన్ని ఘనకార్యాలు సాధిస్తే ఇప్పటికీ మిగిలి ఉండాలి కదా,అంతటి జ్ఞానమూ తర్వాత కాలంలో యేమైపోయింది?మూఢనమ్మకాలకి గురై వెనకబడి పోయి ఇప్పుడు పాతగొప్పల్ని చెబితే యేమి ఉపయోగం?ఇప్పుడు మనకన్నా ముందున్నవాళ్ళ గొప్పదనాన్ని గుర్తించలేని యేడుపు కాదా ఇది!" అని వెక్కిరిస్తారని నాకు తెలుసు.వారికి నేనొకం సంగతి గుర్తు చేస్తున్నాను.12వ శతాబ్ద వరకూ భారతదేశమే ప్రపంచానికి జ్ఞాంభిక్ష పెట్టిందనేది అందరూ ఒప్పుకుంటున్న సత్యం!కానీ నలందా,విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాల్ని కాల్చి బూడిద చెయ్యడం వల్ల జరిగిన నష్టమే మనల్ని ఇన్ని శతాబ్దాల పాటు అంధకారంలో ఉంచిందని చాలామందికి తెలియదు.అక్కడ ఉన్న తాళపత్ర గ్రంధాలు తగలబడటానికి ఆరునెలలు పట్టిందని చెప్తున్నారు, యెంత స్థాయిలో జ్ఞానం ధ్వంసమైపోయింది?ప్రమాదం కనిపెట్టి కొందరు వీలున్నంత మేరకు దక్షిణాదికి తరలించారు.వాటిలో కేరళ లోని నీలకంఠ,మహదేవ శాఖల నుండి పుట్టిన జాతిరత్నమే సూర్యసిధ్ధాంతిక రచయిత భాస్కరాచార్యుడు!George Ghevergese Joseph తన "The Crest of the Peacock: Non-European roots of mathematics" అన్న గ్రంధంలో న్యూటనుకీ,అనేక యూరోపియన్ గణిత శాస్త్రజ్ఞులకీ కీర్తి కారణమైనవి కేరళ శాఖల నుండి జరిగిన అనువాదాలని సోదాహరణంగా నిరూపించాడు.ఈ పుస్తకం టైటిలులో ఉన్న "Crest of the Peacock" ఆర్యభటీయం లోనిదైన చక్కని పోలిక - నెమలికి పించం ఎంతటి శోభాయమానమో తక్కిన శాస్త్రాలన్నింటికీ గణితం అంతటి శోభాయమానమైనది అన్న గణితప్రశస్తి నుంచి తీసుకున్నదే.

      గ్రంధాలయాలు భస్మరాశులుగా మిగిలిపోవటం,జ్ఞానులు క్రూరంగా వధించబడటం,నగరాలకి నగరాలు నేలమట్టం కావటం లాంటివి భారతీయ జ్ఞానసింధువుని ఊషర క్షేత్రాల వైపుకి పరుగులెత్తించినాయి.ఆంగ్లేయులు ఈ దేశంలో ప్రాబల్యం వహించేనాటికి ఒకనాటి ఉద్యానవనం నేడు కనలేని మరుభూమిగా మారిపోయింది!ఆంగ్లేయుల లోని కొందరు జ్ఞానతృష్ణ గలవారు మళ్ళీ ఆ గతాన్ని తవ్వితీస్తున్నప్పుడే పాతకధలు వివరంగా తెలిశాయి - ఇతరులు తవ్వి తీసి ఆశ్చర్యానికి గురవుతుంటే గర్వించటానికి మనం యెందుకు వెనుకాడుతున్నాం?మనవాళ్లలోనే మన దేశం పట్ల ఉన్న చిన్న చూపు వల్ల మనకి రావలసిన గౌరవాల్ని మనకి దక్కించుకోవడం కోసం ప్రతి చిన్నదానికీ యెదురీత ఈదాల్సి వస్తున్నది,యెందుకీ ఆత్మహనపు పైశాచిక ధోరణి?అందరూ జీరో భారతదేశపు ఆవిష్కారం అని ఒప్పుకున్నాక ఇరవయ్యో శతాబ్దంలో కూడా అది గ్రీకుల "ఒమిక్రం" అనే అక్షరం నుంచి వచ్చిందని కొత్త వాదం లేవనెత్తారు యూరపియన్ మేధావులు.చివరాఖరికి గుజరాతులో లభించిన ఒక ఐదవ శతాబ్దానికి సంబంధించిన శిలాశాసనంలో జీరో ఉండటంతో ఒప్పుకోక తప్పలేదు.రామసేతువుని గుర్తించింది అమెరికా వాళ్ళు,కానీ దానికి తప్పుడు వ్యాఖ్యానాలు చెయ్యబోతే ఖండించింది జర్మనీ వాళ్ళు!మరి మనవాళ్ళు యేమి చేస్తున్నారు?ఇతరులు గుర్తించి ప్రశంసించే అంశాల విషయం వీళ్ళకి నచ్చకపోగా అవన్నీ అబధ్ధాలు అని వీళ్ళే పనిగట్టుకుని తప్పులు వెతికి మాదేశం ఒక చెత్త అని అందరికీ వినబడేటట్టు అరవడమే గొప్ప అనుకోవటం బహుశా ప్రపంచంలో ఇంకే దేశంలోనూ జరగదేమో!

     గతంలోని గొప్పదనాన్ని గురించి చెప్పేటప్పుదు వాస్తవాల్ని మాత్రమే చెప్పాలి.మనవాళ్ళు ఒకప్పుడు విమానాలు తయారు చేశారు అని చెప్పే నిరాధారమైన కబుర్ల వల్ల ప్రయోజనం యేముంది?వ్యతిరేకులు మరింత వేళాకోళం చెయ్యటం తప్ప వాటి వల్ల యే ఉపయోగమూ లేదు,నిజమే!విమానాల్ని కనిపెట్టిన వాళ్ళు కార్ల నెందుకు వదిలేశారు అనే ప్రశ్న నాకే వచ్చింది:-)కానీ ఒక విదేశీ మేధావి చెప్పినట్టు మనవాళ్ళకి తెలిసిన ప్రతి విషయాన్నీ  ప్రయోగం ద్వారా రుజువు చేసుకోవాలనే దురదా కనిపించిన ప్రతిదాన్నీ అనుభవించి తీరాలనే దురాశా లేదు!అలాంటి లక్షణం ఉండటం వల్లనే పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం మారణాయుధాల్ని కనిపెట్టడం మీద,కాలుష్యాలను పెంచే వ్యర్ధ వ్యాపారాల మీద శ్రధ్ధ చూపిస్తే మన వాళ్ళు మనిషి చిరకాలం ప్రశాంతంగా జీవించడానికి పనికివచ్చే ఆయుర్వేదం,యోగశాస్త్రం,ఆధ్యాత్మికత వంటి వాటి మీద దృష్టి పెట్టారు.ఇప్పటికీ ధ్వంసం కాకుండా మిగిలిన ఆవిష్కరణలలో సౌభాగ్య చింతనే కనిపిస్తుంది తప్ప భీబత్స సూచనలు లేవు!వాళ్ళేమో తమ దేశపు ప్రాభవం పెరగటానికి యే చిన్న అవకాశాన్నీ వొదులుకోవటం లేదు!మనమేమో మనల్ని మనం కించపరుచుకోవటానికి యే చిన్న అవకాశాన్నీ వొదులుకోవటం లేదు?బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టినట్టు బ్రాహ్మణులు మమ్మల్ని అణిచేశారు,కాబట్టి బ్రాహ్మణులు సాధించిన ఘనకార్యాల్ని మేమెందుకు పొగడాలి అంటే యేమి చెప్పగలం?అమెరికా దేశానికి సంబంధించిన నాసా ఉద్యోగుల్ని అక్కడి నల్లవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలకి బాధ్యుల్ని చెయ్యగలమా?యే సమాజమూ యెప్పుడూ ఒకే రకంగా ఉండదు - గతం నుంచి చెడుని పరిహరించి మంచిని స్వీకరించి ఆగతానికి కదిలితే ప్రయోజనం ఉంటుంది గానీ గతాన్ని తిట్టుకుంటూ యెన్ని శతాబ్దాలు గడిపినా ఒక్క అడుగు కూడా భవిష్యత్తు లోకి పడదు గదా!రెండు మహానగరాలు నవల "అదొక వైభవోజ్వల శకం.అదొక వల్లకాటి అధ్వాన్న శకం..." లాంటి మహాగంభీరమైన వాక్యాలతో మొదలవుతంది!జిజ్ఞాసతో జీవితాలని చరితార్ధం చేసుకున్న గతకాలపు మహనీయుల వల్లనే వర్తమానం ఇలా ఉంది,ఆ జిజ్ఞాసువుల పట్ల గౌరవం లేకుండా భవిష్యత్తు మహోజ్వలం కాబోదు.

అధాతో విశ్వ జిజ్ఞాసా,అధాతో బ్రహ్మ జిజ్ఞాసా!
-----------------------------------------------------------------------------------------------------------------
ఈ ప్రసంగం శాలివాహన శకం 1937 ఆశ్వీజ మాసము 30వ తేదీ గురువారము నాడు ప్రచురించబడినది.

Saturday, 17 October 2015

అప్పుడు వాడు మనమీదకి టెర్రరిస్టుల్ని పంపాడు!ఇప్పుడు వాడు మనమధ్యనే తన పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాడు?అప్పుడూ ఇప్పుడూ మనమే యెర్రిపప్పలం?!

     శివసేన పుట్టిందే తెలంగాణ వాదుల విభజన వాదానికి మాతృక అని చెప్పదగ్గ మరాఠా ప్రాంతీయాభిమానంతో!నా ప్రాంతం నాకు మాత్రమే సొంతమైనది,ఇతర ప్రాంతాల వాళ్ళు రెండో తరగతి పౌరులుగా అణిగిమణిగి పడివుండాలే తప్ప పైకెదిగే సమర్దత ఉన్నా ప్రధమశ్రేణికి వెళ్ళి నా ప్రాంతీయుల మీద పెత్తనం చెయ్యకూడదు,నా ప్రాంతం నాకు మాత్రమే అధికారాన్ని ఇవ్వాలి - ఇలాంటి భావాలతో పుట్టింది.మన గురించి మాట్లాడుతున్నాడు,మనకి అన్యాయం జరిగిందంటున్నాడు,మనకోసం పోట్లాడతానంటున్నాడు,కాబట్టి ఇతన్ని అధికారంలోకి తీసుకొస్తే ఇతను మనకి నిజంగా మేలు చేస్తాడేమో చూద్దాం అనే అమాయకత్వం ఉన్నవాళ్ళు ఇలాంటివాళ్ళ బుట్టలో తేలిగ్గా పడతారు - అదీ సహజమే!కానీ ఆ భావాల్ని జనం మీద రుద్దుతున్న వాళ్ళకి నిజంగా కావలసింది ప్రజల శ్రేయస్సు కాదు, తమ మాట చెల్లుబడి కావడమే.తమకు జై కొడితే తమ ప్రాంతానికి జై కొట్టినట్టే అని నియంతలు చెప్పే సుభాషితాల్లోని అంతఃసూత్రం - ఆత్మానుభవం అయితే గానీ తత్వం బోధపడదు యెంతటి జ్ఞానుల కైనా!ముంబాయికి సంబంధించినంత వరకూ వాళ్ళు యేమి చెసినా చెల్లుతుంది.వాళ్ళ కిష్టం లేనివాళ్ళతో మనవాళ్ళని క్రికెట్ ఆడనివ్వరు!వాళ్ళ కిష్టం లేనివాళ్ళు తీసిన సినిమాల్ని చూనివ్వరు!అలాంటప్పుడు పోయి పోయి ఈ సుధీంద్ర కులకర్ణి 2015 అక్టోబర్ 12వ తేదీన మాజీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ మహ్ముద్ కసూరి రాసిన "Neither A Hawk Nor a Dove: An Insider's Account of Pakistan's Foreign Policy" పుస్తకాన్ని పట్టుబట్టి ముంబయి లొనే యెందుకు ఆవిష్కరించాలనుకున్నాడు?బహుశా అతనికీ సంచలనమే కావాలి కాబోలు - రోగీ పాలే కోరాడు,వైద్యుడూ పాలే ఇచ్చాడు లాగుంది యెవ్వారం!

     ఈ సుధీంద్ర కులకర్ణి చరిత్ర యేమిటో తెలుసా?1996 వరకూ బారత కమ్యునిష్టు(మార్క్సిస్టు) పార్టీ సభ్యుడిగా ఉండి హఠాత్తుగా జ్ఞానోదయమై "నాలాంటివారు మిధ్యాప్రపంచంలో విహరిస్తున్నారు.లేటుగా నైనా మార్క్సిష్టు మోడల్ ఇండియాకి సరిపడదని తెలుసుకున్నాను - నిజానికి ప్రపంచంలో యే మూలకీ ఈ మోడల్ సరిపడదని నేననుకుంటున్నాను" అని నిర్ద్వంద్వంగా ప్రకటించేసి భారతీయ జనతా పార్టీ లోకి దూకేశాడు!మొదట్లో అటల్ బిహారీ వాజపేయి గారికి ప్రసంగాల విషయంలో సహాయం చేస్తూ ఉండేవాడు.ఢిల్లీ-లాహోరు బస్సు యాత్రలోనూ ఇతను ఉన్నాడు.తర్వాతి కాలంలో అద్వానీ గారికి బాగా దగ్గిరయ్యాడు.కానీ "భారత్ వెలిగి పోతోంది" అన్న ఇతని ప్రచార వ్యూహం భాజపాని గెలిపించలెకపోవటంతో పార్టీ నుంచి తప్పుకున్నాడు.2008లో జరిగిన ఒక స్టింగ్ ఆపరేషన్ ఆ తర్వాత "నోటుకి వోటు" కుంభకోణంగా ముదిరి అందులో ఇతని ప్రమేయం కూడా ఉందని తెలిసి 2011లో ఒన్నాళ్ళు జ్యుడిషియల్ రిమాండులో ఉన్నాడు.ఇప్పుడు "అబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్" కాలమిస్టుగా జర్నలిస్టు అవతారం యెత్తాడు.మూలం కమ్యునిష్టు పార్టీలో ఉన్నా శాఖలు భాజపాలో ఉన్నా ప్రస్తుతం మీడియా వాడు గనక తప్పకుండా సంచలనాన్ని ఆశించే ఈ కార్యక్రమం యేర్పాటు చేసి ఉంటాడు!

     పుస్తకాన్ని రాసిందెవరు?మాజీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి!యేమి రాశాడో తెలుసా - పాకిస్తాన్ భారతదేశంతో శాంతినే కోరుకున్నదట!కానీ అటువైపున ఉన్న కొందరు భారత్ వ్యతిరేకులు,ఇటువైపున ఉన్న కొందరు పాకిస్తాన్ వ్యతిరేకుల వల్ల శాంతికి విఘాతం యేర్పడుతున్నదని - ఇందులో కొత్తేముంది?అయితే శివసేన బయటి నుంచి గొదవలు చెయ్యటం తప్ప ప్రభుత్వంలో గానీ విదేశాంగ శాఖలో గానీ పాకిస్తాన్ ద్వేషులు యెవరూ లేరు.పాకిస్తాన్ వైపు నుంచి మాత్రం ప్రభుత్వంలో భారత్ వ్యతిరేక వర్గం ఉండటం వల్లనే సమస్యలు కొనసాగుతున్నాయనేదీ అందరికీ తెలిసిన విషయమే,మరి ఈ పుస్తకంలో ఉన్న ప్రత్యేకత యేమిటి?ఒక పాకిస్తానీ రాయటం!అయితే పాకిస్తానులో ఆవిష్కరించ్కుకోవాలి గదా ఇక్కడ యెందుకు ప్రోత్సహించటం?అదే కమ్యునిష్టు మూలాలు వాళ్ళ ప్రత్యేకత!మనం విశాల హృదయంతో ఆలోచిస్తున్నాం అని నిరూపించుకునే అవకాశం ఉందీ అంటే చాలు,యెంత నీచపు పనైనా సరే మొండిగా చేసి చూపిస్తారు!అదే తమకి నాన్-సెక్యులర్ అని అనిపిస్తే చాలు దాన్ని పీకి పాకం పెట్టి వ్యక్తిగత నైతిక విలువల దగిర్నుంచి సామాజిక న్యాయాల వరకూ అన్నీ ఈ ఒక్క సన్నివేశంతో భ్రష్టు పట్టిపోయినాయని అల్లరి చేస్తారు.ఇదే కసూరి ఇదే పుస్తకాన్ని పాకిస్తాన్ నడిబొడ్డున ఆవిష్కరించుకోగలడా?లేదు,అక్కద జరిగితే అతనికి వచ్చే నిరసన మోతాదుని వూహించుకుంటే ఇప్పడ శివసేన చూపించిన నిరసన చాలా చాలా సభ్యతాయుతమైన నిరసన!

     ఈ విషయాలు తన దేశంలో చెప్పుకోలేని దిక్కుమాలిన తనం తనది,మనకెందుకండీ వాడిమీద ఐంత ఆప్యాయత ఒలకబోసే అతి మనస్తత్వం?ఈ పెద్దమనిషి అక్కడ విదేశాంగ మంతిగా ఉన్నాడు అంటే మన దేశం మీదకి టెర్రరిష్టుల్ని వొదిలే వ్యూహాలలో ఇతడూ భాగస్వామీ అని కూడా అర్ధం కావదం లేదా?వృధ్ద వేశ్యా పతివ్రతా అన్నట్టు మనకి నీతిసూత్రాలు చెప్పాడు,మనతో చప్పట్లు కొట్టించుకున్నాడు!ఇందులోని అతిగొప్ప వాస్తవాల్లో మచ్చుకి ఒక్కటి చూదండి - "2005లో పర్వెజ్ ముషారఫ్ ఇక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే సందర్భంలో ఒక ఇబ్బందికరమీన సన్నివేసం యెదురైంది ఆయనకి.తను చదువుతున్న ప్రసంగం భావమేమిటో తెలియకుండానే భారతదేశం మీద విమర్సల్ని గుప్పించే ఆ ప్రసంగాన్ని చదివేశాడు.కానీ 2004లో తన ప్రభుత్వమే తీసుకున్న కొన్ని నిర్నయాలకి అది విరుధ్ధమ అని అతనికి అప్పుడు తెలియదు.దానికి కారణం మునీర్ అక్రం అనే ఒక భారతద్వేషి అసలు ప్రసంగానికి బదులుగా ఆఖరి నిముషంలో ఈ ప్రసంగాన్ని ఇవ్వడం.",ఇంకా మీకు అనుమానంగా ఉందా మనం యెర్రిపప్పలమైనామని?!

శివసేన ఇప్పటి నిరసన మాత్రం నాకు నిజంగా నచ్చింది - శభాష్!

Thursday, 15 October 2015

కళాపూర్ణోదయం ఒక శృంగార విజ్ఞాన సర్వస్వం!

     నేనొక చిలకని!అలాంటిలాంటి చిలకననుకుంటున్నారేమో నన్ను,బ్రహ్మలోకంలో సరస్వతీదేవి వద్ద ఉన్న పెంపుడు చిలకని నేను!యెక్కడున్నా చిలక చిలకే గదా అని తీసిపారెయ్యకండి - అర్ధంతరంగా నడమంత్రం జేరితే యెంకటేసు కాస్తా వెంకటేశ్వర్లు కావటం లేదూ?ఒకసారేమైందో తెలుసా,బ్రహ్మ పంజరంలో ఉన్న నన్ను చూసి,"ఏమే చిలుకా!ఏమీ తోచకుండా ఉన్నది.ఒక కమ్మని కధ చెప్పవే?" అన్నాడు.అప్పుడు నేను - "స్వామీ!మీ ముందు నేను కధలు చెప్పేపాటి దాననా!" అన్నాను."అయితే నేనే నీకొక కధ చెబుతాను వినవే" అంటూ పరమేష్ఠి ఒక కధ చెప్పాడు.

   "కాసారపురం అనే పట్టణంలో కళాపూర్ణుడనే ఒక రాజున్నాడు.అతను పుట్టుకతోనే యువకుడుగా పుట్టాడు.స్వభాసిధ్ధుడు ఇచ్చిన అరుణమణిని ధనుర్భాణాలను స్వీకరించి బలాఢ్యుడై తన ప్రాభవాని కడ్డుగా ఉన్న రాజులందరినీ జయించాడు.ఇలా ఉండగా ఒకప్పుడు మదాశయుడనే రాజు రూపానుభూతి అనే భార్యతోను,ధీరభావుడనే మంత్రితోను వచ్చి కళాపూర్ణుడితో యుధ్ధానికి తలపడ్డాడు.అయితే కళాపూర్ణుడు తన కోదండవిహారంతో వారిరువురినీ చిత్తుచిత్తుగా ఓడించాడు.ధీరభావుడు పారిపోయాడు.మదాశయుడు శరణు వేడుకున్నాడు.అప్పుడు కళాపూర్ణుడు మదాశయుణ్ణి,అతని భార్యను కూడా తనకు సేవలు చేయడానికి నియమించాడు."

    బ్రహ్మ ఇట్లు కధ చెప్తుండగా విని సరస్వతి నవ్వింది."ఏమే చిలుకా!అయితే ఆ కళాపూర్ణుడు తరవాత ఏమైనాడు?అతని తల్లి దంద్ర్లూ,భార్య ఎవరు?అది అడుగవే" అని నాతో పలికింది.అప్పుడు నేను అట్లాగే బ్రహ్మను అడిగాను.అంతట ఆయన "కళాపూర్ణుడి భార్య అభినవ కౌముది.తండ్రి సుముఖాసత్తి!తల్లి మణిస్తంభుడు?" అని చెప్పాడు.ఇది వినగానే సరస్వతీదేవికి కోపం పూర్తిగా పోయి నవ్వు వచ్చింది.పకపకా నవ్వుతూ "ఏమిటీ?ఆ రాజు తల్లి మగవాడూ,తండ్రి ఆడదీనా?విడ్డూరంగా ఉన్నదే!" అని ప్రశ్నించింది.తరచాత కధ ఏమిటో చెప్పమని కూడా పరమేష్ఠిని కోరింది.

     అప్పుడు బ్రహ్మ శారదకు కోపం పోయిందని,ప్రసన్నురాలైనదనీ గ్రహించాడు.ఈ కధ చెప్పి తను ఆమెను వశపరుచుకొనగలిగితిని గదా అని లోలోపల సంతోషించాడు.మన్మధోద్రేకం పెల్లుబికి రాగా శారద కంఠాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు!తన నాలుగు ముఖాలతో ఆమె అధరాన్ని తనివితీరా ముద్దాడాడు!అంతట సరస్వతి "తరవాత కధ ఏమిటో చెప్పండి స్వామీ!" అని తొందరపెట్టింది.అప్పుడు బ్రహ్మ "తరవాత ఏమున్నదీ!ఆ మహారాజు సత్వదాత్ముడనే తన మంత్రి అంగదేశమందలి క్రముకకంఠోత్తరమనే పట్టణమున తనకు పట్టము గట్టి నిల్పగా రాజ్యం చేస్తున్నాడు.సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నాడు.ఇక మదాశయుడు ఆ పట్టణానికి బంగారు కోట కట్టించి రాజు కృపకు పాత్రుడైనాడు!తన భార్యతో కూడా రాజుకు సేవ చేస్తూ గడుపుతున్నాడు.ఆ కళాపూర్ణుడి దగ్గిర గొప్ప మహిమ గల మణి ఒకటి ఉన్నదని చెప్పాను గదా!దానిని చూస్తూ ఉన్న కారణంగా మదాయ రూపానుభూతులకు మధురలాలస అనే చక్కని కుమార్తె పుట్టింది.మదాయుడి దగ్గిర నలుగురు పురోహితులు ఉన్నారు.ప్రధమాగముడు,ద్వితీయాగముడు,తృతీయాగముడు,తురీయాగముడు - అని వారి పేర్లు!వారు కూడా యధాశక్తి తమ ప్రభువు ధరించే ఆ దివ్యమణిని పర్యాయంగా పట్టి దాని సంస్పర్శన సుఖం చేత ఆనందం పొందుతూ ఉన్నారు.వారంతా తనను ఆశ్రయించుకుని ఉన్నవారు కావడం వల్ల వారి చేష్టలకు కళాపూర్ణుడు కూడా సమ్మతించాడు.అయితే ఒకసారి ఆ నలుగురు పురోహితులలో ఒకడు ఆ మణిని గట్టిగా నొక్కిపట్టగా కళాపూర్ణుడికి కోపం వచ్చింది.వాళ్ళను వెళ్ళగొట్టాడు.వారు అపరాధం చేసినందున వారి స్వామి అయిన మదాశయుని బంగారుకోటలో ఉండటాన్ని కళాపూర్ణుడు సహించలేకపోయాడు.వెంటనే దానిని పడగొట్టించాడు.అందుకు మదాయుడు కోపం తెచ్చుకోకుండా స్వామీ - ఎంతచెడ్డా నేను మీవానే - వద్దంటే యెక్కడికి పోతాను - మీ దేశంలోనే యెక్కడో ఒకచోట బ్రతుకుతాను అని ప్రార్ధించాడు.తన భార్య రూపానుభూతిని తన కుమార్తె మధురలాలసను తీసుకుని క్రముకకంఠోత్తరపురం నుండి దూరంగా వెళ్ళీపోయాడు.అలా కొంత దూరం వెళ్ళగా ఒకచోట పూర్ణకలశద్వయం శోభాయమానమై కనిపించింది.అందుకు సంతోషించి వాటి మధ్యదేశంలో స్థిరనివాసం యేర్పరచుకున్నాడు.అయితే క్రముకకంఠోత్తరపురం నుండి బయలుదేరి వచ్చేటప్పటి ప్రయాణక్షోభ వల్ల వారి కుమార్తె మధురలాలస కృశించిపోయింది.ఎన్నాళ్ళు గడించినా ఆ పిల్ల మళ్ళీ తేరుకోలేదు.అందువల్ల్ల మదాయుడు మళ్ళీ తన కుటుంబంతో క్రముకకంఠోత్తరపురానికి తిరిగి వచ్చాడు.సకుటుంబంగా కళాపూర్ణుడి కొలువుకి వెళ్ళి అతన్ని సందర్శించాడు.కళాపూర్ణుని చూడడం వల్ల మధురలాలస కృశత్వం పోయి ఎప్పటివలె పుష్టిగా తయారైంది.అప్పుదు మదాయుడు రూపానుభూతి తమ ముద్దుల కూతురుకు పట్టిన అవస్థ చెప్పుకున్నారు.కరుణించమని వేడుకున్నారు.కళాపూర్ణుడు ప్రసన్నుదై వారిని సమాదరించాడు.ప్రధమాగమాది పురోహితులు కూడా మళ్ళీ ఎప్పటివలె వినయవిధేయతలతో మెలగుతూ వచ్చారు.కొంత కాలం గడిచింది.మధురలాలస పెరిగి పెద్దదయింది.కళాపూర్ణుని సౌందర్యం చూచి ఆమె అతన్ని మోహించింది."

     బ్రహ్మ ఈ విధంగా చిలవలు పలవలుగా అల్లుకుపోతున్న కధ చెప్తుండేటప్పటికి వింటున్న సరస్వతికి రోషం వచ్చింది."చాల్లెండి ఇక మీ చమత్కారాలు!ఇప్పుడు మనమధ్య జరిగినదే - మీరొక కధగా కల్పించి మారుపేర్లు పెట్టి చెప్పారు.ఆ మాత్రం నాకు తెలియదనుకున్నారా?నన్ను తెలివితక్కువదాన్ని చేసి తాటాకులు కట్టాలనుకున్నారా?" అని చిరుకోపంతో నిలదీసింది.

     "ఇక్కడి సరోవరానికే మీరు కాసారపురం అని పేరు పెట్టారు.సరోవరజలంలో ప్రతిఫలిస్తున్న నా ముఖబింబాన్ని కళాపూర్ణుడని చెప్పారు.నా ముఖచంద్రుదు తక్కిన ముఖచంద్రుల కంటె మిన్నగా ఉన్నాదని చెప్పటానికి గాను ఆ కళాపూర్ణుడు తక్కిన రాజులందరినీ జయించాదని చెప్పారు.ఇక అతడు స్వభావుడనే సిధ్ధ్డి వల్ల ధనుర్బాణాలు,అరుణమణీ,శలాక సంపాదించాదని చెప్పటం భ్రూలతా,వీక్షణ,అధరములు స్వభావము చేతనే ఆకర్షణ కలిగినవని చెప్పడం లేదా?ఇక మదాశయుడు రూపానుభూతితోను ధీరభావునితోను వచ్చాడనీ కళాపూర్ణుడు తన కోదంవిహారము చేత ధీరభావుని తరిమివేశాడనీ మదాశయ,రూపానుభూతులకు ఆశ్రయం ఇచ్చి వారి సేవలందుకున్నాదని వర్ణించారు మీరు - ఆ కాసారానికై మీ హృదయం మీ దృష్టి ధైర్యంతో ఒక్కించుక ప్రవర్తించగా - నా ప్రతిబింబం భ్రూవిలాసంచే మీ ధైర్యాన్ని పోగొట్టి మీ హృదయాన్ని దృష్టిని ఆకర్షించిందని చెప్పడానికే మీరు అలా వర్ణించారు.అవునా?మీ మాటలు విని నాకు నవ్వు వచ్చంది.అప్పుడు మీరు నా ప్రతిబింబంలో కనిపించిన నవ్వుకు లేత వెన్నెలతో అభేదం కల్పించారు.దానికి అభినయ కౌముది అని పేరు పెట్టి స్త్రీని చేసి అది కళాపూర్ణుణ్ణి వరించిందన్నారు.ఇకపోతే కళాపూర్ణుడి తండ్రి సుముఖాసత్తి అనీ,తల్లి మణిస్తంభుడనీ తల్లిదండ్రుల పేర్లు తారుమారు చేసి చెప్పారు.అది నా ప్రతిబింబం శోభనమగు ముఖసామీప్యం కారణంగా సరోవరం నడుమన గల మణిస్తంభము యొక్క గర్భమున ఉదయించేనని చెప్పడం కాదా?నేను మీ మాటలకు నవ్వుతూ మీకు అభిముఖంగా తిరిగాను.అప్పుడు సరోవరంలో ప్రతిబింబం మాయమై నా ముఖం మీ యెదుట కనిపించింది.అది నా దేహమందు కంఠం పై భాగాన కనిపించటం చేతనే కదా మీరు కళాపూర్ణుడు అంగదేశమున క్రముకకంఠోత్తర పురమున పట్టం కట్టుకున్నాని వర్ణించినది?అది నా ఆత్మాధీనం కనుక సత్వదాత్ముడని పేరు పెట్టారు.తరవాత మీరు నా కంఠాన్ని కౌగిలించారు.అది మీ ఆత్మాధీనం కావడం మీ బాహువులు సువర్ణమయం కావడం - దీనినే మీరు మదాశయుడు క్రముకకంఠోత్తరపురాన బంగారుకోట కట్టించాని వర్ణించారు!మీ ఆత్మ, దృష్టి ఏ మమతావశంబుననో నా ముఖముపై పాయక వర్ధిల్లుతూ మధురాధరేచ్చ కలిగియుండటం గురించి మీరు మదాయ రూపానుభూతులు కళాపూర్ణుని సేవిస్తూ అతని మణిలాక మహత్యం వల్ల మధురలాలస అనే కుమార్తెను కన్నారని అభివర్ణించారు,అవునా!ప్రధమాగమాదులగు మదాశయుని పురోహితులు ఆ మణిని పట్టి చూస్తూ దాని స్పర్స వల్ల ఆనందం పొందేవారని మీరు అన్నారు.నన్ను ముద్దాడిన పిమ్మట మీ నాలుగు ముఖాలూ అధరామృత పానం వల్ల ఇంపొందినవని చెప్పడానికి మీరీ కల్పన చేశారు.తరవాత అధరపీడనం వల్ల్ల నాకు కోపం వచ్చింది.మిమ్మల్ని వారించాను.మీ కౌగిలి విడిపించుకున్నాను.ఈ విషయాన్నే మీరు - పురోహితులలో ఒకడు మణిని గట్టిగా నొక్కినప్పుడు కళాపూర్ణుడు కోపించి వారిని వెళ్ళగొట్టాడనీ మదాశయుడు కట్టించిన బంగారుకోటని పడగొట్టాడనీ వర్ణించారు.అటుపైన మీ మనస్సూ, దృష్టీ నా ముఖంపైన కాక తక్కిన అవయవాలపై లగ్నమైనాయి.దానినే మీరు మదాయుడు భార్యాసమేతుడై కళాపూర్ణుని సేవ చాలించి,తదాశ్రయమైన అంగదేశానికి వెళ్ళిపోయాడని చెప్పారు.పూర్ణకలశద్వయాన్ని చూచాడని చెప్పి నా కుచకుంభాలను,మధ్యదేశంలో ఉన్నాడని చెప్పి నా నడుమును వర్ణించారు,అవునా?ముఖమును చూడటం మానినందున అధరేచ్చ అణిగింది మీకు.ఆ విషయాన్నే మీరు ప్రయాణక్షోభ వల్ల్ల మధురలాలస కృశించిందని చెప్పారు.తర్వాత మళ్ళీ మీ చిత్తం,మీ దృష్టి నా ముఖం మీద లగ్నమైనాయి.నన్ను మీరు తనివితీర ముద్దాడి సంతుష్ఠులైనారు.ఈసారి మీ కోరిక తీరింది.ఈ సంగతినే మీరు మదాయుడు మరల కళాపూర్ణుడి దగ్గరకు వచ్చాని,మధురలాలస కృశత్వం పోయి తిరిగి యౌవ్వనం పొందినదని,కళాపూర్ణుని అనుగ్రహం పొందినదని చమత్కారంగా కల్పన చేశారు!ఈ మాత్రం నాకు తెలియదనుకున్నారు,ఇప్పుడు చెప్పండి!నేను చెప్పినదంతా సరిగ్గా ఉందా - లేదా!"

     బ్రహ్మ చెప్పిన కధకు సరస్వతి ఈ విధంగా వ్యాఖ్యానం చేసి ఆ కధలోని అంతరార్ధాన్ని విడమరిచి చెప్ప్పింది.బ్రహ్మ సరస్వతుల శృంగార క్రీడయే ఈ కధారూపం దాల్చాయి.బ్రహ్మ సరస్వతిని మెచ్చుకున్నాడు - ఆమె చెప్పిన వ్యాఖ్యానం నూటికి నూరుపాళ్ళు సరిగ్గా వుందని శ్లాఘించాడు.నేను పక్షిని కనుక నాకు తెలియదనో,మరే కారణం వల్లనో బ్రహ్మ సరస్వతులు నన్ను లెక్కలోకి తీసుకోక తమ శృంగారక్రీను గురించి ఈ విధంగా నా సమక్షంలోనే మాట్లాడుకున్నారు.కొన్నాళ్ళు గడిచాక ఒకప్పుడు ఈ ప్రసంగాన్ని మననం చేసుకుంటూ ఉన్నాను.ఆ సమయంలో బ్రహ్మను సేవించటానికి దేవేంద్రుడు వచ్చి ఉన్నాడు.ఆయన వెంట రంభ కూడా వచ్చి బ్రహ్మలోకమంతా తిరుగుతూ నేనున్న చోటికి వచ్చి నేను మనం చేసుకుంటుండగా విన్నది.చాలా బాగున్నదని రంభ ఆ కధని నా చేత రెండు మూడు సార్లు చెప్పించుకున్నది.అంతలో సరస్వతీదేవి అక్కడికి వచ్చి ఎక్కడ లేని కోపంతో "ఓసీ!ఏమిటే ఆ వాగుడు?" అని తిట్టింది."నీవు చేసిన పనికి భూలోకంలో వేశ్యవై పుట్టుదువు గాక!" అని నన్ను శపించింది.సరస్వతీదేవి కోపం చూసేటప్పటికి రంబహ్కు వొణుకు పుట్టి ఒక రత్నస్తంభం చాటుకు పోయి దాక్కుంది.ఇంతలో బ్రహ్మ కూడా అక్కడికి వచ్చాడు.విషయమంతా తెలుసుకుని "ఏమే!మీ అమ్మ నీకు శాపం ఇచ్చిందని దుఃఖపడకు.ఆ జన్మలో వేశ్యగా పుట్టినప్పటికీ మరుసటి జన్మలో మదాయుడనే రాజుకు మధురలాలస అనే పేరుతో పుత్రికవై జన్మిస్తావు.కళాపూర్ణునే గొప్ప రాజుకు భార్యవౌతావు.భోగభాగ్యాలు అనుభవిస్తావు" అని నన్ను ఓదార్చాడు.అప్పుడు సరస్వతీదేవి బ్రహ్మను చూచి "ఏమిటి ప్రాణేశ్వరా!మళ్ళీ మీరు వెనుకటి కధ ప్రారంభించారే!" అంది.

     "అవును,నేను చెప్పినట్లు జరిగి తీరుతుంది" అన్నాడు బ్రహ్మ."అయితే మీరన్నట్లు తల్లి మగవాడు,తండ్రి ఆడది కూడా అవుతుందా?" అని శారద ప్రశ్నించింది."అవును,అలాగే జరుగుతుంది" అని బ్రహ్మ సమాధానం చెప్పడు."యేమైనప్పటికీ ఏకాంతంగా మనం సంభాషించుకున్న వృత్తాంతం లోకంలో వెల్లడి కావదం శ్రేయస్కరం కాదు స్వామీ!" అని మళ్ళీ అడ్డు చెప్పింది సరస్వతి."ప్రాణేశ్వరీ!మనం ఎంత వద్దన్నా,ఏమి చేసినా ఈ కధ లోకంలో వ్యాపించక మానదు" అని బ్రహ్మదేవుడు ఖండితంగా చెప్పాడు.అంతట సరస్వతీదేవి రంభను బయటికి పిలిచి "రంభా!చిలుక వల్ల విన్నావు కానీ,ఎక్కడయినా సరే,ఎప్పుడయినా సరే,నీవు ఈ విషయం బయటపెట్టావా జాగ్రత్త!" అని ఆజ్ఞాపించింది.అలాగే ఈ విషయం ఎవరి వద్దా బయటపెట్టనని బ్రజ్మచేత కూడా సరస్వతి వాగ్దానం చేయించుకున్నది."ఇక ఈ సంగతి ఎలా వెల్లడి అవుతుందో చూస్తాను" అని పంతంగా పలికింది.అయితే బ్రహ్మ ఆమె మాటలు ఖండించాడు.ఈ కధ భూలోకంలో వ్యాపించటానికి ఏదో విధంగా మార్గం ఏర్పడుతుందనీ ఈ కధ చెప్పిన వారూ,విన్నవారూ కూడా భూమిపై పుత్రపౌత్రాభివృధ్ధి,ధనధాన్యసంపత్తి గలిగి భోగభాగ్యాలతో కలకాలం సర్వసౌఖ్యాలూ అనుభవిస్తారనీ, ఆ విధంగా తను వరం ఇచ్చి ఆశీర్వదిస్తున్నాననీ బ్రహ్మదేవుడు పలికాడు!
-----------------------------------------------------------------------------------------------------------------
     ఒక అద్భుతమైన కల్పిత కధాకావ్యం కళాపూర్ణోదయం.దీనిని రచించిన వాడు పింగళి సూరన.మన ప్రాచీన కవుల్లో యెవరి కాలాన్ని లెక్కగట్టాలన్నా అదో బ్రహ్మభెద్యమైన ప్రహేళికలా తయారవుతున్నది.దీనికి కారణం "పురాణ మిత్యేవ న సాధు సర్వం!" అన్న వాక్యాన్ని బట్టి తమ కావ్యం త ప్రాచీనమైనది అయితే అంత గొప్ప అనే భావం కావచ్చు.మరొకటి తమ రచనల పట్ల ఉండే గర్వం,తమ అస్తిత్వం పట్ల వినయం కలిసి "నా గురించి నేను చెప్పుకోవడం దేనికి?నా కావ్యంలో సత్వం ఉండి అది ఆచంద్రతారార్కం నిలబడితే చాలదా!" అనే మనస్తత్వం కూడా మనకి వారి గురించి ఏ సాక్ష్యాల్నీ వారి కావ్యాల్లో కనబడకుండా చేసింది.ఈ కావ్యాన్ని సూరన నంద్యాల కృష్ణభూపతికి అంకితం ఇచ్చాడు.నంద్యాల కృష్ణభూపతి శా.శ 1526(క్రీ.శ 1605) ప్రాంతంలో నంద్యాలకు రాజుగా ఉన్నట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.గరుడపురాణం,గిరిజా కళ్యాణం,రాఘవ పాండవీయం,కళాపూర్ణోదయం,ప్రభావతీ ప్రద్యుమ్నం ఇతని రచనలు.మొదటి రెండు దొరకటం లేదు.రాఘవ పాండవీయం రెంర్ధాలు వచ్చే విధంగా రామాయణ మహాభారత కధల్ని ఒకే కావ్యంలో జోడించి చెప్పిన ద్వర్ధి కావ్యం!రెండవదైన కళాపూర్ణోదయం ఎనిమిది ఆశ్వాసాల  అద్భుత కావ్యం.

   మహాకవి సూరనార్యుడు కళాపూర్ణోదయ కధను ఎనిమిది ఆశ్వాసాలుగా రచించిన తీరు చూస్తే అత్యద్భుతమైనదిగా కనిపిస్తుంది.కధను వివరంగా చెప్పే పధ్ధతులు రెండు.సంఘటనలు జరిగిన కాలక్రమానుసారంగా కధను అల్లుకుపోవడం ఒక పధ్ధతి.అలాకాక కాలక్రమాన్ని వదలిపెట్టి సందర్భోచితమైన ఏదో ఒక సంఘటనతో కధ ప్రారంభించిన అతరువాత ముందువెనుకలుగా కధను పెంచుకుంటూ పోయి ఒక ఘట్టంలో పూర్తి చేఅయదం రెందవ పధ్ధతి.ఇలాంటి పధ్ధతిని అనుసరించిన ఆంధ్రకవి మరొకరు లేరు!

     కాలక్రమాన్ని బట్టి చూస్తే పైన నేను ఉదహరించిన కధా ప్రారంభం అయిదవ ఆశ్వాసంలో వస్తుంది.మరొక కవి అయీతే దానినే ప్రధమాశ్వాసంగా చేసి కధ మొదలు పెట్టేవాడు.అలాకాక సూరనార్యుడు కడపటి విషయంతో కధ ప్రారంభించాడు.కధ మధ్యభాగాన్ని ముందు వెనుకలు చేశాడు.చేసి కధ మొదటి భాగాన్ని చివర చేర్చాడు.అలా చేర్చి,ప్రధాన కధతో చాలా దగ్గర సంబంధం ఉన్నప్పటికీ ఆ విషయం తెలియనివ్వకుండానే అనేక అవాంతర కధల్ని చమత్కారంగా కల్పించాడు.ఆది నుంచి అంతం వరకూ కనపడీ కనపడకుండా ప్రధాన కధ మహావేగంగా పరిగెత్తేటట్లు కావ్యం రచించాడు.కనుకనే ఆషామాషీగా కళాపూర్ణోదయం చదివితే అర్ధం కాదు.శ్రధ్ధగా రెండు మూడుసార్లు చదివితే చదివిన కొద్దీ చవులూరించే కమ్మని కావ్యం ఇది!ఆసక్తితో చదవటం మొదలుపెడితే అయిపోయే వరకూ చుట్టలు చుట్టలుగా చుట్టుకున్న జిలేబీ తింటున్నట్టు ఉంటుంది - ఒక్కో చోట ఒక్కో రకం కిక్కు!

     ప్రధమాశ్వాసంలో కధ బ్రహ్మలోకంలోని చిలక మొదటి జన్మలో పుట్టిన కలభాషిణికి నలకూబరుడిని పెళ్ళాడాలనే కోరికా మణికంధరుదికి రంభ మీద మోజూ పుట్టేవరకూ నడుస్తుంది.కధకు రంగస్థలం ద్వారక.కాలం శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్న కాలం.కలభాషిణి తన స్నేహితురాళ్లతో కలిసి ఉయ్యాల లూగుతుండగా సరిగ్గా ఆ సమయానికే నారదుడు తన శిష్యుదైన మణికంధరుడితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆకాశమార్గాన వస్తుంటారు.మణికంధరుడు వీళ్ళు ఉయ్యాల లూగుతూ ఉంటే కాళ్ళు ఆకాశంలోకి దూసుకుపోవడాన్ని గురించి రంభ లాంటి అప్సరసల్ని అందంలో మాతో పందేనికి వస్తారా అని కయ్యానికి కాలు దువ్వుతున్నట్టు ఉందని పోలుస్తాడు.దానికి నారదుడు కూడా నీ కవిత్వం బాగుంది, నువ్వు నిజమే చెప్పావు అని పొగుడుతాడు.అప్పుడే రంభా నలకూబరులు కూడా దివ్యవిమానంలో అటుగా ప్రయాణిస్తుంటే ఈ మాటలు విన్న రంభకి యెక్కడ లేని అసూయా పుట్టుకొచ్చింది.దాంతో వాళ్ళ విమానంలోకి వీళ్ళిద్దర్నీ పిలిచి కూర్చోబెట్టి రంభ తన మనసులో మాటని అడిగేసింది "మీ మాటల్ని విన్నాను,మాట అనేముందు కాస్త ఆలోచించారా?నా ప్రక్కనున్నవాడు నలకూబరుడు.కుబేరుని ముద్దుల కొడుకు.చక్కదనంలో జగన్మోహనాకారుడు.రమ్మని చేసైగ చేస్తే చాలు మూడు లోకాలలో ఉన్న సుందరాంగనలందరూ ఉరుకుతూ వచ్చి కౌగిట్లో వాలుతారు.అయినా నలకూబరుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నాడంటే దాని అర్ధమేమిటి మునీంద్రా?చక్కదనంలో నన్ను మించినవారు లేరనే కదా!" అని.దానికి నారదుడు కూడా తగ్గకుండా "అన్ని రోజులూ ఒక్కలాగే ఉంటాయని అనుకోకు.నీలాంటి చక్కని యువతి అతనికీ,నలకూబరుని వంటి చక్కని యువకుడు నీకూ తారసపడి మీ హృదయాల్ని కలచి వేస్తారేమో,ఎవరికి తెలుసు?ఈ ప్రేమలూ పొంగిపోవడాలూ ఎంతసేపు!" అని మెత్తని కత్తితో కోసినట్టు జవాబు చెప్పటంతో రంభ ఋషివాక్యం నిజమవుతుందేమోనని భయపడి వాదన పెంచకుండా వెనక్కి తగ్గింది.గురుశిష్యు లిద్దర్నీ కలభాషిణి ఉన్న వనంలోనే దించి సెలవు పుచ్చుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.ఇటువైపు అలభాషిణి తనకు దగ్గిరగా జరుగుతున్న వినింది.దానికి తోడు నలకూబరుణ్ణి చూసి మోహం పెంచుకుంది.నారదుణ్ణి దించాక ద్వారకలో ఉన్నారు గాబట్టి రంభా నలకూబరులు విమానం కొంచెం కింది నుంచే పోనిస్తూ ఉండటంతో వారు చూదకుండా విమానం క్రిందుగా కొంతదూరం వెళ్ళీ వాళ్ళిదరూ మాట్లాడుకున్న కొన్ని వింతైన విషయాల్ని విన్నది.మొత్తం విషయాలు నారదుల వారి ద్వారా తెలుసుకుంటుంది.నారదుడు కూడా రంభకి సవతిగా ఉండటానికి కలభాషిణి తగినదనే ఉద్దేసంతో చిలక వృత్తాంతం తప్ప మిగిలినాన్నీ చెప్పి రంభకి సవతిపోరు రాబోతుందని కూడా చేప్పి అది నువ్వే కాకూడదా అని కూడా అనేసి కలహానికి బీజం వేస్తాడు.

     అలా మొదలైన కధ తొలుత బ్రహ్మ చెప్పిన కధలోని అన్ని పాత్రలూ ఈ భూమి మీద మనుషులుగా పుట్టి ఆయా సన్నివేశాలన్నీ వాళ్ళ మధ్యన అదే నాటకీయతతో యెలా నడిచాయో చూపించి వైకుంఠంలోని లక్ష్మీ నారాయణులు కూడా ఈ కధను ప్రస్తావించి ఆశీఃపూర్వాకంగా చెప్పే మంగళకరమైన వాక్యాలతో కధని ముగిస్తాడు.పద్యకావ్యంగా చదవటం అపురూపమైన అనుభవమే అయినా ఇప్పుడు అది మనబోటి వాళ్లకి దొరుకుతుందా అనేది అనుమానమే!జనంలో రాన్రానూ సాహిత్యం పట్ల ఆసక్తి తగ్గిపోతుండటం వల్ల మనం చాలా మంచివనుకునే పుస్తకాలు కూడా ప్రచురణకి నోచుకోవడం లేదు - కొనేవాళ్ళు లేనప్పుదు ప్రచుర కర్తలు మాత్రం యేం చేస్తారు?తేలికపాటి అచనంలోకి రెంటాల గోపాలకృష్ణ గారు అనువదించగా జయంతి పబ్లికేషన్స్ ద్వారా 2015లో కూడా దొరకటం ఒకరకంగా సంతోషించదగ్గ విషయమే!

     కధ చిక్కురొక్కురుగా ఉంటుంది కాబట్టి కధా ప్రారంభం మాత్రమే ఇక్కడ చెప్పాను గానీ ఉపకధల్లో కొన్నిటి గురించి చెప్తాను.యెందుకంతే కధగా చదివినా వాటి ప్రాముఖ్యతకి సంబంధించిన క్లూలు అక్కడ ఉండవు.నాకెట్లా తెలిసినయ్యంటారా, అలాంటి విషయాల్లో నేను షెర్లాక్ హోంసు కన్నా ఉద్దండుణ్ణి!నేను ఇక్కడ చేసిన విశ్లేషణల్ని మీరు కధ చదివాక పోల్చుకుంటే ఆ విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది.ఈ పోష్టు మాత్రం చదివితే మీకు యెలాంటి ఉపయోగమూ ఉందు.పుస్తకం చదువుతునప్పుడు గానీ ఇక్క నేను చేసిన విశ్లేషణలు పూర్తిగా అర్ధం కావు.


మాయా రంభ - మాయా నలకూబరుల ప్రణయం:

     నారదుడు ద్వారకకు రావడానికి అతనికి తుంబురుడితో ఉన్న ఒక పాత స్పర్ధ.అతన్ని మించి గానవిద్యలో ప్రావీణ్యం సాధించడానికి తపస్సు చేస్తే శ్రీకృష్ణుడిగా ద్వారకలో ఉన్నప్పుదు నీ కోరిక తీరుస్తానని వరమిస్తాడు.ఇప్పుడు ద్వారకలో అతని శిక్షణ పూర్తయ్యాక మణికంధరుణ్ణి దేశాటన చెయ్యమని పంపించి తన దారిన తను వెళ్తాడు.కొన్ని క్షేత్రాల దర్సనం తర్వాత మణికంధరుడు అననతసయనంలోని ఒక వనంలో సమాధి నిష్ఠుదై శ్రీహరిని గురించి తపస్సు చేస్తుంటే ఆ తపస్సును భగ్నం చెయ్యడానికి ఇంద్రుదు రంభని నియోగిస్తాడు.

     కలభాషిణి యేమో ఒంటరిగా నలకూబరుణ్ణి యెలా చేరుకోవాలో తెలియక దిగాలు పడుతుంటే మణిస్తంభుడనే సిధ్ధుడు సింహ వాహనం మీద ఆకాశమార్గంలో ఆమె ముందు దిగి తనకు దూరశ్రవణ దూరదర్శనాది శక్తులున్నాయని చెప్పి నమ్మించాడు.నారదుడు తనకిచ్చిన వరాల గురించీ ఇంకా అతి రహస్యమైనవీ చెప్పి నమ్మించేసరికి కలభాషిణికి ఇతని ద్వారా నలకూబరుణ్ణి చేరుకోవచ్చుననే ఆ పుడుతుంది.తనూ సేవలు చేసి అతన్ని ప్రసన్నం చేసుకుని మణికంధరుడు ఇప్పుడెక్కడ యెలా ఉన్నాడని అడిగితే అతని తపస్సు భగ్నమైంది,రంభతో క్రీడిస్తున్నాడని చెప్తాడు.మెల్లగా నలకూబరుది గురించి ఆరా తీసింది.నలకూబరుడు కూడా రంభ మణికంధరుని తపస్సును భగ్నం  చెయ్యటం పూర్తి కాగానే మళ్ళీ తోడుకొని పోవటానికి అక్కడే సంచరిస్తున్నట్లు తెలిసి తనని ఏ విధంగా నైనాసరే నలకూబరుడి చెంతకి చేర్చమని ప్రార్ధించింది.మొదట ఇష్టం లేనట్టు నటిస్తూ తర్వాత తన సింహ వాహనం మీదనే తీసుకెళ్తానని చెప్పి దారిలో మృగేంద్ర వాహన ఆలయం దగ్గిర దింపి పూలు కోసుకొస్తానని పూలతోటలోకి వెళ్తాడు.అక్కడ సుముఖాసత్తి అనే ఒక ముదుసలి కలభాషిణికి సిధ్ధుడు దగ్గిర లేని వీలు చూసుకుని అసలు కధ చెప్పి మళ్ళీ సిధ్ధుడు కలభాషిణిని బలి ఇవ్వబోయే సమయానికి తన కంఠాన్ని అడ్డు పెట్టి కలభాషిణిని రక్షిస్తుంది.రెంవసారి సిధ్ధుడు కలభాషిణిని వధించబోతే వాళ్ళిద్దరూ యెవరో విసిరేసినట్టు పోయి దూరంగా పడతారు,యెక్కద>సరిగ్గా మణికంధరుడు తపస్సు చేసుకుంటున్న వనంలో!అప్పటి వరకూ బలి ఇచ్చి శక్తులు పొందాలని చూసిన వాడిలో కామం ప్రకోపించి సిధ్ధుడు కలభాషిణిని బలాత్కరించబోయినప్పుడు నలకూబరుడు వచ్చి సిధ్ధుడితో తలపదతాడు.

    సిధ్ధుడు పారిపోతున్నా వెంటబడి తరుముకుంటూ వచ్చి సంహరించబోయే సమయానికి రంభ ఆవైపుగా వచ్చి నలకూబరుణ్ణి ఆపి ఆ స్త్రీ యేవరో వెతకమంటుంది.సిధ్ధుడు తీరా తాము పడిన ప్రదేశానికి వచ్చి చూస్తే కలభాషిణి కనపడదు.ఇంతలో మరొక రంభ అక్కడికి వచ్చి అందర్నీ విభ్రాంతికి గురి చేస్తుంది.చాలాసేపు వాగ్వాదం,అయోమయం,వినోదం,విషాదం లాంటివన్నీ జరుగుతాయి.ఆఖరికి ఒక రంభ దేవసభకి రమ్మని సవాలు విసరడంతో రెండవ రంభ మాయా రంభ అని తెలుస్తుంది.ఇంతలో నిజ మైన రంభకి ఇప్ప్పుడు మరొక షాకు!మరొక నలకూబరుడు రంగప్రవేశం చేసి రంభని కంగారు పెడతాడు.మొదట వాళ్ళిద్దరూ పోరాడి తేల్చుకుందామని చూసి ఇద్దరూ సమబుజ్జీలుగా తెలియటంతో అసలు రంభ "పూర్వం కళాపూర్ణుని గురించిన ప్రసంగం మనకు యెప్పుడు వచ్చింది?అప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం - పొల్లు పోకుండా చెప్పు!" అని అడిగి.సరైన జవాబు చెప్పిన అసలు నలకూబరుడితో కలిసి తన దారిన తను వెళ్తుంది.

     ఇక్కడ సన్నివేశం యెంత గందరగోళంగా ఉంటుందంటే మీరు యెన్ని సార్లు చదివినా యెవరు యెవరితో యెప్పుడు యెలా కలిశారో కనుక్కోలేరు.కానీ సంవిధానం అంతా పింగళి సూరన వివరిస్తాడు.అసలు రంభ అసలు నలకూబరుడు,నకలు రంభ నకలు నలకూబరుడు - ఈ రెండు జంటల్లో అటు తిరిగి ఇటు తిరిగి రంభా నలకూబరులు,కలభాసిణీ మణికంధరులు కలిసినట్టు తెలుస్తుంది!యెందుకీ సన్నివేశం కల్పించబడింది అనేది అర్ధం చేసుకోవాలంటే ఆధునిక లైంగిక మనోవైజ్ఞానికశాస్త్రం లోని రెండు సూత్రాలు తెలియాలి.ప్రతి మగాడికీ ఒక "IDEAL SHE" ఉంటుంది.ప్రతి ఆదదానికీ ఒక "IDEAL HE" ఉంటాడు.సుదీర్ఘకాలం పాటు యెవరూ ఒకే వ్యక్తితో వైవిధ్యం లేని ఒకే రకమైన సహచర్యానికి కట్టుబడి ఉండలేరు.నూతనత్వాన్ని కోరుకుంటారు.కానీ సమాజం వైవాహిక విధిలో పవిత్రతని శాసిస్తుంది.వివాహం ప్రధానంగా వారసత్వానికి సంబందించినది కాబట్టి పవిత్రత తప్పనిసరి.అలాంటప్పుడు మనముందు రెండు మార్గాలు ఉంటాయి.పాత సహచరులతో తెగదెంపులు చేసుకుని కొత్త సహచరుల్ని వెదుక్కోవటం - అంత వీజీ కాదు!యెవరూ కనిపెట్టలేని విధంగా సమాజం అనుమతించే దారిలోనే నూతనత్వాన్ని సాధించడం - యెట్లా కుదురుతుంది?యేముందీ,తమ సహచరులతొనే గడుపుతూ మనస్సులో తాము బలంగా కోరుకుంటున్న వ్యక్తితో గడుపుతున్నట్టుగా వూహించుకోవడం - యెంత వీజీ!వ్రతమూ చెడదు ఫలమూ దక్కుతుంది!!ఈ పిట్టకధ ద్వారా పింగళి సూరన ఇచ్చిన క్లూ ఇది - శృంగారం మానసోద్భూతమైన దేహాలు ప్రధానం కాని క్రీడ.ఆట రంజుగా నడిచినంత కాలం యదీ తప్పు కాదు.ఈ ప్రమోదం ప్రమాదం కాకుండా ఉండాలంటే ప్రయత్న పూర్వకంగా నయినా సరే తమ సహచరులకి తమని తాము యెప్పుడూ నూతనంగా ఆవిష్కరించుకుంటూ కనబడాలి.రొటీన్ అనేదాన్ని యెక్కువకాలం కొనసాగించకుండా వెరైటీని చూపించాలి!


సుగాత్రీ శాలీనుల కధ:

     కధలో కధగా వచ్చే ఈ కధని గురించి రచయిత అయిన పింగళి సూరన గూడా యెంతో ప్రత్యేకంగా కొందరు దీనిని పారాయణ గ్రంధంగా చదువుతూ ఉన్నట్టు వర్ణిస్తాడు.మణికంధరుడు తీర్ధయాత్రలలో కాశ్మీర దేశం చేరుకుని శారదా పీఠం దగ్గిర అక్కడి వారంతా ఈ కధని పారాయణ గ్రంధంగా చేసుకుని చదువుతుండటం చూసి అడిగి వివరంగా తెలుసుకున్నట్టు ప్రస్తావించబడుతుంది.

   కాశ్మీర దేశంలోని శారదా పెఠానికి సంబంధించిన ఒక పూజారికి సరస్వతీదేవి అనుగ్రహం వల్ల సుగాత్రి పుట్టింది.శాలీనుడు ఇల్లరికపుటల్లుడిగా అత్తవారింట్లోనే ఉంటున్నాడు.శోభనం నాటి తొలిరాత్రి సుగాత్రిని అందంగా అలంకరించి భర్త దగ్గిరకి పంపిస్తే శాలీనూడు ఆమెని కిందనించి పైకి ఒకసారి తేరిపార జూసి బుస్సూరుమని నిట్టూర్చి అటువైపు తిరిగి పడుకున్నాడు?ఒక్కరోజు కాదు యెన్ని రోజులైనా ఇదే తంతు కావడంతో సుగాత్రి తల్లికి అల్లుడి మీద కోపం పెరిగి తోటపనికి పురమాయించింది.తల్లి తన భర్త చేతగాని తనాన్నీ తన అమాయకత్వాన్నీ తిడుతున్నా,సాటివాళ్ళు వేళాకోళం చేస్తూ యేడిపిస్తున్నా సుగాత్రి మాత్రం భర్తను తప్పుగా తలచకుండా తన మంగళసూత్రం చల్లగా ఉంటే అదే పదివేలు అనుకుంటూ అతనంటే భక్తితోనే ఉంటూ వచ్చింది.

     ఇంతలో ఒకరోజు శాలీనుడు తోటపని చేస్తున్నప్పుడు ఉరుములతో మెరుపులతో కుండపోతగా వర్షం పడింది.ఆ అసమయంలో శాలీనూడి గురించి ఆందోళన పడి వర్షం తగ్గగానే తోటకి వెళ్ళింది.అతను ఒక పనివాడిలా కష్టపడుతుండటం చూసి జాలిపుట్టి తను కూడా సాయం చెయ్యాలనుకుంది.పనికి నగలు అడ్దంకదా అని అవి తీసి పక్కన పెట్టి తనూ మగడికి పనిలో తోడుగా శ్రమించటం మొదలు పెట్టింది.ఆభరణాలు లేకుండా చిత్తడి చిరు చెమటలతో అలరారుతున్న సుగాత్రిని చూడగానే శాలీనుడిలో శృంగార వాంచ పెల్లుబికింది!హమ్మయ్య!తల్లి అనుమానిస్తున్నట్టు భర్త నపుంసకుడు కాదు అని తెలిసి ఆనందంగా తల్లికి చెప్పింది!ఆ రాత్రికి సర్వాలంకార భూషితని చేసి పంపిస్తే మళ్ళీ పాతకధయే పునరావృతమయింది.దీంతో సుగాత్రి తల్లికి కూతురు మీద కూడా కోపమొచ్చింది.కానీ మరుసటి రోజు తను తోటపనిలో సాయం చేస్తున్నప్పుడు భర్త మళ్ళీ దగ్గరకు తీసుకోవటం చూశాక భర్త ప్రవర్తనలోని రహస్యం అర్ధమయింది.శాలీనుడిలో ఉన్న మర్మం ఇది - అతడికి నిసర్గ సౌందర్యం అంటే ప్రీతి,కృత్రిమ సౌందర్యం అంటే భీతి?!అదేదో నోటితో చెప్పొచ్చు గదనయ్యా మగడా - అని మీరు అందామనుకుంటే కుదరదు,అన్నీ నోటితో చెప్పలేం యెవళ్ళకి వాళ్ళు అర్దం చేసుకోవాలి అని మా బంగారం సాగదీసింది ఒక విషయం గురించి నేనూ ఇలాగే నోటితో చెప్పొచ్చు గదా అని నిలదీస్తే:-)

     తల్లి సుగాత్రిని తప్పు పట్టి మందలించబోతే సుగాత్రి తన తల్లికి భర్తకు యేది ప్రియమో ఆ విధంగా నడుచుకోవటం భార్యగా తన కనీస ధర్మమని తగిన సమాధానం చెప్పి ఒప్పించింది.సుగాత్రి పతిభక్తికి మెచ్చి సరస్వతీదేవి ప్రత్యక్షమై ఆమె కధ లోకంలో పవిత్రమై వెలయునని వరమిచ్చి అంతర్ధానమైంది.

    యెందుకీ కధకి ఇంత ప్రాధాన్యత నిచ్చాడు అంటే, శ్రమకీ ప్రేమకీ ఉన్న అవినాభావ సంబంధం వాత్స్యాయనుడి నుంచి పింగళి సూరన వరకు గల సనాతన ధర్మతత్వ కోవిదు లందరికీ తెలుసును గనక!నరాల రాపిడినే ప్రేమ అనుకుని నన్ను ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించేవాళ్ళది ప్రేమ కాదు - కామం!తనకి ఇష్టమున్నా లేకపోయినా నాకనవసరం నా నరాల వేడి తగ్గితే చాలునని బలాత్కార సంభోగానికి తెగబడటం అసలైన పురుషత్వం కానే కాదు.పశువుల నుంచి మనుషుల్ని వేరు చేసే అనేకానేకమైన అంశాలలో మనొధర్మశృంగారం ఒకటి - అది తెలియని వాళ్ళు స్త్రీని పశువులాగ కుమ్మడమే పురుషత్వం అనుకుంటున్నారు.పిల్లల్ని పుట్టించగలిగిన ప్రతివాడూ మగవాడు కావచ్చు,అంగస్తంభన ఉన్న ప్రతివాడూ దాన్ని సాక్ష్యంగా చూపించవచ్చు - కానీ పురుషత్వం అనేది స్త్రీని సంతోషపెట్టగలిగిన సమర్ధతని కూడా ఇముడ్చుకుని ఉంటుంది -  ఆ మనోగతమైన సంస్కారాన్ని కూడా కలిగి ఉంటేనే వాడు పురుషుడు అవుతాడు!అది లేనివాడు ఉత్త మగాడు,అంతే!ఇదే రకం విశ్లేషణ ఆడతనాన్నీ స్త్రీత్వాన్నీ వేరు చేస్తుంది.నిర్భయ హంతకుడి లోనూ ఇంద్రాణీ ముఖర్జీ లోనూ ఉన్న సామాన్య ధర్మం ఒకటుంది గమనించారా?కాయకష్టంతో గౌరవప్రదంగా తను బతికి ఇతర్లని బతికించాలనే మంచితనం లేకపోవడమనే వాళ్ళ మనస్తత్వాల లోని ఒక మెలికయే వాళ్ళు చేసిన నేరాలకి మూలం!శ్రమజీవికి తనకు యెటువంటి భాగస్వామి కావాలో స్పష్టంగా తెలుస్తుంది,ఏ విధమైన గందరగోళం ఉండదు.యెర్రగానే ఉండాలి,నున్నగానే ఉండాలి,పిటపిలాడుతూ ఉండాలి,చెయ్యెత్తు మనిషై ఉండాలి,సాటి ఆదవాళ్ళు కుళ్ళుకు చావాలి అనే గొంతెమ్మ కోరికలు ఉండవు.అన్నీ తనవైపుకే లాక్కునేలా కాకుండా ఉన్నదాన్ని చెరిసగం పంచుకునేలా ఉంటే చాలు -ఈ భావం యెక్కించటానికే సుగాత్రీ శాలీనుల కధకి అంతటి పవిత్రతని కల్పించి కళాపూర్ణోదయం అనే కధ రాశాడు పింగళి సూరన!

     ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలుపేమున్నది అనే శ్రమైక జీవన సౌందర్యంలోనే ఒకరితో ఒకరుగా ఇద్దరం,ఒకరిలో ఒకరుగా ఒక్కరం అనే ప్రేమైక జీవన సాఫల్యమూ ఉంటుంది.అది తెలిసిన వాళ్ళు ధన్యజీవులు,తెలియని వాళ్ళు భ్రష్టజీవులు!


లక్ష్మీ నారాయణ సంవాదం:

    ఈ ఉపకధతో కళాపూర్ణోదయం సంపూర్ణం అవుతుంది.బ్రహ్మకీ సరస్వతికీ జరిగిన సరసం నుంచి పుట్టిన కధకి లక్ష్మి నారాయనుణి భక్తుల గురించి అడిగి ఆయన నుణి ఒక ఆశీఃపూర్వకమైన వాక్కులతో ముగుస్తుంది.బ్రహ్మ-సరస్వతి,మణికంధరుడు-కలభాషిణి,సుగాత్రి-శాలీనుడు,కళాపూర్ణుడు-మధురలాలస అనే పేర్లతో ఉన్న ప్రధాన పాత్రలన్నీ జంలుగానే ఉన్నాయి.ఒక జంటలోని స్త్రీ పురుషుల మధ్య అనుబంధాలూ,కోపతాపాలూ యెలా ఉండాలో తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ అది తెలిసే వరకు వీలున్నన్ని యెక్కువసార్లు కళాపూర్ణోదయం చదవాలి.ప్రేమ ఒక స్థాయిని దాటితే భక్తిలాగే ఉంటుంది!నిరంతరం దగ్గరితనాన్ని ఆశిస్తూ ఉండటం,తీసుకోవడం కన్నా ఇవ్వడం గురించి ఆలోచిద్తూ ఉండటం,సహచరులకు క్షేమాన్నీ భద్రతనీ ఆనందాన్నీ కోరుకోవడం - ఇవీ నిజమైన ప్రేమకి లక్షణాలు.నిజమైన ప్రేమ సుఖంగా ఉండనివ్వదు,అందులో బాధే యెక్కువ - అయినా నాస్తికులు గూడా కోరుకోదగిన మోక్షం అది!


ఆత్మవత్ సర్వభూతాణి!ప్రణయవత్ సర్వ మానసాణి!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...