Tuesday, 29 September 2015

శ్రీ రాఘవం!శ్రీ మాధవం!ఆశ్రిత జన మనోహరం!!

-----------------------------------------------------------------------------------------------------------------
గద్య కవిత
-----------------------------------------------------------------------------------------------------------------
ఒక్కొక్క జీవుని యందొక్కొక్క వేదన?

ముజ్జగాల కెల్ల
ముచ్చటైన కరిమేని సొంపువాడు,
సరిలేని రాజసాన ముజ్జగాల నేలెడువాడు!
ఆతదహో!జగదేకధనుర్ధరధీరమతి కరుణాసింధు
వార్తత్రాణపరాయణు డఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు,
మా చూడి కొడుత్త నాంచారు ప్రియవిభుడతడు!

యేమి వేణుగానమది!
నవ రంధ్రముల ఈ తనువా మోవిని తాకి
యెద ఝల్లుమని పులకించి ఇటు రవళించినదో?
లోకాల పాలించుగోపాల బాలుని  
పేదవులు తగిలిన ఆ వెదురు జన్మ మెంతటి ధన్యమో గద!
అంతటి భాగ్యమీఎ జడున కెన్నడు కల్గునో గద?

ఇట్టిది నా జీవుని వేదన!
-----------------------------------------------------------------------------------------------------------------
పద్య కవిత
-----------------------------------------------------------------------------------------------------------------
సీ||యేమి వేణువది?ఆ మోఅహనరవళి ఎ
       చటినుండి తీగలు సాగుతున్న

       దో గద!అంగిలి తాకని సవ్వడి
       నవరంధ్రముల ఈ తనువున యేల

       పుట్టెను?ఆ మోవియొకవేళ తగిలి యె
       డద ఝల్లుమనగ ఇటు రవళించె

       నో?లోకపాలకుదౌ గోపాలబాలుని
       పేదవులు తగిలిన వెదురు జన్మ

తే||మెంత ధన్యమో గద!మరి అంత భాగ్య
      మీ జడున కెప్డు కల్గునో?మాయదారి
      పిల్లగాడొక డూదిన పిల్లగోరు
      కాదు - జీవుల కడతేర్చు గానమోయి?!

సీ||అంతర్యామి!సుజన మంగళకరుడు!ము
       చ్చట గూర్చు కరిమేని సొంపువాడు!

       ఆతడహో,జగదేక దనుర్ధర
       ధీరమతి కరుణాసింధు వార్త

       త్రాణపరాయణు డఖిలాందకోటి
       బ్రహ్మాండనాయకుడు!అంతకుల వైరి!

       సరిలేని రాజసాన నఖిల లోకాల
       నేలెడు వాడు!తనే మనిషిగ

తే||వచ్చి పెద్దాయన నడిగి వేడ్క పెండ్లి
      యాడి మా చూడికొడుత నాంచారు కెంతొ
      నచ్చిన నిజవిభుడతడు!అతని నేన
      డిగెద నక్షయసౌఖ్యాల నెల్లరకును?!
-----------------------------------------------------------------------------------------------------------------

Wednesday, 23 September 2015

పునర్జన్మ అనేది ఇంకెంతోకాలం అభూత కల్పన కాదు - అది కూడా ప్రకృతిలో వాస్తవమై కనబడుతున్న దృగ్విషయమే!

          మా అమ్మాయి బహుశా యల్.కే,జి లో ఉన్నప్పుదు కాబోలు,ఒకరోజు స్కూలు నుంచి రాగానే ఒక నోటుబుక్కు మీద గీతలు గీస్తూ "ఇది హార్టు,ఇది వెయిన్సూ,ఇవి ఆర్టెరీసూ" అని నాకు పాఠం చెప్పినట్టు చెప్పటం మొదలుపెట్టింది!నాకు నవ్వూ ఆశ్చర్యమూ రెండూ ఒక్కసారే పుట్టాయి,పుట్టవా మరి?గీస్తున్నవి పిచ్చిగీతలు,సరిగ్గా హార్ట్ బొమ్మ గీయడం కూడా రాని పిల్లకి హార్టు గురించి వెయిన్సు గురించి యెలా తెలుస్తుంది?అక్కడికీ అనుమానం వొచ్చి "మీ టీచరు చేప్పారా బుజ్జిగా!" అంటే "ఉహూ,నానే తెలుసుకున్నా?!" అనేసింది."నాకు నేనే తెలుసుకున్నా" అని కూడా స్పష్టంగా తెలుగులో మాట్లాడలేని చిన్నపిల్లకి హార్టూ వెయిన్సూ ఆర్టెరీసూ యెలా తెలుస్తాయి?నేను అప్పటికే పునర్జన్మల గురించి కొంచెం చదివి ఉన్నాను గాబట్టి ప్రశ్నలు పొడిగిద్దామని టెంప్టేషను గూడా వొచ్చింది,కానీ దానివల్ల వచ్చే సమస్యలు గూడా తెలుసు గాబట్టి డైవర్ట్ చేసేశాను.మళ్ళీ యెప్పుడూ ఆ ప్రస్తావన రాలేదు!అంత చిన్నపిల్లకి ఆ విషయాలు తెలియడానికి మరోరకమైన కారణం యేదీ కనిపించడం లేదు నాకిప్పటికీ.

          పునర్జన్మ అనే విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇటీవలి వరకూ అంటరాని సబ్జెక్టుగా చూసి దూరం పెట్టేసింది!యెక్కువ శాతం విషయమంతా మతగ్రంధాలలోనే ఉంది.భారతీయ సనాతన ధర్మం తొలినుంచీ సకల జీవరాశులలోనూ వాటి తత్త్వానికి జీవాత్మ అనే పదాన్ని వాడుతున్నది.పైగా భగవద్గీతలో "ఆత్మ నాశనము లేనిది" అని చెప్పి "ప్రాబడిన వస్త్రాల విడిచి నరుడెట్లు క్రొత్తవి తా ధరించు నట్లె జీర్ణ దేహాల వీడి నూత్న దేహాల ధరించు దేహి" అని చెప్పడం వల్ల పునర్జన్మ అనే భావన హిందూ ధర్మంలో అంగీకరించబడిందని తెలుస్తుంది!అబ్రహామిక్ మతాలైన జుదాయిజం,క్రైస్తవం,ఇస్లాం మతాలు వాటి ప్రధాన బోధనల్లో పునర్జన్మని తిరస్కరించినా వాటిలోని కొన్ని శాఖలు మాత్రం పునర్జన్మ విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి!

          "పుట్టినన్ చావు తధ్యమ్ము"అని తెలిసిన మనిషికి యెంత కాలం బతికినా ఇంకా తనివి తీరకపోవడం వల్లనో యేమో "మరుజన్మ ఉన్నదో లేదో!ఈ మమత లప్పుడే మవుతాయో?" అని బెంగ కూడా పుట్టి "చావన్ పుట్టుక తప్పదు" అని ధైర్యం చెప్పుకుని ఇప్పుడు చేసిన తప్పులు చేయకుండా అప్పుడు మరింత గొప్పగా బతుకుదాం లెమ్మని ఓదార్చుకోవడానికి ఈ అందమైన వూహ అతని బెంగ తీరుస్తుంది కాబోలు!హిందూ ధర్మంలో కర్మ-జన్మ-సంసారచక్రం అనే భావన అవైదిక శ్రమణ సాంప్రదాయం నుంచి వచ్చిందని Patrick Olivelle అనే ఇండాలజిస్ట్ సూత్రీకరించాడు.దక్షిణాపధంలోని ద్రవిడ సంస్కృతి నుంచి వైదిక సంస్కృతి ఈ పునర్జన్మ సిధ్ధాంతాన్ని స్వీకరించడం మరొక సంభావ్యత!మరికొందరి విశ్లేషణ ప్రకారం ఈ పునర్జన్మ సిధ్ధాంతం యొక్క అసలు ప్రతిపాదన బౌధ్ధమతంలోనిది!నిజమే కావచ్చు,ప్రాచీన కాలపు ధార్మికసాహిత్యంలో పునర్జన్మ ప్రస్తావనలు ప్రముఖంగా లేకపోవడానికీ బుధ్ధుని తర్వాతికాలం నుంచి మొదలైన పౌరాణికసాహిత్యం నుంచే ఈ పునర్జన్మ భావన విస్తృతంగా ఉండటానికీ అదే కారణం అయి ఉండాలి!

     క్రీ.పూ570 నుంచి క్రీ.పూ495 మధ్యన జీవించిన పైధాగరస్ అనే గ్రీకు మేధావి పునర్జన్మలని సమర్ధించాడు.క్రీ,పూ428 నుంచి క్రీ.పూ348 మధ్యన జీవించిన మరో గ్రీకు మేధావి ప్లాటో తన రచనల్లో పునర్జన్మలకి సంబంధించిన ఉదాహరణల్ని కూడా ఉల్లేఖించాడు.అయితే తదనతర కాలంలో క్రైస్తవం తన ప్రధాన సిధ్ధాంతమైన "మారుమనస్సు పొందిన నరుడు భగవంతునిచే ఆశీర్వదించబడి సరాసరి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలడు" అన్న సూత్రీకరణతో పొసగనందున ఈ భావనని తదనంతర కాలంలో వ్యతిరేకించింది!కానీ వారిలో కొన్ని శాఖల వారు ఇప్పటికీ పునర్జన్మను ప్రస్తావిస్తున్నారు.అసలు శిలువ వేయబడి మరణించినాడని నిర్ధారించిన దైవపుత్రుదు జీసస్ రెండు రోజుల తర్వాత పునరుత్ధానం ద్వారా పైకి లేవడం కూడా ఒక రకంగా పునర్జన్మయే కదా!అర్వాచీన కాలంలో క్రీ.శ19వ శతాబ్దానికి చెందిన Schopenhauer లాంటి అమెరికన్ మేధావులు భారతీయ సంస్కృతి వల్ల్ల ప్రభావితులై ప్రతిపాదించగా Henry David Thoreau,Walt Whitman,Ralph Waldo Emerson లాంటివారు సమర్ధించగా క్రైస్తవ మతం కూడా Francis Bowen ద్వారా ప్రవేశపెట్టబడి Christian Metempsychosis పేరుతో నూతన కాలపు క్రైస్తవంలో పునర్జన్మ సిధ్ధాంతం ఆమోదించబడటం మొదలైంది!

          ఆధునిక శాస్తవేత్తలలో పునర్జన్మల గురించి శాస్త్రీయంగా పరిశోధించినది ఒకే ఒక వ్యక్తి - Dr. Ian Stevenson!అక్టోబర్ 31,1918లో పుట్టిన ఈ కెనడియన్ అమరికాలో సైకియాట్రిస్టుగా ప్రఖ్యాతుడై 2007 ఫిబ్రవరి 8న చనిపోయాడు.ఇతను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా కి సంబంధించిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ విభాగంలో యాభయ్యేళ్ళు పని చేసినా,1957 నుంచి 1967 వరకూ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీకి శాఖాధిపతిగా పనిచేసినా అందరికీ తెలిసింది మాత్రం పునర్జన్మల గురించి చేసిన పరిశోధనల వల్లనే!పునర్జన్మ సిధ్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు,జ్ఞాపకాలు,పుట్టుమచ్చలు,ఇంకా దేహానికి తగిలిన గాయాలు కూడా ఒక జన్మ నుంచి మరొక జన్మకి సంప్రాప్తిస్తాయనే సూత్రీకరణల్ని ఇతను ఆధారాలు చూపించి నిరూపించాడు.నలభయ్యేళ్ళకి పైన ప్రపంచమంతా కాలికి బలపం గట్టుకుని కలయదిరిగి యెక్కడెక్కడ పునర్జన్మకి సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చినా వాటినన్నిట్నీ శాస్త్రీయమైన పధ్ధతిలో అవి నమ్మదగ్గవే అని నిర్ధారించుకుని గ్రంధస్థం చేశాడు.

          ఇతను సైన్సు అంటే యేమిటో తెలియని నిరక్షర కుక్షీ కాదు,శాస్త్రీయ పరిశోధనలు యెలా జరపాలో తెలియని మూర్ఖుడూ కాదు.ఇతను చేసినది కేవలం రికార్డు చెయ్యటం మాత్రమే,కానీ చాలా ఖచ్చితంగా చేశాడు - అదీ శాస్త్రీయమైన పధ్ధతిలో!ఇతని పరిశోధన ప్రధానంగా పారాసైకాలజీకి సంబంధించిన విషయాలతో మొదలైంది.చాలాకాలం క్రితం నుంచీ చాలామంది శాస్త్రజ్ఞులకి గందరగోళంగా అనిపించి అటుకేసి వెళ్ళకుండా ఉన్నవైపుకి ఇతను ధైర్యంగా వెళ్ళాడు.అప్పటికే కొందరు వ్యక్తులు హిప్నటిక్ ట్రాన్సులో ఉన్నప్పుడు హఠాత్తుగా గతజన్మ జ్ఞాపకాల్ని చెప్పడం జరుగుతున్నది,కానీ ఇతను వాటికి విశ్వసనీయత ఉండదు గనక భౌతికపరమైన ఆధారాల కోసం ప్రయత్నించాడు!అంటే హిప్నటిక్ ట్రాన్సులోకి తీసుకెళ్ళి గతజన్మ వివరాల్ని చెప్పించడం కాకుండా గతజన్మ గురించి చెప్తున్న వాళ్ళు పూర్తి స్పృహలో ఉండి చెప్తున్నవాటిని రికార్డ్ చెయ్యటం,వీళ్ళకి గానీ వీళ్ళ కుటుంబ సభ్యులకి గానీ ఆ గతజన్మ అని చెప్పబడుతున్న వ్యక్తుల గురించి తెలిసే అవకాశం ఉందేమో వెతకటం,ఇక్కడి వ్యక్తుల గురించి యేమీ చెప్పకుండా రెండో చోట వివరాల్ని సేకరించి రెంటినీ పోల్చటం - పూర్తి శాస్త్రీయమీన పధ్ధతిలోనే పని చేశాడు."Either he [Dr. Stevenson] is making a colossal mistake. Or he will be known as the Galileo of the 20th century." Journal of Nervous and Mental Disease అనే సైంటిఫిక్ జర్నలులో Dr Harold Lief వ్యాఖ్యానించాడు!

          పునర్జన్మ అనేది ఉన్నదని ఒప్పుకోవటం వల్ల మూఢనమ్మకాలు పెరుగుతాయని భావించి వీటి గురించి నిరాసక్తంగా ఉన్న హేతువాదులైన శాస్త్రజ్ఞులు గానీ క్రైస్తవ మత విశ్వాసాలకి విరుధ్ధమనుకున్న వారు గానీ ఇతని కృషిని తిరస్కరించలేక పోయారు.ఇతను వైజ్ఞానిక ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడని వెక్కిరించడం గానీ ఇతను తిరోగమనవాది అని పేర్లు పెట్టడం గానీ యెవరికీ సాధ్యప లేదు!ఇతని మొదటి ఆసక్తి మామూలు వైద్యశాస్త్రమే!ఇతని భార్య లైబ్రరీలో లెక్క లేనన్ని పారాసైకాలజీ పుస్తకాలు ఉండేవి, కానీ ఇతను వాటిపట్ల ప్రభావితుడు కాలేదని తనే చెప్పుకున్నాడు.ఈ పారాసైకాలజీది పెద్ద మైరావణ చరిత్ర!మనిషిని జంతువుల నుంచి వేరు చేస్తున్నవి రెండు - ఒకటి నిటారుగా నిలబడటం,రెండు బొటనవేలు మిగతా వేళ్ళ నుంచి విడిపోయి వాటికి యెదురుగా రావటం!మొదటి దాని వల్ల ఒక చోటి నుంచి మరొక చోటుకి వేగంగా కదలటం సాధ్యపడితే రెంవ దాని వల్ల పనిముట్లని ఉపయోగించటం సాధ్యపడింది.అయితే మనిషికి నాగరికత యేర్పడటంలో జంతువులకి లేని మరొక ప్రత్యేకలక్షణం - కలలు కనటం అనేది యెక్కువగా తోడ్పడింది!

   ప్రాచీన మానవుడు జాగ్రదవస్థలో దర్శించినవాటి కంటె స్వప్నావస్థలో దర్శించిన వాటినే ఎక్కువగా విశ్వసించాడు.బాబిలోనియన్లకు,ఈజిప్షియన్లకు స్వప్నమూలం బాహ్యంగా ఎక్కడో ఉంటే - ఏ దేవుడో,దెయ్యమో అయితే - చైనీయులకు అది మానవుని అంతరంగంలో ఉన్నది.భారతీయ సంప్రదాయంలో గూడ చైనాలో వలె స్వప్నాన్ని ఆత్మానుభవంగ ఎంచినట్లు కనిపించినా,స్వప్నమూలాన్ని గురించి కొన్ని విశిష్టమైన ప్రాక్కల్పనలు చేశారు.వీరి భావనలు అక్కడక్కడా ఆధునిక మనొవిజ్ఞానశాస్త్ర భావనలకు చేరువగా ఉన్నాయి.ఇతరులకు సుషుప్తావస్థ,జాగ్రదవస్థ అనే రెండు దశలు మాత్రమే వుంటే స్వప్నస్థితిని మన భారతీయులు ఈ రెండింటి కంటె భిన్నంగా భావించారు."సర్వ జీవులు ప్రాణాన్ని ధరిస్తాయి.అలా ప్రాణధారణం చేయని వాటిని నిర్జీవాలు అంటారు.మరి ప్రాణధారణం చేయని స్వప్నం నిర్జీవమా?కాదు,ఇట్లు జీవనమరణధర్మాలు లేని స్వప్నమొక అనిర్వచనీయమైన అనుభూతి" అని అధర్వ సూక్తం అంటున్నది.స్వప్నమూలాన్ని పరిసీలించిన అధర్వన వేదం దానిని "దేవతా గర్భ","అమృత గర్భ","దేవ గర్భ","దేవపత్నీ గర్భ"గ పరిగణించింది.మనిషికి పదునాలుగు ఇంద్రియాలు(5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 4 అంతరింద్రియాలు) ఉన్నాయి.ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్ఠాన దేవత ఉంటుంది.మనస్సును అధిష్ఠించిన దేవతాప్రభావం చేత కలగడం వలన "దేవతా గర్భ" అయింది.జాగ్రద్దశలో కలిగే అనుభవాల తాలూకు వాసనలు,జన్మజన్మాంతరానుభవాల వాసనలు,సృష్ట్యాది నుంచి సంక్రమించిన వాసనలు ప్రతి వ్యక్తి మనస్సులో లీనమై ఉంటాయి.ఈ వాసనలు అనాది కాబట్టి అది "అమృత గర్భ" అయింది.ఈ "అమృత గర్భ" భావనా కారల్ గుస్టాఫ్ యూంగ్ ప్రతిపాదించిన "ఉమ్మడి అచేతనం" భావనా రెండూ ఒకటేనా అనిపిస్తున్నవి.అనేక పురాణతిహాసాలను మధించి అర్ధం చేసుకున్న యూంగ్ అధర్వణ వేదంలోని ఈ మంత్రాన్ని చూడడం సంభవించిందేమోనని ఒక అనుమానం -అతడు ప్రపంచ పురాణాలన్నింటిని అధ్యయనం చేశాడంటారు!చరకుడు శారీరకదోషాలు కలలకు ఎలా దారితీస్తాయో,ఎంతటి గాఢనిద్రలో కలలు కలిగేది,స్వప్నాలు ఎన్ని రకాలో వివరించాడు."మనస్సును వహించు స్రోతస్సు మిక్కిలి ప్రబలములైన వాత పిత్త కఫ దోషములలో నొక దానిచే పూర్తిగ నిండినప్పుదు క్రూరమైన కాలమున మిక్కిలి క్రూరములగు చెడ్డ కలలు వచ్చును.పురుషుడు గాఢము గాక సూక్ష్మముగ  నిద్ర గూర్చినప్పుడు ఇంద్రియములకు ప్రేరకమైన మనస్సు చేత ఫలవంతములును,ఫలప్రదములు కానివియు నగు పలుదెరంగులైన స్వప్నముల గాంచును."సూక్ష్మనిద్రలో మనిషి కలలు కంటాడని చరకుడు చెప్పడం ఈనాటి REM సిధ్ధాంతానికి దగ్గిరగా ఉంది.ఈరకంగా స్వప్నకాలంలోనూ వాస్తవంలోనూ మనిషి జీవితానుభవాలతో వాటికి ఉన్న సంబంధాన్ని చర్చించిన వారంతా స్వప్నాల్ని సాధారణ స్వప్నాలు,అసాధారణ స్వప్నాలుగా వర్గీకరించారు.ఒక మనిషి దైనందిన జీవితపు వాస్తవానుభవాలు ప్రాతిపదికగా వచ్చే స్వప్నాల్ని మనొధర్మవిజ్ఞానశాస్త్రం లోని భాగమైన స్వప్నశాస్త్రం అధ్బుతంగా వివరించగలుగుతున్నది,అయితే విక్టోరియా ఓడ నాలుగు నెలల తరవాత మునిగిపోతుందనో, జిమ్మీ కార్టర్ మరో రెండు రోజుల్లో హత్య చేయబడతాడనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాకో మీకో కల వచ్చిందనుకోండి - వాటితో మనసా వాచా కర్మణా యెలాంటి అనుబంధం లేకపోయినా, అటువంటి సంఘటనలు కలలో కనిపించిన రీతిలో పొల్లు పోకుండా తరవాత జరిగాయనుకోండి - వీటిని శాస్త్రీయంగా ఖండించటానికి గానీ సమర్ధించటానికి గానీ ఇప్పటి శాస్త్రపరిధి చాలదు, అలాగని వీటిని పూర్తిగా కొట్టిపారెయ్యడం కూడా శాస్త్రీయం కాదు.కాబట్టి ఇటువంటి వాటిని పరిశోధించేటందుకు అధిభౌతిక మనోవిజ్ఞానశాస్త్రం(Para-Psychology) అనే ఒక కొత్త శాఖని యేర్పాటు చేశారు.

     1857లో ఉద్యోగంలో జాయినయినా ఇతను పునర్జన్మల పట్ల ఆసక్తి చూపించి 1960లో మొదటి వ్యాసం ప్రచురించబడేవరకూ జరిగిన కధలోని మలుపులు చాలా చిత్రమైనవి!మొదట్లో మామూలు ఫిజీషియన్ హోదాలో జాయినయిన ఇతను కొందరు పేషెంట్లు సైకోసొమాటిక్ డిసీజెస్ లక్షణాల్ని ప్రదర్శించటం గమనించాడు!పోష్టు చాలా సీరియస్ కాబట్టి మీకు గిట్టుబాటు అయ్యేందుకు ఒక జోకు చెప్తాను - నేను వేసిన సొంత జోకు!డిగ్రీ బెజవాడ లయోలా కాలెజిలో చదివాను,రెండవ సంవత్సరం హాస్టల్లో ఉన్నాను.అక్కణ్ణించి యే మంచి సినిమా చూడాలన్నా మొదట సిటీబస్సెక్కి బీసెంటు రోడ్డు రెండో లైన్లో ఒక చెట్టు దగ్గిర దిగాలి.అక్కణ్ణుంచి యెటు వెళ్ళాలన్నా అక్కడ దుర్గాభవన్ హోటలూ దానికానుకుని అందులోంచే పొడుచుకొచ్చినట్టున్న ఒక పుస్తకాల షాపూ ఖచ్చితంగా తగుల్తాయి.ఒకసారి నేనూ మా ఫ్రెండూ కలిసి బయల్దేరి సినిమా కింకా చాలా టైము ఉండటంతో అక్కడున్న మాగజైన్ల కవర్లని పరిశీలిస్తుంతే ఒక తమాషా దృశ్యం కనబడింది.అప్పుడే సన్నీ డియోల్ కొత్తగా ఫీల్డులోకి వచ్చినట్టున్నాడు,వాడి ఫొటోలో మాకిద్దరికీ హేమామాలిని పోలికలు కనపడినాయి,మా ఫ్రెండు కూడా నాలెడ్జిలో నాలాంటి చిచ్చరపిడుగే!"అరే,ఇదేంట్రా హరీ!మొదటి భార్య కొడుకులో రెండో భార్య పోలికలు కనబడుతున్నాయీ?" అని పైకే వాగితే నేను చాలా సీరియస్ మొహంతో "ఆవిడ దగ్గిర కూడా ఈవిణ్ణే గుర్తు చేసుకుంటూ గడిపాడేమో,సైకోసొమాటిక్ ఎఫెక్టు పనిచేసుంటుంది!" అని నేను విశ్లేషించా.కాసేపయ్యాక వెనకనించి కుసకుసా నవ్వుతూన్న చప్పుడు విని వెనక్కి తిరిగి చూస్తే షాపు ఓనరు సైలెంటుగా నవ్వేస్తూ కనిపించాడు - అప్పటికి గానీ మాక్కూడా మా ప్రశ్న-జవాబు లోని క్యామేడీ బుర్రలో వెలగలేదు!గురువుగారు నవ్వుతున్నాడు గదాని అక్కడే ఉంటే "ఇంత చిన్న వయస్సులో అంత బూతు జోకేస్తార్ర్రా?!" అని తిట్లకి లంకించుకుంటాడేమోనని అక్కణ్ణించి జారుకున్నాం కిచకిచా నవ్వుకుంటూ:-)అప్పట్నించీ యిప్పటివరకూ యెప్పుడు సైకోసొమాటిక్ ఎఫెక్ట్ అనే గంభీరమైన మాట గుర్తొచ్చినా పిచ్చపిచ్చగా నవ్వొస్తూనే ఉంటుంది.ఆ జోకు మూలంగా మీకూ నాకూ క్యామెడీగా అనిపించినా ఆ జబ్బుల్ని ట్రీట్ చేసే డాక్టర్లకి మాత్రం పెద్ద ట్రాజెడీ యేంటంటే - పేషెంటు "డాక్టరు గారండో,నాకు ఫలానా జబ్బు లఖణాలు ఉన్నాయని మీరిచ్చిన మాత్తర్లు పని జేయటం లేదు మొర్రో!" అని మొరపెట్టుకుంటున్నా ఆ రోగలక్షణాలకి సంబంధిచిన కారణం దేహంలో కంబడకపోవటం?శరీరానికయినా మనస్సుకైనా వైద్యం చెయ్యాలనుకున్న డాక్టరుకి కారణం తెలియాలి గదా,రోగానికి కారణమైన క్రిమి కనపడాలి కదా - అదే కనపడి చావదు!మనో వైజ్ఞానిక శాస్త్రంలో రోగనిర్ధారణలో సంసర్గం(Hypnosis) చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది.ఈ హిప్నటిక్ ట్రాన్సులోకి వెళ్ళిన వాళ్ళు వింతగా ప్రవర్తించేవాళ్ళు ఒక్కోసారి - డాక్టరు చూస్తున్న అసలు పేషెంటు పిఠాపురంలో ఉండే సుబ్బారావు అయితే తను కడపలో పుట్టిన రాజశేఖర రెడ్డిని అని చెప్తే డాక్టరుకి భయం వెయ్యదూ?ఈ స్టీవెన్సన్ గారు కూడా అలాంటి పాట్లు పడి తట్టుకుని ఆఖరికి పునర్జన్మ సిధ్ధాంతం ద్వారా తప్ప మరో విధంగా వీటిని అర్ధం చేసుకోవడం కష్టమని గ్రహించాడు.


     మొదటి వ్యాసం ప్రచురించబడటానికి కొన్ని దశాబ్దాల ముందునుంచే చిన్నపిల్లల జ్ఞాపకాల గురించి గట్టిగా పరిశోధిస్తున్నప్పుడు "imaged memories","behavioral memories"ల మధ్య తేడాని గమనించాడు1960లో ప్రచురితమైన పునర్జన్మలను గురించిన ఇతని మొదటి వ్యాసం "The Evidence for Survival from Claimed Memories of Former Incarnationsఅదృష్టవశాత్తూ Xerox machine కనుక్కున్న Chester Carlson దృష్టిని ఆకర్షించింది.ఇతని ప్రోత్సాహమే లేకుంటే ఈ పరిశోధనలు ఇంతగా వెలుగు చూసేవి కావు - యెందుకంటే అందులో విపరీతమైన తిరుగుడూ,అంతులేని మానసిక శ్రమా,లాభంలేని ఖర్చూ ఇమిడి ఉన్నాయి.1966 నుంచీ 1977 వరకూ రమారమి సంవత్సరానికి 55,000 మైళ్ళు తిరగటం,ఒక్కోసారి ఒకేరోజున 25 మందిని ఇంతర్వ్యూ చెయ్యటం లాంటి కష్టాల కోర్చి ప్రపంచం నలుమూలల నుంచీ ఇతను సేకరించి రికార్డు చేసిన కేసులు 3,000!మొత్తం అన్ని పరిశోధనలూ వర్జీనియా యూనివర్సిటీ ద్వారా ప్రచురించబడినవి కాబట్టి అధీకృతమైన పత్రాలు అనడంలో యెలాంటి సందేహమూ అఖ్ఖర్లేదు!అయినా సరే ఇతని పరిశోధనల్ని వక్రీకరించి విమర్శించటం,బైబిలుకి విరుధ్ధంగా ఉన్న కారణాన మతవిశ్వాసులూ,ఆత్మ ఉనికిని నిరూపించే విధంగా ఉండటం వల్ల మూఢనమ్మకాల్ని పెంచుతుందనే అపోహతో కొందరు శాస్త్రవేత్తల గుంపూ,సంచలనం సృష్టించడమే తప్ప సామాజిక బాధ్యత లేని మూర్ఖమీడియా అధిపతులూ ఇతనికి "Perverted genius/Popularity seeker" ముద్ర వేసి విసిగించినారే తప్ప అతని సిన్సియారిటీని గుర్తించలేదు.

     ఇతని పరిశోధనల్లోని కొన్ని సామాన్య విషయాల్ని చూస్తే అదొక అభూతకల్పన కాదనీ పరిశోధించి తేల్చుకోవలసిన దృగ్విషయమనీ తెలుస్తుంది.అన్ని జ్ఞాపకాలూ 3 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలలోనే బయటపడుతున్నాయి.అంత చిన్న వయసులో తమకి గానీ తమ కుకుటుంబానికి గానీ సంబంధం లేని మరొక వ్యక్తికి సంబంధించిన విషయాలు అంత ఖచ్చితంగా యెలా తెలుస్తాయి?ఒక బాలుడు/బాలిక చెప్తున్న పూర్వజన్మగా భావించే వ్యక్తులు అందరూ మరణించే సమయంలో తాము చనిపోతున్నామని తెలిసి అప్పుడు తామున్న స్థితి వల్ల చావును బలంగా వ్యతిరేకించడం కనిపిస్తుంది,అంటే ఆ జీవి ఇంకా కొంతకాలం ఈ భూమి మీద ఉండాలన్న గట్టి సంకల్పం వల్లనే ఆ జీవి జ్ఞాపకాలు తిరిగి పుట్టినవారిలో వ్యక్తమౌతున్నాయి తప్పిస్తే గతజన్మలో జీవిత కాలావధిని పూర్తిగా గడిపి మరణించినవారికి సంబంధించిన వారి పునర్జన్మకి సంబంధించిన కేసులు దాదాపు శూన్యం.పైగా ఈ జ్ఞాపకాలు పెరిగి పెద్దయ్యే కొద్దీ వాళ్ళు మర్చిపోతున్నారు,ఒక్క స్వర్ణలత మిశ్రా అనే భారతదేశపు మహిళ విషయంలో మాత్రం జ్ఞాపకాలు ఆజీవ పర్యంతం ఉండటం చూస్తాము గానీ దానికి ఆమె స్త్రీ అయి ఉండటం మూలాన గతజన్మలోని కుటుంబానికి ఆమె పట్ల ఉన్న ఆప్యాయత వల్ల మరిచిపోవడానికి వీలు లేకపోయింది.మిగిలిన వాళ్ళు 5 యేళ్ళు దాటిన తర్వాత నుంచీ ఈ జన్మకి సంబంధించిన మామూలు జీవితమే గడుపుతున్నారు, అంటే క్రమంగా ఈ జన్మకి సంబంధించిన ప్రాపంచిక జ్ఞానం బలమయ్యే కొద్దీ వారంతట వారే ఇప్పటి వాస్తవానికి అనుగుణంగా సర్దుకుపోతున్నారని అర్ధం కావటం లేదా!మరి వీటివల్ల జరగబోయే అనర్ధాలు యేమిటి?వీటిని ఆమోదిస్తున్న వారికన్నా రుజువులనూ సాక్ష్యాధారాలనూ చూసి కూడా అసలు జరగడమే అబధ్ధమని వ్యతిరేకిస్తున్న వారిలోనే నాకు మూర్ఖత్వం యెక్కువగా ఉన్నదనిపిస్తున్నది.శబ్దం అనేది ఒక దృగ్విషయం,దాని చుట్టూ కొన్ని భతికశాస్త్ర నియమాలు కూడా యేర్పడి ఉన్నాయి.ఆ నియమాలు శబ్దం అనేది ఒక దృగ్విష్యం అని గుర్తించి దాన్ని గురించి పరిశోధించిన తర్వాతనే కదా నియమాలు యేర్పడినాయి - మరి పునర్జన్మ అనే దృగ్విషయాన్ని వీరెందుకు గుర్తించడానికి నిరాకరిస్తున్నారు?

     అబ్రహామిక్ ప్రభావంలో ఉన్న పాశ్చాత్య ప్రపంచం పునర్జన్మలని భయాందోళనలతో కలిపి చూడటం వల్ల ఇప్పుడప్పుడే వారు ఈ దృగ్విషయాన్ని గురించి మరింత పరిశోధనలు చెయ్యటం లేదు గాబట్టి భారతీయ విజ్ఞానులు వీటిమీద పరిశోధనలు స్టీవెన్సన్ మహాసయుడు వదలివేసిన కృషిని కొనసాగిస్తే యెంతోకాలం నుంచీ అపరిష్కృతంగా ఉన్న ఒక విషయాన్ని గురించి తొలిసారి సాధికారికంగా విశ్లేషించిన కీర్తి దక్కుతుంది. ఉత్తర భారత  దేశం లోని ఒక నగరాన్ని ఆధారం చేసుకుని జరిపిన ఒక సర్వే లో ప్రతి 500 మందికి ఒకరు గతజన్మ జ్ఞాపకాల్ని చెబుతున్నట్టు తెలిసింది.అయితే వీటిపట్ల ఉన్న సందేహాల వల్ల కుటుంబం స్థాయిని దాటి బయటికి రానివి చాలా ఉండి ఉండొచ్చు!

     అబ్రహామిక్ మతాలని అనుసరించే సమాజాలలో సైన్సుకీ మతానికీ యెప్పుడూ పడి చావదు!ఉదాహరణకి అబార్షన్లని చర్చి వ్యతిరేకిస్తున్నది గనక ప్రపంచ దేశాలన్నింటి మీదా కర్ర పెత్తనం చేసే అమెరికా అధ్యక్షుడు కూడా సాహసించి చట్టం చెయ్యలేని పరిస్థితి!కానీ యెక్కడ బడితే అక్కడ యెప్పుడు బడితే అప్పుడు పెట్టేసుకునే లిలాక్ ముద్దుల ద్వారా వేడెక్కిపోవటం,దానితో అసలు వ్యవహారానికి తొందర పుట్టటం,యేకాంతం దొరకగానే తీట తీర్చుకోవటం అనే కక్కుర్తి పనుల్లో ముణిగిపోయి గర్భనియంత్రణకి సంబంధించిన జాగత్తల్ని తీసుకోకపోవటం వల్ల 13 యేళ్ళకే తన గర్భానికి కారణమెవరో,తనకి పుట్టబోయే బిడ్డకి తండ్రి యెవరో తెలియని గర్భాల్ని మోస్తున్నవాళ్ళు తయారవుతున్నారు.అసలు తల్లికే ఇంకా బాల్యం వీడిపోని సుకుమారపు శరీరంలో ఇంకో శిశువుని మోస్తూ,పాపభీతి,భయమూ,ఆందోళనల్తో ఆ పిల్ల చచ్చినా సరే ఫరవాలేదట, ఆ వ్యక్తురాలైన పిల్ల మీద లేని జాలి పరమ దయాళువులైన క్రీస్తుజనులకి/పోపుగారికి వూహ కూడా తెలియని పిండం మీద ఉండటం యేమి వింత?!ఈ వైరుధ్యాలు హిందువులకి లేవు, భారతీయ జీవన విధానం అనుభవానికి ప్రాధాన్యత నిచ్చింది, ఒక విషయం నీకు అనుభవంలోకి వస్తున్నదా - అయితే అది సత్యమే!యే విషయాన్నయినా అమోధించటం/తిరస్కరించటం ఉపయోగితని బట్టి నిర్ణయించటం సనాతన ధర్మంలోని విశిష్టత!అందువల్లనే ప్రపంచంలోని అతి పురాతనమైనదీ అతి నవీనమైనదీ కూడా అవుతున్నది - ఈ స్వయం చాలిత ధార్మిక యంత్రం! 

     Science also has religious spirit, when you go on searching for a reason,some where you may find your reason fails and settles into  belief!Religion also has scientific spirit, When you go on trying to believe,some where you may find your belief ask question and seeks for reason?

అన్ని ఇజాలూ కమ్యునిజములో కలిస్తే ఆ కమ్యునిజము కూడా హిందూఇజములో కలుస్తుంది!

Saturday, 19 September 2015

ముగ్గురు మూర్ఖపుటమ్మల ఆడపెత్తనానికి విడిపోయిన తెలుగువాళ్ళు సాధించామనుకుంటున్న దానికన్నా పోగొట్టుకున్నదే యెక్కువ?!

     బీహారు యెన్నికల తర్వాత భారతదేశపు రాజకీయ సామాజిక ఆర్ధిక స్థితిగతులలో వూహించని మార్పులు సంభవించవచ్చు!ఈ దేశపు సీనియర్ యెన్నికల విశ్లేషకుల అంచనా ప్రకారం అక్కడ భూమిహార్లు అని పిలిచే అగ్రవర్ణ హిందువులు యెక్కువగా ఉన్నారు.మొదట్లో మోదీ ప్రధానమంత్రిత్వాన్ని వ్యతిరేకించి వేరుపడిన నితీశ్ కుమార్ చొరవతో యేర్పడిన మహాకూటమి పట్ల మోదీ వ్యతిరేకులూ భాజపా త్రువులూ చాలా ఆశలు పెట్టుకున్నారు గానీ రాను రానూ వారిలోని కుంజరయూధములే వారి వారి అహంభావాలను చంపుకోలేక దానినొక ఓటికుండలా తయారు చేశారు!అనూచానంగా జరుగుతూ వస్తున్న యెన్నికల సరళి ప్రకారం మహాకూమిలో ఉన్నవారిలో ఆర్జేడీకి వోటుబ్యాంకుగా ఉన్న యాదవులు 14%,జేడీ వారికి దన్నుగా నిలిచే కోయిర్లు 5%,కుర్మీలు 4%,ముస్లిములు 15%,యల్జేపీకి నికరంగా 6% అని వేసుకున్న లెక్కలు నాయకుల మధ్యన జరుగుతున్న చీలికలపేలికల కుమ్ములాటల వల్ల అర్ధం లేనివిగా తయారై వాటివల్ల నిక్కచ్చిగా ఫలితం ఉంటుందనే గ్యారెంటీ లేకుండా పోయింది.పైగా కాంగ్రెసు వ్యతిరేకతతో వూపు తెచ్చుకున్న ఆర్జేడీ లాల్లూ కాంగ్రెసు పక్కన చేరటం,చేరిన వాడు రాహుల్ గాంధీతో వేదిక పంచుకోనని భీష్మించటం,లాల్లూని భాజపాతో కలిసి పదవీచ్యుతుణ్ణి చేసిన నితీశ్ కుమార్ ఇప్పుడు అతనితో దోస్తీ కట్టటం,వీరందరికీ యేదో ఒక రకమైన చెరుపుకోలేని అవినీతి మరక ఉండటం - మరీ ముఖ్యంగా వీరి రాజకీయ ప్రాధమ్యాలలోని హిందూ వ్యతిరేకత భాజపాకి యెక్కువ అనుకూలతని చూపిస్తున్నది!

     ఆంధ్రాలో కమ్మ,రెడ్డి,కాపు సమీకరణల్ని చూసి మనమొక్కళ్లమే కులపిచ్చితో అఘోరిస్తున్నామని మనమీద మనమే విసుక్కుంటున్నాం గానీ కాంగ్రెసు మరియూ వారి పిలక పార్టీల చలవ వల్ల దేశమంతా ఇదే పరిస్థితి!అబ్బో,అక్కడ అక్షరాస్యత శాతం యెక్కువ అని ఈర్ష్యపడే కేరళలో కూడా అధికారానికి కులసమీకరణలే మూలమవుతున్నాయి!సాంకేతికంగా మైనారిటీలు అని పిలవబడే విభిన్న వర్గాలు,అంటే చర్చి యొక్క డైరెక్టు అజమాయిషీ కింద వున్న క్రైస్తవ సమూహమూ,ముస్లిం లీగ్ ప్రభావంతో ఉన్న ముస్లిం మతస్థులూ,మిగిలిన హిందువులో ప్రముఖమైన రెండు కులాలు నాయర్లూ,ఎఝావలూ యెన్నికలలో అధికారం యెవరికి దక్కుతుందనేది నిర్ధారిస్థారు!వర్గరహితసమాజం గురించి ప్రవచనాలు దంచే కమ్యునిష్టులు కూడా ఈ కులసమీకరణల లోపాయకారీ సర్దుబాట్లతోనే కేరళలో అధికారం చేజిక్కించుకున్నారు, వారెవ్వా యెంత చక్కటి కమ్యునిజం?ఇక తమిళనాట పెరియార్ మరియూ ఇతర ద్రవిడ ఉద్యమ నిర్మాతలు పైకి యెన్ని ఆదర్శాలు ప్రవచించినా గానీ కార్యాచరణలో కొన్ని కులాలు మాత్రమే పాల్గొని విజయవంతం చేయదం వల్ల అందరూ భ్రమపడుతున్నట్టు కులరహితం అయిపోలేదు!2012 నవంబరులో ఒక కులాంతర వివాహం జరిగిన సందర్భంలో 300 మంది దళితుల గృహాలు పరశురామప్రీతి అయిపోయాయంటే ఆలోచించుకోండి పరిస్థితి యెట్లా ఉందో!ఇప్పుడక్కడి రాజకీయ చిత్రపటం మీద కులానికో పార్టీ  తయారై కూర్చుంది కాబట్టి విక్రమార్కుడు జవాబు చెప్పలేని భేతాళుడి ఆఖరి ప్రశ్నలాగ యే కులం గురించీ ప్రత్యేకంగా చెప్పలేము - ఈ దిశలో తమిళియన్లు కొంచెం అభివృధ్ద్గి చెందాక గానీ పరిస్థితి స్పష్టంగా యేదో ఒక కులానికి అనుకూలంగా మారదు!కర్ణాటక రాజకీయ రంగమంతా లింగాయతులూ వొక్కళిగల మధ్యన తిరుగుతున్నది!ఇక మోదీ గారి గుజరాతులో పటేళ్ళు హవాలో ఉన్నారు,మోదీ ముఖ్యమంత్రి పదవిలో మంచిపేరు తెచ్చుకుని పర్సనల్ చరిస్మా వల్ల గట్టెక్కాడు గానీ పేరులో పటేల్ లేనివాడు గుజరాతులో ముఖ్యమంత్రి కావడం చాలా కష్టం!ఇదివరలో స్వచ్చంగా ఉన్న ఒరిస్సాలో కూడా ఖండాయతులు రాజకీయంగా యేకమవుతున్నారు!పట్నాయక్ అనే మరొక కులం కూడా ఉండటంతో కుర్చీ వీరిద్దరి మధ్యనే తిరుగుతూ ఉంటుంది!ఇక మధ్య భారతం,ఉత్తర భారతం,అగ్ర భారతం అంతా రాజ్పుట్,జాట్,యాదవ్,సింధియా,చౌహాన్ లాంటి కులాలతో కలగాపులగమైపోయి ఉంది - ఈ కుల కళంక మహా పాప పంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించుట యన్నది బ్రహ్మకైన రుద్రునికైన దాదాపు అసాధ్యమే!

     మహాకూటమికి ఇప్పుడున్న ప్రతికూలతలలో మొదటిది మాగ్ఝీని పదవీచ్యుతుణ్ణి చెయ్యటం వల్ల దళితులు దూరమవ్వటం,రెండవది లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క అవినీతితో నిండిన నిరంకుశమైన రాజకీయ చరిత్ర గెలిచిన తర్వాతనైనా కలిసి ఉంటారని చెప్పలేని అనిశ్చితి,మూవది బీహారులోని మెజార్టీ ప్రజల్లో ఇప్పటి రాజకీయ గందరగోళానికి పూర్తిగా నితీశ్ కుమార్ బాధ్యుదనే అభిప్రాయం ఉందటం - అన్నీ దుశ్శకునములే,!ఒకనాడు మహోజ్వల కీర్తిప్రభలతో ప్రధాని పదవికి మోదీకి దీటుగా అన్ని విధాలా అర్హుడే అనిపించుకున్న వాడు అణిగివుండి అవకాశం కోసం యెదురుచూసే సహనం లేక ఈర్ష్యాళువుగా పరిగణిస్తారని కూడా ఆలోచించకుండా వేసిన ఒక తప్పటడుగుతో నెమ్మది నెమ్మదిగా దిగజారి నేటికి పడబొయేది గళసీమని శోభితం చేసే వరమాలయో లేక రాజకీయ శిరచ్చేదం చేసే ఖడ్గప్రహారమో తెలియని దిక్కుమాలిన స్థితిలో నిలబడ్డాడు!మహాకూటమి గెలిచి అధికారం దక్కినా లాలూతో పోటీ తప్పదు!మహాకూటమి ఓడితే మిగతావాళ్ళు క్షేమంగానే ఉంటారు గానీ తను మాత్రం ఇక మళ్ళీ అధికారం గురించి ఆశించడానికే వీలు లేనంతగా ముఖం చెల్లని స్థితి దాపురిస్తుంది!

     ఈ యెన్నికల్లో గెలుపోటములు నితీశ్ భవిష్యత్తుతో పోలిస్తే భాజపా భవిష్యత్తుకి సంబంధించినంత వరకూ వెంటనే రాబోయే మార్పులేమీ ఉండవు, కానీ కాలక్రమంలో గెలుపొక రకంగా ఓటమి మరోరకంగా వ్యూహాల్ని మార్చుకునేలా ఒత్తిడిని కల్పిస్తుంది!ఓడితే మహాకూటమి అనుకూల మీడియా పోల్చినట్టు భాజపా అశ్వమేధపు యాగాశ్వాన్ని నిలువరించగలిగిన ప్రతీపశక్తులు మరింత విజృంభిస్తాయి!ఇటువైపు పటేల్ కులస్థుల రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం మరింత పెరగవచ్చు - మోదీని ఇరకాటంలో పెట్టి అతని దక్షతకి సవాలుగా దీన్ని యెగదోసే అవకాశం ఉంది.ఈ పతేళ్ళ ఉద్యమం రెండంచుల పదునైన కత్తిలా కనిపిస్తున్నది - మహాకూటమి ఓడితే మైనారిటీలు రాజకీయంగా బలహీనపడిన అవకాశం చూసుకుని దేశంలో ఉన్న అగ్రవర్ణ హిందువులు మరింత హుషారుగా ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశం కూడా ఉంది, యెంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు మంచి టైము చూసుకుని రగిలింది!ఈ ఉద్యమం తీవ్రరూపం దాలిస్తే అసలు రిజర్వేషన్ల వ్యవస్థ పునాదులే మొత్తంగా కదిలిపోయినా ఆశ్చర్యపోనక్కర లేదు!యెన్నికల్లో కులాలు వోటుబ్యాంకుగా మారటం తప్పించి అస్తవ్యస్తంగా ఇన్ని దశాబ్దాల పాటు కొనసాగించిన రిజర్వేషన్ల వల్ల ఆయా కులాలు సామాజికంగా బాగుపడింది కూడా లేదు!ఒక అర్ధవంతమైన చర్చ అంటూ జరిగితే క్రీమీలేయరు ప్రతిపాదనల్ని తిరస్కరించిన భాగోతాలన్నీ బయటికి వస్తే రిజర్వేషన్లని సమర్ధించేవారు కూడా నీళ్ళు నమలక తప్పదు గదా!వాస్తవంగా చూస్తే ఒక్కసారిగా అదృశ్యం కాకపోయినా రిజర్వేషన్ల పట్ల అన్ని వర్గాలలోనూ మరింత వ్యతిరేకత పెరగడం ఖాయం అయినప్పుదు రిజర్వేషన్ అనుకూల వర్గాలు కూడా వూరుకోవుగా - యెటు చూసినా పెద్ద స్థాయిలో హోరాహోరీ జగడం తప్పదనే అనిపిస్తుంది.

     ఈ యెన్నికల్లో భాజపాకి యెదురుదెబ్బ తగిలితే అయోధ్య మళ్ళీ రంగం మీదకి వస్తుంది!ఇటీవలనే మూలసంస్థ సమావేశాల్లో సాధుసంతులు నిలదీసినట్టు తెలుస్తున్నది,వ్యతిరేకించే సాహసం చెయ్యరు గానీ సమయం సానుకూలతల కోసం ఆలోచిస్తున్నట్టు సర్దిచెప్పి బతిమాలుకుని ఉండొచ్చు.రాజకీయ నాయకులుగా మోదీ,నాయుడూ ఇతరులూ వొదిలేసినా సాదుసంతులు వదలరు కదా!బీహారులో గెలిస్తే సావకాశంగా జరిగేది ఓడితే అప్పటి చిక్కుల్ని తప్పించుకోవటానికి ముందుగానే జరుగుతుంది!డిల్లీ రాజకీయాల్లో యెప్పుడు అయోధ్య ప్రస్తావన వచ్చి పని సగంలో ఆగిపోయినా అప్పుడున్న ప్రభుత్వం యేదోరకంగా కూలిపోతుంది!ఇందిరా గాంధీ హత్య సరిగ్గా మొదటి రధయాత్ర జరిగిన మర్నాడు జరిగింది,రాజీవ్ గాంధీ ప్రభుత్వం అస్తవ్యస్తపు శిలాన్యాసంతో యెన్నికల్లో పరాజయం పాలైంది - తర్వాత వీపీ సింగ్,చంద్రశేఖర్,పీవీ హయాముల్లో జరిగిన తమాషాలు చూశారుగా!హేతువాదులకి ఇవి మూఢనమ్మకాలుగా కనిపించవచ్చు గానీ అక్కడున్నది పక్కా హిందువులు,కాదా?ఒకసారి భాజపా అధికారికంగా రామజన్మభూమికి అనుకూలంగా ప్రకటన చేశాక రామాలయ నిర్మాణానికి గానీ భాజపా ప్రబుత్వ పతనానికి గానీ చాలా తక్కువ సమయమే పడుతుంది.నాకు వ్యక్తిగతంగా తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం స్తంభాలూ,తదితర నిర్మాణాలూ దాదాపు అన్నీ పూర్తి ఆకారాల్ని సంతరించుకుంటున్నాయి!ప్రతీపశక్తులు కళ్ళు తెరిచి కాళ్ళూ చేతులూ కూడదీసుకుని దిగ్భ్రాంతులు వ్యక్తం చేసే లోపునే పాతాళభైరవిలోని మాయామహల్ మాదిరి పునాదుల నుంచి పైకప్పు వరకూ నిర్మాణం పూర్తయిపోయి కనిపిస్తుంది - పారా హుషార్!నెనిప్పుడిది చెప్పినా యెంతమంది గుండెలు బాదుకున్నా జరిగేది ఆగదు!ఒకప్పటి భాజపాకీ ఇప్పటి భాజపాకీ రెండు ముఖ్యమైన తేడాలు ఉన్నాయి.మొదటిసారికీ రెండవసారికీ నాయకుల వ్యక్తిగత సౌశీల్యంలో యే మార్పూ లేదు,అవినీతి మకిలి అంటించాలన్నా అంటించలేని సద్వర్తన ఇప్పటికీ కామనే!సుష్మా స్వరాజ్ కూడా డబ్బు తీసుకుని లలిత్ మోదీకి సాయం చేసిందని యెవరూ అనలేరు,అవునా!అయితే ఇప్పుడు వారు అధికారం పోకుండా ఉండటానికి వేసే యెత్తులలో ఆరితేరిపోయారు,అదే వారి ప్రతికక్షులకి ఉక్రోషాన్ని పెంచి మానసిక సమతౌల్యాన్ని కోల్పోయేలా చేస్తున్నది.వారి ప్రకటనల్ని విశ్లేషించి చూస్తే ఒక గొప్ప చరంగపు ఆటగాడు,అదీ అనతోలీ కార్పోవ్ లాంటి మేధావి ఆడే దూకుడు యెత్తులు వేస్తున్నారంటే వారెంత మొండిగా వున్నారో అర్ధం చేసుకోండి!బీహారులో గెలిచినా ఓడినా భారతదేశాన్ని హిందూ అనుకూల రాజ్యంగా మార్చడానికి బలంగా ప్రయత్నిస్తున్నారు - మతం పట్టు పెరిగితే కులం గుట్టు విడుతుంది కాబోలు!ఖడ్గాన్ని ఖడ్గమే రద్దు చేస్తుందన్న చాణక్యనీతి ప్రకారం ముస్లిం ఉగ్రవాదానికి హిందూ స్వాభిమానం నిండిన బజరంగదళం జవాబు చెప్తుందా?

     యెవరెట్లా పోతే మనకెందుకు లెండి, రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం పెరిగినా,అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగినా,క్రమంగా దేశం హిందూరాజ్యంగా మారినా మన తెలుగువాళ్ళకి ఒరిగేదీ లేదు తరిగేదీ లేదు!ఒకానొకప్పుడు కేంద్రంలో సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్ తర్వాత యెక్కువ మంది సభ్యులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అన్ని రాజకీయ పరిణామాలకీ భవిష్యసూచిగా ప్రత్యేకత ఉండేది!అసలు సనాతన ధర్మం దేశమంతటా ఒక్కతీరున విస్తరించడానికి ఆంధ్రశాతవాహనులే కారణం.యే కాలంలో అయినా ఆంధ్రులు ఇప్పుడున్నంత అనామకంగా యెప్పుడూ లేరు!అన్నీ అనుకూలించి అఖండ హిందూ చైతన్యం దేశమంతటా వెల్లివిరియటం గనక నిజంగా జరిగితే ఐక్యంగా ఉన్న తెలుగువాళ్ళు భౌగోళికంగా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత వల్ల రాజకీయంగా కీలకమైన స్థానంలోనే ఉండేవారని నా నమ్మకం.అప్పుడేమి వూడబొడిచారు,అంతగా బలం ఇచ్చినా రాష్ట్రానికి యేమి ఒరగబెట్టారని నిందించటం కూడా తప్పేనేమో!నెహ్రూవియన్ ఆర్ధిక విధానాల్లోని సాంకేతిక లోపం వల్ల దేశం యెన్నో వనరుల్ని సమర్ధవంతంగా వినియోగించుకోలేక యెదగాల్సినంతగా యెదగలేదు,అస్తవ్యస్తపు రిజర్వేషన్ల వల్ల ప్రజలు ఈర్ష్యాద్వేషాలు పెంచుకుని కలిసికట్టుగా యెదగడం సాధ్యపడలేదు,ఇప్పటికీ దేశమంతటా దరిద్రం తాందవిస్తుంటే మనమొక్కరం కేంద్రాన్ని పీడించితే జలగల్లాగ పీల్చుకు తిన్నారన్న చెడ్డపేరు వచ్చేది కాదా!ఈ దేశభాషల్లో యే ఒక్కటీ సరిగ్గా రాని ఆ సోనియాకి యేమి చెప్పి బుట్టలో వేశాడో గానీ థెలంగాణా ఇచ్చేస్తే చాలు అద్భుతాలు జరిగిపోతాయన్నట్టు పిచ్చెక్కిపోయింది మొదటి మహిళారత్నం!కాంగ్రెసు చేరిత్రలో యెప్పుడూ లేంది పార్టీవాళ్ళ కన్నా బయటివాడికి కాంగ్రెసు అధిష్ఠానం విలువనిచ్చిన సన్నివేశం ఇదొక్కటే,అదేమి తెలివో మరి?ఈ చిన్నమ్మని గుర్తుంచుకోండి అని తెలంగాణా వాళ్లని బతిమిలాడి ఆంధ్రావాళ్లని కన్నెత్తి గూడా చూదని సుష్మాస్వరాజ్ మరో మూర్ఖిణి!మోదీ బహిరంగంగానే చాలా ధీమాగా తన మాట్ అచెప్పాడు,అడ్వాణీ ఆఖరి నిముషాల్లో విభజన చట్టంలో ఉన్న గందరగోళాన్ని చూసి దీన్ని సమర్ధిస్తే వచ్చేది తామే గాబట్టి తలనొప్పులన్నీ తలుచుకుని వ్యతిరేకించినా ఈ చిన్నమ్మ పట్టుబట్టటం వల్లనే అయిష్టంగా ఒప్పుకోవలసి వచ్చింది - ఇంతకీ విభజన వల్ల భాజపాకి ఒరిగిన మేలు యేదన్నా ఉందా?ఆఖరికి చంద్రబాబు యెక్కే గడపా దిగే గడపా అన్నట్టు తిరిగి అన్ని రాజకీయ పక్షాల్నీ కలిసి బతిమిలాడటంతో మెడమీద తలకాయ ఉన్న మగమహారాజులంతా విభజనకి వ్యతిరేకంగా ఉన్నా అధికార పార్టీ సభ్యులే బిల్లుకి వ్యతిరేకత తెలుపుతూ నిరసనలు వ్యక్తం చేస్తుంటే బిల్లుకి సంబ్నధించిన నిజమైన మద్దతు యెంతో తెలిసి గూడా గందరగోళాన్ని అడ్డుపెట్టుకుని వ్యతిరేక వోట్లని కూడా సానుకూలం అని ఫిరాయించేసిన మీరాకుమారి అనబడు మరో మహిళా రత్నం పవిత్రమైన స్పీకరు పదవిని అపవిత్రం చేస్తూ రెచ్చిపోతే గానీ గర్భస్రావం వరకూ వెళ్ళి కూడా తల్లినిచంపి పుట్టే రాక్షసశిశువులా తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించింది?!అధికార పక్షానికి బిల్లును సజావుగా నెగ్గించగలిగే కనీసపు బలం కూడా లేదని తెలిసినా యెంత నెచానికి పాల్పడి అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తీరాల్సిందేనని మూర్ఖించిన ముగ్గురు మూర్ఖురాళ్ళ అధ్వర్యంలో కొన్ని లక్షల మంది భారతీయౌలకు ప్రతినిధులైన గౌరవనీయ పార్లమేంటు సభ్యులు మార్షల్స్ చెయ్యాల్సిన బంట్రోతు పన్లు చేసినా తప్పు లేదట గానీ ఇటువైపు వాళ్ళ మాట అస్సలు వినకూడదని భీష్మించుకున్న మొండితనానికి విసుగెత్తి చేసిన నిరపాయకరమైన పెప్పర్ స్ప్రే దాడిని మాత్రం పరమఘోరంగా చిత్రీకరించారు - అదీ హైదరాబాదులో ఒక సభ పెట్టుకుంటాం అని మర్యాదగా అడిగి పర్మిషన్లు తీసుకుని పెట్టుకుంటుంటే క్షేమంగా మిమ్మల్ని వూరు దాటనివ్వం అని బెదిరించిన వాళ్ళు సన్మార్గులట?! యెలాగైనా తమ ప్రాంతాన్నొక రాష్ట్రంగా మ్యాపులో విడిగా చూసుకోవాలనే రంధి తప్ప గట్టిగా యెందుకు విడిపోవాలనుకుంటున్నారో ధీమాగా చెప్పలేక రోజుకో నినాదం తలకెత్తుకుని వాళ్ళు చెప్పిన అబధ్ధాలు ఇవ్వాళ తెలుస్తున్నాయిగా,వాటన్నిటితో పోలిస్తే ఆ ఒక్క పెప్పర్ స్ప్రే సంఘటన యేపాటిది?

     అంత భీబత్సం చేసి అన్నేళ్ళు ఉద్యమం చేసి ఆఖరికి ప్రాణత్యాగాల లెక్కలు కూడా అబధ్ధాలు చేప్పి సాధించిన ఘనకార్యం యేమిటి?దెబ్బైవేల పుస్తకాలు చదివిన పెద్దమనిషికి లోకజ్ఞానం పెంచే పెద్దబాలశిక్ష లాంటివి దొరకలేదేమో పాపం, వాహనాల రీరిజిస్ట్రేషను నుంచి మొదలుకొని గుదుంబాకి విరుగుడుగా చీపులిక్కరు పెట్టటం వరకూ ఒక్కటంటే ఒక్కటి తెలివైన పని చెయ్యలేదు - అన్నీ వెర్రిబాగుల పన్లే!ఇంత గొప్ప రాష్ట్రమొకటి విడిపోగానే నదులన్నీ తమ దిశల్నీ ఉరవడినీ మార్చుకుని ప్రవహిస్తాయనుకున్నారు గాబోలు నీటి ఒప్పందాలు తిరగరాయాల్సిందేనని కోర్టులో కేసు ఏసేశారు డాబుసరిగా - కొత్తగా వచ్చేసారి ఒప్పందాలు కుదుర్చుకోవడం కుదురుతుంది గానీ నిన్న గాక మొన్న యేర్పాటు చేసిన ఒప్పందాలు రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టు మీ ఒక్కరి కోసం యెట్లా మారుస్తారు,బుధ్ధిగా పాత సమైక్య రాష్ట్రానికి ఎలాట్ చేసిన దాంట్లోనుంచి పంచుకోండని కోర్టు చివాట్లు పెట్టింది,ఆఖరికి మనస్తే తెలంగాణ కూడా మేము గుక్కపట్టి యేడిస్తే చెవులొగ్గి వింటామంది కోర్టు అని రాసుకునేసింది:-)ఇంతోటి దానికి కోర్టు దాకా వెళ్ళి యేడవాలా?నాలుగు రోడ్ల కూదలి దగ్గిర నిలబడి జనం ముందు యేడిస్తే చాలదూ!అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తండ్రిని మించిన తనయుడు తారకం బాబు 40 వేల కిలో మీటర్ల భూమి కొలత కన్నానాలుగు రెట్ల దూరం లక్షా ఏభై వేల కిలో మీటర్ల దూరం పైపు లైన్లు వేసి వాటర్ గ్రిడ్ పథకాన్నివిజయవంతం చేస్తాడంట:-)అయినా యెవడూ నవ్వడం లేదంటే తెలంగాణా వాళ్ళు నిజంగా ప్రత్యేకమైన వాళ్ళే సుమా!ముఖ్యమంత్రిని గట్టిగా విమర్శించుదామంటే యెక్కడ తెలంగాణ విఫలప్రయోగం అని పేరుపెట్టి  మళ్ళీ కలిపేస్తారేమోనని భయం కాదు గదా?అంతే,రాజమార్గంలో తెచ్చుకున్న దాని కన్నా దొడ్డిదారిన తెచుకున్న దాని పట్ల అదెక్కడ జారిపోతుందోనని బిత్త్రచూపులు చూస్తూ ఉండటం సహజమే కదా!మొదట్లో యేదో యేడుస్తున్నారు లెమ్మని విభజనకి సానుకూలంగా ఉన్నాను గానీ ఇప్పుడు మాత్రం తెలంగాణా నడిబొడ్డున రెండు రాష్ట్రాలని ఒక్కటి చెయ్యాలన్న సమైక్యవాదపు జండా యెగిరితే చూడాలని ఉంది!మొదటిసారి రాజశేఖర రెడ్డి నక్సలైట్ల సహాయం తీసుకుని తీరా అధికారంలోకి వచ్చాక అచ్చం చర్చలకి పిల్చి శివాజీని ఖైదులో పెట్టిన ఔరంగజేబు మాదిరి ద్రోహం చేస్తే పగబట్టి రాష్ట్రాన్ని చీల్చడంలో గట్టిగా కృషి చేసిన నక్సలైటులే తిక్క తిరిగితే ఆ పని కూడా చేస్తారేమో?

     పరిపాలన చూస్తే పిచ్చోడి చేతిలో రాయి!యే బిల్డింగు కాస్త పాతగా కనబడినా వాస్తు బాగా లేదనీ,పాతదనీ దీన్ని కూలగొతా దీని బాబు లాంటి దాన్ని కడతా అనటమే తప్ప ఒక్కదాన్నీ కూలగొట్టి చూపించడు!మైండులో ఒక వొడిసెలనీ రాళ్ళసంచినీ పెట్టుకుని నదరుగా బిల్డింగు కనబడినప్పుదల్లా గురి చూసి వొడిసెల్లో రాయి బిగించి లాగి వొదుల్తున్నట్టున్నాడు,పనీపాట లేని పిల్లగాడు అచ్చనగిల్లలు ఆడినట్టు పరిపాలిస్తన్నాడు - ఈ వైబోగం కోసమేనా ఇంతగా అంగలార్చింది!అదివర్లో రైతులు చస్తే పలకరించే వాళ్ళన్నా ఉందేవాళ్ళు,ఇప్పుడసలు వాళ్లని అనాధ పిండాల కింద తోసేస్తున్నారు తప్ప రైతుల కిందనే లెక్కెయ్యటం లేదు - రైతుల పరిస్థితిని చూసి ద్రవించి పోయానంటూ మీడియా ముందు దుఃఖించి ఉద్యమగురువు ఈమధ్యనే శంఖమూది కూడా మళ్ళీ సైలెంటయిపోయాడు,యెందుకనో? మనవాళ్ళు వ్యవసాయాన్ని తిండిగింజల కోసం తప్ప వ్యాపార పంటలకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు కాబట్టి వ్యవసాయానికి యెంత గాలి కొట్టినా అది రాష్ట్రం యొక్క సమగ్రాభివృధ్ధికి దోహదం చెయ్యదు.రాష్త్ర విభజన ద్వారా విద్యావంతులైన యువకులు ఆశించిన మెరుగైన ఉపాధి అవకాశాలు పెరగాలంటే పారిశ్రామికరంగం బలపడాలి!కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ దాని గురించి పట్టించుకోకుండా చెరువుల పూడికలు తీస్తూ కాలవలు శరవేగంగా నిర్మిస్తూ  కాలక్షేపం యెందుకు చేస్తున్నట్టు?ఖర్చు తప్ప ఆదాయం లేని గ్రామాల దత్తత స్వీకార పధకాల కోసం యింత మంది శ్రీమంతుల్ని రంగంలోకి దించి యెందుకు హడావిడి చేస్తున్నారు?గతంలో చంద్రబాబు అభివృధ్ధి నంతా హైదరాబాదు లోనే పిడకలు వేసినట్టు పోగెయ్యడాన్ని వెక్కిరించేవాళ్ళు ఇవ్వాళ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే బలిసిన హైదరాబాదుని ఇంకా బలిపిస్తానంటున్నా కిమ్మనడం లేదేమిటి?

     ఈ రెండు రాష్ట్రాల లోనూ పరిశ్రమలు అభివృధ్ధి కావడానికి తగిన పూర్వరంగం అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలికి బలపం గట్టుకుని దేశాలన్నీ తిరిగి బోల్డు కంపెనీల నుంచి యంవోయూలు సాధించానని చెప్తున్నా ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించే పనుల్లోకి యెందుకు దిగడం లేదో తెలుసా, హైదరాబాదులో తప్ప అంతర్జాతీయ స్థాయికి చెందిన సౌకర్యాలతో ఉన్న విమానాశ్రయాలు ఒకప్పటి సమైక్య రాష్ట్రంలో నైనా యెన్ని ఉన్నాయి?విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడ పరిశ్రమలూ వ్యాపారాలూ చెయ్యడానికి తగిన Infra Structure వాటికవే యేర్పాటు చేసుకునేటట్లయితే వాళ్ళకి గిట్టుబాటు కాదు,అందులోనూ ఇప్పుడు లోకల్ మార్కెట్ పరిధి కుంచించుకుపోయింది గదా!లోకల్ మార్కెట్ బలంగా ఉండి వెంటనే ఆదాయం వస్తుందని గ్యారెంటీ ఉంటే వాళ్ళు కొంత రాజీ పడతారు,అందుకే వాళ్ళు అంత గట్టిగా Infra Structure యేర్పాటు చేసే బాధ్యతని రాష్త్ర ప్రభుత్వాల మీదకే నెట్టేసి కూర్చున్నారు!రవాణా సౌకర్యాలు మెరుగు పడేటంత వరకూ,వారి వ్యాపార నిర్వహణకి అవసరమైన భూమిని సాధికారికంగా వారికి సమర్పించే వరకూ,పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు వస్తాయని గ్యారెంటీ లేనంత వరకూ ఈ రెండు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులూఒ యెంత గింజుకున్నా కొత్త పరిశ్రమల స్థాపనలో తొలి అడుగు పడదు - అది ఖాయం!దానికి కావలసిన పారిశ్రామిక రాయితీలు కేంద్రప్రభుత్వం ఇవ్వాలి.ఇదివరలో భాజపాకి మిత్రపక్షంగా ఉంటూ చంద్రబాబు చక్రం తిప్పడానికి కారణం భాజపా అప్పుడు 13 పార్టీల సంకీర్ణంలో ఉండటం.కానీ ఇప్పుడు మోదీ హవా వల్ల భాజపాకి పూర్తి మెజారిటీ వచ్చేసింది కాబట్టి అవసరం తిరగబడింది!యేమి తెచ్చుకున్నా గద్దించి అడిగే వీలు లేదు,బతిమిలాడుకునే తెచ్చుకోవాలి.మిత్రపక్షంగా ఉన్న బాబుకే ఇంత ఇరకాటంగా ఉంటే అసలెప్పుడూ దగ్గిరకే రాని రావు గారి ఇరకాటం మరీ యెక్కువ!

     రాజ్యాంగంలో సాంకేతికంగా రాష్ట్రాల రిపబ్లిక్ అని గొప్పగా నిర్వచించినా ఆచరణలో మాత్రం కేంద్రం పెత్తనం యెక్కువైన యూనిటరీ స్వభావమే కనబడుతున్నది,యెందుకనో!ఇప్పటికే మోదీ అధ్వర్యంలోని భాజపా ప్రభుత్వం క్రమక్రమంగా నెహ్రూవియన్ పధ్ధతులకి మంగళం పాడేస్తున్నది,బీహారు యెన్నికల్లో గెలుపు ఆ దిశలో మరింత హుషారుగా ముందుకెళ్ళ వచ్చు, బీహారు యెన్నికల్లో ఓడినా మొదలైన మార్పు వెనక్కి తిరగదు కదా!అన్ని సామాజిక మార్పులకీ ఆర్ధిక చట్రం పునాది అనే మార్కిస్టు సూత్రీకరణ ప్రకారం దేశంలో ఇప్పటి కన్నా విభిన్నమైన Social Order యేర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంది!మోదీ గారి మేక్ ఇన్ ఇండియా మంత్రం రూపురేఖలు స్పష్టమైన అవగాహనతో చూదగలిగిన వారికి అది ఖచ్చితంగా స్వదేశీ పెట్టుబడిదారులు విదేశీ పెట్టుబడిదారులతో మరింత పోటీ పడి నాణ్యతని పెంచుకునేలా ఒత్తిడికి గురి చేస్తుందని అర్ధమవుతుంది,ఆ లెఖ్ఖ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే security గురించిన భ్రమల్లో మునిగి తేలకుండా ప్రతివాడూ తన క్వాలిటీని మెరుగు పర్చుకునేటందుకు పోటీ పడటం తప్పనిసరి అని కూడా తెలుస్తుంది!

     SECURITY, DEVELOPMENT అనే రెండు మాటలూ DICTIONARYలో కలిసి ఉంటాయేమో గానీ వాస్తవ జీవితంలో అవి పొరపాటున కూడా ఒక ఒరలో ఇమడని రెండు పదునైన కత్తులు!సెక్యూరిటీని అతిగా కోరుకున్నవాడు డెవెలప్మెంటు గురించి మర్చిపోయి ఇల్లు దాటి కదలకుండా  ముసుగు తన్ని పడుకోవాల్సిందే!డెవెలప్మెంట్ కోరుకున్నవాడు సెక్యూరిటీ గురించి ఆలోచించకుండా రిస్కుకి సిధ్ధపడి ముందుకు దూకాల్సిందే!అట్టడుగు నుంచి బయలుదేరి అంబరాన్ని చుంబించిన యే సాహసి విజయగాధని చూసినా అది అక్షరసత్యమని తెలుస్తుంది,ఇది తెలియకనే ఆంధ్రాతో కలుస్తున్నప్పుడు అతిగా సెక్యూరిటీల కోసం పట్టుబట్టటం అనే ఒక చిన్న పొరపాటు ఇంతకాలం పాటు తెలంగాణా వాళ్ళని మొద్దునిద్ర పోయేలా చేసింది - ఇప్పటికీ తెలంగాణా పునర్నిర్మాణానికి ఆంధ్రావాళ్ళనే దేబిరించాల్సిన మానహీనత యెదురయ్యింది?!రిజర్వేషన్ల మీద భ్రమల్ని వొదులుకుని తమ స్థితిగతుల్ని మెరుగు పర్చుకోవడానికి చేసే నిజమైన ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు బుధ్ధిమంతులైన ముస్లిం సోదరులకీ తెలివైన దళిత మేధావులకీ నామాటలోని సత్యం బోధపడుతుంది!ఆర్ధీకచట్రం మారడం వల్ల సామాజిక ముఖచిత్రం కూడా మారి కులాల పేరిట కుమ్ములాటలూ మతాల పేరిట మారణహోమాలూ తగ్గి భారతదేశం నిజమైన శుభసుందర భవిష్యదుజ్వల సువర్లోకంలోకి సగర్వంగా ప్రవేశించి విశ్వగురువుగా వందనాలు అందుకోవటం ఖాయం - అన్నీ అనుకున్నట్టు జరిగితే?అప్పుడు తెలుగువాళ్ళు యెలా ఉంటారో తెలుసా!ఒకళ్ల నొకళ్ళు తిట్టుకుంటూ నువ్వు దొంగంటే నువ్వు దొంగని పోట్లాడుకుంటూ ఇప్పటికంటే అధమస్థాయికి దిగజారిపోయి ఉంటారు,యేమాత్రం సందేహం లేదు!నిన్నటి నుంచి చేసిన సుదీర్ఘమైన తప్పులతడక ప్రయాణం వల్ల ఇవ్వాళ్ళ ఇట్లా ఉన్నవాళ్ళు ఇవ్వాళ్టి నుంచి రేపటికి చేసే ప్రయాణం ఇంతకన్నా గొప్పగా యెట్లా ఉంటుంది?


జాతీయ స్థాయిలో ఆంధ్రుల ప్రాభవం ఇక గతజలసేతుబంధనమే!

Thursday, 10 September 2015

అలెగ్జాండరు పురుషోత్తముణ్ణి గెలిచాడనేది నిజమా!ఈ దేశపు నిజమైన చరిత్ర దేన్ని నిర్ధారిస్తుంది?

     మనం చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్న చరిత్ర ప్రకారం క్రీ.పూ326లో మాసిడోనియా ప్రభువైన అలెగ్జాండరు ఇప్పటి పంజాబు రాష్త్రంలోని జీలం నది వొడ్డున పురుషోత్తముడ్ని ఓడించాడనీ,కానీ ఓడిపోయినా పురుషోత్తముడి పరాక్రమానికి మెచ్చి గొప్ప ఔదార్యం గల నీతిమంతుడిగా అలెగ్జాండరు అతని రాజ్యం అతనికి తిరిగి ఇచ్చివేశాడనీ ఇప్పటికీ మనందరం యెంతో అమాయకంగా నమ్ముతున్నాము!ఈ అలెగ్జాండరు దండయాత్ర భారతదేశపు చరిత్రలో అతి ముఖ్యమైనదిగా కూడా మన చరిత్రకారులు వర్ణించారు!కానీ భారతదేశంలో కూడా అంతకు ముందే మహాజనపదాల పేరుతో 18 విస్తారమైన సామ్రాజ్యాలు ఉన్నాయి.ప్రతి సామ్రాజ్యంలోనూ తమ ప్రభువు యొక్క విజయ పరంపరలని గానం చెస్తూ కావ్యాలు రాయడం జరిగింది.ప్రతి రాజ్యానికీ తన సొంత కరెన్సీ ఉండేది.చరిత్ర రచన శిలా శాసనాల రూపంలో కూడా చేశారు.కానీ ఇప్పుడు మనం ఇంత ప్రముఖమైనదిగా చదువుకుంటున్న సంఘటన గురించి అసలు యే ప్రస్తావనా లేదు,యెందుకని?మన పురాణాలు 18 కావటం కాకతాళీయం కాదు,ఆ పురాణాలాలో ఆధ్యాత్మిక విషయాలు లేవు,ఆ పురాణాలలో ఆయా రాజవంశాల చరిత్ర రచించబడింది!

అలెగ్జాండరు యొక్క విజయయాత్ర

     అలెగ్జాండరు పురుషోత్తముల మధ్యన జరిగిన యుధ్ధానికి సంబంధించి మనం చదివిన విషయాలకు ఆధారాలు గ్రీకుల చరిత్రలో కన్నా ఆంగ్లేయులైన ఆధునిక చరిత్రకారుల ఉల్లేఖనాల నుంచే లభిస్తున్నది - కారణం యేమిటి?భారతదేశపు ప్రాచీన చరిత్రలో అలెగ్జాండరుని పురుషోత్తముడు ఓడించాడని చెప్పబడింది,గ్రీకు చరిత్రలో అలెగ్జాండరు పురుషోత్తముణ్ణి ఓడించాని చెప్పబడింది!గ్రీసు దేశపు చరిత్రకారులు ఒక గ్రీకు ప్రభువు విదేశీ రాజు చేతిలో ఓడిపోయాని రాసుకుంటారా,గ్రీకు ప్రభువు ఇతర్లని జయించాని రాసుకుంటారా?భారత దేశపు చరిత్రకారులు ఒక భారత ప్రభువు విదేశీ రాజు చేతిలో ఓడిపోయాని రాసుకుంటారా,భారత ప్రభువు ఇతర్లని జయించాని రాసుకుంటారా?బ్రిటిష్ చరిత్రకారులు మాత్రమే ఇతన్ని విశ్వవిజేతగా నిలబెట్టాలని చూశారు!గ్రీకుల వైపు నుంచి అలెగ్జాండరు తప్ప ఇంకెవరూ భారతదేశాన్ని గెలవాలనే ఉద్దేశంలో లేరు,వారి ముఖ్యశత్రువు పర్షియా - దాన్ని గెలిచారు,అందుకే ఇక ముందుకు వెళ్ళడానికి వ్యతిరేకించారు.!బ్రిటిషు చరిత్రకారుల కల్పనాత్మకపు విశ్లేషణయే తప్ప అలెగ్జాండరుకి సైతం ప్రపంచవిజేత కావాలనే కోరిక ఉన్నదనే గట్టి సాక్ష్యాలు లేవు.

     ఆ కాలంలో పురుషోత్తముడి రాజ్యం చాలా చిన్నది,భౌగోళికంగా విదేశీయులు భారతదేశానికి ప్రవేశించే కీలకమైన చోట ఉన్నది,అంతే!ఈ పురుషోత్తముడి గురించి ప్రముఖ రాజవంశాల చరిత్రలలో గానీ ఇతర ప్రస్తావనలలో గానీ పేర్కొన లేదు.మహా జనపదాలకి ఉన్న అనేకానేక సామంత రాజ్యాల మాదిరిగానే యేదో ఒక రాజ్యానికి సామంతుడై ఉండవచ్చు,ఈ యుధ్ధం ప్రస్తావనలో మాత్రమే ఇతని పేరు కనబడుతున్నది!మనం చదువుకుంటున్న ఇవ్వాళ్తి చరిత్రకారులు చెప్తున్నట్టు భారతదేశపు చరిత్రలో కల్లా అతి ముఖ్యమైన సంఘటన కూడా కాదు ఆనాటి వాళ్ళకి,ఈ యుధ్ధంలో అలెగ్జాండరు పురుషోత్తముడి చేతిలో ఓడిపోవటమే భారతదేశపు చరిత్రలో ప్రముఖంగా పేర్కొనబడక పోవటానికి కారణం - అప్రధానమైన విషయాలు చరిత్ర రచనలోకి యెక్కిస్తారా యెవరైనా?వచ్చాడు,ఓడాడు,వెళ్ళాడు - అంతకన్నా అధ్భుతం జరగలేదు!

     యుధ్ధంలో పురుషోత్తముడే గెలిచాడనేటందుకు తటస్థులు కొందరు ఉదహరించిన చారిత్రక వాస్తవాల కన్నా ముందుగా ఇప్పుడు ప్రచారంలో ఉన్న కధలోని వైరుధ్యాలని చూపిస్తాను.పురుషోత్తముణ్ణి ఓడించి ఆ రాజ్యాన్ని తనకి ఇవ్వమని అలెగ్జాండరుతో ఒప్పందం కుదుర్చుకున్న తక్షశిల రాజు అంభి మీకు గుర్తున్నాడనుకుంటాను!సహజంగా అలెగ్జాండరుతో విజయయాత్రకి బయలుదేరిన ఇతరులు ప్రాధమిక లక్ష్యమైన పర్షియా మీద గెలుపుతో వెనక్కి తిరగాలని అనుకోవటం వల్ల అలెగ్జాండరు కూడా ఇక వెనకి వెళ్ళిపోయే వాడో యేమో గానీ అంభితో ఒప్పందం ఖరారు చేసుకోవడం వల్లనే అతను పురుషోత్తముడి రాజ్యం మీదకి వచ్చాని స్పష్తంగా తెలుస్తున్నది గదా!మరి,గెలిచాక పురుషోత్తముడు యెంత వీరోచితంగా పోరాడినా అంభితో తను చేసుకున్న ఒప్పందాన్ని భగ్నం చేసేటంత అమర్యాదకరమైన పని యెందుకు చేస్తాడు?ఇక్కడ ఇంకో క్యామెడీ కూడా ఉంది!యుధ్ధం తర్వాత పురుషోత్తముడికి తన సొంత రాజ్యం మాత్రమే దక్కలేదు,అంబి రాజ్యం కూడా కలిసింది - యేమి వింత?గొప్ప పధకం వేసి నది దాటి చుట్టు తిరిగి వచ్చి వెనకనుంచి దాడి చేసి యుధ్ధంలో గెలిచిన వాడు తన చేతిలో ఓడిపోయిన వాడికి  తను యేవరితోనైతే గెలిచాక పురుషోత్తముడి రాజ్యాన్ని ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడో ఆ రాజ్యాన్ని కూడా ఓడిపోయిన రాజుకి దఖలు పర్చేశాడట!

     Marshal Gregory Zhukov అనే రష్యన్ యుధ్ధనీతి విశారధుడు ఈ యుధ్ధాన్ని గురించి ప్రస్తావిస్తూ అలెగ్జాండరు నేతృత్వంలో మాసిడోనియన్లు భరతఖండంలో జరిగిన యుధ్ధంలో దారుణంగా పరాజితులయ్యారని ప్రస్తావించాడు!Following Alexander’s failure to gain a position in India and the defeat of his successor Seleucus Nikator, relationships between the Indians and the Greeks and the Romans later, was mainly through trade and diplomacy. Also the Greeks and other ancient peoples did not see themselves as in any way superior, only different.” - ఇదీ అతను నిష్కర్షగా తేల్చి చెప్పిన విషయం, ఇంకా అనుమానంగా ఉందా?అలెగ్జాండరు యుధ్ధంలో ఓడిపోతేనే అంబి రాజ్యాన్ని కూడా పురుషోత్తముడికే దఖలు పర్చడం తార్కికంగా సరయినది అవుతుంది!ఆ యుధ్ధంలో తగిలిన గాయాలతోనూ ఆ ఓటమి వల్ల కలిగిన మనోవ్యధతోనూ మరణించడం జరిగిందనేది యదార్ధంగా తోస్తున్నది!యెన్ని అబధ్ధాలు?యెంత కపటం?అంతా వక్రీకరణలూ పులుముడు వ్యాఖ్యానాలూ!

     ఈ మొత్తం కట్టుకధలో ప్రస్తావించబడిన నలుగురు వ్యక్తుల కాలాలు ఇలా ఉన్నాయి:సాండ్రకోట్టస్ పేరుతో మగధ రాజుని వ్యవహరించారు.మన దేశపు చరిత్రలో చంద్రగుప్తుడనే పేరుతో ఇద్దరు ఉన్నారు.వారిలో ఒకరు క్రీ.శ 320లో జీవించి ఉండి భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగాన్ని సృష్టించినదిగా వర్ణించబడిన గుప్తవంశ స్థాపకుడైన గుప్తవంశపు చక్రవర్తి.మరొకరు క్రీ.పూ320లో మౌర్యసామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుడు.దండయాత్ర జరిగిందని చెప్పబడుతున్న క్రీ.పూ 326లో మగధను పాలిస్తున్నది నందవంశం!ఈ ఇద్దరు చంద్రగుప్తులలో యే ఒక్కరికీ ఆ యుధ్ధంతో సంబంధమే లేదు!అలెగ్జాండరూ ఇద్దరు చంద్రగుప్తులూ కాకుండా ఆ కధలో వినబడుతున్న మరొక వ్యక్తి సెల్యూకస్ నికటోర్ - అలెగ్జాండరు సైన్యాధిపతులలో ఒకడు!పురుషోత్తముణ్ణీ గెలిచిన అలెగ్జాండరు ఇతన్ని తన ప్రతినిధిగా నియమించాని చెప్పారు,కానీ అలెగ్జాంరు తర్వాత బాబిలోనియాతో కలిపి అలెగ్జాంరు రాజ్యాన్ని పరిపాలించి క్రీ.పూ305 నుంచి క్రీ.పూ300 వరకూ రెండు సంవత్సరాల పాటు అప్పుడు మగధ ప్రభువైన మౌర్య చంద్రగుప్తుడితో పోరాడి ఓడిపోయి తన కూతురు హెలీనాని ఇచ్చి వివాహం చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు!ఈ నలుగురికీ సంబంధించి ఇప్పటి చరిత్రలో ఉన్న గందరగోళాన్ని పోగొట్టుకోవాలంటే విశ్వనాధ సత్యనారాయణ కూర్చిన పురాణ వైర గ్రంధమాల వరుస కధల్లోని చంద్రగుప్తుని స్వప్నం అనే ఐదవ కధనీ హెలీనా అనే పదవ కధనీ చదివి తీరాలి!

     నిజానికి కమ్యునిష్టు పైత్యకారులు విశ్వనాధకి కాలాన్ని వెనక్కి తిప్పాలనుకున్న దురద అంటగట్టినా కొత్త కొత్త సాహితీరూపాలలో తన ప్రతిభ చూపించడంలో మిగతా రచయితల కన్నా చాలా ముందు నడిచాడు!ఆయన వచన రచనలన్నీ సరళ గ్రాంధికంలోనే ఉంటాయి,అయినా పాషాణ పాక ప్రభువని పేరు వచ్చింది!పద్యాలు మాత్రం కొంచెం ముందువెనుకలు సరిచూసుకుని చదివితే తప్ప అర్ధం కావు - పద్యాల్లో Colloquial Tongue వాడాడు మరి!ఇక కిన్నెరసాని పాటలు యెంత లలితంగా ఉంటాయో చదివితే తెలుస్తుంది.శ్రీశ్రీ కాబోలు తెలుగు సాహిత్యమంతా తగలబడిపోయి ఒక్క విశ్వనాధ సాహిత్యం మాత్రం మిగిలితే చాలు తెలుగువాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు అంటే వెటకారంగా అన్నాడేమో అనుకున్నా - కాదు నిజంగా మెచ్చుకోలుగానే చెప్పి ఉంటాడని పురాణవైరగ్రందమాల అన్ని భాగాలూ చదివితే అనిపిస్తుంది!కధ కన్నా పీఠిక శ్రధ్ధగా చదవాలి!శ్రీశ్రీ తన సాహిత్యంలో చాలా చోట్ల విశ్వనాధని ప్రస్తావించినా అక్కడ వెటకారం కన్నా నాకు అంతర్లీనంగా గౌరవంతో కూడిన హాస్యధోరణి ఉందనిపిస్తుంది!

     పురాణవైరగ్రందమాల అంతా మగధ రాజవంశావళి అని చెప్పవచ్చు!ఒక్కో కధలో ఒక వంశంలోని చివరి రాజు అంతరించి మరొక అంశంలోని మొదటి రజు రాజ్యస్థాపన చెయ్యటం వర్ణిస్తాడు.మంచి రాజులూ చెడ్ద రాజులూ అని గుర్తు పట్టేటంత స్పష్టంగా రాజుల్లో ఉన్న రెండురకాల్నీ చూపిస్తూ పాత్రలని జీవమున్న వ్యక్తులుగా తీర్చిదిద్దాడు.భాష సరళ గ్రాంధికంలో ఉండి మామూలు తెలుగు చదవటం వచ్చిన ప్రతివాడికీ చక్కగా అర్ధమవుతుంది.కధాకధనం విషయాని కొస్తే కళ్ళు చెదిరే సంవిధానం కనబడుతుంది!ఆ రాజులూ సైన్యాధ్యక్షులూ యుద్ధం కోసం ఎలా పథకాలు వేశారు, సైన్యాన్ని ఎలా సమీకరించారు, అవతలి వారి వ్యూహాలని కనిపెట్టి వారికన్నా ముందుగా తాము ఎలా సంసిద్ధమయ్యారు– ఇలాంటివన్నీ మనం ఇపుడు యుద్దాలు చేయడం లేదు కాబట్టి అచ్చంగా అలాగే ఉపయోగించుకోలేక పోవచ్చును, కానీ ఒక అధికారి తన తోటివారితో, క్రిందివారితో, ప్రత్యర్థులతో, తనకి సహాయపడాలని వచ్చే సహృదయులతో, తనని దెబ్బతీయాలని వచ్చే వంచకులతో – ఎవరితో ఎలా మెలగాలో చక్కగా అర్థం చేసుకోగలిగే సన్నివేశాలూ ఉన్నాయి ఈ నవలల్లో. కొన్ని జీవితానుభవాన్ని రంగరించి చెప్పే అర్ధవంతమైన  కొటేషన్లు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది!వాటిలో ఒకటి చెప్పుకుందాం.“.. ఈ ఆకాశమేమి? ఈ సముద్రమేమి? ఈ దిక్కులేమి? ఈ దేశములేమి? ఈ జనమందరు నిట్లు పుట్టుచుండుట యేమి? ఎవనికి వాడీ సృష్టి నంతయు యేదో తలక్రిందులు చేయుచున్నాననుకొనుట యేమి? వాడు తలక్రిందులు సేయుట యంతయు కలిపి ముప్పది నలుబది ఏండ్లు, కాదా యరువది ఏండ్లు. ఇంకను వీలు మిగిలినచో వంద ఏండ్లు. అంతకంటే మించి లేదు కదా! దాని కొరకు వాని యారాటమెంత? ఈ అనంత కాలములో వందేండ్లే సూక్ష్మాతి సూక్ష్మమైన కాలము. పాతికేండ్లు, పరక ఏండ్లు లోకము నానిపట్టికొని సంతోషించెడి వారి సంగతి నింక నేమి చెప్పవలయును? అందరును లోకమున కుపకారము చేయవలయుననెడి వారే. ఎవ్వడును తాను తరించెడి వాడు లేడు. ఇతరులను తరింప చేయవలయుననెడి వాడే. పెద్దలు లోక మజ్ఞాన దూషితమని చెప్పుదురు. ఆ యజ్ఞానము వేయివిధములుగా నుండవచ్చును. సర్వ విధములైన యజ్ఞానములలో మకుటాయమానమైన యజ్ఞానము పరులను తరింపజేయువలయునన్నది. అది నిజముగా లోకోపకార బుద్ధి కాదు. స్వోపకార బుద్ధి!ఇలాంటివి చదివినపుడు.. అరే, చిన్నప్పుడే ఈయన రచనలు చదవకుండా ఈ విషయాలన్నీ మనం జీవితంలో బోలెడంత సమయం వృథా చేసి కష్టపడి నేర్చుకున్నాం కదా అని దిగులేస్తుంటుంది నాకు. :) 

వేయిపడగల విశ్వనాధుడు తెలుగువాళ్ళ జ్ఞానపీఠం!

Monday, 7 September 2015

నవ్యాంధ్రలో ఈ చిందర వందర రాజకీయాలు యెందుకు నడుస్తున్నాయి?ఆదిలోనే తుంచకపోతే భవిష్యత్తు అంధకార బంధురమై పోతుంది గదా!

     ప్రత్యేక హోదా కోసం అంతమంది ఆత్మహత్యలు యెందుకు చేసుకున్నారు?ఆ చేసుకున్న వాళ్లలో ప్రత్యేకహోదా గురించి అర్ధం చేసుకోగలిగిన తెలివితేటలు యెవరికైనా ఉన్నాయా?వాళ్ళ  బయోడాటా చూస్తుంటే అలా కనిపించడం లేదు మరి!ఆంధ్రాకి హక్కుగా రావల్సినది యేదో రావడం లేదంటున్నారు,అది రాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని కూడా అంటున్నారు అన్న ఆందోళనే తప్ప దాని అసలు స్వభావం కూడా పూర్తిగా తెలియదు వాళ్ళకి,అయినా చచ్చిపోతున్నారు - అజ్ఞానం+దారిద్ర్యం+అయోమయం కలిస్తే ఇలా ఉంటుంది!?దీనికి ప్రతిపక్షాల మీద పూర్తిగా తోసెయ్యకుండా అధికార పార్టీ కూడా బాధ్యత వహిణాలి,అసలు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ప్రతిపక్షాలు దాన్ని ఆయుధంగా చేసుకుని ఇంత గందరగోళం సృష్టించాయి!చావగూఒడని వాళ్ళంతా చచ్చిపోయాక జరగాల్సిన డ్యామేజి అంతా అజరిగిపోయాక ఇప్పుడు చేసిన తీర్మానం మొదటి శాసనసభ సమావేశాల్లోనే చేసి ఉండొచ్చు,యెందుకు చెయ్యలేదు?

     ప్రత్యేక హోదాకి ప్రతికూలతలు ఉన్నాయని యే కొంచెం బుర్ర ఉన్నవాడికయినా ముందు నుంచే తెలుసు!తెలియని వాళ్లకి కొంచెం వివరంగా చెప్తే బాగుండేది కదా!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి ఈ అయిదేళ్ళూ దినదినగండం నూరేళ్ళాయుష్షు అన్నట్టు తయారైందనిపిస్తుంది ఇప్పుడు నడుస్తున్న చీదర రాజకీయాల వ్యవహారం చూస్తుంటే!అటువైపు ప్రతిపక్షనాయకుడి మీద అన్ని కేసులు నడుస్తున్నా అతనికి ప్రజల్లో పుల్ ఉంది!"కేసులు చిన్నవైనా పెద్దవైనా ఆధారాలు ఉంటే ఇంతకాలం యెందుకు సాగుతాయి?ఆధారాలు దొరికి ఉంటే యెప్పుడో విచారణ పూర్తి చేసి ఉండేవాళ్ళు,అది లేకపోవడం వల్లనే కదా కేసులు తేలడం లేదు - కాబట్టి జగన్ అమాయకుడు!కావాలనే ఈతన్ని కేసుల్లో ఇరికించారు అని తెలుస్తున్నది,అవునా కాదా?" - యెన్ని సార్లు జగన్ రేపో మాపో  జైలు కెళ్తాడు అని తెదెపా వాళ్ళు డప్పు కొట్టినా జనంలో పనిచేస్తున్న వాదన అది!చంద్రబాబు ద్రోహం చేస్తే ప్రత్యామ్నాయం కోసం ఇతర రాజకీయ పక్షాల వైపుకు చూద్దామంటే కాంగ్రెసు యధావిధిగా దివాళాకోరు వాదనలతో తలనెప్పి తెప్పిస్తున్నదే తప్ప నిర్మాణాత్మకంగా వ్యవహరించటం లేదు,తండ్రి నుంచి రాజకీయ వార్సత్వాన్ని అందిపుచ్చుకోవటం కోసం చీలిన పిల్ల కాంగ్రెసును రాజాధిరాజులాగా ఫలితాలన్నీ యెదురు తన్నేస్తున్న గందరగోళం నిండిన వ్యూహాలతో నడిపిస్తున్న ప్రతిపక్ష నాయకుడు కూడా తెలివితక్కువ యెత్తుగడలతో అభాసుపావుతున్నాడు.ఆ తెలివితక్కువ యెత్తుగడలతో తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కునే కన్నా రాహుల్ గాంధీ చేసినట్టు కొన్నాళ్ళు శెలవులో గడిపి రావచ్చు కదా?యే సైకియాట్రిస్టు దగ్గిర కౌన్సిలింగ్ తీసుకున్నాడో యే గ్రహశాంతి పూజలు చేశాడో ఇదివరకటికన్నా కొంచేం మెచ్యూరిటీ కనబడుతున్నాది మొద్దబ్బాయిలో!?

     ఈ ప్రతిపక్ష నాయకుడు పట్టిసీమని యెందుకు వ్యతిరేకిస్తున్నాడో యెన్ని కోణాల నుంచి చూసినా అర్ధం కావడం లేదు,బహుశా లైలాని మజ్ఞూ కళ్ళతో చూస్తేనే అందంగా కనబడుతుందన్నట్టు అతని దృక్కోణం నుంచే చూడాలేమో!నాకయితే "పట్టిసీమని బాబు పూర్రిచేసి సీమలో గుడ్ విల్ కొట్టేస్తే,అప్పుదు నా గతేంటి?" అనే రాజకీయమే ఉందా?ఇంకేమీ లేదా!అలా అయితే పట్టిసీమని వ్యతిరేకించినందుకే రాయలసీమ ప్రజలు తన చేతికి చిప్ప ఇస్తారు - అది ఖాయం!


రాయలసీమ అనాలోచనాపరుల సమితి

     నేనీ మధ్య తరచుగా "రాయలసీమ ఆలోచనాపరుల సమితి" వారి వ్యాసాలు చదువుతూ వస్తున్నాను.వారి ప్రతి వ్యాసమూ రాయలసీమ రాష్త్ర సాధన కోసం చేసే విజ్ఞప్తితో ముగుస్తున్నది,యేమిటి వారి ఉద్దేశం?విడిపోయి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు,విడిపోవటానికి ముందు నుంచే ఆర్ధిక శాస్త్రవేత్తలు రాబోయే కరువు గురించి చేసిన హెచ్చరికలు చదివాను నేను - ఇప్పుడు ప్రత్యక్షంగా కనబదుతున్నది,ప్రభుత్వాదాయం చూస్తే మెరుగంతా తెలంగాణకి పోయి తరుగంతా ఆంధ్రకి మిగిలి శూన్యం నుంచి నడక మొదలు పెట్టాల్సిన స్థితిలో విడిపోయి దరిద్రాన్ని తీసుకెళ్తారా కొత్తగా యేర్పడబోయే రాయలసీమ రాష్ట్రానికి?400 TMCలు దక్కకపోతే చూస్కోండి ఖబడ్దార్ అని ఒకసారీ,రాజధాని మాప్రాంతం నుంచి లాక్కుపోయారు కాబట్టి రెందో రాజధాని రాయలసీమలో పెట్టాలని ఒకసారీ,అసలు మా సంస్కృతియే భిన్నం ఉత్తరాంధ్ర వాళ్ళ పెత్తనం కింద మేము లొంగి ఉండం అని ఒకసారీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు - యేమి ఆశించి?ఆఖరికి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునికోటి గురించి కూడా "ప్రత్యేకహోదా కోసం చావడ మేమిటి?అది ఆంధ్రావాళ్ళ వ్యవహారం - చస్తే రాయలసీమ రాష్ట్ర సాధన కోసం చావాలి గానీ" అని కూడా అనేశారు!అక్షరం సాక్షిగా ప్రత్యేక రాయలసీమ రాష్త్రసాధన కోసం కోసం చావాల్సిన అవసరం ఉందనుకుంటే ముందు ఆ వ్యాసరచయొత ఇప్పుడే చావొచ్చు గదా!వీళ్ళు ఈరకంగా రెచ్చగొడితే యెక్కడో మునికోటి లాంటి తాడూ బొంగరం లేని అమాయకపు గొట్టాం గాళ్ళు చస్తే ఎలిజీల రూపంలో మళ్ళీ వీళ్ళు తమ రచనా చాతుర్యం ఉపయోగించి మరింతమందిని ఉద్రేకింప జేస్తారు - అంతేనా?

     వీరి ఉద్దేశంలో ప్రత్యేక హోదా ఉత్తరాంధ్ర వారు తమ సమర్ధతని నిరూపించుకోవడం కోసం పనికొచ్చే అంశం కాబట్టి దానికోసం రాయలసీమ వాసులు ఆత్మహత్యల వరకూ వెళ్ళడం అనవసరం అని కాబోలు!మరో రకంగా చెప్పాలంటే ఇంగ్లీషులో "Reading between the lines" అన్నదాని ప్రకారం ప్రత్యేక హోదా రాష్త్రమంతటికీ సంబంధంచినది అయినా ప్రయత్నించి సాధించటాన్ని మాత్రం ఉత్తరాంధ్ర వారి మీదికి నెట్టుతున్నదీ వీరే,400 TMCలు రాయలసీమకి తీసుకురావడమూ ఉత్తరాంధ్ర వారి భుజస్కంధాల మీదనే పెట్టేశారు, వీరు కేవలం మాకు 400 TMCలు తీసుకొస్తారా తెలంగాణా వాళ్ళలాగా విడిపొమ్మంటారా అనడం వరకే పరిమితమవుతారు కాబోలు?మరి 400 TMCల పట్ల అంతగా పట్టింపు ఉన్నవాళ్ళు తమ ప్రాంతానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు పట్టిసీమని వ్యతిరేకిస్తుంటే కిమ్మనకుండా ఉంటున్నారేమి?ఆ రకంగా పట్టిసీమ రాకపోతే "అదుగో పట్టిసీమ రాలేదు కాబట్టి మేము విడిపోతాం" అనే అవకాశం కోసం యెదురు చూస్తున్నారా?ఈ రకం తెలివితేతలు వీళ్ళలో పుట్టినా ఉత్తరాంధ్ర వాళ్ళే ఆ పాపం మొయ్యాలా?

     మొత్తం మీద చూస్తే రాయలసీమ వాస్తవ సమస్యలు యేమిటి,దానికి పరిష్కారం యేమిటి అనేవి నాకెక్కడా వారి వ్యాసాల్లో కనబడ లేదు మరి,యెంతసేపూ ఉత్తరాంధ్రుల పెత్తనం అనే కాపీ/పేష్తు పాండిత్యం,అది ఇవ్వకపోతే విడిపోతాం జాగ్రత్త,ఇందులో వాటా ఇవ్వకపోతే విడిపోతాం చూస్కోండి అనే బెదిరింపులు తప్ప!నేను మంచివాణ్ణి అనుకునే ప్రతి మనిషికీ తను పుట్టి పెరిగిన వాతావరణమే మూలకారణంగా తోచడం వల్ల తలిదంద్రులూ,బంధుమిత్రులూ,కులగోత్రాలూ,ప్రాంతాలూ గొప్పవిగా కనబడి ఆత్మీయతని చూపించవచ్చు - తప్పు లేదు!కానీ పరిధి దాటితే అది ఖచ్చితంగా దురభిమానం అవుతుంది - అప్పుడే ప్రమాదం!తమ ప్రాంతానికి ప్రభుత్వం నుంచి మరింత వాటా రాబట్టుకోవడం కోసం చేసే వాస్తవిక ప్రయత్నంగా ఉంటేనే వారు ఆలోచనాపరులు అని నిరూఒపించుకుంటారు.లేని పక్షంలో రాయలసీమకి కొత్త సమస్యలని సృష్తిస్తారు!


కళింగాంధ్రుల వారి తింగరి పొలికేకలు

     నేను చాలాకలం క్రితం "కళింగ కేక" బ్లాగులోకి వెళ్ళాను ప్రమాదవశాత్తూ!అలా యెందుకంటున్నానంటే మామూలుగా తెలుగువాళ్ళలో తెలుగు గురించి ఔదార్యంతో ఆలోచించే వాళ్ళే తక్కువ,అందులోనూ బ్లాగులు అనేవి ఉన్నాయని తెలిసిన వాళ్ళు మరింత తక్కువ,తెలిసినా అలవాటుగా చూసేవాళ్ళు మరీ తక్కువ!ఆ కొద్దిమందీ చేసేది యేదో ఒక ఆగ్రిగేటరుని పట్టుకుని అక్కణ్ణించి వాళ్ళ మైండ్ సెట్ అంటే వాళ్ల మనసులో ఉన్న మాయరోగాలూ బలహీనతలూ అన్నిటికీ మ్యాచ్ కుదిరే సైటు దొరికితే ఇక అక్కడ ఆజన్మాంతం యేకసైటుదృగీక్షణ వ్రతం చేస్తూ సెటిలైపోతారు!మొదట్లో నేనూ అంతే లెండి!జల్లెడ ద్వారా వెతికే వాణ్ణి,రోజుకో కూసిన్ని బ్లాగులు చూసేసి సరిపెట్టుకునే వాణ్ణి - బతుకు తెరువు కోసం చెయ్యాల్సిన వెధవ ఉద్యోగం ముఖ్యం గదా!యే మాత్రమూ సారము లేని ఈ అపార సంసారములో శ్వశురగృహం లాంటి సారభూతమైన తెలుగు బ్లాగులు అనేవి కూడా ఉన్నాయని యెలా తెలిసిందీ అనే ఋషిమూలం నాకిప్పుడు  గుర్తు లేదు గానీ ప్రవేశించిన కాలం మాత్రం తెలంగాణా ఉద్యమం చివరి రోజుల్లో!ఆంధ్రా అకాశరామన్న బ్లాగు దగ్గ్గిర మరింత కోలాహలం హోరాహోరీ హాలాహలం అన్నట్టు నడుస్తూ ఉండేది!ఇప్పుడు బ్లాగయితే ఉంది గానీ కొత్త పోష్టులు వెయ్యడం లేదు పాపం!నేను బ్లాగరు హోదా తెచ్చుకున్నాక నాకిష్టమైన ఒక ముఫ్ఫయి బ్లాగుల్ని అడ్మిన్ రీడర్స్ లిష్టులోకి చేర్చి అక్కణ్ణించే వాళ్ళు వేసిన కొత్త పోష్టుల కోసం వెతికేవాణ్ణి,దాంతో ఆగ్రిగేటర్ల అవసరం లేకపోయింది.ఇప్పుడు కొత్త ఫ్యాషన్ యేంటంటే మాలిక వారి వ్యాఖ్యల సెక్షనుకి వెల్ళి పోట్లాడటానికి పనికొచ్చే కామెంట్లు వెతుక్కుని అక్కడికి వెళ్ళటం - వృషభరాశి మహత్యం?!

     ఆ పాత వెతుకుడులో ఈ బ్లాగు తగిలింది,మొదటి రెండు పోష్టులూ వారి ప్రాంతం చరిత్రని చెప్పేవి కావడంతో నాకు చరిత్ర అంటే వెర్రెత్తిపోయే లక్షణం ఉందటంతో సూపరుగా అనిపించినాయి."కొంచెం నచ్చిందా?,ఫరవాలేదా?బాగా నచిందా?" అనే ఆప్షన్లతో కేకలు నమోదు చెయ్యమనే వారి అభిప్రాయ సేకరన పధ్ధతి ప్రకారం పొలికేకలే పెట్టేశాను!తీరా ఒక్కొక్క పోష్టూ అలా చూస్తూ ఉంటే "మూల విరాట్టులు ముష్టెత్తుకుంటే..ఉత్సవ విగ్రహాలకి దధ్యోజనాలట." అనే పోష్టు దగ్గిర కొచ్చేసరికి అనుకోని యెదురుదెబ్బ తగిలేసింది,"చచ్చితిని!అనవసరముగా ఆవేశపడి మెచ్చుకుంటిని?!" అనిపించింది!కృష్ణదేవరాయల గురించీ పెద్దన గురించీ యెంత దుర్మార్గంగా వర్ణించారో చూడండి!

కళింగ జాతికి అవమానం జరిగిందని బాధపదే రచయిత ఒక వ్యక్తి యెత్తునీ ,స్పోటకం మచ్చల మొహాన్నీ ప్రస్తావించి యే రకమైన సంస్కారాన్ని ప్రదర్శిస్తున్నారో తెలుసుకోవచ్చా?పాతకాలంలో యే ఒక్క ప్రాంతమూ శతాబ్దాల తరబడి ఒకే రాజు పాలనలో లేదు,ఉన్నదని రచయిత సాక్ష్యాలు చూపించగలరా?రాజు విజిగీషువు తనకు శక్తి ఉన్నదని అనుకుంటే మొత్తం భూమండలాన్నంతా ఆక్రమించేటందుకు అర్హుడు - అనే చాణక్య నీతినే గజపతులూ ఇతర నరపతులూ పాటించారు,అవునా కాదా?అలాంటప్పుడు గజపతులూ రాయలూ యుధ్ధాలు ఒక రకంగానె చేసి ఉండాలి.అయినా మీరు గజపతులతో ఆత్మీయత పెంచుకుని రాయలని ద్రోహి అనటం అతని స్పోటకం మచ్చల్ని ప్రస్తావించటం అనవసరం కాదా?గజపతు లంతా సర్వాంగ సుందరులా?రాజులకి సౌందర్యమా వీరత్వమా ప్రధానం?పెద్దలు అన్ని ప్రాంతాల్లోనూ అందరూ ఆచరించదగిన ఒకే ఒక మంచి మాటగా "ఇతరులు నీకు యేది చేస్తే బాధ కలుగుతుందో అది ఇతర్లకి చెయ్యకుండా ఉండటం" అని చెప్పారు.గజపతుల్ని మోసంతో ఓడించటం గురించి బాధపదేవాళ్ళు అక్కడ ప్రస్తావించనక్కర్లేని స్పోటకం మచ్చల వాడు అనే విశేషణాన్ని యెందుకు కలిపారు?ఆలోచించండి!చరిత్రని ఒకవైపు నుంచే చూసి అర్ధం చేసుకోకుండా తులనాత్మకంగా చూడగలిగితే మంచిది!

     చెత్త మాట కనబడితే ప్రతిస్పందించకుండా ఉండలేని బలహీనత నాది, అది అక్కడ వేసిన కామెంటు!మొదట కనబడింది,తరవాత మాయమైపోయింది,అర్ధం యేమిటి?ఆ రచయిత నా భావాన్ని చదివాడు,కానీ తన భావంలో మార్పు రాలేదు - కామెంటుని మాత్రం తొలగించాడు!ఈ ఒక్కటే అయితే ఫరవాలేదు,కళింగ యుధ్ధం తర్వాత అశోకుడు పశ్చాత్తాప పడటం గురించి "ఆయన గారు ఆ పశ్చాత్తాపమేదో మామీద యుధ్ధం చెయ్యకముందు పడినా బాగుందేది" అని వగపోస్తూ ఒకాయన ఆంధ్రజ్యోతిలో వ్యాసం కూడా రాశాడు,ఇదంతా ప్రాంతీయాభిమానమేనా?ఈ కళింగయుధ్ధం గురించీ అశోకుడి పశ్చాత్తాపం గురించీ మరొక పోష్టులో చెప్పాలనుకుంటున్నాను గనక ఇక్కడ విస్తారంగా చెప్పటం లేదు గానీ అసలు అశోకుడు కళింగ యుధ్ధం వల్లనే పశ్చాత్తాపపడ్డాడనేటందుకు గట్టి ఆధారాలు లేవు,తర్వాత బౌధ్దమతావలంబి అయ్యాడనేటందుకు తిరుగులేని సాక్ష్యాలు లేవు!అలాంటిది ఇవ్వాళ నడుస్తున్న రాజకీయ వ్యవస్థలో వారి ప్రాంతానికి యేమి కావలో తెలుసుకుని దాన్ని సాధించుకంటే రేపటికి పనికొస్తుంది గానీ ఇవ్వాళ్టి కష్టాలకి నిన్నటి అశోకుడో మొన్నటి మరొకడో కారణం అనటం యేమి తెలివి?

పవనదేవుడి కాపుకుల కళ్యాణ దీక్ష

     పవనిజం ఇవ్వాళ్టి అవసరమని నేనూ ఒకప్పుడు ఆశించాను,నిజమే!కానీ మొన్నటి వరకూ బాగానే ఉండి నిన్నటి రోజూన భూసేకరణ చట్టం గురించి ఇతను చేసిన  హడావిడి చూశాక తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన కొన్ని అతి ముఖ్యమైన అనుమానాలు వచ్చినాయి!నాకు ఇప్పుడు రైతులు ఇచ్చిన భూములకి చట్టపరమైన రక్షణ యేదీ లేదనే బెంగ మొదటి నుంచీ ఉంది!ఇతను వద్దంటున్న భూసేకరణ చట్టం దుర్మారగమైనదీ కాదు!ఆ చట్టం రూపొందించినదే ప్రభుత్వం తీసుకునే భూమికి సంబంధించి రైతుల హక్కుల్ని కాపాడటం కోసం పెట్టినది దాని ప్రకారం కూడా బలవంతంగా యెవరూ లాక్కోలేరు!నిజానికి చట్టం ద్వారా తీసుకుంటే ప్రభుత్వానికి పరిహారం బరువు కావటం వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం చేసిన విధానాన్ని ప్రజల ముందు పెట్టింది - అందరికీ అర్ధమయ్యేలా చెప్పాలంటే ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది కౌలుకి తీసుకుంటున్నట్టు,అంతేనా?రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణం యే అడ్దంకులూ లేకుండా కొనసాగి పూర్తయ్యాక తిరిగి భూమిని రైతులకే దఖలు పరుస్తారు,ఇప్పుడు ముందస్తు పరిహారమూ ఇస్తున్నారు కదా!ఒక రైతు నుంచి తీసుకున్న భూమిలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడితే తిరిగి భూమి స్వాధీనమయ్యాక దానిమీద వచ్చే రెంటల్స్ అతని ఆదాయం అవుతుంది,అవునా!ఒకవేళ బాబు చేస్తున్నది లొసుగుల వ్యవహారమే అనుకుందాం,అలాగయితే ఈ పెద్దమనిషి అరిభీకరంగా "ఒకవేళ వచ్చే యెన్నికల్లో తెదెపా వోడిపోతే?" అన్నది చాలా న్యాయమైన ప్రశ్న!అతను గనక దానిమీద గట్టిగా నిలబడి పోరాడితే ఇప్పుడు భూములిచ్చిన రైతులందరికీ ప్రయోజనం చేకూరుతుంది కదా!కానీ ఇప్పటివరకూ భూములిచ్చిన వారు యే గంగలో కలిసినా నేను పట్టించుకోను గానీ ఇవ్వం అంటున్న వీళ్ళ నుంచి బలవంతంగా తీసుకోకపోతే చాలు నేను గొడవ చెయ్యను అని మాత్రమే యెందుకు సరిపెట్టుకుంటున్నాడు?

     ఆ రైతులు నాలుగైదు పూలబట్టలు చూపించి రోజుకి 5,000 సంపాదిస్తున్నాం,30,000 యే మూలకి వస్తాయి అనటం కూడా నమ్మబుధ్ధి కావటం లేదు!రోజుకి 5,000 అంతే నెలకి 1,50,000 - ఇవ్వాళ డాబుసరిగా చెప్పుకునే యే సాఫ్ట్వేర్ ఇంజనీరుకి వస్తున్నాయి?ఇవ్వాళ మాయా లాంటి 3డి అప్లికషన్లు నేర్చుకుని గేంసూ\సినిమాలూ తీసే కంపెనీల్లో పనిచేసేవాళ్ళకి గూడా 75,000 మించటం గగనం!మరి వీళ్ళు యెంతకాలం నుంచి రోజుకి 5,000 ఆదాయం తీస్తున్నారో,ఇంకా మీడియా ముందు కనబడినట్టు అంత బీదగా యెందుకున్నారో యెవరికీ అనుమానమే రావడం లేదా?మొదటిసారి భూసేకరణ ద్వారా ప్రభుత్వానికి భూములిస్తున్న రైతులకి భరోసా ఇచ్చే యాత్రలోనూ మిగతా వాళ్ళ నందర్నీ హడావిడిగా చూసేసి కొందరి దగ్గిర మాత్రం యెక్కువ శ్రధ్ధ చూపించి సమస్యల్ని చెవియొగ్గి ఆలకించటానికీ ఇప్పుడు కూడా కేవలం వీరి మనొభావాలు దెబ్బతినకుండా ఉండటానికి మాత్రమే పోరాడటానికీ ఉన్న బాదరాయణ సంబంధం యేమిటి?ఇలాంటి చేష్టల ద్వారా నేను కొందరివాడినే అని తనే నిరూపించుకుంటున్నా కూడా అందరూ ఇతన్ని దేవుడు అనుకోవాలా!

     ఆ రోజూన వచ్చిన జనసమూహం కూడా "మా రంగా వచ్చాడు" అనటం విన్నాక గూడా ఇంకా అనుమానాలు దేనికి?యేదో మాటవరసకి అన్నట్టుగా కొందరు నన్ను కులానికే పరిమితం చెయ్యాలనుకుంటున్నారు,కానీ నేను అందరివాణ్ణే అంటే యెవరు నమ్ముతారు?మంత్రుల దగ్గిరుంచి నటుదు శివాజీ వరకు ప్రత్యేకహోదా గురించి ప్రధాని దగ్గిర మాట్లాడమని అభ్యర్ధించినా కదలని వాడు ఈ కందరికోసం యెంత వీరావేశంతో కదిలాడు?ఆఫ్టరాల్ అన్నందుకే ఆవేశపడిపోయినవాదు ఓవరాల్ రైతుల కోసం ఆవేశపడితే అందరికీ గట్టి రక్షణలు దక్కేవి కదా?!అసలు నిజంగా ఇతనికి అంత హవా ఉందా,లేక మంచివాడు గదా అని మర్యాద కోసం బాబూ,మోదీ ఇలా ప్రవర్తిస్తున్నారా?నాకయితే ఇతనికి సంబంధించి అందరూ యెక్కువ చేస్తున్నారని అనుమానంగా ఉంది!

     సరే,ప్రస్తుతానికి పాష్త్రప్రభుత్వం ఆ మూడువేల యెకరాలకి సంబంధించి పవన్ అళ్యాణ్ మాటనే నెగ్గించింది!మొత్తం రాజధాని నిర్మాణాన్ని దశలవారీగా విడగొట్టారు గనక ప్రస్తుతానికి మొదటి దశ రాజధానికి వీళ్ళు అడ్డం రారు,కానీ కానీ పవన్ కళ్యాణ అధికార పక్షానికి పక్కలో బల్లెమే తప్ప ప్రేమానురాగాలు తొణికిసలాడే మితపక్షం కాదు అని తేలిపోయింది - అంతవరకూ ఖాయం


ఇప్పటి నవ్యాంధ్రకి కావలసినది ఐకమత్యం విడిపోవాలనే దురాలోచన కాదు

     విభజనకి వ్యతిరేకంగా కికురె ఆనాడు పెట్టిన తీర్మానం వల్ల యేమి ఒరిగిందో ఇవ్వాళ హోదా కోసం చెసిన తీర్మానానికీ అదే గతి పడుతుంది!ఒకవైపున ఆ ప్రత్యేక హోదాకి కోతలు పడుతున్నాయి,అసలు ముందు మందు యే రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఐవ్వటం కుదరదు అని చెప్తున్నారు,అయినా దానికోసం పాకులాడటం దేనికో నాకర్ధం కావ్డం లేదు!ప్రత్యేకహోదా మాత్రం ఇచ్చి మిగతావి ఇవ్వకపోతే సరిపెట్టుకుందామా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అడిగీన్ ప్రశ్న అర్ధమయితే దానికోసం ఇంతగా వెంపర్లాట్ ఔండేది కాదు.ఇప్పుడు మనకి ప్రత్యేకహోదా ద్వారా వచ్చేవి యే మూలకీ సరిపోవు,అదనంగా చాలా కావాలి,కేంద్రం కూడా సుముఖంగానే ఉది,రొపాయి రావాల్సిన చోట అర్ధరూపాయి చాలు అనటం వల్ల రాష్ట్రం బాగుపడుతుందా?

     విడిపోయి రెండేళ్ళు కావస్తున్నా విభజన చట్టంలో ఉన్న యే అంసంలోనూ పంపకాలు జరగలేదు!తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికే షెడ్యూలు 9,10 కంపెనీలన్నీ తెలంగనవే అని తేల్చిపారేసాడు యేకపక్షంగా,అదెట్లా కుదురుతుంది?ఆంధరప్రాదెశ్ ముఖ్యమంత్రి యెన్నిసార్లు చర్చలకి పిల్చినా రావ్దం లేదు,సాంకేతికంగా చూసినా చర్చలకి పిలవాల్సింది ఇద్దరు వాదుల్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి కాదు,కేంద్రం మధ్యవర్తిగా ఉండేటందుకు అంగీకరించి చొర్వ చూపించి తను ఇరుపక్షాలనీ ఒకచ్ఘోట కూర్చఓబెట్టాలి!కేంద్రం ఆచొరవ చూపించాలి అంతే రెండు రాష్ట్రాల లోని అన్ని రాజకీయ పక్షాలూ యెజెండా పాలితిక్స్ కోసం పాప్యులారిటీ కోరుకున్న యెత్తుగడలకి పోకుండా తమ తమ ప్రభుత్వాలకి పూర్తి సహకారం ఇవ్వాలి - కనీసం విభజన ద్వారా తమ రాష్ట్రానికి రావలసిన వాటి విసహ్యంలో నైనా!ఈ లెక్కా డొక్కా తేలితే వచ్చిన వాటిలో యేవి యెక్కడ పెట్టాలో స్పష్టత వస్తుంది!మనకి నికరంగా దక్కిన వనరుల్ని ఉపయోగించుకుని ముందుకి కదలొచ్చు.లెక్కలు తేలనంతకాలం ఈ రెండు రాష్ట్రాల ప్రజలలో అసహనం వల్ల ద్వేషాలు ఇంకా పెరుగుతుంది!అశాంతి ఉన్నచోట అభివృధ్ధి ఉండదు.

     ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహార శైలిని పరిశీలించి చూస్తే అతను మాత్రం అభివృధ్ధికి సంబంధించిన ప్రయత్నాల్లో వీటిని యేమాత్రం పట్టించుకోకుండా తన దారిలో తను ధైర్యంగా ముందుకు వెళ్తున్నట్టు అర్ధమవుతుంది.ఒకసారి అభివృధ్ధ్గి మొదలయితే ఈ పెదధోరణులు వాటంతటవే సమసిపోవచ్చు,కానీ అప్పటికీ ఆగకపోతే?చంద్రబాబు తను ఒకానొకప్పుడు అభివృధ్ధి నంతా ఒకేఒక్క భాగ్యనగరంలోనే పోగెయ్యడం వల్ల జరిగిన అనర్ధాన్ని గుర్తించాడనేటందుకు సాక్ష్యాలు ప్రతిరోజూ కనిపిస్తూనే ఉన్నాయి!పట్టిసీమ కోసం అతను చేస్తున్న ప్రయత్నాల్ని ఆంధ్రప్రాంతపు నాయకులు వ్యతిరేకించకపోయినా రాయలసీఅమకి సంబంధించిన నాయకులే వ్యతిరేకిస్తున్నా ఆపలేని "రాయలసీమ ఆలోచనాపరుల సమితి" వారు అనాలోచితంగా విడిపోవటం గురించి మాట్లాదకుండా ఉంటే బాగుంటుంది.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాటల్లో కూడా మొత్తం 13 జిల్లాల గురుంచి ప్రస్తావిస్తున్నప్పుడు కళిగాంధ్ర వారు మాత్రం యెందుకు విడిపోవాలని కోరుకుంటున్నారు?పైగా వారిద్దరి ధోరణీ కేసీఆర్ అధ్వర్యంలో నడిచిన ప్రాంతీయ ద్వేషానల జ్వాలలు రేకెత్తించే రక్తబీజాసుర యజ్ఞం పధ్ధతిలో ఉంది,దానివల్ల తెలంగాణ రావ్దమయితే వచ్చింది గానీ ఇవ్వాళ్టి తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా తయారయింది!ఇప్పుడు వీరిద్దరూ ఇదే దారిలో ముందుకెళ్తే సీమలో ఒక కేసేఅరూ కళింగలో ఒక కేసీఆరూ పుడతారు - దానివల్ల వారి ప్రాంతాలకె నష్టం!


చెప్పడమే మన ధర్మం వినకుంటే నవ్యాంధ్ర ఖర్మం!

Wednesday, 2 September 2015

రాజు లేనప్పుడూ సారంగో సారంగా!దులపర బుల్లోడో రంగనాయకి దుమ్ము దులపర బుల్లోడా?!

     ఈ మధ్యనే చలసాని ప్రసాద్ అనే ఒక మంచి కమ్యునిష్టు పెద్దాయన పోయారండి!మంచాయనే,యెందుకంటే భ్రమల్లో కూరుకుపోకుండా వాస్తవాలు తెలుసుకుంటేనే విప్లవానికి మంచిది అనే ఉద్దేశంతో చాలాకాలం క్రితమే "ఇలా మిగిలేం" అని ఒక పుస్తకం రాశారు.అందులో పేరుగల కమ్యునిష్టు నాయకులు వ్యక్తిగత జీవితాల్లో విప్లవ చైతన్యానికి దూరంగా ఉండటం గురించి చెప్పారు.కొన్ని సినిమాల్లో "ఈ చిత్రంలోని పాత్రలూ సన్నివేశాలు కల్పితం,యెవరినీ ఉద్దేశించినవి కావు" అని ముందు సూచన ఇచ్చినట్టు పనిగట్టుకుని అసలు పేర్లతో సహా ప్రస్తావించారు!అసలు పుస్తకం చదవలేదు గానీ పరిచయం కోసం యెవరో వ్రాసిన వ్యాసంలో ఇచ్చిన ఉదాహరణలు చదివాను.నెహ్రూ ఇందిర ద్వారా మిత్రులుగానే ఉంటున్న కమ్యునిష్టుల్ని మోసం చేస్తూ కేరళ మంత్రివర్గాన్ని కూల్చేసినప్పుడు సాక్షాత్తూ చలసాని ప్రసాద్ గారే దానికి వ్యతిరేకంగా కార్టూను వేస్తే ఒక సీనియర్ నాయకుడు మరీ అంత ఘాటుగా విమర్శించవద్దన్నాడట!ఇతరుల బానిసత్వపు సంకెళ్లని తెంచి మొత్తం ప్రజలందర్నీ బూర్జువా సమాజం నుంచి వర్గరహితసమాజం వైపుకి నడిపించాల్సిన పార్టీలో ఉన్న వాడు ఒక బూర్జువా పార్టీ సభ్యుదైన నెహ్రూకి యెంత విధేయత(?)/బానిసత్వం(!) చూపించాడు?!

     జాతీయ స్థాయిలో కొడవలిని కామన్ సింబల్ మాదిరి అట్టే పెట్టుకుని ఒకరు కంకినీ ఒకరు సుత్తినీ పంచుకుని యెందుకు CPI మరియూ CPM అనే రెండు విప్లవ పార్టీలుగా విడిపోయారో తెలియదు గానీ ఆంధ్రాలో మాత్రం తెలంగాణా సాయుధపోరాటం జరిగిన తీరు సరిగ్గా లేదు(ట!) అని ఒకరు అభిప్రాయపడటం ఒక కారణం అని చూచాయగా తెలుసు నాకు,రూఢిగా తెలియదు గనక ఆట్టే మాట్టాడగూడదు గానీ అదే నిజమైతే కమ్యునిష్టు అనేవాడు యెవడూ అనగూడని మాట కదా అది,కాదంటారా!ఒరేయి గాడిదా ప్రజలు వాళ్ళమీద జరిగిన దోపిడీని భరించలేక తిరగబడితే దానికి వంకలు పెడతావేంట్రా అని యెవడయినా అన్నాడో లేదో గానీ నేను అక్కడ ఉంటే తప్పనిసరిగా అలాగె మాట్లాడి ఉందేవాణ్ణి!యెందుకంటే కమ్యునిష్టు తరహా విప్లవమైనా సరే అక్కడ కమ్యునిష్టు పార్టీ వెయ్యేళ్ళుగా పని చేస్తున్నా సరే విప్లవాన్ని ఫ్యాక్టరీలో సబ్బునో టూత్పేష్తునో తయారు చేసినట్టు తీసుకురాలేరు!ఫ్రెంచ్ విప్లవం బాస్టిల్లీ జైలు ముట్టడితో మొదలైంది!అక్కడ రేగినది దావానలంలాగ వ్యాపించిందే తప్ప సరైననాయకుడు లేక గిలటైస్ భీబత్సాలతో చెలరేగిపోయి అరాచకత్వానికి దారి తీసింది!నెపోలియన్ అనుకుంటాను ఆ అరాచకత్వాన్ని అణిచేసి సుస్థిరతని తీసుకొచ్చాడు.రష్యాలో లెనిన్ ఒక చిన్న నిప్పురవ్వ రగలగానే ఒక రకంగా హైజాక్ చేసినత వేగంగా దాన్ని కమ్యునిష్తు విప్లవంగా మార్చాడు!చైనాలోనూ ప్రపంచాన్ని కుదిపేసిన పదిరోజుల్లో మావో నాయకత్వం ఉందబట్టి సరిపోయింది,లేకుంటే అక్కడా ఫ్రెంచ్ విప్లవం నాటి అరాచకత్వం మిగిలేది!

     వస్తుతః నాకు కమ్యునిజం అంటే ద్వేషం లేదు.శ్రీశ్రీ మూలంగా మా తరంలో ఆ ప్రభావం సోకని వాడు లేడు?!కష్టజీవికి న్యాయం జర్గాలనే ఆదర్శం ఖచ్చితంగా ఉన్నతమైనదే!అయితే తొలిసారి ముప్పాళ రంగనాయకమ్మ రాసిన విషవృక్షం కొంచెం చదవగానే అసహ్యం వేసింది!ఆవిడే చెప్పుకున్నట్టు గుర్తు శ్రీశ్రీ దగ్గిర ఆ విషయం కదిలిస్తే రామాయణ భారతాల జోలికెళ్ళటం గురించి వ్యతిరేకించాడని.జంఝెం తెంపేసినా బ్రాహ్మణుడైన శ్రీశ్రీకి తెలియదా రామాయణం గురించి?అప్పటికి నేను నాస్తికత్వంలో ఉన్నా చిన్నప్పటినుంచీ రామాయన కధ వివరంగా తెలుసు గనక రామాయణాన్ని విమర్శించటం ఇంత అధమస్థాయిలోనా అనిపించింది నాకే!తను నిజంగా సైధ్ధాంతిక నిబద్ధ్ధతతో విమర్సించదల్చుకుని ఉంటే ఆ పధ్ధతి వేరుగా ఉందేది.రామాయణంలో ప్రాస్తావికంగా యెన్నో విషయాలు చెప్పినా సీతారాములు దాంపత్యంలో పాటించిన నిష్ఠ ప్రధానమైన అంశం,కదా!దాన్ని విమర్శిస్తూ యేకపత్నీవ్రతం తప్పు అని వాదించిందా అంటే అదీ చెయ్యలేదు,ఇదే మనిషి మావో దాంపత్యాన్ని గ్లాసుడు మంచినీళ్ళ ఉదాహరణతో వెక్కిరించింది!అంటే మద్దెలకి అటో దరువూ ఇటో దరువూ అన్నట్టు మావోగారి గ్లాసుడు మంచినీళ్ళ పధ్ధతీ నచ్చలేదు,సీతారాముల పధ్ధతీ నచ్చలేదు,మరి ఈవిడ యేదైనా సరికొత్త పధ్ధతిని ప్రతిపాదించిందా - అదీ లేదు?!వాస్తవజీవితంలో యెవరూ సీతారాముల వలె నిష్ఠగా ఉండటం కుదరదు అని ఉదాహరనలు చూపించి యెవరూ ఆచరించలేని లక్ష్యం కాబట్టి ఇది చెత్త అని చెప్పినా గంభీరమైన తాత్విక చింతనతో కూడిన విమర్శ అయి ఉండేది!వెకిలితనం అనిపించుకునే రీతిలో రాముడు శూర్పణఖని లొట్టలేసుకుంటూ చూశాడు,సీత రావణుణ్ణి కోరికగా చూసి కన్ను కొట్టింది అని రాయటం యేపాటి సైధ్ధాంతిక విమర్శయో ఇప్పటికీ ఆమెని సమర్ధిస్తున్న వీరాభిమానులు చెప్పాలి,చెప్పి తీరాలి!నేను సారంగలోని పోష్టు దగ్గిర వేసిన వ్యాఖ్యలో చెప్పినట్టు జానకివిముక్తి కధకి మరో వెర్షను రాస్తే యెలా ఉంటుంది?చెత్తగా ఉంటుందని నా అంతట నాకే తెలుసు,అయినా వాళ్లకెలా ఉంటుందో తెలియాలి గాబట్టి అడుగుతున్నాను,దీనికీ జవాబు చెప్పి తీరాలి!శ్రీశ్రీ వల్ల కమ్యునిజం అనే ఆదర్శం పట్లా ఆకర్షితులైనవాళ్లలో చాలామంది మురంనా వల్ల వికర్షితులయ్యారు - ఆరకంగా మురంనా వల్ల పార్టీకి మంచి కన్నా చెడే యెక్కువ జరిగింది!

     వర్గరహితసమాజం యేర్పడితే నా కష్టానికి తగిన ఫలితం నాకు వస్తుందంటే కాదనటానికి నాకేమయినా పిచ్చా?కానీ మనం విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్ళాలంటే యేమి చేస్తాం?బస్సెక్కుతాం,యేదో ఒక బస్సు యెక్కుతామా!ఆ బస్సు హైదరాబాదు వెళ్తుందో లేదో ఒకటికి పదిసార్లు సరిచూసుకుని మరీ యెక్కుతాం.మరి వీళ్ళు తీసుకెళ్ళాలనుకుంటున్న వర్గరహితసమాజం ఆనవాళ్ళు చెప్పమంటే నిలువుగుడ్లేసుకుని చూట్టం తప్ప ఒక్క శాస్త్రీయమైన ముక్క చెప్పలేకపోతున్నారు,వీళ్ళని యెట్లా నమ్మాలి?కమ్యునిజంలో శాస్త్రీయత ఉందని నిరూపించాలంటే నమ్మకంతో పనిలేని ఆధారాలతో కూడిన వాస్తవిక వర్ణన కావాలి,అది మార్కుగారి దొసో కెపిత్యలో బుక్కులో అయినా ఉందా!గట్టిగా నిలదీస్తే అసలు సిధ్ధాంతానికే శాస్త్రీయత లేనప్పుడు ఈ  విరగబాటు దేనికి?

     అయినా మురంనా మరియూ మురంనా వీరాభిమానులకీ కమ్యునిష్టు చైతన్యం అంటే కనీసపు సంస్కారం కూడా లేకుండా ఉండటం అనీ మానవ సహజమైన మర్యాదలు కూడా దిక్కుమాలిన హిందూ మతతత్వానికి ప్రతీకలే గాబట్టి విప్లవ వ్యతిరేకుల పట్ల యెంత అమర్యాదగా వ్యవహరించినా తప్పు లేదనీ కొన్ని అభిప్రాయాలు స్మశానంలో దిగ్గొట్టిన మేకుకన్నా గట్టిగా యెముకల మూలుగల్లోకంటా యెక్కిపోయినాయని నా నమ్మకం!అందుకే బాపు గారు చనిపోయినప్పుడు మురంనా పాదరేణువు యేనాడో జరిగిన పాత విషయాన్ని కూడా కెలికి రచ్చ రచ్చ చెయ్యగలిగాడు!వాళ్ళ అభిమాన రచయిత్రి విషవృక్షం రాసేనాటికే బాపుగారు యెంతటి రామభక్తుడో లోకానికంతా తెలుసు!అయినా రాముణ్ణి బద్నాం చేసే తన పుస్తకానికి ఆయనగారు బొమ్మలు వేస్తాడని యెలా అనుకుంది?అప్పటికి తెలియకపోతే అప్పుడైనా తెలిసింది గదా,తెలిశాక సిగ్గుపడే రకం గాదే బాపూ?ఆయన చెక్కు వెనకాల రామ రామ అని రాయడం గురించి కూడా చెత్తవాదనలు చేశారు.అసలు ఆఫర్ తిరస్కరించినప్పుడే ఆ చెక్కు చెల్లనిదే గదా!ఒకసారి సంతకం గూడా చేసి పంపిన చెక్కు మరొకరికి ఇవ్వడం కుదురుతుందా?చెక్కుని చెల్లగొట్టడానికి నువ్వు బ్యాంకులో వేసిన దబ్బు పదిలంగానే ఉంటుంది గదా,క్రాస్ చేసి ఇచ్చిన చెక్కుని మరొకరికి ఇవ్వగలవా?మరి చెల్లని దాని మీద యేమి రాస్తే యేమి గోరం జరుగుతుందట!?ఆ కొంటెబొమ్మల బాపు అట్లాంటి కొంటెపని చెయ్యకపోతేనే హాశ్చెర్యపడాలిస్మీ:-)

     ఇప్పుడీ చెత్తపని - సరిగ్గా ఇప్పుడే ఇదే మంచి సమయమూ మించినన్ దొరుకదూ అని యేగేసుకుంటూ వొచ్చి చలసాని ప్రసాద్ పోయినప్పుదు వరవరరావు  పాతసంగతుల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఈమెగారు అందులో వేలుపెట్టి కెలక్కపోతే యేమవుతుంది?!బాపుగారి విషయంలో అంటే కొందరికి పాయింటు ఉంటే ఉండొచ్చు,కానీ ఇక్కద తను వాగినవన్నీ అబధ్ధాలే గదా!అసలు జరిగింది వేరు, చరిత్రలో రికార్ద్ అయి ఉంది!తను పులుముడు ద్వారా చూపించినది వాస్తవ విరుధ్ధం అని చెప్పడానికి వాల్మీకిలాగా చచ్చి స్వర్గాన లేరు  ఈవిడ చెప్పిన కుట్రదారులు - అదే కొంపముంచింది ఈసారి!ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల అంటే దృశ్యం సరదాగా ఉంది గాబట్టి చూశాము గానీ అదంతా నిజమేనని నమ్మేవాళ్ళు యెంతమంది?ఇప్పుడు మురంనా పరిస్థితీ అదే!అందుకే ఇప్పుడు వాతలు పడుతుంటే వ్యక్తిగత ద్వేషం చూపిస్తున్నారని యెడుపుముఖాలకి దిగారు.నిజం నిప్పులాంటిది,దాంతో ఆడుకోవాలనుకంటే ఇలాగే కాల్తుంది!శ్రీశ్రీ వీరపూజని సమర్ధిస్తూ ఒక చిన్న నినాదం ఇవ్వగానే తప్పు చేశాడని వెక్కిరిస్తూ మీరు మురంనాకి చేస్తున్నదేంటి - భూతపూజయా?అయినా యెక్కడ జరగలేదు వీరపూజ!రష్యాలో మసోలియం లెనిన్ ఒక్కడికే యెందుకు కట్టారు?అందరికన్నా అతడు మరింత గొప్పవాడు అని కదా!చైనాలో మావో ఫొటోలు మాత్రమే కనబడుతున్నాయేమిటి - లాంగుమార్చిలో పాల్గొన్నవారిలో మిగులినవారు తాజమహలు నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల పాటి చెయ్యలేదా?ఆస్తికులు దేవుడి విగ్రహం ముందు చేతులు జోడించి నమస్కరించటం హేతువిరుధ్ధమయితే మీరు యెర్రజండా ముందు నిలబడి పిడికిళ్ళు బిగించి వందనం చెయ్యడం హేతువిరుధ్ధం కాదా?మీ తప్పులు తెలుసుకోకుండా వూరికే విరగబడకండి,మీ కాళ్లకింద భూమి మీకు తెలియకుండానే కదిలిపోయి అందాక దక్కిన అధికార పీఠం కూడా జారిపోతుంది.చరిత్ర యెవడికీ వలపక్షం చూపించదు - బహుపరాక్!

     చూడండి ఇప్పుడేమయిందో - మొత్తం కమ్యునిజం పరువు చిరిగి చాటంతయ్యింది:-)విప్లవ వ్యతిరేకులకి పండగయ్యింది!రంగనాయకమ్మ అభిమానుల కిప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది,ఇదివరకట్లాగ ఢమేల్ ఢమేల్ మంటూ చెలరేగిపోయి గయ్యాళితనంతో పేట్రేగిపోకుండా యేడుపు ముఖాలు వెయ్యడానికి అసలు కారణం అదే!అస్సలు జవాబు చెప్పడానికి దిక్కూదివాణం తెలీని ప్రశ్నొకటి వొచ్చిపడింది,"రంగనాయకమ్మ గారు యెన్ని ప్రజా సమస్యలలో ప్రత్యక్షం గా పాల్గొన్నా"రని?!కమ్యునిష్తు పార్టీ మీటింగులకి సంబంధించిన ఫొటోల్లో చూశాను గానీ ఈవిడకి కనీసం రెండిట్లో యే కమ్యునిష్టు పార్టీలోనన్నా సభ్యత్వం ఉందా అనేది నాకనుమానమే!యూనివర్సిటీల్లో అప్పుడప్పుడూ కుర్రాళ్ళకి విజిటింగు ప్రొఫెసర్లతో గూడా లెక్చర్లు చెప్పిస్తారు మరి,ఆ లెక్కన వాళ్ళు పిలిస్తే ఈమె వచ్చి కూర్చుందేమో!పార్టీలలోనూ సంస్థలలోనూ సభ్యత్వం ఉన్నప్పటికిన్నీ లేనప్పటికిన్నీ ఆమెకి సంబందించినంత వరకూ పెద్ద వ్యత్యాసము లేదు, శ్రీమతి రంగనాయకమ్మలుంగారు ప్రజొద్యమములలో ప్రత్యక్షముగా ఇంతవరకు పాల్గొనలేదు,ఇకముందు కూడా పాల్గొనరు - అయితే యేమిట్ట!వారు వెలమకులమున బుట్టిన రాణీత్వము గలవారు,అలగాజనముతో తిరుగుట వారికి సరిపడదు!అది కేవలము శ్రీశ్రీ,వరవరరావు,చెరబందరాజు వంటి పురుషాధముల పని!ఆ యధముల పరువు పోగొట్టి విప్లవము పరువు నిలబెట్టుటయే వారికి మార్క్సు మహేశ్వరుడు కలలో కనిపించి యప్పగించిన రాచకార్యము! స్వామిని వారి దినచర్య ఇట్లుండును - కనిపించిన ప్రతి పుస్తకమునూ చదివిన ప్రతి విషయమునూ తన బ్రాండు మార్కు వ్యంగ్యమునకు పనికి వచ్చు విషయేమేదేని కలదా యని శోధించుట,దొరికినచో వేణువు వంటి పాదరేణువులూ,ప్రవీణ్ కుమార్ వంటి బభ్రాజమానములూ,వీరబొబ్బిలి వంటి వీరభక్తులూ,మార్క్సిస్ట్ హెగెలియన్ వంటి మూర్ఖ శిఖామణులూ హర్షపులకాంకిత గాత్రులై బాష్పవారి పరిపూర్ణ లోచనులై కిందపడి దొర్లునంతటి వికటహాస్యము రంగరించి ప్రచురణకు పంపుట - అంతకు మించి వారు గడప దాటి బయటకు రారు - ఘోషా సంప్రదాయ మొకటి అఘోరించినది కద వెలమ కులమున?!మీ ఇంటికొచ్చి మిమ్మల్నెవరన్నా విసిగిస్తున్నారనుకోండి,మీరేం చేస్తారు,"వెళ్ళవయ్యా వెళ్ళు పన్లేక నువ్వొచ్చి నా బుర్ర  తింటున్నావు" అని ముఖం మీదనే తలుపేస్తారు మీరే స్వయంగా!కానీ ఈవిడగారు మాత్రం స్వయంగా అలాంటి చెత్తపన్లు చెయ్యరు,చరచరా ఆక్కణ్ణించి అంతఃపురంలోకి వెళ్ళిపోయి "గాంధీ! ఆ మూర్ఖ విజిటరుని బయటికి తరిమికొట్టి తలుపు వేయుము" అని ఆజ్ఞలు జారీ చేస్తారు - రాణీత్వం?!

     వరవరరావు లాగా పొట్టకూటికోసం ప్రభుత్వోద్యోగాలు చేసి అభాసుపాలు కాకుండా,కళ్ళముందు జరుగుతున్న అన్యాయాలకి స్పందించి కార్యాచరణకి దిగి తప్పులు చెయ్యకుండా కాపాడుకుంటూ విప్లవపధగామి అనే పేరుకి యేమాత్రం భంగం రానివ్వకుండా బతకటానికీ తనకొక స్వర్గమందిరాన్ని కట్టుకుని దిగిరాకుండా కూర్చోవడానికీ సరిపడినంత ఆర్జన పుస్తకాల/రచనల ద్వారానే రావాలంటే ఆ పుస్తకాలు/రచనలు యెట్లా ఉండాలో ఆమెకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు - అదే ఆమెలోని ప్రజ్ఞ!చెత్తగా మాట్లాడుతూ కూడా గొప్ప మేధావిలా పేరు తెచ్చుకునే అద్ర్ష్తం అందరికీ ఉంటుందా!కంచె అయిలయ్య అనే మరిఒకాయనకి గూడా ఈదే అదృష్టం పట్టి విరగబడి పోతున్న్నాడు - కులరహితసమాజం,దళితప్రభుత్వం నా లక్ష్యం అంటూనే నా కురుమగొల్ల కులం విశ్వవ్యాప్తం కావాలి అని అంటున్నాడు!యేం,ఆ కోరిక చాకలి,మంగలి,తట్టాయి,బుట్టాయి కులాలన్నిటికీ ఉండొచ్చు గదా?అందరికీ అదే ముచ్చట ఉన్నపుడు ఆ పోటీలో కురుమగిల్ల కులం ఒక్కటే గొప్పది యెట్లా అవుతుంది?అందులోనూ వూరితోనో జిల్లాతోనో ఆగలేదు యేకంగా విశ్వవ్యాప్తం కావాలంట!ఇట్టాంటోళ్ళంతా గొప్పోళ్ళయ్యారంటే కాలానిగ్గూడా గాచ్చారం గాండుమారిందని తెలీట్లా?!

     రంగనాయమ్మ అదృష్టమే అదృష్టం!యే చెత్త రాసినా సైధ్ధాంతిక విమర్శ కింద చెల్లిపోతున్నది!యేనాడూ విప్లవానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడని శ్రీశ్రీని బట్టుకుని "దాటవేతల కవి" అన్నా గౌరవప్రదమయిన తప్పులు పట్టు కార్యక్రమం గానే తేల్చేసారు!జరిగినదొకటయితే మరొకటి జరిగినట్టు పులుముడు పాండిత్యం చూపించి రాసినా ఈమెగారు పరిశోధించి కనుక్కున్న పరమసత్యంలాగ చరిత్రలోకి యెక్కేసింది!ఆమెది కచ్చిబోతు తనం అంటున్నారు సరే ఆమెని విమర్శిస్తే యెవరికి లాభం అనేకాడికి వెళ్ళినా అమాయకులుగానే కనిపిస్తున్నారే తప్ప పొరపాటు ఒప్పుకోకుండా తప్పుకుపోవాలని చూస్తున్నారని యెవరికీ అర్ధమే కావడం లేదు!క్షమాపణ అడగటమే వూహలోకి రానంత దుస్థితిలో ఉన్నారు విమర్శించేవాళ్ళు కూడా!వరవర రావు దగ్గిర్నుంచి హెచ్‌ఆర్‌కే‌హెచ్‌ఆర్‌కే వరకూ "యేమిటి నీ గొప్ప!నువ్వు చేసింది తప్పు!సారీ చెప్పు!" అని గట్టిగా గద్దించి మాట్లాడ్డానికే జంకుతున్నట్టున్నారు - యేమి వైభవం?ఇట్లాంటి వైభవాలన్నీ దేవుణ్ణి నమ్మని ఆవిడకే ఇచ్చిన దేవుడు నన్నెందుకు అవేమీ ఇవ్వకుండా పుట్టించాడు?


దేవుడా!ఇవ్వన్నీ రాంభక్తుడినైన నాకిస్తే నీ సొమ్మేం పోయిందయ్యా?

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...