Saturday, 29 August 2015

ఓ పవిత్ర భారత నారీ నువ్వెక్కడున్నావు!ఈ నైతిక భ్రష్ఠత్వ మేమిటి నీకు?జగమంతా సూర్యవంశమేనని సర్దుకుపోవాలా?!

     ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి ఇద్దరు మగళ్ళ పేర్లు చెప్పి వాళ్లలో యెవరో ఒకర్ని "లవ్" చెయ్యమని వెంటపడి వేధించటం!తిరస్కరించినందుకు కోపమొచ్చి అర్ధనగ్నంగా నడిపించి వీడియో తీసి ఇద్దరు మగాళ్లకి పంపించటం - చూసి యెంజాయ్ చెయ్యమని సందేశాలు ఇచ్చి మరీ రెచ్చగొట్టడం, యేమిటీ విశృంఖలత్వం?!ఆ ఇద్దరిలో ఒకడు ట్రెయినీ లెక్చరర్,యెక్కడ జరిగింది ఇదంతా?నాగార్జునా విశ్వవిద్యాలయం యేమన్నా నాగరికతకి దూరంగా ఉందా!జనసమూహం మధ్యనే ఉన్నారు గదా వీళ్ళంతా?!ఆ మొదటి అమ్మాయి చెయ్యమన్నది ఒక జీవిత కాలపు బంధం అనబడే సీరియస్ వ్యవహారమా - కాదు టెంపరరీ రొమాన్సు కోసం తార్చడం!

     ఇలాంటి తార్పుడు పనుల కోసమా కష్టపడి ఫీజులు కడుతూ కాలేజిలకి పంపిస్తున్నది?ఇలాంటి పైశాచిక చేష్టలకి ట్రెయినింగు కోసమా కాలేజీలు ఉన్నది?అంత దుర్మార్గం అంతకాలం పాపభీతి గానీ ఆత్మవిమర్స గానీ లేకుండా ఒక ఆడపిల్ల చేసిందంటే తలిదండ్రుల పెంపకం అట్లా అఘోరించిందని అర్ధం కావడం లేదా!జరగకూడనిది జరిగిపోయాక యెవరెవరి ప్రతిస్పందన యెలా ఉంది?అంత దుర్మార్గం చేసిన తమ కూతురు అమాయకురాలని తలిదండ్రులు వెనకేసుకొచ్చారు - ఛీ!ఒక మంత్రి మేము సింగపూరును తలపించే రాజధాని కడుతుంటే ఆధునిక సంస్కృతిని అలవాటు చేసుకోలేక చచ్చింది అనేశాడు ఆ టార్చరు భరించలేకా అధికార్లకి రిపోర్టు ఇచ్చినా పట్టించుకోకా "ఈ కాలేజీ వేస్టు ఈ యూనివర్సిటీ చెత్త" అని డైరీలో అసహ్యించుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన ఆడపిల్ల గురించి - ఛీఛీ!ఆడపడుచుల కోసం అలమటించే అన్నగారి ఆశయాలకు కట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అతనింకా మంత్రిగానే ఉన్నాడు కాబోలు - ఛీఛీఛీ?

     తన వయస్సులో సగం ఉన్న కుర్రాళ్ళతో కలిసిపోవడం అని సమర్ధించుకుంటూనో యేమో అసహ్యంగా కాళ్ళూ చేతులూ వూపుతూ డ్యాన్సులు చేస్తున్న నేలబారు దిగజారుడు బ్రోతలు వెధవ విద్యాధికారియా?ఆ అమ్మాయీ ఆమె తండ్రీ యెన్నిసార్లు యెన్ని రిపోర్టులు ఇచ్చినా పట్టించుకోకుండా ఒక ఆడపిల్ల చస్తే ఇంత రాధ్ధాంతమేమిటని విసుక్కున్న యాజమాన్యాన్ని నిలదీసి ఉతికి ఆరెయ్యటానికి బదులు వాళ్ళనే సమర్ధిస్తూ కొందరు కుర్రాళ్ళూ పెద్దాళ్ళూ కూడబలుక్కున్నట్టు కులసంఘాల బోర్డులతో ఆందోళనలు చెయ్యటం - యెన్ని సిగ్గుపడాల్సిన పనులు సిగ్గు లేకుండా చేశారు?!అంటే నిజంగానే రిషితేశ్వరి అనే అమ్మాయి ఒళ్ళు కొవ్వెక్కి చచ్చిపోయిందనా వాళ్ళు అంటున్నది?!బయటపడింది గాబట్టి ఆ ఒక్కచోటు చుట్టూ ఆందోళనలు చేశారు, అక్కడ కొత్త మనిషిని వీసీగా అపాయింటు చేశారు,మరి మిగతా చోట్ల అద్భుతంగా వెలిగిపోతున్నదా?

     ఇప్పుడంటే ఆ తార్పుడు వీడియో తీసిన ఆడపిల్ల కేసులో బుక్కయి అఘోరిస్తున్నది గానీ ఇలా జరక్కపోతే కొన్నేళ్ళ తర్వాత ఇప్పటి ఇంద్రాణి ముఖర్జీలా తయారై ఉండేది కాదా?ఒకటో రెండో సన్నివేశాలు జరిగితే యెక్కడో ఒకరిద్దరు వెధవ పన్లు చేస్తే మొత్తం ఆడజాతిని విమర్శించటం అన్యాయమే కావచ్చు,కానీ మళ్ళీ మళ్ళీ జరుగుతున్నప్పుడు అదీ ఇంత తరచుగా బయట పడుతున్నప్పుడు కూడా మాట్లాడకుండా ఉంటే మనం కూడా వాటిని ఆమోదిస్తున్నట్టు కాదా?యాక్సెప్టబిలిటీ పెరగడం వల్లనే ఇవి తరచుగా జరుగుతున్నాయి,నిజం!ఇప్పుడు బయటపడుతున్నవి జరుగుతున్నవాటిలో యే పదో వంతులోనో ఉంటాయి,బయటపకుండా సమాజంలో జరిగిపోతున్నవి చాలా యెక్కువ శాతమే!ఇవి అక్రమ సంబంధాలు కూడా కాదు,అంతకన్నా నీచమైన వ్యవహారాలు!కొన్నేళ్ళ క్రితం నేను "సూర్యవంశం" అనే టీవీ సీరియల్ చూశాను.కధలో అభూత కల్పనలూ,నేల విడిచి సాము చెయ్యడాలూ లేకుండా పాత్రల రూపురేఖలు కొంచెం వాస్తవానికి దగ్గిరగా ఉన్నట్టు అనిపించి ఆసక్తిగా చూశాను.కానీ క్లైమాక్సు దగ్గిర కొచ్చేసరికి పెద్ద షాకు!అప్పటిదాకా పవిత్రంగా సంసారపక్షంగా ఉండే ఆడమనిషి కూడా తన భర్తకి ఇంకో భార్య ద్వారా పుట్టిన కొడుకూ తన భర్తకి తన ద్వారా పుట్టిన కూతురూ పెళ్ళి చేసుకుంటామంటుంటే అదేదో చాలా మామూలు విషయమన్నట్టు అనుమతి ఇచ్చేస్తుంది?!పైగా ఆఖర్లో "జగమంతా సూర్యవంశం" అనే కొటేషను ఒకటి తెరమీద వొదిలారు!అంటే ఆ తల్లీ ఈ కూతురూ ఇంకో తల్లీ దాని కొడుకూ వీళ్ళిద్దరి మొగుడూ అందరూ సూర్యుడి బిడ్డలే కాబట్టి అన్నా చెల్లెలో అక్కా తమ్ముడో అయ్యేవాళ్ళు కూడా సుబ్బరంగా పెళ్ళి చేసుకోవచ్చునని సీరియల్ తీసిన వాళ్ళూ దాన్ని జనం మీదకి వొదిలిన చానెలు వాళ్ళూ తేల్చేశారు!ఆ సాగలాగుడు మలుపులకి అప్పటికే విసుగెత్తి పోన్లే అయిందనిపించాడు కదా హమ్మయ్య అనుకున్నారో యేమో యెవరూ అభ్యంతరం చెప్పినట్టు నాకెక్కడా దాఖలాలు కంపదలేదు!

     హఠాత్తుగా యెప్పుడో యెక్కడో ఒకచోట జరిగినా అది తప్పు అనే అభిప్రాయం మనకుంటే మన జీవితంలో అలాంటి పని చెయ్యము గదా!అది లేకపోవటం వల్లనే అంత నిస్సిగ్గుగా ఇంద్రాణి అన్ని తప్పులు చేసింది, అవునా?మతధర్మ శాస్త్రాల పట్టు సడిలింది,డబ్బుతో కోర్టుల్ని మ్యానేజి చేసి చట్టం నుంచి తప్పించుకోవచ్చుననే ధీమా పెరిగింది,అనైతికంగా ఉండటమే సాహసకార్యంగా గుర్తింపు పొందింది!తమని చెల్లెలి గానూ తమ్ముడి గానూ పరిచయం చేస్తున్నప్పుడు ఆ పిల్లలూ వ్యతిరేకించ లేదు!ఆ కూతురూ తను సంబంధం పెట్టుకుంటున్నది యెవరితోనో తెలిసి కూడా కొనసాగించింది - యెవరి వెసులుబాటు వారు చూసుకున్న అపవిత్ర సూర్యవంశమే ఇక్కడ కూడా!ఇవ్వాళ్టి ఆడవాళ్ల లోని చిత్రమైన యాక్సెప్తబిలిటీకి మరో వికృతమైన వుదాహరణ - బాహుబలి సినిమాలో అప్పటికే ప్రేమించుకుని మనస్సులో ఒకరినొకరు భార్యాభర్తలుగా అనుకుని ఉన్న జంట మధ్య జరిగిన శృంగారాన్ని కూడా మానభంగం కింద అల్లరి చేసిన తెలుగమ్మాయి అన్నపూర్ణ వల్లక్కాడో యెవరో s/o సత్యమూర్తిలో నిత్యా మీనన్ కారెక్టరు ఒకణ్ణి గాఢంగా ప్రేమిస్తూ కూడా హీరోని గాఠిగా కావిలించుకోవడాన్ని యెందుకు వ్యతిరేకించలేదు?ఒక మగాడు తనకి నచ్చిన అమ్మాయి పట్ల ఆ అమ్మాయి కూడా ఇష్తపడుతున్నదని తెలిశాకనే కొంచెం రఫ్నెస్ చూపిస్తే తట్టుకోలేక రేప్ అని హడావిడి చేసిన ఆడమనిషికి వేరే మగాణ్ణి పెళ్ళిచేసుకోవడానికి సిధ్ధమై ఉండి కూడా హీరోని అంత గాఠిగా కావిలించుకోవడం అనైతికం అనిపించ లేదా?ఇలా తగలడింది ఇవ్వాళ్టి ఆడవాళ్ళ నైతికత?!

     ఇదివరకటి రోజుల్లో పాటించిన మగాడు యేం చేసినా ఫర్వాలేదు ఆడది మాత్రం బుధ్ధిగా ఉండాలి అనే రూలుని వీళ్ళు రివర్సుగేరుకి తీసుకొచ్చారు,ఇదే మహిళాభ్యుదయం కాబోలు!ఒకప్పుడు మాతృస్వామ్యం కూలిపోయి పురుషస్వామ్యం మొదలైంది మితిమీరిన ఇన్సెస్ట్ వల్లనే!ఆనాడు వివాహం అనేది లేకుండా గుంపులో గోవిందా అని యెవరు యెవరితో యెంత కాలం కుదిరితే అంత కాలం స్వేచ్చాప్రణయవిహారులుగా తిరగవచ్చుననే పధ్ధతిని పాటించేవాళ్ళు కాదంటే వెలివేసేటంత గొప్పగా!ఒక తల్లి నుంచి పుట్టిన వాళ్ళు అంతా ఒక సమూహం - తొలి తరపు తల్లి పేరుతో గణం అనే పేరుతో ఉండేది!ఆ రాణి స్థానంలో ఉన్న ఆడది కూడా కొడుకా మనవడా అని చూడకుండా తనకి నచ్చినవాణ్ణి యెన్నుకుని అతన్ని రాణీగారిమొగుడుగా ప్రకటించి మరింత హక్కుగా కూడుతూ ఉండే కాలమూ ఉంది.కానీ పోను పోనూ తెలియని రోగాలు వచ్చి గణాలకి గణాలే తుడిచిపెట్టుకు పోతున్న దశలో రెండు వేర్వేరు గణాలకి సంబంధించిన స్త్రీ పురుషుల మధ్యన జరిగిన సాంకర్యం వల్ల మంచి సంతానం కలగడంతో అప్పటి తెలివికి తోచిన పరిష్కారం - ఒకే తెగకి చెందిన స్త్రీ పురుషుల మధ్యన సంబంధాన్ని నిషేధించి తమ తెగలోని స్త్రీలని మరో తెగకి పంపించి ఆ తెగలోని స్త్రీలని తమ తెగలోకి తెచ్చుకోవటం!దీనివల్లనే మొదటిదిగా స్వజాతి సంపర్కం వల్ల పుడుతున్న జన్యుసంబంధమైన రోగాలకి స్త్రీలే కారణం అనే ఆత్మన్యూనతా రెండవదిగా కొత్త తెగలో పట్టు సాధించలేకపోవటమూ కలిసి మొత్తం ఆడపెత్తనమే కుప్పకూలి పోయింది?!ఈ సోదర సొదరీ సంబంధాల వల్ల పుట్టే పిల్లలు ఈ కాలంలో కూడా రోగాలతో పుట్టి యెక్కువ కాలం బతకడం లేదు - చాలా దేశాలలో చట్టపరంగా కూడా నిషేధాలు ఉన్నాయి.ఒక పరనారీ వ్యసనగ్రస్తుదైన రామద్వేషిని 18 యేళ్ళు దేశప్రధానిగా భరించితే అతగాడు JNU లాంటి విద్యాసంస్థల్ని హిందూ మతద్వేషులతో నింపితే  పిన్నిని పెళ్ళాడాలనుకునే మదపిచ్చి కమ్యునిష్టులు పెరిగి హేతువాదం పేరుతో వావివరసల్ని కూడా భ్రష్టు పట్టించారు!

     ఇప్పుడీ ఇంద్రాణి ముఖర్జీని ప్రముఖులైన హిందూమత ద్వేషులు యేదో ఒకనాడు సామాజిక విప్లవకారిణిగా అభివర్ణించి వెనకేసుకు వస్తారు చూస్తూ ఉండండి!ఇప్పటి భర్తగారి నామధేయం వల్ల గోడ మల్లయ్యలు కూడా మా మతస్థుల మీద జరుగుతున్న కుట్ర అంటూ వారి తరపున ఉద్యమించినా ఆశ్చర్యపోనక్కర లేదు - ఒక మీడియా చేతులో ఉంది కదా మీడియా లో మిత్రులూ ఉన్నారు శత్రువులూ ఉన్నారు, మీడియా కిక పంగే పండగ!సరే ప్రస్తుతానికి కోర్టులో కేసు బుక్కయింది కానీ విచారణకి సహకరించటం లేదట అసలు కధానాయిక  - యే రావణ జఠల్మానీయో కేసు టేకప్ చేసి సలహా ఇచ్చి ఉంటాడు!అసలు అన్ని అబధ్ధాలూ అన్ని పెళ్ళిళ్ళూ అవసరమా?ఒక భర్తతో పడలేదంటే ఆ ఒక్కడిలో తప్పు ఉందనుకోవచ్చు,విడాకులు తీసుకుని పోనీ పెళ్ళి చేసుకోవాలనే అనుకుంది, కూతురుని చెల్లిగా చెప్పుకునే ఖర్మ దేనికి?ఆ కూతురు యెలా ఒప్పుకుంది?యే ప్రశ్నకీ యెవరినుంచీ సమాధానం రాదు ఇప్పుడప్పుడే,కానీ అందరి పాపాల చిట్టాలూ యేదో ఒకనాడు బయట పకపోవు, అనాడు తల దించుకోకా తప్పదు!మన సాహిత్యంలో శుకసప్తతి కధలు ఉన్నాయి.అందులోని విషయం కూడా ఇలాంటి అనైతిక శ్రంగారమే!ఒక కులస్త్రీకి ఒక పరపురుషుడు ఆహ్వానం పంపుతాడు.ఈమెకి కూడా మోహం పుట్టి సింగారించుకుని వెళ్ళబోతుండగా పెంపుడు చిలక ఆపి ఒక కధ చెప్తుంది.ఆ కధలో వస్తువు ఇదివరకే పరపతులతో ప్రణయం సాగించిన మదవతుల విన్యాసాలు!అయితే ఆ కధలు విశృంఖలత్వానికి తెర యెత్తినవి కావు- మెలిక యేమిటంటే కధంతా చెప్పి ఆ కధలోని స్వైరిణి వలె నువ్వు దిగజారుడు పనులు చెయ్యగలవా అనే రకపు ప్రశ్నలు వేస్తుంది చిలక.అవి తను చెయ్యలేనని తెలుసుకుని ఉసూరూమనటమూ అప్పటికి వేళ మించిపోవటమూ జరిగి నాయిక వెనక్కి తగ్గుతుంది - ఆ రోజుకి అలా ఆమె పవిత్రత నిలబడుతుంది,మరుసటి రోజు రాత్రి మరో కధ!అంటే కధకుదు రంకు చెయ్యాలంటే ఇన్ని బొంకులు బొంకాలి,పరువుగా ఉండదల్చుకున్నవాళ్ళు ఇటువంటి పనులు చెయ్యరాదు అనే నీతిని యెక్కించడం కోసమే ఆ కధల్ని అట్లా కల్పించాడు,అయితే ఇవ్వాళ లేనిదే అది - పరువూ గిరువూ జాంతానై నచ్చిందా దోచెయ్! 

     నాకయితే ఇలాంటివి ముందు ముందు మరిన్ని బయటపడినా సమాజంలో యే చలనమూ కలగదని గట్టిగా అనిపిస్తున్నది!యెందుకంటే కలిగితే నిర్మాణాత్మకంగా సమస్య మూలానికి వెళ్ళాలి,మూలం దగ్గిరికి వెళితే మొత్తం సంస్కృతినే మార్చవలసి వస్తుంది,ఇప్పటి సంస్కృతిని మార్చడం అంటే ఇవ్వాళ అనుభవిస్తున్న సుఖభోగాల్ని వొదులుకోవాలి - యెవరు వొదులుకుంటారు?యేమి చెప్పినా ముప్పే!యేం చెప్తాం?నీతిగా ఉండమంటాం,అంతేగా?పొరపాట్న రాముడి గురించి చెబితే పోవాయ్ పుల్లాయ్ అంత నీతిగా ఉండి యేమి ఉధ్ధరించాడు అడివిలో కందమూలాలు తిన్నాడు,నన్నూ అట్లా ఉండమంటావా అని అడుగుతుంటే ఇంక నీతులు చెప్పడ మెట్లా?!బ్రాహ్మణులు కూడా పిలకల్ని గొరిగించుకుని క్రాపులతో తిరుగుతున్న కాలంలో మళ్ళీ వెనక్కి వెళ్ళడం సాధ్యమా:-)కానీ ఒకటి మాత్రం నిజం - సీత కష్టాలు సీతవి,నిజమే కావచ్చు!అన్ని కష్టాలు భరించినా ఆత్మగతమైన ఒక ధీమా,నేను తప్పు చెయ్యలేదు అనే భావమే సీతని జగత్సుందరిని చేసింది!ఇంద్రాణి అనే గొప్ప పేరున్న ఈ బొంకుల దిబ్బ జైలుపాలై అఘోరిస్తున్న ఇప్పటి స్థితిని అప్పుడే వూహించుకుని ఉంటే చెయ్యగలిగేదా?వీళ్ళ కోసమే అన్నట్టు వేమన్న యెప్పుడో అన్నాడు,"నిరుడు ముందర దగ్ధులైన వారు తన యంతవారు గారో!యెక్కడికి పోవ నెరిగి యముడు చంపడా?" అని!

     ప్రతి తప్పుకీ ఒక శిక్ష ఖచ్చితంగా ఉంటుంది,కొన్ని శిక్షలు వెంటనే పడతాయి,కొన్ని టైము తీసుకుంటాయి - ఈలోపు తప్పించుకోగలమనుకున్న వాళ్ళు కొంచెం హడావిడి చేస్తారు - అంతే!ఈ భూమి మీద యేదీ ఒకేసారి తడిగానూ పొడిగానూ ఉండదనుకున్న వాడు నురగతో చచ్చాడు!కిందా కాకుండా మీదా కాకుండా,లోపలా కాకుండా బయటా కాకుండా ఉండే చోటు యెక్కడా లేదనుకుని జీవమూ నిర్జీవమూ అయినది ఉండనే ఉందని విర్రవీగిన వాడు స్తంభాన్ని చీల్చుకుని పుట్టిన ఉగ్రనరసింహమూర్తి వాడిగోళ్ళకి బలైపోయాడు!బిడ్డల తొలిబుధ్ధులు తల్లిఒడిలోనే మొదలవుతాయి,ఇక్కడ తల్లీ చెడింది,ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు కూతురూ చెడింది!ఒక ఆడది చెడితే - పెళ్ళి కానిదైతే తలిదండ్రులు తల దించుకోవాలి,పెళ్ళైనదైతే రెండు కుటుంబాలు తల దించుకోవాలి,బిడ్డలు గలదైతే రెండు తరాలు తల దించుకోవాలి!కానీ కళాకారుడు చెడితే వాడు మాట్లాడే భాష మాతృభాషగా ఉన్నవాళ్ళంతా తల దించుకోవాలి!!ఇన్ని తరాల పాటు స్త్రీ అంటే రంభోరువులూ నాభిదేశమూ తనుమధ్యమూ వక్షోజాలూ మాత్రమే అని వాటినే చూపించి వెర్రెక్కించటమే తప్ప ఆమెకో ముఖం ఉంటుందనీ ఆ ముఖం వెనక భావాలు ఉంటాయనీ చూపించడం చాతగాని వాళ్లంతా కళ పేరుతో రెచ్చగొడితే ఆ సమాజం పరిస్థితి ఇట్లాగే అఘోరిస్తుంది!!!కుర్రాడైతే ఆడదాని అందాల్ని రుచి చూడ్డమే ముఖ్యం, ఇష్టం లేకపోతే రేప్ అయినా చెయ్యడమే మగతనం అనుకుంటాడు,కుర్రదైతే తన అందాల్ని యెరగా వేసి మగాళ్లని వెంటతిప్పుకోవటమే ఘనకార్యం అనుకుంటుంది!వ్యామోహం ఇద్దరిలోనూ ఒకేరకంగా చెలరేగితే వావివరసలూ యెగిరిపోతాయి.యెక్కడ బడితే అక్కడ కనిపిస్తున్న ఈ మనస్సులో అనైతికత నిండిన చీకటి గుహల్లో నైతికత వెలుగుల్ని నింపడానికి యెన్ని దీపాలు వెలిగించాలి?!

ప్రియాన్న సంభవేత్ దుఃఖం అప్రియాత్ అధికం భయం
                                          తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనః!
     ఈ మంత్రం సీతాదేవి మనకు చేస్తున్న జ్ఞానోపదేశం వంటిది!"మనకు కలిగే దుఃఖాలన్నిటికీ మూలకారణం వస్తువులతో గానీ వ్యక్తులతో గానీ మనకు గల మమకారం నుండి యెక్కడ వియోగం కలుగుతుందో నని భయపడటం.అలాంటి భయాలకూ దుఃఖాలకూ అతీతులైన మహాత్ము లందరికీ నేను నమస్కరిస్తున్నాను." - బహుశా రాముడి పట్ల తనకి గల వ్యామోహంతో కలిగిన భయం వల్ల లక్ష్మణుణ్ణి అనకూడని మాటలు అనటమే తన కష్టాలకి కారణమని స్వానుభవం నేర్పిన పాఠం కాబోలు!

వాల్మీకి అందరికీ పనికొచ్చే నీతుల్ని సీత ద్వారానే చెప్పాడు - సీతాయాః చరితం మహత్!

Thursday, 27 August 2015

సీతమ్మ వారి పుట్టింట్లో యెంత వైభోగం?రాముల వారి నట్టింట్లో యెంత నైరాశ్యం!!

     ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు అన్నీ చూడాలన్నారు పెద్దలు - జాతకాలతో సహా!అన్నీ కుదిరినా విడివిడిగా ఇద్దరూ మంచి జాతకులైనా దంపతులుగా కలవటానికి జాతకాలు కలవకపోతే వాళ్ళు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో సని అన్నట్టు అష్టకష్టాలు పడుతూనే ఉంటారు, ఆ సీతారాములకీ జాతకదోషం తప్పలేదా?


     ఖట్మండూకి నైరుతిదిశలో 133 కిలోమెటర్ల దూరంలో ఉన్న జనక్ పూర్ నగరాన్ని హిందువులు సీతాదేవి పుట్టినిల్లుగా అభావిస్తారు.నిజానికి సీత తండ్రి జనక మహారాజుని కొందరు రాజర్షి జనకుడు అని కూడా అనుకుంటారు గానీ అది పొరపాటు!అష్టావక్రుడి లాంటి జ్ఞానులతో గోష్టి సాగిస్తూ కనబదే ఆ జనక రాజర్షి వేరు ఈ జనక మహారాజు మహావీరుడు.శివచాపం ఇతని వద్దకు రావడం కూడా యోధత్వమే కారణం!సీత స్వయంవరం రాముడు వచ్చిన ఆ ఒక్కరోజునే జరగలేదు.శివధనుస్సుని యెక్కుపెట్టిన వారికి తన పిల్ల నిస్తాననై ప్రకటించి చాలా కాలమైంది,యెందరో వీరులు వచ్చారు,యెక్కుపెట్టలేక వెళ్ళిపోయారు,సీత సౌందర్యం గురించి తెలిసి విల్లు యెక్కుపెట్టలేకపోయినా యుధ్ధంలో ఓడించి అయినా సాధించుదామని ప్రయత్నాలు కూడా చేశారు.ఇక సీతకి పెళ్ళే కాదేమో అనే నిరాసలో ఉండగా ఆశీసుల కోసం మునులందరికీ కబురు పెట్టినట్టుగానే విశామిత్రుడికి జనక మహారాజు పంపిన ఆహ్వానం వల్ల ఆయన అయోధ్యకి తిన్నగా వెళ్ళడానికి బదులుగా అది కూడా చూసుకుని వెళ్దామని అనుకోవడం వల్ల అటు వెళ్ళడం జరిగింది!అక్కడ యెటూ రాముడు కూడా ఒక రాజకుమారుడే గనక తనూ ప్రయత్నించాడు,ఇక మరెవ్వరూ యెత్తాల్సిన అవసరం లేదు గనక ధనువు విరిగింది - సీతారాముల కళ్యాణం జరిగింది!

     అప్పటినుంచీ మొదలైంది సీత కష్టాల పరంపర!అంతఃపుర రాజకీయాలు సీతకి తెలియనివి కావు.మొదట అసలు రాజవుతాడో,రాజభ్రాత అవుతాడో తెలియని ఆందోళన - యే ఆడదానికైనా పెద్ద కష్టం మీ ఆయన యేం చేస్తుంటాడు అంటే గొప్పగా చెప్పుకునే వీలు లేకపోవటం!మామగారు హడావిడిగానే చేసి అందువల్లనే తగలరాని దేబ్బ తగిలి అఘోరించాడు గానీ తెల్లారితే రాజవుతాడనుకున్న ఆర్యపుత్రుడు అరణ్యవాసం వెళ్ళాలి అడివిలో ఆపదలుంటాయి నువ్వు రావద్దు నన్ను మాత్రం సాగనంపమని చావుకబురు చల్లగా చెప్పాడు!ఇదెక్కడి గోల,ఒక రోజూ రెండు రోజులు కాదు పధ్నాలుగేళ్ళు భర్తను విడిచి ఒంటరిగా ఉండటానికి తన సతీత్వం ఒప్పుకోలేదు.అయితే అయిందని తెగించి భర్త అని కూడా చూడకుండా చనువుంది గనక అనకూడని మాటలు కూడా అనేసి పోట్లాడి మరీ తను కూడా తోడుగా వెళ్ళీంది!సీతకి తర్వాత యే కాలంలో యే భార్య చేసినా సీతని చూసే కదా అలా చేసేది!?

     పోనీలే రాజరికపు చిక్కులు లేవు,యే బాదరబందీ లేదనుకుని హాయిగా మరిది మంచివాడు గనక వేళకి అన్నీ అమర్చిపెడుతుంటే తేనెవెన్నెల రోజుల మాదిరి గడిపేశారు ఆదిదంపతు లిద్దరూ పదమూడేళ్ళూ!అయోధ్యలో సాటివాళ్ళు యెక్కడ తనమీద జాలిపడతారో అని ఇక్కడి సరదాల కన్నిటికీ గుర్తుల్ని సేకరించే పిచ్చి ఆఖరి రోజుల్లో కొంప ముంచేసింది!తన భర్తా మరిదీ అవమానించిన శూర్పణఖ సోదరుడైన లంకాధిపతి రావణుడు అపహరించటమే గాక తనని వరించమని కూడా అవమానిస్తుంటే గడ్డిపోచలా తీసిపారేసింది రాముడు యెలాగైనా వస్తాడు తన చెరని విడిపిస్తాడని అంత నమ్మకం!అది కూడా ఆంజనేయ భగవాన్లు చాకచక్యంతో తన జాద కనుక్కుని కోతిమూక అని రావణుడు తేలిగ్గా చూసిన వానరయూధముఖ్యుల చేతనే కార్యం పూర్తి చెయ్యడంతో నెరవేరి తన కష్టాలన్నీ గట్టెక్కినట్టేనని సంతోషపడింది - కడివెడు పాలలో ఒలికిన విషపు చుక్కలా స్వీకరించాల్సినవాడు తిరస్కారంగా మాట్లాడటం,యెవరి దగ్గిరకయినా ఫోగానీ నా దగ్గిరకి మాత్రం రావద్దని శఠించుకుని కూర్చున్నాడు!ఆ మాటల కర్ధమేమిటో ఆయనకే వైరము లేని హింస  గురించి నీతిబోధ చేసిన సీతకి తెలియదా?మనకి వచ్చే కష్టాలన్నీ మనం చేసే తప్పుల వల్లనే అనీ మనం చేసే తప్పులనీ మనకున్న బ్లహీనతల వల్ల్లనే అనీ తెలిసిన సీతకి అలాంటి సమయంలో యేమి చెయ్యాలో మరొకరు చెప్పాలా!త్నౌ తిట్టాల్సినవి తనూ తిట్టి ఇక సత్యవిక్రముడి మాట మారదని తెలిసి అగ్నిలో దూకింది!అన్నిట్నీ నిర్మొహమాటంగా కాల్చిపారేసే అగ్నిదేవుడు కూడా చల్లబడి నేను కూడా కాల్చలేనంతటిది నీ భార్య అని చెప్పినా కరగలేదా ధర్మిష్ఠి, ఆఖరికి చచ్చి స్వర్గాన వున్న మామగారు దిగివచ్చి చెప్తే గానీ మాట తిప్పుకోలేదు ధృఢవిక్రముడు!

     సీత వనవాసం మొదలు పెట్టే మొదటి రోజుల్లో అందరు ఆడవాళ్ళలాగే ఒక గ్రామదేవతకి తనూ తన భర్తా తిరిగి అదే దారిలో వస్తామనుకుని ఆ తిరిగి వచ్చేటప్పుడు రెందు కల్లు కుండ్లని సమర్పించుకుంటనన మొక్కుకుంది,కానీ తిరుగుప్రయాణం అప్పటివరకూ అనుభవించిన ఆందోళన వల్లనూ భరతుడక్కడ ప్రాణాలు పణంగా పెట్టుకుని ఉండటం వల్లనూ ఆకాశమార్గంలో హడావిడిగా జరగటం వల్లనూ ఆ మొక్కు సంగతి గుర్తుకే రాలేదు - ఖర్మ!చేసిన మొక్కులు తీర్చకుంటే యెంతటివారికైనా వాగ్దానభంగపు కష్టాలు తప్పవేమో,ఈసారి శని అయోధ్యానగర ప్రజల నాల్కల మీద కూర్చుని అగ్నిపునీతకే అక్రమచరిత్రం అంటగట్టేసి చెవుకు కొరుక్కోవటం మొదలుపెట్టారు!?లక్ష్మణుడి ద్వారా అది రాముడికీ తెలిసింది!అప్పుడు రాముదేమి చెయ్యాలి?మరి మూడు యుగాల తర్వాత వచ్చే కలియుగపు ఆఖరిపాదంలో మాదిరి అయిదేళ్ళకు మారిపోయే ప్రభుత్వం కాదు,ఆజీవ పర్యంతం అయోధ్యా నగర ప్రజలకి అంకితమైపోయిన ప్రమాణమే రాజరికం!

     రాజు తనపాటికి తను ధర్మాత్ముణ్ణని డప్పు కొట్టుకోవటం తప్పుగా భావించే కాలమది!ప్రజలు రాజు పట్ల యేమాత్రం అవిధేయత కలిగి ఉన్నా రాజశాసనానికి విలువ ఉండదు,తనకి రాజరికాన్ని వదలివేసే స్వేచ్చ ఉంటే అసలు అమస్యే లేదు,కాబట్టి అయోధ్యానగర ప్రజల పాపచింతనతో కూడుకున్న దోషారోపణకి తెలిసితెలిసీ సీతని బలిపెట్టాడు,పునర్వివాహం గురించి ఆలోచించకుండా ఏకపత్నీవ్రతం కోసం లోహసీతని భరించాడు అన్ని ధర్మకార్యాలలో!యెన్నో యేళ్ళు గడిచిపోయాక,జంటగా సుఖపడాల్సిన కాలమంతా ఇర్వురూ ఒంటరిగా బతికాక అప్పటి వరకూ యెక్కడ వుందో యేమైపోయిందో తెలియని జగదేక సౌశీల్యవతి సీత ఉనికి అశ్వమేధ సమయంలో రాముడు పంపిన అశ్వరాజం కారణాన సీత దగ్గిర విలువిద్య నేర్చుకున్న కుశలవులనే ఇద్దరు కుర్రాళ్ళు రావణసంహారం చేసిన రాముడికే చెమట్లు పట్టించడంతో బయటపడింది!ఇప్పుడు స్వీకరిస్తానని మర్యాదాపురుషోత్తముడు ముందుకొచ్చినా వైకుంఠం చేరేకాలం ఆసన్నమైంది ఇంకా యెందుకు వ్యామోహం అని దివ్యావబోధతో ఆలోచించిందో మళ్ళీ అపవాదు వస్తే మళ్ళీ ఇదే తంతు జరుగుతుందని మానవాంశతో విరక్తి పుట్టిందో వాల్మీకికే తెలిసి ఉండదు సీత మనస్సులో అప్పుడు రగిన కల్లోలం!అయోధ్యానగర ప్రజల కళ్ళ్ళు తెరుచుకునేలాగ భూమి కంపించింది,ధరణిజాత అందరి తప్పుల్నీ క్షమించి సర్వులకూ నమస్కరిస్తూ తల్లి ఒడిలోకి నడిచింది,సీతామనోభిరాముడు కూడా దేవతల వాక్యం గుర్తుకు తెచ్చుకుని సరయూనదిలో ప్రవేశించి క్షీరసాగరం చేరాడు - సీతపై వేసిన అపవాదుకు శిక్ష కాబోలు నన్నట్టు అయోధ్యానగరం ఇప్పటికీ శాపగ్రస్త మాదిరిగానే ఉంది?!

     యెవరి పాపం యెవర్ని కట్టి కుడిపినా మళ్ళీ సీతకే కష్టాలు మొదలైనాయి - ఆనాటి అయోధ్యానగర ప్రజల్ని క్షమించిన సీతకి భక్తుల మౌఢ్యం వల్ల మళ్ళీ కష్టాలు మొదలైనాయి!మూడు యుగాలు ప్రశాంతంగా యేదో ఒక విధంగా ప్రజలు తమని ఆదర్శంగా తీసుకున్నారు తమ మూలంగా ధర్మం నిలబడింది అని సంతోషిస్తుంటే భక్తులకి రామభక్తి మతపిచ్చిగా మారి అక్కడుండాల్సిన రాముడు ఇక్కడున్నాడు,ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఉంచాలని యేళ్ళ తరబడి హడావిడి చేసి ఒక్కరోజులో అక్కడున్న మసీదుని కూలగొట్టి తననీ తన ఆర్యపుత్రుణ్ణీ టార్పాలిన్ గుడ్డల కింద కూలేశారు!యెలాగూ మసీదు కూలగొట్టారు ఆలయం కడతారు గదా అనుకంటే కడతామని అధికారంలోకి వచ్చినవాళ్ళలో అసలు అలికిడే లేదు!అసలు వాళ్ళు నిజాయితీపరులో కాదో తేల్చుకోవాల్సిన రామభక్తులు రామాజ్ఞ లేనిదే రామచిలకైనా పలకదని మెట్టవేదాంతం చెప్తున్నారు!ఒక్క ఆలయమే కట్టలేని వాళ్ళు అన్ని ఆలయాల సమస్యల్నీ ఉధ్ధరిస్తారని పగటికలలు కూడా కంటున్నారు?

     రామాలయం కట్టడం అవసరమా అంటే దేన్నీ పట్టించుకోని వారికి యేదీ అవసరం కాదు!"If Pakistan were indeed created as a homeland for Muslims, it is hard to understand why far more were left behind in India than were incorporated into the new state of Pakistan - a state created in two halves, one in the east (formerly East Bengal, now Bangladesh) and the other 1,700 kilometres away on the western side of the subcontinent"1947లో ఉపఖందం రెండుగా చీలినప్పుడు ఆ సంఘటనని విశ్లేషించిన అంతర్జాతీయ విశ్లేషకుల్లో ఒకరికి వచ్చిన సందేహమిది!మిగతా విశ్లేషకులు కూడా దాదాపు ఇదే రకం సందేహాన్ని వ్యక్తం చేశారు!దాని అర్ధం యేమిటంటే వారు మతప్రాతిపదికతతో విడిపోయాక మతప్రాతిపదికతన యేర్పడిన కొత్త దేశంలో ఇముడ్చుకున్నవారికన్నా ముస్లిములు భారతదేశంలోనే యెక్కువ సంఖ్యలో యెందుకు ఉండిపోయారు అని?ఇక్కడ ఉండి అక్కడి భజన చేయకండి అని పటేల్ అంటే అతన్ని ముస్లింవ్యతిరేక చాందసభావాలు కలిగిన హిందూమతతత్వవాదిగా ముద్ర వేసేశారు.వారు కోరుకున్న దానికి ఒప్పుకుని మతప్రాతిపదికన విభజించి వారి దేశం వారికి సమర్పించి మనం ప్రశాంతంగా ఉండవచ్చునని అంకుంటే అదీ నెరవేర లేదు!దేశవిభజన నాటి మారణహోమాన్ని మినహాయిస్తే నాటి నుంచి 1).1969లో గుజరాత్ అల్లర్లు 2).1980లో మొరాదబద్ అల్లర్లు 3).1987లో హషింపుర నరమేధం 4).1989లో భాగల్పుర్ హింస 5).1990లలో సుదీర్ఘకాలం పాటు వ్యూహాత్మకంగా కాశ్మీరీ పండితుల వెలివేత 6).1992లో ముంబై అల్లర్లు - బాబ్రీ మసీదు విధ్వంసానికి నిరసన 7).2000లో అమర్నాథ్ యాత్రీకుల వూచకోత 8).2002లో గోధ్రా రైలుపెట్టెలో కరసేవకుల సజీవదహనం 9).గోధ్రా రైలు సంఘటనకి ప్రతీకారం పేరుతో మూడురోజుల పాటూ అడ్డూ అదుపూ లేని ప్రతీకార దాడులు 10).2002లో కాష్మీరు లోని రఘునాథ దేవాలయం మీద దాడి 11).2002లో అక్షరధాం ఆలయం మీద దాడి 12).2006లో వారణాశి బాంబు పేలుళ్ళు 13).2008లో లష్కరే తోయిబా అధ్వర్యంలో ముంబై దాడులు, యేమిటివన్నీ?ఇదీ మనం సాధించుకున్న ప్రశాంతమైన లౌకికవాదం మరియూ మతసామరస్యం వెల్లివిరుస్తున్నదని భ్రమపడుతున్నఈ దేశపు నడుస్తున్న చరిత్ర.

     దేశవిభజన నాటి  ఉద్రేకాలు చల్లారిపోయిన తర్వాత కాలంలో జరిగిన విధ్వంసాల కన్నిటికీ కేంద్రబిందువు అయోధ్య!భారతీయ ముస్లిము సమాజం యొక్క సామాజిక నిర్మితి చాలా సంక్లిష్టమైనది - అందర్నీ ఒక్క గాటన కట్టెయ్యలేము!మతప్రాదిపదికన రిజర్వేషన్లు ఉండటం కన్నా మతప్రాతిపదికని రాజకీయపునాదిగా చేసుకుని అధికార పీఠానికి యెగబాకటానికి వ్యూహాత్మకంగా మతాన్ని వాడుకునేవాళ్ళు వారిలో కొద్దిమందే ఉన్నప్పటికీ విధ్వంసాలు సృష్టించి విద్వేషాలు రగిలించటంలో ఆరితేరిపోయిన ఆ కొద్దిమందే ఇంత భీబత్సాన్ని రగిలిస్తున్నారు!ఆ కొద్దిమందికి అయోధ్య సమస్య అధరువుగా ఉపయోగపడుతున్నది!వారి రాజకీయ పునాదిని బద్దలు కొట్టనంతకాలం ఆ భీబత్సాలు ఆగవు కాబట్టి అయోధ్య సమస్యని వీలయినంత తొందరగా పరిష్కరించాల్చిన అవసరం యెంతైనా ఉంది.వాస్తవం యేమిటంటే సమస్య కున్న పరిధి చిన్నదే!సాంకేతికంగా ఇప్పుడు ఆలయం కట్టాల్సిన భూమిలో కొంత భాగం వక్ఫ్ బోర్డు అధీనంలో ఉంది.అది ప్రభుత్వం వారు మనకి పిత్రార్జితాన్ని యెలా రిజిస్టర్ చేస్తారో అలా అధికారికంగా దఖలు పడి ఉంది.అందుకే మసీదు కూల్చిన వీరాధివీరులు కూడా ఆలయం కట్టడానికి వెనుకాడుతున్నారు!సామరస్యంగా పరిష్కరించుకోవాలంటే వక్ఫ్ బోర్డు వారి నుంచి ఆ భూమి మర్యాదగా అడిగి తీసుకోవడం తప్ప మరోదారి లేదు.కూల్చిన మసీదుకి పరిహారం చెల్లించి తీసుకుంటే వారు మసీదుని వేరే చోట కట్టుకుంటారు - ముఖ్యంగా అతోధ్య ప్రజలు సంతోషిస్తారు!రామభక్తులు కూడా ఏ విధమైన ఆందోళనలూ లేకుండా ప్రశాంతంగా రాముణ్ణి అర్చించుకోవచ్చు.ఇంతమంది హిందువుల్లో ఆపాటి ఉదారులు లేరా?ఉన్నారు,కాకపోతే యెవరో వస్తారని యేదో చేస్తారని యెదురు చూస్తున్నారు కాబోలు!తమ చేతికి మట్టి తగలకుండా కాగల కార్యం తీర్చే గంధర్వుల కోసం యెదురు చూస్తున్నారేమో,ఈ కాలంలో యే గంధర్వులు వస్తారు?


     యేదో వీరత్వం చూపించుదామని ఒక్కరోజు ఘనకార్యం చేసిననదుకు దశాబ్దాల తరబడి మహానగారాలు యెక్కడ బాంబు పేలుతుందోనని వణికిపోతూ తీరా పేలాక శవాల లెక్కలు తేల్చుకుని మళ్ళీ అటువైపు నుంచి ప్రతీకార దాడులకి దిగటం లాంటి పైత్యకారి పనులతో అతలాకుతలమైపోతున్నాయి!పోనీ ముస్లిములు నిజంగా ఆంత భయంకరులా అంటే దేశమంతటా ఉన్న సామాన్య ముస్లిము ప్రజానీకం,ముఖ్యంగా అయోధ్య లోని ముస్లిములు సామరస్యంగా సమస్య పరిషకరిష్కారమైతే సంతోషిస్తామనీ అంటున్నారు.ఇటువైపు మసీదు కూలగొట్టిన విహింప వారు ఆలయాన్ని కట్టడం కూడా తమకి చేతనైన పాత అలవాటు చొప్పున అప్పటి ముతక పధ్ధతిలోనే హిందువుల్ని ఏకశిలాసదృశంగా తయారు చేసి భాజపాకి అఖండమైన మెజారిటీని కల్పిస్తే చట్టసభల ద్వారా బలవంతంగానే మాట చెల్ల్లించుకోవాలని చూస్తున్నారు!!పోనీ విహింప వారి ప్లాను ప్రకారం హిందువుల్ని కలుపుదామా అంటే ఇక్కడ బ్రాహ్మణ శ్రేష్ఠులు,అగ్రకులస్థులు,దళిత మేధావులు,నాస్తిక శిఖామణులు,కమ్యున్ష్టు దార్శనికులు - ఇందర్ని కలపటం యెవడి తరమూ కాదు!ఒకవేళ బలాత్కారమో మానభంగమో చేసేసి ముస్లిములతో పని లేకుండా పుణ్యకార్యం కానిచ్చేస్తే ఆ తర్వాత కోపోద్రిక్తులైన ముస్లిము వర్గాలు ఖచ్చితంగా సరిహద్దుల కవతల నుంచి రెచ్చగొట్టే ఉగ్రవాదుల సాయంతో రెచ్చిపోవడం ఖాయం!యెగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రహ్మహత్య!

సీతాపతీ నీకు టార్పాలిను కప్పేగతి!

Tuesday, 25 August 2015

గుడుంబాను నిరోధించటానికి చీపు లిక్కరును ప్రోత్సహిస్తున్నారట!చీపు లిక్కరుని నిరోధించటానికి దేన్ని ప్రోత్సహిస్తారు?

తాటిచెట్టు యెందుకెక్కావురా అంటే దూడగడ్డి కోసం అన్నాట్ట!యేమో వాడి తెలివి వాడిది కావచ్చు - యెక్కడ మంచి గడ్డి ఉందో పరకాయించి చూడ్డానికి యెక్కాడేమో!మన గవర్నమెంటు వారు ఇంకా తెలివైనవారు కదా ప్రజల సంక్షేమం కోసం యెన్నో మంత్రిత్వ శాఖల్ని యేర్పాటు చేశారు.కుటుంబనియంత్రణ శాఖ ద్వారా పిల్లల్ని పుట్టకుండా చేస్తారు.శిశు సంక్షేమ శాఖ ద్వారా పుట్టిన పిల్లల్ని చావకుండా బతికి ఉంచుతారు.ఆర్ధికశాఖతో పన్నులు వేసి గోళ్ళూడగొట్టి వసూలు చేస్తారు.పోలీసు శాఖతో లాఠీలకి పని చెప్పి అల్లరిపిడుగుల్ని వీపు సాపు చేసి దారికి తీసుకొస్తారు.ఇవ్వన్నీ సరిగ్గా పని చేసినా చెయ్యకపోయినా కంగారు పడరు గానీ ఒక శాఖ సరిగ్గా పని చెయ్యకపోతే మాత్రం గంగవెర్రు లెత్తిపోతారు - ఆరోగ్యశాఖ అనుకునేరు,కాదు కాదు త్రాగుడు శాఖ?!

త్రాగుడు శాఖ గనక సరిగ్గా పని చెయ్యకపోతే ప్రభుత్వం తాగినోడికి మల్లే తూలిపోతుంది!యెందుకంటే ఉద్యోగస్తుల,మంత్రుల,శాసనసభ్యుల జీతాలన్నీ అందులొంచే యేర్పాటు చేశారు మరి?కొన్ని కోట్లమంది తాగి తాగి చస్తూ బతుకుతూ ఉంటే గానీ ఆ ఘనకార్యం నెరవేరదు,జనం చచ్చి ప్రభుత్వాన్ని బతికించాలి!అసలు రాజ్యం లక్షణమే అంత,రాజ్యానికి రెండు ముఖాలు ఉంటాయి - కరెన్సీ,లాఠీ!మొదటిది రాజ్యం సరిహద్దుల్లో యెక్కడయినా చెల్లుతుంది.సంపాదన,ఆస్తి,మిగులు,అప్పు,వడ్డీ,బ్యాంకింగు ఇవన్నీ జనానికి తిండినీ కాల్క్షేపాన్నీ ఇస్తాయి.ఒకడు మరీ పేట్రేగిపోయి అల్లరి చేస్తే అప్పుడు లాఠీ లేస్తుంది.అరెస్టులు,కేసులు బుక్ చెయ్యడాలు,లాయర్లు,కోర్టులు,తీర్పులు అదో గందరగోళం - అటుకేసి సుఖపడాలనుకున్నవారు యెవరూ ఒకంతట పోరు.మాటిమాటికీ లాఠీ ఉపయోగించాలంటే కష్టం కదా!లాఠీ వరకూ వెళ్ళకుండానే ప్రజల్ని బుధ్ధిగా ఉంచటానికి పనికొచ్చే రెండు చేతులు కూడా ఉన్నాయి రాజ్యానికి - మతం,మత్తు!

మొదటిది చాలా శక్తివంతమైనది,పైగా నిరపాయకరమైనదీ గౌరవనీయమైన పధ్ధతి!ప్రతి మతమూ తను నిర్వచించిన ప్రత్యేక లక్షణాల్తో కూడుకున్న సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నమ్మమంటుంది,దేవుడికి నచ్చేవి అని చెప్పి కొన్ని సూత్రాలని పాటించమంటుంది.మంచిపనులు చేస్తే బతికున్నప్పుడు కష్టాలు పడ్డా చచ్చాక స్వర్గంలో సుఖపడవచ్చు నంటుంది,దేవుడికి నచ్చని పనులు చేస్తే చచ్చాక నరకంలో కష్టాలు పడాల్సి వస్తుందని బెదిరిస్తుంది.ఆ మార్మికత ప్రభావం వల్ల దేవుడికి నచ్చే పనులు చేస్తూ బతికుండగా కష్టాలు పడినా చచ్చాక సుఖపడొచ్చుననే ఆశతో కష్టాన్నే ఇష్తంగా చేసుకుని విధేయతని పాటిస్తారు కొందరు - వారు భక్తులు!ఆ విధేయతని మెల్లగా రాజు/ప్రభుత్వం వైపుకి మళ్ళించడం చాలా తేలిక!అందుకే రాజ్యం కనిపించీ కనిపించకుండా చాపకింద నీరులా పనిచేస్తూ ప్రజలకి యెక్కువ విధేయతని అలవాటు చేసే మతాన్ని కొంచెం ఎక్కువగా ప్రోత్సహిస్తుంది!విస్కీ సీసాకీ విబూదిపండుకీ ముడిపెడుతున్నానని అనుకోకండి - రెండూ కిక్కునిచ్చేవి గాబట్టి కొంచెం సోదరస్తుతి!

అలా విధేయతకి అలవాటు పడిన ప్రజలు అంటే రాజ్యానికి చాలా ఇష్టం,కానీ అందర్నీ అట్లా మార్చలేరు,కొందరు హేతువాదులు ఉంటారు,కొందరు ఠాట్ నాకు ఇక్కడే సుఖాలు కావాలి అనే తిరుబాటుదార్లు ఉంటారు - వారికోసం యేర్పాటు చేసిన సదుపాయమే మధుపానం!మధుపానం ఇప్పటిదా?దీని చరిత్ర క్షీరసాగరమధనంతో మొదలవుతుంది!అసలు కన్నా కొసరు ముద్దని అమృతమేమో అని దేవతలూ దానవులూ భ్రమపడిన సుర అమృతం కన్నా ముందే పుట్టింది గదా!అసలుది ఉందో లేదో తెలియని కల్పన అయితే కొసరుది యెక్కడ బడితే అక్కడ కనిపించే వాస్తం.గట్టిగా అంటే సనాతనులు పోట్లాటకి వస్తారు,వచ్చినా రానీండి గానీ యజ్ఞ యాగాదులలో ప్రవహించే సోమం ఇదేనని హేతువాదులు పరిశోధనలు చేసి తేల్చిచెప్పారు!ఆదిశేషుని అపరావతారం బలరామ దేవులు మధూపానాసక్తుడనేది జగద్విదితమే!

అన్ని మతాల్లోనూ మామూలు రోజుల్లో అవాంచనీయమని చెప్పి శ్రోత్రియులకి నిషేధించినా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు కూడా మద్యాన్ని పవిత్రీకరించి స్వీకరించడం జరుగుతూనే ఉంది?!యెందుకయ్యా ఇంత ఆకర్షణ అంటే కల్లు,మద్యం,గుడుంబా,భంగు,కొకైన్,టెనిన్,కెఫేన్,మార్ఫిన్ - అవన్నీ వైద్యశాస్త్ర పరంగా తగుమాత్రం పుచ్చుకుంటే దేహబాధల్నీ మనోరుగ్మతల్నీ ఉపశమింపజేసే మంచి లక్షణం ఉంది.మనిషి శారీరకంగా గానీ మానసికంగా గానీ ఒక మోతాదుని మించి కష్తపడితే శరీరంలో లాక్టిక్ యాసిడ్ యెక్కువగా  ఉత్పత్తి అయ్యి నెప్పుల్ని కలిగిస్తుంది.కొంచెం శ్రమ వల్ల పుట్టే నెప్పులకి నిద్ర సరిపోతుంది.అదికశ్రమకి గురయితే కేవలం నిద్ర చాలదు,అటువంటి సమయంలో తగుమాత్రంగా పుచ్చుకుంటే అందులో ఉండే ఆల్కహాల్ లాక్టిక్ యాసిడ్ వల్ల కలిగే నెప్పుల్ని తగ్గిస్తుంది!కానీ ఆ సమయంలో మనస్సులో కలిగే భ్రమలకి అతిగా దాసుడైతే అవసరం ఉన్నా లేకపోయినా తీసుకోవాలనిపిస్తే వ్యసనం అయి కూర్చుంటుంది - నెత్తిమీదకి కొత్త కష్టాల్ని తెస్తుంది?!

తాగుతున్న వాళ్ళు అందరూ చావరు!డబ్బున్న మారాజులకి యే కొంచెం శృతి మించి ఆరోగ్యం ప్రమాదంలో పడినా వెంఠనే ఫ్యామిలీ డాక్టరుని మెయింటెయిన్ చెయ్యడం అనే స్టాటస్ సింబల్ యెలాగూ ఉంటుంది గనక తగిన వైద్యం చేయించుకుని ఆయనగారు చెప్పిన సలహాలు పాటించి గుండ్రాయిలా బతికే వీలుంటుంది!యెటొచ్చీ పొద్దస్తమానం పని చేస్తే తప్ప పొట్టగడవని వాళ్ళకి ఈ విధమయిన అదనపు వెసులుబాట్లు ఉండవు గనక చస్తారు.తమ చుట్టూ ఉన్న దరిద్రాన్ని భరించలేక భ్రమల్లో కలిగే ఆనందం హాయిగా ఉంటుంది గనక పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు అన్నట్టు తయారవుతారు,పాపం!ఆ గది మాత్రం తెరవవద్దని అందాల రాకుమారి యెంత చెప్పినా యేముందో చూడాలని దాన్ని పనిగట్టుకు తెరిచి రాకుమారికి దూరమై అలమటించే జానపద కధల్లోని కధానాయకుడిలా తాగిన మొదటిసారి దొరికి మత్తు దిగగానే మాయమైపోయిన ఆనందం కోసం మళ్ళీ మళ్ళీ వెతుక్కునే వాళ్ళు తాగకుండానే ఆనందంగా బతకొచ్చుననే అసలు రహస్యం తెలుసుకుంటే కల్తీదైనా ఫరవాలేదు యెక్కువ ఖరీదయినా ఫరవాలేదు అని అంగలార్చుకు చావరు!

ప్రభుత్వం వారు సంపూర్ణ మద్య నిషేధం పెట్టి నిక్కచ్చిగా అమలు చేయ్యవచ్చు గదా అంటే బూతు సినిమాలని నిషేధిస్తామనగానే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చి ఆవేశపడిపోయిన రామగోపాలవర్మ లాంటివారు పడనివ్వరు గదా!యేదో వ్యంగ్యానికి అన్నాను గానీ మాంసాహారాన్ని నిషేధించి శాకాహారాన్ని ప్రోత్సహించాలనే డిమాండు గతంలో వచ్చినప్పుడు పరమాచార్యులే వ్యతిరేకించారు ఆహారపు టలవాట్లలో బోధన ద్వారా ఇష్టాపూర్తిగా మార్చడమే తప్ప బలవంతంగా నిషేధాలు విధిస్తే ఫలితం వికటిస్తుందని!గట్టిగా నిషేధించాలని ప్రయత్నాలు జరిగినా నిజంగానే ఫలితం వికటించింది!స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం పంతులు గారి హయాములో మద్యనిషేధాన్ని నిక్కచ్చిగా అమలు జరిపినందుకే ఆయన ప్రభుత్వం కూలిపోయింది?ప్రస్తుతానికి దేశంలో నికచ్చిగా గాంధీగారి జన్మస్థానమైనందున గుజరాతులో గట్టిగా అమలు చెయ్యాలనే ఉద్దేశంలో మర్యాదస్తులూ మొహమాటస్థులూ ఉన్నారు గానీ పేరుకి మాత్రమే నిషేధం నడుస్తున్నది - మిగతా చోట్ల కన్నా పైనించి కిందివరకూ అధికారులు యెవరి వాటాలు వారు పంపకాలు వేసుకుని తీసుకునే పధ్ధతిలో సమాంతర ఆర్ధికవ్యవస్థ అనిపించేటంతగా వ్యవస్థీకృతమైన నల్లబజారు విక్రయాలు నిజంగా అక్కడ మద్యనిషేధం అంత బలవంతంగా అమలు చెయ్యడం అవసరమా అనిపించేటట్టు ఉన్నాయి!

ప్రస్తుతం భారతదేశపు రాజ్యాంగం అమలయ్యే భూభాగంలో నిక్కచ్చిగా అమలవుతున్నది లక్షద్వీప్ లోని "Bangaram" దీవిలోనే - కానీ అక్కడ జనావాసాలు లేవు!అచట ఒక రిసార్టు కలదు,రిసార్టు నందు ఒక బార్ కలదు - అచట మాత్రమే సేవించవచ్చు.మిజోరమ్ము వారు 17 సంవత్సరాల సుదీర్ఘనిషేధం తర్వాత 1014లో జులై 10న యెత్తిపారేసి రమ్ముని తిరిగి రమ్మని మత్తునిమ్మని ఆహ్వానించినారు!పాపం క్రైస్తవ మతానుయాయులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రార్ధనలు చేసి సరిపెట్టుకున్నారు - అసలు మధ్యనిషేధాన్ని యెత్తివేసే బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కూడా విశ్వాసియే!ప్రార్ధించిన వాళ్లలో ఆయన కూడా ఉన్నాడు పాపం?!"ప్రభువు గనక మద్యనిషేధాన్ని యెత్తివేస్తున్న ఈ బిల్లుని నిజంగా వ్యతిరేకించాలని సంకల్పించి ఉంటే బిల్లుని సభలో ప్రవేశపెట్టకుండా నన్ను నిరోధించమని ప్రభువుని యెంతగానో ప్రార్ధించాను" అని వాక్రుచ్చాడు,అంటే కరుణామయుడు కూడా మద్యనిషేధాన్ని సమర్ధించలేదు,మానవమాత్రులం మనం ఏమి చెయ్యగలం!?

గుడుంబా అమ్మకాల్ని నిరోధించడానికి చీప్ లిక్కరుని ప్రోత్సహించటం,చీప్ లిక్కరు అమ్మకాల్ని నిరోధించడానికి మరోదాన్ని ప్రోత్సహించటం కన్నా ప్రతిదానికీ శాస్త్రీయమైఅన పధ్ధతిలో మార్కెట్ సదుపాయాల్నీ వినియోగానికి ఆరోగ్యపరమైన నిబంధనల్ని రూపొందించి అన్నిటినుంచీ తగినంత ఆదాయం తెచ్చుకోవడం మంచిది!ప్రభుత్వపరంగా కొన్ని రక్షణల్నీ కొన్ని సదుపాయాల్నీ యేర్పాటు చెయ్యటం తప్ప మరేదీ పని చెయ్యదు.అధికారంలో ఉన్నవారి పట్ల ప్రజల విధయతకి మతం,మత్తు రెండూ చాలా అవసరం!తగుమాత్రంగా ప్రయోగించి లాభం పిండుకోవాలే తప్ప బాతుని చంపే విధంగా పోకూడదు.వారికి తెలుసునని నాకు తెలుసుననుకోండి,తెలియని వారికోసం కొంచేం అసందర్భ ప్రలాపం,బోరు కొట్టిందా!


మధువు తాగినవానికి తూలుడు యెక్కువ!మధువు తాగనివానికి యేడుపు యెక్కువ!

Friday, 21 August 2015

గతితార్కికభౌతికవాదం భారతీయ కమ్యునిష్టులకి తాము పుట్టిన దేశాన్ని బద్నాం చేస్తూ చరిత్ర గురించి అబధ్ధాలు చెప్పటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాలేదు కాబోలు!

    నాకు లెనిన్ మొట్టమొదటిసారిగా యే సన్నివేశంలో నచ్చాడో తెలుసా!నిజానికి రష్యా కమ్యునిష్టు దేశంగా మారడమనేది ముందుగా ప్లాను చేసుకున్న ప్రణాళిక ప్రకారం జరగలేదు.కమ్యునిష్టు పార్టీ అనేది ఉంది,కానీ అణచివేత ప్రమాదం ఉంది గనక రహస్యంగానే పని చేస్తూ ఉండేది.ప్రజల్లో జార్ ప్రభువుల అరాచకత్వం పట్ల వ్యతిరేకత ఉంది,కానీ వాళ్ళు తిరగబడే పరిస్థితులు లేవు.అయితే హఠాత్తుగా ఒక నిప్పురవ్వ అరగిలింది - ఫ్రెంచ్ విప్లవంలో క్కూడా ఇలాగే బాస్టిల్ల్లీ కోట ముట్టడి లాంటి ఒక చిన్న సంఘటన నుంచే అంత భీబత్సమైన విప్లవం మొదలైంది!అయితే ఆ చిన్న సంఘటన యొక్క ప్రాముఖ్యతని గుర్తుపట్టి ప్రవాసంలో ఉన్న లెనిన్ శరవేగంగా అక్కడికి చేరుకుని పార్టీ సభ్యుల్ని కూడా అంత వేగంగానూ కదిలించి మొత్తం రష్యా భూభాగాన్ని కమ్యునిష్టు పార్టీ అధ్వర్యంలోకి తీసుకొచ్చి ఆ చిన్న తిరుగుబాటుని గొప్ప విప్లవంగా మార్చివేశాడు - ఒకరకంగా లెనిన్ ఆ సంఘటనని హైజాక్ చేసేసి విప్లవాన్ని స్థాపించినట్టే లెఖ్ఖ!అయితే అప్పటికే తను అన్ని రకాల ప్రణాళికలూ వేసుకుని ఉన్నాడు విప్లవం విజయవంతం కాగానే యెప్పుడెప్పుడు యేమేమి చెయ్యాలి అని.అప్పుడు చేసిన ప్రతిపాదనలలో ముఖ్యమైనది "జాతుల స్వయం నిర్ణయాధికారం" అనేది ఒకటి!దీని ప్రకారం రష్యా కూడా ఒక భాగమైన యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని పిలిచే భూభాగం మీద ఉక్రేనియన్,ఉబ్జెక్,కజాక్,అజర్బైజాన్,లిధువేనియన్,లాట్వీన్ మొదలైన ప్రత్యేక సంస్కృతులతో పరిఢవిల్లే జనసమూహాలు ఉన్నాయి.వారందరికీ మీ ప్రాంతాన్ని మీరే పరిపాలించుకోమని స్వేచ్చ ఇచ్చేశాడు.కానీ లెనిన్ ఇచ్చినా తీసుకోకుండా వాళ్ళు లెనిన్ నాయకత్వంలోనే ఉంటామని చెప్పి కలిసే ఉండిపోయారు.ఇక్కడ విశేషం యేమిటంటే యే జాతికయినా తన సంస్కృతి మీద మమకారం ఉండాలనేది లెనిన్ ఒప్పుకున్నాడు.అతనిలోని ఆ ఔన్నత్యమే ఆయా జాతుల వారినందరినీ లెనిన్ నాయకత్వానికే విధేయులై ఉండేలాగ చేసింది!మరి భారతీయ కమ్యునిష్టులు తాము పుట్టిన దేశపు సంస్కృతినే అవమానిస్తున్నారు,యెందుకు?



     ఒక చోట అన్యాయం జరిగితే స్వదేశీయుడైనా స్వజాతీయుడైనా ధిక్కరించి తీరాలి,దానిని కాదంటే కాదన్నవాడు మనిషే కాడు!ప్రతి ప్రాంతంలోనూ అక్కడి శీతోష్ణస్థితుల కనుగుణంగా వస్త్రధారణా,ఆహారపు టలవాట్లూ,ఆర్జన సాధనాలూ,ఆచార వ్యవహారాలూ ఆ ప్రాంతానికి అంటుగట్టుకునిపోయిఉంటాయి.ఆ ప్రాంతంలో క్షేమంగా బతకాలంటే విధిగా వాటిని అనుసరించాలి.ఒకవేళ అవి అనవసరమైనవి అనిపిస్తే మొత్తం సమాజం ముందు సోదాహరణంగా చెప్పి ఒప్పించటం గొప్ప విషయం,దాన్ని తప్పని యెవరూ అనరు,అనలేరు!ఒక విషయం తమకి ప్రమాదమని తెలిసినా వదలకుండా పట్టుకుని ఉండేవాళ్ళూ,ఒక విషయం క్షేమకరమని తెలిసినా తీసుకోకుండా మొండికెత్తేవాళ్ళూ యెక్కడయినా ఉంటారా చెప్పండి!ఒకరికన్నా యెక్కువగా హీనపక్షం ఇద్దరు ఒకచోట కలిసి బతకాలంటే వాళ్ళు ఒకరికొకరు హాని చేసుకుని అందరూ నశించిపోకుండా ఉండటం కోసం తప్పనిసరిగా కొన్ని నియమాలు పెట్టుకోవాలి - అవి సత్యం,ధర్మం,న్యాయం అనేవాటిని నిర్వచిస్తాయి!నియమాలు తప్పయితే అందరి అనుమతితో వాటిని సంస్కరించాలి గానీ ఒక నియమం పెట్టుకున్నాక వాటిని తప్పితే యేమవుతుంది?నువ్వు నీ స్వప్రయోజనం కోసం చేస్తే నువ్వు బలహీనుడివైతే మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా నిన్ను దండిస్తారు!నీ వ్యతిక్రమణ వాళ్ళకి నష్టం గనుక వాళ్ళు నిన్ను దండించటం న్యాయమే కదా!నీకు హాని కలిగించే విధంగా యెదటివాడు అతిక్రమిస్తే నువ్వూ వూరుకోవు గదా!దీనికోసమే రాజ్యం అనేది రంగప్రవేశం చేసింది.యెక్కడయినా రాజ్యం దండన ద్వారానే ధర్మాన్ని స్థాపిస్తుంది!నియమాలలో తప్పు ఉండి వాట్ని మార్చగలిగినవాళ్ళు సంస్కర్తలు అవుతారు.నియమాల్ని స్వప్రయోజనం కోసం ధిక్కరించటం యెప్పుడూ ఇతర్ల శ్రమని దోచుకోవటానికే జరుగుతుంది!

     యే రెండు జాతుల్ని పోల్చినా కొన్ని సారూప్యతలూ కొన్ని వైవిధ్యాలూ ఉంటాయి!యే రెండు జాతుల్ని యే విషయం ప్రకారం పోల్చినా ఆ రెంటిలో ఒకటి మెరుగ్గా కనబడటం సహజం.ఒక జాతితో పోల్చిన మరొక జాతి మెరుగ్గా కనబడితే ఆ మెరుగైన దాన్ని ఇంకొక జాతితో పోల్చినప్పుడు మూడవది ఇంకా మెరుగ్గా కనబవచ్చు - మెరుగు తరుగులు సహజం!ఈ పోలికలకి ఉపయోగిత,అంతర్గతసౌష్ఠవం,బాహ్యసంస్కారం లాంటి ధనాత్మక అంశాలనే ఉపయోగిస్తారు గనక  యెన్నింటితో పోల్చినా ఒక సంస్కృతి అన్నింటిలొనూ మెరుగే అని తేలితే ఆ సర్వోత్తమమైన జాతికి చెందిన వారు ఇతర్ల ప్రశంసలకి ఆనంద పడటం దోషమా?అహంకరించి గొప్పలు చెప్పుకోవటం తప్పు గానీ కనీసం ఆనందించటం కూడా తప్పేనా!

     "భారత్,మా జాతికి మాతృభూమి మరియు సంస్కృతం యూరప్ భాషలకు తల్లి.తత్వవిచారణలో భారతదేశమే మాకు మాతృమూర్తి.తల్లి యెలాగంటే,ఆమె యొక్క గణితమే అరబ్బుల ద్వారా మ్నకు అబ్బింది.బుధ్ధుడి ద్వారా క్రైస్తవంలో ఆదర్శాలను ఏర్పరిచింది.గ్రామస్వరాజ్యం,స్వయంపాలన,ప్రజాస్వామ్యం నేర్పిన తల్లి భారతదేశమే.అందుకే తల్లి భారతి మనందరికీ అనేక విధాలుగా అమ్మ" అని విల్ డురంట్ అనే అమెరికన్ చరిత్రకారుడు ప్రశంసించాడు!"భారతదేశం, మానవజాతికి ఊయెల,మానవజాతి వాక్కుకి జన్మస్థానం,చరిత్రకి తల్లి,వీరత్వానికి బామ్మ,సంప్రదాయానికి జేజెమ్మ.మానవజాతి చరిత్రలో అత్యంత విలువైన,మరియు అత్యంత వివరణాత్మకమైన విషయాలన్నీ భారతదేశమందే పోగు చేయబడి ఉన్నాయి." అని మార్క్ ట్వెయిన్ అనే అమెరికన్ రచయిత ప్రశంసించాడు!"మానవుడు,తన ఉనికి గురించి కన్న కలలు మొదలుకొని అన్ని కలలను సాకారం చేసుకునేందుకు ఈ ప్రపంచంలో ఆశ్రయం కల్పించిన ప్రదేశం ఏదైనా ఉందంటే, అది కేవలం భారతదేశం మాత్రమే" అని రోమైన్ రోలాండ్ అనే ఫ్రెంచి పండితుడు ప్రశంసించాడు!మరి మన వెధవాయలు యేం చేస్తున్నారు?అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కానివాళ్ళకి కంచాల్లోనూ పెట్టటం లాంటి నికృష్టానికి తెగబడ్డారు!

     యే రెండు జాతుల మధ్యనయినా ఆదానప్రదానాలు సహాయం,వ్యాపారం,యుధ్ధం అనే మూడురకాలుగా ఉంటాయి.యే పధ్ధతిలో జరిగినా ఒకరికి లాభం ఒకరికి నష్టం తప్పకుండా ఉంటాయి!సహాయంలో కూడా మన దగ్గిర ఉన్నది యెదటివాడికి ఇవ్వడం అనేది నష్టమే,కానీ యెదటి వ్యక్తి పట్ల ఉన్న అభిమానం వల్ల మనము దాన్ని నష్టం అనుకోము.మన దేశాన్ని తిడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడికి మరొక దేశమేదో గొప్పగా నచ్చేసిందని అర్ధం చేసుకోవాలి - యేదో ఒకరోజున ముసుగు విప్పేసి బైటపడతాడు గూడాను!ఒకవేళ వాడికి నచ్చిన దేశం మన దేశం మీద దాడి చేస్తే యేం చేస్తాడు?ఆ దేశమే గెలవాలని కోరుకుంటాడు గదా!అది దేశద్రోహం కాదా?

     వాళ్ళ దగుల్బాజీతనానికి మెచ్చుతునకైన ఒక వుదాహరణ చెప్తాను.అయోధ్యలో  రామజన్మభూమి వివాదాన్ని విచారిస్తున్న న్యాయమూర్తులకి "అసలు హిందువులు క్లెయిం చేస్తున్నట్టు మసీదు కింద హిందూ కట్టడం యేదయినా ఉందని ఆధారాలు ఉన్నాయా" ఒక సాంకేతికపరమైన సందేహం వచ్చి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వార్ని సంప్రదిస్తే వారు అన్ని పరిశీలనలూ జరిపి సాక్ష్యాధారాలతో సహా మసీదు కింది పొరల్లో ఒక హిందూ ఆలయం ఉందని నిర్ధారిస్తే ముస్లిములు దాన్ని యేకపక్షమైన రిపోర్టు అంటూ 8మంది "ఎమినెంట్ ప్రొఫెసర్ల"ని సాక్ష్యానికి తీసుకొచ్చారు.ఈ "ఎమినెంట్ ప్రొఫెసర్ల"లో 6గురు హిందువులు?!చూడండి మమ్మల్ని హిందువులు కూడా సమర్ధిస్తున్నారు అని చెప్పుకోవటానికి అమాయకంగా తెచ్చారో యెత్తుగదతో తెచ్చారో గానీ వారు పేరుకే హిందువులు!హిందువులనే పేరుతో ముస్లిములు సాక్ష్యానికి తెచ్చిన మేతావులు యేనాడూ అయోధ్యలో అడుగు పెట్టకుండానే యే తవ్వకాలూ జరపకుండానే యే పరిశోధనలూ చెయ్యకుండానే ASI చేసిన పరిశోధన యేకపక్షం అని మీడియాలో గోల చేసిన వాళ్ళు కోర్టు విచారణలో తెల్లముఖాలు వేశారు,యెందుకో తెలుసా!అక్కడి లాయర్లు కోర్టులకి కావలసింది నమోదు చేసుకోవటానికి పనికొచ్చే గట్టి సాక్ష్యాలు గానీ వీళ్ళు మీడియా ముందు వాగటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని సొల్లుకబుర్లు కాదని తెలిసినవాళ్ళు గనక  వాళ్ళు చెప్పిన విషయాల గురించి అడిగిన ప్రశ్నలకే సరయిన సమాధానాలు చెప్పలేక సాక్ష్యాధారాలు చూపించలేక చివాట్లు తిని చెవులు దులుపుకుని పోయారు - సిగ్గు పడ్డారో లేదో తెలియదు!వీళ్ళుట "ఎమినెంట్ ప్రొఫెసర్లు"ట?!

     ఇదొక్కటే అయితే జన్మానికొకసారి పొరపాటు పడ్డారు పోనీలెమ్మని అనుకోవచ్చు,ప్రతి విషయంలోనూ ఇట్లాగే ప్రవర్తిస్తున్నప్పుడు వీళ్ళ నిర్వాకాల్ని తెలిసి కూడా బైటపెట్టకపోతే చరిత్ర క్షమిస్తుందా మనల్ని?బుధ్ధుడు మహాశాంతిమూర్తి,మహావీరుడయితే లోకోత్తరుడే అని ప్రచారం చేసి హిందూమతం ఈ  రెండు మతాల ధాటికి తట్టుకోలేక విలవిలలాడిపోయిందనీ దుర్మార్గంగా ఈ రెంటినీ దేశం నుంచి తరిమికొట్టి గానీ మళ్ళీ పూర్వపు వైభవానికి రాలేకపోయిందని యెన్ని కబుర్లు చెప్తున్నారు?బౌధ్ధమూ జైనమూ బ్రాహ్మణ మతానికి పూర్వం ఉన్న స్వచ్చమైన హిందూమతం అని ఒకసారీ అబ్బెబ్బే హిందూమతానికీ ఈ రెంటికీ పోలికే లేదు వీటిలో ఉన్నదంతా కొంగొత్త భావధార అని ఒకసారీ  అనేవాళ్ళు సత్యసంధులా?

     ఇవ్వాళ కనిపిస్తున్న జైనులు అహింసామూర్తులే,సందేహం లేదు!కానీ వారి 24 తీర్ధంకరులలో నలుగురు చక్రవర్తులు?!చక్రవర్తులు కావాలంటే యుధ్ధాలు చేయాలి,ఇతర రాజ్యాల్ని గెలవాలి!మరి,యే ఒక్క శత్రుసైనికుణ్ణీ చంపకుండానే యుధ్ధాలు గెలుస్తారా?కేవలం ఈ నలుగురు తీర్ధంకరులు మాత్రమే కదా చక్రవర్తులు అని మీరు అనుకుంటే తప్పులో కాలేసినట్టే,తీర్ధంకరులలో క్షత్రియులు కానివారు యెందరున్నారో చెప్పమనండి యే జైన మతస్థుదినైనా!క్షత్రియుడైన ప్రతివాడికీ యుధ్ధం చెయ్యటం విధి - యుధ్ధాలు గెలిస్తేనే కదా రాజయ్యేదీ ఆ తరవాత చక్రవర్తి అయ్యేదీ - మరి హింస లేని యుధ్ధం ఉంటుందా!జైనుల మొదటి తీర్ధంకరుడైన రిషభదేవుని పెద్ద కుమారుదు భరతుడు మొదటి చక్రవర్తి.ఇతని పేరుతోనే మన దేశం భరతఖండం అయిందని హిందూ జైన పురాణాలు రెండూ అంగీకరిస్తున్నాయి!

     మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు జైనమతస్థుడే!నిజానికి మగధను పాలించిన చాలా వంశాలకు సంబంధించిన రాజులంతా అవైదిక మతాలైన జైన/అజీవక సంప్రదాయాల్ని పాటించారు!ఈ చంద్రగుప్తుడి కాలంలోనే అలెగ్జాండరు మన దేశం మీదకి దండెత్తి వచ్చాడనీ పురుషోత్తముణ్ణి చీకటి మాటున నది దాటి వచ్చి గెలిచాడనీ గెలిచాక సెల్యూకస్ అనేవాణ్ణి తన ప్రతినిధిగా ఇక్కడ ఉంచాడనీ చెప్పే విషయాలు అన్నీ అబధ్ధాలే!ఈ మౌర్య చందర్గుప్తుడి కాలంలో సెల్యూకస్ వచ్చి ఇతని చేతిలో ఓడిపోయి తన కూతురు హెలీనాని ఇతని కిచ్చి పెళ్ళి చేసి వెనక్కి వెళ్ళిపోయాడు.

     మనకి అశోకుడి గురించి ఇప్పుడు వినపడుతున్న విషయాలు కూడా చాలామటుకు రూఢిగా నిర్ధారణ కానివే అయినా ప్రామాణికమైన చరిత్రగా పరిగణించి పాఠ్యపుస్తకాల్లోకి కూడా యెక్కించేశారు!అశోకుడు కళింగ యుధ్ధం తర్వాత అక్కడి భీబత్సానికి మనసు చెదిరి పశ్చాత్తాప పడి బౌధ్ధమతాన్ని అనుసరించాడనేటందుకు కూడా విరుధ్ధంగా కనబడేవి బౌధ్ధ మత సాహిత్యంలోనే ఉన్నాయి.అశోకుడి గురించి చెప్పటానికి బౌధ్ధులు రచించిన "అశోకవదన" అనే గ్రంధంలో ఒక భాగం అశోకుడు తను హింసిస్తున్న ఒక బౌధ్ధసన్యాసి యొక్క సహనశీలత్వాన్ని చూసి పరిశుధ్ధుడు అయ్యాడు అని వ్యాఖ్యానిస్తుంది.అప్పటివరకూ యెన్నో యుధ్ధాలు చేసిన వాడు,పైగా అతని క్రూరత్వం వల్ల చండాశోకుడు అని కూడా వర్ణించబడిన వాడు ఆ ఒక్క యుధ్ధంలో ఒక్కసారిగా పశ్చాత్తాప పడిపోయాడంటే నమ్మాలా?ఈ బుధ్ధ భిక్షువుని హింసిస్తూ వుండగా మారటం అనే కధ కూడ గట్టి సాక్ష్యాలు లేనిదే!పోనీ తన 13వ శిలాశాసనం ప్రకారం "దేవానాం ప్రియుడు ఇక యుధ్ధాలు చెయ్యడు" అని చెప్పుకుని పూర్తిగా అహింసాయుతంగా ఉన్నాడనేటందుకూ ఆధారాలు లేవు.అదే అశోకవదన గ్రంధంలో ఒకచోట అశోకుడి క్రూరత్వాన్ని గురించి చేప్పే మరొక కధ వుంది.ఒక జైనసాధువు గౌతమబుధ్దుడు తమ దేవుడి ముందు మోకరిల్లినట్టుగా ఒక బొమ్మ వేస్తే ఒక బౌధ్ధ శ్రమణుడు అశోకుడికి విన్నవించుకున్నాడట.దానికి అశోకుడు వేసిన శిక్ష - మొత్తం 18,000 మంది జైనుల్ని అజీవకుల్ని మరణశిక్ష విధించి చంపెయ్యటం!బౌధ్ధులు అమాయకులే అయి ఉండవచ్చు, యేదో తమ మనోభావాలకి భంగం కలిగిందని రాజుని వేడుకుంటే రాజు చేశాడని సరిపెట్టుకోవడానికీ కుదరదు!ఈ అశోకుడే చనిపోయేటప్పుడు కొంత సొమ్మ్ముని దానంగా వ్రాయించి అప్పటికి ఇవ్వకుండా మరణించాడు.అతని తర్వాత రాజ్యానికి వచ్చిన అశోకుడి మనుమడు సంప్రాతి మొదట దాన్ని చెల్లించి గానీ సింహాసనం యెక్కలెకపోయాడు - అదీ బౌధ్ధుల శ్రమణత్వం!

     వీళ్ళు హిందూమతాభిమాని అయిన పుష్యమిత్రుడు బౌధ్ధాన్ని క్రూరంగా అణిచివేశాడు అని ఆరోపిస్తున్న విషయం కూడా అశోకవదన గ్రంధం లోనిదే!పుష్యమిత్రుడి కన్నా ముందు వీళ్ళంతా ఉదారుదని పొగుడుతున్న అశోకుడు కూడా బౌధ్ధుల్ని సంతోషపెట్టటానికి జైనుల్ని హింసించాడు కదా!అక్కడ అశోకుడూ జైనసాధువు తల నరికి తెస్తే తలకి 1 బంగారు నాణెం ఇస్తానని ప్రకటించాడు,ఇక్కడ పుష్యమిత్రుడూ బౌధ్ధబిక్షువు తల నరికి తెస్తే తలకి 100 బంగారు నాణాలు ఇస్తానని ప్రకటించాడు - యేమిటి తేడా?!!అయినా ఇలాంటి ఒకేఒక్క సంఘటనతో యే మతమూ తుడిచిపెట్టుకు పోదు.బౌధ్ధం,జైనం - ఈ రెండు మతాలూ అవి తొలిసారి ప్రాచుర్యం లోకి వచ్చిన కాలంలో సామాన్యులకి అసలు గుర్తింపు లేదు.యే మతం ప్రాచుర్యంలోకి రావాలన్నా రాజాశ్రయం పొంది రాజమతంగా గుర్తింపు పొందటం తప్పనిసరి!ఒకసారి రాజు ఒక మతాన్ని రాజమతంగా ఒప్పుకున్నాడంటే ఖజానాలో సింహభాగం వాళ్ళ పరమైనట్టే!రాజుకి వీళ్ళ ప్రవచనాల ద్వారా ప్రజల్లో తనపట్ల విధేయత ఉండే సౌకర్యం ఉంటుంది - ఇచ్చి పుచ్చుకోవడం!

     ఒక రాజ్యంలో ఒక రాజు ఇట్లా చేసినంత మాత్రాన ఉపఖండం అని పిలవదగినంత పెద్ద దేశంలో వీళ్ళొక్కళ్ళేనా ఉన్నది - మిగతా చోట్లకి పోవచ్చును గదా?అసలు యెప్పుడో ఒకసారి జరిగే ఇలాంటి చెదురు మదురు సంఘటనల వల్ల యే మతమూ ఒక్కసారిగా తుడిచిపెట్టుకు పోదు.జైనం అశోకుడు చేసిన ఆ ఒక్క సంఘటనతో తుదిచిపెట్టుకు పోయిందా,లేదే?బౌధ్ధం పుష్యమిత్రుడు చేసిన ఆ ఒక్క సంఘటనతోనే హఠాత్తుగా తుడిచిపెట్టుకుపోయిందా,లేదే!ఒక మతం రాజమతం హోదాను తెచ్చుకోవాలన్నా మరో మతం ఆ హోదాని ఆక్రమించాలన్నా దానికో పధ్ధతి ఉండేది - విద్వత్సభలు జరుగుతాయి.రాజే యేర్పాటు చేస్తాడు అప్పుడు రాజమతం కానివాళ్ళలో యెవరయినా అన్యమతస్థులు కోరుకుంటే!ఆ వాదనలో యెవరు గెలిస్తే రాజు ఆ మతాన్ని రాజమతంగా చేసి ప్రోత్సహించాలి అనే నిబంధన ఉండేది.రాజుకి ఒక మతం పైన మక్కువ ఉండి అందులో పాండిత్యం కూడా ఉంటే ముందు రాజునే మెప్పించాల్సి ఉంటుంది విద్వత్సభకి వెళ్ళేకన్నా ముందు!

     ఒకానొకప్పుడు మిధిలరాజు ఉశీనరుడు సర్వ బౌధ్ధమత సిధ్ధాంతాలనీ విమర్సిస్తూ ఉండేవాడు,అయితే ఆయనంతట ఆయన వాని విమర్సకి పోడు,ఎవరైనా అర్హతులు వెళ్ళి ఆయన్ని కదిలిస్తే మాత్రం ఆయన చేసే వాదనలకి సమాధానం చెప్పలేక నిరాశతో వెనుదిరిగి పోయేవారు.బౌద్ధమతము యొక్క ప్రధమ సిద్ధాంతము కార్యకారణ చక్రము. అజ్ఞానము క్రియగా పర్యవసించును. అది విజ్ఞానమగును. నామరూపములు వహించును. షడింద్రియములు, స్పర్శ, అనుభూతి, ఆశ, గ్రహణము, పరిణామము, జన్మము, దుఃఖము – నిట్లు మారుచుండును. దుఃఖమును చంపినచో అజ్ఞానము నశించునని వారి ప్రధమ సిద్ధాంతము. దీనిని బౌద్ధులయిన అర్హతులు చెప్తే విని ఉశీనరుడు చిరునవ్వు నవ్వుతాడు.కొంత చమత్కారంగా ఒక ఉదాహరణ చెప్తాడు. మొట్టమొదట జిహ్వ మీద రుచి అనేది ఉన్నది కనుక కూర చేసుకోవాలి అనే సంకల్పం పుడుతుంది. దానినుండి ఒక శాకము, దానిని ముక్కలుగా తరుగుట, కడుగుట, వేడి చేయుట, తిరుగమూత, లవణాది మిశ్రమమును కలుపుట, – యివన్నీ పుట్టాయి. జిహ్వయందలి రుచి నుంచి యివన్నీ పుట్టాయి. కాబట్టి లవణాది మిశ్రమమును తొలగించినచో రుచి నశించును. – ఈ వాదన విని చర్చకు వెళ్ళిన అర్హతుడు వెలతెల పోతాడు.అయితే ఇలా హాస్యంగా తేల్చేయడం సరైన వాదనా పధ్ధతి కాదని అంటూనే కాని ప్రతిస్పర్ధి యొక దుష్టసిద్దాంతమును ప్రతిపాదించి నపుడు, పాత వస్తువునే కొత్తవస్తువుగా దీపింపచేయబోయినపుడు పండితుడైన వాడేమి చేస్తాడు? అని అడుగుతారు.“అజ్ఞానము, కర్మ, దుఃఖము యివన్నీ వేదాల్లో వున్నాయి. ఉపనిషత్తులలో వున్నాయి. శాస్త్రాల్లో, పురాణాలలో వున్నాయి. అవి ఏవో కొత్త విషయాలుగా అర్హతులు తెచ్చి ఉశీనరుడి దగ్గర చెప్తే మరి అతనేం చేస్తాడు?” అని ప్రశ్నిస్తాడు.

     7వ శతాబ్దంలో తమిళ దేశానికి చెందిన కూన్ పాండియన్ అనే తమిళ ప్రభువు ఇదే పధ్ధతిలో హైందవం నుంచి జైనం లోకి మారాడు.అయితే అతని భార్యకి ఇది నచ్చక తిరు గ్యాన సంబంధార్ అనే పందితుణ్ణి ప్రేరేపించి వాదనకి తీసుకొచ్చింది.ఆయన వాదనలో గెలిచి మళ్ళీ రాజుని హైందవం లోకి తీసుకొచ్చాడు.బౌధ్ధం,జైనం రెండూ స్థూలంగా అహింసని ప్రముఖంగా చెప్పేవి అయినా సూక్ష్మమయిన భెదాలు ఉన్నాయి.వాటిని బట్టి చూస్తే అసలు అశోకుడు పూర్తిగా బౌధ్ధంలోకి మారాడా అనేది కూడా నిర్ధారణగా చెప్పలేము.బౌధ్ధులు అహింసని ప్రచారం చేసినా మాంసాహారాన్ని వర్జించలేదు,బుధ్ధుడు మహాసమాధికి ముందు తెసుకున్నది మాంసాహారమే!కానీ జైనులు పూర్తిగా శాకాహారులు.అశోకుడి శిలాశాసనాల్లో ఆహార విహారాదులకి సంబంధించిన సూచనలలో జైనుల మాదిరి శాకాహారాన్ని గురించి ప్రస్తుతిస్తూ ఉన్నాయి!బౌధ్ధ మతం పూర్తిగా రాజాశ్రయం మీదనే ఆధారపడటంతో ఆ రాజాశ్రయం పోగానే క్రమంగా అంతరించి పోయింది.జైనులు రాజాశ్రయానికి దూరంగా ఉండటం వల్ల అంత ప్రభావశీలంగా యెప్పుడూ లేకపోయినా పూర్తిగా నశించిపోకుండా ఉండగలిగారు.ఇవి నిజమైన చరిత్ర సాక్ష్యాధారాలతో చెప్తున్న సత్యాలు.కాబట్టి హిందువులు ఇకనుంచీ పైత్యకారి కమ్యునిష్టులు హిందూమతం బౌధ్ధాన్నీ జైనాన్నీ క్రూత్రంగా అణిచేసింది అని కూస్తే నిజమేనని నమ్మేసి సిగ్గుతో తల దించుకోవాల్సిన పని లేదు!

     నిజంగా మన సంస్కృతిలో దోషముంటే విమర్శించినా అర్ధం ఉంది,ఒకరోజు కాకపోతే మరొకరోజయినా విన్నవాడు ఆ విమర్శలోని నిజాయితీని గుర్తించే అవకాశం ఉంటుంది!ఒక దేశపు చరిత్రని అబధ్ధాలతో నిర్మించి అబాసుపాలు చెయ్యడమనేది స్వదేశీయుడు చెయ్యడం యెంత ఘోరం?బహుశా పాపపుణ్యాలు లేవని చేప్పే హేతువాదాన్ని నమ్మడం వల్ల గానీ లేకపోతే ఆ గిల్ట్ మనసులో తొలచడం మొదలెడితే ఒక్క రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేరు గదా! 

స్వజాతిద్రోహం చేసి తలుపులు తెరిచిన వాణ్ణి వీడు ప్రేమించే విజాతివాడు గెలిచాక దగ్గిరకే రానివ్వడు?!

Sunday, 16 August 2015

ఈ దేశం యెందుకు విడిపోయింది?ఈ దేశం విడిపోయి యేమి సాధించింది!

 1947 ఆగస్ట్ 15వ తేదీన శతాబ్దాల దాస్యశృంఖలాలు విడిపోయాయనీ ఈ దేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించిందనీ కొందరు పండుగలు చేసుకుంటుంటే మరికొందరు జన్మభూమిలో నిరాశ్రయులై ఇకనుంచీ అదే మీ కర్మభూమి అని నాయకులు చెప్తే అమాయకంగా నమ్మి అన్యభూమికి తరలి వెళ్ళే ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దయనీయమైన విషాదయాత్రలో మునిగిఉన్నారు!
అప్పటివరకూ యేకజాతిగా ఆంగ్లేయుల మీద తనుమనఃప్రాణధనాలన్నింటినీ తృణప్రాయంగా త్యజించి సంఘటితంగా పోరాడిన చరిత్రని మర్చిపోయి తమ సౌభ్రాతృత్వానికి తిలోదకాలిచ్చి కేవలం అర్ధశతాబ్ది కాలంలోనే రెండు జాతులుగా విడిపోయి సరిగ్గా పరాధీనత నుంచి బయటపడే ఆనందకరమైన సన్నివేశంలోనే ఈ ఉపఖండం రెండుగా చీలిన వేళ తుఘ్లక్ విదూషకత్వాన్ని మరిపించేలా 10 మిలియన్లకి పైగా బీదా బిక్కీ తమ కొంపా గోడూ వదిలి కట్టుబట్టలతో ప్రపంచ మానవాళి చరిత్రలోనే యెక్కడా కనీ వినీ యెరుగని వలసని మొదలుపెట్టారు!
ఆ మహాభయంకరమైన వలసలో అంత సుదీర్ఘమైన మరింత కష్టతరమైన ప్రయాణాన్ని భరించలేక మరణించిన వాళ్ళు గానీ,అసహనం నుంచి పుట్టిన క్రోధం మనుషుల్ని పశువులుగా మార్చివేస్తే చెలరేగిన అల్లర్లలో చంపబడిన వాళ్ళు కానీ 1 మిలియన్ నుంచి 2 మిలియన్ల వరకు ఉండవచ్చు!యెక్కడికక్కడ పురుగుల్లా రాలిపోతున్న కాలంలో ఖచ్చితమైన లెఖ్ఖలు దొరకవు - ఉజ్జాయింపు లెఖ్ఖలే ఇంత దారుణంగా ఉంటే నిక్కచ్చిగా లెఖ్ఖలు తీస్తే భరించగలమా!కేవలం హత్యలే అయితే కొంచెం నయం,మానభంగాలకు గురైన స్త్రీల సంగతి తల్చుకుంటే మానవత్వం ఉన్నవాళ్ళు వినడానికే అసహ్యం వేసే దారుణాలు జరిగినాయి! 
తన వల్ల జరిగిన యుధ్ధంలో లక్షమంది మరణించినందుకే చండాశోకుడు యుధ్ధాలకి సెలవిచ్చి శాంతిమార్గం పట్టి ధర్మాశోకుడుగా మారాడు,మరి అప్పటి నాయకులు యెట్లా తట్టుకోగలిగారు?వారికేం వారు చాలా హాయిగా ఉన్నారు!హిందువుల వైపున గానీ ముస్లిముల వైపున గానీ ధనవంతు లెవరూ తరలిపోలేదు,వెళ్ళినా గొప్పగానే బతికారు!యెటొచ్చీ రాజకీయనాయకులకి ఓట్లు వెయ్యటానికీ వారికి రాజకీయ వైభవాలు దక్కించటానికీ తప్ప్ప యెందుకూ పనికిరాని అలగాజనమే వెళ్ళారు,వెళ్తూ వెళ్తూ నడవలేక చచ్చారు!
వీళ్ళంతా యెందుకిలా కాళ్ళీడ్చుకుంటూ నడ్వటం రైళ్ళలో సుఖంగా పోవచ్చుగా అనుకుంటే వాటి పరిస్థితి ఇలా ఉంది!దీనికి తోడు క్రూరత్వం కొద్దీ తాము చంపిన వాళ్ళని రైళ్ళలో కుక్కి పంపించిన శవాల రైళ్ళ కధ కూడా సమాంతరంగా నడిచింది!
నేను పుట్టడానికి పదేళ్ళ ముందు జరిగిన దారుణాన్ని కేవలం బొమ్మలుగా చూసినందుకే ఇవ్వాళ ఇంతగా చలించిపోతున్నాను - ఒకనాడు అసహాయులైన నా దేశపు సామాన్య ప్రజలకి ఎంతటి నికృష్టమైన పరిస్థితి దాపురించింది?!ఏ కాలం లోనూ ఏ ప్రాంతం లోనూ కనీసపు మానవత్వం ఉన్నవాడెవ్వడూ చూడగూదని హృదయవిదారకమైన దృశ్యమిది!గుండెలు చిక్కబట్టుకుని వినండి పగవాడికి గూడా కోరుకోగూడని దౌర్భాగ్యకరమైన సన్నివేశమిది!అక్కడొక ముసలి మనిషి చావుబతుకుల్లో ఉన్నాడు.నడక మొదలుపెట్టి యెన్ని రోజులైందో గానీ ఇక నడవలేక ఆయువు కూడా హరించుకుపోతున్నదని తెలిసి చావు కోసం యెదురు చూస్తున్నాడు.పక్కనున్నది ముసలి భార్య,మనవళ్ళూ,మనవరాళ్ళూ - వాళ్ల కళ్లల్లో దుఃఖం లేదు, కదూ!తొందరగా చచ్చిపోతే బాగుణ్ణు మళ్ళీ నడక మొదలుపెదదాం అనే యెదురుచూపు ఉంది,నిజం?!యెంతసేపు యేడ్చినా పోయినవాడు తిరిగిరాడు,నడకలో వెనకబడితే చీకటి పడేసరికి తలదాచుకునేటందుకు దిట్టమైన చోటు దొరకదు మరి?
యెవరి సురుచిరసుందరభవిత కోసం స్వాతంత్ర్యాన్ని సాధిస్తామని ఆశలు రేకెత్తించి ప్రశాంతంగా ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్లని కూడా వీధుల్లోకి తీసుకొచ్చి ఉద్యమాలు చేయించారో తమ అవివేకపు రాజకీయాల ఫలితమైన విభజనకి అసంఖ్యాకులైన సామాన్యప్రజల నిండు జీవితాలు అగ్నికీలలకు ఆహుతవుతున్నా తన కుటుంబపు భావి వంశపారంపర్యవైభవాల్ని తలుచుకుని కాబోలు మందస్మితవదనారవిందుడై ఆంగ్లేయప్రభువులతో కరచాలనం చేస్తున్నాడు స్వతంత్రభారతప్రప్రధమప్రధాని!ఈ మనిషి పదవి నలంకరించిన యేదాది లోపునే దేశం మొత్తం అశాంతితో రగిలిపోతుంటే తీరికగా ఇంగ్లాడు దేశపు రాజుని ఇంకా వారి అధీనంలో ఉన్న ఒక సామంతుడు చక్రవర్తిని సంబోధించే పధ్ధతిలో "Your Highness" అని సంబోధిస్తూ తన ఇష్టసఖి యొక్క భర్తగారికి వారు భారతదేశానికి చేసిన గొరుగుడు సేవకి మెచ్చి కాబోలు "సర్" బిరుదు నిచ్చి సత్కరించమని కోరుకుంటూ మహజరు పంపుకున్నాడని యెంతమందికి తెలుసు?ఆ ఇంగ్లాడు రాజే రాణిగారి మొగుడు అని తప్ప సొంత రాజరికం లేని పెట్టమారి మొగుడు!ఆ రాణీ పేరుకే రాణీత్వం తప్ప అధికారాలు లేని వూగొట్టిన నాగటిదుంప - అంత తెలివైన వాడు ఈ పండిట్ బిరుదాంకితుడు?!ఇంకా నయం, ఇంకొంచెం పత్తిత్తు తెలివి చూపించి ఆ ఉత్తరం  చర్చిలు మహాశయుడి లాంటి అన్ని అధికారాలూ ఉన్న అప్పటి ప్రధానికి పంపించాడు గాదు,అప్పటికే గాంధీని నేకెడ్ పకీరు అనేసిన భారతద్వేషి "ఇదుగోనయ్యా చూడండి భారత దేశ ప్రధాని యెంత పిచ్చిపుల్లయ్యో?!" అని ప్రపంచవేదిక మీద అప్పుడే మన పరువు గంగలో కలిపి ఉండేవాడు.

అసలు స్వతంత్రం వచ్చేనాటికి ఉపఖండం విడిపోవటానికి బీజం 1905లో లార్డ్ కర్జన్ అనే దుర్జన ప్రభువు చేసిన బెంగాలు విభజన నాడు మొలకెత్తింది.ప్రపంచంలోనే పరమ భయంకరమైన బెంగాల్ కరువు కూడా ఈ దుర్జనుడి పుణ్యమే!!బుధ్ధిమంతులైన నాయకులు రకరకాల కారణాలతో పక్కకి తప్పుకోగా మిగిలిన నాయకుల బుధ్ధిశూన్యత వల్ల అప్పుడే అణగారిపోవాల్సిన విషబీజం కాస్తా ఇంతింతై వటుడింతయై అన్నట్టు పెరిగి 1945 నాటికి పీకిపారెయ్యలేని విషవృక్షమై కూర్చుంది!

నిజానికి పరిపాలనా సౌలభ్యం కోసం చేశాడే తప్ప అతనికి దురుద్దేశాలు లేవని కొందరు వాదిస్తున్నప్పటికీ ప్రజల్లో అప్పుడున్న మానసిక స్థితి వల్ల అది సృష్టించిన భీబత్సం వాళ్ళ ప్రభుత్వాన్నే కూల్చడానికి కారణమైన విప్లవ బీజాలు నాటింది!సాటి ముస్లిము రైతులకి తమ భూముల్ని కౌలుకిచ్చి ప్రశాంతంగా బతుకుతున్న హిందువులకి విభజన తర్వాత బీహారీల ప్రాబల్యం పెరిగి ఇబ్బందికి గురయ్యారు.అదీగాక అప్పటికే తాము ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ప్రతీకారంగా చేశారనే భావం బలపడి మరింత బలంగా ఉద్యమాన్ని దేశమంతటికీ పాకించారు!తర్వాత కాలంలో దేశమంతటినీ ఉర్రూత లూగంచిన "వందే మాతరం" నినాదం ఈ సమయంలోనే తొలిసారి దాని శక్తిని చూపించింది!దీనినుంచి పుట్టిన భావావేశంలో దేశభక్తీ మతాభినివేమూ కలగలిసిపోయి యువకుల్లో వెర్రి ఆవేశాన్ని పుట్టించి జుగాంతర్ లాంటి రహస్య తీవ్రవాద సంస్థలు యేర్పడి బహిరంగ స్థలాల్లో బాంబులు పేలుస్తూ బ్రిటిష్ అధికార్లని చంపటం వరకూ చాలా భీబత్సాలు జరిగాయి!

ఈ ఉద్యమంలో అనుకోకుండా హిందూ మతానికి సంబంధించిన పౌరాణిక గాధల నుంచి వచ్చిన ప్రతీకలు అతిగా ముందుకు రావటం,ఆంగ్లేయుల నుంచి అధికారాన్ని బదలాయించుకోవడం అనే అప్పటి ఎలైట్ గ్రూపుల వ్యక్తిగత ప్రాబల్యాల రాజకీయ క్రీడలో హిందూమహాసభ హిందువుల రాజకీయ ప్రాధమ్యాన్ని పెంచే విధంగా తీర్మానాలు చెయ్యటం,ఉద్యమధాటికి భయపడి ఆంగ్లేయులు దిగివచ్చి చేసిన సంస్కరణలు హిందువులకే యెక్కువ అనుకూలంగా ఉండటంతో ముస్లిం ఎలైట్ గ్రూపులు కూడా జాగరూకులై ముస్లిం లీగ్ యేర్పాటు చేశారు!"హోమ్ రూల్" గర్జనతో అప్పటిదాకా శాంతమార్గంలో పోరాడుతున్న మిగిలిన వారందరికన్నా ఆవేశపూరితుడైన దేశభక్తుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మహమ్మదాలీ జిన్నా 1930 కల్లా ద్విజాతి సిధ్ధాంతాన్ని తలకెత్తుకోవటమే కాకుండా 1940ల నాటికి పాకిస్తాన్ కోసం వాదిస్తూ అందరూ యెవరి రహస్య ఎజెండాతో వారు హడావిడి పడి చేసిన విభజన కిరాతకంలో తన వంతు పాత్రని మాత్రమే పోషించినా ఇక్కడ అధికారంలోకి వచ్చిన వారి చాతుర్యం వల్ల ఈ దేశంలోని కొందరు ఆవేశపరులైన జాతీయవాదుల దృష్టిలో విభజనకి మొత్తం అతడే బాధ్యుడని నిందించేటంతగా అపార్ధానికి గురయ్యాడు!

ఆంగ్లేయుల మీద పోరాడుతూ జైళ్ళకు వెళుతున్న హిందువులకి విరుధ్ధంగా ఆంగ్లేయులతో సహకరిస్తూ మరింత ప్రయోజనం సాధించాలనేది వీరి వ్యూహం!అందులో కొంతమేరకు విజయం సాధించారు కూడా!నిజానికి బెంగాలు విభజనలో ఉన్న అసలు మెలిక 1857 తిరుగుబాటులోనూ 1878 నుంచి 1880 వరకూ షేర్ అలి ఖాన్ నాయకత్వంలో ఆఫ్ఘన్ భూబాగంలో ఆంగ్ల ప్రభుత్వం మీద జరిగిన యుధ్ధంలోనూ వీరోచితంగా పోరాడిన ముస్లిములని భారతరాజకీయసామాజికప్రధానజీవనస్రవంతి నుంచి వేరు చెయ్యడానికే జరిగినా తొలిదశలో ప్రజల నుంచి పుట్టిన నిజాయితీ గల ప్రతిస్పందన వల్ల అది ఫలించకపోయినా మలిదశలో దూరదృష్టి లేని నాయకుల అవివేకపు పోకడల వల్ల పరిస్థితి ఆంగ్లేయుల రాజనీతి కనుకూలమైన మలుపు తిరిగింది!

అప్పటి రాజకీయ సామాజిక పరిస్తితి యెలా వుందంటే ఇప్పటి లాగే అప్పుడూ రాష్ట్రాలు ఉన్నాయి గానీ మూడు రకాలుగా ఉండేవి.మొదటి రకం:పూర్తిగా ఆంగ్లేయుల అధీనంలో ఉన్నవి.రెండవ రకం:పూర్తిగా ప్రాచీనకాలపు రాజవంశాలకు చెందిన వారైన రాజుల జమీందారల యేలుబడిలోని రాష్ట్రాలు - వీటినే సంస్థానాలు అని కూడా అంటారు.మూడవ రకం:ఈ రెండు వర్గాల మిశ్రమ అధికారంలో ఉన్నవి.కాంగ్రెసు,హిందూ మహాసభ,ముస్లిం లీగ్ లాంటి సంస్థలన్నీ ఆయా వర్గాల లోని విధ్యాధికులు తమని తాము ఎలైట్ అని పిలుచుకుంటూ తమ వ్యక్తిగత ప్రాభవాల కోసం రకరకాల సిధ్ధాంతాలని వల్లెవేసే కుహనా మేధావుల గుంపు తప్ప విశాలప్రజాప్రయోజనం గురించి నిజాయితీగా ఆలోచించిన వాడు ఒక్కడూ లేడు - ఇది నేను వారందరి వ్యక్తిత్వాల్నీ పరిశీలించి చెబుతున్న అక్షరసత్యం!అందుకే మనం గొప్పగా జరిగిందని చెప్పుకునే గుండ్రబల్ల ముచ్చట్ల బేరసారాల ప్రక్రియ ద్వితీయ స్వాంతర్య పోరాటంగా గుర్తింపు పొందింది,సజావుగా జరగాల్సిన ఉపఖండ విభజన అంత దరిద్రంగా తగలడింది?!

మోతీలాల్ కొడుకు రాజకీయ రంగప్రవేశానికి ముందరి దశలో కాంగ్రెసువారు ఆయా సంస్థానాధిపతులకి స్వాతంత్ర్యానంతరం తమ అధికారాలు చెక్కు చెదరని పధ్ధతిలో ఆయా రాష్ట్రాలకి వారే ముఖ్యమంత్రు లయ్యే వెసులుబాటుని కల్పించారు.ఆ ప్రాభవం పట్ల ఉన్న ఆశతో వాళ్ళు ఆంగ్లేయులతో తమ మితృత్వాన్ని చెడగొట్టుకుని కాంగ్రెసుకి సాయం చెయ్యకుండా ఉండి ఉంటే ప్రజల్లో అంత స్పందన వచ్చి ఉండేదా అని నాకు అనుమానమే!యెందుకంటే ఆంగ్లేయులు మనల్ని అత్యంత క్రూరంగా అణిచిపారెయ్యడానికి నియంతల్లాగ ప్రవర్తించారని చెప్తున్న కాలంలో గూడా ఈ దేశ జనాభాలో 5% మించని వాళ్ళు ఇక్కడివారి సహాయ సహకారాలు లేకుండానే అవన్నీ చెయ్యగలరంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే!కట్టబొమ్మన పక్కనే యెట్టప్ప ఉన్నాడు,సిరాజ్ ఉద్దౌలా పక్కనే మీర్ ఖాసిం ఉన్నాడు - ఓకవైపు నుంచే చూస్తే మనకి వీరులుగా కనబడే వాళ్ళు ఆంగ్లేయులతో సఖ్యతగా ఉండి సుఖపడలేని వాళ్ళు గానూ మనకి ద్రోహులుగా కనబడే వాళ్ళు ఆంగ్లేయులకి సహాయం చేసి సుఖపడిన బతకనేర్చిన వాళ్ళు గానూ కనపవచ్చు, మరొక వైపు నుంచి చూస్తే?!"ఒకవైపే చూడు,రెండో వైపు చూకు - చచ్చిపోతావ్!" అని బట్టనెత్తి బాలయ్య విగ్గుపెట్టుకుని పంచి డైలాగు వొదిల్తే సరదాగా నవ్వుకోవచ్చు గానీ చరిత్ర నించి గుణపాఠాలు నేర్చుకుని ఒకసారి జరిగిన తప్పుని మళ్ళీ మళ్ళీ జరగనివ్వకూడదనుకుంటే మాత్రం గతించిన చరిత్రని ఖచ్చితంగా రెండు వైపుల నుంచీ చూడాల్సిందే!తాత తాతల నాటి కధల్ని తవ్విపోయడంలో యెలాంటి తప్పూ లేదు,లేతబుర్రలు వెక్కిరించనూ అఖ్ఖర్లేదు!చదవటానికి తగినంత డబ్బుంది గనక అలవోకగా బారిస్టరు గిరీని లాగించేసినా ఒక్క రోజు కూడా కోర్టు గుమ్మం యెక్కకుండా తండ్రి అప్పటికే చేరిపోయి పలుకుబడిని సాధించుకున్న కాంగ్రెసు పార్టీలో చేరిపోయి పటేల్ కన్నా జిన్నా కన్నా యే విషయంలో పోల్చినా దిగదుడుపుగా ఉన్న ఈ పేరుగొప్ప జాతిపిత గారి అధమశిష్యుడు  మహాత్ముని ఇచ్చిన బిరుదుకి కళంకం తెచ్చేలా గురువు చూపించిన పక్షపాతం వల్ల గొప్ప రాజనీతి దురంధరుడిగా పేరు తెచ్చుకోగలగడం ఈ దేశప్రజల దురదృష్టం మాత్రమే!కోర్టు రూములో వాదనకి దిగగానే నాలుక పిడచ గట్టుకుపోయి గుడ్లు తేలేసి స్పృహ తప్పిపోయి కూలబడిన ఒకనాటి చెత్త లాయరు తర్వాతి కాలంలో మహా మేధావుల్నీ దిగ్దంతులైన లాయర్లతో సహా ఈ డేశప్రజలందర్నీ తన కట్టుబానిసలుగా చేసుకుని ఆడించగలగడం సైతాను లాంటి దుష్టశక్తి యేదో ఈ జాతి చరిత్ర మీద వేసిన పరమ క్రూరమైన ప్రాక్టికల్ జోకులా కనిపిస్తుంది నాకు!ఈ దేశంలో కలవనని నిజాము భీష్మించడం వెనక కాంగ్రెసు తొలిదశలో ఇచ్చిన వాగ్దానం వల్ల పుట్టిన న్యాయమైన ఆశ ఉండి ఉండవచ్చు - ఈ దేశచరిత్రని మరోసారి మరోరకమైన చూపుతో నిశితంగా శోధిస్తే కొత్త నిజాలు చాలా బయట పడవచ్చును.

1876 డిసెంబర్ 25న కరాచీలో జన్మించిన మహమ్మదాలీ జిన్నా లాయరుగా అత్యంత ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకుని రాజకీయాలలో ప్రవేశించి తొలిదశలో ఉద్రేకపూరితుదైన దేశభక్తుడిగా 1916లో "All India Home Rule League" స్థాపించినా,హిందూ ముస్లిం ఐక్యత కోసం లక్నో ఒప్పందానికి రూపకల్పన చేసి యెంతో హేతుబధ్ధమైన ప్రయత్నం చేసినా కాంగ్రెసులోని అంతర్గత వైరుధ్యాల వల్ల అవి సత్ఫలితాల నివ్వక పోవడంతో విసుగుపుట్టి వేరుకుంపటి నినాదాన్ని యెత్తుకున్నాడే తప్ప అతను స్వభావతః ఈ ఉపఖండాన్ని రెందు దేశాలుగా చీల్చాలని కంకణం కట్టుకున్న వేర్పాటువాది కాదు!

ద్వితీయ స్వాతంత్ర్యపోరాటం అని పిలువబడే కాలాన్ని ప్రామాణికంగా తీసుకుని అప్పటి ప్రభావశీలమైన వ్యక్తుల ద్వారా చరిత్ర యే విధమైన మలుపులు తీసుకున్నదీ వివరిస్తూ తిలక్ గురించీ గాంధీ గురించీ నెహ్రూ గురించీ చెప్పిన "కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?!" వ్యాసపరంపరలో కాంగ్రెసు,హిందూమహాసభ,ముస్లిం లీగ్ అనే సంస్థలు యెప్పుడు పుట్టాయనే దాని దగ్గిర్నుంచీ అన్ని విషయాలనీ ప్రస్తావించాను గనక మళ్ళీ ఆ చరిత్రనంతా ఇక్కడ తవ్విపోయడం లేదు.

ప్రపంచంలోని తెలుగు వారందరికీ సవినయంగా చేస్తున్న ఒక సున్నితమైన విన్నపం:ఆనాడు సామాన్య ముస్లిం ప్రజానీకం కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించినా పైవారి రాజకీయావసరాల కోసం హడావిడిగా చేసిన దేశవిభజనకీ ఈ మధ్యనే ప్రజలెవ్వరూ బలంగా విడిపోతామని తెగేసి చెప్పకపోయినా ఒక వ్యక్తి యొక్క కుటుంబానికి ప్రయోజనం కలిగించటానికా అన్నట్టు కనబడుతున్న రహస్య ఒప్పందాలతో చీకటి సభలో హడావిడిగా చేసిన ఆంధ్రప్రదేశ్ విభజనకీ ఉన్న పోలికల్ని జాగ్రత్తగా గమనించితే ఇప్పుడు కొందర్ని పట్టి పీడిస్తున్న తెలంగాణ ఇస్తామని అంత గట్టిగా చెప్పి కూడా ఆఖరి నిముషం వరకూ ఇవ్వకుండా తప్పుకోవాలని విశ్వప్రయత్నం చేసి ఇప్పుడివ్వకపోతే ఇంకొకడు మైలేజి కొట్టేస్తాడని తెలిసిన ఆఖరి క్షణంలో ఠపీమని ఇచ్చెయ్యడం ఎందుకు జరిగిందనే సందేహానికి సమాధానం దొరుకుతుంది!రెండూ ఒకే పార్టీ అధ్వర్యంలోనే జరిగాయి.రెండూ హడావిడిగానే జరిగాయి.యే విద్వేషాలని చల్లార్చటానికి విభజించామని చెప్పారో విభజన అనంతరం కూడా ఆ విద్వేషాలు చల్లారకపోగా ఇంకా పెరిగినాయి!మన కన్నా ముందు మొత్తం భారతప్రజలు కూడా ఇట్లాగే ఆ పార్టీ చేతిలో వెధవలయ్యారులే అని సరిపెట్టుకుని ఓదార్చుకుంటారో ఆ పార్టీ చరిత్ర తెలుసుకుని ఉంటే ముందుగానే జాగ్రత్త పడేవాళ్ళం కదా అని పశ్చాత్తాప పడతారో మీ ఇష్టం!చరిత్రని చరిత్రలా సాక్షి గణపతి వలె వివరిస్తున్న నాకు మాత్రం రాగద్వేషాలు అంటగట్టి మీ బుధ్ధిని పెడదార్లు పట్టించనివ్వకండి!ఆ పార్టీ యొక్క,ముఖ్యంగా ఆ కుటుంబం యొక్క చరిత్ర అంతా తప్పుల తడక నిర్ణయాల నిప్పుల కుంపట్లని దేశచరిత్రకి నెత్తికెత్తడమే తప్ప కుంపట్లని ఆర్పిన దాఖలాలు యెక్కడా లేవు.నెహ్రూ కాశ్మీరు కుంపటిని వెలిగించాడు!ఇందిర భింద్రన్వాలేని అనధికారికంగా ప్రోత్సహించడం ద్వారా పంజాబు నరమేధానికి కారణ మయింది.రాజీవ్ మనదేశపు తమిళులతో వివాహ సంబంధాలు కూడా ఉన్న శ్రీలంక తమిళుల్ని చంపటానికి భారతసైన్యాన్ని పంపటం ద్వారా శ్రీలంక యొక్క అంతర్గత సమస్యని భారత భూభాగం మీదకి తీసుకొచ్చాడు!అవన్నీ ఇతర్లు మంచి సలహాలు ఇచ్చినా పెడచెవిన పెట్టి మూర్ఖంగా తీసుకున్న యేకపక్ష నిర్ణయాల ఫలితమే అని కుల్ దీప్ నయ్యర్ లాంటి రాజకీయ విశ్లేషకులంతా బల్లగుద్ది చెప్పారు!ఇప్పుడు మరో తరపు మూర్ఖుణ్ణి ముందుకు తెస్తున్నది కాంగ్రెసు.ఇతనికి అజ్ఞానం ,దేబెతనం అనే మరికొన్ని సుగుణాలు కూడా వున్నాయి - ఆ కుటుంబానికి చెందిన వ్యక్తుల్ని ప్రధానిగా చూడాలనే ముచ్చట తీర్చుకోవటం కోసం యెన్ని కుంపట్లని భరించడానికయినా సిధ్ధంగా ఉండగలిగిన ఆత్మవిశ్వాసం గలవాళ్ళు మాత్రమే అతని నాయకత్వంలోని కాంగ్రెసు కధికార మిచ్చి ఈ దేశచరిత్రతో మరోసారి ప్రయోగాలు చెయ్యటానికి సిధ్ధపడతారు!అతని పేరుకి కాలిబంధనాలు అని అర్ధం!గౌతమ బుధ్ధుడు తాను సర్వం పరిత్యజించి వనవాస దీక్షకి సిధ్ధమైన సమయాన తన భార్యకి పుట్టిన నూత్నశిశువుకు కొంచెం విసుగుతో పెట్టిన పేరది.అత్యవసరమైన విషయాలను విమర్శించి తన విజ్ఞానాన్ని చూపించే అవకాశాన్ని వొదులుకుని అనవసరమైన విషయాలకి అఖ్ఖర్లేని రాధ్ధాంతం చేస్తూ అతనిప్పటికే సభాకార్యక్రమలకి అంతరాయం కలిగిస్తూ పేరు నిలబెట్టుకుంటూ వినోదాన్ని కలిగిస్తున్నాడు - అట్లాగే ఉండమని ఆశీర్వదించండి తప్ప ముద్దు చేసి అధికారాన్ని కట్టబెట్టకండి!

ఆనాటి ఉపఖండపు విభనలోనూ ఈనాటి ఆంధ్రప్రదేశ్ విభజనలోనూ కొంచెం యెక్కువ సమయం తీసుకుని అన్ని వర్గాలతో సామరస్య పూర్వకమైన సంప్రదింపులు జరిపి శాస్త్రీయమైన పధ్ధతిని ఫాలో అయి ఉంటే ఆనాడు ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దయనీయమైనదిగా చెప్పబడే అసంఖ్యాక ప్రజల సామూహిక విషాదయాత్ర సంభవించి ఉండేది కాదు ఈనాడు మాతృరాష్ట్రం లోని ప్రజలు ఇంత దారుణమైన అనిశ్చితిని యెదుర్కొంటూ భవిష్యత్తు పట్ల భయసందేహాలకి గురికావలసిన దుస్థితి తప్పి ఉండేది!కాలమూ చరిత్రా నిస్తేజంగా యెప్పుడూ ఉండవు,యెన్ని సాంత్వనలు చెప్పుకున్నా వెనకబడిపోయిన వాళ్ళ కోసం అవి ఆగవు!తమ నిర్ణయాలకి అనుకూలంగా భవిష్యత్తుని నడిపించగలిగిన వాళ్ళు రాజనీతి దురంధరులు,కాలానికి లోబడి భవిష్యత్తుని దిక్కుతోచని గమ్యాలకు చేర్చి చేతులు దులుపుకునే వాళ్ళు రాజకీయ నాయకులు.అప్పుడు దేశానికీ ఇప్పుడు రాష్ట్రానికీ మొదటిరకం వారు లోపించడం వల్లనే రెండుసార్లూ చరిత్ర ప్రజల ఆకాంక్షలకి విరుధ్ధమైన దిశలో నడిచింది!ఆనాటి దేశపు పరిస్థితి చూస్తే అతి కొద్ది కాలంలోనే పై స్థాయిలో ఉన్న పెద్దలకి కాళ్ళ కింద పీఠాలు కదిలిపోయే ప్రమాదం వచ్చి పడింది.అక్కడ బ్రిటన్ భూభాగం మీద 1945 యెన్నికల్లో కొత్తగా లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది.యుధ్ధాల్లో అత్యుత్సాహంగా పాల్గొనడం వల్ల  ఆర్ధికంగా తగ్గిపోయిన స్థితిలో భారత్ లాంటి పెద్ద వలసల్ని బలవంతంగా పట్టి ఉంచాలంటే ఖర్చు తడిసి మోపెడయ్యేలా ఉంది.ఇక్కడ గాంధీ పలుకుబడి శరవేగంగా దిగజారిపోతూ అంతకు కొద్ది కాలం క్రితం ఉరితీసిన భగత్ సింగ్ లాంటి వాళ్ళు పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్నారు.మొదటి నుంచీ మిత్రబాంధవుల వలె ఒకరికొకరు సహకరించుకుంటూ వస్తున్న ఆంగ్లేయ-గాంధేయ సమూహాలు రెంటికీ ఇంకా సాగదీస్తే వారిద్దరూ ద్వేషించే కమ్యునిష్టు దేశంగా భారత్ అవతరిస్తుందని భయపడి దాన్ని నివారించడం కోసం హడావిడిగా విభజనని ప్రకటించేసి అధికార మార్పిడిని చేసుకున్నారు.

ఒకవేళ దేశవిభజన జరగకుండా ఉపఖండం యేకజాతిగానే స్వాతంత్ర్యాన్ని సాధించుకుని ఉంటే అప్పుడు ప్రధాని పదవికి పోటీదారులుగా ముగ్గురు ఉండేవాళ్ళు - పటేల్,జిన్నా,నెహ్రూ!ఇప్పటి వలెనే పటేల్ గాంధీ గనుక ఒత్తిడి పెడితే వెనక్కి తగ్గి ఉండేవాడు కానీ జిన్నా మాత్రం వెనక్కి తగ్గి ఉండేవాడు కాదు!అందువల్ల్లనే జిన్నా లక్ర్నో ఒడంబడిక ప్రతిపాదించిన నాటి నుంచే నెహ్రూ కూడా ముస్లిములకి రక్షకుడిగా జిన్నా కన్నా తనని ప్రొజెక్ట్ చేసుకోవటానికి స్వధర్మద్రోహిగా కూడా నిలబడ్డాడు?!హిందూ ముస్లిం విభేదాల వల్ల జరిగిన హింసాయుత సన్నివేశాలకి హిందూమహాసభ,ముస్లిం లీగ్ రాజకీయాల కన్నా ముస్లిములకి పరిరక్షకుడిగా నిలబడాలన్న ఇతని అత్యుత్సాహమే యెక్కువ కారణం!

అన్ని సంవత్సరాలుగా ముస్లిం లీగ్ అంత ప్రభావశీలంగా ఉన్నప్పటికీ ముస్లిములకి ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించబడినప్పటికీ ముసిములు కూడా జిన్నాను నిర్ద్వంద్వంగా తిరస్కరించేసి తాము దేశవిభజనకి వ్యతిరేకం అని యెందుకు చాటిచెప్పారు?ఈ యెన్నికల ఫలితాలతోనే జిన్నా ఇక తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని ప్రకటించి నిస్తబ్దుగా ఉండిపోయినా ఉపఖందం యెలా విడిపోయింది!అప్పుడూ హిందూమహాసభ ఉంది,అయినా ముస్లిములు లీగుని వొదిలి కాంగ్రెసుకే పట్టం కట్టారు,యెందుకని!?మీరు మరోసారి అప్పటి భారత దేశపు రాజకీయ చిత్రపటాన్ని సరిగ్గా గుర్తుకు తెచ్చుకోవాలి.మూడు రకాలుగా ఉన్న అప్పటి రాస్ట్ర్రాల ప్రజల్లో అధిక సంఖ్యాకులు నిరక్షర కుక్షులు.కాంగ్రెసు,హిందూమహాసభ,ముస్లిం లీగ్ - ఇలాంటీవన్నీ కొద్దిమంది విద్యాధికుల సమూహాలు!క్షేత్రస్థాయిలోని ప్రజల్లో చాలామందికి ఈ సంక్లిష్తమైన రాజకీయాల గందరగోళం అర్ధం కాలేదు.కాంగ్రెసు నాయకులూ హిందూమహాసభ నాయకులూ జైళ్ళలో ఉన్న వీలు చూసుకుని మెంబర్లని పెచుకున్నా క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసే క్యాడర్ లేకపోవటం అనే బలహీనత వల్లనూ యెటూ ప్రత్యేకనియోజకవర్గాల యేర్పాటు జరగటంతో కాంగ్రెసు ప్రతికక్షిగా నిలబడటం అనెది ప్రజలకి అంతగా తెలియని ముస్లింలీగ్ విభజనకి రిఫరెండంగా భావించాల్సిన ఆ కీలకమైన యెన్నికల్లో చిత్తుగా ఓడిపోవటానికి ముఖ్యమైన కారణం కావచ్చు!అదీగాక, అప్పటిదాకా మరిన్ని సౌకర్యాల కోసం పోట్లాడటానికి వాడుకుంటున్న ద్విజాతి నినాదాలు క్రమంగా పాకిస్తాన్ ఆవిర్భావం వరకూ వచ్చేసరికి సామాన్య ముస్లిం ప్రజానీకం కూడా భయపడ్డారు!యెంత దరిద్రంలో ఉన్నా ఒక నలభైలలో ఉన్న వ్యక్తి యెంతో కొంత ఆర్జించే ఉంటాడు.పుట్టి పెరిగిన చెటు గనక యెంత బీదరికంలో ఉన్నా తెలిసిన ముఖాల మధ్య ఉందే ధీమాకీ హఠాత్తుగా ఇదంతా వదులుకుని మళ్ళీ శూన్యం నుంచి బతుకు పోరాటం మొదలుపెట్టడం అదీ తామెన్నడూ చూడని దూరప్రాంతానికి వెళ్ళడమంటే యెవరికయినా భయానకమే గదా!వారి భయాల్ని నిజం చేస్తూ ఈ దేశపు నాయకుల మీద వారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి అప్పటి నాయకులు వారికి ద్రోహం చేశారు!ఆ గురుశిష్యులిద్దరికీ మాత్రమే ఈ దేశపు భవిష్యత్తుని నిర్ణయించే నిరంకుశమైన అధికారాన్ని దఖలు పరచిన ప్రతి నాయకుడికీ ఆ పాపంలో భాగం ఉంది.

విభజించి పాలించే దుర్నీతితో ఆంగ్లేయులు మన దేశప్రజల్ని చీల్చారని నిందించతం చాలా తేలిక,కానీ ఉపఖండాన్ని యేకంగా ఉంచటానికి ముస్లిం ప్రజల వైపు నుంచి వచ్చిన యెన్నో అవకాశాల్ని చేజేతులా వదిలేసుకున్న మన నాయకుల అసమర్ధత వల్లనే అలా జరిగిందని ఒపుకోవడం కష్టమే అయినా అది నిష్ఠుర సత్యం!మొదట్లోనే ముస్లింలీగ్ బలపడితే ప్రమాదం, అణిచివేద్దాం అన్న ప్రాక్టికాలిటీ ఉన్న నాయకులు పక్కకి నెట్టివేయబడ్డారు!తర్వాతి కాలంలో నెహ్రూ జిన్నాకి బదులుగా మౌలానా వంటి వారిని ప్రోత్సహించుదాం అంటే జిన్నా మీద అతి విశ్వాసంతో గాంధీ పడనివ్వ లేదు.రాజకీయాల నుంచి విరమించుకుని మూలన కూర్చున్న జిన్నాని పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు పోయి కెలికి మళ్ళీ రంగంలోకి తీసుకొచ్చిన గాంధీని వొదిలి వాళ్ళనీ వీళ్ళనీ విభజనకి కారకులని తిట్టి యేమి ప్రయోజనం?గురుశిష్యుల వింతపోకడల్ని కూడా వారికి కలికితురాయిలుగా కట్టబెడుతూ రచించిన నాటి పత్రికాధిపతుల అమోఘమైన ప్రచారవ్యూహం అగ్నికి వాయువు వలే తోడై మహాత్ముడనే ఇమేజి నిచ్చి దేశప్రజల మీదకి వదిలితే అతను నామాట వినకపోతే నిన్ను చంపుతానని కత్తితో జడిపించే నియంతృత్వానికి బదులుగా నామాట వినకపోతే నేను చస్తానని బెదిరించే నియంతృత్వాన్ని పాటిస్తూ అసత్యంతో చేసిన ప్రయోగాలు వికటించి ఈ దేశం విడిపోయింది!


ఈ దేశం విడిపోయి యేమి సాధించింది?మీకు తెలియదా,అదీ నేనే చెప్పాలా!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...