మంచోడు మంచోడు మామిడికాయంత దొడ్డోడు అని మురిసినంతకాలం పట్టలేదు మంచమంతా చెడగొట్టే రకమని తెలియడానికి?!అప్పుడెప్పుడో మామగారు పార్టీ పెట్టినప్పుడు అటు వెళ్ళలేదు మర్యాద కోసమైనా - ఉన్న పార్టీకి అంకితమైన నిజాయితీ అనుకుందామా?అబ్బే,మామ గెలిచి అధికార పీఠం యెక్కడం ఖాయం అని తెలిసేదాకా ఆగి అప్పుడు ఝామ్మున జంపయ్యాడు!ఫలితాలు తెలియడానికి ఒక్క రోజు ముందు దూకినా నాబోటివాళ్ళు మంచివాడేలే ఆఖరి నిముషాల్లో అయినా జనంలో పొంగిపొర్లిఉతున్న వూపుని గమనించి నిజాయితీగానే వచ్చాడని నమ్మేవాళ్ళు - అడ్డెడ్డెడ్డే, కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలాగా దూకేశాడు!పోనీ మామగారికి మంచిపేరు తెస్తూ తన మర్యాద కాపాడుతూ నైతికంగా ఉన్నతంగా ఉన్నాడా అంటే అదీ కుదురుగా చెయ్యలేదు.అప్పటి దాకా తన చుట్టూ తిరుగుతున్న జనం ఒక ఆడదాని చుట్టూ తిరగడం భరించలేక కొత్తగా రాజపురోహితుడి వేషం కట్టాలనుకున్న వాధా ఘృష్ణ లాంటి సంస్కారహీనపు మీడియా మాయావులు మామగారి చెవిపోగుల గురించీ మారిన బొట్టు తీరుల గురించీ యెద్దేవా చేస్తూ ఒక దుష్టశక్తిని సృష్టించి జనాన్ని భ్రమింపజేసి ప్రజాప్రతినిధుల్ని యెత్తుకెళ్ళి విలాసవంతమైన పంచతారల భవనాల్లో దాచి చాలా గొప్ప ప్రజాస్వామికంగా తిర్రుగుబాటు చేశాడు!ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిన ఈగలా తన చరిత్రని మర్చిపోవడం వల్లనేమో ఇవ్వాళ మరొకడు దిమ్మ తిరిగి గూబ గుయ్యిమనిపించే దెబ్బ కొడితే విలవిలలాడుతున్నాడు - ఒక సచ్చీలుణ్ణి అపఖ్యాతి పాలుచేసినంతగా రోదిస్తున్నాడు!రామహత్యాపాతకం కట్టి కుడపక మానుతుందా?
విమానంలో మాంగారి కాళ్లకి అడ్డం పడిన పెట్టెని అటు జరిపి ఇటు జరిపి హడావిడి చేసిన మనిషే విమానం దిగగానే చాలా కూల్ కూల్ యెత్తుగడతో గూబ గుయ్యిమనిపించిన చతురత వెనక్కాల పెట్టుకుని ఇప్పుడు అదే తారకరాముని అభిమాని తన అభిమాననేతను దెబ్బతెసిన విలన్ మీద పగతీర్చుకున్నంత సరదాగా కొట్టిన తమలపాకు సరసానికే హడిలిపోతున్నాడు వృధ్ధనారి పతివ్రత అయినట్టు!
యేం మాట్లాడితే పేపర్లో పెద్దచ్చరాల్తో తన పేరు పడుద్దో,యేం చేస్తే అందరూ తనని ఇంద్రుడూ చంద్రుడూ అని పొగుడుతారో అనే ప్రచారకండూతి తప్ప ప్రజల గురించి యేనాడన్నా నిజాయితీగా ఆలోచించాడా?అలా అలోచిస్తే అధికారం పోయినప్పుడు తెరాసా సాయంతోనైనా మళ్ళీ అధికారంలోకి వద్దామని కలలు గన్న రోజులు గుర్తు లేవా?తెలంగాణ నేత ఒకడు ఉసిగొలుపుతుంటే గయ్యాళిమంద అంతా ఒక్కటై ఆంధ్రావాళ్ళని అన్యాయంగా తిడుతున్నప్పుడు అదేం మాట మీకు రాష్త్రం కావాలంటే అడిగి తీసుకోండి మీ కష్టాలకీ సమస్యలకీ ఇతర్ల నెందుకు తిట్టడం అని నిలదీసి అడిగి ఆంధ్ర ప్రజల్లో ఉండే స్వాభిమానం నిలబెట్టాలని అనుకున్నాడా?తన స్థానంలో యెన్.టి.ఆర్ ఉంటే అలా కిక్కురుమనకుండా ఉండేవాడా?సాఫ్టువేరుతో మ్యాజిక్కులు చేసి ఉద్యోగాలు రప్పించటం పిడకలేసినట్టు ఒకే ఒక్క నగరంలో అభివృధ్ధిని పోగుపడెయ్యటం - ఇవేనా నాయకత్వానికీ సమర్ధతకీ గీటురాళ్ళు?ప్రజల్లో రోటీ కపడా మకాన్ అన్న ఆ మూడింటి తర్వాత ఆత్మాభిమానం అనేది ఒకటుంటుందనీ ఒక వర్గం వాళ్ళు కేవలం దురుద్దేశంతో భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలు కూడా వేసుకుని కారుకూతలు కుయ్యడం వల్ల ప్రజలు ఆ మాటలకి దీటుగా జవాబు చెప్పలేని తమ ప్రాంతం నాయకుల దేబెతనానికే యెక్కువ కష్టపెట్టుకుంటున్నారనీ గమనించని వాడు అతడేమి ప్రజానాయకుడు?విభజన అన్యాయంగా జరుగుతున్నదని తెలిసినప్పుదు అక్కడా ఇక్కడా పడుక్కుని అఘోరించే బదులు ప్రజల ముందుకొచ్చి అక్కడ జరుగుతున్నదేమిటో విప్పిచెప్పి ధైర్యంగా క్రూరమైన విభజనకి వ్యతిరేకంగా ఉద్యమిస్తే యెవరు అడ్దుకునే వాళ్ళు - గోడమీదిపిల్లి రాజకీయపు మనస్తత్వం నిలువెల్లా మూర్తీభవించటం వల్ల కాదా ఆ ఫలితమివ్వని తింగరి పనులన్నీ చేసింది!సమర్ధించావా తెలంగాణాని నిండుమనస్సుతో సమర్ధించి సహాయం చేసి ఆంధ్రాకి న్యాయం జరిగేలా పోట్లాడాలి, లేదా లక్షమంది వ్యతిరేకించినా సరే ఇది నా పాయింటు భవిష్యత్తులో తెలుస్తుంది నేను రైటో మీరు రైటో అని చెప్పి గట్టిగా నిలబడాలి - అది నిజమైన నాయకత్వ లక్షణం అంటే,అది వుందా మనోడికి?
తమ నాయకుల్లోనూ తమలోనూ ఉన్న వెధవాయిత్వాల్ని గురివిందల్లాగ దాచుకుని ఆంధ్రావాళ్ళ దోపిడీ వల్ల మేం నష్టపోయాం అని తిడుతుంటే ప్రాంతీయాభిమానం ఆంధ్రుల కుండకూడదా?ఆంధ్రప్రజల తరపున మాట్లాడే అవకాశం ఉండి కూడా రెండు కళ్ళ సిధ్ధాంతం చాటున నత్తిమాటలు మాట్లాడకుండా ఉంటే ఆంధ్రపరజలు తనకి కూడా మామగారిని మించి నీరాజనాలు పట్టి ఉండేవాళ్ళు - ఆంధ్రుల ఆత్మాభిమానం అనే నినాదంతో పుట్టిన పార్టీలో ఉండి స్వాభిమానం లేకపోవటం వల్ల అవకాశం జారవిడుచుకుని ఒంటికన్నుతో మిగిలాడు, ఆ ఒక్కటి గూడా గుడ్డికన్ను మూస్తే యెంత తెరిస్తే యెంత అన్నట్టు ఉంది!
అదంతా పోనీ విభజన తర్వాత ఇంతవరకూ రాష్ట్రానికి నికచ్చిగా యేమి సాధించాడు?యెంతసేపూ రాను రానంటూ చెట్టెక్కి కూచున్న పక్క రాష్త్రపు ముఖ్యమంత్రిని చర్చలకి పిలుస్తూ ముసలి ముత్తయిదువ కబుర్లు చెబుతూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి యేమో గయ్యాళితనంతో షెడ్యూలు 10లోని వాటితో సహా అన్నిటికీ లుంగజుట్టి ఒడేసుకునేందుకు ఇప్పటికే హోం వర్కు పూర్తి చేసేసుకుని అవకాశం కోసం యెదురు చూస్తున్నాడు!విభజన చట్టంలోనే ఉండి విభజన చట్టం ద్వారా అధికారికంగా దఖలు పడి ఆంధ్రాకి రావలసిన వాటిలో దేన్నీ సాధించకుండా యేడాదిలో ఈ పోటుగాడు చేసిన ఘనకార్యం యెమిటి?అసలు విభజన బిల్లుని వండివార్చిన వాళ్ళు విభజన తర్వాత ఆంధ్రప్రదెశ్ అనే భూభాగం ఒకటి ఉంటుందని అనుకున్నారా అని అనుమానమొచ్చేలా చేస్తుంటే చూస్తూ కూర్చున్న వాడు ఇవ్వాళ కేంద్రంలో నలుగురు మంత్రుల్ని చేర్చి కూడా ప్రత్యేకహోదాని కూడా సాధించలేకపోవడం అంటే అక్కడ నడుస్తున్నది సమస్థాయిలో ఉండి చేస్తున్న స్నేహమా?లేక వాళ్ళ సాయం లేనిదే పదవిలో ఉండటం కష్టమని తెలిసిన కుర్చీ కాపాడుకునేందుకు పనికొచ్చే దాస్యమా?
పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు హైదరాబాదులో కూర్చుని కేసుల్లో ఇరుక్కుని అఘోరించకపోతే అప్పటి ముఖ్యమంత్రి చేసినట్టు రెండవ నిముషం నుంచే సొంత రాష్ట్రం నడిబొడ్డు నుంచి పారిపాలించవచ్చు గదా?ఇప్పుడు సౌకర్యవంతమైన భవనాలకీ కొదవ లేదు గదా!ఒకవేళ ఉన్నాడే అనుకుందాం తన జాగ్రత్తలో తను ఉండొద్దా!అంతా అయిపోయి అడ్డంగా దొరికిపోయాక ఇపుడేడ్చి యేం లాభం?ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క సిధ్ధాంతం,వ్యూహం,ఆయుధం అన్నీ ద్వేషమే నని చిన్నపిల్లాణ్ణి అడిగినా చెప్తాడు, తనింకా అతను తన మంత్రివర్గంలో చేతులు కట్టుకు తిరిగిన మనిషిలాగే చూసినందుకు ఫలితం అనుభవిస్తున్నాడు!మన రాష్ట్రానికి యేదయినా గట్టిగా అడిగితే తెలంగాణలో 2019కి దెబ్బ తగుల్తుందేమో అనే రంధిలో అన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి ధాటిగా మాట్లాడి లాక్కుపోతున్నా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోవడం వల్ల యేమి వొరిగింది?!ఇప్పుడు షెడ్యొలు 10 విషయంలో నైనా గట్టిగా ఉంటాడో వీట్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి వాగ్ధాటికే వదిలేస్తాడో?
అడ్డగోలుగా దొరికిపోయేలా కేసులో ఇరికించటమంటే మొహం మీద ఉమ్మెయ్యటం లాంటిదే కదా - ఇంకా చూరు బట్టుకుని ఇల్లిటపుటల్లుడి లాగా కేంద్రాన్ని నేనిక్కడే ఉంటాను నాకు ఆర్టికిల్ 8 కావాలి అని మారాం చేస్తున్నాడంటే సిగ్గూ లజ్జా వొదిలేసినట్టు కాదా - క్షాత్రం తనకి లేదని ఆంధ్రప్రదేశ్ జనం కూడా తనలాగే అన్నీ వొదిలేసుకుని కూర్చోవాలా!కేంద్రం కలగజేసుకుని చెప్పినంత మాత్రాన తెలంగాణ ముఖ్యమంత్రి వింటాడా?ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని యెన్నికలకి దిగుతాడు, యెవడి పెర్ఫామెన్సూ బాగోలేని స్థితిలో మోదీ గానీ తను గానీ ఇప్పుడు యెన్నికలకి సిధ్ధంగా ఉన్నారా - యెందుకింకా అభాసు పాలయ్యే క్షాత్రం లేని నికృష్టపు పనులు?దెబ్బ తిని ఇన్ని రోజులైంది తిరిగి దెబ్బ కొట్టగలిగాడా?దెబ్బ కొట్టే పాటి తెగువ లేనప్పుడు అక్కడ స్థానబలిమి లేనప్పుడు ఇంకా ఆక్కడే యెందుకు?అటువైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రంతో యేమాత్రం పనిలేకుండా ధీమాగా తనకి కావల్సినవన్నీ పోట్లాడి మరీ సాధించుకుంటూ మగాడిలాగా నెట్టుకొస్తూ ఉంటే ఈ పునిస్త్రీ రాజకీయంతో నాబోటివాళ్ళకి విసుగు తెప్పిస్తున్నాడు!
అడ్డగోలుగా దొరికిపోయేలా కేసులో ఇరికించటమంటే మొహం మీద ఉమ్మెయ్యటం లాంటిదే కదా - ఇంకా చూరు బట్టుకుని ఇల్లిటపుటల్లుడి లాగా కేంద్రాన్ని నేనిక్కడే ఉంటాను నాకు ఆర్టికిల్ 8 కావాలి అని మారాం చేస్తున్నాడంటే సిగ్గూ లజ్జా వొదిలేసినట్టు కాదా - క్షాత్రం తనకి లేదని ఆంధ్రప్రదేశ్ జనం కూడా తనలాగే అన్నీ వొదిలేసుకుని కూర్చోవాలా!కేంద్రం కలగజేసుకుని చెప్పినంత మాత్రాన తెలంగాణ ముఖ్యమంత్రి వింటాడా?ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని యెన్నికలకి దిగుతాడు, యెవడి పెర్ఫామెన్సూ బాగోలేని స్థితిలో మోదీ గానీ తను గానీ ఇప్పుడు యెన్నికలకి సిధ్ధంగా ఉన్నారా - యెందుకింకా అభాసు పాలయ్యే క్షాత్రం లేని నికృష్టపు పనులు?దెబ్బ తిని ఇన్ని రోజులైంది తిరిగి దెబ్బ కొట్టగలిగాడా?దెబ్బ కొట్టే పాటి తెగువ లేనప్పుడు అక్కడ స్థానబలిమి లేనప్పుడు ఇంకా ఆక్కడే యెందుకు?అటువైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రంతో యేమాత్రం పనిలేకుండా ధీమాగా తనకి కావల్సినవన్నీ పోట్లాడి మరీ సాధించుకుంటూ మగాడిలాగా నెట్టుకొస్తూ ఉంటే ఈ పునిస్త్రీ రాజకీయంతో నాబోటివాళ్ళకి విసుగు తెప్పిస్తున్నాడు!
రాష్ట్రం లోటుబడ్జెట్టులో వచ్చింది!కేంద్రం నుంచి ప్రత్యేక హోదా కానీ ఇతోధికమైన సాయానికి నికరమైన వాగ్దానం కానీ యేదీ తేలేదు!అయినా ప్రపంచం పట్టనంత రాజధాని కడతానంటున్నాడు - ఆదాయం యెక్కడిదయ్యా అంటే గంధపు చెక్కల స్మగ్లర్ల నందర్నీ చంపేసి వాళ్ళనుంచి స్వాధీనం చేసుకున్న చందనం ముక్కల్ని అమ్మటమూ మద్యం షాపుల్ని పెంచటమూ అద్భుతమైన పరిష్కారాలట - వీటి తర్వాత వ్యభిచారాన్ని చట్తబధ్ధం చేసి వ్యభిచార కేంద్రాల్ని కూడా తెరిస్తే బాగుంటుంది?!
కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినట్టు ఒక ఆల్పుడికి అధికారమిచ్చామా గతిలేక!