Tuesday, 31 March 2015

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు కేంద్రప్రభుత్వంలో వున్నా ఏపీకి రావల్సినవి కూడా రావడం లేదు!

          కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు చంద్రబాబు తమకేమీ సాయం చెయ్యకపోయినా భాజపాకి మాత్రం ఇబ్బందులు కలిగించవద్దని సొంత మనుషుల్నే కట్టడి చేస్తుంటే ఆనక జనం దీన్ని నపుంసకత్వంగా అర్ధం చేసుకుని సహేంద్ర తక్షకాయ అన్న చందాన భాజపాతో పాటూ కాంగ్రెసు లాగా నువ్వూ ఆవల ఉండు నాయుడూ అంటే యేమి చేయవలె?అప్పుడే సూర్యారావు మాస్టారి గెలుపు ద్వారానూ మిశ్రమ ఫలితాన్ని చూపించటం లోనూ సంకేతాలు పంపించారు - తెదెపాకి ప్రజాభిమానం తగ్గిందని!అది ప్రజాగ్రహం గా ముదరక ముందే చురుకు తెచ్చుకోవాలి, తెచ్చుకుంటాడా కేంద్రంలో మోదీ అవసరం అనే పాతపాటతో తమ్ముళ్ళకి ఇంకా కళ్ళాలు బిగించి పూర్తిగా పుట్టి మునిగాకే కళ్ళు తెరుస్తాడా?

            ఒకసారి కేసీఆర్ ఉద్యమంలో ఆంధ్రోళ్లని తిట్టే పైత్యకారి వాదనని గట్టిగా యెదుర్కునే అర్హతలు అన్నీ ఉన్నా గోడమీదపిల్లివాటం రాజకీయంతో మొత్తం ఆంధ్రప్రజానీకం యొక్క నిజమైన ప్రతినిధిగా నిలబడి తెలుగుప్రజలలో తిరుగులేని ఆమోదాన్ని పొందే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు,మళ్ళీ భాజపాతో మెతక రాజకీయమాడి మరోసారి ప్రజాభిమానానికి దూరమవుతాడా!

             మొన్నటి పార్లమేంటు సమావేశాల్లో (ఉగాదికి ముందు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రస్తావనకి వీరప్ప మొయిలీ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వ్యతిరేకిస్తారనుకున్న ఇతరులు యెవరూ అతనితో గొంతు కలపలేదు. పైగా బెంగాల్ సభ్యుడు సౌగతా రాయ్ అయితే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించడం గురించీ రాష్ట్రానికి సహాయం చెయ్యడం గురించీ కొంత అనుకూలంగానే మాట్లాడాడు!అయినా పిల్లిమెడలో గంట కట్టేదెవరు అన్న దోబూచులాటతో అధికార ప్రతిపక్ష పార్టీలు మీనమేషాలు లెక్క పెట్టటానికి కారణం యేమిటో ఆ పార్టీ అధిష్ఠానాలకే తెలియాలి!వ్యతిరేకించాలని అనుకున్నవాళ్లు యెవరయినా చొరవ తీసుకోదల్చుకుంటే వీరప్ప మొయిలీ ప్రకటనకి అనుకూలంగా మాట్లాడే అవకాశాన్ని వొదులుకుని వుండేవారు కాదు గదా!

        సాంకేతికంగా ప్రత్యేక హోదాకి ఇదివరలో నిర్వచించిన కొండ ప్రాంతాలు వుండటం లాంటివి లేకపోయినా విభజన కారణంగా ఆవిర్భవించిన యేడాదికే లోటు బడ్జెట్ వుండటం,మాతృరాష్ట్రం అయినా రాజధానిని పూర్తి ఆదాయంతో సహా కొత్తగా యేర్పడిన పిల్ల రాష్ట్రానికి వొదిలేసి రాజధాని లేకుండా ఆదాయాన్ని కోల్పోయి నిలవటం కూడా వాటితో పోల్చదగ్గ బలహీనతలే, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వటం సబబే అని వెంకయ్య నాయుడు అంటుంటే అందరూ తలలూపుతున్నారు - అయినా అది దఖలు పర్చేటందుకు తొలి అడుగు మాత్రం పడటం లేదు,కారణ మేమిటి?అప్పటి ప్రధాని చేసిన వాగ్దానాన్ని ఇప్పటి ప్రభుత్వం మన్నించి తీరాలనే సభా సాంప్రదాయం కూడా అనుకూలంగానే వుంది కదా?అట్లా మన్నించకపోతే ఆ పదవికి ప్రత్యేకత యేముంటుంది?నిండుసభలో ఒక ప్రధాని చేసిన ప్రకటన కేవలం ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయి మరో పార్టీ అధికారంలోకి రావడం మూలంగా అమలుకి నోచుకోకపోతే ఆ స్థానానికి రాజ్యాంగపరమయిన గౌరవం తగ్గినట్టే గదా!

        ప్రభుత్వంలో ఉన్న భాజపా తొలి అడుగు వేస్తే అధికారం పంచుకుంటున్న మిత్రపక్షానికి మేలు చేస్తున్న అపప్రధ మొయ్యాల్సి రావచ్చునన్న భయం ఉందొచ్చు,కానీ విభజనలో దేన్ని ఆశించి అంత మొండిగా తెలంగాణా ఇచ్చి దాన్ని పొందలేక చతికిలబడిన కాంగ్రెసు కనీసం పరువు నిలబెట్టుకోవడానికైనా ఇప్పుడు ఏపీకి ప్రత్యెక హోదా రప్పించాల్సిన అవసరం వుంది కదా! యేదో ఒకరోజున చర్చ+ఓటింగు తీర్మానం కాంగ్రెసు ప్రవేశ పెడితే ఆ రోజుతో ఐసాపైసా తేలిపోతుంది గదా యెందుకీ యెదురు చూపులు?ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడతామని అన్నిసార్లు వాగుతున్నా తిరపతి యెన్నికల నుంచి మొన్నటి యెం.యెల్.సీ యెన్నికల వరకూ ఒక్క చొట కూడా ఒంటికాలు మీద నిలబడే చోటు కూడా ఇవ్వడం లేదంటే "ముందు సాధించుకురా అప్పుడు చూస్తాం" అని చెప్తున్నారని అర్ధం చేసుకోకపోతే పూర్తిగా చచ్చాక మేలుకుంటారా యేంటి?

          తెదెపా నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న ఆడంగి పేరుగల మగాడు ఒకడు కాసేపు హోదా రావడం కష్టమనీ యెక్కువ నిధులతో సరిపెట్టుకుందామని సన్నాయి నొక్కులు నొక్కుతూనూ ఆ నిధులు కూడా సరిపడినన్ని ఇవ్వకపోవడం తెలుస్తూనే ఉన్నా వచ్చేస్తున్నాయి అధిక నిధులు అనీ బహురూపుల వేషాలతో సొంత పార్టీ వాళ్ళనే మోసం చేస్తున్నాడు,అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంకా కళ్లు తెరవడం లేదు,యెందుకనో?ప్రజలు మాత్రం గమనిస్తూ నిశ్శబ్దంగా వున్నారు, అవకాశం కోసం యెదురు చూస్తూ తుఫాను ముందరి ప్రశాంతతని చూపిస్తున్నారు  - ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులూ కొంచెం చురుకు తెచ్చుకోవాలి?!

ప్రజలతో క్రూర పరిహాసాలు ఆడిన ప్రతివాడూ పరిహాసాస్పదుడయ్యాడనేది చరిత్ర చెప్తున్న సత్యం!

Sunday, 29 March 2015

నీ కళ్ళెదుట వేరేవాడు మీ అమ్మని రేప్ చేస్తుంటే ఈ సలహా మీ అమ్మకి ఇవ్వగలవా అనే ప్రశ్న యెందుకు తట్టలేదు?

          అవును,ఆ ఇంటర్వ్యూ చేసిన ఆడమనిషికి గానీ దాన్ని వీడియోగా తీస్తే లేని తప్పు బయటికి చూపిస్తే యేదో ఘోరం జరిగిపోతుందని అల్లరి చేసిన వాళ్లకి గానీ ఆ ప్రశ్న వాణ్ణి అడిగి చూడాలని యెందుకు అనిపించలేదు?ఆ గాడిద రేప్ చేస్తుంటే చెయించుకోవాలి గానీ తిరగబడటం దేనికి అని ప్రశ్నిస్తున్న సన్నివేశాన్ని చూస్తున్న మొదటి క్షణం లోనే నాకు కలిగిన సందేహ మిది!

      లడ్డుని బజారులో పెడితే కుక్కలు ముట్టుకోవా అని కూసిన లాయర్ని వెంనే "నీ భార్య కూడా లడ్డు అనుకో,తను పచారీ కొట్టుకు వెళ్తున్నప్పుడో తలనెప్పి మాత్ర తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడో సరదాకి ఓ నాలుగు కుక్కల్ని పంపి నాకిస్తాం అప్పుడు కూడా ఇట్లాగే సమర్ధించ గలవా?" అని అడగాలని యెందుకు తోచలేదు అక్కడున్న జనాల్లో యే ఒక్కడికీ?

       రేపటి రోజున వాడు జైలులో తన సాహస కార్యాన్ని గురించి కవిత్వం చెప్పుకుంటే అవి పత్రికల్లో ప్రచురితమై హాట్ కేకులుగా అమ్ముడయినా ఆశ్చర్యం లేదు గదా!విదుదలయ్యాక యెన్నికల్లో పోటీ చేస్తే అఖండమైన గెలుపు కూడా వరించినా ఆశ్చర్యం లేదు గదా!మొగ్గలోనే తుంచగలిగిన దానికి నీరు పోసి పెంచి పోషించి అప్పుడు కత్తులూ గొడ్డళ్ళూ సానబెట్టి ప్రయోజన మేమిటి?పిల్లల్ని యెట్లా పెంచాలో తెలియని వాళ్ళు పిల్లల్ని కనడం దేనికి?!

      సూటిగా గుండెల్ని తాకే ఒక ప్రశ్న వెయ్యి శతఘ్నుల్ని పేల్చగలదు!సరిగ్గా ప్రశ్నించడమే తెలియని వాళ్ళు పరిష్కారాన్ని యెట్లా సాధించ గలరు?ఆ నరపశువుని కన్న తలిదండ్రులే వాడికి స్త్రీ పట్ల చిన్నచూపు కలగడానికి మొదటి కారణమని తెలిశాక గూడా తెల్లమొహం వేసుకుని చూసేవాళ్ళు యేనాటికి కళ్లు తెరుస్తారు?సంస్కారం నేర్పని విద్య ఈ దురవస్థకి మూలకారణం అని యెంతమందికి తట్టింది?!

ధర్మో రక్షతి రక్షితః

Saturday, 28 March 2015

మొదట అట్టను అంత భయంకరముగ చిత్రించ నేల?పిదప అట్టను చూసి భయపడకండని కన్నుగీటులేల!

       స్వైరిణి మళ్ళీ కన్ను గీటి కాలెత్తింది!ఈసారి మహాభారతం మీద పడింది?రంకు నేర్చిన ఆడది బొంకు నేర్వదా అని - అబధ్ధాలు చెప్పడంలో మాంఛి శ్రేష్టమైన మార్గాన్నే యెంచుకునింది?!మొదటిసారి వాల్మీకి చెప్పనివి - రాముడు శూర్పణఖని చొల్లు కార్చుకుంటూ చూశాడనీ,సీత రావణుణ్ణి చూసి గొప్పగా మురిసిపోయిందనీ - తను కల్పించి చెప్తే రామకధ యెక్కువ మందికి తెలిసి వుండటంతో అట్లాంటి వాటితో తిరగేసి తన గూబనే గుయ్యి మనిపించడం తప్ప రామాయణాని కేమీ హాని జరగలేదు!కానీ తిరిగే కాలూ తిట్టే నోరూ వూరుకోవుగా యెందుకో ఈసారి మహా భారతం చదివింది.అప్పట్లాగే తనకి అర్ధం కానివి కొన్ని తప్పులుగా కనపడినాయి.అర్జెంటుగా ఆమాంబాపతు గాళ్ళకి ఓ పదిమందికి ఫోను చేసిందిట!వాళ్ళు మహాభారతంలో అవి వున్నాయా, మాకేం తెలీదన్నారంట!వెంఠనే బుర్రకి పదును పెట్టేసింది - సంస్కృతం రాకపోతే యేం అనువాదాలు వున్నాయిగా రామాయణ విషవృక్షం కూడా అట్లాగే లాగించిందిగా "ఇదండీ మహా భారతం"అనే పుస్తకాన్ని వొదిలింది - దేశంలో వున్న స్వైరిణి పాదరేణువులంతా హర్ష పులకాంకితగాత్రులై పోయేటట్లుగా!

     యేదైనా ఒక వస్తువుని పదిమందికీ అమ్మాలంటే చూడగానే ముచ్చట గొలిపే ప్యాకింగు అవసరమని చిన్నపిల్లాడికి కూడా తెలుసు!తన జేబులో వున్న శెనిక్కాయని పక్క పిల్లోడికి అమ్మాలన్నా కూడా మట్టి తుడిచి సాపుచేసి అమ్మాలని చూస్తాడు,మరి ఈ తెలివి యేమిటో తన పైత్యకారి తనమంతా అట్ట చూడగానే తెలిసి పోవాలన్నట్టు వికారమైన బొమ్మతో వొదిలింది?తనే తెలిసీ అట్టని చూడగానే కోపమొచ్చేలా చేసి మళ్ళీ "అట్టను చూస్తే  కోపమొస్తుందేమో.  లోపలికి వెళ్ళండి. న్యాయం లేకుండా, చర్చ లేకుండా,  పరిశీలించకుండా కోప్పడితే  అది తప్పవుతుంది కదా?" అని దీర్ఘాలు తీస్తుంటే ఆ తెలివిని తెలివనే అనాలా?

        అబధ్ధాలు రెండు రకాలుగా చెప్పొచ్చు!రామాయణం విషయంలో అక్కడ లేని దాన్ని వున్నట్టు చెప్తే ఇక్కడ మహాభారతం విషయంలో తను వెక్కిరించటానికి పనికొచ్చేదాన్ని మాత్రమే వుటంకిస్తూ అక్కడే తన వాదనని వెక్కిరించే సత్యం వున్నా దాన్ని మాత్రం చెప్పకుండా వొదిలేసి చెలరేగిపోవటం చాలా గొప్ప తెలివి! గట్టిగా యెవరయినా నిగ్గదీస్తే నేను చెప్పిన పార్టు మట్టుకు అక్కడ వుందా లేదా అని యెదురుదాడి కూడా చెయ్యొచ్చు, అమ్మ స్వైరిణీ బల్లే లాజిక్కు లాగావుగా!

        అప్పుడెప్పుడో బాపుగారు అప్పుడే పోయారనే ఇది కూడా లేకుండా పాత విషయాన్నొకదాన్ని కెలికి అల్లరి చెసిన ఒక బ్లాగరు ఇప్పుడు ఆవిడకి పరమ భక్త శిఖామణి అయిపోయి అందులోని విశేష భాగాలు అంటూ తనకి తిరుగులేని వనిపించే కొన్ని చెత్త వాదనల్ని ఒక పోష్టుగా వేశాడు.ఆవిడ లాగే రండి,వాదించండి,గెలవండి అని పిలిచి తీరా వాదన గట్టిగా వుంటే ఆ కామెంట్లని ప్రచురించకుండా వొదిలేసి,కొన్నిటికి తాంబూలా లిచ్చెశాను తన్నుకు చావండన్నట్టుగా నేను చెప్పిందే ఫైనల్,ఇంక దీని గురించి వాదన అనవసరం అనీ అంటున్నాడు!మరి అంతోటి దానికి రండి,చూడండి,వాదించండి, గెలవండి అని పిలుపు లెందుకు?ఆ "స్వైరిణి పాద రేణువు" పోష్టులో ప్రచురించిన విషయాన్ని మార్చి 24 నాటి 7:28 గంటల తన కామెంటు వరకూ ఇక్కడ ప్రస్తావించదల్చుకున్నాను.అక్కడి లాగా ఇక్కడ నేను కామెంట్లని మోడరేట్ చెయ్యను.మిత్రులకి, మహాభారతాన్ని సమర్ధించదల్చుకున్న వారికి మాత్రం భాష విషయంలో హెచ్చరిక చేస్తున్నాను - మన భాష అసభ్యంగా వంటే సరుకు లేక ఇట్లా మాట్లాడుతున్నారని నింద రావచ్చు కాబట్టి జాగ్రత్తగా వుండండి!ఉషశ్రీ తెలుగు అనువాదం కొన్ని భాగాలు నా దగ్గిర వున్నాయి కాబట్టి విషయం వరకూ కంగారు పడాల్సిన పని లేదు! కాబట్టి స్వైరిణి పాద రేణువులు మాత్రం తమ బుధ్ధినీ సంస్కారాన్నీ మిళితం చేసిన వాదనల్ని నిరభ్యంతరంగా చెయ్యవచ్చు!

       మొదట స్వర్గారోహణ పర్వాన్ని గురించిన వాదనల్నే తీసుకుందాం.ఉషశ్రీ చెప్పిన దాని ప్రకారం వ్యాస భారతంలో శతాధిక పర్వాలు వున్నాయి. ప్రతి పర్వానికి పెట్టిన పేరు ఆ పర్వంలో చెప్పే కధని సూచించే విధంగా వుంటుంది.కాండలుగా,పర్వాలుగా,సర్గలుగా ప్రతి భాగానికీ పెట్టినట్టుగానే "మహా ప్రస్థానం","స్వర్గారోహణం" అని పెట్టి కధ చెప్పినా కూడా స్వైరిణికీ స్వైరిణిపాదరేణువుకీ వాళ్ళు యెక్కడి కెళ్తున్నారో అర్ధం కాలేదట!ఇంద్రుడు కనపడగానే ఆగిపోయాడేమిటీ అని అమాయకంగా ఆవిడ దీర్ఘాలు తీస్తూ అడుగుతే ఈ స్వైరిణిపాదరేణువు నేను విడమరిచి చెప్పాక కూడా కధలో స్వర్గాని కెళ్తున్నట్టు లేదుగా అని అడ్డం తిరిగి వాదిస్తున్నాడు,ఈపాటి తెలివికి అసలు వాదనకి తెగబడటం దేనికి?ఇట్లా వ్యాసభారతంలో వాళ్ళు బయలుదేరింది స్వర్గానికి చేరడానికే అని కాకుండా అస్పష్టంగా వుండేటట్టు యే అనువాదంలో వుందో చెప్తే మేమూ చదివి తరిస్తాం!తమ తమ పుణ్యవిశేషంతో యోగనిష్ఠకి సంబంధించిన ప్రయాణమైన మహాప్రస్థానంలో కూడా దేహబంధాలకి చోటిచ్చి వెనక్కి చూసుకుంటూ పడిపోయిన వాళ్లందర్నీ మోసుకుంటూ వెళ్ళాలని పిచ్చ్గివాళ్ళు మాత్రమే అనగలరు!మిగతావాళ్ళు పడిపోయినప్పుడు కూడా యెందుకు పడిపోతున్నారో చెప్పి ఆగకుండానే వెళ్ళాడనేది తెలిసి కూడా ద్రౌపది పడిపోవటాన్నే ప్రముఖంగా చెప్పడం ఆడవాళ్ళని రెచ్చగొట్టాలని కాదా?ఈ దేశపు ఆడవాళ్ళు మరీ అంత చెవుల్లో పువ్వులు పెట్టుకున్నారని అనుకుందా!రామాయణం,మహాభారతం కధల్లో యేముందో తెలియకపోయినా ఆడవాళ్ళు తమ తల్లుల ద్వారా తమ ప్రవర్తనని నిర్దేశించుకుంటున్నారు,అదొక పరస్పరాశ్రిత సంబంధానికి తమ క్షేమం కోసం కట్టుబడటం - అందులో సందేహాలు వచ్చినప్పుడు మాత్రమే సమాధానాల కోసం ఆ గ్రంధాల సారం పనికొస్తుంది!ఖచ్చితంగా పాటించి తీరాలని ఒత్తిడి కూడా చెయ్యటం లేదు,అట్లా సాగదని తెలిపేటందుకు బృహత్కధ లోని శృంగారం నిండిన చాటువులూ భారతంలోనే అక్కడక్కడా వున్నఉపకధలూ వుదాహరణలుగా నిలుస్తాయి!

        జూదం చాలా ధర్మబధ్ధంగా జరిగినట్టూ అందులో అక్రమం యేమీ లేనట్టూ కౌరవులు ఓడిపోయుంటే భానుమతినీ అట్లాగే ఈడ్చుకొచ్చేవాళ్ళు కదా అనీ,వాళ్ళూ అడవులకి వెళ్ళాల్సిందే కదా అని ఆవిడ లాజిక్కు లాగితే పిన్నిని పెళ్ళి చేసుకుని పక్కలోకి లాగాలని చూసే పైత్యకారి ఒకడు దుశ్శాసనుడికి రేప్ చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చిన ధర్మరాజుకి ద్రౌపది విడాకులు యెందుకివ్వలేదు అని అడుగుతున్నాడు?అంత నీచమయిన కామెంటుని కూడా తన సైడు వాడు వేశాడు గాబట్టి పబ్లిష్ చేసిన ఈ స్వైరిణిపాదరేణువుకి తనకి బెండు తీసే కామెంట్లలో మాత్రం అసభ్యత కనిపిస్తుంది కాబోలు?విరాట పర్వంలో ద్రౌపది భీముడితో అంటుంది "యెంతకాలం జూదమాడినా తరగని సంపద మనది,కొద్ది క్షణాల్లో మాయచేసి ఓడించారు.ఈ విరాట రాజు ఒకప్పుడు మనకి సామంతుడు. ఇప్పుడు మీ ఆన్నగారు దాసుడిగా తిరగటం, వీళ్లని సంతోష పెట్టటం కోసం నువ్వు యేనుగులతో సింహాలతో పోట్లాడటం, గాండీవి నారీజనం మధ్యన గంతులు వెయ్యడం చూస్తుంటే నాకు దుఃఖంగా వుంది" అని!తన భర్తల పట్ల అంత గౌరవం వుండి మాయోపాయంతో దుర్యోధనుడు తన భర్తల్ని ఓడించటం వల్లనే తనకి పరాభవం జరిగిందని తెలిసిన ద్రౌపది ఈ ఆడదానితో పెళ్లికి పనికిరాని గాడిదకి నచ్చేటట్టు విడాకుల ఆలోచన చేస్తుందా?ఇంత కాలం ఈ కామాంధుడి వదరుబోతు తనాన్ని చూశాక గూడా యెవడికీ వీణ్ణి నాలుగు తందామనే ఆలోచనే రావటం లేదా?ఇంకా హిందువులలో ధార్మికక్షాత్రం రగుల్కొనుట లేదా?ఒక్కసారి కూడా గెలవకుండా అన్నిసార్లూ ఓడిపోవటం చూశాకనైనా ధర్మరాజు కేవలం ఆసక్తి కొద్దీ నేర్చుకోవటమే తప్ప ప్రావీణ్యం కోసం యేనాడూ పాకులాడ లేదనీ దానికి భిన్నంగా శకుని అందులో ఆరితేరిన వానీ తెలియడం లేదా?అదే విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణంలో అశ్వధ్ధామ "యుధ్ధంలో గెలవలేమని తెలిసే మీరు ద్యూతానికి దిగి పాండవశ్రీని హరించారు.అప్పుడు మా అవసరం మీకు లేకపోయింది,ఇప్పుడు కూడా శకునినే పిలవండి" అని అంటాడే - ఆ ముక్క యేమి చెప్తుంది?భీష్ముడు కూడా ద్యూతార్జితం రాజపురుషులకి గౌరవప్రదమయిన సంపాదన కాదు,న్యాయంగా వాళ్ళ భాగం వాళ్ళకిస్తే నువ్వు క్షేమంగా వుంటావు నీ మేలు కోరి చెప్తున్నా నంటాడు.ఇంత ప్రముఖమైన సన్నివేశం కూడా స్వైరిణి చదివిన అనువాదాల్లో లేదా?

       హస్తినాపురం,కౌరవులు,దృతరాష్ట్రుడు,దుర్యోధనుడు,భీష్మద్రోణాదులు - ఇవన్నీ ఒకదాని కొకటి సంబంధం లేకుండా గాల్లో తేల్తున్న విడివిడిభాగాలు గాబోలు స్వైరిణిపాదరేణువుకి హస్తినాపురం ఓడిపోతే దృతరాష్టుడు ఓడిపోవటమేమిటో అంతుబట్టటం లేదట!ఇండియాకీ పాకిస్తానుకీ జరిగిన యుధ్ధంలో భుట్టో తుపాకీ పట్టుకుని యుధ్ధం చేశాడా?వెయ్యేళ్లు యుధ్ధం చేస్తానన్న భుట్టో చేత నిర్యుధ్ధ సంధి సంతకం యెందుకు చేయించుకుంది ఇండియా?ఈ స్వైరిణిపాదరేణువు లాజిక్కు ప్రకారం భుట్టో ఇండియా మీద పెత్తనం చెయ్యాలి గాబోలు - యేమి పిచ్చి లాజిక్కు ఇది? అసలు దృతరాష్ట్రుడికి రాజ్యార్హత లేదు - అది ఖచ్చితం!యేదో పెద్దవాడు కుళ్ళి చస్తాడని ఇప్పటి రాష్త్రపతికి మల్లే వుత్సవ విగ్రహం లాగా కూర్చోబెట్టాడు పాండురాజు, రాజ్యార్హతకీ పిత్రార్జితానికీ తేడా తెలీదా ఈ దద్దమ్మలకి ప్రజాస్వామ్యంలో కూడా తాగుబోతుకీ తండ్రి ఆస్తిలో వాటా వస్తుందిగా అని పేలుతాడు?నిజమైన రాజ్యార్హత వుండి ఆ అర్హతని నిలబెట్టుకున్న పాండురాజు పెద్ద కొడుకుగా ధర్మరాజుని యువరాజుగా అందరూ అంగీకరించినట్టు అంత స్పష్టంగా చెప్పాక గూడా వెర్రిమొర్రి మాటలు మాట్లాడితే యెవడు యెవడి గూబ గుయ్యి మనిపించాలి?!యుధ్ధాలు చెయ్యటం,రాజ్యాన్ని విస్తరించటం,అధికారిక నిర్ణయాలు చెయ్యటం అన్నీ పాండురాజు పరంగానే జరిగేవి!పాండురాజు చనిపోయాక కుంతి పిల్లలతో వస్తున్నప్పుడు యువరాజ మర్యాదలతో గౌరవంగా చూస్తారు ధర్మరాజుని, స్వైరిణి చూసినవైనా అనువాదాలలో ఆ భాగం చూస్తే తెలుస్తుంది గదా!అయినా రాజ్యం దుర్యోధనుడిదే అయినట్టూ ధర్మరాజే తనది కాని దాన్ని ఆశించే దుర్మార్గుడనే వాదన వ్యాసుడికన్నా కవిత్రయంకన్నా స్వైరిణికే యెక్కువ తెలుసునని డప్పు కొట్టుకోవడానికి తప్ప యెందుకైనా పనికొస్తుందా?

       ఉత్తర గోగ్రహణం తర్వాత యెకాయెకి కృష్ణ రాయబారం జరగలేదు!మొదట ధర్మరాజు ధౌమ్యులవార్ని పంపిస్తాడు మర్యాదగా తమ భాగం తమకి ఇచ్చి తమ్ముడి కొడుకుల పట్ల తనకున్న ప్రేమని చూపించమని,దానికి ప్రతిగా దృతరాష్ట్రుడు సంజయుణ్ణి పంపించి యెట్లాగూ వనవాసం అలవాటయిందిగా అక్కడే వుండిపోరాదా అనే బూతుసందేశం పంపిస్తాడు,అయినా తమాయించుకుని ఆఖరుసారిగా కృష్ణుణ్ణి పంపిస్తాడు ధర్మరాజు!ఈ స్వైరిణికీ స్వైరిణిపాదరేణువుకీ ధర్మరాజు తన అర్ధరాజ్యం కోసమే యుధ్ధం చేశాడని యెట్లా అర్ధమయిందో తెలియదు గానీ పేర్లు చెప్పి మరీ తలా ఒక గ్రామం ఇచ్చినా చాలు నంటే సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను పొమ్మన్నాకే గదా యుధ్ధం జరిగింది?అంత ధీమాగా హస్తినాపురాన్నే కొట్టాక కూడా అది వొదులుకుని పోవటం పిచ్చివాడు తప్ప యెవ్వడూ చెయ్యడు గదా!గెల్చిన వాడికి అది ధర్మవిజితమే కదా, ఇంకా దాన్ని తనని అడుక్కుతినమని అన్న ధృతరాష్ట్రుడి కిచ్చి తను యెక్కడికో పోవటమేమిటి అర్ధం లేకుండా?!యుధ్ధం పూర్తయ్యాక ధర్మరాజు  అసలు దృతరాష్ట్రుడి రాజ్యార్హతతో యేమాత్రం సంబంధం లేకుండానే హస్తినాపురానికి పూర్తి హక్కుదారుడు అని తెలిసి కూడా తను అర్ధరాజ్యం కోసమే యుధ్ధం చేశాడు గాబట్టి హస్తినాపురాన్ని దృతరాష్ట్రుడికి ఇస్తేనే ధర్మం అంటే ఇండియాకీ పాకిస్తానుకీ జరిగిన యుధ్ధంలో పాకిస్తాను సైన్యం మాత్రమే ఓడిపోయింది గానీ భుట్టో ఓడిపోలేదనీ ఆ నిర్యుధ్ధ సంధి పత్రం మీద బలవంతంగా సంతకం పెట్టించుకోవటం అన్యాయమనీ అన్నట్టే గదా?

          గీతలోని కర్మయోగానికీ భారతం చివరి ఫలశ్రుతికీ ముడిపెట్టి వెక్కిరించటం స్వైరిణికే చెల్లింది - బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టటం లాంటిది!ఫలితం మీద ఆశ లేకుండా యే గాడిదా పని మొదలు పెట్టడు,భగవద్గీతలో చెప్పింది అంతా ఫలితం గురించిన యావతో కక్కుర్తితో వుండకు,ఫలితం నీ ఆశలకి విరుధ్ధంగా వచ్చినా కుంగిపోకు,ఒక పని నువ్వు తప్పనిసరిగా చెయ్యాల్సినదయితే ఆ పని నీకు లాభమైనా నష్టమైనా ఒక్కలాగే చెయ్యమని చెప్తుందే తప్ప ఫలితం లేని కర్మ గురించి చెప్పదు!అసలు ఫలితం లేని కర్మా వుండదు,ఫలితాన్ని ఆశించని మనిషీ వుండడు - అది వ్యాసుడికి స్వైరిణి కన్నా బాగా తెలుసు!అర్ధం కాకపోతే మూసుకుని కూర్చోవాలి గానీ సంబంధం లేనివాట్ని కలపకూడదు,వున్నవాట్ని వున్నట్టుగానే అర్ధం చేసుకోవాలి!మహా భారతం అనే గ్రంధాన్ని చదవాలని అనుకున్న వాడెవడయినా దాన్నుంచి యెంతో కొంత నేర్చుకుందామనే తెరుస్తాడు - అది కూడా తెలియదా ఈ స్వైరిణికి?మిల్స్ అండ్ బూన్ పుస్తకం తెరిచేవాడు కాలక్షేపాన్ని ఆశిస్తాడు,భారతాన్ని తెరిచేవాడు జ్ఞానాన్ని ఆశిస్తాడు - చెంబు కొద్దీ గంగ!

         అసలు ఇలాంటి సాహిత్యం అన్ని మతాల్లోనూ వున్నా ఈ కుహనా మేధావులు హిందూ మతం మీదనే పడి యేడుస్తా రెందుకో?అంబేద్కర్ గారు రాముడి పుట్టుక గురించి అక్రమ సంబంధం వల్ల పుట్టాడు అనే విధంగా వ్యాఖ్యానించినప్పుడు మరి యేనుగు కలలోకి వస్తే పుట్టిన పిల్లాడు అక్రమ సంతానం కాబోలు అని మనం అంటే యెట్లా ప్రతిస్పందిస్తారు?క్రైస్తవ మతంలో ఉండి హిందూ పురాణాల్ని అపహాస్యం చేసే ఐలయ్య గారూ ఆయన అభిమానులూ అబ్రహాము ద్వారా కాకుండా దేవదూత వల్ల పుట్టిన యేసు అక్రమ సంతానం అని ఒప్పుకోగలరా?వారి వారి మతాల్లో వున్న హేతువిరుధ్ధమైన విషయాలు వారికెంత ప్రీతిపాత్రమో హిందువులకీ అంతే కదా అని యెందుకు అనుకోరు,హిందువులు వాజెమ్మల వలె ఇట్లాంటివి నిగ్గదియ్యటం లేదు గనకనా!ఈ స్వైరిణీ స్వైరిణి అభిమానులూ తాము హేతువాదులమనీ ఈ కధలన్నీ హేతువిరుధ్ధంగా అన్యాయంగా వుండటం వల్లనే విమర్శిస్తున్నామని చెప్పుకుంటున్నారు గాబట్టి ఇంత అరిభీకరంగా అన్ని మతాల్నీ వెక్కిరించగలరా!

       తనకి అర్ధం కానివన్నీ తప్పులని విర్రవీగితే మరోసారి చావుతిట్లు తినాల్సి వస్తుంది స్వైరిణి,అయినా పాప్యులారిటీ కోసం యెంత చవకబారు పన్లు చెయ్యటానికైనా దిగజారేవాళ్లని యెన్ని తిట్టినా యేముంటుంది - వొదిలెయ్యటమే కాకికేమి తెలుసు సైకోఅనాలిసిస్ అని!ఈ స్వైరిణిపాదరేణువు మహాభక్తిగా విశేషభాగాలు అంటూ ప్రచురించిన వాటిని బట్టే నాకు ఈ తుక్కుపుస్తకం వల్ల మహాభారతానికి యెలాంటి ప్రమాదమూ రాదని అర్ధమై పోయింది,ఇంకెందుకు ఆందోళనతో కూడిన హైరానా?!


దీంతో ఆగకుండా మొత్తం పుస్తకాన్నే ప్రచ్రురిస్తే కానీ ఖర్చు లేకుండా చదివి నవ్వుకుంటా!

Wednesday, 11 March 2015

కాదంబరి లాగ ప్రేమలేఖ రాయగలిగే అమ్మాయి యెక్కడయినా ఉందా?

      ఇవ్వాళా రేపూ వయసులో ఉన్నవాళ్ళు కొంచెం రొమాంటిక్ మూడ్ కావాలంటే "మిల్స్ అంద్ బూన్" వాళ్ళ పుస్తకాల్లో యేదో ఒకటి రాక్ లోంచి బైటికి తీస్తారు!వీట్ని చాలా వ్యాపారాత్మకంగా రాస్తారు - ఎట్లాగంటే ఒకసారి చదివిన పుస్తకాన్ని యేడాది తర్వాత తీసినా చదివిన కధేగా అనిపించి బోరు కొట్టేటట్టు రాస్తారు!మొదటిసారి చదివినప్పుడు వుర్రూత లూగించాలి, రెండోసారి చదువుతుంటే వుసూరు మనిపించాలి - లేకపోతే వాళ్ళ కొత్త పుస్తకాలికి గిరాకీ ఉండదే?బిజినెస్సు ట్రిక్కు, మన చేతి చిలుమొదిలించాలని!

       కానీ యెన్ని సార్లు చదివినా బోరు కొట్టడం అటుంచి కొత్త అర్ధాలు తోస్తూ పులిసిన కొద్దీ కిక్కు పెంచే ఫ్రెంచి మద్యం లాంటి కధ మనవాడే ఒకడు రాశాడు, ప్రపంచమంతా ఒక శతాబ్దకాలం నుంచీ ఇంగ్లీషులోకి అనువాదం చేసుకుని చదువుతూ పోటీలు పడి మెచ్చుకుంటున్నారు!అదే సంస్కృత సాహిత్యంలో కల్లా అత్యధ్భుతమైన రెండు గద్య కావ్యాలని రాసిన బాణభట్టు యొక్క అపూర్వ కావ్యసృష్టి - కాదంబరి!పేరు కర్ధం నిజంగా మత్తుగానే ఉంటుంది, యెందుకంటే కదంబ వృక్ష సంబంధమయిన మధువు - ఇప్ప కల్లు!దీని ఎఫెక్టుకి మత్తెక్కి పోయి కాబోలు కన్నడ,మరాఠీ భాషా సాహిత్యాల్లో యెప్పట్నుంచో నవల,ప్రేమ కధ లాంటి వాటి కన్నిటికీ "కాదంబరి" అనేది పర్యాయ పదమైపోయింది - తస్స చెక్క!

      అతడి రచనలే అధ్భుతం అనుకుంటే అతడి జీవితం అతడి రచనల కన్నా గొప్పగా వుంటుంది!దాదాపుగా మహాకావ్యాలు రాసినా కేవలం కవిత్వం అల్లినా రచయితల జీవితం చాలా సాధారణంగా వుంటుంది.చిన్నప్పుడే కవిత్వంలో మంచి ప్రతిభ చూపించటం,మంచి గురువు దగ్గిర చందస్సు,అలంకారం అవీ నేర్చుకోవటం,అప్పటి పధ్ధతి ప్రకారం వయస్సు రాగానే పెళ్ళి చేసుకోవటం,తీరిగ్గా కూచుని తమ ప్రతిభకి సాన పెట్టుకుని గొప్ప కావ్యాల్ని రాసి సాటివాళ్ళని మెప్పించటం,అవి కాలాతీతమయిన కావ్యాలుగా ఇతర్లు పొగుడుతుంటే సంతోష పడటం - ఇంతే!కానీ బాణభట్టు జీవితం అలా కాదు,విషాదం,సంక్షోభం,ప్రతిభ,స్నేహం,విశృంఖలత్వం ,ప్రణయం లాంటి అనుభూతులతో ఇష్తమొచ్చినట్టు చెలరేగిపోయిన క్షీరసాగరమధనం - అందుకే అతని సాహిత్యంలో మనిషి జీవితానికి సంబంధించిన అన్ని అంశాలూ కలగల్సిపోయి కనబడుతూ "బాణోచ్చిష్టం జగత్సర్వం" అనే నానుడి పుట్టింది!

      తల్లి చిన్ననాడే స్వర్గస్థురాలైంది.వూహ తెలిసి అనుబంధం బలమయిన వయస్సులో తండ్రి కూడా మరణించాడు!తండ్రి దూరమవడం అతని జీవితంలో అత్యంత దుర్భరమైంది!ఆ బాధ గురించి హర్ష చరిత్రలో చెప్పిన  తనసొంత జీవితంలోనూ ఒకసారి చెప్పాడు, కాదంబరిలో వైశంపాయనుడు చిలుక జన్మలో తండ్రిని పోగొట్టుకున్న దుఃఖాన్ని పలికించేటప్పుదు మళ్ళీ తన దుఃఖాన్నే పలికించినంత యదార్ధంగా వర్ణిస్తాడు!అపారమయిన ప్రతిభ గల ఆ తండ్రిని పోగొట్టుకున్న కుర్రవాడు దేశదిమ్మరిగా కొంతకాలం తిరిగాడు - విషాదంలో కూరుకుపోకుండా నిత్యచైతన్యంతో కదిలి యెందరో మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నాడు!.కలిసిన వ్యక్తులంతా అధ్భుతమయిన వ్యక్తిత్వాలతో అలరారిన వాళ్ళే - కవి వేణిభరతుడు,నర్తకి తాండవిక,కధకుడు జయసేనుడు,ఐంద్రజాలికుడు కరాళుడు,దొమ్మరాటల చకోరాక్షుడు,జైనసాధువు వీరదేవుడు!అంతటి సంచలనాత్మకమైన జీవితం గడిపి తిరిగి తన సొంతవూరుకే వచ్చాడు వయోభారంతో జ్ఞానభారంతో వంగి?ఇంతటి వైవిధ్యభరితమైన జీవితం గడిపిన కవి సాధారణమైన రచనలు యెట్లా చేస్తాడు?!

      ఇతను రాసిన హర్ష చరిత్ర వల్లా అందులోనే తన జీవితాన్ని కూడా వర్ణించుకోవడం వల్లా చాలా ఖచ్చితంగా ఇతను క్రీ.శ 7వ శతాబ్దం మొదటి భాగంలో జీవించాదని చెప్పవచ్చు."గుప్తుల కాలం స్వర్ణయుగం" అని మనం చిన్నప్పుడు చదువుకున్న అత్యంత ప్రఖ్యాతుడైన గుప్తవంశపు రాజు హర్షుడు తండ్రి పోయాక గడుపుతున్న సంచార జీవితం గురించి విని పిలిపించుకుని తన దగ్గిర ఉద్యోగ మిచ్చాడు. హర్షునితో విభేదాలు యేమీ లేకపోయినా కనిపించని ప్రమాదాల మయమైన ఆ రాజోద్యోగపు జీవితం యెక్కువ కాలం గడపలేక సొంతవూరు ప్రీతికూటం చేరుకుని అక్కడే హర్షచరిత్ర,కాదంబరి అనే రెండు గద్యకావ్యాల్ని రాశాడు!

      మన తెలుగులో వున్న మాండలిక భేదాల వంటివే అయిన పైశాచి,మాగధి లాంటి వాటిని సంస్కరించి అన్నింటిలో వున్న గొప్ప విషయాలని సరయిన పాళ్ళలో కలిపి క్రీ.పూ 4వ శతాబ్దంలో పాణిని అనే వ్యాకరణ వేత్త సంస్కృత భాషని నిర్మించాడు.ఆ సంస్కృత భాషలోనే బాణభట్టు కాదంబరిని కల్పించాడు.రెండూ ఒకదానికోసం ఒకటి పుట్టాయా అన్నట్టు జరిగింది కాదంబరి రచన!పాణిని యేం మాయ చేసాడో తెలియదు గానీ సంస్కృతం ఒక వైపు నుంచి చూస్తే గట్టిగా పట్టేసిన నియమాలతో చిక్కురొక్కురుగా వున్నట్టు కనిపిస్తుంది,మరో వైపు నుంచి చూస్తే పదాల్నీ అర్ధాల్నీ యెట్లా కావాలంటే అట్లా వంచగలిగిన తీగలు సాగే గుణమూ ఉంది.ఇంగ్లీషులోనూ కాంపౌండ్ నౌన్స్ అని ఒకటి కన్నా యెక్కువ పదాల్ని కలిపేసి పుట్టించిన పదాలు కొన్ని వున్నాయి - "bluebird","horseshoe","newsprint" లాంటివి. "newsprint"అనే పదాన్ని "news print" గానూ చదవ వచ్చు లేదంటే "new sprintగానూ చదవవచ్చు!కానీ సంస్కృతం మాత్రం ఇలాంటి కాంబినేషన్లని అత్యధ్భుతంగా పుట్టించగలదు.పైగా ఒకే మాటకి సమానార్ధకాలు కూడా వున్నాయి.ఈ శక్తి వల్లనే ద్వ్యర్ధి కావ్యాలూ త్ర్యర్ధి కావ్యాలూ పుట్టాయి!కాదంబరిలోనే చంద్రాపీడుడు చంద్రాయుధం అనే అశ్వాన్ని చూసినప్పుడు అది అతనికి "చక్రవర్తినరవాహనోచితం"గా కనిపించిందట!దీన్ని "చక్రవర్తియైన నరపాలకుడికి వాహనంగా వుందతగినది" అని గానీ "చక్రవర్తి యైన నరవాహనుడనే ఫలానావ్యక్తికి వాహనంగా వుండతగినది" అని గానీ పూర్తిగా ప్రతి పదాన్నీ మరింత విడదీసి "చక్ర-వర్తి-నర-వాహన-ఉచితం" అని గనక తీసుకుంటే "చక్రాన్ని ప్రదర్శించగలిగిన(సమర్ధతని చూపించగలిగిన) యే నరుని కైనా వాహనం కాదగినది" అని కూడా అర్ధం చెప్పుకోవచ్చు!

       మాట వరసకి "వాక్యం రసాత్మకం కావ్యం(రసం చిప్పిల్లే ఒక్క వాక్యం అయినా కావ్యమే!)" అని ఒప్పుకున్నా కావ్యం అనేసరికి అందరూ ఒప్పుకోవాల్సిన కనీస లక్షణాలు కొన్ని ఉండాలి కదా!ఆసక్తిని కలిగించే కధ ఖచ్చితంగ ఉండాలి. వర్ణనలో వైవిధ్యం గనక ఉంటే యే వస్తువునైనా యెంత సుదీర్ఘంగానైనా వర్ణించవచ్చు, అధ్భుతంగా ఆనిపించే సన్నివేశాల్ని కధనంతా ఆపేసి అయినా సరే మరింత విస్తారంగా వర్ణించవచ్చు,భాష మీద తనకున్న ఆధిక్యాన్ని చూపిస్తూ పదాలతో ఆడుకోవటం,పాఠకుడి మీద ప్రహేళికలు విసరటం,కొన్నింటికి తనే జవాబులు చెప్పి కొన్నింటిని నువ్వే కనుక్కోమని ఛాలెంజి చేసి వొదిలెయ్యటం - ప్రపంచ సాహిత్యంలో ప్రతిభ గల రచయితలు చేసిన అన్ని ప్రక్రియల్నీ "కాదంబరి" అనే ఈ ఒక్క కధలోనే ఇమిడ్చాడు బాణభట్టు, పాశ్చాత్యులు పొగిడారంటే పొగడరా మరి!ఇంగ్లీషులో "యూఫెమిజం" అనే మాట యెప్పుడయినా విన్నారా?అది క్రీ.శ 16లో జాన్ లిల్లీ అనే రచయిత చేసిన హాస్య రచన "Euphues" నుంచి పుట్టిన పదం.కానీ బాణుడు "కాదంబరి"ని అంతకు చాలాకాలం ముందే ఒక విశేషణంగా మార్చేశాడు!

    సంస్కృత సాహిత్యంలో గద్యకవులు చాలా చాలా తక్కువ - "స్వప్న వాసవదత్తం" రచయిత సుబంధు,"హర్షచరిత్ర" మరియు "కాదంబరి"ని రచించిన బాణుడు,"దశకుమార చరిత్ర" రచయిత దండి!ప్రతిభలో యెవ్వరూ తక్కువవాళ్ళు కాకపోయినా కాదంబరి వల్ల బాణభట్టు వీళ్లందరిలోనూ ప్రధముడిగా నిలిచాడు!

       కధ ఇట్లా వుంటుంది - లక్ష్మీదేవికి శ్వేతకేతువు అనే మునికీ నయనరతి వల్ల పుండరీకుడు అనే కొడుకు పుడతాడు.తండ్రి దగ్గిర పెరుగుతూ బ్రహ్మచర్యంలో విద్య నేర్వాల్సిన వయసులో మహాశ్వేత అనే అప్సర కాంతతో ప్రేమలో పతాడు!బలహీన మనస్కుడైన వీడు ప్రేయసిని ఇప్పటికిప్పుడు చూడాలని కబురు పెట్టి తను వొచ్చేవరకూ కూడా విరహానికి ఆగలేక వెన్నెల కురిపిస్తూ తన విరహాన్ని అంతగా పెంచిన చంద్రుణ్ణి "నాలాగే జన్మ నుంచి జన్మకి ప్రియురాలి విరహంతో మరణించుదువు గాక!" అని శపించి ప్రాణాలు విడుస్తాడు?చంద్రుడికి తిక్కరేగి "నాతోపాటూ నువ్వూ అట్లాగే అఘోరిస్తావు!" అని ప్రతిశాపమిచ్చి దానివల్ల తన లోకానికి సంబంధించిన మహాశ్వేత అనే అమ్మాయికి అన్యాయం జరుగుతుందని తెలిసి జన్మ నుంచి జన్మకి అనే మాటని బట్టి శాపాన్ని రెండు జన్మలకి పరిమితం చేసి ఆ జన్మలు పూర్తయ్యాక ప్రియసమాగమం జరిగే విధంగా శాపఫలితాన్ని మార్చి కధని ముందుకు తీసుకెళ్ళటం కోసం తను చంద్రాపీడుడనే రాజుగారబ్బాయిగా పుడతాడు.పుండరీకుడు వైశంపాయనుడనే పేరుతో మంత్రిగారబ్బాయిగా పుట్టి అతనికి స్నేహితుడిగా వుంటాడు.ఒకసారి అన్ని జానపద కధల్లోలాగే రాజుగారబ్బాయి దారితప్పి ఒక శివాలయంలో గంధర్వగానం విని కాదంబరిని కలుస్తాడు.ఇక్కడ కాదంబరి గురించి బాణుడు వర్ణించిన భాగం చదువుతుంటే మా బంగారమే గుర్తొచ్చింది, అంత చక్కని మనిషికి పొట్టిబుడంకాయని నేను దొరికాను - యేమిటో పాపం!తను తన స్నేహితురాలికి ప్రియవియోగ దుఃఖాన్ని తప్పించడానికి ఇక్కడి మూర్తికి సంగీతార్చన చేస్తున్నానని చెప్పటం,ఇతనూ మర్యాదస్తుడే నని ఆమె తెలుసుకోవటం, ఆమె వెంట వాళ్ల లోకం వెళ్ళి ఆమె తల్లిదండ్రుల్ని,మహాశ్వేతని చూడటం లాంటి కధ కొంత నడిచాక వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ కూడా పుడుతుంది!ఈ లోపు వైశంపాయనుడు కూడా వీళ్ళని కలిసి మహాశ్వేతని చూసి ఈ జన్మలో కూడా ప్రేమిస్తాడు.ఫలితంగా శాపప్రభావం వల్ల ఈ మగవాళ్ళిద్దరూ అప్పుడు మరణించి చంద్రాపీడుడు శూద్రకునే పేరుతో జన్మించి రాజుగా రాజ్యమేలుతూ ఉంటాడు.వైశంపాయనుడిగా ఉన్న పుంరీకుదు మధ్యలో చంద్రాయుధం అనే గుర్రంగా  మారి తన స్నేహితుడికే వాహనంగా మారి తర్వాత ఆ జన్మ అంతమై చిలుకగా పుడతాడు.ఈ చిలుక తండ్రిని పోగొట్టుకుని రెక్కలు కూడా మొలవని నిస్సహాయ స్థితిలో ఉన్న దశలో జాబాలి అనే ఋషి సాకి స్వస్థత కూర్చి "నీ మితిమీరిన ప్రణయమూ వాచాలత్వమే నిన్నీ స్థితికి తీసుకొచ్చింది" అని తిడుతూ పాత కధనంతా విప్పి చెప్తాడు.అప్పుడు మళ్ళీ లక్ష్మీదేవి శబరకాంతగా రూపం మార్చుకుని ఈ చిలుకని ఒక పంజరంలో పెట్టి తీసుకెళ్ళి శూద్రక మహారాజు ముందు పెడుతుంది!జాబాలి చెప్పినప్పుడు కూడా విని గుర్తుంచుకోవడమే తప్ప తనకి సొంతంగా గుర్తు రాని వైశంపాయనుడనే చిలుకకి స్నేహితుణ్ణి చూగానే కధ మొత్తం తనకే గుర్తుకొస్తుంది!కధ అంతా విన్నాక శూద్రకుడికీ గుర్తుకొస్తుంది!పరిష్కారం అప్పటి జన్మల్ని వొదిలెయ్యటం!అట్లా చెయ్యగానే పుంరీకుడూ చంద్రాపీడుడూ తమ రూపాల్ని పొంది యెవరి ప్రేయసిని వారు పెళ్లి చేసుకోవదంతో కధ సుఖాంత మవుతుంది!

          నేను తెలుగులో ఈ కధని చదివింది పేరాల భరతశర్మ అనే ఆయన పీ.హెచ్.డీ కోసం రాసిన సిధ్ధాంత వ్యాసం లో నుంచి!తెలుగు సాహిత్యంలో చీపుళ్ల గురించీ పేడతట్టల గురంచే కాక ఇట్లాంటి మంచివాటి గురించి కూడా అప్పుడప్పుడూ పరిశోధనలు చేస్తూ వుంటారని అప్పుడే తెలిసింది నాకు!సిధ్ధాంత వ్యాసం అంటే బోల్డు విశ్లేషణలు చెయ్యాలి ఒక వాదం మొదలెట్టి దానికి యెన్నో నిరూపణలు చూపించాలి అనుకుంటే మాత్రం ఆ పేరుతో ఆయన పీకిందేమీ లేదు గానీ కధలో కొంచెం అదోమాదిరిగా వుండే పాత్రకి లక్ష్మీదేవినే యెందుకు తీసుకున్నాడు బాణుడు అనే పాయింటుని మాత్రం చక్కగా విశ్లేషించాడు!ద్రౌపదీమానసంరక్షణం సన్నివేశానికే ధర్మరాజు ద్రౌపదిని రేప్ చేసుకోవటానికి దుశ్శాసనుడికి పర్మిషన్ ఇచ్చేశాడు అని వాగే చిత్తకార్తె కుక్కలు వున్న ఈ కాలంలో ఆ విశ్లేషణ చాలా అవసరమే గానీ చాలాకాలం క్రితం చదవటంతో గుర్తు రావడం లేదు.నా సొంత విశ్లేషణ యేమిటంటే ఈ కధ మొత్తం చంద్రుడి చుట్టూ తిరుగుతుంది!కాదంబరి తల్లిదండ్రుల్ని ఒక జీవితకాలం పాటు ప్రేమగా గడిపిన వాళ్ళు  వార్ధక్యంలో యెట్లా వుంటారో చూపిస్తాడు!ఆ విధంగా ఈ జంటలలో "మిల్స్ అండ్ బూన్" కధల్లో చూపించినట్టు మూడు ముద్దులూ ఆరు సంభోగ దృశ్యాలూ కాకుండా ఆయా వ్యక్తుల మధ్య వుండే అనుబంధాలకి విలువ ఇస్తాడు గనక అక్క లోపించింది సోదర సోదరీ బంధం మాత్రమే గనక లక్ష్మీదేవిని కధలోకి తీసుకురావడం జరిగి ఉండొచ్చు!ఈయన ఓపిగ్గా చేసిందల్లా "కాదంబరీ లోచనానందా చంద్రా!" లాంటి భాషతో బాణబట్టు రాసింది రాసినట్టు తెలుగులోకి అనువదించటమే!

       అంత గొప్ప కధలో కధానాయకి అయిన కాదంబరి అనే అమ్మాయి చంద్రాపీడుడనే అబ్బాయికి తనకి అతనంటే ప్రేమ పుట్టిన తొలినాళ్లలో తన మనస్సులో కొత్తగా పొటమరిస్తున్న భావాల్ని చెప్పుకుంటూ ఒక వుత్తరం రాస్తుంది! అంతా చదివాక మీరొప్పుకుంటారో లేదో గానీ నా అభిప్రాయం మాత్రం ఒకటే - ప్రపంచంలో వున్న ప్రేమలేఖా సాహిత్యం అంతా వాస్తవ వ్యక్తులు రాసినవి,కానీ ఆ కండిషన్ తీసేసి దీన్ని కూడా వాటిలో చేరిస్తే మొదటి బహుమతి మాత్రం దీనికే ఇవ్వాలి న్యాయంగా!ఇంతవరకూ నా పోష్టుల్ని చాలా ఓపిగ్గా నిదానంగా చదివిన వాళ్ళు కూడా "ముందు టపా టైటిలుకి న్యాయం చెయ్యవయ్యా మహప్రభో! టెన్షన్ ఆగట్లేదు - ఆ ఉత్తరమేదో చూపించు?" అని తిట్టుకుంటున్నారని నాకు తెలుసు, ఇదిగో చదవండి."గొప్పదగు నీ ప్రేమను నేనెరుగుదును.మిగుల మృదువైన దిరిసెన పువ్వువలె మెత్తని స్వభావము గల స్త్రీజనమునకు ఇంతమాత్రము ప్రాగల్భ్యము ఎట్లు కలుగును? అందును బాల్యముననున్న కుమారికల కెట్లు కలుగును?ఏ యింతులు తామై భర్తలకు సందేశము నంపుదురో, భర్తల వద్దకు తెగించి వెళ్ళుదురో అట్టివారు సాహసకారిణు లగుదురు.అయినను సాహసించి పంపుచున్న నేను మిక్కిలి సిగ్గిలుచున్నాను.ఇంతకు యేమని వార్త నంపుట? నీవు నాకు అతి ప్రియుడవు అనినచో పునరుక్తి దోషము.నీకు నేను ప్రియురాలను అను మాట వివేకహీనము.నీయందు నాకు గొప్ప అనురాగము కలదు అనిన అవి వేశ్య పలుకులగును. నిన్ను విడచి బ్రతుకజాలను అనినచో అనుభవ విరుధ్ధమగు మాట యగును. మన్మధుడు నన్ను పరాభవించుచున్నాడు అనినచో అది నా దోషము బయటపెట్టుకొనిన తెలివితక్కువ యగును. అదికాదు,మన్మధుడు నీకు నన్ను ఇచ్చివేసినాడు అనినచో నీకు దగ్గిరవుటకు పన్నిన పన్నుగడ యగును. బలాత్కారముగ హరింపవలసినవాడవు అనినచో నది కులట యొక్క పొగరు అగును.అవశ్యము రావలెను అనినచో సౌభాగ్యము వలన గల్గు అహంకార మగును. నా యంత నేనే వచ్చుచున్నాను అనినచో స్త్రీ చాపల్య మగును.ఈ నీ దాసి నీ యందే దక్క ఇతరులందు అనురాగము లేనిది అనినచో మనసునందలి భక్తిని వెల్లడించుకొను తేలికతన మగును. నిరాకరింతువేమో యను సందేహముచే వార్త నంపలేదు అనినచో నిరాకరించుట యెఱుగని వానికి నిరాదరణ నేర్పినట్లగును. నన్ననుసరించి జీవించువారు నాకై దుఃఖింతురేమో యని యెంచనట్టి కఠినురాలను అనుట అత్యంత ప్రణయ ప్రకటన మగును. నా మరణముచే నీయందు నాకెంత ప్రేమ గలదో తెలిసికొనగలవు అందునా?మరణము నాపట్ల ఊహించరానిది.కావున ఏమని వార్త నంపుట?" ఈ చివరి వాక్యం కాదంబరికే కాదు బాణభట్టుకి కూడా వర్తిస్తుంది ఆ భాగం రాయగానే బాణభట్టు భౌతికంగా అస్తమించినా కాదంబరి కావ్యం వల్ల చిరంజీవిగా ఉన్నాడు గాబట్టి?


(కధ ఇంతటితో ఐపోలేదు,ఇంకా వుంది)

Sunday, 8 March 2015

ఒక పైత్యకారి కమ్యునిష్టుతో విచిత్ర సంభాషణ ఫలితం పొంతన లేని అసమన్వయ సుత్తి?!








Hari Babu Suraneni said...
కొన్ని కీలకమయిన ప్రశ్నలకి జవాబు చెప్తారా?
1).మానవుడు వస్తుగతవాది అని స్మిత్తుగారు చెప్పినది మార్క్సుగారు కూడా వొప్పుకున్నారు గనక మీరూ కాదనకుండా వొప్పేసుకున్నారు.

కానీ ఈ వస్తుగతవాది అయిన మనిషి వర్గరహిత సమాజం రాగానే యే ప్రతిఫలమూ ఆశించకుండా సొంత ఆస్తిని రద్దు చేసేసుకుని అదనపు విలువని సమాజపరం చేసేస్తాడని మార్క్సుగారు చెప్పినప్పుడు మీకు అనుమానం రాలేదా?

2).వర్గరహిత సమాజంలో కూడా పుట్టుకతో మనిషి వస్తుగతవాదిగానే వున్నప్పుడు అతన్ని వర్గరహిత సమాజపు లక్షణాలకు పట్టి వుంచటానికి ఒక చట్రం యేదో ఒక రూపంలో అవస్రమవుతుందనే కామన్ సెన్సు కూడా లేకుండా "వర్గరహిత సమాజం రాగానే రాజ్యం అతమైపోతుంది" అని పిట్టకధ చెప్తే మీరెట్లా నమ్మారు?

3).వర్గరహిత సమాజం రాగానే అంటే యెప్పటికి?దాన్ని గుర్తు పట్టటం యెట్లా?అంత గొప్ప శాస్త్రీయమైన సిధ్ధాంతంలో లక్ష్యం గురించిన వర్ణనలన్నీ పౌరాణికులు స్వర్గం గురించి చెప్పే పిట్టకధల్లాగా కల్పనాత్మకంగా పరమ అశాస్త్రీయంగా వుండటానికి కారణ మేమిటి?

మీరు గనక ఈ సందేహాలన్నిటికీ శాస్త్రీయంగా జవాబులు చెప్పగలిగీతే నేనిక యెక్కడా మీ సిధ్ధాంతాన్ని విమర్సిస్తూ పల్లెత్తు మాత కూడా అనను - ఒట్టు!
FEBRUARY 24, 2015 AT 4:47 PM








Marxist Hegelian said...
రాచరికభూస్వామ్య వ్యవస్థని రద్దు చేస్తే రాజుగారి స్వేచ్ఛ పోతుందని పెట్టుబడిదారీ ప్రజాస్వామికవాదులు బాధపడరు. రాజుకి అధికారం వస్తుగతం అని తెలిసినా పెట్టుబడిదారీ ప్రజాస్వామికవాదులు రాజుని సింహాసనం నుంచి తోసేస్తారు. అలాగే పెట్టుబడిదారునికి అదనపు విలువ వస్తుగతం అని కమ్యూనిస్త్లకి తెలియకపోవడం జరగదు.
FEBRUARY 25, 2015 AT 9:43 AM








Hari Babu Suraneni said...
అడిగిన దానికీ చెప్పిన దానికీ పొంతన వున్నట్టు మొత్తం చద్వితే మెడమీద తలకాయ వున్నవాడెవ్వడూ ఒప్పుకోడు,అది తెలుసా?నా ప్రశ్నలు నీకు సరిగ్గా అర్ధం కాలేదు గాబట్టి ఈసారి పాయింట్ బై పాయింటడుగుతాను.నువ్వు కూడా అట్లాగే జవాబు చెప్పు,సరేనా?

నేను అదనపు విలువ నిర్వచనము అడగలేదు.వర్గరహిత సమాజం గురించిన వర్ణనా అందులోని శాస్త్రీయతా అడిగాను.
1.నాకు కావలసిన క్లారిఫికేషన్ పెట్టుబడి దారులు కాదు,వర్గరహిత సమాజంలో పుట్టే పిల్లలు పుడుతూనే వస్తుగత స్వభావాన్ని వొదిలేసుకుంటారా>
2.ఒకడు పెట్ట్టుబడి దారుగా మార్తాడా మరొకలా మార్తాడా అనేది తర్వాత తెలుస్తుంది.కానీ పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా వర్గరహిత సమాజానికి అలవాటు పడిపోతారా?
3.వర్గరహిత సమాజం యొక్క లక్షణాలు యేమిటి?అందులో హాయిగా సర్దుకుపోగలిగిన మనుషుల మౌలిక స్వభావం యెట్లా వుంటుంది?
4.ఒక ప్రాంతం లోని వ్యక్తులంతా వర్గరహిత సమాజంలోకి ప్రవేశించేశారని యెట్లా గుర్తుపట్టాలి?
5.వర్గరహిత సమాజం ఒకసారి వునికిలోకి వచ్చినా అది శాశ్వతంగా దానంతటదే కొనసాగుతుందా లేక అందులోని వాళ్ళు దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సి వుంటుందా?
6.దాన్ని కొనసాగించటానికి ఒక యంత్ర్రాంగం తప్పనిసరి అయితే రాజ్యం అన్నది పోనట్టే గదా,మరి వర్గరహిత సమాజం రాగానే రాజ్యం పోతుంది అంటే నువ్వెట్లా నమ్మావు?
7.నువ్వు పాటించే సిధ్ధాంతంలోనే శాస్త్రీయత లేకపోయినా నమ్ముతున్నావంటే నువ్వు నమ్మేది మూఢణమ్మకం కాదా?
8.నువ్వే ఒక అశాస్రీయమైన సిధ్ధాంతాన్ని నమ్ముతూ హిందూత్వం,అది పాటించే వావి వరసలూ అశాస్త్రీయం అని యెట్లా అనగలుగుతున్నావు?
9.నేను అడుగుతున్నది నీ సైధ్ధాంతిక కార్యాచరణకి నువ్వు యేర్పరుచుకున్న లక్ష్యం శాస్త్రీయమైనదేనా అని,సూటిగా అడిగిన దానికి తిన్నగా తడుముకోకుండా జవాబు చెప్పు.
FEBRUARY 27, 2015 AT 10:12 AM








Marxist Hegelian said...
నువ్వు అడుగుతున్నది ఏమిటి? కొందరు వీధులు తుడవాలి - కొందరు వీధులు తుడవకూడదు, కొందరు తెల్ల చొక్కాలు వేసుకుని లెక్కలు వ్రాయాలి - కొందరు యంత్రాలని నడిపించాలి అనుకునేవాళ్ళు పెట్టుబడిదారీ సమాజంలో తప్పకుండా ఉంటారు. సొంత ఆస్తిని రద్దు చేసినా ప్రజలకి పాత సమాజంలోని పద్దతే నచ్చుతుందని నీ సందేహమా?
FEBRUARY 27, 2015 AT 12:29 PM








Hari Babu Suraneni said...
సొంత ఆస్తిని రద్దు చేసినా ప్రజలకి పాత సమాజంలోని పద్దతే నచ్చుతుందని నీ సందేహమా?
?
యెవరు యెవరి స్వంత ఆస్తిని రద్దు చేస్తారు?
వర్గరహిత సమాజంలో యెవరికి వారు వారి స్వంత ఆస్తిని రద్దు చేసుకుంటారా లేక కొంతమంది మిగతా వాళ్ళ స్వంత ఆస్తులను రద్దు చేస్తారా?
FEBRUARY 27, 2015 AT 1:47 PM








HariBabuSuraneni said...
కొందరువీధులుతుడవాలి - కొందరువీధులుతుడవకూడదు, కొందరుతెల్లచొక్కాలువేసుకునిలెక్కలువ్రాయాలి - కొందరుయంత్రాలనినడిపించాలిఅనుకునేవాళ్ళుపెట్టుబడిదారీసమాజంలోతప్పకుండాఉంటారు.
?
మరివర్గరహితసమాజంలోప్రతివ్యక్తీవీధులుతుదవటం,లెక్కలువ్రాయటం ,తెల్లచొక్కాలువేసుకోవటంఅన్నీఒకేదమ్మున చేసేస్తాడా?
నేనుఅడుగుతున్నదివర్గరహితసమాజంలోఈపనులుయెట్లాజరుగుతాయి అనే, చెప్పుమరి?
FEBRUARY 27, 2015 AT 2:03 PM








Marxist Hegelian said...
రష్యాలోకొంతకాలంపాటుడబ్బుపైనిషేధంఉండేది. ఎవరెవరికిఏయేవస్తువులుఇచ్చారోఅక్కడిప్రభుత్వంకార్ద్లమీదవ్రాయించేది. వస్తుఉత్పత్తిసరిపోకలెనిన్డబ్బునితిరిగిప్రవేశపెట్టాడు. ముందుకుపోవడంలోకమ్యూనిస్త్లకిసాంకేతికసమస్యలురావచ్చు. కానీవిప్లవంరాకముందేతెల్లచొక్కావేసుకున్నవాడులెక్కలువ్రాసినతరువాతవీధులుతుడవగలడాలాంటిఅనవసరఅనుమానాలకిపోతేవిప్లవంరాదు.
FEBRUARY 27, 2015 AT 2:37 PM

       దీని తర్వాత నేను ఒక ప్రశ్న వేసి యెంతకాలం యెదురు చూసినా జవాబు రావట్లేదు.అక్కడి దాకా తపటపా సంబంధం ఉన్నా లేకపోయినా జవాబులు చెప్పినవాఉ కాస్తా ఆ ప్రశ్నకి మాత్రం మూగనోము పట్టాడు!కారణం యేమై ఉండొచ్చునో మీరు వూహించగలరా?నేను వేసిన ప్రశ్న యేమిటో చూస్తే మీకూ అర్ధమవుంతుంది.








విప్లవంరాకముందేతెల్లచొక్కావేసుకున్నవాడులెక్కలువ్రాసినతరువాతవీధులుతుడవగలడాలాంటిఅనవసరఅనుమానాలకిపోతేవిప్లవంరాదు.
?
యెవరు చెప్పారు అట్లా?నీకు కమ్యునిజం గురించి పరిచయం చేసిన  మేతావి చెప్పివుంటాడు!

విప్లవం వచ్చాక యేర్పడే వర్గరహితసమాజం లక్షణాలు యెట్లా వుంటయ్యో గూడా తెలుసుకోకుండా యే అనుమానమూ రాకుండా విప్లవం రాగానే చుట్టూ ఉన్న దరిద్రమంతా యెగిరిపోతుందంటే నమ్మటం తావీజు మహిమని నమ్మే మతపిచ్చిగాళ్ళలా ఆలోచించడం అని నీకు అనిపించలేదా?

నీ సిధ్ధాంతం శాస్త్రీయమైనది అని గట్టిగా యెదటివాళ్లకి చెప్పలేని నువ్వు యెదటివాళ్ళని అశాస్త్రీయంగా ఆలోచిస్తున్నారని వెక్కిరించడం అంటే యేమిటి నాయనా!నీ పుచ్చొంకాయ్తెలివితేటలకి నువ్వు హిందూధర్మాన్ని విమర్సించేటంత మేధావివా?

యెదటివాడు అడిగినదాన్ని పూర్తిగా అర్ధంచేసుకుని అడిగినదానికి రెలెవెంటుగా ఒక్క జవాబు తిన్నగా చెప్పలేనివాడివి నువ్వు నన్ను గురించి నీలాంటి వాడిముందు శంఖమూదను అంటుంటే నవ్వు వస్తాంది!నువ్వు శంఖమూదటం కాదు బాంబులు పేల్చినా యే గొట్టాంగాడూ నీకు పూచికపుల్ల్ల విలువ కూడా ఇవ్వడు - అది తెలుసా!

        జవాబు చెప్పలేని తన దివాళాకోరు తనాన్ని దాచుకోవటానికి నా ప్రశ్నని స్పాములో పెట్టాట్ట!బలే తెలివి తేటలు?ఇంతోతి పాండిత్యం ఇతర్లకి లేదని యెక్కడ బడీతే అక్కడ కామెంట్లు వెయ్యడానికి తిరుగుతాడు గదా,మరో బ్లాగులో పాండిత్యం వాంతి చేసుకుంటుంటే చూశాను.అక్కడ ఓ కొసరు వేశా.








HariBabuSuraneni said...
@MarksisT Hegeliyan
ఇంతకీ తమరి పోశ్టులో మార్క్సిజం లోని పిట్టకధల్ని గురించి వేసిన చివరి ప్రశ్నలకి ఇంకా కవాబు రాలేదు?

5 మార్చి, 2015 7:02 [PM] 







Marxist Hegelian చెప్పారు...
కృష్ణుడు పిట్ట కథలోని పాత్ర అని తెలిసి కూడా అతనికి గుడి కట్టేవాళ్ళకీ, చిరంజీవి సినిమా పోస్తర్‌ల దగ్గర జంతు బలులు ఇచ్చే అభిమానులకీ మధ్య తేడా ఉండంటావా? మతం పేరుతో చెప్పే పిట్ట కథల్ని నమ్మొచ్చు కానీ మార్క్సిజమ్‌ని నమ్మకూడదు అనేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. నాస్తికుల్లో కూడా మార్క్సిజమ్‌ని వ్యతిరేకించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మతం విషయంలో రెండు రకాల అభిప్రాయాలు ఉండవు.
5 మార్చి, 2015 8:44 [PM]

      కొంచెం విసుగూ కోపం రేంజిని దాటి పెరిగినట్టున్నాయిగా!అయితే మాత్రం పైన వొదిలిన కామెంటులో నాకు నచ్చిన మరో ముక్క వొదిలాడుగా?








Hari Babu Suraneni చెప్పారు...
?మతం పేరుతో చెప్పే పిట్ట కథల్ని నమ్మొచ్చు కానీ మార్క్సిజమ్‌ని నమ్మకూడదు అనేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. 
:-<>)
మతం పేరుతె దాన్ని నమ్మేవాళ్ళు పిట్టకధల్ని నమ్మినట్టుగానే మార్క్సుఇస్టులు కూడా వాళ్లకి నచ్చిన మూఢనమ్మకాల్ని నమ్మొచ్చు అనే కమ్యునిష్టుని నిన్నే చూస్తున్నాను?!
6 మార్చి, 2015 12:21 [PM]








Marxist Hegelian చెప్పారు...
పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు నువ్వు నా బ్లాగ్‌లో కూడా ఇలాంటి వ్యాఖ్యలే వ్రాస్తే నేను వాటిని స్పామ్ లిస్త్‌లో పెట్టాను, గుర్తుందా? కమ్యూనిజం సాధ్యం కాదు అని చెపితే అది ఒక భౌతికవాది చెప్పాలి కానీ మంత్రాలకి చింతకాయలు రాలుతాయని నమ్మేవాళ్ళు చెప్పక్కరలేదు. కార్ల్ మార్క్స్, ఫోయర్బాఖ్‌పై చర్చించాడు కానీ బైబిల్‌పై చర్చించలేదు. మతవాదులతో చర్చించడం కంటే భౌతికవాదులతో చర్చించడమే ఎక్కువ ఉపయోగకరం. "రామాయణ విషవృక్షం" చదివినప్పుడు కూడా నాకు ఇలాగే అనిపించేది, 'ఇవి కట్టు కథలని తెలిసి కూడా వీటిని నమ్మేవాళ్ళు ఉంటారు, వీళ్ళతో చర్చ అవసరమా' అని. 

6 మార్చి, 2015 1:58 [PM]

మళ్ళీ పేల్చాడు బాంబు - "కమ్యూనిజం సాధ్యం కాదు అని చెపితే అది ఒక భౌతికవాది చెప్పాలి కానీ మంత్రాలకి చింతకాయలు రాలుతాయని నమ్మేవాళ్ళు చెప్పక్కరలేదు" అని!కార్ల్ మార్క్సు గనక ఇది విని వుంటే "చీ!నేనింకా యెందుకు బతికున్నాను,ఇంత బూతుమాట వినకుండా వున్నా బాగుండేది" అని కుళ్ళి కుళ్ళి యేడ్చి వుండేవాడు:యెప్పుడో చచ్చి అదృష్టవంతుడయ్యాడు గదా!

       సరే ప్రవీణూ ఒప్పుకున్నా "కమ్యూనిజం సాధ్యం కాదు అని చెపితే అది ఒక భౌతికవాది చెప్పాలి కానీ మంత్రాలకి చింతకాయలు రాలుతాయని నమ్మేవాళ్ళు చెప్పక్కరలేదు" అని!కానీ కమ్యునిజం సాధ్యపడుతుంది అని మామూలు భౌతికవాది గానీ నీలాంటి బహుతిక్కవాది గానీ చెప్పగలడా?

నేను కూడా భౌతికవాదం ప్రకారమే అడుగుతాను.నువ్వు కూడా భౌతికవాదం ప్రకారమే చెప్పు!

1.కారల్ మార్క్సు గారు స్మిత్తుగారు చెప్పిన మానవుడు వస్తుగత వాది అని ఒప్పుకున్నప్పుడు ఆ వస్తుగత వాదికి తగ్గ ఆర్ధిక విధానం స్మిత్తుగారు ఆల్రెడీ చూపించేసినప్పుడు దీనికంటే భిన్నమయిన వర్గరహిత సమాజంలోకి మనిషిని నడిపించటానికి కొత్త ఆర్ధిక చట్రాన్ని కనుక్కోకుండా ఇదే ఆర్ధిక చట్రాన్నే యెందుకు వాడుకున్నాడు - సైకిలు తయారు చెయ్యటానికి మాత్రమే పనికొచ్చేవాటితో కారును తయారు చెయ్యాలనుకున్నట్టు?

2.వర్గరహిత సమాజం యేర్పడగానే రాజ్యం దానంతటదే మాయమై పోతుందని యే ఆధారాలతో యెంత శాస్త్రీయమైన విశ్లేషణతో చెప్పాడు కార్ల్ మార్క్స్?ఈ ప్రశ్నకి నువ్వు సొంతంగా జవాబు చెప్పొద్దు,నీ పుచ్చొంకాయ్ పాండిత్యం నాకు తెలుసు!మీ స్వైరిణి "పెట్టుబడి" అనే పేరుతో తెలుగులో రాసిందిగా!అందులో యేముందో చెప్పు చాలు. నీకు చాతకాకపోతే నా మిత్రులు సేకరించి తీసుకొస్తారు!

వర్గరహిత సమాజం అసలు యెప్పటికీ యేర్పడదని నేను ఖచ్చితంగా చెప్పగలను.దాన్ని సాకారం చేసి చూపించగలనని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా?యెందుకంటే పైన నువ్వే చెప్పావు లెనిన్ కొంతకాలం డబ్బుతో ప్రమేయం లేకుండా చేద్దామని చూసి కుదరక మళ్ళీ మామూలు పధ్ధతికే వచ్చాడని - అది నాకూ తెలుసు,లెనిన్ జీవితం అతను చేసిన పనులూ అన్నీ తెలుసు. లెనిన్ నాకు నచ్చడానికి కూడా అదే దారిన మూర్ఖంగా పోకుండా వాస్తవాన్ని గమనించి వెనక్కి తగ్గడం ఒక కారణం!

డబ్బుకీ రాజ్యానికీ సంబంధం వుంది,అది నీకు తెలుసా?ఇవ్వాళ దేశాల్ని వేర్వేరు అస్థిత్వాలతో నిలబెడుతున్నది వాటి కరెన్సీయే!మన దేశంలో యే మూలకి వెళ్ళినా రూపాయి చెల్లుతుంది కాని డాలరు చెల్లదు!నీ దగ్గిర డాలరు ఉంటే దాన్ని మన కరెన్సీ లోకి మార్చుకోవాలే తప్ప దాన్ని యెకాయెకిన వాడలేవు,వాడకూడదు,అవునా?

నేను మావూరు వెళ్తే వేపపుల్ల తప్ప పేష్టూ బ్రష్షూ వాడను.కానీ అక్కణ్ణించి ఇక్కడికి రాగానే అవి తప్పనిసరి.అది నీకైనా నాకైనా కొనకుండా రాదు.డబ్బు తోనే అమ్మకం,కొనుగోలు అనే వినిమయ సంబంధం వస్తుంది!ఇవి ఉన్నంత కాలం వీటిని నియంత్రించడానికి రాజ్యం తప్పనిసరిగా వుండాలి,వుండి తీరాలి!

మరి వర్గరహిత సమాజంలో రాజ్యం ఉండదు అని నోటిమాటగా చెప్తే సరిపోతుందా?శాస్త్రీయమైన సిధ్ధాంతం మాది అని డప్పు కొట్టుకుంటున్నప్పుడు ఆధారాలు చూపించాలి గదా?పెట్టుబడి దారీ విధానంలో అనివార్యంగా వచ్చిపడే అదనపు విలువని వస్తుగతవాది అయిన పెట్టుబడి దారు తనంతట తను శ్రామికుల పరం చెయ్యడు గనక దానికి సాయుధ పోరాటమే మార్గం అంటే పెట్టుబడిదారుని మట్టగించెయ్యడం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుందని అంత ఘట్టిగా చెప్పాడని ఇప్పుడు యెన్నికల్లో నిలబడుతున్న ఈ బూర్జువా కమ్యునిష్టులకి నిజంగానే తెలియదా?అధికారంలోకి వొచ్చాక చూసుకుందాం అని అసలు మాటని చెప్పకుండా దాచిపెట్టటం మోసం చెయ్యటం కాదా?మోసం చేసేది పెట్టుబడిదార్లని కదా అంటావు నాకు తెలుసు!పెట్టుబడిదార్లు వాళ్ళకి వోట్లు వెయ్యరుగా!వాళ్ళకి వోట్లు వేసేవాళ్ళని మోసం చేస్తున్నట్టేగా!నట్టేగా అని నిన్నడగటమేమిటి నా బొంద - అది ఖచ్చితంగా మోసమే,అవునా కాదా?

3.హెగెలియన్ భావవాదాన్ని తిరగేసి భౌతిక పునాదుల మీద నిలబెట్టానని అంత గొప్పగా చెప్పి వర్గరహిత సమాజం పేరున వున్న అతిముఖ్యమైన భాగాన్ని మతవాదులు స్వర్గాన్ని గురించి చెప్పే విదంగా స్వైరకల్పనలతో నింపేసి మళ్ళీ భావవాదానికి యెందుకు తిరిగిపోయాడు? 

          చిన్నప్పుడు పంచతంత్రంలో విష్ణుశర్మ చెప్పిన "ముందు చోటు చూసుకుని కదా పాద మెత్తవలేను?" అనే మాట నాకు గుర్తుంది!యే ప్రయాణానికైనా ముందు లక్ష్యం చాలా ముఖ్యం.యెక్కడికెళ్ళాలో అక్కడేముంటుందో కూడా తెలియకుండా యెవడయినా ప్రయాణం మొదలు పెడితే వాడ్ని యేమంటారు?పిచ్చి పుల్లయ్య అంటారని నీకూ తెలుసు!వర్గరహితసమాజం యెట్లా వుంటుందో తెలియకుండా దానికోసం అంగలారుస్తున్న నువ్వేమవుతావు?పుల్లయ్య వేమవరం వెళ్ళాడు,వచ్చాడు యెందుకెళ్ళావురా అంటే యేమో నాకు తెలియదన్నాడనే జోకులాంటి సామెతని నీలాంటి వాళ్ళని చూసే అది పుట్టించి వుండాలి?!

          అవును,కృష్ణుడికీ రాముడికీ గుడి కట్టటం గురించి వెక్కిరించేటప్పుడు లెనిన్ మసోలియం గుర్తుకు రాలేదా నీకు?నీలోనే నువ్వు కమ్యునిష్టులు గొప్పవాళ్ళు నాన్ కమ్యునిష్టులు చెత్తవాళ్ళు అని విద్వేషభరిత దురహంకారానికి ఫిక్సయిపోతే అవతలి వాళ్లని యేది మూఢనమ్మకమని వెక్కిరిస్తున్నావో అదే నువ్వూ చెస్తూ సమర్ధించుకుంటుంటే నీకు పెత్తనమిస్తే బలవంతంగా వ్యతిరేకుల్ని చంపి అయినా సరే నీ అభిప్రాయాల్ని యెదటివాళ్ళ మీద రుద్దే మనస్తత్వం నీకులాగే యెదటివాళ్ళకీ వుంటే తప్పేమిటి?

          కత్తి నువ్వు తీస్తావా నేను తియ్యనా అన్న రజనీ బాబా లాగే నేనూ ఒక చాలెంజి విసురుతున్నా కాసుకో!జవాబులు నువ్వు చెప్తావా మీ స్వైరిణిని తీసుకొస్తావా?నువ్వే చెప్పడానికి సిధ్ధపడితే నువ్వొక్కడివీ యెదవలా తేలి కమ్యుంజం బతుకుతుంది కొంతకాలం!మీ స్వైరిణియే వస్తే మొత్తం కమ్యునిజమే మట్టిగొట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు!ఈ పైత్యకారికే కాదు బ్లాగుల్లో వున్న కమ్యునిష్టు సిధ్ధాంతులందరికీ ఆ స్వైరిణి  అభిమానులందరికీ ఇది ఓపెన్ ఛాలెంజి!

ఆ హరి శాసిస్తాడు!ఈ హరి సాధిస్తాడు!

Tuesday, 3 March 2015

ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?పీకేకి ఆస్కార్ అవార్డు వస్తుందా!

          విత్తు ముందా చెట్టు ముందా అంటే యేమి చెప్తాం?చూసిందే సత్యం అనుకునే మామూలు మనుషులైతే చెట్టే ముందు గదా అనేస్తారు.వృక్ష శాస్త్రజ్ఞుల నడిగితే ఒక జాతి నుంచి మరొక జాతి పుట్టటానికి సంబంధించిన మార్పులు విత్తనం నుంచే మొదలవుతా యంటారు.వాదన  కోసమే బతికే ప్రవీణులు ఆ మార్పులు విత్తనంలోకి చెట్టు నుంచే వస్తాయి గదా అని మెలిక వేస్తారు.యుగాల తరబడి చర్చించినా అది తేలదు!

         దీనమ్మా కాంగ్రెసు - యెంతపని జేసింది! కాశ్మీరు దగ్గిర్నుంచీ ఖలిస్థాన్ వరకూ కుంపట్లు రగిలించి వొదిలెయ్యటమే తప్ప ఒక్క కుంపటి కూడా ఆర్పని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ విభజనని కూడా అట్లాగే తగలేసిందిగా!!చచ్చేది చావకుండా స్వతంత్రం వచ్చిందగ్గిర్నుంచీ దేశమంతా తన్ని తగలేసినా నెహ్రూ బాబునీ ఇందిరమ్మనీ రాజీవ్ బాబునీ గెలిపించినందుకు కృతజ్ఞత కూడా లేకుండా తెలుగోళ్ళని బజార్న పడేసింది గదా?!ఇంకా యెందుకో అంత వ్యామోహం,మీసాలు మెలిదిప్పుకుని మరీ వీరత్వం వొలబోస్తుంటే మళ్ళీ వొట్లేసేటట్టున్నారు యెదవ జనాలు?దీపాల మల్లయ్యలని వుంటారు వాళ్లకి దీపాలార్పటం తప్ప దీపాలు వెలిగించటం చేత కాదు!దిక్కుమాలిన స్వతంత్రం రాకుండా వున్నా బాగుండేదనిపిస్తంది ఈ పాపిష్టోళ్ళ చేతుల్లో పడ్డాం! ఇంత దరిద్రంగా విభజించినందుకు సిగ్గుపడి మూలన కూర్చోకుండా సిగ్గు లేకుండా విభజన హామీల కోసం దేశమంతటా ఆందోళనలు చేస్తారంట!

          యెగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రహ్మహత్య,కరవమంటే కప్పకి కోపం వదలమంటే పాముకి కోపం,అవ్వకా బువ్వకా,ఎద్దు గట్టుమీదకి లాగడం దున్న నీట్లోకి లాగడం లాంటి దురవస్థలన్నిట్నీ ఒకేసారి తెలుగోళ్ళ మీద కుమ్మరించి పారేసిందా ఇటాలియన్ బారు గర్లు ముండ@!ఈ దేశపు సమాజం తీరు యేమిటో తెలీదు,ఈ దేశభాషల్లో ఒక్కటి కూడా రాదు - అయినా ఈ దేశానికి భాగ్యవిధాతని చేశారు దొంగసచ్చినోళ్ళు!

        యెప్పుడో యాభయ్యేళ్ళ క్రితం మద్రాసు నుంచి విడిపోయినా ఎన్.టి.ఆర్ వచ్చేదాకా మనల్ని కూడా మదరాసీలని పిలిచేటంత గొప్పగా తెలుగోళ్ళకి గుర్తింపు తెచ్చిన యెదవలు, ఇక్కడ ముఖ్యమంత్రిని యెన్నుకోవడానికి కూడా పేర్లు డిల్లీకి పంపించి కట్టుబానిసల్లా బతికిన గాడిదలు,ఒకణ్ణి పడదోసి మరొకడు కుర్చీ యెక్కి సొంతానికి దండుకోవటమే తప్ప ప్రజల గురించి యేనాడూ పట్టించుకోని దరిద్రగొట్టు రాజకీయం తాము చెయ్యటమే కాకుండా తా జెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు తనతో కలిసిన తనలోంచి చీలిన అన్ని పార్టీలకీ అంటించిన కుక్కమూతిపిందెలు ఇవ్వాళ ఆంధ్రాకి న్యాయం చెయ్యడానికి ఉద్యమాలు చేస్తారట!

          ముఫ్ఫయ్ సీట్లకోసం ముండమోపి రాజకీయం చేసి మాతృ రాష్ట్రాన్ని అవశేషంగా నోటితో కూడా వెక్కిరించి అసలు విడగొట్టాక అక్కడొక భూభాగం వుంటుందని కూడా అనుకోని దొంగలంజకొడుకులు* ఇవ్వాళ సాధు సజ్జనుల మాదిరి సుభాషితాలు చెప్తున్నారు,యెవడు వింటాడనో!

          ఇస్తానని యెవడికి చెప్పాడో వాడూ యేడుస్తున్నాడు - కేసు వోడిపోయినోడు కోర్టు మెట్ల మీదనే యేడిస్తే గెల్చినోడు కొంగుచాటు చేసుకుని యేడ్చినట్టు - యెవడికీ మేలు చెయ్యకుండా తమకీ గుణ్ణం కొట్టుకుని ఇంత ఘనకార్యం చేసి యేమి సాధించారో తెలియని దారీతెన్నూ లేని విభజన చేసిన వీళ్ళే మనకి సరైన దారి చూపిస్తారట మళ్ళీ వెంట పరిగెత్తుదామా?ఈసారి ఉత్తుత్తి నరకం కాకుండా నిజమైన నరకలోకపు జాగిలాల్నీ సలసల మరుగుతున్న కుంభీపాకపు ద్వీపకల్పాల్నీ చూపించి తరింపజేస్తారు!

          యెన్నడూ పెళ్ళాం దగ్గిర కూడా నోరు విప్పని మూగమొద్దు నోరు విప్పి చెప్పిన ఒకేఒక మాట కూడా బూతుమా కింద మారిపోయింది?ఇవ్వాల్సినవి లెక్కగట్టి బిల్లులో నిక్కచ్చిగా ఇవ్వలేదు గానీ ఇవ్వడానికి వీల్లేని దాన్ని మాత్రం -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని రాబోయే కొత్త ప్రభుత్వానికి చెప్తాననే వాగ్దానం  చేశాడు!వాగుదానం చెఱువు దానం!దాన్ని పట్టుకుని యెన్నేళ్ళు పోరాడినా కుక్కతోకని పట్టుకుని గోదారిని ఈదినట్టే!

         పిల్లలు పుట్టగానే పురిటి స్నానం చేయించేటప్పుడు కొందరికి సిగ్గూ లజ్జా మానం అభిమానం అనేవి కూడా జారిపోతాయి - అలాంటివాళ్ళు అయితే కాంగ్రెసు పార్టీలో చేరతారు లేదంటే కాంగ్రెసు పార్టీకి వోటు వేస్తారు!యెన్నికలప్పుడు ఇస్తానని వాగ్దానం చేసి ప్రభుత్వం యేర్పడ్డాక నాలుగేళ్ళ పదకొండు నెలల్లో సమైక్య రాష్ట్రపు ఆదాయం అప్పుల వివరాలు తెలియలేదు,అవి న్యాయంగా యెలా పంచితే తర్వాత రెండు ముక్కల మధ్యనా గొడవలు రాకుండా వుంటాయనేది కూడా తెలియలేదు,మొత్తం రాష్ట్రంలో వున్న వనరులేమిటో అవి యెలా పంచితే బాగుంటుందో కనీసం రిపోర్టులు కూడా తెప్పించుకోలేదు అయినా నెలరోజులు తీసుకున్నారు - మీరు చేసింది పదో తరగతి తప్పినోడికి అప్పజెప్పినా ఒక్క రోజులో పూర్తి చేసేవాడు, యెందుకురా ఒక్కొక్కళ్ళూ లాయరు గిరీలూ డాక్టరు గిరీలూ వెలగబెట్టారు?

          మోదీ మాత్రం యేమి చేస్తాడు?ఆంధ్రాకి విభజన పేరుతో ఇస్తే మరో పేరున మాకూ కావాలని పదిమంది బయల్దేరతారు.అన్ని రాష్ట్రాలకీ పన్ను రాయితీలు ఇస్తే కేంద్రానికి ఆదాయం రాక మొత్తం దేశమే అడ్డుక్కు తింటుంది!ఆంధ్రాకి పన్ను రాయితీలు కల్పిస్తే అసలే చురుకైన ఆంధ్రావాళ్ళు తమకన్నా యెక్కడ ముందుకి దూసుకుపోతారో ననే కుళ్ళుమోతు మనస్తత్వాలు చాలమందికే వున్నై!తన పొలం తడిసే దాకా కింద వాళ్ళకి నీళ్ళు బందు జేసే పల్లెటూరి నిశానీ మోతుబరి మనస్తత్వాలే విద్యాధికులైన రాష్ట్ర్రాల ముఖ్యమంత్రుల్లో కూడా కనిపిస్తున్న కాలంలో వున్నాం మనం!ఇవ్వాళ తమాషా చూస్తూ మనకిచ్చిన రేపటి రోజున యెదురు తిరుగుతారనుకున్న వాళ్ళని కదిలించి మాట్లాడించాలి!చెయ్యాల్సింది ఒకే వైపు దాడి కాదు - తటస్థుల్ని మన వైపుకి తిప్పుకుంటే తప్ప గెలవలేం!చివ్వరివరకూ దానికోసమే ప్రయత్నించితే అసలుకే మోసం రావచ్చు,అదనపు సహాయం హామీలు రప్పించుకోఅవడంతో సరిపెట్టుకోక తప్పదేమో?అందులోనన్నా నిక్కచ్చిగా అంకెల విషయంలో రాజీ పడకుండా గట్టిగా వుండాలి,వుంటారా మనవాళ్ళు?!


         ఇలాంటి విషయాల్లో మూర్ఖంగా ఒకే వైపు దాడిని కేంద్రీకరిస్తే గెలవడం కష్టం.ఒంరిగా యెంత భీకరంగా పోరాడినా గెలుపు అనుమానమే అయినప్పుడు అలివిమాలిన దానికోసం పోరాడారు,చెవులు దులుపుకుని తిరిగొచ్చారు అనే వెక్కిరింతకి గురవుతాం!ఇలాంటి వాటికోసమే చాణక్యుడు షాడ్గుణ్యం వుపదేశించాడు.మిత్రుల్ని యుధ్ధంలోకి ఆహ్వానించాలి,తటస్థుల్ని మనకు అనుకూలం చేసుకోవాలి,వ్యతిరేకుల్ని బుజ్జగించి తటస్థులుగా మార్చుకోవాలి - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన చాణక్యానికి పదును పెట్టాలి.అయితే ఇప్పుడే కాదు ఇంకొంచెం వేడి పుట్టి ఆంధ్ర ప్రజానీకం ఆగ్రహం దేశం మొత్తానికి న్యాయమైనదని అనిపించే స్థాయికి పెరిగాక చెయ్యాలి.భాజపా కూడా అధికారికంగా కాకపోయినా పార్టీ పరంగా తన ముఖ్యమంత్రుల్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మాట సాయం చేసే విధంగా సంసిధ్ధం చెయ్యాలి.కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటున్న మిత్ర రాష్ట్ర్రానికి ఆపాటి సాయం చెయ్యలేదా!ఒక హెచ్చరిక - కాంగ్రెసుని గానీ కాంగ్రెసు పార్టీకి సంబంధించిన సంస్థల్ని గానీ, కాంగ్రెసు పార్టీని అభిమానించే వాళ్ళని గానీ వుద్యమం లోపలికి రానివ్వకుండా ఆ పార్టీ మీద కూడా తన చిత్తశుధ్ధిని నిరూపించుకునే లాగ వొత్తిడి పెట్టాలి.కష్టమే,గ్యారెంటీ లేదు - అయినా తప్పదు:ఉద్యమ స్పూర్తితో కదలాలి!అందుకే సత్యధర్మన్యాయ ప్రతిష్ఠితమైన నా గురు పరంపర వ్యాసపరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం వున్న నా గురు పరంపర పాదాలను స్మరించి "సౌభాగ్య ఆంధ్ర" అనే ఉద్యమాన్ని ప్రతిపాదిస్తున్నాను.ఇది కేవలం ప్రత్యేక హోదా కోసం కాకుండా మనం వేస్తున్న తొలి అడుగులోని ప్రతి విషయాన్నీ ప్రతిబింబించేదిగా ఉండాలి!తప్పనిసరిగా ఉద్యమంలోకి అన్ని వర్గాల వాళ్ళూ ప్రవేశించాలి!నేను కేవలం సంచలనం కోసమో తాత్కాలిక సంరంభం కోసమో యేదీ  చెప్పను!అగ్నులు రగిలినా ఫరవాలేదు,ప్రాణాలే పోయినా ఫరవా లేదు,మళ్ళీ పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి నాటి దృశ్యాలు కనబడినా కంగారు పడకూడదు.వెనక్కి తిరగటానికి వీల్లేని ప్రయాణానికి మనం వేసే తొలి అడుగు బలంగా పడాలి,అంతే!

          యేది యేమయినా నవ్యాంధ్ర ప్రజలు డెబ్బయ్యేళ్ళ తర్వాత మళ్ళీ శూన్యం నుంచే తమ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు.తమ రెక్కల సత్తువ తప్ప మరే సాయమూ లేదు, దేవుడే దిక్కు అనుకుందామన్నా దేవుడు కూడా శీతకన్నేసినట్టున్నాడు మన మీద!

-----------------------------------------------------------------------------------------------------------------
(*శ్రీ శ్రీ ఇవ్వాళ నాకు సపోర్టుగా వుంటానికే ఈ మాట ఇంతకు ముందే తన కవిత్వంలో వాడినట్టున్నాడు!)
(@షిండే త్రయంలో ఒకర్ని నిలదీస్తే మాకూ ఇష్టం లేదు కానీ పైనుంచి ఒత్తిడి పెడుతున్నారన్నాడు?)

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...