Wednesday, 31 December 2014

హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా వైభవం!

     రామాయణం యెందుకు చదవాలి?రామాయణం యెవరు చదవాలి?రామాయణం యెవరు చదవకూడదు?రామాయణం చదవకపోతే నష్టమేమైనా వుందా?రామాయణం కొందరికి కల్పవృక్షం లాగానూ కొందరికి విషవృక్షం లాగానూ కనబడటానికి కారణ మేమిటి?ఈ ప్రశ్నలకి వరసగా వెనక నుంచి ముందుకు జవాబులు చెప్తాను!

     జంబూద్వీపే భరత వర్షే అని బ్రాహ్మణులు వుభయ సంధ్యల్లో సంకల్పం చెప్పుకుంటూ ఇవ్వాళ్టి ఆఫ్ఘనిస్థాన్ వరకూ విస్తరించిన ప్రాచీనకాలం నుంచీ ఇక్కడ అధిక సంఖ్యాకులైన ప్రజలు పాటిస్తున్న సనాతన సాంప్రదాయాన్ని విదేశీయులు ఈ భూభాగాన్ని హింద్ అని పేరుపెట్టి గుర్తించాక దానినే ఆ సాంప్రదాయానికీ కూడా తగిలించి హిందూ మతం అని పేరు పెట్టారు!కానీ నా దృష్టిలో దీన్ని మతం అని పిలవటం తప్పు. ధర్మం అని పిలవడమే సరయినది! యెందుకంటే ఇది కాక ఇవ్వాళ మతాలుగా గుర్తించబడిన వాటికి ఒకే ప్రధాన దైవం,ఒకే పవిత్ర గ్రంధం,ఒకే సూత్రధారి అనే మూడు ఖచ్చితమయిన విభాగాలు వున్నాయి.పాటించవలసిన విధి నిషేధాల కయితే అవి ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అనే ఒత్తిడీ,,పాటించకపోతే మతం నుంచి బహిష్కరించే పెత్తనమూ కేంద్రీకృతమయిన మతాధికార్లకి కట్టబెట్టబడి వుంది! 

     కానీ ఇక్కడ అలాంటివి లేవు. గ్రామ దేవతలతో సహా యెవరు యెవర్ని యెంచుకున్నా ఆ దైవమే ప్రధాన దైవం భక్తులకి!వేదాలూ, వుపనిషత్తులూ,అష్టాదశ పురాణాలూ - ఇవన్నీ కూడా వేటికవే సమానమయిన పవిత్రత కలిగినవే!ధర్మగ్లాని సంభవించినప్పుడు దైవసంకల్పంతో ప్రభవించిన అవతారపురుషు లంతా యెవరికి వారు సొంత వ్యక్తిత్వం కలిగి వుండి కూడా సమానంగానే పూజనీయు లయ్యారు! అలా అవతరించిన వారు కూడా ప్రజలకి ధర్మబధ్ధంగా బతకడం యెలాగే నేర్పటం కోసం తాము కూడా ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చి వాటిని తాము ఆచరించి చూపించి వుదాహరణగా నిలిచారు!ఋషి పరంపర అనేది ఒకటి వున్నా ప్రజల్ని ఐచ్చికంగా పాటించేలా చెయ్యడమే తప్ప బలవంతంగా పైనుంచి రుద్దకుండా వుండటం వల్ల్ల ధార్మిక వికేంద్రీకరణ అనేది సహజసిధ్ధమై కుదిరింది!దీనికి సాక్ష్యంగా సాయిబాబా గురించి ఒక పీఠాధిపతి నిషేధాజ్ఞలు జారీ చేసినా సాయిబాబా భక్తులు యే మాత్రమూ సందేహించకుండా వాట్ని బేఖాతరు చేసిపారేసి ధైర్యంగా తమ నమ్మకానికే నిలబడటాన్ని చెప్పుకోవచ్చు!ఇంత ప్రజాస్వామికమైన పధ్ధతిని మరో మతంలో చూడగలమా?కానీ ఇంత ప్రజాస్వామ్య బధ్ధమయిన సాంప్రదాయంలో కూడా ఒక రెంటికి మాత్రం వాటి విశిష్థతని బట్టి మోనాపలీ వచ్చేసింది!ఒకటి అన్ని పవిత్ర గ్రంధాల సారాన్నీ సంకలించిన భగవద్గీత,రెండు అన్ని ధర్మాలనీ ఒకచోట గుదిగుచ్చి ఒక కధలో ఇమిడ్చిన రామాయణం.హిందూ ధర్మాన్ని పాటించేవాళ్లలో ఈ రెంటి పట్లా వున్న ఆప్యాయతని బద్దలు కొట్టకుండా వారి భావజాలాన్ని వ్యాపింపజేయలేము అని రూఢిగా తెలుసుకుని యెలాగయినా సరే ఇక్కడ వ్యాపించాలనే మూర్ఖత్వం యెక్కువగా వున్నవాళ్ళకి గీత హింసని ప్రబోధిస్తున్నట్తు వినబడుతుంది,రామాయణం విషవృక్షం లాగా కనబడుతుంది.

     చాలాకాలం క్రితం "అంతరార్ధ రామాయణం" అని ఒక పుస్తకాన్ని కొంచెం తిరగేసాను!బెజవాడ లయోలా కాలెజిలో చదివేటప్పుడు బీసెంటు రోడ్డు దరిదాపులకి వస్తే తీరిక అంటూ వుంటే పుస్తకాల షాపుల్ని చుట్టడం, మంచి పుస్తకం కనబడినట్టాయెనా సరిపడా దబ్బులుంటే అప్పుడే కొనెయ్యడం - లేదంటే ఇరవై నాలుగ్గంటల్లో మళ్ళీ పైకంతో సహా తిరిగొచ్చి అప్పుడు కొనడం చేసేవాణ్ణి!ఈ పుస్తకం మాత్రం యెందుకో నచ్చాక గూడా నాచేతికి రాకుండా తప్పించేసుకుంది!అయినా రుచి చూసేటప్పుడే చాలామటుకు లాగించేశాను యెందుకయినా మంచిదని!రాసింది మన తెలుగాయనే,వేదుల సూర్యనారాయణ శర్మ గారనుకుంటాను!రామాయణానికే గాదు,భారతానికీ,భాగవతానికీ గూడా అంతరార్ధాన్ని విప్పిచెప్పారు గానీ నేను రామాయణం గురించి మాత్రమే చదివాను!

     ఇవ్వాళ మిలిటరీ వాళ్ళు రహస్య సందేశాల్ని వాళ్ళు యెవరికి తెలియజెప్పాలో వాళ్లకి తప్ప మిగిలిన వాళ్ళకి అర్ధం కాని ఒక కోడ్ లాంగ్వేజిని వాడుకుని పంపించటం అనే పధ్ధతి ఫాలో అయినట్టు పాత్రలకి పెట్టిన పేర్లని విడగొట్టీ ,వుపకధల సన్నివేశ కల్పనలో మూలకధకున్న ప్రాధాన్యతని కనిపెట్టీ పైకి కనిపించని మరో కధ దాగి వున్నట్టు నిరూపించారు!"అయోధ్యా నగరానికి రాజు దశరధుదు" అంటే మన మనస్సులోని చపల స్వభావం గురించి చెప్తున్నట్టు లెక్క!యెలా అంటే, యోధులకి జయించ శక్యం కానిది అని కదా అర్ధం - మనల్ని మనమె నాశనం చేసుకోవాలి తప్ప ఇతరులెవరూ మనని నాశనం చెయ్యలేరు కదా!మన మనస్సుని కూడా మనం మచ్చిక చేసుకోగలమే కానీ గెలవలేం కదా!ఇక దశరధ అనే మాటకి పదివైపులకీ పరిగెత్తగలిగిన రధాలు అని అర్ధం,చపలత్వానికి పర్యాయ పదం!కౌసల్య,కైకేయి,సుమిత్రలకి గూడా ఇలాగే వున్నాయి గానీ రాముడు అంటే రమింపజేయువాడు అని అర్ధం.సీత అనే పదానికి ఆయన చెప్పింది నాకు గుర్తు లేకపోవతంతో సొంతంగా పరిశ్రమిస్తే "అసీద్" అనగా "యేదయితే వున్నదో అది" అనే "బ్రహ్మసత్యం జగన్మిధ్య" అనే మంత్రార్ధం కనబడింది!ఇప్పుడు మనం రాముణ్ణి అధికుడిగా నిలబెట్టాడనీ సీతని అతని భార్యగా నిలబెట్టి రెండో స్థానం ఇచ్చాడనీ అనుకునే దానికి పూర్తి విరుధ్ధం.సీతయే ఆరాధనీయమయిన దైవశక్తి కాగా రాముడు దైవ్వసాన్నిధ్యం కోరుకునే సాధకు డవుతాడు!మిగతా కధలో వచ్చే సన్నివేశాల్ని ఆ పధ్ధతిలోనే వర్ణించి ఆయన కూడా నా వూహనే సమర్ధిస్తున్నారు?శివ ధనుర్భంగం అనేది సాధకుడి ఓంకార సాధన ఫలితమిచ్చి తొలిసారిగా దైవ సంశ్లేషణం జరగటానికి గుర్తు!శివ ధనువు విరిగినప్పటి భీబత్సపు వర్ణనలన్నీ అప్పుడు యోగిలో కలిగే అలజడిని వర్ణించే మార్మిక విషయాలతో నిండి వుంటాయి!

     అలా మొదటిసారి దైవసంస్పర్శన సుఖాన్ని అనుభవించి కూడా కైక పాత్ర పరంగా చెప్పబడిన దుర్గుణం సాదకుణ్ణి భయంకరమయిన రాక్షస ప్రవృత్తులతో నిండిన ప్రకృతి శక్తుల మధ్యకి విసిరేస్తే పంచేంద్రియాలు పంచవికారాలతో కలిసి రావణం చేస్తూ వచ్చి అతన్ని దైవానురక్తి నుంచి దూరం చేస్తాయి!ఒకసారి సాధించి కోల్పోయిన దాన్ని తిరిగి మరింత గట్టిగా సాధించాలంటే ఇప్పుదు అతనికి ఒక సద్గురువు చాలా అవసరం!ఆ స్థానంలో హనుమంతుల వారు వస్తాడు?ఆ పాత్ర కధలో ప్రవేశించడమే "మా భయ మా సంవిక్త" అనే మహావాక్యంతో ప్రవేశిస్తుంది!గురువు శిష్యుడికి చేసే సహాయం కూడా అదే - భయాన్నీ ఆందోళననీ వదలగొట్టి సరయిన దారిలో నడిపించటం! కధలో కూడా హనుమంతుడు ప్రవేశించేవరకూ రాముడే ఇవ్వాళ్టి సినిమాల్లో వున్నట్టు డైనమిక్ హీరోలా వుంటాడు,కానీ ఒకసారి హనుమంతుడు ప్రవెశించాక కధలోని ప్రతి సన్నివేశంలోనూ హనుమంతుడే ప్రధానంగా కనపడి వ్యవహారాన్ని చక్కబెదతాడు!అది కూడా అతని ఆచార్యత్వాన్ని నిర్ధారించే విషయమే!

    సీతా సందర్శనం చేసి రాగానే నేను నీకు ఇవ్వగలిగింది ఇదే అని రాముదు హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు.అది మామూలు కౌగిలి కాదు, శిష్యుడు గురువుతో అభేధస్థితిని సాధించటానికి చిహ్నం!యుధ్ధం ముగిశాక సీత అగ్నిప్రవేశ ఘట్టం మరో అధ్బుత సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది!ఈ సకల చరాచర జగత్తునీ శాసించగలిగిన వాడు తనని మోహానికి గురి చేసి అనాధలా వొదిలెయ్యటం పట్ల అతని ఆక్రోశాన్ని వ్యక్తీకరించటం,ఆ అవేశంలో దైవాన్ని కూడా అధిక్షేపించడం అనే చిత్రమయిన దృశ్యం కనబడుతుంది!రామదాసు "యెవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు" అని గద్దించి మళ్ళీ "అబ్బా, దెబ్బల బాధ కోర్వలేక తిట్టితినయ్యా" అన్నప్పుడూ అన్నమయ్య బ్రహ్మాండ నాయకుణ్ణి చిన్న పిల్లాణ్ణి చేసి జోలపాటలు పాడినప్పుడూ వాళ్ళు అంత గట్టిగా దైవం మీద అధికారం సాధించి యెలాంటి మానసిక స్థితిలో వున్నారో సీత అగ్నిప్రవేశం జరిగిన సన్నివేశంలో రాముడి మనస్థితి కూడా అలాగే వుంటుంది! 

     అంటే ఇది ఒక రాజుగారబ్బాయి కధ కాదు,మన మనస్సులో నిత్యం జరిగే "యేది పాపం?యేది పుణ్యం" అనే సంఘర్షణకి ప్రతిరూపం అన్నమాట!సామాన్యత్వం నుంచి అసామాన్యత్వానికి ప్రయాణం చేసిన ప్రతి వ్యక్తీ అంతరంగంలో ఈ సన్నివేశాల మీదుగానే ప్రయాణిస్తాడు,ఈ అనుభూతుల నన్నిట్నీ అనుభవించి తీరుతాడు!అందుకే వాల్మీకి అవతారికలో అంత ధీమాగా "ఈ ప్రపంచంలో పర్వతాలు స్థిరంగా వున్నంత వరకూ నదులు ప్రవహిస్తున్నంత వరకూ నా రామకధ నిలిచి వుంటుంది" అని చెప్పుకోగలిగాడు?!అనునిత్యం మనలో జరిగే కధని మనం తెలుసుకోకపోతే నష్టం యెవరికి - మనకే!

   జవహర్ లాల్ నెహ్రూ గొప్పవాడు,మంచివాడు అనే భావం వున్నవాళ్ళలో యెవరూ రామాయణాన్ని చదవకూడదు.దానివల్ల వాళ్ల మనోభావాలు దెబ్బతిని అశాంతికి గురయి వాళ్ళ మానసికారోగ్యం చెడుతుంది!తండాల సంస్కృతిలో పెరిగి మూకుమ్మడి దొమ్మీల లాంటి కిరాతక యుధ్ధాల్తో మునిగితేలిన చెంగిజ్ ఖాన్ మరియూ తైమూరు లంగ్ అనే క్రూరుల్లో ఆ గాంధీగారి ప్రధమ శిష్యుడికి గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడ్దాయి,బహుశా రక్త సంబంధం యేదయినా వుందేమో!వాళ్ళని పొగడటానికి యెన్నో విశేషణాల్ని వాడాడు.కానీ రాముణ్ణి గురించి పొగిడినట్టు లేదు?జిజియా పన్నులు వేసిన ఔరంగజేబు కాలం లోనే తన రాజ్యంలో హిందూ ముస్లిముల్ని సమానంగా చూసిన శివాజీ మహరాజ్ అతనికి గొప్ప నాయకత్వ లక్షణాలు వున్నవాడిగా కనపడ లేదు,పొగడటానికి చాలా ఇబ్బంది పడిపోయాడు,యెందుకనో!కాబట్టి వారు ఈరోజున లేకపోయినా వారి మానసపుత్రులు వున్నారు గనక వారికి నేను చేస్తున్న విజ్ఞప్తి - "అయ్యా!తమరు దయ వుంచి రామాయణం చదవకండి!చదివినా వెంఠనే మర్చిపొండి!మీకు తోచిన పిచ్చి అర్ధాలు వెతికి మమ్మల్ని కూడా మీలాగ తయారు చేసి వుధ్ధరించుదామని అస్సలు ప్రయత్నించకండి!మేము మా ఆత్మారాముడితో అనుబంధాన్ని వొదులుకుని ప్రేతాత్మల్లాగ బతకడానికి సిధ్ధంగా లేం!"

    లాభం వస్తుందని రూఢిగా తెలిసినప్పుడు మంచిపనులు చేస్తూ నష్టం వస్తుందని అనుమానం రాగానే దొంగపనులకి దిగుతూ అవకాశవాదిగా బతకాలనుకోకుండా నష్టం వచ్చేటప్పుదు వెనక్కి తగ్గుతూ మంచిపనులు మాత్రమే చెయ్యాలనుకునేవాళ్ళు అందుకు వుత్తేజితులు కావడం కోసం రామాయణం తప్పనిసరిగా చదవాలి!యెడ్వినా పట్ల వ్యామోహంతో అభాసు పాలయిన జవహర్ లాల్ నెహ్రూ లాగా కాకుండా మరోలాగ బతకాలనుకునేవాళ్ళకి రామాయణం వుత్సాహాన్ని ఇస్తుంది.రాముడే స్వయంగా చెప్పినట్టు "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అనే భావం ప్రకారం ఈ దేశాన్ని మాతృదేశంగా భావించేవాళ్ళు కులమతప్రాంతాలతో సంబంధం లేకుండా రామాయణాన్ని చదవాలి?!

     ఇక్కడితో రామకధా వైభవం పూర్తయింది!మొదట ఇంత విస్తారంగా ఇదంతా చెబుదామనుకోలేదు.చిన్న ప్రస్తావనతో సరిపెట్టి అసలు కధలో వుండే ప్రహేళికలనే తిన్నగా యెత్తుకుందామనుకున్నాను,తీరా మొదలు పెట్టాక అనుకోకుండా ఇంతగా విస్తరించింది?అయినా ఇవన్నీ తెలిస్తేనే కధలోపలి విశేషాలు మరింత చక్కగా అర్ధమవుతాయి లెండి!కానీ ఇక్కడే అవి కూడా చెబితే పోష్టు చాలా పెద్దదయ్యేలా వుంది,కనుక "హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విశ్లేషణం" అనే తరవాతి భాగం కోసం మీరు కొంచెం వేచివుండాలి!
_______________________________________________________________
చారిత్రక విషాదం   రామకధా వైభవం రామకధా విశ్లేషణం రామకధా విమర్శనం  రామకధా విజృంభణం

Tuesday, 30 December 2014

ఆంధ్రప్రదేశ్ కి విభజన కష్టాలు మొదలయ్యాయా?చంద్రబాబు నిజంగా వీట్ని పరిష్కరించగలడా!

    హుద్ హుద్ తుఫానుకు ప్రధాని మోదీ ప్రత్యక్షంగా చూసి చలించిపోయి ప్రకటించిన 1000 కోట్ల సాయంలో నికరంగా వచ్చేది 620 కోట్లు మాత్రమేనని తెలుస్తున్నది!కేంద్రం తన వాతాగా ఇప్పటికి 400 కోత్లు మాత్రమే ఇచ్చిందనీ,మహా అయితే ఇంకో 105 కోత్లు ఇచ్చి సరిపెట్తేస్తారనీ,అంతకంటే యెక్కువ ఆసలు పెట్తుకోవద్దని కేంద్ర అధికారులు తెగేసి చెప్పారనీ మీసాల సుహాసిని లాంటి నయా మీడియా సలహాదారు ఒక కధనాన్ని జనం మీదకి వొదిలాడు.

     హుద్ హుద్ తుఫాను నష్టంపై రాష్త్ర ప్రభుత్వమే రెండు రకాల నివేదికల్ని పంపింది.తొలుత 40 వేల కోట్ల పైనే నష్టం జరిగిందని తెలిపారు.ఆ తర్వాత 21 వేల కోట్ల నష్తం జరిగిందంటూ గణాంకాలతో మరో నివేదిక వెళ్ళినట్టు తెలిసింది.రెండు రకాల నివేదికలతో గందరగోళానికి గురయి సాయాన్ని నిర్ణయించే బాధ్యతను పూర్తిగా కేంద్ర బృందానికే వదిలేసింది.ఆ బృందం తను సొంతంగా మళ్ళీ తిరిగి చూసి కొండని తవ్వి యెలకని పట్తినట్టుగా తుఫాను సాయం కింద రూ.620 కోట్లు ఇస్తే సరిపోతుందని తేల్చేసింది.మరోవైపు ప్రధానమంత్రి ప్రకటించినట్లుగా వెయ్యి కోట్లు ఇవ్వక్కర్లేదని రూ.400 కోట్లు ఇస్తే సరిపోతుందని కేంద్ర హోం శాఖ పరిధిలోని జాతీయ విపత్తు విభాగం సిఫారసు చేసింది.దీనికి కేంద్ర ఆర్ధిక శాఖ కూడా ఆమోద ముద్ర వేసింది.ఈ మొత్తానికి రాష్ట్ర విపత్తు నిధి నుంచి తన వాటాగా రూ.115 కోట్లను చేర్చి మొత్తం రూ.515 కోట్లను కేంద్ర సాయంగా చూపించ వచ్చు.ప్రస్తుతానికి ఇదే కేంద్రం నుంచి నికరంగా అందే తుఫాను సాయం?కేంద్ర బృందం సిఫారసు యెంత గరిష్ఠంగా లెక్క వేసినా రూ.620 కోట్లు మించదు.అంటే ప్రధాని ప్రకటించిన సాయంలోనే రూ.495 కోట్లకు కోత పడిందన్న మాట!

     ఈ మొత్తం వ్యవహారం ఇంత నిష్ఫూచీగా జరుగుతుంటే కేంద్ర మంత్రివర్గంలోనే వున్న నలుగురు తెదెపా సభ్యులూ భాజపా వెంకయ్య నాయుడూ యేమి చేస్తున్నట్టు?అంత భయంకరమయిన తుఫానుకి ప్రధాని బహిరంగంగా చేసిన వాగ్దానానికి సంబంధించిన నిధుల్నే సమర్ధవంతంగా రాబట్టలేని వాళ్ళు రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లూ, రాష్త్ర పునర్నిర్మాణానికి అవసరమయిన మరిన్ని లక్షల కోట్లూ యెట్లా సాధించగలరు?ఆడలేని సానిది మద్దెల ఓడన్నట్టు వీళ్ళ అసమర్ధత నంతా జాతీయ విపత్తు విభాగంలోని ఒక అధికారి మీదకి మళ్ళించాలని మీసాల సుహాసిని సుకుమారమైన కధలు చెప్తున్నాడు!

     ఆడలేని సానిది మద్దెల ఓడన్నట్టు ఈ అసమర్ధత నంతా జాతీయ విపత్తు విభాగంలోని ఒక అధికారి మీదకి మళ్ళించాలని మీసాల సుహాసిని సుకుమారమైన వింత వింత కధలు చెప్తున్నాడు!సరయిన నివేదికలు పంపకపోవడం,అక్కడి నుంచి వచ్చే సమాచారాన్ని రాష్ట్ర  ప్రభుత్వానికి నివేదించక పోవడం,సుకుమారుని వింతయిన వ్యవహార శైలి అనీ రకరకాల సాహిత్య పదకోశంతో వార్తని నింపేసింది.నిజానికి నాకిది రాష్త్ర ప్రభుత్వంలో సర్వం సహాధికారి అయిన మిత్రుడూ కేంద్రంలోనూ వున్న ఆ మిత్రుని పార్టీ సభ్యులూ ఇబ్బంది పడకుండా చక్రం అడ్డువెయ్యటం లాగా కనిపిస్తున్నది!

     హుద్ హుద్ సాయం రప్పించే బాధ్యత నంతా ఆ ఒక్క అధికారికే రాష్త్ర ప్రభుత్వం కట్టబెట్టిందా?ప్రబుత్వంలో ఇంకెవరూ తుఫాను సాయం గురించి పట్టించుకోలేదా?సాక్షాత్తూ కేంద్ర మంత్రివర్గంలోనే వున్న వాళ్ళకి కూడా తుఫాను సాయం పని యెంత వరకూ వచ్చింది అనే ఆరా కూడా లేకుండా పోయిందా?నిక్కచ్చిగా రావాల్సిన సాయాన్నే తెచ్చుకోలేని రాష్త్రప్రభుత్వం అసలు రాత పూర్వకంగా నికరమయిన హామీయే లేని ప్రత్యేక హోదాని యెలా సాధించుకుంటుంది?ఇప్పటికే సుజనా రాగం మారింది!ఇదివరలో వున్న ప్రణాళికా సంఘం ప్రకారం అయితే ప్రధానికి విశేషాధికారాలు వుండేవి - ఆ ఒక్కణ్ణి బతిమాలుకుంటే సరిపోయేది,ఇప్పుదు మోదీగారు దాని స్థానంలో ముఖ్యమంత్రుల కౌన్సిలు చేతిలో పెట్టాడు ఆ పనిని?!భయం గల కోడి బజారులో గుడ్డు పెట్టినట్టు ఒక్క మనిషి నిర్ణయమే అనుకూలంగా వుంటుందో లేదో తెలియని విషయం ఇప్పుడు అంతమంది చేతిలో పడింది!

హిందూ ధర్మ ప్రహేళికలు-చారిత్రక విషాదం!

      అసలు హిందూ ధర్మమే ఒక వైపు నుంచి చూస్తే చాలా సరళంగానూ మరోవైపు నుంచి చూస్తే గహనంగానూ కనిపిస్తుంది!బట్టనెత్తి బాలయ్య అట్టకన్నా దిట్టమయిన విగ్గు పెట్టి "ఒక వైపే చూడు!రెండో వైపు చూడకు - తట్టుకోలేవ్,చచ్చిపోతావ్" అంటే అది సినిమా గాబట్టి డయరెక్టరు చెప్పాడు గాబట్టి అమ్రిష్ పురి అయినా సరే దడుచుకున్నట్టు నటించాల్సిందే,అట్టా చెయ్యకపోతే నిర్మాత డబ్బులిస్తాడా?కానీ పాపం హిందూ ధర్మానికి ఆ రకం సీను లేదాయె!ప్రతీ అడ్దగాడిదకీ లేకువైపొయింది?

      ఒకప్పుడు విదేశీయుల దృష్టిలో ఇది - పాముల నాడించే వాళ్ళ దేశం?కావమ్మ మొగుడంటే కామోసని అందరూ నమ్మేసారు, కాదని వాదించేవాడు లేడు గదా!కానీ చరిత్ర మరొక పిక్చరు చూపిస్తాంది?ఇంగ్లీషోడు మనని ఆక్రమించుకున్న కొత్తల్లోనే మన దేశం నుంచి వెళ్ళిన ఒక నౌకకి అక్కడ లంగరెయ్యగానే అక్కడి వాళ్లకి గుండెలు గుభేలు మన్నయ్,ఇంత పెద్ద నౌకని చూట్టం వాళ్ల జన్మకదే మొదటి సారి మరి!దాంతో ఇంగ్లీషోళ్ళు మనల్ని దెబ్బతియ్యటానికి చేసిన మొదటి పని మన నౌకల్ని నిషేధించటం!

    ఇంగ్లీషు వాళ్ళకన్నా ముందు ప్రపంచ దేశాల్లో "మేడిన్ ఇండియా" అనే మాటకి ఇవ్వాళ "మేడిన్ అమెరికా" మరియూ "మేడిన్ జప్యాన్" అనే మాటల కన్నా యెక్కువ దమ్ము వుంది!మహానౌకలు అని పిల్చేవాళ్ళు భారతీయ నౌకల్ని!వాళ్లలా దేశాల్ని రాజకీయంగా ఆక్రమించి తమకి అనువుగా ప్రభుత్వాల్ని మార్చుకుని చేసిన దివాళాకోరు వ్యాపారం కాదు మనం చేసింది,సరుకులో నాణ్యత చూపించి సాధించిన మోనోపలీ అది!

     17వ శతాబ్దంలో జాన్ డాల్టన్ కనుక్కున్న అణుధర్మ శాస్త్రం గురించి డాల్టన్ కన్న 2,500 సంవత్సరాలకి పూర్వమే ఆచార్య కణాదుడు ఇక్కడ ప్రతిపాదించాడు!అది యేదో భంగు మత్తులో వుండి వాగిన సొల్లు కాదు,అతని అసలు పేరు కశ్యపు డయితే ఈ సిధ్ధాంతం పేరు మీద కణాదు డనేది బిరుదుగా వచ్చింది!ఈ ఋషి క్రీ.పూ 600లో ఇప్ప్పటి గుజరాతు లోని అప్పటి ప్రభాస క్షేత్రంలో జన్మించాడు.ఈ విశ్వమంతా అతి చిన్న అంశమయిన కణములు లేదా అణువులతో నిర్మించ బడింది అనీ,ఆ కణాన్ని అంతకన్నా చిన్న భాగాలుగా విడగొట్టలేము అనీ సిధ్ధాంతం లాగా వివరించి చెప్పాడు.కానీ మనం మాత్రం అణుధర్మ శాస్త్ర పితామహుడిగా జాన్ డాల్టన్ మహాశయుణ్ణే కీర్తిస్తాం.

     "భూమికి గల ఆకర్షణ వల్ల వస్తువులు భూమి పైన పడుతున్నాయి.ఇదే ఆకర్షణ వల్ల భూమి,ఇతర గ్రహాలు,నక్షత్ర సమూహాలు,సూర్యుడు,చంద్రుడు తమ తమ కష్యలలో పరిభ్రమిస్తున్నాయి" - ఇది మనం న్యూటన్ పేరు మీద గురుత్వాకర్షణ శక్తి నియమంగా చదువుకుంటున్నాం.కానీ ఈ మాటలు క్రీ.శ 400-500 మధ్యన జీవించిన భాస్కరాచార్యు డనే భారత దేశపు ఖగోళ శాస్త్రవేత్త రచించిన "సూర్య సిధ్ధాంత" మనే గ్రంధం లోనివి!ఇది మనకి ఐజాక్ న్యూటన్ ద్వారా 1200 సంవత్సరాల తర్వాత తెలిసింది?

   పాశ్చాత్య శరీరధర్మశాస్త్రం ఇంకా శైశవదశలోనే వున్న వెనకటి కాలంలోనే ఇక్కడి వాడయిన ఆచార్య చరకుడు ఎనాటమీ,ఎంబ్రియాలజీ,ఫార్మకాలజీ శాఖలకి సంబంధించిన యెన్నో విషయాల్ని విపులంగా చెప్పాడు!మధుమేహం, హృదయ సంబంధమయిన వ్యాధుల గురించి యెన్నో విషయాలు చెప్పాడు!ఇక క్రీ.శ 499లోనే తన "ఆర్యభటీయం"లో గ్రహగతుల గురించీ గ్రహణాలు యేర్పడే విధం గురించీ వ్యాఖ్యానించాడు!కోపర్నికస్ ద్వారా మనం తెలుసుకున్న దానికి 1000 సంవత్సరాలకు ముందే భూమి గుండ్రంగా వుంటుందనీ అది సూర్యుడి చుట్టూ ఒక అక్షం మీద పరిభ్రమిస్తుందనీ చెప్పాడు?2600 సంవత్సరాలకు పూర్వమే శుశ్రుత మహర్షి సిజేరియన్,క్యాటరాక్ట్,ప్లాస్టిక్ సర్జరీ,బ్రైన్ సర్జరీ లాంటి యెన్నో క్లిష్తమయిన శస్త్ర చికిత్సలు చేశాడు!

      శ్రీమధ్భాగవతం లోని 3వ కాండ 30వ అధ్యాయంలో వర్ణించిన తల్ల్లి గర్భంలో శిశువు యెదిగే దశల్ని ఇవ్వాళ మనం చూసే ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ వివరాలతో పోల్చి చూస్తే రెంటిలోనూ యెన్నో పోలికలు కనపడతాయి!గురు పాదుకా స్తవంలో శక్తిని "నాద బిందు కళాధరీ" అని కీర్తించారు!చందస్సుకి సరిపోతుందని వేసిన వ్యర్ధ పదం కాదది - ఇవ్వాళ బౌతిక శాస్త్రవేత్తలు మూలకాల్ని గుర్తు పట్టటానికి రిసొనేటింగ్ ఫ్రీక్వెన్సీ, స్పెక్త్రోఫోటోమెట్రీ, అటామిక్ వెయిట్  అనే మూడింటిని పరీక్షలుగా తీసుకుంటున్నారు!

   వేదగణితం గురించి కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ చేసిన గొడవ ఇంకే దేశంలో నైనా యెవరయినా చేస్తే జాతిద్రోహుల కింద జమకట్టి  జనమే తన్ని తగలేసే వాళ్ళు!ఇక్కడ గాబట్టి మేధావులుగా చెలామణీ అవుతూ గౌరవాలు పొందుతున్నారు?అసలు ఇవ్వాళ ప్రపంచంలో మనం ఫాలో అవుతున్న అంకగణితంలో మనవాళ్ళు చేసింది కేవలం సున్నాని కనిపెట్టట మొక్కటే కాదు - ప్రాధమిక నియమాలు కూడా మనవాళ్ళు చెప్పినవే!

    సున్నాని కనిపెట్టడం కూడా ఆర్కిమిడ్డీసు లాగా నీళ్లతొట్టెలో పడుకుని వూగుతుండగా హట్ఠాత్తుగా తెలిసొచ్చి "యురేఖా తకమిఖా" అని పాడుకుంటూ వొంటిమీద బట్ట వుందాలేదాని కూడా చూసుకోకుండా రెచ్చిపోయినట్టు జరగలేదు!దైవానికీ జీవుడికీ వుందే సంబంధాన్ని అందులో నిక్షేపించారు!శూన్యాంకం మరియూ పూర్ణాంకం అని రెండు పేర్లతోనూ పిలిచే ఈ గుర్తుకి సొంతంగా విలువ లేదు,కానీ మరొక అంకెకి కుడిపక్కన అంటే ముందువైపుకి చేరితే దాని విలువని పదింతలు పెంచుతుంది.భగవంతుణ్ణి చూడగలిగిన మనిషి విలువ గురించిన సూచన అది!అసలు 1 నుంచి 9 వరకూ వున్న అంకెలన్నీ 1కి బహురూపాలే!అంటే అక్కడ వున్నవి రెండే రెండు - '1" మరియూ "0".ఇవ్వాళ కంప్యూటర్లలో వాడుతున్న బూలియన్ ఆల్జీబ్రా చెప్పే "బీయింగ్" మరియూ "నథింగ్" అనే సిధ్ధాంతానికి మూలరూపం కూడా ఇందులోనే వుంది?!అలాంటిది యెంత కష్టమయిన లెక్కనయినా పేపరు మీద వేసుకుని అంచెల వారీగా చెయ్యాల్సిన పని లేకుండా,కనీసం కాలిక్యులేటరు కూడా వాడకుండా మనస్సులోనే చెయ్యగలగడం వల్ల మన పిల్లలు యెంత చురుగ్గా తయారవుతారు అనేది కూడా పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యతిరేకించారు,యేమి దౌర్భాగ్య మిది?

     ఇతర్లు కనుక్కున్న వాట్ని మనవాళ్ళు ముందే కనుక్కున్నా ఇంకా ఇతర్ల పేరు మీదనే చదువుతున్నాం.ఈ దగుల్బాజీ తనం పేరు సెక్యులరిజం,మోడర్నిటీ!ఒక ఫ్రెంచ్ మహిళ - పెద్దగా పేరున్న మనిషి కూడా కాదు,మన దేశంలోని ప్రాచీన విజ్ఞానం గురించి కొంచెం తెలియగానే "ఇదే మా దేశపు వాళ్ళు కనిపెడితే ప్రపంచం పొలిమేరలు గింగురుమనేలా అరిచి గోల చేసయినా సరే గుర్తింపు తెచ్చుకునేవాళ్ళం" అనేసింది!

    నేను ఈమధ్యన ఒక తెలివితక్కువ పని చేశాను!ప్రజ బ్లాగులో గీత గురించి ఒక ప్రశ్న వేస్తే కొందరితో వాదన మొదలెట్టాక క్షేమంగా ఇందులోంచి బయట పడగలనా,యెరక్కపోయి ఇరుక్కున్నాను గదా అని పరితపించాల్సిన దుస్థితి యెదుర్కొన్నాను?మొత్తం విషయాన్ని తెలుసుకుంటే కానీ అర్ధం కాని విషయాన్ని గురించి ముక్కలు ముక్కలుగా తెలుసుకుని అసలు మొత్తం యేమి అర్ధాన్ని ఇస్తుందో ముందు ముందయినా తెలుసుకోవాలనుకోకుండా రెండు మూడు ముక్కల్ని, అది కూడా వాట్ని విమర్శించడం ద్వారా అసలు రచయితల కన్నా నేను తెలివయిన వాణ్ణి అని తమ పాండిత్యాన్ని చూపించుకోవాలనే రకం వాదనలు నాకు గీత గురించిన చర్చల్లో యెదురయినాయి.

     Einstein విశ్వంలో వంపుదారే తిన్ననిదారి అని చెప్పాడు అని ముక్తాయించి వొదిలేస్తే యెలా వుంటుంది?ఆ వొక్క ముక్క చుట్టూరా ఆయన యేం చెప్పాడో దాన్ని యెలా సమర్ధించాడో తెలియకపోతే ఆ ముక్క అర్ధమవుతుందా యెవరికయినా!మనకి సాంప్రదాయికంగా వున్న పండగల్లో ప్రతిదానికీ ఒక నక్షత్రం క్షితిజం మీదకి రావటం వుంటుంది కదా!అది అక్కడికి యెందుకొస్తుంది?విశ్వంలో సూర్యమండలం,నక్షత్రరాశులూ వాటి సొంత వేగాలతో వాటి మానాన అవి పరిభ్రమిస్తుంటే భూమి మీద నుంచి చూస్తే మాత్రం ఆ రెండూ ఒకే రేఖ మీదకి వచ్చినట్టు కనిపిస్తాయి.దాన్ని సూర్యుడు ఆ నక్షత్ర రాశిలో ప్రవేశించడం అంటారు.కోపర్నికస్ అనేవాడు భూమి గురించి ఒక నిజం చెప్పినందుకు సజీవదహనం చేసిన వాళ్లకన్నా చాలా ముందుగానే ఆయా విషయాలన్నిట్నీ ఒక శాస్త్ర స్థాయిలో అభివృధ్ధి చేసిన వాళ్ళకి సరిగ్గా ఆ సమయానికి వాతావరణంలో జరిగే మార్పులు కూడా తెలుసు!ఆ రోజు దేవుడి పేరు మీద చెయ్యమని చెప్పిన పూజల్లోనూ వండివార్చి ఆరగింపు చేసి మనం తినాల్సిన నైవేద్యాల లోనూ ఆ వాతావరణానికి దేహంలో జరిగే మార్పులకి ప్రతిక్రియలుగా పనిచేసే ఔషధాల్ని సమకూర్చటం అనే ఆయుర్వేద సూత్రాలు వున్నాయని తెలియకపోతేనే అవి మూఢనమ్మకాలు అవుతాయి!

   ఒక వైపున చంద్రుడు క్షీరసముద్రంలో లక్ష్మీదేవికి సోదరుడుగా పుట్టుకొచ్చాడు,అతను ఓషధుల కధిపతి,మనస్సును భ్రమింప జేస్తాడు అనే పిట్టకధలూ చెప్పారు, మరొక వైపున చంద్రుడు అనేది గోళాకారంగా వున్న గ్రహం,అది భూమి చుట్టూ తిరుగుతుంది అని వ్యాసార్ధాన్ని కూడా కొలిచి సిధ్ధాంతాలూ చెప్పారు?బైబిలుకి విరుధ్ధంగా చెబితే చంపేసిన వాళ్ళు శాస్త్రీయ దృష్టి గలవాళ్ళూ ఆధ్యాత్మికతలోనూ శాస్త్రీయతని ఇముడ్చుకున్న వాళ్ళు అనాగరికులా?మామూలుగా చెప్తే బోరు కొట్టించే విషయాల్ని కల్పిత కధలుగా చెప్పే పురాణ సాహిత్యం అన్ని జాతుల్లోనూ వుంది!నక్షత్ర రాశులు యెలా పుట్తాయి అనే దాని చుట్టూ అల్లిన "క్లాష్ ఆఫ్ థ టైటాన్స్"కి నాలుగో వెర్షన్ ఇప్పుదు హాలీవుడ్డులో నడుస్తాంది?"జాక్ అండ్ థ బీన్ స్టాక్" అనే పేరుతో మనమూ చిన్నప్పుడు చదువుకున్న చిక్కుడు మొక్కతో ఆకాశంలోకి వెళ్ళే కధనే ఇప్పుడు మళ్ళీ "జాక్ అండ్ థ జైంట్ స్లేయర్" పేరుతో మళ్ళీ తీసుకుని సరదాగా సూపర్ హిట్టు చేసుకున్నారు?మనవాళ్లకి ఇదేమి మాయరోగమో మన పురాణ కధల్లో బూతులూ తప్పులూ తప్ప ఇంకెమీ కనబడ్దం లేదు?!ఇంటి ఈగ శ్లేష్మం మీదా తేనెటీగ పువ్వు మీదా వాలినట్టు వీళ్ళ బుధ్ధిలో వున్నదాన్నే అక్కడ చూస్తున్నారా?రామాయణంలో నైనా భారతంలో నైనా మతి తప్పిన భౌతిక్క వాదమూ స్త్రీవాద దళితవాద పైత్యకారి పాండిత్యాలకి పనికొచ్చే అంశాలూ వెతుకుతారు,అవి లేనిదంతా చెత్త అని తీర్మానించేస్తారు?

    వాళ్లు యెటూ అవి మాకక్కర్లేదని చెప్పేశారు గాబట్టి వాళ్లకి పనికి రాకపోయినా అసలు అక్కడేముందో తెలుసుకోవాలనుకునే బుధ్ధిమంతులకి కనీసం వాళ్ళ గందరగోళపు వాదాలకి మతి తప్పకుండా వుండటానికి పనికొస్తాయనే వుద్దేశంతో పౌరాణిక సాహిత్యంలో నిగూఢంగా వున్నవాట్ని గురించి నాకు తెలిసిన విషయాల ఆధారంతో వ్యాఖ్యానించాలని పూనుకున్నాను.రామాయణంలో వాలిని రాముడు అన్యాయంగా చంపేశాడని పొర్లి పొర్లి యేడుస్తున్న వాళ్ళు ఇప్పటికీ వున్నారు?ఇక భారతంలో కర్ణుడికీ యేకలవ్యుడికీ అయితే ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా వున్నాయి?అవి నిజంగా తప్పులేనా,అసలు అక్కడ మనం తెలుసుకోవలసినదేమిటి అనేవి వివరిస్తాను!

     అర్ధ పాండిత్యం అంటారు గదా, పాండిత్యంలో సగం వుంటుందా?వుంటుంది!దేన్ని గురించయినా యెందుకు తెలుసుకోవాలి?తెలుసుకుని యేమి చేయాలి?మనకి పనికొచ్చేదాన్ని గురించే మనం తెలుసుకోవాలి!తెలుసుకున్నదాన్ని ఆచరణలోకి అనువదించుకోవాలి!అక్కడ వున్నదాన్ని అర్ధం చేసుకోవడం, అర్ధమయిన దాన్ని వుపయోగించుకోగలగడం అనే రెందూ కలిస్తేనే పూర్ణ పాండిత్యం,ఆ రెంటిలో యే ఒక్కటి లోపించినా అర్ధపాండిత్యమే?అంతే తప్ప పాండిత్యంలో 100% మరియూ 50% అంటూ పెర్సెంటేజిలు వుండవు!పౌరాణిక సాహిత్యం పూర్తిగా నైతిక సంబంధమయిన సందేహాల్ని నివృత్తి చెయ్యడానికి వుద్దేశించినవి!వాటిల్లో అనవసరమయిన విషయాల్ని వెదకటమంటే రామాయణంలో పిడకల వేటలా వుంటుంది!అర్ధమయినదాన్ని పనికొచ్చేలా వుపయోగించుకోవటం,అర్ధం కాకపోయినా పనికొస్తుందేమో అనిపిస్తే పూర్ణపండితుల్ని అడిగి తెలుసుకోవటం,అంతే - చెంబు కొద్దీ గంగ!
_______________________________________________________________
చారిత్రక విషాదం   రామకధా వైభవం  రామకధా విశ్లేషణం రామకధా విమర్శనం  రామకధా విజృంభణం

Friday, 26 December 2014

తెలంగాణా మేధావులకి నా వైపునుంచి శ్రీరామప్రసాద గీత!

             "కులరీత్యా,ప్రాంతరీత్యా,భాషరీత్యా వెనుకబడిన ప్రజలూ,లైంగికంగా అనగదొక్కబడిన స్రీలూ అప్పటికే అభివ్ర్ధ్ధి చెందిన వారితో యెలా పోటీ పదగలరు?" అన్న ప్రస్న సరైంది కాదు.వెనుకబడిన వాళ్ళు అభివృధ్ధి చెందిన వాళ్ళతో ఒకానొక సంబంధంలోకి వచ్చినప్పుడు మాత్రమే "వెనుకబడినవాళ్ళు"గా గుర్తించబడుతున్నారు.ఈ తారతమ్యం సాపేక్షమైనది.యెవరయినా గానీ "మేము మీకన్నా అభివృధ్ధి చెందినవాళ్ళం.మీరు మాకన్నా వెనుకబడిన వాళ్ళు" అని అంటున్నప్పుడు వెనుకబడిన వాళ్ళు ఆ అభివృధ్ధి చెందిన వాళ్ళతో సంబంధాన్ని తెంచేసుకున్నప్పుడు ఆ తేడాల వునికే అదృశ్యమౌతుంది.

         అభివృధ్ధి చెందిన వాళ్ళు వెనుకబడిన వాళ్ళ అభివృధ్ధి క్రమాన్ని గుర్తించటానికి నిరాకరించినప్పుడు,వాళ్ళ ఆత్మగౌరవాన్ని నలిపివేస్తున్నప్పుడు వెనుకబడిన వాళ్ళు అభివృధ్ధి చెందిన వాల్లతో తమ సంబంధం యొక్క పరిమితులను కుదించే ప్రయత్నం చెయ్యాలి.బ్రిటిష్ దేశమూ, ఇంగ్లీషు భాషా యెంత ఆధునిక స్థాయికి అభివృధ్ధి చెందినవైనప్పటికీ వారు మనల్ని పీడిస్తున్నప్పుడు వారి ఆధిక్యాన్ని నిరోధించే లక్ష్యంతో స్వాతంత్ర పోరాటాలు సాగాయి.అవన్నీ వాళ్ళు పాలకులు,మనం పాలితులు అనే సంబంధాన్ని రద్దు చెయ్యటానికి జరిగాయి.

          అంటే,అభివృధ్ధి చెందిన వాళ్ళ అతివృధ్ధిని నిరోధించే విధంగానే వెనుకబడిన వాళ్ళ అభివృధ్ధి జరగాలన్న మాట!అభివృధ్ధి చెందిన వారి స్థాయికి యెదగాలన్నా,వారి ఆధిక్యాన్ని నిరోధించాలన్నా వెనుకబడిన ప్రజలు ఇప్పటికే అభివృధ్ధి చెందినవారి కంటే వేగంగా కదలాల్సి వుంటుంది.ఈ పధ్ధతిలోనే అభివృధ్ధి పేరున జరిగే పరాయీకరణని కూడా వెనుకబడిన ప్రజలు క్రమేణా తొలగించుకోగలుగుతారు.కాబట్టి అభివృధ్ధి చెందినవారి కన్నా అదనపు చైతన్యం పొందీతే తప్ప వారిని మించిపోయి గెలిచే లక్ష్యం సిధ్ధించదు!

   మాక్కాస్త పేరు ప్రతిష్ఠలు సంపాయించి పెట్టండి బాబూ అని యెవరూ యెవర్నీ దేబిరించనక్కర్లేదు.పేరు ప్రతిష్ఠలు ఏయే మార్గాల్లో వస్తాయో తెల్సుకుని వాట్ని సాధించే కృషిని నమ్ముకుంటే వాటంతటవే వస్తాయి.మేము బలహీనవర్గానికి చెందిన వాళ్లం కాబట్టి మా తరపున మీరు పోరాడి ఫలితాన్ని మాకు దక్కించండని యెవ్వర్నీ ప్రాధేయ పడవద్దు.అట్లా చేసేవాళ్ళు రెండే విధాలు:మాఫియా గ్యాంగులు,నక్సలైటు వర్గాలు - యెవ్వర్ని మీరు సంరక్షకులుగా యెంచుకున్నా మీకు దక్కేది తాత్కాలిక రక్షణే!
                                                                                                                       -------B.S.రాములు & కలెకూరి ప్రసాద్
-----------------------------------------------------------------------------------------------------------------
          ఇది యెప్పుడో నాకు నచ్చి నా పర్సనల్ కలక్షన్ లోకి యెక్కించుకున్న ఒక విశ్లేషణ.ఇందులోని సారాంశ మేమిటంటే అబివృధ్ధి చెందటం,వెనకబడటం అనేవి సాపేక్షాలు.వెనకబడిన వాళ్ళు అనే మాటకే అసలు అర్ధం లేదు  యెవరి కన్నా వెనకబడిన వాళ్ళో చెప్పకపోతే!ఈ రకమయిన అవగాహన నాలో మొదటినుంచీ గట్టిగా వుండటం వల్లనే రాష్త్ర విభజన విషయంలో తెలంగాణా వాదుల్ని నేను అంత గట్టిగా సమర్ధించాను.

          ఆ విశ్లేషణలో రెండు కీఎలకమయిన అంశాలు వున్నాయి.ఒకటి,అభివృధ్ధి చెందిన వాళ్ళు వెనకబడిన వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఆ సంబంధాన్ని తెంచేసుకోవటం,వెనుకబడిన వాళ్ళు అభివృధ్ధి చెందిన వాళ్ల కన్నా వేగంగా కదలటం. మొదటిది సాధించారు,కానీ రెండవది సాధించ గలరా?

          యెందుకంటే నాకు మొదటి నుంచీ తెలంగాణా వుద్యమవీరులు చేస్తున్న వాదనల్లో ఒక సందేహం ఇప్పటికీ మిగిలి పోయింది!అసలు ఒక ప్రాంతం లోని మేధావు లంతా యాభయ్యేళ్ళ పాటు తమ ప్రాంతం వాళ్ళు వెనకబడితే యెందుకు నిస్తేజంగా వుండి పోయారు?వుద్యోగాల కయితే చదువులూ డిగ్రీలూ కావాలి,కానీ వ్యాపార పారిశ్రామిక రంగాల్లో పైకి రావాలంటే కేవలం పెట్టుబడీ చొరవా మాత్రం చాలు గదా!ఆంధ్ర వలసవాదుల దోపిడీలూ,ఆంధ్రోళ్ళ దుర్మార్గపు కబ్జాలూ లాంటి పనికిమాలిన వాదనల్ని తీసేస్తే తెలంగాణాలో వ్యాపార పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి పెట్టి యెదగ గలిగిన వాళ్లే లేరా?

          యెంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందన్నట్టు దేశానికి స్వాంత్ర్యం రావడమేమో గానీ  తెలంగాణాలో మాత్రం పెద్ద సైజు గందరగోళాన్ని రగిలించింది?!నిజాము ఈ దేశంలో కలవనని మంకు పట్టు పట్టటం, ఆ ప్రభుత్వాన్ని పోలీసు చర్య ద్వారా కలిపేసుకోవటం,పనిలో పనిగా ఆ వుద్యమానికి నాయకత్వం వహించిన కమ్యునిష్టుల్ని కూడా యేరి పారెయ్యటంతో మొత్తం తెలంగాణా అంతటా హఠాత్తుగా ఒక శూన్యం యేర్పడింది!ప్రజల్ని చైంతన్యవంతుల్ని చేసిన కమ్యునిష్టులు శవప్రాయులై నెహ్రూ భక్తులుగా మారిపోవటంతో నాయకత్వ లేమి యేర్పడింది!అప్పటి దాకా ప్రజల్ని పీడించి అపార ధనరాసుల్ని పోగు చేసిన వాళ్ళు దేశం వొదిలి పారిపోవటంతో ఆర్ధికపరమయిన యెదుగుదల వెనకబడింది!ఆ శూన్యాన్ని ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు భర్తీ చేశారు.అది కావాలని ఆంధ్రోళ్ళు కుట్ర పూరితంగా చేసింది కాదు గానీ ఒక మోనోపలీ అనేది స్థిరపడి పోయింది!

          ఒకసారి మోనాపలీ యేర్పడితే దాన్ని వొదులుకోవటానికి యెవడూ ఇష్టపడడు!రేపు తెలంగాణా రాష్త్రం నుంచి యెదిగే వాళ్ళు కూడా దీనికి అతీతంగా వుండరు!యేమయితేనేం రాజకీయ పరమయిన విభజన జరిగింది!కానీ అసలు ప్రశ్న యేమిటంటే:ఆంధ్రావాళ్ళు వచ్చి బాగుపడిన చోట తామూ బాగుపడేటందుకు అవకాశాలు వున్నాయని తెలిసినప్పుడు, అక్కడికెళ్తే యెదుగుదల సాధ్యమని తెలిశాక ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కోస్తా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?

         యెక్కువ అభివృధ్ధి చెందటం తక్కువ అభివృధ్ధి చెందటం అనే సాపేక్షతని రద్దు చేసే విధంగా ఈ యాబయ్యేళ్లలో యెందుకు కదల లేకపోయారు?అలా కదల లేని మీలోని  అశక్తతని వొదిలించుకోకుండా  మామీద ద్వేషంగా పెంచుకుని ఇప్పటికీ చావు వార్తలకి తక్కువ కవరేజీ ఇచ్చారు అనే పుచ్చొంకాయ్ తెలివితేటల్తో నెగటివ్ పధ్ధతుల్లో కాకుండా పాజిటివ్ దారిలో వెళ్తే తెలంగాణాలో అభివృధ్ధి జరగకపోయేదా?

Monday, 22 December 2014

ఆంధ్ర విశ్వవిద్యాలయమున యేమి కలదు?శ్రీ కృష్ణదేవరాయ వసతిగృహము కలదు!

         వాత్స్యాయనుడు దేశంలో కల్లా ఆంధ్రావాళ్ళు గొప్ప రొమాంటిక్ అని తేల్చేశాడు,తెలుసా?అసలు తెలుగక్షరాల్ని తీసుకోండి,యెంత ముద్దొచ్చేలా వుంటాయి!అన్నీ వృత్తాకారం నుంచే పుట్టాయి.యే అక్షరం తీసుకున్నా ఒక వృత్తాన్ని గీసి అక్కడక్కడా కొంచెం చెరపటం,చిన్న చిన్న వొంపుల్ని చేర్చటం - అంతే!నేల చూస్తే సస్యశ్యామలం.గాలి వీస్తే చేమట ఆరే మాత్రపు సుకుమారం.యెండ రోహిణీ కార్తెలో తప్ప యెప్పుడూ నీరెండ.సరిగ్గా భూమధ్యరేఖ మీద వుండటం వల్ల కాబోలు కాలాలూ,ఋతువులూ స్పష్టంగా తమ ముద్ర వేసే వాతావరణం అమిరింది!అందుకే "ఆంధ్రత్వ మాంధ్రభాషాచ" అని అన్నది!

                అసలే అందమయిన ఇలాంటి ప్రాంతంలో ఆడదాని వొంపుసొంపుల్ని గుర్తు చేసే మిట్టపల్లాల్తో కాస్త జాగా దొరికితే చాలు బులబులాగ్గా మొలుచుకొచ్చేసి ఠీవిగా నిలబడే చెట్తుచేమల్తో కళకళ్ళాదే మావిశాఖ లాంటి విశాఖలో  అయిదేళ్ళు గడిపితే కవిత్వం పుట్టుకు రాకుండా వుంటుందా!అసలు వైజాగులో చదవాల్సి రావటమే బలవంతంగా భగవంతుడే అక్కడికి తోసినట్టు జరిగింది?డిగ్రీ బెజవాడ లయోలా కాలేజి అనే గొప్ప క్రమశిక్షణాయుతమయిన కాలేజిలో చదివినా మేము చేరిన టైము బాగుండక మొదటి రెందేళ్ళూ ఆ ఫాదర్లు కూడా తలలు పట్టుకునేలా ఏ ఐ యస్ ఎఫ్ మరియూ యస్ ఎఫ్ ఐ వాళ్ళు రంగప్రవేశం చేసి ఆ కాలేజి చరిత్రలో యెన్నడూ లేనివిధంగా స్టూదెంట్ యూనియన్ల పోట్లాటలూ స్ట్రెయికులూ లాంటి వాటితో గడిచి పోయింది.అసలా ఫాదర్లకి మాలాంటి సంతనంతా తీసుకోవాల్సిన పరిస్థితి రావడం వల్ల గానీ మామూలుగా అయితే అక్కద చదివే అదృష్టం లేదు.వాళ్ళు బుద్దిమంతులైన కుర్రాళ్ల కోసం వడకట్టి మరీ సెలక్షన్లు చెయ్యటంతో విధ్యార్ధుల లెక్క బాగా తగ్గిపోయి యూజీసీ వారు శ్రీముఖం పంపించారు - యేమని?"అయ్యా, మీ కాలేజిలో చదివే విధ్యార్ధుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మాకేలనో మా నిధులు దుర్వినియోగమవుచున్నవని అనుమానముగా వున్నది.కాబట్టి మీ కాలేజికి నిధులు ఆపివయేయ దలచితిమి" - అని! దానితో గండం గడవటానికి ఇంగ్లీషులో మాత్రం 90% పైన వొస్తే చాలు అనే కండిషన్ పెట్టి టముకెయ్యడంతో మాలాంటివాళ్లతో పాటు,పైన చెప్పుకున్న వాళ్ళ లాంటివాళ్ళు కూడా అక్కడి కొచ్చి పడ్డారు.ఫైనలియరు కొచ్చేసరికి ఫాదర్లూ వాళ్ళకి తిక్క రేగిపొయి గొడవ బ్యాచినంతా వాళ్ళ చాణక్యనీతు లన్నీ వుపయోగించి బయటికి పంపేశాక గానీ మళ్ళీ మామూలు వాతావరణం రాలేదు.ఆ ఒక్క సంవత్సరం కళ్ళు తెరిచి యేమి వుపయోగం?అత్తేసరు ఫస్టు క్లాసుతో సరిపెట్టుకోవలసి వచ్చింది!ఆ పెర్సంటేజికి అసలు సొంత రాష్ట్రంలో అప్లై చెయ్యడమే దండగ మీలాంటి మందకి భోపాలు విదిషాలు తప్ప గతిలేదు అని ఒక లెక్చరరు గారు బైస్కోపు వేసెయ్యగా, మా బ్రదరు ఒకతను అక్కడి నుంచే రావడం వల్ల మొత్తం భారత దేశానికి నడిబొడ్డున వున్న భోపాల్లో రెండేళ్ళు చదివా!రెండేళ్ళూ మొదటి సంవత్సరమే అఘోరించా?ఇంక లాభం లేదని ఆంధ్రాలో ప్రయత్నిద్దామని స్వరాష్త్రంలో అన్ని యూనివర్సిటీలకీ అప్లై చేసి ఖమ్మంలో ఒక రెండు నెలలు వుస్మానియాలో యెంట్రెన్సుకి ట్రయనింగు టూషన్లు కూడా ఉధ్ధరించి నానా పాట్లూ పడి ఆఖరికి వైజాగులో సెటిలయ్యా.సరిగ్గా నేను అక్కణ్ణించి బయటపడిన కొద్ది నెల్లకే భోపాలులో గ్యాసు లీకు ప్రమాదం జరిగింది!

             చేరిన కొత్తల్లోనే నాకు "వొన్లీ విమల్" అనే నిక్కు నేము పెట్టేశారు!దానికి కారణం నా షర్టుకి కూడా ఆ మోడల్ షర్టుకి లాగా నిలువు చారలుండేవి.పైగా సార్లు రావడం ఆలీసమయితే బోరు గొట్టి వరండాలో వచ్చీపోయే సార్లకి సలాములు కొడుతూ కబుర్లు చెప్పుకుంటూ వుందేవాళ్లం.సహజంగా పిట్టగోడకి ఆనుకుంటే అనుకోకుండానే కాళ్ళు మెలికేస్తాం గదా, నా పోజు కూడా అలాగే వుండేది.అప్పటికే పెళ్ళి కుదిరిందని తెలిసిపోయి "అన్నాయ్" అంటూ వాళ్లకి పోటీ లేకుండా చేసేసుకున్నారు వెధవలు?!నాకూ ఆ దురద లేదు గాబట్టి పెద్దమనిషి తరహాలోనే వుండిపోయా ననుకోండి,కానీ వాళ్ళు సాయంకాలం లేడీసు హాస్టలు కెళ్ళడానికి చేసుకునే యేర్పాట్లు చూసినప్పుడు మాత్రం పెళ్ళి కుదరకపోతే నేనూ ఈరకంగానే తయారయ్యేవాణ్ణి గదా అనిపించేది!సాయంకాలమయ్యేసరికి మళ్ళీ బ్రష్షింగు చేసి ఆ పేష్టు వాసన రాకుండా మింటు స్ప్రేలు నోట్లోకి వూదుకుని పోయేవాళ్ళు!

           స్వతంత్రం వచ్చిన కొత్తల్లో పెట్టిన స్కూళ్ళూ కాలేజి లన్నీ వుదారులైన అప్పటి జమిందార్ల అశ్వశాలలో గజశాలలో అయి వుండేవి!ఇక్కడ కూడా ఆ ఆనవాళ్ళు కనబడుతూ వుండేవి.వాటి మధ్య తిరుగుతుంటే మనకీ రాజభోగం పట్టినట్టు వుంటుంది గదా?నేను కృష్ణాజిల్లా నుంచి వొచ్చినట్టు అందరూ అన్ని ప్రాంతాల నుంచె వచ్చారు గద - హాస్టల్లోనే వుండాలి మరి.కానీ మాకు అలాట్ చెయ్యాల్సిన రూము లన్నీ సీనియర్లు ఖాళీ చెయ్యకుండా మొండికేశారు!మమ్మలనందర్నీ మాకు కేటాయించిన "శ్రీ కృష్ణ దేవరాయ వసతి గృహం" లోనే కామన్ హాలులో సర్దేశారు.మాలో ఒకడు ఫైర్ బ్రాండ్ లాగా వార్డెను దగ్గిర హడావిడి చేస్తే వాడికి జడిసి పాపం వాళ్లకీ చురుకు పుట్టిందేమో గట్టిగా ప్రయత్నించి కుదరక తెల్లారి రాత్రికల్లా మా ఫైర్ బ్రాండుని రహస్యంగా పిలిపించుకుని,"బాబూ, నీ మాటలకి కదిలి కొంచెం గట్టిగా ప్రయత్నించేసరికి నిన్న రాత్రి ఒక గుంపు ఐరన్ రాడ్లు పట్టుకుని కొంప మీద కొచ్చారు,పిల్లలు గల వాణ్ణి,చిన్న వాడివి దణ్ణం గూడా పెదతాను కావాలంటే కొంచెం వోపికపట్టు" అని బతిమిలాడుకునేసరికి వాడు చల్లబడిపోయాడు.తర్వాత యెప్పటికో గానీ అధికారికంగా రూముల్లోకి పంపలేక పోయారు.ఈలోపు ఖర్చు పెట్టుకోగలిగిన నాలాంటి నలుగురైదుగురం పక్కనే వున్న చినవాల్తేరులో రూములు తీసుకున్నాం.హాస్టల్లో రూములు అలాట్ అయ్యేసరికి చినవాల్తేరు బాగా అలవాటయ్యి మారూములు మేము వొదిలేసుకున్నాం.అయినా సరే రాత్రి పదింటి వరకూ ఇక్కడే మకాం!

              వైజాగు జనాలకి బెజవాడ జనాల్లాగ సినిమా పిచ్చి లేదు!బీచి వుండటం ఒక ప్లస్ పాయింటు కాగా,వైజాగే కాదు భీమిలీ లాంటివన్నీ మంచి సీనరీలు గల చోట్లు కాబట్టి నలురైదుగురు కలిసి పిక్నికులకి పోవచ్చు!సినిమాలకి వెళ్ళినా మేం యేనాడూ బ్లాకులో టిక్కెట్లు కొన్న పుణ్యాన పోలా!మెల్లగా నడుచుకుంటూ వెళ్తే ఏవీయెన్ కాలజి డవున్లో పాత సినిమాలు ఆడే థియేటరు ఓకటుందేది - పేరు గుర్తుకు రావడం లేదు!మేము వెళ్ళేసరికి అక్కడా క్యూ దిట్టంగానే వుండేది గానీ అంతా మాలాంటివాళ్లే గదా తేలిగ్గానే టిక్కెట్లు దొరికేవి.దాంతో ఒక మంచి పాత సినిమా చూసి గిట్టుబాటు చేసుకునే వాళ్ళం.రామారావు పాత సినిమాల కన్నా గొప్ప సినిమాలు తియ్యలేని ఇప్పటి సినిమా జనాల్ని యేదో వుధ్ధరిద్దామని పెట్టిన స్లాబు సిస్టము మాలాంటి వాళ్లందరికీ థియేటరులో పాత సినిమాలు చూసే అదృష్టం పోగొట్టింది! క్వాలిటీ సినిమాలు తియ్యడం చేతకాకపోవడం అనే అసలు లోపాన్ని ఇప్పటికీ సరి దిద్దుకోలేకపోవడం వల్ల స్లాబు సిస్టము వచ్చాక గూడా స్లంపులు మాత్రం పోలేదు?

            అంతగా ఆపాతమధురాలకి అతుక్కు పోయిన మమ్మల్ని కూడా "శుభలేఖ రాసుకున్నా యెదలో యెపుడో" పాట మాత్రం అదరగొట్టేసింది!ఆపాట యెంత క్రేజు పుట్టించిందంటే కొత్తపాటల్లో యేముంది చెత్త అనుకునే పాతపాటల ఫ్యాన్సు కూడా గట్టిగా లెంపలేసుకునేటట్టు చేసింది?క్యాంపసులో ఆపాట సృష్టించిన భీబత్సం చూస్తే కుర్రాళ్ళెప్పుడూ మాటలర్ధం కానివ్వని ఫాస్టు బీటునే కోరుకుంటారు అనేమాట అబధ్ధం అనిపిస్తుంది!అక్కడ అంతగా పిచ్చెక్కిపోయింది కుర్రాళ్ళే గదా మరి?మా స్టూడెంటు హాస్టళ్లలో లేదు గానీ స్కాలర్స్ హాస్టల్లో వుండేది టీవీ. అప్పుడీ నానాజాతి చానల్సు లేవు,వోన్లీ డీడీ!హిందీ సినిమా పాటల్తో చిత్రహారూ తెలుగు పాటల్తో చిత్రలహరీ వొచ్చే టైము కల్లా అక్కడ చేరేవాళ్లం.అక్కడి సీను చాలా గొప్పగా వుండేది.సోడాబుడ్డి కళ్లద్దాల వాళ్లంతా "మీకేం,మీరు యెక్కడ కూచున్నా కనపడుద్ది - మాకు కనపడదుగా!" అని వెనకపడ్ద తరగతుల వాదనతో ముందరిప్లేసుల్ని ఆక్రమించే వాళ్ళు.కూచుంటే మనవాళ్ళు బాసింపట్ల రాయుళ్ళేగా, వాళ్ళట్టా కింద కూచుని మోరలెత్తుకు చూస్తంటే నా సామిరంగా చూసే వాళ్లలో నాలాంటి తింగరోళ్ళకి కడుపుబ్బి పోయేది!ఆ కూచోడం గూడా హైటుల వారీగా కూచునే వాళ్ళు!యెక్కడయినా బావ గానీ వంగతోటకాడ కాదన్నట్టు పొడుగు వాళ్ళు ఇంకెక్కడయినా రొమ్ములిరుచుకుని తిరుగుతారేమో గానీ ఇక్కడ మాత్రం యే పొట్టివాడి ముందయినా కూచున్నాడా నిర్దాక్షిణ్యంగా అణిచి పారేస్తారు!మామూలుగానే ఇంత భీబత్సంగా వుండే టీవీహాల్లో ఈపాట టైములో కొత్త బ్యాచి ఒకటి తయారయింది!పాట వొచ్చేముందు సినిమా పేరు వెయ్యటం ఆలీసం కయ్యిన ఈల వెయ్యాలి - ఫ్రెండులకి హింటు!అంతే,స్నానం చేసే వాళ్ళు గూడా గబగబా టవలు చుట్టేసుకుని వొంటినిండా సబ్బునురగల్తో సహా పరిగెత్తుకొచ్చే వాళ్ళు.



          సంగీతం,సాహిత్యం రెండూ జోడుగుర్రాల మాదిరి పరిగెత్తి హుషారు పుట్టించేస్తాయి!మెలోడీ జాంబొరీ 50:50 అయిపోయాయి ఈపాటలో!బృందగానం పేరుతో  హడావిడి చేసే గ్రూపు డాన్సర్లు లేరు!చిరంజీవి రాధ ఇద్దరూ మామూలుగా చేసే డ్రిల్లు తంతు లాగా కాకుండా స్వింగింగు మూవ్మెంట్లతో నింపేశారు పాటని!పిక్చరైజేషనూ అదిరింది - పొగమంచు,పరిగెత్తే గుర్రం,పాతకాలపు లాంతర్లు,బొచ్చుకుక్కపిల్లతో యెదురొచ్చే మనిషీ,చెట్టు కింద నుంచుని చూసే మనుషులూ - ప్రతి ఫ్రేమూ అధ్భుతమైన సౌందర్యభరితమే!

Friday, 19 December 2014

నాధూరాం గాడ్సే దేశభక్తుడు కాదా?వందే మాతరాన్ని కించపరిచిన జవ్హేరీ లాల్ దేశభక్తుడా!

     ఈ దేశవిభజన అంత కిరాతకంగా యెందుకు జరిగిందో యెవరికయినా తెలుసా?యెన్ని సార్లు యెన్నికలు జరిగినా జిన్నా ఈ దేశం నుంచి విడిపోవాలని యెంతగా ప్రయత్నించినా ప్రజలు తిరస్కరించితే ఇక పాకిస్తాను యేర్పడటం అసంభవమని తేల్చుకుని నిరాశతో రాజకీయాల నుంచి వైదొలగి మూలన కూర్చున్న జిన్నా ఈ దేశ విభజనకి యెలా కారణ మౌతాడు?! జైలులో వున్న మోహన దాసుని అక్కదే చావనివ్వకుండా వొదిలినందుకు ఆ మూర్ఖుడు  చేసిన పని యేమిటో తెలుసా?జిన్నాని కలవటం!కలిసి యేమి వుధ్ధరించాడు?ప్లెబిసైటు పెడదాం ఒప్పుకుంటావా అనే ప్రతిపాదన చేశాదు!జిన్నా నాకు అలా కుదరదు పాకిస్తాను తప్ప నాకేదీ అక్కర్లేదు అని మొదలుపెట్టి ఒక్కసారిగా వూపు తెచ్చుకున్నాడు.పాకిస్తాను గురించి అన్ని ఆశలూ వొదులుకుని మూల కూర్చున్న స్థితి నుంచి అతివేగంగా పావులు కదిపి తన కార్యం సాధించుకునేటంత హుషారు తెచ్చుకున్నాడు?జనం మూలకి తోసిన చెత్తని పనిమాలా పోయి బయటికి తీసుకొచ్చి జనం నెత్తిన రుద్దిన ఈ పిచ్చి పుల్లయ్య జాతిపితా?

     ప్రత్యేక నియోజక వర్గాలు ప్రతిపాదించినప్పుదు ముస్లిములకి వొప్పుకున్న వాడు దళితుల దగ్గ్గిర కొచ్చేసరికి వాళ్లకిస్తే భూగోళం బద్దలవుతుందనేటంత భీబత్సం యెందుకు చేశాడు?సాయిబులు పరాయోళ్ళు గాబట్టి ప్రత్యేక నియోజక వర్గాలు ఇచ్చినా పర్లేదు,వాళ్ళు దేశం నుంచి విడిపోయినా పర్లేదు గానీ దళితులు మాత్రం స్వేచ్చగా తల యెత్తుకు నిలబడకూడదనా?గాంధీ నుంచీ నెహ్రూ నుంచీ కమ్యునిష్టుల నుంచీ దేశభక్తిని నేర్చుకోవాల్సిన దిక్కుమాలిన స్థితిలో యెవడూ లేడిక్కడ!ఆ మనిషి పట్ల అంత భక్తి వున్నవాళ్ళు ఈ యాభయ్యేళ్లలో దేశంలో మద్యనిషేధాన్ని యెందుకు అమలు చెయ్యలేక పోయారు?నా పంచప్రాణాల్లో ఒకటని అఘోరించాడుగా,ఆ ప్రాణాన్ని నిర్లక్ష్యం చేశారేం?

     ప్రకాశం గారు మద్యనిషేధాన్ని నిక్కచ్చిగా అమలు చేసినందుకు ప్రపంచ పార్లమెంటరీ చరిత్రలో యెక్కడా అంతకు ముందు గానీ ఆతర్వాత గానీ జరగని విధంగా అధికార పక్షమే తమ ముఖ్యమంత్రి మీద అవిశ్వాస తీర్మానం పెట్టి దించెయ్యటం అనే గొప్ప పని చేశారని చరిత్రలో రికార్డు అయి వుంది,అవునా కాదా?మొదటి సారి పాపం ప్రతిపక్షాల వాళ్ళు కూడా పెద్దాయన మంచోడు అని మొహమాట పడి తిరక్కొట్తేస్తే తప్పుడు రూలింగు తో మళ్ళీ అదే సెషన్లో పెట్టి అంత మంచోణ్ణి బలవంతంగా గెంటేసారు గదరా!సారా బట్టీల యజమాని మీ పార్టీకి రాష్త్ర స్థాయి అధ్యక్షుడా?మీకు గాంధీ మీద భక్తి పొర్లి పోతుందా?యెవడికి చెప్తారు రా పిట్టకధలు!

     హోం రూలు వుద్యమం దగ్గిర్నుంచి అంత దేశభక్తిని ప్రదర్సించిన జిన్నా ఒక్కసారిగా దేశ విభజనకి కారకుడయిన విలన్ లాగా యెలా మారాడు?నోటితో ఈశ్వరల్లా చెక్కభజన్లు చేస్తున్నా ప్రాక్టికల్ పాలిటిక్స్ దగ్గిర కొచ్చేసరికి ముస్లిములకి సరయిన గుర్తింపు ఇవ్వకుండా తిక్కగా ప్రవర్తిస్తుంటే మండదా యెవడికయినా?అసలు ముస్లిములని ప్రత్యేకంగా వుంచడం దేనికి??కాంగ్రెసులోకి చేర్చుకుని వాళ్లని వుత్సాహంగా కాంగ్రెసు కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేసి వాళ్ళ కార్యదక్షతని బట్టి గౌరవాదరాలు కల్పిస్తే కాదనే వాడెవడు?ముస్లిములు ముస్లిము లీగులో విడిగానే వుండాలి,కానీ కాంగ్రెసుకి పక్కతాళం వేస్తూ అణిగిమణిగి పడి వుండాలే తప్ప కాంగ్రెసుని మించి పోగూడదు అనే తిక్క పాలసీయే గదా ముస్లిముల్లో లీగుకి అంత బలాన్ని తెచ్చి పెట్టింది!అయినా విభజన దగ్గిర కొచ్చేసరికి ప్రజలు మేము విడిపోము,కలిసే వుంటాం అని అంత గట్టిగా చెప్పాక గూడా ఈ దేశం యెందుకు విడిపోయింది?పై స్థాయిలో రాజకీయ ప్రయోజనం ఆశించిన వాహినీ వారి పెద్ద మనుషులు కుట్రతో ప్రజల ఆకాంక్షలకి విరుధ్ధంగా ఈ దేశాన్ని విదగొడితే నాయకులు మమ్మల్ని మోసం చేశారు అని మోసపోయిన ప్రజల ఆగ్రహమే కాదా నాడు రగిలిన కార్చిచ్చుకి కారణం?!

   చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయాక అటువైపు నుంచి శవాల రైళ్ళు వస్తున్నా శాంతిమంత్రం జపిస్తూ సొల్లు కబుర్లు చెప్తుంటే యెవడు వింటాడు? ప్రజల అసలు కోపం ఈ గురుశిష్యుల మీదే కదా, వీళ్ళ మాట అస్సలు వినలేదు!ఒకసారి శిష్యుల వారు ముద్దుల కూతురితో మంటల్ని ఆర్పడానికి వెళ్తుంటే గుంపులో ఒకడు ఆ సుందరాంగి పైట లాగాడట!వొళ్ళు కొవ్వెక్కి చేశాడనుకుని ఆగ్రహించబోతే,"అయ్యా, మీ కూతురు పైట లాగినందుకే ఇంత కోప మొచ్చిందే?మా ఆడవాళ్ళ మీద ఇంతకన్నా దారుణమైన పన్లు చేస్తున్నారు, మాకెంత కోపం రావాలి!" అని అడిగేసరికి డింపట్ కుక్కిన పేను లాగా అయిపోయాడు.ఇది జరిగిన చరిత్ర!ఆ ప్రశ్న అడిగిన ఒక్క వ్యక్తి కాదు కొన్ని కోట్ల మందిలో ఆ ఇద్దరి మీదా భగ్గున మండిన మంటకి ప్రతిరూపమే నాధూరాం గాడ్సే!అతడేమీ నిరక్షర కుక్షి కాదు!ఆఖరి నిముషం వరకూ స్వాతంత్ర్య సంగ్రామాన్ని వ్యతిరేకించి స్వతంత్రం రాగానే కాంగ్రెసు మంత్రివర్గాల్లో చేరిన మనుజేశ్వరాధములలో ఒకడు కాదు?వాళ్లంతా దేసభక్తు లయితే అతను కూడా ఖచ్చితంగా దేశభక్తుడే?!

     చంపకుండా వుంటే అనామకంగా హతమారి పోయే వాడేమో అనేటంతగా అప్పటికే అభాసు పాలైన వాణ్ణి చంపి మీకు ఇన్నేళ్ళుగా పనికొచ్చిన ఇంటిపేరుగా మార్చి మేలు చేసినందుకు కృతజ్ఞతగా నైనా అతన్ని దేశభక్తుడిగా వొప్పుకోవాలిరా కాంగ్రెసు బడుద్ధాయిలూ!


వందే మాతర గీతాన్ని బ్యాండు మేళానికి పనికి రాదని అవమానించిన వాడు దేశభక్తుడా?

Wednesday, 17 December 2014

ఆనందమఠంలో బంకిం ఋషి చూపిన భారత దర్శనం - నా స్పందనం!

పుచ్చపువ్వులాంటి వెన్నెలలో ఆరాత్రి మహేంద్రుడూ భవానందుడూ అడివిని  దాటుతున్నారు.మహేంద్రుడు శాంతంగా గర్వంతో కొంచెం కుతూహలంగా వున్నాడు.అకస్మాత్తుగా భవానందుడు మరొక విధమైన ఆకృతిని ధరించాడు.సైన్యాధ్యక్షుడి నెత్తిమీద దెబ్బ తీసిన యోధుని అవతారం ఇప్పుడతనిలో కనిపించడం లేదు. వెన్నెల వెలుగులో ప్రశాంత వాతావరణంలో చెట్లతో,కొండలతో,నదులతో,లోయలతో రమణీయమయిన భూసందర్శనంతో మనస్సు పులకించి పోతున్నది.భవానందుదు నవ్వుముఖంతో చక్కగా సంభాషణ గావిస్తున్నాడు,కబుర్ల కోసం యెన్ని వుపాయాలు అన్వేషించినా మహేంద్రుడు సంభాషణకు దిగకుండా మౌనంగానే వున్నాడు.మరో మార్గం లేక భవానందుడిక పాటను అందుకున్నాడు.

"వందే మాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం"

     పాట విని మహేంద్రుడు ఆశ్చర్య మొందాడు.అతని కేమీ అర్ధం కాలేదు."తల్లి యెవరు?" అని భవానందుణ్ణి అడిగాడు.భవానందుడు సమాధానం ఇవ్వకుండా పాడుతూనే వున్నాడు.

"శుభ్ర జ్యొత్స్నా పులకిత యామినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం"

     "ఇదైతే దేశం - తల్లి కాదు" అన్నాడు మహేంద్రుడు."మేం మరెవరినీ తల్లిగా గ్రహించం.జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని విన్లేదూ?ఉన్న దేశమే కన్నతల్లి మాకు.తల్లి లేదు,తండ్రి లేడు,అన్నదమ్ములు లేరు,అక్కచెల్లెళ్ళు లేరు - యెవ్వరూ లేరు,ఇల్లు లేదు,వాకిలి లేదు,వున్నదల్లా ఆ సుజల సుఫల మలయజ శీతల సస్యశ్యామల" అని జవాబు చెప్పాడు భవానందుడు.

     మహేంద్రుదు కొంచేం తెల్సుకున్నాడు - "మళ్ళా పాడండి" అని అడిగాడు.భవానందుడు తొలినుంచీ అందుకుని పాడటం మొదలు పెట్టాడు.

వందే మాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం!

శుభ్ర జ్యొత్స్నా పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత దృమదళ శొభిణీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం!

సప్తకోటి కంఠ కలకల నినాద కరాలే
ద్విసప్త కోటి భుజైర్ధ్నత ఖరకరవాలే
అబలా కేతోమా ఏతో బలే!

బహుబల ధారిణీం నమామి తారిణీం
దిపుదళ వారిణీం మాతరం
తుమీ విద్య తుమీ ధర్మ
తుమీ హరి తుమీ మర్మ
త్వంహి ప్రాణాః శరీరే
బాహుతే తుమీ మాం శక్తి
హృదషే తుమీ మాం భక్తి
తో మారయీ ప్రతిమా గడీ గడీ మందిరే!

త్వంహి దుర్గా దశప్రహార ధారిణీ
కమలా కమల ధళ విహారిణీ
వాణీ విద్యాదాయినీ నమామి త్వాం
నమామి కమలాం అతులాం అమలాం!

సుజలాం సుఫలాం మాతరం
వందే మాతరం
శ్యామలాం సుస్మితాం సరళాం భూషితాం
ధరణీం తరణీం మాతరం!


     సన్యాసి పాడుతూ యేడ్వటం చూశాడు మహేంద్రుడు.మహేంద్రుడి మనస్సు కూడా అంతులేని భావావేశంతో వూగిపోతున్నది.
                                                                                                     ------------------బంకించంద్ర చటోపాధ్యాయ

యెంతటి సౌందర్యరాశి మన దేశమాత!

          కాశ్మీర దేశమను ముఖబింబము తరళ సౌందర్య సంశోభితమై మెరవగా,పంచాబ్జము హిమాచల ప్రదేశముతో గల్సిపోయి మెదవొంపై కుదరగా,హరియాణమా గళసీమ యందు కాంతులీను పచ్చల పతకమై శోభిల్లగా,హస్తిన హృదయభాగాన సుస్థిరముగ రక్షితమై యుండగా,రాజస్థానపు యెగువ భాగము కుడిభుజము గాను ఉత్తర దేశపు అగ్రస్థానము యెడమ భుజము గాను రూపు దిద్దుకొని కడపటి ఉత్తర దేశము బీహారుతో గల్సి వంగదేశము వరకు సాచిన వామహస్తమై తోచుచుండగా,అస్సాము త్రిపుర మేఘాలయ మణిపుర మిజోరము లన్నియు నేకమై బిగించిన పిడికిలిగా,అరుణాచల ప్రదేశము జయసూచకముగ పైకెత్తిన బొటనవేలుగా,రాజస్థానమును దిగువకు మోచేయిగా మడిచి గుజరాతమను అరచేతిని సుతారముగ మరాఠ దేశమనెడి నితంబసీమపై మోపి యుంచగా,మధ్యప్రదేశము రమణీయంబగు కటిస్థలమై అమరి యుండి భోపాలు నగరము సరిగా నాభిప్రదేశమై నెలకొని యుండగా,వింధ్య సానువులను స్వర్ణమేఖలగ దాల్చి ఓడ్ర దేశ మటువైపు యెడమ వూరువై సౌష్ఠవము గూర్చగా,కుడివైపున దిగువ మరాఠ దేశమను వూరువు నుండి కర్ణాటకము సాగి కేరళ యను పాదాబ్జముపై దృఢముగ నిలువంబడి అటువైపు ఓడ్ర దేశము నుండి కిందకు దిగిన ఆంధ్రదేశ మొయ్యారముగ వొంచిన తన్వి మోకాలి వొంపై అందము నిబ్బడించగా,అందుండి సాగిన సెందమిళనాడను వామపాదంపు మునివేళ్ళను నేలపై నల్లన తాకించి ఒక నిసర్గ సుందరమైన నాట్యభంగిమలో అవతరించిన మాతృభారతికి వందనం!

          అండమాను నికోబారులు ఆమె పాదాల కడ ప్రకృతియే పులకించి సమర్పించిన పుష్పరాశులై వెలుగు అట్టి సహజ సౌందర్య సంశోభితమగు దేశమాతను యే కాలమందు గాని, యెంత కిరాతకులైన గాని వికృత పరచకుంద్రు గాక!తల్లిని దూషిత మొనరించు ఘోరకృత్యములు సలుపకుంద్రు గాక!
హరి.S.బాబు
15.08.1990




Tuesday, 16 December 2014

మతాంతరీకరణలు తప్పు అని తెలిసీ మనమూ అదే పని చెయ్యాలా?!

      ఒకప్పుడు కాంగ్రెసు అవినీతికరమయిన పాలనకు విసుగెత్తి భాజపాను మొదటిసారి గెలిపిస్తే ఇంక మనకెదురేమి అని రెచ్చిపోయి భారత్ వెలిగిపోతోంది అని డప్పు కొట్టుకుని కళ్ళు తెరిచి చూసేసరికి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది?మళ్ళీ అధికారంలోకి రావడానికి పదేళ్ళ కాంగ్రెసు భ్రష్టాకారి పరిపాలన సాయపడింది!ఇప్పుడు మళ్ళీ అలాంటిది జరిగితే మళ్ళీ అధికారంలోకి రావదానికి ఇరవయ్యేళ్ళు పట్టొచ్చు,యాభయ్యేళ్ళు పట్టొచ్చు?!

      కొండనాలిక్కి మందేస్తే వున్న నాలిక వూడిన చందంగా మొత్తం హిందూధర్మమే అభాసుపాలయి అయ్యవార్ని చెయ్యబోతే కోతి అయినట్టు మళ్ళీ జనం ముందు నిలబడి వోట్లు అడగలేని పరిస్థితి కూడా రావొచ్చు?! గీతని రాష్ట్రీయ గ్రంధంగా చెయ్యకపోతే గీతకి యేమయినా లోటు వస్తుందా?సాక్షాత్తూ భగవాన్ శ్రీకృష్ణుడే "మధ్భక్తులకు దప్ప అశ్రధ్ధాపరులకు తెల్పకు మీవు" అన్నాడు!సంస్కృతం సరిగ్గా రాదంటూనే "స్వభావప్రభవైర్గుణై" అంటే పుట్టుకతో వచ్చే స్వభావం అని వాళ్ళకి వాళ్లే అర్ధం చెప్పేసుకుని వ్యాసుడు గీత లోని చాతుర్వర్ణాన్ని కొన్ని కులాల ఆధిక్యతని సమర్ధించడానికే రాశాడు అని ఘీంకరించేవాళ్ళు, అసలు చదవకుండానే విమర్శించేవాళ్ళు ఇప్పటికే లెక్కకి మిక్కిలిగా పోగయ్యారు - ఈ మందని ఇంకా పెంచటానికి గాక యెందుకయినా పనికొస్తుందా ఆ పని?

      సంస్కృతం  తెలిసి అందులోని సారాన్ని తెలుసుకుని విమర్శించిన సజ్జనులైన కమ్యునిష్టు మేధావులే వర్ణం వేరు కులం వేరు, వర్ణం అనేది ఒక రకమయిన శ్రమ విభజన లాంటిది కులం మాత్రమే పుట్టుకతో వస్తుంది అని చెప్పారనేది కూడా తెలియకుండా వర్ణాన్నీ కులాన్నీ కలిపేసి పీకి పాకం పెట్టే అజ్ఞానులకి గీతని పరిచయం చెయ్యడం అవసరమా?

      మతాంతరీకరణ అనేది తప్పు అని తెలిసి కూడా పునరాగమనం అని పేరు పెట్టి వాళ్ళు చేసిన తప్పునే మనమూ చెయ్యాలా? అలా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన వాళ్లు ఒకవేళ ఇప్పుడు  నేను బ్రాహ్మణ కులంలోకి వెళ్ళానుకుంటున్నాను అంటే వొప్పుకుని సాదరంగా బ్రాహ్మణ్ణి చేస్తారా?ఇక్కడ మతం లోపలే వున్న హరిజనులకి ఆలయప్రవేశం జరిపించి దగ్గిరకి తీసుకోలేని వాళ్ళు గతంలో మతం మారిన వాళ్లని తిరిగి మతంలోకి తీసుకొచ్చి యేమి వుధ్ధరిస్తారు?

     యే మతాని కయినా ఇతర మతస్తుల ముంచి ప్రమాదం రాదు, సొంత మతంలో వున్న వేరుపురుగులూ ఆషాఢభూతులే ప్రమాదం!నెహ్రూ లాంటి వాళ్లనీ నెహ్రూ భక్తుల్నీ గుర్తు పట్టిన వెంఠనే తన్ని తగిలెయ్యగలిగినంత జాగరూకత వుంటే చాలు హిందూ ధర్మం సగర్వంగా తలయెత్తుకుని నిలబడే వుంటుంది యెంతమంది అశనాసక్తులు వీడిపోయినా?!

      వాళ్ళు డబ్బాశ చూపించి మతం మారుస్తున్నారా?మతం మారకుండానే గొప్పగా బతికే వీలు కల్పించు! ఈ మతాన్ని నిజంగా ప్రేమించి నిష్టగా అనుసరించే వాడు యెంత డబ్బు ఇస్తే మతం మారతాడు?మాలవాళ్లలోనే క్రిష్టియానిటీ వైపుకి వెళ్ళకుండా వుండిపోయిన వాళ్ళూ, గుడి గోపురాల్లోకి రానివ్వట్లేదు గాబట్టి ఇంట్లోనే హిందూ దేవుళ్ళ పటాలు పెట్టుకుని వాటికి దణ్నం పెట్టుకుని సరిపెట్టుకునేవాళ్ళు ఇప్పటికీ వున్నారు,తెలుసా?

    ఒక మంచి హిందువు,ఒక మంచి ముస్లిము,ఒక మంచి కిరస్తానీ - వీళ్ళు ఒక చోట కలిస్తే కొట్టుకోరు, తిట్టుకోరు,పైగా ఒకరి మతనిష్టకి మరొకరు అవసరమయిన సాయం కూడా చేస్తారు!యెటొచ్చీ శ్రీ శ్రీ చెప్పినట్టు రిఫరీని మోసం చేసి గెలవడం - అంటే "రిఫరీ రిఫరీ!నువ్వూ నేనూ ఒక మతం, వాడు వేరే మతం కాబట్టి నాకు పాయింట్లు యెక్కువేసి నన్ను గెలిపించు" అనే యవ్వారాలు చెయ్యాలనుకుంటేనే మతం గొడవలు రేపే సాధన మవుతుంది!మతాన్ని తన వ్యాపారానికీ అధికార ప్రాప్తికీ వాడుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే మతం గురించి అవసరమయిన దానికన్నా యెక్కువగా వాగుతారు?

      నిన్న గాక మొన్న ఒక ముస్లిము తిరుపతి వేంకటేశ్వర స్వామికి  బంగారు పూలు మొక్కుకుంటే అతని మరణాంతరం అతని కొడుకు వచ్చి సమర్పించాడని చదివాను!ఇలాంటివాళ్ళు కూడా బాధపడి దూరమవడానికి తప్ప యేందుకీ పునరాగమనాలు?సాక్షాత్తూ భగవాన్ శ్రీకృష్ణుడే చెప్పాడు,యేమని:

                                              శ్లో||ఇతర దేవతా భక్తులయ్యు శ్రధ్ధగ కొల్చినట్లయిన
                                                  వారు సైతం కౌంతేయ!నన్నె చేరుదు రప్రయత్నంగ?!


Thursday, 11 December 2014

రావు గారూ,బాబు గారూ - మీరు కట్టబోయే ఆకాశ హర్మ్యాలలో యెవరు వుంటారండీ?!

                                            సీ||రావులు, బాబు లంతాను వార్వారి సొం
                                            త సుఖాల కోసమే తప్ప జనుల

                                            కోసమై పనిచేయబోరు, తెలుసుకొని
                                            మసులుకొనుడు!వందిమాగధులను

                                            వెంటబెట్టుకొనెడు వైభవములె తప్ప
                                           "యెవడురా వాడు నా ప్రజల మీద

                                            దౌష్ట్యము చేసేది?!" అంటు హుంకారము
                                            చేసెడి వారిప్డు లేరు,లేరు?

                                       తే||ఆకసమును తాకెడి భవనాలు గట్టి
                                             అపర రావణాగ్రజుల నుంచెదరు గాని
                                             బీదబిక్కిల నందులో చేర్చబోరు,
                                             నిజము- జాగరూకతయె బెస్టు నేడు మనకు?!
                                                                                                          (07/12/201)
_______________________________________________________________
    ఆకాశహర్మ్యాలు కట్టడానికి చాలా ఖర్చవుతుంది.ఆ ఖర్చుకు తగ్గ్గట్టుగా అందులో అద్దెకు వుండాలన్నా కొనుక్కుని వుండాలన్నా కోట్లకు పడగలెత్తిన ధనవంతులకే తప్ప సామాన్యులకు అందుబాటులో వుండవు. బయటికి కనిపించేటట్టు అంచున వున్నవాటికి తప్ప గాలీ వెల్తురూ అసలు రాదు. ఒక సినిమా పాటలో పట్టపగలు దీపాల పట్నవాసం అని వెక్కిరించినది ఇలాంటి పరిస్థితినే! మనకి అత్యవసరమయిన ఆక్సిజన్ భూమి కింది పొరల్లోనే దట్టంగా వుంటుంది,  పైకి వెళ్ళేకొద్దీ పల్చబడుతుంది.

     యేదయినా అగ్నిప్రమాదం సంభవిస్తే క్షేమంగా బయటపడటం చాలా కష్టం. అమెరికాలోనే దీనికి సరయిన పరిష్కారం కనుక్కోలేదు, జాగ్రత్తలు తీసుకోవడం తప్పించి జరగకూడనిది జరిగితే మాత్రం తాలిబన్లు కూల్చేసిన జంట భవంతుల మాదిరి అందరూ హతమారి పోవటమే తప్ప మరోవిధంగా బయటపడే మార్గమే వుండదు?! మరి విభజనానంతరం ఈ రెండు రాష్త్రాల ముఖ్యమంత్రులూ కేంద్రమూ స్మార్ట్ సిటీల పేరుతో చేసే హడావిడి దేనికి?ఖచ్చితంగా తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే!ఇతరమయిన తమ పనుల్లో నెలకొన్న అయోమయాన్ని కనబడనివ్వకుండా వీటి గురించి వూరించి మభ్యపెట్టి పబ్బం గడుపుకోవటానికి గాక నిధులూ ఆదాయాల లెక్కలే తేలని పరిస్థితుల్లో వుండి యేమిటీ ధీమా కబుర్లు?

         ఇప్పటికే నగరజీవనం ఈ రియల్ మాఫియాకి కోట్లు కురిపించే ప్రక్రియతో అధ్వాన్నంగా తయారయింది! కొంచెం ఆగి ఆలోచిస్తే నగరాలలో ఇవ్వాళ జరుగుతున్న నేరాలన్నీ రెండు రకాలు.మన పక్కింటి వాణ్ణి హఠాత్తుగా ఒక నేరంలో అరెస్టు చేసేవరకు ఆవ్యక్తి అటువంటి వాడని పక్క ఫ్లాటు వాళ్లకే తెలియదు? నిర్భయ చట్టాల లాంటివి ఇన్ని వచ్చిన తర్వాత కూడా స్నేక్ గ్యాంగులు వీరవిహారం చెయ్యటం, బరితెగించి తాళ్లతో మంచాలకి కట్టేసి వ్యభిచారం చేయించటం లాంటివి చేసేటందుకు వాళ్ళకి వున్న ధైర్యం - మనమెవరమో యేం చేస్తున్నామో యెవరికీ తెలియదులే అన్న పరిస్థితి వల్ల కాదా!

        అందరూ తిరోగమన వాది అని పిలిచే విశ్వనాధ సత్యనారాయణ గారు "వేయి పడగలు" నవలలో వర్ణించింది సుబ్బన్నపేట అనే గ్రామం యొక్క పుట్టుక,పెరుగుదల,నాశనం! కొన్ని దశాబ్దాల తర్వాత స్పీల్ బర్గ్  "బ్యాక్ టు థ ఫ్యూచర్" అనే సినిమా ట్రయాలజీలో చూపించిన హిల్ వ్యాలీ అనే ప్రాంతం యొక్క మూడు దశలూ సుబ్బన్న పేట విషయంలో విశ్వనాధ చూపించినట్టుగానే వుంటాయి!?.ఈ ఇద్దరు కళాకారులూ చేస్తున్నది ఒకే హెచ్చరిక - తొందరగా దబ్బు సంపాదించే వీలు వుండటం వల్ల మనుషులు దానికోసం పడే మితిమీరిన ఆరాటం, అందులో విఫలమవడం నుంచి పుట్టే అశాంతి మనిషిని మనిషిగా మిగలనివ్వదని!మనకి తెలియకుండానే వూడలు దిగిన మర్రిచెట్లలా కాంతిని మింగేస్తూ వుండే ఈ భవంతుల పట్ల అసౌకర్యంగా అనిపిస్తూ వుంటుంది కదా? అయినా మరో దారి లేనట్టు సర్ధుకు పోతున్నాం,కానీ మరోదారి యేదయినా వుందా అని కనీసం ఆలోచించను గూడా ఆలోచించటం లేదు!

        సింగపూరులోనూ అమెరికాలోనూ కనిపించే భవంతుల్ని చూపించి వాళ్ళు ఇక్కడికి రావదానికి బాగుంటుందని కొందరూ వాళ్ళని మెప్పించడానికి పనికొస్తాయని కొందరూ అంటున్నారు గానీ కొన్ని దశాబ్దాల క్రితమే ఈ రకమయిన నిర్మాణాలతో వాళ్ళ కనుచూపుమేరని కప్పేసుకున్న వాళ్ళకి ఇప్పుడు వాళ్లనే ఇమిటేట్ చేస్తూ కట్టినవి కొత్తగా కనబడతాయా? మనకున్న ప్రకృతి సౌందర్యంతో అలరారే సహజ సౌందర్యాన్ని చూపిస్తే విస్మితు లవుతారు,వాళ్ళకు అక్కడ దొరకనిదీ ఇక్కద వున్నదీ అయిన పరిశుభ్రమయిన గాలిని పీల్చుకునే అవకాశమిస్తే కృతజ్ఞులవుతారు! కొయ్యబొమ్మలె మెచ్చు కళ్లకు కోమలుల సౌరెక్కునా అన్నట్టు గాలికి తలలూపుతూ జీవంతొణికిసలాడే పచ్చని పొలాల్ని ధ్వంసం చేసి నిర్జీవంగా పడివుండే నిశ్చల భవంతులు కట్టి యెవరిని మెప్పిస్తారు?

    అసలు ఇప్పుడు మనం వుంటున్న ఈ చిన్న చిన్న అపార్టుమెంట్ల లోనే రెండు ముఖ్యమైన లోపాలు వున్నాయి.కట్టేవాళ్ళు భవన నిర్మాణంలో రెండు మార్పులు చేస్తే అందులో వుండే జనం చాలా హాయిగా వూపిరి పీల్చుకోగలుగుతారు! ప్రతి ఫ్లోరుకీ ఒక కామన్ రీదింగు రూము లాంటి ఒక పెద్ద హాలు వుంటే ఇది అందరూ ఒకచోట చేరడానికి వుపయోగ పడుతుంది. దానివల్ల యేవరు యెలాంటి వాళ్ళో తెలుస్తుంది. ఇంకా ఇవ్వాళ నగరాల్లో వుండే పిల్లలలో మనం చూస్తున్న అవలక్షణాలకి వాళ్లకి పాజిటివ్ అప్ప్రైజల్ విలువ యేమిటో తెలియక పోవటం!వుదాహరణకి నేను చెప్పినట్టు ఒక కామన్ హాలు వుందనుకోండి, ఆదివారాల్లో సంగీతమో నాట్యమో వచ్చిన వాళ్ళు చిన్న ప్రదర్శన ఇస్తే అనదరూ వాళ్లని చప్పట్లు కొట్టి మెచ్చుకుంటుంటే మనమూ అలా చేసి పేరు తెచ్చుకోవాలని మిగతా వాళ్ళు కూడా తమలో వున్న ప్రతిభని చూపిస్తారు,అవునా కాదా?కానీ ఇవ్వాళ వాళ్లకి వినబడుతున్నవి కేవలం చదువుకి సంబంధించిన హెచ్చరికలే!ఇవ్వాళ్టి పిల్లలు అమ్మానాన్నలయినా సరే దైరెక్టుగా ఇచ్చే వుపన్యాసాల కన్నా నలుగురు పెద్దవాళ్ళు ఒకచోట కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఇండైరెక్టుగా తమ చెవిలో పడే చిన్న చిన్న మాటల ద్వారానే నేర్చుకుంటున్నారు,గమనించారా?

       మరొకటి ప్రతి ఫ్లోరుకీ ఒక చిన్న గార్డెన్ లాంటిది కావాలి. మొక్కలు పెరగాలంటే తప్పనిసరిగా టాపు వుండదు కాబట్టి గాబట్టి యెండ,గాలి ఇక్కడ పుష్కలంగా దొరుకుతుంది.ఇరవయి నాలుగు గంటలూ ఫ్యానుల కిందా ఏసీల్లోనూ వుందటం వల్ల వచ్చే చర్మరోగాలకి దూరంగా వుండవచ్చు! మరీ పెద్ద పెద్ద చెట్లు అక్కద పెంచలేమని నాకూ తెలుసు గానీ కుండీల్లో పెంచదగినవి అయినా మనిషి కన్నా యెత్తు యెదిగి నీడ నిచ్చేవి చాలా వున్నాయి గదా!చిన్న చిన్న భవనాల విషయంలో ఇవి గొంతెమ్మ కోరికల్లాగా అనిపించవచ్చు గానీ యెక్కువ ఫ్లాట్లు వుండి యెక్కువ అంతస్తుల్లో కట్తే వాటిల్లో మాత్రం ఇవి తప్పనిసరిగా వుండాలి!ఇప్పటివరకూ భవన నిర్మాతలు వీటిని చేర్చలేదంతే దాని అర్ధం వాళ్ళ్లకి ఆ ఆలోచన రాలేదని అయినా అనుంకోవాలి,వచ్చినా ఆ స్థలంలో వొదిలేసే ఫ్లాటుల వల్ల వచ్చే లాభం మీద దృష్టి అయినా అయి వుండాలి?కాబట్టి అందులో నివసించబోయే వాళ్ళు వీటిని గురించి గట్టిగా అడిగీతే తప్ప ఇవి జరగవు!

P.S:అది జరగటం అనేది పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు, పెళ్ళి జరిగితే కానీ పిచ్చి కుదరదు అన్నట్టు అసలు అపార్టుమెంట్లలో వుండాలనుకునే వాళ్ళలో చాలా మంది తమ లోగుట్టును భద్రంగా దాచుకునే వొంటికాయ  సొంటికొమ్ము బాపతు గాళ్లే?!అయినా క్షెమంగా బతకాలనే ఆశతో నన్నా వీట్ని పట్టించుకుని కొంచెం జాగ్రత్తగా బతుకుతారని చిన్న ఆశ! 

Monday, 8 December 2014

మార్క్సిష్టు సిధ్ధాంతాన్ని హిందూ ధర్మం ప్రకారం విమర్శించి వెక్కిరించ వచ్చునా?

               రామాయణం పని పట్టడం అయ్యింది,ఇక ముతప్పాళ కురంగీన్యాకమ్మ ఇప్పుడు భారతం మీద పడింది!యేమిటి నీ అధికారం అంటే ఆవిడా ఆవిడ పంఖాలూ చెప్పేది యేమిటంటే మా మార్క్సిష్టు సిధ్ధాంతం లోకంలో అన్నింటి కన్నా గొప్పది, దానితో దేనినయినా విశ్లేషించ వచ్చు గాబట్టి ఒక మార్క్సిష్టు భారతాన్ని యెలా అర్ధం చేసుకోవాలో వివరించే హక్కు మాకు వుంది అని అంటారు? పైగా మీరు విమర్శలకి యెందుకు భయపడుతున్నారు అని మనల్ని దబాయిస్తారు! అందుకే ముందు ఇతర మతస్తుల పుస్తకాల్ని మీ మతం ప్రకారం అర్ధం చేసుకోవడం తర్వాత చేద్దురు గానీ మీ మతం లో వున్న మూఢనమ్మకాల సంగతి యేమిటి అని నేను అడుగుతున్నాను!

         ఇక్కడ బ్లాగుల్లో చర్చించే ఒక కుర్ర కమ్యునిష్టు మనిషి వస్తుగత వాది అనే స్మిత్తుగారి ఆర్ధిక సూత్రాన్నే మార్క్సు కూడా వొప్పుకుంటాడు అని చాలా గట్టిగా చెప్తున్నాడు!మరింక కొత్తగా మనం మార్క్సిజాన్ని యెందుకు ఫాలో అవ్వాలి?తన లక్ష్యానికి తగ్గట్టుగా కొత్త ఆర్ధిక శాస్త్రం యేదీ కనుక్కోలేదు మార్క్సు! స్మిత్తుగారి ఆర్ధిక శాస్త్రాన్నే ఫాలో అవుతూ మరి స్మిత్తుగారు చెప్పేదానికన్నా భిన్నమయిన సమాజాన్ని యెట్లా సృష్టిద్దామనుకున్నాడు మార్క్సు మహాశయుడు? కమునిష్టు పార్టీకి సంబంధించిన ప్రతి వాడూ ఇప్పటి వ్యవస్థ లన్నీ ఫెయిలవటానికి వాటికి సరయిన ఆర్ధిక ప్రణాళిక లేకపోవటమనీ ప్రతిదానికీ ఆర్ధిక శాస్త్ర పునాది వుండాలనీ చెప్తూ ప్రతి లక్ష్యానికీ ఫ్రేం వర్కు చాలా అవసరం అని సొల్లు వాగుతూ కూడా వర్గరహిత సమాజాన్ని సృష్టించే కొత్త వ్యవహారానికి ఇప్పటి స్మిత్తుగారి ఫ్రేం వర్కు సరిపోతుందని యెలా అంటున్నాడు?

            మనిషి వస్తుగత వాది - అంటే అతని ప్రపంచం మొత్తం తనతోనే మొదలవుతుంది. మరి ఈ బలమయిన నేను అనే మౌలిక లక్ష్యానికీ కమ్యునిష్టు సిధ్ధాంతం మనిషికి చెప్పే తొలి సుభాషితమయిన స్వంత ఆస్తి రద్దుకీ మధ్య సమన్వయం యేలా కుదురుతుంది? మిగతా మతాల వాళ్ళు "నేను , నాది అనేది వొదులుకోండి, అంతా మంచిగా వుంటుంది" అని చెప్తున్నట్టు మీ మతంలో దానికి ప్యారలల్ గా వినిపించే స్వంత ఆస్తి రద్దు అనే ఒక తింగరి మాటని ప్రచారంలోకి తెచ్చారు, కానీ స్వంత ఆస్తి రద్దు సాధ్యమా? మీ ఇంట్లో గోడ మీద వేలాడే మార్క్సు గారి బొమ్మ అక్కడికి యెలా వచ్చింది?కొంటే వచ్చింది,అవునా కాదా? కొనాలంటే ఒక్క రూపాయి అయినా సరే మీ దగ్గిర స్వంత ఆస్తి వుండి తీరాలి, అవునా కాదా?

           ఇక దోపిడీ గురించి "కన్నంలో దొంగని కన్నంలోనే కనుక్కున్నాడు" - అని డప్పాలు కొదతారు!ప్రపంచం మొత్తం జనాభా అంతా ఇద్దరికే కుదించుకు పోయినా ఆ ఇద్దరి మధ్యనా అమ్మకం, కొనుగొలు అనే ట్రాన్సాక్షన్లు యెన్ని జరిగినా యే ఒక్క అమ్మకం-కొనుగోలు వ్యవహారమూ 50-50 గా వుండదు, త్రాసు యెటో ఒక వైపు మొగ్గుతుంది! అమ్మేవాడి అవసరం గట్టిదని తెలిస్తే కొనేవాడు చెట్టెక్కి కూర్చుంటాడు, కొనేవాడికి అది తప్పనిసరిగా అవసరం అని తెలిస్తే అమ్మేవాడు చెట్టెక్కి కూర్చుంటాడు - వెయ్యేళ్ళకి ముందూ ఇదే జరిగింది, ఇప్పుడు మన కళ్ళముందు ఇదే జరుగుతున్నది,వెయ్యేళ్ళ తర్వాతా ఇదే జరుగుతూ వుంటుంది మీ కమ్యునిష్టులు ప్రభుత్వాలు నడుపుతున్న చోట్లతో సహా? ఇంతోటి గొప్ప నిజం మార్క్సుగారు చెప్తే తప్ప తెలుసుకోలేని మీరే మిగతావాళ్ళతో పోలిస్తే పిచ్చి పుల్ల్లయ్యలు!

              అదనపు విలువని సమాజపరం చెయ్యడం అనేది స్వంత ఆస్తిని మనిషి వొదులుకోగలిగినప్పుడే సాధ్య పడుతుంది! స్వంత ఆస్తి రద్దుకి మీకు పిచ్చపిచ్చగా నచ్చేసిన ఈ కొత్తమతాన్ని ప్రచారం చెయ్యడానికి మీరు ముచ్చటగానే వొప్పుకున్నా మిగతా వాళ్లకి "నేను,నాది" అనేవాటిపట్ల మమకారాన్ని యే విధంగా వొదిలిస్తారు?ఈ అదనపు విలువని సమాజపరం చెయ్యడం అనేది మార్క్సు కన్నా చాలాకాలం ముందే భారతదేశంలో కొంతకాలం చాలా నిక్కచ్చిగా అమలు జరిగిందని మీకు తెలుసా?

             ప్రపంచంలో వున్న ముసల్మాను లంతా మక్కా లోని కాబా దగ్గిర నమాజు చేసినట్టు మీరు మాత్రం లెనిన్ శవం ముందు పిడికిళ్ళు బిగించి "విప్లవం వర్ధిల్లాలి" అని పొలి కేకలు వేస్తే అది మీరు మీ మతపెద్దల పట్ల చేశారు గాబట్టి గొప్ప,అదే ఇతర మతస్తులు రాముడికో పీర్లకో శిలువకో చేస్తే మూఢనమ్మకం,దీన్ని సిధ్ధాంత నిబధ్ధత అనరు డబుల్ మొరాలిటీ అంటారు, అవునా కాదా? మార్క్సిష్టు సిధ్ధాంతం అన్నిటికీ పరిష్కారాల్ని చూపిస్తుంది అని మీరు యే ఆధారమూ లేకుండా చెప్పినా అది తావీజు మహిమ కాదు, ఇతర్లు అదే పని చేస్తే అది మతమౌఢ్యం, యేమి వాదనా చమత్కృతి?

        లెనిన్ పోయాక స్టాలిన్ వీర విక్రమోపేతంగా విజ్రంబిస్తుంటే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళలో మగవాడైన ట్రాట్స్కీ దేశం వొదిలిపెట్టిపోగా ఆడదైనందుకు లెనిన్ భార్య కుండలు కడుక్కుంటూ ఇంటికి మాత్రమే పరిమితమైపోతే ఆ పురుషాధిక్యత గురించి మాట్లాడని వాళ్లకి మహాభారతంలో పాత్రల మీద జాలి పొంగుకొస్తున్నది, యేమి విడ్డూరం?!వాస్తవ జీవితంలో తను వున్న కమ్యునిష్టు పార్టీ లోనే పాతుకుపోయిన పురుషాధిక్యతని వదల గొట్టలేని ఈ ముగ్గుబుట్ట ముసిల్ది కల్పిత పాత్రల గురించి జాలిపడుతున్నది,కూటి కోసం కోటి విద్యలు?! ముగ్గురు మొగుళ్ళని మార్చిన ము.రం.నా ద్రౌపది అయిదుగురు భర్తల గురించి వెక్కిరిస్తే యెట్లా వుంటుంది?తను ఒక మొగుడితో కాపర ముంటున్నప్పుదు మరో మొగాడితో తిరిగిందా యెప్పుడయినా? అంటే దాంపత్యం విషయంలో తన సొంత జీవితంలో తను కూడా సీత లాగే పవిత్రంగానే గడిపింది కదా? మరి తను పాటించిన ధర్మాన్నే వాల్మీకి కావ్యరూపంలో చెప్తే తట్టుకోలేక విమర్శించడం అంటే నిన్ను నువ్వు చెప్పుచ్చుక్కొట్టుకోవటం అని కూడా తెలియని ఈ దేబెమొహం పెద్ద తెలివయినదానిలాగా ఇవ్వాళ కొత్తగా దేన్ని విమర్శిస్తున్నది?


హిందువులు ఇదివరకట్లా లేరు,తస్మాత్ జాగ్రత్త?!

Monday, 1 December 2014

తెలుగు భాషకి యాబై ఆరు అక్షరాలు అనవసరమా?

        అనగనగా ఒకచోట తెలుగు బాషని ఆధునికం చెయ్యాలనే ఒక చర్చలో ఒక వ్యక్తి ఇంగ్లీషు 26 అక్షరాలతో యెంతో విస్తృతమయిన పదజాలాన్ని కలిగి వుండి ప్రపంచ వ్యాప్తం కాగా తెలుగు భాషకి 56 అక్షరాలు యెందుకు,తగ్గించుకుని ఫాస్టుగా యెదగొచ్చుగా అంటున్నారు. అక్షరాలు తక్కువగా వుండటం వల్లనే ఇంగ్లీషు భాష ప్రపంచవ్యాప్తం కాగలిగిందా?అక్షరాలు యెక్కువగా వుండటం వల్లనే తెలుగు వెనక బడిపోయిందా!

       పారిశ్రామిక విప్లవంతో వచ్చిన హుషారు వల్ల విపపరీతమయిన విధ్వంసాన్ని సృష్టించ గలిగిన కొత్తరకపు ఆయుధాలతో యుధ్ధాల ద్వారా దేశాల్ని ఆక్రమించుకుని ఆక్రమించిన ప్రతి చోటా బలవంతంగా నేర్పిస్తే జరిగిన వ్యాప్తిని అక్షరాలు తక్కువగా వుండటానికి అంటగడుతున్నారు,యేమి పిచ్చితనం?"ధర్మం" అనే మాటకి సరయిన పారిభాషిక పదాన్ని కనుక్కోలేక తల్లకిందులయి "Dutifulness" అనేది కొంచెం దగ్గిరగా వస్తుందని సరిపెట్టేసుకున్నారు. తెలుగులో ప్రతి అక్షరానికి ప్రాధాన్యత వుంది.భావాలకి మాత్రమే కాదు ద్వనులకి కూడా రూపం కల్పించారు.దానివల్ల మిగతా భాషల కన్నా పదజాలం లో విస్తృతి పెరగడం వల్ల అది గొప్పే అవుతుంది తప్ప లోపమెలా అవుతుంది? ఇతర భాషల్లో చెప్పలేని భావాన్ని కూడా చెప్పగలిగే గొప్పదనాన్ని కత్తిరించుకుని ఇతర భాషల మాదిరిగా తయారవడం అంటే  ఒక ఆజానుబాహుడు కొద్దిసేపు పొట్టివాళ్ళ మధ్య గడపటం కోసం కాళ్ళో తలో కత్తిరించున్నట్టు కాదా, అది అవసరమా?!

        పదవిస్తృతి యెంత అవసరమో ఒక వుదాహరణ చెప్తాను - ఈ మధ్యనే ఇంగ్లాండులో స్కూలు స్థాయిలో ఒక 2000 మంది విధ్యార్ధులకి వాళ్ళు వొపయోగించగలిగిన పదవిస్తృతి(vocabulary)నీ వాళ్ళ వ్యక్తిత్వ వికాసాల్లో వుండే తేడాల్నీ పరిశీలించి చూశారు.సహజంగానే యెక్కువ పదాల్ని వుపయోగించ గలిగిన వాళ్ళు అన్నిటిలోనూ అగ్రస్థానంలో వున్నారు!అలాంటిది ఇతర భాషలు వ్యక్తీకరించలేని భావాల్ని కూడా చెప్పటానికి పనికొచ్చే విస్తృతమయిన పదకోశం వుండి, ఇతర భాషల పదాల్ని అతి తేలిగ్గా ఇముడ్చుకోగలిగిన గొప్పదనాన్ని వొదులుకుని ఇంగ్లీషు లాగా వున్న అక్షరాలనే కత్తిరించుదాం అంటున్నారు,ఇది యేమి భాషాభిమానం?

        భాష ధాతుజన్యం, అంటే క్రియ ముఖ్యం.ప్రతి భాషలోనూ నామవాచక పదాలు,క్రియా పదాలు,విశేషణ పదాలూ - ఇలా విభాగాలు వుంటాయి. కానీ తమాషా యేంటంటే మిగతా రకం పదాల్లో కూడా క్రియ గుప్తంగా వుంటుంది. వుదాహరణకి రాముడు అనేది మనిషి పేరు.కానీ దాని అర్ధం రమింపజేయువాడు అని. అంటే రమింప జెయ్యటం అనే క్రియ అందులో దాగి వుంది. కారా మాస్టారు తెలుగు వాక్యం అనే ఒక పుస్తకం రాసారని చదివాను.వాక్య నిర్మాణానికి సంబంధించిన సూత్రాలే భాషలకి ప్రత్యెకత నిస్తాయి.ఇంగ్లీషులో ఆబ్జెక్ట్ చివరికి చేరుతుంది.తెలుగులో కర్త,కర్మ ,క్రియ అన్నీ ఆ వరసలోనే వుంటాయి.ముఖ్యంగా తెలుగు భాష ధ్వని ప్రధానమయినది(phonetic language), ఆ ప్రత్యేకతని పోగొట్టుకోవటం, అదీ ఇతర భాషల మాదిరిగా తయారు చెయ్యాలనే వుద్దేశంతో చెయ్యటం  మూర్ఖత్వం!

       తెలుగు భాష కున్న ప్రత్యేకత అందమైన పొందికైన అక్షరాల కూర్పు!ఇవి ఒక్కరోజులో వచ్చిపడ లేదు.దశల వారీగా అవసరం కొద్దీ పుట్టించినవే.మిగతా భాషలకి లేనిదీ తెలుగుకి మాత్రమే వున్న ప్రత్యెకత - ద్వనుల్ని కూడా అక్షరబధ్ధం చెయ్యటం.పైగా దశల వారీగా చేసిన మార్పులలో వరసగా పేర్చటంలో ఒక సౌలభ్యం వుంది.చూదండి:
అ & ఆ - కంఠ్యములు (గొంతుతో పలికేవి).
ఇ & ఈ తాలవ్యములు (కంఠానికీ, పళ్ళ చిగుళ్ళకీ మధ్య ఉన్న భాగాన్ని తాలువు అంటారు. తాలువుతో పలికేవి తాలవ్యములు).
ఎ, ఏ & ఐ - కంఠ్యతాలవ్యములు (కంఠము & తాలువుతో పలికేవి). 
ఋ & ౠ - మూర్ధన్యములు (నాలుక ముందు భాగాన్ని వెనక్కి వంచి పలికేవి).
ఌ, ౡ - దంత్యములు (నాలుక ముందు భాగాన్ని దంతాలకి తగిలించు పలికేవి).
ఉ & ఊ ఓష్ఠ్యములు (పెదవులతో పలికేవి).
ఒ, ఓ & ఔ - కంఠ్యోష్ఠ్యములు (కంఠము & పెదవులతో పలికేవి).

ఇప్పుడు స్పర్శములు (plosives) చూద్దాం. తెలుగులో "క" నుంచి "మ" వరకు ఉన్నవి స్పర్శములు (నోటి భాగములతో గట్టి ప్రయత్నం చేసి పలికేవి). 

క, ఖ, గ, ఘ & ఙ - కంఠ్య స్పర్శములు (guttaral plosives).
చ, ఛ, జ, ఝ & ఞ - తాలవ్య స్పర్శములు (palatal plosives).
ట, ఠ, డ, ఢ & ణ - మూర్ధన్య స్పర్శములు (retroflex plosives).
త, థ, ద, ధ & న - దంత్య స్పర్శములు (dental plosives).
ప, ఫ, బ, భ & మ - ఓష్ఠ్య స్పర్శములు (labial plosives).

"ఙ, ఞ, ణ, న, మ"లు నాసిక్యములు (ఇవి పలికేటప్పుడు నోటిలో ఏదో ఒక భాగం గాలి ప్రవాహానికి అడ్డు తగిలి ముక్కు నుంచి గాలి బయటకి వస్తుంది).

స్పర్శములు కానివి అంతస్థములు (approximants). అవి:
య - తాలవ్య అంతస్థము.
ర, ఱ & ళ - మూర్ధన్య అంతస్థములు.
ల - దంత్య అంతస్థము.
వ - దంత్యఒష్ఠ్య అంతస్థములు (labiodental approximant).

గాలి ఊదుతూ పలికేవి ఊష్మములు (fricatives). అవి:
శ - తాలవ్యోష్మము
ష - మూర్ధన్యోష్మము
స - దంత్యష్మము
హ - కంఠ్యోష్మము
provided by Marxist Hegelian

      తెలుగుకి రాతలో వుండే సౌలభ్యం పెన్ను గానీ పెన్సిలు గానీ పేపరు మీద ఆనించి మొదలు పెడితే చివరి వరకూ ఒక్కపెట్టున రాయగలగడం."ట" లాంటివటికి కొన్ని మినహాయింపులు వున్నా తొందరగా రాసేటప్పుడు అవి కూడా చకచకా రాసెయ్యొచ్చు!

        పదాలు యెరువు తెచ్చుకోవడం తప్పు కాదు. పదుగు రాడుమాట పాడియై ధర జెల్లు నన్నట్లు మాట్లాడే వాడుక భాషే ముఖ్యం.భాషని పుట్టించే శక్తి కష్టజీవులకే వుంది! యెందుకంటే భాష పుట్టిందే పని కోసం కాబట్టి? ఒక పని చెయ్యాలంటే తను ఒక్కడే చెయ్యగలిగిన దయితే తనే వుపాయాలు ఆలోచించి చేసుకుంటాడు. కానీ ఇతర్ల సాయం అవసరం అయినప్పుడు తప్పనిసరిగా భాష కావాలి."నాకు నువ్వు ఈ సహాయం చెయ్యాలి" అని మరో మనిషిని అడగటానికే భాష పుట్టింది. పనిమంతులకి మాట్లాడటం ఒక అవసరం. ఆ అవసరం వున్నవాడు చిన్నయ సూరి కోసమూ చూడడు, రెన్ అంద్ మార్టిన్నూ వెదుక్కోడు.ఈ మధ్యనే ఫ్లై ఓవరుని ఒక పల్లెటూరి వాడు పైదారి అన్నాడని చదివాను.యేది బాగుంది?ఇంతకాలం ఆ చుట్టూ తిరుగుతూనే ఎవున్నా నాగరీకులూ పండితులూ అంత మంచిమాటని యెందుకు పుట్టించలేక పోయారు?

    అలా వాక్యనిర్మాణంలో తెలుగు యొక్క లక్షణాన్ని పాటిస్తున్నంతవరకూ యెన్ని రకాల పదాల్ని ఇముడ్చుకున్నా అది తెలుగే అవుతుంది. మాతృభాష అని యెందుకు అంటున్నాం అంటే మమకారం కోసం! పనిలో లీనమవ్వాలంటే పనిని ప్రేమించాలి. భాషని సరిగ్గా వాడుకోవాలంటే భాషని ప్రేమించాలి. ప్రతి భాషా మొదట అరుపులుగా కేకలుగా పుట్టిందే. ఆ అరుపుల్నీకేకల్నీ క్రమబధ్ధం చేస్తే అంటే వ్యాకరణాన్ని వుపయోగిస్తే భాష అయ్యింది.ఈ క్రమబధ్ధం చేసేవాళ్ళు యెక్కణ్ణించి వస్తారు? ఆ భాష మాట్లాడే వాళ్ళలోంచే వస్తారు గదా! పంచవేణీ సంగమం గురించి చెప్పుకుంటారు అన్ని రకాల పదాల్నీ కలుపుకోగలదని తెలంగాణాలో వినపడే తెలుగు గురించి.యేమండీ మీరొక్కరేనా కలుపుగోగలిగింది?కృష్ణా జిల్లా మాండలికంలో అంతా తెలుగు పదాలేనా?వుర్దూ పదాలూ ఇంగ్లీషు పదాలూ లేవా?

      అసలు భిన్నత్వంలో యేకత్వం అనేది మన దేశానికే పరిమితమనీ ఇంకెక్కడా ఇలా లేదనీ కొందరెందుకో అదేపనిగా పొగుడుతారు? అమెరికాలో ఇప్పుడు అనేక జాతుల వాళ్ళు కలిస్ బ్రతకటం లేదా? రష్యా అంతా యేక మొత్తమయిన భూఖండమా? సెర్బియన్లు, బోత్స్నియన్లు లేరా? ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళిన మనిషి అక్కడ యెక్కువ కాలం వుండాలంటే చచ్చినట్టు అక్కడి భాషని నేర్చుకోవలసిందే గదా! ఆ మనిషి తిరిగి తన ప్రాంతాని వస్తే అక్కద నేర్చుకున్న మాటల్ని ఇక్కడా మాట్లాడితే ఇక్కడివాళ్ళకి నచ్చితే అందరూ అలవాటు చేసుకుంటే ఆ పదాలు ఈ భాషలోకి వొదిగి పోవడం లేదా?

     యేరుల జన్మం శూరుల జన్మం యేరికి తెలుసు? యే పదం యెప్పుడు పుట్టిందో యెప్పుడు చచ్చిందో యెప్పుడు మళ్ళీ పుట్టిందో తెలుసుకోవాలంటే పదవ్యుత్పత్తి శాస్త్రం వుంది.భాష యెదగాలంటే వాడే వాళ్ళు కూర్చేవాళ్ళు ఇద్దరూ వుండాలి,వాళ్ళ మధ్య సయోధ్య వుండాలి!ఇవ్వాళ తెలుగు కున్న దుస్థితి కూర్చే వాళ్ళు లేకపోవటం మరీ గట్టిగా చెప్పాలంటే కూర్చుకోవటం మీద శ్రధ్ధ లేకపోవటం?!యెవడిష్ట మొచ్చినట్టు వాడు మాట్లాడుకోవాలనే దురద పరిమితి దాటింది.పనిమంతుడెవడూ ఇలా పిల్లితల గొరిగే చర్చలకి రాడు!వాడి కవసరమయిన భాషని వాడే సృష్తించుకోగలడు!పండితులు అతడు సృష్టించిన పదాల్ని వుపయోగించుకుని కావ్యాలు రచించి పేరు తెచ్చుకుంటారు?!

       కూర్చడం యెవరు చెయ్యాలి?అధికారం వున్నవాడు చెయ్యాలి!అధికారం యెలా వస్తుంది?పదే పదే వాడటం వల్ల పరిచయం పెరిగి జ్ఞానం విస్తారమయితే అధికారం వస్తుంది!అస్లు అన్ని అక్షరాలు యెందుకు,భాష తల్లి కాదు ఒక కట్టుగొయ్య మాత్రమే అనేవాళ్ళతో యేమి మాట్లాడగలం,అనవసరం!అక్షరాలు తగ్గించితే పదవిస్తృతి తగ్గడమే తప్ప యే వుపయోగమూ వుండదు,అలాంటి వికృత ప్రయోగాల కన్నా అసలు తెలుగు మాట్లాడకుండా వుండటం మంచిది?!ఈ అక్షరాలు యెక్కువైనాయనే వాదం తెలంగాణా మేధావుల నుంచే వస్తున్నది.నిజమే, వారికి ఇన్ని అక్షరాలూ ఇంత విస్తృతమయిన పదజాలం అవసరం లేదు.ఇవి చాలు.ఆ బ్లాగరు యెప్పుడో సరదాగా వెక్కిరించిన దాన్ని ఇప్పుడు చాలా గంబీరమయిన తాత్విక చింతనతో యెత్తుకున్నారు:-) చారిత్రకంగా,బౌగోళికంగా ప్రాచీన కాలంలో ఇప్పుదు ప్రత్యెకరాష్ట్రంగా యేర్పడిన తెలంగాణా ప్రాంతంలోని తెలుగువాళ్ళనే ఆంధ్రులు అనీ వారిది ఆంధ్రత్వం అనీ వ్యవహరించే వాళ్ళు!వాళ్ళు నిన్నటి రోజున ఆ పేరుని మన రాష్ట్రానికి సాధికారికంగా ఇచ్చేసి ఆంధ్రత్వాన్ని వొదులుకున్నారు. ఇవ్వాళ తెలుగు భాషనీ చిన్నబుచ్చుతున్నారు, రేపు తెలుగుదనాన్నీ వొదులుకుంటారు? మహద్భాగ్యం, రేపటి రోజున అవి మనకు మాత్రమే సొంతమవుతాయి - కానివ్వండి!

     కొందరిలో మరొక విచిత్రం చూశాను - తెలుగు నా మాతృభాష అనటానికే శ్రీరాముడి ప్రస్తావన వొచ్చినప్పుడల్లా జవహరు లాల్ నెహ్రూ యెగిరి పడినట్టు వులిక్కి పడుతున్నారు? తెలుగును మాతృభాష అనుకోకపోతే యేం?తప్పనిసరిగా తెలుగుని అంతగా గౌరవించి తీరాలా? అనేవారికి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. విస్తారంగా చెప్పబోయే విషయాన్ని అర్ధం చేసుకోవాల్సిన పధ్ధతిలో అర్ధం చేసుకుంటే చాలు! ముందుగా ఒక సరదాగా వుండే పద్యాన్ని ఇక్కడ ఇస్తున్నాను:-)

క్రమముగ "శ్రీమత్సకల గుణ సంపన్న"
యని యున్న జదివెడు నఱవవాడు

కడగి "చిరిమదు చగల కుణ చంపన్న"
యని,కన్నడము వాడు మొనసి

"సిరిమతు సగల గోణ" యని తోడనె
"శంపణ్ణ" యని,మహారాష్ట్రుండు పని వడివడి

జెలగుచు "శ్రీమతూ సెకల గుణానె
సంపన్నాసె" యని,యోడ్ర భాషణుండు

వెలయు "శ్రీమొతొ సొకొలో గుణ సొంపొన్నొ"
యని, యికెన్ని యేల యన్యభాష

లాంధ్రు డున్నయట్లె యలరు బఠించు
నంచు హాస్యవేది యాడునాడు:-))


       ఈ సరదా పద్యం రాసింది శ్రీ కొక్కొండ వెంకట రత్నం పంతులు గారు.ఈయనా వీరేశలింగం పంతులు గారూ అప్పట్లో గజకచ్చపాల్లాగా పోట్లాడుకునే వాళ్ళు - ప్రతిభ తోనే?!యీయన ఒక నాటకం రాసి అందులో పాలేరు పాత్రకి వీరిగాడు అని పెడితే ఆయనేమో ఒక నత్తిపాత్రతో తన పేరుని "కొక్కొక్కొండి గాడండి" అనీ చెప్పించాడు!

      సరదాగా రాసినా ఈ పద్యంలో ఒక సాంకేతికాంశం వుంది.ప్రపంచంలో వున్న ప్రతి భాషా ఒకే ప్రాంతంలో యెందుకు కేంద్రీకరించబడి వుంది?యెందుకంటే యే భాషకైనా అక్షరాలూ,పదాలూ, వాటి వుచ్చారణా ముఖ్యం - వాట్ని వేరు చేసేవి గూడా అవే!చలిగా వుందే ప్రాంతం వాళ్ళు కొన్ని ద్వనుల్ని చించుకున్నా పలకలేరు.వేడిగా వుందే ప్రాంతంలో వుండేవాళ్ళకీ అదే ఇబ్బంది?పై పద్యంలో జనరలైజ్ చెయ్యటమే తప్ప అన్నిచోట్లా పరాయి భాషల్ని కూడా చక్కగా మాట్లాడాలని పట్టుదలతో సాధించే వ్యక్తులు కొందరయినా వుంటారు!మొత్తమ్మీద ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితులకీ బౌగోళిక పరిస్థితులకీ అక్కడి ప్రజలు మాట్లాదే భాషకీ దగ్గిర సంబంధం వుండి వుండాలి?!ఆ రకంగా చూస్తే మన ప్రాంతం సరిగ్గా భూమధ్య రేఖ మీద వుండటంతో చలీ, వేడీ రెండూ సమానంగా తగుల్తుండటం చేతనే మనం అన్ని రకాల ద్వనుల్నీ పలక గలుగుతున్నామేమో!

         సుబ్బారావు వాళ్ళ అమ్మ మాట్లాడేది సుబ్బారావుకి మాతృభాషా మరియూ పుల్లారావు వాళ్ళమ్మ మాట్లాడేది పుల్లారావుకి మాతృభాషా అవదు! భాష ప్రాంతానికి సంబంధించినది కాబట్టి ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ ఆ భాషే మాతృభాష అవుతుంది. స్తన్యమిచ్చి పెంచే కన్నతల్లితో యెంత గౌరవనీయమయిన స్త్రీ నైనా సమానం చెయ్యగలమా! యవ్వనంలో అమెరికా వంటి దూరదేశాలకు పోయి ఇక చాలు అనేటంత సంపాదించిన వాళ్ళు వృధ్ధాప్యంలో మళ్ళీ ఇక్కడే సెటిలవ్వాలని యెందుకు తపించి పోతున్నారు?మాతృదేశం పట్ల వుండే "జననీ జన్మభూమిశ్చ" అనే భావనతోనే గదా!మాతృదేశం అనే భావనని ఒప్పుకున్నపుడు మాతృభాష అనేదాన్ని ఒప్పుకోవటానికి అభ్యంతర మేమిటి?

     చాలామంది బెంగ పడుతున్నట్టు నేను తెలుగు యేమవుతుందో అని అతిగా బెంగ పడిపోవటం లేదు. మాట్లాడాల్సిన అవసరం వున్నవాడు తను చెప్పదల్చుకున్న దాన్ని యెదటివాళ్ళకి యెలా అయినా చెప్పి తీరతాడు, అందులో యెలాంటి అనుమానమూ అక్కర్లేదు.కానీ మాట్లాడాల్సిన అవసరం వున్నవాళ్ళకి తను చెప్పదల్చుకున్న భావానికి సరిపోయే మాట ఇక్కడ తెలుగులో వుంది అని తెలిస్తే గదా ఆ తెలుగు మాటనే వాడగల్గేది! ఆ తెలియజెప్పటం అనేది మాత్రం మనం పూనుకుని చెయ్యాలి.

ముందుగా ఇక్కడ నాకు పరిచయమయిన అచ్చతెలుగు మాటల్ని ఒక నాల్గింటి గురించి చెబుతాను:
---------------------------------
పైదారి  = Fly-over
పొద్దు మాను = Light house
తవ్వోడ = Dredger
చిచ్చు గోలి(లు) = Lighter
---------------------------------
         వీటిల్లో వున్న అసలయిన విశేషం పలకడానికి తేలిగ్గా వుండటం కాదు అవి చేసే పనిని సూచించే పాండిత్యం ఆ పదాన్ని పుట్టించిన వాడికి వుండటం.తవ్వుకుంటూ వెళ్ళే ఓడ తవ్వోడ అయింది!ప్రతి వెలిగించే వస్తువుకీ వొత్తి వుంటుంది,అ వొత్తి చుట్టూ పుట్టే వెలుగు మొదట గోళాకారం లోనే వుంటుంది!

     ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఇదే: భాష పదాల సమాహారం, కనుక మొత్తం భాషకి సంబంధించిన విహంగ వీక్షణ కాదు మూలానికి వెళ్ళి ప్రతి పదాన్నీ దాని చరిత్రతో సహా పట్టించుకోవాలి!ఒక పదకోశం యేర్పాటు చెయ్యాలి?బ్రౌణ్య నిఘంటువు వుంది కదా అని అనవచ్చు. అది చాలా పరిమితం. కేవలం పదాన్నీ అర్ధాన్నీ చూపిస్తుంది,అంతే! నేను చెప్తున్నది etymological dictionary! వీలున్నంతవరకూ పైన చెప్పిన లాంటి అచ్చ తెలుగు పదాల్ని సేకరించాలి. అచ్చతెలుగు పదం కాకపోయినా అది యే భాషా పదమో చెప్పాలి. కైఫియత్ అనేది పరభాషా పదమే - కానీ కైఫియత్తు అనగానే తెలుగు పదమై పోయింది!

      ప్రామాణిక తెలుగు అనగానే రెండున్నర జిల్లాల భాష మామీద రుద్దాలని చూస్తున్నారు అని యెగిరిపడి దాన్ని పడనివ్వలేదు - మరి ఇప్పుడు మనం అఘోరిస్తున్న దేమిటి? అంత జేసీ కాళోజీ గారు నా గొడవ అనిండే గానీ నా లొల్ల్లి అనలే! రాష్త్ర గీతానికి మళ్ళీ ఆ నీటుభాషలోని పాటే యెక్కింది? ఇప్పుడు దీనికైనా కలిసి వస్తే మొత్తం 23 జిల్లాల లోనూ,లేని పక్షంలో ఇటువైపు 13 జిల్లాల లోనూ కలియదిరగాలి. వినపడే ప్రతి మాటనీ రికార్డు చెయ్యాలి. వీలున్నంతవరకూ అచ్చ తెలుగు పదాలనే సేకరించాలి.తప్పనిసరిగా అది తెలుగు పదం కాకపోయినా అందరూ వాడుతున్నారు గాబట్టి దానినీ ఆ ప్రస్తావనతో కలిపి యెక్కించాలి.మన మనసులోని భావాన్ని తెలిపేటందుకు తగ్గ పదం వుందనేది తెలిస్తే గదా వాడటం జరిగేది?పనిముట్టుగా చూసినా వాడకం వల్లనే గదా దాని పనితనం తెలిసేది!

      ఇదంతా ఒక్క రోజులో అయ్యేపని గాదనేది నాకు తెలుసు.తెలుగుని తెలుగులా వుంచడానికి యేడుస్తున్నవాళ్ళు పోయిన ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుని అధికార భాషగా చేసుకోలేని వాళ్ళం నిజంగా చెయ్యగలుగుతామనీ కాదు, కానీ చెయ్యాల్సింది మాత్రం ఇదే!
ముఖే ముఖే సరస్వతి!
______________________________________________________________
పదవ్యుత్పత్తి శాస్త్రం=etymology(science of finding the history of words)

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...