Tuesday, 25 November 2014

కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (జవహర్ లాల్ నెహ్రూ)

ఈ దేశంలోని ప్రతి రేణువు లోనూ రామపాద స్పర్శ వుండాలని కోరుకుని ఇక్కడ సీత కూర్చుంది,ఇక్కడ రాముడు మారీచుణ్ణ్ణి చంపిన బాణాన్ని కడుక్కున్నాడు అని తమ తమ ప్రాంతాల్ని రాముడితో అనుసంధానించుకునే ప్రజలకి ఒక స్రీలోలుడు యెలా ప్రతినిధి అయ్యాడు?ఇక్కడి ప్రజల సంస్కృతీ సాంప్రదాయాల్ని గౌరవించని వాడు ఇక్కడి ప్రజలకు తిరుగులేని నాయకుదు యెట్లా అయ్యాడు!తన మంత్రివర్గ సభ్యుడూ యుధ్ధాన్ని పర్యవేక్షిస్తున్న రక్షణ మంత్రీ అయిన సాటి దేశభక్తుడు నేనిక్కడ శత్రువుని తరిమి కొడుతున్నాను సమస్య పరిష్కారమైపోతుంది ఒక్కరోజు ఆగమన్నా ఆగకుండా పనిగట్టుకుని కాశ్మీరును వివాదంగా మార్చి అంతర్జాతీయ ప్రమేయానికి దఖలు పర్చేసి అనంత కాలం వరకూ పరిష్కరించలేని పీటముడిగా తయారు చెయ్యటం వెనుక తన ప్రియురాలైన - ఆ శీలవతి కూతురు కూడా అంగీకరించిన - ఒక విదేశీ వనిత ప్రమేయం వున్నదని తెలిశాక కూడా అతన్ని దేశభక్తుడని కీర్తించడం ఈ దేశాన్ని ప్రేమించే వాడెవడయినా చెయ్యదగ్గ పనేనా?




స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధానికి మొదటి గవర్నరు జనరల్ గా నిన్నటిదాకా తామంతా ఈ దేశం నుంచి యెవర్ని తరిమి కొట్టాలని అంత పోరాటం చేశారో ఆ ఇంగ్లీషువాడు తప్ప భారతీయుడెవడూ పనికి రాలేదా? తన ప్రియురాలితో మరికొన్ని రోజులు కులకాలన్న ఆరాటం తప్ప మిగిలిన ఇంగ్లీషు వాళ్ళంతా యెప్పుడో తట్టాబుట్టా సర్దుకుపోయినా ఆ ఒక్క ఇంగ్లీషువాణ్ణి ఇంకా ఇక్కడే వుంచడానికి కారణ మేమిటి? కొత్తగా స్వతంత్రం తెచ్చుకుని దేశం సక్షోభంలో కూరుకుపోయిన సమయంలో ఈ దేశభక్తుడు తీరిగ్గా ఇంగ్లీషు రాజుకు "Your Highness" అని సంబోధిస్తూ తను వుంచుకున్నదాని మొగుడు అయిన మౌంటు బాటము గారికి సర్ బిరుదు తక్కువయిందనీ అది ఇవ్వవలసిందనీ వుత్తరాలు రాస్తూ గడిపాడని యెవరికయినా తెలుసా? ఇంగ్లీషు రాజే అసలు వూడగొట్టిన నాగటి దుంప!పైన ఒక సామంతుడు చక్రవర్తిని సంబోధించినట్టుఈ విదేశీ భావజాలపు బానిస చేసిన సంబోధన? ఆ వుత్తర మేదో ఆ దేశ ప్రధాని చేతిలో పడివుంటే అప్పుడే భారత ప్రధాని పిచ్చిపుల్లయ్యతనాన్ని ప్రపంచానికి పెద్ద జోకులాగా చెప్పి పరువు తీసి వుండేవాడు!!




ఈ దేశపు స్వాభిమానానికి ప్రతీక అయిన వందే మాతర గీతం జాతీయ గీతం కాకుండా చెయ్యాలని సభలోనే వున్న ఆదర్శవంతులయిన ముస్లిము సభ్యులు కూడా ఆమోదిస్తున్నా బజారు వెధవల్ని సంతోష పెట్టాలని - ప్రధానిగా వున్నందుకు కనీసం తటస్థంగా నన్నా వుండకుండా - తనే మిగిలిన వాళ్ళకి రాని వంకల్ని కూడా పెట్టి వ్యతిరేకించిన వాణ్ణి కూడా దేశభక్తుడు అని అంటున్నారే, ఇక దేశద్రోహులు యెవరండీ?! మహోన్నతమయిన బావ పరంపరతో సమున్నతంగా నిలబడి యెక్కడయినా ప్రధమ స్థానంలో నిలబడాల్సిన మంత్రగీతాన్ని దాని కాలిగోటికి కూడా సరిపోలని ఒక మామూలు రణగొణ పాట కిందకి దించి రెండో స్థానానికి దిగజార్చుతుంటే చేష్టలుడిగి నిల్చున్నారు అప్పటి దేశభక్తులంతా ఈ గాడిదని ప్రధానిని చేసి! ఇవ్వాళ రహమాన్ అనే సచ్చా ముసల్మాన్ "మా తుజే సలాం" అని గొంతు నిండుగా గానం చేస్తే యే గాడిద అడ్డం పడ్డాడు? బిస్మిల్లా ఖాన్ నాదస్వరంలో పలికించిన "వాతాపి గణపతిం భజేహం" లోని సంస్కృత పదాల కన్నా ఘోరమైనవా వందే మాతరం లోని సంస్కృత పదాలు!వందే మాతరం పాడొద్దని చెప్పిన ప్రవక్త "వాతాపి గణపతిం భజేహం" గురించి చెప్పడం మర్చిపోయాడా? "మూర్ద్నివా సర్వలోకస్య శీర్యతే వనయేవవా" అనేది నమ్మే నాలాంటి క్షాత్రం గలవాడు యెవడయినా ఆనాడు వుండి వుంటే, "చీ! ఆ రెండో స్థానం మాత్రం దేనికి?యెవడికి గౌరవం వుంటే వాడే పాడుకుంటాడు!" అని ఆ రెండో స్థానానికి కూడా యెట్టి పరిస్థితి లోనూ ఒప్పుకుని వుండేవాడు కాదు?!




1889 నవంబర్ 14న కాశ్మీరు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మోతీలాల్ నెహ్రూ అనే ఒక సంపన్న బారిస్టరుకు ప్రధమ కుమారుడుగా జవహర్ లాల్ నెహ్రూ జన్మించాడు. తల్లి స్వరూపరాణి కూదా లాహోరు లో స్థిరపడిన  సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందినదే. బాల్యంలో చెప్పుకోదగిన సంఘటన లేమీ జరగక పోయినా పంతుళ్ళే ఇంటికొచ్చి చదువు చెప్పే వైభవోపేతమయిన జీవితంతో పెరిగి పెద్దవాడయ్యాడు! తండ్రి మోతీలాల్ రాజకీయ వ్యాసంగంలో చురుగ్గా వుంటూ భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి రెండుసార్లు అధ్యక్షుడిగా పని చేశాడు! ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన 1912లో లండన్ నుంచి బారిస్టరు గిరీ పూర్తి చేసుకుని రాగానే పేరుకి అలహాబాదు హైకోర్టులో బారిస్టరుగా నమోదు చేసుకున్నాడు గానీ దానికన్నా రాజకీయాలే సుఖంగా అనిపించడంతో పాట్నా కాంగ్రెసు మహాసభకు హాజరై అక్కడి నుంచీ తొలి తరం వారసత్వ రాజకీయపు వైభవం యొక్క ప్రదర్శన మొదలు పెట్టాడు!




ఇతనికి అప్పటి కాంగ్రెసు "కొద్దిగా ఇంగ్లీషులో ప్రవేశమున్న వున్నత కులీనుల సమూహం యొక్క హడావిడి వ్యవహారాలు"గా కనబడినప్పటికీ, కాంగ్రెసు యొక్క ప్రభావశీలత్వం పైన సందేహాలు వున్నప్పటికీ పార్టీ కార్యకలాపాల్లో - అంటే, మోహన దాసు గాంధీ నడుపుతున్న పౌరహక్కుల ప్రచార కార్యక్రమాలకి చందాలు పోగెయ్యటం లాంటివాటిల్లో మనస్పూర్తిగానే పాల్గొన్నాడు? తను కూడా ప్రచార సభల్లో పాల్గొన్నాడు.1914లో ప్రధమ ప్రపంచ యుధ్ధ ఫలితం భారత దేశంలోని మేధావుల్లో మిశ్రమ స్పందన కలిగించింది. కొందరు ఇంగ్లీషు వాళ్ళకి నడ్డివిరిగి కూలబడటాన్ని చూడటం ఆనందాన్ని కలిగిస్తే మరి కొందరు ఇంగ్లీషువాళ్ళతో తమకున్న అనుబంధం వల్ల విచారించారు! నెహ్రూ మాత్రం ఫ్రాన్సు పైన సానుభూతి చూపించాడు ఆ దేశపు సంస్కృతిని ఆరాధించే వాడు గనక!పుట్టిన దేశపు సంస్కృతిని తప్ప అన్ని దేశాల సంస్కృతుల్నీ ఆరాధించిన ప్రమాదవశాత్తూ హిందువైన ఇతడికి హిందూ ధర్మం మాత్రం దేశంలో వుండదగనిదిగా కనిపించింది? ఆఖరికి మూకుమ్మడి దొమ్మీలని పశుబలంతో గెలవడం తప్ప ఇంకేమీ లేని చెంగిజ్ ఖాన్ తైమూరు లంగ్ లాంటివాళ్ళలో కూడా ఇతనికి అధ్బుతమయిన నాయకత్వ లక్షణాలు కనిపించాయి? ఇంకా పార్టీ స్థాయిలో మాత్రం "స్వాతంత్ర్యాన్ని గూర్చి వూహించటమే పిచ్చితనం" అని భావించే గోపాల కృష్ణ గోఖలే లాంటి మితవాదుల ప్రభావం బలంగానే వున్నప్పటికీ ఈ యుధ్ధానంతర రాజకీయాల్లో రాడికిల్స్ అనే గ్రూపులో చేరిపోయి విజృంభించటం మొదలు పెట్టాడు .




తను కూడా మితవాదే అవటం వల్ల తండ్రి బాబూ వేరే "ప్రాక్తికల్ ఆల్టర్నేటివ్" లేదురా అని ప్రైవేటు చెప్పినా వుద్యమం మరీ అంత నెమ్మదిగా కదలడాన్న్ని భరించలేక "హోం రూల్" కోరుకునే అతివాదుల్లో కలిసిపోయాడు ఖాజీ సాయిబు గారు తురకల్లో కలిసిపోయినట్టు:-) 1915లో గోఖలే గారు కీర్తిశేషుడవటంతో తిలక్, అనీబిసెంటు లాంటి వాళ్ళంతా యెంత గట్టిగా హోం రూలు కోసం ప్రతిపాదించినా అంతటి భయంకరమయిన ప్రతిపాదనని తక్కిన మితవాదులు నిర్ద్వందంగా తిరస్కరించెయ్యటంతో అది వీగిపోయింది. అతివాదులు కూడా మొండికెత్తి అనీబిసెంటు ఒకటీ తిలక్ గారు ఒకటీ హోం రూల్ లీగుల్ని పెట్టి సమాంతరంగా పోరాడటం మొదలు పెట్టారు.నెహ్రూ రెంటిలోనూ సభ్యుడయినా అనీబిసెంటు తోనే యెక్కువగా తిరిగాడు. ఇదే సమయంలో జరిగిన మరొక ముఖ్యమయిన విశేషం నెహ్రూకి బాగా లాభించింది!అదే 1916   దెసెంబరులో లక్నో ఒప్పందం పేరుతో భారత జాతీయ కాంగ్రెసుకూ ముస్లిం లీగుకూ మధ్యన జరిగిన "హిందూ ముస్లిం ఐక్యతా ఒప్పందం". దీని సూత్రధారి రెంటిలోనూ సభ్యుడై హోం రూల్ వుద్యమంలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్న మహమ్మదాలీ జిన్నా! ఈ లక్నో ఒప్పందానికి కర్తా కర్మా క్రియా అన్నీ జిన్నానే, అందుకే సరోజినీ నాయుడు "the Ambassador of Hindu-Muslim Unity" అని ఇతన్ని ప్రశంసించింది.




ఇందులో బెంగాలు విభజన అనంతరం పలుకుబడి తగ్గిన ముస్లిము లీగుకి మళ్ళీ గౌరవనీయత పెంచడం అనే వ్యూహం దాగి వుంది! అసలు ముస్లిము లీగు మొదట కాంగ్రెసు పేరుతో హడావిడి చేసే హిందూ గుంపు నుంచి రక్షణ కోసం రాణికి విధేయంగా వుండే వుద్దేశంతో పుట్టిందని మొదటి భాగంలో తెలుసుకున్నాం కదా! కానీ ఇంగ్లీషు వాళ్ళు ఖలీఫా పట్ల వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది ఇంగ్లీషువాళ్ళకి దూరంగా జరగాలనుకోవడం కూడా కలిసొచ్చింది? ఈ మొత్తం ప్రక్రియకీ నెహ్రూకీ వున్న సంబంధం యేమిటంటే ఈ ప్రతిపాదన ఆనంద భవన్ లో "All-India Congress Committee" నుంచి ఒక సూచనగా మొదలవటం!




ఈ మలుపు తర్వాత నెహ్రూ మాట్లాడిన ప్రతి పలుకూ వేసిన ప్రతి అడుగూ హిందూ ముస్లిం సమైక్యతా పరిరక్షకుడిగా జిన్నా స్థానాన్ని ఆక్రమించడానికే!అందుకోసం ఇతడు హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడేటంతగా దిగజారి పోయాడు. ఈ దేశం నుంచి విడిపోయి తన కొక దేశాన్ని సాధించుకున్న జిన్నా యేనాడయినా ఈ దేశపు సంస్కృతినీ హిందూత్వాన్నీ అవమానించాడా? నాకు తెలిసినంత వరకూ మీ హిందువుల వల్ల మా ముస్లిములకి ప్రమాదం అని సైధ్ధాంతికంగా వాదించటం తప్ప పరుషమయిన భాష వాడలేదు. ఒకవేళ వాడినా అతడు హిందువు కాదు గాబట్ట్టి తెలియక అన్నాడని క్షమించ వచ్చు!. ఒక హిందువు "భారత దేశంలో మతం పేరుతో ప్రచలితమవుతున్న దంతా, సంస్థాగతమయిన నిర్మాణం కలిగినవన్నీ నన్ను ఆగ్రహావేశాలకు గురి చేస్తున్నాయి, చాలాసార్లు నేను దీన్ని వ్యతిరేకించాను, నేను దీన్ని పూర్తిగా వూడ్చి పారెయ్యాలనుకుంటున్నాను. ఈ మతాన్నీ సంస్కృతినీ పూర్తిగా నాశనం చెయ్యాలనుకుంటున్నాను. ఇది గుడ్డి నమ్మకాలకీ, పరపీడన పరాయణత్వానికీ చిహ్నంగా నిలబడి వుంది" అని ప్రకటించగలిగాడంటే - ఆలోచించండి?! తేనెటీగ పువ్వుల మీద వాలి మకరందాన్ని తయారు చేసి ఆనందాన్ని కలిగిస్తుంది. పోతుటీగ శ్లేష్మం చేత  ఆకర్షించబడి దానిలో ముంచిన పాదాలతో మన మీద వాలుతూ అసహ్యాన్ని కలిగిస్తుంది. మాక్స్ ముల్లర్ లాంటి విదేశీయులకి గొప్పగా కనిపించిన హిందూ ధర్మంలో ఇతనికి ఇవే కనబడినాయన్న మాట? ఈ దేశాన్ని గురించి తెల్సుకోవడానికి విదేశీయులు  "ఇండాలజీ" అనే ఒక శాస్త్రాన్ని యేర్పాటు చేసుకుంటే ఈ దేశంలో పుట్టిన ఈ మనిషికీ ఇతని మార్గంలో నడిచే ఇతరులకీ ఈ సనాతన ధర్మం సిగ్గుపడదగినదిగా కనిపించిందన్న మాట! విజ్ఞత గలవాడు తను పాటించే ధర్మంలో తప్పు లుంటే అందరితోనూ చర్చించి సంస్కరించి మరింత గౌరవప్రదంగా నిలబెట్టాలని చూస్తాడే తప్ప ఇతనిలా ద్వేషిస్తాడా?ఈ మొత్తం నాటక మంతా జిన్నా కన్నా తనే ముస్లిం పరిరక్షకుడిగా యెదగటానికి చేసిన దిగజారుదు రాజకీయమే తప్ప అతని మాటల్లో గంభీరమయిన తాత్విక చింతనతో కూడిన విమర్శనాత్మక దృక్పధం నాకయితే యెక్కడా కనబడ లేదు?




చౌరీ చౌరా సంఘటన తో మోహన దాసు హఠాత్తుగా అన్ని కార్యక్రమాల్నీ ఆపెయ్యడాన్ని మిగతా వాళ్ళందరికన్నా యెక్కువగా వ్యతిరేకించినప్పటికీ తండ్రి మోతీలాలుతో సహా అందరూ బయటి కెళ్ళి స్వరాజ్ పార్టీని స్థాపించినా వాళ్ళతో వెళ్ళకుండా గాంధీని వదలకుండా అంటిపెట్టుకుని కూర్చున్నాడు? వ్యక్తిత్వంలో గానీ నాయకత్వ పటిమలో గానీ పార్తీకి మేలు చేసే యెత్తుగడలు వెయ్యటంలో గానీ ఇతని కన్నా అఖండులయిన వాళ్ళంతా అనేకానేక కారణాల వల్ల కాంగ్రెసుకి దూరమవడం వల్ల కలిగిన శూన్యం కారణంగా మోహన దాసు ఆశీస్సులతో యే చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షమన్నట్టు ఇతడు మర్రి చెట్టులా యెదిగిపోవటానికి తోడ్పడింది.




ఈ దేశ విచ్చిత్తికి కారకుడయిన వాడిగా జిన్నాను అపార్ధం చేసుకుంటారు గానీ ముస్లిములకు రక్షకుడిగా యెదగటం కోసం నెహ్రూ చేసిన ద్విముఖవిషప్రచారం - "హిందూ నాయకు లందర్నీ వీలయినంత మతమౌఢ్యం గలవాళ్ళుగా చిత్రించటం, హైందవేతరులు దుర్మార్గు లయినా సరే అపార్ధాలకి గురయిన వాళ్ళుగా చిత్రించటం"  వల్లనే ముస్లిములలో అంతగా భయాందోళనలు రగిలాయనేది యెంతో నిశితంగా పరిశీలించి చూస్తే తప్ప అర్ధం కాని విషయం! అప్పటికే ద్విజాతి సిధ్ధాంతం ప్రచారంలో వున్నా జిన్నా మొదట్లో దేశ విభజన వైపుకి అంత తొందరగా అడుగులు వెయ్యకుండా నిగ్రహంగానే వున్నాడనేదీ, దేశాన్ని విడిపోకుండానే వుంచి హిందూ ముస్లిం ఐక్యత కోసమే కృషి చేశాడనేదీ తెలిస్తే గానీ యెవరు నిజమైన ద్రోహులో తెలియదు!


1928 నాటికి గాంధీని ఒప్పించి "dominion status" ప్రకటన చేయించగలిగాడు నెహ్రూ. రెండు సంవత్సరాల లోగా భారత్ కు "dominion status" ఇవ్వకపోతే ఇక కాంగ్రెసు "complete independence" పిలుపు నిస్తుందనేది నెహ్రూ ప్రమేయంతో మోహన దాసు చేసిన ఆ బెదిరింపు సారాంశం! రెండు సంవత్సరాలు కూడా యెక్కువే ననిపించి మళ్ళీ తనే పూనుకుని గాంధీని ఒప్పించటంతో ఆ పరిమితి సంవత్సరానికి కుదించబడింది? ఇదివరకటి అన్ని దిమాండ్ల లాగే దీన్ని కూడా పట్టించుకోలేదు బ్రిటిషు వాళ్ళు. దానితో తానే అధ్యక్షత వహించి 29 డిసెంబర్ 1929లో "పూర్ణ స్వరాజ్" పిలుపు నిచ్చాడు. ఈ లాహోరు కాంగ్రెసు మహా సభ తర్వాత గురువు క్రమంగా వెనక్కి తగ్గి శిష్యుడికి దారి ఇవ్వడంతో 1935లో యేర్పడిన అర్ధంతర ప్రభుత్వాల నాటికి నెహ్రూ దుర్నిరీక్షమయిన మహానేతగా యెదిగాడు.


1930ల్లోనే రెండుసార్లు కలాత్తా మేయరుగా యెన్నికై పాలనా సంబంధమయిన విషయాల్లో అధ్బుతంగా రాణించిన సుభాష్ చంద్ర బోసు ఇతనికన్నా యెన్నో విధాల సమర్ధుడు. అయినా సరే అంతర్గత ప్రజాస్వామ్య సాంప్రదాయం ప్రకారం అఖండమయిన మెజార్టీతో పార్టీ అధ్యక్షుడిగా బోసు యెన్నికవడాన్ని జీర్ణించుకోలేక గురు శిష్యులిద్దరూ ఆ ఓటమిని అక్రమ పధ్ధతుల్లో గెలుపుగా మార్చుకున్న సన్నివేశం లోనే కాంగ్రెసు అప్పటికీ ఇప్పటికీ నైతికతకి యెంత గొప్పగా కట్టుబడుతుందో తెలిసిపోతుంది. ఆ ఇద్దరూ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అత్యున్నత ఆదర్శాలకి కట్టుబడిన వాళ్ళయితే బోసు రాజీనామా చేసి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి వుండేది కాదు. వాళ్ళే పార్టీ పదవులకి రాజీనామా చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళే వాళ్ళు!




1937లో "provincial states" నాటికే నెహ్రూ కాంగ్రెసు పార్టీలోనూ దేశపు సామాజిక రంగస్థలం మీదా ఒక ప్రజాసామ్య ప్రభువుగా అవతరించేశాడు?! అప్పటికే ప్రజలకి "కాంగ్రెసు అంటే ప్రభుత్వం" అని అర్ధమై పోయింది. పరిస్థితి యెలా వుందంటే, "కాంగ్రెసు యేం చెప్తే అదే శాసనం. నెహ్రూ యేం చెప్తే అదే కాంగ్రెసు చెప్తుంది.". అప్పటి నెహ్రూ వైభవాన్ని చూసి రష్యా వాడు కృశ్చేవ్ "Democratic Dictator" అనే బిరుదు కూడా ఇచ్చేశాడు!ఈ "provincial states"లో మత ప్రాతిపదికన హిందువులకీ ముస్లిములకీ ప్రత్యేక నియోజక వర్గాలు యేర్పాటు చెయ్యడానికి ఒప్పుకున్న మోహన దాసు దళితుల దగ్గిర కొచ్చేసరికి మాత్రం అరిభీకరంగా వ్యతిరేకించేశాడు! అప్పటి నుంచీ ఇప్పటి వరకూ గొప్పగా అనిపిస్తున్న ఈ కుహనా సెక్యులరిజంలో వున్న అసలైన మడత పేచీ ముస్లిములని ప్రధాన జీవన స్రవంతిలో కలవనివ్వకుండా చెయ్యటమే! హిందూ ముస్లిములని విడి విడిగానే వుంచి అవసరమయినప్పుడు కలుపుతూ మిగతా అప్పుడు విడిగా వుంచుతూ ఆడిన దొమ్మరాటలు వాస్తవంలో వ్యతిరేక ఫలితాన్నే ఇచ్చింది? నిజానికి ముస్లిముల్ని ప్రొత్సహించటానికి రాజమార్గం కాంగ్రెసులోనే చేర్చుకుని వారి వారి వుద్యమ స్పూర్తిని బట్టి పార్టీలో వున్నత స్థానానికి యెదిగేలాగా సహకరించటం చెయ్యాలి, కానీ ఆ తెలివయిన అభిప్రాయంతో ముస్లిము లీగుకి పోటీ పెడదాం, యెన్నికల్లో వోడిద్దాం అని చెప్పిన వాళ్ళు హిందూ మతతత్వ వాదులుగా ముద్ర వేయించుకున్నారు, అటు వేపు వున్న గాలి వెధవల్ని సంతృప్తి పరిచే వాళ్ళు ఆదర్శ నేత లయ్యారు. ఆ ప్రతిపాదనలు చేసిన వారికే వీళ్ళ కున్నవాళ్ళ కన్నా యెక్కువ మంది ముస్లిము స్నేహితులు వున్నారు! ఈ రకంగా హిందువులు ముస్లిములు విడివిడిగా వుండటం బాగా లాబించింది ఇంగ్ల్లీషు వాళ్లకే - "విభజించు - జయించు" అనే చాణక్యనీతిని మన మీదకే వొదలటానికి తోడ్పడింది!




1929-31 మధ్యలో ఇవ్వాళ మనం ఆదేశిక సూత్రాలుగా రాజ్యాంగంలో చదువుతున్న వున్నతాదర్శాల్ని - మత స్వేచ్చ,వాక్ స్వాతంత్ర్యం,భావ స్వాతంత్ర్యం,కుల మత వర్ణ ప్రాంతాల కతీతంగా చట్ట పరమయిన సర్వ సమానత్వం, మద్యపాన నిషేధం, అస్పృశ్యతా నిరోధం, భారత్ ను సోషలిష్టు మరియు సెక్యులరు దేశంగా నిలబెట్టటం వంటి కలగాపులగం కబుర్లన్నమాట - వండి వార్చేశాడు. తీరా తినడానికి కూర్చునేసరికి కొందరికి మింగుడు పడలేదు పాపం! అటు ముగ్గురూ ఇటు ముగ్గురూ చేరి ఆరుగురు ప్రముఖ నాయకులూ దాంతో కాలిబంతాట ఆడేసుకున్నారు! కుడి-రెక్క వాటంతో సర్దార్ వల్లభాయ్ పటేల్, డా.రాజేంద్ర ప్రసాద్, చక్రవర్తుల రాజగోపాలాచారి ఆడితే యెదమ-రెక్క వాటం గాళ్ళు సుభాష్ చంద్ర బోసు, మౌలానా ఆజాద్ సాయంతో నెహ్రూ ఆడాడు. సర్వశక్తులూ ఒడ్డి 1936లో డా.రాజేంద్ర ప్రసాద్ ని దించేసి తను అధ్యక్షుడై సామ్యవాద భావజాలానికి  మరింత వూపును తీసుకొచ్చాడు. ఇతని కన్నా అన్ని విధాలా సమర్ధుడయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో బోసు బయటికి వెళ్ళిపోవటం అప్పటి పరిస్థితుల్లో అడ్డు లేకుండా నడిచింది. స్వాతంత్ర్యానంతరం గాంధీ దుర్మరణాన్ని తన చేతగానితనంగా భావించుకుని కుంగి పటేల్ దూరమవడంతో తర్వాతి రాజకీయాల్లో అడ్డు లేకుండా జరిగిపోయింది. అదృష్టం తన్నాల్సిన చోట తంతే ప్రజాస్వామికంగా కూడా నియంతృత్వం వెలగబెట్టవచ్చుననే దానికి ఇతడే ఒక గొప్ప వుదాహరణ!




అప్పటిదాకా పైకి చెప్పకపోయినా గాంధీ వారసుడుగా అందరూ వూహిస్తున్న నెహ్రూని 1941 జనవరి 15న రాజాజీ కాదు, నెహ్రూయే నా వారసుడు అని గాంధీ ప్రకటించటంతో అధికారికంగా యువరాజ పట్టాభిషేకం జరిగిపోయింది!1942 ఆగస్టు 8న గాంధీ మొదటి సారి తీవ్రమయిన భాషతో క్విట్ ఇందియా తీర్మానాన్ని ప్రవేశ పెట్టాడు. భాష యెప్పుడయితే అంత తీవ్రంగా వుందో వెంఠనే ఇంగ్లీషువాళ్ళు మొత్తం నాయకు లందర్నీ ఖైదు చేసేశారు.ఇలా కాంగ్రెసు నాయకులంతా జైళ్ళలో వుండటం జిన్నా నాయకత్వం లోని ముస్లిం లీగుకి విపరీతమయిన ప్రోత్సాహాన్ని ఇచ్చింది! 1943 ఏప్రిలు కల్లా అప్పటిదాకా వాస్తవదూరంగా వున్న ప్రత్యేక దేశం చాలా దగ్గిర కొచ్చేసిందన్నంత బలాన్ని పెంచుకోవడం కేవలం కాంగ్రెసు నాయకుల అరెస్టు వల్లనే సాధ్యపడింది? కానీ కాలం గడిచే కొద్దీ సామాన్యులైన ముస్లిములకి గూడా జైళ్లలో వున్న కాంగ్రెసు నాయకుల పైన సానుభూతి పెరగడం, 1943-1944ల మధ్యన విరుచుకు పడ్ద బెంగాలు కరువు ముస్లిము లీగు ప్రభుత్వం ఖాతాలో పడటంతో ముస్లిము లీగు యెంత వేగంగా ప్రాభవం పెంచుకుందో అంత వేగంగానూ అపఖ్యాతికి గురయింది. జిన్నా అయితే పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకుని కాశ్మీరులో సెటిలయిపోయాడు! మరింత నాటకీయంగా 1944 మే లో అనారోగ్య కారణాలతో జైలు నుంచి విడుదలయి వచ్చిన మోహన దాసు ఈ శవానికి మళ్ళీ ప్రాణం పోశాడు?




ఈ మేధావి పనిగట్టుకుని అక్కడ కూసిందేమిటంటే యుధ్ధానంతరం ముస్లిములు అధికంగా వున్న ప్రాంతాల్లో ప్లెబిసైటు పెడదాం వాళ్ళు దేశం నుంచి విడిపోదామని అనుకుంటున్నారా లేదా అని తేలుచుకోవడానికి అని - మాటల్లో చెప్పకపోయినా అది పాకిస్తానుకు ఒప్పుకోవటమే, అదీ జిన్నా పరువు పోగొట్టుకుని దాని గురించి ఆశలుడిగి కూర్చున్న సమయంలో! జిన్నా వెంటనే చురుగ్గా కదిలి నాకలా కుదరదు పాకిస్తాను యేర్పాటుకు నికరమయిన హామీ కావాలనటంతో కధ అడ్డం తిరిగింది. బూదిని వూది నిప్పు రగిలించటం కోసమే జరిగినట్టు గాంధీ జిన్నాను కలిసిన ఈ సంఘటన దారా షికో పతనం తర్వాత ఈ దేశ చరిత్ర తిరగకూడని మలుపు తిరిగిన మరో దుర్ఘటన!? దాంతో జిన్నా రెట్టించిన బలంతో కదిలి అతి వేగంగా తన పూర్వపు ప్రాభవాన్ని సమకూర్చుకుని అసాధ్యమనుకున్న తన పాకిస్తాను కలని సుసాధ్యం చేసుకున్నాడు!


ఆ విధంగా ఈ దేశపు రాజకీయ రంగస్థలం మీద విధి ప్రదర్సించిన మహా నాటకం లోని పాత్రధారు లంతా యెవరి పాత్రల్లో వాళ్ళు స్థిరంగా కుదురుకోగా  1947 జూన్ 3న బ్రిటిష్ ప్రభుత్వం తొలిసారి విదుదల చేసిన ప్రణాళిక తో మొదలై 1947 ఆగష్టు 15తో శత్రు దేశపు  ప్రభుత్వం మధ్యవర్తిత్వం లోనే రెండుగా చీలుతూ స్వతంత్ర దేశంగా అవతరించింది మన భారత దేశం!మనకు చేసిన ద్రోహాలకి కత్తికో కండగా నరకాల్సిన శత్రువుని ఆత్మబంధువును సాగనంపినట్టు క్షేమంగా రేవులు దాటించి ఆత్మబంధువులుగా కలిసి మెలిసి బతకాల్సిన వాళ్ళు కుత్తుక లుత్తరించుకునే విధంగా ఆవిర్భవించినది శుభవేళ యెలా అవుతుందో నాకిప్పటికీ అర్ధం కాదు? పాలు పొంగించి గృహప్రవెశాలు చేసే సాంప్రదాయం గల భారత జాతి నవశకానికి వేసిన తొలి అడుగులో తగలబడుతున్న గృహాలని చూసింది, శవాల గుట్టల మధ్య నుంచి నడిచింది! మాతృభారతిని పంచామృతాలతో అభిషకించాల్సిన శుభవేళ జ్ఞాతి కలహాల నుంచి యెగసిపడిన రక్తనదీప్రవాహాలతో అభిషేకించాము - అది యేమి స్వాతంత్ర్యం?! శాంతికాముకుల మంటూ డప్పాలు కొట్టుకోవటమే తప్ప ఆ కలహాల్ని తగ్గించటానికి కళ్లముందు కొచ్చిన బంగారం లాంటి అవకాశాల్ని కాలదన్ని అప్పటి నాయకులు మూర్ఖంగా ప్రవర్తించడం  వల్లనే అలా జరిగిందని యెంతమందికి తెలుసు?




మొన్నటి రోజున ఆ మనిషి వేరే దారి లేకనే అలా చెయ్యలేదనీ వాస్తవికంగా ఆలోచించే వాళ్ళు ఇది తప్పు భవిష్యత్తులో ప్రమాదాన్ని తీసుకొస్తుందని హెచ్చరించినా వినకుండా మొండిగా దూసుకెళ్ళడం వల్లనే నిన్నటి రోజున ఆనాడు వాస్తవికంగా ఆలోచించిన వాళ్ళు చెప్పిన భీబత్సాలు జరిగినాయనీ తెలిసిన తర్వాత కూడా ఇప్పటి రోజున కొందరు ఇతన్ని గొప్ప దార్శనికుడని పొగుడుతున్నారంటే వీళ్ళని యెలా అర్ధం చేసుకోవాలి? ప్రపంచంలోని యే దేశచరిత్రలోనూ తన దేశానికి ఇన్ని సమస్యల్ని సృష్టించిన దేశాధినేత మరొకడు లేడు? జనంతో చీత్కరించుకుని గెంటించుకున్నవాళ్ళకి గూడా మహా వుంటే ఒకటో రెండో, మన వాడా - యెక్కడ వేలు పెడితే అక్కడల్లా ఒక కుంపటి రగిలించాడు! అదీ యెప్పటికి ఆరతాయో తెలియని రావణ కాష్టాలు!? అన్ని తప్పులు చేసినా ఇతడికి ఇంకా చప్పట్లు పడుతున్నాయంటే అది అతని అదృష్టం! అన్ని తప్పులు చేసినా ఇతడికి ఇంకా చప్పట్లు కొడుతున్నారంటే అది ఈ దేశపు మేధావుల దేబెతనం!


రాజ్యాంగ రచన 1935లో మొదటిసారి మంత్రివర్గాల్ని యేర్పరచినప్పటి నుంచీ జరుగుతూనే వుంది. మొదట్లో బ్రిటిష్ ఇండియాకు బయట వున్న రాజ్యాలకి రాష్ట్రాల హోదా ఇచ్చేసే ఫెదరల్ రాజ్యాంగానికి అనుకూలంగా వుందేవాళ్ళు నెహ్రూ తప్ప మిగిలిన నాయకులందరూ. కానీ 1946కి వచ్చేసరికి అది కాస్తా నెహ్రూ మాట వేదవాక్కుగా చెల్లుబడి అయ్యే కాలం గనక  ఆ రాజ్యాల నన్నిట్నీ విలీనం చేసి రిపబ్లికన్ తరహాకు రాజ్యాంగం 180 దిగ్రీలు తిరిగి నిజాముని బలవంతంగా లొంగదీసుకోవడంతో సగం పూర్తయ్యింది. కానీ బలవంతంగా లొంగదీసుకోవటం వల్ల వాళ్ళని పూర్తిగా శాంతపర్చటానికి కొన్ని హక్కులూ భరణాలూ పేరుతో ఖజానా మీద అదనపు ఖర్చు కూడా వచ్చి పడటంతో 1971లో ఇతని కూతురు ప్రధానిగా 26వ సవరణతో ఆ రాజభరణాలను రద్దు చేశాకనే ఆ పని పూర్తయింది. అంటే తెలంగాణా ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన సైనిక చర్యకి ప్రధాన కారకుడు నెహ్రూయే అన్నమాట! అప్పుడు యెదురు తిరిగిన మిగతా వాళ్ళు కూడా 1935లో తమకి రాజ్యాంగం వాగ్దానం చేసిన న్యాయబధ్ధమయిన హక్కు కోసమే పోరాడారన్న మాట!


1935లో యేర్పడిన "provincial autonomy"తో యెర్పడిన ప్రభుత్వాల్లో నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెసు అత్యధిక స్థానాల్ని గెలుచుకుని ప్రజల ఆమోదంతో తిరుగులేని అధిపత్యాన్ని చూపించగా జిన్నా అధ్యక్షతన ముస్లిం లీగు చాలా దారుణంగా దెబ్బ తినేసింది.ఈ దశలో నెహ్రూ మౌలానా అజాద్ లాంటి వుదార వాదిని భారత ముస్లిములకి ప్రతినిధిగా ముందుకు తీసుకొద్దామని చూసినా మోహన దాసు ఇంకా జిన్నాయే భారత ముస్లిములకి ప్రతినిధి అనే భ్రమ నుంచి బయటికి రాకుండా జిన్నాకే ప్రాధాన్యత ఇస్తూ వుండటంతో అదీ కుదర లేదు?!


జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఈ దేశపు భవితవ్యాన్ని శాసించటం మొదలు పెట్టిన 1947 ఆగష్టు 15 తదాది మోహన దాసు హత్యకి గురయిన 1948 జనవరి 30 వరకు ఈ దేశంలో యేదో ఒక మూల విధ్వంస కాండ జరగని రోజంటూ లేదు. యాస్మిన్ ఖాన్ అభిప్రాయం ప్రకారం  మహా మేధావి అయిన పటేల్ చాతుర్యం కన్నా దార్సనికుడుగా పేరు గాంచిన నెహ్రూ సమర్ధత కన్నా గాంధీ చావు - రెండు వారాల పాటు నాటకీయంగా ప్రదర్శించిన విషాద భరితమయిన వాతావరణమే - ఆ భీబత్సాన్ని ఆపగలిగింది? బతికుంటే అప్పటికే మాట చెల్లుబడి తగ్గిపోవడంతో కొంతకాలం తర్వాత అనామకంగా హతమారి పోయేవాడు కాస్తా చచ్చి గోడమీదబొమ్మై ఇంతకాలం గుర్తున్నాడు?!




ఇతని పేరుమీద చెలామణిలో కొచ్చిన మిశ్రమ ఆర్ధిక విధానం కొన్ని శతాబ్దాలకు ముందే చాణక్యుదు చెప్పాడు - గనులు, నదులు,లాభసాటిగా వుండకపోయినా ప్రజలకి వుపయోగపడేవి అన్నీ ప్రభువే సొంతంగా పర్యవేక్షించాలి అని!ఇతను ఆర్ధిక సలహాదారుగా యెంచుకున్న మహలనోబిస్ బొమ్మా బొరుసా లెక్కలు తేల్చే ప్రాబబిలిటీ మేథమేటిక్సు పండితుడే తప్ప ఆర్ధిక శాస్త్రంలో యేమాత్రమూ పరిజ్ఞానం లేనివాడు!ఫెల్డ్మాన్ మరియూ మహలనోబిస్ అనే ఇద్దరిలో ఫెల్డ్మాన్ ఏలెక్ట్రికల్ ఇంజనీరు, మహలనోబిస్ గాలివాటం లెక్కల పంతులు!అంటే లెక్క ప్రకారం నడవాల్సిన ఆర్ధిక వ్యవహారాలతో పాచికలు విసిరే తరహాలో జూద మాడాడు!జూదంలో యేం జరుగుతుంది?పాచికలు అనుకూలంగా పడినంత కాలం అధ్బుతంగా గడుస్తుంది,అవి కాస్తా మొరాయించటం మొదలయినాక ఆటగాడు ఒక్కొక్క మెట్టుగా దిగుతూ సర్వ నాశన మయ్యే వరకూ వొచ్చే ఆటలో నైనా గెలుస్తానేమో ననే ఆశతో ఆడుతూనే వుంటాడు. అట్లాగే మన దేశపు విదేశీ మారక ద్రవ్యం తాకట్టు పెట్టాల్సి వచ్చే వరకూ మనకి ఈ మనిషి మనమీద రుద్దిన దరిద్రగొట్టు ఆర్ధికం మీద వ్యామోహం వదల్లేదు!




విదేశాంగ విధానాన్ని చాణక్యుడి షాడ్గుణ్యాన్నించి తీసుకుంటున్నానని చెప్పి మళ్ళీ అందులో తన పైత్యం కొంత కలిపి పంచశీల అని పేరు పెట్టి ప్రపంచం మీద వొదిల్తే భాయి భాయి అన్న చైనా మొదటి శీల వూడగొట్టేసింది 1962లో!మిత్రుడికి శత్రువు మనకూ శత్రువు అనే చాణక్యుడి సూత్రాన్న్ని పట్టించుకోకుండా చైనాకు నచ్చని దలైలామాకి ఆశ్రయ మిచ్చాడు! అప్పటి దాకా నిమ్మళంగా వున్నవాడు హడావిడిగా చైనా సరిహద్దుల్లో పటాలాల్ని దించడం మొదలెట్టాడు. దాంతో మండి వాళ్ళు కాల్పులు జరపటంతో మొదలయిన ఇండో - చైనా యుధ్ధం భారత సైన్యాన్ని శత్రువు కూడా జాలిపడేటంత పరమ దయనీయమయిన స్థితిలోకి నెట్టేసింది?! ఈ విధంగా అన్నివైపుల నుంచీ సమస్యలూ విమర్శలూ పెరిగిపోవటంతో రాజీనామాకి కూడా సిధ్ధపడి మళ్ళీ తమాయించుకుని, కనీసం సమర్ధించుకోవడానికి కూడా వీలివ్వనంత స్పష్టంగా కంటికి కనబడుతున్న తాను చేసిన తప్పులకు తానే వగచి వగచి కృశించి కృశించి నశించాడు 1964 మే 27న!




అంతటితో యెక్కడ అందమయిన ఆడది కనబడినా అమాంతం అక్కడ వాలిపోయి కావిలించుకుని పులకించిన పరమ పాషండాల ప్రదర్శన సమాప్తమై పోయింది!కానీ అంగారం లోనూ శృంగారం లోనూ ఇతని కన్నా రెండాకులు యెక్కువే చదివిన ఇతని కూతురు భారత దేశపు రాజకీయ రంగస్థలం మీద మహమ్మారిలా విరుచుకుపడి ఒక చీకటి కాలాన్ని సృష్టించింది?
________________________________________________________
1    2    3    4    5    6                                     (తేదీల వివరాలు:వికీ పీడియా,చిత్రాలపీటిక:గూగుల్)

Friday, 21 November 2014

జీవం లేని భవనాలూ రోడ్లూ అధ్బుత సౌందర్య ప్రతీకలా? వాటికోసం జీవం తొణికిసలాడే పంటపొలాల్ని పాడుబెట్టాలా!

          ప్రతివాళ్ళూ నల్లని జీమూతాల్లాగా ఆకాశంలోకి సూదుల్లా దూసుకుపోయే భవంతులూ, హేమమాలిని బుగ్గల్లా నున్నగా వుండే తారు రోద్లూ అందంగా కనిపించి సింగపూరును అభివృధ్ధికి కొలమానంగా చూపిస్తారేమిటి?ఒక భవంతి మరొక భవంతికి సూర్యరశ్మిని మూసేస్తే పట్తపగలు దీపాలు వెలిగించుకోవాల్సి రావటం వైభవమా?ఇప్పుదు చంద్రబాబుకి సింగపూరు అనే పిచ్చి పట్టింది! ఆంధ్ర ప్రదేశ్ మొత్తాన్ని తర్వాత చేస్తాడేమో గానీ ప్రస్తుతానికి మాత్రం రాజధానిని సింగపూరును తలపించేలా తీర్చిదిద్ది తనేంటో చూపిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు!

     పిడుగులు యెత్తుగా వున్న భవంతుల్నే యెందుకు తాకుతాయో తెలుసా? విద్యుచ్చక్తి రెండు రూపాల్లో వుంటుంది - ఒకటి తీగల్లో ప్రవహించేది, రెండవది ప్రవహించకుండా ప్రతీ వస్తువుని ఆవరించుకుని వుండే స్థిర విద్యుత్తు.భవనాల్లో వాడే టన్నుల కొద్దీ లోహాలు ఆ భవంతుల చుట్టూ ఈ స్థిర విద్యుత్తుని తయారు చేస్తాయి.అదీగాక వాతావరణంలో పై పొరలకు వెళ్ళే కొద్దీ గాలి కూడా అయాన్లుగా విద్యుదీకరింపబడుతుంది, ఆక్సిజను శాతం తగ్గిపోతూ వుంటుంది! మామూలుగా స్థిరవిద్యుత్తు వల్ల ఎలెక్త్రొక్యూషన్ జరగదు, కానీ ఆకాశంలో వురుములు-మెరుపుల వర్షం పడేటప్పుడు మాత్రం తప్పకుండా ఈ స్థిర విద్యుత్తు క్షేత్రాలు పిడుగుల్ని ఆకర్షిస్తాయి! అలాంటి ప్రమాదాల గురించి సామాన్యులకి తెలియకపోవచ్చు,కానీ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ ప్రజలకి ఇలాంటి ప్రమాదాల గురించి చెపాల్సిన ప్రభుత్వాధికారులకి తెలియకనా - తెలిసీ రెయల్ ఎస్టేట్ వారికి లాభాలు చేకూర్చి తమ వాటా తాము తీసుకుంటూ సరిపెట్టెయ్యడానికా ఈ బహుళ అంతస్తుల భవనాల్ని ప్రోత్సహిస్తున్నారు?

         సింగపూరు అనేది అంతా కలిపితే మన మహానగరాలకు దాదాపుగా వున్నా ప్రత్యెకంగా ఒక ద్వీపంలా వుండటంతో అదే దేశం కూడా అయ్యింది.చేసేది దళారీ వ్యాపారం - ముడి చమురుని దిగుమతి చేసుకుని, శుద్ధి చేసి, దాన్ని తిరిగి విదేశాలకి అమ్మే దేశం. టూరిజం కూడా ఒక వనరుగా మారిన యెకానమీ. దాన్ని తీసుకొచ్చి వ్యవసాయం బలంగా వుండి జీవం తొణికిస లాడే ప్రకృతి సంపదతో కళ్లపండువుగా వుండే మన దేశంతో పోల్చి చూసే పిచ్చిపని ఈ దేశపు గొప్పతనం తెలియని మూర్ఖుడే చేస్తాడు! యెప్పుడూ వ్యవసాయమే చేస్తారా? అని అడగ్గానే యెప్పటికీ ముఖ్యమంత్రిగానే వుంటారా? అని అడగని ప్రజలు దొరికారు చంద్రబాబుకి?! పచ్చని ప్రకృతి దృశ్యాలతో కళకళ లాడే భూమిని ఆ పచ్చదనం నుంచి దూరం చేసి,దాని వల్ల పుట్టే ఆక్సిజన్ స్పర్శకి దూరమయి సిమెంటు కట్టడాలని పెంచుతూ కార్బన్ డయాక్సైడుని పుట్టించుకునే రాజధాని మనకి మేలు చేస్తుందా?

     కేవలం నోటిమాటలతో తప్ప నికరమయిన పత్రాలు ఇవ్వకుండా భూములు తీసుకోవటం రైతుల్ని మోసం చెయ్యటమె!ఇప్పుడు సంతోషంగా భూముల్ని ఇస్తున్న వాళ్లంతా ఇంతకుముందు అస్సలు రేటు పలకని భూములకి ఇది మంచి రేటు కాబట్టి ఇస్తున్నారు!కానీ ఇదీవరకే మంచి రేటుతో వుండి చక్కని పంటలు పండే పొలాలు వున్న రైతులకి మాత్రం నష్టమే. మొదట్లో ఇచ్చిన రైతులకి లాభం వుంటుందని సమర్ధించాను గానీ నికరంగా యే పత్రాలూ దఖలు పర్చే దాఖలాలు లేవని తెలిశాక మాత్రం నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. దీనికన్నా భూసేకరణ చట్టాన్ని ఫాలో అయ్యి ఆ దారిలో కేంద్రసహాయంతో రాజధాని కట్టడమే మంచిది. ఒకసారి ఇలాంటి పిచ్చి వేషాల తోనే అధికారం కోల్పోయిన వాడు మళ్ళీ అవే పిచ్చ వేషాలు వేస్తున్నాడు! విభజన జరిగాక కూడా అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రిగా వుండటం మెరుగు అనే భావనతోనే సందేహిస్తూనే బొటాబొటీ మెజార్టీ ఇచ్చారని తెలుస్కుంటే కళ్ళు కొంచెం వాస్తవాన్ని చూస్తాయి. రాజధాని విషయంలో కిరికిరి జరిగి పరువు పోగొట్టుకుంటే కాంగ్రెసుకి పట్టించిన గతినే ఇతనికీ పట్టించక తప్పదు!

      అసలు రాజధాని విషయంలో అస్మదీయులయిన పాత్రికేయుల ద్వారా లీకు లిచ్చి భూముల ధరల్ని పెంచకుండా తను గోప్యతని పాతించి వుంటే బాగుండేది! ఒక ప్రాంతాన్ని నిర్ణయించుకుని అతి తక్కువ కాలంలో చట్టబధ్ధమయిన పధ్ధతి లోనే భూ సమీకరణ చేసి వుండాల్సింది.ఇప్ప్పుడు కొత్తగా బయట పడుతున్న విషయాలన్నిటినీ చూస్తే ఇది రైతులకి అన్యాయం చేసి రియల్టర్లకి మేలు చెయ్యడానికే ఈ తరహా భూసేకరణ అనేది తెలుస్తుంది! తన గార్గేయ సిధ్ధాంతి వాస్తు సలహాలతో కాకుండా రాజధానిని అందరి ఆమోదంతో ముఖ్యంగా రైతులకి నికరలాభం చేకూర్చే విధంగా వుండాలి.

        ఒక వేళ సాంప్రదాయ బధ్ధంగా వెళ్లాలని అనుకున్నా ఇప్పుడు చెప్తున్న ప్రాంతం విషయంలోనూ కొందరు వాస్తు విరుధ్ధం అంటున్నారు.అసలు రాజధాని అనేది అందరికీ సంబంధించినది అయినప్పుడు అధికార పక్షం తన సొంత ప్రయోజకత్వానికి సంబంధించిన విషయంగా తీసుకోకుండా అఖిలపక్ష సమావేశం యేర్పరచి అందరి అభిప్రాయాలతో ముందుకెళ్ళటం అన్ని విధాలా శ్రేయస్కరం?!

Thursday, 20 November 2014

శ్రీమతే కచరా రమణ గోవిందో హరీశ్ కవితారకం మహత్!!!

          విడిపోక ముందు దక్షిణ భారతంలో నాలుగు బలమయిన భాషా సాంస్కృతిక మూలస్తంభాల్లో ఒకటిగా వున్న ఆంధ్ర ప్రదేశ్ యెంత భయానకంగా విడిపోయిందంటే అది జరిగిన తీరు చూసి అప్పటి దాకా ఈ రాష్ట్రం విడిపోగానే తామూ విడిపోదాం అని గోతికాడినక్కల్లా యెదురు చూసిన ఇతర రాష్ట్రాల్లోని వాళ్ళంతా మూతి కాలిన తెనాలిరాముడి పిల్లుల్లా యెక్కడి వాళ్ళక్కడ గప్ చుప్ అయిపోయారు!ఒకప్ప్పుడు చెన్నపట్నాన్ని వొదులుకోలేక అటువాళ్ళూ ఇటువాళ్ళూ కొంచెం గింజుకున్నా యెంత హుందాగా ఇరుపక్షాల వారూ వ్యవహరించారు!బిల్లుకి కోరం చాలకపోతే కొందరు తమిళులు కూడా ఆంధ్రావాళ్ళ పక్షాన వోటు వేసి గెలిపించడం కూడా జరిగిందని చదివాను.మొదటి దశలో రాజకీయంగా వూగిసలాడుతూ తలా ఒక మాటా మాట్లాడుతుంటే,"మీ ఆంధ్రావాళ్ళకి సిగ్గు లెదు" అని ఒక రైల్లో జరిగిన సంభాషణలో మిత్రుడైన ఒక తమిళ రాకజీయ వేత్త గద్దించి మరీ గట్టిగా పోరాడమని వుత్సాహ పరచిన సన్నివేశం గురించీ చదివాను.అందుకనే విడిపోయిన మరుసటి రోజు నుంచీ చెన్నై లోనూ ఇతర ప్రాంతాలలో వున్న తెలుగువారు అసలేమీ జరగనట్టుగానే యెక్కడి వాళ్ళు అక్కడ సాటి తమిళులతో నిన్నటి రోజున వున్నంత సాదరంగానూ వుండగలిగారు!

          మరి ఇప్పుడెందుకిలా జరిగింది? ఒక బుడ్డిమంతుదు తను గొప్ప నీతిమంతుడిలాగా పోజులు కొడుతూ మీరంతా దొంగలు, ద్రోహులు,తెలంగాణాకి అన్యాయం చేశారు  అని రెచ్చిపోతుంటే కాదు, మేము తెలంగాణా ప్రజలకి అన్యాయం చెయ్యలేదు అని చెప్పుకోవడానికి కూడా ముఖం చెల్లనంతగా రాజకీయాల్ని భ్రష్టు పట్టించిన అన్ని పార్టీల రాజకీయ నాయకులూ దీనికి కారణం!మరీ ముఖ్యంగా విభజన ఆఖరి దశలో అక్కడా ఇక్కడా అధికారంలో వుండి రెండు రాష్త్రాలకీ న్యాయం జరిగే హుందా అయిన పధ్ధతిని పాటించగలిగి వుండి కూడా ఒక పిట్టలదొర చూపించిన ముఫ్ఫయ్ సీట్ల అద్భుతాన్ని చూసి అతని ముందు సాష్టాంగపడి పోయి యూపీయే-3 అనే ఒక చెత్త ప్లానుని భుజానేసుకుని  ప్రజలతో సంబంధం లేని రాజ్యాధికారాన్ని ఆశించే అలవాటున్న నూట ముఫ్ఫయ్యేళ్ళ జంబుకం అధికారంలో వుండటం ఈ రెండు రాష్ట్రాల లోని సౌభ్రాతృత్వాన్ని కోరుకునే వివేకవంతులయిన తెలుగు వాళ్ళ దురదృష్టం!

      "అట్లెట్ల వొస్తది తెలంగాణా?" అని విన్నవాళ్ళు అంటే "ఇట్లనే వొస్తది తెలంగాణా" అన్నా, అట్లనే తెచ్చి చూపించినా అని మురుసుకునే ఇవ్వాల్టి వాహనాల పునః పునః రిజిస్ట్రేషన్ పండితుడు తెలంగాణా వుద్యమాన్ని యెక్కడ మొదలు పెట్టి యే దారుల్లో తిప్పి యెక్కడ నిలబెట్టాడో నిజంగా తెలంగాణా గడ్దని ప్రాణాధికంగా ప్రేమించే తెలంగాణా వాసులు అర్ధం చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇంతకు ముందు మాతృ రాష్ట్రం నుంచి విడిపోయిన రాష్ట్రాలు మొదట విడిపోవటానికి సభలో మెజారిటీ మైనారిటీ లెక్కలతో కొలిస్తే అంకెకి తక్కువే అయినా తమ శాసన సభలోనే విభజన ప్రతిపాదన చేసి ప్రతికక్షుల్ని కూడా వొప్పించి సోదర రాష్ట్రాలు రెండూ సాదరంగా విడిపోయాయని తెలిసి కూడా ఇక్కడ మేము అంకెకి తక్కువున్నాం మాకు న్యాయం జరగదు అని ఆర్టికిల్ మూడుని భుజానేసుకుని యెందుకు తిరిగాడు!ఆంధ్రోళ్ళని తిడుతూ విడిపోయే అమర్యాద కరమయిన పధ్ధతిలోనే తెలంగాణా తీసుకురావాలనే దరిద్రమయిన వూహ యెలా వచ్చిందో ఇతనికి నాకిప్పటికీ అర్ధం కావడం లేదు? దానికి తోడు అప్పుడు అధికారంలో వున్న ఇతర పార్టీల రాజకీయ నాయకులంతా తెలంగాణాకి సంబంధించి గందరగోళంలో వుండటమూ దీన్నించి తమకీ మైలేజీ నొల్లుకుందామనే కక్కుర్తిలో వుండటమూ ఈ పిట్టలదొరకి రెక్కలు మొలిచినట్లయింది! యెప్పుడు యెవడికి అధికారం దూరమయినా భుజానేసుకుని తిరగొచ్చుననే దుర్మార్గమయిన తెలివితో తెలంగాణా రాజకీయ నాయకులే తెలంగాణా వెనుకబాటు తనాన్ని అలాగే వుంచెయ్యటం కూడా కలిసొచ్చింది!వీళ్ళు చెప్పే అబధ్ధాల్ని అబధ్ధాలుగా నిరూపించలేని వాళ్ళు, కనీసం ఇతని ఈ అమర్యాదకరమయిన భాషకి కూడా గట్టిగా ప్రతిస్పందించలేని అసమర్ధులు రాజకీయ ప్రతికక్షులు కావటం మరింత హుషారు నిచ్చింది! దానితో ప్రపంచంలో మరే న్యాయపోరాటమూ జరగనంత దిక్కుమాలిన దారికి వుద్యమం సగర్వంగా కదిలి తెలంగాణా లోని సభ్యతాసంస్కారం గలవారు వ్యతిరేకించినా వుద్యమద్రోహులనే పేరుతో దహశుధ్ధికి గూడా తెగబడి ఆరోగ్యకరమయిన చర్చలకి వుద్దేశపూర్వకంగానే దూరంగా వుంటూ ఆఖరికి లోక్ సభ సభ్యులు మార్షల్స్ పని కూడా చెయ్యాల్సినంత దరిద్రమయిన పతాక సన్నివేశం వరకూ నడిచిన కధలో యే మలుపులో తెలంగాణా ప్రజల స్వాభిమానం ప్రతిబింబించిందో యెప్పుడో ఒకప్పుడు యెవరో ఒకరు చరిత్రకారులకీ పరమపురుషుడికీ జవాబు చెప్పి తీరాలి! తమ పార్టీకి సంబంధించిన రాష్ట్రస్థాయి నాయకుల కన్నా ఈ కోతల్రాయుడికి యెక్కువ ప్రాధాన్యత నిచ్చి ఈ మనిషి వొక్కడే మళ్ళీ కాంగ్రెసుని దేశమంతటా అధికారంలోకి తీసుకురాగలడని నమ్మిన డిల్లీ గాంక్రెసు దేశమంతటా పూర్తిగా హతమారి పోతే తప్ప ఆంధ్రావాళ్ళకి జరిగిన పన్నెండేళ్ళ సుదీర్ఘమయిన అవమాన కాండకి పూర్తి  పరిహారం లభించదు!

          నేనిక్కడ బ్లాగుల్లో "తెలంగాణా మేధావుల్లోని మేధావిత్వపు శాతం యెంత?" అని అడిగితే ఒక్కరూ ఇంత అని ధీమాగా చెప్పలేక పోయారు!"అబ్బో మేధావి గారు బాగనే కనిపెట్టిండు?" అని వ్యంగ్యాలు వాడేసి ఆకుకీ పోకకీ అందని జవాబు లేవో చెప్పేసి తప్పుకున్నారు."కబ్జా లు చెయ్యడం వ్యాపారం అనుకుంటున్నారా ఎంధి ? రామోజీ ఫిల్మ్ సిటీ లు , రాంకి లు , లాంకో ఎస్టేట్ లు , నార్నె ఎస్టేట్ లు ప్రపంచంలో యే విషయం కొథ గా కనుక్కొని వీళ్ళు అవ్వి సంపాదించారు" అని బాగానే గర్జించారు అప్పుడు!మరి రాష్ట్రం యేర్పడినాక ఆ వీరాధివీరులు మాట్లాడరేం?వారి హేట్ లిష్టులోని వ్యక్తుల్ని కబ్జాకోరులుగా నిరూపించి వెళ్ళగొట్టలేకపోయారేం?అవి కబ్జాలు అని వాళ్ళు ఖచ్చితంగా అంటే నీరజా మిశ్రా అనే ఒక స్త్రీ మాత్రం చెయ్యలేని అసమర్ధులుగా వాళ్ళూ వాళ్ళ ముఖ్యమంత్రే లెక్క కొస్తారు, అవునా కాదా?అప్పుడెప్పుడో కాళోజీ రెండున్నర జిల్లాల రెండున్నర కులాల పెత్తనం గురించి తూర్పార బట్టటం గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఇవ్వాళ మంత్రివర్గ సభ్యుల  కులాల దామాషా లెక్కల్తో చూస్తే తామివ్వాళ ఒకటిన్నర కులాల పెత్తనం కింద వున్నారని తెలియడం లేదా?తెలిసీ తెలియనట్టు అమాయకత్వం నటిస్తున్నారా?మరి నిన్నటి రోజున యే కుల వర్గ సమీకరణలతో ప్రభుత్వాలు యేర్పాటు చేసి తమని దోచేసారని విమర్సించారో ఈ రోజు ప్రభుత్వంలో అవే కుల వర్గాల పెద్దమనుషులు కొలువుదీరిన మంత్రివర్గం వారు కోరుకున్న కొత్తరకం తెలంగాణాను ఎట్లా తీసుకొస్తుంది? అట్టడుగున వున్న ప్రజల రాజకీయ పరిజ్ఞానంలో తేడా లేదు, అధికార యంత్రాంగంలో తేడా లేదు, ప్రభుత్వాధినేతల సంస్కారంలో తేడా లేదు, పరిపాలనకు పాటిస్తున్న చట్రంలో తేడా లేదు - కానీ భవిష్యత్తు మాత్రం ఇదివరకటి కన్నా విభిన్నంగా వుంటుందంటే నమ్మాలా!

             యాభయ్యేళ్ళ వేరుకుంపటి పైత్యం తర్వాత పన్నెండేళ్ళ మంకుపట్టు తర్వాత ఇప్పుడు తెలంగాణా యెలా వుంది? ప్రాధమ్యాలు తెలియని మయోఅయం,తను యెంత అమర్యాదగా వాగినా యెదటివాళ్ళు మాత్రం మర్యాద కొద్దీ వూరుకుంటుంటే అది అలుసుగా తీసుకుని మరింత రెచ్చిపోయే నోటి దురుసు ముఖ్యమంత్రి, యెటు చూస్తే అటు అంధకారం!అక్కడున్న మేధావుల్ని కదిలిస్తే -తెలంగాణాకు లేకుండా చేసిన విద్యుత్ ప్లాంట్లకు నాలుగింతలు భవిష్యత్తులో రాబోతున్నాయి. అప్పుడు తెలంగాణా అడిగే స్థితినుండి ఇచ్చే స్థితికి రావచ్చు కూడా.- అనే నవ్వాలో యేదవాలో తెలియని విచిత్రమయిన ఆలోచనలతో వున్నారు.ఇప్పటికే ముందు కాలానికి కూడా కొనేసుకుని అక్టోబరు 2 నుంచే నిరంతరాయంగా వాడుకుంటున్న రాష్ట్రానికి రేపెప్పుడో వీళ్ళిచ్చేదేంది? మిగులుతో విడిపోయి కూడా కరెంటు అడిగిన రైతుల మీదకి పోలీసుల్ని పంపించి తలలు పగలగొట్టిన రాష్ట్రం భవిష్యత్తులో మేడలు కడుతుందట!యెదటి వాళ్ళకి విందులు చేస్తుందట!

    మర్యాద నిచ్చిన మర్యాద వచ్చును!ద్వేష పూరిత ప్రసంగాల్తో తక్కువరకం మనుషుల్ని రంజింపజేస్తూ, ముందు చూపు - దొంగ చూపు అనే ప్రాసయతుల తిట్లు తిడుతూ తన వాచాలత్వానికి తనే మురుసుకుని నవ్వుకునే స్థాయి వ్యక్తిని సమర్ధించటానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పుడు తను మాట్లాడుతున్నది యెన్నికల ప్రసంగం కాదని తెలుసు.అవతలి మనిషి నుంచి తనకు హక్కుగా రావలసినదే అడుగుతున్నా అది మర్యాదకరమయిన పధ్ధతి కాదని తెలియకే అలా మాట్లాడవలసి వచ్చిందా?పదేళ్ళ క్రితం జరిగినాయని చెబుతున్న ద్రోహాల కధలన్నీ ఇదివరకే విప్పారు గదా, మళ్ళీ మళ్ళీ అవే తవ్వడం అంటే మీవైపు నుంచి అమర్యాదనే చూపిస్తారు, అయినా మేము మాత్రం మర్యాదనే చూపించాలనేది అతనీ మరియూ అతని పంఖాల భావమా?!అయినా ఒక సారి రిజిస్టర్ అయిన వాహనాన్ని రెండోసారి రిజిస్టర్ చెయ్యడం కుదరదనే మామూలు విషయం కూడా తెలియని ఈ చవట దద్దమ్మకి మరొకర్ని సన్నాసి అనే అర్హత వుందా?!

     యాబై అరవై యేళ్ళుగా తెలంగాణాకి ద్రోహం జరగడంలో తెలంగాణా రాజకీయవేత్తల ప్రమెయమే యెక్కువని అంత కాలం రాజకీయ జీవితం గడిపాక కూడా ఇతనికి నిజంగానే తెలియదా? ఈ బుడ్డిమంతుడు పెద్ద నీతిమంతుడిలా పోజులు కొడుతూ ఆంధ్రా రాజకీయ వేత్తల్ని మాత్రమే అంటున్నాను ప్రజల్ని కాదు అని యెంత సమర్ధించుకున్నా కొన్ని లక్షల కోట్ల మంది ముందు సభావేదికల మీద పచ్చి బూతుల్ని కూడా అవి బూతులు కాదని తెగబడి యెలా మాట్లాడ గలిగాడు?రాజకీయ వేత్తలు ఆకాశంలోంచి వూడిపడతారా?ఒక శాసనసభ నియోజకవర్గంలో లక్ష వోట్లు వుంటే లక్ష వోట్లూ ఒకరికే పడతాయా?పది మంది నిలబడితే పదకొండువేల వోట్లు యెవరికి వచ్చినా అతనే గెలుస్తాడు గదా!గెలిచిన వాడు తనకు వోటు వేసిన ఆ పదకొండు వేల మందికి మాత్రమే ప్రతినిధి అవుతాడా?అతనికి వోటు వెయ్యనివాళ్ళు నేను ఇతనికి వోటు వెయ్యలేదు గాబట్టి నాకితను ప్రతినిధి కాదు అంటారా?యెన్నికలు తెలంగాణాలో కూడా ఆంధ్రాలో జరిగినట్టే జరుగుతున్నాయా లేక మరోరకంగా జరుగుతున్నాయా! తెలంగాణా ప్రజలు  యెన్నుకున్న రాజకీయ నాయకులే తెలంగాణా బాగుని పట్టించుకోకపోతే ఆంధ్రా ప్రాంతపు రాజకీయ నాయకుల్ని తిట్టడ మేమిటి?

     ఇప్పుడు బాబు మీద నన్నూ తెలంగాణానీ బద్నాం చెయ్యాలని చూస్తున్నావు అని రెచ్చిపోతున్నాడు గానీ ఇలాగే విడిపోవాలని తను వేసిన యెదవ ప్లాను వల్ల తనూ తెలంగాణా ఇప్పటికే బద్నాం అయిపోయారని తెలుసుకోలేకపోతున్నాడు?! ఆంధ్రాని కేంద్రం 24X7 విద్యుత్తు ప్లానుకి పైలెట్ రాష్ట్రంగా యెన్నుకోవడాన్ని కూడా స్నేహితుడు ఇచ్చిన గిఫ్టు లెండి అని వంకర కూత కూస్తున్నారు గానీ మిగతా రాష్ట్రాల వాళ్ళు అలా అనుకోవడం లేదు.ఒక బెంగుళూరు నివాసి - When compared with loss due to bifurcation. It is big zero....A P people has got better aluminum plate there as Telangana was gifted by Golden plate with platinum studded spoon that was congress decision..where as the power giving is just like giving an water for thirsty.person - అంటున్నాడు!అతనొక్కడే కాదు అక్కడే కామెంటిన ఇతర్లు, అక్కడా ఇక్కడా అనేముంది ఈ విభజన గురించి మాట్లాడుకునే అందరూ అదే అభిప్రాయంలో వున్నారు. ఇప్పుడు అందరూ ఆంధ్రావాళ్ళ పట్ల జాలితోనూ సదభిప్రాయం తోనూ వుంటే తెలంగాణ వాళ్ళ పట్ల యే అభిప్రాయం వున్నట్టు?హైదరాబాదు నుంచి వాళ్లకి రావలసిన ఆదాయంలో చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఆంధ్రా వాళ్ళని కట్ట్టుబట్టల్తో తరిమేసిన దుర్మార్గులుగా ప్రపంచం ముందు నిలబడ్డారు పన్నెండేళ్ళ పాటు మాకన్యాయం జరిగిందని మహోద్యమం చేసిన తెలంగాణా వాళ్ళు!

       ఒకప్పుడు రాష్ట్రం మొత్తాన్ని చీకటి గుయ్యారంగా చేసి కేవలం హైదరాబాదు లోనే అభివృధ్ధి నంతా పోగేసిన చంద్రబాబు ఇవ్వాళ్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదమూడు జిల్లాలకీ అభివృధ్ధిలో భాగం కల్పించే దిశగా అడుగులు వేస్తూ పాత తప్పుల్ని పునరావృతం చెయ్యకుండా జాగ్రత్త పడుతున్నాడు!అసలే జీమూతం లాంటి రుణమాఫీ రిజర్వ్ బ్యాంకు ప్రతిపక్షం లాగ తయారయి మోకాలడ్డం పెట్టేసరికి భల్లూకంలా తయారయినా తన చాణక్య ప్రజ్ఞతో బ్యాంకర్లని బుజ్జగించి అంచెలంచెల మోక్షం లాంటి కష్టమయిన దారిని యెన్నుకుని ప్రస్తుతానికి బరువు తగ్గించుకుని వూపిరి పీల్చుకున్నాడు!రిజర్వ్ బ్యాంకు వాదన కూడా కరెక్టే మరి, ప్రభుత్వాలు తమ బడ్జెట్లలో యెక్కువ శాతం ఇలాంటి అనుత్పాదక వ్యయాలకి కేటాయిస్తే సంస్థాగతమయిన పెట్టుబడుల్లో కోత పెట్టాల్సి వస్తుంది గదా!అంత కాలం శ్రమించి పెంచిన రాజధానిని వదిలి వచ్చిన కొత్త రాష్ట్రం మళ్ళీ రాజధాని కట్టుకోవడానికి కూడా నోటి మాటల నీటి మూటల్ని అద్దంలో చూపించడమే తప్ప నికరమయిన వాగ్దానం చెయ్యలేదు నికృష్టపు కాంగ్రెసు! పాత ప్రభుత్వం చేసిన గ్యారెంటీ ఇవ్వని వాగ్దానాల్ని ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తుందో లేదో తెలియని అయోమయం కొంతకాలం గడిచి,ఇచ్చినా డబ్బు రూపంగా బ్యాంకులో వెయ్యం రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి సంబంధించి వేసే ప్రణాళికల్లో సాంకేతికంగా సాయం చెయ్యడమే తప్ప అని తేల్చి చెప్పడంతో పరిస్థితు లన్నీ మొదట కంగారు పెట్టినా రాజధానికి పెట్టే ఖర్చు నుంచే రాజధాని అవసరాలకీ ప్రభుత్వ నిర్వహణకీ అవసరమయిన రెవెన్యూ రాబట్టుకునే విధంగా చంద్ర బాబు వేసిన మాస్టర్ ప్లాన్ నిజంగా అధ్బుతమే!దుర్మార్గమయిన విభజనతో సమస్యల్ని మూటగట్టుకుని లోటుతో వచ్చిన రాష్ట్రాన్ని కూడా గతాన్ని తిట్టుకోకుండా భవిష్యత్తులోకి పరుగులు పెట్టిస్తున్నాడు ఆంధ్రా ముఖ్యమంత్రి.

      కల్లు కాంపౌండ్లు తెరిపించటానికీ బతుకమ్మను స్టేట్ ఫెస్టివల్ గా చెయ్యటానికేనా తెలంగాణాను తెచ్చింది అని చిన్న కుర్రాడు కూడా జోకులేస్తున్నాడు,ఇప్పటి వరకూ తెలంగాణా ప్రభుత్వం నిక్కచ్చిగా అంటే యే కోర్టుతోనూ చివాట్లు తిని వెనక్కి తగ్గేలా కాకుండానూ సహం లోనే గెజెట్టుల ద్వారా కేంద్రానికి దఖలు పర్చెయ్యకుండానూ చేసినవి ఆ రెండే మరి?!1956 స్థానికత అనంగానే కోర్టు, "నువ్వు ఈ దేశంలోనే వున్నావా,అర్జెంటుగా ఈ వాదన ఆపు,లేదంటే చీరి చింతకి కడతాన్రరేయ్!" అనేసింది - నాలిక్కర్చుకుని వెనక్కి తగ్గాడు!నిజంగా అన్నిటికీ అది గానీ అమలు చేస్తే తనే ఇప్పుడు ఆంధ్రాలో వున్న విౙనగ్రానికి పోయి కాందిశీకుడిలా బతకాలి మరి?లార్సన్ అండ్ టబ్రో అనే ఒక కంపెనీ పరమ ఘోరమయిన కామెంట్లతో నేను వీళ్ళతో పనిచెయ్యలేను ఈ బోడి కాంట్రాక్టు నుంచి తప్పుకుంటున్నానహో అని టముకేసినా యేమి పీకాడు? అత్త తిట్టినందుక్కాదు గానీ తోడికోడలు నవ్వినందుకు కోపగించుకుని ఆ తోడికోడలు నోటికి ప్లాస్టరేసి సరిపెట్టుకున్నాది తెలంగాణా పెబుత్వం! మరీ పరువు పోకుండా సమయానికి కేంద్రం గెజెటు ద్వారా ఆ కార్యక్రమాన్ని తను దఖలు పర్చేసుకుంది గానీ లేకపోతేనా? ఒకసారి వాహనాల చట్టంప్రకారం రిజిస్టరు చేయబడిన వాహనానికి రెండవ రిజిస్ట్రేషన్ అనే చెత్త వూహ యెలా వచ్చింది?వాహనాల చట్టంలో యేమయినా అస్పష్టత వున్నదా? లేదే, కోర్టు ముక్క చివాట్లు పెట్టింది గదా? అప్పటికీ వెనక్కి తగ్గకుండా వాహనం మీద వుండే నంబరు ప్లేటు మీద మాత్రం మారిస్తే చాలుననే మొదటిదాని కన్నా చెత్త వూహ యెలా వచ్చింది?హత్యలూ దోపిడీలూ చేసి పారిపోయే వాళ్ళు చేసినట్టు యే వాహన యజమాని అయినా తప్పు నంబరు వాహనం మీద వేస్తే ట్రాఫిక్ పోలీసులు చూస్తూ వూరుకుంటారా? అలా వూరుకోమని ప్రభుత్వాధినేతగా లిఖిత పూర్వకంగా పోలీసులకి ఆదేశాలు జారీ చెయ్యగలడా?తోటకూర నాడే చెప్పకపోతివేమే అని తల్లిని చెంప పగలగొట్టిన వాడిలాగా వాహనాల రీ రిజిస్ట్రేషన్ అన్నప్పుడే ఈ తెలివితక్కువ దద్దమ్మను వొదిలించుకోకపోతిమే అని తెలంగాణా ప్రజలు తమ చెంపలు తామే వాయించుకోవాల్సి వస్తుందేమో రేపటి రోజున!

          ఈ వెర్రిమొర్రి ఆలోచన లన్నిటి వెనకాలా తనలోనూ తన పంఖాల్లోనూ వున్న ఆంధ్రావాళ్ళ మీదున్న ద్వెషమే కారణం!పింగళి సూరన కళాపూర్ణోదయం అవతారికలో వాళ్ళ కుటుంబాల్లో విన్న ఒక తమాషా కధ చెప్తాడు. ఆ కధకో పేరు కూడా వుందేదట, "పింగళి వారి పేకి" అని.వీళ్ళ తాత గారి కాలంలో ఒకాయన పని చేసుకుంటుంటే హఠాత్తుగా ఒక ఆడమనిషి వచ్చి నాకూ పని చెప్పు చేస్తానని తగులుకుందట. తీరా పని చెప్పబోయే ముందు ఒక కండిషన్ పెట్టింది, "నేను ఆపకుండా పని చెయ్యగలిగేలా చెప్పాలి,నాకు చెయ్యడానికి పనిలేని మరుక్షణం నిన్ను మింగేస్తాను" అని!ఆ మహానుభావుడు తెలివయిన వాడు అవటంతో వ్యవసాయప్పన్లన్నీ తనతోనే లాగించాడు!కానీ ఆరాత్రి మాత్రం అనుకున్నట్టు జరగలేదు? మనిషి రూపంలో వుండటం వల్లనో మరెందుచేతనో గానీ దానికీ నిదరొచ్చిందో యేమో, రాత్రి మంచి నిద్రలో దీపం కళ్ళల్లో పడుతుంటే ఆ నిద్రపోతున్న దానికి కొంచెం పక్కకి జరమన్నాడు. పని చెప్పాక అది యెలా చేస్తుందో చూసి గుండె గుభేలు మన్నంత పనయ్యింది?! యెక్కడ పడుకున్నది అక్కణ్ణించే నాలిక పొడుగ్గా సాగించి నాలికతో పక్కకి తోస్తున్నది. అప్పటిదాకా ధైర్యంగా వుండి యేదో అనుకున్న పెద్దమనిషి ఇదేదో మరీ ప్రాణాంతకమయిన పిశాచమని తెలిసి వొదిలించుకుందామని చూస్తే "నా పూస నాకిస్తే వెళ్తా" నందట!ఆ పూస కధేమిటని చూస్తే పని మధ్యలో యేదో పూస కనబడితే బావుందని జేబులో వేసుకున్నాడు, అది ఇచ్చాడు - ఆ పిశాచం వొదిలింది!ఈ ఆంధ్రా ద్వేషం అనే కల్వకుర్తి వారి పేకి గూడా అంతే- దీన్ని వొదిల్తే రాజకీయంగా తను చస్తానని భయపడుతున్నాడు, వొదలనంతకాలం మైండు సరిగ్గా పని చెయ్యక ఇలాంటి తిక్కపనులే మళ్ళీ మళ్ళీ చేస్తూనే వుంటాడు!

    నిన్నటి నుంచి ఈరోజుకి ద్వేషమనే విత్తనం నాటి అబధ్ధాలు,అమర్యాద,అనుమానాలు అనే దినుసుల్ని యెరువుగా వేసి ఒక విషవృక్షాన్ని పెంచుతూ ఇవ్వాళ్తి మలుపులో నిలబడ్డారు.మేము అబధ్ధాలు ఆడామా అని అదిరిపోతారేమో,సాక్ష్యం చూపిస్తాను.ఆంధ్రాలో రుణమాఫీ గురించి పెద్ద తెలిసినట్టు యేం వాగాడు?ఇంతవరకూ రైతులకి ఒక్క రూపాయి ఇవ్వలేదు అని ఆంధ్రా ముఖ్యమంత్రి మీద చెలరేగిపోయాడు.ఈ మనిషి ఇలా వాగిన తెల్లవారే సరికి అప్పటికే సిధ్ధంగా వున్న రుణమాఫీ వివరాల్ని ఆన్ లైన్లో పెడుతున్నాం చూసుకోండి అన్నాడు ఆంధ్రా ముఖ్యమంత్రి! చూసి తేల్చుకుంటాడా తేలు కుట్టిన దొంగలా వూరుకుంటాడా? ఒక అబధ్ధాలకోరుని అబధ్ధాల కోర్లు మాత్రమే సమర్ధించుకుని మెచ్చుకోగల్గుతారు! ఈ అబధ్ధాల కోరు -  ప్రైవేటు కర్మాగారమైన హిందుజాలను బెదిరించి తెలంగాణాకు అందించ వలసిన కరెంటు ఆపాడు - అని చంద్రబాబు మీద అభాండాలు వేస్తున్నాడు! దేశమంతటా విస్తరించాలనుకునే ఒక వ్యాపారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడని తన వ్యాపారాన్ని కొత్త శాఖలు తెరిచి విస్తరించుకోకుండా ఆగిపోతాడని ఒకడంటే నమ్మేవాళ్ళు చెవిలో పువ్వు పెట్టుకున్నపిచ్చివాళ్ళయినా అయివుండాలి అన్నవాడికి పంఖా లయినా అయి వుండాలి?

          ఒకే నగరంలో ఒకే భవనంలో పక్క బ్లాకులోకే వెళ్ళి పత్రికా సమావేశంలో కక్కిన ముందుచూపు-దొంగచూపు అనే ప్రాసయతుల తిట్లు ముఖాముఖిగానే కక్కే వీలు వుంది కదా?ఆంధ్రా ముఖ్యమంత్రి కూడా యెప్పటించో పిలుస్తూనే వున్నాడు గదా ఇలాంటివన్నీ తేల్చుకుందామని. తన రాష్త్రానికి న్యాయం జరిపించుకోవడానికి పోట్లాడి అయినా సాధించుకు రమ్మనే గదా అందరూ అనేది,కానీ అమలాపురంలో చెయ్యాల్సిన పని ఆముదాలవలసలో చేస్తున్నాడు తెలంగాణా ముఖ్యమంత్రి?!అధికారంలోకి వొచ్చినప్పటి నుంచీ చర్చలకి రమ్మని పిలుస్తున్నా ముఖం చెల్లక తప్పించుకుని తిరుగుతూ అమలాపురంలో చెయ్యాల్సిన పనిని ఆముదాల వలసలో చేస్తే యేమి ప్రయోజనం?

       నిన్నటి నుంచి ఈ రోజుకి ఒక చైన్ రియాక్షన్లో భాగంగా నడిచి ఇక్కడికి వచ్చారు.ఈ చైన్ రియాక్షన్ ఇలాగే కొనసాగితే రేపు యెలా వుంటుందో వూహించలేమా?ఈ దారిలో వెళ్తే ఆ మూడు పార్టీలూ మిమ్మల్ని కార్నర్ చేసి తెలంగాణా వొస్తే చాలుననే విధంగా మిమ్మల్ని మెంటల్ గా ప్రిపేర్ చేసే అవకాశం వుందనీ, అలా తెలంగాణాకి అన్యాయం జరిగే ప్రమాదం వుందని యెప్పుడో "ధర్మమేవ జయతే" బ్లాగులో కామెంటు వేసాను! కానీ అది పబ్లిష్ కాలేదు.ఒక వ్యక్తి విననప్పుడు మిగతా వాళ్ళు మాత్రం యేమి వింటారులే అని నేనూ ఇంకెక్కడా వెయ్యలెదుకానీ  ఇప్పుడు చూశారుగా నా అంచనా యెలా నిజమయిందో! ఒక చైన్ రియాక్షన్ మొదలయితే దాని నడక ఆ రకంగానే వుంటుంది.వేరే ఫలితం రావాలంటే ఆ చైన్ రియాక్షన్ దిశని మార్చాలి.అప్పుడు నేను వూహించిన నాలుగు దశల్లో రెండు పూర్తయి మూడో దశలో వుంది ఇప్పటి తెలంగాణా! ఇప్పటి తెలంగాణాలో పందితరాయలు వెక్కిరించిన తరహాలో నడుస్తాంది రాజ్యం!ఒకప్పుడు ఇందిరయే ఇండియా, ఇండియాయే ఇందిర అనేరకం కాంగ్రెసోళ్ళ మాదిరి కేసీఆరే తెలంగాణా, తెలంగాణానే కేసీఆరు అనే మూర్ఖులు పెరిగారు!రెచ్చిపోయి దుర్మార్గాలు చెయ్యడం ఒక రకం, కానీ పిచ్చిపుల్లయ్య లాగా ప్రవర్తించినా సమర్ధించుకొస్తున్నారే?!తెలంగాణా ప్రజలకి విసుగుపుట్టి ఆపమనాల్సిందే తప్ప ఆటగాడు మాత్రం అనంతకాలం వరకూ ఇదే రకంగా ఆడినా విసుగు దరిచేరనివ్వని విక్రమార్కుడే - మరి తెలంగాణా ప్రజల భవిష్యత్తు యేంటి?!


శ్రీమతే కచరా రమణ గోవిందో హరీశ్ కవితారకం మహత్!!! 

Tuesday, 11 November 2014

కమలమే సకలం కావాలి అంటున్న మోదీ దూకుడును ఆపడ మెట్లా?ఇప్పటికీ వెనకపడిన కులాల వాళ్ళు ఇక ముందుకు రావడ మెట్లా!

               "చుండూరు నరమేధం" - యేమాత్రం సంస్కారం వున్నా సరే కులాలు,మతాలు,ప్రాంతాల కతీతంగా అందర్నీ కదిలించింది!ప్రతివారూ చనిపోయిన వారి పట్ల సానుభూతి చూపించారు.దోషులకి శిక్ష పడాలని మనస్పూర్తిగానే కోరుకున్నారు.అది మనుషుల మనసుల్లో వుండాల్సిన ఆదర్శవంతమయిన ఆలోచనలు ఇంకా వున్నాయనే దానికి సాక్ష్యం.కానీ వాస్తవంలో అలా జరగలేదు.ఆదర్శాలు అన్నం పెట్టవు."సూపు లేటి సేత్తాయి?సాపుగా సచ్చూరుకుంటాయి!" - అన్నాడో కవి?! దోషులు శిక్ష నుంచి జారిపోయారు! బెనిఫిట్ ఆఫ్ డవుట్ అనే మెలిక చాలా నిర్దాక్షిణ్యంగా అడ్డు పడటం వల్ల పట్టపగలు వెంటాడి మరీ హతమార్చిన వాళ్ళుగా అందరూ చూసి గుర్తు పట్టగలిగిన వాళ్ళని కోర్టులూ చట్టాలూ మాత్రం గుర్తు పట్టలేక పోయాయి?

               అసలు చుండూరులో జరిగిందేమిటి?మొదట యుధ్ధోన్మాదంతో చెలరేగిపోయి యెవరు యెంత చెప్పినా యుధ్ధం ఆపకుండా మొండిగా వున్న జపాన్ అమెరికా ఆఖరి అస్త్రంగా వేసిన లిటిల్ బాయ్ దెబ్బకి తునాతునకలై అంతా అయిపోయాక  సానుభూతిని పొందినట్టు చుండూరు నరమేధం చరిత్ర కూడా ఇప్పటి హతులు ఒకప్పుడు కామాతురులుగా ఇప్పటి నేరస్తులు ఒకప్పుడు మర్యాదస్తులుగా వుండి - కాలం ఒకే ఒక క్రూరమయిన సంఘటనతో వాళ్ళ స్థానాల్ని గుర్తు పట్టలేనంతగా మార్చి చూపిస్తున్న క్లైమాక్సు లేని సినిమా! సినిమా అనేది యెంత శక్తివంతమయిన సాధనమైనా దాన్ని వాడకూడని విధంగా వాడితే సమాజానికి యెంత చెడు చెయ్యగలదనే దానికి చుండూరు నరమేధానికి బీజాలు సినిమా హాల్లోనే పడినాయనేది నిలువెత్తు సాక్ష్యం! బియ్యే లిట్టు డిగ్రీని చూపించుకుంటూ సినిమాల్లో ఆ ప్రబంధాల ప్రభావంతో స్త్రీసౌందర్యాన్ని ఆపాదమస్తకం(ఆ బెత్తెడు జాగాని మాత్రం యెందుకో వొదిలేసారు?) కనుల పండువుగా చూపిస్తూ తెల్లని చర్మం,నున్నని చెంపలు,సన్నని నడుం వంటివే సౌందర్యానికి గుర్తు అని కృత్రిమ సౌందర్య సాధనాల విక్రయాలను పెంచగలిగిన కళాఖండాల్ని వండి వార్చిన రసికేంద్రుదూ అతని అంతేవాసులూ ఈ కేసులో అసలు ప్రస్తావనకే రాకపోయినా వాళ్ళూ ముద్దాయిలేనని యెంతమందికి అర్ధమయింది!

        ప్రభుత్వ పధకాల వల్ల కొంతా మారిన వుత్పత్తి సాధనాల వెసులుబాటు వల్ల్ల కొంతా హఠాత్తుగా ఆర్జనపరులయిన కుర్రాళ్ళకి మాకూ అలాంటి పెళ్ళాలు కావాలని అనిపించడం చాలా సహజంగా జరుగుతుంది. కానీ చుట్టూ చూస్తే తమ లాగే యెండకి యెండి వానకి తడిసి కూలిపనులకి తిరుగుతూ కావురేసుకు పోయిన తమ కుటుంబాల్లోని నల్లపిల్లల కన్నా అదే సినిమా హాల్లో  ఆ సినిమా కవులే వర్ణించినట్టు జాం పళ్ళ లాగానూ యాపిలు పళ్ళ లాగానూ కనబడే పెద్ద కులాల ఆడపిల్లలు వాటంగా కనబడ్డారు?మనసుకు నచ్చిన వాడికోసం పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని మేడలు దిగివచ్చి నిరుపేదని వలచే కావ్యనాయికలే వాళ్ళల్లో కనబడ్డారు గానీ "అన్నయ్యా, ఆ మాలొడు నాకు లవ్ లెటర్ రాశాడు, ఓ పట్టు పట్టరా" అనే అహం ఆ పెద్దకులాల ఆడపిల్లల్లోనూ వుంటుందని తెలుసుకోలేకపోయారు -  కనబడే అందాల్ని మాత్రమే చూసి మతి భ్రమించి వుజ్జయిని రాకుమారిని అలవోకగా పట్టేద్దామనుకున్న పాపం పసివాళ్ళు!

           ఈ మొత్తం భారతదేశపు సమాచార సాధనాల్లో హడావుడి చేసేవాళ్ళలో గానీ, సమాజాన్న్ని ప్రభావితం చెయ్యగల రాజకీయ రంగంలో చెలామణీలో వున్న నాయకమ్మణ్యులలో గానీ,జరిగిన నేరానికి దోషుల్ని శిక్షించే అధికారమున్న న్యాయస్థానాల్లో తమకు డబ్బులొచ్చే కేసుల్లో తిమ్మిని బమ్మినీ బమ్మిని తిమ్మినీ చెయ్యగలిగిన లాయరుమ్మణ్యులలో గానీ సమస్య మూలాన్ని తెలుసుకుని నిక్ష్పక్షపాతమయిన తీర్పుని తెచ్చి మళ్ళీ అలాంటివి జరక్కుండా చేసే సమర్ధవంతమయిన పరిష్కారాన్ని చూపగలిగిన మేధావి ఒక్కడు కూడా లేడు?! కమ్యునిష్టుల్ని చూస్తే బ్రాహ్మణాధిపత్యం, అగ్రవర్ణ దురహంకారం, వర్గపోరాటం లాంటి - బాధితులకి అర్ధం కానివీ పీడకుల దగ్గిర పనిచెయ్యనివీ అయిన - చెత్తమాటల్తో రెచ్చిపోతుంటారు? అక్కడ జరిగింది మాలవాళ్ళ మీద కమ్మవాళ్ళు దాడి చెయ్యటం, మధ్యలో బ్రాహ్మణు లేమి చేశారు? ఒకవేళ మా కులం యెక్కువా మీకులం తక్కువా అనే సూత్రాలు చెప్పింది బ్రాహ్మణులే అనుకుందాం, ఆ  బ్రాహ్మణులు చెప్పినది మాలలూ మాదిగలూ కూడా వొప్పుకోవడం వల్లనే గదా ఇంతగా తమ మీద దొపిడీ జరుగుతున్నా ఒక్కటిగా కలిసి పోరాడకుండా మాల మహా నాడు, మాదిగ దండోరా అని వేరు కుంపట్లతో వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుంటున్నది?

        చుండూరు నరమేధానికి బలయిన వాళ్ళకోసం పోరాడుతున్న వుద్యమకారులకి వారి సొంతవర్గాల్లోనే యెంతమంది గట్టిగా నిలబడి మద్దతు ప్రకటించారు?యెవరి స్వార్ధాల కోసం వారు యెవరి లెక్కలు వారు వేసుకుంటూ తమ కులానికి మరింత రాజకీయ ప్రాతినిధ్యం పెంచుకోవడానికి పోరాడుతున్నాం అని చెప్తూ కులసంఘాలు పెట్టి వాటి చాటున సొంత వ్యవహారాల్ని చక్కబెట్టుకోవటం వాళ్ళు కూడా చేస్తున్నప్పుడు  యెదటివాళ్ళకి మాత్రమే కులపిచ్చిని అంటగడితే అది పోట్లాటకీ కాట్లాటలకీ పనికొస్తుందే తప్ప అసలు రొంపి నుంచి బయట పడెయ్యదు గదా!

           ఒకచోట అన్యాయం జరిగినప్పుడు దానికోసం జరిగే పోరాటాల్నీ పై స్థాయిలో జరిగే పైరవీ రాజకీయాల్నీ పక్కన బెట్టి సమాజంలో వున్న స్థితిని చూస్తే మాల కులస్థులు మాదిగ కులస్థుల్ని చిన్నచూపు చూడ్డం చాలా మామూలుగా జరిగిపోతూనే వుంది!నేనొక సాక్ష్యం చూపిస్తాను. మా ఫాదర్ రాజకీయాల్ల్లో తిరిగిన మనిషి. మావూరి మాలపల్లిలో ఆయన యేం చెప్తే అది వేదవాక్కు. అంత గురి వున్నచోట సొంత సంగతులు కూడా చెప్పుకుంటారు కదా! ఒకసారి ఒకతను అలాంటి సలహా కోసం వచ్చాడు.సమస్య ఇదే:వాళ్ళబ్బాయి మాదిగ కులస్థురాలయిన అమ్మాయిని ప్రేమించాడు, ఇతనికి అది ఇష్టం లేదు -  ఈ కులం ప్రాతిపదిక మీదనే, మా ఫాదర్ని ఆ కుర్రాడికి నచ్చజెప్పమని అడిగాడు. ఆయన కూడా అడగ్గానే ఒప్పుకున్నా మా మదరుకి కొన్ని చాదస్తాలు వుండటం వల్ల ప్రేమికుల్ని విడదియ్యటం అనే పాయింటు మీద పోట్లాడటంతో వెనక్కి తగ్గారు. అసలు విషయం ఇంత స్పష్టంగా కనబడుతుంటే కమ్యునిష్టులు ఇంకా బ్రాహ్మణాధిపత్యం అనే సొల్లు కబుర్లు చెప్తున్నారే తప్ప ఆ కులాల వాళ్ళు ఈ వెనుకబాటుతనాన్ని తొలగించుకోవడానికి మార్గాలు యేమిటనేది మాత్రం చెప్పటం లేదు!

         బోడిగుండుకీ మోకాలికీ ముడిపెదుతున్నానని అనుకోకుండా నిశితంగా పరిశీలించి చూస్తే చుండూరు నరమేధం నుంచి గోధ్రా రైలు ఘటన అనంతరం జరిగిన ముస్లిముల వూచకోతల వరకూ జరిగే సామూహిక విధ్వంసాల మధ్యన కొన్ని పోలికలు వున్నాయి. అంతిమంగా యెక్కువ భీభత్సానికి గురై ఆక్రందించే వారి మీద పుట్టే జాలిలో మొదట రెచ్చగొట్టిన వాళ్ళ దుడుకుతనం మరుపు కొచ్చేస్తుంది.జపాను విషయం లోనూ అంతే.అసలు ఆ యుధ్ధానికి కారణం జపానే అని ఒక వాదన.యుధ్ధం మొదలయ్యాక సరే యెంతో మంది యెన్నో విధాల రాజీ ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గలేదు!ఆఖరికి కొన్ని సంవత్సరాల తర్వాత అప్పటి విషయాలకి జపాను చక్రవర్తి క్షమాపణ చెప్పాల్సిన అవసర మేమిటి? మనుషులు తమ రాగద్వేషాల కనుగుణంగా యేదో ఒక పక్షం మంచిదని తీర్మానించేసి తమకు నచ్చిన పక్షాన్ని సమర్ధించ వచ్చుగాక, కాలానికీ చరిత్రకీ సెంటిమెంటు లేదు!

            ఈరోజు అంత దుర్మార్గంగా చెలరేగిపోతున్న ఈ మూడు పెద్ద కులాలూ చరిత్ర కందని కాలం నుంచీ ఇలాగే లేవు.వేదపఠనం జరిగేటప్పుడు దూరం నుంచి విన్నా వాళ్ళ చెవుల్లో సీసం కరిగించి పొయ్యమనే విధంగా అప్పటి బ్రాహ్మణుల చేత అవమానించబడిన శూద్ర వర్ణం లోనివే ఈ కులాలు కూడా!ఇక్కడ ఆంధ్ర ప్రాంతం లోనే కాదు దేశమంతటా గుజ్జర్లు, చౌధురీలు,పన్నియర్లు అనే సహస్రాధికమయిన కులాలు వున్నాయి.తమాషా యేమిటంటే కమ్యునిష్టులూ ఆ భావజాలం మాత్రమే ప్రపంచంలోని అన్ని సమస్యలకీ పరిష్కారం చూపించగలుగుతుందని నమ్మేవాళ్ళూ కులపరమయిన ఆధిక్యతా భావం కేవలం బ్రాహ్మణుల్లోనే వుందని యెందుకు తీర్మానించశారో తెలియదు గానీ ప్రతి కులానికీ ఆ కులానికి చెందిన ప్రాచీనత పట్లా గొప్పదనం పట్లా అభిమానం వున్నది!ఈ మధ్యనే నేను ఇక్కడ బ్లాగుల్లోనే జాంబ పురాణం గురించి చదివాను.వింతేమిటంటే అందులో మనకి రామాయణంలో రాముడికి సహాయంగా వచ్చిన భల్లూక వీరుడిగా మాత్రమే తెలిసిన జాంబవంతుడు ప్రధాన దైవం!అంతకన్నా విశేషం ఇప్పుడు మనం తక్కువ కులాలు అని చెప్పుకునే చాకలి, మంగలి మాదిగ కులాల వాళ్ళంతా ఆ జాంబవంతుడితో చాలా గొప్పగా అనుసంధానించబడ్డారు గానీ ఈ మూడు పెద్ద కులాలకీ అందులో గుర్తింపు లేదు?అటు బ్రాహ్మణులు వీళ్ళని వేదం వింటే చెవుల్లో సీసం కరిగించి పొయ్యమన్నారు?ఇటు జాంబవ పురాణం లో చోటు లేదు?మరి యెప్పుడు మొదలై యెప్పటికి వీళ్ళు ఇంతగా పెరిగారు?


         కాకతి రుద్రదేవ మహారాజు పేరుతో సుమారు క్రీ.పూ 1250 నుంచి 1290ల వరకు తెలుగు ప్రజల్ని పరిపాలించిన ఆంధ్ర మహాసామ్రాజ్ఞి కాకతి రుద్రమ దేవి సైనిక విధానంలో ఒక విప్లవాత్మకమయిన విధానాన్ని పాటించింది - బ్రాహ్మణేతరుల్ని సైన్యంలోకి తీసుకోవటం!కన్యాశుల్కంలో "మీ వైదికపాళ్ళు జంఝాలు వొడుక్కుంచూ వుంచారో?" అనీ "మీ నియోగ్యపాళ్ళు నీచు గూడా తింఛూ వుంచారో!" అనీ వెక్కిరింతలు వున్నట్టున్నాయి కదా!ఆమె ప్రోత్సాహంతో వెలమ వాడయిన బసవ దండనాధుడి మూలంగా వెలమలూ, గోన గన్నారెడ్డి వల్ల రెడ్లూ, కాపయ నాయకుడి వల్ల కమ్మవాళ్ళూ యెదిగి పెద్ద కులాలుగా మారారు.సిపాయిగా చేరి కనీసం దళపతి వరకూ చేరినా అప్పటి కాలానికి ఆర్జన చాలా యెక్కువే!యుధ్ధాలు జరిగితే వోడిపోయిన కోటలో రాజుగారు ఖజానాని పట్టుకుంటే మిగతా వాళ్ళు వూరిమీద పడి అందినంత దోచుకోవడమే!యెక్కడ పరిమితికి మించిన ధనం పోగుపడినా అక్కడ యెంతోకొంత నెత్తురంటిన డబ్బు వుంటుంది?! అయితే పరిమితికి మించిన ఆస్తులు కోమట్లకీ వుండేవిగా ఇవ్వాళ వాళ్ళు వెనకబడిపోయి వీళ్ళు యెలా పైకి వచ్చారు అనుకుంటున్నారా?కోమట్లు యెంత వున్నా బంగారం మీద పెట్టి రొటేషన్లో తిప్పడంతో సరిపెట్టుకుంటే వీళ్ళు మాత్రం సంపాదనంతా భూమి మీద పెట్టుబడి పెట్టి భూస్వాము లయ్యారు! ఆ ఆదాయంతో పరిశ్రమలు పెట్టి పారిశ్రామికాధిపతు లయ్యారు! పరిమితికి మించిన ఆస్తి వుంటే దగ్గిరగా వుండేవాళ్ళు నమ్మకస్తులు కావాలి! బంధుత్వాలు గానీ సెంటిమెంటు గానీ వున్నవాళ్ళ కన్నా నమ్మకస్తులు యెవరు వుంటారు? అందుకే అందరూ తప్పనిసరిగా తమ వ్యాపార వ్యవహారా లన్నింటిలోనూ తమ కులం వాళ్లనే ప్రోత్సహించేది! ఆ విధంగా కులస్థుల్లో పాప్యులర్ అయితే రాజ్యాధికారం దగ్గిర కొస్తుంది!గట్టిగా చెప్పాలంటే రాజ్యాధికారం లేకపోయినా ప్రభుత్వం వాళ్ళకి యే పని కావాలంటే ఆ పని చేస్తుంది.

                ఇప్పటికే ఇలా యెదిగిన వాళ్ళకీ ఇప్పుడు యెదగాలనుకుంటున్న వాళ్ళకీ ఈ నమ్మకమూ ఆప్యాయతా తప్పనిసరిగా అవసరం కాబట్టి కమ్యునిష్టులూ, మానవ వాదులూ, మరింకే శవ వాదు లయినా ఈ అమరికని భగ్నం చెయ్యలేరు?! అతిగా తీసుకుంటే మనం అమృతం అనుకునే పాలు గూడా విషమవుతాయంటున్నారు అన్నిరకాల వైద్యవిధానాల్లోనూ, అలాంటిదే కులాభిమానం కూడా! రాణా ప్రతాప సింహుణ్ణీ చత్రపతి శివాజీనీ పొగడ్డానికి యెవరూ కులాభిమానం చూపించకపోవచ్చు గానీ బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడు లాంటి వాళ్లని పొగిడేటప్పుడు అతను మా కులం వాడే అని మిగతా వాళ్లకన్నా కొంచెం యెక్కువ హుషారు పడ్డంలో తప్పు లేదు గానీ మా కులం వాడు గనకనే అంతటి వాడయ్యాడు అని విర్రవీగటం మాత్రం శానా తప్పు! మా కులం గొప్పది అని అనుకోవటమూ మిగతా కులాల్లో వున్న గొప్పని కూడా మెచ్చుకోవటమూ అయితే OK, BUT మా కులమే గొప్పది మిగతావన్నీ చెత్తవి అనుకుంటే మాత్రం NOT OK?!

              తమ కులం లోని గొప్పవాళ్ల ముచ్చట్లన్నీ కాలక్షేపానికి కూర్చున్నప్పుడు చెప్పుకుని మురుసుకోవడానికే తప్ప కార్యరంగంలో ఇతర్లతో పోటీ పడేటప్పుడు యెందుకూ పనికిరావు. ఇద్దరు సమాన బలం గలవాళ్ళు యెదురెదురుగా నిలబడి తలపడితే వాళ్లలో యెవరు గెలుస్తారనేది కులాన్ని బట్టి గానీ మతాన్ని బట్టి గానీ ప్రాంతాన్ని బట్టి గానీ నిర్ధారించలేము కదా!కానీ ఇవ్వాళ ప్రజాప్రతినిధుల్ని యెన్నుకునే పని మాత్రం అలా జరగడం లేదు.యే నియోజక వర్గంలో యెవరిని నిలబెట్టాలన్నా ఆ నియోజకవర్గంలో వున్న ఈ భూస్వాములూ పారిశ్రామికవేత్తల ప్రాభవానికి ఇబ్బంది కలిగించని మర్యాదస్తుల్నే యెంచుకుంటున్నారు తప్పితే ఆ నియోజకవర్గంలోని అందరి ప్రయోజనాల్నీ పరిరక్షించే ప్రమాదకరమయిన వ్యక్తుల్ని మాత్రం నిలబెట్టటం లేదు! ఈ విషవలయంలో తిరుగాడుతున్నంత కాలం మిగతా కులాల వాళ్ళు రాజ్యాధికారం రాకపోతే పోయింది,ఈ చుండూరు నరమేధం లాంటి క్రూరమయిన దాడుల్నించి తప్పించుకునే మార్గం యెప్పటికీ దొరకదు! రాజ్యాధికారాన్ని పొందటానికి ఈ అమరిక వల్ల లాభం పొందే ఇప్పటి పెత్తందార్లు దీన్ని ఒక పట్టాన వదలరు, మరి ఇప్పుడున్న చిన్న కులాలు యెదిగేదెట్లా?

         ఇప్పుడు మోదీ గారు అంటున్న కమలమే సకలం కావాలి అనే ఆశ నిజమయితే యేం జరుగుతుంది?ఇప్పటికే హిందువుల్లో ఆర్ధికంగా, సామాజికంగా పైకొచ్చి వున్న అగ్రకులాల వాళ్ళు రాజకీయంగా కూడా యెదుగుతారు!అది కూడా గ్రామస్థాయిలోనూ విస్తరించాలనుకున్న మోదీ గారి ప్రనాళిక పూర్తయితే ఇప్పుదు అన్ని విధాలుగా అట్టడుగున వున్న కులాల వాళ్ళు యెప్పటికీ పైకి రాలేరు?!నాకు మోదీ గారి అభిప్రాయం తప్పనే దురుద్దేశం లేదు.చాణక్యుదు రాజు విజిగీషువు, శక్తి వుంటే మొత్తం భూమి నంతా ఆక్రమించ వచ్చు నన్నాడు! భాజపా అనే నాకు నచ్చిన అతి తక్కువ రాజకీయ పార్టీల్లో ఒకటి వ్యాపిస్తానంటే నాకు అభ్యంతర మేమిటి?కానీ ఇప్పటికిప్పుడు భాజపాలో చేరి రాజకీయంగా యెదగగలిగే అవకాశం సమాజంలో ఇప్పటికే ముందుకు వెళ్ళిన వారికే అది మేలు చేస్తుంది తప్ప అట్టడుగున వున్నవారికి మరోరకంగా వాళ్ళు ఇక యెప్పతికీ ముందుకు రానివ్వకుండా దారులు మూసేస్తుంది!మోదీ ప్రధానమంత్రి కాగానే అతని కులంలో వున్న వారంతా ఒకాసారిగా పైకొచ్చేసినట్టేఅ నుకుంటే మనం అంబేద్కరు రాసిన రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం గనక ఆ కులస్తులంతా పైకి వచ్చేసి వుండాలి ఈపాటికే.

        ఆర్ధికంగా నేను యెక్కడో చెన్నయ్ లో కాందిశీకుడిలా బతికే ఒక చిరుద్యోగిని.కానీ సామాజికంగా నేను అగ్రకులం వాడిని.ఆ హోదా నాకు పుట్తుకతోనే వచ్చింది.నేను ముఖ్యంగా ప్రస్తావించాలనుకుంటున్న పాయింటు ఇదే.వ్యక్తులు ఆర్ధికంగా బాగుపడటం వల్ల ఒక కులానికి మొత్తంగా యే విధమయిన హోదా పెరగదు!ఇప్పుదు నిమ్న కులాలుగా వున్న వాటికి ఆ హోదా పెరగాలంటే యేమి జరగాలి అనేది నేను చెప్పాలనుకున్నది!కమ్యునిష్టు తరహా వర్గ రహిత సమాజం అనే ఆదర్శానికి మన దేశప్రజలు మానసికంగా సిధ్ధమయ్యే పరిస్థితి లేదు. ఇక్కడున్న సంక్లిష్టతని అర్ధం చేసుకునే సహనం కమ్యునిష్టులకి లేదు. మన దేశంలో యే మార్పు జరిగినా పైకి కుదుపులాగా కనబదకుండా కొంచెం కొంచెంగా మారుతూ అసలైన సంస్క్తృతి ఒక ప్రవాహం లాగా సాగిపోయే లక్షణం కలది!దాన్ని బద్దలు కొట్టాలనే ముప్పాళ రంగనాయకమ్మ అభిమానుల అత్యుత్సాహం మంచిది కాదు!ఇప్పుడు అగ్రకులాలు కూడా ఒకప్పుడు నిమ్న కులాలే కాబట్టి వాళ్ళు యేమి చేసి అగ్రకులాలుగా యెదిగారో వీళ్ళు కూడా అలా చేస్తే సరిపోతుంది కదా!

         కాళోజీ రెండున్నర కులాలు అని అనేటంత సీను మిగతా కులాలకి యెందుకు లేకుండా పోయింది?యెందుకంటే ఈ కులాలు ఆంధ్రప్రదేశ్ లోని భూమిలో అధిక శాతాన్ని ఆక్రమించుకుని వున్నాయి గాబట్టి! డబ్బు రొటేషన్ తిరగడం కోమట్లలో యెక్కువగా వున్నా ఆ కులం భూమికి దూరంగా వుండటమే రాజకీయంగా సామాజికంగా ఈ కులాల కన్నా బలహీనంగా వుండటానికి కారణం! యే విధంగా నయినా వీలయినంత యెక్కువ భూమి మీద అధిపత్యమే కులానికి హోదా పెంచుతుంది! ఇక్కడొక విశేషం గమనించాలి ఈ కులం అధీనంలో వున్న భూమి కులస్థు లందర్లోనూ సమానంగా వాతాలు పంచబడి లేదు, కేవలం ఆ కులంలోని 10% మంది అధీనంలో ఈ భూమి వున్నా ఆ కులం హోదా పెరిగింది! యెందుకలా జరిగిందంటే తన అధీనంలోని ఆస్తిని కాపాడుకోవటానికి నమ్మకస్తుల కోసం బంధువుల మీదా తెలిసిన వాళ్ల మీదా ఆధార పదటం క్షేమం గనక తమకి దగ్గిరగా తమ కులస్థులే వుండేలాగ చూసుకుంటారు! అందుకే కులపిచ్చి అంతగా లేనివాళ్ళూ దుర్మార్గాలు చెయ్యని వాళ్ళూ కూడా ఇతర్లకి సహాయం చేసేటప్పుడు తమ కులం వారికే మొదటి అవకాశం ఇవ్వడం జరుగుతుంది! సామాజికంగా జరిగే యే మార్పు అయినా కుదుపులు లేకుందా జరగాలంటే తప్పనిసరిగా - తాత్కాలికమయిన పరిష్కారం,దీర్ఘకాలికమయిన పరిష్కారం రెండూ అవసరమే! రిజర్వేషన్లు అనేవి తాత్కాలికంగా వ్యక్తులు ఆర్ధికంగా యెదగటానికి పనికొస్తాయి - నేను వీట్ని పూర్తిగా వ్యతిరేకించటం లేదు. కానీ వీటి ద్వారా ప్రోత్సాహం తెచ్చుకున్న వారిలో కొందరయినా వ్యాపార పారిశ్రామీక రంగాల్లోకి ప్రవేశించి భూమి మీద అధిపత్యం సాధించనంత కాలం ఆ కులం యొక్క సామాజిక హోదా పెరగదు!

            దళితులే కాదు ముస్లిములది కూదా ఇదే పరిస్థితి - రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన ప్రాతినిధ్యం వుండాల్సిన అవసరం వున్నా వాళ్ళు వాస్తవంలో రెండవ తరగతి పౌరుల్లాగే వున్నారు?ఖైదీ తన జైలర్ని తన జైలు గదిలో మరి కొంచెం సౌకర్యవంతమయిన యేర్పాట్లని  కోరుకున్నట్టు శాతాల్లో దక్కే అడుగు బొడుగు తిండి లాంటి రిజర్వేషన్ల కోసం మాత్రం దిట్టంగా పోట్లాడుతున్నారు గానీ తమకి నిజమయిన అభ్యున్నతిని ఇచ్చే దారులు వెతకడం లేదు!ఈ రిజర్వేషన్ల ద్వారా వచ్చే పదీ పరకా వుద్యోగాల ద్వారా వెయ్యేళ్ళు గడిచినా ఆయా వర్గాలు ముందుకి రావడం అనేది కల్ల!ఉద్యోగం లో భద్రత ఉంటుంది, కానీ ఒక ఉన్నతోద్యోగి కూడా తన ముప్పయ్యేళ్ళ సర్వీసులో పొంద లేని ఆదాయం ఒక మధ్యస్థ అంతరువు లోని వ్యాపారి కేవలం అయిదు పది సంవత్సరాల లోనే పొంద గలడు.  వ్యక్తులకు ఉద్యోగాలు భద్రతా నిచ్చినా వర్గాల వారీగా చూస్తే వ్యాపార పారిశ్రామిక రంగాల వల్లే లాభం ఉంటుంది.

           ఉద్యోగాల కయితే డిగ్రీలు కావాలి. పరీక్షలు రాయాలి. నానా రకాల తంటాలూ పడాలి. కానీ వ్యాపారం చెయ్యాలన్నా పరిశ్రమ పెట్టాలన్నా ఇవేమీ అక్ఖర్లేదు. కానీ ఏది తను బాగా అమ్మగలడో తన గురించి తనకు బాగా తెలియాలి. కొత్త వస్తువును తయారు చేసి దానికి కొత్తగా మార్కెట్ ని పుట్టించుకొవడమా, అప్పటికే ఉన్న వస్తువుని మరింత బాగా మెరుగు పరచి అమ్మడమా - ఏది తనకు చేతనయితే అది చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. మొదటి విడత లాభాలు వచ్చేవరకు అవసరమయ్యే  సంస్థాగతమయిన పెట్టుబడిని తనే సమకోర్చుకోవాలి. ఒకసారి లాభాలు రావడం మొదలయితే తరవాత వ్యాపారాన్ని విస్తరించడానికి మూలధనాన్ని కదిలించకుండా లాభాల నుంచే పెట్టుబడినీ పొందాలి. ఇవన్నీ చెయ్యగలిగిన వాడే వ్యాపార పారిశ్రామిక రంగాల్లో వృద్దిలొకి వస్తాడు.

        కాబట్టి వాళ్ళలో ఇప్పటికే వ్యాపార పారిశ్రామిక రంగాల్లోకి అడుగు పెట్టటానికి తగినంత ఆదాయం వున్నవాళ్ళ్ళు అటువైపుకి వెళ్ళాలి!దానికి మొదటి అడుగు వీలయినంత యెక్కువ భూమిని హస్తగతం చేసుకోవాలి?!ప్రతి వ్యాపారికీ పారిశ్రామిక వేత్తకి మొదలు పెట్టటానికి తక్కువ భూమే అవసరమయినా విస్తరించుకునే దశలో భూమి చాలా ముఖ్యమయిన వనరు. దాదాపు దేశమంతటా కులాల పరిస్థితి ఇలాగే వుంది కాబట్టి ఇది అందరూ పాటించగలిగిన చక్కని రాజమార్గమే!అందులోనూ విభజన జరిగాక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్మార్ట్ సిటీల రూపంలోనూ పరిశ్రమల్ని వ్కేంద్రీకరించటం రూపంలోనూ భూమి అమ్మకాలూ కొనుగోళ్ళూ ఇదివరకటిలాగా బిగుసుకు పోయి వుండవు, రాబోయే రెండు మూడేళ్ళలో భూముల అమ్మకాలూ కొనుగోళ్ళూ యెంతో లిబరల్ అవుతాయి.పైగా ఈ సమయం దాటిపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం ఇప్పుడప్పుడే రాకపోవచ్చు.భూమికీ సంపదకీ అధికారానికీ వున్న ఈ సంబంధం తెలిసినందువల్లనే శాంతిపర్వంలో భీష్ముడి పరంగా వేదవ్యాసుడూ అర్ధశాస్త్ర రచయిత చాణక్యుడూ భూమి గురించి అంత విస్తారంగా చెప్పారు!

భూమి మీద అధిపత్యమే రాజకీయాధికారానికి దగ్గరి దారి!

Tuesday, 4 November 2014

మార్క్సిజం తెలియకపోతే పుట్టిన వాళ్ళం పుట్టినట్టే వుంటామా?

     మార్క్సు గారు చెప్పిన వ్యక్తిగత ఆస్తి రద్దు నాకు వేదాంతులు చెప్పే అహం వొదులుకోమనటం లాగా వినపడుతుంది, అదేమిటో!వేదాంతం చెప్పే గురువులు "సాధన చేయుమురా నరుడా,సాధ్యము కానిది లేదురా" అని యెంత వూదరగొట్టినా నరమానవుడి కెవడికీ అహాన్ని వొదులుకోవటం సాధ్యపడ లేదు.మార్క్సుగారు చెప్పిన వ్యక్తిగత ఆస్తి రద్దు కూడా అంతే.మార్క్సుగారు చెప్పిన చాలా అంశాలు మతాచార్యులు చెప్పే మాటల్లాగే ఆకుకీ పోకకీ అందకుండా వుంటాయి.ఈ వ్యక్తిగత ఆస్తి రద్దునే తీసుకోండి - ఆయన ఫ్రెండు యెంగెల్సు గారు పెద్ద జమీందారు కొడుకు.

      మార్క్సుగారు ఆ "దొసో కొపిత్యేలో" రాసి జనంలోకి వొదిలిన తర్వాతయినా యెంగెల్సు గారు తన ఆస్తిని వొదులుకున్నాడా? పుస్తకం రాస్తుండగానే వొదులుకుని వుంటే మాత్రం మార్క్సుగారి పుస్తకం బయటికి రాకపోయుండేది!మార్క్సుగారు తన భార్యకే గాక తన పనిమనిషికి పుట్టిన పిల్లలకి గూడా బాధ్యుడై వాళ్ల నందర్నీ పోషించడానికి మేజోళ్ళూ బూట్లూ అమ్ముకుంటున్నప్పుడు మిత్రుడిగా అప్పులు తీర్చి ఆదుకోకపోయుంటే అప్పులు యెక్కువై అప్పుల వాళ్ళ చేత జైలుకు తరమబడి అక్కడే మగ్గుతూ వుందే వాడు కదా!ఇంతకీ తెలుగులో ఇంత నిజాయితీగా చెప్తున్న ఈ రచయిత్రి పేరున ఆస్తులు యేమీ లేవు గదా?వుంటే సిధ్ధాత ద్రోహం కాదా!

      మావూళ్ళో ఒక మహానుభావుడు వున్నాడు. పేరు గూడా చెప్తాను.పొన్నం వీర రాఘవయ్య చౌదరి.ఈయన విశిష్టత యేమిటంటే అంత కుగ్రామమలో పుట్టి కమ్యునిష్టు కావడమూ, అనామకంగా వుండిపోకుండా కంకి గుర్తు పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా యెదగటం. చాలా మంది వున్నారు గదా ఇలాంటి గొట్టాలు అనుకోవచ్చు మీరు, కానీ కమ్యునిష్టుగా వుంటూనే కమ్యునిష్టు అయిన వాడు మాట్లాడగూడని బూతు మాట మాట్లాడినా కమ్యునిష్టుగానే చెలామణీ అవుతూ వుందటం?ఒక పనిమీద మేము వాళ్ళింటికి వెళ్ళి తనతో మాట్లాడే అవకాశం కోసం యెదురు చూస్తున్నాం. ఈలోపు వాళ్లబ్బాయి అతనితో మాట్లాడుతుండగా వాళ్ళిద్దరి సంభాషణా మా చెవిన పడింది,మామూలు మనిషిని గనక కళ్ళు తిరిగినంత పనయింది?!అదే గొప్పవాళ్లయితే మీడియా ముందు దిగ్భ్రాంతి పడేవాళ్లేమో?

      తమ పొలాల్లో పనులు జరుగుతున్నాయి, పనులూ, కూలీలూ వాటికి స్మబంధించిన విషయం."అంతెందుకు కూలీ, దండగ?" - అని ముదలకిస్తున్నాడీ రైతుకూలీ సంక్షేమానికి కట్టుబడ్డ పార్టీకి సంబంధించిన పెద్దమనిషి!"కూలీలు రారు నాన్నా, మిగతా వాళ్ళు అంతే ఇస్తున్నారు" అని కొడుకు అంటే "యెందుకు రారు గట్టిగా మాట్లాడాలి" అని ఆ కమ్యునిష్టు పితృదేవుడు కమ్యునిష్టు కాని కొడుకుని గద్దిస్తున్నాడు.అంతగా కమ్యునిజంతో మమేకమయిన మనిషి మిగతా వాళ్ల కన్నా తన పొలంలో కూలీల్ని అయిదు రూపాయలు తక్కువకి పని చేయించుకోవాలనుకుంటున్నాడే ఆ మనిషి పుట్టినట్టా?పుట్టనట్టా?పుట్టగానే చచ్చిపొయినట్టా?

      ఇంకో వెయ్యేళ్ళ తర్వాత అయినా - ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్లనుకున్నట్టు విప్లవం భూమి అంతటా పరుచుకున్నాక కూడా యే ఇద్దరు వ్యక్తుల మధ్య నయినా అమ్మకం, కొనుగోలు లాంటి ట్రాన్సాక్షన్ జరిగితే యెవడో ఒకడు నష్టపొవటం ఖాయం!అమ్మేవాడు అవసరపడి అమ్ముతున్నాడని తెలిస్తే కొనేవాడు తక్కువకి కిట్టించుకోవాలని చూస్తాడు.కొనేవాడికి ఈ వనరు చాలా అవసరం అని తెలుసుకుంటే అమ్మేవాడు చెట్టెక్కి కూర్చుంటాడు.దీనికోసం మార్క్సిజమే చదవాలా?ఒక వూరి కరణం మరో వూరి కాపు అనే సామెత ఈనాటిదా?!

      మరీ ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించిన చాలా విషయాలు మార్క్సిజంలో చెప్పే విషయాల కన్నా గొప్పగా వుంటాయి.వుదాహరణకి దేవీ భాగం విషయాన్నే తీసుకుంటే మార్క్సు చెప్పిన అదనపు విలువని సమాజ పరం చేసి సంపదని అందరూ సమానంగా పంచుకోవడం మనవాళ్ళు పాతకాలం లోనే సాధించారని అర్ధ మవుతుంది!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...