ఈ భూ పెపంచకంలో యెంత తెలివయిన ఆడదాని కయినా యెక్కడో అక్కడ వేపకాయంతయినా వెర్రి వుంటాది!కావలిస్తే ఆ సుధా మూర్తినో కిరణ్ బేడీనో చూడాండి?సోనియా లాంటి వాళ్ళకయితే వేపకాయంత యేం ఖర్మ తాటికాయంతే వుంటుందని మీరు కూడా వొప్పుకుంటారు!వెర్రి గాకపోతే దేశమంతా అప్పిటికే పదేళ్ళ అవినీతి గబ్బు వాసన ముక్కులు బద్దలు గొడతా వుంటే కేసీఆరు థెలంగాణాలో ముఫ్ఫయ్ సీట్లు గ్యారెంటీ అనంగానే ఆ వూపుతోనే యూపీయే-3 అని గంతులేస్తూ పెళ్ళికాని ప్రసాదుని రాజేశ్వరి కిచ్చి ముడెట్టెయ్యొచ్చునని ఇంత దరిద్రంగా తెలుగోళ్ళని విడగొట్టుద్ది?!అలాగని మీరు లైనేసే అమ్మాయిలో ఈ వెర్రి కనబడగానే వొదలగొట్టాలనే దురదతో దాన్ని గురించి ఆ అమ్మాయికి క్లాసులు గానీ పీకేరు సుమా!బాలక్రిష్ణ అదేదో సినిమాలో "పగ,పగ,పగ" అని రెచ్చిపోయినట్టు అప్పిటిదాకా సుకుమారంగా కనబడిన ఆ ముద్దుగుమ్మ అమ్మోరిలాగా శివాలెత్తి పోయి మిమ్మల్ని ఇరగదీసెయ్యటం ఖాయం! మరి యేమి చెయ్యాలయ్యా అంటే రివర్సు గేరులో,"ప్రియా, ఈ భూమండలం మీద ఈ అద్భుతమయిన లక్షణం మాత్రమే వుంది" అనే కలరు పులిమి వుబ్బెయ్యాలి!అప్పుడు ఆ అమ్మాయి బొచ్చుకుక్కపిల్ల లాగా మచ్చికై "నువ్వు యాడికెళ్తే ఆడికొస్త రాజా" అనే లెక్కలో కొస్తుంది.
ఈ భూ పెపంచకంలో యెంత వెర్రిబాగుల మగాడి కయినా యెందులోనో ఒకందులో అమోఘమయిన ప్రజ్ఞ వుంటాది!అనంగనంగా ఒక వూళ్ళో మునసబుగారి గేదె తప్పిపోయినాది.ఆ కాలంలో ఒక రాజ్యానికి రాజు యెట్టాగో వూరికి మునసబు అట్టా.ఇనకేముంది వూళ్ళో వున్న తెలివైనోళ్ళంతా వెతికి వెతికి ఇక దొరకదని తీర్మానించుకున్న క్షణంలో ఆ వూళ్ళో వున్న వెర్రి వెంగళప్ప గేదెతో సహా ప్రత్యక్ష మయ్యాడు?అందరికీ ఇంత తెలివైన వాళ్ళం మనం చెయ్యలేనిది ఈ వెంగళప్ప అంత వీజీగా చేసెయ్యటమాని తల కొట్టేసినంత పనై అసలు రహస్యం యేమిటని వాణ్ణే అడిగారు.చిద్విలాసంగా చెప్పాడు - "నేనే గేదెనైతే యెలా ఆలోచిస్తానో యెటువైపు నా కాళ్ళు లాగుతాయో అనే పధ్ధతి ఫాలో అయ్యా!" అని?!అది కూడా ప్రజ్ఞే మరి, మునసబు గారి గేదెని వెతికి పట్టుకు రావడం మాటలా!యేదో ఒక ప్రజ్ఞ ప్రతి మగాడి లోనూ వున్నప్పుడు అందరు మగాళ్ళూ సక్సెసవ్వాలి గదా,మరి యెందుకు ఫెయిలవుతున్నారు అని మీరడగొచ్చు. అయితే ఆ ప్రజ్ఞ యెక్కడ పనికొస్తుందో అక్కడ గాని వాణ్ణి వుంచామా అల్లాటప్పాగా కనబడినోడు కూడా అగ్గిరాముడై పోతాడు, తన ప్రజ్ఞ పనికిరాని చోట నిలబెడితే అగ్గిరాముడు కూడా బుగ్గై పోతాడు,అదీ రగస్యం! వాడెక్కడ పనికొస్తాడో కనిపెట్టి ఆ రూటులోకి నడిపించగలిగిన ఆడది కడకొంగున కాదు, లంగాబొందున ముడేసుకున్నా కిక్కురుమనకుండా పడి వుంటాడు మగాడు. మొదటి సారిగా జనాలకి సినిమా చూపించాలని తపన పడిన దాదా సాహేబు గారికి తాళిబొట్టు కూడా తెగనమ్మి సప్పోర్టుగా నిలబడింది చూశారా ఉత్తమ ఇల్లాలు, ఆవిడ సాయమే లేకపోయుంటే ఆయన యాడుండేవోడు?
ఈ ఆడోళ్ళనీ మగాళ్ళనీ పెళ్ళి పేరుతో ముడెయ్యటానికీ అది సజావుగా సాగటానికీ మన పెద్దోళ్ళు యెటకారంలాగా వుండే మాటొకటి చెప్పారు!ఇద్దరూ తెలివైనోళ్ళయినా ఇద్దరూ దద్దమ్మ లయినా ఆ సంసారం యేడిసినట్టుగా వుంటాదంట? ఒకళ్ళు మాత్రమే తెలివైనోళ్ళు అయితేనే అదిరిపోద్దంట? మన సంగతీ చుట్టూ జరుగుతున్న యెవ్వారాలూ చూస్తా వుంటే నిజమేననిపిస్తాంది గానీ దాన్ని అన్ని కేసుల్లోనూ ఫాలో అయ్యే వీలే లేదు గందా!మా అమ్మాయి తెలివైంది, మీ అబ్బాయి పిచ్చోడేనా అని అడగలేం, మా అబ్బాయి జీనియస్సు మీ అమ్మాయి పిచ్చి సంగతేంటి అని ఆరాలూ తియ్యలేం! అక్షరసత్యాలు చెప్పే హరిబాబు క్కూడా అలివిగాని లెక్క గాబట్టి ఆట్టే బుర్ర పాడు జేసుకోమాకండి ఈ కాంబినేషను యెట్టా కలపాలా అని!
ఆడది మగాడి కేది ఇవ్వాల మగాడు ఆడదాని కేది ఇవ్వాల అనేది తెలుసుకుంటే ఈ లెక్క మరోలాగ తెగుద్ది!ఆడది, మగాడికి, ఇవ్వటం - అనంగానే అదే! అదే! అని యెగరమాకండి, గాలి తీసేస్తా! మగాడు చూట్టానికి యేపుగా వుంటాడు, సాగినంత కాలం నా అంతవోడు లేడు అని రెచ్చిపోతాడు గానీ కుంచెం గాలి మారి దారి కనబడని మలుపు చేరాడా బిక్కచచ్చి పోతాడు! వుద్యోగం వూడే పరిస్తితి వొచ్చిందని తెలిసిన మగాడు రేపటి నుంచి బతుకు గడిచేదెట్లా అనే గొడవ కన్నా ఈ విషయం ఇంట్లో చెప్పడ మెట్లా అనే కొడవలి గుర్తుకే యెక్కువ భయపడతాడు, అవునా? ఆ సమయంలో ఆడది మగాడికి కొంచెం ఓదార్పు ఇవ్వాలి, ధైర్యం చెప్పాలి, నీకు తోడుగా నేనుంటానని భరోసా ఇవ్వాలి, ఇంతటితో అయిపోలేదు రేపటి రోజున మనం మరింత గొప్పగా వుంటామేమో అనే ఆశని కల్పించాలి! లేని పక్షంలో ఫెయిలయినప్పుడల్లా ఒక్కో ఆడది జారుకుంటుంటే రోజుకో ఆడదానికి లైనెయ్యాలి, జరిగే పనేనా? ఈ దిక్కుమాలిన హిండియాలో యెవరో కామగోపాల వర్మ లాంటి పెట్టి పుట్ట్టిన అదృష్టమంతులకి తప్ప అందరికీ దొరకదు ఆ భాగ్యం!మరి మగాడు ఆడదానికి యేమివ్వాలి?నాకు తెలుసు, వెంఠనే? ఇంకేముంటాయి షాపింగు ఖర్చులు తప్ప! అని అనుభవసారంతో విసుక్కుంటారని. కానీ సాటి ఆడవాళ్ళకి మా ఆయన ఫలానా అని గర్వంగా చెప్పుకోగలగడాన్ని ఇష్టపడతారు ఆడాళ్ళు, ఒక గౌరవప్రదమయిన సామాజిక స్థాయి చాలు వాళ్ళకి మగాళ్ళు యెన్ని వెధవ్వేషాలు వేసినా క్షమించెయ్యడానికి?దాంతోపాటు రంభ, వూర్వశి, మేనక లాంటి వాళ్ళు పిల్చినా నన్ను వొదిలి వెళ్ళడు అనే నమ్మకం కలిగిస్తే ఇంట్లోనే స్వర్గం చూపిస్తారు మన ఆడోళ్ళు!
దంపతుల సుఖసుడి బాగుండి యెవరో ఒకరే తెలివైనోళ్ళు వుండేలా కుదిరితే అవ్వల్ రైటే గానీ అది కుదరనప్పుడు గూడా ఇద్దరూ ఒకే గాడిలో వున్నా పెర్సంటేజిలు తేడా వుంటాయి గదా - మరట్లాంటప్పుడు యెవళ్ళు యెక్కువ తెలివిగా వుంటే బాగుంటాది అనే లాజిక్కు మీలో యెవురికయినా తోచిందా?ఆ డవుటు గాని బుర్రలోకి వొచ్చి జవ్వాబు తెల్సిపోయిందా మీరు అగ్గిలో దూకినా నెప్పి తెలీకండా దాటుకు రాగలిగిన ఘనాపాఠీ లన్నట్టు! నా వోటు మాత్రం ఆడోళ్ళకే - ఆడది యెక్కువ తెలివిగా వుండి మగాడు పెళ్ళాం చెబితే వినాలి అని బుధ్ధిగా వున్న సంసారాలే పదికాలాలు చెక్కు చెదరకుండా మనగలుగుతున్నాయి - చుట్టూ చూడండి జాగ్రత్తగా?!అమ్మ హరిబాబూ మీ ఇంట్లో ఆడోళ్ళతో గొడవలు రాకుండా యేం పొలిటికల్ తీర్పు చెప్పావులే అని యెకసెక్కాలు ఆడతారా?కుదరదు, కారణాలు చాలా గంభీరమైనవి, జాగ్రత్తగా వినండి!
పిల్లల్ని కనడం వాళ్ళని పెంచడం అనే బాధ్యత వుండటం వల్ల ఆడాళ్ళలో పిల్లలకోడి మనస్తత్వం బలంగా వుంటుంది. కుటుంబానికి కష్టం వొచ్చినప్పుడు నేనూ, నా భర్తా, నా పిల్లలూ క్షేమంగా వుండాలంటే యేంచెయ్యాలి అనే దృష్టి తప్ప అనవసరపు త్యాగాల తోనూ అక్కర్లేని ఆదర్శాల తోనూ బుర్రల్ని ఖరాబు చేసుకోరు!పైగా ఋతుచక్రం ఆ సమయంలో వాళ్ళని చీకాకు పెట్టినా జీవధర్మానుసారం కల్మషాలన్నీ అప్పుడు బయటికి వెళ్ళిపోవడం వల్ల మామూలు సమయాల్లో మనసు మీద అనవసరపు వొత్తిడులు వుండవు!అద్బుతమయిన ఫలితాల్ని ఇచ్చే నిర్ణయాలు తీసుకోవటానికి కావలసిన ఒకే ఒక దినుసు ప్రశాంతమయిన మనసు!కాబట్టి సంస్కారవంతుడై సుఖంగా బతకాలనుకున్న మగాడు తన ఆడదానిలో ఈ లక్షణం వుంటే దాన్ని వుపయోగించుకుని బాగుపడాలి తప్ప నేను మగాణ్ణి,మోనార్కుని, నామీద ఆధారపడి బతుకుతున్న ఈ ఆడదానితో ఆలోచన యేంటి అని అనుకోగూడదు.అలా అనుకున్న వాళ్ళు ఐతే అప్పుల పాలై తిప్పలు పడటమో లేదంటే జైలు పాలై చిప్పకూడు తినటమో చేస్తున్నారు,తెలుసుకోండి!ఆడాళ్ళు కూడా యేదో ఆయన తెచ్చి పోస్తే వుడకేస్తాను అంతకి మించి తను యేం చేస్తాడో నాకెందుకు అనుకోకుండా భర్త వేసే ప్రతి అడుగునీ గమనించాలి,తప్పటడుగు వేస్తాడేమో అని అనుమానమొస్తే ముందుగానే హెచ్చరించి కుటుంబాని కొచ్చే ప్రమాదాన్ని నిలవరించగలగాలి.
అసలింతకీ ఒకే చూరు కింద ఒక జీవితకాలం తాము గడపాలని తెలిసి గూడా ఈ ఆడాళ్ళూ మగాళ్ళూ యెందుకు సర్దుకుపోలేక పోతున్నారు?ఈ పీటముడి విప్పగలిగితే సంసారోపనిషత్తు ఆమూలాగ్రం అర్ధమయినట్టే!మగాడికి భర్తశ్రీ అనీ ఆడదానికి భార్యశ్రీ అనీ బిరుదులు కూడా ఇచ్చెయ్యొచ్చు!పక్క పక్కనే తిరుగుతున్నా కలిసే పెరుగుతున్నా ఆడప్రపంచం,మగప్రపంచం అనే రెండు ప్రపంచాలు ఖచ్చితంగా వున్నాయండి!ఆడాళ్ళు నలుగురు ఒకచోట కూడీతే చీరలూ,నగలూ, భర్తల హోదాలూ - వీటి గురించి మట్లాడుకుంటారు.మగాళ్ళు నలుగురు ఒకచోట కూడితే సినిమాలూ, రాజకీయాలూ మాట్లాడుకుంటారు.చూశారా, మాట్లాడుకునే టాపిక్కుల్లోనే ఆడ టాపిక్కులూ మగ టాపిక్కులూ అనే విధంగా వేరుపడిపోయాయి?!ఈ విధంగా బిల్హణీయంలో కనబడే తెర ప్రతిచోటా కనబదకుండా అమిరిపోయింది!ఈ తెరని చింపెయ్యాలి!స్త్రీలు భర్త నుంచి యేమి అశిస్తారో దాన్ని యెలా కొరత లేకుండా తీర్చాలో మగాళ్ళకి తెలియాలి.పురుషులు భార్య నుంచి యేమి ఆశిస్తారో వాటిని యెలా తీర్చి సంతృప్తి పర్చాలో ఆడాళ్ళకి తెలియాలి.అవి తెలియని వాళ్ళు పెళ్ళికీ దాంపత్య జీవనానికీ అర్హులు కాదని తీర్మానించి వాటికి దూరంగా వుంచాలి. నా మాట వినగానే క్రూరంగా అనిపించినా ఇవ్వాళ మన చుట్టూ జరుగుతున్న భీభత్సాలతో పోలిస్తే అది సరయిన పరిష్కారమే ననిపిస్తుంది!
మరీ అంత కఠొరమయిన తీర్పు ఇస్తే యెలా అని సణిగే సుకుమారులకి ఒక ముక్తాయింపు ఇస్తా!అసలు పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని మీరెల్లరు హాయిగ కాలం గడపాలన్న వాళ్ళే పెంపకాల్లో ఒక తింగరిపని చేశారు, ఇప్పటికీ మనం కూడా అలవాటుగా చెస్తూనే వున్నాం?!మగవాడు పుడితే వాడికేం మగమహారాజు యెలా అయినా బతికేస్తాడు అనే దరిద్రపు మాటల్తో రేపటి రోజున వాడు ఒక కుటుంబ పెద్దగా వుండాలి అనేది తెలిసి కూడా బాధ్యతలు నేర్పకుండా సంస్కారం గలవాడిగా తీర్చిదిద్దకుండా గాలి కొదిలేస్తున్నారు! ఆడపిల్ల పుడితే యెప్పటికయినా పెళ్లయి కొత్తచోటికి వెళ్ళాల్సినదే గాబట్టి యెక్కడయినా బతకగలిగే ధైర్యమూ కొత్తవాళ్లతో చొరవగా కలిసిపోయి అందిస్తే అల్లుకుపోగల తెలివినీ నేర్పకుండా అంతులేని విధినిషేదాల్తో భయస్తురాళ్ళుగా తయారు చేసి అమాయకంగా హతమారి పోయేటట్టు పెంచుతున్నారు! దాని ఫలితంగానే మగతనం అంటే ఆడదానితో సామరస్యంగా వ్యవహరించి తన సమర్ధతతో ఆమెను సంతోషపెట్టటంగా కాకుండా పశువులాగా భయపెట్టి లొంగదీసుకుని తన కోరిక తీర్చుకోవటం అని భ్రమించి ఈవ్ టీజింగుల దగ్గిర్నించి రేపుల వరకూ గల అకృత్యాల నన్నిట్నీ అంత ధీమాగా చేస్తున్నారు మగవాళ్ళు. పెంపకాల్లో వున్న ఈ రివర్సు గేరుని వెనక్కి తిప్పి మగాళ్ళని రేపు ఒక కుటుంబ పెద్దగా భార్యనీ, పిల్లల్నీ మ్యానేజి చెయ్యగలిగే బుధ్ధిమంతులు గానూ, ఆడాళ్ళని కొత్తగా వెళ్ళిన ఇంట్లో ధీమాగా బతకగలిగే ధైర్యస్థులుగానూ పెంచటం మొదలు పెడితే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడినట్టు కళకళ్ళాడుతూ వుంటాయి, దాంపత్యాలు జోడుగుర్రాల రధాల్లాగా పరుగులు పెడతాయి!
ఇప్పుడొక చిక్కుప్రశ్న:హిందూ వివాహవిధిలో సరిగ్గా దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తంలో జరిగే కార్యక్రమం యేమిటి?