Monday, 18 November 2024

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu:గురువు గారూ!

మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా.అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట,"మహాత్మా నేను చేస్తున్నది హింస కాదా అని అడిగారు.దానికి నేను జవాబు చెప్పాను.ఇక ఇది హింస,ఇది అహింస అని చెప్పడం ఎవరి తరమూ కాదు.ఒక ప్రాణి పుట్టడానికీ చావడానికీ అంతకుముందర చేసిన కర్మలే కారణం,చంపేవాడు నిమిత్త మాత్రుడు.పండ్లువేర్లుఓషధులు, కాయగూరలుఆకు కూరలుజంతువులు ప్రాణులకు ఆహారం కింద భగవంతుడు ఏర్పరచాడు.ఇది వేదం చెప్పిన సత్యం.దానిని మనం కాదనగలమా!

పూర్వము శిబి చక్రవర్తి తన మాంసాన్ని కోసి డేగకు ఆహారం ఏర్పరచాడు - అతనికి పుణ్యం లభించింది కదా!రంతిదేవుడు ప్రతిరోజు వేలకొద్ది గోవులను వధించి సంతర్పణ చేశాడు - అతనికి పుణ్యం లభించింది కదా!మరి వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు కదా!కాబట్టి మాంసాహారాన్ని జీవహింస కింద పరిగణించ కూడదు.పితృకార్యములలోనూ దైవకార్యములలోనూ మాంసాహారాన్ని పెడతారు,మిగిలిన దాన్ని భుజించడం ధర్మం అని ఋషులు చెబుతున్నారు కదా!

రైతులు భూమిని దున్నుతున్నప్పుడు ఎన్నో జీవాలు చచ్చిపోతాయి - అది హింస కాదా!ఇంత యేల,మానవులు నడిచేటప్పుడు వాళ్ళ కాళ్ళ కింద పడి కొన్ని జీవులు చచ్చిపోతాయి - మరి అది జీవహింస అవుతుందా?కాబట్టి ఇది ఎవరికి వారు నిర్ణయించుకోవలసిన విషయము" అని అంటాడు.

ఇందులో "మరి వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు కదా!కాబట్టి మాంసాహారాన్ని జీవహింస కింద పరిగణించ కూడదు.పితృకార్యములలోనూ దైవకార్యములలోనూ మాంసాహారాన్ని పెడతారు,మిగిలిన దాన్ని భుజించడం ధర్మం అని ఋషులు చెబుతున్నారు కదా!" అనేది మీరు నొక్కి చెప్తున్న "యజ్ఞంలో హింసకు తావు లేదు.అది పూర్తి అహింస!" అనేదానికి పూర్తి విరుధ్ధం కదా,మీరు ఏం చెప్తారు?

Venkata Chaganti:

"పండ్లు,వేర్లు,ఓషధులు, కాయగూరలు,ఆకు కూరలు,జంతువులు ప్రాణులకు ఆహారం కింద భగవంతుడు ఏర్పరచాడు" -> ఇది తప్పు.కేవలము "పండ్లు,వేర్లు,ఓషధులు, కాయగూరలు,ఆకు కూరలు" ప్రాణులకు ఆహారం -> ఇది సరియైనది.

"పూర్వము శిబి చక్రవర్తి తన మాంసాన్ని కోసి డేగకు ఆహారం ఏర్పరచాడు - అతనికి పుణ్యం లభించింది కదా!" -> కేవలము ఇది అతని సొంత నిర్నయము.

"రంతిదేవుడు ప్రతిరోజు వేలకొద్ది గోవులను వధించి సంతర్పణ చేశాడు - అతనికి పుణ్యం లభించింది కదా!" -> ఇది చాలా పెద్ద అబద్దం. వేదములో ఇది ఉన్నదని చెప్పినవాడు మహా పాపి.

"మరి వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు కదా!" -> వేదములో ఇది ఉన్నదని చెప్పినవాడు మహా పాపి.

"పితృకార్యములలోనూ దైవకార్యములలోనూ మాంసాహారాన్ని పెడతారు,మిగిలిన దాన్ని భుజించడం ధర్మం అని ఋషులు చెబుతున్నారు కదా!" -> వేదములో ఇది ఉన్నదని చెప్పినవాడు మహా పాపి.

"రైతులు భూమిని దున్నుతున్నప్పుడు ఎన్నో జీవాలు చచ్చిపోతాయి - అది హింస కాదా!" -> ఇది హింస అని చెప్పినవాడు మహా పాపి.

"ఇంత యేల,మానవులు నడిచేటప్పుడు వాళ్ళ కాళ్ళ కింద పడి కొన్ని జీవులు చచ్చిపోతాయి - మరి అది జీవహింస అవుతుందా?" -> కాదు కాకూడదు.

hari.S.babu:అలా వూరికే డిక్లరేషన్ ఇస్తే ఎలా?

ఇది నేను ఎక్కణ్ణించి తీసుకున్నానో తెలుసా!"కవిత్రయం పాదరేణువు" అని తమ గురించి చెప్పుకున్న రెటైర్డ్ హైకోర్ట్ రిజిస్ట్రార్ మొదలి వెంకట సుబ్రమణ్యం గారు వ్యాసకృతాన్నీ కవిత్రయకృతాన్నీ చదివి తేట తెలుగులో చేసిన అనువాదం నుంచి."వేదములో ఇది ఉన్నదని చెప్పినవాడు మహా పాపి." అని మీరు అంటున్నది కవిత్రయానికీ వ్యాసుల వారికీ తగుల్తుంది. తొందరపడుతున్నారేమో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది.

Venkata Chaganti:We will definitely do something about it, somewhere in the next month.

hari.S.babu:I think You already might read asvamaerdha parvam - It says pandavas felt happy on smelling the burnt body parts of YajnaaSvam!

Venkata Chaganti:Nonsense to the peak!

hari.S.babu:అశ్వమేధ పర్వం యొక్క చతుర్ధాశ్వాసంలో స్వయాన వేదవ్యాసుల వారి అధ్వర్యంలో జరిగిన అశ్వమేధంలో ఎంత స్థాయిలో జంతుహింస జరిగిందో తెలుసా!"ప్రధాన యజ్ఞవాటికను బంగారు ఇటుకలతో చతురస్రాకారంలో నిర్మించారు.ఎటు చూచినా 18 మూరలు ఉండేటట్టు నిర్మించారు.యజ్ఞవాటిక గరుడ పక్షి ఆకారంలో నిర్మించారు.

ఋత్విక్కులు యూపస్తంభాలను పాతారు - దానికీ లెక్కలు ఉన్నాయి.ఖాదిరములతో చేసినవి 6,మారేడు కర్రలతో చేసినవి 6, మోదుగ కర్రతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి2, శ్లేషాత్మక చెట్టు కొయ్యతో చేసినది 1. యూప స్తంభాలకు చతుష్పాత్తులనూ జలచరములనూ పక్షులనూ కలిపి 300 జంతువులను కట్టారు.ప్రధాన యూపస్తంభానికి యజ్ఞాశ్వాన్ని కట్టారు.

యజ్ఞమునకు వేదవ్యాసుల వారి శిష్యులు కూడా వచ్చారు.యజ్ఞప్రక్రియలో మొదట యూపస్తంభాలకు కట్టిన 300 జంతువులనూ చంపారు.తర్వాత యజ్ఞాశ్వమును చంపే సమయం వచ్చింది.అప్పుడు ద్రౌపదిని యజ్ఞాశ్వానికి సమీపంలో నిలబడమని చెప్పారు.దేశమంతా తిరిగి వచ్చిన యజ్ఞమును పాండవులు చంపారు.

అశ్వము యొక్క వివిధ అవయవములను ద్రౌపది తన స్వహస్తములతో అగ్నిలో వేసి దేవతలకు హవిస్సుల రూపంలో అందజేసింది.యజ్ఞాశ్వము యొక్క మాంసఖండాలు హోమకుండములో కాలుతున్నప్పుడు అందులోనుండి వచ్చే పొగనూ వాసననూ పీల్చి పాందవులూ ద్రౌపదీ ఆనందించారు.ఆపైన ఋత్విక్కులు శాస్త్రవిధిని అనుసరించి మిగిలిన యజ్ఞాశ్వము యొక్క మాంసఖండాలను అగ్నిలో వ్రేల్చారు. అంతటితో అశ్వమేధం పూర్తయ్యింది." - ఇది కవిత్రయం వారి పాదరేణువు అని తన గురించి చెప్పుకున్న M.V.Subramanyam గారి వర్ణన యధాతధం

Venkata Chaganti:Because of this nonsense Hinduism has gone to dust.

hari.S.babu:Exactly, We need to expose such Spiritual Quid Proco 👍

Venkat Chaganti:Of course we will!

hari.S.babu:వ్యాసహృదయం తెలియని తర్వాత తరాల వారు ధర్మరాజుకి తాత్విక విషయాల పట్ల ఆసక్తి ఉండి అడిగాడనే సమర్ధనతో కొన్ని చెత్త కధల్ని కూడా చేర్చారు.ఇప్పుడు ధర్మరాజుయొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి అక్షరం పొల్లుపోని రీతిన చదువుతున్నప్పుడు గమనించిన మరొక దుర్మార్గం అవధులు దాటిన బ్రాహ్మణ ప్రశంస!

బ్రాహ్మణుణ్ణి తిడితే చాలు ఆపదలు ముంచుకొస్తాయని చెప్పడానికి ఒక కధ,బ్రాహ్మణుడి ధనాన్ని హరిస్తే ఏం జరుగుతుందో చెప్పి బెదిరించడానికి ఒక కధ,అసలు బ్రాహ్మణుణ్ణి తిట్టదమో కొట్టదమో కాదు నిర్లక్ష్యం చేసినా చాలు కీడు జరుగుతుందని సాక్ష్యం చూపిస్తూ ఒక కధ.

Benifit of Doubt కింద బ్రాహ్మణులలో ఉండాల్సిన మంచి లక్షణాలు అని చెప్పారు, అవి ఉన్నవాడే బ్రాహ్మణుడు అని చెప్పి ప్రశంస రకం సద్బ్రాహ్మణులకి చెందుతుంది కదా,దోషం ఏముంది అనిపించవచ్చు గానీ సుగుణాల్ని బట్టి పొగడాలంటే అన్ని కులాల్లోనూ సజ్జనులూ దుర్జనులూ ఉన్నారు.ఇక్కడ కధలు వ్రాసిన వాళ్ళు కూడా మంచి బ్రాహ్మణులు అని ప్రత్యేకించి చెప్పడం లేదు.అందరు బ్రాహ్మణుల్నీ నెత్తిన పెట్టుకోమంటూ ఇతర కులాల వాళ్ళని బతిమిలాడుతున్నారు, ప్రలోభపెడుతున్నారు, బెదిరించుతున్నారు - Spiritual Imperialist కబుర్లు చెప్తున్నారు.

British Imperialist Scoundrels ఇచ్చిన కొన్ని మేలు రకపు సౌకర్యాల కోసం మనలోని కొందరు కల్లగురువులై పంచమవేదానికి కూడా అశుధ్ధం పులిమారు.అది ఇవ్వాళ జరగలేదు.ఎప్పుడు జరిగిందో తెలియని అతి ప్రాచీనమైన గతంలో జర్గింది.ఒక్క రోజులో కూడా జరగలేదు.అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చెత్తని అక్కదక్కడా ఇరికిస్తూ వాళ్లు చేర్చినదాన్ని కూడా వ్యాసకృతం కింద రుద్దేశారు.

అయితే, చెత్తను చేర్చుతున్నప్పుడు గానీ తర్వాత కాలంలో గానీ చెత్తని గుర్తించి తొలగించాల్సిన జగద్గురువులూ వేదపండితులూ ఇన్ని తరాల పాటు చెత్తని అలానే ఉంచి ఎందుకు కొనసాగిస్తున్నారు?వీళ్ళకి వేదంలో ఇవన్నీ లేవనీ వేదంలో లేనివాటిని ఉన్నట్టు చెప్పడం దోషం అనీ తెలియదు గనకనా!అంతే అయ్యుండాలి.

జై శ్రీ రామ్!

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...